Beer
-
మందుబాబులకు బ్యాడ్ న్యూస్
-
తెలంగాణలో మద్యం ప్రియులకు షాక్.. తగ్గుతున్న బీర్ల నిల్వలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీర్ల(Beers) నిల్వలు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం గోడౌన్లో లక్ష కేసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ నెల 8 వరకు సుమారు 84 లక్షల కేసులు ఉండగా క్రమేపి బీర్ల స్టాక్ తగ్గుతోంది. మరో రెండు, మూడు రోజులు మేనేజ్ చేయొచ్చని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు. పాత బకాయిలు ఇవ్వకపోవడంతో బీర్ల స్టాక్‌ను యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) సంస్థ నిలిపివేసిన సంగతి తెలిసిందే.తెలంగాణలో కొత్త బీర్ బ్రాండ్లు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రిజిస్టర్ కానీ కంపెనీలను తీసుకొస్తే ఇబ్బందులు తప్పవని డిస్ట్రిబ్యూటర్లు అభిప్రాయపడుతున్నారు. గోడౌన్లో ఉన్న స్టాక్‌ను విడుదల వారీగా ప్రభుత్వం విడుదల చేస్తోంది.తాము తయారు చేసే బీర్లను ఇక నుంచి తెలంగాణలో సరఫరా చేయబోమని యూబీ సంస్థ ప్రకటించింది. బేసిక్ ధరలు పెంచలేదని, బిల్లులు పెండింగ్‌లో ఉన్నందున బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్టు కంపెనీ నిబంధనల ప్రకారం...ఎన్ఎస్ఈ, బీఎస్ఈ (బాంబే స్టాక్ ఎక్స్చేంజ్)లకు సమాచారం ఇచ్చింది. రాష్ట్రంలో నాలుగైదు బ్రాండ్ల బీర్లకు మంచి మార్కెట్ ఉంది.అందులో యూబీ తయారు చేసే కింగ్‌ఫిషర్ బీర్లదే సింహభాగం. మొత్తం తెలంగాణ మార్కెట్లో 72 శాతం వరకు ఈ బ్రాండ్‌దే ఉంటుందని అంచనా. ఈ బీర్లు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్)కు సరఫరా చేసినందుకుగాను కేస్‌కు రూ.289 చొప్పున తయారీదారులకు చెల్లిస్తారు. ఈ బేసిక్ ధర పెంచాలన్న డిమాండ్ ఎక్సైజ్ శాఖలో చాలా కాలంగా వినిపిస్తున్నా, అమల్లోకి రాకపోవడంతో తాజా సమస్య ఏర్పడింది. 2019–20 నుంచి కంపెనీకి చెల్లించే బేసిక్ ధరలను తెలంగాణ ప్రభుత్వం సవరించలేదని, దీని కారణంగా భారీ నష్టాలు వస్తున్నాయని ఆ లేఖలో వెల్లడించారు. టీజీబీసీఎల్ చెల్లించాల్సిన పెద్ద మొత్తం పెండింగ్‌లో ఉందని, ఈ కారణంగానే తాము బీర్లు సరఫరా చేయడం లేదని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: తక్షణమే ప్రక్షాళన..! -
లిక్కర్ బకాయిలు రూ. 2వేల కోట్లకు పైనే!
సాక్షి, హైదరాబాద్: మద్యం సరఫరా చేసే కంపెనీలకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ చెల్లించాల్సిన బకాయిలు రూ.2 వేల కోట్లకు పైగానే ఉన్నట్టు తెలుస్తోంది. లిక్కర్‌తో పాటు బీర్లు తయారు చేసే కంపెనీలన్నింటికీ కలిపి ఈ మేరకు బకాయిలు ఉన్నాయని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. గత ప్రభుత్వ హయాం నుంచే ఈ బకాయిలు కొనసాగుతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒప్పందం మేరకు 45 రోజులకు బిల్లులు చెల్లిస్తున్నారే కానీ పాత బకాయిలు మాత్రం విడుదల చేయడం లేదని పేర్కొంటున్నాయి. బకాయిలు కొనసాగుతుండడాన్ని కంపెనీలు భరించలేకపోతున్నాయని, ఈ నేపథ్యంలోనే యూబీ కంపెనీ పరిణామం చోటు చేసుకుందని తెలుస్తోంది. యూబీతో పాటు బీర్లు సరఫరా చేసే ఏబీ, ఇతర లిక్కర్ కంపెనీలు కూడా బిల్లుల ఉక్కిరిబిక్కిరిలోనే ఉన్నాయనే చర్చ ఎక్సైజ్ వర్గాల్లో జరుగుతోంది. తమకు బకాయిలు చెల్లించని కారణంగా సరఫరా నిలిపివేస్తామంటూ ఆరు నెలల క్రితమే యూబీ కంపెనీ నుంచి ఎక్సైజ్ శాఖకు లేఖ వచ్చినట్టు తెలుస్తోంది. అయితే తాము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత బిల్లులు క్రమం తప్పకుండా విడుదల చేస్తున్నందున ప్రభుత్వం ధీమాతో ఉందని సమాచారం. యూబీ లేఖతోనే తెరపైకి ‘సోం’!సరఫరా నిలిపివేస్తామంటూ యూబీ లేఖ రాసిన నేపథ్యంలోనే ఎక్సైజ్ వర్గాలు ముందుచూపుతో మరో డిస్టిలరీకి అనుమతినిచ్చే ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది. లిక్కర్ కంపెనీలకు ఉండే ‘రాజకీయ’ సంబంధాల కారణంగా, యూబీకి చెక్ పెట్టాలనే యోచనతో ప్రభుత్వం కూడా ప్రోత్సహించిందని, ఈ పరిస్థితుల్లోనే సోం డిస్టిలరీస్ అనే మరో బీర్ల కంపెనీ తెరపైకి వచ్చిందనే చర్చ జరుగుతోంది. అయితే ఈ డిస్టిలరీకి అనుమతుల వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవడంతో సదరు ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. అయితే ఇప్పుడు యూబీ నిర్ణయం నేపథ్యంలో.. ఆ కంపెనీ అడిగిన విధంగా మద్యం సరఫరా చేసే కంపెనీల బేసిక్ ధరలను పెంచడం లేదంటే బీర్ల తయారీ కోసం సోం డిస్టిలరీస్ లాంటి కంపెనీలకు అనుమతులివ్వడం తప్ప ప్రభుత్వానికి మరో ప్రత్యామ్నాయం లేదని అధికారులు అంటున్నారు.ఇతర మద్యం బ్రాండ్లకు కొరత !యూబీ కంపెనీ నిర్ణయంతో కింగ్‌ఫిషర్ బీర్లు డిపో లకు రావడం నిలిచిపోయింది. దీంతో బుధవారం నాటికి డిపోల నుంచి తీసుకున్న బీర్లు మాత్రమే ప్రస్తుతం వైన్‌షాపుల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ బీర్లు వారం వరకు సరిపోతాయని, అప్పటికి పరిష్కారం రాకపోతే కింగ్ ఫిషర్ బీర్ల కొరత ఏర్పడుతుందని ఎక్సైజ్ వర్గాలంటున్నా యి. ఇదిలావుంటే ఇతర మద్యం బ్రాండ్లకు ఇప్పటికే మార్కెట్లో కొరత వచ్చిందని తెలుస్తోంది. సియా గ్రామ్స్ అనే కంపెనీ తయారు చేసే 100 పైపర్స్, బ్లెండర్స్ ప్రైడ్, రాయల్‌స్టాగ్ లాంటి ప్రీమియం బాండ్ల సరఫరా నిలిచిపోయిందని సమా చారం. దీంతో ఇప్పటికే మార్కెట్లో ఆయా బ్రాండ్లు దొరకడం లేదని వైన్‌షాపుల యజమానులు చెపుతు న్నారు. అయితే ఇందుకు వికారాబాద్ జిల్లాలోని ఒక డిస్టిలరీని ప్రభుత్వం మూసివేయడమే కారణమని, ఈ డిస్టిలరీలోనే సియాగ్రామ్స్ ప్రీమియం బ్రాండ్లు తయార వుతాయని, అందుకే ఆయా బ్రాండ్లు మార్కెట్లోకి రావడం లేదని ఎక్సైజ్ వర్గాలు వెల్లడించాయి. -
కింగ్ ఫిషర్ బీర్ల నిలిపివేత.. అందుకేనా?: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీర్ల అమ్మకాలు నిలిపివేయడానికి యునైటెడ్ బ్రూవరీస్(UB) తీసుకున్న నిర్ణయం పలు ప్రశ్నలు పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అనుమానం వ్యక్తం చేశారు. బీర్లకు సంబంధించి యునైటెడ్ బ్రూవరీస్ ప్రకటనపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.బీర్లకు సంబంధించిన బకాయిలను బెవరేజెస్ కార్పొరేషన్(TGBCL) చెల్లించలేదని యునైటెడ్ బ్రూవరీస్ పేర్కొందన్న హరీష్ రావు.. దీంతో రాష్ట్రంలో కింగ్ ఫిషర్, హినెకెన్ వంటి ప్రీమియం బ్రాండ్ల లభ్యతకు అంతరాయం కలుగుతుందని భావిస్తున్నారని చెప్పారు.బూమ్ బూమ్, బిర్యానీ వంటి స్థానిక బ్రాండ్ల బీర్లను ప్రోత్సహించేందుకు ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రయత్నమా? అంటూ అనుమానం వ్యక్తం చేశారు. బిల్లుల చెల్లింపులో వరుస క్రమాన్ని కాకుండా ప్రత్యేక ప్రాధాన్యతల కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందా అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: తెలంగాణకు కింగ్‌ఫిషర్ బీర్లు బంద్ -
తెలంగాణ బేవరేజస్ కార్పొరేషన్‌కు బీర్ల సప్లై నిలిపివేత
-
బీరు సీసాల్లో ఫంగస్
మల్లాపూర్(కోరుట్ల): ఓ బెల్ట్‌షాపులో కొనుగోలు చేసిన బీరుసీసాల్లో ఫంగస్ కనిపించింది. కొనుగోలుదారుల వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా ఖానాపూర్‌కు చెందిన కొంతమంది వ్యక్తులు మంగళవారం మెట్పల్లి వెళ్తున్నారు. మార్గమధ్యలో మల్లాపూర్ మండలంలోని ఒబులాపూర్ బెల్ట్షాప్లో బీర్లు తీసుకున్నారు. రెండు సీసాల్లో ఫంగస్ కనిపించింది. దీనిపై బెల్ట్‌షాప్ నిర్వాహకులను ప్రశ్నించగా, నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారన్నారు. అధికా రులు స్పందించి, నాణ్యత లేని మద్యం విక్రయిస్తున్న బెల్ట్‌షాప్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
మాల్యా పెళ్లి సందడి : మెనూలో అదే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్
భారతీయ బ్యాంకులకు వేలకోట్ల రూపాయలను ఎగవేసి విదేశాలకు చెక్కేసిన వ్యాపారవేత్త, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రమోటర్ విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ మాల్యా తన చిరకాల స్నేహితురాలు జాస్మిన్ను పెళ్లి చేసుకున్నాడు.లండన్‌లో జూన్ 22న సిద్ధార్థ-జాస్మిన్ వివాహ వేడుక జరిగింది. అయితే ఈ పెళ్లి సందడిలో వడ్డించిన వంటలు, ఇతర పదార్థాలపై ఇంటర్నెట్లో చర్చ నడుస్తోంది.ముఖ్యంగా ఫ్యాషన్ డిజైనర్ మనోవిరాజ్ ఖోస్లా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఇంట్రస్టింగ్ సంగతులను షేర్ చేశాడు. ముఖ్యంగా కింగ్‌ఫిషర్ బీర్ ఇమేజ్ను షేర్ చేయడంతో ఇది ఫాలోయర్లను ఆకట్టుకుంటోంది. లండన్‌లో కింగ్ పిషర్కు మించింది ఏముంటుంది అనే క్యాప్షన్‌తో ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. ఇంకా కడీపట్టా బుర్రట్టా, పాన్-ఫ్రైడ్ అట్లాంటిక్ సీ బాస్ లాంటి వాటితో పాటు ఇతర వంటకాలున్నాయని తన స్టోరీలో తెలిపాడు. మరోవైపు సిద్ధార్థ-జాస్మిన్ పెళ్లి సంబరాలకు సంబంధించి ఫోటోలు వైరల్ అయ్యాయి. తాజాగా పెళ్లి కళ ఉట్టిపడుతున్న తమ రెండు ఫోటోలను సిద్ధార్థ మాల్యా ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. అంతకుముందు తన కాబోయే భార్యతో పోజులిచ్చిన ఫోటోలను షేర్ చేసి, తన ఫ్యాన్స్‌కు పెళ్లికబురు అందించిన సంగతి తెలిసిందే. -
కప్పం కడితేనే ‘కింగ్ ఫిషర్’!
సాక్షి, అమరావతి: ‘మాకు లాభం ఉంటేనే లారీలు కదులుతాయి’.. ‘మాకు కప్పం కడితేనే కింగ్ ఫిషర్ బీరు మార్కెట్లోకి వస్తుంది.. లేదంటే అంతే సంగతులు’ అని పారిశ్రామికవేత్తలకు హెచ్చరికలు జారీ చేస్తోంది.. టీడీపీ కూటమి ముఠా. డీల్ సెట్ కాకపోతే కంపెనీలోకి ఒక్క లారీని రానివ్వం.. పోనివ్వం అని తెగేసి చెబుతోంది. దీంతో కింగ్ ఫిషర్ బీరును ఉత్పత్తి చేసే యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) కంపెనీ అధికార పార్టీ దాష్టీకానికి బెంబేలెత్తుతోంది. శ్రీకాకుళం జిల్లాలో పారిశ్రామికవేత్తలను హడలెత్తిస్తున్న ఈ సిండికేట్‌ను ఎచ్చెర్ల బీజేపీ ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వరరావు వర్గం తెరముందు నడుపుతుంటే.. తెర వెనుక వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వర్గం చక్రం తిప్పుతోంది. నెలకు రూ.1.50 కోట్లు చొప్పున ఏడాదికి రూ.18 కోట్లు తమకు కప్పం కింద కట్టాలని కంపెనీకి కూటమి ప్రజాప్రతినిధులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇందుకు యునైటెడ్ బ్రూవరీస్ సిద్ధంగా లేకపోవడంతో కింగ్ ఫిషర్ బీరు ఉత్పత్తి మొదలుకావడం లేదు.అడుగడుగునా అడ్డుపడుతున్న టీడీపీ కూటమి ముఠా..శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం బంటుపల్లిలో ఉన్న యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) బీర్ కంపెనీ ఉంది. తమ ఫ్యాక్టరీలో కింగ్ ఫిషర్ బీరు ఉత్పత్తిని ప్రారంభించేందుకు ఆ కంపెనీ చేస్తున్న యత్నాలకు అడుగడుగునా టీడీపీ కూటమి ముఠా అడ్డు పడుతోంది. ముడి సరుకును ఫ్యాక్టరీకి తీసుకువచ్చి, ఉత్పత్తి చేసిన సరుకును ఫ్యాక్టరీ నుంచి బయటకు తీసుకువెళ్లే ఒక్కో లారీకి రూ.వేయి చొప్పున కప్పం చెల్లించాలని ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గం కరాఖండీగా తేల్చిచెప్పిందనే విషయం సంచలనం సృష్టించింది. ఎందుకంటే లోడింగ్, అన్ లోడింగ్ కోసం రోజుకు సగటున 500 లారీలు వస్తాయి.. ఆ లెక్కన రోజుకు రూ.5 లక్షల చొప్పున నెలకు రూ.1.50 కోట్ల వరకు కప్పంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదికి ఈ మొత్తం 18 కోట్లు. అంత భారీ మొత్తం కప్పంగా చెల్లించలేమని కంపెనీ ప్రతినిధులు చెప్పడంతో ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గీయులు ఏకంగా ఆ ఫ్యాక్టరీపై దాడి చేసి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. కంపెనీ ఆస్తులను ధ్వంసం చేయడమేకాకుండా కంపెనీలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందిపై దాడి చేసి భయోత్పాతం సృష్టించారు.దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు మొదట పట్టించుకోలేదు. కేంద్ర హోం శాఖకు నివేదించడంతో ఢిల్లీ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో పోలీసులు ఒక రోజు తరువాత కేసు నమోదు చేశారు. మరోవైపు కంపెనీ ఉద్యోగులపై ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయించడం గమనార్హం. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాకే చెందిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని కప్పం కట్టేలా డీల్ సెట్ చేసినట్టు సమాచారం. ఆయన ఆదేశాలతో కంపెనీ ప్రతినిధులు ఎమ్మెల్యే ఈశ్వరరావుతో రాజీ చర్చలు కూడా జరిపారు. తాము అడిగినట్టుగా నెలకు రూ.1.50 కోట్లు కప్పం కడితేనే బీర్ ఉత్పత్తి ప్రారంభించకోవచ్చని ఎమ్మెల్యే వర్గం కంపెనీకి తేల్చిచెప్పింది. కంపెనీ యాజమాన్యం ససేమిరా.. ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గం డిమాండ్ చేసినట్టుగా నెలకు రూ.1.50 కోట్లు వరకు కప్పంగా చెల్లించేందుకు యూబీ కంపెనీ యాజమాన్యం ససేమిరా అన్నట్టు సమాచారం. బంటుమల్లిలోని ఒక్క యూనిట్‌కే ఏడాదికి ఏకంగా రూ.18 కోట్లు అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు మామూళ్లుగా ఇవ్వడం తలకుమించిన భారంగా ఆ కంపెనీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరో రూపంలో కొంత మొత్తం అయితేనే ఇవ్వగలమని చెప్పినట్టు సమాచారం. దీంతో ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గం భగ్గుమంది. ఫ్యాక్టరీలోని బీరు ఉత్పత్తికి అడ్డుపడుతోంది. రెండు రోజులుగా ఫ్యాక్టరీకి లారీలు వస్తున్నా అందులోని ముడి సరుకును అన్లోడింగ్ చేయనీయడం లేదు. అంతేకాకుండా ఇప్పటికే ఉత్పత్తి చేసిన బీరును మార్కెట్లోకి పంపేందుకు లారీల్లోకి లోడింగ్ చేయనీయడం లేదు. అంతేకాకుండా కళాసీలెవరూ పనిలోకి రావడానికి వీల్లేదని ఎమ్మెల్యే వర్గం ఆల్టిమేటం జారీ చేసింది. ఎమ్మెల్యే వర్గం గుప్పిట్లోనే కళాసీల సంఘం ప్రతినిధులు ఉండటం గమనార్హం. ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గీయుల దాష్టీకంతోయూబీ ఫ్యాక్టరీ ముందు భారీ సంఖ్యలో లారీలు బారులు తీరి ఉన్నాయి. ఎమ్మెల్యే వర్గం హెచ్చరికలకు భయపడి ఎవరూ ముడి సరుకును అన్లోడింగ్ చేయడం లేదు. దాంతో యూబీ ఫ్యాక్టరీలో బీరు ఉత్పత్తి నిలిచిపోయింది. మరోవైపు ఉత్పత్తి కోసం తెప్పించిన ముడి సరుకు సైతం లారీల్లోనే మగ్గిపోతోంది. ముడి సరుకు పాడైపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని కంపెనీ ప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు.డ్రామాను అదరగొడుతున్న అచ్చెన్నఈ వ్యవహారంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు డబుల్ గేమ్ ఆడుతుండటం గమనార్హం. కంపెనీ ప్రతినిధులు తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఎమ్మెల్యే ఈశ్వరరావుతో మాట్లాడినట్టు అచ్చెన్నాయుడు కథ నడిపించారు. తాను చెబుతున్నా కళాసీలు వినడం లేదని చెప్పి ఎమ్మెల్యే ఈశ్వరరావు తప్పించుకున్నారు. అయితే మంత్రి అచ్చెన్న, ఎమ్మెల్యే ఈశ్వరావు పక్కా పన్నాగంతోనే ఈ వ్యవహారాన్ని ఉద్దేశపూర్వకంగా సాగదీస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాక్టరీలో బీరు ఉత్పత్తి కొన్ని రోజుల పాటు నిలిచిపోతే యాజమాన్యం తప్పనిసరిగా తమ కాళ్లబేరానికి వస్తుందనేదే ఇద్దరు నేతల ఉద్దేశమని అంటున్నారు. అదే అదనుగా భారీగా కప్పం డిమాండ్ చేసి సాధించుకోవచ్చని కుట్రపన్నారు. పారిశ్రామికవేత్తల ఆందోళన..అధికారంలోకి వచ్చీ రావడంతోనే కూటమి నేతల బెదిరింపులతో పారిశ్రామికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. పారిశ్రామికవేత్తల పట్ల ప్రభుత్వ వైఖరిపై వారిలో ఆవేదన వ్యక్తమవుతోంది. కానీ ప్రభుత్వ పెద్దలు మాత్రం తమ పంతం వీడటం లేదు. యూబీ కంపెనీ ఉదంతం ద్వారా రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలకు స్పష్టమైన సందేశం ఇవ్వాలన్నదే కూటమి ప్రభుత్వ ఉద్దేశంగా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాము డిమాండ్ చేసినంత కప్పం కడితేనే రాష్ట్రంలో ఏ కంపెనీ అయినా మనుగుడ సాగిస్తుంది.. లేదంటే ఆ కంపెనీ మూత పడాల్సిందేనని స్పష్టం చేస్తోంది. -
మద్యం ప్రియులకు దొరకని బీర్లు
మెదక్: టెండల్లో బుసబుస పొంగే చల్లని బీరు తాగి ఉపశమనం పొందాలనుకునే మందుబాబులకుకష్టకాలమొచ్చింది. వైన్ షాపుల్లో బ్రాండెడ్ బీర్లు దొరకని పరిస్థితి నెలకొంది. మద్యం డిపోలు ప్రధాన బ్రాండ్ల బీర్లపై రేషన్ విధించడంతో అటు వైన్‌షాప్ యజమానులు.. ఇటు కొనుగోలు దార్లు నిరుత్సాహానికి గురవుతున్నారు. దీంతో మద్యం ప్రియులు దొరికిన దానితోనే సరి పెట్టుకుంటున్నారు. ఒక్కో షాపునకు ఇండెక్స్ ఆధారంగా 20 నుంచి 25 కేసులు ఇస్తుండగా.. ఇది ఒక రోజుకు కూడా సరిపోదని మద్యం వ్యాపారులు పెదవి విరుస్తున్నారు. జిల్లాలో మెదక్, రామాయంపేట, నర్సాపూర్‌లో ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 49 వైన్ షాపులు, ఐదు బార్లు ఉన్నాయి. ఈయేడు ఎక్సైజ్ సంవత్సరం డిసెంబర్లో ప్రారంభమైంది. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో కొంత మేర మద్యం అమ్మకాలు పెరిగాయి. గతేడాది డిసెంబర్ నుంచి మార్చి వరకు రూ.194.68 కోట్ల మద్యం విక్రయాలు జరుగగా, ఈసారి నాలుగు నెలల కాలంలో రూ.206.71 కోట్ల విక్రయాలు జరిగాయి. మందు బాబుల పరేషాన్.. వేసవి ఎండలు ముదరడంతో మద్యం ప్రియులు ఎక్కువగా బీర్లు తాగడానికి మొగ్గు చూపుతున్నారు. కానీ ప్రస్తుతం నీటి కొరత, బీర్ల ఉత్పత్తి షరతులు తదితర కారణాల వల్ల బీర్ల కొరత ఏర్పడింది. అలాగే బీరు కాలపరిమితి 6 నెలలు ఉండటంతో ఎక్కువ కాలం నిల్వ ఉంచలేని పరిస్థితి. గతేడాది నాలుగు నెలల కాలంలో 2,68,763 కేసులు అమ్మగా, ఈయేడు మార్చి 31 వరకు 2,96,977 కేసులు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం సాధారణ బ్రాండ్లు లభిస్తున్నప్పటికీ వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే బ్రాండ్లు దొరకడం లేదు. దీంతో ఇండెక్స్‌కు అనుగుణంగా 20 నుంచి 25 కేసులు లభ్యతను బట్టి ఇస్తున్నారు. అలాగే సామాన్యుడికి అందుబాటు ధర కలిగి, నిత్యం ఎక్కువగా అమ్ముడు పోయే ఓ బ్రాండ్ లిక్కర్ కొరత కారణంగా దానికి కూడా రేషన్ విధించినట్లు మద్యం వ్యాపారులు తెలిపారు. పెరిగిన 10.50 శాతం ఎక్సైజ్ స్టేషన్ల వారీగా మద్యం అమ్మకాలు చూస్తే గతేడాది నాలుగు నెలలు (డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి) నర్సాపూర్‌లో రూ.7,172.2 లక్షలు విక్రయాలు జరుగగా ఈసారి నాలుగు నెలలు రూ.7,888.2 లక్షలు, మెదక్‌లో గతేడాది రూ.6,847.6 లక్షలు ఉండగా, ఈసారి రూ.6,902.4 లక్షలు, రామాయంపేటలో గతేడాది రూ.5,447.9 లక్షలు కాగా, ఈసారి రూ.5,880.2 లక్షలు విక్రయించాయి. మొత్తం మీద గతేడాది నాలుగు నెలలతో పోలిస్తే ఈసారి జిల్లా వ్యాప్తంగా 6.18 శాతం మద్యం విక్రయాలు వృద్ధి చెందాయి. అలాగే గతేడాది బీర్లతో పోలీస్తే ఈ నాలుగు నెలల్లోనే బీర్ల వినియోగం 10.50 శాతం పెరిగింది. ప్రతీయేటా వేసవి కాలంలో బీరు సరఫరాలో కొరత ఏర్పడుతుంది. డిమాండ్ కనుగుణంగా సరఫరా లేక పోవడంతో ప్రధాన బ్రాండ్లపై రేషన్ విధిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
Telangana: మద్యం ప్రియులకు షాక్.. ఇక బీర్లు దొరకడం కష్టమే..!
మంచిర్యాలరూరల్(హాజీపూర్): వేసవి కాలంలో చల్లని బీరు తాగాలని ఆశించే మద్యంప్రియులకు బీర్లు దొరకడం కష్టంగా మారుతోంది. ఇ ప్పటికే హాజీపూర్ మండలం గుడిపేటలోని మ ద్యం డిపోకు బీర్ల సరఫరా చాలావరకు నిలిచి పోయింది. వచ్చిన నిల్వలను డిపో పరిధిలోని మద్యం దుకాణాలు, బార్లకు రేషియో పద్ధతిన సరఫరా చేస్తోంది. బీర్లకు కొరత ఏర్పడగా.. కొ ద్ది రోజుల్లో తీవ్రం కానున్నట్లు తెలుస్తోంది. గ తంలో పలు కంపెనీలు ప్రభుత్వ లిక్కర్ గోదా ములకు సరఫరా చేసిన బీరు నిల్వలకు బకా యిల చెల్లింపులో జాప్యమే కొరతకు కారణమని తెలుస్తోంది. గుడిపేట లిక్కర్ డిపో పరిధిలో 135 మద్యం దుకాణాలు, 28వరకు బార్లు ఉన్నా యి. వేసవిలో పెద్దయెత్తున బీర్ల అమ్మకాలు సాగుతాయి. గత ఏడాది మార్చిలో రెండు లక్షల వరకు బీరు కేసుల విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది మార్చిలో 1.80లక్షల వరకు బీరు కేసులు మాత్రమే అమ్మకాలు జరిగాయి. గత ఏడాది బీరు కేసులు మద్యం దుకాణాల డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా జరిగి డిపోలో లక్షల కేసుల నిల్వలు ఉండేవి. ఇప్పుడు బీరు కేసులు వచ్చినవి వచ్చినట్లు విక్రయిస్తుండగా.. డిపోలో నిల్వలు ఉండడం లేదు. ఈ లెక్కన డిమాండ్‌కు తగిన విధంగా సరఫరా లేదని తెలుస్తోంది. బిల్లులు పెండింగ్‌లో.. లిక్కర్ తయారీ కంపెనీల నుంచి ప్రభుత్వం వివిధ బ్రాండ్లకు సంబంధించి బీర్లు కొనుగోలు చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోని మద్యం డిపోలకు సరఫరా చేస్తోంది. అక్కడి నుంచి రిటైల్ దుకాణాలకు సరఫరా జరుగుతుంది. లిక్కర్ తయారీ కంపెనీలు సరఫరా చేసిన మద్యం బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో కొన్ని డిస్టిలరీస్, బ్రేవరేజేస్‌లు మద్యం ఉత్పత్తి తగ్గించడంతోపాటు బీరు నిల్వల సరఫరా చాలా వరకు తగ్గించేశాయి. వేసవిలో మార్చి నుంచి మే వరకు దాదాపు రూ.2కోట్ల విలువైన బీర్ల అమ్మకాలు జరుగుతాయి. ఒక్కో మద్యం దుకాణానికి రోజుకు సుమారుగా 50 బీరు కేసుల వరకు విక్రయాలు జరిగేవి. కానీ ఈ వేసవిలో 30 బీరు కేసుల వరకు కూడా సరఫరా చేయడం లేదని మద్యం వ్యాపారులు చెబుతున్నారు. ఏప్రిల్, మే నెలల్లో బీర్ల కొరత తీవ్రం కానుంది. డిపో పరిసరాలు వెల వెల గుడిపేట మద్యం డిపో పరిసరాలు నిత్యం కళకళలాడుతూ కనిపించేవి. ఇప్పుడు అందుకు భిన్నంగా వెల వెలబోతున్నాయి. పలు మద్యం కంపెనీలు బీరు నిల్వల సరఫరా తగ్గించడంతో లారీలు, ఇతర వాహనాల రాకపోకలు తగ్గాయి. మొన్నటి వరకు రోజుకు 20 వాహనాలకు పైగా మద్యం నిల్వలతో వచ్చిన సందర్భాలు ఉండగా ఇప్పుడు 10 వాహనాలు కూడా డిపోకు రావడం లేదు. డిపో మేనేజర్ శ్రీనివాస్‌ను సంప్రదించగా.. డిపోకు వచ్చిన బీరు నిల్వలను అన్ని రిటైల్ మద్యం దుకాణాలకు రేషియో పద్ధతిన సమానంగా సరఫరా చేస్తున్నామని తెలిపారు. -
మద్యం ప్రియులకు శుభవార్త.. సౌత్‌లో కొత్త బీర్ బ్రాండ్ ఎంట్రీ..
దేశంలోని మద్యం ప్రియుల రుచులు, అభిరుచులకు అనుగుణంగా కంపెనీలు సైతం తమ ఉత్పత్తులను తయారుచేస్తున్నాయి. పానీయాలు ఉత్పత్తి చేసే కంపెనీలు నెమ్మదిగా ఆల్కహాల్ తయారీ రంగంలోకి ప్రవేశిస్తున్నాయి. గత నెలలో సాఫ్ట్ డ్రింక్స్ దిగ్గజం కోకా-కోలా ఆల్కహాలిక్ బెవరేజెస్ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా దిల్లీకి చెందిన పానీయాల తయారీ సంస్థ కిమయా హిమాలయన్ బెవరేజెస్ దక్షిణాది మార్కెట్లోకి ప్రవేశించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో కంపెనీ బార్లీ ఆధారిత స్వదేశీ బీర్‌ను ఏప్రిల్ 2024 నాటికి కర్ణాటక, తమిళనాడులో ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ సీఈవో అభినవ్ జిందాల్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఉత్పత్తిని ఉత్తర భారతదేశంలో దిల్లీ, ఉత్తరాఖండ్‌తో సహా ఐదు రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు. ఇదీ చదవండి: అదనపు ఛార్జీలు లేకుండా ఫుడ్, క్యాబ్ సర్వీసు..! కంపెనీ ఇప్పటికే ఇటీవలి కాలంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, చండీగఢ్ మార్కెట్లలోకి ప్రవేశించింది. సెప్టెంబరు 2019లో కంపెనీ ప్రారంభమైనప్పటి నుంచి మార్చి 2023 నాటికి అమ్మకాలు 1,25,000 కేసుల నుంచి సుమారు 10 లక్షల కేసులకు పెరిగినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇందులో 96 శాతం రిటైల్ అమ్మకాలేనని సంస్థ తెలిపింది. గత ఏడాది కంపెనీ 100 శాతం ఫెసిలిటీను ఉపయోగించినట్లు తెలిపింది. ఈ క్రమంలో 1,00,000 హెక్టోలీటర్లను ఉత్పత్తి చేసింది. ఇప్పుడు 2,00,000 హెక్టోలీటర్ల లక్ష్యంతో ఈ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడానికి విస్తరణ చర్యలు చేపట్టినట్లు చెప్పింది. -
మూత్రంతో తయారు చేసిన బీరు..ఎగబడుతున్న జనాలు!
బీరు అంటే మందుబాబులకు ఎంత ఇష్టం చెప్పనవసరం లేదు. ఇది ఆరోగ్యానికి మంచిదని చాలామంది దీన్నే ప్రిఫర్ చేస్తారు. అలాంటి బీరుని మూత్రంతోనా..ఛీ యాక్ అంటారేమో! అక్కడ సింగపూర్ జనాలు మాత్రం ఈ బీర్ చాలా రుచిగా ఉందని ఎగబడుతున్నారట. ఇలాంటి బీరు కావాలని అంటున్నారట. వాళ్లకి ఈ బీరు ఎలా తయారవ్వుతుందో తెలయదనుకోకండి. ఆ బీరుని ఉత్పత్తి చేసిన కంపెనీలు ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయట. పైగా పర్యావరణ హితం కోసంమే ఇదంతా చేస్తున్నారట సింగపూర్ అధికారులు! సింగపూర్ జాతీయ నీటి ఏజెన్సీ సహకారంతో న్యూబ్రూ అనే కంపెనీ మూత్రంతో బీరుని తయారు చేస్తుంది. అంతేగాదు సూపర్ మార్కెట్లో బ్రూవర్క్ట్జ్ అనే బ్రాండ్‌తో ఈ బీరుని విక్రయాలు జరుపుతుంది. జనాలు కూడా ఎగబడి కొంటున్నారట. పైగా కస్టమర్లకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారట కూడా. అయినా కూడా జనాలు కొనడం విశేషం. మొదట్లో వాట్? అని ఆశ్చర్యపోయి.. చిరాకు పడ్డా ఆ తర్వాత ఈ బీరే చాలా టేస్టీగా ఉందని కొట్టుండడం విచిత్రం. ఎందుకిలా అంటే.. నీటి భ్రదతను మెరుగుపరిచేందుకు శుద్ది చేసే కర్మాగారాల సాయంతో ప్రవహించే మరుగునీటిని రీసైకిల్ చేసి తాగే 'నీవాటర్గా' మారుస్తారు. ఈ శుద్ది చేసిన మరుగునీటి వినియోగం, ప్రాముఖ్యతపై సింగపూర్వాసులకు అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగమే ఈ సరికొత్త బీరును తయారుచేస్తున్నారట. తొలుత మరుగు నీటిని ప్రాసెస్ చేయాలనే ఆలోచన చాలామంది తిరస్కరించారు. కానీ ప్రపంచవ్యాప్తంగా మంచి నీటి వనరులు దారుణంగా క్షీణిస్తున్నాయని సర్వేలు తెలిపాయి. అలాగే ప్రపంచ వన్యప్రాణి నిధి అంచనా ప్రకారం 2.7 బిలియన్ల మంది ప్రజలు ఏడాదిలో ఒక నెలపాటు నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈనేపథ్యంలోనే సింగపూర్ అధికారులు ఈ వినూత్న ఆలోచనకు నాంది పలికారు. ఇప్పటికే సింగపూర్, ఇజ్రాయల్ వంటి దేశాలు మరుగునీటిని మంచి నీటిగా మార్చి వినియోగించే విధానాన్ని అమలు చేస్తున్నాయట. త్వరలో ఈ దేశాల సరసన యూఎస్ కూడా చేరనుందట. (చదవండి: బుడగల మాదిరి భవనం..కట్టడానికే 14 ఏళ్లు..కానీ..) -
ఈ వెయిటర్ ఏం ఎనర్జీ డ్రింక్ తీసుకున్నట్టుంది?
-
బీర్ వ్యర్థాలతో..బిస్కెట్లు, చిక్కిలు, లడ్డులా..
కొంతమంది ఆకలితో అలమటిస్తుంటే, మరోపక్క టన్నులకొద్దీ ఆహారం వివిధ రకాలుగా వ్యర్థాల రూపంలో మట్టిపాలవుతోంది. ఈ మధ్య కాస్త అవగాహన రావడంతో ఫంక్షన్లలో మిగిలిన ఆహారాన్ని ఆశ్రమాలకు దానంగా ఇస్తున్నారు. అయితే వండిన ఆహారమే కాకుండా, కొన్నిరకాల పదార్థాలు, పానీయాలు తయారయ్యాక ఎన్నో పోషకాలున్న పదార్థాలు చెత్తలోకి వెళ్లి పోతున్నాయి. వీటిని మనం చక్కగా వినియోగించుకుంటే...బిస్కెట్లు, బ్రెడ్, రోటీలు చేసుకోవచ్చని చెబుతోంది ఎలిజబెత్ యార్క్. బీర్ తయారవగా మిగిలి పోయిన వ్యర్థాలతో చిక్కి, లడ్డు, నూడుల్స్ తయారు చేసి మరీ రుచి చూపెడుతోంది ఎలిజబెత్. బెంగళూరుకు చెందిన ఎలిజబెత్ యార్క్ ఒక చెఫ్. మణిపాల్‌లో డిగ్రీ చేసిన ఎలిజబెత్ తరువాత మైసూర్‌లోని సెంట్రల్‌ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో రీసెర్చ్ చేసింది. అందులో భాగంగా దేశంలో ఎన్నో రకాలుగా భారీ ఎత్తున ఆహార వృథా జరుగుతోందని గ్రహించింది. ఆహారం వ్యర్థం కాకుండా ఎలా ఆపాలా... అని ఆలోచించింది. ఈ క్రమంలోనే 2016లో కాలిఫోర్నియాలోని బ్రెడ్ స్పెషలిస్ట్, ఫుడ్ హిస్టోరియన్ విలియం రెబెల్ దగ్గర ఇంటర్న్‌గా చేరింది. రుబెల్ ద్వారా... ‘‘వందల ఏళ్ల నాడే పానీయాల తయారీ దారు, (బ్రీవర్స్), రొట్టె, బ్రెడ్స్ తయారీదార్లు (బేకర్స్) కలిసి పనిచేసే వారని తెలిసింది. కొన్నిసార్లు ఆర్థికంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు మిగిలిపోయిన బ్రెడ్‌ను బ్రీవర్స్, గింజలు, ఈస్ట్‌ను బ్రీవర్స్ బేకర్స్ ఇచ్చి పుచ్చుకునేవాళ్లు. అలా వాళ్లు పదార్థాలు వృథా కాకుండా, తక్కువ ఖర్చులో ఆహారాన్ని తయారు చేసేవారు’’ అని ఎలిజబెత్ తెలుసుకుంది. భారత్‌లో కూడా ఇలా చేసి ఫుడ్ వేస్ట్ కాకుండా చూడవచ్చు అనుకుంది. సేవింగ్ గ్రెయిన్స్ లాక్డౌన్ సమయంలో కాస్త ఎక్కువ సమయం దొరకడంతో ఎలిజబెత్ వ్యర్థాల నుంచి ఫుడ్ తయారు చేయాలని నిర్ణయించుకుంది. బీర్ తయారైన తరువాత పడేసే వ్యర్థాలను రుచికరమైన ఆహారంగా మార్చాలనుకుని 2021లో ‘సేవింగ్∙గ్రెయిన్స్’ ప్రారంభించింది. బీర్ తయారవగా మిగిలిన పిప్పిని పిండిగా మార్చి, తరువాత ఆ పిండితో బ్రెడ్, రోటీలు, గ్రనోలా, కుకీస్, టీ బిస్కెట్స్, లడ్డులు, చిక్కీలు తయారు చేసి విక్రయిస్తోంది. పిప్పినుంచి తయారు చేసినవే అయినా ఇవి ఎంతో రుచిగా ఉండడం విశేషం. సేవింగ్ గ్రెయిన్స్ ఉత్పత్తులు ఆఫ్‌లైన్‌లోనేగాక, ఆన్‌లైన్‌లోకూడా లభ్యమవుతున్నాయి. స్థానిక బేకరీ భాగస్వామ్యంతో సేవింగ్ గ్రెయిన్స్ను విస్తరిస్తోంది ఎలిజబెత్. రోజుకి పన్నెండు వేల కేజీలు.. ‘‘రకరకాలుగా ఫుడ్ వేస్ట్ అవడం చాలా బాధగా అనిపించేది. రుబెల్‌ను కలిసాక ఈ సమస్యకు చక్కటి పరిష్కారం దొరికింది. దాంతోనే ‘సేవింగ్ గ్రెయిన్స్’ను ప్రారంభించాను. బీర్, ఆల్కహాల్‌ను తయారు చేసేందుకు గోధుమలు, ఓట్స్, బార్లీలను నానబెట్టి మొలకలు వచ్చిన తరువాత, చక్కెరతో ఉడికి స్తారు. తరువాత మెత్తగా రుబ్బి రసాన్ని వేరు చేసి బీర్, ఆల్కహాల్స్‌ను తయారు చేస్తారు. పానీయం వేరు చెయ్యగా మిగిలిన పిప్పిని పశువులకు దాణాగా వేస్తుంటారు. పశువులు తిన్నప్పటికీ, ఎక్కువ మొత్తంలో వ్యర్థంగా పోతుంది. ఒక్క బెంగళూరులోనే రోజుకి పన్నెండు వేలకేజీల ధాన్యాలను పానీయాల తయారీలో వాడుతున్నారు. రోజుకి ఇంత అంటే ఇక ఏడాదికి చాలా ఎక్కువ అవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న బ్రీవరీలు లక్షల కేజీల ధాన్యాలను ఉపయోగిస్తున్నాయి. ఇలా ఉత్పన్నమయ్యే పిప్పిని ఫుడ్‌గా మార్చడం వల్ల ధాన్యాలు వ్యర్థంగా పోవు. సేవింగ్ గ్రెయిన్స్ ద్వారా ఎంతోమంది ఆకలి కూడా తీర్చవచ్చు’’ అని ఎలిజబెత్ చెబుతోంది. (చదవండి: బీర్‌ని బేషుగ్గా తాగొచ్చట! అందులో ప్రోటీన్, విటమిన్ బి) -
బీర్‌ని బేషుగ్గా తాగొచ్చట! అందులో ప్రోటీన్, విటమిన్ బీ..
బీర్‌ని ఎలాంటి సందేహం లేకుండా హాయిగా తాగొచ్చట. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. పైగా ఎన్నో రకాల వ్యాధుల నుంచి రక్షిస్తుందని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. ఆరోగ్య నిపుణులు ఎలాంటి ఆందోళన లేకుండా బీర్‌ని బేషుగ్గా తాగండి అని ధీమాగా చెప్పేస్తున్నారు. ఇంతకీ బీర్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే.. బీర్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు రోజు 1.5 నుంచి రెండు గ్లాసుల బీర్లు తీసుకుంటే గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఒకవేళ ఇప్పటికే గుండె సమస్యలతో బాధపడుతుంటే వాళ్లు బీర్ తాగాలని నిర్ణయించుకోవడం అనేది చాలా మంచి ఆప్షన్ అంటున్నారు. ఇంతకు మునుపు గుండె పోటుకి గురైనవారు క్రమం తప్పకుండా బీర్ తాగితే ఇరవై ఏళ్లకు పైగా జీవిస్తారని, వారి ఆయుః ప్రమాణం కూడా పెరుగుతుందని చెబుతున్నారు బీర్లో వైన్ కంటే పోషకమైనది. ఎందుకంటే వైన్‌లో ఉండే ఆల్కహాలిక్ ద్రాక్ష రసం కంటే బీర్లో ఎక్కువ ప్రోటీన్లు, విటమిన్ బీ రెండూ ఉంటాయని అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడికల్ సైన్స్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. బీర్లో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇది వివిధ రకాల వ్యాధుల నుంచి రక్షిస్తుంది. మధుమేహం వచ్చే ప్రమాదం కూడా తక్కువే. వారానికి 14 గ్లాస్లుల బీర్ తాగితే టైప్2 డయాబెటిస్‌కు గురయ్యే అవకాశం తక్కువగా ఉందని, ఏడువేల మందికి పైగా వ్యక్తులపై జరిపిన అధ్యయనంలో తేలింది. బలమైన ఎముకల కోసం పాలు ఎలా అయితే మంచిదే బీర్ కూడా మంచిదే. పాలు ఎముకలకు ఏ విధమైన శక్తిని అందిస్తాయో అలానే బీర్ కూడా ఇస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పచ్చి బఠానీలు, తృణధాన్యాల్లో ఎలాంటి విటమిన్లు ఉంటాయో అవే బీర్లో కూడా ఉంటాయిన చెబుతున్నారు. దంతాలు కూడా బాగుంటాయట. ఇది తాగితే పెదాలపై చిరునవ్వు తగ్గదని దంత వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే బీర్ దంతాలపై ప్రభావంతంగా పనిచేస్తుందట. ముఖ్యంగా కావిటీస్, ఇన్ఫెక్షన్కు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుందట. (గమనిక: ఒక గ్లాసు బీరు ఎలాంటి హాని ఉండదన్నారు. అదికూడా వారానికి ఒక్కసారి చొప్పున తీసుకుంటుంటే ఎలాంటి సమస్య ఉండదని చెబుతున్నారు) (చదవండి: అత్యంత అరుదైన వ్యాధి!సల్మాన్ ఖాన్ సైతం ఫేస్ చేశాడు! ఆ వ్యాధి ఏంటంటే) -
78,678 బాక్స్‌ల బీర్ల వృథా.. ఆ ఒక్క పని చేసుంటే ఇలా జరిగేది కాదు
మైసూరు: మైసూరు జిల్లాలోని నంజనగూడులో ఉన్న యునైటెడ్ బ్రువరీస్ కర్మాగారంలో తయారవుతున్న బీరు నాణ్యత ప్రశ్నార్థకమైంది. జిల్లా అబ్కారీ అధికారులు సుమారు రూ. 25 కోట్ల విలుచ చేసే 78,678 బాక్స్‌ల బీర్లను సీజ్ చేశారు. ఈ కంపెనీ తయారుచేసే ప్రముఖ బీర్ల సీసాల్లో అవక్షేపం పేరుకుపోయిందని, ఇటువంటి బీర్లను తాగరాదని తెలిపారు. జూలై 15వ తేదీన ఈ సీసాలు నింపారని తెలిపారు. కొన్ని సీసాల్లో గసి పేరుకుపోయినట్లు మందుబాబుల ద్వారా తెలుసుకున్న అధికారులు బీర్ల శాంపిళ్లను తీసుకుని ల్యాబ్‌కు పంపించారు. దీనిపై ఆగస్టు 2వ తేదీన నివేదిక రాగా, ఈ బీర్లు తాగడానికి పనికిరావని అందులో హెచ్చరించారు. దాంతో ఆ బ్యాచ్‌లో సిద్ధమైన 78,678 పెట్టెల బీర్లను సీజ్ చేశారు. ఇవి అప్పటికే మద్యం షాపులకు వెళ్లిపో గా మళ్లీ వెనక్కి తెప్పించినట్లు తెలిపారు. సీసాల్లోకి నింపేముందు బీర్‌ను సక్రమంగా ఫిల్టర్ చేయకపోతే అవక్షేపం చేరుకుంటుందని చెప్పారు. చదవండి ఫోన్ ఛార్జింగ్‌పై బాస్ ఆగ్రహం.. టాయిలెట్ ఫ్లష్ చేయద్దంటున్న నెటిజన్లు! -
ఎయిర్‌క్రాఫ్ట్ నడుపుతూ 11 ఏళ్ల చిన్నారి.. పక్కనే మద్యం తాగుతూ తండ్రి.. మరుక్షణంలో..
కొంతమంది వినోదం పేరుతో చేసే పనులు వారి ప్రాణాలకు ముప్పును తెచ్చిపెడతాయి. తాజాగా ఇటువంటి సంఘటనే చోటుచేసుకుంది. 42 ఏళ్ల పరిశోధకుడు గారాన్ మైయా, అతని కుమారుడు ఫ్రాన్సిస్కో మైయా నిర్లక్ష్యపు వినోదానికి పోయి మృత్యువు పాలయ్యారు. వీరు ప్రయాణిస్తున్న ట్విన్ ఇంజిన్ బీచ్‌క్రాఫ్ట్ బారన్- 58 ఒక అడవిలో ప్రమాదానికి గురయ్యింది. ఈ దుర్ఘటనకు జరగడానికి కొన్ని నిముషాల ముందు రికార్డయిన వీడియో అందరినీ ఆలోచింపజేస్తోంది. దీనిని చూస్తే ఈ ప్రమాదం ఎందుకు జరిగిందో ఇట్టే తెలిసిపోతుంది. వీడియోలో మద్యం తాగుతున్న తండ్రి గారోన్ మైయా, ఎయిర్‌క్రాఫ్ట్‌ను కంట్రోల్ చేసే ప్రయత్నంలో ఉన్న 11 ఏళ్ల కుమారుడు ఫ్రాన్సిస్కో మైయా కనిపిస్తారు. Express.co.uk తెలిపిన వివరాల ప్రకారం ఈ వీడియో దుర్ఘటన జరగడానికి ముందు షూట్ చేసినది. ఈ కేసు విచారణ చేపట్టిన అధికారులు ఈ వీడియో ఈ ఘటనకు ముందు సమయానిదా? కాదా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో చూస్తే ఎయిర్‌క్రాఫ్ట్‌లోని తండ్రీకొడుకులు తమ రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నట్లు కనిపిస్తున్నారని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. బ్రెజిల్‌కు చెందిన మీడియా రిపోర్టు ప్రకారం గారాన్ నోవా కాంక్విస్టాలోని రోండోనియా పట్టణంలోని తమ పొలం నుండి ఎయిర్ క్రాఫ్ట్‌లో బయలుదేరాడు. ఇంధనం నింపడానికి విల్హేనాలోని విమానాశ్రయంలో ల్యాండ్ చేశాడు. తన కుమారుడిని కాంపో గ్రాండే నుంచి వేరే ప్రాంతానికి తీసుకు వెళ్లాలని అతను అనుకున్నాడు. వారి కుమారుడు అక్కడ తల్లితో పాటు ఉంటూ స్కూలులో చదువుకుంటున్నాడు. కాగా ఎయిర్‌క్రాఫ్ట్ ప్రమాదంలో భర్త, కుమారుడు మృతిచెందారని తెలియగానే అతని భార్య ఎనాఫ్రిడోనిక్ ఆత్మహత్య చేసుకుంది. భర్త, కుమారుని అంత్యక్రియలకు ముందే ఆమె ఆత్మహత్య చేసుకుంది. కాగా బ్రెజిల్ చట్టాల ప్రకారం 18 ఏళ్ల వయసుదాటిన వారే అధికారికంగా ఎయిర్ క్రాఫ్ట్ నడిపేందుకు అర్హులు. ఇది కూడా చదవండి: అలస్కాలో పగిలిన హిమానీనదం.. కేదార్నాథ్ విపత్తును తలపించేలా.. Avião bimotor Beechcraft Baron 58, de matrícula PR-IDE, "caiu matando pai e filho" a Aeronave cair em uma região de mata fechada, na divisa de Rondônia e Mato Grosso. Os destroços da aeronave foram localizados na manhã deste domingo (30) o pecuarista Garon Maia e o filho.🇧🇷 pic.twitter.com/nOEBpVZJup — D' AVIATION 🇧🇷 (@pgomes7973) August 1, 2023 -
ఆధారాలు దొరకలేదు.. చివరికి బీరు సీసా మూత నిందితులను పట్టించింది
బెంగళూరు: బీరు సీసా మూత నిందితులను పట్టించింది. బెంగళూరులోని మిలీనియం బార్ వద్ద ఈనెల 16న అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులపై జరిగిన దాడి ఘటనను చంద్రాలేఔట్ పోలీసులు ఛేదించారు. అప్రోజ్, రాకేశ్, రాజు, ఆదిల్ పాషా అనే నిందితులను అరెస్టు చేశారు. వివరాలు.. మిథున్‌రాజ్, ముత్తురాజ్ అనే స్నేహితులు ఆటోలో పాటలు పెట్టుకొని మాట్లాడుకుంటుండగా రెండు బైక్‌ల్లో వచ్చిన నిందితులు బీరు బాటిళ్లతో తలలపై దాడి చేసి పారిపోయారు. బాధితులు రక్తం మడుగులో పడి ఉండగా ఆస్పత్రికి తరలించారు. చంద్రలేఔట్ ఎస్ఐ రవీశ్ కేసు దర్యాప్తు చేపట్టారు. సీసీకెమెరాల్లో కూడా నిందితుల కదలికలు లేవు. కేవలం ఘటన స్థలిలో బీరు బాటిల్ మూత లభించింది. బ్యాచ్ నంబర్ ఆధారంగా కొనుగోలు చేసిన బార్ ఆచూకీ లభించింది. అక్కడకు వెళ్లి సీసీకెమెరా పరిశీలించగా నిందితులు బీర్లు కొనుగోలు చేసి బైక్‌లో వెళుతున్న దృశ్యాలు కనిపించాయి. గాలింపు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు. కాగా ఎందుకు దాడికి పాల్పడ్డారని ప్రశ్నించగా ఊరికేనే దాడి చేసినట్లు నిందితులు తెలిపినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: భర్తకు దూరంగా.. ప్రియుడికి ఫోన్ చేసి నేను చనిపోతాను... -
ఇంట్లోనే బీర్ తయారీ..జస్ట్ క్షణాల్లో రెడీ చేసుకోవచ్చు ఎలాగంటే
ఎక్కువ మంది బీర్లు తాగేందుకు ప్రిఫర్ చేస్తారు. అది మంచిదని కొందరూ..గ్లామర్ కోసం అని మరికొందరూ తాగుతుంటారు. పైగా ఆ బీర్లో క్రిస్పీగా సైడ్ డిష్‌లు ఉండాల్సిందే. ఇక చూడు సామిరంగా మందుబాబులు ఓ రేంజ్లో కుమ్మేస్తారు. ఇక ఓ కంపెనీ మరింత ముందడుగు వేసి ఏకంగా ఇన్స్టెంట్ బీర్ పౌడర్లను తీసుకొచ్చింది. ఇక మందు బాబులు బయటకు అడుగుపెట్టకుండా ఇంట్లోనే గ్లాస్లో దర్జాగా ఐస్‌క్యూబ్‌లు వేసుకుని బీర్ తాగేయొచ్చు అంటోంది జర్మన్ కంపెనీ. ఈ మేరకు జర్మనీకి చెందిన బ్రూవరీ కంపెనీ ఇంట్లోనే క్షణాల్లో బీర్ తయారు చేసుకునేలా ఇన్‌స్టింట్ కాఫీ మాదిరిగా బీర్ పౌడర్ని తీసుకొచ్చింది. ఇక ఇంట్లోనే చల్లగా తయారు చేసుకుని క్రిస్పీ స్నాక్స్‌తో ఓ పట్టుపట్టేయొచ్చు. ఇన్స్టెంట్ కాఫీ లేదా మిల్క్‌షేక్ మాదిరిగా క్షణాల్లో తయారు చేసుకోవచ్చట. ఒక గ్లాస్లో రెండు చెంచాల బీర్ పొడికి నీటిని జోడిస్తే చాలట. నిమిషాల్లో రెడీ అయిపోతుందట. దీంతో ఇక టన్నుల కొద్ది బీర్ రవాణను భారీగా తగ్గుతుందని అంటున్నారు వ్యాపార నిపుణులు. ఇక నుంచి ఒక కిలో బీర్ రవాణకు బదులు కేవలం 45 గ్రాముల పౌడర్‌కి పరిమితం చేయొచ్చు. అదే సమయంలో బీర్‌తో స్నానం చేయాలనుకునే వారి కోసం బాత్ బీర్‌ను కూడా రూపొందిస్తున్నారట. ప్రస్తుతానికి సదరు జర్మనీ కంపెనీ 42 రకాల బీర్లను అందిస్తోందని, అలాగే గ్లూటెన్-ఫ్రీ బీర్, నాన్ ఆల్కహాలిక్ బీర్లను సైతం తయారు చేయునున్నట్లు సదరు జర్మనీ కంపెనీ బ్రూవరీ న్యూజెల్లర్ క్లోస్టర్ బ్రూ పేర్కొంది. -
బీచ్‌లో బీర్ తాగుతూ జల్సా చేస్తున్న అల్లు అర్జున్ హీరోయిన్ (ఫోటోలు)
-
బీరుతో ఆమ్లెట్ కిక్కే కిక్కు
-
ఏంటిది బ్రో.. ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌లో ఆ ఫోటో పెట్టి.. అడ్డంగా బుక్ అయ్యావ్!
మా పిల్లలు బుద్ధిమంతులు, చెడు అలవాట్లు లేవు.. ఇది తల్లిదండ్రులకు వారి పిల్లలపై ఉన్న నమ్మకం. అంతెందుకు ఇరుగు పొరుగు, బంధువులు దగ్గర కూడా ఇలానే చెప్పడం మనం చూసే ఉంటాం. ఇక కొందరైతే ఇంట్లో సైలెంట్‌గా బయట వైలెంట్‌గా ప్రవర్తిస్తుంటారు. కానీ ఏది ఏమైనా ఏదో ఒక రోజు అసలు బండారం మన పేరెంట్స్‌కి తెలిసి తీరుతుంది. తాజాగా ఓ కుర్రాడు ఇదే తరహాలోనే అడ్డంగా బుక్ అయ్యాడు. యువతలో ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీటిలో చెన్నై, ముంబై, ఆర్సీబీ వంటి టీమ్‌లకు ఫ్యాన్స్ ,ఫాలోవర్స్ ఎక్కవనే చెప్పాలి. ఇక తమ అభిమాన జట్టు గెలిస్తే ఆ ఆనందంతో సంబరాలు జరుపుకోవడం సహజమే. తాజాగా ఓ యువకుడు బీర్ తాగుతూ ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. అంతటి ఆగక వెంటనే ఆ బీర్ టిన్ ఫోటో తీసి "ముంబయి గెలుస్తుంది...లెట్స్ గో" అని వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేశాడు. అయితే ఇక్కడే ఓ పొరపాటు జరిగిపోయింది. అతను తన ఫ్రెండ్స్ గ్రూప్‌లో అనుకుని ఫోటోని ఫ్యామిలీ గ్రూప్‌లో షేర్ చేశాడు. ఇంకేముంది...ఆ కుర్రాడి తల్లిదండ్రులు ఇది చూసి ఖంగుతిన్నారు. "నీకు తాగే అలవాటుందా..? ఇదేంటి..?' అని అతన ప్రశ్నించారు. మరోవైపు ఆ ఫోటోని వెంటనే డిలీట్ చేయాలని సానియా తన సోదరుడిని కోరింది. దీంతో అతను తొందర్లో డెలీట్ ఫర్ ఎవరీ వన్ అనే ఆప్షన్ కాకుండా డెలీట్ ఫర్ మీ అనే దాన్ని క్లిక్ చేశాడు. ఇంకేముంది జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ తరవాత పెద్ద రచ్చ జరిగింది. ఆ కుర్రాడి అన్న ఈ ఛాటింగ్‌కి సంబంధించిన స్క్రీన్‌షాట్స్‌ని ట్విటర్లో షేర్ చేశాడు. "మా తమ్ముడు చేసిన పని ఇది" అంటూ పోస్ట్ చేశాడు. ఈ ఫోటో చూసిన నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. " ఏంటి బ్రో తాగితే తాగావ్..ఆ ఫోటోలు అవసరమా" అని ఆ కుర్రాడికి క్లాస్ పీకుతున్నారు. ఇంకొందరైతే "సెల్ఫ్ డ్యామేజ్ ఎలా చేసుకోవాలి అనే కోర్స్ చేసుంటాడు" అని ఫన్నీగా స్పందిస్తున్నారు. No way my brother sent this on the family group 😭 pic.twitter.com/FKnrcYiu3K — Saniya Dhawan (@SaniyaDhawan1) May 26, 2023 చదవండి: మీరు లావుగా ఉన్నారా.. అయితే ఆ రెస్టారెంట్లో పుడ్ ఫ్రీ, ఫ్రీ! -
బీర్ల వ్యాన్ బోల్తా
-
ప్రతిరోజూ బీరు తాగడం ముప్పే..
చెమట ద్వారా ఒంట్లోని నీటి శాతానికి వేసవి సీజన్లో తీవ్ర నష్టం కలుగుతుంది. మరోవైపు ఆల్కహాల్ వినియోగంతో సంభవించే అధిక మూత్ర విసర్జన ఈ నష్టాన్ని అధికం చేస్తుంది. శరీరం తీసుకునే దానికంటే ఎక్కువ నీటిని కోల్పోయినప్పుడు డీహైడ్రేషన్ పరిస్థితి ఏర్పడుతుంది. శరీర పనితీరుకు అవసరమైన సాధారణ ద్రవాల కొరతకు దారితీస్తుంది. దీంతో తీవ్రమైన నాలుక పిడచ కట్టుకుపోయేంత దాహం, పొడి నోరు, తలనొప్పి, మైకం, అలసట, గందరగోళానికి గురికావడం వంటివి ఎదురవుతాయి. ఆల్కహాల్ మూత్ర ఉత్పత్తిని పెంచుతుంది. అంతేకాక శరీరానికి ద్రవాలను నిలుపుకోవడం కష్టతరం చేస్తుంది. వేసవి వేడిలో ఆల్కహాల్ వినియోగించినప్పుడు, త్వరగా డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది, శరీర అంతర్గత ఉష్ణోగ్రతను నియంత్రించే స్వాభావిక సామర్థ్యాన్ని ఆల్కహాల్ దెబ్బతీస్తుంది, శరీరపు అంతర్గత ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా పెరిగినప్పుడు సంభవించే తీవ్రమైన పరిస్థితి హీట్‌స్ట్రోక్. ఇది మెదడు, గుండె ఇతర అవయవాలకు హాని కలిగిస్తుంది. అధిక శరీర ఉష్ణోగ్రత, వేగవంతమైన హృదయ స్పందన, వికారం, వాంతులు, తలనొప్పి నుంచి మూర్ఛ వరకూ ఇది దారి తీసే ప్రమాదం ఉంది. మానేయాలి లేదా బాగా తగ్గించాలి.. ఈ నేపథ్యంలో ఆల్కహాల్ వేసవి వేడిని కలపడం వల్ల కలిగే ప్రమాదాల నుంచి రక్షించుకోవడానికి హైడ్రేటెడ్‌గా ఉండడం చాలా అవసరం. రోజంతా పుష్కలంగా నీరు తాగడం చాలా అవసరం. అధిక వేడి, ఉక్కపోత, ఉష్ణోగ్రతలు ఉండే రోజులలో ఆల్కహాల్‌ను పూర్తిగా ఆపేయడం లేదా బాగా పరిమితం చేయడం మంచిది. బీరుతో పాటు నాన్ వెజ్ వంటకాలు అధికంగా తీసుకోవడం కూడా ద్రవం అడుగంటడానికి శరీరంలో వేడి విజృంభణకు దారి తీస్తుంది. ఏటా పెరుగుతున్న బీరు విక్రయాలు... గత కొన్నేళ్లుగా మార్చి, ఏప్రిల్, నెలల్లో బీర్ల విక్రయాలు తారస్థాయికి చేరుకోవడం కనిపిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరు నుంచి మే మొదటి వారం వరకూ పది రోజుల పాటు వర్షాల కారణంగా వాతావరణం చల్లబడడంతో బీర్ల వినియోగం కూడా ఎప్పటికన్నా బాగా తగ్గిపోయింది. దాంతో ఈ సారి బీర్ల అమ్మకాల్లో తరుగుదల నమోదవుతుందని వైన్‌షాప్ యజమానులు భావించారు. 10 రోజులుగా ఒక్కసారిగా పెరిగిన ఎండలు మళ్లీ బీరు విక్రయాలు ఎగబాకాయి. కేవలం 2 వారాల విక్రయాలతోనే గత ఏడాది మే నెల సేల్స్‌ను అందుకోవడం తథ్యమని వ్యాపారులు చెబుతున్నారు. వేసవి కాలం చల్లని బీరు కిక్‌ని నగరవాసుల్లో పెంచుతోంది. గత కొన్నేళ్లుగా వేసవి సీజన్లో అమాంతం నగరంలో పెరిగే బీర్ల విక్రయాలే దీనికి నిదర్శనం. ఆల్కహాల్ శాతం తక్కువ, ఆరోగ్యానికి హానికరం కాదు వంటి అపోహలతో అడపాదడపా రుచి చూసేవాళ్లు కూడా వేసవిలో బీర్బలులుగా మారిపోతున్నారు. ముఖ్యంగా యువత బీర్ల వినియోగాన్ని మంచినీళ్ల ప్రాయంగా భావిస్తుండడం కనిపిస్తోంది. బీరు చల్లదనాన్ని ఇవ్వడమనేది అపోహ మాత్రమేనని, బీరు వ్యసనం ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాలు చూపిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వేడి వాతావరణంలో మద్యపానం శారీరక విపత్తుగా మారుతుందని వైద్యులు అంటున్నారు. వేడి వాతావరణం నేపథ్యంలో ఆల్కహాల్‌ను అత్యధికంగా తీసుకోవడం వల్ల తీవ్రమైన ఆరోగ్య ఇబ్బందులు వస్తాయని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆల్కహాల్ అబ్యూజ్ అండ్ ఆల్కహాలిజం నివేదిక చెబుతోంది. వైద్యులేమంటున్నారు? ► 5 నుంచి 12 శాతం ఆల్కహాల్‌తో, ఇతర ఆల్కహాలిక్ పానీయాల కంటే బీరు తక్కువ హానికరం. కొంత మొత్తంలో ఆల్కహాల్ కలిగి ఉందనే నెపంతో అధికంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు దాని తీస్తుంది. ► ఆల్కహాల్‌లోని కేలరీలు ఆహారాల నుంచి వచ్చే కేలరీల కన్నా భిన్నంగా ఉండి, పొట్ట ఉబ్బడానికి దారితీస్తాయి పొత్తికడుపులో కొవ్వు పేరుకుపోవడం అన్నింటికంటే ప్రమాదకరం. ► అధిక మద్యపానం గుండె కండరాలను దెబ్బతీస్తుంది, స్ట్రోక్, అధిక రక్తపోటు, టైప్ 2 డయాబెటిస్ దడ ప్రమాదాన్ని పెంచుతుంది. ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువగా ఉన్న బీరు తాగడం వల్ల హైపర్ టెన్షన్ కిడ్నీ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అధిక మూత్రవిసర్జనకు కారణమై బీరు మూత్రపిండాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. దీర్ఘకాలంలో మూత్రపిండాల్లో రాళ్లు లేదా మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది. ► రెగ్యులర్‌గా బీరు తాగడం వల్ల కొన్ని విటమిన్లు మినరల్స్ అవసరాలు శరీరానికి బాగా పెరుగుతాయి. ఈ అవసరాలు నెరవేరనప్పుడు, అది మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. బీరు తాగడం వల్ల ఒక వ్యక్తి త్వరగా నిద్రపోవడానికి సహాయపడుతుంది కానీ అది దీర్ఘ కాలం ఉండదు. ఇందులో గాఢ నిద్ర 90 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఇది పగటిపూట మగత, ఏకాగ్రత లోపం, అలసటకు దారితీస్తుంది. -
ఆఫీసుల్లో కూడా వైన్, బీర్ సర్వ్ చేసేలా కొత్త పాలసీ!
ఆ రాష్ట్రంలోని కార్యాలయాల్లో(ఆఫీసుల్లో) బీర్, వైన్ సర్వ్ చేసేలా అనుమితించడం కోసం ప్రత్యేక పాలసీని కూడా తీసుకొచ్చారు. ఈ పాలసీ ప్రకారం అన్ని కార్పొరేటే కార్యాలయాల్లో వైన్, బీర్ వంటి తక్కువ కంటెంట్ ఆల్కహాల్ డ్రింక్స్‌ని సర్వ్ చేసేలా అనుమితిస్తున్నారు. ఈ పాలసీ నిబంధన ప్రకారం కార్పోరేట్ కార్యాలయాల్లో సుమారు 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంటీన్ లేదా తినుబండరాలు ఉండాలి. ఈ మేరకు గురుగ్రామ్ లేదా హర్యానాలోని అక్కడ క్యాబినేట్ మంగళవారం ఈ క్తొత పాలసీ 2023-24కి ఆమోదం తెలిపింది. రిటైల్ పర్మిట్ రుసుము కింద పర్యావరణం, జంతు సంక్షేమ నిధి కోసం రూ. 400 కోట్లను సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం తర్వాత విడదల చేసిన అధికారిక ప్రకటనలో దీని గురించి తెలిపారు. హర్యానా కొత్త మద్యం పాలసీలో ముఖ్యాంశాలు కొత్త పాలసీలో దేశీయ మద్యం, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, ఇంపోర్టెడ్ ఫారిన్ లిక్కర్ బేసిక్ కోటా పెరిగింది. దీంతో దేశీయ మద్యం, IMFL పై ఎక్సైజ్ సుంకం రేట్లలో నామమాత్రపు పెరుగుదల మాత్రమే ఉంది. ఈ పెంపుదలతో ఎక్సైజ్ ఆదాయానికి పెద్దపీట వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వ్యాపారం చేసే సౌలభ్యం కోసం, కొత్త విధానంలో, జిల్లా స్థాయిలో IFL (BIO) లేబుల్‌లను పునరుద్ధరించింది. అలాగే సూక్ష్మ మధ్య తరహా రంగాన్ని ప్రోత్సహించడానికి చిన్న షాపులకు లైసెన్స్ ఫీజును తగ్గించింది. రాష్ట్రంలో వైన్ తయారీ కేంద్రాలను ప్రోత్సహించేందుకు వైన్ తయారీ కేంద్రాల పర్యవేక్షక రుసుమును తగ్గించినట్లు ప్రకటనలో తెలిపారు. పంచకులలోని శ్రీ మాతా మానస దేవి ఆలయం చుట్టుపక్కల నోటిఫై చేయబడిన పవిత్ర ప్రాంతాలు, గురుకులాలు ఉన్న గ్రామాలలో మద్యం దుకాణాలు తెరవకూడదని నిర్ణయించినట్లు ప్రకటన పేర్కొంది. తక్కువ ఆల్కహాల్ కంటెంట్ ఉన్న పానీయాలను ప్రోత్సహించడానికి, మైల్డ్, సూపర్ మైల్డ్ కేటగిరీల కింద సిద్ధంగా ఉన్న పానీయాలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. పబ్ కేటగిరీలో బీర్, వైన్ వినియోగానికి మాత్రమే లైసెన్స్ ఫీజు మరింతగా తగ్గించింది. (చదవండి: మరో భారత్ జోడో యాత్రకు కాంగ్రెస్ సన్నాహాలు) -
బీర్‌తో నడిచే బైక్: మతిపోయే స్పీడ్, కావాలంటే వీడియో చూడండి!
సాక్షి, ముంబై: బీర్‌తో నడిచే బైక్ ఎపుడైనా చూశారా? అవును బీర్ బైకే.. అది కూడా గంటకు 240 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుందట. ప్రస్తుతం ఈ బీర్ బైక్ ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. అమెరికాకు చెందిన మైఖేల్సన్ బీర్ బైక్ సృష్టికర్త. గతంలో రాకెట్‌తో నడిచే టాయిలెట్, జెట్‌తో నడిచే కాఫీపాట్ను కనుగొన్న మైఖేల్సన్ తాజా బీర్బైక్ను రూపొందించడం విశేషం. దీనికి సంబంధించిన వివరాలను ఫాక్స్9తో షేర్ చేసిన అతగాడు బైక్‌లో అమర్చిన హీటింగ్ కాయిల్ బీర్‌ను 300 డిగ్రీల వరకూ మండిస్తుందని, దీంతో నాజిల్స్‌లో ఆవిరి జనరేట్ అవ్వడం ద్వారా బైక్ పని చేస్తుందని మైఖేల్సన్ తెలిపారు. బీరుతో నడిచే మోటార్‌సైకిల్ బ్లూమింగ్టన్లోని అతని గ్యారేజీలో నిర్మించారట. ఈ బైక్ గంటకు 240 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుందని చెప్పాడు మైఖేల్సన్. గ్యాస్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో ఇదొక వినూత్న ఆవిష్కరణ అని వెల్లడించాడు. అంతేకాదు రెడ్ బుల్, కారిబౌ కాఫీతో సహా ఏదైనా ద్రవం కూడా తన బైక్ ఇంధనంగా మార్చుకోవచ్చని కూడా పేర్కొన్నాడు. తాను డ్రింక్ చేయనని, అందుకే దీన్ని ఇంధనంగా మలచి మెరుగ్గా వాడుకోవాలని ఆలోచించానని చెప్పుకొచ్చాడు. రాకెట్మ్యాన్గా పేరొందిన మైఖేల్సన్ బీర్ బైక్ స్ధానిక కార్ షోస్‌లో టాప్ ప్లేస్ స్ధానంలో నిలవడం విశేషం. కొన్ని ప్రదర్శనల అనంతరం తన ఇంటిలోని మ్యూజియంలో ఈ బైక్‌ను ఉంచుతానని మైఖేల్సన్ తెలిపాడు. 9 నెలల క్రితం తన యూట్యూబ్ ఛానెల్లో ఈ వీడియోను షేర్ చేశాడు. అతని కుమారుడు దీని గురించి సవివరమైన సమాచారం ఇచ్చాడు. -
గ్రేటర్ లో 17రోజుల్లో కోటి బీర్లు సేల్
-
బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయా? నిజమేనా?
కిడ్నీలో రాళ్లు ఏర్పడే కేసులు దేశంలో రోజురోజుకు పెరుగుతున్నాయి. కిడ్నీ పనితీరు, కిడ్నీ రోగాల బారినపడితే ఎదురయ్యే ఆరోగ్య సమస్యల గురించి చాలా మందికి సరైన అవగాహన లేకపోవడం వల్లే ఈ కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచ కిడ్నీ దినోత్సవం(మార్చి 9) సందర్భంగా ప్రిస్టిన్ హెల్త్ కేర్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయని ప్రతి ముగ్గురిలో ఒకరు నమ్ముతున్నట్లు ఈ సర్వేలో తేలింది. అయితే ఇందులో అసలు వాస్తవం లేదని, కేవలం కల్పితమేనని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. అలాగే కిడ్నీలో రాళ్ల సమస్య చికిత్సను 50 శాతం మంది కావాలనే 6 నెలలు ఆలస్యం చేస్తున్నారు. దాన్ని కాస్తా రెండేళ్లకు పొడిగిస్తున్నారు. కిడ్నీ రోగాలకు సంబంధించి అధికారికంగా జాతీయ గణాంకాలు లేకపోయినప్పటికీ కేసుల్లో గణనీయ పెరుగుదల కన్పిస్తున్నట్లు లైబ్రేట్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్ డేటా స్పష్టం చేసింది. దీని ప్రకారం 2021తో పోల్చితే 2022 కిడ్నీ రోగాలకు సంబంధించి డాక్టర్ అపాయింట్మెంట్లు ఏకంగా 180 శాతం పెరిగాయి. వీరిలో ఎక్కువమందికి కిడ్నీలో రాళ్ల సమస్యే ఉంది. ఈ సమస్యతో బాధపడుతున్న వారిలో మహిళలతో పోల్చితే పురుషులే మూడు రెట్లు అధికంగా ఉన్నారు. కిడ్నీలో రాళ్ల సమస్య వల్ల ప్రధానంగా ఊబకాయం, హైపర్ టెన్షన్ వంటి సమస్యల బారినపడే ముప్పు ఉంటుంది. అయితే ఈ విషయం బాధితుల్లో 14 శాతం మందికే తెలుసు. యూరిన్ కిడ్నీ నుంచే ఉత్పత్తి అవుతుందన్న విషయం సర్వేలో పాల్గొన్న 50 శాతం మందికిపైగా తెలియదు. కిడ్నీలు కూడా ప్రోటీన్లను విచ్ఛిన్నం చేస్తాయని 9 శాతం మందికి మాత్రమే తెలుసు. ఎముకల ఆరోగ్యానికి కిడ్నీనే కీలకమని 7 శాతం మందికే తెలుసు. ఫిట్నెస్, బాడీ బిల్డింగ్‌కు పాపులారిటీ పెరుగుతున్న కారణంగా చాలా మంది తమ డైట్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నారు. అయితే ప్రోటీన్ సప్లిమెంట్ల వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడుతాయని 50 శాతం మంది విశ్వసిస్తున్నారు. కానీ ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కిడ్నీ ఆరోగ్యంపై చాలా మందికి కనీస అవగాహన లేదని సర్వే స్పష్టం చేసింది. కిడ్నీలో రాళ్లను తొలగించే సర్జరీ సేఫ్ అని సర్వేలో పాల్గొన్న 68శాతం మంది నమ్ముతున్నారు. అయినా 50 శాతం మంది కావాలనే చికిత్సను 6 నెలల పాటు ఆలస్యం చేస్తున్నారు. కిడ్నీ సమస్యలను గుర్తించిన వెంటనే చికిత్స తీసుకుంటే అవి మరింత పాడవకుండా నివారించవచ్చని డాక్టర్ వైభవ్ కపూర్(ప్రిస్టిన్ కేర్ సహవ్యవస్థాపకులు) సూచిస్తున్నారు. చదవండి: ఇది ఎక్కువగా తినడం వల్లే గుండెపోట్లు, అకాల మరణాలు..! -
ఒక ఫోన్ కొంటే రెండు బీర్లు ఫ్రీ.. అరెస్ట్
క్రైమ్: స్మార్ట్‌ఫోన్ కొంటే బీర్లు ఫ్రీ అని అనౌన్స్ చేశాడు. ఊరంతా పోస్టర్లు అంటించి.. పాంప్లెట్స్ పంచాడు. ఆ ప్రకటనతో ఒక్కసారిగా ఆ సెల్‌ఫోన్ దుకాణం ముందు జనం ఎగబడ్డారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడంతో పాటు అక్కడ రచ్చ రచ్చ చేశారు. ఇది కాస్త పోలీసుల దాకా చేరింది. రంగ ప్రవేశం చేసి ఆ బంపరాఫర్ ప్రకటించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. యూపీ భదోహిలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. చౌరీ రోడ్లో రాజేశ్ మౌర్య అనే వ్యక్తి సెల్ఫోన్ల షాప్ నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో తన దుకాణంలో మార్చి 3 నుంచి 7వ తేదీల మధ్య సెల్‌ఫోన్ కొంటే రెండు బీర్ క్యాన్లు ఇస్తానని ప్రకటించాడు. సెంటర్లలో పోస్టర్లు అతికించి, పాంప్లెట్స్ పంచాడు. దీంతో కస్టమర్లు ఒక్కసారిగా ఎగబడ్డారు. ట్రాఫిక్‌కు విఘాతం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి గుంపును చెదరగొట్టారు. ఐపీసీ సెక్షన్ 151 (ప్రజాశాంతికి విఘాతం కలిగించడం) నేరం కింద మౌర్యను అరెస్ట్ చేసి, దుకాణాన్ని సీల్ చేశారు. -
కుక్క పిల్ల అని పెంచితే.. రెండేళ్ల తర్వాత నిజం తెలిసి షాకయ్యారు!
చాలా మంది పెంపుడు జంతువులను పెంచుకోవడం చూస్తూనే ఉంటాం. ఇక కొందరైతే వాటిని తమ ఇళ్లలోని మనుషులులానే భావిస్తారు. ఇదంతా షరా మామూలే. చైనాలోని ఓ కుటుంబం కూడా ఓ కుక్క పిల్లను రెండేళ్లు అల్లారుముద్దుగా పెంచుకుంది. కానీ పెద్దయ్యాక దాన్ని అసలు రంగు బయటపడింది. నిజం తెలియగానే కుటుంబమంతా షాక్‌లో ఉండిపోయింది. ఇంతకీ అక్కడ ఏం జరిగింది. వివరాల్లోకి వెళితే.. యునాన్ ప్రావిన్స్‌లోని కున్మింగ్ నగరం వెలుపల ఉన్న మారుమూల గ్రామానికి చెందిన సు యున్ అనే మహిళ, 2016లో విహారయాత్రలో వెళ్లి ఓ కుక్కపిల్లని తన ఇంటికి తీసుకెళ్లింది .ఆ కుక్కపిల్ల చూసేందుకు పెద్దదిగా, కాస్త భిన్నంగా ఉన్నప్పటికీ ఆ మహిళ అవేవి పట్టించుకోలేదు. అయితే అది పెరిగేకొద్దీ, దాని ప్రవర్తన కుక్కలా కాకుండా వింతగా ప్రవర్తించేది. అలా రెండేళ్ల గడిచింది ఆ తర్వాత ఆ కుక్క పిల్ల బలంగా తయారై క్రూరంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. దీంతో ఆ మహిళకు అనుమానం రావడంతో జంతువులకు సంబంధిత అధికారులను సంప్రదించింది. ఆమె అనుమానాలను నిజం చేస్తూ, ఆ మహిళ ఇంట్లో పెంచుకుంటున్న జంతువు ఆసియాటిక్ బ్లాక్ బేర్ అని, అంతరించిపోతున్న జాబితాలో ఉన్న జాతికి చెందిన ఎలుగుబంటని తేలింది. దీంతో ఆ మహిళ షాక్‌కు గురైంది. తత్ఫలితంగా, యునాన్ వైల్డ్ లైఫ్ రెస్క్యూ విభాగం ఆ జంతువును స్వాధీనం చేసుకుంది. 2018లో తొలిసారిగా వైరల్‌గా మారిన ఈ వింత కథనం.. అయితే తాజాగా మళ్లీ ఆ వార్త వైరల్‌గా మారింది. చదవండి: టికెట్ బుకింగ్ సమయంలో షాక్.. ఐఆర్సీటీసీపై యూజర్లు ఫైర్! -
మందుబాబులకు గుడ్ న్యూస్.. ఉదయం 3 వరకు బార్లు ఓపెన్.. ఎక్కడంటే?
చండీగఢ్: కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకై బార్లు ఉదయం 3 గంటల వరకూ తెరచి ఉంచేందుకు అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించిన కొత్త ఎక్సైజ్ పాలసీ 2023-24ను బుధవారం విడుదల చేసింది. అలాగే మద్యంపై 'కౌ సెస్'ను తగ్గించింది. కొత్తగా 'క్లీన్ ఎయిర్ సెస్'ను తీసుకొచ్చింది. చండీగఢ్‌లో ఇంతకుముందు అర్ధరాత్రి ఒంటిగంట వరకే బార్లకు అనుమతి ఉండేది. కొత్త ఎక్సైజ్ పాలసీలో కౌ సెస్‌ను తగ్గించారు. స్వదేశంలో తయారైన 750 ఎంఎల్ లిక్కర్ బాటిల్‌పై కౌ సెస్ గతంలో రూ.5 ఉండగా.. ఇప్పుడు రూ.1కి తగ్గించారు. అలాగే బీరుపై కూడా రూ.5గా ఉన్న ఈ సెస్‌ను రూ.1కి పరిమితం చేశారు. ఇక 750/700 ఎంఎల్ విస్కీపై కౌ సెస్‌ను రూ.10 నుంచి రూ.2కి తగ్గించారు. అలాగే ఎక్సైజ్ డ్యూటీలోనూ ఎలాంటి మార్పు చేయలేదు. తక్కువ ఆల్కహాల్ డ్రింక్స్‌ను ప్రోత్సహించడానికి బీర్, వైన్ వంటి వాటిపై లైసెన్స్ ఫీజులు పెంచలేదు. చదవండి: ‘వారి టార్గెట్ నేను కాదు.. మీరే!’ రాజీనామా లేఖలో మనీష్ సిసోడియా -
కలెక్టర్ సారూ.. కింగ్ ఫిషర్ బీర్లు దొరకడం లేదు..!
మద్యం ప్రియులు బ్రాండ్ల విషయంలో ఏ మాత్రం రాజీపడరనే విషయం మరోసారి రుజువైంది. తమకు అత్యంత ఇష్టమైన మద్యం బ్రాండ్ లేకపోతే తాము ఎందుకు సర్దుకుపోవాలి అనుకున్నాడో ఏమో గానీ ఒక వ్యక్తి ఏకంగా కలెక్టరేట్‌నే ఆశ్రయించాడు. ‘మాకు కింగ్ ఫిషర్ బీర్లు అందుబాటులో లేవు’ అని ఫిర్యాదు చేశాడు. మద్యం పాలసీ అనేది ప్రభుత్వం చూస్తుంది కాబట్టి దాన్ని ఏకండా ప్రభుత్వ ఉన్నతాధికారి దృష్టికే తీసుకెళ్లాడు మనోడు. ఏకంగా కలెక్టర్‌కే ఫిర్యాడు చేశాడు. జగిత్యాలకు చెందిన బీరం రాజేష్ అనే వ్యక్తి తమ ఊరిలో ప్రజావాణి కార్యక్రమం జరుగుతుందనే విషయం తెలుసుకున్నాడు. ఏదైనా సమస్య కదా అనుకున్నాడు. తనకు వచ్చిన సమస్య కింగ్ ఫిషర్ బ్రాండ్ అందుబాటులో లేదనేది. దీన్ని కలెక్టర్ వద్దకే తీసుకెళ్లాడు. ప్రజావాణిలో తమకు కింగ్ ఫిషర్ బ్రాండ్ బీర్లు దొరకడం లేదని విన్నవించాడు. ఇది చూడటానికి నవ్వు తెప్పించినా మనోడి కష్టం ఎవరికి తెలుసు. మరి ఆ కలెక్టర్‌గారు దీనిపై చర్యలు తీసుకుంటామన్నారా.. లేక లైట్ తీసుకుంటారో చూడాలి. గతంలో కూడా జగిత్యాల ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. అదే జగిత్యాలలో 2018లో అయిల సూర్యనారాయణ అనే వ్యక్తి కూడా కింగ్ ఫిషర్ బ్రాండ్ బీరు దొరకడం లేదని ఫిర్యాదు చేశాడు. అప్పుడు కూడా ప్రజావాణి కార్యక్రమంలోనే కలెక్టర్‌గా ఫిర్యాదు చేశాడు. జగిత్యాలలో కింగ్ ఫిషర్ బీరు విక్రయాలను నిలిపేసి వాటి స్థానంలో నాసిరకం బీరును అమ్ముతూ కొనుగోలుదారులను మోసం చేస్తున్నారని తెలిపారు. పొరుగున కరీంనగర్లో కింగ్ ఫిషర్ బీర్ యథేచ్చగా దొరుకుతుండగా జగిత్యాలలో ఈ గడ్డు పరిస్థితికి కారణమేంటని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడుమరొక ఫిర్యాదు. వ్యక్తులు మారారు కానీ అదే ఫిర్యాదు. బ్రాండ్ కూడా అదే. -
బైక్ నడుపుతూ బీర్ తాగిన యువకుడు.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు
లక్నో: ఓ యువకుడు అతిగా ప్రవర్తించాడు. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నడుపుతూ బీర్ తాగాడు. రహదారిపై ఇతడు చేసిన చేష్టలను స్నేహితులే వీడియో తీశారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో రంగంలోకి దిగిన ఉత్తర ప్రదేశ్ గాజియాబాద్ పోలీసులు యువకుడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. రూ.31,000 చలనా విధించారు. హెల్మెట్ ధరించకపోగా బైక్ నడుపుతూ మద్యం సేవించినందుకు ఇంత భారీమొత్తంలో జరిమానా వేశారు. ఇందుకు సంబంధించిన చలానాను సోషల్ మీడియాలో షేర్ చేశారు. #Ghaziabad DME पर बीयर पीकर रील रिकॉर्ड करने वाले इस सूरमा ने तो @Gzbtrafficpol की चालानी कार्यवाई की पोल खोल दी, DME पर 2 व्हीलर नही जा सकते यहाँ तो पूरी शूटिंग जारी है। मसूरी थाना क्षेत्र है। @ghaziabadpolice @uptrafficpolice @sharadsharma1 @bstvlive @DCPRuralGZB pic.twitter.com/Mvbj2sFZ2H — Lokesh Rai 🇮🇳 (@lokeshRlive) January 20, 2023 చదవండి: రష్యా నుంచి గోవా వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు -
ఈ బీరు ఖరీదు 4 కోట్లు
హే... బీరుకు అంత ఖరీదుంటుందా? ఏదో పాత వైనో, విస్కీనో, షాంపేనో అయినా నమ్మొచ్చు. కానీ.. బీరు కు మరీ అంత కాస్ట్ ఉండటం ఏంటి? సహజంగా వచ్చే కామెంట్. కానీ, ఈ బీరు చాలా విలువైనది. ఎందుకంటే అది 140 ఏళ్ల కిందటిది. దీని వెనుక ఎంతో చరిత్ర ఉంది. అదే దీన్ని అత్యంత ఖరీదైన మద్యంగా చేసింది. ఒక్లోహామాకు చెందిన ఓ వ్యక్తి 2007లో ఈ బీర్ ‘ఆల్సాప్స్ ఆర్కిటిక్ ఆలె’ని మసాచుసెట్స్‌కు చెందిన ఓ సెల్లర్ నుంచి కొన్నాడు. షిప్పింగ్‌తో కలిపి రూ. 24 వేలు అయ్యింది. ఆ బాటిల్‌తో పాటు... లామినేట్ చేసిన చేతిరాత నోట్ ఒకటి వచ్చింది. ‘ఈ బాటిల్‌ను 1919లో నేను పొందాను. దీన్ని 1852లో ఆర్కిటిక్ యాత్ర కోసమే తయారు చేశారు’ అని ఆ బాటిల్ అమ్మిన పెర్సీ.జి.బోలస్టర్ పేర్కొన్నాడు. కొనుగోలు చేసిన వ్యక్తి ఆసక్తితో పరిశోధిస్తే ఈ చరిత్ర తెలిసింది. ‘ఆ బీర్‌ను సర్ జాన్ ఫ్రాంక్లిన్ ఆర్కిటిక్ యాత్ర కు వెళ్లేటప్పుడు వెంట తీసుకెళ్లారు. అప్పటికే ఆ వాయవ్య మార్గంలో రెండుసార్లు ప్రయాణించిన ఫ్రాంక్లిన్ బృందాన్ని ఆ యాత్ర మింగేసింది. రెండు ఓడలు మునిగిపోయాయి. 129 మంది మరణించారు. వారిని వెదకడానికి వెళ్లిన అడ్మిరల్ సర్ ఎడ్వర్డ్ బెల్చెర్కు.. వాళ్లు తీసుకెళ్లిన సరుకుల్లో ఈ బీర్ మాత్రమే దొరికింది’ అని తెలుసుకున్నాడు. ఆ అరుదైన బీర్‌ను ఈబేలో వేలం వేస్తే... 157కు పైగా బిడ్లు వచ్చాయి. చివరకు రూ.4 కోట్లకు ఆ బాటిల్‌ను ఎవరో కొనుగోలు చేశారు. దాన్ని తాగారా? లేదా? అనేది మాత్రం తెలియదు. -
ప్రపంచంలోనే ఖరీదైన బీరు ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే ఖరీదైనవి, విలువైనవి ఎవరికైనా ఆసక్తి ఎక్కువే. అందులోనూ పురాతనమైన వైన్, షాంపైన్ ఖరీదైన లగ్జరీ డ్రింక్స్‌గా మందుబాబులను ఊరిస్తూ ఉంటాయి. తాజాగా ఒక బీరు బాటిల్ అంత్యంత ఖరీదైన ధరతో వార్తల్లో నిలిచింది. ఈ బీరు బాటిల్ ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వక తప్పదు. అవును ఈ బీరు బాటిల్ ధర అక్షరాలా ఐదు లక్షల డాలర్ల అంటే మన భారతీయ కరెన్సీలో రూ.4 కోట్ల పైనే అన్నమాట. 140 సంవత్సరాల క్రితం నాటి ‘అల్ సాప్స్ ఆర్కిటిక్ అలె’ వేలంలో అత్యంత ధర పలికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా చరిత్ర కెక్కింది. ఒక వ్యక్తి ఈ బీరు బాటిల్‌ని 5,03,300 డాలర్లకు కొనుగోలు చేయడం విశేషం. అల్సాప్స్ అనే బీర్ల తయారు కంపెనీ దీన్ని తయారుచేసింది. దీంటోల ఆల్కహాల్ 10 శాతం ఉండటమే దీని ప్రత్యేకత అట. లండన్‌లోని పురాతన వస్తువులు, ఆర్ట్వర్క్కి సంబంధించిన ఆంటిక్ట్రేడ్ సమాచారం ప్రకారం, ఓక్లహోమాకు చెందిన ఒక కస్టమర్ 2007లో ఈబే ఆన్లైన్ వేలంలో దీన్ని 304 డాలర్లకు సొంతం చేసుకున్నాడు. ఈ బీరు బాటిల్‌ని స్టోర్‌లో వేలానికి పెడితే 157 మంది పోటీపడ్డారు. మసాచుసెట్స్ రాష్ట్రానికి చెందిన ఒక వ్యాపారి ఈ బీరు బాటిల్‌కి డెలివరీ ఛార్జి కింద 19.5 డాలర్లు తీసుకున్నాడని వెల్లడించింది. ఈ బీరు బాటిల్‌పైన పాత పేపర్‌తో లామినేటెడ్ కవర్ ఉంది. ఆ కాగితం మీద చేతితో రాసిన అక్షరాలు, పెస్సీ జి.బోల్స్టర్ అనే పేరుతో సంతకం ఉంది. అందులో ‘ఈ బాటిల్ 1919లో నా దగ్గర ఉంది’ అని రాసి ఉంది. ఆ నోట్‌ని బట్టి ఈ బీరు బాటిల్‌ని ధ్రువ ప్రాంతాలకు వెళ్లేవాళ్ల కోసం 1852లో ప్రత్యేకంగా తయారుచేశారు అన్నట్లుగా తెలుస్తోంది. కాగా సర్ ఎడ్వర్డ్ బెల్చర్ అనే నౌకాదళం అధికారి ఆర్కిటిక్ చల్లటి వాతావరణానికి తగ్గట్టుగా ఒక బీరు బాటిళ్లను తయారుచేయాలని 1852లో అల్సాప్స్ కంపెనీని కోరాడట. అందుకని ఆర్కిటిక్ ధ్రువంలో గడ్డకట్టకుండా ఉండేందుకు ఆల్కహాల్ శాతం ఎక్కువ (10శాతం) ఉండేలా ఈ బీరుని తయారుచేశారు. ఎడ్వర్డ్ ఈ బీరు బాటిళ్లను బ్రిటీష్ నౌకాదళం అధికారి, ఆర్కిటిక్ యాత్రికుడు సర్ జాన్ ఫ్రాంక్లిన్, అతని టీం కోసం ఆర్కిటిక్ ధ్రువానికి పంపించాడని యాంటిక్ ట్రేడ్ వెబ్సైట్ తెలియజేస్తోంది.ఎరేబస్, టెర్రర్ , వారి సిబ్బందిని కనుగొనడానికి రెస్క్యూ ప్రయత్నాల తర్వాత బీర్ బాటిల్ కనుగొన్నారట. దురదృష్టవశాత్తు, ఇద్దరు సిబ్బందికి సంబంధించిన ఆధారాలు ఎప్పుడూ కనిపించలేదు. -
టీచర్ అయ్యి ఉండి ఇదేం పని... పిల్లల ముందే అలా..: వీడియో వైరల్
ఉపాధ్యాయుడి వృత్తిలో ఉండి కూడా ఒక ప్రబుద్ధుడు దారుణమైన ఘోరానికి ఒడిగట్టాడు. విద్యార్థులుండే స్కూల్‌కి తాగుతు రావడమే కాకుండా చిన్నారుల ముందే ఒక ఖాళీ బీర్బాటిల్ని కింద పెట్టాడు. అదీకూడా విద్యార్థులకు మంచి చెడు చెప్పాల్సిన పవిత్రమైన వృత్తిలో ఉండి ఇలా తాగుతూ స్కూల్‌కి రావడం అందర్నీ ఒకింత విస్తుపోయేలా చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఈ ఉపాధ్యాయుడు తాగా వచ్చిందే గాక వారి ముందే ఒక ఖాళీ బీర్ల బాటిల్‌ని కింద పెట్టాడు. ఎవరో ఒక పక్క నుంచి వీడియో తీస్తుంటే మరో బీర్ బాటిల్‌ని దాచుకునేందుకు యత్నించి విఫలమయ్యాడు కూడా. ఈ ఘటన స్పందించిన ఉత్తరప్రదేశ్ జిల్లా అధికారులు సదరు ఉపాధ్యాయుడిన సస్పెండ్ చేశారు. కొంతమంది వ్యక్తులు మద్యం మత్తులోనే స్కూల్‌కి వస్తున్న టీచర్ని గమనించి ఈ వీడియో రికార్డు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై స్పందించిన డిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మాలి ట్విట్టర్లో...విద్యార్థుల ముందే తాగి వచ్చిన సదరు టీచర్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఉత్తరప్రదేశ్ పోలీసులను కోరారు. नशे की हालत में धुत मास्टर जी बच्चे बच्चियों को पढ़ा रहे हैं। वीडियो हाथरस यूपी की बताई जा रही है। यदि बच्चों के भविष्य के सृजनहार टीचर ऐसी हरकत करें तो क्या बच्चों का भविष्य अच्छा हो सकता है? तुरंत इस टीचर पे कार्यवाही करे @Uppolice pic.twitter.com/zbCoJb5D8e — Swati Maliwal (@SwatiJaiHind) October 2, 2022 (చదవండి: టన్నుల కొద్ది వ్యర్థాలతో కోట్లు గడిస్తూ...వరుసగా ఆరోసారి తొలిస్థానం దక్కించుకున్న నగరం) -
అందంతో కట్టిపడేసింది.. ఎత్తిన గ్లాస్ దించకుండా తాగింది
ఆట ఏదైనా సరే.. కొందరు అభిమానులు తమ చర్యతో, అందంతో అందరి దృష్టిని తమవైపు తిప్పుకుంటారు. తాజాగా యూఎస్ ఓపెన్‌లో అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. అమెరికాకు చెందిన మేఘన్ లక్కీ అనే యువతి టెన్నిస్‌కు వీరాభిమాని. గతేడాది యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో భాగంగా ఒక మ్యాచ్‌కు హాజరైన మేఘన్ లక్కీ.. అందరూ చూస్తున్న సమయంలో గ్లాసు బీరును దించకుండా తాగి అందరి దృష్టిలో పడింది. అప్పటినుంచి ఆమెను ''బీర్ చీర్ గర్ల్'' అని ముద్దుగా పిలుస్తున్నారు. కాగా సదరు యువతి ఈ ఏడాది కూడా తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఆదివారం(సెప్టెంబర్ 4న) యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో మ్యాచ్‌లు చూడడానికి వచ్చింది. కాగా ఈసారి కూడా తన బాయ్‌ఫ్రెండ్ అందించిన బీర్ గ్లాసును అందుకున్న మేఘన్ పూర్తిగా తాగేసింది. అలా వరుసగా రెండో ఏడాది కూడా బీర్ చాలెంజ్‌ను పూర్తి చేసి తనకున్న పేరును నిలబెట్టుకోవడంతో మ్యాచ్‌కు హాజరైన ప్రేక్షకులు మేఘన్‌కు స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం గమనార్హం. ఈ వీడియోనూ స్వయంగా యూఎస్ ఓపెన్ నిర్వాహకులే ట్విటర్లో షేర్ చేస్తూ.. మేఘన్ లక్కీకి మా అభినందనలు.. బహుశా ఇది ట్రెండింగ్ పాయింట్‌గా నిలిచే అవకాశముంది. అంటూ క్యాప్షన్ జత చేశాడు. కాగా ఈ వీడియోకు దాదాపు 2 లక్షల వ్యూస్ రావడం విశేషం. It seems this is becoming tradition at this point 🍻 pic.twitter.com/vTO1hUJVNS — US Open Tennis (@usopen) September 4, 2022 View this post on Instagram A post shared by US Open (@usopen) చదవండి: యూఎస్ ఓపెన్‌లో పెను సంచలనం.. నాదల్ కథ ముగిసింది -
మూత్రంతో బీర్!
చల్లచల్లని బీర్.. కూల్‌గా గొంతు దిగుతుంటే ఆ కిక్కే వేరంటూ బీరు ప్రియులు లొట్టలేస్తుంటారు. ఒక్కో బ్రాండ్ బీర్.. ఒక్కో టేస్ట్.. అంటూ నాలుక చప్పరిస్తుంటారు. ఇక్కడిదాకా అందరూ ఒకటే.. కానీ సింగపూర్‌కు చెందిన ‘న్యూబ్రూ’ బీర్ గురించి చెప్తే మాత్రం ఎవరెవరు ఎలా స్పందిస్తారో ఊహించడం కష్టమే. ఎందుకంటే.. ఆ బీర్‌ను మూత్రంతో, డ్రైనేజీ వాటర్‌తో తయారు చేస్తారు మరి. నిజమే.. సాధారణంగా బీరు తయారీకి భారీగా నీళ్లు అవసరం. అసలే నీటి కరువుతో ఉన్న సింగపూర్‌లో.. డ్రైనేజీ నీళ్లయినా, మరే నీళ్లయినా సరే పూర్తిగా శుద్ధిచేసి మళ్లీ వాడాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలోనే సింగపూర్ ప్రభుత్వ వాటర్ ఏజెన్సీ పీయూబీ, స్థానిక బీరు తయారీ సంస్థ బ్రూవర్క్జ్ కలిసి ‘న్యూబ్రూ’ను మార్కెట్లోకి తెచ్చాయి. అధికారులు మూత్రాన్ని, డ్రైనేజీ నీళ్లను పూర్తిస్థాయిలో శుద్ధిచేసి ‘న్యూవాటర్’ పేరుతో సురక్షిత నీటిని సిద్ధం చేశారు. ఆ నీటిని ఉపయోగించి ‘న్యూబ్రూ’ బీరును తయారుచేసి మార్కెట్లోకి వదిలారు. మంచి మాల్ట్‌తో, తాగాక తేనె వంటి రుచిని ఇస్తుండటంతో ‘న్యూబ్రూ’ బీర్‌కు బాగా డిమాండ్ కనిపిస్తోందని సింగపూర్ అధికారులు చెప్తున్నారు. -
షాకింగ్ బీర్: వావ్ అంటారా? యాక్ అంటారా?
బీర్ అంటే ఇష్టపడని మందుబాబులు ఎవరైనా ఉంటారా? మార్కెట్లో విభిన్న ఫ్లేవర్లలో, రక రకాల బ్రాండ్లలో బీర్లు లభ్యమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో కొత్త రకమైన బీర్ అందుబాలోకి వచ్చింది. ఈ వెరైటీ బీరుకు లభిస్తున్న ఆదరణ చూస్తే.. మరి వావ్.. అనాల్సిందే. వాస్తవానికి ఆ బీర్ దేనితో తయారువుతుందో తెలిస్తే షాక్ అవుతారు. ఇది తెలిసి వావ్ అంటారో లేదంటే.. యాక్ అంటారో మీరు తేల్చుకోండి. ఎందుకంటే ఈ బీర్ యూరిన్‌తో తయారవుతుంది. ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే దాదాపు 20 సంవత్సరాల నాటి మురుగునీటిని శుద్ధిచేసి మరీ తయారుచేస్తున్న 'యూరిన్ బీర్'ను గ్రీన్ బీర్‌గా ప్రచారం చేస్తోంది. సింగప్‌పూర్‌లోని న్యూబ్రూ కంపెనీ. సింగపూర్ న్యూబ్రూ ఉత్పత్తి చేస్తున్న యూరిన్ బీర్‌కు భారీ ఆదరణ లభిస్తుండటం విశేషం. పలురకాల పరీక్షలు, వివిధ దశల్లో వడపోత తర్వాత ఆరోగ్యకరమైన బీర్‌ను తయారు చేస్తున్నామని, త్రాగడానికి సురక్షితమని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా తమ స్పెషల్ బీరు ఆరోగ్యానికి ఆరోగ్యం, అద్భుతమైన రుచి కూడా అని తెలిపింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, నీటి కొరతపై అవగాహన కల్పించేందుకు ప్రచారం చేపట్టిన ప్రభుత్వ నీటి సంస్థ, ఈ సమస్యను అధిగమించేందుకు వినూత్న పరిష్కారాల్ని అన్వేషిస్తోంది. బీర్లో 90 శాతం నీరు ఉంటుందనీ అందుకే అల్ట్రా-క్లీన్ హై-గ్రేడ్ రీసైకిల్ వాటర్‌తో తయారు చేస్తున్నామని కంపెనీ తెలిపింది. సింగపూర్ ఇంటర్నేషనల్ వాటర్ వీక్, వాటర్ కాన్ఫరెన్స్‌లో నేషనల్ వాటర్ ఏజెన్సీ, స్థానిక క్రాఫ్ట్ బీర్ బ్రూవరీ 'Brewerkz' న్యూబ్రూ ఏప్రిల్ 8న ప్రారంభించింది. నీటి రీసైక్లింగ్, పునర్వినియోగంపై అవగాహన కల్పించేందుకే న్యూబ్రూ సింగపూర్ 'గ్రీనెస్ట్ బీర్' ఆవిష్కరణ అని కంపెనీ ఎండీ ర్యాన్ యుయెన్ వెల్లడించారు. కాగా ప్రపంచవ్యాప్తంగా నీళ్లు, టీ, తరువాత అత్యంత ప్రజాదరణ పొందిన పానీయం బీర్. వికీపీడియా, ఫార్చ్యూన్ బిజినెస్ ఇన్సైట్స్ అందించిన అంచనాల ప్రకారం, 2021లో 768.17 బిలియన్ డాలర్లుగా ఉన్న గ్లోబల్ బీర్ మార్కెట్ 2028 నాటికి 989.48 బిలియన్ల డాలర్లకు పెరిగే అవకాశం ఉంది. -
‘బీర్’ప్రియులకు చేదు వార్త.. భారీగా ధరలు పెంపు?
సాక్షి,హైదరాబాద్: ‘బీర్’ప్రియులకు చేదు వార్త. బీర్ ధరలను పెంచాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రతిపా దనలు కూడా సిద్ధమైనట్టు సమా చారం. బీర్ ధరలను పెంచాలని కొంతకాలంగా డిస్టలరీల యాజమాన్యాలు కోరుతున్న నేపథ్యంలో బీర్ ధరల పెంపుపై ఎ క్సైజ్ ఉన్నతాధికారులు ఇటీవల కసరత్తు జరిపారు. ఈ కసరత్తు అనంతరం ఒక్కో బీర్ ధరను రూ.10–20 పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రస్తుతం లైట్ బీర్ రూ.140 ఉండగా దాన్ని రూ.150, స్ట్రాంగ్ బీర్ రూ.150 ఉండగా, దాన్ని రూ.170 చేయనున్నట్లు సమాచారం. చదవండి: హైకోర్టు సీజేగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ -
సార్.. రెండు బీర్లు కావాలి
దౌల్తాబాద్: అర్ధరాత్రి ఓ ఆకతాయి చేసిన పనికి పోలీసులు అవాక్కయ్యారు. గురువారం రాత్రి 2 గంటల సమయంలో ఓ యువకుడు ‘డయల్ 100’కు కాల్ చేసి ‘సార్.. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, మీరు రావాలి’అని కోరాడు. దీంతో డ్యూటీలో ఉన్న బ్లూకోల్ట్స్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలు వెంటనే అతని వద్దకు బయలుదేరారు. తీరా అక్కడికి వెళితే ‘సార్.. నాకు రెండు బీర్లు కావాలి’అని ఆ యువకుడు అనడంతో పోలీసులు విస్తుపోయారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం గోకఫసల్వాద్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు ఆ గ్రామానికి వెళ్లేసరికి ‘డయల్ 100’కు ఫోన్ చేసిన జనిగెల మధు అనే యువకుడు మద్యం మత్తులో తూగుతున్నాడు. పైగా బీర్లు కావాలంటూ పోలీసులను ఆటపట్టించడానికి యత్నించాడు. దీంతో మధును పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. 100కు ఫోన్ చేసి తమ సమయం వృథా చేసిన మధుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రమేశ్ తెలిపారు. -
బీర్ పీనా.. దూద్ దేనా !
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అధిక పాల దిగుబడి కోసం గేదెలు, ఆవులకు మోతాదుకు మించి బీర్‌దాణా (బీర్ తయారు చేయగా మిగిలిన వ్యర్థాల లిక్విడ్) తాగిస్తున్నారు. ఇలా చేయడం వలన ప్రత్యక్షంగా పశువుల ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతో పాటు.. పరోక్షంగా పాలు తాగిన చిన్నారుల అనారోగ్యానికి కారణమవుతున్నారు. సాధారణంగా పాలిచ్చే గేదెలు, ఆవులకు రైతులు అధిక పాల దిగుబడి కోసం కడుపునిండా పచ్చిగడ్డి, ఎండుగడ్డి, పల్లిపట్టి, బెల్లంపట్టి, కుసుమ నూనె తీయగా మిగిలిన కిల్లి, తవుడు, కందిపొట్టు, మొక్కజొన్నతో తయారు చేసిన సంప్రదాయ దాణా వాడుతుంటారు. వీటిలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. అయితే బహిరంగ మార్కెట్లో ఈ దాణా ధరలు రెట్టింపవడంతో వ్యయ భారాన్ని తగ్గించుకునేందుకు కొంతమంది పక్కదారిపట్టారు. ధర తక్కువ బీర్ తయారీ కంపెనీలు ట్యాంకర్ల ద్వారా రహస్యంగా సరఫరా చేస్తున్న బీర్‌దాణాను డ్రమ్ముకు రూ.900 నుంచి రూ.1,000 చొప్పున కొనుగోలు చేసి పశువులకు అందిస్తున్నారు. సంప్రదాయదాణాలో ఐదు శాతానికి మించి బీర్‌దాణా వాడకూడదు. కానీ తక్కువ ధర.. 20–30 శాతం పాలు ఎక్కువగా ఇస్తుండడంతో రైతులు ఒక్కో పశువుకు రోజుకు సగటున నాలుగు నుంచి ఐదు కిలోల చొప్పున వాడుతున్నారు. పశువుల ఆరోగ్యానికి ఇది హానికరమని వైద్యులు హెచ్చరించినా పెడ చెవిన పెడుతున్నారు. ఫలితంగా పశువుల జీవితకాలం పదిహేనేళ్ల నుంచి పదేళ్లకు పడిపోతోంది. ఎనిమిది నుంచి పది ఈతలు ఈనాల్సిన గేదెలు నాలుగైదు ఈతలకే పరిమితమవుతున్నాయి. ఆరోగ్యపరిస్థితి క్షీణించి, త్వరగా మృత్యువాత పడుతున్నాయి. పశువుల పాకలోని డ్రమ్ముల్లో బీర్ లిక్విడ్ డిమాండ్ ఎక్కువ కావడంతో.. పశువైద్యశాఖ అధికారుల అంచనా ప్రకారం జిల్లా లో 1,88,182 పశువులు ఉండగా, వీటిలో 1,22, 58 7 గేదెజాతివి ఉన్నాయి. విజయ, మదర్ డెయి రీలు 8,570 మంది రైతుల నుంచి పాలు సేకరిస్తున్నాయి. గ్రేటర్ వాసులకు రోజుకు కనీసం 25–30 లక్షల లీటర్ల పాలు అవసరమవుతుండగా, ప్రస్తుతం జిల్లాలో 2.50 లక్షల లీటర్లకు మించి సరఫరా కావడం లేదు. బహిరంగ మార్కెట్లో లీటర్ పాలను రూ.70 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. దిగుబడికి, డిమాండ్‌కు మధ్య భారీ వ్యత్యాçసం ఉండడంతో రైతులు పశువుల నుంచి అధిక దిగుబడి సాధించేందుకు బీర్‌దాణాను వాడుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 4,144 పాడిపశువులను 75 శాతం నుంచి 50 శాతం సబ్సిడీపై రైతులకు అందజేశారు. పశుగ్రాస సాగు కోసం ఈ ఏడాది ఇప్పటి వరకు 140.2 మెట్రిక్ టన్నుల విత్తనాలు సరఫరా చేశారు. సొంతంగా పొలం ఉన్న వారు గడ్డినిసాగు చేసినప్పటికీ.. పొలం లేనివారు పశువులకు ఆహారంగా బీర్‌దాణాను వినియోగిస్తున్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తి ప్రభుత్వం సరఫరా చేసిన పశువుల్లో ఇప్పటికే 417 చనిపోవడం గమనార్హం. ఆరోగ్య సమస్యలు వస్తాయి సాధారణంగా మక్క, తవుడు, వేరుశశగ చెక్క, కందిపొట్టుతో తయారు చేసిన దాణాను పశువులకు వాడుతుంటారు. కిలో రూ.25 నుంచి రూ.30 వరకు ఖర్చవుతుంది. బీర్దాణాకు లీటర్‌కు రూ.పదిలోపే దొరుకుతోంది. ఇందులో ఆల్కాహాల్ శాతం ఎక్కువగా ఉండడంతో పశువులు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పాలల్లో ఎసిడిటీ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తాగిన పిల్లలకు జీర్ణకోశ సంబంధ సమస్యలు తలెత్తే ప్రమాదముంది. – డాక్టర్ శంకర్,వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, తలకొండపల్లి -
మద్యం ప్రియులకు భారీ షాక్..!
రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో బీర్ల ధరలు భారీగా పెరగనున్నాయి. మద్యాన్ని తయారు చేసేందుకు ఉపయోగించే కీలకమైన బార్లీ ధరలు, సరఫరాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో దేశంలో బీర్ ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే, రష్యా-ఉక్రెయిన్ వివాదంతో యుఎస్, కెనడాతో పాటు ఇతర దేశాల్లో రష్యా బ్రాండెడ్ స్పిరిట్లను బహిష్కరించడంతో వోడ్కా ధర భారీగా పెరిగింది. రష్యా, ఉక్రెయిన్ బార్లీ రష్యా ప్రపంచంలో రెండవ అతిపెద్ద బార్లీ ఉత్పత్తిని కలిగి ఉండగా, ఉక్రెయిన్ ప్రపంచవ్యాప్తంగా మాల్ట్ నాల్గవ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉంది. అయితే యుద్ధ సంక్షోభం తీవ్రమైతే బార్లీ ధరలు పెరిగే అవకాశం ఉంది. దేశం బార్లీని ఉత్పత్తి చేస్తుంది భారతదేశం కూడా బార్లీని ఉత్పత్తి చేస్తుంది. దేశంలోని అనేక బ్రేవరీలు బార్లీ దేశీయ ఉత్పత్తిపై మాత్రమే ఆధారపడి ఉన్నాయి. అయితే అంతర్జాతీయ బార్లీ ధరలు పెరగడం వల్ల దేశీయంగా ధరలపై ప్రభావితం కావచ్చు. ప్రభావం ఎలా ఉంటుందో బీర్ బ్రాండ్ బిరా 91 చీఫ్ ఎగ్జిక్యూటివ్ అంకుర్ జైన్ మాట్లాడుతూ..రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం ప్రపంచ బార్లీ ధరలపై ప్రభావం చూపుతుందని. అయితే ఇది స్వల్పంగా ఉంటుందా..? దీర్ఘంగా కొనసాగుతుందో తెలియాలని జైన్ చెప్పారు. -
Cockroach beer: పేరే కాదు, ఆ టేస్టే వేరంటున్న బీర్ ప్రియులు
బీర్‌ను సాధారణంగా బార్లీ గింజలు, హోప్ మొక్కనుంచి వచ్చే పువ్వులు, ఒక్కోసారి గోధుమలతోను తయారు చేస్తారని మనలోచాలామందికి తెలుసు కదా. ఈ మధ్య గ్లూటెన్ ఫ్రీ అంటూ జొన్నలతో కూడా బీర్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. తాజాగా వెరైటీ బీరు ఒకటి హల్ చల్ చేస్తోంది. అదే కాక్రోచ్ బీర్.. మీరు విన్నది నిజమే. బొద్దింకల బీర్. కానీ ఇది ఎక్కడ పడితే దొరకదు సుమా! మరి ఈ స్పెషల్ బీర్ ఎక్కడ తయారవుతుంది. దీని రేటెంత? ఆ విశేషాలేంటో తెలుసుకుందాం రండి. బార్లీ గంజిని పులియబెట్టి, ప్రాసెస్ చేసి బీరు తయారు చేస్తారు. ఆయా బ్రాండ్లు వీటికి కొన్ని ప్లేవర్లను యాడ్ చేస్తాయి. కానీ జపాన్‌లో మాత్రం బీరును ఎలా తయారు చేస్తారో తెలిస్తే..ముందు యాక్ అంటారు. కానీ టేస్ట్‌కు టేస్ట్.. ఆరోగ్యానికి ఆరోగ్యం అంటూ జపాన్ వాసులు ఈ స్పెషల్ బీర్ కోసం ఎగబడతారట. 20వ శతాబ్దం ప్రారంభం నుండి ఈ బీర్‌ను ఎంజాయ్ చేస్తున్నారట అక్కడి మందుబాబులు. -
‘బీరు’బలి.. ఒక్కపనితో హీరో అయ్యాడు
నెదర్లాండ్స్: మనం మన చేతుతలతో వాటర్ గ్లాస్‌లని ఒకేసారి రెండూ, మూడో మహా అయితే నాలుగు కూడా పట్టుకోవచ్చు. ఇంకా మరింత ప్రయత్నం చేసి ట్రై ఉపయోగించో లేక మరో విధంగానైనా తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తాం. కానీ ఒకేసారి ఎక్కవ గాజు గ్లాస్‌లతో వాటర్ లేదా కూల్ డ్రింక్ లాంటి వాటిని తీసుకువెళ్లడం అసాధ్యం. కానీ ఇక్కడొక వ్యక్తి హీరో మాదిరి ఏకంగా 48 బీర్ గ్లాస్‌లను తీసుకొచ్చేశాడు. (చదవండి: అక్టోబర్ 20 ప్రపంచ గణాంకాల దినోత్సవం) నెదర్లాండ్స్‌కి చెందిన క్రిస్టియాన్ రోట్గెరింగ్ ఫుట్‌బాట్ అభిమాని. అతను తన కుటుంబ సభ్యులు, స్నేహిలతులతో కలసి ఫుట్‌బాట్ స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు వచ్చాడు. ఆ తర్వాత అతను తనవాళ్ల కోసం బీర్‌ను కొనుగొలు చేసి తీసుకువెళ్తున్నాడు. ఎవరైనా డిస్పాజుబుల్ గ్లాస్‌తో ప్యాక్ చేసి ఉంటే సులభంగా తీసుకెళ్లగలం. కానీ క్రిస్టియాన్ ఓకేసారి ఐదు ట్రైలో బీరుగ్లాస్లను ఒకదానిపై ఒకటి పెట్టి మొత్తం 48 గ్లాస్‌లను ఒకేసారి హీరోలా తీసుకువెళ్లడంతో అక్కడ ఉన్న స్టేడియంలోని ప్రేక్షక్షుల అందర్ని ఆశ్చర్యపరిచాడు. దీంతో అతను ఒక్కసారిగా సెలబ్రిటీ స్టేటస్ పొందాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్ వావ్ యు ఆర్ సో గ్రేట్ అంటూ రకరకాలు ట్వీట్ చేశారు. (చదవండి: అదో వింతైన రంగురంగుల బల్లి.. ప్లీజ్ కాపాడండి) View this post on Instagram A post shared by Veronica Inside (@veronica.inside) -
అంబలి చేయబోతే అనుకోకుండా బీరు పుట్టింది
International Beer Day 2021: ‘ఈ గింజల సారా తయారు చేసినవాడు ఎవడో గానీ.. వాడు మహా మేధావి అయ్యి ఉంటాడు’.. బీరు రుచి మరిగి గ్రీకు తత్వవేత్త ప్లాటో చెప్పిన మాటలివి. మత్తులో చెప్పాడో.. మామూలుగా చెప్పాడోగానీ ఇక్కడే ఆయన బీరులో కాలేశాడు. బీరును తయారు చేసింది, చరిత్రలో ఆ పానీయానికి పెద్ద ఎత్తున్న ప్రాముఖ్యత కల్పించింది.. అంతర్జాతీయంగా ప్రచారం చేసింది, ఇప్పుడు మార్కెట్లో అమ్ముడుపోతున్న బీరుకు ఒక రూపం తెచ్చిపెట్టింది.. అంతా ఆడవాళ్లే. అందుకే ఈ ‘బీర్ డే’ నాడు మందు బాబులు.. ఆ మహిళామణులకు జోహార్లు చెప్పాల్సిందే. సాక్షి, వెబ్‌డెస్క్: సుమారు ఏడువేల సంవత్సరాల క్రితం.. మెసోపోటామియా సంస్కృతిలో బీరు కల్చర్ ఆసక్తికరంగా మొదలైంది. అప్పట్లో ఆడవాళ్లు బలవర్థకమైన ఆహారం(ఇమ్యూనిటీ ఫుడ్) కోసం అంబలి కాచుకునేవాళ్లు. అయితే కొందరు ఆడవాళ్లు మాత్రం ధాన్యాలకు మూలికలను జోడించి నీళ్లలో బాగా మరిగించి పానీయాలు తయారు చేసుకునేవాళ్లు. వాటిని నిల్వ బెట్టడం.. అవి పులిసిపోయి విచిత్రమైన వాసన, రుచి అందించేవి. ఆపై అవి మత్తు ద్రావణాలనే ప్రచారం(ఫుల్‌గా తీసుకుంటే ఏదైనా మత్తు ఇస్తుంది కదా) జరగడంతో చాలా మంది వాటిని ఇంట్లోనే తయారు చేసుకోవడం మొదలుపెట్టారు. అలా సారాయి(బీరు) అమ్మకాల సంప్రదాయం వేల సంవత్సరాల క్రితమే మొదలైంది. పోను పోనూ ఆ పానీయాలకు తమ చేతివాటం ప్రదర్శిస్తూ మరింత మార్కెటింగ్ పెంచారని బ్రిటిష్ చరిత్రకారుడు సొమ్మెలియర్ జేన్ పెయిటోన్ చెప్పాడు. కానీ, ఈజిప్షియన్ల కాలంలో మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లు మద్యం సేవించడం, ఈ క్రమంలో ఇళ్లలోనే వాటి తయారీ ఉండేదని.. ఆ సమయంలోనూ బీర్‌లాంటి పానీయాలు చెలామణిలో ఉండొచ్చని చరిత్రకారులు అభిప్రాయపడుతుంటారు. మంచి నీళ్లు, టీ తర్వాత ప్రపంచంలో ఎక్కువ మంది తాగేది.. బీరు సన్యాసి చొరవ.. మధ్యయుగం నాటికి.. పులిసిన పానీయాల తయారీ, వాటి అమ్మకం విపరీతంగా పెరిగింది. ఉన్నత వర్గాల నుంచి కింది వర్గాల దాకా అంతా ఆ పానీయాలకు అలవాటు అయ్యారు. అయితే పులిసిన ద్రావణాలు.. ఎక్కువ రోజులు నిల్వ ఉండేవి కావు. దీంతో రకరకాల ప్రయోగాలు చేశారు. చివరికి గంజాయి మొక్కలకు చెందిన హోప్స్ మొక్క పువ్వులను చేర్చడం.. అవి ద్రావణాలను పాడుకాకుండా ఉంచడంతో పాటు మత్తూ అందించడం మొదలైంది. జర్మనీకి చెందిన క్రైస్తవ సన్యాసి.. హిల్డెగార్డ్ ఆఫ్ బింగెన్(హిల్డెగార్డ్) విప్లవాత్మక ధోరణితో ఆధునిక కాలంలో బీర్(11వ శతాబ్దంలో ఈ పేరు పెట్టింది కూడా ఈమెనే?!)కు ఒక రూపం వచ్చింది. అయితే బలవర్థకమైన ఈ పులిసిన పానీయాలను డొమెస్టిక్ నుంచి కమర్షియల్‌గా మార్చేయాలన్న బుద్ధి కలిగింది మాత్రం మగవాళ్లకే. ఆడవాళ్లు తెలివిగా గుర్తించిన సహజమైన కార్బొనేషన్‌ను పక్కనపెట్టేసి.. బలవంతంగా పరిశ్రమల్లో కార్బొనేషన్‌ను చొప్పించడం మొదలుపెట్టారు. అలా బీర్ వెనుక ఆడవాళ్ల కృషిని తెర వెనక్కి నెట్టేసి.. అప్పటి నుంచి బీర్ల పరిశ్రమలో కింగ్‌లుగా చెలామణి అవుతున్నారు మగవాళ్లు. ఇంటర్నేషనల్ బీర్ డే అన్నట్లు.. International Beer Day ఎలా పుట్టిందో, ఇంతకీ బీర్ డే ఉద్దేశం తెలుసా?.. ఏం లేదు సరదాగా స్నేహితులతో నాలుగు సిప్‌లు వేస్తూ ఈ రోజును ఎంజాయ్ చేయడమే బీర్ డే ఉద్దేశం. బీర్ ప్రియుల కోసం బీర్‌కు జరిపే పుట్టిన రోజు ఇది. 2007లో కాలిఫోర్నియా, శాంటా క్రూజ్‌కు చెందిన జెస్సే అవ్‌షాలోమోవ్న్ అనే తాగుబోతు.. ఈ బీర్ డే పుట్టుకకు కారణం. 2012 దాకా ఆగష్టు 5నే ఇంటర్నేషనల్ బీర్ డేను చేస్తూ వచ్చారు. అయితే ఆ తర్వాత ఆగష్టు మొదటి శుక్రవారంను బీర్ డేగా నిర్వహించుకోవాలని మందుబాబులకు సూచించాడు జెస్సే. అలా పాశ్చాత్య సంస్కృతి నుంచి పుట్టిన ఈరోజు.. ఇప్పుడు దాదాపు 80కిపైగా దేశాల్లో, ప్రధానంగా 200 నగరాల్లో ఈ బీర్ వేడుకలను నిర్వహించుకుంటున్నారు మందుబాబులు. ఆ లిస్ట్‌లో మన దేశం కూడా ఉంది. ఆ లెక్కన ఇవాళ(ఆగష్టు 6) ఇంటర్నేషనల్ బీర్ డే అన్నమాట. బీర్ మీద కొన్ని అపోహలు అతిగా తీసుకుంటే ఏదైనా అనర్థమే. అది ఆల్కహాల్ విషయంలోనూ వర్తిస్తుంది. ఓ మోస్తరుగా ఆల్కహాల్ తీసుకుంటే ఫర్వాలేదని డాక్టర్లే చెప్తుంటారు. ఇది బీర్‌కు కూడా వర్తిస్తుంది. చాలా అధ్యయనాల్లో సైంటిఫిక్‌గా రుజువయ్యింది ఏంటంటే.. మోస్తరు మందు తాగేవాళ్లు ఎక్కువ కాలం బతుకుతారని!. నమ్మమని అంటారా?.. ఎవరి ఇష్టం వాళ్లది! ►బీరు.. సహజంగా తయారు చేసేదే. వీటిని కల్తీ చేయాలని ప్రయత్నిస్తే.. చెడిపోతుంది కూడా. ఇక బీర్లో క్యాలరీలు-కార్బొహైడ్రేట్స్ ఉంటాయని సైంటిఫిక్‌గా రుజువైంది. అలాగే ఇందులో కొవ్వు-కొలెస్ట్రాల్ పర్సంటేజ్ ఉండవని కూడా తేలింది. ఇదిలా ఉంటే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్-క్లినికే మెడిసిన్ యూనివర్సిటీ(ప్రేగ్) సంయుక్తంగా బీర్‌పై పరిశోధనలు నిర్వమించాయి. బీర్ తాగితే లావు అవుతారని చెప్పడం, బొజ్జ పెరుగుతుందనే ప్రచారం అంతా ఉత్తవేనని ఈ పరిశోధనలు సైంటిఫిక్‌గా నిరూపించాయి. ►ఒకానొక టైంలో నీళ్ల కంటే బీరు పదిలం అనే ప్రచారం జరిగిందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ప్యాకింగ్ వాటర్‌లో కల్తీ జరిగే అవకాశం ఉన్నా.. బీర్లో(మరిగించి.. సీల్ వేయడం) ఆ ఛాన్స్ అస్సలు ఉండదని చెప్తుంటారు రీసెర్చర్లు. కానీ, ఈ రోజుల్లో కల్తీ కానిది ఏది చెప్పండి!. ఇక స్నేహితులతో సరదాగా ఛిల్ కావడానికి బీర్ కొట్టడం ఒక అలవాటు(అలవాటు ఉన్నవాళ్లకు మాత్రమే). కాలాలతో సంబంధం లేకుండా తీసుకునే ఆల్కాహాల్‌గా.. సమ్మర్లో చల్లని పానీయంగా బీర్ సేల్స్ విపరీతంగా ఉంటాయి. ►అన్‌ఫిల్టర్-లైట్ఫిల్టర్ బీర్లలో ‘విటమిన్-బి’ సమృద్ధిగా ఉంటుంది. గింజల పానీయాన్ని షుగర్‌తో పులియబెట్టినప్పుడు.. గుండె జబ్బులను అరికట్టే ఫొలిక్ యాసిడ్ పుడుతుందనేది పరిశోధనల్లో(2014) వెల్లడైంది. అయితే అమెరికన్ హార్ట్ అసోషియేషన్ మాత్రం దీనిని కచ్చితంగా నమ్మాల్సిన అవసరం లేదని ప్రకటించింది. ►హోప్స్‌లో గ్జాంథోహూమోల్ అనే ఫ్లేవనాయిడ్ ఉంటుంది. ఇది క్యాన్సర్కారక ఎంజైములను నిరోధించే పొటెంట్ యాంటీయాక్సిడెంట్. అందుకే జర్మన్లు దీనిని ఎక్కువ ప్రోత్సహిస్తుంటారు. బీర్ మెటాబాలిజంను సక్రమంగా నడిపిస్తుందని నిరూపించిన అధ్యయనాలూ ఉన్నాయి. ఇవిగాక బీర్ తయారీ, ప్యాకింగ్, యాడ్స్, అమ్మకాలు.. ఇలా వ్యాపారపరంగా బీర్ అందించే లాభాలు.. వేల కోట్లలో ఉంటాయి. బీర్ వీళ్లకు వద్దు బీర్‌తో బెనిఫిట్స్ మాత్రమే చెప్పుకోకూడదు కదా. అందుకే ఉన్న ప్రతికూల ప్రభావాలను చర్చిద్దాం. ♦గర్భవతులు, పిల్లలకు పాలిచ్చే తల్లుళ్లు ♦ఎలర్జీ-చర్మ వ్యాధులు ఉన్నవాళ్లు ♦నిద్రలేమితో బాధపడుతున్న వాళ్లు ♦కాలేయ సంబంధిత వ్యాధులు ఉన్నవాళ్లు ♦అల్సర్, గుండెలో మంట సమస్యలు ఉన్నవాళ్లు ♦ చిన్నపిల్లలు.. తదితరులు చివరగా.. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అనే హెచ్చరిక అందరికీ తెలుసు!. -
బీర్ బాధలు.. బార్ ఓనర్ల కష్టాలు...ఇవే కారణాలు
సాక్షి, సిటీబ్యూరో: చిల్డ్ బీర్ అంటే మద్యం ప్రియులకు అదో క్రేజ్.. చాలా మంది అలాంటి బీర్నే ఇష్టపడుతారు..అయితే ఇటీవల నగరంలో బీర్ల వినియోగం తగ్గుముఖం పట్టింది. బీర్ తాగేందుకు వెనుకంజ వేస్తున్నారు.గతంలో పెంచిన బీర్ల ధరలను కొంతమేరకు తగ్గించినప్పటికీ వినియోగం పెరగకపోవడం గమనార్హం. శీతల పానీయా లు సేవించడం వల్ల కోవిడ్ వ్యాపించవచ్చుననే భావన వల్ల చాలా మంది బీర్ తాగేందుకు విముఖత చూపుతున్నారు. దీంతో మద్యం వైపు మొగ్గు చూపుతున్నారు. ►గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 15 లక్షల కేసుల నుంచి 13 లక్షల కేసులకు రోజువారి విక్రయాలు తగ్గినట్లు అధికారుల అంచనా. ►కేవలం ఎండాకాలంలోనే కాకుండా సాధారణ వాతావరణంలోనూ బీర్ల అమ్మకాలు అసాధారణంగానే ఉంటాయి. అయితే ఈ సారి మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. కిక్ ఇచ్చే మద్యం వైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ధరలు కూడా కారణమేనా... గత సంవత్సరం లాక్డౌన్ అనంతరం బీర్లపై రూ.30 వరకు పెంచారు. సహజంగానే కోవిడ్ దృష్ట్యా బీర్‌కు దూరంగా ఉన్న వారు ధరల పెంపుతో మరింత దూరమయ్యారు. దీంతో ప్రభుత్వం ఒక్కో బీర్‌పై రూ.10 తగ్గించింది. ► రూ.210 నుంచి రూ.200 కు, రూ.170 నుంచి రూ.160 కి ధరలు తగ్గాయి. ఈ కారణంగానైనా అమ్మకాలు పెరగవచ్చునని అంచనా వేశారు. అయినా ప్రయోజనం లేదు. ► బీర్ సేల్స్ పెద్దగా పెరగలేదు.‘అమ్మకాలు తగ్గడానికి ధరలే ప్రధాన కారణం. ఒక క్వార్టర్ లిక్కర్ కంటే ఇప్పటికీ బీర్ ధరే ఎక్కువ. అందుకే బీర్ కంటే లిక్కర్ సేవించడం నయమనే భావన ఉంది.’ అని ఎక్సైజ్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. కేవలం రూ.10 తగ్గించడం వల్ల అమ్మకాలు పెద్దగా ప్రయోజనం లేదని అన్నారు. కరోనా భయం కూడా సేల్స్ తగ్గడానికి కారణం కావచ్చు. మూసివేత దిశగా బార్లు మరోవైపు బార్లకు చల్లదనమే శాపంగా మారింది. చల్లటి వాతావరణంలో కోవిడ్ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందనే కారణంతో మద్యం ప్రియులు బార్లకు వెళ్లడం తగ్గించారు. క్లోజ్డ్ బార్లకు బదులు ‘ఓపెన్ బార్’ను ఎంపిక చేసుకుంటున్నారు. సరదాగా నలుగురు కలిసి బార్‌కు వెళ్లే అలవాటు తగ్గింది.చాలా వరకు ఇంటి వద్ద మద్యం సేవించేందుకు ఇష్టపడుతున్నారు. ► తప్పనిసరి పరిస్థితుల్లో బార్లకు వెళ్లవలసి వచ్చినా ఒక్కరిద్దరు మాత్రమే కలిసి వెళ్లడం గమనార్హం.దీంతో గ్రేటర్లో చాలా బార్లు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ► సుమారు 404 బార్లలో 60 శాతం వరకు నష్టాల్లో నడుస్తున్నట్లు అంచనా. ఇప్పటికే 20 బార్లను మూసివేశారు.మరికొన్ని బార్లు లైసెన్సు ఫీజు కూడా చెల్లించలేని స్థితిలో మూసి వేత దిశగా ఉన్నట్లు తీస్తున్నట్లు ఎక్స్‌జ్ అధికారులు వెల్లడించారు. -
3 నెలల్లో రూ.5 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: మద్యం అమ్మకాలు జోరుగా జరగడంతో ఎక్సైజ్ శాఖకు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కాసుల పంట పండింది. 2021–22కిగాను ఏప్రిల్, మే, జూన్లలో కలిపి రూ. 6,741.44 కోట్ల విలువైన మద్యం అమ్మకాలపై రూ. 5 వేల కోట్ల మేర ఆదాయం వచ్చిందని ఎక్సైజ్ శాఖ వర్గాలు తెలిపాయి. ఇక ఈ నెల 18 వరకు రూ. 1,436 కోట్ల విలువైన మద్యం విక్రయాలు గణాంకాలు జరిగాయని బ్రూవరేజెస్ కార్పొరేషన్ లెక్కలు చెబుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ ఆదాయం కింద రూ.16 వేల కోట్లు వస్తాయని ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనల్లో అంచ నా వేయగా తొలి 3 నెలల్లోనే సుమారు 5 వేల కోట్ల (దాదాపు 30%) ఆదాయం రావడం గమనార్హం. ఆ ఐదు జిల్లాల్లోనే 50 శాతానికి పైగా... రాష్ట్రంలోనే అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో మద్యం విక్రయాలు జరుగుతుండగా రెండో స్థానంలో నల్లగొండ, ఆ తర్వాత హైదరాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్ (అర్బన్) జిల్లాలున్నాయి. ఈ మూడు నెలల్లో కలిపి రంగారెడ్డి జిల్లాలోనే రూ. 1,500 కోట్ల మేర అమ్మకాలు జరిగాయి. ఏప్రిల్‌లో రూ. 534.83 కోట్లు, మేలో రూ. 450.67 కోట్లు, జూన్‌లో రూ. 495.08 కోట్ల విలువైన మద్యం రంగారెడ్డి జిల్లాలో అమ్ముడుపోయింది. నల్లగొండ జిల్లాలో ఏప్రిల్‌లో రూ. 251.32 కోట్లు, మేలో రూ. 243.32 కోట్లు, జూన్‌లో రూ. 267.5 కోట్ల అమ్మకాలు జరిగాయి. హైదరాబాద్‌లో ఈ మూడు నెలల్లో కలిపి రూ. 650 కోట్లు, మహబూబ్‌నగర్‌లో రూ.570 కోట్లు, వరంగల్ అర్బన్‌లో రూ. 555 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. మేలో తగ్గిన బీర్ విక్రయాలు ఈ మూడు నెలల మద్యం అమ్మకాలను పరిశీలిస్తే ప్రతి నెలలో 27 లక్షలకుపైగా కేసుల లిక్కర్ అమ్ముడవుతోంది. జూన్‌లో మాత్రం అత్యధికంగా 28.73 లక్షల కేసుల మేర లిక్కర్ విక్రయాలు జరిగాయి. బీర్ల విషయానికి వస్తే ఏప్రిల్, జూన్లలో 26 లక్షలకుపైగా కేసులు అమ్ముడు కాగా, మేలో సుమారు 20 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. ఇందుకు బీర్ల ఉత్పత్తి తగ్గిపోవడమే కారణమని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడంతో డిస్టిల్లరీలు బీర్ల ఉత్పత్తిని తగ్గించాయని, ఆ తర్వాత రూ.10 చొప్పున ప్రతి బాటిల్‌పై ప్రభుత్వం ఉపశమనం ఇవ్వడంతో జూన్‌లో బీర్ల ఉత్పత్తి, అమ్మకాలు పెరిగాయని ఎక్సైజ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
‘బాబోయ్ మందు’.. పైనాపిల్ బీర్‌కు ఫుల్గిరాకీ
‘హమ్ మందు నహీతో బతుకు నయ్ సక్తాహై’.. లాక్డౌన్ టైంలో చాలామంది మందు బాబులు వెల్లడించిన అభిప్రాయం ఇదే. అంతెందుకు ఫస్ట్ వేవ్ టైంలో మందు దొరక్క.. శానిటైజర్లు, ఇంట్లోనే మందు ప్రయోగాలతో ఘోరంగా దెబ్బతిన్నవాళ్లూ లేకపోలేదు. ప్రస్తుతం సౌతాఫ్రికాలో మందు బాబులకు ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. దీంతో ఇంట్లోనే బీర్లు తయారు చేసుకుంటున్నారు. దీంతో పైనాపిల్ ధరలకు రెక్కలొచ్చాయి. సౌతాఫ్రికాలో లాక్డౌన్ 4 లెవల్లో భాగంగా 14 రోజులపాటు లిక్కర్ షాపులు మూతపడ్డాయి. దీంతో పైనాపిల్ పండ్ల ద్వారా ఇంట్లోనే బీర్లు తయారు చేసుకుంటున్నారు మందుబాబులు. ఈ ప్రభావంతో పైనాపిల్ పండ్ల ధరలు 74 శాతం పెరిగాయి. లాక్డౌన్-మందు దొరకని పరిస్థితుల నేపథ్యంలోనే పైనాపిల్‌కు ఒక్కసారిగా డిమాండ్ సౌతాఫ్రికా అగ్రిమార్క్ ట్రెండ్స్(ఏఎంటీ) గురువారం వెల్లడించింది. అయితే జూన్ చివరి వారం నుంచే లిక్కర్‌పై ఆంక్షలను అమలు చేస్తోంది దక్షిణాఫ్రికా ప్రభుత్వం. దీంతో అప్పటి నుంచే పైనాపిల్ ధరలు స్వల్ఫంగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా 14 రోజుల నిషేధం నేపథ్యంలో.. ఒక్కసారిగా రేట్లు పెరిగాయి. ఒకవేళ లాక్డౌన్ కొనసాగితే మాత్రం పైనాపిల్ ధరలు ఊహించని రేంజ్‌కు చేరొచ్చని అంచనా వేస్తున్నారు. -
మద్యం ప్రియులు.. మే నెలలో ఎంత తాగారో తెలుసా!
సాక్షి, వైరా: ఎండల తీవ్రత పెరగడంతో మద్యం ప్రియులు చల్లటి బీర్లను తాగేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో వాటి విక్రయాలు అమాంతంగా పెరిగి పోయాయి. ఓ వైపు కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. మే నెలలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఎండ తాపం నుంచి సేద తీరేందుకు మందుబాబులు చల్లటి బీర్లు తాగేశారు. గతేడాది జనవరి నుంచి మే నెల వరకు రూ.61 కోట్ల విలువ చేసే బీర్లను తాగగా, ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు రూ.89.83 కోట్ల విలువైన బీర్లు లాగించేశారు. డిమాండ్‌కు తగ్గట్లుగా సరఫరాకు ఇబ్బంది లేకుండా డిపో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 167 మద్యం దుకాణాలు, 47 బార్లు, 3 క్లబ్‌లు ఉన్నాయి. వాటితో పాటు అనధికారికంగా వేల సంఖ్యలో బెల్టుషాపుల్లో బీర్ల అమ్మకాలు సాగిస్తున్నారు. అదనపు వసూళ్లు.. వ్యాపారులు కొన్ని చోట్ల సిండికేట్‌గా మారి బీరు ధరపై అదనంగా వసూలు చేస్తూ మందుబాబుల జేబులకు చిల్లులు పెట్టి దండుకుంటున్నారు. జిల్లాలో చాలా మద్యం దుకాణాల్లో బీర్లు దొరకడం లేదు. పక్కనే ఉన్న బెల్టు దుకాణాల్లో మాత్రం యథేచ్ఛగా బీర్లు అమ్ముతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో భానుడి ప్రతాపం విపరీతంగా పెరిగింది. ఇక అప్పటి నుంచి బీర్ల అమ్మకాలు పెరిగి పోయాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో పగటి పూట 30 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదు కాగా, రాత్రి పూట వాతావరణం చల్లగా మారింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎండలు ముదిరిపోయాయి. ఉష్ణోగ్రతలు కూడా 40 డిగ్రీలకు చేరకున్నాయి. దీంతో జనాలు ఎండ వేడికి అల్లాడి పోయారు. ఈ సమయంలో ఎండ వేడిని తట్టుకోవడానికి మందు బాబులు చల్లని బీర్ల వైపు మొగ్గు చూపారు. దీంతో మార్చి నుంచి మే నెల వరకు 60 శాతానికి పైగా విక్రయాలు పెరిగాయి. మొత్తం మీద 5 నెలల్లోనే మద్యం ప్రియులు అక్షరాలా రూ.89.83 కోట్ల విలువ చేసే బీర్లు తాగేశారు. గతేడాది, ఈ ఏడాది అమ్మకాలు ఇలా.. 2020 లో బీర్లు (కేసులు) 2021లో బీర్లు(కేసులు) జనవరి రూ.16 కోట్లు 1.18 లక్షలు రూ.17 కోట్లు 1.20 లక్షలు ఫిబ్రవరి రూ.19 కోట్లు 1.42 లక్షలు రూ.14 కోట్లు 83 వేలు మార్చి రూ.11 కోట్లు 86 వేలు రూ.22 కోట్లు 1.27 లక్షలు ఏప్రిల్ లాక్డౌన్ -------- రూ.22 కోట్లు 1.30 లక్షలు మే రూ.15 కోట్లు 90 వేలు రూ. 14.83 కోట్లు 88 వేలు చదవండి: మందుబాబు ఆత్రం.. రూ1.5లక్షలు గోవింద -
మందుబాబు ఆత్రం.. రూ1.5లక్షలు గోవింద
ముంబై: కరోనా కట్టడికి మహారాష్ట్రలో లాకడౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇంటి నుంచి కాలు బయటపెట్టకుండా ఉండాలంటే చాలా కష్టం. ఇక మందు బాబులది మరో రకమైన బాధ. చుక్క పడకపోతే.. నరాలు లాగేస్తాయి. ఇలాంటి వారి కోసం పలు ఈ కామర్స్ సంస్థలు ఆన్లైన్లో మద్యం అందుబాటులోకి తెచ్చాయి. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆన్లైన్లో బీర్ ఆర్డర్ చేయడానికి ప్రయత్నించి లక్షన్నర పొగొట్టుకున్నాడు. వెంటనే పోలీసులను అప్రమత్తం చేయడంతో నష్టపోకుండా బయటపడగలిగాడు. ఆ వివరాలు.. పుణెకు చెందిన 55 ఏళ్ల వ్యక్తి ఒకరు ఆన్లైన్లో బీర్ ఆర్డర్ చేయడానికి ఓ ఈ కామర్స్ సంస్థకు కాల్ చేశాడు. తొలుత రిజిస్టేషన్ ఫీజు కింద 10 రూపాయలు చెల్లించాడు. ఆ తర్వాత సదరు కంపెనీ అతడి నంబర్‌కు ఓ యాప్ లింక్‌ను సెండ్ చేసింది. దాని ద్వారా డబ్బులు చెల్లించాల్సిందిగా సూచించింది. దాంతో బాధితుడు యాప్ ఒపెన్ చేసి.. డబ్బులు చెల్లించడానికి పిన్ నంబర్ ఎంటర్ చేయగా.. అతడి అకౌంట్ నుంచి 1,50,009 రూపాయలు డిడక్ట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. వెంటనే ఆ వ్యక్తి ఆలస్యం చేయకుండ సైబర్ క్రైం టీమ్‌ను సంప్రదించాడు. వారు అతడి నంబర్‌కు వచ్చిన బ్యాంక్ మెసేజ్‌ను వెరిఫై చేసుకుని.. నిందితుల అకౌంట్‌కి డబ్బులు క్రెడిట్ కాకుండా ఫ్రీజ్ చేయగలిగారు. ఈ సందర్బంగా సైబర్ క్రైం టీం అధికారు ఒకరు మాట్లాడుతూ.. "సదరు ఈ కామర్స్ సంస్థ పంపిన యాప్ ఒక రిమోట్ డివైజ్‌కు అయి ఉంటుంది. ఒక్కసారి యాప్ ఒపెన్ చేశామంటే మన ఫోన్ కంట్రోల్ మొత్తం సైబర్ కేటుగాళ్ల చేతిలోకి వెళ్లిపోతుంది. ఇక వారు అకౌంట్లో ఉన్న కాడికి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. అయితే బాధితుడు వెంటనే మమ్మల్ని సంప్రదించడంతో.. డబ్బులు నష్టపోకుండా చూడగలిగాం. వారాల వ్యవధిలో డబ్బులు అతడి అకౌంట్లోకి వస్తాయి" అని తెలిపారు. చదవండి: కుక్కకు ఉద్యోగం.. నెలకు 15 లక్షల జీతం! కాపాడుకోగలిగాడు కి -
కుక్కకు ఉద్యోగం.. నెలకు 15 లక్షల జీతం!
అసలే కరోనా దెబ్బకు జాబులు పోయి.. జీతాలు తగ్గిపోయి.. ఇంక్రిమెంట్లు రాక ఇబ్బందులు పడుతున్న మనలాంటోళ్లు.. ఈ జాబ్ ఆఫర్ వింటే.. పైనన్న మాట నిజమేనని ఒప్పుకోవాల్సిందే.. ఎందుకంటే.. తాజాగా ఓ బీరు కంపెనీలో చీఫ్ టేస్టింగ్ ఆఫీసర్ జాబును భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. నెలకు దాదాపు రూ.15 లక్షల జీతం. రూ.60 వేల విలువైన హెల్త్ ఇన్సూరెన్స్. ఇలా చాలా బెనిఫిట్స్. ఇంతకీ ఎవరికి? శునకాలకు!! అవును.. వాటికే.. అవి చేయాల్సిందల్లా.. బీరును రుచి చూడటంతోపాటు, సంస్థ అంబాసిడర్‌గా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇంకా అర్థం కాలేదా.. బీరుకు.. వాటికి ఏం సంబంధమని..? అమెరికాలోని బుష్ కంపెనీ కేవలం కుక్కల కోసం జంతువుల ఎముకలతో ప్రత్యేకమైన బీరు తయారు చేస్తుంటుంది. ఈ ఆల్కహాల్ రహిత బీరును రుచి చూసేందుకు మాంచి ఘ్రాణ శక్తి ఉండి.. రుచి చూడటంలో దిట్ట అయిన కుక్క కావాలి. అందుకే ఎవరైనా తమ పెంపుడు కుక్కలను ఈ జాబ్‌లో జాయిన్ చేసేందుకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కంపెనీ పేపర్లో ప్రకటన ఇచ్చింది. అదండీ సంగతి.. ఇక్కడ చదవండి: వైరల్: చలి చీమ చేతలకు పాము గిలగిల ఏలియన్స్ నిజంగానే ఉన్నారా? -
‘వ్యాక్సిన్ తీసుకోండి..బీరు పట్టుకెళ్లండి’ వినూత్న ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. సెకండ్ వేవ్‌లో పలురాష్ట్రాల్లో శరవేగంగా విస్తరిస్తోంది. రోజువారీ వరుసగా లక్షకేసులకు తగ్గడం లేదు. అటు మరణాల సంఖ్య పెరుగుతోంది. అయినా కరోనా టీకాపై ప్రజల ఆసక్తి అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీకా వేయించుకున్న వారికి వినూత్న ఆఫర్‌తో ముందుకొచ్చిందో రెస్టారెంట్. బిజినెస్ ఇన్సైడర్ సమాచారం ప్రకారం, గుర్గావ్ గోల్డ్ రోడ్‌లోని రెస్టారెంట్ టీకా స్వీకరించిన తరువాత ఆ టీకా కార్డు చూపిస్తే ఉచిత బీరును ఆఫర్ చేస్తోంది. ఢిల్లీకి సరిహద్దున ఉన్న హార్యానాలోని గుర్గావ్లోని ఇండియన్ గ్రిల్ రూమ్ రెస్టారెంట్ యాజమాన్యం మందుబాబులకు ఈ ఆఫర్ ప్రకటించింది. కరోనా టీకా వేయించుకొని, సంబంధిత కార్డును చూపిన వారికి బీర్ ఉచితంగా ఇస్తామని తెలిపింది. ఏప్రిల్ 5, 2021 న ప్రారంభమైన ఈ ఆఫర్ కేవలం వారం వరకు మాత్రమే కొనసాగుతుందని వెల్లడించింది. టీకాలు వేయించుకునేలా ప్రజలను ప్రోత్సహించే ఉద్దేశంతో టీకా లగావో, బీర్ లేజావో అంటోంది. ‘ఇండియన్ గ్రిల్ రూమ్‌తో టీకా వేసుకున్న సంతోషాన్ని పంచుకోండి' అంటూ కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. గత వారం, గుజరాత్ రాజ్‌కోట్‌లోని స్వర్ణకారుల సంఘం టీకా తీసుకున్న మహిళలకు బంగారంతో చేసిన ముక్కు పుడకలను, పురుషులకు హ్యాండ్ బ్లెండర్లను అందించింది.అలాగే జాన్ విజన్ సంస్థ ఉచితంగా ఆహారం అందించింది. అల్పాహారం, లంచ్, రాత్రి భోజనం అందిస్తున్నాం కాబట్టి టీకా తీసుకున్న వారు ఇంటికి వెళ్ళిన తర్వాత పని చేయాల్సిన అవసరం లేదనీ, వారు విశ్రాంతి తీసుకోవచ్చుని విజన్ యాజమాన్యం ప్రకటించిన సంగతి తెలిసిందే. (కరోనా సెకండ్ వేవ్ : బ్యాంకులకు చిక్కులు) అయితే కరోనా టీకా తీసుకున్నాక మద్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే వైద్యులు హెచ్చరించారు. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత అల్కహాల్ వంటివి తీసుకుంటే.. వారిలో కరోనా ఇమ్యూనిటీ సమర్థవంతంగా పనిచేయదని సూచించారు. మరోవైపు కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 45 రోజుల వరకు తప్పనిసరిగా వీటికి దూరంగా ఉండాలని రష్యాకు చెందిన అడ్వైజరీ ఇటీవల ఒక ప్రకటన జారీ చేసింది. అయితే దీనిపై భిన్న అభిప్రాయాలున్నప్పటికీ, వ్యాక్సిన్ తీసుకున్నవారికి మద్యం ఆఫర్ చేయడంపై మాత్రం సామాన్యులనుంచి విమర్శలొస్తున్నాయి. -
ఏడాదిగా శృంగారానికి దూరం.. బిడ్డతో బలవంతంగా
గాంధీనగర్: ఎన్నారై సంబంధం అంటే చాలు.. ఎగిరి గంతేసి.. ఎలాంటి ఆరాలు తీయకుండా భారీగా కట్నకానుకలు సమర్పించుకుని.. ఆనక వారి చేతిలో మోసపోయి కోర్టు మెట్లు ఎక్కేవారు ఇప్పటికి చాలా మంది ఉన్నారు మన సమాజంలో. తాజాగా ఈ కోవకు చెందిన కేసు ఒకటి గుజరాత్లో వెలుగు చూసింది. ఎన్నారై భర్త అదనపు కట్నం కోసం వేధిస్తూ.. తనతో సఖ్యంగా ఉండటం లేదని.. పైగా ఏడాదిగా తనతో శృంగారం జరపలేదని.. అంతటితో ఊరుకోక తన బిడ్డ చేత బీర్ తాగిస్తూ సైకోలా ప్రవర్తిస్తున్నాడని.. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ మహిళ గుజరాత్ పోలీసులను ఆశ్రయించింది. ఆ వివరాలు.. సదరు మహిళకు 2016లో వివాహం అయ్యింది. ఏడాది తర్వాత భర్తతో కలిసి ఆమె దుబాయ్‌కు వెళ్లింది. ఇండియాలో ఉన్నన్ని రోజులు తనను బాగానే చూసుకున్న భర్త దుబాయ్ వెళ్లిన నాటి నుంచి హింసించడం ప్రారంభించాడు. దుబాయ్ వెళ్లాక అతడిలోని సైకో బయటకు వచ్చాడు. అదనపు కట్నం తేవాల్సిందిగా బాధితురాలిని వేధింపులకు గురి చేసేవాడు. ప్రతి రోజు తాగి నరకం చూపించేవాడు. అతంటితో ఊరుకోక భార్య చేత బలవంతంగా బీర్ తాగించేందుకు ప్రయత్నించేవాడు. ఎంత సైకోలా ప్రవర్తించేవాడంటే రెండేళ్ల తన కుమార్తె చేత బీర్ తాగించేవాడు. ఇక ఏడాదిగా భార్యతో శృంగారానికి కూడా దూరంగా ఉంటున్నాడు. తాను అడిగినంత కట్నం ఇస్తేనే కాపురం అని తేల్చి చెప్పాడు. ఇక బిడ్డకు, బాధితురాలికి ఆరోగ్యం బాగాలేకపోయినా పట్టించుకునేవాడు కాదు. ఆస్పత్రికి తీసుకెళ్లడం.. మందులిప్పించడం వంటివి చేసేవాడు కాదు. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చిలో భర్తతో కలిసి ఇండియాకు వచ్చింది బాధితురాలు. భర్త ఆమెను తన పుట్టింట్లో వదిలేసి దుబాయ్ చెక్కెశాడు. అతడి చేష్టలతో విసిగిపోయిన మహిళ అహ్మదాబాద్ పోలీస్ స్టేషన్లో అతడిపై ఫిర్యాదు చేసింది. చదవండి: ‘దృశ్యం’ సీన్: పోలీస్‌స్టేషన్‌లో అస్థిపంజరం -
ఆ బీర్లంటేనే యువతకు ఇష్టం..
న్యూఢిల్లీ: యువత తమ భావోద్వేగాలను వ్యక్త పరిచేందుకు స్నేహితులతో కలిసి అప్పుడప్పుడు బీర్‌ను సేవిస్తుంటారు. గతంలో యువత బీర్లో కొంత ఆల్క్‌హాల్ శాతం ఉన్న పట్టించుకునే వారు కాదు. కానీ ప్రస్తుత యువత వైఖరిలో మార్పు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యానికి హానీ కలిగించే ఆల్కహాల్ కలిగిన బీర్‌కు యువత దూరంగా ఉండాలని భావిస్తున్నారు. అయితే బీర్ అంటే విపరీతంగా ఇష్టపడేవారు సైతం ఆల్కహోల్ శాతం లేని బీర్‌ను ఇష్టపడుతున్నారు. కొంత మంది తక్కువ ఆల్కహాల్ శాతమున్న బీర్నైనా ఓకే అంటున్నారు. ఇప్పటికీ దేశంలో 85 శాతం ఆల్కహాల్ బీర్లనే సేవిస్తున్నారు. కాగా దేశంలోని అనేక బీర్ కంపెనీలు (యునైటెడ్ బెవరేజ్, అన్హిసర్ ఇన్బెవ్) నాన్ ఆల్క్‌హాల్, ఆల్క్‌హాల్ కలిగిన బీర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కాగా దేశంలోని బీర్ వినియోగంపై మింటెల్ సంస్థ సర్వే నిర్వహించింది. అయితే గత ఆరు నెలల్లో బీర్ వినియోగించిన 25 ఏళ్ల పైబడిన 1,655 మంది దేశీయ ఇంటర్నెట్ వినియోగదారులను మింటెల్ సర్వే చేసింది. తమ సర్వేలో 25నుంచి 34ఏళ్ల యువత పాల్గొన్నారు. కాగా తక్కువ ఆల్కహాల్ శాతం లేదా పూర్తిగా ఆల్కహాల్ శాతం లేని బీర్లవైపే 40శాతం యువత మొగ్గు చూపినట్లు సర్వే పేర్కొంది. (చదవండి: థియేటర్లో బీరు, బ్రీజర్ ఓకేనా: నాగ్ అశ్విన్) -
కాలం చెల్లిన బీర్ల అమ్మకాలు
మాడ్గుల: మాడ్గుల మండల కేంద్రంలోని ఓ వైన్స్‌లో కాలం చెల్లిన బీర్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కాలం చెల్లిన బీర్లను వైన్స్ యజమాన్యం ఒక్కో బీరు ఎంఆర్పీ ధర కంటే రూ.10తో అధిక ధరలకు బెల్ట్ షాపుల నిర్వాహకులకు విక్రయిస్తున్నారు. సదరు బెల్టు షాపుల నిర్వాహకులు ఒక్కో బీరును మరో రూ.20 కలిపి అధిక ధరకు మద్యం ప్రియులకు అంటకడుతున్నారు. కాగా మండంలలోని పెద్దమాడ్గుల, నర్సాయిపల్లి, మాడ్గులకు చెందిన వారు మంగళవారం స్థానికంగా ఉన్న బెల్టు షాపుల వద్ద బీర్లు కొనుగోలు చేశారు. వారు కొనుగోలు చేసిన బీర్లు కాలం చెల్లిపోవడంతో వినియోగదారులు బెల్టుషాపు నిర్వాహకులను ప్రశ్నించగా వైన్స్‌లో ఇచ్చిందే తెచ్చామని సమాధానం ఇచ్చారు. కొనుగోలుదారులు సరాసరి మాడ్గులలోని ఓ వైన్స్‌కు వచ్చి బీర్లు కొనుగోలు చేశారు. ఆ బీర్లు గతేడాది డిసెంబర్ 28వ తేదీ నుంచి ఈ ఏడాది జూన్ 24వరకు వినియోగించాల్సి ఉంది. ఈ విషయమై సదరు కొనుగోలుదారులు వైన్స్‌షాపు యజమానిని నిలదీయగా వేరేది ఇస్తాం.. అంటూ కొనుగోలుదారులతో వాగ్వాదానికి దిగారు. బీర్ల కాలపరిమితి దాటి సుమారు 2 నెలలు కావస్తున్నా వైన్స్‌షాపు యజమాన్యం ప్రజలకు అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై కొనుగోలుదారులు ఫోన్లో ఎౖMð్సజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. కాలంచెల్లిన మద్యం సీజ్ చేశాం...... వినియోగదారుల నుంచి అందిన సమాచారం మేరకు మంగళవారం వైన్స్‌ను తనిఖీ చేశాం. కాలం చెల్లిన బీర్లను సీజ్ చేశాం. విషయం ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తాం. కాలం చెల్లిన బీర్లను ల్యాబ్‌కు పంపించి నివేదిక వచ్చిన తర్వాత సదరు వైన్స్‌షాపు యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని ఆమనగల్లు ఎక్సైజ్ శాఖ సీఐ వేణుకుమార్ తెలిపారు. -
10 బీర్లు తాగి పడుకున్నాడు, ఆ తరువాత..
బీజింగ్: మీరు అదే పనిగా ఎత్తిన బాటిల్ దించకుండా బీర్లు తాగుతున్నారా? ఒకటి, రెండు కాదు ఏకంగా 10, 12 తాగుతూ మత్తులో ఏం చేస్తున్నారో అర్థం కానీ స్థితిలోకి వెళ్తున్నారా? ఏది మర్చిపోయినా సరే బీర్ కానీ లేదా ద్రవ పదార్థాలు ఏవైనా తీసుకున్నప్పుడు మూత్ర విసర్జన చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే చైనాలో ఒక వ్యక్తి పది బీర్లకు పైగా తాగి మత్తులో మూత్ర విసర్జన చేయకుండా నిద్రపోయాడు. ఉదయం లేచే సరికి అతడి మూత్రాశయం పగిలి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. (అబ్రకదబ్ర.. సెలబ్రిటీ అయిపోయింది!) చైనాకు చెందిన హూ(40) ఒక రోజు రాత్రి బార్లో 10 బీర్లకు పైగా తాగేసి ఆ మత్తులో మూత్రం పోయకుండానే 18 గంటల పాటు నిద్రపోయాడు. నిద్రలేవగానే అతనికి తీవ్రమైన నొప్పి రావడంతో అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతనిని పరీక్షించిన వైద్యులు హూ మూత్రాశయం మూడు చోట్ల పగిలి ద్రవం అతని కడుపులోకి చేరి నొప్పి వచ్చిందని తెలిపారు. సరైన సమయంలో ఆసుపత్రికి తీసుకురావడంతో అతని ప్రాణాలు కాపాడగలిగామని చెప్పారు. ఈ విషయం పై డాక్టర్ మాట్లాడుతూ, మనం ఏం తాగినా అది మూత్రాశయంలోకి చేరుతుందని, అది నిండగానే మూత్రం పోయాలన్నా సంకేతాలు వస్తాయన్నారు. మత్తులో ఉన్న కారణంగా మెదడు నుంచి సంకేతాలు రాకపోవడంతో హూ అలాగే నిద్రపోవడంతో ఇలా జరిగిందని తెలిపారు. ఎంత నీరు తాగితే దానికి తగ్గట్టుగా మూత్రవిసర్జన చేయాలని తెలిపారు. ('ఇది తయారు చేసినవాడిని చంపేస్తా’) -
బీరు గుటగుటా తాగిన చేప: మంచిదేనా?
న్యూఢిల్లీ: నీళ్లలో ఉండే చేపలు ఏం తాగుతాయి? అనగానే ఉప్పు నీటిలో నివసించే చేపలు నీళ్లు తాగుతాయి, మంచి నీటిలో ఉండే చేపలు నీళ్లు తాగవు అని సైన్స్ స్టూడెంట్స్ చటుక్కున సమాధానమిస్తారు. కానీ ఇక్కడో చేప మాత్రం నీళ్లు కాకుండా బీరు తాగుతోంది. దీని తాలూకు వీడియోను అటవీ అధికారి సుశాంత్ నందా సోషల్ మీడియాలో షేర్ చేయగా చక్కర్లు కొడుతోంది. అయితే చేప బీరు తాగడమేంటని నెటిజన్లు అవాక్కవుతున్నారు. (కోబ్రాతో ఫైట్: కోతి పోరాటానికి ఫిదా!) సముద్రంలో ఓ వ్యక్తి షికారుకెళ్లాడు. ఈ క్రమంలో ఓ చేప ఏదో పసిగట్టినదానిలా వెంటనే అతని పడవపై వచ్చి కూర్చుంది. దీంతో అతను వచ్చింది నా ఫ్రెండే అన్నట్లుగా దానికి బీరు పట్టించాడు. బీరు సీసా ముందు పెట్టగానే చేప కూడా ఆత్రంగా గుటుక్కుమంటూ తాగింది. దీన్ని చూసిన నెటిజన్లకు ఇప్పుడో ప్రశ్న అంతుచిక్కడం లేదు. "చేపకు బీరు మంచిదేనా? కాదా?" అని నెట్టింట వాదులాడుకుంటున్నారు. "ఇంతకీ బీరు పుచ్చుకుంటున్న ఈ చేప పేరేంటి చెప్మా?" అని మరికొందరు దాని వివరాలకోసం ఆరా తీస్తున్నారు. (ఈ చేపలను తింటే ప్రాణాలు పోతాయ్) -
మంచినీళ్లలా బీరును తాగేసిన చేప
-
కరోనాను జయించిన బామ్మ : బీర్‌తో సెలబ్రేషన్
వాషింగ్టన్ : చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరినీ కరోనా కబళిస్తుంటే 103 ఏళ్ల బామ్మ మాత్రం మృత్యువు అంచుల దాకా వెళ్లి పూర్తిగా కోలుకుంది. కోలుకున్న శుభ సందర్భంగా ఆసుపత్రిలోనే చిల్డ్ బీర్స్‌తో సెలబ్రేట్ కూడా చేసుకుంది. అమెరికాలోని మసాచూసెట్స్ నగరానికి చెందిన స్టెజ్నా మే నెలలో కరోనా బారిన పడింది. అందులోనూ వృద్ధురాలు కావడంతో అప్పటికే ఆమె పరిస్థితి విషమించింది. దీంతో స్టెజ్నాపై కుటుంబ సభ్యులు ఆశలు వదులుకున్నారు. దీంతో ఆమె చివరి కోరికలు ఏమైనా ఉంటే తీర్చేద్దాం అనుకున్నారు. కానీ అనూహ్యంగా స్టెజ్నా కరోనా నుంచి కోలుకుంది. చావు వరకూ వెళ్లిన బామ్మ తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవడంతో వారి కుటుంబంలో ఆనందానికి అవధుల్లేవు. కోలుకున్న బామ్మ కూడా చిల్డ్ బీర్‌తో సెలబ్రేట్ చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె మనువరాలు షెల్లీ గన్ సోషల మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్తా వైరల్ అయ్యింది. దీంతో పలు పత్రికలు ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ ప్రచురించాయి. (ట్విట్టర్‌ను మూసేస్తా : ట్రంప్ ) ఈ సందర్భంగా షెల్లీ మట్లాడుతూ, ‘మా బామ్మ తన జీవిత కాలంలో మా కోసం చాలా కష్టపడింది. ఈ వయసులో ఆమె కరోనాకు గురి కావడంతో మేం చాలా ఆందోళనకు గురయ్యాం. అంతేకాకుండా ఆమె పరిస్థితి కూడా విషమించడంతో ఆశలు వదులుకున్నాం. చివరి కోరికలు ఏమైనా ఉంటే తీర్చేద్దాం అనుకున్నాం. కానీ బామ్మ కోవిడ్‌ను జయించింది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంది. ఈ విషయాన్ని మేమే నమ్మలేకపోతున్నాం. అంటూ ఆనందం వ్యక్తం చేసింది'’ అంతేకాకుండా 103 ఏళ్ల వయసులోనూ కరోనా వైరస్‌ను తట్టుకుని కోలుకోవడంతో ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ఆస్పత్రి సిబ్బందే ఆమెకు చిల్డ్ బీర్ అందించారు. అది చూడగానే బామ్మ మరింత సంతోషంతో బీర్‌ను ఎంజాయ్ చేసింది అంటూ షెల్లీ పేర్కొంది. (ఎన్ 95 మాస్క్‌ల పేరుతో భారీ మోసం ) -
థియేటర్లో బీరు, బ్రీజర్ ఓకేనా..
లాక్డౌన్ నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా సినిమాల విడుదల ఆగిపోయింది. థియేటర్లు ఇప్పట్లో తెరుచుకోవు.. ఒకవేళ తెరుచుకున్నా వెంటనే ప్రేక్షకులతో కళకళలాడతాయనుకోవడం భ్రమ అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ క్రమంలో ఇప్పటికే ప్రేక్షకులు నెమ్మదిగా ఓటీటీలవైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో థియేటర్లకు వచ్చే జనాల సంఖ్య పెంచడం కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ ఐడియా చెప్తున్నారు. అయితే ఇది మంచి ఆలోచన, కాదా చెప్పాలంటూ నెటిజన్లను కోరారు.(2 వేల కోట్ల రూపాయల బీరు వృధా!) ‘ఒకసారి నేను, సురేష్ బాబు గారు, రానా థియేటర్లకు వచ్చే జనాల సంఖ్య పెరగాలంటే ఏం చేయాలి అని చర్చించుకున్నాం. విదేశాల్లో మాదిరిగానే మన దగ్గర కూడా థియేటర్లలో బీర్, వైన్, బ్రీజర్ అందించేందుకు లైసెన్స్ ఇస్తే ఎలా ఉంటుంది.. వ్యాపారం మెరుగుపడుతుందా అని చర్చించుకున్నాం. ఇంతకు నా ఆలోచన మంచిదా, చెడ్డదా చెప్పండి’ అంటూ నాగ్ అశ్విన్ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు వెంటనే స్పందించారు. కొందరు దీనికి మద్దతు తెలపగా.. మరి కొందరు మాత్రం ఇలా చేస్తే.. ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు దూరమవుతారు అని రీట్వీట్ చేశారు.(పేరు చెడగొట్టకూడదనుకున్నాను) Once In a talk with suresh babu garu and rana, it came up what if theaters get license to serve beer/breezer/wine, like in other countries..could it increase footfalls...could it save the theater business (which does need saving)...wat do you think? Good idea, bad idea? — Nag Ashwin (@nagashwin7) May 15, 2020 -
2 వేల కోట్ల రూపాయల బీరు వృధా!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ను కట్టడి చేయడం కోసం విధించిన లాక్డౌన్లో భాగంగా బ్రిటన్‌లోని పబ్‌లన్నింటిని మూసివేయడం జరిగింది. దీంతో దాదాపు రూ. 7 కోట్ల పింట్ల బీరు వృధా అవుతోంది. మార్చి 20వ తేదీన మూతపడిన పబ్‌లు జూలై నాలుగవ తేదీన తెరచుకోనున్నాయి. ఈ కారణంగా పబ్స్‌లో రూ. 7 కోట్ల పింట్ల బీరు నిల్వ ఉండి పోయిందని, అవి తెరచుకునే నాటికి బీరు ఎందుకు పనికి రాదని బ్రిటన్ బీర్ అండ్ పబ్ అసోసియేషన్ తెలిపింది. (కరోనాకు ‘క్యూర్’ ఉందన్న శాస్త్రవేత్తలు) అయితే మిగిలి పోయిన బీరులో కొంత భాగాన్ని సేంద్రీయ వ్యవసాయంలో ఎరువుల కోసం, జంతువుల దాణ కోసం ఉపయోగించవచ్చని అసోసియేషన్ చీఫ్ ఎమ్మా మార్క్‌క్లార్కిన్ తెలిపారు. కరోనా కారణంగా దెబ్బతిన్న వ్యవసాయాన్ని ఈ రకంగా ఆదుకునేందుకు బీరు ఉపయోగపడడం సంతోషకరమైనప్పటికీ పబ్‌లకు బారీ నష్టం వాటిల్లుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో బీరు తయారీ కేంద్రాలను, పబ్‌లను కొంత మేరకైనా ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రూ. 7 కోట్ల పింట్ల బీరు విలువ బ్రిటన్‌లో దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ఉంటుంది. (మనమే మాయం చేశాం..సిగ్గుతో తలదించుకోవాలి!) -
బీర్.. రివర్స్ గేర్
ఒంగోలు: వేసవి వచ్చిందంటే చాలు.. బీరు బాటిళ్ల గలగలలు వినిపిస్తుంటాయి. ఒక్కో సందర్భంలో లిక్కర్ కంటే బీర్లే అధికంగా అమ్ముడవుతాయి. ఈ ఏడాది మాత్రం బీరు విక్రయాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. గత నాలుగేళ్లలో మే నెల 8 నుంచి 13వ తేదీ వరకు జరిగిన విక్రయాలను పరిశీలిస్తే 2017లో కనిష్టంగా రోజుకు 2,037 కేసులు, గరిష్టంగా 4,625 కేసుల బీర్లు విక్రయించారు. 2018లో కనిష్టంగా 2,073 కేసులు, గరిష్టంగా 6,591 కేసులు, 2019లో కనిష్టంగా 1,553 కేసులు, గరిష్టంగా 5,397 కేసులు అమ్ముడయ్యాయి. ఈ నెల 8న లాక్డౌన్ మినహాయింపులతో మార్కాపురం(ప్రకాశం 2) మద్యం డిపో ప్రారంభమైంది. మొత్తం ఐదు రోజులపాటు విక్రయాలు జరిగితే అమ్ముడైన బీరు కేసుల సంఖ్య 3,234 మాత్రమే. ఇక ఒంగోలు మద్యం డిపో ఈ నెల 11న ప్రారంభమైంది. అప్పటి నుంచి 13వ తేదీ వరకు కేవలం 695 కేసుల బీరు అమ్ముడైంది. ధరల పెంపు కారణంగా ప్రజలు మద్యానికి దూరం అవుతున్నారని, బీర్ల విక్రయాలపై ధరల పెంపు ప్రభావం ఎక్కువుగా కనిపిస్తోందని ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. లిక్కర్ విక్రయాలు కూడా క్రమేపీ తగ్గుతున్నాయని వారు పేర్కొనడంగమనార్హం. -
లిక్కర్ మాయ!
మద్యం దుకాణాలు తిరిగి తెరుచుకోవడంతో మద్యంప్రియులు బారులు తీరుతున్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా 16శాతం ధరలు పెంచినా రికార్డు స్థాయిలో అమ్మకాలు జరుగుతున్నాయి. కరోనా వైరస్ కట్టడి నేపథ్యంలో ప్రభుత్వం మద్యం అమ్మకాల సమయాన్ని కుదించింది. ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటున్నాయి. ఎక్కడా ధరల పట్టిక ఉండటంలేదు. సమయం దాటిన తర్వాత చాలా చోట్ల రహస్యంగా అమ్ముతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో ఏటా మద్యం అమ్మకాలు పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఈ ఏడాది కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి 23నుంచి మే 5వరకు మద్యం దుకాణాలు దాదాపు 45 రోజుల పాటు మూతపడి ఉండటంతో డిమాండ్ మ రింత పెరిగింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6 నుంచి మద్యం దుకాణాలు తెరుచుకోవడా నికి అనుమతి ఇవ్వగా మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. నాలుగు రోజుల వ్యవధిలోనే రూ.42.36కోట్ల విలువజేసే మద్యం రెండు డిపోల నుంచి వైన్‌షాపులకు తరలించారు. దీనిని బట్టి చూ స్తే రికార్డు స్థాయిలో లిక్కర్ విక్రయాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. తిమ్మాజిపేట డిపో నుంచి మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాలకు కలిపి రూ. 22.15కోట్ల లిక్కర్‌ను, రూ.3.26కోట్ల విలువజేసే బీ ర్లను మద్యం దుకాణాలకు తరలించారు. అలాగే వ నపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాలకు కలిపి కొ త్తకోట డిపో నుంచి రూ.16.95కోట్ల విలువజేసే మ ద్యం వ్యాపారులు తమ దుకాణాలకు తీసుకెళ్లారు. నిబంధనలు హుష్‌కాకి! ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రతి మద్యం షాపు వద్ద పెరిగిన మద్యం ధరల పట్టిక విధిగా ఉండాలి. ఏ బ్రాండు మద్యం ఎంతకు విక్రయిస్తున్నారో ధరల పట్టికలో సూచించాల్సి ఉన్నా ఈ నిబంధన అనేక చోట్ల అమలుకు నోచుకోవడం లేదు. ఫలితంగా ఒక్కో క్వార్టర్ మద్యంపై కనీసం రూ.పది నుంచి రూ.15 వరకు అదనంగా వసూలు చేస్తున్నా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రతి బీరుపై ఎంఆర్పీ కన్నా రూ.పదికి అదనంగా విక్రయిస్తున్నారు. దీంతో ప్రతినెలా మద్యంప్రియుల జేబుకు చిల్లు పడుతోంది. అలాగే ఖరీదైన మద్యం బ్రాండ్లపై క్వార్టర్‌కు రూ.30 చొప్పన అదనంగా విక్రయిస్తున్నారు. బీర్లకు డిమాండ్ అప్పుడే వేసవి తాపం మొదలైంది. ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రతలు ఈ ఏడాది నమోదువుతుండటంతో మద్యంప్రియులు బీర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో వీటి అమ్మకాలు బాగా పెరిగాయి. ముఖ్యంగా పది రోజుల నుంచి ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు అమాంతం పెరగడంతో బీర్లకు డిమాండ్ పెరిగింది. ఎండలను బట్టి జూన్, జూలైలోనూ ఈ అమ్మకాలు తారస్థాయిలోనే ఉంటాయి. పెరిగిన అదనపు ఆదాయం మద్యం ధరలను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి భారీగా అదనపు ఆదాయం సమకూరునుంది. చీప్ లిక్కర్‌పై 11శాతం, బ్రాండెడ్ మద్యంపై 16శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. ఈ మేరకు మద్యంప్రియులపై భారం పడింది. ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాలు 164, బార్లు 30 ఉన్నాయి. కరోనా ప్రభావంతో మూతపడిన మద్యం దుకాణాలను తెరిచేందుకు అనుమతినిస్తూనే ధరలను సైతం పెంచుతున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఒక్కో చిన్న బీరుపై రూ.20, పెద్ద బీర్లపై రూ.30 పెంచారు. ఈ లెక్కన చూస్తే ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.200కోట్ల ఆదాయం పెరగనుంది. అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు దుకాణాదారులు ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం. అన్ని దుకాణాలకు ఎక్సైజ్ శాఖ నుంచే ధరల బోర్డులు తయారుచేసి అందజేశాం. నిర్వాహకులు వీటిని ఎక్కడికక్కడ ఏర్పాటు చేయాల్సిందే. సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎక్కడా ఈ దుకాణాలు తెరవడం లేదు. డిపో నుంచి స్టాక్ వస్తే తప్ప ఆ సమయంలో తెరుచుకోవు.– అనిత, ఈఎస్, మహబూబ్‌నగర్ -
ఆరెంజ్ జోన్: ‘వెళ్లి బీర్ తెచ్చుకుంటాను’
ముంబై: ‘లాక్డౌన్లో నేను ఉన్న ప్రాంతం(అలీబాగ్) తొలుత రెడ్‌జోన్‌లో ఉండేది. ఇప్పుడు ఆరెంజ్ జోన్ అయింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా మద్యం షాపులు తెరుచుకోగానే వెంటనే బీర్ తెచ్చుకుంటాను. చాలా మద్యం షాపుల దగ్గర భౌతిక దూరం పాటించడం లేదు. నేను మాత్రం తప్పకుండా భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్క్ ధరించే షాప్‌కు వెళ్లి మద్యం తెచ్చుకుంటాను. ఇక నేను ఇద్దరితో కలిసి బీర్ తాగే అవకాశం ఉంటే కచ్చితంగా రోజర్ బిన్నీ, లక్షణ్ శివరామకృష్ణన్‌లతో కలిసి తాగుతాను’అని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఇక ఆస్ట్రేలియా వేదికగా 1985లో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను గుర్తుచేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రవిశాస్త్రి హాఫ్ సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే మ్యాచ్ సందర్భంగా తనను మియాందాద్ స్లెడ్జింగ్ చేశాడని తెలిపాడు. ‘పాకిస్థాన్ని ఆ మ్యాచ్‌లో ఓడించడం నాకు మరిచిపోలేని జ్ఞాపకం. నిజాయతీగా చెప్పాలంటే ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచేందుకు మియాందాద్ చాలా ప్రయత్నించాడు. కానీ.. అతనికి ఆడీ(ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ) కారు గెలుచుకునే అవకాశం దక్కలేదు’ అని రవిశాస్త్రి వెల్లడించాడు. చదవండి: ‘ధోని, కోహ్లిలు వెన్నుపోటు పొడిచారు’ 'అందుకే రైనాను పక్కన పెట్టాం' -
కోటిన్నర లీటర్ల బీరు మురుగుపాలు!
సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్‌తో అమ్మకాల్లేకపోవడంతో రాష్ట్రంలో ఏకంగా కోటిన్నర లీటర్ల బీరు డ్రైనేజీపాలు కానుంది. ఎందుకంటే, బీరు తయారైన తేదీ నుంచి సుమారు ఆరు నెలల పాటు వినియోగించుకోవచ్చు. ఈ లెక్కన చూస్తే రాష్ట్రవ్యాప్తంగా బీర్లు తయారుచేసే బేవరేజెస్ సంస్థలు, ఎక్సైజ్ డిపోలు, వైన్‌షాపులు, బార్లలో సుమారు 20 లక్షల కాటన్ల బీరు నిల్వ ఉన్నట్టు అంచనా. లీటర్ల లెక్కన తీసుకుంటే సుమారు కోటిన్నర లీటర్ల బీరు గడువు తీరిపో వడంతో వినియోగానికి పనికిరాకుండా పో తోందని ఆబ్కారీ శాఖ లెక్కలు వేస్తోంది. ఏప్రి ల్లో సాధారణంగా రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల కాటన్ల మేర బీరు విక్రయమయ్యేది. దీని విలు వ సుమారు రూ.600 కోట్లు. (ఫేస్బుక్ వలలో పడి.. బీమా డబ్బు) ఇక మేలోనూ ఇంతే మొత్తంలో బీరు విక్రయాలు జరిగేవి. మే లో లాక్డౌన్ ఇంకా పొడిగిస్తే మొత్తంగా రెండు నెలలకు కలిపి సుమారు రూ.1,200 కోట్లు (7.5 కోట్ల లీటర్ల) విలువైన బీర్ల అమ్మకాలకు బ్రేక్ పడినట్లే. నిజానికి బీర్ల ఉత్పత్తి మార్చి నెలాఖరు నుంచే పలు బేవరేజెస్లో నిలిచిపోయింది. అప్పటికే తయారుచేసిన స్టాకు పలు బా ట్లింగ్ యూనిట్లు, ఆబ్కారీ డిపోలు, బార్లు, వై న్స్, క్లబ్‌లలో నిల్వ ఉంది. ఇందులో 6నెలల గడువు తీరిన స్టాక్ 20 లక్షల కాటన్ల మేర ఉం టుందని అంచనా. ఒక్కో కాటన్లో 12 బీర్లు ఉంటాయి. ఒక్కో సీసాలో 650 మి.లీ బీరు ఉం టుంది. ఈ లెక్కన సుమారు 1.56 కోట్ల లీటర్ల బీరుకు గడువు తీరిపోయిందని ఆబ్కారీ అధికా రులు చెబుతున్నారు. దీనిని అనివార్యంగా డ్రైనేజీ పాలు చేయాల్సిందేనని అంటున్నారు. ఇక, బీర్ల వినియోగంలో రాజధాని గ్రేటర్ హైదరాబాద్ అగ్రభాగాన ఉంది. ఏప్రిల్‌లో రాష్ట్రంలో 50 లక్షల కేసుల బీరు వినియోగం ఉండగా, ఇందులో యాభైశాతం అంటే 25 లక్షల కాటన్లు నగరంలోనే విక్రయమయ్యేవి. (‘సూపర్’గా దోపిడీ!) -
మంటల్లో పబ్‌కు బీరు సరఫరా!
ఆస్ట్రేలియాలో గత కొంతకాలంగా పొదలు తగలబడుతూ మంటలు చుట్టుముట్టిన విక్టోరియా పట్టణాల్లో మల్లకూట ఒకటి. ఆ నగరం నుంచి బుధవారం నాడే వేలాది మంది ప్రజలను, వారితోపాటు ఆహార పదార్థాలను తీసుకొని ఓ నౌకా దళం సురక్షిత ప్రాంతానికి తరలి పోయింది. అయినా నాలుగు వేల మంది ప్రజలు పట్టణంలో మిగిలిపోయారు. ఆ పట్టణానికి వచ్చి పోయే దారులను అధికారులు తాత్కాలికంగా మూసి వేశారు. పట్టణంలోని హోటల్ మోటల్‌లోని పబ్‌లో బీర్లు అయిపోయాయి. అప్పటికే మంచినీటి కొరతతో బాధ పడుతున్న పట్టణ ప్రజలు బీర్లకు ఎగబడడంతో బీర్లు త్వరగా అయిపోయాయి. రెగ్యులర్ కోటా రావడానికి సమయం పడుతుంది. దాంతో పబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పీటర్ ఫిలిపోవిక్ మల్లకూట కౌంటీ అగ్నిమాపక దళాధికారికి ఫోన్ చేసి పరిస్థితి వివరించారు. ఆయన ఈ విషయాన్ని సహాయక చర్యల్లో నిమగ్నమైన సైనిక దళానికి చేరవేయడంతో ఆ సైనిక దళం కార్ల్‌టాన్, యునైటెడ్ బ్రేవరీస్‌కు చెందిన మూడు వేల లీటర్ల బీర్లను తీసుకొచ్చి పబ్‌కు సరఫరా చేసింది. అందుకు హోటల్ యజామానితోపాటు వినియోగదారులు కూడా సైన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. భూగర్భ జలాలు బాగా తగ్గిపోయి భూ ఉపరితం బాగా వేడెక్కిపోవడంతో ఆస్ట్రేలియాలో అడవులు, పొదలు తగులబడుతున్న విషయం తెల్సిందే. దీని వల్ల ఇప్పటికే కొన్ని కోట్ల జంతువులు మత్యువాత పడ్డాయి. నీటిని రక్షించుకోవడంలో భాగంగా లక్షకుపైగా ఒంటెలను కాల్చివేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెల్సిందే. చదవండి: ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం ఆగని కార్చిచ్చు.. ఎటుచూసిన కళేబరాలే బీచ్‌లలో చిక్కుకున్న వేల మంది -
గ్లాసు పాల కన్నా పెగ్గు బీరు మిన్న!
న్యూఢిల్లీ : ‘పాలు తాగండి. ఆరోగ్యంగా ఉంటారు’.. ప్రభుత్వ నినాదమిది. రోజూ లేవగానే ఒక గ్లాసుడు పాలు తాగాలని పిల్లలకు పెద్దలు కూడా చెబుతుంటారు. అయితే ప్రముఖ జంతు సంరక్షణ సంస్థ(పెటా) మాత్రం.. మనుషుల ఆరోగ్యానికి పాల కంటే రోజూ ఓ పెగ్గు బీరే బెటర్ అని చెబుతోంది. ఈ మేరకు ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసింది. హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధనలు చేసి విడుదల చేసిన రిపోర్టు ఆధారంగా పెటా ఈ విషయాన్ని వెల్లడించింది. ఆరోగ్యం కోసం పాలకంటే బీరే చాలా మంచిదని పెటా ఘంటాపథంగా చెబుతోంది. ఇందులో ఎలాంటి అనుమానాలూ అక్కర్లేదని పెటా ఎగ్జిక్యూటివ్ వైఎస్ ప్రెసిడెంట్ ట్రేసీ రీమాన్స్ స్పష్టం చేశారు. డెయిరీ ప్రాడక్ట్స్ ఎక్కువగా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని పెటా పేర్కొంది. గుండె సంబంధిత వ్యాధుల, ఒబెసిటీ, డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదముందని పెటా హెచ్చరించింది. ఇక డెయిరీ ఉత్పత్తుల వాడకం వల్ల ఎముకల వ్యాధి కూడా సోకుతుందని చెప్పిన పెటా.. దీన్ని నిర్థారిస్తూ కొన్ని రుజువులను కూడా వెల్లడించింది. కానీ బీరు తాగడం వల్ల ఎముకలు బలోపేతమవుతాయని చెబుతోంది. -
ఇక ఈ బీర్లకు చీర్స్ చెప్పాల్సిందే!
న్యూఢిల్లీ : ఇక ఎవరైనా మూడు బీర్లు, ఆరు గ్లాసులతో ఛీర్స్ చెప్పాల్సిందే. ఇంతకాలానికి శాస్త్రవేత్తలు బీరులో ఉన్న మంచి గుణాలను కనిపెట్టారు. బీరు తాగితే కొత్తగా బొజ్జలు రాకపోవడమే కాకుండా బొజ్జలు కరిగిపోయి మొత్తంగా స్థూలకాయం తగ్గుతుందట. పైగా సుఖంగా నిద్ర పడుతుందట. వీటిలో ఒకరకమైన బ్యాక్టీరియా, ఈస్ట్ మిశ్రమం ఉండడమే అందుకు కారణమని శాస్త్రవేత్తలు తేల్చారు. అన్ని బీర్లలో ఈ గుణం ఉందో, లేదో తెలియదుగానీ బెల్జియంకు చెందిన హోగార్డెన్, వెస్ట్‌మల్లే ట్రిపల్, ఎట్ క్రైకెన్‌బియర్ బ్రాండ్ల బీర్లలో ఈ మంచి గుణాలు ఉన్నాయట. ఆ బీర్లు రెండుసార్లు, భూగర్భంలో ఉండగా ఒకసారి, సీసాలో మరోసారి బీరు పులియడం వల్ల వాటికి ఆ మంచి గుణాలు అబ్బాయట. భూగర్భంలో పులియడానికి ఒకరకమైన ఈస్ట్, సీసాలో పులియడానికి మరో రకమైన ఈస్ట్‌ను ఉత్పత్తిదారులు ఉపయోగిస్తున్నారని, ఈ రెండోసారి పులియడంతోనే బీరులో ఎక్కువగా ఆరోగ్య లక్షణాలు చేరుతున్నాయని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. వాటిలో కూడా లైట్ బీరుకన్నా స్ట్రాంగ్ బీరే మంచిదని, అలా అని ఎక్కువగా బీర్లు తాగమని తాను సిఫార్సు చేయడం లేదని ఆమ్స్టర్డామ్ యూనివర్శిటీలో బ్యాక్టీరియా నిపుణుడిగా పనిచేస్తున్న ప్రొఫెసర్ ఎరిక్ క్లాసెన్ చెప్పారు. ‘ఎక్కువ ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదు, ఈ రకమైన బ్రాండ్లలో రోజొకటి తాగినా ఆరోగ్యానికి మంచిదే. ఈ రకాల బీరు బాటిళ్లలో 50 శాతానికిపైగా మంచి బ్యాక్టీరియా ఉంది’ ఆయన చెప్పారు. -
గ్లాసు బీరుకు ఎంత చెల్లించాడో తెలిస్తే షాక్!..
కాన్బెర్రా : ఓ వ్యక్తి గ్లాసుడు బీరు కోసం చెల్లించిన మొత్తం ఎంతో తెలిస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు. అంత చెల్లించాడా? అంటూ నోరెళ్ల బెడతారు. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాకు చెందిన పీటర్ లాలర్ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం మాల్మేసన్ అనే హోటల్‌కు వెళ్లాడు. అక్కడ అమెరికన్‌ది కాకుండా బ్రిటీష్ బీరు ఆర్డర్ చేశాడు. డ్రింక్‌ను ఎంజాయ్ చేస్తూ తాగాడు. కార్డుతో డబ్బులు కట్టేశాడు. బీరుకు ఎంత డబ్బులు చెల్లించానో తెలుసుకోవాలనుకున్న పీటర్ హోటల్ సిబ్బందిని అడిగాడు. పీటర్ చెల్లించిన మొత్తం ఎంతో చెప్పడానికి సిబ్బంది తటపటాయించాడు. పీటర్ గట్టిగా అడిగేసరికి బిల్ ఎంతో చెప్పాడు. అంతే! పీటర్ షాక్ తిన్నాడు. తాను ఒక గ్లాసు బీరుకోసం దాదాపు రూ. 70 లక్షలు చెల్లించానని తెలిసి నోరెళ్లబెట్టాడు. అయితే మొదట అతడికి నమ్మకం కుదురలేదు. ఇంటి వద్దనుంచి ఫోన్ రావటంతో అది వాస్తవమేనని అతడు ధ్రువీకరించుకున్నాడు. దీనిపై పీటర్ మాట్లాడుతూ.. ‘‘ చరిత్రలో అత్యంత ఖరీదైన బీరు. దీని కోసం నేను నిజంగానే 99 వేల డాలర్లు చెల్లించాను’’ అంటూ వాపోయాడు. కాగా, హోటల్ సిబ్బంది పొరపాటు వల్లే బిల్ ఎక్కువగా వేసినట్లు తేలటంతో సదరు డబ్బు మొత్తాన్ని వెనక్కు ఇచ్చేందుకు యాజమాన్యం సమ్మతించింది. జరిగిన పొరపాటుకు చింతిస్తూ పీటర్‌కు క్షమాపణలు చెప్పింది. వసూలు చేసిన డబ్బును వీలైనంత త్వరగా వెనక్కు ఇచ్చే ఏర్పాటు చేస్తామని తెలిపింది. See this beer? That is the most expensive beer in history. I paid $99,983.64 for it in the Malmaison Hotel, Manchester the other night. Seriously. Contd. pic.twitter.com/Q54SoBB7wu — Peter Lalor (@plalor) September 5, 2019 -
బీర్'ఫుల్'
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో గత జూన్ నెలలోబీరోత్సాహం కనిపించింది. లిక్కర్ కంటే బీరు వైపే మందుబాబులు ఎక్కువ మొగ్గు చూపారు. ఏడాదిగణాంకాలను పరిశీలిస్తే బీర్ల అమ్మకాల్లో ఎక్కువ పెరుగుదల కనిపించడమే దీనికి నిదర్శనం. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండల వేడి నుంచి ఉపశమనం పొందేందుకు బీర్లు తాగడంతో అమ్మకాలు బాగా పెరిగాయి అనుకుంటే జూన్ నెలలోనూ రికార్డు స్థాయిలో అధికంగా అమ్ముడుపోవడం గమనార్హం. జూన్ నెలలో హైదరాబాద్ జిల్లాలో గడిచిన ఏడాదితో పోలిస్తే 18.06 శాతం, రంగారెడ్డి జిల్లాలో 19 శాతం మేర అమ్మకాలు పెరిగాయి. దీంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా భారీగా పెరిగింది. ఈ ఏడాది జూన్ నెలలో ఎండలు మండిపోయాయి. ఉక్కపోత తగ్గకపోవడంతో మద్యం ప్రియులు ఎక్కువగా లిక్కర్‌కు బదులు బీర్లు తాగడానికే ఆసక్తి చూపారు. జూలై నుంచి బీర్ల అమ్మకాలు తగ్గి లిక్కర్ అమ్మకాలు పెరిగే అవకాశం ఉంటుందని ఎక్సైజ్ అధికారులు అంటున్నారు. నీటి ఎద్దడిని అధిగమించి.. ఈ ఏడాది వేసవి కాలంలో రాష్ట్రంలోని అన్ని నదులు, జలాశయాల్లో నీటి కొరత ఏర్పడటంతో బీర్ల ఉత్పత్తి చేసే కంపెనీలు కొన్ని రోజుల పాటు ఉత్పత్తిని తగ్గించాయి. దీంతో గ్రేటర్లో కొన్ని రోజుల పాటు ఆబ్కారీ శాఖ నుంచి సరఫరా సరిగ్గా లేకపోవడంతో మద్యం దుకాణాలు, బార్లలో మే నెలలో బీర్లకు కొరత ఏర్పడింది. ఆ తర్వాత బీర్లు ఉత్పత్తి చేసే కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుని, ట్యాంకర్ల ద్వారా ఇతర ప్రాంతాల నుంచి నీటిని తెప్పించుకుని బీర్లను ఉత్పత్తి చేశాయి. దీంతో డిమాండ్ మేరకు సరఫరా చేయగలిగారు. దీనికి తోడు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ అధికారులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా దిగుమతి చేసుకుని సరఫరా చేశారు. రంగారెడ్డి జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో గత ఏడాది జూన్‌లో 6,38,150 కాటన్ల లిక్కర్, 11,65,641 కాటన్ల బీర్లు సేల్ కావడంతో ప్రభుత్వానికి రూ.426.05 కోట్ల ఆదాయం వచ్చింది. జూన్ నెలలో 6,51,023 కాటన్ల లిక్కర్, 13,91,526 కాటన్ల బీర్లు సేల్ కావడంతో ప్రభుత్వానికి రూ.462.06 కోట్ల ఆదాయం చేకూరింది. లిక్కర్ అమ్మకాల్లో పెద్దగా తేడా లేకపోయినా 2 శాతం అమ్మకాలు పెరిగాయి. బీర్లు మాత్రం 19 శాతం అధికంగా గ్రోత్ రేట్ సాధించాయి. అమ్మకం విలువ 8 శాతం అదనంగా నమోదయింది. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో 2018 మే నెలలో 533353 కాటన్ల లిక్కర్, 1425207 కాటన్ల బీర్లు అమ్ముడుపోవడంతో ప్రభుత్వానికి రూ. 396.95 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది మే నెలలో 6,10,081 కాటన్ల లిక్కర్, 15,96,409 కాటన్ల బీర్లు అమ్ముడుపోగా ఆదాయం రూ. 467.11 వచ్చింది. గడచిన ఏడాదితో పోలిస్తే లిక్కర్ అమ్మకాలు 14 శాతం పెరగగా, బీర్ల అమ్మకాలు 12 శాతం పెరిగాయి. అమ్మకం విలువ 18 శాతం పెరిగింది. హైదరాబాద్ జిల్లాలో హైదరాబాద్ జిల్లాలో గత ఏడాది జూన్‌లో 3,25,119 కాటన్ల లిక్కర్, 4,79,840 కాటన్ల బీర్ల విక్రయంతో ప్రభుత్వానికి రూ.213.66 కోట్ల ఆదాయం చేకూరింది. ఈ ఏడాది జూన్‌లో 3,30605 కాటన్ల లిక్కర్, 5,69,131 కాటన్ల బీర్లు సేల్ కావడంతో రూ. 225.16 కోట్ల ఆదాయం వచ్చింది. జూన్ నెలలో హైదరాబాద్ జిల్లాలో గడచిన ఏడాదితో పోలిస్తే లిక్కర్ గ్రోత్ రేట్ కేవలం 1.7 శాతం మాత్రమే ఉంది. అదే బీర్ల గ్రోత్ రేట్ మాత్రం బాగా పెరగడంతో 18.6 శాతం పెరుగుదల నమోదయింది. మొత్తం అమ్మకం విలువ 5.4 శాతం పెరిగింది. అదేవిధంగా మే 2018 సంవత్సరంలో 2,70,663 కాటన్ల లిక్కర్, 5,75,575 కాటన్ల బీర్లు అమ్ముడుపోగా ప్రభుత్వానికి రూ.191.61 కోట్ల ఆదాయం సమకూరింది. 2019 మే నెలలో 2,95,709 కాటన్ల లిక్కర్, 6,09,070 కాటన్ల బీర్లు అమ్ముడుపోగా ప్రభుత్వానికి రూ.213.04 కోట్ల ఆదాయం వచ్చింది. గడచిన ఏడాదితో పోలిస్తే లిక్కర్ 9.3, బీర్లు 5.8, గ్రోత్ రేటు సాధించగా అమ్మకం విలువ 11.2 శాతంపెరిగింది. -
‘కేఎఫ్’ కావాలి.. కరీంనగర్లో కలపండి!
సాక్షి, జగిత్యాల: బీర్బల్ కథలు వినే ఉంటారు. ‘బీర్’బాబుల లేఖ ఎప్పుడైనా చదివారా? వేసవిలో మందుబాబుల దాహం తీర్చే ‘బీర్’కాయల కోసం జగిత్యాల వాసులు ఏకంగా తమ జిల్లాను త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. కిక్కిచ్చే ‘కింగ్‌ఫిషర్’ కోసం కరీంనగర్ జిల్లాకు మారిపోతామంటున్నారు! తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల సందర్భంగా ఈ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. జగిత్యాల రాయికల్ మండలం మూటపల్లి గ్రామంలోని బ్యాలెట్ బాక్స్ లోంచి బయటపడ్డ ఉత్తరం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తమ జిల్లాను తిరిగి కరీంనగర్ జిల్లాలో విలీనం చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును కోరుతూ జగిత్యాల వాసుల పేరుతో ‘బీర్’కాయుడెవరో ఈ లేఖ రాశారు. మంగళవారం ఓట్ల లెక్కింపు సందర్భంగా ఇది బయటపడింది. తమకెంతో ఇష్టమైన బీర్ జగిత్యాల జిల్లాలో లభ్యంకానందున తమ జిల్లాను కరీంనగర్లో కలిపేయాలని లేఖలో కోరారు. కింగ్‌ఫిషర్(కేఎఫ్) బీర్‌ను అందుబాటులో ఉంచాలని పనిలో పనిగా అభ్యర్థించారు. ఈ లెటర్ చదివి జనాలు తెగ నవ్వుకుంటున్నారు. అయితే ఈ లేఖ బ్యాలెట్ బాక్స్‌లో రాలేదని, ఇదంతా ఫేక్ అని స్థానికులు అంటున్నారు. -
కోరుకున్న బీరు బ్రాండ్ దొరకడం కష్టమే...
సాక్షి సిటీబ్యూరో: ఎండల వేడి తారాస్థాయికి చేరింది. ఎండ తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బీరు తాగి ఎండల నుంచి తాత్కాలిక ఉపశమనం పొందాలనుకున్న మద్యం ప్రియులకు మద్యం దుకాణాలు, బార్లలో బీర్లు నో స్టాక్ అనే సమాధానం వినిపిస్తుంది.దీంతో నిరాశకు లోనవుతున్నారు. వేసవిలో బీర్ల అమ్మకాలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయి. వేసవిలో పలువురు విస్కీ, రమ్ము తదితరాలకంటే బీర్లపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీర్ల కొరత ఉన్నప్పటికీ గ్రేటర్ పరిధిలో సమస్య మరింత ఎక్కువగా ఉంది. ఉత్పత్తి తగ్గినందునే ఎండాకాలంలో బీర్లకు డిమాండ్ అధికంగా ఉన్నప్పటికీ అందుకు సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో మద్యం ప్రియులకు ఇబ్బందులు తప్పడం లేదు. బీర్ల ఉత్పత్తికి అధికంగా నీరు అవసరం అవుతుంది. ఎండలతో జలాశయాలు, నదులు ఎండిపోవడంతో బీర్లను ఉత్పత్తి చేసే కంపెనీలకు నీటి సరఫరా నిలిచిపోయింది. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలోని సింగూరు జలాశయం నుంచి 5 బీర్లు ఉత్పత్తి చేసే కంపెనీలకు నీటి సరఫరా జరుగుతుంది. అయితే జలాశయంలో నీరు లేకపోవడంతో కంపెనీలకు సరఫరా నిలిపివేశారు. దీంతో ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించాల్సి వస్తోంది. 10 నుంచి 20 శాతం మాత్రమే సరఫరా.. గతంలో బేవరేజెస్ కార్పోరేషన్ ద్వారా 100 కార్టన్ల బీర్లు సరఫరా చేసే వైన్స్, బార్లకు ఆర్డర్ చేసిన మొత్తంలో 10 నుంచి 25 శాతం వరకు మాత్రమే సరఫరా చేస్తున్నారు. గతంలో వారానికి రెండు సార్లు బేవరేజెస్ గోదాంల నుంచి బీర్ల సరఫరా జరిగేది. ప్రస్తుతం ఇండెంట్ పెట్టినా ఒకేసారి సరిపడిన స్టాక్ ఇవ్వకపోవడం, ఆర్డర్ చేసిన దాంట్లో కొంత మాత్రమే స్టాక్ ఇవ్వడంతో ప్రతి రోజు బీర్ల స్టాక్ కోసం గోదాంలకు వెళ్లాల్సి వస్తుంది. దీంతో దుకాణ దారులపై చలాన్, గేట్ పాస్, రవాణా ఇతర చార్జీల పేరుతో అదనపు భారం పడుతోంది. బీర్ల ప్రియులు అధికంగా ఇష్టపడే బ్రాండ్ల బీర్లు దొరకడం కష్టంగా మారింది. వైన్స్, బార్లకు 10 నుంచి 25 శాతం వరకే సరఫరా చేస్తుండటంతో కొన్ని గంటల వ్యవధిలోనే స్టాక్ అయిపోతోంది. దీంతో దుకాణాల యజమానులు బీర్ల ప్రియులు అడిగిన బ్రాండ్‌ను ఇవ్వలేకపోతున్నారు. ఎండ నుంచి ఉపశమనం పొందాలనుకునే వారు ఇష్టపడే బ్రాండ్ దొరకకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న వాటితో సరిపెట్టుకుంటున్నారు. వర్షాలు కురిసి జలాశయాల్లో నీరు చేరి బీర్ల ఉత్పత్తి పెరిగితేనే సమస్య తీరుతుందని ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. -
బీరు సీసాల లారీ బోల్తా
-
బేగంపేటలో బీరు సీసాల లారీ బోల్తా
సాక్షి, హైదరాబాద్: బేగంపేటలో సోమవారం తెల్లవారుజామున బీరు కాటన్లతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. రోడ్డుపైనే లారీ బోల్తా పడటంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. లారీ బోల్తా పడటంతో బీరు సీసాలన్నీ రోడ్డు మీద పడిపోయాయి. దీంతో వాటిని దొంగలించేందుకు స్థానికులు ఎగబడ్డారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బీరు సీసాలు చోరీకి గురికాకుండా కాపలా కాస్తున్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బీరు తాగిన పెళ్లి జంట..వైరల్ వీడియో
-
పెళ్లి జంట... బీరు తంటా
బొమ్మనహళ్లి : పవిత్రమైన మంటపంలో ఓ పెళ్లి జంట బీరు తాగి అందర్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు... సాధారంగా పెళ్లి మండటపంలో నూతన దంపతులకు చల్లటి పానీయాలు ఇవ్వడం ఆనవాయితీ. అయితే ఇక్కడ కనిపించే ఓ జంట తమ స్నేహితులు ప్రేమతో తీసుకువచ్చిన బీరు బాటిళ్లను ఎత్తి గుటగుట తాగి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇదేమి పెళ్లిరా బాబు అంటూ మరికొందరు నిట్టూరుస్తు వెళ్లిపోయారు. కర్ణాటక హుబ్బళ్లి జిల్లా పరిధిలో ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఫుల్ కిక్కు!
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: వేసవి సెలవులు పూర్తయి విద్యాసంవత్సరం ప్రారంభం కాగానే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు అందించేందుకు విద్యాశాఖ ముందస్తుగానే ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలకు కలిపి అధికారులు ప్రతిపాదనలు పంపగా మొదటి విడతలో సగానికి పైగానే పుస్తకాలు వచ్చేశాయి. వాటిని మండలాల వారీగా సర్దుకుని పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో మాదిరి కాకుండా ఈ సారి అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు సరిపోయే పుస్తకాలను అందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం పంపిణీ చేసిన పుస్తకాలు పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలను కొట్టిపారేస్తూ ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రతి పుస్తకానికి కూడా ఒక ప్రత్యేకమైన కోడ్‌ను విధించారు. వీటిని విద్యార్థులకు పంపిణీ చేసేటప్పడు వారి ఆధార్‌కార్డుతో అనుసంధానం చేస్తారు. అయితే పూర్తి స్థాయిలో పుస్తకాలు గతంలో అందుబాటులో లేనప్పుడు ప్రతి పాఠశాలలో కూడా బుక్‌బ్యాంక్ పద్ధతిలో విద్యార్థులందరికీ మండుతున్న ఎండలకు తడారిపోతున్న గొంతులను తడిపేందుకు మందు ప్రియులు బీర్లను తెగతాగేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే.. పది శాతానికి పైగా విక్రయాలు జరిగాయి. ఉక్కపోతలకు విస్కీ ప్రియులు సైతం బీర్ల వైపే ఆసక్తి చూపడంతో కేసుల కొద్ది బీర్లు ఖర్చవుతున్నాయి. సర్పంచ్, పార్లమెంట్ ఎన్నికలు, ప్రాదేశిక ఎన్నికలు కూడా కలిసి రావడంతో బీర్ల అమ్మకాల్లో జోరు కొనసాగింది. ఈ నాలుగు నెలల్లోనే రూ.171కోట్ల బీర్లు విక్రయించారు. మండుతుండటంతో గడిచిన నాలుగు నెలల్లో బార్లు, వైన్స్ షాపులలో బీర్లు అధికంగా అమ్ముడుపోయి ప్రభుత్వ ఖజానాలో భారీగా నగదు జమ అయింది. గతేడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మాసాల్లో కలిపి రూ.145.76కోట్ల వ్యాపారం జరగగా, ఈ ఏడాది రూ.171.34కోట్ల వ్యాపారం సాగింది. అంటే దాదాపు రూ.25కోట్ల వ్యాపారం ఎక్కువగా సాగింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 66 వైన్స్‌లు, 13 బార్లు, 1 ఎలైట్ బార్, నాగర్‌కర్నూల్ జిల్లాలో 45 వైన్స్‌లు, 7 బార్లు, వనపర్తి జిల్లాలో 29 వైన్స్‌లు, 4బార్లు , 1ఎలైట్ బార్, జోగుళాంబ గద్వాలలో 24 వైన్స్‌లు, 4బార్లు ఉన్నాయి. రికార్డుస్థాయిలో బీర్ల అమ్మకాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గడిచిన ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌వరకు జరిగిన బీర్ల విక్రయాల కంటే ప్రస్తుత సంవత్సరం జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఎక్కువగా బీర్ల విక్రయాలు జరిగినట్లు గణాంకాలు చెపుతున్నాయి. గడిచిన ఏడాది జనవరిలో 2,89,903 కాటన్లు అమ్ముడు పోగా రూ.29.7కోట్లు, ఫిబ్రవరిలో 2,21,506 కాటన్ల విక్రయాలు జరగగా, రూ.22.82కోట్లు, మార్చిలో 4,23,235కాటన్లు అమ్ముడుపోగా, రూ.43.55 కోట్లు, ఏప్రిల్‌లో 4,45,653 కాటన్లు అమ్ముడు పోగా రూ.49.69కోట్ల ఆదాయం వచ్చింది. 2019 జనవరిలో 3,16,687 కాటన్ల బీర్లు అమ్ముడు పోగా రూ.34.93 కోట్లు, ఫిబ్రవరిలో 2,96119 కాటన్లకు రూ.32.91కోట్లు, మార్చిలో 4,46,545, కాటన్లకు రూ.49.44 కోట్లు, ఏప్రిల్‌లో 4,50,502 కాటన్లకు రూ. 54.06 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ లెక్కన గతేడాదితో పోలిస్తే ఈ జనవరిలో రూ.5.23కోట్లు, ఫిబ్రవరిలో రూ.10.09కోట్లు, మార్చిలో రూ.6.11కోట్లు, ఏప్రిల్‌లో రూ.4.37కోట్ల ఆదాయం ఎక్కువగా వచ్చింది. అధిక ధరకు విక్రయాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న బెల్టుషాపులలో మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అదే విధంగా ఆయా జిల్లా పరిధిలోని మద్యం దుకాణాలలో యజమానులు వయస్సుతో నిమిత్తం లేకుండా దుకాణాలకు వచ్చే ప్రతి ఒక్కరికీ మద్యాన్ని విక్రయిస్తున్నారు. అందులో మైనర్లు కూడా మద్యాన్ని విక్రయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. -
మందుబాబుల మనసు ద్రవించే ఘటన!
లక్నో : ఎర్రటి ఎండల్లో చల్లని బీరు తాగాలని భావించే మందుబాబుల మనసు ద్రవించే ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో చోటుచేసుకుంది. ఎక్స్పైరీ డేట్ ముగిసిన కారణంగా దాదాపు లక్షల లీటర్ల బీరును అధికారులు నేలపాలు చేశారు. దీని విలువు సుమారు 3 కోట్ల రూపాయలు ఉంటుందని వెల్లడించారు. వివరాలు.. నోయిడాలోని ఓ గోడౌన్లో మద్యం నిలువచేసి ఉందన్న సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు గురువారం అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో 11, 652 బీరు బాటిళ్లను గుర్తించారు. అయితే వాటి ఎక్స్పైరీ డేట్ ముగిసిపోవడంతో వాటన్నింటినీ పోగుచేసి బుల్డోజర్లతో తొక్కించారు. ఈ సందర్భంగా వివిధ బ్రాండ్లకు చెందిన దాదాపు 1.24 లక్షల బీరు బాటిళ్లను ధ్వంసం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా ఎన్నికల నేపథ్యంలోనే పెద్ద మొత్తంలో మద్యం నిల్వ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఇక ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు సహా దేశంలోని పలు లోక్‌సభ నియోజకవర్గాల్లో గురువారం రెండో దఫా పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. -
వరల్డ్‌కప్ ఆడియన్స్‌కు ఐసీసీ బంపర్ ఆఫర్!
లండన్ : క్రికెట్ మైదానంలో వరల్డ్ కప్ మ్యాచ్ చూస్తూ చేతిలో చల్లని బీరు గ్లాసు ఉంటే ప్రేక్షకులకు ఆ మజాయే వేరు! అయితే త్వరలో జరగబోయే వన్డే వరల్డ్ కప్‌లో అఫీషియల్ బీర్ పార్ట్నర్ పెట్టిన రేటుతో మద్యం గొంతు దిగడం కష్టంగా అనిపించింది. అంతే... మీరెందుకు బాధ పడుతున్నారు మేమున్నాం కదా అంటూ నేరుగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)నే రంగంలోకి దిగింది. టోర్నీ నిర్వాహక దేశం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)తో కలిసి బీరు ధరను కిందకు దించింది. అదేమీ చర్చలతో కాదు... మీరు కోల్పోయే మొత్తాన్ని మేం చెల్లిస్తాం కానీ తక్కువ ధరకే స్టేడియాల్లో బీర్లు అందించండని సదరు సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. సబ్సిడీ బీరు కథ వివరాల్లోకెళితే... వరల్డ్ కప్ అధికారిక బీర్ స్పాన్సర్‌గా భారత్‌కు చెందిన ‘బీరా 91’ కంపెనీతో ఐసీసీ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచ కప్ మ్యాచ్‌లు జరిగే 11 వేదికల్లో ఇదే బీరును అమ్మాలి. నిర్వాహకులు ఒక బీరు పింట్ (గ్లాసు) ధరను 9.70 డాలర్లు (సుమారు రూ. 670)గా నిర్ణయించారు. అయితే అక్కడి వ్యాపారులు మాత్రం ఇది తమకు ఏమాత్రం గిట్టుబాటు కాదని, కనీసం 15.5 డాలర్లు (సుమారు రూ.1000) ఉంటే గాని కుదరదని తేల్చేశారు. పెద్ద సంఖ్యలో వచ్చే అభిమానులను బీరు రేటుతో నిరాశపర్చడం ఇష్టం లేని ఐసీసీ...ఫ్యాన్స్‌కు తక్కువ రేటుకే ఇవ్వండి, మిగిలిన నష్టాన్ని మేం పూరిస్తాం అని హామీ ఇచ్చింది. దీని ప్రకారం మొత్తం దాదాపు 5 లక్షల పౌండ్ల (రూ. 4 కోట్ల 52 లక్షలు) సబ్సిడీ భారం పడనుంది. దీనిని ఐసీసీ, ఇంగ్లండ్ బోర్డు సమంగా భరిస్తాయి. అంటే క్రికెట్ పెద్ద ఐసీసీ బీర్ల కోసం 2 లక్షల 50 వేల పౌండ్ల (రూ. 2 కోట్ల 26 లక్షలు) నష్టాన్ని భరించేందుకు సన్నద్ధమైంది!