హెల్త్‌ డ్రింక్‌గా బీరు: మంత్రి జవహర్‌ | Beer is a health drink says Excise Minister Jawahar | Sakshi
Sakshi News home page

హెల్త్‌ డ్రింక్‌గా బీరు: మంత్రి జవహర్‌

Published Tue, Jul 4 2017 1:59 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

హెల్త్‌ డ్రింక్‌గా బీరు: మంత్రి జవహర్‌ - Sakshi

హెల్త్‌ డ్రింక్‌గా బీరు: మంత్రి జవహర్‌

సాక్షి, అమరావతి: మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా చూడబోమని ఓ వైపు చెబుతూనే మరోవైపు పూటుగా మద్యం తాగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. బీరును హెల్త్‌ డ్రింక్‌గా ప్రమోట్‌ చేస్తున్నామని సాక్షాత్తూ ఎక్సైజ్‌ శాఖ మంత్రి కేఎస్‌ జవహర్‌ పేర్కొనడాన్ని బట్టి చూస్తే ప్రభుత్వం ఉద్దేశ్యం ఏంటో ఇట్టే అర్ధమవుతుంది.

సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం రోడ్ల వెంబడి నగరాల్లో, పట్టణాల్లో మద్యం షాపుల ఏర్పాటు వీలు కాకపోవడంతో రోడ్లను డీ నోటిఫై చేయనున్నామని, బైపాస్‌ రోడ్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించి పూర్తి విధి విధానాలపై మంగళవారం జీవో జారీ కానుందని ఎక్సైజ్‌ మంత్రి కేఎస్‌ జవహర్‌ తెలిపారు. 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement