minister jawahar
-
టీడీపీలో వీడని సస్పెన్స్
సాక్షి , ఏలూరు : తెలుగుదేశం పార్టీ పెండింగ్‌లో పెట్టిన నాలుగు సీట్లపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఆ నాలుగు కూడా సిట్టింగ్‌లనే ఖరారు చేసే అవకాశం ఉందన్న ప్రచారం నడుస్తోంది. మరోవైపు అసలు అభ్యర్థిని ప్రకటించకుండానే ఉంగుటూరులో ఆదివారం తెలు గుదేశం పార్టీ ఎన్నికల సభ నిర్వహిస్తోంది. అయితే ఏర్పాట్లన్నీ సిట్టింగ్ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులే దగ్గరుండి చేస్తున్నారు. అర్ధరాత్రికి అయినా తన పేరు ఖరారు చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలోని అన్ని స్థానాలకు అభ్యర్థులను ఆదివారం ఉదయం ప్రకటించనుంది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇడుపులపాయ నుంచి ఈ జాబితాను విడుదల చేస్తారు. శనివారమే జాబితా ఇవ్వాల్సి ఉన్నా వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో జాబితా విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఎంపీఅభ్యర్థులను కూడా ఆదివారం ప్రకటించనున్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లాలో దాదాపుగా అందరు సిట్టింగ్‌లను ప్రకటించినా ఒక్క చింతలపూడిలో మాత్రమే కొత్త వారికి ఛాన్స్ ఇచ్చారు. పీతల సుజాతకు సీటు రాకుండా ఎంపీ మాగంటి బాబు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బాగా లాబీయింగ్ చేశారు. కేవలం కమ్మ సామాజికవర్గం పెత్తనాన్ని ఎదిరించినందుకే పీతల సుజాతకు సీటు లేకుండా చేశారని దళిత వర్గాలు మండిపడుతున్నాయి. ఆమెకు సీటు ఇవ్వకుండా అవమానించడంపై ఆమె సామాజిక వర్గం నేతలు ఆగ్రహంగా ఉన్నారు. దీంతో చివరి వరకూ వేచి ఉండి ఎక్కడా సుజాతకు స్థానం కల్పించకపోతే పార్టీ నుంచి బయటకు రావాలని దళిత నేతలు భావిస్తున్నారు. నిడదవోలులో అన్నదమ్ములు పోటీ పడుతుండటంతో ఎవరికి ఇవ్వాలో మీరే తేల్చుకోండని చంద్రబాబునాయుడు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఇద్దరిలో ఎవ్వరూ తగ్గకపోతే మూడో వ్యక్తికి సీటు ఇస్తానని స్పష్టం చేసినట్లు సమాచారం. సొంత అన్న కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావును వ్యతిరేకిస్తుం డడంతో నిడదవోలులో రచ్చ కొనసాగుతోంది. నరసాపురంలో సీటు తమకే దక్కుతుందని కొత్తపల్లి సుబ్బారాయుడి వర్గం ధీమాగా ఉంది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవనాయుడి వర్గంలో ఆందోళన నెలకొంది. అయినా సీఎం తనకే హామీ ఇచ్చారన్న ధీమాతో ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. పోలవరంలో కూడా మొడియం శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా ఉన్న వర్గంలోని అభ్యర్థులపై ఐవీఆర్ఎస్ సర్వేలో వారికి సానుకూలంగా రాకపోవడంతో సిట్టింగ్ వైపే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. మరోవైపు మంత్రి జవహర్ తనకు కొవ్వూరులో సీటు రాకుండా అడ్డంపడ్డ నేతలపై విరుచుకుపడ్డారు. వారు ఎంత కుటిల రాజకీయాలు చేసినా తనకు సీటు రాకుండా అడ్డుకోలేకపోయారని, తనపై నమ్మకం ఉంచిన చంద్రబాబునాయుడు తిరువూరు సీటు ఇచ్చారని చెప్పుకొచ్చారు. అయితే అక్కడ గెలుపు అంత ఈజీ కాకపోవడంతో మంత్రి వర్గం ఆందోళన చెందుతోంది. ఇంకో వైపు జనసేనలో కూడా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే యర్రా నవీన్ బయటకు వెళ్లిపోగా తాజాగా ఏలూరులో జనసేన నేత సాగర్‌బాబు కూడా పార్టీని వీడి బయటకు వచ్చారు. జనసేన సిద్ధాంతాలకు భిన్నంగా నాలుగుపార్టీలు మారిన వ్యక్తికి సీటు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. -
సీఎం ఇంటివద్దే ‘తమ్ముళ్ల’ తన్నులాట
సాక్షి, అమరావతి: ఎన్నికల వేళ అధికార తెలుగుదేశం పార్టీలో ముఠా కుమ్ములాటలు తీవ్రమయ్యాయి. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్దే తెలుగు తమ్ముళ్లు పరస్పరం ఘర్షణకు దిగారు. అరుపులు, కేకలతో తన్నులాటకు దిగగా.. ఈ ఘర్షణలో పలువురికి స్వల్ప గాయాలైనట్టు సమాచారం. శుక్రవారం ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెంట్లలో పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు, నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గాల నాయకుల సమావేశాలు జరిగాయి. ఈ నేపథ్యంలో కొవ్వూరు, నిడదవోలు సిట్టింగ్ ఎమ్మెల్యేలైన కేఎస్ జవహర్, బూరుగుపల్లి శేషారావులకు సీట్లు ఇవ్వొద్దని అక్కడి క్యాడర్, స్థానిక నాయకత్వం ఆందోళనకు దిగింది. నిడదవోలు నియోజకవర్గ సమావేశంలో ఎమ్మెల్యే అనుకూల, వ్యతిరేక వర్గాల నాయకులు ఒకరిపై ఒకరు దాడి చేసి కొట్టుకున్నట్లు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు సీటిస్తే టీడీపీ గోదారిలో కలిసిపోయినట్లేనంటూ ఆయన్ను వ్యతిరేకించే నాయకులు ఆందోళనకు దిగారు. రెండు వర్గాల నాయకులు అరుపులు, కేకలతో తన్నులాటకు దిగగా.. పలువురు నేతలకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఇసుక క్వారీల్లో బూరుగుపల్లి తీవ్ర అవినీతికి పాల్పడ్డారని, గ్రామాల్లో తమను పట్టించుకోకుండా అణచివేశారని పలువురు ఆరోపించారు. సమావేశానంతరం వారంతా టెంట్లనుంచి బయటికొచ్చి బూరుగుపల్లికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. వారిని ఆపేందుకు పరిశీలకులుగా ఉన్న పార్టీ నేతలు నానాతంటాలు పడ్డారు. సమావేశంలో జరిగిన విషయాల్ని చంద్రబాబుకు వివరిస్తామని, ప్రశాంతంగా ఉండాలని సర్దిచెప్పినా అసమ్మతివర్గం వినిపించుకోలేదు. మంత్రి జవహర్‌ను నిలదీసిన వైరివర్గం.. మరోవైపు కొవ్వూరు నియోజకవర్గంపై నిర్వహించిన సమావేశంలో మంత్రి కేఎస్ జవహర్ ఎదుటే ఆయన అసమ్మతి వర్గం ఆందోళనకు దిగింది. పరిశీలకుల ఎదుటే జవహర్‌ను నిలదీయడమేగాక.. అవినీతికి పరాకాష్టగా మారిన ఆయనకు సీటిస్తే ఓడిస్తామని పలువురు నాయకులు హెచ్చరించారు. ఇందుకు జవహర్ అనుకూల వర్గం అభ్యంతరం చెప్పడంతో గొడవ జరిగి రెండు వర్గాలు తోపులాటకు దిగాయి. పరిశీలకులు ఆపినా పట్టించుకోని కార్యకర్తలు జవహర్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. జవహర్ డౌన్ డౌన్, అవినీతిపరుడు జవహర్‌కు సీటివ్వొద్దు అంటూ నినాదాలు చేశారు. రెండు నియోజకవర్గాల సమావేశాలు రసాభాసగా మారడంతో సీఎం నివాస ప్రాంతం వద్ద గందరగోళం నెలకొంది. పోలీసులు వచ్చి ఆందోళన చేసిన వారిని అడ్డుకుని దూరంగా పంపించివేశారు. కొవ్వూరు నుంచే పోటీ చేస్తా: జవహర్ సమావేశానంతరం మంత్రి జవహర్ మీడియాతో మాట్లాడుతూ తాను మళ్లీ కొవ్వూరు నుంచే పోటీ చేస్తానని, కొందరు నాయకులు అహంకారంతో కావాలని తనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారని చెప్పారు. తనకు వ్యతిరేకంగా ఉన్నవారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. -
‘జవహర్‌కు టికెట్ ఇస్తే చిత్తుగా ఓడిస్తాం’
సాక్షి, అమరావతి : మంత్రి జవహర్‌పై సొంత పార్టీలోనే వ్యతిరేకత మొదలైంది. వచ్చే ఎన్నికల్లో మంత్రి జవహర్‌కు టికెట్ ఇస్తే చిత్తుగా ఓడిస్తామని కొవ్వూరు టీడీపీ నాయకులు పార్టీ అధిష్టానానికి తెలియజేశారు. గ్రూప్ రాజకీయాలను ప్రొత్సహిస్తూ పార్టీని నాశనం చేస్తున్నారని అధిప్టానానికి ఫిర్యాదు చేశారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతలకు జవహర్ గౌరవం ఇవ్వడంలేదని మండిపడ్డారు. బ్రాందీ షాపుల్లో పనిచేసే వారే కొవ్యూరులో పార్టీని నడుపుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జవహర్‌కు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వోద్దని అధిష్టానాన్ని కోరారు. -
కార్యకర్తచే కాళ్లు పట్టించుకున్న ఏపీ మంత్రి
ద్వారకాతిరుమల: రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి కేఎస్ జవహర్ ఓ కార్యకర్తతో కాళ్లు పట్టించుకున్న వ్యవహారంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా పోతవరం, రామసింగవరం గ్రామాల మధ్యలోని ఓ నేత ఇంట్లో శుక్రవారం జరిగిన ఈ తతంగం ఎవరికీ కనిపించనీయకుండా పార్టీ నేతలు జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా ఓ ఔత్సాహికుడు తన సెల్ఫోన్లో బంధించడంతో విషయం బయటకు పొక్కింది. దీంతో మంత్రిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే మంత్రి కాళ్లు నొక్కింది కార్యకర్త కాదని, ఫిజియోథెరపిస్టుని కొందరు నేతలు చెప్పుకొచ్చారు. చంద్రబాబు మళ్లీ సీఎం కావాలంటూ అన్నదేవరపేట నుంచి మంత్రి మొదలెట్టిన 102 కి.మీ పాదయాత్ర శుక్రవారం ద్వారకా తిరుమలకు చేరింది. -
మంత్రికి ఎసరు!
-
మంత్రులపై తుపాను బాధితుల ఆగ్రహం
వజ్రపుకొత్తూరు: తుపాను సాయంలో తీవ్ర జాప్యం చేస్తున్న సర్కారుపై ఉద్దానం ప్రజలు కన్నెర్ర చేశారు. సర్వం కోల్పోయి రోడ్డున పడితే తీరిగ్గా ఇప్పుడు వస్తారా అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. రాష్ట్ర కార్మిక, క్రీడా శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ అల్లుడు వెంకన్న చౌదరిని సోమవారం రోడ్డుపైనే అడ్డుకుని రెండు గంటల పాటు మండుటెండలో నిలబెట్టారు. అనంతరం పూండి కూడలి నుంచి రెండు కిలోమీటర్లు దూరంలో పెద్దమురహరిపురం గ్రామం వరకు నడిపించి తీసుకెళ్లారు. పూండి పరిసర ప్రాంతాలైన పీఎంపురం, సీఎంపురం, సీతంపేట, గూనాలపాడు, యూజీపురం, అమలపాడు తదితర గ్రామాల నుంచి వచ్చిన యువకులు, మహిళలు మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకుని నిలదీశారు. సీఎం డౌన్ డౌన్, మంత్రి కొల్లు రవీంద్ర, వెంకన్నచౌదరి గోబ్యాక్ అంటూ నినాదాలతో నిరసన వ్యక్తంచేశారు. అంతకుముందు బాధిత గ్రామాల ప్రజలు పూండిలోని వైఎస్సార్ కూడలి వద్ద రహదారిని దిగ్బంధించారు. ఈలోగా మంత్రి అక్కడకు చేరుకోవడంతో బాధితులంతా ఆయన కాన్వాయ్‌ని చుట్టుముట్టారు. తిత్లీ తుపాను వచ్చి ఐదు రోజులు కావస్తోంది.. బతుకులు ఛిద్రమై ఏడుస్తుంటే ఇప్పుడా మా గ్రామానికి వచ్చేది అంటూ నిలదీశారు. బాధితుల ఆగ్రహం చూసి మంత్రి నోట మాట రాలేదు. బాధితులకు హెచ్చరిక ఇదిలా ఉంటే.. బాధితులు ఓ వైపు తమ ఆవేదన వినిపిస్తుంటే వెంకన్న చౌదరి వారిని ఉద్దేశించి ‘అడ్డు తొలగుతారా.. పోలీసులను రప్పించి తొలగించమంటారా’.. అంటూ దురుసుగా ప్రవర్తించడంతో బాధితులు మరింత రెచ్చిపోయారు. తొలగించండి చూద్దాం.. అంటూ ఎదురుతిరిగారు. నష్టపరిహారం, పునరావాసంపై స్పష్టమైన హామీ ఇస్తేగానీ వదిలేది లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో మంత్రి వారితో పాటు రెండు గంటలు నడిచారు. దారిలో ఓ మహిళ చంటి బిడ్డతో ఏడుస్తూ ఆందోళన వ్యక్తంచేసింది. పాలు పట్టేందుకు పాల ప్యాకెట్లు కూడా లేవని ఆయన దృష్టికి తీసుకెళ్లింది. ఈలోగా ప్రత్యేక పోలీసు దళంతో జిల్లా ఎస్పీ త్రివిక్రమవర్మ తన సిబ్బందితో అక్కడకు చేరుకుని ఆయనకు రక్షణగా నిలిచారు. పెద్దమురహరిపురం గ్రామానికి చేరకున్న మంత్రికి గ్రామాభివృద్ధి సంఘం అధ్యక్షుడు కళిశెట్టి గోపాల్ సమస్యలు వివరించారు. అడుగడుగునా నిరసనలు మరోవైపు.. తుపాను ప్రాంతాల్లో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులకు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అడుగడుగునా నిరసనలు ఎదురవుతున్నాయి. పీఎంపురం, రెయ్యిపాడు గ్రామాల్లో రైతులు మంత్రులు, అధికారుల తీరుపై వ్యతిరేకత వ్యక్తంచేశారు. అమలపాడు, యూఆర్‌కేపురం, కంబారాయుడుపేట గ్రామాల్లో మంత్రికి నిరసనల సెగ తగిలింది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ పాత టెక్కలి మీదుగా వివిధ గ్రామాల్లో పర్యటించారు. ఆయనకూ నిరసనలు చుట్టుముట్టాయి. కష్టాల్లోనూ దాతృత్వం కాసులు కురిపించే తోటలు నేలమట్టమై పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ తమకంటే ఎక్కువ కష్టాల్లో ఉన్న పొరుగు వారిని అక్కున చేర్చుకుని తమ ఇళ్లలో ఆశ్రయం కల్పించడం ద్వారా చాలామంది రైతులు తమలోని ఔన్నత్యాన్ని చాటుకుంటున్నారు. ‘ఒకరికొకరు.. అందరికి అందరం..’ అనే మాటను వారు నిజం చేస్తున్నారు. వజ్రపుకొత్తూరు మండలం చినబైపల్లిలో ఇటీవలి తుపాను బీభత్సానికి పలు ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోగా మరికొన్ని ఇళ్ల గోడలు కూలిపోయాయి. ఈ పరిస్థితుల్లో మూడు కుటుంబాల వారు మంచాల కింద తలదాచుకుని ప్రాణాలు రక్షించుకున్నారు. గూడు కోల్పోయిన ఇలాంటి ఎనిమిది కుటుంబాల వారికి అదే గ్రామానికి చెందిన పి. మధుసూదనరావు తన ఇల్లూ దెబ్బతిన్నప్పటికీ వారికి ఆశ్రయం కల్పించారు. ‘ఇలాంటి కష్టాల్లో ఒకరికొకరు తోడూనీడలా ఉండకపోతే బతికి ఏమి ప్రయోజనం’.. అని మధుసూధనరావు భార్య ‘సాక్షి’తో అన్నారు. వీరిలాగే చాలామంది రైతులు తమ గ్రామాల్లో అనేకమందికి ఆశ్రయం కల్పించి దాతృత్వం చాటుకుంటున్నారు. మరోవైపు.. ‘మా బిడ్డ కరిష్మ విశాఖలో బి.ఫార్మసి చదువుతోంది. దసరాలోగా ఫీజులు కట్టాలని కాలేజీ వారు నోటీసులు పంపారు. తుపాను బాధితుల పిల్లలకు ప్రభుత్వమే ఫీజులు చెల్లించాలి’.. అని మధుసూదనరావు భార్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదేనా ఆదుకునే తీరు? నేను చంటి పిల్లతో ఉన్నాను. తాగేందుకు నీరులేదు. బిడ్డకు పాల ప్యాకెట్ కూడా అందలేదు. సహాయక చర్యలేవీ చేపట్టలేదు. ఏం తిని బతకాలి? కిలో టమాటా రూ.80కు.. అగ్గిపెట్టె రూ.6కు అమ్ముతున్నారు. సర్వం కోల్పోయిన వారిని ఇదేనా ఆదుకునే తీరు. ఇప్పటికే ఐదు రోజుల గడిచిపోయాయి. ఇంకా అంధకారంలోనే ఉన్నాం. మా గ్రామం వైపు చూసేవారే లేరు. – కె. రోహిణి, పీఎంపురం బియ్యం, సరుకులు ఇవ్వలేదు ఇల్లూ వాకిలి కోల్పోయి రోడ్డున పడ్డాం. రహదారులపై పడిన చెట్లను మేమే తొలగించాం. అధికారులు, ప్రజాప్రతినిధుల జాడే కరువైంది. కోట్లాది రూపాయల జీడి, కొబ్బరి చెట్లను కోల్పోయాం. చేతిలో చిల్లి గవ్వలేదు. నిత్యావసర ధరలు మండిపోతున్నాయి. అయినా మా గ్రామంలో బియ్యం, ఇతర సరుకులు పంపిణీ చేయలేదు. – ఎస్. వినోద్, పెద్దమురహరిపురం -
పవన్ ఎక్కడ పోటీ చేసినా ఓడిపోతాడు
సాక్షి, అమరావతి: సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడ పోటీ చేసినా ఓడిపోతాడని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని జోస్యం చెప్పారు. విలేకరులతో నాని మాట్లాడుతూ..వాళ్ల అన్నయ్య చిరంజీవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 18 సీట్లు మాత్రమే గెలిచారనే విషయాన్ని గుర్తు చేశారు. పవన్ కల్యాణ్ ఒక యాక్టర్, అతన్ని చూడటానికి మాత్రమే ప్రజలు వస్తారు..అంతే కానీ వాపును చూసి బలుపు అనుకోకూడదని హితవు పలికారు. పవన్ కల్యాణ్ తన బలం, బలహీనత తెలుసుకుని మాట్లాడాలని హెచ్చరించారు. మంత్రి జవహర్ మాట్లాడుతూ..పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీని కాపాడటానికే చంద్రబాబుపై పవన్ కల్యాణ్ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబును దించాలనే లక్ష్యం తప్ప, ప్రజాసమస్యల పట్ల పవన్‌కు చిత్తశుద్ధి లేదని వ్యాఖ్యానించారు. నియోజకవర్గానికి రూ.25 కోట్లు ఖర్చు పెట్టేందుకు టీడీపీ నేతలు సిద్ధంగా ఉన్నారనే పవన్ వ్యాఖ్యలు అర్ధరహితమైనవన్నారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు డబ్బులు తీసుకోవడం పవన్‌కు అలవాటుగా మారిందని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ డబ్బులు అనే యావ పవన్‌కు పట్టిందని విమర్శించారు. మూడు రోజులు ఆంధ్రాలో తిరిగి, ఎవరికీ చెప్పకుండా హైదరాబాద్‌కు చెక్కేసే పవన్‌ను ప్రజలు నమ్మే స్థితిలో లేరని వ్యాఖ్యానించారు. -
మోత్కుపల్లి.. అప్పుడెందుకు నోరు మెదపలేదు?
సాక్షి, అమరావతి : ‘మోత్కుపల్లికి గవర్నరో, రాజ్యసభ సభ్యుడు లాంటి పదవులు లేకపోయేసరికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. నీకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన పార్టీ గురించి ఇలాంటి విమర్శలు చేయడం సరికాద’ని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ పేర్కొన్నారు. మహానాడులో విలేకరులతో మాట్లాడుతూ.. ఇన్నాళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబుకి ప్రియ శిష్యుడినని ప్రకటించుకుని ఇప్పుడిలా పార్టీని విమర్శించటం సరికాదన్నారు. రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన పార్టీని విమర్శిస్తూ.. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. దళితుల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందన్నారు. జీవో నంబరు 25ను అమలు చేసి దళితులను పారిశ్రామికవేత్తలుగా నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, ఈ విషయాలేవి మోత్కుపల్లికి కనిపించడం లేదని విమర్శించారు. తెలంగాణ మంత్రివర్గంలో మహిళలకు, మాదిగలకు తగిన గుర్తింపు ఇవ్వని విషయం మోత్కుపల్లికి కనిపించడం లేదని విమర్శించారు. ఏడ్చే మగాడిని నమ్మకూడదు అనే సామెత మోత్కుపల్లి లాంటి వారిని చూసే పుట్టిందని మంత్రి ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా తల్లిలాంటి టీడీపీ పార్టీ పట్ల కృతజ్ఞతగా ఉండకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని మోత్కుపల్లిని హెచ్చరించారు. -
ఆయనకు తల్లికి, చెల్లికి తేడా తెలియనట్లుంది
సాక్షి, కడప : రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్‌కు తల్లికి, చెల్లికి తేడా తెలియనట్లుందని కడప ఎమ్మెల్యే ఎస్బీ అంజద్‌బాషా మండిపడ్డారు. వైఎస్సార్ జిల్లా కడపలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన నిన్న (శుక్రవారం) విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్పయాత్రను మంత్రి ముద్దుల యాత్రగా అభివర్ణించడంపై విరుచుకుపడ్డారు. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే బీరును హెల్త్ డ్రింక్‌గా వర్ణించిన మంత్రి నుంచి ఇంతకంటే మాటలు ఊహించలేమన్నారు. ఇలాంటి వ్యక్తి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉండటం మన దౌర్భాగ్యమన్నారు. అక్రమంగా, అన్యాయంగా సంపాదించిన సొమ్ముతో రాష్ట్రంలో చంద్రబాబు కుటుంబం మినహా ఏ ఒక్కరూ సంతృప్తిగా లేరన్నారు. జన్మభూమి కార్యక్రమాల్లో ప్రజలు అర్జీలు ఇచ్చి ఇచ్చి విసిగిపోయారన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అనారోగ్య, అవినీతి, స్కాములు, క్షుద్ర, తాంత్రిక, సెక్స్ కాల్‌మనీ ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని తూర్పారబట్టారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి : ఎమ్మెల్యే రఘురామిరెడ్డి రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయకపోతే సీఎం చరిత్రహీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు. 16 మాసాలుగా ఒక రాష్ట్ర సీఎంకు ప్రధానమంత్రి మోదీ అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే కారణం అర్థం చేసుకోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. -
ఏపీ ఎక్సైజ్ మంత్రికి తప్పిన ప్రమాదం
-
మంత్రి జవహర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖమంత్రి జవహర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. అనంతపురంలో జన్మభూమి సభ ముగించుకుని ఆయన రోడ్డు మార్గంలో కొవ్వూరు వస్తుండగా నల్లజర్ల మండలం దూబచర్ల వద్ద మంత్రి వాహనాన్ని ఓ కారు ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హానీ జరగలేదు. మంత్రి వాహనం స్వల్పంగా దెబ్బతింది. మంత్రి వాహనాన్ని ఢీకొట్టిన కారు కొవ్వూరుకు చెందిన ప్రసాద్ ది గుర్తించారు. ప్రసాద్ మద్యం సేవించి కారు నడిపిన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
'ఏపీ మంత్రి నుంచి నన్ను రక్షించండి'
-
ఏపీ మంత్రిపై టీడీపీ కార్యకర్త ఫిర్యాదు
సాక్షి, కొవ్వూరు : ఏపీ ఎక్సైజ్ శాఖమంత్రి కె.జవహర్‌పై సొంత పార్టీ కార్యకర్తే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంత్రి నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనను రక్షించాలని కోరాడు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో చోటుచేసుకున్న ఈ ఘటనకు సోషల్‌మీడియా వివాదమే కారణమని తెలుస్తోంది. దీంతో కొవ్వూరు టీడీపీలో వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. బీర్ హెల్త్ డ్రింక్ అంటూ మంత్రి జవహర్ గతంలో చేసిన వ్యాఖ్యలపై కొవ్వూరు టీడీపీ ఫేస్బుక్ పేజీలో జెడ్పీటీసీ విక్రమాదిత్య వర్గానికి చెందిన కార్యకర్తలు కామెంట్స్ పెట్టారు. ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించిన మంత్రి మాట్లాడుదామని ఇంటికి పిలిచి చేయి చేసుకున్నారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సత్యేంద్రప్రసాద్ అనే కార్యకర్త మంత్రి జవహర్ నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పార్టీలోని అక్రమాలను ప్రశ్నించినందుకు తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పుడుతున్నారని, అనవసర కేసుల్లో ఇరికిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. మంత్రిగారు తనపై చేయి చేసుకోవడమే కాకుండా చంపుతానని బెదిరించాడని సత్యేంద్రప్రసాద్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. -
అన్ని దేవాలయాలూ ఒక్కటి కాదు
సాక్షి, రాజమహేంద్రవరం: రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు ఒక్కటి కాదని, దేవాదాయశాఖ ఆధ్వర్యంలోని దేవాలయాలకు మాత్రమే 100 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేసేలా చట్టంలో ఉందని ఎక్సైజ్‌శాఖ మంత్రి కె.ఎస్.జవహర్ చెప్పారు. దేవాదాయశాఖ పరిధిలో లేని దేవాలయాల వద్ద మద్యం దుకాణాలు ఏర్పాటు చేయకూడదన్న నిబంధన చట్టంలో లేదని స్పష్టం చేశారు. వచ్చేనెల 1వ తేదీ నుంచి అమలు చేయబోయే నూతన కల్లుగీత(ట్యాడీ) పాలసీపై 13 జిల్లాల గీత కార్మిక సంఘాలతో ఆయన శనివారం తూర్పుగోదావరి జిల్లా రాజమõßహేంద్రవరంలో సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మద్యాన్ని ఆదాయ వనరుగా చూడట్లేదని, ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా తమ ప్రభుత్వం నూతన పాలసీని ప్రవేశపెట్టిందని చెప్పారు. రాష్ట్రంలో ప్రజల విజ్ఞప్తి మేరకు 600 దుకాణాలను తరలించామన్నారు. మద్యం దుకాణాలు వద్దని చేసే ఉద్యమాల్లో సగం డబ్బులిచ్చి(పెయిడ్ ఈవెంట్స్) చేయిస్తున్నవేనని మంత్రి వ్యాఖ్యానించారు. మద్యం దుకాణం పర్మిట్ రూం 50 చదరపు మీటర్లకు మించి ఎంతైనా ఉండొచ్చని ఓ ప్రశ్నకు జవాబుగా ఆయన చెప్పారు. విశాఖ మన్యంలోని ఆరు మండలాల్లో గంజాయి సాగు నియంత్రణపై దృష్టి పెట్టామని మంత్రి తెలిపారు. త్వరలో 500 మందితో ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని బలోపేతం చేస్తామన్నారు. గీత కార్మికుల వినతులపై చర్చించి వచ్చేనెల 1 నుంచి ఐదేళ్ల కాలపరిమితికి కల్లుగీత పాలసీని అమలు చేస్తామన్నారు. కేరళ, మహారాష్ట్రల్లో ఈత కల్లు నిల్వ చేస్తున్న విధానంపై అధ్యయనానికి ప్రత్యేక బృందాన్ని పంపిస్తామని తెలిపారు. రాష్ట్రంలో నీరా తయారీకి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. తాడిచెట్టుతోపాటు ఈత, కొబ్బరిచెట్లపై నుంచి ప్రమాదవశాత్తు పడిన కార్మికుడికి బీమా అందించేలా నూతన పాలసీలో మార్పులు చేస్తామని తెలిపారు. సమావేశంలో ఎౖMð్సజ్ శాఖ కమిషనర్ లక్ష్మీ నరసింహం, తూర్పుగోదావరి జిల్లా డీసీ అరుణారావు, ఎన్ఫోర్స్మెంట్ ఏసీ హేమంత్ నాగరాజు, రాజమహేంద్రవరం ఈఎస్ సూర్జిత్‌సింగ్ పాల్గొన్నారు. -
కేసీఆర్‌పై మందకృష్ణ ఎందుకు పోరాడటం లేదు..
అమరావతి: తెలంగాణలో దళితుల సమస్యలపై , దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేసిన కేసీఆర్ పై మందకృష్ణ ఎందుకు పోరాటం చేయడం లేదని ఏపీ మంత్రి జవహర్ ప్రశ్నించారు. విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ వచ్చిన తర్వాతే మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత వచ్చిందన్నారు. టీడీపీ మాత్రమే మాదిగలకు న్యాయం చేస్తుందని తెలిపారు. వర్గీకరణ అంశం మా చేతుల్లో లేదని , చట్టప్రకారం దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మద్యం అమ్మకాల్లో ఎటువంటి అక్రమాలు జరిగినా సహించేది లేదని సీఎం చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్పారని వివరించారు. సుప్రీం కోర్టు నిబంధనల మేరకే షాపులు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. మద్యం షాపులకు దేవుళ్ల పేర్లు పెట్టొద్దని, కేవలం రిజిస్ట్రేషన్స్ లో పేర్లు పెట్టుకోవచ్చునని సూచించారు. మహిళలకు ఎక్కడైనా సమస్యలుంటే తనకు నేరుగా 9951314101 అనే నెంబర్‌కు ఫోన్ చేయవచ్చన్నారు. మద్యం కల్తీకి పాల్పడితే టాడా కేసులు పెడతామని హెచ్చరించారు. -
మంత్రి వ్యాఖ్యలపై మహిళల కన్నెర్ర
♦ బీర్‌ను హెల్త్ డ్రింక్ అన్న మంత్రి జవహర్ ♦ మండిపడుతున్ననారీ సంఘాలు ♦ మెడికల్ షాపుల్లో కూడా బీర్ అమ్ముతారా? ♦ విద్యార్థులకు ఏం సందేశం ఇస్తున్నారు ? ♦ ఉద్యమించడానికి సన్నద్ధం సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఒక పక్క మద్యాన్ని ఆదాయ వనరుగా చూడటం లేదని పదేపదే చెబుతున్న మంత్రి జవహర్ మరోవైపు బీరును హెల్త్ డ్రింక్‌గా ప్రమోట్ చేస్తామన్న వ్యాఖ్యలపై మహిళా లోకం మండిపడుతోంది. మెడికల్ షాపుల్లో కూడా బీరు అమ్ముతారా అని ప్రశ్నిస్తోంది. గౌరవప్రద ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన మంత్రి బీరును హెల్త్‌డ్రింక్‌గా చెప్పడం ద్వారా విద్యార్థులకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఆదాయం కోసం ఎంతకైనా దిగజారడం ఈ ప్రభుత్వానికే చెల్లిందని మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే యువత మద్యానికి బానిస అవుతుంటే ప్రభుత్వమే హెల్త్ డ్రింక్ అంటూ బీరును ప్రమోట్ చేయడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే ఇళ్ల మద్యన మద్యం దుకాణాలపై ఉద్యమిస్తున్న వారిపై కేసులు పెట్టడాన్ని మహిళా సంఘాలు తప్పు పడుతున్నాయి. మద్యం పాలసీపై ప్రభుత్వం వెనక్కి తగ్గని పక్షంలో ఉద్యమించడానికి మహిళా సంఘాలు సన్నద్దం అవుతున్నాయి. ఇప్పటికే సుప్రీం కోర్టు నిబంధనలను తప్పించుకోవడం కోసం జాతీయ రహదారులను రాష్ట్ర రహదారులుగా మార్చడం, రాష్ట్ర రహదారులను మున్సిపల్, అర్బన్ రహదారులుగా మార్పులు చేయడం ఆదాయం కోసం కాకపోతే మరెందుకని వారు నిలదీస్తున్నారు. గ్రామాల్లో ఇళ్ల మధ్యన మద్యం దుకాణాల ఏర్పాటుపై మంగళవారం కూడా ఆందోళనలు జరిగాయి. చింతలపూడి మండలంలోని భట్టువారిగూడెం, రాఘవాపురం గ్రామాల్లో జనావాసాల మధ్య మద్యం దుకాణాలను తొలగించాలని ఆందోళనలు జరిపారు. భట్టువారిగూడెంలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణం వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్యం సేవించిన వారు తమ ఇళ్ళకు వచ్చి తలుపులు కొడుతున్నారని గ్లాసులు కావాలని అడుగుతున్నారని వాపోయారు. రాఘవాపురం గ్రామంలో మద్యం దుకాణాన్ని తరలించాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. చింతలపూడి –సత్తుపల్లి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. శివాలయం సమీపంలో ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం వద్ద మద్యం దుకాణం పెడుతున్నారని ఆరోపించారు. మొగల్తూరు పంచాయతీ కాలువరోడ్డులో మద్యం దుకాణం ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. పెనుగొండ మండలం సిద్ధాంతం గోదావరి రోడ్డులో మద్యం దుకాణ ఏర్పాటు వ్యతిరేకిస్తూ మహిళలు నిరశన కొనసాగిస్తున్నారు. మంగళవారం ఉదయం మరోసారి నిరశన కార్యక్రమాలు చేపట్టారు. పుణ్యక్షేత్రానికి వెళ్లే దారిలోనూ ఇబ్బందులు ఎదురవుతాయంటూ నిరశన వ్యక్తం చేశారు. ఉదయం సిద్ధాంతంలో ర్యాలీ నిర్వహించి మద్యం దుకాణానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మద్యం దుకాణం ఏర్పాటు చేయకుండా పంచాయతీ తీర్మానం చేయాలంటూ సర్పంచ్ బిరుదగంటి రత్నరాజుకు వినతిపత్రం అందించారు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చి ఇలాగేనా మాట్లాడేది..? పోడూరు : ‘బీరు’ను హెల్త్ డ్రింక్‌గా ప్రమోట్ చేస్తానని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి కేఎస్.జవహార్ చేసిన వాఖ్యలను మహిళాలోకం తీవ్రస్థాయిలో ఖండిస్తోంది. మంత్రిస్థాయి నేత ఇటువంటి వాఖ్యలు చేయడం చూస్తోంటే ఈ ప్రభుత్వం సమాజాన్ని ఎటువైపు నడిపిచాలనుకుంటోందని మహిళలు ఆగ్రహావేశాలతో మండి పడుతున్నారు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తి ని చేపట్టిన మంత్రి జవహార్ ఇలాగేనా మాట్లాడేది...పిల్లలకు ఇలాగే పాఠాలు చెప్పారా...?అని పలువురు మహిళలు, మహిళా ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. సిగ్గు చేటు.., బీరు హెల్త్ డ్రింక్ గా ప్రమోట్ చేస్తానని సాక్షాత్తూ ఎక్సైజ్ మంత్రి పేర్కొనడం సిగ్గుచేటు. పేద, మధ్య తరగతికి చెందిన లక్షలాది మంది మద్యానికి బానిసలు కావడంతో వారి కుటుంబాలు ఆర్ధికంగా చితికి చిన్నాభిన్నమవుతున్నాయి. ఎక్సైజ్‌శాఖ మంత్రి చేసిన వాఖ్యలు లక్షలాదిమందిని మద్యానికి బానిసలుగా మార్చే విధంగా ఉన్నాయి. – గుంటూరి వాణి పెద్దిరాజు, ఎంపీపీ, పోడూరు బాధాకరం రాష్ట్ర ఎక్సైజ్ మంత్రే ఇటువంటి వాఖ్యలు చేయడం చాలా బాధాకరం. రాష్ట్రంలో మద్యం అమ్మకాలను విపరీతంగా పెంచుకుని ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా మంత్రి వాఖ్యలు కనబడుతున్నాయి. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తి నుంచి మంత్రి స్థాయికి వచ్చిన నాయకుడు ఇలా మాట్లాడటం ఆందోళనకరమైన విషయం. మంత్రి తన వాఖ్యలను ఉపసంహరించుకోవాలి. – కుడిపూడి నాగలక్ష్మి, ఎంపీటీసీ, గుమ్మలూరు మద్యానికి బానిసలను చేస్తున్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మద్యానికి బానిసలుగా చేసి వారిని నిర్వీర్యం చేస్తోంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ మద్యాన్ని ఆరోగ్య పానీయంగా పేర్కొనడం విడ్డూరం. పురుషులకు మద్యాన్ని అలవాటు చేసి వారి కుటుంబాలను తిరోగమనంలోకి నెట్టేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన మద్యం దుకాణాలు ఉండకూడదని సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే దానినుంచి తప్పించుకోవడానికి ఆ రహదార్లను ప్రాంతీయ రహదార్లుగా మార్చాలని నిర్ణయించటం మద్య నియంత్రణపై చంద్రబాబు చిత్తశుద్ధి ఏ పాటిదో తెలుపుతోంది. బీరుపై బాధ్యతారహిత వ్యాఖ్యానం చేసిన మంత్రి జవహర్‌ను పదవి నుంచి తొలగించాలి. ఇళ్లు, ప్రార్థనా మందిరాల చెంత మద్యం దుకాణాల ఏర్పాటును మహిళలు, స్థానికులు అడ్డుకుంటున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం దారుణం. – పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ -
మంత్రి జవహర్ వ్యాఖ్యలపై దుమారం
అమరావతి: ఆంధ్రపద్రేశ్ ఎక్సైజ్ మంత్రి కేఎస్ జవహర్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. బీరును హెల్త్ డ్రింక్‌గా ప్రమోట్ చేస్తున్నామని ఆయన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కావాలంటే బీరు హెల్త్ డ్రింక్ అని నిరూపిస్తానంటూ మంత్రి సవాల్ చేయటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలుచోట్ల నిరసనలు చేపట్టారు. సాక్షాత్తూ ఎక్సైజ్ మంత్రికి బీరు హెల్దీ డ్రింక్‌గా కనిపిస్తుందా? ఏం మాట్లాడుతున్నారో ఆయనకు అర్థం అవుతుందా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. కాగా మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా చూడబోమని ఓ వైపు చెబుతూనే మరోవైపు బీరును హెల్త్ డ్రింక్‌గా ప్రమోట్ చేస్తున్నామని మంత్రి కేఎస్ జవహర్ పేర్కొనడాన్ని బట్టి చూస్తే ప్రభుత్వం ఉద్దేశ్యం ఏంటో ఇట్టే అర్ధమవుతుంది. -
హెల్త్ డ్రింక్‌గా బీరు: మంత్రి జవహర్
-
హెల్త్ డ్రింక్‌గా బీరు: మంత్రి జవహర్
సాక్షి, అమరావతి: మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా చూడబోమని ఓ వైపు చెబుతూనే మరోవైపు పూటుగా మద్యం తాగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. బీరును హెల్త్ డ్రింక్‌గా ప్రమోట్ చేస్తున్నామని సాక్షాత్తూ ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ పేర్కొనడాన్ని బట్టి చూస్తే ప్రభుత్వం ఉద్దేశ్యం ఏంటో ఇట్టే అర్ధమవుతుంది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం రోడ్ల వెంబడి నగరాల్లో, పట్టణాల్లో మద్యం షాపుల ఏర్పాటు వీలు కాకపోవడంతో రోడ్లను డీ నోటిఫై చేయనున్నామని, బైపాస్ రోడ్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించి పూర్తి విధి విధానాలపై మంగళవారం జీవో జారీ కానుందని ఎక్సైజ్ మంత్రి కేఎస్ జవహర్ తెలిపారు. -
ఉపాధ్యాయులు బాధ్యతగా ఉండాలి
సాక్షి ప్రతినిధి, ఏలూరు : క్రమశిక్షణ, నిబద్ధత వంటి పర్యాయ పదాలకు నిర్వచనమైన ఉపాధ్యాయులు సామాజిక బాధ్యత, స్పృహ కలిగి ఉండాలని ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ సూచించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు కేటాయించవలసిన సమయం వారికి వినియోగించకుండా అవమానాల పాలుకావద్దని హితవు పలికారు. బయోమెట్రిక్ హాజరు అమలుపై మంత్రి మాట్లాడుతూ ఉపాధ్యాయులను సమయానికి బడికి వెళ్లమనడం తప్పా అని ప్రశ్నించారు. ప్రతి శనివారం మీ ఊరు– మీ మంత్రి కింద నియోజకవర్గంలో అందుబాటులో ఉంటానని చెప్పారు. శాసనమండలి సభ్యులు రాము సూర్యారావు మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోరే వ్యక్తి జవహర్ అని పేర్కొన్నారు. డీఈవో ఆర్ఎస్ గంగా భవానీ మాట్లాడుతూ ఉపాధ్యాయుల అభ్యున్నతికి మంత్రి జవహర్ మార్గదర్శకులుగా నిలుస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సాల్మన్ రాజు మాట్లాడుతూ 1997లో ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన మంత్రి ఎప్పటికప్పుడు ఉపాధ్యాయుల సమస్యలపై స్పందిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేసేవారన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా ఏపీటీఎఫ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో ముందుకు వెళ్లారన్నారు. సమావేశంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పి.వెంకటేశ్వరరావు, ఎన్ టీయూ జిల్లా అధ్యక్షుడు డి.ప్రసాదరాజు, ఏపీటీఎఫ్–1938 జిల్లా అధ్యక్షుడు గుగ్గులోతు కృష్ణ, జేఏసీ జిల్లా కార్యదర్శి చోడగిరి శ్రీనివాస్, ఏపీఎన్ జీవో సంఘ ఉపాధ్యక్షుడు రమేష్, ఆర్‌యూపీపీ జిల్లా అ«ధ్యక్షుడు టి.గిరిరాజు, వైఎస్సార్ సీపీ ఉపాధ్యాయ సంఘ నాయకులు సుధీర్, టీఎన్ యూఎస్ జిల్లా అధ్యక్షుడు టీవీ రామకృష్ణ, ఇతర సంఘాల నాయకులు మాట్లాడారు. అనంతరం మంత్రి జవహర్ దంపతులను వివిధ ఉపాధ్యాయ సంఘాలు ఘనంగా సత్కరించాయి. డిప్యూటీ డీఈవో డి. ఉదయ్‌కుమార్, సర్వశిక్షాభియాన్ సీఎంవో రూజ్వెల్ట్ పాల్గొన్నారు. -
శివప్రసాద్ వ్యాఖ్యలపై జవహర్ ఆగ్రహం
ఏలూరు: ఎంపీ శివప్రసాద్ వ్యాఖ్యలపై మంత్రి జవహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులోని జెడ్పీ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతిలో అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేసేందుకు, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు రూ. 75 కోట్లు కేటాయించి దళితుల పట్ల తనకున్న ప్రేమను సీఎం చంద్రబాబు చాటుకున్నారన్నారు. ప్రాంతాలవారీగా పదవులు ఇచ్చారనడం శివప్రసాద్ అజ్ఞానానికి నిదర్శనమన్నారు. సీనియర్ నాయకుడిగా ఉన్న శివప్రసాద్ పార్టీని అప్రదిష్టపాలు చేస్తున్నారన్నారు. శివప్రసాద్ వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని జవహర్ చెప్పారు.