
ద్వారకాతిరుమల: రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి కేఎస్ జవహర్ ఓ కార్యకర్తతో కాళ్లు పట్టించుకున్న వ్యవహారంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా పోతవరం, రామసింగవరం గ్రామాల మధ్యలోని ఓ నేత ఇంట్లో శుక్రవారం జరిగిన ఈ తతంగం ఎవరికీ కనిపించనీయకుండా పార్టీ నేతలు జాగ్రత్తలు తీసుకున్నారు.
అయినా ఓ ఔత్సాహికుడు తన సెల్‌ఫోన్‌లో బంధించడంతో విషయం బయటకు పొక్కింది. దీంతో మంత్రిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే మంత్రి కాళ్లు నొక్కింది కార్యకర్త కాదని, ఫిజియోథెరపిస్టుని కొందరు నేతలు చెప్పుకొచ్చారు. చంద్రబాబు మళ్లీ సీఎం కావాలంటూ అన్నదేవరపేట నుంచి మంత్రి మొదలెట్టిన 102 కి.మీ పాదయాత్ర శుక్రవారం ద్వారకా తిరుమలకు చేరింది.