Excise Minister
-
ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర.. యూట్యూబర్‌పై మంత్రి కన్నెర్ర
సాక్షి,చైన్నె: యూట్యూబర్ ఎస్ శంకర్‌పై విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ కన్నెర్ర చేశారు. ఆయనపై ఏకంగా నాలుగు పరువు నష్టం దావాలను సోమవారం సైదాపేట కోర్టులో దాఖలు చేశారు. శంకర్ తనకు వ్యతిరేకంగా పదే పదే వీడియోలను విడుదల చేస్తూ వస్తున్నారని ఆ పిటిషన్లలో మంత్రి వివరించారు. మహారాష్ట్ర తరహాలో తమిళనాడులో ప్రభుత్వాన్ని కూల్చేందుకు తానేదో కుట్ర చేస్తున్నట్లుగా శంకర్ ఆధార రహిత ఆరోపణలు చేస్తున్నట్లు పేర్కొన్నా రు. అలాగే, తాను టాస్మాక్బార్లను నిర్వహిస్తున్నట్లు ఆరోపించారని తెలిపారు. ఆధార రహిత ఆరోపణలు చేయడమే కాకుండా డీఎంకే అధిష్టానం తనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తప్పుడు సమాచారం ప్రజలకు అందజేస్తూ వస్తున్నాడని వివరించారు. తన పేరుకు, పరు వుకు కలంకం తెచ్చే విధంగా వ్యవహరిస్తున్న శంకర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ మేరకు కోర్టును కోరారు. -
బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవు: మంత్రి శ్రీనివాస్ గౌడ్
సాక్షి, హైదరాబాద్: ప్రశ్నించే వారిని అణచి వేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, ఇతర రాష్ట్రాల్లో మాదిరి తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. దేశాన్ని ప్రమాదంలోకి నెట్టివేస్తున్న బీజేపీ నేతల మాటలు నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేర న్నారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో కలసి సోమవారం ఆయన టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేవలం ఒకరిద్దరు వ్యాపారుల కోసమే పనిచేస్తూ, ఏ వర్గానికీ కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థల అమ్మకం ద్వారా రిజర్వేషన్ల ఎత్తివేతకు కేంద్రం కుట్ర పన్నిందని, బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల కొనుగోలు, ప్రభుత్వాలను కూల్చడమే ఎజెండాగా పనిచేస్తోందని ధ్వజమెత్తారు. భోజనాలు చేసినంత మాత్రాన ఒరిగేదేమీ లేదు బీజేపీ నేతలు తెలంగాణకు వచ్చి భోజనాలు చేసినంత మాత్రాన ఒరిగేదేమీ లేదని, మహబూబ్‌నగర్‌లో కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే 2 రోజుల పర్యటనతో ఇదే విషయం స్పష్టమైందని శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. జిల్లా స్థితిగతులు తెలుసుకోకుండా కేంద్ర మంత్రి విమర్శలు చేశారని, కేసీఆర్ పాలనలోనే పాలమూరు జిల్లా దశ మారిందని స్పష్టం చేశారు. తెలంగాణకు కేసీఆర్ ఏం చేశారో తెలుసుకునేందుకు బీజేపీ నేతలు గ్రామాల్లో పర్యటించాలని ఎమ్మెల్యే అంజయ్య అన్నారు. వ్యవసాయం గురించి మాట్లాడే హక్కు బీజేపీ నేతలకు లేదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం అసాధ్యమన్నారు. ఇదీ చదవండి: దేవుళ్లను రాజకీయాల్లోకి లాగొద్దు: మంత్రి తలసాని -
డిప్యూటీ సీఎంగా నారాయణ స్వామి బాధ్యతలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా నారాయణస్వామి బాధ్యతలు చేపట్టారు. సచివాలయం నాలుగో బ్లాక్‌లోని ఆయన చాంబర్లో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఎక్సైజ్‌శాఖలో ఇటీవల మరణించిన ఇద్దరు ఉద్యోగులకు సంబంధించిన మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేస్తూ మొదటి సంతకం చేశారు. తమది బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వమని... ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలతో తామంతా ముందుకెళ్తామన్నారు. చదవండి: ఉంగరం దొంగలు మీరేనా? రాజకీయ నేపథ్యం: 1981లో చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం అన్నూరు సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1981–86 వరకు కార్వేటినగరం సమితి ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 1987లో కార్వేటినగరం మండలాధ్యక్షుడు అయ్యారు. 1989–94 వరకు పీసీసీ సభ్యుడిగా వ్యవహరించారు. 1994, 1999ల్లో సత్యవేడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసి ఓటమిపాలయ్యారు. 2004లో సత్యవేడు నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో ఓటమి చెందారు. 2014, 2019 ఎన్నికల్లో గంగాధరనెల్లూరు నుంచి వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 నుంచి 2022 వరకు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు రెండోసారి మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. -
తెలంగాణ: మద్యం షాపుల లైసెన్స్‌ల పొడిగింపు లేనట్టే!
సాక్షి, హైదరాబాద్: అక్టోబర్ 31తో ముగియనున్న రాష్ట్రంలోని మద్యం దుకాణాల లైసెన్స్‌ల గడువును మరికొంతకాలం పొడిగించాలని మద్యం షాపుల యజమానులు చేసిన విజ్ఞప్తి పట్ల రాష్ట్ర ప్రభుత్వం విముఖతతో ఉన్నట్లు తెలుస్తోంది. నవంబర్ 1 నుంచి రానున్న రెండేళ్ల కాలానికి కొత్త ఎక్సైజ్ విధానాన్ని తీసుకొచ్చి లాటరీ ద్వారా కొత్తగా లైసెన్స్‌లు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అదేవిధంగా సెప్టెంబర్ 30తో ముగియనున్న బార్ షాపుల లైసెన్స్‌లకు ఫీజు కట్టించుకుని పునరుద్ధరించే అవకాశాలున్నాయి. ఎక్సైజ్ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ గురువారం నిర్వహించిన సమీక్షలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కొత్త ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన విధివిధానాలపై ఈ సమీక్షలో చర్చించారు. లాక్డౌన్ కారణంగా 80 రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడటంతో తీవ్రంగా నష్టపోయామని, మరో మూడు లేదా ఆరు నెలల పాటు లైసెన్స్‌ల గడువు పొడిగించాలని మద్యం షాపుల యజమానులు చేసిన విజ్ఞప్తిని సమావేశంలో చర్చించగా..దీనిపై విముఖత వ్యక్తమైంది. అయితే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో చర్చించి దీనిపై తుదినిర్ణయం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే దరఖాస్తులతో పాటు లైసెన్స్ ఫీజుల పెంపు విషయాన్ని సైతం సీఎంతో చర్చించిన తర్వాతే ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమీక్షలో ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు కమిషనర్ అజయ్ రావు, డిప్యూటీ కమిషనర్ హరికిషన్ పాల్గొన్నారు. -
‘అక్రమ మద్యం వెనుక చంద్రబాబు హస్తం ఉందనే అనుమానం’
సాక్షి, అమరావతి: ప్రజల ఆరోగ్యం దృష్ట్యా దశల వారీగా మద్యపాన నిషేధం విధిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి తెలిపారు. కాగా, బెల్ట్‌షాపులు పెట్టి మద్యం విక్రయాలను ప్రోత్సహించింది ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడేనని విమర్శించారు. అసలు మద్య నియంత్రణ అనేది చంద్రబాబుకు ఇష్టం లేదని తెలిపారు. అక్రమ మద్యం సరఫరా వెనుక చంద్రబాబు ఉన్నారనే అనుమానం ఉందని నారాయణ స్వామి ఆరోపించారు. -
అక్రమ ప్రాజెక్టులు ఆపండి, మాపైనే నిందలా
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘‘కృష్ణానదిపై ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను ఆపాలని మేం అంటున్నాం. కానీ తెలంగాణలో ఉన్న సీమాంధ్రులు ఇబ్బందులు పడతారన్న ఉద్దేశంతోనే తాము ఎక్కువగా మాట్లాడడం లేదని ఏపీ సీఎం, మంత్రులు అనడం విచారకరం. తెలంగాణ ఏర్పాటయ్యాక హైదరాబాద్‌లోగానీ, ఇతర ప్రాంతాల్లో గానీ నివసిస్తున్న సీమాంధ్రులు ఎక్కడైనా ఇబ్బందులు పడ్డారా? రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాల్లో ఇబ్బందులు పడ్డామని ఎవరైనా అన్నారా? ట్యాంక్ బండ్‌పై ఉన్న ఏ ఒక్క సీమాంధ్ర నాయకుడి విగ్రహాన్ని అయినా తొలగించామా? తెలంగాణలో ఉన్న సీమాంధ్రులను ఇక్కడివారు కలుపుకొని పోయి.. వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ ఏపీలో మమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. టీఎస్ ఆర్టీసీ బస్సులను అక్కడి స్టేషన్లలో ఆపనివ్వలేదు. తిరుపతిలో ఓ అధికారి మమ్మల్ని అవమాన పరిచిన ఘటన కూడా ఉంది..’’అని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. గురువారం మహబూబ్‌నగర్ కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ పాలమూరును ఎడారి చేసేలా అక్రమ ప్రాజెక్టులతో నీటిని దోచుకెళ్లే ప్రయత్నం చేస్తోందని, పైగా తెలంగాణపై నిందలు మోపుతోందని శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. పొరుగు రాష్ట్రాలతో సుహృద్భావ వాతావరణం ఉండాలనేదే సీఎం కేసీఆర్ సంకల్పమని.. మహారాష్ట్రకు నష్టం వాటిల్లకుండా వారిని ఒప్పించి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశామని చెప్పారు. ఏపీ కూడా అలాగే పైన ఉన్న వారికి ఇబ్బంది కలగకుండా చూసుకుంటుందని భావించామన్నారు. శ్రీశైలం పూర్తిగా విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు అని, అలాంటిది విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఇంత రాద్ధాంతం ఎందుకని ప్రశ్నించారు. -
పైడి జయరాజ్ సేవలు మరువలేనివి
‘‘తెలంగాణ ముద్దుబిడ్డ, తొలి తరం ఇండియన్ సూపర్ స్టార్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుగ్రహీత పైడి జయరాజ్ భారతీయ సినిమాకు అందించిన సేవలు మరువలేనివి. ఆయన పేరు తెలుగు చిత్ర పరిశ్రమలో మరింత మారుమ్రోగేందుకు నా వంతు కృషి చేస్తా’’ అని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పైడి జయరాజ్ 111వ జయంతి ఉత్సవాలు హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ‘జై తెలంగాణ ఫిల్మ్ జేఏసీ’ చైర్మన్ పంజాల జైహింద్ గౌడ్ సారధ్యంలో జరిగాయి. ఈ సందర్భంగా పంజాల జైహింద్ గౌడ్ మాట్లాడుతూ– ‘‘తెలంగాణ లో సినిమా పరిశ్రమకు ఇచ్చే అవార్డులు పైడి జయరాజ్ పేరిట ఇవ్వాలి. అంతేకాకుండా హైదరాబాద్–కరీంనగర్ హైవేకి పైడి జయరాజ్ హైవేగా నామకరణం చేయాలి’’ అని డిమాండ్ చేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనవడు ఎన్.వి. సుభాష్, ఎం.ఎల్.సి. నారపురాజు రామచంద్రరావు, నటుడు బాబూమోహన్, ‘తెలుగు నిర్మాతల మండలి’ ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్, ‘ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్’ అధ్యక్షులు మోహన్ గౌడ్, హీరో పంజాల శ్రావణ్ కుమార్ గౌడ్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. -
అంత్యక్రియల్లో పాల్గొంటే కరోనా రాదు
సాక్షి, పాలమూరు : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో సోమవారం కరోనాతో మృతి చెందిన ఓ వ్యక్తి అంత్యక్రియల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. ఈ వైరస్‌పై భయపడుతున్న వారందరికీ భరోసా కలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనాతో మృత్యువాత పడిన వారి అంతిమ సంస్కారాలకు కుటుంబసభ్యులు సైతం ముందుకు రాకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం నిర్వహించినంత మాత్రాన కరోనా సోకదన్నారు. హైదరాబాద్‌లోని గాంధీ తదితర ఆస్పత్రుల్లో మృతి చెందిన రోగులను వారి పిల్లలే తీసుకెళ్లడానికి ముందుకు రాకపోవడం చూస్తుంటే మానవత్వం మంటగలుస్తోందన్నారు. కోవిడ్ నిబంధనల ప్రకారం ఐదుగురి నుంచి పది మంది వరకు పీపీఈ కిట్లు వేసుకుని అంత్యక్రియల్లో పాల్గొనవచ్చన్నారు. ఈ సందేశాన్ని అందరికీ చేరవేయాలనే ఉద్దేశంతో ఓ ప్రముఖుడి అంత్యక్రియలకు హాజరయ్యానన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా ఆప్తులకు అంతిమ సంస్కారాలు నిర్వహించాలన్నారు. -
బెల్ట్ షాపుల వెనుక టీడీపీ ముఖ్య నేతలు ఉన్నారు
-
తాటి, ఈత చెట్లను నరికితే నాన్ బెయిలబుల్ కేసులు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో తాటి, ఈత చెట్లను అక్రమంగా నరికేవారిపై సెక్షన్ 27, ఆబ్కారీ చట్టం 1968 ప్రకారం నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశిం చారు. రియల్ ఎస్టేట్ సంస్థలు లేఅవుట్ల పేరు తో తాటి, ఈత చెట్లను నరికి వేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వచ్చిన వినతులపై ఆయన ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. చెట్లను నరికివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. -
కార్యకర్తచే కాళ్లు పట్టించుకున్న ఏపీ మంత్రి
ద్వారకాతిరుమల: రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి కేఎస్ జవహర్ ఓ కార్యకర్తతో కాళ్లు పట్టించుకున్న వ్యవహారంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా పోతవరం, రామసింగవరం గ్రామాల మధ్యలోని ఓ నేత ఇంట్లో శుక్రవారం జరిగిన ఈ తతంగం ఎవరికీ కనిపించనీయకుండా పార్టీ నేతలు జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా ఓ ఔత్సాహికుడు తన సెల్ఫోన్లో బంధించడంతో విషయం బయటకు పొక్కింది. దీంతో మంత్రిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే మంత్రి కాళ్లు నొక్కింది కార్యకర్త కాదని, ఫిజియోథెరపిస్టుని కొందరు నేతలు చెప్పుకొచ్చారు. చంద్రబాబు మళ్లీ సీఎం కావాలంటూ అన్నదేవరపేట నుంచి మంత్రి మొదలెట్టిన 102 కి.మీ పాదయాత్ర శుక్రవారం ద్వారకా తిరుమలకు చేరింది. -
ఏపీ ఎక్సైజ్ మంత్రికి తప్పిన ప్రమాదం
-
మంత్రి జవహర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖమంత్రి జవహర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. అనంతపురంలో జన్మభూమి సభ ముగించుకుని ఆయన రోడ్డు మార్గంలో కొవ్వూరు వస్తుండగా నల్లజర్ల మండలం దూబచర్ల వద్ద మంత్రి వాహనాన్ని ఓ కారు ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హానీ జరగలేదు. మంత్రి వాహనం స్వల్పంగా దెబ్బతింది. మంత్రి వాహనాన్ని ఢీకొట్టిన కారు కొవ్వూరుకు చెందిన ప్రసాద్ ది గుర్తించారు. ప్రసాద్ మద్యం సేవించి కారు నడిపిన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నేడు మంత్రి కొల్లు రవీంద్ర రాక
అనంతపురం అర్బన్ : బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం జిల్లాకు విచ్చేస్తున్నారు. ఉదయం 6 గంటలకు అనంతపురం చేరుకుని 10.30 వరకు ఆర్అండ్బి అతిథి గహంలో బసచేస్తారు. అనంతరం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగే జిల్లా పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. 1.15 గంటలకు రోడ్డు మార్గంలో రాయదుర్గం చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన నీరు– చెట్టు కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం ఆరు గంటలకు రోడ్డు మార్గంలో హైదరాబాద్ బయలుదేరి వెళతారు. -
మచిలీపట్నం పోర్టుకు త్వరలో భూ సమీకరణ
- 12 వేల ఎకరాల సమీకరణ - 15 మంది డిప్యూటీ కలెక్టర్లకు త్వరలో బాధ్యతలు - మద్య నియంత్రణకు ఐదు శాఖలతో కమిటీః మంత్రి కొల్లు హైదరాబాద్ మచిలీపట్నం పోర్టుకు త్వరలో భూ సమీకరణ నోటిఫికేషన్ జారీ చేస్తామని, నెలన్నరలోగా భూ సమీకరణ కార్యక్రమాలు ప్రారంభిస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. భూ సమీకరణ కార్యక్రమాల్ని పరిశీలించేందుకు మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (మాడ) ఏర్పాటు చేశామన్నారు. సోమవారం సచివాలయంలో మంత్రి కొల్లు మీడియాతో మాట్లాడారు. పోర్టుకు అవసరమైన 12 వేల ఎకరాలను సమీకరించేందుకు 15 మంది డిప్యూటీ కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించనున్నామన్నారు. మచిలీపట్నం పోర్టును అధునాతనంగా, కంటెయినర్ పోర్టుగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే డీపీఆర్‌ను పోర్ట్సు అథారిటీకి సమర్పించామని, కాంట్రాక్టు కంపెనీ నవయుగ పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తెలియజేశారు. రాష్ట్రంలో 1,853 గ్రామాల్లో సారా తయారీ కేంద్రాలుగా గుర్తించామని, నవోదయం కార్యక్రమంలో భాగంగా ఇప్పటికి 685 గ్రామాల్ని సారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దామన్నారు. రాబోయే రెండు మూడు నెలల్లో ఏపీని సారా రహిత రాష్ట్రంగా రూపొందిస్తామన్నారు. రాష్ట్రంలో మద్య నియంత్రణకు ఎక్సైజ్, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, విద్యా శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖలతో కలిసి ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కొల్లు తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అభివృద్ధిని చూసి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు పార్టీలో చేరుతున్నారని చెప్పారు. -
కల్తీకల్లు విక్రయిస్తే కఠిన చర్యలు
జగిత్యాల: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ఇటీవల నల్లగొండ జిల్లాలో పర్యటించిన మంత్రి.. తాజాగా బుధవారం కరీంనగర్ జిల్లా జగిత్యాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గుడుంబా, కల్తీకల్లు విక్రయిస్తే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామన్నారు. ఆఫీసుల నిర్వహణకు ప్రతి నెల నిధులు కేటాయించడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల కోసం సొంత భవనాలు నిర్మిస్తామన్నారు. సిబ్బందికి వాహనాలు అందజేసేందుకు వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. -
కల్తీ మద్యం అడ్డాగా ఎక్సైజ్ మంత్రి నియోజకవర్గం
-
'కల్తీ మద్యం అడ్డాగా ఎక్సైజ్ మంత్రి నియోజకవర్గం'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర సొంత నియోజకవర్గమైన మచిలీపట్నం కల్తీ మద్యం తయారీకి అడ్డాగా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కె.పార్థసారధి ఆరోపించారు. విజయవాడలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రతిరోజు కల్తీ మద్యం మరణాలు జరుగుతున్నాయన్నారు. ఎక్సైజ్ మంత్రి ఇంటికి సమీపంలోనే కల్తీ మద్యం సామాగ్రి లభించడంతో... రాష్ట్రంలో పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకుని కల్తీ మద్యం మరణాలను అరికట్టాలని పార్థసారధి డిమాండ్ చేశారు. -
మండలి ప్రశ్నోత్తరాలు
నేను పాత గౌడ్‌ను.. ఆదాయం పెంచుతా ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు సాక్షి, హైదరాబాద్: ‘నేను పాతగౌడ్ను. పాతకాలంలో కల్లు గీసి తాగించడం తప్పతాగే అలవాటు మాకు లేదు. ఇప్పు డు మారిన పరిస్థితుల ప్రకారం మాలో(గౌడ్‌లలో) కొంద రు తాగుతున్నా, మా కుటుంబంలో ఎవరికీ ఆ అలవాటు కాలేదు. కల్లు తాగే అలవాటును వీలైనంత ఎక్కువమందికి నేర్పించి, వ్యాపారం పెంచుకోవడం మా వృత్తి ధర్మం’ అని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి టి.పద్మారావు వ్యాఖ్యానించారు. బుధవారం అసెంబ్లీ లాబీల్లో తనను కలసిన విలేకరులతో ఆయన సరదాగా మాట్లాడుతూ, ‘గీత కార్మికునిగా నాకు వారి సమస్యలు, కష్టనష్టాలు తెలుసు. గీత కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి చర్యలు తీసుకుంటూనే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచాల్సిన బాధ్యత నాపై ఉంది. ఏ రకంగా చూసినా వ్యాపారం పెంచాల్సిన బాధ్యత నాదే కదా’ అని వ్యాఖ్యానించారు. మంత్రివర్గంలో మార్పులు చేర్పులుంటాయని జరుగుతున్న ప్రచారం గురించి అడిగితే, తనకేమీ తెలియదని, అంతా ముఖ్యమంత్రికి మాత్రమే తెలుసునని సున్నితంగా తప్పించుకున్నారు. రెండువేల కోట్లతో పల్లెల దాహార్తి తీర్చవచ్చు సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వం రూ. 36 వేల కోట్లతో చేపట్టనున్న వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు కంటే రూ. 2 వేల కోట్లతో తెలంగాణాలోని పదివేల గ్రామాల దాహార్తి తీర్చవచ్చు. ఇందులో వెయ్యికోట్లతో అన్ని గ్రామాల్లో నీటి శుద్ధి ప్లాంట్లు, మరో వెయ్యికోట్లతో బోరుబావులు, ఓవర్‌హెడ్ ట్యాంకులు ఏర్పాటు చేయవచ్చు. ప్రాధాన్యతలను మరచి ప్రభుత్వం వేల కోట్లు వాటర్‌గ్రిడ్‌కు కేటాయిస్తోంది. ప్రాణహిత-చేవేళ్ల,పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను రాబోయే మూడేళ్లలో పూర్తిచేయకుంటే ఓట్లడగమని ప్రభుత్వం ధైర్యంగా ప్రకటించాలి. ప్రజల దృష్టి మళ్లించేందుకే వాటర్‌గ్రిడ్ పథ కాన్ని తెరమీదకు తెచ్చారు. ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన ప్రకారం రైతులకు లక్ష రూపాయల రుణమాఫీని ఏకకాలంలో చేయాలి. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరందించాలని డిమాండ్ చేస్తున్నాం. - కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రభుత్వం తీరు రాజ్యాంగ విరుద్ధం శాసనసభ, శాసనమండలిలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రాజ్యాంగ విరుద్ధం. చట్టసభల్లో టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశాలు జరుగుతున్నట్టుంది. విపక్ష సభ్యుల సస్పెన్షన్‌తో సీఎం కేసీఆర్‌కు భజన చేసేవిధంగా సభా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రాజెక్టుల రీడిజైన్ ఏకపక్షంగా చేయడం దారుణం. సీఎం కేసీఆర్ ‘మాటల రావు’గానే మిగిలారు.. ఆయన ‘చేతల రావు’గా మారాలన్నదే మా ఉద్దేశం. విపక్షాల గొంతునొక్కే ప్రయత్నం చేస్తుండడం శోచనీయం. రైతులకు ఏకమొత్తంలో రుణమాఫీ చేయాలి. - పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అందుబాటులో విత్తనాలు, యూరియా: పోచారం సాక్షి, హైదరాబాద్: రైతులు పంటలు వేసుకునేందుకు వీలుగా విత్తనాలు, యూరియా అందుబాటులో ఉన్నాయని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలి పారు. బుధవారం మండలిలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానం చెప్పారు. వివిధ రకాలైన ఎరువులకు సంబంధించి 18.32 లక్షల మెట్రిక్ టన్నుల సరఫరాకు ప్రణాళికలు రూపొందించగా ఇప్పటికే 11.06 లక్షల టన్నులు సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో వేరుశనగ విత్తనాల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఖరీఫ్ కోసం 8.50 ఎల్ఎంటీల యూరియాను కేంద్రం రాష్ట్రానికి కేటాయించిందని వెల్లడించారు. 4 వేల కిలోమీటర్ల హైవేలు కోరాం: తుమ్మల రాష్ట్రంలోని 4,207 కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని కేంద్ర రోడ్లు, రహదారుల శాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగే శ్వరరావు తెలిపారు. మొదటి దశలో కనీసం 1,015 కి.మీ పొడవున్న 6 రహదారులను జాతీయ రహదారులుగా స్థాయి పెంచాలని గతేడాది డిసెంబర్లో మరో సారి సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాసినట్లు బుధవారం మండలిలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. కాగా, హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో మొదటి దశలో 20 కూడళ్లలో మల్టీ లెవల్ ఫ్లై ఓవర్ల నిర్మాణానికి టెండర్లు పిలిచినట్లు తుమ్మల పేర్కొన్నారు. ఎమ్మెల్సీలు కె.యాదవరెడ్డి,పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాములు నాయక్ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానం చెప్పారు. అలాగే జీహెచ్ఎంసీలో మెత్తం 53 పార్కింగ్ ప్రదేశాలున్నాయని, గతేడాది కన్నా 10 శాతం అదనపు ధర నిర్ణయించి టెండర్ల ద్వారా వాటిని కేటాయించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. పార్కింగ్ ప్రదేశాల వల్ల ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగితే తమ దృష్టికి తీసుకొస్తే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పగటి పూటే 9 గంటల విద్యుత్ : జగదీశ్‌రెడ్డి వచ్చే ఏడాది మార్చిలో వ్యవసాయానికి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య రెండు విడతలుగా 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామని బుధవారం మండలిలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఒక విడత, ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరో విడత ద్వారా విద్యుత్ అందజేస్తామని తెలిపారు. విదేశాల్లో ఉన్నత విద్యకు సహాయం: కడియం ఎస్సీ,ఎస్టీలతో పాటు మైనారిటీ విద్యార్థులకు కూడా అంబేద్కర్ విద్యానిధి కింద విదేశాల్లో ఉన్నతవిద్యకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. విదేశాల్లో విద్యకు రూ.10 లక్ష లు సరిపోవడం లేదన్న అభిప్రాయం తమ దృష్టికి వచ్చిం దని, స్టడీ, కాలేజీ, వసతి ఖర్చులు ఇతరత్రా పరిశీలించి ఈ మొత్తాన్ని సవరించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని బుధవారం మండలిలో ఎమ్మెల్సీ రాములునాయక్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. సిటీ బస్సులు జీహెచ్ఎంసీకి ఇవ్వం: మహేందర్ రాజధానిలోని ఆర్టీసీ బస్సు సర్వీసుల పర్యవేక్షణను జీహెచ్ఎంసీకి అప్పగించాలన్న నిర్ణయమేదీ లేదని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం మండలిలో ఎంఐఎం సభ్యులు సయ్యద్ అల్తాఫ్జ్వ్రీ, సయ్యద్ అమీనుల్ జాఫ్రీ తదితరులు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానం ఇచ్చారు. సిటీ సర్వీసుల ద్వారా ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయని, 2014-15లో గ్రేటర్ హైదరాబాద్ జోన్లో రూ.188.64 కోట్ల మేర నష్టం వచ్చిందని చెప్పారు. -
'మావాళ్లు ఎవరూ డబ్బు తీసుకోలేదు'
ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖలో బదిలీల విషయంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, తన పేషీలో సిబ్బంది ఎవరూ డబ్బులు తీసుకోలేదని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. తమ విభాగంపై ఆరోపణలు చేసినవారు దమ్ముంటే వాటిని నిరూపించాలని ఆయన సవాలు చేశారు. బీసీలకు ఏడాదికి రూ. 380 కోట్ల ఆర్థిక సాయం చేస్తామని, అందులో రూ. 190 కోట్లను ప్రభుత్వం రాయితీగా ఇస్తుందని కొల్లు రవీంద్ర చెప్పారు. చంద్రన్న బీసీ ఉపాధి వారోత్సవాల పేరుతో ఉపకరణాలు పంపిణీ చేస్తామని తెలిపారు. -
గీత కార్మికుల కోసం ‘కోటి ఈత చెట్లు’
సికింద్రాబాద్: రాష్ట్రంలో ఏడాదిలోగా కోటి ఈత మొక్కలను నాటాలని నిర్ణయించినట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావుగౌడ్ చెప్పారు. గీత కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడం ద్వారా పరిష్కారానికి కృషి చేస్తున్న మంత్రి పద్మారావుగౌడ్‌ను ఆదివారం తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం ప్రతినిధులు కలసి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చెరువులు, కుంట కట్టలపై హరితహారం కార్యక్రమం ద్వారా ఈత మొక్కలు నాటేందుకు కార్యాచరణ సిద్ధమైందని తెలిపారు. ఇప్పటికి 48 లక్షల ఈత మొక్కలను నాటేందుకు సిద్ధంగా ఉంచామన్నారు. గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌గౌడ్, సత్యనారాయణ గౌడ్, గోపాల్ గౌడ్, వినోద్ గౌడ్, రాములు గౌడ్ తదితరులు మంత్రిని కలసిన వారిలో ఉన్నారు. -
బందరు పోర్టుకు సర్వే పూర్తి : మంత్రి రవీంద్ర
విజయవాడ : రాజధానికి దగ్గరలో ఉన్న బందరు పోర్టు నిర్మాణానికి కావాల్సిన స్థల సర్వే పూర్తయిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. మంగళవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు మొత్తం 5300 ఎకరాల ప్రైవేటు, ప్రభుత్వ భూమలను సర్వే చేసినట్లు తెలిపారు. ఈ పోర్టు నిర్మిస్తే రాజధాని ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుందన్నారు. భూములిచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని, వారికి అనుమానాలుంటే నివృత్తి చేసి ముందుకు సాగుతామన్నారు. మచిలీపట్నంలో మెరైన్ అకాడమీని 300 ఎకరాల్లో నిర్మిస్తామని చెప్పారు. అక్కడే 25 ఎకరాల్లో క్రీడా స్టేడియం నిర్మాణానికి కసరత్తు చేస్తున్నామన్నారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆసక్తి కనపరుస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ నుంచి జరిగే ఎక్‌పోర్టు, ఇంపోర్ట్ అంతా మచిలీపట్నం పోర్టు నుంచి చేస్తే లాభదాయకంగా ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించి నల్గొండలో మెరైన్ హబ్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. మంత్రి రవీంద్ర తన శాఖకు సంబంధించి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్త లిక్కర్ పాలసీ ప్రవేశ పెట్టే యోచనలో ఉన్నామని చెప్పారు. ఇప్పటికే తమిళనాడులోని లిక్కర్ పాలసీపై అధ్యయనం చేసినట్లు తెలిపారు. వచ్చే వారం కేరళలోని లిక్కర్ పాలసీపై అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. ఈ రెండు రాష్ట్రాల్లో అమలవుతున్న పాలసీల్లోని మెరుగైన విధానాలను ఏపీలో అమలు చేస్తామన్నారు. -
మాట తప్పం..మంచి చేస్తాం
రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కోనేరుసెంటర్(పెదయాదర) : ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని రాష్ట్ర బీసీసంక్షేమ, చేనేత, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. బుధవారం పెదయాదర, ఎన్ గొల్లపాలెం గ్రామాల్లో జరిగిన ‘జన్మభూమి - మా ఊరు’లో మంత్రి పాల్గొన్నారు. అర్హులైన వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఫించన్లు అందజేశారు. అలాగే అంగన్వాడీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన సీమంతం కార్యక్రమంలో పాల్గొని మహిళలను ఆశీర్వదించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రైతు, డ్వాక్రా రుణాల రద్దుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ఏర్పడిన సంక్షోభం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఆలస్యం జరుగుతుందని తెలిపారు. బందరు నియోజకవర్గాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జన్మభూమి మా ఊరు కార్యక్రమం ద్వారా అధికారులను ప్రజల ముందుకు తీసుకు రావడం జరుగుతుందన్నారు. పెదయాదరలో జరిగిన సభకు ఎంపీడీవో జివి. సూర్యనారాయణ, ఎన్ గొల్లపాలెంలో జరిగిన సభకు తహశీల్దార్ బి.నారదముని అధ్యక్షత వహించారు. జెడ్పీటీసీ లంకే నారాయణప్రసాద్, మండల అధ్యక్షుడు గోపు సత్యనారాయణ, పెదయాదర సర్పంచి కంచర్లపల్లి నటరాజకుమారి, ఎన్‌గొల్లపాలెం సర్పంచి జెడ్డు వడ్డీకాసులు, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, వైస్ ఎంపీపీ ఊసా వెంకటసుబ్బారావు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. బీచ్ వద్ద పటిష్ట చర్యలు తీసుకోవాలి... కార్తీకమాసాన్ని పురస్కరించుకుని మంగినపూడి బీచ్‌కు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. బుధవారం మంత్రి పలువురు అధికారులతో కలిసి మంగినపూడి బీచ్‌ను సందర్శించారు. ఆయన బీచ్ వద్ద చేసిన ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు. కార్తీకమాసం సందర్భంగా మంగినపూడి బీచ్‌కు సుమారు లక్షకుపైగా భక్తులు వస్తారని చెప్పారు. వారికి అవసరమైన బాత్రూంలు, డ్రెసింగ్రూంలు, వ్యక్తిగత మరుగుదొడ్లు ఇలా భక్తులకు అవసరమైనసౌకర్యాలు కల్పించాలని సూచించారు. మంత్రితో పాటు రూరల్ సీఐ ఎస్వీవీఎస్. మూర్తి, రూరల్ ఎస్సై ఈశ్వర్రావు, సహాయ టూరిజం అధికారి రామలక్ష్మణ్, డివిజనల్ పంచాయతీ అధికారి జె.సత్యనారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ బుల్లయ్య, జెడ్పీటీసీ లంకే నారాయణప్రసాద్, వైస్ ఎంపీపీ ఊసా వెంకటసుబ్బారావు, టీడీపీ మండల అధ్యక్షుడు గోపు సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.