కల్తీకల్లు విక్రయిస్తే కఠిన చర్యలు | excise minister ridings on gudumba and Adulterated liquor centres | Sakshi
Sakshi News home page

కల్తీకల్లు విక్రయిస్తే కఠిన చర్యలు

Published Wed, Feb 24 2016 8:02 PM | Last Updated on Fri, Aug 17 2018 5:07 PM

excise minister ridings on gudumba and Adulterated liquor centres

జగిత్యాల: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ఇటీవల నల్లగొండ జిల్లాలో పర్యటించిన మంత్రి.. తాజాగా బుధవారం కరీంనగర్ జిల్లా జగిత్యాలలో తనిఖీలు నిర్వహించారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  గుడుంబా, కల్తీకల్లు విక్రయిస్తే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామన్నారు. ఆఫీసుల నిర్వహణకు ప్రతి నెల నిధులు కేటాయించడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల కోసం సొంత భవనాలు నిర్మిస్తామన్నారు. సిబ్బందికి వాహనాలు అందజేసేందుకు వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement