Padma Rao
-
కేసీఆర్ ఫార్మ్ హౌస్ కి పద్మారావు గౌడ్
-
కాబోయే సీఎం కేటీఆర్‌కు శుభాకాంక్షలు: పద్మారావు
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే కార్మికుల సమావేశంలో తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారనే విషయాన్ని మరింత స్పష్టం చేశారు. కేటీఆర్ సమక్షంలోనే పద్మారావు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సికింద్రాబాద్‌లో నూతనంగా నిర్మించిన దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల సంఘ్ డివిజనల్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పద్మారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పద్మారావు మాట్లాడుతూ.. కార్మికుల తరపున, తెలంగాణ శాసనసభ తరపున కాబోయే సీఎం కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నానని ప్రకటించారు. త్వరలోనే ఆయన సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, కేటీఆర్‌కు సీఎం అయ్యే అర్హతలు ఉన్నాయని మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే. -
లాక్‌డౌన్‌తో ఎవరూ ఇబ్బంది పడకూడదు
-
బాధ్యతలు స్వీకరించిన పద్మారావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా మాజీమంత్రి, సికింద్రాబాద్ శాసనసభ్యుడు పద్మారావు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికకు సభలోని అని పార్టీలు మద్దతు తెలపడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ తెలిపారు. సభాపతి ప్రకటన అనంతరం బాధ్యతలు చేపట్టిన.. పద్మారావుకు సభలోని సభ్యులందరూ అభినందనలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పద్మారావు పాత్ర మరువలేనిదని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. సభావతి ప్రకటన అనంతరం కేసీఆర్ ఆయనను దగ్గరుండి తీసుకెళ్లి స్పీకర్ చైర్లో కూర్చోబెట్టారు. పద్మారావు ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన విపక్ష పార్టీ సభ్యులకు కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. -
క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయికి..
సాక్షి, సిటీబ్యూరో: మాజీ మంత్రి పద్మారావుకు మరో ఉన్నత పదవి దక్కింది. 1986లో మోండా డివిజన్ నుంచి కార్పోరేటర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పద్మారావు ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశారు. ఇక ఇప్పుడు శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా సేవలందించనున్నారు. ఆయన ఎన్నిక దాదాపు లాంఛనమే అయినా, శనివారం నామినేషన్ వేయనున్నారు. ఇదిలా ఉండగా మోండా మార్కెట్ కేంద్రంగానే పద్మారావుతో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1986 మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పద్మారావు విజయం సాధించగా, జనతా పార్టీ నుంచి బరిలోకి దిగిన శ్రీనివాస్ యాదవ్ ఓటమి పాలయ్యారు. దివంగత నేత పీజేఆర్‌కు ప్రధాన అనుచరుడిగా కొనసాగిన పద్మారావు 1999 ఎన్నికల్లో సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ తర్వాత 2001లో టీఆర్ఎస్లో చేరి 2002లో మరోసారి మోండా డివిజన్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో టీఆర్ఎస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా బరిలో దిగి... ప్రస్తుత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై గెలుపొందారు. 2008లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన... అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో తలసానిపై ఓడిపోయారు. 2009లో పొత్తుల్లో భాగంగా మహాకూటమి అభ్యర్థిగా సనత్‌నగర్ నుంచి పోటీ చేసిన పద్మారావు... మర్రి శశిధర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. తిరిగి 2014లో జరిగిన ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ఎక్సైజ్ మంత్రిగా పనిచేశారు. తాజా ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి దాదాపు 45వేల మెజారీటీతో విజయం సాధించారు. అయితే ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా సాదాసీదా జీవితం గడిపే పద్మారావు... తాను పుట్టి పెరిగిన టకారా బస్తీలోనే ఇప్పటికీ నివాసం ఉంటున్నారు. మినిస్టర్ క్వార్టర్స్‌లో బంగళా ఇచ్చినా తాను అమితంగా ఇష్టపడే బస్తీలోనే ఉంటూ తన వాళ్ల మధ్యే గడుపుతుండడం విశేషం. -
ఎక్సైజ్ సమస్యల్ని పరిష్కరిస్తా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఉద్యోగుల ప్రతీ సమస్యను పరిష్కరిస్తానని ఆశాఖ మంత్రి టి. పద్మారావు అన్నారు. సొంత భవనాలు, రవాణా సౌకర్యాల కల్పన వంటి సమస్యలను ఇప్పటికే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. సచివాలయంలో శుక్రవారం జరిగిన ఆ శాఖ డైరీ, క్యాలెండర్–2018 ఆవి ష్కరణ సభలో ఆయన మాట్లాడుతూ..ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంక్రాంతి తరువాత ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తానన్నారు. తెలంగాణను గుడుంబా రహిత రాష్ట్రంగా మార్చడంలో కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల పాత్ర ఎంతో ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌బీసీఎల్ చైర్మన్ దేవి ప్రసాద్ రావు, ముఖ్యకార్యదర్శి సోమేశ్ కుమార్, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
‘సాక్షి’ ఎరీనాకు సర్కారు మద్దతు
సాక్షి, హైదరాబాద్: ప్రతిభ కలిగిన ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ‘సాక్షి’ మీడియా సంస్థ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే ఎరీనా వన్ యూత్ఫెస్ట్కు రాష్ట్ర క్రీడా శాఖ తరఫున ఏటా రూ.25 లక్షల నగదు ప్రోత్సాహకం అందజేస్తామని క్రీడలు, యువజన సర్వీసులు, ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు తెలిపారు. ఎరీనా పోటీల్లో గెలుపొందే క్రీడాకారులకు వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరఫున భారీ బహుమతులు అందజేస్తామన్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియం లో కన్నుల పండువగా సాగిన ‘సాక్షి’ ఎరీనా వన్ యూత్ ఫెస్ట్ రెండో ఎడిషన్ ఉత్సవాలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఫొటో గ్యాలరీ : ( సాక్షి ఎరీనా యూత్‌ఫెస్ట్ ) వివిధ ఇంజనీరింగ్, వృత్తివిద్యా కళాశాలల సమాచారం ఉన్న ‘ఎక్సలెన్సీ ఇన్ ఎడ్యుకేషన్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం క్రికెట్, కబడ్డీ తదితర క్రీడాంశాల్లో విజేతలుగా నిలిచిన వివిధ కాలేజీ విద్యార్థులకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడాకారులకు ఇతోధికంగా ప్రోత్సాహం అందజేస్తున్నార న్నారు. క్రీడలకు గతేడాది రాష్ట్ర వార్షిక బడ్జెట్లో రూ.64 కోట్లు కేటాయించామన్నా రు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌ను భారీగా పెంచుతామని చెప్పారు. యువతను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం ద్వారా బంగారు తెలంగాణ సాధనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. జిల్లా, రాష్ట్రస్థాయిలతో పాటు ఒలింపిక్ పథకాలు సాధించిన క్రీడాకా రులకు ప్రభుత్వం రూ.10 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు నగదు ప్రోత్సాహకం అందజేస్తోందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పాఠకుల ఆదరాభిమానాలు చూరగొన్న ‘సాక్షి’ మీడియా సంస్థ క్రీడాకారులను ప్రోత్సహించడం, ప్రతిభ కలిగిన వారిని వెలుగులోకి తీసుకురావడం అభినందనీ యమని కొనియాడారు. వచ్చే ఏడాది రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో 600కు పైగా కళాశాలలు ఈ ఎరీనా పోటీల్లో పాల్గొనాలని మంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు. అన్ని రకాల క్రీడల్లో హైదరాబాద్ నంబర్‌వన్‌గా నిలిచిందన్నారు. క్రీడాస్ఫూర్తితోనే రాణిస్తాం ప్రతి ఒక్కరూ అన్ని అంశాల్లో నూటికి నూరుశాతం సంపూర్ణంగా ఉన్నప్పుడే గొప్పవిజయాలు సాధించవచ్చని ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు అన్నారు. క్రీడాస్ఫూర్తితో పనిచేసినపుడే అనుకున్న పనిలో రాణించగలమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ బలం, బలహీనతలను బేరీజు వేసుకొని గొప్ప లక్ష్యాలను నిర్దేశించు కోవాలని, ఎవరినీ గుడ్డిగా అనుసరించరాదని సూచించారు. యువతే దేశ సంపద అని సోషల్ మీడియాతో విలువైన సమయాన్ని వృథా చేయరాదన్నారు. సమాజంపై యువత చూపే ప్రభావంతోనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని స్ఫూర్తిదాయక ప్రసంగం చేసి యువతను ఆకట్టుకున్నారు. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. సృజనాత్మకత, సమయస్ఫూర్తి వంటి ఉత్తమ లక్షణాలు క్రీడల ద్వారానే అలవడతాయ న్నారు. ప్రముఖ హకీ క్రీడాకారుడు, అర్జున, పద్మశ్రీ అవార్డుల గ్రహీత ముఖేశ్ మాట్లాడుతూ.. క్రీడల్లో రాణించినవారు చదువుతోపాటు ఇతర రంగాల్లో చురుగ్గా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ విద్యాసంస్థల వైస్ చైర్పర్సన్ రుద్రమదేవి, సుల్తాన్ ఉల్ ఉలూమ్ విద్యాసంస్థల కార్యదర్శి జాఫర్ జావీద్, ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, సింగర్ శ్రీనివాస్, హోండా(ఆంధ్రప్రదేశ్ సేల్స్ విభాగం) సంస్థ అసిస్టెట్ మేనేజర్ అనంత్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో సాక్షి ఫైనాన్స్ విభాగం డైరెక్టర్ వైఈపీ రెడ్డి, సాక్షి కార్పొరేట్ కమ్యూనికేషన్స్ విభాగం డైరెక్టర్ రాణీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉరకలెత్తిన ఉత్సాహం.. వేలాది మంది కుర్రకారు కేరింతలు.. జయజయధ్వానాలు.. వివిధ క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులతో ఉత్సాహంగా సాగిన మార్చ్ఫాస్ట్.. విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటా.. పాటలతో ‘సాక్షి’ ఎరీనా వన్ యూత్ ఫెస్ట్ రెండో ఎడిషన్ సంబురాలు అంబరాన్ని తాకాయి. ఈ వేడుకల్లో 230కి పైగా కాలేజీలకు చెందిన సుమారు 4,500 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఎల్బీస్టేడియం కిటకిటలాడింది. వివిధ కాలేజీ విద్యార్థులు ఆలపించిన సినీ నేపథ్య గీతాలు, స్వయంగా రూపొందించిన మ్యూజిక్ ఆల్బమ్స్, సంగీత కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు ఆహూతులను మైమరపించాయి. పలు క్రీడాంశాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అభినందనలు వెల్లువెత్తాయి. విద్యార్థులు, తల్లిదండ్రులతోపాటు వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలరించిన సెలబ్రిటీలు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని పృథ్వీ పేల్చిన డైలాగులు, ప్లే బ్యాక్ సింగర్ హేమచంద్ర, రాప్ సింగర్స్ ’హే పిల్లా’ టీమ్ పాడిన పాటలు విద్యార్థులను ఉర్రూతలూగించాయి. వీరు పాడిన పాటలకు హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు స్టెప్పులేశారు. అష్టాచమ్మా, ఊహలు గుసగుసలాడే ఫేమ్ అవసరాల శ్రీనివాస్ తన మాటలతో యువతకు మార్గనిర్దేశనం చేశారు. లాస్య నటించిన త్వరలో విడుదల కానున్న ’రాజా మీరు కేక’చిత్రంలోని డైలాగులతో అలరించింది. -
త్వరలోనే రాష్ట్రానికి కల్లుగీత పరికరాలు
కల్లుగీత కార్మికులకు తోడ్పడే పరికరాలను రాష్ట్రంలో ప్రవేశపె ట్టబోతున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు తెలిపారు. త్వరలోనే నల్లగొండ జిల్లాకు ఈ పరికరాలను పంపుతామ న్నారు. కల్లు దుకాణాల అంశంపై ఓ ప్రశ్నకు ఆయన సమాధాన మిచ్చారు. కల్లుగీత యంత్రాల కోసం అధికారులు ఇప్పటికే కేరళలో అధ్యయనం చేసి వచ్చారని చెప్పారు. కల్లు గీత అభివృ ద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, హరితహారంలో ఈ ఏడాది 54 లక్షల తాటి, ఈత చెట్లు నాటామన్నారు. వచ్చే ఏడాది 2 కోట్లు, తర్వాతి ఏడాది 5 కోట్ల చెట్లను నాటాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కల్లు గురించి ఆసక్తికరంగా మాట్లాడారు. ‘కల్లు మూడు రకాలు. పోద్దాళ్లు, పరుపుదాళ్లు, పందాళ్లు అనే రకాల చెట్ల నుంచి కల్లు వస్తుంది. అందులో పోద్దాళ్లు, పందాళ్ల కల్లులో ఔషధ గుణాలు ఉంటాయి’ అని పేర్కొన్నారు. -
సంగారెడ్డిపేటలో పోలీస్ పికెట్
మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం సంగారెడ్డిపేటలో పోలీస్‌పికెట్ ఏర్పాటు చేసినట్లు జోగిపేట సిఐ వెంకటయ్య తెలిపారు. సోమవారం ఆయన గ్రామాన్ని సందర్శించారు. శిఖం భూముల విషయంలో ఆదివారం సంగారెడ్డిపేట, వీరోజిపల్లి గ్రామస్తులు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. దీంతో అక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ విషయంపై సోమవారం డీఎస్పీ నాగరాజు, తహశీల్దార్ పద్మారావు, సీఐ వెంకటయ్య రెండు వర్గాల ప్రజలతో సమావేశమయ్యారు. శిఖం భూముల విషయంలో రెండు గ్రామాలకు చెందిన 30 మందిపై కేసులు నమోదు చేశామని, 100 మందికి నోటీసులు అందజేశామని చెప్పారు. ఈ సంఘటనలో గాయపడిన వారు ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఎవరూ శిఖం భూములు దున్నరాదని తెలిపారు. -
సంబురంగా హరితహారం
♦ జిల్లా వ్యాప్తంగా ప్రారంభం ♦ మొక్కలు నాటిన మంత్రులు హరీశ్‌రావు, పద్మారావు ♦ ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు.. ♦ మొదటి రోజు ఐదు లక్షల మొక్కలు : కలెక్టర్ సాక్షి, సంగారెడ్డి : అందర‘మొక్క’టై కదులుదామంటూ.. హరితహారాన్ని సంబురంగా నిర్వహించారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రజలు, ప్రజాప్రతినిదులు, అధికారులు పాల్గొని మొక్కలు నాటారు. జిల్లా మంత్రి హరీశ్‌రావు, ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి తూప్రాన్‌లో హరితహారం కార్యక్రమం ప్రారంభించారు. ఆ తర్వాత రామాయంపేటలోని సర్వాయికుంట సమీపంలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను మంత్రులు హరీశ్‌రావు, పద్మారావు ఆవిష్కరించారు. జెడ్పీ చైర్పర్సన్ రాజమణి జెడ్పీ ఆవరణలో మొక్కలు నాటారు. ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సోలిపేట రామలింగారెడ్డి, బాబూమోహన్, మదన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి ఎక్కడికక్కడ తమ నియోజకవర్గాల్లో నిర్విహించిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. అధికారులూ ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటారు. సీసీఎల్ఏ రేమండ్ పీటర్, కలెక్టర్ రోనాల్డ్ రోస్, జేసీ వెంకట్రాంరెడ్డి కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటారు. సంగారెడ్డిలో కలెక్టర్ మాట్లాడుతూ హరితహారం మొదటి రోజున జిల్లా వ్యాప్తంగా ఐదు లక్షల మొక్కలు నాటినట్లు చెప్పారు. జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి సంగారెడ్డిలోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్, చిద్రుప్పలోని పోలీసు శిక్షణ కేంద్రంలో మొక్కలు నాటారు. వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈత చెట్లు నాటిని మంత్రులు తూప్రాన్ బైపాస్‌రోడ్డులో మంత్రులు హరీశ్‌రావు, పద్మారావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఈత, ఖర్జూరం మొక్కలు నాటారు. గీతకార్మికులు, గౌడసంఘం నాయకులు ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్, కలెక్టర్ రోనాల్డ్‌రోస్, పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్పి సింగ్, సీసీఎల్ఏ కమిషనర్ రేమండ్‌పీటర్ తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్‌లోని మార్కెట్‌యార్డులో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు, గజ్వేల్-ప్రజ్ఞాఫూర్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. రామాయంపేట, మెదక్పట్టణం, మెదక్ మండలంలో జరిగిన కార్యక్రమాలలోనూ మంత్రి హరీష్‌రావు, డిప్యూటీస్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి హాజరై మొక్కలు నాటారు. జిల్లా కేంద్రంలో.. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మొక్కలు నాటారు. ఆయనతోపాటు సీసీఎల్ఏ రేమండ్‌పీటర్, కలెక్టర్ రోనాల్డ్ రోస్ తదితరులు మొక్కలు నాటారు. రాష్ట్ర శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మొక్కలు నాటారు. మిరుదొడ్డి మండల కేంద్రంలోని తహశీల్దార్, ఎంపీడీఓ, వికలాంగుల పునరావస కేంద్రం, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. జహీరాబాద్‌లోని పండ్ల మార్కెట్ యార్డులో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి ఎం.డి.ఫరీదుద్దీన్ మొక్కలు నాటారు.అందోలు నియోజకవర్గ కేంద్రమైన అందోలు, అల్లాదుర్గం మండలాలల్లో హరిత హారం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బాబూమోహాన్ ప్రారంభించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి పలు మండలాల్లో పాల్గొని మొక్కలు నాటారు. హత్నూర మండలంలో పోలీసులు దత్తత తీసుకున్న కాసాల, చింతల్‌చెరువు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో మొక్కలు నాటారు. నారాయణఖేడ్‌లో ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి ప్రారంభించారు. సంగారెడ్డిలోని డీసీసీబీ కార్యాలయం ఆవరణలో డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి అధికారులతో కలిసి మొక్కలు నాటారు. -
కల్తీకల్లు విక్రయిస్తే కఠిన చర్యలు
జగిత్యాల: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ఇటీవల నల్లగొండ జిల్లాలో పర్యటించిన మంత్రి.. తాజాగా బుధవారం కరీంనగర్ జిల్లా జగిత్యాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గుడుంబా, కల్తీకల్లు విక్రయిస్తే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామన్నారు. ఆఫీసుల నిర్వహణకు ప్రతి నెల నిధులు కేటాయించడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల కోసం సొంత భవనాలు నిర్మిస్తామన్నారు. సిబ్బందికి వాహనాలు అందజేసేందుకు వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. -
చీప్ లిక్కర్ కాదు.. చౌక మద్యం
సాక్షి, హైదరాబాద్: ‘‘గుడుంబా మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలను రక్షించేందుకే తెలంగాణ ప్రభుత్వం తక్కువ ధరకు మద్యాన్ని అందించే ఏర్పాటు చేస్తోంది. అంతేగానీ గుడుంబాకు ప్రత్యామ్నాయంగా ఎలాంటి చీప్ లిక్కర్‌ను పంపిణీ చేయడం లేదు’’ అని ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావు గౌడ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకు రానున్న నూతన మద్యం పాలసీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో... మంత్రి సోమవారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మద్యం పాలసీలో తాము తీసుకురాబోతున్న విధి విధానాలను వివరించారు. రాజకీయంగా మనుగడ ప్రశ్నార్థకం కావడంతో కొన్ని విపక్షాలు, తాము ఇంకా ప్రకటించని మద్యం పాలసీపై లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. నూతన మద్యం పాలసీని రెండు, మూడు రోజుల్లో ప్రకటిస్తామని, అందులో ప్రజలకు హానీ కలిగించే అంశాలేమైనా ఉంటే నిలదీసే అధికారం ఎవరికైనా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం మద్యం తాగాలని ప్రోత్సహించదని, గుడుంబా తాగి ప్రాణాలు తీసుకోకుండా ప్రజలను రక్షించేందుకే ఈ చర్యలు చేపట్టిందన్నారు. అక్టోబరు 1 నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. అన్నింట్లోనూ అదే ఆల్కహాల్ గుడుంబాను అరికట్టేందుకు ప్రభుత్వం కొత్తగా సారాయి దుకాణాలు ప్రారంభించ నుందని, కిరాణా షాపుల్లో కూడా మద్యం అమ్మకాలు చేపట్టనుందని విపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని మంత్రి దుయ్యబట్టారు. ప్రభుత్వం సారాయి గానీ, ఆపిల్జ్యూస్ను గానీ ప్రజలకు అందించడం లేదని, గతంలో ఉన్న మద్యం సీసాలనే తక్కువ ధరకు పంపిణీ చేస్తుందన్నారు. రూ.వెయ్యి ఖరీదున్న మద్యంలో ఎంత శాతం ఆల్కహాల్ ఉంటుందో, రూ.15కు అందించే మద్యం లోనూ అంతే శాతం (42.5) ఆల్కహాల్ ఉంటుందన్నారు. మండలం యూనిట్‌గా ప్రతి మండలంలో మూడు గ్రామాల్లో ఔట్లెట్లు (వైన్ షాపులు) ఉండేలా కొత్త విధానం తీసుకొస్తామన్నారు. మద్యం తాగకుండా ఉండలేని వారు.. కాస్త దూరం వెళ్లి అయినా నాణ్యమైన మద్యం తెచ్చుకుంటారని వ్యాఖ్యానించారు. గుడుంబాను అరికట్టేందుకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. నూతన మద్యం పాలసీతో కల్లుగీత కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. దశల వారీగా మద్యం విక్రయాలను నియంత్రిస్తామని, మద్యంతో జరిగే నష్టాలపై ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రభుత్వం డాక్యుమెంటరీని రూపొందించిందని పేర్కొన్నారు. సాంస్కృతిక సారధి నేతృత్వంలో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఆదాయం కోల్పోతున్నాం రాష్ట్రంలో గుడుంబాను సంపూర్ణంగా అరికట్టాలన్నది ప్రభుత్వ ధ్యేయమని పద్మారావు చెప్పారు. రూ.10తో గుడుంబా సేవిం చి అమాయకులు బలవుతున్నందున వారికి అందుబాటులో ఉండేలా సురక్షితమైన మద్యాన్ని రూ.15కే అందించాలని నిర్ణయిం చామన్నారు. సేల్స్‌ట్యాక్స్, వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ.. ఇలా వివిధ రూపాల్లో ఒక కేసు మద్యానికి రూ.1,840 ఆదాయం ప్రభుత్వానికి వస్తుందని, అయితే మద్యం తక్కువ ధరకు అందించాలనే ఉద్దేశంతో.. పన్నులను రూ.730కి ప్రభుత్వం తగ్గించుకుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకు 1.50 లక్షల కేసు ల విక్రయం జరుగుతోందని, పన్నులను తగ్గించడం ద్వారా ఆదాయాన్ని కోల్పోతామన్నారు. ప్రస్తుతం దుకాణాల్లో 180 మిల్లీలీటర్ల మద్యం ధర రూ.70 ఉండగా దాని ధరను రూ.30కు, 90 మిల్లీలీటర్ల మద్యం ధరను రూ.40 నుంచి రూ.15కు త గ్గిస్తున్నామని చెప్పారు. ఈ కొత్త విధానం గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమని, పట్టణ, నగర ప్రాంతాల్లో మద్యం ధరల్లో ఎలాంటి మార్పులు ఉండబోవన్నారు. -
'గుడుంబా పై యుద్ధం'
హైదరాబాద్:గుడుంబాపై ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందని సోమవారం మంత్రి పద్మారావు స్పష్టం చేశారు. గుడుంబాను అరికట్టడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. అవసరమైతే గుడుంబాను అరికట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులను సస్పెండ్ చేస్తామని మీడియా సమావేశంలో అన్నారు. గ్రామ గ్రామాన, కిరాణా స్టోర్లలోమద్యం అంటూ కొందరు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారన్నారు. ఒక్కో మద్యం కేసు పై రూ.1800 టాక్స్ వస్తుంటే రూ.700లకు తగ్గించి గుడుంబాకు ప్రత్యామ్నయంగా మద్యం తీసుకురావాలని చర్చలు జరుగుతున్నయని తెలిపారు. కొన్ని వందల కోట్ల నష్టం వచ్చినా సరే...తక్కువ ధరలకే మద్యం అందించి గుడుంబాను అరికట్టేలా చర్యలు ప్రారంభించనున్నామన్నారు. తక్కువ ధరకే 90 ఎంఎల్ మద్యాన్ని 15 రూ.లకే అందించడంతో వారు గుడుంబాను వదిలేసే అవకాశం ఉందన్నారు. -
చీప్ లిక్కర్ ప్రవేశపెట్టేది లేదు: మంత్రి పద్మరావు
-
'హైదరాబాద్ కు ప్రత్యేక మద్యం పాలసీ'
హైదరాబాద్: తెలంగాణ కొత్త మద్యం పాలసీపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుక్రవారం సాయంత్రం సమీక్ష జరిపారు. ఈ సమావేశానికి మంత్రి పద్మారావు, కమిషనర్ చంద్రవదన్, ఇతర అధికారులు హాజరయ్యారు. అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. 'అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం విధానం అమలు కానుంది. ఈ నెలాఖరుకల్లా మద్యం నోటిఫికేషన్ విడుదల చేస్తాం. అందులో హైదరాబాద్ నగరానికి ప్రత్యేక మద్యం పాలసీ ఉంటుంది. చౌకల మద్యం అందుబాటులోకి తెచ్చే విషయంపైన.. అదే విధంగా కర్ణాటక తరహాలో మద్యం అందించే విధానంపై చర్చిస్తాం. శాఖల సమన్వయంతో గ్రామాల్లో నుంచి గుడుంబాను పారద్రోలుతాం' అని అన్నారు. గుడుంబాను పూర్తి స్థాయిలో నిరోధించేందుకు యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించామన్నారు. అదే విధంగా మద్యం పాలసీపై మరిన్ని మోడళ్లను పరిశీలించాలని సీఎం కేసీఆర్ అధికారులను కోరారు. -
గీత కార్మికుల కోసం ‘కోటి ఈత చెట్లు’
సికింద్రాబాద్: రాష్ట్రంలో ఏడాదిలోగా కోటి ఈత మొక్కలను నాటాలని నిర్ణయించినట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావుగౌడ్ చెప్పారు. గీత కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడం ద్వారా పరిష్కారానికి కృషి చేస్తున్న మంత్రి పద్మారావుగౌడ్‌ను ఆదివారం తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం ప్రతినిధులు కలసి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చెరువులు, కుంట కట్టలపై హరితహారం కార్యక్రమం ద్వారా ఈత మొక్కలు నాటేందుకు కార్యాచరణ సిద్ధమైందని తెలిపారు. ఇప్పటికి 48 లక్షల ఈత మొక్కలను నాటేందుకు సిద్ధంగా ఉంచామన్నారు. గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌గౌడ్, సత్యనారాయణ గౌడ్, గోపాల్ గౌడ్, వినోద్ గౌడ్, రాములు గౌడ్ తదితరులు మంత్రిని కలసిన వారిలో ఉన్నారు. -
జూలై 1 నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ
* ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలకు మంత్రి పద్మారావు ఆమోదం * ముఖ్యమంత్రి వద్ద ఫైలు, ఆమోదమే తరువాయి * వైన్‌షాపుల పెంపు, చౌక మద్యం విక్రయాలకు మొగ్గు * రెవెన్యూ లక్ష్యం రూ. 12,227 కోట్లు * కల్తీ మద్యం, బెల్టుషాపులను నిర్మూలిస్తామన్న ఎక్సైజ్ కమిషనర్ సాక్షి, హైదరాబాద్: సీఎం ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో నూతన మద్యం విధానాన్ని అమలు చేసేందుకు ఎక్సైజ్‌శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో నాటుసారా (గుడుంబా)ను అరికట్టడం, బెల్టుషాపులను ఎత్తివేయడంతో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 12,227 కోట్ల రెవెన్యూ లక్ష్యాన్ని సాధించే దిశగా విధివిధానాలను రూపొందించింది. ప్రస్తుత విధానంలోని లోటుపాట్లను వివరిస్తూ.. మహారాష్ట్రలో అమల్లో ఉన్న దేశీదారూ తరహాలో చౌక మద్యాన్ని వైన్‌షాపుల ద్వారా విక్రయించడం, జనాభాను బట్టి మద్యం దుకాణాలను పెంచడం వంటి ప్రతిపాదనలను తయారుచేసింది. మద్యంతో సంబంధం లేకుండా సారాను తిరిగి ప్రవేశపెట్టే ప్రతిపాదననూ రూపొందించింది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న మద్యం పాలసీలను ఆర్నెల్లుగా అధ్యయనం చేసిన అనంతరం వాటి లోటుపాట్లనూ పరిశీలించి అధికారులు ఈ నివేదికలను రూపొందించారు. ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలకు ఆ శాఖ మంత్రి టి. పద్మారావుగౌడ్ ఆమోదం తెలిపారు. దీంతో వాటిని సీఎం పరి శీలనకు పంపారు. ఈ నెల తొలివారంలో సీఎం ఆమోదం లభించిన వెంటనే జూలై 1 నుంచి రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీ అమలు కానుంది. చౌక మద్యానికి సర్కారు మొగ్గు కొద్ది నెలల క్రితం సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లా పర్యటనలో విచ్చలవిడి గుడుంబా అమ్మకాలపై ఫిర్యాదులందాయి. గుడుంబాకు బదులుగా మహారాష్ట్రలో విక్రయిస్తున్న దేశీదారూ తరహాలో తక్కువ ధర మద్యాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని ఆయన భావిం చారు. ఈ మేరకు మంత్రి పద్మారావు, అధికారులతో పలుమార్లు సమావేశమై చర్చించారు. ఎక్సైజ్ అధికారులు పలు రాష్ట్రాల్లో అధ్యయనం చేసి నివేదికలు అందించారు. ఇటీవల ఎక్సైజ్ కమిషనర్ ఆర్వీ చంద్రవదన్ మహారాష్ట్రలో పర్యటించి దేశీదారూ అమ్మకాల వివరాలను తెలుసుకున్నారు. అక్కడ రెగ్యులర్ మద్యం అమ్మకాల కన్నా దేశీదారూ వల్లే ఎక్కువ రెవెన్యూ వస్తోందని తేలింది. ఈ నేపథ్యంలో చౌక మద్యం, 10 వేల జనాభాకు ఓ మద్యం దుకాణం ఏర్పాటు, లెసైన్స్ ఫీజు, ప్రివిలేజ్ ఫీజులను రెగ్యులరైజ్ చేయడం తదితర అంశాలతో కొత్త మద్యం విధానం ఉండాలని ఎక్సైజ్ శాఖ తేల్చినట్లు సమాచారం. ఈ విధానంతో వచ్చే రెవెన్యూ వివరాలనూ నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది. సీఎం కూడా ఇందుకు సానుకూలంగా ఉండటంతో కొత్త విధానాన్ని ఈ వారంలోనే ఆమోదించే అవకాశముంది. రాష్ట్రంలో నాటుసారా తయారీ, బెల్టు షాపులు ఉండకూడదన్న ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగానే నూతన విధానాన్ని రూపొందించినట్లు ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్ తెలిపారు. -
బహిరంగసభకు భారీ బందోబస్తు
సాక్షి, సిటీబ్యూరో: జింఖానా గ్రౌండ్లో సోమవారం నిర్వహించనున్న టీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు పటిష్ట భద్రత కల్పిస్తున్నారు. 4వేల మంది పోలీసులతో గట్టి బందోబస్తును ఏర్పాటు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వీఐపీల వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ప్రదేశాలు కేటాయించారు. అలాగే జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు పార్కింగ్ ప్రదేశాలు కేటాయించారు. ఏ జిల్లా వాహనాలు ఎక్కడ పార్కింగ్ చేయాలో ఇప్పటికే నాయకులకు తెలియజేశారు. ఈ మేరకు ట్రాఫిక్ చీఫ్ జితేందర్, డీసీపీలు రంగనాథ్, చౌహాన్, అదనపు పోలీసు కమిషనర్ అంజనీకుమార్, డీసీపీలు కమలాసన్‌రెడ్డి, డాక్టర్ రవిందర్, సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, సుధీర్‌బాబు, రవి వర్మ, స్పెషల్ బ్రాంచ్ జాయింట్ పోలీసు కమిషనర్ వై.నాగిరెడ్డిలతో కమిషనర్ శనివారం ప్రత్యేకంగా సమావేశమై ఆరా తీశారు. ముందు జాగ్రత్త గా జింఖానా గ్రౌండ్స్‌లో బాంబ్ స్క్వాడ్ పోలీసులు అణువణువు తనిఖీ చేపట్టారు. ⇒ రంగారెడ్డి, మహబూబ్‌నగర జిల్లాలోని శంకర్పల్లి, చేవేళ్ల, తాండూర్, వికారాబాద్, మహబూబ్‌నగర్ నుంచి వచ్చే వాహనాలు మెహదీపట్నం, మాసాబ్‌ట్యాంక్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1, పంజగుట్ట, బేగంపేట మీదు గా రసూల్‌పురాకు చేరుకోవాలి. ఈ వాహనాలను ఎయిర్ కార్గో వద్ద పార్క్ చేయాలి. ⇒ మెదక్, రంగారెడ్డిలోని పటాన్చెరువు, సదాశివపేట్, జహిరాబాద్, కూకట్పల్లి నుంచి వచ్చే వాహనాలు బీహెచ్ఈఎల్, కూకట్పల్లి, అమీర్‌పేట, బేగంపేట మీదుగా పీజీ కాలేజ్‌కు చేరుకోవాలి. పీజీ కాలేజ్, క్లాసిక్ గార్డెన్, బాలమ్రాయ్, ఈద్గా ప్రాంతాల్లో పార్క్ చేయాలి. ⇒ మెదక్, రంగారెడ్డిలోని మెదక్, నర్సాపూర్, జీడిమెట్ల, బాలనగర్ నుంచి వచ్చే వాహనాలు నర్సాపూర్ చౌరస్తా, బోయిన్పల్లి జం క్షన్, తాడ్‌బండ్ మీదుగా బాలమ్రాయ్కు చేరుకోవాలి. ఇక్కడ మల్లారెడ్డి గార్డెన్, చందనాగార్డెన్, సేఫ్ ఎక్స్‌ప్రెస్, సీఎంఆర్ స్కూల్, అషిస్ గార్డెన్లో వాహనాలు పార్క్ చేయాలి. ⇒ నిజామాబాద్, నిర్మల్, మేడ్చల్, కామారెడ్డి, కుత్బుల్లాపూర్ నుంచి వచ్చే వాహనాలు మేడ్చల్, బోయిన్పల్లి, తాడ్‌బండ్ మీదుగా బాలమ్రాయ్కి చేరుకోవాలి. ⇒ మెదక్, కరీంనగర్, అదిలాబాద్, వరంగల్, రంగారెడ్డి నుంచి కరీంనగర్ హైవే పై నుంచి వాహనాలు శామీర్‌పేట్, బొల్లారం, కార్ఖానా, ఎన్సీసీ గేట్, డైమండ్ పాయింట్ మీదుగా చేరుకుని ధోబీఘాట్, ఇంపిరయల్ గార్డెన్, రాజరాజేశ్వరీ గార్డెన్, గాయిత్రి గార్డెన్, అశోక్‌గార్డెన్, బోయిన్పల్లి మార్కెట్, ముడాపోర్టులో పార్కింగ్ చేయాలి. ⇒ భువనగిరి, వరంగల్, ఘట్కేసర్, మల్కాజ్గిరి, కీసర నుంచి వచ్చే వాహనాలు ఉప్పల్, తార్నక, మెట్టుగడ్డ మీదుగా హైదరాబాద్ భవన్ సంగీత్‌కు చేరుకోవాలి. రైల్వే డిగ్రీ కాలేజ్, ఆర్సీసీ గ్రౌండ్స్, సీఎస్ఐ, పీజీ కాలేజ్, కీస్ హై స్కూల్, ఓపెన్ గ్రౌండ్, ఎల్‌అండ్‌ఓ పీఎస్ వద్ద పార్క్ చేయాలి. ⇒ ఖమ్మం, నల్లగొండ నుంచి విజయవాడ హైవే మీదుగా వచ్చే వాహనాలు ఎల్బీనగర్ రింగ్‌రోడ్డు, మలక్ పేట్, ఛాదర్‌ఘాట్, ఎంజే మార్కెట్, నాంపల్లి, తెలుగుతల్లి ఫ్లైవర్, లోయర్ ట్యాంక్‌బండ్, కవాడి గూడ మీదుగా బైబిల్ హౌస్‌కు చేరుకుని వాహనాలను మాత్రం ఎన్టీఆర్గార్డెన్, పబ్లిక్ గార్డెన్లో పార్క్ చే యాలి. ⇒ నల్లగొండ, మహబూబ్‌నగర్ లోని కొంత భాగం, యాచారం, యంచాల్, ఇబ్రహీంపట్నం నుంచి నాగార్జునసాగర్ హైవే నుంచి వాహనాలు సాగర్ రింగ్‌రోడ్డు, సైదాబాద్, చంచల్‌గూడ, మలక్‌పేట్, ఎంజే మార్కెట్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ మీదుగా బైబిల్ హౌస్‌కు చేరుకుని అక్కడ కార్యర్తలను దించివేసి వాహనాలు మాత్రం నిజాం కాలేజీలో పార్క్ చేయాలి. ⇒ కందుకూర్, మహేశ్వరం, మహబూబ్‌నగర్‌లోని కొంత భాగం నుంచి శ్రీశైలం హైవే మీదుగా వచ్చే వాహనాలు కందుకూర్, పహాడిషరీఫ్, సంతోష్‌నగర్ మీదుగా వచ్చి కర్బలా మైదానంలో కార్యకర్తలను దించివేసి వాహనాలను నెక్లెస్‌రోడ్‌లో పార్క్ చేయాలి. ⇒ మహబూబ్‌నగర్, శంషాబాద్, రాజేంద్రనగర్ నుంచి కర్నూల్ హైవేపై నుంచి వచ్చే వాహనాలు అరాంఘర్ చౌరాస్తా, పీవీఎన్ఆర్ ఫ్లైఓ వర్, మాసాబ్‌ట్యాంక్, పంజగుట్ట, బేగంపేట మీదుగా రసూల్‌పురాకు చేరుకుని అక్కడ కార్యకర్తలను దించివేసి నెక్లెస్‌రోడ్డులో వాహనాలను పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. వీఐపీ కార్ల పార్కింగ్... జింఖానా గ్రౌండ్, లంబారోడ్, ఆర్జీఆర్ సిద్ధాంతి కాలేజ్ , వెస్లీ డిగ్రీ కాలేజ్, లీ రాయల్ ప్యాలస్, చీఫ్ ఇంజనీరింగ్ కార్యాలయం, మహబూబియా కాలేజ్, ప్రభుత్వ జూనియర్ కాలేజ్, సెంటనరీ హై స్కూల్, హరి హర కళా భవన్, ఎస్బీహెచ్ చౌరస్తా నుంచి ప్యాట్నీ చౌరస్తా వరకు, ఎస్బీహెచ్ చౌరస్తా నుంచి ప్లాజా చౌరస్తా వరకు, కె.యస్.బాలికల ఉన్నత పాఠశాలలో వీఐపీ కార్ల పార్కింగ్‌ను కేటాయించారు. ఆయా ప్రాంతాల్లో కేవలం 830 కార్లు మాత్రమే పార్క్ చేస్తారు. డైవర్షన్ పాయింట్లు.. ⇒ సురభి గార్డన్, టివోలి జంక్షన్ హాల్ దగ్గర- సాధారణ ట్రాఫిక్‌ను ప్లాజా వైపు వెళ్లడానికి అనుమతించరు. ఈ ట్రాఫిక్‌ను జూబ్లీ బస్టాండ్, స్వీకార్ ఉపకార్, వైఎంసీఏ, జెయింట్ జోస్ రోటరీ, బ్రూక్ బాండ్, సీటీఓ వైపు పంపిస్తారు. ⇒ సీటీఓ జంక్షన్-సాధారణ ట్రాఫిక్‌ను ప్లాజా వైపు వెళ్లడానికి అనుమతించరు. ఈ ట్రాఫిక్‌ను రాజీవ్గాధీ విగ్రహం, లీరాయల్, బ్రూక్‌బాండ్, టీవోలీ, స్వీకార్ ఉపకార్, వైఎంసీఏ, ప్యారడైజ్, ఎస్డీరోడ్, ప్యాట్నీ, క్లాక్‌టవర్ వైపు మళ్లిస్తారు. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు కూకట్పల్లి: పరేడ్ గ్రౌండ్లో టీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రులు కె. తారకరామారావు, పద్మారావు, శ్రీనివాస్‌యాదవ్‌లు, కర్నె ప్రభాకర్, కూకట్పల్లి టీఆర్ఎస్ ఇన్చార్జ్ పద్మారావులు శనివారం పరిశీలించారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి జరిగే పార్టీ ఆవిర్భావ సభ ను విజయవంతం చేయాలని సూచించారు. -
టీఆర్ఎస్ ప్లీనరీకి.. సకల ఏర్పాట్లు
హైదరాబాద్ సిటీ : అధికార టీఆర్ఎస్ ప్లీనరీని విజయవంతం చేసేందుకు పార్టీ నాయకత్వం పని మొదలు పెట్టింది. ఈనెల 24న ఎల్బీ స్టేడియంలో జరగనున్న ప్లీనరీ కోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ మేరకు వేదిక, సభా ప్రాంగణం ఏర్పాట్ల కమిటీ చైర్మన్, మంత్రి పద్మారావు గౌడ్ శుక్రవారం ఎల్బీ స్టేడియాన్ని సందర్శించారు. జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్లీనరీకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి కలిపి 36వేల మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి చెప్పారు. -
రిజర్వాయర్, గొట్టపు మార్గం పనుల్లో జాప్యం
‘నిధులు పుష్కలంగా ఉన్నాయి. 2014 మార్చిలోపు నల్లగొండ జిల్లా కోదండపూర్ నుంచి మూడో దశ కృష్ణా జలాలను మహానగరానికి తరలిస్తాం’. 2013 మార్చిలో సాహెబ్‌నగర్ వద్ద పనుల శంకుస్థాపనలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి చెప్పిన మాట.. ‘మూడో దశ కృష్ణాజలాల పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకముందే డిసెంబర్‌లోపే మహానగరానికి కృష్ణా జలాల్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యం’. గత నెల 20న గునుగల్ రిజర్వాయర్ సందర్శనలో తెలంగాణ రాష్ట్ర మంత్రి పద్మారావు అన్న మాట. ‘కోదండపూర్ నుంచి మహానగరం వరకు అక్కడక్కడా కొన్ని చిన్న చిన్న పనులు, రిజర్వాయర్లలో కూడా పనులు మిగిలున్నాయి. డిసెంబర్‌లోపు నగరానికి కృష్ణా జలాలను తరలించకున్నా.. వచ్చే ఏడాది మార్చిలోపు తప్పనిసరిగా నీటిని తరలిస్తాం’. పనుల పర్యవేక్షణ ఉన్నతాధికారి అంటున్న మాట. ఆ అధికారి అన్న మాటలను బట్టి చూస్తే మూడో దశ కృష్ణా జలాలు డిసెంబరులో మహానగరానికి చేరడం కష్టమేననిపిస్తోంది. మూడో దశ కృష్ణా జలాలను గొట్టపు మార్గం ద్వారా మహానగరానికి అందించడానికి రూ. 1,670 కోట్ల అంచనా వ్యయంతో నగర సమీపంలోని సాహెబ్‌నగర్ వద్ద 2013 మార్చిలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. నల్లగొండ జిల్లా కోదండపూర్ నుంచి నగర సమీపంలోని బీఎన్ రెడ్డి (సాహెబ్‌నగర్) నగర్ వరకు 115 కిలోమీటర్ల మేర గోతులు తీసి గొట్టపు మార్గంలో పైపులు బిగించి మహానగరానికి 5.5 టీఎంసీల కృష్ణా జలాలను అందించడమే మూడో దశ లక్ష్యం. రూ.1,670 కోట్లలో గొట్టపు మార్గం పనుల పూర్తికి రూ.943.44 కోట్లు, కోదండపూర్ వద్ద రూ.149 కోట్ల వ్యయంతో నిర్మించే 90 మిలియన్ గ్యాలన్ల నీటిని శుద్ధి చేసే ప్లాంట్, రూ. 24 కోట్లతో నర్సర్లపల్లి, గోడుకొండ్ల, గునుగల్ కేంద్రాల వద్ద 99 ఎంఎల్ సామర్థ్యం కలిగిన నీటి జలాశయాలు, రూ.140 కోట్ల వ్యయంతో నీటి శుద్ధి కేంద్రాలు, పంపింగ్ కేంద్రాల వద్ద విద్యుత్ వ్యవస్థ కోసం అప్పటి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 2013లో ప్రారంభించిన పనులు 2014 మార్చిలోపే పూర్తయి మూడో దశ 5.5 టీఎంసీల కృష్ణా జలాలు మహానగరానికి చేరాల్సి ఉంది. కానీ అధికారుల్లో చిత్తశుద్ధి లేకపోవడం, ప్రభుత్వం నుంచి రూ.వందల కోట్ల నిధులు సకాలంలో అందకపోవడం వల్లే పనులు నత్తనడకన సాగుతున్నట్లు ఆయా కంపెనీల ప్రతినిధులు పేర్కొంటున్నారు. మంత్రి పద్మారావు అన్నట్లు గడువు ఇంకా 50 రోజులు ఉంది. ఇప్పటికైనా నిధులు తక్షణమే విడుదల చేస్తే పనులు చకచకా పూర్తి చేయడం సాధ్యమేనని వారు అంటున్నారు. ప్రస్తుతం పనులు పరిస్థితి చూస్తే వచ్చే ఏడాది మార్చి లోపు కూడా పూర్తి స్థాయిలో మహానగరానికి మూడో దశ కృష్ణా జలాలు అందేలా కనిపించడం లేదు. ఇదే విషయమై మూడో దశ పనుల పర్యవేక్షణ చేసే ఓ ఉన్నతాధికారిని సంప్రదించగా డిసెంబర్లో పనులు పూర్తిచేసి కృష్ణాజలాలు నగరానికి అందించేలా చూస్తున్నాం. కానీ వచ్చే ఏడాది మార్చి లోపు మాత్రం కచ్చితంగా సరఫరా చేస్తామనే నమ్మకం తమకు ఉందన్నారు. ఆశలన్నీ మూడో దశపైనే.. ఇబ్రహీంపట్నం డివిజన్ ప్రజలు మూడో దశ కృష్ణాజలాల సరఫరాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ కొన్నేళ్లుగా సాధారణ వర్షపాతం కూడా నమోదు కావడంలేదు. భూగర్భ జలాల నీటి మట్టం 500 అడుగులకు పడిపోయింది. డివిజన్లోని ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల, హయత్‌నగర్ మండలాల్లో చాలా గ్రామాల్లో ఇప్పటికే బోరుబావులు పూర్తిగా ఎండిపోయాయి. హయత్‌నగర్ మండలం మినహా మిగతా మూడు మండలాల్లోని 100కుపైగా గ్రామాల్లో ఫ్లోరైడ్ శాతం అత్యధికంగా ఉంది. ఏడేళ్లుగా మూడు మండలాల్లోని 135 గ్రామాలకుపైగా కృష్ణాజలాలు సరఫరా చేస్తున్న ప్రత్యేక సంపులు, ట్యాంకులు లేకపోవడంతో ఫ్లోరైడ్ నీరే దిక్కవుతోంది. డివిజన్లో నిత్యం కోటీ 50 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తే కొంతవరకైనా నీటి ఎద్దడి తప్పుతుంది. గునుగల్ రిజర్వాయర్ నుంచి డివిజన్లోని పలు మండలాలకు నిత్యం 60 నుంచి 70 లక్షల లీటర్ల నీటిని మాత్రమే మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు సరఫరా చేస్తున్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు యాచారం, ఇబ్రహీంపట్నం, లోయపల్లి, కందుకూరులకు నాలుగు లైన్ల ద్వారా నాలుగు రోజులకోసారి కృష్ణాజలాలను సరఫరా చేస్తున్నారు. మూడో దశ పనులు పూర్తయితేనే ఇబ్రహీంపట్నం ప్రజలకు సరిపడా కృష్ణాజలాలు సరఫరా చేస్తామని గత నెల గునుగల్‌కు వచ్చిన మంత్రి పద్మారావు, మెట్రో వాటర్‌వర్క్స్ అధికారులు హామీ ఇవ్వడంతో ప్రజల్లో ఆశలు రేకెత్తాయి. కరువు పరిస్థితులతో ఇప్పటికే డివిజన్లో నీటి ఎద్దడి తీవ్రమవుతోంది. మార్చిలోపు నీరు అందితేనే ప్రజల నీటి కష్టాలు తీరుతాయని డివిజన్ ఆర్డబ్ల్యూఎస్ డీఈ విజయలక్ష్మి పేర్కొన్నారు. -
మంత్రి సభలో వాగ్వాదం
కూసుమంచి : ఆసరా పథకం పింఛన్ల పంపిణీ కోసం కూసుమంచిలో శనివారం ఏర్పాటు చేసిన సభ రసాభాసగా మారింది. పింఛన్ల పంపిణీకి రాష్ట్ర మంత్రి పద్మారావు ముఖ్య అతిథిగా రాగా పాల్గొన్న ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాన్ని విమర్శించారు. దీంతో సభలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే మాట్లాడుతూ మేం జిల్లాలో 2.45 లక్షల మందికి పింఛన్లు ఇస్తే ఈ ప్రభుత్వం తగ్గిస్తోందని, పింఛన్లు ఎందుకు తగ్గిస్తారని, ఏ ఒక్క పింఛన్ పోయినా తాను ఊరుకోనని, పోరాడుతానని అన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లకు కూడా బడ్జెట్లో వెయ్యి కోట్లు ఇస్తే ఎందుకు సరిపోవడం లేదని, పెండిండ్ బిల్లులే రూ.1500 కోట్లు ఉన్నాయని, వీరు ఇచ్చింది ఏ ముందని ప్రశ్నించారు. అసలు తెలంగాణ తెచ్చింది, ఇచ్చింది మేమేనని ఎమ్మెల్యే అనడంతో టీఆర్ఎస్ పాలేరు నియోజకవర్గ ఇన్చార్జ్ బత్తుల సోమయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అసలు మీ ప్రభుత్వం ఏమి చేసిందని ..? మీ ప్రభుత్వంలోనే ఇళ్ల బిల్లులు రాలేదని, మీరే తెలంగాణ ద్రోహి’ అంటూ ఎమ్మెల్యే ప్రసంగానికి అడ్డుతగిలారు. ఆయనకు టీఆర్ఎస్ కార్యకర్తలు మద్దతు పలికి జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. దీంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ క్రమంలో డీఎస్సీ బాలకిషన్, సీఐ రవీందర్‌రెడ్డి కలుగ జేసుకుని సోమయ్యను, కార్యకర్తలను శాంతింపజేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు మద్దతుగా కాంగ్రెస్ కార్యకర్తలు జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ కార్యకర్త ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కుర్చీని వేదికపైకి విసిరేందుకు యత్నించగా పోలీసు లు అడ్డుకున్నారు. దీంతో మంత్రి పద్మారావు కల్పించుకుని టీఆర్ఎస్ కార్యకర్తలను వారించారు. సభా వేదికపై ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని విమర్శిస్తుండగా జడ్పీ చైర్మన్ కవిత అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో వారి మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేకు మంత్రి చురకలు... ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడిన ఎమ్మెల్యేకు మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి తనదైన శైలిలో చురకలు వేశారు. మంత్రి మాట్లాడుతూ రాంరెడ్డి వెంకటరెడ్డి అన్నకు తనకు ముప్పై ఏళ్లుగా పరిచయం ఉందని, ఆయనున్న తాను రామన్న అంటూ పిలుస్తానని కవ్వింపుగా మాట్లాడారు. అన్నా అంటూ పిలిచిన తనను మంచిగా హైదరాబాద్‌కు పంపుతాడేమోనని అనుకుంటే పక్కనే ఉంటూ బొక్కేసిండూ అంటూ చురకలేశాడు. అన్నా మీరు మాట్లాడింది బాగానే ఉంది కానీ, మీ ప్రభుత్వంలోనే తెలంగాణకు ఒక్క పైసాగూడా ఇవ్వమని అప్పటి ఆంధ్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినప్పుడు మీరు మంత్రిగానే ఉన్నారు కదా..? అప్పుడు తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే నివ్వెర పోయారు. ఈ ప్రభుత్వం వచ్చి ఐదు నెలలే అవుతోందని, అప్పుడే విమర్శిస్తే ఎలా..? అభివృద్ధికి సహకరించాలంటూ మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. -
చురుగ్గా కృష్ణా మూడోదశ పనులు
కొత్తగా అధునాతన రిజర్వాయర్ల నిర్మాణం శాశ్వత రహదారులు మంత్రి పద్మారావు వెల్లడి సికింద్రాబాద్: కృష్ణాజలాల మూడోదశ నిర్మాణపనులు చురుగ్గాసాగుతున్నాయని రాష్ర్ట ఎక్సైజ్‌శాఖ మంత్రి టీ.పద్మారావు ప్రకటించారు. రూ. వందకోట్లతో పనులు జరుగుతున్నాయన్నారు. సికింద్రాబాద్ ప్రాంతంలో తాగునీరు, మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారమార్గం చూపేందుకు బృహత్తర ప్రణాళిక రూపొందించామని ఆయన ప్రకటించారు. డిసెంబర్ నెలాఖరు నాటికి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారమార్గం లభిస్తుందన్నారు. అదే విధంగా రూ. 600 కోట్లతో ఈ ప్రాంతంలోని డ్రైనేజీ వ్యవస్థను సమూలంగా ఆధునీకరించనున్నామని తెలిపారు. సీఎం నుంచి అనుమతి వచ్చినవెంటనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. బుధవారం జలమండలి అధికారులతో సికింద్రాబాద్, సనత్‌నగర్ నియోజకవర్గాల్లో మంత్రి పర్యటించారు. రిజర్వాయర్లను పరిశీలించారు. కృష్ణాజలాలు వచ్చేలోపు రిజర్వాయర్లను ఆధునీకరించనున్నామని చెప్పారు. అలాగే నీటి నిల్వకోసం భారీ స్టోరేజ్ రిజర్వాయర్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. హుస్సేన్‌సాగర్, మారేడుపల్లి, తార్నాక, లాలాపేట, సీతాఫల్ మండి ప్రాంతాల్లోని ప్రస్తుత రిజర్వాయర్ల స్థానంలో అధునాతన పద్ధతుల్లో రిజర్వాయర్ నిర్మాణం పనులు చేపడుతున్నామని చెప్పారు. సికింద్రాబాద్ ప్రాంతంలో జనాభాకు సరిపడేలా డ్రైనేజీలను నిర్మిస్తామని, ఇందుకు రూ.600 కోట్లు ఖర్చు అవుతుందని అంచనాలు చేశామన్నారు. ఈ ప్రాంతంలో అధునాతన రహదారుల వ్యవస్థను ఏర్పాటుచేస్తామన్నారు. భవిష్యత్తులో రహదారులను తవ్వే అవకాశం ఉండకుండా భూగర్భం నుంచి అవసరమైన లైన్లను వేసిన మీదట రహదారుల నిర్మాణం చేపడుతామని చెప్పారు. ప్రయోగాత్మకంగా ఎల్ఈడీ విద్యుత్‌దీపాల ఏర్పాటును అమలులోకి తెచ్చామన్నారు. త్వరలో అన్ని రహదారుల్లో ఇవే విద్యుత్దీపాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జలమండలి మారేడుపల్లి డివిజన్ మేనేజర్ ఎస్.ఆనంద్‌స్వరూప్, డిప్యూటీ జీఎంలు దామోదర్‌రెడ్డి, హరుణాకర్రెడ్డి, రాజశేఖర్, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, టీఆర్ఎస్ నగర నాయకులు శేఖర్, ఆకుల నాగభూషణం, కరాటే రాజు, సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
డిసెంబర్ నాటికి నగరానికి ‘కృష్ణా’ నీళ్లు
మంత్రి పద్మారావు వెల్లడి సీఎం ఆదేశాల మేరకు పైపులైన్ పనుల పరిశీలన సాక్షి, సిటీబ్యూరో: కృష్ణా మూడోదశ ప్రాజెక్టును వచ్చే డిసెంబర్‌నాటికి పాక్షికంగా పూర్తిచేసి నగరానికి 22.5 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తామని ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తిస్థాయిలో మూడోదశ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందని, తద్వారా గ్రేటర్‌కు 90 మిలియన్ గ్యాలన్ల కృష్ణా జలాలు అందుతాయన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆయన సోమవారం మూడోదశ పనులను జలమండలి ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. నగర శివార్లలోని సాహెబ్‌నగర్ నుంచి గోడకొండ్ల, గున్గల్, నాసర్లపల్లి, నల్లగొండ జిల్లా కోదండాపూర్ వరకు సుమారు 110 కిలోమీటర్ల పరిధిలో జరుగుతున్న పైప్‌లైన్, పంప్‌హౌజ్, నీటిశుద్ధి కేంద్రాల పనులను పరిశీలించారు. పనుల పురోగతి పట్ల సంతృప్తి వ్యక్తంచేశారు. కోదండాపూర్ నీటి శుద్ధి కేంద్రం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఏడాది జూలై నాటికి గోదావరి మంచినీటి పథకాన్ని పూర్తిచేసి నగరానికి 170 మిలియన్ గ్యాలన్ల గోదావరి జలాలను సరఫరా చేయనున్నామన్నారు. నాగార్జున సాగర్ జలాశయంలో నీటినిల్వలు తగ్గినపుడు డెడ్‌స్టోరేజి నుంచి సైతం గ్రేటర్ తా గునీటి అవసరాలకు అవసరమైన నీటిని సేకరించేం దుకు సుంకిశాల కృష్ణా హెడ్‌వర్క్స్ పనులను పూర్తిచేస్తామన్నారు. ఇందుకోసం రూ.840 కోట్ల అంచనా వ్యయంతో రూ పొందించిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సమర్పించనున్నామని తెలిపారు. కృష్ణా మూడోదశ పైప్‌లైన్‌కు ఆనుకొని ఉన్న గ్రామాల తాగునీటి అవసరాలకు కృష్ణా జలాలను సరఫరా చేస్తామన్నారు. అవసరమైతే కృష్ణా నాలుగోదశ.. రాబోయే పదేళ్లలో నగర జనాభా ప్రస్తుతం ఉన్న కోటి నుంచి రెండు కోట్లకు చేరుకుంటుందని..అప్పటి జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకొని అవసరమైతే కృష్ణా నాలుగోదశ పథకాన్ని చేపట్టే అంశాన్ని పరిశీలిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి పద్మారావు చెప్పారు. కృష్ణా జలాల్లో 30 టీఎంసీలకు గాను ప్రస్తుతం కృష్ణా మూడుదశల ప్రాజెక్టుల ద్వారా 16.5 టీఎంసీల జలాలను నగర తాగునీటి అవసరాలకు మళ్లిస్తున్నామన్నారు. నీటి వృథాను అరికట్టడం,జలమండలి నష్టాలను అధిగమించేందుకు కనీసం నీటి శుద్ధికి అయ్యే నిర్వహణ వ్యయాన్ని ఛార్జీల రూపంలో వసూలు చేయక తప్పదని పేర్కొన్నారు. ఈ పర్యటనలో మంత్రి వెంట జలమండలి ఎండీ జగదీశ్వర్, డెరైక్టర్లు రామేశ్వర్రావు, కొండారెడ్డి, సత్యనారాయణ, ఎల్లాస్వామి, జలమండలి ఉన్నతాధికారులు ఇతర టీఆర్ఎస్ నాయకులున్నారు. కృష్ణా ప్రాజెక్టు లోన్‌కు రూ.15 కోట్లు విడుదల.. కృష్ణా మొదటి,రెండవ దశ ప్రాజెక్టుల కోసం గతంలో జలమండలి సేకరించిన రుణానికి సంబంధించి వాయిదా చెల్లించేందుకు రూ.15 కోట్లు విడుదల చేస్తూ మున్సిపల్ పరిపాలన శాఖ సోమవారం ఉత్తర్వులిచ్చింది. -
డిసెంబర్‌లోగా నగరానికి మూడోదశ కృష్ణాజలాలు
యాచారం: నగర ప్రజలకు నీటి ఎద్దడి తలెత్తకుండా డిసెంబర్‌నాటికి మూడోదశ కృష్ణా జలాలను తరలించడానికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు పేర్కొన్నారు. సోమవారం ఉదయం ఆయన నాగార్జునసాగర్-హైదరాబాద్ రహదారిపై జరుగుతున్న మూడో దశ కృష్ణాజలాల తరలింపు పనులను పరిశీలించారు. మార్గమధ్యలో గునుగల్ గ్రామంలో ఉన్న రిజర్వాయర్‌ను సందర్శించారు. ఇక్కడ నిర్మిస్తున్న 99 ఎంఎల్ నీటి నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్లను పరిశీలించారు. నీటి సామర్థ్యం, ఎప్పటిలోగా పూర్తవుతుంది తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గునుగల్లో నిర్మించిన రిజర్వాయర్లు, మూడో దశ రిజర్వాయర్ల పనులు తదితర విషయాలను హెచ్ఎండబ్ల్యూఎస్ ఎండీ జగదీశ్వర్ మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పనుల్లో వేగవంతం కోసమే అధికారుల బృందంతో కలిసి హైదరాబాద్ నుంచి నల్లగొండ జిల్లా కోదండపూర్ వరకు జరుగుతున్న పైపులైన్, రిజర్వాయర్ల పనులను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. నీటి పన్ను చెల్లించే విషయంలో ప్రజల్లో చైతన్యం తీసుకరావాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. పన్నులు చెల్లిస్తే నీటి ఇబ్బంది ఉండదన్నారు. పన్నుల వసూలు విషయంలో సీఎం కేసీఆర్ సైతం కఠినంగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ‘పట్నం’ ప్రజలకు సరిపడా.. మూడోదశ కృష్ణా జలాల్లో ఇబ్రహీంపట్నం డివిజన్ ప్రజలకు సరిపడా తాగునీరు అందించే విధంగా అధికారులను ఆదేశించనున్నట్లు మంత్రి తెలిపారు. కరువు ప్రాంతమైన పట్నంకు సరిపడా కృష్ణాజలాలు సరఫరా చేయాలని టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, గునుగల్ సర్పంచ్ అచ్చెన మల్లికార్జున్ తదితరులు మంత్రికి విన్నవించారు. దీనికి స్పందించిన మంత్రి నివేదిక తెప్పించుకొని సీఎం ఆదేశాల మేరకు ఈ ప్రాంతానికి తాగునీరు అందించేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో హెచ్ఎండబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు సత్యానారాయణ, కొండారెడ్డి, విజయకుమార్, దశరథ్‌రెడ్డి, వైస్ ఎంపీపీ రామకృష్ణ యాదవ్, నాయకులు శ్రీనివాస్, జగదీశ్వర్ యాదవ్, నారాయణరెడ్డి, యాదయ్య గౌడ్, లక్ష్మణ్, మధుసూదన్‌రెడ్డి, సంధాని, భాషా, భాస్కర్, కిషన్ తదితరులు పాల్గొన్నారు. -
సికింద్రాబాద్ అభివృద్ధికి రూ.300 కోట్లు
మంత్రి పద్మారావు సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్, కంటోన్మెంట్ బోర్డు పరిధిలో రూ.300 కోట్ల అంచనా వ్యయంతో మంచినీటి పైప్లైన్ల విస్తరణ, స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణం, డ్రైనేజీ వంటి వసతులు కల్పిస్తామని ఆబ్కారీశాఖమంత్రి పద్మారావు తెలిపారు. గురువారం సచివాలయంలోని తన ఛాంబర్లో జలమండలి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గతంలో ఈప్రాంతంలో మౌలిక వసతుల కల్పనకు ఉద్దేశించి సిద్ధంచేసిన మాస్టర్‌ప్లాన్‌ను సమగ్రంగా అమలు చేస్తామన్నారు. ముఖ్యంగా మారేడ్‌పల్లి, తార్నాక, లాలాపేట్ ప్రాంతాల్లో భారీ మంచినీటి స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణానికి అంచనాలు సిద్ధంచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. సీతాఫల్మండి ప్రాంతంలో స్టోరేజి రిజర్వాయర్‌కు మరమ్మతులు చేపట్టాలని సూచించారు. కంటోన్మెంట్ పరిధిలో తాగునీరు, డ్రైనేజి వసతుల కల్పనపై నెలకొన్న వివాదాలను త్వరితంగా పరిష్కరించాలన్నారు. సికింద్రాబాద్ పరిధిలో మురుగునీటి పారుదల వ్యవస్థను ఆధునికీకరించేందుకు భారీ ట్రంక్‌మెయిన్స్, లేటరల్స్ నిర్మించాలని సూచించారు. అడ్డగుట్ట, మారేడ్‌పల్లి, లాలాపేట్, తార్నాక పరిధిలోని అన్ని కాలనీలు, బస్తీల్లో మంచినీరు, డ్రైనేజీ వసతులు కల్పించాలన్నారు. మూడోదశపై సమీక్ష కృష్ణా మూడోదశ ప్రాజెక్టును త్వరితంగా పూర్తిచేసి, నగరానికి అదనంగా 90 మిలియన్ గ్యాలన్ల కృష్ణాజలాలను తరలించి నగరం నలుమూలలకు సరఫరా చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో జలమండలి ఆపరేషన్స్ విభాగం డెరైక్టర్ రామేశ్వర్రావు, జీఎం ఆనంద్‌స్వరూప్, డీజీఎం హర్నాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆబ్కారీ చేతిలో ఆయుధం
ఖమ్మం క్రైం : ఎక్సైజ్ సిబ్బంది చేతికి ఇక ఆయుధాలు రాబోతున్నాయి. సాయుధ పోలీసు దళంలో వీరూ చేరబోతున్నారు. గుడుంబా తయారీదారులు, గంజాయి స్మగ్లర్ల నుంచి ప్రాణాపాయం లేకుండా వీరికి తుపాకులు అప్పగించే కార్యక్రమానికి రంగం సిద్ధమవుతోంది. ఎక్సైజ్ సిబ్బందికి ఆయుధాలు ఇచ్చేందుకు నిర్ణయించినట్లు ఆ శాఖ మంత్రి పద్మారావు ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఏయే ప్రాంతాల్లో సిబ్బందికి ఆయుధాలు అవసరముంటాయో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు నివేదికలు తయారు చేస్తున్నారు. ఎందుకు ఇలా..? జిల్లాలో గుడుంబా తయారీ ఎక్కువగా ఉండడం, ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగు చేస్తుండడం తెలిసిందే. వీటిని అరికట్టడానికి వెళ్లిన ఎక్సైజ్ సిబ్బందిపై దాడులు జరిగాయి. చేతుల్లో ఎలాంటి ఆయుధాలు లేకపోవడంతో సిబ్బంది ఈ దాడులను ఎదుర్కొలేక ఇబ్బందు లు పడుతున్నారు. గాయాలకు గురై ఆస్పత్రుల్లో చేరిన సందర్భాలూ ఉన్నాయి. గుడుంబా తయారీదారులు, గంజాయి సాగుదారుల దాడులను ఎదుర్కొనేందుకు పోలీస్ శాఖ సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక వైపు శాంతిభద్రతల విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు ఎక్సైజ్ సిబ్బందితో కలిసి దాడుల్లో పాల్గొనడం పోలీసులకు ఇబ్బందికరంగా మారింది. పోలీస్ శాఖపై ఆధార పడకుండా ఎక్సైజ్ శాఖకు ఆయుధాలు ఇవ్వాలని గత ప్రభుత్వాలు భావించినా అది అమలుకు నోచుకోలేదు. నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మేరకు చొరవ చూపుతోంది. ఎక్సైజ్ శాఖకు ఆయుధాలు ఇవ్వాలని నిర్ణయించింది. సమస్యాత్మక ప్రాంతాల్లోనే... జిల్లాలో గుడుంబా తయారయ్యే సమస్యాత్మక ప్రాంతాల్లోనే సిబ్బందికి ఆయుధాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఏయే ప్రాంతాల్లో ఎక్సైజ్ సిబ్బందిపై గుడుంబా తయారీదారులు, గంజాయి స్మగ్లర్లు దాడులు చేసే అవకాశముందో ఆ సిబ్బంది సంఖ్య గురించి నివేదిక పంపించాలని భావిస్తున్నారు. జిల్లాలో పని చేస్తున్న ఎక్సైజ్ అధికారులతో పాటు సిబ్బందికి కూడా ఆయుధాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. ఎవరెవరికి... జిల్లాలో ఒక డిప్యూటీ కమిషనర్, ఒక అసిస్టెంట్ కమిషనర్, ఇద్దరు ఈఎస్‌లు, ముగ్గురు ఏఈఎస్‌లు, 19 మంది సీఐలు, 42 మంది ఎస్సైలు, 38 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 194 మంది కానిస్టేబుళ్లు ఆయుధాలు చేపట్టే అవకాశం ఉంది. వీరిలో అధికారుల వరకు 9 పాయింట్ 38 రివాల్వర్లు మిగతా సిబ్బందికి 303 తుపాకులు ఇవ్వనున్నట్లు తెలిసింది. అయితే వీరిలో కొద్దిమంది సీఐలు, ఎస్సైలు, జూనియర్ అసిస్టెంట్ల స్థాయి నుంచి పదోన్నతిపై రావడంతో వారికి వెపన్ ట్రైనింగ్‌పై అవగాహన లేదు. మిగతా వారు ఎక్సైజ్ ఎస్సై స్థాయి నుంచి రావడంతో వారికి శిక్షణలో భాగంగానే ఎక్సైజ్ అకాడమీలో వెపన్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. వెపన్ ట్రైనింగ్‌పై అవగాహన లేనివారి గురించి వివరాలను ఎక్సైజ్ ఉన్నతాధికారులు తయారు చేస్తున్నారు. ఈ సిబ్బందిలో ఎంత మందికి ఆయుధాలు ఇవ్వాలనే దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన తర్వాత ఎక్సైజ్ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. -
అమరుల కుటుంబాలను ఆదుకుంటాం
సాక్షి, ఖమ్మం: ‘1969 నుంచి ప్రత్యేక రాష్ట్రం సిద్ధించే వరకు ఎందరో వీరుల త్యాగఫలం తెలంగాణ.. రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది అసువులుబాశారు. వారి కుటుంబాలకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రతి అమరుడి కుటుంబానికి రూ.10 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది. అమరవీరులకుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం.. వ్యవసాయాధారిత కుటుంబాలకు వ్యవసాయ భూమి, అమర వీరుల పిల్లలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తాం.’ అని ఎక్త్సెజ్ శాఖ మంత్రి టి.పద్మారావు ప్రకటించారు. నవ తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం తొలి స్వాతంత్య్ర వేడుకలు జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ నినాదాలు, గీతాలు, సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా నృత్యాలు, ప్రదర్శనలతో గ్రౌండ్ మార్మోగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి టి.పద్మారావుగౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో అమరుడైన కరీంనగర్‌కు చెందిన పోలీస్ కిష్టయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడంతోనే అమర వీరులకు కుటుంబాలను ఆదుకునే ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా పోరాడిన ఉద్యమకారులపై సీమాంధ్ర సర్కారు అనేక అక్రమ కేసులు బనాయించిందని, వీటన్నింటినీ ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. పంట చేతికి రాక, సాగుకు చేసిన అప్పులు తీర్చలేక..కుటుంబం గడవక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారి రుణ భారాన్ని పంచుకోవడాన్ని ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ.లక్ష వరకు రుణ మాఫీ చేస్తుందని హామీ ఇచ్చారు. గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని గిరిజన సోదరులు ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించి వారికి విద్య, ఉద్యోగావకాశాలను మెరుగు పరచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి, సకలజనుల సమ్మె చేసిన ఉద్యోగుల సంక్షేమం తమ బాధ్యత అని, అందుకే ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రత్యేక తెలంగాణ ఇంక్రిమెంట్ ప్రకటించామని చెప్పారు. అద్భుత పథకంకళ్యాణలక్ష్మి .. పేద దళిత, గిరిజన ఆడపిల్లల వివాహానికి రూ.50 వేలు ఆర్థిక సహాయం అందించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలోంచి పుట్టిన పథకమే కల్యాణ లక్ష్మి అని మంత్రి పద్మారావు అన్నారు. దేశ చరిత్రలోనే ఇలాంటి పథకం లేదన్నారు. పేద విద్యార్థులు వృత్తి, ఉన్నత విద్యలనభ్యసించేందుకు వీలుగా ప్రభుత్వం ఫాస్ట్ పథకం ప్రవేశపెట్టిందన్నారు. గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండే ఆర్ఎంపీ, పీఎంపీలకు ప్రభుత్వం సర్టిఫికెట్లు ఇచ్చి వారికి గుర్తింపునిస్తుందని పేర్కొన్నారు. దళిత బిడ్డలు పూర్ణ, ఆనంద్ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి తెలంగాణ రాష్ట్ర కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటారని ప్రశంసించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించే ఉద్దేశంతోనే సమగ్ర సర్వే కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. సర్వే రోజున ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవు ప్రకటించారని, ఆ రోజు అందరూ ఇళ్లలోనే ఉండాలని కోరారు. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో 40 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు తెలిపారు. గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహిస్తాం.. వచ్చే ఏడాది జూలైలో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు ఘనంగా ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలో రూ.18.26 కోట్లతో 255 పనులు జరుగుతున్నాయన్నారు. జిల్లాలోని ఆరు పురపాలక సంఘాల్లో రానున్న రోజుల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేయనుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల వరుసగా జరిగిన సార్వత్రిక, మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగిలే జిల్లా అధికారులు, పోలీసులు కృషి చేశారని ప్రశంసించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి, ఎస్పీ ఏవీ.రంగనాథ్, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, బాణోతు మదన్‌లాల్, ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, జాయిల్ కలెక్టర్ సురేంద్రమోహన్, పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. -
కొత్త పేషీలో పాత సిబ్బంది !
* మంత్రులు మారినా, ప్రభుత్వాలు మారినా అధికారులు వారే * దశాబ్దాలుగా పేషీల్లో తిష * పైరవీలు చేసుకుని మంత్రుల వద్దకు చేరుతున్న వైనం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం మారింది.. ప్రభుత్వం మారింది.. మంత్రులూ మారారు.. కానీ మంత్రుల పేషీల్లో పనిచేసే అధికారులుగానీ, సిబ్బందిగానీ మారడం లేదు. పేషీల్లో పనిచేసే అధికారులు సొంత శాఖలో పనిచేయడం మానేసి దశాబ్దాలు గడుస్తోంది. వారంతా మంత్రుల పేషీలను అతుక్కుపోయారు. అక్కడుండే అధికారం, ఇతరత్రా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలేవైనా పేషీల్లో తామే ఉండాలన్నట్టుగా మంత్రులు ఇంకా బాధ్యతలు స్వీకరించకముందే వాలిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ ఒరవడిలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. కొందరైతే పదవీ విరమణ చేసినా.. ఇంకా పేషీల్లో కొనసాగడానికే ఇష్టపడుతున్నారు. దానికి మంత్రులు కూడా ప్రోత్సహిస్తుండడం గమనార్హం. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన పేషిలోకి నిప్పు కణికల్లాంటి అధికారులను తీసుకుంటానని, ఎట్టిపరిస్థితుల్లోనూ అవినీతి సహించేది లేదని స్పష్టం చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే తన పేషీలోకి అలాంటి ఇమేజ్ ఉన్నవారినే తెచ్చుకోవాలని నిర్ణయించారు. మెదక్ జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్‌ను తన పేషీలో అదనపు కార్యదర్శి స్థాయి హోదాలో నియమించుకున్నారు. మంత్రుల పేషీల్లో నియమించుకునే అధికారులకు సంబంధించి జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్ హెచ్చరిస్తున్నా.. మంత్రులు మాత్రం దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. మంత్రుల కంటే ముందే పేషీల్లో పనిచేసే సిబ్బంది పైరవీల్లో మునిగి తేలుతున్నారు. మంత్రుల నుంచి లేఖలు తీసుకుంటూ.. సాధారణ పరిపాలన శాఖకు పంపిస్తున్నారు. సాధారణంగా మంత్రులు కోరిన వారిని వారి పేషీల్లో నియమిస్తుంటారు. గతంలో పేషీల్లో సిబ్బందికి సంబంధించి నిఘా విభాగం నుంచి నివేదికలు తెప్పించుకున్న తర్వాత.. వారి నియామకాలు జరిగేవి. పదవీ విరమణ చేసిన అధికారులను నియమించుకోరాదని కూడా ఉత్తర్వులు ఉన్నాయి. కానీ ఇవేవీ పట్టనట్లు మంత్రులపై ఒత్తిళ్లు తెచ్చి, మరీ పేషీల్లో చేరుతున్నారు. ప్రస్తుతానికి ఈ పేషీ అధికారులెవరికీ సాధారణ పరిపాలన శాఖ నుంచి నియామక ఉత్తర్వులు అందనప్పటికీ అక్కడే పనిచేస్తుండడం గమనార్హం. అంతా పాత వారే... గతంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి వద్ద పనిచేసిన మోహన్‌లాల్ ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వద్ద చేరారు. గతంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి వద్ద పనిచేసిన పేషీ సిబ్బంది మొత్తం ప్రస్తుతం హోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాయిని నర్సింహారెడ్డి పేషీలో ప్రత్యక్షమయ్యారు. మాజీ మంత్రి గీతారెడ్డి వద్ద పనిచేసిన ఉపేందర్‌రావు, బన్నయ్యలు ఇప్పుడు రవాణా శాఖ మంత్రి వద్ద చేరినట్లు సమాచారం. పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రిగా పనిచేసిన మోపిదేవి వద్ద పీఎస్‌గా విధులు నిర్వర్తించిన మాణిక్‌ప్రభు ఇప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు వద్ద చేరుతున్నారు. గతంలో స్త్రీ, శిశు సంక్షేమ, ఐకేపీ శాఖ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి వద్ద పనిచేసిన సత్యనారాయణరెడ్డి ఇప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రి వద్ద పీఎస్‌గా చేరుతున్నట్టు తెలిసింది. టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన విజయరామారావు, హరీష్‌రావు వద్ద పనిచేసిన జాన్‌వెస్లీ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ వద్ద చేరనున్నారు. వీరే కాదు... గతంలో పీఎస్‌లు, పీఏలుగా పనిచేసిన పలువురు అధికారులు ఇంకా బాధ్యతలు తీసుకోని మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు.