'గుడుంబా పై యుద్ధం'
హైదరాబాద్:గుడుంబాపై ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందని సోమవారం మంత్రి పద్మారావు స్పష్టం చేశారు. గుడుంబాను అరికట్టడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. అవసరమైతే గుడుంబాను అరికట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులను సస్పెండ్ చేస్తామని మీడియా సమావేశంలో అన్నారు.
గ్రామ గ్రామాన, కిరాణా స్టోర్లలోమద్యం అంటూ కొందరు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారన్నారు. ఒక్కో మద్యం కేసు పై రూ.1800 టాక్స్ వస్తుంటే రూ.700లకు తగ్గించి గుడుంబాకు ప్రత్యామ్నయంగా మద్యం తీసుకురావాలని చర్చలు జరుగుతున్నయని తెలిపారు. కొన్ని వందల కోట్ల నష్టం వచ్చినా సరే...తక్కువ ధరలకే మద్యం అందించి గుడుంబాను అరికట్టేలా చర్యలు ప్రారంభించనున్నామన్నారు. తక్కువ ధరకే 90 ఎంఎల్ మద్యాన్ని 15 రూ.లకే అందించడంతో వారు గుడుంబాను వదిలేసే అవకాశం ఉందన్నారు.