gudumba
-
న్యూట్రీఫెర్మ్తో గుడుంబా తయారీ.. తాగితే ప్రాణాలు పోవడం ఖాయం!
కొత్తగూడ(మహబూబాబాద్ జిల్లా): ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలు, గిరిజనులు మొదట సహజసిద్ధమైన ఇప్పపువ్వుతో గుడుంబా తయారు చేసుకుని తాగేవారు. క్రమంగా బెల్లం, పటిక, యూరియాతో తయారుచేసి గుడుంబాను విక్రయించారు. అయితే నల్లబెల్లం విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో కొన్ని రోజులు చక్కెర వినియోగించారు. కాగా బెల్లంతో అయినా చెక్కెరతో అయినా గుడుంబా తయారీలో పటిక క్రీయాశీలకంగా మారింది. కాగా పటిక దొరక్కపోవడంతో తయారీదారులు కొత్తపుంతలు తొక్కుతున్నారు. న్యూట్రీఫెర్మ్ స్ప్రే మందుతో గుడుంబా తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చదవండి: ప్రగతి భవన్లో మంత్రి ‘కేటీఆర్’ ఎమోషనల్ సీన్.. 500గ్రాముల ప్యాకెట్‌తో 20సీసాలు.. పటిక దొరక్కపోవడంతో తయారీదారులు కొత్తదారిలో వెళ్తున్నారు. 500గ్రాముల ప్యాకెట్‌తో 20 సీసాల గుడుంబా వస్తోంది. దీనికి బెల్లం, చక్కెర, పటికతో పనిలేదు. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు పట్టుకునే అవకాశం లేదు. యథేచ్ఛగా తీసుకెళ్లవచ్చు. మిర్చి, పత్తిలాంటి ఆరుతడి పంటల ఎదుగుదలకు న్యూట్రీఫెర్మ్ అనే మందు ఫర్టిలైజర్ షాపుల్లో దొరుకుతుంది. ఓ ప్యాకెట్ తీసుకుని ఒక డ్రమ్ములో సగం నీరు పోసి కలియబెట్టి రెండు రోజులు నానబెడతారు. మూడోరోజు గుడుంబా తయారు చేసే విధంగానే బట్టీ పెడతారు. సాధారణంగా గుడుంబా తయారు చేయడాని వారం రోజులు పడుతుంది. దీనికి రెండు రోజులే సమయం పట్టడం, అధికారులు దీనిపై దృష్టి పెట్టకపోవడంతో తయారీదారులు గుట్టుచప్పుడు కాకుండా న్యూట్రీఫెర్మ్ గుడుంబా తయారు చేస్తున్నారు. వాపు వస్తున్న ముఖాలు.. పంటలపై స్ప్రే చేసే మందుతో తయారుచేసే గుడుంబా వల్ల తయారీదారుల ముఖాలు వాపు వస్తున్నట్లు తెలిసింది. ముఖాలు వాస్తున్నా లాభాల కోసం గుడుంబా తయారీని వారు మానడం లేదు. అయితే తయారీదారుల పరిస్థితి ఇలా ఉంటే తాగే వారి పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. తాగిన వారి అవయవాలు త్వరగా పాడైపోయి మృత్యువుకు దగ్గర కావడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. గుడుంబాతో ఎక్కువ లాభాలు ఉండడంతో కొందరు కుటీర పరిశ్రమగా మార్చుకున్నారు. వీరిపై ఎన్ని కేసులు బనాయించినా గుడుంబా తయారీని మాత్రం మానడం లేదు. నాజీతండా కేంద్ర బిందువు..? నూతన గుడుంబా తయారీ విధానానికి వరంగల్ జిల్లా ఖానాపురం మండలం నాజీతండా కేంద్ర బిందువు అని తెలుస్తోంది. ఈ గ్రామంలో గుడుంబా తయారు చేసి పలు గ్రామాలకు సరఫరా చేయడంతో పలు కేసులు నమోదయ్యాయి. మూడు మండలాల సరిహద్దు గ్రామం కావడంతో పోలీసుల నిఘా తక్కువ. ఎక్సైజ్ అధికారులకు తండావాసులు భయపడకపోవడం గమనార్హం. ఖానాపురం మండలంలోని పలు గ్రామాలతో పాటు జిల్లాలోని కొత్తగూడ, గంగారం, గూడూరు మండలాల్లో దాదాపు అన్ని గ్రామాలకు ములుగు జిల్లా పస్రా మండలంలోని పలు గ్రామాలకు ఇక్కడి గుడుంబా సరఫరా అవుతున్నట్లు సమాచారం. ఇక్కడి మహిళలు గుడుంబా తయారు చేస్తారు. చిన్నచిన్న ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసి భార్యభర్తలు ద్విచక్రవాహనాల ద్వారా గ్రామాలకు సరఫరా చేస్తారు. మధ్యలో ఎవరైనా ఆపి తనిఖీ చేసేందుకు యత్నిస్తే మహిళలు అరవడం, గోల చేయడం, తమపై అత్యాచారయత్రం చేకస్తున్నారని గగ్గోలు చేసి అధికారులను భయానికి గురిచేస్తారు. మద్యం ధరలు పెరగడంతో.. ప్రభుత్వం మద్యం ధరలను పెంచడంతో రోజువారి కూలీలు, వ్యవసాయదారులు గుడుంబా తాగడానికి మొగ్గు చూపుతున్నారు. పొద్దంతా పొలం పనులు చేసి రాత్రి సమయంలో అధికంగా వెచ్చించి మద్యం తాగలేక చాలా మంది గుండుబా తాగుతున్నారు. అయితే నూతన గుడుంబా తయారీ విధానం వారికి తెలియకే తాగి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ప్రాణాలకే ప్రమాదం గుడుంబా దేనితో తయారు చేసినా తాగడం ప్రాణాలకే ప్రమాదం. ఇంకా స్ప్రే మందుతో తయారు చేసిన గుడుంబాను అస్సలు తాగొద్దు. ఇటీవలి కాలంలో ఎక్కువ మంది రోగుల్లో గుడుంబా కారణంగా కిడ్నీలు, లివర్, గుండె ఇతర అవయవాలు దెబ్బతినడం గమనిస్తున్నాం. దీని ప్రభావం పేగులపై కూడా పడుతుంది. –రవీందర్‌నాయక్,అసిస్టెంట్ ప్రొఫెసర్, మానుకోట మెడికల్ కాలేజీ కఠిన చర్యలు తీసుకుంటాం గుడుంబాను అరికట్టేందుకు బెల్లం, పటిక రవాణాను పూర్తిస్థాయిలో కట్టడి చేశాం. స్ప్రే మందులతో గుడుంబా తయారీ నా దృష్టికి రాలేదు. ఇక నుంచి వాటిపై కూడా దృష్టి పెడుతాం. ప్రాణాలకే ప్రమాదం అని తెలిసినా తయారు చేయడం, తాగడం సరైంది కాదు. ప్రజలు చైతన్యవంతులై గుడుంబాను నిషేధించడంతో పాటు ఎక్కడ గుడుంబా తయారు చేసినా సమాచారం అందించాలి. –నగేష్, ఎస్సై -
గుప్పుమంటున్న గుడుంబా..!
నిర్మల్‌టౌన్: జిల్లాలో గుడుంబా గుప్పు మంటోంది. గుడుంబా రహిత జిల్లాలుగా ప్రకటించాలని సీఎం కేసీఆర్ ఆయా జిల్లా ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులకు సూచించడంతో ఆ మేరకు జిల్లాలో గుడుంబా మాయమైంది. ఇటీవల జిల్లాలో విధించిన లాక్డౌన్ ఫలితంగా మళ్లీ గుడుంబా అమ్మకాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. మారుమూల ప్రాంతాలను అడ్డాగా చేసుకొని గుడుంబా తయారీని కొనసాగిస్తున్నారు. అధికారులు అప్పుడప్పుడు చేపడుతున్న తనిఖీల్లో పట్టుబడుతున్నా దందామాత్రం ఆగడం లేదు. కడెం, ఖానాపూర్, పెంబి, మామడ, లక్ష్మణచాంద, సారంగాపూర్ మండలాల పరిధిలోని గిరిజన, అటవీ ప్రాంతాల్లో గుడుంబాను తయారు చేస్తున్నారు. ఉపాధి లేకే... మారుమూల గ్రామాల్లో ఉపాధి లేక గ్రామీణులు గుడుంబా తయారీని ఆశ్రయిస్తున్నారు. దళారులు వారికి మాయమాటలు చెప్పి వారిచే గుడుంబా తయారు చేయించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. లాభం వారికి చేరుతుండగా, అమాయక గిరిజనులు మాత్రం ఎక్సైజ్ అధికారులకు చిక్కుతున్నారు. గతంలో గుడుంబా తయారీపై ఆధారపడిన వారికి ప్రభుత్వం రూ.2లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేసి ఉపాధి అవకాశాలు కల్పించింది. కాగా జిల్లా పరిధిలో 20మందికి మాత్రమే ఈ అవకాశం లభించింది. మిగతా వారికి సైతం ఇలాంటివి కల్పిస్తే వారు ఈ వృత్తిని వీడే అవకాశం ఉంది. జిల్లావ్యాప్తంగా దాదాపు 100 మంది వరకు ఇలాంటి వారు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. లాక్డౌన్లో విచ్చలవిడిగా... లాక్డౌన్ సమయంలో గుడుంబా తయారీ విచ్చలవిడిగా కొనసాగింది. ఓ వైపు సాధారణ బ్రాండ్లు సైతం ధరల్లో కొండెక్కడంతో వారు గుడుంబాను ఆశ్రయించారు. ఈ సమయంలో గుడుంబా తయారీ మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగింది. ఈ సమయంలో డబ్బు సంపాదనకు అలవాటు పడిన వారు గుడుంబా తయారీని అలాగే కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నుంచి సైతం ప్రత్యామ్నాయ ఉపాధి లేకపోవడంతో వారు ఇదే వృత్తికి అంకితమవుతున్నారు. ఇంటిల్లి పాది... గుడుంబా తయారీలో ఇంటిల్లిపాది భాగస్వాములవుతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఖానాపూర్, ఇక్బాల్‌పూర్, మందపెల్లి ప్రాంతాల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు చేపట్టిన దాడుల్లో పలువురు ఆడవాళ్లు సైతం గుడుంబా తయారు చేస్తూ పట్టుబడటం ఇందుకు నిదర్శనం. ఇటీవల పట్టుబడిన కేసులో 50లీటర్ల గుడుంబా, రెండు ద్విచక్రవాహనాలను ఎక్సైజ్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని వెయ్యి లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. ఉపాధి కల్పిస్తున్నాం గుడుంబా తయారీ దారులకు ప్రభుత్వం ఉపాధి కల్పిస్తోంది. గతంలో 20 మందికి రూ.2 లక్షల చొప్పున ఉపాధి కోసం నిధులు అందించాం. గుడుంబా తయారీ దారులపై విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నాం. పట్టుబడ్డ వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.– రవీందర్‌రాజు, డీపీఈవో, నిర్మల్ -
మెల్లమెల్లగా నల్లబెల్లం
ఎక్సైజ్ కానిస్టేబుల్ పరిశీలిస్తున్న గోనె సంచుల మూటలు పద్మావతి ఎక్స్‌ప్రెస్ లోనివి. కేసముద్రం వద్ద రైల్లోనే పట్టుబడ్డాయి. వీటిని గుంటూరు జిల్లా బాపట్ల రైల్వే స్టేషన్లో రైలెక్కించారు. పక్కా సమాచారంతో ఎక్సైజ్, సివిల్, రైల్వే పోలీసులు సంయుక్తంగా వలపన్ని పట్టుకున్నారు. ఈ చిత్రంలో కనిపిస్తున్నవి కేసముద్రం–నెక్కొండ మార్గమధ్యలో కదులుతున్న రైలులోంచి బయటకు విసిరేసిన బస్తాలు. అందులో గుడుంబా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం ముద్దలు ఉన్నాయి. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న కొందరు వ్యక్తులు మెరుపు వేగంతో ఆ బస్తాలను తీసుకుని మాయమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బెల్లాన్ని నిషేధించింది. సాక్షి, హైదరాబాద్: 100 శాతం గుడుంబా రహిత రాష్ట్రంగా ప్రకటించిన తెలంగాణలోని పల్లెలకు నిత్యం నిషేధిత నల్లబెల్లం దిగుమతి అవుతోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వైపు వస్తున్న రైళ్లలో రోజుకు కనీసం 50 నుంచి 75 టన్నుల నల్లబెల్లం అక్రమ రవాణా కొనసాగుతోంది. దీని నుంచే గుడుంబాను కాస్తున్నారు. పక్క రాష్ట్రంలో తక్కువ ధరకే కావాల్సినంత బెల్లం అందుబాటులో ఉండటం, రోడ్డు మార్గంతో పోల్చితే రైలు ద్వారా అక్రమ రవాణా సులువుగా ఉండటంతో మాఫియా ఇటు మళ్లింది. తొలుత ఒక్కో వ్యక్తి గుట్టుచప్పుడు కాకుండా 30 నుంచి 50 కిలోల బెల్లం అక్రమ రవాణా చేయాగా.. తాజాగా ముగ్గురు నలుగురు వ్యక్తులు ఒక గ్రూప్‌గా ఏర్పడి ట్రిప్పునకు 4 క్వింటాళ్ల వరకు బెల్లం దిగుమతి చేస్తున్నారు. మళ్లీ రెచ్చిపోతున్న గుడుంబా మాఫియా గుడుంబాతో ప్రాణాపాయం ఎక్కువగా ఉండటం, తెలంగాణ పల్లెలు నాటు సారా మత్తులో జోగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం నాటు సారాను నిర్మూలించాలని సంకల్పించింది. ఈ మేరకు నల్లబెల్లాన్ని నిషేధించి, నాటు సారా కాయటం మానేసిన కుటుంబాలకు పునరావాసం కల్పించింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మరోవైపు గుడుంబా తయారీకి వినియో గించే బెల్లం, పట్టిక అమ్మకాలు సాగిస్తే ఎక్సైజ్ అధికారులు పీడీ యాక్టును ప్రయోగించారు. బెల్లం సరఫరా మూలాలను మూసేశారు. బెల్లం అమ్మకాలపై నిఘా పెట్టారు. అయితే పునరావాస ప్యాకేజీ అందరికీ అందకపోవటం, ఏడాదిపాటు గుడుంబా నిర్మూలన కోసం శ్రమ పడ్డ ఎక్సైజ్ అధికారులు విశ్రాంతి ధోరణితో కనిపించడంతో నాటు సారా కాసే కుటుంబాలు మళ్లీ రెచ్చిపోతున్నాయి. గుడుంబా దందా ఇప్పుడు గ్రామాల వైపు చొచ్చుకొని వస్తోంది. అక్కడ కిలో రూ.35.. ఇక్కడ రూ.90 ఏపీలో కిలో రూ.35 ఉన్న నల్లబెల్లం రాష్ట్రంలో రహస్య మార్కెట్లోకి వచ్చే సరికి కిలో రూ.75 నుంచి రూ.90 వరకు పలుకుతోంది. దీంతో బెల్లం అక్రమ రవాణా చేయడానికి గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు ముఠాగా ఏర్పడుతున్నారు. విశాఖపట్నం, విజయవాడ, ఒంగోలు, నాగ్‌పూర్, మన్మాడ్, అకోలా వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బెల్లం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వస్తోంది. రైలులో ఖమ్మం జిల్లా మీదుగా సికింద్రాబాద్ సమీప గ్రామాల వరకు చేరవేస్తున్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య దందా సాగిస్తున్నారు. విశాఖ, తుని, అనకాపల్లి, నెల్లూరు తదితర ప్రాంతాల్లో 50 కిలోల నుంచి క్వింటాల్ వరకు బెల్లం కొనుగోలు చేసి బస్తాల్లో తీసుకుని సాధారణ ప్రయాణికుల్లా రైలు ఎక్కుతున్నారు. జనరల్ బోగీల్లో సీట్ల కింద, టాయిలెట్ల వద్ద దాచి ఉంచుతున్నారు. తమ గమ్యానికి రాగానే బస్తాలను కదులుతున్న రైలు లోంచి విసిరేస్తున్నారు. ముఠా సభ్యులు బస్తాలను సేకరించి ఆటోల ద్వారా రాత్రికి రాత్రే గ్రామాలకు తరలించి విక్రయిస్తున్నారు. -
99 శాతం గుడుంబా నిర్మూలించాం
ఖమ్మం క్రైం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 99 శాతం గుడుంబా విక్రయాలు జరగడంలేదని, ఎక్కడో ఏజెన్సీ ప్రాంతంలో మాత్రమే గుడుంబా అమ్ముతున్నట్లు తెలుస్తోందని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్‌రావు తెలిపారు. సోమవారం ‘సాక్షి’మెయిన్‌లో ‘నాటుసారాకు కొత్తరెక్కలు’ శీర్షికన కథనం ప్రచురితమైన నేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం సువిజ్ఞానపురం ప్రాంతంలో చక్కెరతో గుడుంబా తయారు చేస్తున్నారని, దీంతో పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు వెళ్లి వారిని అరెస్టు చేయడంతోపాటు పదిమంది చక్కెర వ్యాపారులపై కేసు నమోదు చేసి.. బస్తాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. గుడుంబా పునరావాసం కింద ఉమ్మడి జిల్లాలో 732 మందిని ఎంపికచేసి, వారికి రూ. 2 లక్షల చొప్పన రుణాలిచ్చామన్నారు. వారు మళ్లీ గుడుంబా విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వస్తే రుణాన్ని రద్దు చేయడంతోపాటు బైండోవర్ కేసులు నమోదు చేస్తామన్నారు. చక్కె ర రూపంలో గుడుంబాను తయారు చేస్తున్నట్లు తమ దృష్టికి వస్తే వాటిపై కూడా కఠినచర్యలు తీసుకుంటామన్నారు. ఏపీ నుంచి చక్కెర తరలించే ప్రాం తాలపై నిఘాపెట్టామని, నాటుసారాను అరికట్టేందుకు కృషి చేస్తామన్నారు. -
గిరిజనుల ఉపాధి పథకంలో రూ.4 కోట్ల కుంభకోణం
-
మధ్యవర్తి బెదిరించాడా?
నవాబుపేట: గుడుంబా పునరావాసం కల్పనలో ఏమైనా అక్రమాలు జరిగాయా.. అంటూ ఎక్సైజ్ అధికారులు లబ్ధిదారుడితో ఆరా తీశారు. గుడుంబా తయారీ, అమ్మకం మానేసిన వారికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తున్న విషయం విదితమే. అయితే.. ఎక్సైజ్ అధికారులు ఆ సొమ్మును పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయమై ‘సాక్షి’ మెయిన్‌లో శనివారం ‘గుడుంబా సొమ్ము గుటుక్కు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఇందులో మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేటకు చెందిన ప్రభాకర్ వాదన వచ్చింది. స్పందించిన ఎక్సైజ్ అధికారులు శనివారం ఉదయమే రంగంలోకి దిగారు. ప్రభాకర్‌కు అందిన ఆవులను ఎక్సైజ్ శాఖ మహబూబ్‌నగర్ రూరల్ ఎస్ఐ రామకృష్ణ పరిశీలించారు. ఆవుల కొనుగోలు సమయంలో మధ్యవర్తి ఏమైనా బెదిరించాడా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ లబ్ధిదారులను ఎంపిక చేసి ఎంపీడీవోలకు అప్పగించడంతో తమ విధి పూర్తవుతుందని తెలిపారు. పథకం అమలును ఎంపీడీవోలు పర్యవేక్షిస్తారని చెప్పారు. -
కొటేషన్లలోనే కొట్టేశారు!
సాక్షి, యాదాద్రి : కొటేషన్ల ద్వారా కొనుగోళ్లు చేశారు.. వారు చూపిన చోటనే కొనుగోళ్లు చేయాలని లబ్ధిదారులను పురమాయించారు. అధికారులు చెప్పిన చోటకు వెళ్లి సరుకులు తెచ్చుకున్నారు. రూ.2లక్షల మంజూరులో వారికి వచ్చింది కేవలం రూ.1.50లక్షల వస్తువులే. ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి అధికారులతో గొడవ ఎందుకని సర్దుకుపోయారు ఇదీ.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గుడుంబా పునరావాసం పథకం అమలుపై ‘సాక్షి’ నిర్వహించిన గ్రౌండ్‌రిపోర్ట్‌లో వెల్లడైన వాస్తవాలు. ఉమ్మడి నల్లగొండ జిల్లాను గుడుంబా రహిత జిల్లాగా ప్రకటించారు. ప్రభుత్వం గుడుంబా అమ్మకందారులకు కల్పించిన పునరావాస పథకం అమలులో అధికారులు అత్యంత చాకచాక్యంగా అవినీతికి పాల్పడినట్లు తేటతెల్లమైంది. బ్యాంకుల కాన్సంట్‌తో సంబంధం లేకుండా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీ ఎంపిక చేసిన లబ్ధిదారులకు యూనిట్లు మంజూరు చేస్తారు. మార్గదర్శకాల ప్రకారం ఎక్సైజ్ శాఖ లబ్ధిదారులను గుర్తించాలి. ఈ లబ్ధిదారుల జాబితాను సంక్షేమ శాఖల ద్వారా ఎంపీడీఓలకు పంపించి లబ్ధిదారులకు కౌన్సెలింగ్ నిర్వహించిన తదనంతరం యూనిట్లు గ్రౌండింగ్ చేశారు. ఉమ్మడి జిల్లాలో గుడుంబా పునరావాసం పొందిన లబ్ధిదారులను కలిసినప్పుడు వారి మాటల్లో అధికారులు అవినీతికి పాల్పడినట్లు వెల్లడించారు. చాలా మంది తమ పేరు రాయడానికి ఇష్టపడలేదు. నిజం చెప్పితే మళ్లీ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతారని భయాన్ని వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కేటగిరిలో 704 మంది లబ్ధిదారులను గుర్తించారు. ఒక యూనిట్ విలువ రూ.2లక్షలు. మొత్తంగా 14.08 కోట్లు కేటాయించారు. జిల్లాల వారీగా చూస్తే..యాదాద్రి భువనగిరి జిల్లాలో 81 మంది లబ్ధిదారులను గుర్తిస్తే 76 మందికి గ్రౌండింగ్‌చేశారు. నల్లగొండ జిల్లాలో 229 మందికి 229మందికి మంజూరు చేశారు. అత్యధిక తండాలు కలిగిన సూర్యాపేట జిల్లాలో 394 మంది గుడుంబా తయారీ, విక్రయదారులను గుర్తించగా 391 మందికి పునరావాస పథకం కింద నగదు మంజూరు చేశారు. చేతికి చిల్లిగవ్వ ఇవ్వలేదు పునరావాసం కింద మంజూరైన మొత్తంతో కొనుగోళ్లన్నీ కోటేషన్లతో నడిపించారని, చేతికి ఒక్క రూపాయి ఇవ్వలేదని పలువురు లబ్ధిదారులు వాపోయారు. పునరావాసం పథకంలో పాడి పశువులు, గొర్రెలు, కిరాణం, జనరల్‌స్టోర్, లేడిస్ ఎంపోరియం, వస్త్ర దుకాణం, ఆటోమొబైల్, టెంట్‌హౌస్‌లు లబ్ధిదారుల కోరిక మేరకు ఇప్పించారు. అయితే ఎక్కడా కూడా లబ్ధిదారులకు చేతికి డబ్బులు ఇవ్వలేదు. అదే సమయంలో వారు కోరిన చోట కూడా ఇప్పించలేదు. ముందుగానే అధికారులు ఎంపిక చేసుకున్న దుకాణాల పేరు మీద కొటేషన్లు తీసుకుని వారి వద్ద సరుకులు కొనుగోలు చేశారు. దీంతో అధికారులు ముందుగానే కమీషన్లు మాట్లాడుకుని వారినుంచి కొటేషన్లను స్వీకరించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహరంలో ప్రతి యూనిట్ వెనుక అక్రమాలు చోటు చేసుకున్నాయి. లబ్ధిదారులు తాము ఇతర చోట్ల కొనుగోలు చేస్తామంటే అధికారులకు అందుకు అంగీకరించకపోవడం వెనుక అంతర్యంలోనే అక్రమాలు జరగాయని లబ్ధిదారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రతి కొనుగోలులో రూ.50వేల వరకు అవినీతి జరిగిందని తెలుస్తోంది. జరిగిన అవినీతి బయటపెడితే తమను కేసుల పేరుతో వేధిస్తారని పేరు రాయడానికి ఇష్టపడని సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలానికి చెందిన గిరిజన లబ్ధిదారుడొకరు ‘సాక్షి’తో చెప్పారు. ‘‘నాకు రూ.2లక్షలు మంజూరైది. వచ్చిన పేరే కానీ నాకు ఇచ్చింది రూ.1.40లక్షల సరుకులు మాత్రమే. అన్ని వారే ఇప్పించారు. హోల్‌సేల్ దుకాణానికి వెళ్లి తెచ్చుకోమంటే తెచ్చుకున్నాను. ఓ లెక్కా లేదు, ఓ పత్రం లేదు. ప్రభుత్వం ఇచ్చింది బతుకుదామని కిరాణ దుకాణం నడుపుకుంటున్నాను. ఇప్పుడు ఎవరి మీద చెప్పిపా ఏం లాభం’’ అంటూ దాటవేశాడు. అంతా పారదర్శకంగా చేశాం గుడుంబా పునరావాస పథకంలో యాదాద్రి జిల్లావ్యాప్తంగా 76మంది లబ్ధిదారులకు యూనిట్లు గ్రౌండ్ చేశాం. వారంతా ఇప్పుడు గుడుంబా అమ్మకాలు నిలిపివేసి వ్యాపారాలు చేసుకుని జీవిస్తున్నారు. మూడు సంవత్సరాల వరకు వారిపై నిఘా కొనసాగుతుంది. ఈ మేరకు సారా అమ్మకాలు చేయమని బాండ్ రాయించుకున్నాం. ఎలాంటి అక్రమాలు జరగకుండా కోటేషన్ల ద్వారా లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేశాం. ఎక్కడా అవినీతి జరగలేదు. – కృష్ణప్రియ, యాదాద్రి జిల్లాఎక్సైజ్ శాఖ అధికారి డబ్బులు సగమే ఇచ్చారు.. నాది మేళ్లచెరువు మండలం కందిబండ గ్రామం. పునరావాస పథకం కింద రూ. రెండు లక్షల విలువచేసే గొర్రెలు ఇవ్వాల్సి ఉండగా అధికారులు కేవలం రూ. లక్ష విలువ చేసే గొర్రెలే ఇచ్చారు. రూ. లక్షకు 16 గొర్రెలు ఇవ్వాల్సి ఉండగా ఒకటి కోతపెట్టారు. మిగిలిస రూ.లక్ష ఎప్పుడు ఇస్తారంటే కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. సారా విక్రయించుకుంటూ ఉన్నంతలో పూట వెళ్లదీసుకునేది. ఇప్పుడు తిండికి ఇబ్బందులు పడుతున్నా. అధికారులను మిగిలిన డబ్బులు అడిగితే ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారు. కుటుంబ పోషణ భారంగా మారింది. మిగిలిన రూ. లక్ష అయినా చేతికందిస్తే చిన్నపాటి కిరాణ దుకాణం పెట్టుకుంటా. – భిక్షాల నాగయ్య, కందిబండ, మేళ్లచెరువు రూ.50 వేలకు మించి సరుకుల్లేవ్ ఆత్మకూరు(ఎం)మండల కేంద్రానికి చెందిన రాగటి పార్వతమ్మ ఐదేళ్ల నుంచి సారా విక్రయిస్తుంది. సారానిర్మూలనలో భాగంగా పార్వతమ్మకు ప్రభుత్వం పునరావాసం కల్పిస్తామని చెప్పింది. ఎక్సైజ్ శాఖ అధికారులు ఆమెకు భువనగిరిలో కిరాణా సరుకులు ఇప్పించారు. అయితే రూ. 2లక్షల విలువ గల సామగ్రి ఇప్పించాల్సి ఉండగా అధికారులు ఇప్పించిన సరుకులు రూ. 50 వేలకు మించి కూడా లేవని పార్వతమ్మ వాపోతోంది. సరుకులకు సంబంధించిన బిల్లులు కూడా ఇవ్వలేదని ఆరోపిస్తోంది. – రాగటి పార్వతమ్మ, ఆత్మకూరు(ఎం) -
‘పునరావాసం’లో పదనిసలు..
సాక్షి, వరంగల్ రూరల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో గుడుంబా పునరావాస పథకం అమలులో ఎక్సైజ్ అధికారులు పారదర్శకంగా వ్యవహరించడం లేదు. ఎక్సైజ్ సీఐ, ఎంపీడీఓ, మండల పశువైద్యాధికారి.. లబ్ధిదారులతో కలిసి జీవాలు, సామగ్రి కొనుగోలు చేయాల్సి ఉండగా.. ఈ నిబంధనను తుంగలో తొక్కేశారు. గొర్రెలు, గేదెల పంపిణీలో, కిరాణా దుకాణాల ఏర్పాటులో ఏకపక్షంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. గొర్రెలను, గేదెలను కొనుగోలు చేసి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు తీసుకొచ్చి ఇచ్చారు. కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసిన వారికి కూడా సామాగ్రి ఇప్పించారే తప్ప రూ.2లక్షల యూనిట్‌కు సంబంధించి ఎక్కడా లెక్కలు చెప్పలేదు. అధికారులు ముందే కమీషన్లు మాట్లాడుకొని లబ్ధిదారులకు అంటగట్టినట్టు తెలుస్తోంది. పునరావాసం ఇలా.. సారా తయారీని పూర్తిగా మానేసిన వారికి జీవనోపాధి చూపిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన హామీమేరకు గుడుంబా తయారీకి దూరంగా ఉన్న వారికి గొర్రెలు, బర్రెలు, ఆవులు, ఆటో రిక్షాలు, ఆటో ట్రాలీలు, కిరాణం షాప్, చెప్పుల షాప్, చికెన్ సెంటర్, స్టీల్ సిమెంట్ షాప్‌ల ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థికంగా సాయం చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.2లక్షల చొప్పున అందించి పునరావాసం కల్పించారు. పునరావాసం పథకం కింద ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 1038 మందిని ఎంపిక చేయగా, ఇప్పటివరకు 997 మందికి ఆర్థికసాయం అందజేశారు. అడిగితే వేధింపులు గతంలో సారా తాగేవారి ఇండ్లలోనే కాదు... తయారీదారుల ఇండ్లల్లో కూడా సంతోషం కరువయ్యేది. సారా తాగి మరణించిన వారి ఇండ్లల్లో ఏడుపులు పెడబొబ్బలు వినిపిస్తే... సారా తయారుచేసిన వారి ఇండ్లల్లో కూడా అలాంటి రోదనలే కనిపించేవి. సారా తాగి ఇబ్బందులు పడ్డ కుటుంబాల వారు తయారీదారులపై దాడులు చేసి శాపనర్ధాలు పెట్టేవారు. దానికి తోడు ఎక్సైజ్ అధికారుల దాడులు నిర్వహించి సారా తయారీదారుల భరతం పట్టి జైలుకు పంపేవారు. అది తప్పు అని తెలిసినా తయారీదారులు గుడుంబా తయారు చేయడం మానేవారు కాదు. ఎందుకంటే వారికి అదే జీవనాధారం. సారా తయారుచేసి దొంగ చాటున విక్రయిస్తే తప్పా కుటుంబం గడవలేని పరిస్థితి. తయారుదారులపై దాడులు చేసి జైల్లో పెట్టినా.. జైలు తిండి తిన్నా పర్వాలేదని మళ్లీ వచ్చిన తరువాత ప్రారంభించేవారు. మూడు పుటల పట్టెడన్నం తినాలంటే సారా తయారు చేయాల్సిందే. దీంతో ఎక్సైజ్ శాఖాధికారుల కన్నుపడని చోట తయారుచేసి గుట్టల్లో, పొలాల్లో తయారుచేసి చాటుమాటున విక్రయించేవారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం గుడుంబా నిర్మూలనకు శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగా గుడుం బా తయారీ, విక్రయాలను అరికట్టందుకు చేపట్టాల్సిన చర్యలపై దృష్టిసారించింది. వారికి స్వయం ఉపాధి కల్పించడంతోపాటు గుడుంబా అరికట్టేందుకు పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఇంతవరకు భాగానే ఉన్నా.. పునరావాస పథకంలో పలువురు అధికారులు అవినీతికి పాల్పడుతుం డడంతో సర్కారు లక్ష్యం నీరుగారులతోంది. రూ.2 లక్షల విలువైన సామగ్రి, జీవాల కొనుగోళ్లకు సంబంధించి రశీ దులు అడిగిన లబ్ధిదారులకు వేధింపులు తప్పడం లేదు. వరంగల్ రూరల్ జిలాకు చెందిన ఓ వ్యక్తి కొన్నేళ్లుగా గుడుంబా తయారుచేశాడు. ఇప్పటి వరకు ఎక్సైజ్ పోలీసులు సుమారు పదుల సంఖ్యలో కేసులు పెట్టారు. ఇంకా ఒకలో, రెండో కేసులు ఉన్నాయి. గత సంవత్సరం ఆగస్టులో పునరావాసం కింద అతడికి రూ.2లక్షలతో ఆటో అందించారు. దీంతో నెలకు రూ.4వేల వరకు సంపాదిస్తున్నాడు. ఇది వరకు పోలీసులు వస్తున్నారంటే భయంతో జీవనం గడిపేవాడు. ఇప్పుడు కుటుంబసభ్యులతో ఆనందంగా ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇటీవల ఆటోకు ఎంత అయింది సారు.. రశీదులు ఇవ్వలేదని అడిగితే ఎక్సైజ్ అధికారులు అతడిని వేధింపులు గురిచేశారు. గత కేసులు తోడుతారనే భయంతో సదరు వ్యక్తి సైతం కిమ్మనకుండా ఉన్నట్లు తెలిసింది. ఎలా అంటే.. గుడుంబా తయారీ దారులు, విక్రయించే కుటుంబాలకు ప్రభుత్వం స్వయం ఉపాధి కింద పాడిగేదెలు, గొర్రెల వంటి జీవాలు కొనుగోలు చేసి ఇస్తోంది. ఈ డబ్బులు ఎంపీడీఓ ఖాతాల్లో పడుతున్నాయి. నిబంధనల ప్రకారం ఎక్సైజ్ సీఐ, ఎంపీడీఓ, మండల పశువైద్యాధికారి.. లబ్ధిదారులతో కలిసి జీవాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కానీ.. అధికారులు ఎవరికి తెలియకుండా ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసి లబ్ధిదారులకు అందజేస్తున్నారు. రశీదులు ఇవ్వకపోగా.. అడిగిన వారిని వేధిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చికెన్ సెంటర్లు, కిరాణాషాపులు ఏర్పాటు చేసుకునే వారికి సామగ్రి కొనుగోళ్ల సైతం అధికారులే చేస్తున్నారు. వీరికి ఒక్కొక్కరికి రూ.2 లక్షలు అందితే.. అందులో రూ. 20,000 నుంచి రూ. 50,000 వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అవినీతికి ఆస్కారం లేదు.. గుడుంబా విక్రయం, తయారీ మానేసిన కుటుంబాలకు పునరావాస పథకం ద్వారా రెండు లక్షల రూపాయలు అందిస్తున్నాం. పథకం దుర్వినియోగం కాకుండా ప్రతి నెలా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి తనిఖీ చేపడుతున్నాం. పూర్తి పారదర్శకంగా జిల్లా కలెక్టర్ సౌజన్యంతో సంక్షేమాధికారులు చెక్‌లను అందిస్తున్నారు. అవినీతికి, దుర్వినియోగానికి ఆస్కారం లేదు. వరంగల్ అర్బన్‌లో 236 మంది ఎంపిక కాగా, ఇప్పటికే 201 మందికి పథకాన్ని అందించాం. బాలస్వామి, ఎక్సైజ్ సూరింటెండెంట్, వరంగల్ అర్బన్ -
గుడుంబా సొమ్ము గుటుక్కు!
సాక్షి, నెట్వర్క్: వారందరికీ గుడుంబా తయారీనే ఉపాధి.. చట్ట వ్యతిరేకమని తెలిసినా చేసేదేమీ లేక దానితోనే పొట్టబోసుకోవాల్సిన పరిస్థితి.. పట్టుబడినప్పుడల్లా కేసులు.. పోలీస్ స్టేషన్ల మెట్లెక్కడం.. జరిమానాలు.. జైలుశిక్షలు మామూలే..! ఎన్నో ఏళ్లుగా ఇలా దుర్భర జీవితాలు గడుపుతున్న వారి బతుకుల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన పథకానికి సైతం అక్రమాల చీడ పట్టుకుంది. అధికారుల ఆమ్యామ్యాలతో లబ్ధిదారులకు అందాల్సిన సొమ్ము పక్కదారి పడుతోంది. ‘గుడుంబా ఆధారిత కుటుంబాల పునరావాస పథకం (జీఈపీఆర్‌ఎస్)’ లబ్ధిదారులను ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పలకరించగా అనేక విస్మయకర అంశాలు వెలుగుచూశాయి. ఎక్కువ మాట్లాడితే.. పేరు తీసేస్తాం.. గుడుంబా తయారీదారులకు జీఈపీఆర్‌ఎస్ కింద రూ.2 లక్షలతో ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం ఆదేశిస్తే.. అందులో అధికారులే చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఏ జిల్లాలో చూసినా లబ్ధిదారులకు రూ.2 లక్షల లబ్ధి చేకూరిన దాఖలాలు కనిపించడం లేదు. రూ.లక్ష లేదా లక్షన్నర వరకు మాత్రమే ఇస్తున్నారు. ఇదేంటని అడిగితే.. ‘అదంతే.. ఎక్కువగా మాట్లాడితే జాబితా నుంచి పేర్లు తొలగిస్తాం. ఉన్న సామగ్రి రికవరీ చేసి వేరే వారిని ఎంపిక చేస్తాం’అని దబాయిస్తున్నట్లు పలువురు లబ్ధిదారులు వాపోయారు. పలు జిల్లాల్లో సామగ్రిని అధికారులే కొనుగోలు చేసి దొంగ బిల్లులు ఇచ్చిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. పలువురు లబ్ధిదారులు సాయం కోసం ఇంకా నిరీక్షిస్తూనే ఉన్నారు. అవినీతికి తెరలేచిందిలా.. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లేమి కారణంగా పథకంలో అవినీతి చోటుచేసుకుంది. ఫలితంగా లబ్ధిదారులకు రుణాలు సరైన రీతిలో అందడం లేదు. ఎక్సైజ్ అధికారులతోపాటు ఎంపీడీవో జాయింట్ సర్వే చేసి రుణాలు అందించాల్సి ఉంది. రుణ లబ్ధిదారుల ఎంపిక, ఆయా కార్పొరేషన్ల నుంచి వచ్చిన చెక్కుల అందజేత వంటి అంశాలు ఎక్సైజ్ సీఐ స్థాయి అధికారితోపాటు ఎంపీడీవోలు పర్యవేక్షించాల్సి ఉంది. రుణాల మంజూరుకు చెందిన గ్రౌండింగ్‌పై ఎంపీడీవో, ఎౖMð్సజ్ అధికారులు ఎప్పటికప్పుడు జాయింట్ సర్వేలు చేయాలి. కానీ కొందరు ఎంపీడీవోలు నామమాత్రంగా వ్యవహరించడంతో ఎక్సైజ్ అధికారులు కమీషన్ల దందాలకు తెరలేపారు. ఫలితంగా రుణాల మంజూరులో అవకతవకలు చోటుచేసుకున్నాయి. ఇదిగో మరకలు.. పథకం కింద జగిత్యాల జిల్లా మెట్పల్లి ఎక్సైజ్ సర్కిల్‌కు 46 యూనిట్లను కేటాయించారు. ఒక్కో యూనిట్‌కు రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.92 లక్షలు విడుదల చేశారు. దీంతో లబ్ధిదారులు కిరాణం, బ్రిక్స్, కూల్‌డ్రింక్స్, గొర్రెలు, గేదెల పెంపకం తదితర వ్యాపారాలను ఏర్పాటు చేసుకున్నారు. వీటిలో 17 కిరాణా దుకాణాలకు సంబంధించి స్థానిక ఎక్సైజ్ సిబ్బంది అవినీతికి పాల్పడినట్లు ఉన్నతాధికారుల విచారణలో బయటపడింది. స్థానిక సీఐ, ఎస్సైలు అవినీతికి పాల్పడ్డారని తేలడంతో వారిపై వేటు వేశారు. ఎన్నెన్నో అక్రమాలు - పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన పి.శ్రీనివాస్‌కు టెంట్‌హౌస్ పెట్టుకోవడానికి ఎక్సైజ్ పోలీసులు రూ.2 లక్షల విలువైన సామగ్రి ఇప్పించారు. 2017 ఆగస్టు 28న హైదరాబాద్ నుంచి సామగ్రి తీసుకొచ్చి టెంట్‌హౌజ్ ప్రారంభించారు. కానీ ఆ సామగ్రి అంతా కలిపి రూ.1.20 లక్షలు మాత్రమే విలువ చేస్తుందని, అధిక రేట్లు వేసి సొమ్ము చేసుకున్నారని శ్రీనివాస్ చెబుతున్నాడు. - కుమ్రం భీం జిల్లాలో నలభై మంది లబ్ధిదారులను గుర్తించారు. అందులో తొలివిడతగా గతేడాది జూలైలో 19 మందికి యూనిట్లు అందజేశారు. 15 మందికి రూ.లక్ష చొప్పున, నలుగురికి రూ.2 లక్షల చొప్పున అందించారు. అయితే ఇందులో మేకలు, గొర్రెల యూనిట్ల పంపిణీలో అవకతవకలు జరిగాయి. రూ.లక్ష విలువైన 20 గొర్రెలు/మేకలు పంపిణీ చేయగా.. కొద్దిరోజుల్లోనే వాటిల్లో సగానికిపైగా మృత్యువాత పడ్డాయి. ఇన్సూరెన్స్ కోసమని రూ.ఐదు వేలు వసూలు చేసినా.. ఇన్సూరెన్స్ చేయించలేదు. ఇదీ పథకం.. రాష్ట్రంలో సారా/గుడుంబా వాసన లేకుండా చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగానే కిందటేడాది మార్చిలో జీఈపీఆర్‌ఎస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద గుడుంబా తయారీదారులు చిన్న తరహా వ్యాపారాలు చేసుకునేలా రూ.2 లక్షలు మంజూరు చేస్తారు. ఆ మొత్తంతో కిరాణా దుకాణాలు, టెంట్‌హౌస్‌లు, చికెన్ షాపులు, బట్టల వ్యాపారం, సూపర్ మార్కెట్లు వంటివి ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాల వారిని లబ్ధిదారులుగా గుర్తించి బ్యాంకుల నుంచి కాకుండా ఆయా కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందజేస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికకు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కమిటీ ఉంటుంది. ఇందులో ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఎస్పీ, డీఆర్డీవో, జిల్లా బీసీ, గిరిజన సంక్షేమశాఖ అధికారి, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి, స్త్రీ, శిశు సంక్షేమం, అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖల అధికారులు ఉంటారు. ఉచితంగా ఇస్తున్నాం.. ఏదో ఒకటి తీసుకో.. ఈ ఫొటోలో ఆవుకు నీళ్లు తాగిస్తున్న వ్యక్తి మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేటకు చెందిన ప్రభాకర్. ఆయనకు గుడుంబా పునరావాస పథకం కింద రూ.2 లక్షలతో యూనిట్ మంజూరు చేశారు. మూడు పాడి ఆవులు ఇప్పిస్తామని చెప్పారు. ఏడాదిపాటు తిరిగాక.. చిత్తూరు జిల్లా పులమనూర్లో మధ్యవర్తి ద్వారా ఆవులు ఇప్పించారు. ఇవి బలహీనంగా ఉన్నాయంటే.. ‘ఉచితంగా వస్తున్నప్పుడు ఏదో ఒకటి తీసుకో’అంటూ దబాయించారు. చికెన్ సెంటర్‌కు రూ.2 లక్షలా? ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు కుందారపు చంద్రయ్య. గోదావరిఖనిలోని జీఎం కాలనీ. ప్రభుత్వం గుడుంబా పునరావాసం కింద చికెన్ సెంటర్ పెట్టుకోవాలని నిర్ణయించాడు. చంద్రయ్యకు రూ.2 లక్షలు మంజూరయ్యాయి. దీంతో అధికారులు కోళ్లను ఉంచే ఇనుప జాలి, ఈకలు పీకే యంత్రం, చికెన్ కొట్టే కర్ర మొద్దు, కత్తులు, ఫ్రిడ్జ్ కొనిచ్చారు. కానీ తర్వాత లెక్కలు వేస్తే అన్నీ కలిపి రూ.60 వేలకు మించవని తేలింది. మిగతా డబ్బుల కోసం అధికారుల వద్దకు వెళితే.. మొత్తం సొమ్ము ఆ సామగ్రికే ఖర్చయిందని చెప్పి పంపేశారు. అడిగితే స్కీం రద్దు చేస్తామన్నరు ఈయన పేరు దోరి ఐలయ్య. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం లక్కారం. జీవనోపాధి కల్పిస్తామని అధికారులు చెబితే గుడుంబా అమ్మడం మానేశాడు. పిండి గిర్ని నడుపుకొంటానంటే ప్రభుత్వం రూ.2 లక్షలు మంజూరు చేసింది. కానీ అధికారులు ఇచ్చిన సామగ్రి విలువ రూ.60 వేలకు మించి ఉండదు. ఇదేమిటని అడిగితే స్కీం రద్దు చేసి వేరే వారికి ఇస్తామని అధికారులు బెదిరించారని ఐలయ్య వాపోతున్నాడు. జీఎస్టీ కింద రూ.36 వేలు కట్..! ఈయన పేరు బల్వీందర్‌సింగ్. రాజన్న సిరిసిల్ల సిక్కువాడి. ఏడుగురు పిల్లలు. జీవనోపాధి కోసం 15 ఏళ్లుగా సారా అమ్ముతున్న బల్వీందర్‌పై ఐదారు సార్లు కేసులు నమోదయ్యాయి. సారా అమ్మడం మానేయడంతో రూ.2 లక్షలు మంజూరయ్యాయి. దాంతో అధికారులు రెండు వెల్డింగ్ మిషన్లు, డ్రిల్లింగ్, గ్రైండర్, షెటర్ ఫిటింగ్ మిషన్లు కొనివ్వగా.. బల్వీందర్ మరో రూ.50 వేలు ఫైనాన్స్‌లో తెచ్చుకుని ఇతర పరికరాలు కొనుక్కున్నాడు. కానీ అధికారులు రెండు లక్షల సాయంలో జీఎస్టీ అని రూ.36 వేలు కట్ చేసుకున్నారని వాపోతున్నాడు. -
గుట్కా, గుడుంబాపై హైకోర్టుకు గృహిణి లేఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గుట్కా అమ్మకంపై నిషేధమున్నా.. విచ్చలవిడిగా వాటి విక్రయం జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ సూర్యాపేటకు చెందిన గృహిణి సీహెచ్ ప్రమీల రాసిన లేఖపై హైకోర్టు స్పందించింది. లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణిస్తూ పిల్ కమిటీ నిర్ణయం తీసుకుంది. కమిటీలోని న్యాయమూర్తులందరూ లేఖను పిల్‌గా పరిగణించేందుకు పూర్తి అర్హమైనదని ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో హైకోర్టు రిజిస్ట్రీ ఈ లేఖను పిల్‌గా మలిచింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ, ఎక్సైజ్, వైద్య ఆరోగ్య శాఖల ముఖ్య కార్యదర్శులు, డీజీపీని ప్రతివాదులుగా చేర్చారు. మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) నేతృత్వంలోని ధర్మాసనం విచారించే అవకాశముంది. రాష్ట్రంలో గుట్కా, గుడుంబా విక్రయంపై నిషేధం అమలు కావట్లేదని, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందంటూ ప్రమీల గత నెల 10న హైకోర్టుకు లేఖ రాశారు. -
'సారాయి పల్లెలు' మారాయి
- గుడుంబాతో కునారిల్లిన పల్లెల్లో మళ్లీ జీవకళ - రాష్ట్రంలో 95% గుడుంబా రహిత గ్రామాలు - సత్ఫలితాలు ఇస్తున్న ‘రిహాబిలిటేషన్ స్కీమ్’ - మత్తు వదిలి వృత్తులు, ఉపాధి వైపు మళ్లుతున్న జనం గుడుంబా రక్కసి కోరల్లో చిక్కి విలవిల్లాడిన పల్లెలవి! పని చేయాల్సిన యువత సారా మత్తులో తూగేది.. చిన్న వయసులోనే నానా రోగాలతో కునారిల్లిపోయేది.. పచ్చని సంసారాలు కూలిపోయేవి.. పోషించేవారు ప్రాణాలొదలటంతో కుటుంబాలు అనాథలయ్యేవి. కానీ ఇప్పుడా పల్లెలు మళ్లీ జీవం పోసుకుంటున్నాయి. కుల వృత్తులు, ఇతర ఉపాధి పనులతో కళకళలాడుతున్నాయి. యువత హుషారుగా పనిచేసుకుంటూ తలెత్తుకుని జీవిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సారా తయారు చేసే కుటుంబాలను ఆ పని మాన్పించి.. ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించేందుకు చేపట్టిన ‘పునరావాస పథకమే (రిహాబిలిటేషన్ స్కీమ్)’ దీనికి కారణం. రాష్ట్రవ్యాప్తంగా 9,560 గ్రామాలు సారాతో ప్రభావితమైనట్లుగా గుర్తించిన ఎక్సైజ్ శాఖ... ఈ ఏడాది జూన్ నాటికి 9,350 గ్రామాల నుంచి సారాను తరిమి వేసింది. సారా తయారీపై ఆధారపడి బతుకుతున్న కుటుంబాలకు కొత్త జీవితాన్ని ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఆ గ్రామాలు, కుటుంబాల పరిస్థితులపై ఈ వారం ‘సాక్షి’ ఫోకస్.. – సాక్షి, హైదరాబాద్ సారా మహమ్మారికి విధ్వంసమైన పల్లె కొత్తగూడెం. తొలి తెలంగాణ సాయుధ పోరాటానికి యోధులను అందించిన ఈ పల్లె.. అనంతర కాలంలో సారా కోరలకు చిక్కి విలవిల్లాడింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామాన్ని ‘సాక్షి’ ప్రతినిధి సందర్శించినప్పుడు విస్తుగొలిపే అంశాలెన్నో వెలుగు చూశాయి. 1,700 ఎకరాల సాగు భూమి, ఊట బావులు, ఆత్మగౌరవంతో బతుకుదామనే పల్లె జనం, తొలి తెలంగాణ సాయుధ పోరాటానికి వీరులను అందించిన చైతన్యం... ఇన్ని ఉన్నా ఈ గ్రామం సారా కోరలకు చిక్కింది. 1,100 గడపలున్న ఈ పల్లెలో 150 కుటుంబాలకు సారానే జీవనాధారం. ఒక్కో ఇంట్లో రోజుకు రెండు బట్టీలు గుడుంబా తయారు చేసేవారు. ఒక్కో బట్టీ నుంచి నాలుగు సేర్ల.. లెక్కన 1,200 సేర్ల (ఒక్క సేరు = 650 మిల్లీలీటర్లు) సారా ఉత్పత్తయ్యేది. ఇందులో సగం ఆ గ్రామం వాళ్లే తాగగా.. మిగతా సారాను చుట్టూ ఉన్న 10 గ్రామాలకు సరఫరా చేసేవాళ్లు. 2000వ సంవత్సరం నుంచి 2014 దాకా దాదాపు 14 ఏళ్లపాటు సారా రాజ్యమేలింది. ఆయా కుటుంబాల నుంచి పక్క గ్రామంలోని ఉన్నత పాఠశాలకు వెళ్లే విద్యార్థుల స్కూల్ బ్యాగుల్లో కూడా సారా సీసాల సరఫరా జరిగేది. అప్పట్లో గ్రామం నుంచి ఏటా 8 మందికిపైగా పదో తరగతి పూర్తి చేసుకుంటే.. అందులో ఐదుగురు పైచదువులకు వెళ్లకుండా సారా పనిలో, గ్రామంలో దొరికిన పనిలో పడిపోవడం గమనార్హం. మార్పు వచ్చింది.. గత దశాబ్దకాలంలో కొత్తగూడెంలో సారా మహమ్మారి బారినపడి 36 మందికిపైగా బలయ్యారు. సారాకు బానిసై జవసత్వాలు ఉడిగిపోయినవారు కొందరైతే.. మత్తులో ఆత్మహత్యకు పాల్పడినవారు మరికొందరు. ఇప్పటికీ సారా రక్కసి విధ్వంసం తాలూకు ఆనవాళ్లు పల్లెలో స్పష్టంగా ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం సారాపై ఉక్కుపాదం మోపడం, ఆయా కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపడంతో.. ఆ పల్లె కోలుకుంటోంది. రెండేళ్లుగా సారా తయారీ పూర్తిగా నిలిచిపోయింది. గతంలో సారా కాసిన కుటుంబాలతోపాటు ఊరు జనం అంతా ఉపాధి హామీ పనులకు, ఇతర వృత్తులకు వెళ్లటం కనిపించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం రిహాబిలిటేషన్ స్కీమ్ కింద తమకు ఆర్థిక సహకారం అందిస్తే.. అందరితో కలసి గౌరవంగా బతుకుతామని సారా కాసే కుటుంబాలు చెబుతున్నాయి. చాలా ప్రమాదకరం బెల్లం, పలు రకాల రసాయనాలు ఉపయోగించి నాటు సారా తయారు చేస్తారు. ఆ మిశ్రమం త్వరగా పులియడానికి, మరింత మత్తు రావడానికి బ్యాటరీ పొడీ, యూరియా వంటివి కలుపుతారు. ఇలా తయారయ్యే సారాలో ఎక్కువ మోతాదులో ఫ్యూజల్ ఆయిల్, ఆల్డిహైడ్స్, తక్కువ శాతంలో మిథనాల్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఫ్యూజల్ ఆయిల్, ఆల్డిహైడ్స్ శరీరంలో కండర వ్యవస్థ, నాడీ మండలం, జీర్ణ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని హెచ్చరిస్తున్నారు. శరీరంలో వీటి అవశేషాలు లేకుండా పూర్తి జీర్ణం కావడానికి కనీసం మూడు నెలలకు పైగా పడుతుందని స్పష్టం చేస్తున్నారు. కొత్తగూడెంలో పెద్ద గుట్ట మీద బండ రాళ్లు పగుల గొడుతున్న కుంచం వెంకటయ్యను ‘సాక్షి’ పలకరిస్తే.. ‘‘బండ కొట్టడమే నా కుల వృత్తి. మొదట్ల మంచిగనే బతికినం. నాకు సారా అలవాటైంది. పొద్దున్న లేస్తే సారా తాగడంతో పని చేతగాకపోయేది. నా భార్య పనిచేస్తేనే ఇల్లు గడిచేది. నా భార్య ఇది భరించలేక మా బిడ్డ చదువు మాన్పించి పెళ్లి చేసింది. నా తాగుడు, బిడ్డ పెళ్లితో అప్పులు పెరిగిపోయినయి. కానీ ఇప్పుడు సారా బందయింది. ఆలుమగలం కలసి కంకర కొడితే రోజుకు రూ.600 దాకా వస్తున్నయి. ఎంత మంచిగ తిన్నా రూ.400 మిగులుతున్నయి. నా ఆరోగ్యం కూడా బాగుంటంది..’’ అని తన అనుభవాన్ని వివరించాడు. 10 మందిలో ఏడుగురికి.. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 10 మందిలో ఏడుగురికి సారా అలవాటు ఉందని ఎక్సైజ్ శాఖ చేసిన సర్వేలో తేలింది. కొందరైతే రోజుకు సేరు (650 మిల్లీలీటర్లు) సారా కూడా తాగుతున్నట్లుగా బయటపడింది. ఇంతగా సారాకు అలవాటు పడిన వారి సగటు ఆయుష్షు 45 ఏళ్లు.. గిరిజనుల్లో అయితే 35 ఏళ్లు మాత్రమేనని వెల్లడైంది. ఇక సారాకు బానిసైన యువకుల్లో పనిచేసే సామర్థ్యం పూర్తిగా తగ్గిపోతుంది. విపరీతంగా సారా తాగేవారికి, కేవలం అలవాటుగా ఉన్న వారికి మధ్య పనిచేసే సామర్థ్యంలో 21 శాతం తేడా ఉందని తేలింది. కేవలం అలవాటుగా ఉన్నవారికి, అసలు సారా అలవాటులేని వారితో పోల్చితే.. 35శాతం పనిచేసే సామర్థ్యం తక్కువని తేలింది. సారాలోని రసాయనాల కారణంగా నాడీ వ్యవస్థ దెబ్బతింటుందని, ఆకలి వేయదని.. దాంతో సరిగా తిండి తినక పోవటం, రక్తంలో కీటోన్లు పెరగటంతో కండరాల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు కూడా చెబుతున్నారు. దీంతో చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు ముసురుకుంటాయని స్పష్టం చేస్తున్నారు. ఇలా యువతను పీల్చిపిప్పి చేస్తున్న సారాను నిర్మూలించి.. తెలంగాణను గుడుంబా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇది ఆర్థిక, సామాజిక సమస్య రాష్ట్ర ప్రభుత్వం సారా తయారీని సామాజిక, ఆర్థిక సమస్యగా గుర్తించింది. గుడుంబా తయారు చేసేవారికి, అలవాటుగా మారిన వారికి ఆర్థిక సహాయం అందించటం ద్వారా ఈ జాడ్యం నుంచి దూరం చేయవచ్చని నిర్ణయించింది. ఈ మేరకు రిహాబిలిటేషన్ స్కీమ్‌ను అమల్లోకి తెచ్చింది. సారా తయారు చేసే కుటుంబాలు ఆ పనిని వదిలేసి.. ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకోవడానికి ఈ పథకం కింద రూ.2 లక్షల వరకు ఆర్థిక సహకారం అందిస్తుంది. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ గ్రామాల్లో సర్వే నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా 7,886 కుటుంబాలు సారా తయారు చేస్తున్నట్లు గుర్తించాయి. వారిలో 5,712 కుటుంబాలకు రిహాబిలిటేషన్ పథకం కింద రూ.107.88 కోట్లు సాయం అవసరమని అంచనా వేశారు. తొలిదశలో 1,366 కుటుంబాలకు రూ.26.51 కోట్లు అందజేశారు. మిగతా కుటుంబాలకు కూడా దశల వారీగా ఆర్థిక సహాయం అందజేసేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. హైదరాబాద్‌లోని ధూల్‌పేట, ఉమ్మడి మహబూబ్‌నగర్, సిద్దిపేట జిల్లాల్లో ఈ పథకంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. ► సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మోత్కులపల్లి పంచాయతీ పరిధిలోని ఆవుకుంట తండాకు వెళ్లి లకావత్ స్వరూపను పలకరిస్తే.. ‘‘వెంటపడి తరుముతూ కేసులు పెట్టిన, ఇంట్లో ఉన్నకాడికి గుంజుకుపోయిన ఎక్సైజ్ పోలీసులే ఇంటికి వచ్చి... కేసులు తీసేసి రూ.2 లక్షలు చేతుల్లో పెట్టటం కొత్తగా అనిపిస్తంది. తండాలకు పోలీసులు వస్తున్నారంటే ఎక్కడి సామాన్లు అక్కడ దాచిపెట్టేటోళ్లం.. చెట్టుకొకలం పుట్టకొకలం అయ్యేవాళ్లం. ఇప్పుడు గుడుంబా బంద్ చేసి.. మాకు మూడు పాలిచ్చే బర్రెలను ఇచ్చారు. వాటి పాలు అమ్ముకుంటూ మంచిగ బతుకుతున్నం..’’ అని చెప్పారు. రాళ్లతో కొట్టారు: ఏఈఎస్ అంజిరెడ్డి హైదరాబాద్‌లోని ధూల్‌పేటకు గుడుంబా అడ్డాగా పేరుంది. ఎక్సైజ్ అధికారులు అక్కడికి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు ఉండేవి. అక్కడి పరిస్థితులను ఏఈఎస్ అంజిరెడ్డి వెల్లడించారు. ‘‘ధూల్‌పేటలో దాదాపు 550 కుటుంబాలు సారా తయారు చేసేవి. ఎక్సైజ్ బృందాలు వెళ్లినా ఖాతరు చేసేవాళ్లు కాదు. మేం వెంటబడి బెల్లం ఊట కుండలను పగలగొట్టే వాళ్లం, సారాను పారబోసేవాళ్లం. కానీ వాళ్లను ఆపలేకపోయాం.. తర్వాత సారా ఉత్పత్తి మూలాలు, రవాణా మీద నిఘా పెట్టాం. ప్రధానంగా ఆరు గ్యాంగులను గుర్తించి.. ఉత్పత్తి మూలాలు, రవాణా మీద దెబ్బకొట్టే చర్యలు చేపట్టాం. పక్కా ప్రణాళికతో దాడులు చేసి.. 350 మందిని అరెస్టు చేశాం, 678 మందిని బైండోవర్ చేశాం. ఆరుగురిపై పీడీ యాక్ట్ నమోదు చేశాం. దాదాపు 60–70 వాహనాలు సీజ్ చేశాం. అయితే సారా సద్దుమణిగిందిగానీ.. మా మీద దాడులు జరిగాయి. ముఖానికి కర్చీఫ్‌లు కట్టుకుని వచ్చి ఎక్సైజ్ సిబ్బందిపై రాళ్లు విసిరారు. స్టేషన్మీదకు రాళ్లు వేశారు. సిబ్బంది ఎవరైనా ఒంటరిగా దొరికితే చితకబాదారు కూడా. కానీ చివరికి పరిస్థితి మా చేతికి వచ్చింది. సారా తయారు చేసే కుటుంబాలకు కౌన్సెలింగ్ చేశాం. రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించి.. ప్రత్యామ్నాయ ఉపాధికి సహకరించాం..’’ అని అంజిరెడ్డి వెల్లడించారు. మంచి స్పందన ఉంది.. ‘‘95 శాతం గ్రామాలు గుడుంబా రహితమయ్యాయి. రిహాబిలిటేషన్ స్కీమ్ మంచి ఫలితాలు ఇస్తోంది. ఇప్పటివరకు 1,366 కుటుంబాలకు రూ.26.51 కోట్లు సాయంగా అందజేశాం. ఈ డబ్బుతో వాళ్లు ఇతర వ్యాపారాలు, పనులు చేసుకుని గౌరవంగా బతకడానికి అవకాశం వచ్చింది. త్వరలోనే మిగతా అన్ని కుటుంబాలకు కూడా నిధులు అందజేస్తాం. వారికి కావాల్సిన వ్యాపారం కోసం సలహాలు సూచనలు స్థానిక ఎక్సైజ్ అధికారులు ఇస్తారు.’’ – చంద్రవదన్, ఎక్సైజ్ కమిషనర్ పాలు అమ్ముతున్న.. ‘‘నా ఇంటికే నేను దొంగోడి లెక్క వచ్చి పోయేటోన్ని. పోలీసులు ఎప్పుడు వస్తరో? ఎప్పుడు పోతరో తెల్వక రాత్రిళ్లు నిద్ర కూడా సరిగా ఉండేది కాదు. కానీ సారా అమ్మితేనే పైసలొచ్చేది. అదే బుక్కెడు బువ్వ పెట్టేది. మానాలంటే మానే పరిస్థితి లేదు. కానీ ప్రభుత్వం రెండు లక్షలు ఇవ్వడంతో రోజుకు 10 లీటర్ల పాలిచ్చే గేదెలు తీసుకున్నాం. ఇప్పుడు ఎవరితో భయం లేకుండా బతుకుతున్నం..’’ – రాములు, మల్కాపూర్, నవాబుపేట (గతంలో సారా విక్రయించిన వ్యక్తి) ఇక గుడుంబా జోలికి వెళ్లను ‘‘15 ఏళ్ల నుంచి సారా అమ్ముతున్న. నా భార్య కూడా ఇదే పని చేస్తది. ఎక్సైజ్ పోలీసులకు దొరికినా మేం ఈ పని మానుకోలేదు. ఎందుకంటే మాకు జీవనాధారం. పిల్లలను సారా పనికి దూరంగానే ఉంచిన. ఈ కేసులతో మేం ఒక్క రోజన్నా సుఖంగా ఉండలేదు. చివరికి ఎక్సైజ్ సార్లు వచ్చి... సహాయం చేస్తే సారా పని మానుతవా అన్నరు. సరే అన్నా. 30 గొర్రెలు కొనిచ్చారు. గొర్రెలు కాసుకుంటున్నా.. పిల్లలు బడికి పోతున్నారు. ఇక గుడుంబా జోలికి వెళ్లను..’’ – తేజావత్ బుజ్జినాయక్, మిర్యాలగూడ మండలం ఐలాపురం -
గుడుంబాను నిర్మూలించాలి
♦ తయారీ, అమ్మకందారులకు రూ.2లక్షలతో ♦ ప్రత్యామ్నాయ ఉపాధి ♦ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ♦ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వరంగల్ రూరల్: గుడుంబాను సమూలంగా నిర్మూలించాలని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం గుడుంబా బాధిత కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి కింద వివిధ యూనిట్లను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ వేలాది కుటుంబాలు రోడ్డు పాలవడానికి కారణమైన గుడుంబా తయారీ, విక్రయం, వినియోగాన్ని అరికట్టాలన్నారు. గతంలో గుడుంబా నిర్మూలనకు చర్యలు తీసుకున్నామని, పలు ప్రాంతాలను గుర్తించి స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్టు పేర్కొన్నారు. గుడుంబా ఆధారిత కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధికి రూ.2లక్షల విలువైన ఒక్కో యూనిట్ మంజూరు చేశామని చెప్పా రు. లబ్ధిదారులు మళ్లీ ఆ వ్యాపారానికి మరలకుండా పర్యవేక్షించాలని ఎక్సైజ్ అధికారులు, కలెక్టర్‌కు సూచించారు. రాష్ట్రంలో 90శాతం పేద, బడు గు, బలహీన వర్గాలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. ఇందుకుగాను రూ.40వేల కోట్లు, వెచ్చిస్తున్నదని పేర్కొన్నారు. వరంగల్ రూరల్ జిల్లాలో ఎంపిక చేసిన 123 మంది ఎస్సీ గుడుంబా ఆధారిత కుటుంబాలలో 50 మందికి మంగళవారం గొర్రెలు, బర్రెలు, ఆటోట్రాలీలు, ఆటోలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థ మేయర్ నరేంద ర్, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, టి.రాజయ్య, రూరల్, అర్బన్ కలెక్టర్లు వరంగ ల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటి ల్, అమ్రపాలి కాట, నగర పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు, గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థ కమిషనర్ శృతి ఓజా, మాజీ ఎంపీ గుండు సుధారాణి, రూరల్ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
గుడుంబా బాధితులకు రూ.72.60 కోట్లు
మంత్రి జోగు రామన్న సాక్షి, హైదరాబాద్: గుడుంబా బాధితుల పునరావాసానికి సీఎం కేసీఆర్ రూ.72.60 కోట్లు మంజూరు చేశారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. శుక్రవారం సచివాలయంలో శాఖాపరౖ అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షించా రు. 3,600 గుడుంబా బాధిత కుటుంబాల కు అబ్కారీ శాఖ పర్యవేక్షణలో కలెక్టర్లు ఒక్కో కుటుంబానికి రూ.2లక్షలు ఆర్థిక సాయం అందజేస్తారని మంత్రి తెలిపారు. విదేశాల్లో ఉన్నత చదువుల నిమిత్తం బీసీ విద్యార్థులకు రూ.17కోట్లు విడుదల చేశా మన్నారు. మహాత్మా జ్యోతిబాపూలే గురు కుల పాఠశాలల నిర్వహణకు మరో విడ తగా రూ.30కోట్లు విడుదల చేస్తామన్నా రు. వచ్చే నెల 15కల్లా బీసీ గురుకుల పాఠ శాలలతోపాటు వసతిగృహాల్లోని విద్యార్థు లకు యూనిఫారాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. శాఖ ముఖ్య కార్యదర్శి అశోక్ కుమార్ పాల్గొన్నారు. -
నిర్లక్ష్యానికి ఫలితం
⇔ గుడుంబా నియంత్రణలో పలువురు అధికారుల ఉదాసీనత ⇔ రాష్ట్ర కార్యాలయానికి మానుకోట ఎక్సైజ్ సీఐ సరెండర్ ⇔ మరో ఇన్స్పెక్టర్కు అదనపు బాధ్యతలు ⇔ మరికొందరు అధికారులపైనా చర్యలకు రంగం సిద్ధం సాక్షి, వరంగల్: వరంగల్ ఉమ్మడి జిల్లా ఎౖMð్సజ్ అధికారులకు ‘గుడుంబా’ దెబ్బ తగులుతోంది. గుడుంబా తయారీ, అమ్మకాల నియంత్రణలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉమ్మడి జిల్లాలోని అధికారులపై ఎక్కువగా ఉంటున్నాయి. రాష్ట్రంలో ఎక్కువ జిల్లాలను గుడుంబా రహిత జిల్లాలుగా ప్రకటించారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో మాత్రం ఈ పరిస్థితి చాలా తక్కువగా ఉంది. దీనిపై ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు అసంతృప్తితో ఉన్నారు. అధికారుల తీరుతోనే.. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని కొందరు ఎక్సైజ్ అధికారుల తీరుతోనే గుడుంబా నియంత్రణలో విఫలమవుతున్నారని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇదే విషయమై ఇటీవల క్షేత్రస్థాయి నుంచి సమాచారం సేకరించారు. మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని ఎక్సైజ్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే గుడుంబా నియంత్రణ ఆశించిన విధంగా లేదని ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. గుడుంబా తయారీ, అమ్మకాలు ఎక్కువగా జరిగే మహబూబాబాద్ జిల్లాలోని కొందరు అధికారుల వైఖరి ప్రభుత్వానికి నష్టం చేసేలా ఉందని సమాచారం అందింది. ఈ సమాచారం ఆధారంగా మహబూబాబాద్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె.తిరుపతిపై చర్యలు తీసుకున్నారు. గుడుంబా నియంత్రణపై పట్టించుకోనట్లుగా వ్యవహరించారనే కారణంతో కమిషనర్ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో టాస్క్‌ఫోర్స్ విభాగంలో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ రామకృష్ణకు మహబూబాబాద్ స్టేషన్ అదనపు బాధ్యతలను అప్పగించారు. గుడుంబా నియంత్రణ, బెల్లం అమ్మకాల విషయంలో పట్టించుకోనట్లుగా ఉంటున్న మరికొందరు అధికారులపైనా త్వరలోనే చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. వరంగల్ అర్బన్ జిల్లా స్థాయి అధికారిపైనా త్వరలోనే చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. కేసుల నమోదు, పరిష్కారం, గుడుంబా నియంత్రణ, ఉద్యోగుల విషయంలో ఈ అధికారి వ్యవహరించే తీరుపై ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక అందినట్లు సమాచారం. త్వరలోనే ఈ అధికారిపై చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. ఉదాసీనంగా.. రాష్ట్రంలో ఎక్కడా గుడుంబా ఉండొద్దనే రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. రెండేళ్లుగా ఈ విషయంలో గట్టిగా వ్యవహరిస్తోంది. నాటుసారా, గుడుంబా తయారీ, అమ్మకాలను రూపుమాపడమే లక్ష్యంగా ఎక్సైజ్ శాఖ అధికారులు పనిచేశారు. అయితే, ఏడాదిగా ఈ విషయంలో కొంత మెతకగా వ్యవహరించారు. దీంతో గుడుంబా తయారీ, అమ్మకాలు మళ్లీ బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ శాఖలో ఉన్నతస్థాయిలో భారీ మార్పులు చేసింది. గుడుంబా నియంత్రణలో కఠినంగా వ్యవహరించిన అధికారులకు మళ్లీ బాధ్యతలు అప్పగించింది. ఇలా ఉన్నతస్థాయిలో మార్పులు చేసినప్పటి నుంచి గుడుంబా నియంత్రణ చర్యలు మళ్లీ మొదలయ్యాయి. అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా అధికారులు మాత్రం ఇంకా మారడంలేదు. యథావిధిగా గుడుంబా నియంత్రణ విషయంలో ఉదాసీనంగానే వ్యవహరిస్తున్నారు. -
గుడుంబా రహిత హైదరాబాద్
ఇందుకోసం అధికారులు చర్యలు తీసుకోవాలి: పద్మారావు హైదరాబాద్: గుడుంబా రహిత ప్రాంతంగా హైదరాబాద్‌ను మారుస్తామని ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ మంత్రి పద్మారావు పేర్కొన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో జరిగిన మహాత్మాగాంధీ జయంతి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.... రాష్ట్రంలో గుడుంబా తయారీపై ఉక్కుపాదం మోపుతున్నామని, ఇప్పటికే ఎనిమిది జిల్లాల్లో దాన్ని నిర్మూలించామని వివరించారు. వచ్చే ఏడాదిలోగా హైదరాబాద్‌ను కూడా గుడుంబా రహిత జిల్లాల సరసన చేర్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. గుడుంబా తయారీపై ఆధారపడి జీవించే వారికి పునరావాసం కల్పిస్తామని.. ఇందు కోసం జిల్లాకు రూ.10 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. రుగ్మతలను తొలగించాలంటే గుడుంబాను పూర్తిగా నిషేధించాలని, ఆ దిశగా తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి అన్నారు. గుడుంబా రహిత జిల్లాగా ప్రకటించడం కంటే ఆచరించడం ఎంతో కష్టమని జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా పేర్కొన్నారు. గుడుంబా అంతానికి శక్తివంచన లేకుండా కష్టపడుతున్నట్లు ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ కమిషనర్ ఆర్వీ చంద్రవదన్ వివరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ భగవాన్‌రెడ్డి, ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ సి.వివేకానంద రెడ్డి, ఇన్చార్జి డెరైక్టర్ ఎన్.అజయ్ రావు, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ శ్రీవాత్సవ్, ఇతర అధికారులు రాజేశ్వర రావు, ఫారుఖీ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు నాంపల్లిలోని ఆబ్కారీ భవన్ నుంచి రవీంద్రభారతి వరకు ఎకై ్సజ్ పోలీసులు భారీ ర్యాలీ నిర్వహించారు. -
గుట్కాపై ఉక్కుపాదం మోపాలి
పలు శాఖలతో కలెక్టర్ కరుణ సమీక్ష ఏటూరునాగారం : ఏజెన్సీలో పెట్రేగిపోతున్న గుట్కాపై ఉక్కుపాదం మోపాలని, గుడుంబాను పూర్తిగా లేకుండా చేయాలని కలెక్టర్ వాకాటి కరుణ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పలు శాఖలతో ఐటీడీఏ సమావేశపు గదిలో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గుడుంబా అమ్మకాలు చాలా వరకు నిర్మూలించాలని అన్నారు. గుట్కాల వల్ల టీబీ వస్తుందని ఇటీవల చేసిన పరీక్షల్లో తేలిందని, వాటికి కారణమైన మత్తు పదార్థాల నిర్మూలన కోసం కృషి చేయాలన్నారు. ఈ విషయంలో ఎక్సైజ్, పోలీసు శాఖ చొరవ చూపే విధంగా చర్యలు చేపడుతామన్నారు. ఐకేపీ పనితీరు బాగలేదు.. ఐటీడీఏ పరిధిలోని టీఎస్పీ మండలాల్లో ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) పనితీరు అస్తవ్యస్తంగా ఉందని కలెక్టర్ ఏరియా కోఆర్డినేటర్‌పై మండిపడ్డారు. మూడు మండలాల్లోని మహిళా గ్రూపుల ద్వారా చేపట్టిన గుప్పేడు బియ్యం 155 వీఓ సంఘాలకు గాను ఏడు వీఓలు మాత్రమే చేస్తున్నట్లు ఏసీ గోవింద్చౌహన్ కలెక్టర్‌కు వివరించారు. నిరుపేదల కోసం చేపట్టిన గుప్పేడు బియ్యం సేకరణపై నిర్లక్ష్యం చూపినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదరిక నిర్మూలన కోసం ఏర్పాటు చేసి ఐకేపీ సిబ్బంది పనితీరుపై బాగలేదని, ఇలా చేస్తే పేదలు ఎప్పుడు అభివృద్ధి చెందుతారని ప్రశ్నించారు. 267 గ్రూపులకు 67 గ్రూపులు బాగా ఉండడం ఏమిటని, మిగతావి ఎలా డిపాల్ట్ అయ్యాయన్నారు. ఇలా చేయడం వల్ల ప్రైవేట్ వడ్డీ రుణాలకు మహిళా సంఘాలు అలవాటు పడే ప్రమాదం ఉందన్నారు. కొత్తగూడ ఏసీ వరలక్ష్మి పనితీరు బాగా ఉందని, గ్రూపులు కూడా మెరుగ్గా ఉన్నాయని కితాబిచ్చారు. ఈఎస్ఎస్ కింద ఇచ్చిన మేకలను లబ్ధిదారులు కోసుకొని తింటున్నారా... లేక చనిపోతున్నాయని అబద్దాలు చెబుతున్నారా... ఐకేపీ వాళ్లు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం వారం రివ్వూ్య పెట్టాలని పీఓను ఆదేశించారు. భాగస్వాములను చేయాలి గోదావరి పరివాహాక ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లో పారిశుధ్యంపై చొరవ చూపే విధంగా మహిళా సంఘాలను భాగస్వాములు చేయాలని కలెక్టర్ అన్నారు. స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్ల నిర్మాణం, హరితహారం ద్వారా మొక్కల పెంపకంలో మహిళా సంఘాల చొరవ చూపాలన్నారు. సంయుక్తంగా పక్కా భవనాలు ఐటీ డీఏ కింద రూ.3 లక్షలు, ఈజీఎస్ కింద రూ.5 లక్షలతో కలిపి రూ. 8 లక్షలతో ఏజెన్సీలోని అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించే విధంగా చూడాలని ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్, డ్వామా ఏపీడీ శ్రీనివాస్ కుమార్‌ను కలెక్టర్ ఆదేశించారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో మునిగ, నిమ్మకాయ, కరివేపాకు, బచ్చల కూర, పాలకూర, గోంగూర నాటే విధంగా హార్టికల్చర్ అధికారులు ఉచితంగా విత్తనాలను అందించాలన్నారు. ఐఏపీ నిధులు వస్తే ఏజెన్సీలో అభివృద్ధి ఏజెన్సీలోని ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి వచ్చే ఐఏపీ నిధుల ద్వారా నిర్మాణాలు చేపట్టాలని కలెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ కోటిరెడ్డిని ఆదేశించారు. 59 భవనాల్లో 20 పూర్తి కాగా, మిగతావి పురోగతిలో ఉన్నాయన్నారు. మండల సమాఖ్య భవనాలు 13లో ఎనిమిది నిర్మించామని, మిగతా ఐదింటికి స్థలాల కోసం అన్వేషిస్తున్నట్లు ఈఈ తెలిపారు. సమీక్షలో ఆర్డీఓ మహేందర్‌జీ, ఏపీఓ వసందరావు, డీఈఈ మల్లయ్య, ఐకేపీ ఏపీడీ నూరొద్దీన్, ఎంఐ ఈఈ రాంప్రసాద్, డీఈఈ యశ్వంత్, ఏఈఈ శ్యాం, పీహెచ్ఓ సంజీవరావు, ఎంపీడీఓ ప్రవీణ్, తహసీల్దార్ నరేందర్, పాల్గొన్నారు. బాధితుల వేడుకోలు... మండలంలోని మారుమూల గ్రామాలకు బస్సులు రావడం లేదని, ఇసుక లారీలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రాంబాయి కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. మేడారం పూజారి ఆనందరావు చనిపోయిన తీరు అనుమానంగా ఉందని భార్య ఉషారాణి కలెక్టర్‌కు విన్నవించారు. బయ్యక్కపేటకు చెందిన ఓ వ్యక్తిపై అనుమానం ఉందని ఆమె వెల్లడించారు. ఇళ్ల స్థలాలు ఇప్పించాలని స్థానిక విలేకరులు కలెక్టర్‌కు వినతి అందజేశారు. కార్యక్రమంలో నూక ప్రభాకర్, అలువాల శ్రీను, వెంకన్న, అఫ్జల్, గంపల శివ, కృష్ణ, లాలయ్య, భిక్షపతి, శ్రీను, గంగాధర్, సత్యం, విజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
గుట్కాపై ఉక్కుపాదం మోపాలి
పలు శాఖలతో కలెక్టర్ కరుణ సమీక్ష ఏటూరునాగారం : ఏజెన్సీలో పెట్రేగిపోతున్న గుట్కాపై ఉక్కుపాదం మోపాలని, గుడుంబాను పూర్తిగా లేకుండా చేయాలని కలెక్టర్ వాకాటి కరుణ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పలు శాఖలతో ఐటీడీఏ సమావేశపు గదిలో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గుడుంబా అమ్మకాలు చాలా వరకు నిర్మూలించాలని అన్నారు. గుట్కాల వల్ల టీబీ వస్తుందని ఇటీవల చేసిన పరీక్షల్లో తేలిందని, వాటికి కారణమైన మత్తు పదార్థాల నిర్మూలన కోసం కృషి చేయాలన్నారు. ఈ విషయంలో ఎక్సైజ్, పోలీసు శాఖ చొరవ చూపే విధంగా చర్యలు చేపడుతామన్నారు. ఐకేపీ పనితీరు బాగలేదు.. ఐటీడీఏ పరిధిలోని టీఎస్పీ మండలాల్లో ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) పనితీరు అస్తవ్యస్తంగా ఉందని కలెక్టర్ ఏరియా కోఆర్డినేటర్‌పై మండిపడ్డారు. మూడు మండలాల్లోని మహిళా గ్రూపుల ద్వారా చేపట్టిన గుప్పేడు బియ్యం 155 వీఓ సంఘాలకు గాను ఏడు వీఓలు మాత్రమే చేస్తున్నట్లు ఏసీ గోవింద్చౌహన్ కలెక్టర్‌కు వివరించారు. నిరుపేదల కోసం చేపట్టిన గుప్పేడు బియ్యం సేకరణపై నిర్లక్ష్యం చూపినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదరిక నిర్మూలన కోసం ఏర్పాటు చేసి ఐకేపీ సిబ్బంది పనితీరుపై బాగలేదని, ఇలా చేస్తే పేదలు ఎప్పుడు అభివృద్ధి చెందుతారని ప్రశ్నించారు. 267 గ్రూపులకు 67 గ్రూపులు బాగా ఉండడం ఏమిటని, మిగతావి ఎలా డిపాల్ట్ అయ్యాయన్నారు. ఇలా చేయడం వల్ల ప్రైవేట్ వడ్డీ రుణాలకు మహిళా సంఘాలు అలవాటు పడే ప్రమాదం ఉందన్నారు. కొత్తగూడ ఏసీ వరలక్ష్మి పనితీరు బాగా ఉందని, గ్రూపులు కూడా మెరుగ్గా ఉన్నాయని కితాబిచ్చారు. ఈఎస్ఎస్ కింద ఇచ్చిన మేకలను లబ్ధిదారులు కోసుకొని తింటున్నారా... లేక చనిపోతున్నాయని అబద్దాలు చెబుతున్నారా... ఐకేపీ వాళ్లు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం వారం రివ్వూ్య పెట్టాలని పీఓను ఆదేశించారు. భాగస్వాములను చేయాలి గోదావరి పరివాహాక ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లో పారిశుధ్యంపై చొరవ చూపే విధంగా మహిళా సంఘాలను భాగస్వాములు చేయాలని కలెక్టర్ అన్నారు. స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్ల నిర్మాణం, హరితహారం ద్వారా మొక్కల పెంపకంలో మహిళా సంఘాల చొరవ చూపాలన్నారు. సంయుక్తంగా పక్కా భవనాలు ఐటీ డీఏ కింద రూ.3 లక్షలు, ఈజీఎస్ కింద రూ.5 లక్షలతో కలిపి రూ. 8 లక్షలతో ఏజెన్సీలోని అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించే విధంగా చూడాలని ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్, డ్వామా ఏపీడీ శ్రీనివాస్ కుమార్‌ను కలెక్టర్ ఆదేశించారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో మునిగ, నిమ్మకాయ, కరివేపాకు, బచ్చల కూర, పాలకూర, గోంగూర నాటే విధంగా హార్టికల్చర్ అధికారులు ఉచితంగా విత్తనాలను అందించాలన్నారు. ఐఏపీ నిధులు వస్తే ఏజెన్సీలో అభివృద్ధి ఏజెన్సీలోని ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి వచ్చే ఐఏపీ నిధుల ద్వారా నిర్మాణాలు చేపట్టాలని కలెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ కోటిరెడ్డిని ఆదేశించారు. 59 భవనాల్లో 20 పూర్తి కాగా, మిగతావి పురోగతిలో ఉన్నాయన్నారు. మండల సమాఖ్య భవనాలు 13లో ఎనిమిది నిర్మించామని, మిగతా ఐదింటికి స్థలాల కోసం అన్వేషిస్తున్నట్లు ఈఈ తెలిపారు. సమీక్షలో ఆర్డీఓ మహేందర్‌జీ, ఏపీఓ వసందరావు, డీఈఈ మల్లయ్య, ఐకేపీ ఏపీడీ నూరొద్దీన్, ఎంఐ ఈఈ రాంప్రసాద్, డీఈఈ యశ్వంత్, ఏఈఈ శ్యాం, పీహెచ్ఓ సంజీవరావు, ఎంపీడీఓ ప్రవీణ్, తహసీల్దార్ నరేందర్, పాల్గొన్నారు. బాధితుల వేడుకోలు... మండలంలోని మారుమూల గ్రామాలకు బస్సులు రావడం లేదని, ఇసుక లారీలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రాంబాయి కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. మేడారం పూజారి ఆనందరావు చనిపోయిన తీరు అనుమానంగా ఉందని భార్య ఉషారాణి కలెక్టర్‌కు విన్నవించారు. బయ్యక్కపేటకు చెందిన ఓ వ్యక్తిపై అనుమానం ఉందని ఆమె వెల్లడించారు. ఇళ్ల స్థలాలు ఇప్పించాలని స్థానిక విలేకరులు కలెక్టర్‌కు వినతి అందజేశారు. కార్యక్రమంలో నూక ప్రభాకర్, అలువాల శ్రీను, వెంకన్న, అఫ్జల్, గంపల శివ, కృష్ణ, లాలయ్య, భిక్షపతి, శ్రీను, గంగాధర్, సత్యం, విజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
గుడుంబా స్థావరాలపై దాడులు
దహెగాం : మండలంలోని కల్వాడ మర్రిపల్లి గ్రామాల్లోని గుడుంబా స్థావరాలపై ఆదివారం దాడులు నిర్వహించినట్లు పీఎస్సై సుధాకర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం... గుడుంబా విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించామని పేర్కొన్నారు. కల్వాడ గ్రామానికి చెందిన బానోత్ తుకారాం, మర్రిపల్లి వాసి బదావత్ వినోద్‌లపై కేసు నమోదు చేశామని తెలిపారు. వీరి వద్ద 100 గుడుంబా ప్యాకెట్లు, 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నామని వివరించారు. -
గుప్పుమంటున్న గుడుంబా
బైండోవర్లు చేసినా యథేచ్ఛగా సారా తయారీ గుడుంబా తయారు చేస్తూ పట్టుబడి.. కేసుల్లో ఇరుక్కున్నా.. నాటుసారా తయారీ మాత్రం ఆగడం లేదు.. విక్రయాలు యథేచ్ఛగా జరుపుతూనే ఉన్నారు. గ్రామాల్లో నాటుసారా కేసులు నమోదు చేసి బైండోవర్లు చేస్తున్నారు. అయినా.. సారా బట్టీలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ యంత్రాంగం తయారీ దారులపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నా.. ఆగడం లేదు. నాటుసారా తయారు చేయడాన్ని ఆపేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నా.. పరిస్థితి యథావిధిగానే ఉంది. మంచాల మండలంలో పటేల్ చెర్వు తండా, బుగ్గ తండా, బండలేమూర్, సత్తి తండా, ఆంబోత్ తండా, బోడకొండ, దాద్‌పల్లి తండా, వెంకటేశ్వర తంగాల్లో నాటుసారా ఎక్కువగా తయారు చేస్తున్నారు. సారా తయారుకు అలవాటు పడిన గిరిజనులు ఇతర వృత్తులు చేయకుండా.. గుట్టుచప్పుడు గాకుండా గుడంబా తయారు చేస్తూ పరిసర గ్రామాల్లో విక్రయిస్తున్నారు. ఎక్సైజ్‌శాఖ అధికారులు పలుమార్లు దాడులు చేసి, కేసులు నమోదు చేసినా షరా మాములుగానే ఉంతోంది. దీంతో గ్రామాల్లో నాటుసారా విక్రయాలు కొనసాగుతునే ఉన్నాయి. తండాల నుంచి ఆటోలు, జీపులు, మోటారు సైకిళ్లపై నాటుసారా ఇతర గ్రామాలకు తరలిస్తున్నారు. గ్రామాల్లో సారా విక్రయించే వారు గతంలో మాదిరిగా ఇళ్లలో గాకుండా గ్రామాల శివారుల్లో.. ఊరికి దగ్గరలోని మైదాన ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. సారా తాగే వారిని సాయంత్రం వేళ్లలో ఒకచోట కూడగట్టి నిమిషాల వ్యవధిలో లీటర్ల కొద్ది నాటుసారాను విక్రయిస్తున్నారు. బైండోవర్లు చేసినా స్పందన శూన్యం గ్రామాల్లో నాటుసారా తయారీ, విక్రయదారులపై కేసులు నమోదు చేసి, బైండోవర్లు చేసినా.. తయారు చేస్తూనే ఉన్నారు. విక్రయాలు జరుపుతూనే ఉన్నారు. మంచాల మండలంలో ఇటీవల మూడు నెలల్లో తహసీల్దార్ శ్యాంప్రకాశ్ ఎదుట 18 మందిని బైండోవర్ చేశారు. 10 మందిపై (ఏఎన్‌టీ), మరో 8 మందిపై 7ఏ కేసులు నమోదు చేశారు. వారందరికీ సారా తయారు చేసినా.. విక్రయించినా చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. కఠిన శిక్ష విధిస్తామని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చే రేషన్ సరుకులు, ఇతర పథకాలు అందించమని తెలిపారు. అయినా గిరిజన తండాల్లో గుడంబా తయారు చేసి విక్రయిస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు ఉక్కుపాదం మోపి.. నాటుసారా విక్రయాలను ఆపాలని ప్రజలు కోరుతున్నారు. రూ.50 వేలు జరిమానా.. గతంలో నాటుసారా తయారీ కేసుల్లో బైండోవర్ అయిన వారు మళ్లీ నాటుసారా తయారు చేసినా, విక్రయించినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఇబ్రహీంపట్నం ఎక్సైజ్ సీఐ తుక్యానాయక్ హెచ్చరించారు. వారికి రూ.50 వేలు జరిమానా, జైలుకు పంపడం ఖాయమన్నారు. సారా తయారు చేయవద్దు. గ్రామాల్లో విక్రయించవద్దని హెచ్చరించారు. -
టార్గెట్ ధూల్‌పేట
♦ రాజధానిలో గుడుంబా అడ్డాపై ఆబ్కారీ శాఖ ప్రత్యేక దృష్టి ♦ తయారీదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి కోసం కసరత్తు సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలోని ధూల్‌పేట నుంచి గుడుంబా మహమ్మారిని శాశ్వతంగా తరిమికొట్టే కార్యక్రమానికి ఆబ్కారీ శాఖ శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా గుడుంబా తయారీ, అమ్మకాలను నిషేధించే లక్ష్యంతో గత సంవత్సరం అక్టోబర్ నుంచి ‘గుడుంబా రహిత జిల్లాల ప్రక్రియ’ హైదరాబాద్, వరంగల్ జిల్లాల్లో మినహా పూర్తయింది. ఈ క్రమంలో రాజధాని అడ్డాగా దశాబ్దాలుగా ధూల్‌పేటలో పరిశ్రమగా సాగుతున్న గుడుంబా తయారీకి చెక్ పెట్టే అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇటీవల ఓ కమిటీని ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా గోషామహల్ ఎమ్మెల్యే, ఆబ్కారీ శాఖ డెరైక్టర్, ధూల్‌పేట ఈఎస్, హైదరాబాద్ డీసీ, ధూల్‌పేట, గోషామహల్, బేగంబజార్, జియాగూడ, మంగళ్‌హాట్, దత్తాత్రేయ నగర్, కార్వాన్ కార్పొరేటర్లతో కూడిన ఈ కమిటీ ప్రతిపాదనల ఆధారంగా తుది నిర్ణయం తీసుకోవాలని సర్కార్ భావిస్తోంది. వెయ్యి కుటుంబాలకు అదే ఆధారం... మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కొన్ని సామాజిక తెగలకు చెందిన వారు నిజాం సమయంలో ధూల్‌పేటకు వచ్చి స్థిరపడ్డారు. ప్రస్తుతం ఈ తెగలకు చెందిన సుమారు 5వేల కుటుంబాల్లో సగం గుడుంబా (నాటు సారా) తయారీపైనే ఆధారపడ్డాయి. గుడుం బాను ధూల్‌పేట నుంచి తరిమికొట్టాలని గతంలో ప్రభుత్వాలు చేసిన ప్రయత్నం విజయవంతం కాలేదు. ఈ పరిస్థితుల్లో దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఇక్కడ ప్రత్యామ్నాయ ఉపాధి కోసం నిధులు కేటాయించడమే కాకుండా, వారికి బ్యాంకు రుణాలు ఇప్పించే ప్రయత్నం చేశారు. తరువాత కాలంలో రుణాలు పొందిన సుమారు 500 మంది తిరిగి బ్యాంకర్లకు చెల్లించలేదు. 80 శాతం కుటుంబాలు అదే దందా సాగిస్తున్నాయి. వివిధ కారణాలతో చాలా మంది దీనికి దూరమైనా... ప్రస్తుతం 1000 కుటుంబాలు ఈ దందాపై ఆధారపడ్డట్టు ఆబ్కారీ శాఖ అంచనా వేస్తోంది. వీరిలో ఒక్కో కుటుంబం నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసి, ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ సంక్షేమ నిధి కింద ఉన్న రూ.4.5 కోట్లతో నైపుణ్య శిక్షణ ద్వారా ఉద్యోగావకాశాలు పెంపొందించాలని యోచిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌తో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని, ధూల్‌పేటలో గుడుంబాను పూర్తిగా నిర్మూలించేందుకు కృషి చేస్తామని హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ వివేకానందరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. కాగా మద్య నిషేధం, గుడుంబా అరికట్టడంపై టెలీఫిల్మ్‌లను రూపొందించి వివిధ ప్రసార సాధనాల ద్వారా ప్రచారం చేయాలని ఆబ్కారీ కమిషనర్ నిర్ణయించారు. -
గుడుంబా విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
చెన్నూర్ : పట్టణంలోని బట్టిగూడెం, ఎనగుట్ట (ఎమ్మెల్యే) కాలనీల్లో గుడుంబా విక్రయిస్తున్న ఇద్దరిని పట్టుకొని మంగళవారం అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ సీఐ లక్ష్మణ్ తెలిపారు.బట్టిగూడెం కాలనీలో గిరెల్లి లచ్చయ్య, ఎనగుట్టలో గుండా సంతోష్ గుడుంబా విక్రయిస్తుండగా దాడులు నిర్వహించి పట్టుకున్నామన్నారు. లచ్చయ్య వద్ద 8 లీటర్లు, సంతోష్ వద్ద 10 లీటర్ల గుడుంబాతోపాటు మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇద్దరిపై ఎక్సైజ్ కేసు నమోదు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించామని సీఐ తెలిపారు. దాడుల్లో ఎక్సైజ్ ఎస్సై దిలీప్‌కుమార్, సిబ్బంది కుమారస్వామి, రాజయ్య, సుకన్య పాల్గొన్నారు. -
మారిన వారికి ఉపాధి
గుడుంబా విక్రయించిన వారి వివరాల సేకరణ అదే జీవనాధారంగా బతుకుతున్న వారికి ఆర్థిక సాయం త్వరలో పలు వృత్తుల్లో ఉపాధి చూపించడానికి సిద్ధమవుతున్న అధికారులు మహబూబ్‌నగర్ క్రైం : గుడుంబాను సమూలంగా నిర్మూలించేందుకు సర్కార్ నడుం బిగించింది. ఇప్పటికే ప్రభావిత గ్రామాల్లో కనిపించకుండా పోయిన గుడుంబా ఆనవాళ్లు భవిష్యత్‌లోనూ పూర్తిగా లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే జీవనాధారంగా బతుకుతున్న కుటుంబాలు తిరిగి అటువైపు వెళ్లకుండా ప్రణాళిక రూపొందించింది. అవసరమైతే అలాంటి కుటుంబాలకు ఉపాధి కలిగేలా ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మూడు రోజుల్లో అబ్కారీ శాఖ అధికారులు ప్రభావిత గ్రామాల్లో ప్రత్యేక సర్వే చేపట్టనున్నారు. జిల్లాలోని 585 ప్రభావిత గ్రామాల్లో పర్యటించి కుటుంబ పోషణ భారమైన వారి వివరాలను సేకరించనున్నారు. గుడుంబా తయారీ, విక్రయాలు జరిపేందుకు అన్ని వనరులున్న 585గ్రామాలను అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఆయా గ్రామాల్లో జీవనాధారంగానే చాలా మంది తయారీ, విక్రయాలు జరుపుతున్నారని, కొంతమంది మాత్రమే గుడుంబా దందాచేసి డబ్బులు సంపాదిస్తున్నారని, అలాంటి వారి వివరాలు పూర్తిగా తమ వద్ద ఉన్నాయని అబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. అడవుల్లో ఉండే తండాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే గ్రామా ల్లో ఎక్కువగా గుడుంబా తయారీ జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. గతేడాది జూలై నుంచి ఈ సంవత్సరం ఫిబ్రవరి వరకు 1757మంది గుడుంబా విక్రయదారులపై అధికారులు కేసులు నమోదు చేశారు. ఇందులో 12మందిపై పీడీ యాక్టు కేసులు కూడా నమోదు చేశారు. పలు వృత్తులో ఉపాధి.. రాష్ట్ర ప్రభుత్వం సారా తయారు మానేసిన కుటుంబాలకు పలు వృత్తులో కార్పొరేషన్స్ ద్వారా రుణాలు ఇప్పించి, వారికి ఆసక్తి ఉన్న వృత్తులో ఉపాధి చూపిస్తారు. దీంట్లో డెయిరీఫాం, కోళ్లఫాం, కిరాణ దుకాణం, టైలరింగ్, గేదెల పెంపకం ఇలా పలు వృత్తులను గుర్తిస్తున్నారు. ఆర్థిక సాయం .. గతంలో గుడుంబా తయారీ, విక్రయాలు జరిపి, తాజాగా పూర్తిగా మారిపోయి ఇతర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారికి ఆర్థిక సాయం చేసి, తద్వారా వారికి ఉపాధి కల్పించేందుకు సర్కారు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అధికారులు సారా తయారీ మానేసిన కుటుంబాలను ఇప్పటికే 740 గుర్తించారు. జిల్లాలో ఏ కేటగిరిలో 33, బీ కేటగిరిలో 152, సీ కేటగిరిలో 400గ్రామాలో ్లవిపరీతంగా సారా తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గత ఏడాది జూలై నుంచి 1757 కేసులు, 1079 మంది అరెస్టు, 19628 లీటర్ల సారా సీజ్, 73 వాహనాలు సీజ్, 88వేల బెల్లం సీజ్ చేశారు. 12 పీడీయాక్టు కేసులు నమోదు చేశారు. అదేవిధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి 384 అవగాహన కార్యక్రమాలు, 484ర్యాలీలు నిర్వహించారు. బైండోవర్లు, అందులో జరిమానా విధించిన కేసులలో ప్రభుత్వానికి రూ.17లక్షల 78వేల ఆదాయం వచ్చింది. -
కల్తీకల్లు విక్రయిస్తే కఠిన చర్యలు
జగిత్యాల: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ఇటీవల నల్లగొండ జిల్లాలో పర్యటించిన మంత్రి.. తాజాగా బుధవారం కరీంనగర్ జిల్లా జగిత్యాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గుడుంబా, కల్తీకల్లు విక్రయిస్తే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామన్నారు. ఆఫీసుల నిర్వహణకు ప్రతి నెల నిధులు కేటాయించడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల కోసం సొంత భవనాలు నిర్మిస్తామన్నారు. సిబ్బందికి వాహనాలు అందజేసేందుకు వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. -
ఆగని సారా దందా
గుడుంబారహిత జిల్లాలో విచ్చలవిడిగా అమ్మకాల ప్రకటనలకే పరిమితమైన ఎక్సైజ్‌శాఖ ప్రజాప్రతినిధుల పత్రాలే ప్రామాణికమా? రెండు నెలల్లో 149 మందిపై కేసులు కరీంనగర్ క్రైం :‘జిల్లాలో 98 శాతం గుడుంబా తయూరీ, అమ్మకాలు అరికట్టాం. గుడుంబా రహిత జిల్లాగా చేశాం. గ్రామాల్లో గుడుంబా విక్రయూలు లేనేలేవు..’ ఇది 2015 డిసెంబర్ 3న నగరంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఎక్సైజ్‌శాఖ కలెక్టర్, ఎస్పీ ప్రకటన. కానీ.. పరిస్థితి అందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. జిల్లాలో గుడుంబా దందా ఆగడం లేదు. ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా గుడుంబా విక్రయూలు సాగుతూనే ఉన్నారుు. సర్పంచ్‌లు, ఎంపీపీలు, కార్పొరేటర్లు, మున్సిపాలిటీ కౌన్సిలర్లు తమతమ ప్రాం తా ల్లో గుడుంబా అమ్మకాలు లేవంటూ ఇచ్చిన సమాచా రం ఆధారంగా ఆయా ఠాణాల ఎక్సైజ్ ఎస్సైలు, సీఐ లు ఉన్నతాధికారులకు నివేదించడంతో గుడుంబా రహితజిల్లాగా ప్రకటించినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయి లో పరిశీలించకుండా, నివేదికపై విచారణ జరుపకుండానే ప్రకటన చేసినట్లు స్పష్టమవుతోంది. ఇవిగో ఆధారాలు.. 2015 డిసెంబర్లో అమ్మకాలు లేవని ప్రకటించిన అధికారులు.. అదే నెలలో జిల్లావ్యాప్తంగా గుడుంబాకేసుల్లో 74 మందిని రిమాండ్‌కు పంపించారు. వీరిలో పురుషులు 41 మంది, మహిళలు 33 మంది ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో పలు కేసుల్లో 75 మందిని రిమాండ్ చేశారు. వీరిలో గుడుంబా తయారీదారులతోపాటు అమ్మకందారులూ ఉన్నారు. వీరిలో 46 మంది పురుషులు, 29 మంది మహిళలున్నారు. నాలుగు రోజుల క్రితం ముస్తాబాద్లోలో గుడుంబా అమ్ముతున్న ఓ మహిళను అరెస్టు చేశారు. గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. ప్రకటనలకే పరిమితమైన ఎక్సైజ్‌శాఖ జిల్లాను 100 శాతం గుడుంబా రహిత జిల్లాగా మర్చినట్లు గొప్పలు చేప్పుకుంటున్న ఎక్సైజ్‌శాఖ కేవలం ప్రకటనలకే పరిమితమైందనే ఆరోపణలున్నాయి. క్షేత్రస్థాయిలో గుడుంబా తయారీ, నియంత్రించడానికి ఎక్సైజ్‌శాఖ తీసుకున్న చర్యలపై ఆదినుంచి అనుమానాలే ఉన్నాయి. ఈ దాడులు ఏళ్ల నుంచి చేస్తూనే ఉన్నా గుడుంబా తయారీ, అమ్మకాలు నియంత్రించినా ప్రాంతాలు లేవనే చెప్పవచ్చు. జిల్లాలో గుడుంబా త యారు చేస్తున్న ప్రాంతాలు కొ న్ని మాత్రమే ఉన్నాయ న్న విషయం విదితమే. మరీ ఆ ప్రాంతాల్లో గుడుంబా తయారీని నియంత్రించారా..? అంటే అది లేదు. దాడు లు చేస్తున్నా.. పీడీ యాక్ట్ ప్రయోగిస్తున్నా.. గుడుంబాతయారీ కుటిర పరిశ్రమంగా చేసుకున్న తండావాసులు యథావిధిగా అమ్మకాలు సాగిస్తున్నారు. అధికారుల చేతివాటం... ఎక్సైజ్ అధికారులకు గుడుంబా తయారీ, అమ్మకందారుల నుంచి ప్రతినెలా పెద్ద మొత్తంలో మామూళ్లు చేరుతున్నాయనేది బహిరంగ రహస్యం. కొన్నిచోట్ల కొంతమంది అధికారులు ఏకంగా గుడుంబా వ్యవస్థనే పెంచిపోషిస్తున్నారని సమాచారం. గుడుంబా రహిత జిల్లాగా ప్రకటించిన తర్వాత చేతులు దులుపుకోవడంతోనే మళ్లీ తయారీ, అమ్మకాలు యథేచ్చగా సాగుతున్నారుు. ఇప్పటికైనా కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి గుడుంబా తయారీ, అమ్మకాలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు. ఎక్సైజ్ దాడులు 2015లో 3340పైగా కేసులు నమోదు చేసి 2,349 మం ది అరెస్టు చేసి వారి నుంచి 77232 లీటర్ల గుడుంబా, 293 వాహనాలు, 39.12 లక్షల లీటర్ల బెల్లంపానకం ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్‌శాఖ అధికారులు తెలిపారు. పోలీస్‌శాఖ దాడులు 2015లో గుడుంబా తయారీ, అమ్మకం సంబంధించి 905 కేసులు నమోదు చేసి 1182 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 14401 లీటర్ల గుడుంబా, 1550 టన్నుల బెల్లం పానకం, 101 కిలోల పటిక, 7 స్కూటర్లు స్వాధీనం చేసుకున్నారు. -
గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు
సుల్తానాబాద్: గుడుంబా తయారీ కేంద్రాలపై పోలీసులు ఎక్సైజ్ అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం గారెపల్లిలో గురువారం తెల్లవారుజాము నుంచి దాడులు నిర్వహించిన పోలీసులు ఎనిమిది మంది గుడుంబా తయారీ దారుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో పోలీసులు 400 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేయడంతో పాటు రూ. 28 వేలు విలువ చేసే గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. -
బెజ్జూర్‌లో ఎక్సైజ్ అధికారుల దాడులు
బెజ్జూర్: ఆదిలాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం పలుగుపెల్లి గ్రామంలోని గుడుంబా తయారీ కేంద్రాలపై బుధవారం ఉదయం ఎక్సైజ్ అధికారులు దాడులు జరిపారు. ఈ సందర్భంగా 4,500 లీటర్ల పానకం ధ్వంసం చేయటంతో పాటు 20 లీటర్ల గుడుంబా, ఒక బైక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎక్సైజ్ ఎస్సై రాజు తెలిపారు. -
గుడుంబా రహిత జిల్లా!
► 21న ప్రకటన చేసే అవకాశం సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాను గుడుంబా రహిత ప్రాంతంగా ప్రకటించేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఈ నెల 21న దీనిపై ప్రకటన చేయాలని కలెక్టర్ రఘునందన్‌రావు నిర్ణయించారు. గుడుంబా తయారీ, వినియోగం, నష్టాలపై ఎక్సైజ్ శాఖ చేపట్టిన అవగాహన, చైతన్య కార్యక్రమాలతో సత్ఫలితాలు వచ్చాయని, దీంతో ఇప్పటికే 95శాతం గుడుంబా రహిత ప్రాంతంగా గుర్తించినట్లు చెప్పారు. గుడుంబా విక్రయాలను కూడా పూర్తిగా అరికట్టినట్లు చెప్పారు. ఈ క్రమంలో ఈనెల 21న వికారాబాద్ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో బహిరంగ సభ నిర్వహించి గుడుంబా రహిత జిల్లాగా ప్రకటించనున్నట్లు కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. -
15 టన్నుల నల్లబెల్లం స్వాధీనం
గుడుంబా తయారి కోసం ఉపయోగించే నల్లబెల్లం నిల్వలను గురువారం ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని వాసవీభవన్ రోడ్డులో ఉన్న లక్ష్మీ రాజ్యం అనే వ్యాపారికి చెందిన గొడౌన్ లో అక్రమంగా నిల్వ ఉంచిన 15 టన్నుల నల్లబెల్లం నిల్వలను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో ఈ రోజు ఉదయం నుంచే పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఇప్పటికే పది టన్నుల పట్టికను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సుధాకర్ తెలిపారు. -
గుడుంబా రహిత రాష్ట్రమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: గుడుంబాను రాష్ట్రం నుంచి తరిమికొట్టడమే లక్ష్యంగా ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ విభాగం చేసిన దాడులు సత్ఫలితాలు ఇవ్వడంతో గ్రామాల నుంచి జిల్లా స్థాయి వరకు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. ‘గుడుంబా ఫ్రీ’ పేరిట చేపట్టే ఈ ప్రచార కార్యక్రమాలను ఆయా జిల్లాల ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈనెల 30 నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు జరిగే ఈ ప్రచార ఉద్యమం ద్వారా గుడుంబా రహిత గ్రామాలు, మండలాలను ప్రకటిస్తారు. ఒక జిల్లాలో పూర్తిస్థాయిలో గుడుంబా లేదని రూఢీ చేస్తూ కలెక్టర్, ఎస్పీ డిక్లరేషన్ ఇస్తే దాన్ని గుడుంబా రహిత జిల్లాగా ప్రకటించి ఉత్సవాలు జరుపుతారు. తొలుత గుడుంబాను 95 శాతం మేర నిషేధించిన గ్రామాలు, మండలాలను స్థానిక తహసీల్దార్, ఎస్ఐల ఆమోదంతో ప్రకటించి, సభలను నిర్వహిస్తారు, తరువాత జిల్లా స్థాయిలో సంబరాలు జరుపుతారు. గుడుంబాకు వ్యతిరేకంగా ఈనెల 30వ తేదీ నుంచి డిసెంబర్ 10 వరకు చేపట్టే కార్యక్రమాల వివరాలను ఎక్సైజ్ డెరైక్టర్ అకున్ సబర్వాల్‌కు అధికారులు ఇప్పటికే పంపించారు. -
గుడుంబా పట్టివేత: ముగ్గురి అరెస్ట్
అశ్వారావుపేట : ఖమ్మం జిల్లాలో అక్రమంగా గుడుంబా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 100 లీటర్ల గుడుంబా, ఓ ఆటో, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. అశ్వారావుపేటలో రోజూ వారీ చేసే తనిఖీల్లో గుడుంబా అక్రమ రవాణా బయటపడింది. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మలక్‌పేటలో ఎక్సైజ్ దాడులు
మలక్‌పేట నియోజకవర్గంలోని సైదాబాద్, సింగరేణి కాలనీ, ఖాజాబాగ్, చింతల్ తదితర ప్రాంతాలలో బుధవారం ఉదయం హైదరాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎం.ఎం.ఫరూక్ ఆధ్వర్యంలో అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 1,352 గుడుంబా ప్యాకెట్లు, 130 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఆరుగురిని రిమాండ్‌కు తరలించారు. మిగతా వారిని బైండోవర్ చేసి వదిలిపెట్టినట్టు అధికారులు తెలిపారు. -
గుడుంబాపై అవగాహన
గుడుంబా తాగడం వల్ల వచ్చే అనర్థాల గురించి పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గునగల్ గ్రామంలో సోమవారం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. గ్రామంలో గుడుంబా తయారీ కేంద్రాలు అధికంగా ఉండటంతో వాటిని ధ్వంసం చేయకుండా.. వాటి వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. -
చీప్ లిక్కర్ కాదు.. చౌక మద్యం
సాక్షి, హైదరాబాద్: ‘‘గుడుంబా మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలను రక్షించేందుకే తెలంగాణ ప్రభుత్వం తక్కువ ధరకు మద్యాన్ని అందించే ఏర్పాటు చేస్తోంది. అంతేగానీ గుడుంబాకు ప్రత్యామ్నాయంగా ఎలాంటి చీప్ లిక్కర్‌ను పంపిణీ చేయడం లేదు’’ అని ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావు గౌడ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకు రానున్న నూతన మద్యం పాలసీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో... మంత్రి సోమవారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మద్యం పాలసీలో తాము తీసుకురాబోతున్న విధి విధానాలను వివరించారు. రాజకీయంగా మనుగడ ప్రశ్నార్థకం కావడంతో కొన్ని విపక్షాలు, తాము ఇంకా ప్రకటించని మద్యం పాలసీపై లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. నూతన మద్యం పాలసీని రెండు, మూడు రోజుల్లో ప్రకటిస్తామని, అందులో ప్రజలకు హానీ కలిగించే అంశాలేమైనా ఉంటే నిలదీసే అధికారం ఎవరికైనా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం మద్యం తాగాలని ప్రోత్సహించదని, గుడుంబా తాగి ప్రాణాలు తీసుకోకుండా ప్రజలను రక్షించేందుకే ఈ చర్యలు చేపట్టిందన్నారు. అక్టోబరు 1 నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. అన్నింట్లోనూ అదే ఆల్కహాల్ గుడుంబాను అరికట్టేందుకు ప్రభుత్వం కొత్తగా సారాయి దుకాణాలు ప్రారంభించ నుందని, కిరాణా షాపుల్లో కూడా మద్యం అమ్మకాలు చేపట్టనుందని విపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని మంత్రి దుయ్యబట్టారు. ప్రభుత్వం సారాయి గానీ, ఆపిల్జ్యూస్ను గానీ ప్రజలకు అందించడం లేదని, గతంలో ఉన్న మద్యం సీసాలనే తక్కువ ధరకు పంపిణీ చేస్తుందన్నారు. రూ.వెయ్యి ఖరీదున్న మద్యంలో ఎంత శాతం ఆల్కహాల్ ఉంటుందో, రూ.15కు అందించే మద్యం లోనూ అంతే శాతం (42.5) ఆల్కహాల్ ఉంటుందన్నారు. మండలం యూనిట్‌గా ప్రతి మండలంలో మూడు గ్రామాల్లో ఔట్లెట్లు (వైన్ షాపులు) ఉండేలా కొత్త విధానం తీసుకొస్తామన్నారు. మద్యం తాగకుండా ఉండలేని వారు.. కాస్త దూరం వెళ్లి అయినా నాణ్యమైన మద్యం తెచ్చుకుంటారని వ్యాఖ్యానించారు. గుడుంబాను అరికట్టేందుకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. నూతన మద్యం పాలసీతో కల్లుగీత కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. దశల వారీగా మద్యం విక్రయాలను నియంత్రిస్తామని, మద్యంతో జరిగే నష్టాలపై ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రభుత్వం డాక్యుమెంటరీని రూపొందించిందని పేర్కొన్నారు. సాంస్కృతిక సారధి నేతృత్వంలో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఆదాయం కోల్పోతున్నాం రాష్ట్రంలో గుడుంబాను సంపూర్ణంగా అరికట్టాలన్నది ప్రభుత్వ ధ్యేయమని పద్మారావు చెప్పారు. రూ.10తో గుడుంబా సేవిం చి అమాయకులు బలవుతున్నందున వారికి అందుబాటులో ఉండేలా సురక్షితమైన మద్యాన్ని రూ.15కే అందించాలని నిర్ణయిం చామన్నారు. సేల్స్‌ట్యాక్స్, వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ.. ఇలా వివిధ రూపాల్లో ఒక కేసు మద్యానికి రూ.1,840 ఆదాయం ప్రభుత్వానికి వస్తుందని, అయితే మద్యం తక్కువ ధరకు అందించాలనే ఉద్దేశంతో.. పన్నులను రూ.730కి ప్రభుత్వం తగ్గించుకుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకు 1.50 లక్షల కేసు ల విక్రయం జరుగుతోందని, పన్నులను తగ్గించడం ద్వారా ఆదాయాన్ని కోల్పోతామన్నారు. ప్రస్తుతం దుకాణాల్లో 180 మిల్లీలీటర్ల మద్యం ధర రూ.70 ఉండగా దాని ధరను రూ.30కు, 90 మిల్లీలీటర్ల మద్యం ధరను రూ.40 నుంచి రూ.15కు త గ్గిస్తున్నామని చెప్పారు. ఈ కొత్త విధానం గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమని, పట్టణ, నగర ప్రాంతాల్లో మద్యం ధరల్లో ఎలాంటి మార్పులు ఉండబోవన్నారు. -
'గుడుంబా పై యుద్ధం'
హైదరాబాద్:గుడుంబాపై ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందని సోమవారం మంత్రి పద్మారావు స్పష్టం చేశారు. గుడుంబాను అరికట్టడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. అవసరమైతే గుడుంబాను అరికట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులను సస్పెండ్ చేస్తామని మీడియా సమావేశంలో అన్నారు. గ్రామ గ్రామాన, కిరాణా స్టోర్లలోమద్యం అంటూ కొందరు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారన్నారు. ఒక్కో మద్యం కేసు పై రూ.1800 టాక్స్ వస్తుంటే రూ.700లకు తగ్గించి గుడుంబాకు ప్రత్యామ్నయంగా మద్యం తీసుకురావాలని చర్చలు జరుగుతున్నయని తెలిపారు. కొన్ని వందల కోట్ల నష్టం వచ్చినా సరే...తక్కువ ధరలకే మద్యం అందించి గుడుంబాను అరికట్టేలా చర్యలు ప్రారంభించనున్నామన్నారు. తక్కువ ధరకే 90 ఎంఎల్ మద్యాన్ని 15 రూ.లకే అందించడంతో వారు గుడుంబాను వదిలేసే అవకాశం ఉందన్నారు. -
లిక్కర్ మాఫియాను అడ్డుకోగలమా?
ఆందోళన చెందుతున్న ఎక్సైజ్ ఉన్నతాధికారులు సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లో గుడుంబాను అరికట్టడం కోసం ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన పాలసీపై ఆబ్కారీ శాఖ తీవ్ర మదనపడుతోంది. నూతన పాలసీ ప్రకారం మండలం ఒక యూనిట్‌గా ఏర్పాటు చేస్తే ఇబ్బందులు తప్పవని భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న జిల్లా స్థాయి మద్యం పాలసీకే లిక్కర్ మాఫియా అరాచకాలు సృష్టిస్తున్న నేపథ్యంలో మండలం యూనిట్‌గా అమలు చేస్తే వారి ఆగడాలకు అడ్డూ అదుపూ ఉండదేమోనని ఎక్సైజ్ శాఖ ఆందోళన చెందుతోంది. అంతేకాదు లిక్కర్ మాఫియా పూర్తి గుత్తాధిపత్యంతో మరింత బలపడే ప్రమాదం ఉందంటున్నారు. రాజకీయ నాయకులను, అధికారులను తమ వైపు తిప్పుకొని ధరలను ఇష్టారీతిన పెంచే ప్రమాదం లేకపోలేదని పేర్కొంటున్నారు. అదే విధంగా గ్రామాల్లో కల్తీ మద్యం ఏరులై పారినా అదుపు చేసే పరిస్థితి ఉండకపోవచ్చని అంటున్నారు. మొత్తం మీద ఈ విధానం వల్ల ఎక్సైజ్‌శాఖ మరింత అభాసు పాలయ్యే ప్రమాదముందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. పాతరోజులు వస్తాయేమో..! ఎన్టీఆర్ హయాంలో ‘వారుని-వాహిని’ ద్వారా సారా అమ్మకాలను సొంతం చేసుకున్న వ్యక్తులు గ్రామాల్లో వారి ఏజెంట్లను నియమించుకొని అమ్మకాలు సాగించేవారు. అయితే అక్రమ సారా సరఫరా అవుతుందంటూ సదరు వ్యక్తుల తాలుకు మనుషులు ‘ప్రైవేట్ సైన్యం’గా ఏర్పడి గ్రామాలతో పాటు తండాలలో విధ్వంసం సృష్టించారు. మళ్లీ అలాంటి ముప్పు వాటిల్లుతుందేమోనని ఆబ్కారీ శాఖ అందోళన చెందుతోంది. -
చౌక మద్యం ఉండాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: గుడుంబాను అరికట్టేందుకు చౌకమద్యం ఉండాలన్న నిర్ణయానికే ప్రభుత్వం కట్టుబడింది. రూ.15 కే 90 మిల్లీలీటర్ల మద్యం అందించేందుకు సిద్ధమైంది. ఆదాయం లేకున్నా, ప్రజల ప్రాణాలకు హాని కలగకుండా ఉండేందుకు పల్లెల్లో చౌకమద్యం ఉండాల్సిందేనని ఉన్నతస్థాయి వర్గాలు చెప్పాయి. అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చే నూతన మద్యం పాలసీపై సీఎం ఆమోదముద్ర వేశారు. 26 లోగా ఉత్తర్వులు ఇచ్చేలా, ఆ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరో 60 బార్లు కొత్త మద్యం విధానంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. వైన్‌షాపులు, బార్లకు చెరో గంట సమయాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. వైన్‌షాపుల వేళల్ని ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు, బార్ అండ్ రెస్టారెంట్లు ఉదయం 10 నుంచి రాత్రి 12 వరకు తెరిచి ఉంచనున్నారు. రాష్ట్రంలో అదనంగా 60 బార్ల ఏర్పాటుకు అనుమతి ఇవ్వనున్నారు. వైన్‌షాపుల పెంపునకు ‘నో’ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 2,216 మద్యం దుకాణాలను కొనసాగించాలని సర్కారు భావిస్తోంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో 1,500 పైచిలుకు ఉన్న మద్యం దుకాణాలకు మండలం యూనిట్‌గా లాటరీ పద్ధతిలో లెసైన్స్‌లు ఇస్తారు. దీంతో వైన్‌షాపులను పెంచాల్సిన అవసరం లేదని భావిస్తోంది. మండలం లెసైన్స్ పొందిన వ్యక్తి దాని పరిధి గ్రామాల్లో కూడా ఇకపై దుకాణాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఆదాయంపైనా దృష్టి ఆబ్కారీ శాఖ నుంచి ప్రస్తుతం లభిస్తున్న రూ.10 వేల కోట్లను ఈసారి మరో రెండు వేల కోట్లు అదనంగా రాబట్టాలని సర్కారు చూస్తోంది. మద్యం దుకాణాలకు దరఖాస్తు ఫీజు, మండలానికి ఒకటే ఏర్పాటు కానున్న వైన్‌షాపు లెసైన్స్‌కు భారీగా వడ్డించాలని నిర్ణయించింది. దరఖాస్తు ఫీజు 20 శాతం, లెసైన్స్ ఫీజు 15 శాతం పెంచాలని భావిస్తోంది. మండలంలో వైన్‌షాపుకు రూ.కోటి వరకు నిర్ణయించే అవకాశం ఉంది. -
ఆర్థిక శాఖ పనితీరు భేష్: ఈటల
హైదరాబాద్ : అవినీతికి పాల్పడితే ఎవరినీ ఉపేక్షించబోమని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. గడిచిన అయిదు నెలల కాలానికి సంబంధించి ఆర్థిక శాఖ పనితీరు, ఆదాయ-వ్యయాలపై ...సచివాలయంలో అధికారులతో ఆయన శనివారం సమీక్ష నిర్వహించారు. 92 శాతం ఆదాయానికి చేరుకున్నామని వెల్లడించిన మంత్రి...రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు నిధులు పుష్కలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఆర్థిక శాఖ పనితీరు సమర్థవంతంగా ఉందని, ప్రభుత్వ సొమ్ము ప్రజల డబ్బుగా భావించి ఖర్చు చేస్తున్నామని, ఆయాశాఖల్లో ఆడిట్ నివేదికల ద్వారా అవినీతిని అరికడుతున్నామని ఈటెల తెలిపారు. రైతుల రుణమాఫీల్లో కొంత మేర గాడి తప్పినట్లు సమాచారం ఉందని, మొదటి,రెండో విడత రైతుల రుణ మాఫీలో కొంత అవినీతి జరిగిందని తెలిపారు. అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఈటల హెచ్చరించారు. గుడుంబాను అరికట్టేందుకే చౌక మద్యం తెస్తున్నామని, ప్రభుత్వ ఆదాయ వనరుగా మద్యం విధానాన్ని చూడటం లేదని ఆయన అన్నారు. -
గుడుంబాకు బానిసై వ్యక్తి మృతి
కరీంనగర్: సుల్తానాబాద్ మండలంలోని సుగ్లాంపల్లి గ్రామానికి చెందిన గోపిశెట్టి చందు(35) అనే వ్యక్తి శనివారం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్థుల కథనం ప్రకారం గుడుంబాకు బానిసై అతిగా సేవిస్తూ అనారోగ్యం బారిన పడడంతో కరీంనగర్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా మృతిచెందినట్లు తెలిపారు. గుడుంబాను అరికట్టకుంటే గ్రామంలో మరింత మంది చనిపోయే ప్రమాదం ఉందని సర్పంచ్ పసెడ్ల స్వరూప తెలిపారు. వెంటనే ఎక్సైజ్ అధికారులు, పోలీసులు గుడుంబా స్థావరాలపై దాడులు చేసి గుడుంబాను అరికట్టాలని కోరారు. మృతునికి భార్య లక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
గుడుంబా అమ్ముతున్న గ్రామాలు @ 483
నల్లగొండ : జిల్లా వ్యాప్తంగా ఏరులైపారుతున్న గుడుంబా లెక్కతేలింది. నాటుసారా జోలికి ఎవరూ వె ళ్లకుండా దాని స్థానంలో గ్రామాల్లో చీప్ లిక్కర్ దుకాణాలు తెరవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి కొద్ది రోజులుగా రాష్ట్రస్థాయిలో జరుగుతున్న కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. అయితే గుడుంబా అమ్మకాలు జరిగే ప్రాంతాలు గుర్తించిన తర్వాతే ఎన్ని గ్రామాల్లో చీప్ లిక్కర్ దుకాణాలకు అనుమతివ్వాలనే అంశం ఆధారపడి ఉంది. దీంతో ఇటీవల జిల్లా ఎక్సైజ్‌శాఖ నాటుసారా అమ్మకాలు జోరుగా సాగే ప్రాంతాలను జల్లెడ పట్టింది. జిల్లా వ్యాప్తంగా 1178 గ్రామ పంచాయతీలు ఉండగా...నాటుసారా తయారయ్యే గ్రామాలు 483 ఉన్నట్లు గుర్తించారు. ఈ గ్రామాలను ఏ,బీ కేటగిరీలుగా విభజించారు. ‘ఏ’ కేటగిరిలో నాటుసారా తయారు చేస్తున్న గ్రామాలు, తండాలు 260 ఉండగా...సారా అత్యధికంగా అమ్ముడయ్యే గ్రామాలు, తండాలు కలిపి 483 ఉన్నాయి. ఈ గ్రామాల్లో నాటుసారా తయారీ అరికట్టడంతోపాటు, మద్యం వ్యాపారులు అక్రమంగా నడుపుతున్న బెల్టుదుకాణాల భరతం పట్టేందుకు ‘పీడీ యాక్ట్’ ప్రయోగించాలని ఆదేశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే గడిచిన నాలుగు మాసాల్లో పోలీస్‌శాఖ, ఎక్సైజ్ శాఖ అధికారులు గ్రామాలు, తండాల్లో మెరుపుదాడులు చేస్తున్నారు. పోలీస్ వర్సెస్ ఎక్సైజ్.... గ్రామాల్లో చీప్ లిక్కర్ దుకాణాలు తెరవాలంటే ముందుగా నాటుసారా తయారీ నిరోధించాలి. దీనిలో భాగంగానే జూలైలో ఖరారు కావాల్సిన మద్య పాలసీ మూడు నెలల వరకు వాయిదా వేశారు. వచ్చే నెలాఖరు నాటికి మూడు మాసాల గడువు పూర్తవుతుంది. అప్పటిలోగా బెల్లం అమ్మకాలు, నాటుసారా తయారీ, బెల్టుదుకాణాలను నామరూపం లేకుండా చేయాలని పోలీస్, ఎక్సైజ్ శాఖలకు ఆదేశాలు వచ్చాయి. గతానికి భిన్నంగా ప్రభుత్వం పోలీస్ శాఖకు సర్వాధికారాలు కట్టబెట్టింది. పోలీస్‌శాఖ దాడిచేసి పట్టుకున్న కేసులను గతంలో ఎక్సైజ్ శాఖకు అప్పగించడం జరిగేది. కానీ ఇప్పుడు అలా కాకుండా పోలీస్ శాఖకు కేసులు న మోదు చేసే అధికారాన్ని కల్పించారు. దీంతో పోలీస్ అధికారులు జిల్లా వ్యాప్తంగా మెరుపు దాడులు చేస్తుండటంతో దానికి దీటుగానే ఎక్సైజ్ శాఖ సైతం నాటుసారా తయారీ దారులపై కొరఢా ఝళిపిస్తోంది. దాడులు ఉధృతం.... వరుసగా మూడు, నాలుగు కేసులు నమోదైన వ్యక్తులు లేదా బెల్లం వ్యాపారులపై పీడీ యాక్ట్ ప్రయోగించనున్నారు. సారా తయారీ, విక్రయాలకు అడ్డుకట్టవేయడంలో విఫలమైతే సంబంధిత ఎక్సైజ్, పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేయమని సీఎం నుంచి ఆదేశాలు ఉన్నాయి. దీంతో నాలుగు మాసాలుగా ఈ రెండు శాఖలు కూడా కంటి మీద కునుకు లేకుండా గ్రామాల్లో, తండాల్లో తరచూ దాడులు చేస్తున్నాయి. గతేడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు నాటుసారా 25,023 లీటర్లు పట్టుకుంటే ఈ ఏడాది అదేరోజుల్లో 30,046 లీటర్ల సారాను సీజ్ చేశారు. గతేడాది అరెస్టయిన వ్యక్తులు 1338 మంది కాగా..ఈ ఏడాది 1501 మందిని అరెస్టు చేశారు. నల్లబెల్ల అమ్మకాలు మాత్రం గతేడాది 15,915 కిలోలు సీజ్ చేయగా...ఈ ఏడాది కేవలం 5,875 కిలోల బెల్లాన్ని మాత్రమే సీజ్ చేశారు. ఎక్సైజ్ శాఖ చరిత్రలో ఈ దాడులు ఓ రికార్డు సాధిస్తాయని అధికారులు చెప్పడం గమనార్హం. ‘ఏ’ కేటగిరిలో గ్రామాలు /తండాలు : 260 ‘బీ’ కేటగిరిలో గ్రామాలు /తండాలు : 223 ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై 31 వరకు నమోదైన గుడుంబా కేసులు సీజ్ చేసిన సారాయి (లీటర్లు) 30,046 ధ్వంసమైన బెల్లం పానకం (లీటర్లు) 12,47,810 సీజ్ చేసిన నల్లబెల్లం(కిలోలు) 5,875 నాటుసారా కేసులు 3,125 అరెస్టయిన వారి సంఖ్య 1,501 సీజ్ చేసిన వాహనాలు 109 -
'చీప్' లిక్కర్
ఇక సర్కారీ చౌక మద్యం అక్టోబర్ తర్వాతే అమ్మకాలు క్వార్టర్ 30 రూపాయలే..! 10 వేల జనాభాకు ఓ దుకాణం! గుడుంబా విక్రయూలు బాగున్నచోటే లెసైన్స్ ఖమ్మం(వైరా): రాష్ట్రంలో చౌక మద్యం విక్రయాలపై ప్రభుత్వ కసరత్తు తుది దశకు చేరుకుంది. ప్రజల ప్రాణాలను హరిస్తున్న గుడుంబాను తరిమికొట్టాలంటే .. ఆ స్థానంలో చౌక మద్యం అమ్మకాలు తప్పనిసరి అని భావిస్తున్న ప్రభుత్వం దీన్ని ఎప్పటి నుంచి అందుబాటులోకి తేవాలనే అంశంపై మల్లగుల్లాలు పడుతోంది. అధికార వర్గాల సమాచారం మేరుకు అక్టోబర్ నుంచి కొత్త లెసైన్సు అమల్లోకి వస్తుండటంతో అప్పటి నుంచి చౌక మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. దుకాణాలపై కసరత్తు చౌక మద్యం దుకాణాలు ఎక్కడ ఎర్పాటు చేయాలనే అంశంపై జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మొదలు ఎక్సైజ్ ఎస్సై వరకు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎక్సైజ్ ఉన్నతాధికారుల సమావేశంలో దీనిపై పలు సూచనలు వచ్చాయి. 10 వేల జనాభాకు ఒక చౌక మద్యం దుకాణానికి అనుమతి ఇవ్వాలని ఓ ఆలోచన.. లేదంటే రెవెన్యూ, గ్రామ పంచాయతీ యూనిట్‌గా అనుమతి ఇవ్వాలని మరో ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. గుడుంబా విక్రయూలు ఎక్కువగా ఉన్న చోట లెసైన్స్‌లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆయూ ప్రాంతాల్లో ప్రజల జీవన విధానం, ఆర్థిక పరిస్థితులు, మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే అమ్మకాలు ఎలా ఉంటాయనే అంచనాలు రూపొందించాల్సిందిగా ఎక్సైజ్ సిబ్బందికి ఆదేశాలు జారీ అయ్యూయి. అక్టోబర్ నుంచే చౌకమద్యం ఈ ఏడాది మద్యం లెసైన్స్‌దారుల లెసైన్స్ గడువు జూన్ 30కి ముగిసింది. దీన్ని ప్రభుత్వం మరో మూడునెలలు అంటే సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. అక్టోబర్ నెలలో కొత్త లెసైన్సులు, కొత్త మద్యం విధానాన్ని ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. భవి ష్యత్‌లో చౌకమద్యం పై న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి కనీసం మూడు నెలల సమయం అవసరం ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు. ఎక్సైజ్ అధికారుల సమాచారం మేరకు వైన్స్ షాపుల్లో చౌక మద్యం అమ్మకాలు జరపడానికి వీల్లేదని.. 10 వేల జనాభా ఉన్నచోట మద్యం దుకా ణం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలో 25లక్షల జనా భా ఉన్నట్లు లెక్కలు చెపుతున్నాయి. ప్రస్తుతం ఉన్న 149 దుకాణాల స్థా నంలో జనాభాకు అనుగుణంగా 250 మద్యం దుకాణాలు రానున్నాయి. రూ.30కే చౌకమద్యం ప్రస్తుతం మద్యం దుకాణాల్లో లభిస్తున్న చీప్‌లిక్కర్ ధర రూ.180 ఉండగా ప్రభుత్వం అమ్మే చౌకమద్యం మాత్రం రూ.30 కే లభించనుంది. గుడుంబా ప్యాకెట్ల ధరకు దగ్గరగా ఉండేందుకు ఈ ధరను నిర్ణయిస్తున్నట్లు సమాచారం. మరింత కిక్ ఇచ్చేలా ఆల్కాహాల్ శాతాన్ని పెంచనున్నారు. ఇక రూ.30కే మందుబాబులకు కిక్ ఎక్కేలా లిక్కర్ అందుబాటులోకి రానుంది. -
గుడుంబాపై ఉక్కుపాదం
వ్యాపారులపై పీడీ యాక్ట్ నల్లబెల్లం, పటిక అమ్మితే శిక్షిస్తాం.. ఎక్సైజ్ అధికారుల హెచ్చరిక వరంగల్‌క్రైం : జిల్లా ఎక్సైజ్ అధికారులు గుడుంబా వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. అధికారులు వివిధ శాఖల సమన్వయంతో గ్రామాలు, తండాల్లో గుడుంబాపై అవగాహన సదస్సులు విస్తృ తంగా నిర్వహిస్తూనే.. మరోపక్క రాటుదేలిన గుడుంబా వ్యాపారులపై పీడీ యాక్ట్ ప్రయోగించి జైలుకు పంపుతున్నారు. ఇప్పటివరకు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో వేలాది లీటర్ల గుడుంబాను ధ్వంసం చేయడంతోపాటు నిత్యం దాడులు చేస్తూ గుడుంబా విక్రయదారులు, ముడిసరుకు సరఫరా చేసేవారిని అదుపులోకి తీసుకుంటున్నారు. పెద్దఎత్తున గుడుంబా విక్రయాలు, ముడిసరుకు అమ్మే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నారు. ఇందులో భాగంగా మొట్టమొదటగా నర్సంపేటకు చెందిన గుడుంబా విక్రయదారుడు ముప్పిడి రమేశ్‌పై మహబూబాబాద్ ఈఎస్టీఎఫ్ పీడీ యూక్ట్ ప్రయోగించి సెంట్రల్ జైలుకు తరలించింది. ముడిసరుకు రవాణాదారుడిపై పీడీ యాక్ట్ హన్మకొండ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో విరివిగా నల్లబెల్లం, పటికను సరఫరా చేస్తున్న పరకాలకు చెందిన వ్యాపారి చిటికేశి సదాశివుడుపై తాజాగా పీడీ యాక్ట్ నమోదు చేశారు. గుడుంబా ముడిసరుకు సరఫరాకు చెందిన పలు కేసుల్లో సదాశివుడు ముద్దారుు. దీంతో తిరిగి అలాంటి నేరాలకు పాల్పడకుండా పీడీ యాక్ట్-1986 కింద నిర్బంధించడానికి కలెక్టర్ గత నెల 30న ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్సైజ్ డిప్యూటి కమిషనర్ నర్సారెడ్డి ఆదేశాల మేరకు సదాశివుడిని అదుపులోకి తీసుకుని ఈనెల 1వ తేదీన వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. సదాశివుడిని హన్మకొండ ఎక్సైజ్ సీఐ గండ్ర దేవేందర్‌రావు, టాస్క్‌ఫోర్స్ సీఐ రామకృష్ణ, హన్మకొండ ఎస్సైలు బిక్షపతి, సుబ్బరాజు సిబ్బంది అరెస్టు చేశారు. అలాగే గుడుంబా కేంద్రాలకు నల్లబెల్లం, పటిక వంటి ముడి సరుకును రవాణా చేస్తే కఠినంగా శిక్షిస్తామని ఈ సందర్భంగా సీఐ దేవేందర్‌రావు హెచ్చరించారు. ఎక్సైజ్ శాఖకు సంబంధం ఉన్న పలు కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వారిని పీడీ యాక్ట్ ద్వారా నిర్బంధిస్తామని తెలిపారు. -
గుడుంబాకు చెక్!
* కొత్త మద్యం పాలసీపై ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ నివేదిక * వారంలోగా నూతన విధానం ప్రకటన సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా నూతన మద్యం విధానంపై ఎక్సైజ్ శాఖ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. మద్యం దుకాణాలను క్రమబద్ధీకరించడంతో పాటు ప్రజల ప్రాణాలకు హానిగా మారిన నాటుసారా(గుడుంబా)ను నిరోధించేందుకు తక్కువ ధర మద్యాన్ని (అఫర్డబుల్ లిక్కర్) ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు తాజాగా ఎక్సైజ్ కమిషనర్ ఆర్వీ చంద్రవదన్ సీఎంన కలసి నివేదిక అందజేశారు. వివిధ రాష్ట్రాల్లో మద్యం విధానంపై ఎక్సైజ్ అధికారులు అధ్యయనం చేసి ఇచ్చిన నివేదికల ఆధారంగా కొత్త మద్యం విధానం ప్రతిపాదనలు తయారు చేశారు. దీనిపై సమగ్ర రిపోర్టును సీఎంకు ఆయన అందజేశారు. ఈ నేపథ్యంలోనే ప్రజలకు ఆమోదయోగ్యమైన మద్యం విధానాన్ని తీసుకొస్తామని సీఎం కేసీఆర్ కూడా ప్రకటించారు. దుకాణాల పెంపు యోచనలో ఎక్సైజ్ శాఖ రాష్ట్రంలో ప్రస్తుతం 2,216 మద్యం దుకాణాలు (ఎ4 షాపులు) ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్, కార్పొరేషన్, మునిసిపాలిటీ, మండల కేంద్రం, గ్రామాల సమాహారం ప్రాతిపదికన ఆరు స్లాబుల్లో మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో వ్యాపారులకు లెసైన్స్‌లు అందిస్తున్నారు. అయితే ఒక ైవె న్షాపు పరిధిలో ఉన్న గ్రామాలు, బస్తీల్లో బెల్టుషాపులు విచ్చలవిడిగా వెలిసి, ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. ఈ నేపథ్యంలో 10 వేల జనాభాకు ఒక వైన్‌షాపు ప్రాతిపదికన ఈసారి మద్యం దుకాణాలను పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం.ఈ లెక్కన రాష్ట్రంలో దాదాపు 3,500 మద్యం దుకాణాలు తెరవాలన్నది ఎక్సైజ్ శాఖ ప్రణాళిక. లెసైన్స్ ఫీజు అధికంగా ఉన్నందున గ్రేటర్ పరిధిలోని 103 షాపులను వ్యాపారులెవరూ తీసుకోలేదు. ఈ నేపథ్యంలో దుకాణాలను పెంచి లెసైన్స్ ఫీజును రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రత్యామ్నాయంగా చీపెస్ట్ లిక్కర్ ప్రస్తుతం వైన్‌షాపుల్లో కారు చౌక మద్యం పేరుతో రిటైలర్‌కు విక్రయిస్తున్న 180 మి.లీ. మద్యం కనీస ధర రూ.60, 90 మి.లీ. ధర రూ. 35గా ఉంది. ఇంత మొత్తాన్ని వెచ్చించలేని వారు రూ.20 లోపే లభించే గుడుంబా పాకెట్లను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో పర్యటించిన కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్ అక్కడ లభ్యమవుతున్న దేశీ దారూ మద్యంపై అద్యయనం చేసి, 20 రూపాయలకే 90 మి.లీ. చీపెస్ట్ లిక్కర్‌ను అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా ఆయన అంగీకరించినట్లు సమాచారం. ఈ మేరకు వారం రోజుల్లో కొత్త మద్యం విధానాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం. -
గుడుంబా స్థావరాలపై దాడులు
వరంగల్ : పర్వతగిరి మండలంలోని కల్లెడ శివారు కొత్త తండాలోని గుడుంబా స్థావరాలపై పోలీసులు శుక్రవారం తెల్లవారు జామున దాడి చేశారు. ఈ దాడుల్లో 1000 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. రెండు వందల లీటర్ల నాటు సారాను పట్టుకున్నారు. ఐదుగురిపై కేసు నమోదు చేశారు. కొత్తతండాలోని పొలాల్లో, గుట్టల మధ్య ఉన్న గుడుంబా తయారీ కేంద్రాలపై దాడులు చేయడానికి పోలీసు తీవ్రంగా కృషి చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో గుడుంబాకు యువకులు బానిసై చనిపోతున్నారని తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కల్లెడ గ్రామ పంచాయతీ సహకారంతో సర్పంచ్ చొరవతో గుడుంబాపై యుద్ధం చేస్తున్నట్లు తెలిపారు. గుడుంబా నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. కల్లెడ గ్రామ సర్పంచ్ చినపాక శ్రీనివాస్ మాట్లాడుతూ ఎక్సైజ్ అధికారులకు పలు మార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. గుడుంబాను అమ్మేవారు, తయారుచేసేవారు ఆ వృత్తి మానేస్తే వారికి ఉపాధి హామీ పథకం కింద పని కల్పిస్తామని హామీ ఇచ్చారు. -
'నాటు సారాను పూర్తిగా అరికడతాం'
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి పరిసర ప్రాంతాలలో నాటు సారా తయారీని పూర్తిగా అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు అబ్కారీ సంచాలకులు దామోదర్ ఆదివారం రాజమండ్రిలో స్పష్టం చేశారు. గత 20 ఏళ్లుగా నాటు సారా మాఫియా వేళ్లూనుకొని ఉందని తెలిపారు. పుష్కరాల సందర్భంగా నాటు సారాను పూర్తిగా నిరోధిస్తామన్నారు. ఈ దాడుల్లో బారీగా నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. 33 మంది నాటుసారా తయారీ దారులను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన చెప్పారు. శనివారం అర్థరాత్రి నుంచి దామోదర్ ఆధ్వర్యంలో నాటు సారా స్థావరాలపై దాడులు ఆదివారం ఉదయం కూడా కొనసాగుతున్నాయి. పశ్చిమగోదావరి, విశాఖ జిల్లా నుంచి వచ్చిన దాదాపు 500 మంది ఎక్సైజ్ సిబ్బంది... 30 బృందాలుగా విడిపోయి...నాటు సారా స్థావరాలపై దాడులు చేస్తున్నారు. జూన్ నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో నాటు సారా తయారి ఊపందుకొంది. దీనిపై పూర్తి సమాచారం అందుకున్న అబ్కారీ డైరెక్టర్ దామోదర్ దాడులు నిర్వహించేందుకు సమాయత్తమైయ్యారు. అందులో భాగంగా పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాల నుంచి సిబ్బందిని రప్పించి... శనివారం అర్థరాత్రి నుంచి దాడులు నిర్వహిస్తున్నారు -
సార్కారు కిక్కు..
{పభుత్వ సారాయిపై {పజాభిప్రాయ సేకరణ త్వరలో జిల్లాకు {పత్యేక బృందాలు పరిస్థితిపై ఆరా ఆదిలాబాద్ క్రైం : గుడుంబాకు అడ్డుకట్ట వేసేందుకు సర్కారు సారాను ప్రవేశపెట్టాలని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం సారాయి ప్రవేశపెట్టడంపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే త్వరలో జిల్లాకు ప్రత్యేక టాస్క్ఫోర్సు బృందాలు రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం జిల్లాలో మద్యపాన నిషేధం ఏ విధంగా అమలవుతోంది.. మద్యపానం అలవాటు ఉన్నవారు దేనిని సేవిస్తున్నారు.. వాటి స్థానంలో ఏమి కోరుకుంటున్నారు.. అనే అంశాలపై టాస్క్ఫోర్సు బృందాలు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నా రుు. ప్రభుత్వం నుంచి మద్యపాన ప్రియులు ఏ రకమైన సారాయి కోరుకుంటున్నారు..? సారా తీసుకురావడంతో గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుందనే అంశాలను అంచనా వేయనున్నారు. 1993లో అప్పటి ప్రభుత్వం సారాయిని నిషేధించింది. సారాపై నిషేధం తో చీప్‌లిక్కర్‌కు డిమాండ్ పెరగడం, ప్రజల ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు రావడంతో ఐఎంఎల్, బీర్ల అమ్మకాలు పెరిగి ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా మారింది. అప్పటి నుంచి కేవలం అధికారికంగా మద్యం దుకాణాలు, బార్ రెస్టారెంట్లు మాత్రమే కొనసాగుతున్నాయి. జోరుగా గుడుంబా.. జిల్లాలో అనేక ప్రాంతాల్లో గుడుంబా స్థావరాలు పా తుకుపోయి ఉండడం, ఎన్నిసార్లు అధికారులు దాడు లు చేసినా అవి పూర్తి స్థాయిలో నియంత్రణలోకి రావడం లేదు. జిల్లాలో బెల్లంపల్లి, మంచిర్యాల, మందమర్రి, శ్రీరాంపూర్, ఉట్నూర్, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో రోజుకు వంద లీటర్ల గుడుంబా విక్రయిస్తున్నారని సమాచారం. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామాల్లో గుడుంబా వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ప్రమాదకరమైన నాటుసారా తాగి ఎంతో మంది మృత్యువాత పడుతున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర శివారు గ్రామాల్లో చీప్ లిక్కర్ విక్రయాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, గుడుంబా తక్కువ ధరకు అందుబాటులో ఉండడంతో అనేక మంది దాన్ని సేవిస్తున్నారని తెలుస్తోంది. దీనికితోడు మహారాష్ట్ర నుంచి దేశీదారు జిల్లాకు పెద్ద ఎత్తున అక్రమంగా రావడంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. ప్రజాభిప్రాయ సేకరణ.. గుడుంబా అరికట్టడమా..? లేదా ప్రభుత్వం తరఫున సారాయిని తీసుకురావడమా..? అని తెలంగాణ ప్రభుత్వం కొంత కాలంగా మల్లగుల్లాలు పడుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు టాస్క్ఫోర్సు బృందాలను పంపించి ప్రజాభిప్రాయాన్ని సేకరించే పనికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ సారాయి కోరుకుంటున్న వారి గురించి ఆరా తీసి, గ్రామాల్లో ఎవరెవరికి మద్యం తాగే అలవాటు ఉంది.. ఇప్పుడు లభించే చీప్‌లిక్కర్, ఇతర ఖరీదైన బ్రాండ్లు గ్రామాల్లో ఎంత మేరకు విక్రయం అవుతున్నాయి.. గుడుంబా ప్రభావం ఉన్న ప్రాంతాల్లో వీటి విక్రయాలు ఏ విధంగా ఉన్నాయనే అంశాలను సైతం టాస్క్ఫోర్సు బృందాలు పరిశీలించనున్నాయి. జిల్లాలో వైన్‌షాపుల ద్వారా లభిస్తున్న ఆదాయానికి ప్రభుత్వ సారాతో ఏమైనా గండిపడుతుందా..? పడితే ఎంత మేరకు..? ప్రభుత్వం సారాయిని ప్రవేశపెడితే ఎంత పరిమాణంలో కనీస బాటిల్ ఉండాలి..? దాని ధర ఎలా ఉండాలి..? అందువల్ల మద్యం విక్రయాలకు కలిగే నష్టం ఎంత..? అన్న అంశాలను సైతం గ్రామాల వారీగా లెక్కలు తీస్తున్నారు. సర్కారు సారాయిని ప్రవేశపెడితే ఒక్కో మండలంలో ఎన్ని దుకాణాలకు అనుమతులు ఇవ్వాలి, లెసైన్సు ఫీజు, సారాయి ధర ఎంత ఉండాలనే వివరాలతో ఎక్సైజ్ కమీషనర్‌కు నివేదిక అందజేసినట్లు తెలుస్తోంది. సంవత్సరానికి 500 కోట్ల ఆదాయం.. జిల్లాలో మద్యం విక్రయం ద్వారా ఏటా సుమారు రూ.500 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం లభిస్తోంది. ఇక పండుగలు, ఎన్నికలు.. ఇతర ప్రత్యేక సందర్భాల్లో వీటి ఆదాయం మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సారాయితో మద్యం విక్రయాలకు ఇబ్బంది కలగకుండా చూడాలనే అంశంపై ఉన్నత స్థాయి అధికారులు, క్షేత్రస్థాయి ఎక్సైజ్ అధికారుల నుంచి ప్రజాభిప్రాయాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం సరఫరా చేస్తున్న చీప్‌లిక్కర్ ధర రూ.60 ఉండటంతో వాటి విక్రయాల సంఖ్య ఎక్కువగా ఉండి.. చీప్‌లిక్కర్ ధర కన్నా తక్కువగా సుమారు రూ.35 ధరకు 180 ఎంఎల్ సారాను ప్రభుత్వం పంపిణీ చేస్తే గుడుంబా ప్రవాహం ఆపవచ్చని, అలాగే అధికారిక మద్యం విక్రయాలకు ఇబ్బందులు ఉండవని ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వానికి నివేధికను అందజేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శివరాజ్‌ను వివరణ కోరగా సర్కారు సారాపై ఇంకా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టలేదని, ఉన్నత అధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదన్నారు. -
ఆ‘సారా’ ఉండదు..!
గుడుంబా స్థానంలో సారాయి ప్రవేశపెడితే అసలుకే మోసమంటున్న ఆర్థిక శాఖ ఐఎంఎల్, బీర్ల విక్రయాలపై ఆదాయ లక్ష్యం రూ. 10,500 కోట్లు ఇందులో 40 శాతం వాటా చీప్లిక్కర్దే.. సారాతో చీప్‌లిక్కర్ ఔట్ లాభనష్టాలను బేరీజు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రలో దేశీదారు అమ్మకాలను పరిశీలించి వచ్చిన ఎక్సైజ్ బృందం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గుడుంబాకు అడ్డుకట్ట వేసేందుకు సర్కారీ సారాయిని ప్రవేశపెట్టాలని భావిస్తున్న ప్రభుత్వం... దానివల్ల ఎక్సైజ్ రెవెన్యూ తగ్గిపోతుందేమోనని తర్జనభర్జన పడుతోంది. ఐఎంఎల్ (స్వదేశీ తయారీ మద్యం), బీర్ల అమ్మకాల ద్వారా ఏటా రూ. 10 వేల కోట్ల ఆదాయం సమకూరుతుండగా... చీప్‌లిక్కర్ కన్నా తక్కువ ధరకు సారాయి విక్రయిస్తే అసలుకే మోసం వస్తుందేమోనని భావిస్తోంది. 1993లో సారాయిపై ప్రభుత్వం నిషేధం విధించేనాటికి ఐఎంఎల్పై వచ్చే ఆదాయం కన్నా.... సారాయి కాంట్రాక్టులు, అమ్మకాల ద్వారానే అబ్కారీ శాఖకు ఎక్కువగా ఆదాయం వచ్చేంది. సారాపై నిషేధంతో చీప్‌లిక్కర్ ఆ స్థానాన్ని భర్తీ చేయడం, ప్రజల ఆర్థిక స్థితిగతుల్లో వచ్చిన మార్పులు వంటివాటితో ఐఎంఎల్, బీర్ల అమ్మకాలు పెరిగి ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఇదే సమయంలో కార్మికులు, అల్పాదాయ వర్గాలు తక్కువ ధరలో లభించే ప్రమాదకరమైన నాటుసారా తాగుతుండడంతో అనర్థాలు పెరిగాయి. ఇటీవల సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనలో మహిళలు గుడుంబాపై ఆందోళన వ్యక్తం చేశారు కూడా. ఈ నేపథ్యంలో గుడుంబాకు పరిష్కారంగా ప్రభుత్వ సారాయిని ప్రవేశపెట్టాలని ప్రభుత్వ పెద్దలు అభిప్రాయానికి వచ్చారు. ఈ మేరకు ఎక్సైజ్ మంత్రి, సంబంధిత అధికారులతో సీఎం సమావేశమై... సారాయిని ప్రవేశపెడితే ఎదురయ్యే పరిణామాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అయితే సారాను ప్రవేశపెడితే ఎక్సైజ్ శాఖ ద్వారా వస్తున్న రెవెన్యూలో లోటు తప్పదని ఆర్థిక శాఖ తేల్చినట్లు సమాచారం. ప్రస్తుతం మండల కేంద్రాలు, హైవేలకు మాత్రమే వైన్‌షాపులు, బార్లు పరిమితం. సారాయి ప్రవేశపెడితే ఊరూరా దుకాణం ఏర్పాటవుతుందని, అదే జరిగితే చీప్‌లిక్కర్, మీడియం లిక్కర్ తాగేవారు సారా వైపు మొగ్గు చూపుతారేమోనని ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. ఇదే జరిగితే ఖజానా రాబడి భారీగా తగ్గిపోతుందని ఎక్సైజ్ శాఖ నివేదిక రూపొందించింది. మహారాష్ట్రలో పరిశీలన మహారాష్ట్రలో చౌకమద్యంగా ‘దేశీదారు’కు డిమాండ్ ఉండడంతో... ఎక్సైజ్ కమిషనర్ అహ్మద్ నదీం ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ రాజశేఖర్‌తో కూడిన బృందం ఆ రాష్ట్రానికి వెళ్లి పరిశీలించింది. అక్కడి ప్రభుత్వం 90 ఎంఎల్ దేశీదారు మద్యాన్ని రూ. 17కే సరఫరా చేస్తుండడంతో అల్పాదాయ వర్గాలు, కార్మిక వర్గాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. అయితే మహారాష్ట్రలో దేశీదారు అమ్మకాలు, ఆదాయం, దేశీదారు వల్ల ఐఎంఎల్ అమ్మకాలకు జరిగే నష్టం తదితర అంశాలను రాష్ట్ర ఎక్సైజ్ బృందం పరిశీలించింది. రాష్ట్రంలో సారాయిని ప్రవేశపెడితే ఒక్కో మండలంలో ఎన్ని దుకాణాలకు అనుమతులు ఇవ్వాలి, లెసైన్స్ ఫీజు, సారాయి ధర ఎంత ఉండాలనే వివరాలతో నివేదికను ఎక్సైజ్ కమిషనర్‌కు ఇచ్చింది. అలాగే, సారాయిని 90 ఎంఎల్‌కు బదులు 180 ఎంఎల్ బాటిల్‌గా రూ. 35 కనీస ధరగా ఉండాలని కూడా తెలిపినట్లు సమాచారం. ఆదాయం ఔట్? రాష్ట్రంలో జనవరి నెలలో 17.90 లక్షల కేసుల ఐఎంఎల్ మద్యం, 25 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. తద్వారా వచ్చిన రెవెన్యూ రూ.767 కోట్లు. ఈ మొత్తం ఆదాయంలో చీప్ లిక్కర్ అమ్మకాల ద్వారా వచ్చేది 40 శాతానికిపైగా ఉంటుంది. అదే సారాయిని ప్రవేశపెడితే చీప్‌లిక్కర్ అమ్మకాలు తగ్గిపోయే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం రూ. 10,500 కోట్ల ఆదాయ లక్ష్యంగా సాగుతున్న ఎక్సైజ్ రెవెన్యూలో సారాయి వల్ల భారీగానే కోత పడుతుందని ఎక్సైజ్, ఆర్థికశాఖలు ప్రాథమికంగా తేల్చాయి. అయితే సారాయి వల్ల రాష్ట్రవ్యాప్తంగా రూ. 2,500 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని తేల్చినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం మద్యం దుకాణాలు, బార్లు ఏర్పాటు చేసేందుకు లెసైన్స్ ఫీజు రూ. 35 లక్షల నుంచి రూ. 90 లక్షల వరకు ఉంది. ఈ ఫీజు రూపంలోనే ఏటా వెయ్యి కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. -
తిమ్మాపూర్‌లో పోలీసుల నాకాబందీ
తిమ్మాపూర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో పోలీసులు గురువారం నాకాబందీ నిర్వహించారు. మూడు మండలాల పోలీసులతో ఎస్ఐ దామోదర్ రెడ్డి ఈ తనిఖీలు చేపట్టారు. పలు గుడంబా కేంద్రాలను గుర్తించి ధ్వంసం చేశారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి నాకాబందీ కొనసాగుతోంది. పోలీసుల హడావుడితో ఉలిక్కిపడిన గ్రామస్థులు నాకాబందీ విషయం తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. -
సర్కారీ సారాయి?
గుడుంబా నియంత్రణకు ప్రత్యామ్నాయ మార్గం! ఎక్సైజ్ శాఖ సమీక్షలో ప్రస్తావించిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్తీ మద్యంతో కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన పరిష్కారంపై నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం డిమాండ్ మేరకు రాష్ట్రంలోనే మద్యం ఉత్పత్తి తగినన్ని డిస్టిలరీల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్న కేసీఆర్ తెలంగాణలో చాలా చోట్ల గుడుంబా సమస్య ఉంది. నేను గరీబ్‌నగర్‌కు పోతే అక్కడి మహిళలు మళ్లీ ప్రభుత్వ సారా తేవాలని అడిగారు. తెలంగాణ సమాజం ఈ సమస్యను అధిగమించాలి. దీనిపై చర్చ జరగాలి. తొందర్లోనే దీనిపై ఓ విధానం రూపొందిస్తాం - ఆదివారం వరంగల్ జిల్లా హన్మకొండలో మీడియాతో సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మళ్లీ ప్రభుత్వ సారాయి దుకాణాలు తెరిచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయా? కల్తీ మద్యాన్ని(గుడుంబా) అరికట్టడానికి ఇదే ప్రత్యామ్నాయమని ప్రభుత్వం భావిస్తోందా? కల్తీ మందు తాగి చోటుచేసుకుంటున్న మరణాలతో కుటుంబాలు వీధిన పడుతున్నాయని, దీనికి మరో మార్గాన్ని అన్వేషించాలని సర్కారు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు గుడుంబా గురించి ఎక్కువ మంది ఫిర్యాదు చేస్తున్నారని, ప్రభుత్వ సారా అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వరంగల్‌లో చేసిన వ్యాఖ్యలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. తాజాగా ఎకై్సజ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలోనూ సీఎం ఈ విధమైన సూచన చేసినట్లు సమాచారం. సోమవారం సచివాలయంలో ఎకై్సజ్ శాఖతో సమావేశంలో ముఖ్యమంత్రి ఎక్కువగా గుడుంబాపైనే చర్చించినట్లు తెలిసింది. అధికారవర్గాల సమాచారం ప్రకారం.. వచ్చే అబ్కారీ సంవత్సరానికి సంబంధించిన పలు అంశాలపైనా ఆయన చర్చించారు. గుడుంబాతో అనేక కుటుంబాలు పెద్దదిక్కును, యుక్తవయసులోని పిల్లలను కోల్పోయి దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోతున్నాయని కేసీఆర్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ మద్యాన్ని తాగి యువకులు మరణించడం వల్ల చిన్న వయసులోనే యువతులు వితంతువులుగా మారుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. గుడుంబాను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై త్వరగా ఓ నివేదికను సమర్పించాలని ఆదేశించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వారుణి వాహిని పేరుతో ప్యాకెట్ల ద్వారా విక్రయించిన సారాయిపై 1993లో నిషేధం విధించారు. అప్పటి నుంచి రాష్ట్రంలో సారా నిషేధం కొనసాగుతోంది. దీని స్థానంలో చీప్ లిక్కర్‌ను తీసుకొచ్చినా.. ఆ తర్వాత ధరల పెరుగుదలతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు గుడుంబాకు అలవాటుపడ్డారు. దాదాపుగా అన్ని జిల్లాల్లో యథేచ్ఛగా గుడుంబా విక్రయాలు సాగుతున్నా ఎకై్సజ్ శాఖ పట్టించుకోని పరిస్థితి ఉంది. రాష్ర్టంలోనే తగినన్ని డిస్టిలరీల ఏర్పాటు కాగా, డిమాండ్ మేరకు మద్యం ఉత్పత్తిని రాష్ర్టంలోనే చేపట్టాలని, ఇందుకు అవసరమైన డిస్టిలరీల ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని ఎకై్సజ్ అధికారులను కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో అమ్ముడయ్యే చాలా లిక్కర్ బ్రాండ్లను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని, దీంతో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పన్నులు రాకుండా పోతున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. ఉత్పత్తికి అవసరమైన మేరకు డిస్టల్లరీలను రాష్ర్టంలోనే ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతానికి చెందిన నిరుద్యోగులందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ప్రభుత్వానికి పన్నుల ఆదాయం కూడా పెరుగుతుందని, వినియోగదారులకూ ఎంతోకొంత ధర తగ్గుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణలో మద్యం వ్యాపారం చేస్తూ రాష్ర్టంలో డిస్టిల్లరీలు పెట్టని కంపెనీల వివరాలు సేకరించాలన్నారు. ఈ సమీక్షలో మంత్రి పద్మారావు, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు, ఎకై్సజ్ శాఖ సంయుక్త కమిషనర్ ప్రసాద్ పాల్గొన్నారు. -
పుస్తెలు తెంపుతున్న గుడుంబా రక్కసి
ఏజెన్సీలో ఏరులై పారుతున్న నాటు సారా విచ్చలవిడిగా బెల్లం వ్యాపారం మాముళ్ల మత్తులో జోగుతున్న చెక్‌పోస్టుల అధికారులు ములుగు/ఏటూర్‌నాగారం :గుడుంబా రక్కసి పచ్చని సంసారాల్లో చిచ్చు రేపుతోంది. ఆడపడచుల పుస్తెలు తెంపుతోంది. ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తోం ది. కొంపలు కూలుస్తున్న నాటుసారాను అరికట్టాల్సిన ఎక్సైజ్, పోలీస్ అధికారులు మామూ ళ్ల మత్తులో జోగుతున్నారు. గుడుంబా తయూరీకి ఉపయోగించే నల్లబెల్లం, పటిక సరఫరా చే సే లారీలకు చెక్‌పోస్టుల వద్ద గేట్లు ఎత్తేస్తున్నా రు. ఫలితంగా గుడుంబా వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. టార్గెట్ల కోసమే ఎక్సైజ్ దాడులు..? బెల్లం రవాణా, గుడుంబాను అరికట్టాల్సిన ఎక్సైజ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. గుడుంబా వ్యాపారుల నుంచి మాముళ్లు తీసుకుని అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఏడాదిలో వారికుండే టార్గెట్లను పూర్తి చేసుకోవడానికి మాత్రమే అడపాదడపా గ్రామాల్లో దాడులు నిర్వహిస్తున్నారనే విమర్శలు ఉన్నారుు. అందులోనే కొందరిని మాత్రమే పదేపదే అరెస్ట్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నారుు. విచ్ఛలవిడిగా బెల్లం సరఫరా.. చిత్తూరు, కామారెడ్డి, అనకాపల్లి, సంగారెడ్డి రకాల బెల్లం ప్రస్తుతం జిల్లాకు సరఫరా అవుతోంది. చిత్తురు నుంచి వయా ఖమ్మం జిల్లా మణుగూరు మీదుగా వరంగల్ జిల్లా ఏటూరునాగారం, మంగపేట, కొత్తగూడ మండలాలకు సరఫరా చేస్తున్నారు. ఇక్కడి నుంచి వివిధ పల్లెలు, పట్టణాలకు పంపుతున్నారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి నుంచి వచ్చే లారీలు కరీంనగర్ జిల్లా కాటారం మీదుగా భూపాలపల్లి, పరకాల, తాడ్వాయి, గోవిందరావుపేట, హసన్‌పర్తి మండలాలకు చేరుకుంటున్నారుు. అలాగే అనకాపల్లి నుంచి జిల్లాలోని వివిధ పట్టణాలకు బెల్లం రవాణా చేస్తున్నారు. సంగారెడ్డి నుంచి వచ్చే లారీలు జనగామ మీదుగా వచ్చి రఘునాథపల్లి, పాలకుర్తి, మహబూబాబాద్, నర్సంపేట, డోర్నకల్, వర్ధన్నపేట మండలాలకు బెల్లాన్ని సరఫరా చేస్తున్నారుు. అలాగే కరీంనగర్ జిల్లా బోర్లగూడెం నుంచి ఎడ్లబండ్లతో నల్లబెల్లాన్ని ఏటూరునాగారం, మండపేట, తాడ్వాయి, బుట్టాయిగూడెంకు తీసుకొచ్చి అక్కడ నుంచి గుడుంబా తయారీదారులకు విక్రయిస్తున్నారు. ఇలా జిల్లావ్యాప్తంగా 30 నుంచి 35 మంది బడా వ్యాపారులు బెల్లం సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. వారిలో కొందరు పశువుల దాణా కోసం బెల్లం పర్మిషన్లు ఉండగా మిగతావారు ఎలాంటి అనుమతులు లేకుండా విచ్ఛవిడిగా వ్యాపారం చేస్తున్నారు. అనుమతి ఉన్న ఒక్కో వ్యాపారి పది రోజులకు రెండు లోడ్లు(400 టన్నుల) బెల్లం దిగుమతి చేసుకుంటున్నాడు. అంటే జిల్లాలో కేవలం పది రోజుల్లో అధికారికంగా 15000 టన్నుల బెల్లం వ్యాపారం జరుగుతోంది. నామమాత్రంగా చెక్‌పోస్టులు.. ఇతర జిల్లాల నుంచి వచ్చే బెల్లం రవాణాను పరిశీలించేందుకు జిల్లాలో ప్రవేశించే అన్ని గ్రా మాల్లో చెక్‌పోస్టులు ఉన్నాయి. గణపురం మం డలం చెల్పూరు, భూపాలపల్లి, మంగపేట మండలం రాజుపేట, కొత్తగూడ మండలం గంగారం, రఘునాథపల్లి, మరిపెడ, హసన్‌పర్తి, కరీంనగర్ జిల్లా కాటారాంలో చెక్‌పోస్టులు ఉన్నాయి. వారానికి సుమారు పదుల సంఖ్యలో బెల్లం లోడ్లు చెక్‌పోస్టులను దాటి లోపలికి వస్తున్నాయి. ఒక్కో చెక్‌పోస్టుకు ముందే రూ.5 వేలు చెల్లించి రాచమార్గంలో రవాణా కొనసాగిస్తున్నట్లు తెలిసింది. నాయకుల కనుసన్నల్లో వ్యాపారం వివిధ పార్టీలకు చెందిన కొందరు మండల నా యకుల కనుసన్నల్లో వ్యాపారం విచ్ఛలవిడిగా సాగుతున్నట్లు సమాచారం. బెల్లం వ్యాపారం చేసిన వీరికి ఎలాంటి ఆపద వచ్చిన పెద్దతలల నుంచి ఫోన్లు చేరుుంచుకుని క్షణాల్లో సమస్యను పరిష్కరించుకుంటున్నారని తెలిసింది. వీధినపడిన కుటుంబాలు గుడుంబా తాగితాగి ప్రాణాలు కోల్పోరుున వారి సంఖ్య ఏజెన్సీలో వందల సంఖ్యలో ఉం ది. గుడుంబా రక్కసితో ఎంపెల్లి రాంబాయి, చెన్నం లాలమ్మ, మామిడి నర్సమ్మ, దేపాక శాంత, దేపాక అనసూర్య, కర్ణ సుశీల, వావిలా ల రాములమ్మ, కుమ్మరి ఆదిలక్ష్మి, ఇల్లందు ప్రమీల, దేపాక సారమ్మ, చిట్యాల వెంకట మ్మ, దేపాక స్వరూప, వావిలాల జయమ్మ, ఎంపెల్లి సావిత్రి, తిప్పనపల్లి పోషమ్మ, వావి లాల అనసూర్య, కొండాయి మణి, జరుడు జ్యోతి, జాడి మాణిక్యం తదితరుల భర్తలు గు డుంబాకు బానిసలు మారి ప్రాణాలు కోల్పోయూరు. ఇంటిపెద్ద దిక్కును కోల్పోరుు వితంతువులుగా మారిన వారంతా కుటుంబ భారా న్ని మోస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇప్పటికైనా పోలీస్, ఎక్సైజ్‌శాఖ అధికారులు గుడుం బాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
జోరుగా గుడుంబా తయారీ
మంచిర్యాల రూరల్ : మండలంలో గుడుంబా గుప్పుమంటోంది. గ్రామాల్లో విచ్చలవిడిగా తయారు చేసి అమ్మకాలు కొనసాగిస్తున్నా ఎక్సైజ్ అధికారులకు పట్టడం లేదు. అడ్డూ అదుపు లేకపోవడంతో తయారీదారులు పెద్ద ఎత్తున సారా వ్యాపారానికి సిద్ధం అవుతున్నారు. బావులు, వాగులు, అడవుల్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ బెల్లం, జీడి గింజలు, ఇతరత్రా సామగ్రి దర్శనమిస్తున్నాయి. కొత్త సంవత్సర వేడుకలు, సంక్రాంతి పండుగల నేపథ్యంలో గుడుంబా తయారీ జోరుగా సాగుతోంది. మండలంలోని ముల్కల్ల, పెద్దంపేట గ్రామాల్లో నాటుసారా తయారీ కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి. ముల్కల్ల తయారీదారులు ర్యాలీవాగు పరిసర ప్రాంతాలు, శివారులోని అటవీ ప్రాంతంలో ఎక్కువగా గుడుంబా తయారు చేస్తున్నారు. ఇక్కడ తయారైన గుడుంబాను సింగరేణి గ్రామాలతోపాటు మండలంలోని ఇతర గ్రామాలకు నిత్యం సరఫరా చేస్తున్నారు. మంచిర్యాల పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉండే ముల్కల్ల గ్రామంలో విచ్చలవిడిగా గుడుంబా తయారీ కేంద్రాలు ఉన్నాయి. అయినా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదు. నెల నెలా ముడుపులు అందుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్దంపేట గ్రామంలో గుడుంబా తయారు చేసి, విక్రయాలు జరిపే వారు అధిక సంఖ్యలో ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది జీవనోపాధి సైతం ఇదే కావడం గమనార్హం. ఈ గ్రామం అటవీ ప్రాంతంకు దగ్గరగా ఉండడంతో, చెట్ల చాటున, పొదల్లో గుట్టు చప్పుడు కాకుండా గుడుంబా తయారు చేస్తున్నారు. మండలంలోని 25 గ్రామాలకు సరఫరా అవుతోంది. తయారీదారులు లీటరు రూ.25 వరకు విక్రయిస్తే, ఆయా గ్రామాల్లోని వ్యాపారులు లీటరు గుడుంబాను రూ.50 వరకు అమ్ముతున్నట్లు సమాచారం. నూతన సంవత్సరం, సంక్రాంతి పండగల నేపథ్యంలో వ్యాపారులు ముందస్తుగానే వేలాది లీటర్ల గుడుంబాకు అడ్వాన్సులు ఇచ్చినట్లు తెలుస్తోంది. నూతన సంవత్సరం సమయంలో, ఆ తర్వాత సంక్రాంతికి ముందు గ్రామాల్లో జరిగే కోడి పందేలు, చిత్తు బొత్తు ఆట వంటివి ఆడనుండడం, ధాన్యం అమ్మిన డబ్బులు రైతుల వద్ద అధికంగా ఉండడంతో గ్రామాల్లో పెద్ద మొత్తంలో గుడుంబా అమ్మకాలు జరగనున్నాయి. దీన్ని అవకాశంగా ఎంచుకున్న పలువురు వ్యాపారులు గుడుంబా విక్రయాలు భారీగా చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. చర్యలు తీసుకుంటాం - శ్రీనివాస్, ఎక్సైజ్ సీఐ, మంచిర్యాల గ్రామాల్లో గుడుంబా తయారీ జరుగుతుందని సమాచారం ఉంది. ముల్కల్ల, పెద్దంపేట గ్రామాల్లో దాడులు చేసి, తయారు చేసిన గుడుంబా డ్రమ్ములను ధ్వంసం చేసి, కేసులు నమోదు చేశాం. ఇప్పటికే నిల్వ ఉంచిన ప్రదేశాలను గుర్తిస్తున్నాం. వాటిపై కూడా దాడులు జరిపి ఎలాంటి విక్రయాలు లేకుండా చూస్తాం. -
పోలీసులను చూసి ... బైకులు వదిలి ...
కరీంనగర్: గుడుంబాను అక్రమంగా బైకులపై తరలిస్తున్న యువకులు... పోలీసులను చూసి భయపడ్డారు. అంతే నాలుగు బైకులను, 250 లీటర్ల గల గుడుంబా డబ్బాలను వదిలిపెట్టి ... అక్కడి నుంచి పరారైయ్యారు. దాంతో పోలీసులు బైకులను, గుండుంబా డబ్బాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన కరీంనగర్ నగర శివారులోని హుస్నాబాద్ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. రహదారిపై పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే ఆ విషయాన్ని గుడుంబా అక్రమ రవాణా చేస్తున్న యువకులు దగ్గర వచ్చే వరకు గుర్తించలేక పోయారు. పోలీసులకు పట్టుబడితే ఇంతే సంగతులు అనుకున్నారో ఏమో... కాళ్లకు బుద్ది చెప్పి అక్కడి నుంచి పరారైయ్యారు. బైక్ నెంబర్లు ఆధారంగా పరారైన యువకులను అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. -
హైదరాబాద్‌లో కల్తీ కల్లే లేదు
హైదరాబాద్: ‘అసలు హైదరాబాద్‌లో కల్తీ కల్లు అనేదే లేదు. అంతగా కాకపోతే కల్లులో నీళ్లు, చక్కెర వంటివి కలుపుతుంటారు’ అని అసెంబ్లీ లాబీలో కల్తీ కల్లు ప్రస్తావన వచ్చినపుడు ఎక్సైజ్ మంత్రి టి. పద్మారావు వ్యాఖ్యానించారు. కల్లు ఉత్పత్తికి సరిపోను తాటిచెట్లు, ఈతచెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అయితే గుడుంబా అంటే విషమేనని, దానివల్లే రాష్ట్రంలో మరణాలు సంభవిస్తున్నాయన్నారు. గుడుంబా కంటే సారాయి అన్ని విధాలా మంచిదని, ప్రభుత్వం సారాయి దుకాణాలు పెట్టాలనే డిమాండ్ కూడా వస్తోందని మంత్రి అసలు విషయాన్ని బయటపెట్టారు. కల్లు దుకాణాలు పెట్టినందుకే తమ ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొంటోందని, ఇక సారాయి దుకాణాలు పెడితే ఎట్లా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయన్నారు. -
దసారా
- ఏరులై పారుతున్న గుడుంబా - పండుగ నేపథ్యంలో - పెద్దమొత్తంలో తయారీ.. అమ్మకాలు - చేష్టలుడిగిన యంత్రాంగం మంచాల/దోమ/యాచారం: గ్రామాల్లో సారా తయారీ యథేచ్ఛగా సాగుతోంది. మంచాల మండ లం నగరానికి చేరువలో ఉండడంతో ఇక్కడ తయారు చేసిన సారాను అక్కడికి గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. మండలంలోని పటేల్ చెరువు తండా, బుగ్గ తండా, సత్తి తండా, ఆంబోత్ తండా, బోడకొండ, కొర్రం తండా, సల్లిగుట్ట తండా, వెంకటేశ్వర తండా, చెన్నారెడ్డి గూడ తండా, బండలేమూర్, అజ్జిన తండాల్లో సారా తయారీ ముమ్మరంగా సాగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. సారా తయారీదారులు సమీప ప్రాంతాలకు నిత్యం సాయంత్రం సమయంలో డబ్బాల్లో గుట్టుచప్పుడు కాకుండా సారాను రవాణా చేస్తున్నారు. దూర ప్రాంతాలకైతే బస్సుల్లో తీసుకెళ్తున్నారు. రవాణా సదుపాయం లేని గ్రామాలకు స్కూటర్లపై డబ్బాల్లో, ట్యూబుల్లో పంపిస్తున్నారు. నిత్యం మంచాల మండల పరిధిలో వేలాది లీటర్ల సారా విక్రయాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. పెరిగిన ధరలు.. గతంలో సీసా సారా ధర రూ. 40 ఉండేది. ప్రస్తుతం విక్రయదారులు సీసా సారా రూ. 50 -60 లకు అమ్ముతున్నారు. కాగా ఇటీవల సారా విక్రేతలు రూటు మార్చారు. సీసాల్లో విక్రయించడం ఇబ్బందిగా ఉందని ప్యాకెట్లలో అమ్మకాలు సాగిస్తున్నారు. ఒక్కో ప్యాకెట్ రూ. 15 చొప్పున విక్రయిస్తున్నారు. తయారీదారులు అక్రమంగా తమ ఇళ్లల్లో సారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం, నవసాగరం వంటి వాటిని పెద్దమొత్తంలో నిల్వ ఉంచుకుంటున్నారు. ఆరుట్ల, లోయపల్లి, ఎల్లమ్మ తండా తదితర ప్రాంతాల్లో వ్యాపారులు సారా తయారీ సామగ్రిని విక్రయిస్తున్నారు. చర్యలు శూన్యం.. అక్రమార్కులు యథేచ్ఛగా సారా తయారీ, విక్రయాలు జరుపుతున్నా పట్టించుకునే వారే కరువవయ్యారు. మంచాల మండల పరిధిలో సారా తయారీ, విక్రయాలపై ఎక్సైజ్ సీఐ తుక్యా నాయక్ వివరణ కోరగా.. దాడులు నిర్వహించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్థానికులు సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. పెరిగిన అమ్మకాలు.. దోమ మండల పరిధిలోని పలు గ్రామాల్లో కొందరు పట్టపగలే సారా మత్తులో రోడ్లపై జోగుతున్నారు. ఉదయం నుంచి రెక్కలు ముక్కలు చేసుకుంటున్న నిరుపేదలు సంపాదించిన డబ్బంతా సారా మహ మ్మారికి తగిలేస్తున్నారు. దీంతో ఇల్లు గడవడం కష్టం మారుతోందని బాధిత మహిళలు కంటతడి పెట్టుకుంటున్నారు. దోమ మండల కేంద్రంతో పాటు మల్లేపల్లి, పాలేపల్లి, రాకొండ, లింగన్‌పల్లి, ఎల్లారెడ్డి పల్లి, ఊట్పల్లి, బ్రాహ్మణ్‌పల్లి, కిష్టాపూర్, గుండాల్, దాదాపూర్ తదితర గ్రామాల్లో సారా అమ్మకాలు కొనసాగుతున్నాయి. మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో సుమారు 40 సారా బట్టీలు, 100కు పైగా విక్రయ కేంద్రాలు ఉన్నట్లు సమాచారం. వీటి నిర్వాహకులు ఎక్సైజ్ అధికారులకు ప్రతినెల మామూళ్లు చెల్లించి తమ దందాను మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా కొనసాగిస్తున్నారు. కొందరు తయారీదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఎక్సైజ్ అధికారులు ముట్టజెబుతున్నట్లు అరోపణలు వినిపిస్తున్నాయి. పట్టించుకునే వారేరి..? పలువురు యువజన సంఘాల సభ్యులు ఆయా గ్రామాల ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్నారు. సారా మహమ్మారి బారిన పడితే అనారోగ్యంపాలై ఇళ్లు గుల్లవుతాయని స్థానికులకు అవగాహన కల్పిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో సారా రక్కసిని దూరం చేసేందుకు ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో సారా అమ్మరాదు, కొనరాదని తీర్మానాలు చేస్తున్నారు. సారా అమ్మకాలు, తయారీపై అధికారులకు సమాచారం ఇస్తే పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారులు అక్రమార్కులకే కొమ్ముకాస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకొని అక్రమార్కుల భరతం పట్టాలని పలువురు కోరుతున్నారు. గుప్పుమంటున్న గుడుంబా.. యాచారం మండల పరిధిలోని నక్కగుట్ట, తక్కళ్లపల్లి తండాల్లో 20 వరకు సారా దుకాణాలు ఉన్నాయని స్థానికు లు చెబుతున్నారు. ఇక్కడ నిత్యం వందల లీటర్లలో సారా విక్రయాలు జ రుగుతున్నాయి. యాచారం, మొ గుళ్లవంపు, చింతపట్ల, మొండిగౌరెల్లి, మ ల్కీజ్గూడ, తక్కళ్లపల్లి తదితరల గ్రామాల నుంచి జనం ఇక్కడికి సారా తాగేందుకు వస్తుంటారు. కొందరు పీకల దాకా సారా తాగి మార్గమధ్యంలో పడిపోతుండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల యాచారానికి చెందిన ఒకరు, చింతపట్లకు చెందిన ఇద్దరు సారా తాగి మృత్యువాత పడ్డారని స్థానికులు తెలిపారు. సారా తయారీదారులు, విక్రేతలపై చర్యలు తీసుకోవాలని ఇటీవల యాచారం ఎంపీపీ జ్యోతీనాయక్ ఎక్సైజ్ పోలీసులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఎక్సైజ్ అధికారుల మద్దతుతోనే సారా విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు విని పిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సారా విక్రయాలు అరికట్టకుంటే ఇబ్రహీంపట్నం ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని నాయకులు హెచ్చరించారు. -
ఆబ్కారీకి ఆయుధాలు
ఆదిలాబాద్ క్రైం : తెలంగాణ ప్రభుత్వం ఆబ్కారీ సిబ్బందికి ఆయుధాలు ఇవ్వనుంది. గుడుంబా, గంజాయి స్మగ్లర్ల నుంచి ప్రాణాపాయం లేకుండా వీరికి తుపాకులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం ఆబ్కారీ శాఖ నుంచి వివరాలు కోరింది. ఈ మేరకు అధికారులు ఎంత మంది సిబ్బంది ఉన్నారు? ఎన్ని ఆయుధాలు అవసరం అనే నివేదికలు ప్రభుత్వానికి పంపించారు. ఆయుధాలు ఎందుకు? జిల్లాలో గుడుంబా తయారీ, గంజాయి సాగు అధికంగా ఉంది. వీటిని అరికట్టడానికి ఆబ్కారీ అధికారులు వెళ్లినప్పుడు స్మగ్లర్లు దాడులు చేసిన సంఘటనలూ అనేకం ఉన్నాయి. చేతుల్లో ఆయుధాలు లేకపోవడంతో వారి దాడులను ఎదుర్కోవడం లేదు. ఆయుధాలు లేకపోవడంతో పోలీసుల సహాయం తీసుకోవాల్సి వస్తోంది. పోలీసులు విధి నిర్వహణలో బిజీగా ఉన్నప్పుడు స్మగ్లర్లు తప్పించుకు పోతున్నారు. పోలీసు శాఖపై ఆధారపడకుండా ఆబ్కారీ శాఖకు ఆయుధాలు ఇవ్వాలని గత ప్రభుత్వాలు భావించినా అమలుకు నోచుకోలేదు. నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మేరకు చొరవ చూపుతోంది. ఎక్సైజ్ శాఖకు ఆయుధాలు ఇవ్వనున్నట్లు నిర్ణయించినట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లోనే.. జిల్లా వ్యాప్తంగా 11 ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి. ఒక డిప్యూటీ కమిషనర్, ఇద్దరు ఎక్సైజ్ సూపరిటెం డెంట్లు, 11 మంది సీఐలు, 20 మంది ఎస్సైలు 50 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 160 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. జిల్లాలోని గుడుంబా తయారయ్యే సమస్యాత్మక ప్రాంతాల్లోనే ఎక్సైజ్ సిబ్బందికి ఆయుధాలు అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో చెన్నూరు, లక్సెట్టిపేట, ఉట్నూర్, ఇచ్చోడ, నిర్మల్, మంచిర్యాల స్టేషన్ల పరిధిలో గుడుంబా స్థావరాలు అధికంగా ఉంటాయి. ఈ స్టేషన్ల పరిధిలోని ఏజెన్సీ గ్రామాల్లో పెద్ద ఎత్తున గుడుంబా తయారవుతోంది. అయితే ఈ స్టేషన్లో పరిధిలో పనిచేసే ఎక్సైజ్ సిబ్బందిపై గుడుంబా తయారీదారులు, గంజాయి సాగు చేసేవారు దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంత ఎక్సైజ్ అధికారులతోపాటు సిబ్బందికి కూడా ఆయుధాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. నివేదిక పంపాం.. - శివరాజు, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ గుడుంబా తయారీ నియంత్రణలో ఎక్సైజ్ సిబ్బందికి ఆయుధాలు ఇవ్వాలని ఇదివరకే ప్రభుత్వానికి నివేదించాం. శాఖపరంగా అన్ని సమగ్ర వివరాలు అందజేశాం. ఆయుధాలు లేకపోవడంతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. గుడుంబా స్థావరాలపై దాడులు చేసే సమయంలో పోలీసుల సహాయం తీసుకుంటున్నాం. దీనిపై ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఇంక ఎలాంటి ఆదేశాలు రాలేదు. -
జాతరకు.. గుట్టుగా గుడుంబా
గోవిందరావుపేట, న్యూస్‌లైన్ : దట్టమైన అటవీ ప్రాంతంలో గుడుంబా గుప్పుమంటోంది. మేడారం జాతర సమీపిస్తుండడంతో గుడుంబా తయూరీదారులు భారీగా సారా ఉత్పత్తి చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఇలా వందకుపైగా కుండల్లో బెల్లం పాన కం పులియబెట్టి, గుడుంబా బట్టీలతో సారా కాస్తున్న దృశ్యం గౌరారం చెరువు కట్ట నుంచి మచ్చాపూర్ మధ్య ఉన్న దట్టమైన అడవిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నారుు. మద్యపాన వ్యతిరేక పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు రేండ్ల సంతోష్ ఇచ్చిన సమాచారంతో విలేకరుల బృందం బట్టీలను కనుగొనేందుకు బయల్దేరింది. గౌరారం చెరువు కట్ట నుంచి మచ్చాపూర్ మధ్య ఉన్న దట్టమైన అడవిలో సుమారు 5 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాక వట్టివాగు పక్కనే బట్టీలు కనిపించాయి. ఈ బృందాన్ని చూసినతయూరీదారులు పరారయ్యారు. అక్కడ నాలుగు బట్టీలు, వందకుపైగా బెల్లం ఊటల కుండలు కనిపించాయి. 10 టిన్నుల్లో గుడుంబా కనిపించింది. వెంటనే తహసీల్దార్ బండి నాగేశ్వర్రావుకు సమాచారమివ్వడంతో ఆయన ఎక్సైజ్ అధికారులతో కలిసి సుమారు రెండు గంటల తర్వాత సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎక్సైజ్ సీఐ ఇంద్రప్రసాద్, ఎస్సై మాన్సింగ్, హెడ్ కానిస్టేబుల్ రాములు, సారంగపాణి, కానిస్టేబుల్ హరినాథ్, శ్రీరాములు, నిజాముద్దీన్ మార్గమధ్యంలో మరో గుడుంబా తయూరీ కేంద్రాన్ని కూడా గుర్తించి కుండలను ధ్వంసం చేశారు. కాగా చల్వాయికి చెందిన కొంతమంది కూలీలను పెట్టి బట్టీలను నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా సీఐ ఇంద్రప్రసాద్ మాట్లాడుతూ మొత్తం 10 బట్టీల్లో తాము 5వేల లీటర్ల బెల్లం పానకం, 5 వందల లీటర్ల గుడుంబాను ధ్వంసం చేసినట్లు తెలిపారు. పక్కా సమాచారం ఇస్తే దాడులు నిర్వహిస్తామని తెలిపారు. నాకు ప్రాణభయం ఉంది : సంతోష్ మద్యపాన వ్యతిరేక పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రజల మేలు కోరి తాను ఉద్యమం చేస్తుంటే గుడుం బా వ్యాపారులు నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు. బెల్లం, పటిక, ఇతర వస్తువులు విచ్ఛలవిడిగా లభిస్తున్నాయి. బెల్లాన్ని నియంత్రిస్తే గుడుంబా అదే తగ్గిపోతుంది. అధికారులు సరైన చర్య లు తీసుకోవాలి. -
సింగరేణికాలనీలో అక్రమ గుడుంబా వ్యాపారం