కరీంనగర్: గుడుంబాను అక్రమంగా బైకులపై తరలిస్తున్న యువకులు... పోలీసులను చూసి భయపడ్డారు. అంతే నాలుగు బైకులను, 250 లీటర్ల గల గుడుంబా డబ్బాలను వదిలిపెట్టి ... అక్కడి నుంచి పరారైయ్యారు. దాంతో పోలీసులు బైకులను, గుండుంబా డబ్బాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన కరీంనగర్ నగర శివారులోని హుస్నాబాద్ రహదారిపై శనివారం చోటు చేసుకుంది.
రహదారిపై పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే ఆ విషయాన్ని గుడుంబా అక్రమ రవాణా చేస్తున్న యువకులు దగ్గర వచ్చే వరకు గుర్తించలేక పోయారు. పోలీసులకు పట్టుబడితే ఇంతే సంగతులు అనుకున్నారో ఏమో... కాళ్లకు బుద్ది చెప్పి అక్కడి నుంచి పరారైయ్యారు. బైక్ నెంబర్లు ఆధారంగా పరారైన యువకులను అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.