సార్కారు కిక్కు.. | Alcohol ban | Sakshi
Sakshi News home page

సార్కారు కిక్కు..

Published Wed, Feb 18 2015 3:11 AM | Last Updated on Fri, Aug 17 2018 7:40 PM

Alcohol ban

{పభుత్వ సారాయిపై  {పజాభిప్రాయ సేకరణ
త్వరలో జిల్లాకు   {పత్యేక బృందాలు
 పరిస్థితిపై ఆరా

 
ఆదిలాబాద్ క్రైం : గుడుంబాకు అడ్డుకట్ట వేసేందుకు సర్కారు సారాను ప్రవేశపెట్టాలని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం సారాయి ప్రవేశపెట్టడంపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే త్వరలో జిల్లాకు ప్రత్యేక టాస్క్‌ఫోర్సు బృందాలు రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం జిల్లాలో మద్యపాన నిషేధం ఏ విధంగా అమలవుతోంది.. మద్యపానం అలవాటు ఉన్నవారు దేనిని సేవిస్తున్నారు.. వాటి స్థానంలో ఏమి కోరుకుంటున్నారు.. అనే అంశాలపై టాస్క్‌ఫోర్సు బృందాలు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నా రుు. ప్రభుత్వం నుంచి మద్యపాన ప్రియులు ఏ రకమైన సారాయి కోరుకుంటున్నారు..? సారా తీసుకురావడంతో గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుందనే అంశాలను అంచనా వేయనున్నారు. 1993లో అప్పటి ప్రభుత్వం సారాయిని నిషేధించింది. సారాపై నిషేధం తో చీప్‌లిక్కర్‌కు డిమాండ్ పెరగడం, ప్రజల ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు రావడంతో ఐఎంఎల్, బీర్ల అమ్మకాలు పెరిగి ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా మారింది. అప్పటి నుంచి కేవలం అధికారికంగా  మద్యం దుకాణాలు, బార్ రెస్టారెంట్లు మాత్రమే కొనసాగుతున్నాయి.
 
జోరుగా గుడుంబా..


జిల్లాలో అనేక ప్రాంతాల్లో గుడుంబా స్థావరాలు పా తుకుపోయి ఉండడం, ఎన్నిసార్లు అధికారులు దాడు లు చేసినా అవి పూర్తి స్థాయిలో నియంత్రణలోకి రావడం లేదు. జిల్లాలో బెల్లంపల్లి, మంచిర్యాల, మందమర్రి, శ్రీరాంపూర్, ఉట్నూర్, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో రోజుకు వంద లీటర్ల గుడుంబా విక్రయిస్తున్నారని సమాచారం. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామాల్లో గుడుంబా వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ప్రమాదకరమైన నాటుసారా తాగి ఎంతో మంది మృత్యువాత పడుతున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర శివారు గ్రామాల్లో చీప్ లిక్కర్ విక్రయాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, గుడుంబా తక్కువ ధరకు అందుబాటులో ఉండడంతో అనేక మంది దాన్ని సేవిస్తున్నారని తెలుస్తోంది. దీనికితోడు మహారాష్ట్ర నుంచి దేశీదారు జిల్లాకు పెద్ద ఎత్తున అక్రమంగా రావడంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది.

ప్రజాభిప్రాయ సేకరణ..

గుడుంబా అరికట్టడమా..? లేదా ప్రభుత్వం తరఫున సారాయిని తీసుకురావడమా..? అని తెలంగాణ ప్రభుత్వం కొంత కాలంగా మల్లగుల్లాలు పడుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు టాస్క్‌ఫోర్సు బృందాలను పంపించి ప్రజాభిప్రాయాన్ని సేకరించే పనికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ సారాయి కోరుకుంటున్న వారి గురించి ఆరా తీసి, గ్రామాల్లో ఎవరెవరికి మద్యం తాగే అలవాటు ఉంది.. ఇప్పుడు లభించే చీప్‌లిక్కర్, ఇతర ఖరీదైన బ్రాండ్లు గ్రామాల్లో ఎంత మేరకు విక్రయం అవుతున్నాయి.. గుడుంబా ప్రభావం ఉన్న ప్రాంతాల్లో వీటి విక్రయాలు ఏ విధంగా ఉన్నాయనే అంశాలను సైతం టాస్క్‌ఫోర్సు బృందాలు పరిశీలించనున్నాయి. జిల్లాలో వైన్‌షాపుల ద్వారా లభిస్తున్న ఆదాయానికి ప్రభుత్వ సారాతో ఏమైనా గండిపడుతుందా..? పడితే ఎంత మేరకు..? ప్రభుత్వం సారాయిని ప్రవేశపెడితే ఎంత పరిమాణంలో కనీస బాటిల్ ఉండాలి..? దాని ధర ఎలా ఉండాలి..? అందువల్ల మద్యం విక్రయాలకు కలిగే నష్టం ఎంత..? అన్న అంశాలను సైతం గ్రామాల వారీగా లెక్కలు తీస్తున్నారు. సర్కారు సారాయిని ప్రవేశపెడితే ఒక్కో మండలంలో ఎన్ని దుకాణాలకు అనుమతులు ఇవ్వాలి, లెసైన్సు ఫీజు, సారాయి ధర ఎంత ఉండాలనే వివరాలతో ఎక్సైజ్ కమీషనర్‌కు నివేదిక అందజేసినట్లు తెలుస్తోంది.
 
సంవత్సరానికి 500 కోట్ల ఆదాయం..


జిల్లాలో మద్యం విక్రయం ద్వారా ఏటా సుమారు రూ.500 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం లభిస్తోంది. ఇక పండుగలు, ఎన్నికలు.. ఇతర ప్రత్యేక సందర్భాల్లో వీటి ఆదాయం మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సారాయితో మద్యం విక్రయాలకు ఇబ్బంది కలగకుండా చూడాలనే అంశంపై ఉన్నత స్థాయి అధికారులు, క్షేత్రస్థాయి ఎక్సైజ్ అధికారుల నుంచి ప్రజాభిప్రాయాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం సరఫరా చేస్తున్న చీప్‌లిక్కర్ ధర రూ.60 ఉండటంతో వాటి విక్రయాల సంఖ్య ఎక్కువగా ఉండి.. చీప్‌లిక్కర్ ధర కన్నా తక్కువగా సుమారు రూ.35 ధరకు 180 ఎంఎల్ సారాను ప్రభుత్వం పంపిణీ చేస్తే గుడుంబా ప్రవాహం ఆపవచ్చని, అలాగే అధికారిక మద్యం విక్రయాలకు ఇబ్బందులు ఉండవని ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వానికి నివేధికను అందజేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శివరాజ్‌ను వివరణ కోరగా సర్కారు సారాపై ఇంకా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టలేదని, ఉన్నత అధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement