ఆగని సారా దందా | Sara incessant danda | Sakshi
Sakshi News home page

ఆగని సారా దందా

Published Sat, Feb 13 2016 4:21 AM | Last Updated on Sun, Sep 3 2017 5:31 PM

ఆగని సారా దందా

ఆగని సారా దందా

జిల్లాలో 98 శాతం గుడుంబా తయూరీ, అమ్మకాలు అరికట్టాం.

గుడుంబారహిత జిల్లాలో విచ్చలవిడిగా అమ్మకాల
ప్రకటనలకే పరిమితమైన ఎక్సైజ్‌శాఖ
ప్రజాప్రతినిధుల పత్రాలే ప్రామాణికమా?
రెండు నెలల్లో 149 మందిపై కేసులు

 
 
 కరీంనగర్ క్రైం :‘జిల్లాలో 98 శాతం గుడుంబా తయూరీ, అమ్మకాలు అరికట్టాం. గుడుంబా రహిత జిల్లాగా చేశాం. గ్రామాల్లో గుడుంబా విక్రయూలు లేనేలేవు..’ ఇది 2015 డిసెంబర్ 3న నగరంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఎక్సైజ్‌శాఖ కలెక్టర్, ఎస్పీ ప్రకటన.
కానీ.. పరిస్థితి అందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. జిల్లాలో గుడుంబా దందా ఆగడం లేదు. ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా గుడుంబా విక్రయూలు సాగుతూనే ఉన్నారుు. సర్పంచ్‌లు, ఎంపీపీలు, కార్పొరేటర్లు, మున్సిపాలిటీ కౌన్సిలర్లు తమతమ ప్రాం తా ల్లో గుడుంబా అమ్మకాలు లేవంటూ ఇచ్చిన సమాచా రం ఆధారంగా ఆయా ఠాణాల ఎక్సైజ్ ఎస్సైలు, సీఐ లు ఉన్నతాధికారులకు నివేదించడంతో గుడుంబా రహితజిల్లాగా ప్రకటించినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయి లో పరిశీలించకుండా, నివేదికపై విచారణ జరుపకుండానే ప్రకటన చేసినట్లు స్పష్టమవుతోంది.

 ఇవిగో ఆధారాలు..
2015 డిసెంబర్‌లో అమ్మకాలు లేవని ప్రకటించిన అధికారులు.. అదే నెలలో జిల్లావ్యాప్తంగా గుడుంబాకేసుల్లో 74 మందిని రిమాండ్‌కు పంపించారు. వీరిలో పురుషులు 41 మంది, మహిళలు 33 మంది ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో పలు కేసుల్లో 75 మందిని రిమాండ్ చేశారు. వీరిలో గుడుంబా తయారీదారులతోపాటు అమ్మకందారులూ ఉన్నారు. వీరిలో 46 మంది పురుషులు, 29 మంది మహిళలున్నారు. నాలుగు రోజుల క్రితం ముస్తాబాద్‌లోలో గుడుంబా అమ్ముతున్న ఓ మహిళను అరెస్టు చేశారు. గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు.

ప్రకటనలకే పరిమితమైన ఎక్సైజ్‌శాఖ
జిల్లాను 100 శాతం గుడుంబా రహిత జిల్లాగా మర్చినట్లు గొప్పలు చేప్పుకుంటున్న ఎక్సైజ్‌శాఖ కేవలం ప్రకటనలకే పరిమితమైందనే ఆరోపణలున్నాయి. క్షేత్రస్థాయిలో గుడుంబా తయారీ, నియంత్రించడానికి ఎక్సైజ్‌శాఖ తీసుకున్న చర్యలపై ఆదినుంచి అనుమానాలే ఉన్నాయి. ఈ దాడులు ఏళ్ల నుంచి చేస్తూనే ఉన్నా గుడుంబా తయారీ, అమ్మకాలు నియంత్రించినా ప్రాంతాలు లేవనే చెప్పవచ్చు. జిల్లాలో గుడుంబా త యారు చేస్తున్న ప్రాంతాలు కొ న్ని మాత్రమే ఉన్నాయ న్న విషయం విదితమే. మరీ ఆ ప్రాంతాల్లో గుడుంబా తయారీని నియంత్రించారా..? అంటే అది లేదు. దాడు లు చేస్తున్నా.. పీడీ యాక్ట్ ప్రయోగిస్తున్నా.. గుడుంబాతయారీ కుటిర పరిశ్రమంగా చేసుకున్న తండావాసులు యథావిధిగా అమ్మకాలు సాగిస్తున్నారు.

 అధికారుల చేతివాటం...
ఎక్సైజ్ అధికారులకు గుడుంబా తయారీ, అమ్మకందారుల నుంచి ప్రతినెలా పెద్ద మొత్తంలో మామూళ్లు చేరుతున్నాయనేది బహిరంగ రహస్యం. కొన్నిచోట్ల కొంతమంది అధికారులు ఏకంగా గుడుంబా వ్యవస్థనే పెంచిపోషిస్తున్నారని సమాచారం. గుడుంబా రహిత జిల్లాగా ప్రకటించిన తర్వాత చేతులు దులుపుకోవడంతోనే మళ్లీ తయారీ, అమ్మకాలు యథేచ్చగా సాగుతున్నారుు. ఇప్పటికైనా కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి గుడుంబా తయారీ, అమ్మకాలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.

ఎక్సైజ్ దాడులు
2015లో 3340పైగా కేసులు నమోదు చేసి 2,349 మం ది అరెస్టు చేసి వారి నుంచి 77232 లీటర్ల గుడుంబా, 293 వాహనాలు, 39.12 లక్షల లీటర్ల బెల్లంపానకం ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్‌శాఖ అధికారులు తెలిపారు.

 పోలీస్‌శాఖ దాడులు
2015లో గుడుంబా తయారీ, అమ్మకం సంబంధించి 905 కేసులు నమోదు చేసి 1182 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 14401 లీటర్ల గుడుంబా, 1550 టన్నుల బెల్లం పానకం, 101 కిలోల పటిక, 7 స్కూటర్లు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement