రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి పరిసర ప్రాంతాలలో నాటు సారా తయారీని పూర్తిగా అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు అబ్కారీ సంచాలకులు దామోదర్ ఆదివారం రాజమండ్రిలో స్పష్టం చేశారు. గత 20 ఏళ్లుగా నాటు సారా మాఫియా వేళ్లూనుకొని ఉందని తెలిపారు. పుష్కరాల సందర్భంగా నాటు సారాను పూర్తిగా నిరోధిస్తామన్నారు. ఈ దాడుల్లో బారీగా నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. 33 మంది నాటుసారా తయారీ దారులను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
శనివారం అర్థరాత్రి నుంచి దామోదర్ ఆధ్వర్యంలో నాటు సారా స్థావరాలపై దాడులు ఆదివారం ఉదయం కూడా కొనసాగుతున్నాయి. పశ్చిమగోదావరి, విశాఖ జిల్లా నుంచి వచ్చిన దాదాపు 500 మంది ఎక్సైజ్ సిబ్బంది... 30 బృందాలుగా విడిపోయి...నాటు సారా స్థావరాలపై దాడులు చేస్తున్నారు.
జూన్ నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో నాటు సారా తయారి ఊపందుకొంది. దీనిపై పూర్తి సమాచారం అందుకున్న అబ్కారీ డైరెక్టర్ దామోదర్ దాడులు నిర్వహించేందుకు సమాయత్తమైయ్యారు. అందులో భాగంగా పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాల నుంచి సిబ్బందిని రప్పించి... శనివారం అర్థరాత్రి నుంచి దాడులు నిర్వహిస్తున్నారు