excise police
-
రాజ్ పాకాల ఇంట్లో పార్టీపై పోలీసుల దాడి
శంకర్పల్లి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది పాకాల రాజేంద్రప్రసాద్ అలియాస్ రాజ్ పాకాలకు చెందిన ఇంట్లో నిర్వహించిన పార్టీ పై ఎక్సైజ్, ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. అను మతి లేకుండా లిక్కర్ పార్టీ నిర్వహించారని, డ్యూ టీ ఫ్రీ విదేశీ మద్యం వినియోగించారని గుర్తించా రు. పార్టీలో పాల్గొన్నవారిలో ఒకరు కొకైన్ వినియో గించి ఉన్నట్టుగా తేల్చారు. ఈ మేరకు రాజ్ పాకాల, మద్దూరి విజయ్‌పై మోకిలాా పోలీసులు, రాజ్ పాకాలపై శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. మోకిలా ఠాణాలో నమోదైన ఎఫ్ఐఆర్లోని వివరాల ప్రకారం.. ‘‘రాజ్ పా కాల నానక్‌రామ్‌గూడలో ఈటీజీ పేరుతో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహిస్తున్నారు. అందులో సీఈఓగా పనిచేస్తున్న జూబ్లీహిల్స్ వాసి మద్దూరి విజయ్‌కు ఫ్యూజన్ యాక్స్ పేరుతో మరో సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. రాజ్ పాకాల హైదరాబాద్ శివార్లలోని జన్వాడలో ఉన్న షీర్మాథే ప్రాపర్టీస్‌లో కొన్నాళ్ల క్రితం ఓ ఇంటిని నిర్మించారు. అందులో తరచుగా వీకెండ్ పార్టీలు ఇస్తూ.. స్నేహితులు, తమ సంస్థల్లోని ఉద్యోగులతో కలిసి పేకాట ఆడుతున్నారు. ఐదేళ్లుగా తనతో సన్నిహితంగా ఉన్న విజయ్ను శనివారం రాత్రి తన ఇంట్లో నిర్వహిస్తున్న దీపావళి పార్టీకి రావాలంటూ రాజ్ పాకాల ఆహ్వానించారు. ఈ పార్టీలో వీరిద్దరితో సహా 38 మంది పాల్గొన్నారు.’’ అని పోలీసులు పేర్కొన్నారు. విశ్వసనీయ సమాచారంతో దాడి.. ‘‘రాజ్ పాకాల ఇంట్లో పార్టీపై మోకిలా పోలీసులకు శనివారం రాత్రి సమాచారం అందింది. ఠాణాలోని జనరల్ డైరీలో ఎంట్రీ నమోదు చేసిన అధికారులు.. నార్సింగి ఏసీపీ నుంచి సెర్చ్ ప్రొసీడింగ్స్ తీసుకున్నారు. ఆపై ఎస్వోటీ (స్పెషల్ ఆపరేషన్ టీమ్), ఎక్సైజ్ పోలీసులతో కలసి శనివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో రాజ్ పాకాల ఇంటిపై దాడి చేశారు. ఎలాంటి ఈవెంట్ పరి్మషన్ లేకుండా పార్టీలో స్థానిక లిక్కర్‌ను, డ్యూటీ ఫ్రీ విదేశీ మద్యాన్ని వినియోగిస్తున్నట్టు గుర్తించి.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. పార్టీకి హాజరైన పురుషులకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా మద్దూరి విజయ్ కొకైన్ తీసుకున్నట్టు తేలింది.మహిళా పోలీసుల సాయంతో ఆ ఇంట్లో ఉన్న మహిళలకు డ్రగ్స్ పరీక్షలు చేయడానికి పోలీసులు ప్రయతి్నంచగా.. వారి నుంచి విముఖత ఎదురైంది. ఇక ఆ ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులు విదేశీ మద్యం, పేకాటకు సంబంధించిన వస్తువులు, పేక ముక్కలను స్వా«దీనం చేసుకున్నారు. 16 మంది మహిళలు సహా 38 మందిని అదుపులోకి తీసుకున్నారు.’’ అని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. పేకాట నిర్వహణ, ఒకరు డ్రగ్స్ తీసుకున్నట్టు తేలడంపై మోకిలా పోలీసులు కేసు నమోదు చేసి, అందులో రాజ్ పాకాల, విజయ్‌లను నిందితులుగా చేర్చారు. ఇక అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహణ, విదేశీ మద్యం వినియోగంపై శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు రాజ్ పాకాలపై కేసు నమోదు చేశారు. రాజ్ పాకాల, ఆయన సోదరుడి నివాసాల్లో సోదాలుగచ్చిబౌలి, బంజారాహిల్స్ (హైదరాబాద్): జన్వాడలోని రాజ్ పాకాల ఇంట్లో పారీ్టపై శనివారం రాత్రి దాడి చేసిన పోలీసులు.. ఆదివారం రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్‌లో ఉన్న రాజ్ పాకాల, ఆయన సోదరుడు శైలేంద్ర నివాసాల్లో సోదాలు చేపట్టారు. ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషీ, తమ సిబ్బందితో, భారీ పోలీసు బందోబస్తుతో ఈ తనిఖీలు చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు శైలేంద్ర నివాసంలో సోదాలు చేశారు. షో కేస్లు తాళాలు వేసి ఉండటం, తాళంచెవులు లేకపోవడంతో వాటిని పగలగొట్టి తనిఖీ చేశారు. రాత్రి 7 గంటల నుంచి రాజ్ పాకాల విల్లాలో సోదాలు చేశారు. రాత్రి 9 గంటల నుంచి రాజ్ పాకాల బంధువులకు మరో విల్లాలో తనిఖీలు చేపట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతల నిరసన సోదాల విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు ఒరియన్ విల్లాస్ వద్దకు చేరుకున్నారు. అధికారులను అడ్డుకునేందుకు ప్రయతి్నంచారు. ఫామ్‌హౌస్‌లో పార్టీ చేసుకుంటే ఇళ్లలో సోదాలు చేయడం ఏమిటని నిలదీశారు. అయితే అక్కడే ఉన్న రాయదుర్గం పోలీ సులు కల్పించుకుని సోదాలకు సహకరించాలని కోరారు. ఈ సమయంలో పోలీసులు, బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. దీనితో పోలీసులు ఎమ్మెల్యేలు వివేకానంద, మాగంటి గోపీనాథ్, డాక్టర్ సంజయ్‌కుమార్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి, నేతలు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మన్నె క్రిశాంక్, జయసింహ తదితరులను అదుపులోకి తీసుకుని, పోలీస్స్టేషన్లకు తరలించారు. కేటీఆర్ నివాసం వద్ద హడావుడి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంట్లోనూ సోదాలు జరపబోతున్నారన్న ప్రచారం జరగడంతో ఆదివారం.. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు బంజారాహిల్స్ లోని కేటీఆర్ నివాసం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ భారీగా మోహరించిన పోలీసులు.. వారి ని కేటీఆర్ ఇంట్లోకి అనుమతించలేదు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఇతర నేతలను అదుపులోకి తీసుకున్నారు. ముమ్మరంగా దర్యాప్తు.. రాజ్ పాకాల ఇంట్లో జరిగిన పార్టీ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్‌గా తేలిన మద్దూరి విజయ్ను విచారిస్తున్నారు. ఆ డ్రగ్‌ను తనకు రాజ్ పాకాల ఇచ్చారని విజయ్ చెప్పారని.. ఈ క్రమంలో రాజ్ పాకాలకు కొకైన్ ఎలా వచి్చంది? ఎవరు విక్రయించారు? ఆ పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారనే వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. విజయ్ను పార్టీ జరిగిన ప్రాంతంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రాజ్ పాకాలను ఆదివారం ఉదయం 10 గంటలకు శంషాబాద్ ఎక్సైజ్ పోలీసు స్టేషన్.. మధ్యాహ్నం 2 గంటలకు మోకిలాా పోలీస్‌స్టేషన్‌కు విచారణ కోసం రావాలని ఆదేశించారు. కానీ రాజ్ పాకాల ఈ విచారణలకు హాజరుకాలేదు. ఆయన మొబైల్ స్విచాఫ్ వస్తోందని, గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
హైదరాబాద్ పబ్బులపై దాడులు.. నలుగురికి డ్రగ్స్ పాజిటివ్
సాక్షి, హైదరాబాద్: నగరంలో పబ్బులపై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. టెస్టులో నలుగురికి డ్రగ్స్ పాజిటివ్‌గా తేలింది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషి నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఐదు పబ్బుల్లో తనిఖీలు నిర్వహించాగా, 33 మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్స్‌తో శాంపిల్స్ సేకరించారు.పాజిటివ్ వచ్చిన వారిలో వరంగల్ కు చెందిన చిన్న నిగేష్, శ్రీకాకుళం కి చెందిన నార్త్ రవికుమార్, మూసాపేటకు చెందిన టీవీఎస్ కేశవరావు, చార్మినార్ కు చెందిన అబ్దుల్ రహీమ్ లకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. కోరం క్లబ్లో ఇద్దరికి, బేబిలోన్ పబ్‌లో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. చిన్న నిగేష్(వరంగల్), నార్త్ రవికుమార్(శ్రీకాకుళం), కేశవరావు(మూసేపేట), చార్మినార్‌కు చెందిన రహీమ్‌లకు పాజిటివ్‌గా గుర్తించారు. -
హైదరాబాద్ పబ్బుల్లో దాడులు.. ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్
హైదరాబాద్, సాక్షి: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అర్ధరాత్రి మరోసారి పబ్బులు, బార్లలో పోలీసులు దాడులచేశారు. టీజీనాబ్, ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని 25 పబ్బులపై ఆకస్మిక తనిఖీలు చేశారు. పబ్బుల్లో 107 మందికి అనుమానితులకు డ్రగ్స్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు చేయగా.. ఐదుగురికి పాజిటివ్‌గా తేలింది. శుక్రవారం రాత్రి 11 గంటల నుండి ఒంటి గంట వరకు పోలీసులు తనిఖీలు కొనసాగించారు. ఎక్సోరాలో గంజాయి పరీక్షల్లో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. రంగరెడ్డి జిల్లాలో బార్లలో మరో ముగ్గురు వ్యక్తులు పాజిటివ్‌గా తేలారు. మొదటిసారి తనిఖీల్లో డ్రగ్ డీటెక్షన్ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ఆ వ్యక్తులను టీజీనాబ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆరు కేసుల్లో జీ 40లో ఇద్దరికి, విస్కీ సాంబ పబ్బులో ఇద్దరికి, జోరా పబ్బులో ఒకరికి, క్లబ్ రొగ్లో ఒకరికి డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ వచ్చినట్లు అధికారుల తెలిపారు. -
మందుబాబులకు అలర్ట్.. నేటి నుంచే వైన్‌షాప్‌లు బంద్
హైదరాబాద్: ఎన్నికల నేపథ్యంలో శంషాబాద్ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వైన్స్, బార్లు, కల్లు కంపౌండ్లను ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి మూసి వేస్తున్నట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దేవేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. 30వ తేదీ పోలింగ్ ముగిసిన అనంతరం తిరిగి షాపులను తెరుస్తారని అన్నారు. ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయించినా, మద్యం నిలువ చేసినా వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలను ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 236 కేసులు నమోదు చేశామన్నారు. తమ ప్రాంతంలో మద్యం విక్రయించినా, డంప్ చేసినా ఫోన్ నంబర్ 8712658750లో ఫిర్యాదు చేయాలని కోరారు. -
Delhi Liquor Scam: బీజేపీలో చేరితే కేసులు ఎత్తేస్తామన్నారు
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీని వీడి, బీజేపీలో చేరితే తనపై కేసులన్నీ ఎత్తివేయడంతోపాటు ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి కట్టబెడతామంటూ ఆఫర్ ఇచ్చారని చెప్పారు. సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల నుంచి విముక్తి కల్పిస్తామంటూ బీజేపీ నుంచే ఈ సందేశం వచ్చిందని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ట్వీట్ చేశారు. అనంతరం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన కేజ్రీవాల్‌తో కలిసి గుజరాత్‌కు వచ్చారు. ‘‘బీజేపీకి నేను ఇచ్చే సమాధానం ఇదే. నేను మహారాణా ప్రతాప్ వారసుడిని. రాజ్‌పుత్‌ను. తల నరుక్కోవడానికైనా సిద్ధమే గానీ, కుట్రదారుల ఎదుట, అవినీతిపరుల ఎదుట తలవంచే ప్రసక్తే లేదు. నాపై పెట్టినవన్నీ తప్పుడు కేసులే. మీకు చేతనైంది చేసుకోండి’’ అని ట్విట్టర్లో తేల్చిచెప్పారు. బీజేపీ ఇచ్చిన రెండు ఆఫర్లతో తన వద్దకు వచ్చిన వ్యక్తిని చూసి ఆశ్చర్యానికి గురయ్యానని మీడియాతో చెప్పారు. నాయకులను బీజేపీలో చేర్పించడమే ఆ వ్యక్తి పని అన్నారు. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తనకు రాజకీయ గురువు అని, ఆయన వద్దనే రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్నానని, ముఖ్యమంత్రో, ప్రధానమంత్రో కావడానికి రాజకీయాల్లోకి రాలేదంటూ అతడికి తేల్చిచెప్పానని సిసోడియా వెల్లడించారు. తాను నిజాయితీ పరుడినని, కేసులతో భయపెట్టలేరని తేల్చిచెప్పారు. దేశంలో ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్యనందించాలన్నదే తన కల అని, అందుకోసం కృషి చేస్తూనే ఉంటానని పేర్కొన్నారు. అయితే, తనకు ఆఫర్ ఇచ్చిన వ్యక్తి ఎవరన్నది సిసోడియా బహిర్గతం చేయలేదు. కాగా, బీజేపీ ఆఫర్‌కు సంబంధించి తమ వద్ద ఆడియో టేపులున్నాయని, సమయం వచ్చినప్పుడు వాటిని బయటపెడతామని పార్టీలోని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. సిసోడియా భారతరత్నకు అర్హుడు: కేజ్రీవాల్ విద్యాశాఖ మంత్రిగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలను మెరుగుపర్చిన మనీశ్ సిసోడియా భారతరత్న పురస్కారానికి అర్హుడని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టంచేశారు. కానీ, కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం ఆయనను వెంటాడుతోందని ఆక్షేపించారు. సన్మానించాల్సింది పోయి వేధింపులకు గురిచేయడం ఏమిటని నిలదీశారు. కేజ్రీవాల్ సోమవారం అహ్మదాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ విద్యా విధానాన్ని న్యూయార్క్ టైమ్స్ ప్రతిక ప్రశంసించిందని గుర్తుచేశారు. ఐదేళ్లలో అద్భుతాలు చేసిన వ్యక్తిపై సీబీఐ దాడులు చేయడం మీకు సిగ్గనిపించడం లేదా? అని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 70 ఏళ్లలో ప్రభుత్వాలు చేయని అద్భుతాలను సిసోడియా చేశారని, ఆయనకు భారతరత్న దక్కాలని ఉద్ఘాటించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సిసోడియాతోపాటు తనను కూడా అరెస్టు చేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. గుజరాత్లో 27 ఏళ్ల బీజేపీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆరోపించారు. రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపిస్తే నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు ఢిల్లీలో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాని సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చినట్లుగానే తమ ప్రభుత్వాన్ని సైతం పడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అందులో భాగంగా సీబీఐ, ఈడీతో సోదాలు చేయించారని విమర్శించారు. నిజానికి లిక్కర్ పాలసీకి, సీబీఐ–ఈడీ సోదాలకు సంబంధం లేదన్నారు. ‘ఆపరేషన్ కమలం’ విఫలమైందని ట్విట్టర్లో కేజ్రీవాల్ స్పష్టం చేశారు. దమ్ముంటే పేరు బయటపెట్టండి: బీజేపీ మనీశ్ సిసోడియా ఆరోపణలను బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఖండించారు. బీజేపీ తరఫున ఆఫర్ ఇచ్చిన వ్యక్తుల పేర్లను దమ్ముంటే బయటపెట్టాలని సిసోడియాకు సవాలు విసిరారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా స్పందిస్తూ.. సిసోడియా మతిభ్రమించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. లిక్కర్ పాలసీ వ్యవహారంలో అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆప్ నేతలు డ్రామాలు అడుతున్నారని మండిపడ్డారు. ఆరోపణలకు సమాధానం చెప్పలేక ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దూరంగా పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. మీరు నిజంగా నిజాయితీపరులైతే 24 గంటల్లోగా స్పందించండి అని కేజ్రీవాల్‌కు సూచించారు. కేజ్రీవాల్ నివాసం వద్ద బీజేపీ ధర్నా ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్ నివాసం వద్ద బీజేపీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఎక్సైజ్ పాలసీని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా ప్రసంగించారు. సీబీఐ నమోదు చేసిన కేసులో మొదటి నిందితుడైన డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రజల సొమ్మును దోచుకొనేందుకు లిక్కర్ మాఫియాకు అనుమతులు ఇచ్చారన్నారు. -
అడ్డదారుల్లో అక్రమ కిక్కు!
చిప్పగిరి మండలం ఖాజీపురం గ్రామానికి చెందిన బోయ నారాయణ కర్ణాటక రాష్ట్రం బళ్లారి నుంచి 1,056 మద్యం బాటిళ్లను జిల్లాకు తీసుకువస్తుండగా ఎక్సైజ్ పోలీసులు పక్కా సమాచారంతో కాపుకాచి పట్టుకున్నారు. కర్నూలు: కర్నూలు మండలం పడిదెంపాడు గ్రామానికి చెందిన రాఘవేంద్రగౌడు తన అనుచరుడు ఈడిగ మహేంద్రగౌడు ద్వారా అలంపూర్ నుంచి 315 మద్యం సీసాలు ఆటోలు తరలిస్తూ గ్రామ శివారులో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులకు పట్టుబడ్డాడు. అదే రోజు ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన దూదేకుల సిద్ధయ్య, దూదేకుల దస్తగిరిలు 126 మద్యం బాటిళ్లను మోటర్ సైకిల్‌పై ఆళ్లగడ్డకు తరలిస్తుండగా ఎక్సైజ్ పోలీసులు కాపు కాచి పట్టుకున్నారు. ... ఇలా ప్రతి రోజూ కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి జిల్లాలోకి విచ్చలవిడిగా మద్యం రవాణా అవుతోంది. ఏపీలో మద్యం ధరలు పెరగడం, విక్రయాల విషయంలో పరిమితులు విధించడంతో పొరుగు రాష్ట్రాలకు చెందిన మద్యం అమ్మకాలు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. మొన్నటి వరకు బెల్ట్ దుకాణాలు నిర్వహించిన వారు వివిధ మార్గాల్లో మద్యం సీసాలు తెచ్చి జిల్లాలో అమ్మకాలు సాగిస్తున్నారు. తెలంగాణలో మద్యం ధరలు తక్కువగా ఉండడంతో అక్కడ కొనుగోలు చేసి జిల్లాలోని కొంతమంది బార్ల యజమానులు ఎక్కువ ధరలకువిక్రయాలు చేసి సొమ్ము చేసుకుంటున్నట్లు బయటపడింది. నంద్యాలకు చెందిన టీడీపీ మాజీ కౌన్సిలర్ ఇదే తరహాలో భారీగా మద్యం తరలిస్తూ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడడం ఇందుకు బలం చేకూరుతోంది. తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్మకాలు చేస్తూ బార్ల యజమానులు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. వెలుగులోకి గ‘మ్మతై’న అంశాలు.. జిల్లాలో ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటైన తర్వాత గ‘మ్మతై’న అంశాలు చోటు చేసుకుంటున్నాయి. అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రభుత్వమే జిల్లాలో మద్యం దుకాణాలను నిర్వహిస్తోంది. గతంలో ఉన్న దుకాణాలను 20 శాతం మేర తగ్గించింది. డిగ్రీ, ఇంటర్ చదివి నిరుద్యోగులుగా ఉన్న వారిని సేల్స్ మెన్, సూపర్వైజర్లుగా నియమించి వారి ద్వారా అమ్మకాలు చేస్తున్నారు. గతంలో మద్యం సీసాల విషయంలో ఆంక్షలు ఉండేవికావు. ఎన్ని సీసాలైనా మందుబాబులు తీసుకునేవారు. ఇప్పుడు ఒక మనిషికి రోజుకు గరిష్టంగా మూడు సీసాలు మాత్రమే ఇస్తున్నారు. మరోవైపు 21 ఏళ్లు దాటిన వారికే మందు ఇస్తున్నారు. రాత్రి 8గంటలు దాటితే మద్యం దొరకని పరిస్థితి. దీన్ని ఆసరాగా చేసుకుని గతంలో మద్యం వ్యాపారంలో సంబంధాలు ఉన్న వారు లాభపడాలని చూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో పల్లెల్లో బెల్ట్ దుకాణాలు నిర్వహించిన వారు ఎక్కువ భాగం తెలంగాణ రాష్ట్రం నుంచి మద్యాన్ని తరలించిరాత్రి వేళల్లో రహస్యంగా వ్యాపారాలు సాగిస్తున్నారు. జిల్లాలోని మద్యం సీసాలకు తెలంగాణ ధరల విషయంలో ఎంతో వ్యత్యాసం ఉంది. క్వార్టర్ సీసాకు రూ.40 నుంచి రూ.60, ఫుల్‌బాటిల్‌కు రూ.200 నుంచి రూ.250 వరకు తేడా ఉంది. దీనికితోడు అక్కడ ఎన్ని సీసాలైనా ఇస్తున్నారు. ద్విచక్రవాహనాలు, కార్లు, లారీల్లో సరిహద్దు రాష్ట్రం తెలంగాణ నుంచి డ్యూటీ చెల్లించని మద్యం తీసుకువచ్చి విక్రయాలు జరుపుతున్నారు. దీంతో ప్రభుత్వం ఆదాయానికి గండి పడుతోంది. గతంలో బెల్ట్ దుకాణాలు నిర్వహించిన వారు కర్నూలు మండలంలోని ప్రతి పల్లెల్లో ఇప్పుడు ఇదే తరహా వ్యాపారానికి తెరతీశారు. ద్విచక్రవాహనాల ద్వారా తెలంగాణ మద్యాన్ని తరలిస్తున్నారు. కర్నూలుకు ఆనుకునే తెలంగాణ ప్రాంతం ఉండడంతో అక్కడ మద్యాన్ని ఇక్కడకు తీసుకువచ్చి అమ్మకాలు చేయడం సులువైంది. ఎక్సైజ్ పోలీసులు నమోదు చేస్తున్న కేసులే ప్రభుత్వానికి సుంకం చెల్లించని మద్యం విక్రయాల వ్యవహారాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. అక్రమ రవాణాలో యువకులే కీలకం... మద్యం అక్రమ రవాణాలో యువకులే కీలకపాత్ర పోషిస్తున్నారు. కొద్దిగా కష్టపడితే భారీగా డబ్బు సంపాదించుకోవచ్చన్న దురాశ యువకులను పెడమార్గం పట్టిస్తుంది. కర్నూలు – తెలంగాణ నడుమ జిల్లాను ఆనుకుని సుమారు 60 కిలో మీటర్ల మేరకు తుంగభద్రనది ఉంది. నదిలో ప్రవాహం తగ్గితే ఖాళీ నడకన, ద్విచక్రవాహనాల ద్వారా మద్యం తరలించే పరిస్థితి ఏర్పడింది. సుంకేసుల వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేవామని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నప్పటికీ కర్నూలు స్టేషన్లో ఉన్న సిబ్బందితో చెక్‌పోస్టు విధులు నిర్వర్తింపజేయడం అధికారులకు తలకు మించిన భారంగా మారింది. సరిహద్దుల్లో నిఘా పెట్టాం తెలంగాణ మద్యం జిల్లాలోకి ప్రవేశిస్తున్నట్లు గుర్తించాం. సుంకం చెల్లించని మద్యం అమ్మకాలు నిల్వరించేందుకు చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచాం. బెల్ట్, మొబైల్ వ్యాపారులపై కూడా సమాచారం తెలిసిన వెంటనే తనిఖీలు చేపట్టి కేసులు నమోదు చేస్తున్నాం. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మద్యం విక్రయాలు జరిగేలా చూస్తాం. చెన్నకేశవరావు, డిప్యూటీ కమిషనర్ -
భారీగా తెలంగాణ మద్యం పట్టివేత
కర్నూలు : నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి ముఖ్య అనుచరుడు, టీడీపీ మాజీ కౌన్సిలర్ ముడియం కొండారెడ్డి పెద్ద కుమారుడు తా ర్నాక్ తెలంగాణ నుంచి భారీ గా మద్యం తరలిస్తూ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఏపీ 21 ఏఎఫ్ 3336 స్విఫ్ట్ డిజైర్ కారులో జోగులాంబ–గద్వాల జిల్లా అలంపూర్ వద్ద ఉన్న మద్యం దుకాణం నుంచి 11 కేస్ల మద్యం (132 ఫుల్‌బాటిళ్లు) కొనుగోలు చేసి తార్నాక్ అక్రమంగా నంద్యాలకు తరలిస్తున్నాడు. కర్నూలు శివారులోని జాతీయ రహదారి టోల్‌ప్లాజా వద్ద ఎక్సైజ్ పోలీసులు పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. టీడీపీ నేతల నుంచి ఒత్తిడి పెరగడంతో ఉదయమే కొండారెడ్డి కుమారుడిని వదిలేసి, మద్యంతో పాటు కారును సీజ్ చేశారు. నంద్యాలకు చెందిన నారెళ్ల రాజేష్, తలారి శ్రీనివాసులను 1,2 ముద్దాయిలుగా చేర్చారు. కారు కొండారెడ్డి పేరుతో ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ యనను మూడో ముద్దాయిగా చేర్చారు. కొండారెడ్డికి నంద్యాలలో చంద్రిక, గాయత్రి బార్లు ఉన్నాయి. ఏపీలో నూతన మద్యం పాలసీ అమలులోకి వచ్చిన తర్వాత రేట్లు భారీగా పెరగడంతో తెలంగాణనుంచి మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ విక్రయాలు జరుపుతున్నట్లు విచారణలో తేలింది. ఈ కేసులో ఎక్సైజ్ అధికారులు వ్యవహరించిన తీరుపై ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. -
మనోళ్లు ‘మామూలోళ్లే’!
నిజామాబాద్ నగరంలో హైదరాబాద్ రోడ్డులోని వంశీ వైన్స్, ద్వారకామాయి వైన్స్‌లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తుండగా హైదరాబాద్ నుంచి వచ్చిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) బృందం శనివారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. నిర్వాహకులపై కేసు నమోదు చేసి, రూ.2 లక్షల జరిమానా విధించింది. ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ కేసులు నమోదు చేస్తుంటే.. మరి జిల్లాలోని ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారులు ఏం చేస్తున్నట్లు..? సాక్షి, నిజామాబాద్: జిల్లాలో మద్యం వ్యాపారులు దండుకుంటున్నారు. ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మార్పీ కంటే అధనంగా వసూలు చేస్తున్నారు. అయినా జిల్లా ఎక్సైజ్ యంత్రాంగం పట్టించుకోవడం లేదు. ఎంతైనా వాళ్లు కూడా ‘మామూలోళ్లే’ కదా! అందుకే అధికారులు, సిబ్బంది కార్యాలయాలకే పరిమితమయ్యారు. అయితే, పైనున్న వారు వీళ్లలా ‘మామూలు’ అధికారులు కారు కదా..! జిల్లాలో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న దుకాణాలపై దాడులు చేసి, కేసులు నమోదు చేశారు. అయితే, క్షేత్ర స్థాయిలో పూర్తి బలగం ఉన్న జిల్లా ఎక్సైజ్ యంత్రాంగం ఎందుకు దాడులు చేయలేదనే దానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ఐదు ఎక్సైజ్ స్టేషన్లున్నాయి. ఒక్కో స్టేషన్లో సీఐ, ఎస్సై, ఇతర సిబ్బంది పని చేస్తున్నారు. నిజామాబాద్ స్టేషన్లో అదనంగా మరో ఎస్సై, వీటికి తోడు అసిస్టెంట్ కమిషనర్ నేతృత్వంలోని ఓ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఉంది. దీనికి అదనంగా మరో టాస్క్‌ఫోర్స్ విభాగం పని చేస్తోంది. ఇవి కాకుండా ఓ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం, ఉమ్మడి జిల్లాలకు కలిపి మరో డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఉంది. జిల్లా వ్యాప్తంగా మద్యం వ్యాపారులు సిండికేట్‌గా మారి బహిరంగంగా అడ్డ్డగోలుగా రూ.కోట్లలో దోపిడీకి పాల్పడుతుంటే, ఇంత యంత్రాంగం ఉన్న ఎక్సైజ్‌శాఖ ఏం చేసినట్లు? కేవలం వారికి వచ్చే మామూళ్ల వసూళ్లకే పరిమితమయ్యారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దసరా వరకు దండుకున్నారు.. మద్యం వ్యాపారులు సిండికేట్‌గా మారి అధిక ధరలకు మద్యం విక్రయించారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ పట్టణాలతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని వైన్సుల్లో క్వార్టర్‌పై రూ.10, హాఫ్ బాటిల్‌పై రూ.20, ఫుల్ బాటిల్‌పై రూ.40 వరకు ధర పెంచేసి అడ్డుగోలుగా దోపిడీకి పాల్పడ్డారు. ఇలా ఒక్కో రోజు రూ.లక్షల్లో దండుకున్నారు. జిల్లా వ్యాప్తంగా పది రోజుల్లో రూ.కోట్లలో వెనకేసుకున్నారు. నెల వారీగా లైసెన్సు ఫీజు భారమవుతోందంటూ హడావుడి చేసిన మద్యం వ్యాపారులు చివరి నెల అందిన కాడికి దండుకుంటున్నారు. వీరితో జిల్లాలోని ఎక్సైజ్ ఉన్నతాధికారులు చేతులు కలపడంతో దోపిడీ యథేచ్ఛగా కొనసాగింది. ఈ క్రమంలో మందు బాబుల జేబులకు చిల్లు పడింది. జిల్లా వ్యాప్తంగా 95 వైన్సులుంటే దాదాపు అన్ని వైన్సులు దసరా వరకు ఎమ్మార్పీ నిబంధనలను ఉల్లంఘించారు. దసరా తర్వాత కూడా కొన్ని వైన్సుల్లో యథేచ్ఛగా ఎమ్మార్పీ నిబంధన ఉల్లంఘన జరుగుతోంది. కొత్త లైసెన్సుల సిండికేట్‌కు బాటలు.. నవంబర్ ఒకటో తేదీ నుంచి కొత్త వైన్సులు ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని ఎక్సైజ్ ఉ న్నతాధికారుల తాజా నిర్వాకం కారణంగా కొత్త వైన్సులు ప్రారంభమయ్యాక కూడా సిండికేట్ దోపిడీ కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. అధికారులు మామూళ్ల మత్తులో ఇలాగే వ్యవహరిస్తే మద్యం దోపిడీ యథేచ్ఛగా కొనసాగడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేసులు సైతం తారుమారు.. నవ్వి పోదురుగానీ నాకేటి సిగ్గు అన్న చందంగా తయారైంది ఎక్సైజ్ అధికారుల పనితీరు. మూడు నెలల క్రితం ఓ కల్లు దుకాణం నిర్వాహకుడి వద్ద లంచం డిమాండ్ చేస్తూ ఎక్సైజ్‌శాఖ టాస్క్‌ఫోర్స్ సీఐ వెంకట్‌రెడ్డి, ఎస్సై స్రవంతి ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు నిజామాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌ను కూడా తనిఖీ చేశారు. కేసులను తారుమారు చేసేందుకు ఏ ఒక్క రికార్డును కూడా నమోదు చేయలేదని ఉన్నట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. అయితే, ఈ స్టేషన్లో ఉండాల్సిన జనరల్ డైరీ, ఈ–2 రిజిస్టర్, కాంట్రవన్ రిజిస్టర్లను ప్రతిరోజు నమోదు చేయాల్సి ఉండగా, వారం రోజులుగా పెండింగ్‌లో పెట్టినట్లు తేటతెల్లమైంది. ఈ అడ్డగోలు వ్యవహారంపై ఏసీబీ ఎక్సైజ్‌శాఖ రాష్ట్ర కమిషనరేట్‌కు, రాష్ట్ర విజిలెన్స్ విభాగానికి నివేదిక ఇచ్చింది. కానీ దానిపై ఇప్పటివరకు రాష్ట్ర ఎక్సైజ్ అధికారులు కనీస చర్యలు తీసుకోక పోవడంతో ఇలాంటి అడ్డగోలు దందాలు యథేచ్చగా కొనసాగుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాకు ఫిర్యాదు అందలేదు.. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు మాకు ఒక్కరు కూడా ఫిర్యాదు చేయక పోవడంతో జిల్లా ఎక్సైజ్ అధికార యంత్రాంగం కేసులు నమోదు చేయలేక పోయింది. హైదరాబాద్‌కు ఫిర్యాదులు చేస్తే హైదరాబాద్ టీం వచ్చి కేసులు చేసింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా అధిక ధరలకు మద్యం విక్రయాలు ఆపేశారు. – డేవిడ్ రవికాంత్, డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్‌శాఖ -
నాటుసారాతో పట్టుబడ్డ టీడీపీ నేత
సాక్షి, తూర్పుగోదావరి: కాకినాడ రూరల్‌లో సోమవారం ఎక్సైజ్ శాఖ అధికారుల తనిఖీల్లో భారీగా నాటుసారా పట్టుబడింది. నేమాంకు చెందిన ఓ టీడీపీ నేత గత కొంతకాలంగా యథేచ్చగా నాటుసారా విక్రయిస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అధికారులు సోమవారం పక్కా వ్యూహం ప్రకారం దాడి చేశారు. బలుసు తిప్ప, భైరవపాలెం నుంచి కాకినాడకు సముద్ర మార్గాన పడవల సహాయంతో రవాణా చేస్తుండగా సూర్యరావు వంతెన వద్ద అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అయితే పట్టుబడ్డ నాటుసారా బస్తాలపై టీడీపీకి చెందిన ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. ఫ్లెక్సీల మీద కాకినాడ రూరల్ ఎమ్మేల్యే పిల్లి అనంత లక్ష్మి దంపతులు ఫోటోలు కనిపించడంతో అధికారులు షాక్‌కు గురయ్యారు. ఈ దాడిలో స్థానిక టీడీపీ నేత బుజ్జి నాటుసారాతో పట్టుబట్టారు. గతకొంత కాలంగా నేమాంలో జోరుగా నాటుసారా వ్యాపారం జరుగుతున్నా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో ఎక్సైజ్ శాఖ చూస్తూ ఉండిపోయిందని స్థానికులు వాపోయారు. అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఈశ్వరుడు తెలిపారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : నాటుసారాతో పట్టుబడ్డ టీడీపీ నేత బుజ్జి -
నాటుసారాతో పట్టుబడ్డ టీడీపీ నేత బుజ్జి
-
నాటు సార కేంద్రలపై ఎక్సైజ్ పోలీసులు దాడి
-
రూ.50 లక్షల గంజాయి పట్టివేత
పటాన్‌చెరుటౌన్: అక్రమంగా తరలిస్తున్న రూ.50 లక్షలు విలువ చేసే 508 కిలోల గంజాయిని సంగారెడ్డి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, పటాన్చెరు ఎక్సైజ్ పోలీసులు శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం పటాన్‌చెరులోని ఎక్సైజ్ కార్యాలయంలో మెదక్ రేంజ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కేఏబీ శాస్త్రి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రయ్య, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ గాయత్రి విలేకర్లకు వివరాలు వెల్లడించారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు నుంచి జహీరాబాద్‌కు చెందిన వీరుశెట్టి, కర్ణాటకలోని బీదర్ జిల్లా బాల్కికి చెందిన పుత్రాజ్ నీలారామ్ మెట్రాజ్ రెండు వాహనాల్లో గంజాయిని మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలకు తరలించేందుకు తీసుకొస్తున్నారని పోలీసులకు సమాచా రం అందింది. దీంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, ఎక్సైజ్ పోలీసులు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలోని ముత్తంగి రింగ్ రోడ్డు వద్ద శనివారం రాత్రి తనిఖీలు నిర్వహించి రెండు కార్లలో తరలిస్తున్న సుమారు రూ.50 లక్షలు విలువ చేసే 508 కిలోల గంజాయిని, ఆ కార్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అయితే పట్టుకున్న వారు కేవలం డ్రైవర్ లే అని, ప్రధాన నిందితులు జహీరాబాద్ నియో జకవర్గం ఝరాసంగం చెర్లపల్లి తండాకు చెందిన బన్సీలాల్, కర్ణాటక బల్కికి చెందిన సహదేవ్, రవూఫ్‌ఖాన్ అని వెల్లడించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్పా రు. కార్యక్రమంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐలు, ఎక్సైజ్ సీఐ సీతారామిరెడ్డి, ఎస్సైలు వెంకటేశం తదితరులు పాల్గొన్నారు -
పోలీస్ స్టేషన్లో మద్యం సేవించి..అసభ్యంగా ప్రవర్తించి..
-
ఎక్సైజ్ పోలీస్ అకాడమీలో అగ్నిప్రమాదం
రాజేంద్రనగర్ : బండ్లగూడ ఎక్సైజ్ పోలీస్ అకాడామీలో ఉన్న యూఎస్ఈ హోలోగ్రామ్స్ ప్రైవేటు లిమిటెడ్ ఆవరణలో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తయారైన విస్కీ, బీర్, బ్రాందీ తదితర బాటిళ్లకు ఇక్కడి నుంచే లెబుల్స్‌ను తయారు చేసి పంపిస్తుంటారు. ఇందులోని చెత్తను పక్కనే డంప్ చేశారు. మంగళవారం సాయంత్రం చెత్తకు నిప్పంటుకుంది. నిమిషాల వ్యవధిలోనే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. దీని పక్కనే లేబుల్స్‌కు సంబంధించిన ప్లాస్టిక్ బండిళ్లను డంప్ చేశారు. వీటికి సైతం నిప్పంటుకుని దట్టమైన పోగలు వ్యాపించాయి. కెమికల్ డబ్బాలు ఉండడంతో పేలాయి. ఇంత పెద్ద పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవిస్తే నివారించే పరికరాలు ఏమీ లేకపోవడం గమనార్హం. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో చూట్టూ దట్టమైన పొగ ఆవరించింది. స్థానికంగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పక్కనే ఉన్న బస్తీల్లోకి ఘాటైన పొగ రావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. బండ్లగూడ, కిస్మత్పూర్, బుద్వేల్, రాజేంద్రనగర్ వరకు ఈ పొగలు వ్యాపించాయి. ప్లాస్టిక్ కావడంతో ఘాటన దుర్వాసన వ్యాపించింది. రెండు అగ్నిమాపక వాహనాల సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. -
వైన్స్ నిల్.. ‘బెల్ట్’ ఫుల్
సదాశివనగర్(ఎల్లారెడ్డి)/బీబీపేట(కామారెడ్డి) : మద్యం పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతోంది. ఊరూరా బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. దీంతో సామాన్యులు పొద్దంతా పని చేసి సంపాదించిన సొమ్మును మద్యానికి వెచ్చిస్తూ కుటుంబాలను వీధిన పడేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో బెల్టు షాపుల దందా ‘మూడు బాటిళ్లు.. ఆరు కాసులు’గా తయారైంది. ఈ దందా దర్జాగా సాగుతోంది. అధికారుల కన్నుసైగలలోనే ఈ తంతు కొనసాగుతున్నా ఎక్సైజ్ అధికారులు, పోలీసులు అటువైపు కన్నెతి చూడడం లేదు. కామారెడ్డి జిల్లాలో 37 వైన్స్ దుకాణాలు, మూడు బారులు కొనసాగుతున్నాయి. అధికారులు మామూళ్లమత్తులో జోగుతున్నారని తెలుస్తోంది. ప్రతి నెల ముడుపులు అందడంతో వారు బెల్టు దుకాణాలపై దృష్టి సారించడం లేదని స్పష్టమౌతుంది. మద్యం షాపుల ప్రతి నెల రూ.30 కోట్ల మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. వైన్స్లలో మద్యం సేవించ రాదు, బార్లలో సీల్డ్ మద్యం అమ్మరాదు. వైన్స్‌కు సంబంధించి ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటలు, బార్లకు ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటలవరకు అమ్మకాలు చేపట్టాలి అనే నిబంధనలు విధించారు. ఇవి కాకుండా బయట ఎక్కడపడితే అక్కడ మద్యం విక్రయించరాదని ఆదేశాలున్నాయి. అయినా ఆ నిబంధనలు నిర్వాహకులు పాటించడం లేదని తెలుస్తోంది. దీంతో మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. గ్రామాల్లో బెల్టు షాపులు అందుబాటులో ఉండడంతో పొద్దంతా కష్టపడి పనిచేసి సంపాదించిన కూలి డబ్బులతో మద్యం తాగుతూ సంసారాలను పాడు చేసుకుంటున్నారు సంపాదన మద్యానికి ఖర్చు చేస్తుండడంతో వారి కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. మద్యానికి బానిసలైన కొందరు ఏ పని చేయకుండా ఉదయాన్నే బెల్టు షాపులకు చేరుకొని ఉద్దెర పెట్టి అప్పుల పాలవుతున్నారు. అధిక ధరలకు విక్రయాలు.. మద్యం ధరలకు అడ్డూ అదుపు లేకుండా పోయాయి. దీంతో ప్రజారోగ్యానికి చిల్లు పడుతోంది. బెల్టు షాపుల్లో ప్రతి క్వార్టర్‌కు రూ.10 నుంచి రూ.20 వరకు, ఒక్కో బీరు సీసా మీద రూ. 20 అదనంగా తీసుకుంటున్నారని ఆరోపణలున్నాయి. గ్రామాల్లో చీప్ లిక్కర్ విక్రయాలు బాగా పెరిగాయి. వాటిలో కూడా కల్తీ మద్యం కలుపుతూ ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నారు. పేరుకే కిరాణం.. అమ్మేది మద్యమే.. అనేక మంది పేరుకు కిరాణ దుకాణాలు నిర్వహిస్తూ లోపల మాత్రం మద్యం వ్యాపారం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో బస్టాండ్లలోనే బెల్టు షాపులు నిర్వహిస్తుండటం, రాత్రయితే అక్కడ పండుగ వాతావరణంలా కనపడుతూ చుట్టు పక్కల ఉన్న కాలనీవాసులకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంకా గ్రామం లోపలికి వెళ్తే కిరాణ దుకాణాల్లో, సొంత ఇళ్లల్లో పెద్ద పెద్ద ఫ్రిడ్జ్‌లు పెట్టుకొని మరీ విక్రయిస్తుండడం చాలా ఉన్నాయి. మద్యం మత్తులో అక్కడే ఇళ్ల మద్యలో గొడవలు పడుతూ అర్ధరాత్రి వరకు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని గ్రామస్తులు అరోపిస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో కిరాణ దుకాణాల్లో బెల్టు షాపులు నిర్వహిస్తూ జనాల దగ్గర బాగానే డబ్బులు సంపాదిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో మహారాష్ట్ర నుంచి కల్తీ మద్యం తెప్పించి అమ్ముతూ జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇంచుమించూ ప్రతి గ్రామంలో మద్యం దుకాణాలు వెలిసి ఊరంతా ఏరులై పారుతుందని ప్రజలు విమర్శిస్తున్నారు. పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు బెల్టు షాపులను అరికట్టాల్సిన ఎక్సైజ్, పోలీసు శాఖ అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో జోగుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాల్లో ఎన్ని బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు అనే పూర్తి సమాచారం ఎక్సైజ్ అధికారుల వద్ద ఉన్నా ఇప్పటివరకు ఏ బెల్టు షాపుపై దాడులు చేసిన దాఖలాలు లేవు. బెల్టు షాపుల నిర్వాహకుల దగ్గర మామూళ్లు తీసుకోవడంతోనే చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామాల్లో వెలుస్తున్న బెల్టు షాపులను నియంత్రించాలని పలువురు కోరుతున్నారు. బెల్టు దుకాణాలు నిర్వహిస్తే బైండోవర్ నిబంధనలకు విరుద్ధంగా గ్రామాల్లో బెల్టు దుకాణాలు ఏర్పాటు చేసినట్లు అయితే కఠిన చర్యలు తీసుకుంటాం. అక్రమ మద్యం విక్రయాలు నిర్వహించిన వారిపై కేసులు నమోదు చేస్తాం. కేసు నమోదు చేసి తహసీల్దార్ ఎదుట బైండెవర్ చేస్తున్నాం. బెల్టు దుకాణాలపై ప్రత్యేక దృష్టి పెడతాం. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించిన వారిపై తగు చర్యలు తీసుకుంటాం. చట్టానికి ఎవరూ అతీతులు కారు. –శ్రీనివాస్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ బెల్టు షాపులకు అనుమతులు లేవు గ్రామాల్లో బెల్టు షాపులను నిర్వహించేందుకు ఎలాంటి అనుమతులు లేవు. ఎక్కడైనా అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు తెలిస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో మద్యం అమ్మకాలు జరగకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నాం. ఒకవేళ అమ్ముతున్నారని ఎవరైనా సమాచారం అందిస్తే బెల్టు షాపు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటాం. –రాధాకృష్ణారెడ్డి, ఎక్సైజ్ సీఐ, దోమకొండ -
భారత్‌కు తిరిగి వచ్చేందుకు మాల్యా ఉత్సాహం
-
రాజధానిలో లిక్కర్ చాక్లెట్లు
సాక్షి, హైదరాబాద్: మద్యం తాగడం గురించి తెలుసు.. కానీ మద్యం తినొచ్చని మీకు తెలుసా..? అవును గ్లాసులో పోసుకుని సోడా కలుపుకొని తాగడం మనకు తెలిసిన విధానం కానీ బ్రాందీ, విస్కీ, రమ్ముతో తయారు చేసిన లిక్కర్ చాక్లెట్ల అమ్మకాలు మన హైదరాబాద్‌లోనే జోరుగా సాగుతున్నాయి. ఇలాంటి చాక్లెట్లపై మన దేశంలో నిషేధం ఉన్నా అక్రమ విక్రయాలు జరుగుతున్నాయి. ఢిల్లీకి చెందిన ఓ మాఫియా లిక్కర్ చాక్లెట్లను డెన్మార్క్ నుంచి అక్రమంగా తెప్పించి మెట్రోపాలిటన్ నగరాల్లో విక్రయిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన ఓ చాక్లెట్ డిస్ట్రిబ్యూటర్ ముఠాతో ఒప్పందం చేసుకొని విక్రయిస్తుండగా హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. లండన్, ఐరిస్, డెన్మార్క్‌కు చెందిన మొత్తం 96 బాక్సుల్లో ఉన్న 1,081 చాక్లెట్లను అధికారి నంద్యాల అంజిరెడ్డి స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో చాక్లెట్లో 4 శాతం ఆల్కహాల్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా, గతంలో ఇలాగే లిక్క ర్ చాక్లెట్లను సరఫరా చేసిన అబిడ్స్‌కు చెందిన శ్రీధర్ అనే వ్యక్తి ప్రస్తుతం ఇంట్లోనే లిక్కర్ చాక్లెట్ల కంపెనీ పెట్టాడు. స్థానికంగా లభించే విస్కీ, బ్రాందీ, రమ్ము తీసుకొచ్చి వాటితో చాక్లెట్లు తయారు చేసి విక్రయిస్తుండగా హైదరాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వివేకానందరెడ్డికి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. నిందితుడి నుంచి 1.3 కిలోల విస్కీ చాక్లెట్లు, 1.5 కిలోల రమ్ము చాక్లెట్లు, 6.4 కిలోల చాక్లెట్ పదార్థాలు, లిక్కర్ సీసాలు స్వాధీనం చేసుకున్నారు. -
ఊరూరా సారా కిక్కు
చీరాల: ‘‘జిల్లాలో నాటు సారా తయారీ, అమ్మకాలు లేవు. ఎక్కడా సారా ఆచూకీ లేదు. ఎక్సైజ్ అధికారుల పనితీరు భేష్. సారా రహిత జిల్లాగా ప్రకాశం జిల్లాను ప్రకటిస్తున్నాం’’ అని అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. కానీ చీరాలతో పాటు జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలైన గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం ప్రాంతాల్లో జోరుగా సారా తయారు చేయడంతో పాటు విక్రయిస్తున్నారు. జిల్లాలో నాటు సారా లభించని గ్రామాలు లేవంటే అతిశయోక్తి కాదు. ఉదాహరణకు చీరాలకు మరో పేరు క్షీరపురి. అంటే ఒకప్పుడు పాడిపరిశ్రమతో పాలవెల్లువ కనిపించేపరిస్థితి ఉండేది. ప్రస్తుతం ఆ స్థానంలో సారా వెల్లువగా మారింది. చీరాల ప్రాంతంలో ఎక్కువగా నివసించేది బడుగు, బలహీన వర్గాల వారే. కాయకష్టం చేసుకుని బతుకులు సాగిస్తుంటారు. పని ఒత్తిళ్లు, మరో ఇతర కారణాల వలన మద్యం మత్తుకు ఎక్కువ మంది బానిసలవుతున్నారు. కూలీ, నాలీ చేసుకుని బతికే ఈ వర్గాలు మద్యం కొనుగోలు చేసి తాగే ఆర్థిక స్థోమత లేక ప్రత్యామ్నాయ మార్గంగా సారా వైపు మళ్లారు. దీంతో కొన్నేళ్లుగా చీరాల ప్రాంతంలో సారా పరవళ్లు తొక్కుతోంది. చీరాలకు కూతవేటు దూరంలో అంటే ఐదు కిలోమీటర్లలోపే గుంటూరు జిల్లా స్టువర్టుపురం మందుబాబులతో కోలాహలంగా ఉంటుంది. కడుపునిండా తాగి తమతో కలిసి మద్యం తాగే వారికి పార్శిల్ రూపంలో కొనుగోలు చేసి రైళ్లలో రోజూ తెస్తుంటారు. వేటపాలెం, పందిళ్లపల్లి, జాండ్రపేట, రామకృష్ణాపురం, చీరాల, ఈపూరుపాలెంతో పాటు చినగంజాం, పలు ప్రాంతాల నుంచి రోజూ స్టువర్టుపురం వెళ్లి సారా తాగి వెంట కూడా తెచ్చుకోవటం నిత్యకృత్యం. సారా రహిత జిల్లా ఎక్కడ మంత్రివర్యా..? జిల్లాలో నాటుసారా ఊసేలేదని మంత్రి ప్రకటించిన సంత్సరన్నర కాలం నుంచి ఎక్కడా సారా నిలుపుదల కాలేదు. జిల్లాలోని చీరాల, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి ప్రాంతాలతో పాటుగా మారుమూల తాండాల్లో కొందరు కొన్నేళ్లుగా నాటుసారా తయారు చేస్తూ జీవనం గడుపుతున్నారు. ఏదో చాటుమాటుగా కాకుండా ఇళ్ల వద్దే సారా కాస్తున్నారంటే సారా అమ్మకాలు ఏవిధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. చీరాల, రామ్‌నగర్, ఆదినారాయణపురం, సాయికాలనీ, తోటవారిపాలెం వీవర్స్ కాలనీకి చెందిన కొందరు స్టువర్టుపురంలో కాచే సారాను ఐదు లీటర్ల క్యాన్ రూ.400 కొనుగోలు చేసి, మందుబాబులకు గ్లాస్ రూ.10, క్వార్టర్ రూ.20–రూ.30 చొప్పున విక్రయిస్తున్నారు. అందులోనూ మొదటి క్వాలిటీ, రెండవ క్వాలిటీని బట్టి డబ్బులు వసూలు చేస్తుంటారు. ప్రధానంగా కూలీ పనులు చేసుకుని బతికే కాలనీవాసులకు అందుబాటులో సారా విక్రయాలకు అడ్డూఅదుపూ ఉండటం లేదు. ఇదిలా ఉంటే చీరాల ప్రాంతంలోని దండుబాట, స్వర్ణరోడ్డు, జాలమ్మగుడి, ఉజిలీపేట, శృంగారపేట, గాంధీనగర్, ఎఫ్‌సీఐ గోడౌన్స్ సమీపంలో కూడా సారా విక్రయాలు రోజూ భారీ స్థాయిలో జరుగుతుంటాయి. చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న పోలీసులు... నాటుసారా వ్యవహారాన్ని స్థానిక పోలీసులు గానీ, ఎక్సైజ్ పోలీసులు గానీ చూసీచూడనట్లు వ్యవహరిస్తుంటారు. స్టువర్టుపురం నుంచి చీరాలకు ఆటోలు, టూవీలర్స్లలో నేరుగా చీరాలకు తరలిస్తుంటారు. అయితే ఈపూరుపాలెం రోడ్డు పక్కనే రూరల్ పోలీస్‌స్టేషన్ అనేది ఒకటుంటుంది. కానీ అక్కడ తనిఖీల తంతుకానీ, కనీసం నిఘా కానీ ఉండదు. పోలీస్‌స్టేషన్ దాటుకుని నేరుగా ఈపూరుపాలెం, చీరాల ప్రాంతాలకు నాటుసారా తరలిస్తున్నా స్థానిక పోలీసులు సారా పట్టుకుంటే మనకేమి వస్తుందిలే అనుకున్నారేమో గానీ వారి జోలికి అస్సలు వెళ్లరు. ఎక్సైజ్ పోలీసుల పరిస్థితైతే మరీ దారుణం. వారికి సారా సామ్రాట్లు అంటే మహా భయం. ఎక్సైజ్ పోలీసులపై సారా అమ్మే మాజీ నేరస్తులు పలుమార్లు దాడులు చేసి గాయపరిచిన సంఘటనలు చీరాల్లో అనేకం ఉన్నాయి. జిల్లా కేంద్రంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్‌తో పాటు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, సబ్‌డివిజన్ టాస్క్‌ఫోర్స్ ఉన్నప్పటికీ వారు సారా నియంత్రించటంలో నామమాత్రంగా కూడా దృష్టి పెట్టడం లేదు. స్థానికంగా కూడా తయారీ.. గతంలో కేవలం స్టువర్టుపురంలో సారా తయారై చీరాలకు అక్రమ రవాణా జరుగుతుండేది. కానీ సారాకు డిమాండ్ పెరగటంతో స్థానికంగా తయారు చేస్తున్నారు. ఈపూరుపాలెం స్ట్రయిట్‌కట్ పక్కన, రామ్‌నగర్ గ్యాంగిలో, మత్య్సకార గ్రామమైన వాడరేవులో, విజిలీపేట, జాలమ్మగుడి, ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద, జవహర్ నగర్ ప్రాంతాల్లో కాపుసారా అమ్మకాలకు నిలయంగా మారింది. ఇందుకోసం ఎక్సైజ్ అధికారులు కొందరు ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని సారా నియంత్రణకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ప్రైవేటు వ్యక్తులు సారా అమ్మకందారులతో చేతుల కలపడంతో సారా పరవళ్లు తొక్కుతోంది. కాపు సారా తయారీకి అధిక మోతాదులో మిరపకాయలు, యూరియా, బ్యాటరీ పౌడర్‌తో పాటు ఇతర హానికరమైన విష పదార్థాలను కలుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికైనా ఎక్సైజ్ పోలీసులు చొరవచూపి సారా మహమ్మారిని చీరాల ప్రాంతం నుంచి తరిమికొట్టాలని ప్రజలు కోరుతున్నారు. సారా నియంత్రణకు దాడులు చేపడుతున్నాం జిల్లాలో నాటుసారా తయారీ, అమ్మకాలను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. వారంలో ఒకరోజు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దాడులు నిర్వహిస్తున్నాం. సారా అమ్ముతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. చీరాల ప్రాంతంలో ఇటీవల మాజీ నేరస్తులు 28 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసి వారిపై ప్రత్యేక నిఘా ఉంచాం. ప్రత్యేక బృందాలు, ఆయా పోలీస్స్టేషన్లలోని సీఐలు, ఎస్సైలు రోజువారీ తనిఖీలు, దాడులు చేస్తున్నారు.–పి.శ్రీనివాసరావు, ఎక్సైజ్ ఈఎస్, ఒంగోలు. -
తెలంగాణ బీరు ఆంధ్రాలో
అనంతపురం, కళ్యాణదుర్గం: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడుల్లో మద్యం దుకాణదారులు సాగిస్తున్న అక్రమ అమ్మకాలు బహిర్గతమయ్యాయి. నిబంధనలు తుంగలోకి తొక్కిన విషయాలు కూడా వెలుగు చూశాయి. తెలంగాణ రాష్ట్రం వ్యాప్తో తయారు చేసిన కింగ్ ఫిషర్ బీరు బాటిళ్లు లభించడం గమనార్హం. వివరాల్లోకెళితే... ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ అన్నపూర్ణ, ఎస్ఐ హరినాథ్ శుక్రవారం సాయంత్రం గాంధీచౌక్‌లోని మద్యం దుకాణం కళ్యాణి – 3పై దాడి చేశారు. అక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తో ఉన్న కింగ్‌ఫిషర్ బీరుబాటిల్ కేస్ లభ్యమైంది. అంతేకాదు తక్కువ ధర మద్యంతో మొదలుకుని ఎక్కువ ధర మద్యం వరకు లూజు అమ్మకాలు కనిపించాయి. వాటిని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు షాపు వద్దకు వెళ్లి హడావుడి చేశారు. కళ్యాణి మద్యం దుకాణాలు పట్టణంలో మూడు ఉన్నాయి. ఇవన్నీ యార్డు చైర్మెన్ నారాయణ, ఆయన అనుచరులు లక్కీ లాటరీలో దక్కించుకుని నడుపుతున్నారు. దీంతో ఎలాంటి కేసు నమోదు చేయకుండా సీఐపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఆమె ససేమిరా అనడంతో కొద్దిసేపు వాదనకు దిగారు. ఫలితం లేదని భావించి ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి తనయుడు మారుతీ చౌదరిని ఎక్సైజ్ స్టేషన్‌కు రప్పించారు. సీఐతో టీడీపీ నేతల వాగ్వాదం కేసు నమోదు చేయకూడదంటూ ఎమ్మెల్యే తనయుడు మారుతీ చౌదరి, యార్డు చైర్మెన్ నారాయణ, కో ఆప్షన్‌సభ్యుడు మురళి, మున్సిపల్ వైస్ చైర్మెన్ శ్రీనివారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ సీఐ అన్నపూర్ణతో వాగ్వాదానికి దిగి రుబాబు చేశారు. దీంతో ఎక్సైజ్ పోలీసుస్టేషన్లో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. చివరికి ‘కేసులు నమోదు చేస్తే ఏమవుతాయిలే...’ అంటూ నాయకులు వెళ్లిపోయారు. అయితే కేసుల నమోదు విషయంలో అధికారులు తర్జనభర్జన పడ్డారు. స్టేషన్లో గందరగోళ పరిస్థితిని తెలుసుకున్న పెనుకొండ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రణవి హుటాహుటిన కళ్యాణదుర్గం ఎక్సైజ్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ సీఐ అన్నపూర్ణ, స్థానిక ఎక్సైజ్ సీఐ సృజన్‌బాబులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. లభ్యమైన బీరు, మద్యం బాటిళ్లను పరిశీలించారు. అయితే కేసు నమోదు విషయాన్ని తర్వాత చెబుతామంటూ అధికారులు జారుకోవడం కొసమెరుపు. -
ఎక్సైజ్ పోలీసు స్టేషన్లో విందులు
బాపట్ల: స్థానిక ఎక్సైజ్ పోలీసు స్టేషన్ శుక్రవారం మందు, విందులతో బిజీగా మారింది. ఏకంగా కార్యాలయాన్నే బార్గా మార్చేశారు. ఎక్సైజ్ ఎస్ఐ రవితో పాటు పలువురు కానిస్టేబుళ్లు, ఇద్దరు ఇతర వ్యక్తులు శుక్రవారం మధ్యాహ్నం కార్యాలయంలోనే మద్యం తాగారు. విందులో కూడా పాల్గొన్న ఎస్ఐ చిందులేయడం గమనార్హం. ఈ విషయం తెలిసి మీడియా అక్కడికి వెళ్లగా ఇక్కడ ఇలాంటివి మామూలే అంటూ వ్యాఖ్యానించడం కొసమెరుపు. -
కనిపిస్తే దాడులే..!
చిత్తూరు అర్బన్: విధి నిర్వహణలో ఉన్న ఓ కానిస్టేబుల్‌పై చేయి వేయాలంటేనే ఎవరైనా ఆలోచిస్తారు. అలాంటిది ఓ సీఐపై సారా కాస్తున్న వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేశారంటే వారి వెనుక బలమైన రాజకీయ నేతలు ఉండాలి. అవును.. సారా కాస్తున్న వారికి, సారాను అమ్మే వారికి, సారా రవాణా చేసే వారికి అధికార పార్టీ నాయకులు అండగా ఉన్నారు. జిల్లా కేంద్రంలోని కొందరు టీడీపీ నేతలు వాళ్ల ఉనికిని చాటుకోవడానికి నిరక్ష్యరాస్యుల్ని పావులుగా చేసుకుని సారా సామ్రాజ్యానికి అధిపతులుగా రాణిస్తున్నారు. హడలెత్తిస్తున్న రాసనపల్లె చిత్తూరు తమిళనాడుకు సరిహద్దు కావడంతో గుడిపాల, పాలసముద్రం, ఎస్ఆర్.పురం, గంగాధరనెల్లూరు, పిచ్చాటూరు, సత్యవేడు, నగరి ప్రాంతాల్లో నాటుసారాను తయారు చేయడమే వృత్తిగా కొందరు ఎంచుకున్నారు. అన్నింటికంటే గుడిపాల మండలంలోని రాసపల్లె పేరు చెబితే పోలీసులు సైతం భయపడి వెనకడుకు వేసే పరిస్థితి నెలకొంది. ఈ గ్రామంలో ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాలకు వెళుతున్న వారితో పాటు నాటుసారా తయారీని ప్రవృత్తిగా ఎంచుకున్న వారు సైతం ఉన్నారు. పక్కనే ఉన్న అటవీశాఖ భూముల్లో ఇష్టానుసారం సారా తయారు చేసి తమిళనాడు, కర్ణాటకతో పాటు చిత్తూరు పరిసర ప్రాంతాల్లో యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. రాసనపల్లెలో తనిఖీలకు వెళ్లిన పోలీసులు, ఎక్సైజ్ అధికారులను ఏ మాత్రం లెక్కచేయకుండా సారాజులు దాడులకు దిగడం పరిపాటిగా మారింది. ఇలాంటివెన్నో.. సారా వ్యాపారుల దాడులతో ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటోంది. ఫలితంగా చిత్తూరు లాంటి ప్రాంతాల్లో పనిచేయడానికి ఆసక్తి చూపడంలేదు. గతేడాది అక్టోబర్‌లో తనిఖీలకు వెళ్లిన ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంట్ అధికారులపై సారా వ్యాపారులు దాడి చేశారు. 2016 ఏప్రిల్ 30న చిత్తూరు ఎక్సైజ్ అర్బన్ సీఐ గోపీకృష్ణపై దాడి చేసి సుమో అద్దాలను ధ్వంసం చేసి తమ ప్రాంతంకు రావొద్దంటూ హెచ్చరించారు. 2015 డిసెంబరులో చిత్తూరు నగరంలోని మూడో గేటు వద్ద సైతం గోపీకృష్ణపై సారా వ్యాపారులు దాడి చేసి గాయపరిచారు. తాజాగా దాడి చేసి చితకబాదారు. అధికారుల మౌనం.. సారా వ్యాపారులు ఎక్సైజ్ పోలీసులపై దాడి చేస్తున్నా ఉన్నతాధికారులు మౌనం వహించడం విమర్శలకు తావిస్తోంది. ఓ వ్యక్తి తరచూ నేరాలకు పాల్పడుతుంటే ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్టు పెట్టొచ్చు. అధికార పార్టీ నాయకులకు తలొగ్గుతున్న ఎక్సైజ్ శాఖలోని కొందరు అధికారులు పీడీ యాక్టుపై వెనకడుగు వేస్తున్నారు. జిల్లాలో 38 మంది సారా వ్యాపారులపై పీడీ యాక్టు పెట్టాలనే ప్రతిపాదన మూడేళ్ల క్రితమే తెరపైకి వచ్చింది. సంబంధిత ఫైలు కలెక్టర్ వద్దకు వెళ్లకుండా చిత్తూరుకు చెందిన ఓ టీడీపీ ప్రజాప్రతినిధి అడ్డుకున్నారు. దీంతో దాడులు పునరావృతమయ్యాయి. ‘ఈయన పేరు గోపీకృష్ణ. చిత్తూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అర్బన్ సీఐ. సారా ఊటల్ని ధ్వంసం చేయడానికి వెళ్లిన ఈయనపై రాళ్లతో దాడి చేశారు. ప్రాణం అరచేతుల్లో పెట్టుకుని రక్తగాయాలతో సిబ్బందితో కలిసి పారిపోయి ఆస్పత్రికి చేరుకున్నారు. గాయపడ్డ వారిలో ఓ మహిళా కానిస్టేబుల్‌కు పక్కటెముకలు విరిగిగాయి. ఇదెక్కడో మారుమూల ప్రాతంలో జరిగింది కాదు. చిత్తూరు నుంచి పది కి.మీ దూరంలో ఉన్న రాసనపల్లెలో బుధవారం జరిగిన ఘటన.’ -
ఎనీ సెంటర్..ఎనీ వేర్!
రోజంతా కష్టపడి ఆ కష్టాన్ని మరిచి పోయేందుకు కొందరు తాగుతున్న మద్యం మకిలీగా మారింది. జిల్లాలో ప్రధానంగా చీరాల్లోనే కల్తీ మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. చాలా మద్యం దుకాణాలు అధికార పార్టీ నేతల చేతుల్లోనే ఉండటంతో అడిగేవారెవరూ లేకపోవడంతో నకిలీ మద్యం పరవళ్లు తొక్కుతోంది. 24 గంటలూ మద్యం దుకాణాలు బార్లా తెరచి అమ్మకాలు సాగిస్తున్నారు. అర్ధరాత్రి మద్యం దరువు చందంగా కనీసం మంచినీరు దొరక్కునా మద్యం మాత్రం పుష్కలంగా దొరుకుతోంది. వ్యాపారులను ఎక్సైజ్ అధికారులు ప్రశ్నిస్తే తమవి అధికార పార్టీ నేతలకు సంబంధించిన షాపులని యథేచ్ఛగా బెదింపులకు దిగుతున్నారు. చీరాల సబ్‌డివిజన్‌లో 37 వైన్ షాపులు, 6 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. ప్రకాశం, చీరాల:మద్యం దుకాణాల్లో క్వార్టర్ రాయల్‌స్టాగ్ రూ.160, మ్యాన్షన్ హౌస్ రూ.130, సిగ్నేచర్ రూ.220, బ్లాక్‌డాగ్ రూ.375, బ్లెండర్ స్ప్రైడ్ రూ.220, బ్లాక్ గోల్డ్ రూ.170 మార్పిస్ రూ.220 చొప్పున విక్రయిస్తున్నారు. ఎమ్మార్పీకే అమ్మకాలు చేస్తుండటంతో మద్యం వ్యాపారులు కల్తీకి అలవాటు పడ్డారు. ఖరీదు మద్యం బాటిళ్లలో క్వార్టర్ రూ.50లు విలువ చేసే చీప్ లిక్కర్‌ను కలిపి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. చీరాల్లోని అన్నీ మద్యం దుకాణాల్లో కల్తీ మద్యం రాజ్యమేలుతోంది. అధిక ధరలు ఉన్న మద్యం బాటిళ్లల్లో హెచ్డీ, ఓటీతో పాటు కొన్ని బ్రాండ్లలో మంచినీరు పోసి విక్రయాలు చేస్తున్నారు. క్వార్టర్, ఆఫ్, ఫుల్ బాటిళ్లలో మరింత కల్తీ మద్యాన్ని విచ్చలవిడిగా కలుపుతున్నారు. కథ నడిపేది వీరే.. మద్యం దుకాణాల్లో కౌంటర్లో పనిచేసే వారే కల్తీ చేయడంలో సిద్ధ హస్తులు. ఫుల్ బాటిల్లో క్వార్టర్ మద్యాన్ని తీసేందుకు రబ్బరు ట్యూబుతో ప్రత్యేకంగా తయారు చేసిన యంత్రం ద్వారా సీల్ తీసి బాటిల్లోని మద్యం తీసేసి అందులో చీప్ లిక్కర్, వాటర్ కలిపి యథాస్థానంలో బాటిళ్లు ఉంచి అమ్మకాలు చేస్తున్నారు. తమ లాభాలు, బేటాల కోసం దుకాణం నిర్వహకులు, అటెండర్లతో కలిసి అక్రమాలు చేస్తున్నారు. కన్నెత్తి చూడని ఎక్సైజ్ అధికారులు చీరాల డివిజన్లో ఉన్న అన్నీ మద్యం దుకాణాల్లో మద్యం కల్తీ చేసి విక్రయిస్తున్నారని ఎక్సైజ్ అధికారులకు తెలిసినా దుకాణాల వైపు వెళ్లడం లేదు. అధికార పార్టీకి చెందిన నేతలు, వారి అనుయాయులకు చెందిన దుకాణాలు కావడంతో తనిఖీలు నిలిపేసి ఎక్సైజ్ అధికారులు మద్యం అమ్మకాలు ప్రోత్సహిస్తూ తమ వాటాలు పంచుకుంటున్నారు. కల్తీ మద్యం ఏరులై పారుతున్నా అడ్డుకట్ట వేయడంలో విఫలయ్యారు ఎక్సైజ్ అధికారులు. 24 గంటలూ మద్యం అమ్మకాలు చీరాల ప్రాంతంలో మద్యం అమ్మకాలకు నిర్ణీత సమయం, పగలు రాత్రి అన్న తేడాలు లేవు. మద్యం వ్యాపారాలను పెంచుకునేందుకు 24 గంటలూ దుకాణాలు తెరిచి అమ్మకాలు చేస్తున్నారు. ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం అమ్మకాలు చేయాల్సి ఉండగా దుకాణదారులు మాత్రం తెల్లవారు జాము 4 గంటలకు టీ దుకాణాల మాదిరిగా రాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్మకాలు చేస్తున్నారంటే కల్తీ వ్యాపారం ఏ విధంగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం:నాసరయ్య, సీఐ, ఎక్సైజ్ చీరాల సబ్ డివిజన్లోని మద్యం దుకాణాలు, బార్లలో మద్యం కల్తీ చేసి అమ్మకాలు చేస్తుంటే ఫిర్యాదు చేయవచ్చు. దుకాణాల్లో అమ్మే మద్యంపై అనుమానం ఉంటే వాటిని పరీక్షలు చేయిస్తాం. కల్తీ మద్యం అమ్మకుండా చర్యలు చేపడతాం. కల్తీ మద్యం అమ్మితే దుకాణాన్ని సీజ్ చేస్తాం. -
దినసరి కూలీ నుంచి ఎక్సైజ్ ఎస్సైగా....
రాజానగరం/రాజమహేంద్రవరం రూరల్ : కష్టే.. ఫలి అన్నారు పెద్దలు, అది నిజమేనని నిరూపించాడు రాజానగరం మండలం, నరేంద్రపురానికి చెందిన ప్రగడ వీరేంద్ర అనే యువకుడు. ప్రస్తుతం రాజమహేంద్రవరం రూరల్ మండలం, శాటిలైట్‌సిటీలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేస్తున్న ఈ యువకుడు 2016 గ్రూప్– 2లో 316 మార్కులు సాధించి ఎక్సైజ్ సబ్ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. దినసరి కూలీ నుంచి ఎక్సైజ్ ఎస్సైగా.. తండ్రి ప్రగడ పద్దరాజు వ్యవసాయ కూలీ, అతడికి ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు సంతానం కాగా, అమ్మాయికి వివాహం చేశాడు. అబ్బాయిలకు పెద్దగా చదువులు చెప్పించలేకపోయాడు. ఆ తరుణంలో కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా తనకు ఉన్నత చదువులు చదువుకోవాలనే ఆకాంక్ష ఉన్నా వీరేంద్రకు పదో తరగతితోనే చదువుకు స్వస్తి చెప్పవలసి వచ్చింది. తండ్రితో పాటు కూలీకి పోతూ తన లక్ష్యాన్ని ఏవిధంగా సాధించాలనే ఆలోచనతో నిత్యం ఉండేవాడు. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్‌ని ప్రైవేట్‌గా పూర్తి చేశాడు. అదే సమయంలో సైకిల్‌పై పాలను సేకరించే అవకాశం రావడంతో ఆ పనిని చేస్తూ తద్వారా పరిచయమైన రాజానగరంలోని ఉపాధ్యాయుడు బి. కామేశ్వరరావు(చిన్న మాస్టారు) సలహాలు, సూచనలు తీసుకుంటూ గణితంతో బీఏ చేసి, ఉపాధ్యాయ శిక్షణను పూర్తి చేశాడు. అయితే ఆంగ్ల భాషలో సరైన పట్టులేక మాట్లాడే సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు హైదరాబాద్ వెళ్లి ఒక ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పగలంతా పని చేస్తూ రాత్రి సమయంలో ఆంగ్ల భాషపై పట్టు సాధించే దిశగా శిక్షణ తీసుకునేవాడు. ఇదే సమయంలో జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)లో డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ పడడంతో దరఖాస్తు చేసి, కొవ్వూరు బ్రాంచ్‌లో డెవలప్మెంట్ ఆఫీసర్‌గా 2008లో చేరి 2010 వరకు పని చేశాడు. అనంతరం 2008 డీఎస్సీలో అర్హత సాధించడం ద్వారా 2010లో ఉపాధ్యాయ ఉద్యోగాన్ని అందుకుని రాజమహేంద్రవరం రూరల్ మండలం శాటిలైట్ సిటీలోని ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడి భార్య కూడా ఉపాధ్యాయురాలే కావడంతో గ్రూప్ పరీక్షల వైపు దృష్టిని సారించి, ఎక్సైజ్ ఎస్సైగా ఎంపికయ్యాడు. ఇందుకు సంబంధించిన ఆదేశాలను శనివారం అందుకున్నాడు. అతడి తమ్ముడు మాత్రం ఎలిమెంటరీ చదువుతోనే స్వస్తి పలికి అదే గ్రామంలో ప్లంబింగ్ వర్కు చేస్తున్నాడు. తనకు పరిచయమైన వారంతా తన ఆశయాన్ని గౌరవించి ప్రోత్సహించడం వల్లనే తాను ఈ స్థాయిని అందుకోగలిగానని వీరేంద్ర తన విజయ రహస్యాన్ని తెలిపాడు. ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు తపనతో సాధన చేస్తేనే ఫలితం ఉంటుందన్నాడు. -
డ్రగ్స్ కేసులో చార్జిషీట్‌కు రంగం సిద్ధం!
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన పలువురు సినీ ప్రముఖుల డ్రగ్స్ వినియోగం, విక్రయం కేసులో ఎక్సైజ్ సిట్ చార్జి షీట్ వేసేందుకు సిద్ధమైంది. కోర్టు నుంచి అందిన ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా సిట్ అధికారులు చార్జిషీట్ రూపొందిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో దీన్ని కోర్టుకు సమర్పించనున్నారు. సిట్ విచారించిన వారిలో పూరీ జగన్నాథ్, రవితేజ, తరుణ్, నవదీప్, నందు, తనీష్, చార్మి, ముమైత్ ఖాన్, సుబ్బరాజు తదితరులు ఉన్నారు. విచారణలో ముగ్గురు సినీ ప్రముఖుల నుంచి రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలను సేకరించిన అధికారులు వాటిని ఫోరెన్సిక్ పరిశీలనకు పంపారు. తాజాగా ఫోరెన్సిక్ నివేదిక అందడంతో ఇద్దరు ప్రముఖులు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయిందనే ప్రచారం జరుగుతోంది. కానీ సిట్ అధికారికంగా దీన్ని ధ్రువీకరించలేదు. -
నకిలీ మద్యం ‘ముఠా’ గుట్టురట్టు!
కర్నూలు : నకిలీ మద్యం ముఠా గుట్టును ఎక్సైజ్ అధికారులు రట్టు చేశారు. జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏఈఎస్ ఆర్.వి.సుధాకర్, సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిఘా వేసి ఏపీ21 ఏఈ 8159 నంబరు గల టాటా సుమోలో తరలిస్తున్న 1400 మెక్‌డోవెల్స్ క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకుని రవాణాదారుడితో పాటు ఇద్దరు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తిమ్మాపురం కేంద్రంగా వ్యాపారం... ఎమ్మిగనూరు మండలం తిమ్మాపురం కేంద్రంగా నకిలీ మద్యం వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. గ్రామానికి చెందిన రంగస్వామి రెండేళ్లుగా ఈ దందా కొనసాగిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారుల విచారణలో వెలుగుచూసినట్లు సమాచారం. కృష్ణగిరి, గోనెగండ్ల, దేవనకొండ, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం మండలాల్లో బెల్టు దుకాణాలే లక్ష్యంగా ఈ వ్యాపారం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఎల్లాగౌడ్పై గతంలో పీడీ యాక్ట్... నకిలీ మద్యం వ్యాపారి ఎల్లా గౌడ్ గతంలో కూడా ఎక్సైజ్ అధికారులకు పట్టుబడి దాదాపు ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాడు. ఈయనపై పీడీ యాక్ట్ నమోదు కావడంతో కొంతకాలం పాటు వ్యాపారానికి విరామం ప్రకటించి అధికార పార్టీకి చెందిన నాయకుల అండతో రెండేళ్లుగా మళ్లీ ఈ దందాను కొనసాగిస్తున్నట్లు సమాచారం. నకిలీ మద్యం తయారీ ఇలా... రాయచూరు జిల్లా గిలకసుగూరు గ్రామానికి చెందిన ఎల్లాగౌడ్ అదే గ్రామంలో ఓ రహస్య ప్రదేశంలో మెక్‌డోవెల్స్ కంపెనీకి చెందిన పాత సీసాలను పెద్దఎత్తున పోగుచేసి కలర్ నీళ్లలో స్పిరిట్ కలిపి సీసాలకు నింపి ప్రత్యేక మిషన్‌తో ప్లాస్టిక్ మూతలు బిగించి జిల్లాలోని బెల్టు దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. మండలాల వారీగా ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకుని దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. బంటుపల్లె గ్రామానికి చెందిన బాలా గౌడ్, వీరాంజనేయులు దేవనకొండ మండలంలో బెల్టు షాపులకు స్పూరియస్ లిక్కర్ (విషపూరితమైన మద్యం) సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందడంతో ఎక్సైజ్ అధికారులు నిఘా వేసి పట్టుకున్నట్లు సమాచారం. రెండు నెలలుగా నిఘా... ఎక్సైజ్ అధికారులు తిమ్మాపురం రంగస్వామిపై రెండు నెలలుగా నిఘా ఉంచి ఈదులదేవరబండ నుంచి వెంబడించి బేతపల్లె గ్రామ సరిహద్దులో పట్టుకున్నట్లు తెలుస్తోంది. గిలకసుగూరు నుంచి మాధవరం చెక్‌పోస్టు మీదుగా జిల్లాలోకి నకిలీ మద్యం రవాణా అవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఐదుగురు కానిస్టేబుళ్లను గోనెగండ్ల మండలం గాజులదిన్నె ప్రాజెక్టు, దేవనకొండ మండలం ఈదులదేవరబండ దగ్గర కాపలా ఉంచి పక్కా సమాచారంతో నకిలీ మద్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎస్కార్ట్‌గా మరో వాహనంలో వెళ్తున్న ఏజెంట్లు బాలాగౌడ్, వీరాంజనేయులును అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న మద్యాన్ని పత్తికొండ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. ఎక్సైజ్ అధికారుల అదుపులో ఉన్న ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. చెక్‌పోస్టులకు ముందే సమాచారం... జిల్లా సరిహద్దు గ్రామాలకు గిలకసుగూరు ఆనుకుని ఉండటంతో కర్ణాటక పోలీసుల నిఘా కొరవడింది. దీంతో నకిలీ మద్యం రవాణాదారులు చెక్‌పోస్టులలో మామూళ్లు ముట్టజెప్పి వ్యాపారాన్ని య«థేచ్ఛగా సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలోని దాదాపు పది మండలాలను కేంద్రంగా చేసుకుని నెలకు రెండుసార్లు గిలకసుగూరు నుంచి బెల్టు దుకాణాలకు ఎల్లా గౌడ్ ఏజెంట్ల ద్వారా నకిలీ మద్యం సరఫరా చేస్తున్నట్లు సమాచారం. నకిలీ మద్యం తరలించే వాహనాల నంబర్లు చెక్‌పోస్టులో ఉన్న అధికారులకు ముందుగానే చేరవేస్తారు. దీంతో తనిఖీలు లేకుండానే అక్కడి అధికారులు వదిలేస్తుండటంతో నకిలీ మద్యం వాహనాలు జిల్లాలోకి యథేచ్ఛగా ప్రవేశిస్తున్నట్లు తెలుస్తోంది. -
పన్ను కట్టలేదని గీతకార్మికుల అరెస్టు
జనగామ అర్బన్: గీత కార్మికులను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టేషన్లో నిర్బంధించారు. సోమవారం జనగామ జిల్లా కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. జనగామకు చెందిన గీత కార్మికులు తాటి పన్ను కట్ట లేదన్న కారణంతో ఎక్సైజ్ సీఐ శేషగిరిరావు ఆదేశాల మేరకు ఎస్సై పవన్ తన సిబ్బందితో కలసి తాటి వనంలోకి వెళ్లారు. వనంలో ఉన్న బూడిద సత్యనారాయణ, పూజారి రమేశ్, బత్తిని ఉపేందర్, గంగాపురం సత్తయ్య, చిర్ర సత్తయ్యను అదుపులోకి తీసుకున్నారు. రూ.72 వేలు పన్ను చెల్లిస్తేనే బయటకు పంపుతామం టూ స్టేషన్లో నిర్బంధించారు. విషయం తెలుసుకున్న తెలంగాణ కల్లు గీత కార్మిక సం ఘం(టీకేజీకేఎస్) రాష్ట్ర సహాయ కార్యదర్శి బూడిద గోపి నేతృత్వంలో పలువురు ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్నారు. కార్మికులను అరెస్టు చేయడంపై అధికారులను నిలదీశారు. పన్ను చెల్లించ వద్దని మంత్రి టి.పద్మారావు వెల్లడించారని, అలాంటప్పుడు ఎందుకు అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల నిర్బం«ధం విషయాన్ని ఎక్సైజ్ సూపరింటెండెంట్ మహిపాల్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కార్మికులను సాయంత్రం విడిచిపెట్టారు. దీనిపై జనగామ ఎక్సైజ్ సీఐ శేషగిరిరావు వివరణ కోరగా గీత కార్మికులను అరెస్టు చేయలేదని, తమ విధి నిర్వహణలో భాగంగా బకాయి ఉన్న డబ్బుల కోసం స్టేషన్‌కు తీసుకుని వచ్చామని తెలిపారు. -
ఆరు కిలోల ఎండు గంజాయి పట్టివేత
నారాయణఖేడ్: మండలంలోని అనంతసాగర్ గ్రామంలో కుమ్మరి పుండ్లిక్ ఇంటిపై దాడి చేసి ఆరు కిలోల ఎండుగంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం తెలిపారు. సోమవారం రాత్రి నమ్మదగిన సమాచారం మేరకు గ్రామానికి చెందిన కుమ్మరి పుండ్లిక్ ఇంటిపై దాడి చేసినట్లు తెలిపారు. అతడి ఇంటిలో ఆరు కిలోల 100 గ్రాముల ఎండుగంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు న మోదు చేసినట్లు చెప్పారు. నిందితుడిని త్వరలో అరెస్టు చేస్తామన్నారు. కేసును ఖేడ్ ఎక్సైజ్ సీఐ మహేష్, ఎస్ఐ కిరణ్‌కుమార్ గౌడ్లకు అప్పగించామని సీఐ వివరించా రు. ఈ దాడుల్లో హెడ్ కానిస్టేబుళ్లు అలీం, సిద్ధయ్య, జాకబ్, సోమయ్య పాల్గొన్నారు. -
నాటు సారాకు కొత్త రెక్కలు
రాష్ట్రంలోని పల్లెల్లో నాటుసారా మళ్లీ గుప్పుమంటోంది. ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టినా, నల్లబెల్లం అమ్మకాలపై నిఘా పెట్టినా.. ‘చక్కెర’రూపంలో కొత్త రెక్కలు తొడుక్కుంటోంది. గోదావరి నది వెంట.. అడవి మొదట్లో.. వ్యవసాయ బావుల వద్ద గుడుంబాగా విరగకాస్తోంది. సారా, గుడుంబా తయారీకి కొంతకాలంగా దూరంగా ఉన్నవారంతా.. తిరిగి మళ్లీ సారా వైపు మళ్లుతున్నట్లు ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది. గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి ‘సాక్షి’ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రాన్ని గుడుంబారహితంగా మార్చడం కోసం ప్రభుత్వం కొంతకాలంగా కఠిన చర్యలు చేపడుతోంది. సారా తయారీపైనే ఆధారపడిన కుటుంబాల పునరావాసం కోసం ఆర్థిక సాయమూ చేస్తోంది. దీంతో కొంతకాలం పాటు నాటుసారా, గుడుంబాల తయారీ తగ్గినా.. ఇప్పుడు మళ్లీ పల్లెల్లోకి చొరబడుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా, నల్లబెల్లం అందకుండా కట్టడి చేసినా తయారీదారులు వెనక్కి తగ్గడం లేదు. బెల్లానికి ప్రత్యామ్నాయంగా నేరుగా చక్కెరనే వినియోగిస్తూ సారా తయారు చేస్తున్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ వంటి జిల్లాల్లో మొలాసిస్తో నాటుసారా కాస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంత జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో, రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న జిల్లాల్లో నాటుసారా తయారీ చాపకింద నీరులా విస్తరిస్తున్నట్లు ‘సాక్షి’క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది. ఖమ్మం జిల్లాలో జోరుగా..: పాత ఖమ్మం జిల్లా పరిధిలో ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం పట్టణం మినహా చుట్టూ ఉన్న మండలాల్లో గుడుంబా వ్యాపారం జోరుగా సాగుతోంది. నల్లబెల్లానికి బదులుగా చక్కెరతో గుడుంబా తయారీని మొదలుపెట్టింది ఈ ప్రాంతం వారేనని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఇక్కడి గుడుంబా స్థావరాలపై దాడులు చేసినప్పుడల్లా భారీగా చక్కెర నిల్వలు పట్టుబడుతుండడం గమనార్హం. కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో ఎక్సైజ్ అధికారులు నాటుసారా తయారీదారులను అదుపులోకి తీసుకుని విచారించగా.. నల్లబెల్లం బదులుగా చక్కెర వాడుతున్న విషయాన్ని వెల్లడించారు. దుమ్ముగూడెంతోపాటు చర్ల, భద్రాచలం, బూర్గంపాడు మండలాలు, అటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గుడుంబా తయారవుతోంది. అటవీ ప్రాంతంలోనే సారా తయారు చేసి.. ప్యాకెట్లలో నింపి మైదాన ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ఇక ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గుడుంబా మాఫియా సాధారణ గిరిజన కుటుంబాలు కాసిన నాటుసారాను సేకరించి.. ప్యాకెట్లలో నింపి టోకున విక్రయిస్తోంది. కొత్తగూడెం జిల్లా భద్రాచలం, కొత్తగూడెం పారిశ్రామికవాడతోపాటు సమీప పల్లెలు, మండల కేంద్రాల్లో కలిపి రోజుకు సుమారు 1,000 లీటర్ల గుడుంబా విక్రయాలు జరుగుతున్నట్లు అంచనా. చక్కెర ఎందుకంటే..? రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణల కారణంగా నల్లబెల్లం దొరకడం లేదు. ఎక్కడైనా దొరికినా కిలో రూ.90 నుంచి రూ. 110 దాకా పలుకుతోంది. అది కూడా నమ్మకస్తులైన వారికే విక్రయిస్తున్నారు. అదే చక్కెరకు ఎంతైనా దొరుకుతుంది. నల్లబెల్లంతో పోలిస్తే చౌకగా వస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో చక్కెర ధర రూ.45 వరకు ఉంది. అయితే వ్యాపారులు ఛత్తీస్‌గఢ్, ఏపీ రాష్ట్రాల నుంచి ఖండసారి చక్కెర (కాస్త నలుపుగా, నాణ్యత తక్కువగా ఉండే స్థానిక మిల్లుల చక్కెర)ను తీసుకొచ్చి రూ.35కే కిలో చొప్పున సారా తయారీదారులకు విక్రయిస్తున్నారు. దీంతో సారాకు చక్కెర వినియోగం పెరిగింది. అక్కడ 60 శాతం చక్కెర సారాకే! గుడుంబా తయారీకి చక్కెర వినియోగంపై ‘సాక్షి’బృందం భద్రాచలం పట్టణంలో పరిశీలన చేసింది. ఇక్కడ దాదాపు 12 హోల్‌సేల్ చక్కెర దుకాణాలు ఉన్నాయి. గతంలో వీరంతా కలిపి నెలకు ఆరు లోడ్ల (లోడుకు 17 టన్నుల) చక్కెర విక్రయించేవారు. కానీ కొద్దినెలలుగా నెలకు 16 లోడ్ల చక్కెర అమ్ముడుపోతోంది. అంటే 272 టన్నుల చక్కెర వినియోగం అవుతోంది. అయితే ఇందులో 60 శాతం చక్కెరను సారా తయారీ కోసం వినియోగిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లో మొలాసిస్తో.. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లోని నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల మొలాసిస్ (చెరుకు రసం నుంచి చక్కెర తయారు చేయగా మిగిలే మడ్డి)తో గుడుంబా తయారు చేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలతోపాటు వాటి సరిహద్దుల్లో ఉన్న నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో చెరుకు సాగు ఎక్కువ. ఖండసారి చక్కెర కర్మాగారాలు విస్తృతంగా ఉన్నాయి. వాటిలో చెరుకు నుంచి చక్కెర తీయగా మిగిలిన మొలాసిస్‌ను లీటర్ రూ.20 నుంచి రూ.25 వరకు విక్రయిస్తున్నారు. గుడుంబా తయారీదారులు ఈ మొలాసిస్‌ను కొనుగోలు చేసుకువెళ్లి.. గుడుంబా తయారుచేస్తున్నారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లాలోని మాగనూరు, కృష్ణా, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్, మనూరు, కంగ్టి, కల్హేర్, న్యాల్కల్ తదితర మండలాలు, నిజామాబాద్ జిల్లా భీంగల్, కమ్మర్పల్లి, మోర్తాడ్, సిరికొండ, ధర్పల్లి, జక్రాన్‌పల్లి తదితర మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లో నాటుసారా గుప్పుమంటోంది. అదిలాబాద్ జిల్లాలో జైనథ్, బోథ్, వాంకిడి, ఉట్నూర్ తదితర మండలాల్లో మొలాసిస్తో గుడుంబా తయారు చేస్తున్నారు. ఎక్సైజ్ అధికారుల వెనుకంజ! రాష్ట్రంలో గుడుంబా ఉత్పత్తి స్థాయిని కేసుల నమోదు ద్వారా అంచనా వేస్తుంటారు. కేసులు ఎక్కువగా నమోదైతే నాటుసారా విక్రయాలు ఎక్కువగా ఉన్నట్టు. లేకుంటే తయారీ లేనట్టే. దీంతో ఎక్సైజ్ అధికారులు తమ పరిధిలో సారా తయారీ లేదనిపించుకోవడం కోసం కేసులు నమోదు చేయడమే లేదని ఎక్సైజ్ వర్గాలు పేర్కొంటున్నాయి. గుడుంబా విక్రయిస్తూ పట్టుబడిన వారిని బెదిరించి వదిలేస్తున్నారని అంటున్నాయి. దాంతో సారా తయారీ నిరాటంకంగా సాగిపోతోంది. ఇలా చేస్తున్నారు? బిందెడు నీళ్లలో రెండు మూడు కిలోల చక్కెర కలిపి ద్రావణం తయారు చేస్తున్నారు. అందులో పాచిపోయిన అన్నం, తవుడు, టైర్లు, ట్యూబుల ముక్కలు వేసి కొన్ని రోజుల పాటు పులియబెడుతున్నారు. దానికి పలు రకాల రసాయనాలు కలిపి.. మరగబెట్టి గుడుంబా తయారు చేస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో, రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని వ్యవసాయ బావుల వద్ద ఇది నిరాటంకంగా జరిగిపోతోంది. -
పాల ప్యాకెట్ల తరహాలో మద్యం ప్యాకెట్లు!
సాక్షి, అమరావతి: టెట్రా ప్యాకెట్లలో మద్యం అమ్మాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. మద్యం అమ్మకాలలో అక్రమాలు అరికట్టేందుకు పాల ప్యాకెట్ల తరహాలో మద్యం ప్యాకెట్లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. కొత్త టెట్రా విధానాన్ని ఎక్సైజ్ శాఖ పరిశీలిస్తోంది. ఈమేరకు మహారాష్ట్రలోని పుణేలో మద్యం ప్యాకెట్లను ఉత్పత్తి చేసే కంపెనీని పరిశీలించేందుకు అడిషనల్, జాయింట్ కమిషనర్లు ఆదివారం అక్కడికి వెళ్లారు. చీప్ లిక్కర్‌ను 180 ఎం.ఎల్ ప్యాకెట్లలో సరఫరా చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం అమలు అవుతున్న ప్యాకెట్ విధానం విజయవంతం కాకపోవడంతో మద్యం అమ్మకాలు పెంచుకునేందుకు పాల ప్యాకెట్ తరహా టెట్రా ప్యాకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని తలుస్తోంది. -
తాగినోళ్లకు తాగినంత!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కుంభమేళా మేడారం జాతరలో ఏర్పాట్లు ఎలా ఉన్నా.. మందుకు మాత్రం ఎలాంటి ఇబ్బంది రాకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్త పడింది. మేడారం పరిసర ప్రాంతాల్లో వారం రోజుల పాటు తాత్కాలిక బార్లకు అనుమతి ఇచ్చింది. ఎమ్మా ర్పీ నిబంధనలను సడలించి దుకాణదారుడు ఇష్టం వచ్చిన ధరకు మద్యం అమ్ముకునే వెసులుబాటు కల్పించింది. గిరిజనుల పేర్ల మీద గిరిజనేతర లిక్కర్ మాఫియా ఈ బార్లను దక్కించుకుంది. రోజుకు రూ.9 వేల లైసెన్స్ ఫీజు మేడారం జాతరలో ఈవెంట్ పర్మిట్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 22 తాత్కాలిక బార్లను అనుమతించింది. రోజుకు రూ.9 వేల లైసెన్స్ ఫీజుతో స్థానిక గిరిజనుల పేరు మీద వీటిని ఇచ్చింది. ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు వారం రోజులపాటు వీటిని నిర్వహించుకోవచ్చు. మేడారం, మేడారం చెరువు, నార్లపూర్, ఊరట్టం, కన్నెపల్లి, ఎల్బాక క్రాస్ రోడ్డు, రెడ్డిగూడెం, కొత్తూరు, చింతల్ క్రాస్ రోడ్డు తదితర గ్రామాల పరిధిలో బార్లను అనుమతించింది. వాస్తవిక మద్యం ధర మీద 30 శాతం అదనపు రేటుతో టీఎస్‌బీసీఎల్ తాత్కిలిక బార్లకు సరఫరా చేస్తుంది. ప్రభుత్వం నుంచే ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేస్తున్నారు, ఎమ్మార్పీ ధరకే మద్యం విక్రయిస్తే వారికి గిట్టుబాటు కాదు కాబట్టి.. ఆ నిబంధన ఎత్తివేసినట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఒక్క రోజులో రూ.2.5 కోట్ల మద్యం విక్రయం వాస్తవానికి ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకే మద్యం దుకాణాలు ఇవ్వాలనే నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో గిరిజనేతర లిక్కర్ మాఫియా స్థానిక గిరిజనుల పేరు మీద బార్లను దక్కించుకుంది. దీనికి ఎమ్మార్పీ నుంచి సడలింపు ఉండటంతో ఇష్టం వచ్చిన కాడికి దండుకుంటున్నారు. 28న అనుమతి పొందిన దుకాణాలు 29వ తేదీ ఒక్కరోజే రూ.2.5 కోట్ల విలువైన మద్యం విక్రయించినట్లు ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధాన జాతర జరిగే రోజుల్లో భారీగా లిక్కర్ వ్యాపారం జరగవచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు స్థానిక మద్యం డిపోల్లో ప్రజలు ఎక్కువగా తాగే మద్యం బ్రాండ్లకు ఏ లోటు రాకుండా ఏర్పాట్లు చేశారు. -
‘పునరావాసం’లో పదనిసలు..
సాక్షి, వరంగల్ రూరల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో గుడుంబా పునరావాస పథకం అమలులో ఎక్సైజ్ అధికారులు పారదర్శకంగా వ్యవహరించడం లేదు. ఎక్సైజ్ సీఐ, ఎంపీడీఓ, మండల పశువైద్యాధికారి.. లబ్ధిదారులతో కలిసి జీవాలు, సామగ్రి కొనుగోలు చేయాల్సి ఉండగా.. ఈ నిబంధనను తుంగలో తొక్కేశారు. గొర్రెలు, గేదెల పంపిణీలో, కిరాణా దుకాణాల ఏర్పాటులో ఏకపక్షంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. గొర్రెలను, గేదెలను కొనుగోలు చేసి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు తీసుకొచ్చి ఇచ్చారు. కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసిన వారికి కూడా సామాగ్రి ఇప్పించారే తప్ప రూ.2లక్షల యూనిట్‌కు సంబంధించి ఎక్కడా లెక్కలు చెప్పలేదు. అధికారులు ముందే కమీషన్లు మాట్లాడుకొని లబ్ధిదారులకు అంటగట్టినట్టు తెలుస్తోంది. పునరావాసం ఇలా.. సారా తయారీని పూర్తిగా మానేసిన వారికి జీవనోపాధి చూపిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన హామీమేరకు గుడుంబా తయారీకి దూరంగా ఉన్న వారికి గొర్రెలు, బర్రెలు, ఆవులు, ఆటో రిక్షాలు, ఆటో ట్రాలీలు, కిరాణం షాప్, చెప్పుల షాప్, చికెన్ సెంటర్, స్టీల్ సిమెంట్ షాప్‌ల ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థికంగా సాయం చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.2లక్షల చొప్పున అందించి పునరావాసం కల్పించారు. పునరావాసం పథకం కింద ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 1038 మందిని ఎంపిక చేయగా, ఇప్పటివరకు 997 మందికి ఆర్థికసాయం అందజేశారు. అడిగితే వేధింపులు గతంలో సారా తాగేవారి ఇండ్లలోనే కాదు... తయారీదారుల ఇండ్లల్లో కూడా సంతోషం కరువయ్యేది. సారా తాగి మరణించిన వారి ఇండ్లల్లో ఏడుపులు పెడబొబ్బలు వినిపిస్తే... సారా తయారుచేసిన వారి ఇండ్లల్లో కూడా అలాంటి రోదనలే కనిపించేవి. సారా తాగి ఇబ్బందులు పడ్డ కుటుంబాల వారు తయారీదారులపై దాడులు చేసి శాపనర్ధాలు పెట్టేవారు. దానికి తోడు ఎక్సైజ్ అధికారుల దాడులు నిర్వహించి సారా తయారీదారుల భరతం పట్టి జైలుకు పంపేవారు. అది తప్పు అని తెలిసినా తయారీదారులు గుడుంబా తయారు చేయడం మానేవారు కాదు. ఎందుకంటే వారికి అదే జీవనాధారం. సారా తయారుచేసి దొంగ చాటున విక్రయిస్తే తప్పా కుటుంబం గడవలేని పరిస్థితి. తయారుదారులపై దాడులు చేసి జైల్లో పెట్టినా.. జైలు తిండి తిన్నా పర్వాలేదని మళ్లీ వచ్చిన తరువాత ప్రారంభించేవారు. మూడు పుటల పట్టెడన్నం తినాలంటే సారా తయారు చేయాల్సిందే. దీంతో ఎక్సైజ్ శాఖాధికారుల కన్నుపడని చోట తయారుచేసి గుట్టల్లో, పొలాల్లో తయారుచేసి చాటుమాటున విక్రయించేవారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం గుడుంబా నిర్మూలనకు శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగా గుడుం బా తయారీ, విక్రయాలను అరికట్టందుకు చేపట్టాల్సిన చర్యలపై దృష్టిసారించింది. వారికి స్వయం ఉపాధి కల్పించడంతోపాటు గుడుంబా అరికట్టేందుకు పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఇంతవరకు భాగానే ఉన్నా.. పునరావాస పథకంలో పలువురు అధికారులు అవినీతికి పాల్పడుతుం డడంతో సర్కారు లక్ష్యం నీరుగారులతోంది. రూ.2 లక్షల విలువైన సామగ్రి, జీవాల కొనుగోళ్లకు సంబంధించి రశీ దులు అడిగిన లబ్ధిదారులకు వేధింపులు తప్పడం లేదు. వరంగల్ రూరల్ జిలాకు చెందిన ఓ వ్యక్తి కొన్నేళ్లుగా గుడుంబా తయారుచేశాడు. ఇప్పటి వరకు ఎక్సైజ్ పోలీసులు సుమారు పదుల సంఖ్యలో కేసులు పెట్టారు. ఇంకా ఒకలో, రెండో కేసులు ఉన్నాయి. గత సంవత్సరం ఆగస్టులో పునరావాసం కింద అతడికి రూ.2లక్షలతో ఆటో అందించారు. దీంతో నెలకు రూ.4వేల వరకు సంపాదిస్తున్నాడు. ఇది వరకు పోలీసులు వస్తున్నారంటే భయంతో జీవనం గడిపేవాడు. ఇప్పుడు కుటుంబసభ్యులతో ఆనందంగా ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇటీవల ఆటోకు ఎంత అయింది సారు.. రశీదులు ఇవ్వలేదని అడిగితే ఎక్సైజ్ అధికారులు అతడిని వేధింపులు గురిచేశారు. గత కేసులు తోడుతారనే భయంతో సదరు వ్యక్తి సైతం కిమ్మనకుండా ఉన్నట్లు తెలిసింది. ఎలా అంటే.. గుడుంబా తయారీ దారులు, విక్రయించే కుటుంబాలకు ప్రభుత్వం స్వయం ఉపాధి కింద పాడిగేదెలు, గొర్రెల వంటి జీవాలు కొనుగోలు చేసి ఇస్తోంది. ఈ డబ్బులు ఎంపీడీఓ ఖాతాల్లో పడుతున్నాయి. నిబంధనల ప్రకారం ఎక్సైజ్ సీఐ, ఎంపీడీఓ, మండల పశువైద్యాధికారి.. లబ్ధిదారులతో కలిసి జీవాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కానీ.. అధికారులు ఎవరికి తెలియకుండా ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసి లబ్ధిదారులకు అందజేస్తున్నారు. రశీదులు ఇవ్వకపోగా.. అడిగిన వారిని వేధిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చికెన్ సెంటర్లు, కిరాణాషాపులు ఏర్పాటు చేసుకునే వారికి సామగ్రి కొనుగోళ్ల సైతం అధికారులే చేస్తున్నారు. వీరికి ఒక్కొక్కరికి రూ.2 లక్షలు అందితే.. అందులో రూ. 20,000 నుంచి రూ. 50,000 వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అవినీతికి ఆస్కారం లేదు.. గుడుంబా విక్రయం, తయారీ మానేసిన కుటుంబాలకు పునరావాస పథకం ద్వారా రెండు లక్షల రూపాయలు అందిస్తున్నాం. పథకం దుర్వినియోగం కాకుండా ప్రతి నెలా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి తనిఖీ చేపడుతున్నాం. పూర్తి పారదర్శకంగా జిల్లా కలెక్టర్ సౌజన్యంతో సంక్షేమాధికారులు చెక్‌లను అందిస్తున్నారు. అవినీతికి, దుర్వినియోగానికి ఆస్కారం లేదు. వరంగల్ అర్బన్‌లో 236 మంది ఎంపిక కాగా, ఇప్పటికే 201 మందికి పథకాన్ని అందించాం. బాలస్వామి, ఎక్సైజ్ సూరింటెండెంట్, వరంగల్ అర్బన్ -
గుడుంబా సొమ్ము గుటుక్కు!
సాక్షి, నెట్వర్క్: వారందరికీ గుడుంబా తయారీనే ఉపాధి.. చట్ట వ్యతిరేకమని తెలిసినా చేసేదేమీ లేక దానితోనే పొట్టబోసుకోవాల్సిన పరిస్థితి.. పట్టుబడినప్పుడల్లా కేసులు.. పోలీస్ స్టేషన్ల మెట్లెక్కడం.. జరిమానాలు.. జైలుశిక్షలు మామూలే..! ఎన్నో ఏళ్లుగా ఇలా దుర్భర జీవితాలు గడుపుతున్న వారి బతుకుల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన పథకానికి సైతం అక్రమాల చీడ పట్టుకుంది. అధికారుల ఆమ్యామ్యాలతో లబ్ధిదారులకు అందాల్సిన సొమ్ము పక్కదారి పడుతోంది. ‘గుడుంబా ఆధారిత కుటుంబాల పునరావాస పథకం (జీఈపీఆర్‌ఎస్)’ లబ్ధిదారులను ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పలకరించగా అనేక విస్మయకర అంశాలు వెలుగుచూశాయి. ఎక్కువ మాట్లాడితే.. పేరు తీసేస్తాం.. గుడుంబా తయారీదారులకు జీఈపీఆర్‌ఎస్ కింద రూ.2 లక్షలతో ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం ఆదేశిస్తే.. అందులో అధికారులే చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఏ జిల్లాలో చూసినా లబ్ధిదారులకు రూ.2 లక్షల లబ్ధి చేకూరిన దాఖలాలు కనిపించడం లేదు. రూ.లక్ష లేదా లక్షన్నర వరకు మాత్రమే ఇస్తున్నారు. ఇదేంటని అడిగితే.. ‘అదంతే.. ఎక్కువగా మాట్లాడితే జాబితా నుంచి పేర్లు తొలగిస్తాం. ఉన్న సామగ్రి రికవరీ చేసి వేరే వారిని ఎంపిక చేస్తాం’అని దబాయిస్తున్నట్లు పలువురు లబ్ధిదారులు వాపోయారు. పలు జిల్లాల్లో సామగ్రిని అధికారులే కొనుగోలు చేసి దొంగ బిల్లులు ఇచ్చిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. పలువురు లబ్ధిదారులు సాయం కోసం ఇంకా నిరీక్షిస్తూనే ఉన్నారు. అవినీతికి తెరలేచిందిలా.. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లేమి కారణంగా పథకంలో అవినీతి చోటుచేసుకుంది. ఫలితంగా లబ్ధిదారులకు రుణాలు సరైన రీతిలో అందడం లేదు. ఎక్సైజ్ అధికారులతోపాటు ఎంపీడీవో జాయింట్ సర్వే చేసి రుణాలు అందించాల్సి ఉంది. రుణ లబ్ధిదారుల ఎంపిక, ఆయా కార్పొరేషన్ల నుంచి వచ్చిన చెక్కుల అందజేత వంటి అంశాలు ఎక్సైజ్ సీఐ స్థాయి అధికారితోపాటు ఎంపీడీవోలు పర్యవేక్షించాల్సి ఉంది. రుణాల మంజూరుకు చెందిన గ్రౌండింగ్‌పై ఎంపీడీవో, ఎౖMð్సజ్ అధికారులు ఎప్పటికప్పుడు జాయింట్ సర్వేలు చేయాలి. కానీ కొందరు ఎంపీడీవోలు నామమాత్రంగా వ్యవహరించడంతో ఎక్సైజ్ అధికారులు కమీషన్ల దందాలకు తెరలేపారు. ఫలితంగా రుణాల మంజూరులో అవకతవకలు చోటుచేసుకున్నాయి. ఇదిగో మరకలు.. పథకం కింద జగిత్యాల జిల్లా మెట్పల్లి ఎక్సైజ్ సర్కిల్‌కు 46 యూనిట్లను కేటాయించారు. ఒక్కో యూనిట్‌కు రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.92 లక్షలు విడుదల చేశారు. దీంతో లబ్ధిదారులు కిరాణం, బ్రిక్స్, కూల్‌డ్రింక్స్, గొర్రెలు, గేదెల పెంపకం తదితర వ్యాపారాలను ఏర్పాటు చేసుకున్నారు. వీటిలో 17 కిరాణా దుకాణాలకు సంబంధించి స్థానిక ఎక్సైజ్ సిబ్బంది అవినీతికి పాల్పడినట్లు ఉన్నతాధికారుల విచారణలో బయటపడింది. స్థానిక సీఐ, ఎస్సైలు అవినీతికి పాల్పడ్డారని తేలడంతో వారిపై వేటు వేశారు. ఎన్నెన్నో అక్రమాలు - పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన పి.శ్రీనివాస్‌కు టెంట్‌హౌస్ పెట్టుకోవడానికి ఎక్సైజ్ పోలీసులు రూ.2 లక్షల విలువైన సామగ్రి ఇప్పించారు. 2017 ఆగస్టు 28న హైదరాబాద్ నుంచి సామగ్రి తీసుకొచ్చి టెంట్‌హౌజ్ ప్రారంభించారు. కానీ ఆ సామగ్రి అంతా కలిపి రూ.1.20 లక్షలు మాత్రమే విలువ చేస్తుందని, అధిక రేట్లు వేసి సొమ్ము చేసుకున్నారని శ్రీనివాస్ చెబుతున్నాడు. - కుమ్రం భీం జిల్లాలో నలభై మంది లబ్ధిదారులను గుర్తించారు. అందులో తొలివిడతగా గతేడాది జూలైలో 19 మందికి యూనిట్లు అందజేశారు. 15 మందికి రూ.లక్ష చొప్పున, నలుగురికి రూ.2 లక్షల చొప్పున అందించారు. అయితే ఇందులో మేకలు, గొర్రెల యూనిట్ల పంపిణీలో అవకతవకలు జరిగాయి. రూ.లక్ష విలువైన 20 గొర్రెలు/మేకలు పంపిణీ చేయగా.. కొద్దిరోజుల్లోనే వాటిల్లో సగానికిపైగా మృత్యువాత పడ్డాయి. ఇన్సూరెన్స్ కోసమని రూ.ఐదు వేలు వసూలు చేసినా.. ఇన్సూరెన్స్ చేయించలేదు. ఇదీ పథకం.. రాష్ట్రంలో సారా/గుడుంబా వాసన లేకుండా చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగానే కిందటేడాది మార్చిలో జీఈపీఆర్‌ఎస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద గుడుంబా తయారీదారులు చిన్న తరహా వ్యాపారాలు చేసుకునేలా రూ.2 లక్షలు మంజూరు చేస్తారు. ఆ మొత్తంతో కిరాణా దుకాణాలు, టెంట్‌హౌస్‌లు, చికెన్ షాపులు, బట్టల వ్యాపారం, సూపర్ మార్కెట్లు వంటివి ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాల వారిని లబ్ధిదారులుగా గుర్తించి బ్యాంకుల నుంచి కాకుండా ఆయా కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందజేస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికకు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కమిటీ ఉంటుంది. ఇందులో ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఎస్పీ, డీఆర్డీవో, జిల్లా బీసీ, గిరిజన సంక్షేమశాఖ అధికారి, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి, స్త్రీ, శిశు సంక్షేమం, అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖల అధికారులు ఉంటారు. ఉచితంగా ఇస్తున్నాం.. ఏదో ఒకటి తీసుకో.. ఈ ఫొటోలో ఆవుకు నీళ్లు తాగిస్తున్న వ్యక్తి మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేటకు చెందిన ప్రభాకర్. ఆయనకు గుడుంబా పునరావాస పథకం కింద రూ.2 లక్షలతో యూనిట్ మంజూరు చేశారు. మూడు పాడి ఆవులు ఇప్పిస్తామని చెప్పారు. ఏడాదిపాటు తిరిగాక.. చిత్తూరు జిల్లా పులమనూర్లో మధ్యవర్తి ద్వారా ఆవులు ఇప్పించారు. ఇవి బలహీనంగా ఉన్నాయంటే.. ‘ఉచితంగా వస్తున్నప్పుడు ఏదో ఒకటి తీసుకో’అంటూ దబాయించారు. చికెన్ సెంటర్‌కు రూ.2 లక్షలా? ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు కుందారపు చంద్రయ్య. గోదావరిఖనిలోని జీఎం కాలనీ. ప్రభుత్వం గుడుంబా పునరావాసం కింద చికెన్ సెంటర్ పెట్టుకోవాలని నిర్ణయించాడు. చంద్రయ్యకు రూ.2 లక్షలు మంజూరయ్యాయి. దీంతో అధికారులు కోళ్లను ఉంచే ఇనుప జాలి, ఈకలు పీకే యంత్రం, చికెన్ కొట్టే కర్ర మొద్దు, కత్తులు, ఫ్రిడ్జ్ కొనిచ్చారు. కానీ తర్వాత లెక్కలు వేస్తే అన్నీ కలిపి రూ.60 వేలకు మించవని తేలింది. మిగతా డబ్బుల కోసం అధికారుల వద్దకు వెళితే.. మొత్తం సొమ్ము ఆ సామగ్రికే ఖర్చయిందని చెప్పి పంపేశారు. అడిగితే స్కీం రద్దు చేస్తామన్నరు ఈయన పేరు దోరి ఐలయ్య. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం లక్కారం. జీవనోపాధి కల్పిస్తామని అధికారులు చెబితే గుడుంబా అమ్మడం మానేశాడు. పిండి గిర్ని నడుపుకొంటానంటే ప్రభుత్వం రూ.2 లక్షలు మంజూరు చేసింది. కానీ అధికారులు ఇచ్చిన సామగ్రి విలువ రూ.60 వేలకు మించి ఉండదు. ఇదేమిటని అడిగితే స్కీం రద్దు చేసి వేరే వారికి ఇస్తామని అధికారులు బెదిరించారని ఐలయ్య వాపోతున్నాడు. జీఎస్టీ కింద రూ.36 వేలు కట్..! ఈయన పేరు బల్వీందర్‌సింగ్. రాజన్న సిరిసిల్ల సిక్కువాడి. ఏడుగురు పిల్లలు. జీవనోపాధి కోసం 15 ఏళ్లుగా సారా అమ్ముతున్న బల్వీందర్‌పై ఐదారు సార్లు కేసులు నమోదయ్యాయి. సారా అమ్మడం మానేయడంతో రూ.2 లక్షలు మంజూరయ్యాయి. దాంతో అధికారులు రెండు వెల్డింగ్ మిషన్లు, డ్రిల్లింగ్, గ్రైండర్, షెటర్ ఫిటింగ్ మిషన్లు కొనివ్వగా.. బల్వీందర్ మరో రూ.50 వేలు ఫైనాన్స్‌లో తెచ్చుకుని ఇతర పరికరాలు కొనుక్కున్నాడు. కానీ అధికారులు రెండు లక్షల సాయంలో జీఎస్టీ అని రూ.36 వేలు కట్ చేసుకున్నారని వాపోతున్నాడు. -
‘బెల్టు’ జోలికి వెళ్లొద్దు
సాక్షి, అమరావతి: సంక్రాంతి పండుగ నేపథ్యంలో పల్లెల్లో మద్యం ఏరులై పారుతోంది. మద్యం దుకాణాలు లేని గ్రామాల్లో కూడా అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో బెల్టు షాపులు నడుస్తున్నాయి. చివరకు మెడికల్ షాపుల్లో సైతం మద్యం అమ్మకాలు యథేచ్చగా సాగుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వీటిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో బెల్టుషాపులపై దాడులు చేస్తున్న ఎక్సైజ్ అధికారులకు మద్యం వ్యాపారులు, అధికార పార్టీ నేతల నుంచి బెదిరింపులు తీవ్ర స్థాయిలో వస్తున్నాయి. మద్యం షాపులు, బెల్టు షాపుల జోలికి వెళ్లొద్దంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులే బెదిరింపులకు దిగుతున్నారు. బెల్టు షాపులపై పలు జిల్లాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ విభాగం శుక్రవారం పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. దీంతో అధికార పార్టీ నేతలు, మద్యం సిండికేట్లకు చిర్రెత్తుకొచ్చింది. ‘మామూళ్లు ఇవ్వలేదనే దాడులు చేస్తున్నారంటూ ఎక్సైజ్ కమిషనర్‌కు ఫిర్యాదులు చేస్తాం.. తర్వాత మీ ఇష్టం’ అంటూ ఎక్సైజ్ అధికారులను బెదిరించారు. ఫిర్యాదు ఆధారంగా తమను ఎక్కడ సస్పెండ్ చేస్తారోననే భయంతో అధికారులు సెలవుపై వెళ్లాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఆ షాపు వైపు చూస్తే తాట తీస్తా.. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం తిర్లంగి గ్రామంలోని ఓ పాన్ షాపులో బెల్టు షాపు నిర్వహిస్తున్నారు. దీని వల్ల తమ గ్రామంలో శాంతి భద్రతల సమస్య ఏర్పడుతోందని ఆ గ్రామస్తులు ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంట్ విభాగానికి ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల ఫిర్యాదుతో టాస్క్ఫోర్సు అధికారులు దాడి చేసి.. నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. వీరికి ఎక్కడి నుంచి మద్యం సరఫరా అవుతుందో ఆరా తీసి సంబంధిత మద్యం షాపును సీజ్ చేసేందుకు అధికారులు ప్రయత్నించగా.. వెంటనే శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ మంత్రి నుంచి వారికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ మద్యం షాపుపై కేసు నమోదు చేస్తే తాట తీస్తానని ఆ మంత్రి బెదిరింపులకు దిగినట్లు తెలిసింది. ప్రజల ఇబ్బందుల కన్నా మద్యం సిండికేట్ నిర్వాహకుడైన తన అనుచరుడి అక్రమ వ్యాపారమే ప్రధానమని ఆ మంత్రి బెదిరింపులకు దిగడంతో ఆ శాఖ ఉన్నతాధికారులు షాక్‌కు గురయ్యారు. ఎక్సైజ్ మంత్రి ఇలాకాలోనూ.. ఎక్సైజ్ మంత్రి జవహర్ సొంత జిల్లా అయిన పశ్చిమగోదావరిలో సంక్రాంతి సీజన్లో బెల్టు షాపులు ఏర్పాటు చేసుకునేందుకు వేలం పాటలు నిర్వహించారు. కొందరు రూ.లక్షల్లో వేలం పాడి బెల్టు షాపులు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో బెల్టు షాపుల జోలికొస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని జిల్లాకు చెందిన వివాదాస్పద ఎమ్మెల్యే ఒకరు ఎక్సైజ్ అధికారులను బెదిరించినట్లు తెలిసింది. - గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో బెల్టు షాపులు ఇబ్బడి ముబ్బడిగా ఏర్పాటు చేశారు. చివరకు మెడికల్ షాపుల్లో సైతం మద్యం అమ్ముతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సీనియర్ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే ఇక్కడ మద్యం దందా జరుగుతున్నట్లు తెలిసింది. కాగా, ఇక్కడి బెల్టు షాపులపై మహిళల నుంచి ఫిర్యాదులు రావడంతో ఎక్సైజ్ అధికారులు దాడులు చేసేందుకు వెళ్లగా.. సీనియర్ ఎమ్మెల్యే వారిని తీవ్ర స్థాయిలో బెదిరించారు. - చిత్తూరు జిల్లాలో బెల్టు షాపులు ఏర్పాటు చేసుకునేందుకు మద్యం సిండికేట్లు ఓ మంత్రిని ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ఆ మంత్రి చూసీ చూడనట్లు వదిలేయాలని ఎక్సైజ్ అధికారులకు ఆదేశాలిచ్చారు. మార్జిన్ ఇవ్వట్లేదుగా.. మద్యం వ్యాపారం చేసినందుకు ప్రభుత్వం వ్యాపారులకు 7 శాతం మార్జిన్ ఇస్తుంటుంది. అంటే రూ.వంద మద్యం అమ్మితే వ్యాపారికి ఏడు రూపాయలు దక్కుతాయి. ఈ మార్జిన్ శాతం పెంచాలని వ్యాపారులు కోర్టుల్లో కేసులు వేశారు. దీన్ని కూడా టీడీపీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకొని అధికారులను బెదిరిస్తున్నారు. మద్యం వ్యాపారులకు ప్రభుత్వం ఎక్కువ కమీషన్ ఇవ్వట్లేదని, అందువల్ల అక్రమ మద్యం వ్యాపారానికి అడ్డు వెళ్లొద్దని ఎక్సైజ్ అధికారులను హెచ్చరిస్తున్నట్లు సమాచారం. -
డ్రగ్స్ రాకెట్ నిందితుడికి బెయిల్
సాక్షి, హైదరాబాద్: ఇటీవల సినీరంగాన్ని కుదిపేసిన డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలోని ప్రధాన నిందితుడు మైక్ కమింగకు హైకోర్టు ఊరటనిచ్చింది. ఎక్సైజ్ పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేలతో రెండు పూచీకత్తు సమర్పించాలని, దేశం విడిచి వెళ్లకూడదని పలు షరతులు విధించింది. ప్రతీ రెండో శనివారం సంబంధిత పోలీసుల ముందు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో ఎక్సైజ్ పోలీసులు డచ్ దేశస్తుడైన కమింగను జూలై 26న అరెస్ట్ చేసి, అతని ఇంటి నుంచి కొన్ని మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అప్పటినుంచి అతను జైలులోనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో కమింగ తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. పిటిషనర్ తరఫు న్యాయవాది శివరాజు శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. కమింగ ఇంటిలో సోదాలు జరిపి డైమిథిల్ ట్రైపటమైన్ (డీఎంటీ)ని స్వాధీనం చేసుకున్నారని.. ఆ సమయంలో ఎక్సైజ్ అధికారులు తమ సొంత కానిస్టేబుళ్లను సాక్షులుగా చూపారని అన్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని వివరించారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ను ఇప్పటివరకు నిర్ధారించ లేదని వెల్లడించారు. దీనిపై న్యాయమూర్తి ఎక్సైజ్ అధికారుల వివరణ కోరగా.. ఎఫ్ఎస్ఎల్ నివేదికను సమర్పిస్తామని చెప్పారు. సోమవారం నాటి విచారణకు ఈ రిపోర్టును అధికారులు కోర్టుకు అందజేయలేకపోయారు. నివేదిక సమర్పణకు తమకు మరింత గడువు కావాలని కోరారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం కమింగకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. -
లూజు వదిలి.. బెల్టు మరిచి!
అధికారంలోకి రాగానే బెల్టు షాపులను తొలగిస్తామని పాదయాత్రలో చంద్రబాబు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బెల్టు షాపులను మూసేయాలని ఎక్సైజ్ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో వాటి జోలికి వెళ్లొద్దని మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు ఎక్సైజ్ వర్గాల ద్వారా తెలిసింది. ప్రభుత్వ ద్వంద్వ నీతి కారణంగా బెల్టు షాపుల్లో మద్యం ఏరులై పారుతోంది. ♦ గత నెలలో యల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామాంలో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి సంబంధించిన ఇంట్లో బెల్ట్‌షాపు నిర్వహిస్తుండగా ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి 60 బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే నివాసంలో బెల్ట్‌షాపు కొనసాగుతుండటం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ♦ అదే మండలంలోని గొడ్డుమర్రిలో ఎక్సైజ్ పోలీసుల దాడుల్లో 42 బాటిళ్ల మద్యం లభ్యమైంది. ఈ బెల్ట్‌షాపు కూడా టీడీపీ నేతకు చెందినదే. ఈ మద్యం బాటిళ్లు నాలుగు దుకాణాల్లో కొనుగోలు చేసినట్లు అధికారుల పరిశీలనలో వెల్లడయింది. ♦ ఈ రెండు ఉదాహరణలు చూస్తే జిల్లాలో బెల్టు షాపులు ఏ స్థాయిలో నిర్వహిస్తున్నారో అర్థమవుతోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: మద్యం సిండికేట్ల వ్యవహారం గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. బినామీల పేరుతో దుకాణాలను దక్కించుకుని యథేచ్ఛగా విక్రయాలు సాగించారు. అప్పట్లో 80 శాతం దుకాణాలు తెల్ల రేషన్ కార్డుదారులైన బినామీల పేరుతో నిర్వహించారు. ఈ క్రమంలో అబ్కారీశాఖ పాత విధానానికి ఫుల్స్టాప్ పెట్టి కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది. ప్రస్తుతం లాటరీ పద్ధతిన దుకాణాలు కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా 246 మద్యం దుకాణాలు ఉండగా.. వీటిలో చాలా దుకాణాల పరిధిలో బెల్టు షాపులు ఏర్పాటయ్యాయి. ఈ ఏడాది మే వరకు బెల్ట్‌షాపుల నిర్వాహకులు దుకాణాల నుంచి మద్యం కేసులను తీసుకెళ్లి విక్రయించేవారు. అయితే ఆన్లైన్బిల్లింగ్ అమల్లోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. ఇదీ ప్రస్తుత పరిస్థితి.. గతంలో ఆర్గనైజర్(గదిలో విక్రయాలు) బెల్ట్ దుకాణాలు కనిపించేవి. ఇప్పుడు మొబైల్(ఊర్లో తిరుగుతూ అమ్మడం) అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఆర్గనైజర్ దుకాణాలు కూడా చాలా గ్రామాల్లో కొనసాగుతున్నాయి. వీరు మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీకి కొనుగోలు చేస్తారు. ఒక దుకాణంలో గరిష్టంగా ఆరు బాటిళ్లు విక్రయించొచ్చు. అంతకంటే ఎక్కువ విక్రయిస్తే మద్యం దుకాణం ఆధ్వర్యంలోనే బెల్ట్‌షాపు నిర్వహిస్తున్నట్లు. దీంతో బాటిళ్ల ఆన్లైన్ బిల్లింగ్‌లో ఆరు బాటిళ్లకు మించకుండా బిల్లు చేస్తున్నారు. రోజూ వచ్చే వారు, ఒక బాటిల్‌కు వచ్చే వారి పేరుతో బిల్లులు ఇస్తున్నారు. గొడ్డుమర్రిలో అధికారుల దాడుల్లో దొరికిన 42 బాటిళ్లు ఏ దుకాణంలో కొనుగోలు చేశారని ఆరా తీస్తే పులివెందులలోని నాలుగు దుకాణాల్లో కొనుగోలు చేసినట్లు తేలింది. తిమ్మంపల్లిలోని 60 బాటిళ్లు కూడా పలు షాపుల్లో కొనుగోలు చేసినట్లు వెల్లడయింది. అంటే బెల్ట్‌షాపు నిర్వాహకులు పట్టణాల్లో ఐదారు దుకాణాలు తిరిగి బాటిళ్లు కొనుగోలు చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఇలా తీసుకెళ్లిన బాటిళ్లను ఇంట్లో పెట్టుకుని కొందరు బెల్టు దుకాణాలను నిర్వహిస్తున్నారు. ఇంకొందరు జేబులో పెట్టుకుని గ్రామాల్లో తిరుగుతూ విక్రయిస్తున్నారు. ఒక్కో బాటిల్‌పై రూ.25 నుంచి రూ.30 అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ తరహా బెల్ట్‌షాపులు నడుస్తున్నట్లు అధికారులకు తెలిసినా లక్ష్యాన్ని అధిగమించేందుకు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని మద్యం దుకాణాల ద్వారా ఆబ్కారీకి 60 శాతం ఆదాయం వస్తుంటే, 40 శాతం ‘బెల్ట్’ ద్వారానే సమకూరుతోంది. ఆర్డర్ సరే.. ఆచరణ కరువు టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేశారు. ఆ తర్వాత చంద్రబాబు సీఎం పీఠమెక్కాక రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించి ‘మద్యాంధ్రప్రదేశ్’గా మార్చారు. తీ నేపథ్యంలో పదేళ్లు అధికారానికి దూరమైన చంద్రబాబు 2014 ఎన్నికల ప్రచారంలో ‘బెల్ట్ రాగాన్ని’ అందుకున్నారు. అధికారంలోకి వస్తే బెల్టు షాపులను తొలగిస్తామని ప్రకటించారు. మేనిఫెస్టోలో కూడా ఇదే విషయాన్ని పొందుపరిచారు. నిజానికి బెల్ట్‌షాపుల నిర్వహణకు ఎప్పుడూ, ఏ ప్రభుత్వంలో అనుమతుల్లేవు. అయినప్పటికీ ఓ జీఓను కూడా జారీ చేశారు. దీంతో బాబు మాటపైన నిలబడ్డారని అంతా భావించారు. ఇంతలోనే తనదైన శైలిలో ‘బెల్ట్’ జోలికి వెళ్లొద్దని.. ‘బెల్ట్’ తీస్తే సర్కారు ఖజానాకు గండిపడుతుందని మౌఖిక ఆదేశాలు జారీ చేయించారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉందని.. ఇలాంటి సమయంలో ఎంత మద్యం తాగిస్తే.. అంత ఆదాయం వస్తుందని కూడా బాబు సూచించినట్లు తెలుస్తోంది. ఆ మేరకు అధికారులు ‘బెల్ట్’ వైపు కన్నెత్తి చూడని పరిస్థితి. పైగా కొత్త నిబంధనల మేరకు లాటరీలో ఎవరి పేరుతో షాపు వస్తుందో వారే నడపాలి. అయితే లాటరీలో దుకాణం దక్కించుకున్న వారి నుంచి తిరిగి ‘ఎక్సెస్ రేటు’తో ఖద్దరు నేతలు దుకాణాల్లో పాగా వేయడం గమనార్హం. -
ఏసీబీ వలలో ఎక్సైజ్ ఇన్చార్జి డీసీ
శ్రీకాకుళం సిటీ: జిల్లాలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్‌శాఖ ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్ ఎం.శివప్రసాద్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర శుక్రవారం స్థానిక విలేకరులకు వెల్లడించారు. మద్యం వ్యాపారుల నుంచి నెలవారీ వసూళ్లకు పాల్పడుతున్నారనే అభియోగాలపై శుక్రవారం ఏసీబీ అధికారులు ఎక్సైజ్‌శాఖ ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్ ఇంటిపై దాడులు చేశారు. నగరంలో ప్రభుత్వ బాలికల పాఠశాల ఎదురుగా ఉన్న ఓ అపార్టుమెంట్లో అద్దెకు ఉంటున్న శివప్రసాద్ ఇంట్లో క్షుణ్నంగా సోదాలు నిర్వహించారు. లెక్కలో లేని రూ.4.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును సీజ్ చేశామని, దీనిపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిస్తామని ఏసీబీ డీఎస్పీ రాజేంద్ర తెలిపారు. కాగా 2015 నుంచి శివప్రసాద్ అసిస్టెంట్ కమిషనర్‌గా జిల్లా ప్రొషిబిషన్ అండ్ ఎక్సైజ్‌శాఖలో పనిచేస్తున్నారు. 2017 ఫిబ్రవరి నుంచి ఇన్చార్జి డీసీగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఏసీబీ తనిఖీల్లో సీఐలు రమేష్, శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎక్సైజ్ అధికారుల దాడులు
బొంరాస్‌పేట(కొడంగల్): ఎక్సైజ్ అధికారులు నాటుసారా తయారీ కేంద్రంపై దాడి చేసి ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ సంఘటన మండల పరిధిలోని వడిచర్ల అనుబంధ ఊరిముందలి తండాలో మంగళవారం చోటు చేసుకుంది. అధికారుల కథనం ప్రకారం.. తండాలో నాటుసారా తయారీ, అమ్మకంపై విశ్వసనీయ సమాచారం అందుకున్న సీఐ చంద్రశేఖర్, డీటీఎఫ్ సీఐ ధన్వంత్‌రెడ్డి సిబ్బందితో కలిసి తండాలో దాడులు నిర్వహించారు. తండాకు చెందిన ముఢావత్ చందు, ముఢావత్ మోహణ్, శివ, దేవమ్మ, లక్షిబాయి, నాన్యనాయక్ నుంచి సారా తయారీ సామగ్రి లభించింది. 13 లీటర్ల ఐడీ, డిట్రాయిడ్, 100 లీటర్ల షుగర్వాష్ను ధ్వంసం చేశారు. ఈమేరకు వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. -
ఎక్సైజ్ ఎస్సై భర్త ఆత్మహత్య
జంగారెడ్డిగూడెం: స్థానిక ఎక్సైజ్స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న ఆర్.సత్యవతి భర్త పైలా విజయ్‌కుమార్ (43) శనివారం ఆత్మహత్య చేసుకున్నారు. పట్టణంలో సూర్య కళాశాల రోడ్డులో ఒక అపార్ట్మెంట్లో వీరి కుటుంబం నివసిస్తోంది. శనివారం మధ్యాహ్నం సమయంలో ఇంట్లో భార్యాపిల్లలు లేని సమయంలో డైనింగ్ హాల్లో ఫ్యాన్‌హుక్‌కు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. విధుల నుంచి మధ్యాహ్న సమయంలో సత్యవతి ఇంటికి వెళ్లి చూసేసరికి భర్త విజయ్‌కుమార్ ఉరివేసుకున్నట్టు గుర్తించారు. జంగారెడ్డిగూడెం సీఐ కె.బాలరాజు, ఎస్సై జీజే విష్ణువర్ధన్, కొ య్యలగూడెం ఎస్సై సూర్యభగవాన్ తదితరులు ఘట నాస్థలానికి వెళ్లి పరిశీలించారు. విజయ్‌కుమార్ పలు చోట్ల ప్రైవేట్ ఉద్యోగం చేసేవారు. ఇటీవల వరకు స్థానికంగా ఉన్న ప్రైవేట్ విద్యాసంస్థలో పనిచేస్తుండగా, రోడ్డు ప్రమాదంలో పడిపోగా చేయి విరిగింది. దీంతో ఆ ఉద్యోగాన్ని మానివేశారు. అయితే భార్య సత్యవతి ప్రభుత్వ ఉద్యోగి కాగా, తాను ఖాళీగా ఉండటం తో ఆత్మన్యూనతా భావానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. విజయ్‌కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఏరియా ఆస్పత్రి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ బాలరాజు తెలిపారు. ఇదిలా ఉండగా జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ సీఐ బి.శ్రీనివాసరావు, ఎస్సై సత్యనారాయణ, ఏలూరు అసిస్టెంట్ ఎౖసజ్ సూపరింటెండెంట్ నాగేంద్ర, భీమవరం, తాడేపల్లిగూడెం ఎౖసజ్ సీఐలు బలరామరాజు, పెద్ది రాజు, ఎన్ఫోర్స్మెంట్ సీఐలు ధనరాజు, ఎం.శ్రీను, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. విజయ్‌కుమా ర్ మృతదేహానికి నివాళులర్పించారు. ఎౖసజ్ ఎస్సై సత్యవతిని పరామ ర్శించారు. -
జోరుగా ‘బెల్ట్’ దందా
షాబాద్(చేవెళ్ల): షాబాద్ మండలంలో ఏ గ్రామంలో చూసినా బెల్ట్‌షాపుల దందా జోరుగా కొనసాగుతున్నాయి. సంబంధిత అధికారులు మామూళ్ల మత్తులో పడి అసలు బెల్ట్‌షాపుల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఓ వైపు ప్రభుత్వం బెల్ట్‌షాపులపై కోరడా ఝులిపించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా బెల్ట్‌షాపు నిర్వాహకులకు మాటలు చెవికెక్కడం లేదు. దీనికి తోడు ఎక్సైజ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మండలంలోని వివిధ గ్రామాల్లో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. వేలాపాలా లేకుండా 24 గంటల పాటు లభించే మద్యం దుకాణాలు గ్రామాల్లో ఉన్నాయి. దీంతో పాటు తండాల్లో సారాబట్టిలు కూడా పెట్టి మద్యం విక్రమాలు, బెల్టుషాపుల ద్వారా బహటంగా నడుస్తున్నాయి. ఒక చిన్న పాటి గ్రామంలో 5నుంచి 10వరకు బెల్టు దుకాణాలున్నాయి. వీటిని మూసి వేయాల్సిందేనని ప్రభుత్వం అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసినా అధికారులు ఖాతరు చేయడం లేదు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కొన్ని గ్రామాల్లో తాగడానికి నీరు దొరకపోయినా, మద్యం మాత్రం తప్పకుండా దొరుకుతుంది. పట్టించుకోని ఎక్సైజ్ శాఖ.. షాబాద్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో మొదలుకుని అనుబంధ గ్రామాల్లో కూడా మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మండల పరిదిలోని అన్ని గ్రామాలతో పాటు తండాల్లోను సారాబట్టీలు, బెల్ట్‌షాపులు జోరుగా వెలుస్తున్నాయి. వీటిని పట్టించుకోనే పర్యవేక్షించాల్సిన ఎక్సైజ్ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఇతర ప్రాంతాల ‡నుంచి ఆటోల్లో కల్తీ మద్యం సరఫరా చేస్తున్నట్లు సమాచారం. అదే విధంగా ఈ బెల్ట్ దుకా>ణాల్లో మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తూ మందు బాబులను దోచేస్తున్నారు. ఏదో నామమాత్రపు తనిఖీలు నిర్వహించి చూసిచూడన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోవాలని ఆయా గ్రామాల యువజన సంఘాల సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ఎక్సైజ్ ఎస్ఐ అరుణ్‌కుమార్‌ను వివరణ కోరగా.. గ్రామాల్లో బెల్టుషాపులు నడిపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
ఆదివాసీల భారీ ర్యాలీ
సాక్షి, ఆసిఫాబాద్: కుమ్రం భీం జిల్లాలోని ఆదివాసీలకు కోపమొచ్చింది. తమ వర్గానికి చెందిన వారిని అక్రమంగా అరెస్టు చేశారని, వారిని వెంటనే విడుదల చేయాలని ఆదివాసీ సంఘాలు గురువారం చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. కలెక్టరేట్‌ను ముట్టడించిన ఆదివాసీలు అక్కడ పార్క్ చేసి ఉన్న పలువురు అధికారుల కార్ల అద్దాలను, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. జిల్లా కేంద్రంలో గురువారం ఆదివాసీలు చేపట్టిన నిరసన కార్యక్రమానికి పలు మండలాల నుంచి వేలాది మంది తరలివచ్చారు. తొలుత ర్యాలీ తీసి, అంతర్ రాష్ట్ర రహదారిపై రెండు గంటల పాటు బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ ఐక్యకార్యాచరణ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం అనంతరం వేలాది సంఖ్యలో ఆదివాసీలు కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయంలో పార్కింగ్ చేసిన జేసీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఇరిగేషన్ ఈఈ, జిల్లా వ్యవసాయ అధికారి, సీపీవో వాహనాలపై దాడి చేశారు. ఒక దశలో కార్యాలయ ఆవరణలో భయానక వాతావరణం నెలకొంది. వేలాది సంఖ్యలో బైఠాయించిన ఆదివాసీలను అదుపు చేయడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు వచ్చి ఆదివాసీలతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. జోడేఘాట్లోని కుమ్రంభీం మ్యూజియంలో ఉన్న లంబాడీ తెగకు చెందిన శాంకిమాత విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ఈ నెల 5న కాల్చివేశారు. దీంతో జిల్లావ్యాప్తంగా లంబాడీ నాయకులు నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు దాదాపు 20 మందిపైగా ఆదివాసీలపై కేసులు నమోదు చేశారు. వారిని వెంటనే విడుదల చేయాలని, కలెక్టర్ చంపాలాల్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీల సంఘం ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. -
ఇంటి ముందుకే మందు
రంగంలోకి ‘మొబైల్ మద్యం’ - ‘బెల్టు’ షాపుల సరికొత్త అవతారం.. హాలోగ్రామ్ లేబుళ్లు తొలగించి సరఫరా - ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో విక్రయాలు.. లిక్కర్ సిండి‘కేట్ల’ నయా దందా సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బెల్టు షాపులు సరికొత్త అవతారంలో జనం ముందుకు వచ్చేశాయ్. కిరాణా షాపులు, పాన్ షాపులు, లాడ్జిలు, మెడికల్ షాపుల్లో మద్యం వ్యాపారాలు చేస్తున్న సిండి‘కేట్లు’ ఇప్పుడు మరో అడుగు ముందుకేశాయ్. మొబైల్ ‘బెల్టు’ షాపులు తెరపైకి తీసుకొచ్చి ఆటోలు, ద్విచక్ర వాహనాల ద్వారా మద్యం విక్రయిస్తున్నారు. ఒకేచోట బెల్టు షాపులు నిర్వహిస్తే దొరికిపోతామనే ఉద్దేశంతో మొబైల్ మందు అమ్మకాలు చేపట్టడం గమనార్హం. ఇలా ఇప్పుడు మొబైల్ మద్యం వ్యాపారం మూడు గ్లాసులు.. ఆరు పెగ్గులు మాదిరిగా రాష్ట్రవ్యాప్తంగా సాగుతోంది. ఈ తరహా విక్రయాలతో సిండికేట్ల మధ్య వివాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. విశాఖపట్టణంలో మద్యం వ్యాపారంలో పట్టున్న అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు నిర్వహించే సిండికేట్‌కు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన అమాత్యుడి అనుచరుడు నడిపే సిండికేట్‌కు ఇటీవల విభేధాలు తలెత్తి ఆధిపత్య పోరుకు దారి తీసింది. లేబుళ్లు తొలగించి విక్రయాలు మొబైల్ విక్రయాల ద్వారా మద్యం అమ్మకాలు ఇటీవల పెరిగినట్లు ఎక్సైజ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మద్యం దుకాణాల నుంచి కొనుగోలు చేసిన బాటిళ్లపై 13 అంకెల బార్ కోడ్ హాలోగ్రామ్ లేబుళ్లను తొలగించి విక్రయాలు సాగిస్తున్నారు. బ్యాచ్, హీల్ నెంబర్లు లేకపోవడంతో మద్యం బాటిళ్లు ఎక్కడ నుంచి కొనుగోలు చేశారన్నది తెలియడం లేదని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. బార్ కోడ్ నెంబరును ముద్రిస్తే అక్రమ మద్యం విక్రయాలను అరికట్టే వీలుంది. బాటిళ్లపై లేబుల్ లేకపోతే ఎన్డీపీ (నాన్ డ్యూటీ పెయిడ్) మద్యంగా గుర్తించి కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నా ఎక్సైజ్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మొబైల్ మద్యం విక్రయాలు అధికంగా తూర్పుగోదావరి, గుంటూరు, విశాఖపట్టణం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో జోరుగా జరుగుతున్నాయి. ఫిర్యాదులపై చర్యలు ఉత్త ప్రచారమే.. బెల్టు షాపులపై ఫిర్యాదుల కోసం 1100 నంబరు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ‘ప్రజలే ముందు’ (పీపుల్స్ ఫస్ట్) నినాదంతో ఈ నంబరు గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. సీఎం కోర్ డ్యాష్ బోర్డు సమాచారం మేరకు ఈ నంబరుకు ఇప్పటివరకు 3,916 బెల్టు షాపులపై ఫిర్యాదులు అందాయని ప్రభుత్వం పేర్కొంది. ఎక్సైజ్ అధికారులు 3,822 ఫిర్యాదుల్ని పరిశీలించి తనిఖీలు చేపట్టారని, 1,126 షాపులను మూసివేశారని డ్యాష్ బోర్డులో ప్రకటించారు. కానీ బెల్టు షాపులు యధావిధిగా కొనసాగుతున్నాయని ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. రాజధాని ప్రాంతంలో తుళ్లూరు మండలం ఐనవోలు, తాడేపల్లి ప్రాంతాల్లో పాన్‌షాపులు, జనరల్ స్టోర్లలో మద్యం విక్రయాలు సాగుతూనే ఉన్నాయని మహిళా సంఘాలు ఫిర్యాదులు చేస్తున్నాయి. -
ఎక్సైజ్ పాలసీ ఖరారు
-
ఎక్సైజ్ పాలసీ ఖరారు
మద్యం దుకాణాలకు ఈనెల 13న నోటిఫికేషన్ సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు మద్యం కొత్త పాలసీ ఖరారైంది. రాష్ట్రంలో గతంలో ఉన్న ఆరు శ్లాబులను నాలుగు శ్లాబులకు కుదించాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. గతంలో రూ. 50 వేలు ఉన్న దరఖాస్తు ఫీజును అర్బన్ ప్రాంతంలో రూ. లక్షకు పెంచారు. ఈ మేరకు ఎక్సైజ్ అధికారులు పంపిన ప్రతిపాదనలకు సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదముద్ర వేశారు. దీంతో అధికారులు మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈనెల 13న నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించారు. అదే రోజు నుంచి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తుల స్వీకరణ చివరి గడువు ఈనెల 19గా నిర్ణయించారు. 22వ తేదీన మద్యం దుకాణాల లైసెన్సులకు డ్రా నిర్వహిస్తారు. డ్రా నిర్వహణ బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. పాత పాలసీలో ఆరు స్లాబులుగా ఉన్న లైసెన్సు ఫీజును నాలుగు స్లాబులకు కుదించారు. మేజర్ గ్రామ పంచాయతీ, మండల కేంద్రంలో గతంలో రూ. 39.5 లక్షలు, రూ. 40.8 లక్షలుగా ఉన్న రెండు శ్లాబులను కలిపేసి రూ. 45 లక్షలతో ఒక శ్లాబు చేశారు. గతంలో 2 లక్షల నుంచి 3 లక్షలలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లోని మద్యం షాపులకు రూ. 50 లక్షలు, రూ. 60 లక్షల శ్లాబులు ఉండగా, ఆ రెండింటిని కలిపి రూ. 55 లక్షలతో ఒకే శ్లాబు చేశారు. 3 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లోని మద్యం దుకాణాలకు గతంలో రూ. 81.6 లక్షల స్లాబు ఉండేది. తాజాగా పర్మిట్ రూమ్‌తో కలిపి ఈ శ్లాబును రూ. 85 లక్షలకు పెంచారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గతంలో రూ. 1.08 కోట్లు ఉండగా, ఈసారి దానిని పర్మిట్ రూమ్‌తో కలిపి రూ. 1.10 కోట్లుగా నిర్ధారించారు. రెండేళ్ల లీజు కాలాన్ని ఎప్పటిలాగే కొనసాగించనున్నారు. -
రోడ్డు రమ్మంటోంది..!
♦ మద్యం వ్యాపారులకు ఊరట ♦ నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో వర్తించని ‘సుప్రీం’ ఆదేశాలు ♦ రహదారుల సమీపంలో దుకాణాల ఏర్పాటుపై స్పష్టత ♦ న్యాయశాఖ అభిప్రాయం కోరనున్న ఎక్సైజ్ అధికారులు ♦ కొందరికి ఖేదం.. మరికొందరికి మోదం భీమవరం టౌన్: ‘ఊరు పొమ్మంటోంది.. రోడ్డు రమ్మంటోంది..’ అన్నట్టుగా ఉంది మద్యం వ్యాపారుల పరిస్థితి. జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల దూరంలో మద్యం దుకాణాల ఏర్పాటును నిషే ధిస్తూ ఇచ్చిన తీర్పు నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల పరిధిలో వర్తించదని పేర్కొంటూ తాజాగా సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల దూరంలో ఉన్న బార్లు, పబ్బులు, రెస్టారెంట్లు, మద్యం దుకాణాలను ఈఏడాది మార్చి 31లోపు తొలగించాల్సిందేనంటూ గతేడాది డిసెంబర్లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై కొందరు అప్పీల్‌కు వెళ్లగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ నిర్ణయం అమలుకోసం జూ న్ 30 వరకూ గడువు ఇచ్చింది. జూలై 1 నుంచి కొత్తం మద్యం విధానం అమలులోకి రావడంతో మద్యం దుకాణాలు, బార్లను రహదారులకు దూరంగా ఏర్పాటు చేశారు. ఈలోపు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రహదారులను నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకురావడంతో కొందరు రాష్ట్ర రహదారుల వెంబడి దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. సరైన ప్రాంతాలు దొరక్కపోవడంతో చాలా మంది తమ దుకాణాలను నివాసిత ప్రాంతాలు, విద్యాసంస్థలు, ఆలయాల సమీపాల్లో ఏర్పాటుచేయడంతో మహిళలు గళమెత్తారు. రాస్తారోకో లు, ధర్నాలతో ఉద్యమాలు చేపట్టారు. దీంతో ఎౖMð్సజ్ అధికారులు దిగివచ్చి దుకాణాలను తొలగించక తప్పలేదు. ఈ క్రమంలో మద్యం వ్యాపారులు దుకా ణాల ఏర్పాటుకు సురక్షిత ప్రాంతాలను అన్వేషించి పెద్ద మొత్తం లీజు చెల్లించి పకడ్బందీగా రేకుల షెడ్లను, దుకాణాలు ఏర్పాటుచేసుకున్నారు. పాత దుకాణాల్లో ఏర్పాటుకు యత్నాలు సుప్రీంకోర్టు జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల దూరంలో మద్యం దుకాణాల ఏర్పాటును నిషేధిస్తూ ఇచ్చిన తీర్పు నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల పరిధిలో వర్తించదని తాజాగా స్పష్టం చేయడంతో పెద్ద మొత్తంలో అడ్వాన్స్‌లు చెల్లించి దుకాణాలు ఏర్పాటుచేసుకున్న వ్యాపారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మహిళల ఆగ్రహంతో దుకాణాలు ఖాళీ చేసిన వ్యాపారులు ఊ పిరి పీల్చుకుంటుండగా ఇప్పటికే భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టి ప్రజల ఆగ్రహం వ్యక్తంకాని చోట దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వారు గందరగోళంలో పడ్డారు. జాతీయ, రాష్ట్ర రహదారుల్లోని ఈ వ్యాపారులు పాత దుకాణాల్లోకి వెళ్లిపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎక్సైజ్‌శాఖ అధికారులు మాత్రం ఊపిరి పీల్చుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా మహిళల ఆగ్రహాన్ని ఎౖMð్సజ్ శాఖ చవిచూడటమే ఇందుకు కారణం. కాగా సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన స్పష్టతపై ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర న్యాయశాఖ అభిప్రాయం కోరుతున్నట్టు సమాచారం. సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన స్పష్టతపై భీమవరంలో ఎక్సైజ్ సీఐ కె.బలరామరాజును వివరణ కోరగా విషయం వాస్తవమేనని తమ ఉన్నతాధికారులు న్యాయశాఖ అభిప్రాయాన్ని కోరుతున్నట్టు చెప్పారు. త్వరలో సమస్య పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
నేను రోజూ డ్రగ్స్ వాడుతా!
-
నేను రోజూ డ్రగ్స్ వాడుతా!
♦ విచారణలో నెదర్లాండ్వాసి మైక్ఖమింగో! హైదరాబాద్: డ్రగ్స్ కేసులో నిందితునిగా ఉన్న నెదర్లాండ్స్‌కు చెందిన మైక్ఖమింగో (30)ను శేరిలింగంపల్లి ఎక్సైజ్ కార్యాలయంలో శనివారం విచారించారు. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్న పోలీసులు శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో మూడు రోజులపాటు ఖమింగోను విచా రించనున్నట్లు సమాచారం. మొదటి రోజు విచారణకు సిట్ అధికారులు వస్తారని ఎక్సై జ్ పోలీసులు ఎదురుచూశారు. వారు రాకపోవడంతో సీఐ గాంధీనాయక్ విచారించారు. అతను ఎటువంటి సమాధానం చెప్పలేదని తెలిసింది. తమ దేశంలో డ్రగ్స్ వాడకం సర్వ సాధారణమని ఇక్కడ చట్టాలు తమకు తెలియదని అధికారులతో అన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. తన సెల్‌ఫోన్ లాక్ కోడ్‌ను మరిచిపోయానని, తనకు ఎవరితో సంబంధాలు లేదని పేర్కొన్నట్లు తెలిసింది. 2.6 గ్రాముల డీఎంటీ డ్రగ్స్ కేసులో ఖమింగో ను సిట్ అధికారులు అరెస్టు చేశారు. అతను శేరిలింగంపల్లి పరిధిలోని నానక్‌రాంగూడ జయభేరి ఆరెంజ్ కౌంటీలో నివాసముంటున్నాడు. అదే అపార్ట్మెంట్లో డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్న సినీ ప్రముఖులు అతను ఉండే ప్లాట్ పక్కనే నివాసముంటున్నట్లు తెలిసింది. ఖమింగో డ్రగ్స్‌ను సరఫరా చేస్తాడనే అనుమానంతో పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. తాను తన దేశంలో డ్రగ్స్ రోజూ వాడుతానని, ఇక్కడ కూడా డ్రగ్స్ తీసుకుంటానని ఎవరికి సరఫరా చేయనని తెలిపారు. అతని విచారించేటప్పుడు అడ్వకేట్ సమక్షంలో పోలీసులు ప్రశ్నించారు. -
బాహుబలి-2 లాగే మరో ఆసక్తికర పార్ట్-2!
డ్రగ్స్ కేసులో ఆగస్టు మొదటివారం తర్వాత మరో అంకం బాహుబలి వన్ సినిమా ముగింపు.. ఓ పెద్ద ప్రశ్నను సగటు ప్రేక్షకుడి ముందు ఉంచింది. అదే.. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? ఇది రెండోపార్ట్ సినిమాపై అంతులేని ఆసక్తిని, ఉత్కంఠను రేకెత్తించింది. ఇప్పుడు అలాంటి ఆసక్తిని డ్రగ్స్ కేసు రేకెత్తించబోతుందా? ఈ కేసులో పార్ట్-1, పార్ట్-2 ఉండబోతున్నాయా? బాహుబలి వన్ - టూ మాదిరిగానే... డ్రగ్స్ కేసులో సిట్ విచారణ.. వన్ -టూ పార్టులు సాగనున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే.. డ్రగ్స్ కేసులో ఇప్పటికే 12 మందికి నోటీసులిచ్చి విచారిస్తున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ.. చార్జిషీట్ దాఖలుతో మొదటి అంకాన్ని త్వరలో ముగించనుంది. అదే సమయంలో ఈ నెల మొదటివారంలో రెండో అంకం మొదలుకానుందని తెలుస్తోంది. ఈ రెండో అంకం ఏమిటి? కొత్తగా ఎవరెవరిని విచారిస్తారన్నది ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. రెండో భాగంలో మరింతమంది సినీ ప్రముఖులు, ఇతర రంగాల పెద్దలు ఉన్నారని ప్రచారం సాగుతోంది. అయితే, సెకండ్ పార్ట్‌లో విచారణ ఎదుర్కొబోతున్న వాళ్ల పేర్లు బయటపెట్టొద్దంటూ ఉన్నతాధికారులపై ఒత్తిడి వస్తోందని సమాచారం. ఆగస్టులో రెండోపార్ట్ మరింత సీరియస్‌గా ఉంటుందనే సంకేతాలు మాత్రం బయటకు వస్తున్నాయి. ఇదే విషయం అందరిలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. డ్రగ్స్ పార్ట్-2లో ఏముంటుందన్న తీవ్ర ఉత్కంఠ, ఎవరి పేర్లుంటాయనే ఆందోళన సినీ పరిశ్రమ వర్గాలను, ఇప్పటికే గుట్టుగా నోటీసులు ఎదుర్కొంటున్నవారిని వెంటాడుతోంది. కాగా, తొలి విచారణ చార్జిషీట్లో సిట్ ఎలాంటి విషయాలను పొందుపరుస్తుందనేది కూడా ఇప్పుడు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. సినిమారంగానికి చెందినవారిలో మరికొందరిని విచారణకు పిలుస్తారని ప్రచారం సాగుతోంది. ఎక్సైజ్ అధికారులు.. ఇదే విషయాన్ని చూచాయగా చెబుతున్నారు. ఆగస్టు మొదటివారం తర్వాతే వీరి విచారణ ఉంటుందని సమాచారం. ఇదే సమయంలో కమింగా విచారణను కీలకంగా భావిస్తున్నారు ఎక్సైజ్ అధికారులు. కొందరు టెక్నీషియన్స్, కొందరు సినీ ప్రముఖులు.. కమింగా ద్వారా డ్రగ్స్ పొందినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండో పార్ట్‌లో కమింగా కీలకం కాబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ విచారణలో బయటకు వెలుగుచూడని వారు.. డ్రగ్స్ వాడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఓవైపు కమింగాను విచారిస్తూనే మరోవైపు అనుమానితులను కూడా విచారిస్తున్నట్లు తెలిసింది. విచారణ ముగియగానే సరిపోదని, దాని తర్వాత వెలువరించే చార్జిషీట్ అందరి జాతకాలు బయటపెడుతుందని ఎక్సైజ్ అధికారుల వాదన. ఇప్పటివరకు పూరి జగన్నాధ్‌ను 11 గంటలు, శ్యామ్ కె. నాయుడును 6 గంటలు, సుబ్బరాజును 13గంటలు, తరుణ్‌ను 13 గంటలు, నవదీప్‌ను 11 గంటలు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను 4గంటలు, చార్మిని 6 గంటలు, ముమైత్‌ఖాన్‌ను 6 గంటలు, రవితేజను 9 గంటలు, రవితేజ మాజీ డ్రైవర్ శ్రీనివాస్‌ను 4 గంటలు సిట్ అధికారులు విచారించారు. మరోవైపు కెల్విన్, జీషన్‌ల అరెస్ట్ తర్వాత పలువురు సినీ ప్రముఖులతోపాటు మరో ప్రైవేటువ్యక్తిని విచారణకు పిలిచారు. అందరి విచారణ ముగిసిన తర్వాత ఈ కేసులో తొలి చార్జిషీట్ తీసుకురానున్నారు. ఇప్పటి దాకా విచారణకు హాజరైన వారిందరి పేర్లు చార్జిషీట్లో ఉంటాయా ? లేదా అన్నది త్వరలో స్పష్టం కానుంది. ఇప్పటి వరకు సిట్ జరిపిన విచారణలో డ్రగ్స్ సరఫరా, వినియోగానికి సంబంధించి సిట్ కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. దీని ఆధారంగా త్వరలోనే వాడకందారులతో పాటు అమ్మకందారుల గుట్టును కనిపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
సినిమావాళ్లను సిట్ టార్గెట్ చేసింది: డైరెక్టర్
విశాఖపట్నం: టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ రాకెట్ కేసులో ఎక్సైజ్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తీరుపై మరో దర్శకుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. డ్రగ్స్ రాకెట్ కేసు విచారణలో సిట్ సినిమా స్టార్లను టార్గెట్ చేసిందని ప్రముఖ దర్శకుడు పీసీ ఆదిత్య అన్నారు. విజయనగరంలో ఉన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. డ్రగ్స్ కేసులో మాస్టర్‌మైండ్‌గా భావిస్తున్న కెల్విన్ మొబైల్ఫోన్లో 248 కాంటాక్ట్ నంబర్లు లభిస్తే.. కేవలం 12మంది సినీ ప్రముఖులను మాత్రమే సిట్ విచారిస్తున్నదని ఆయన తప్పబట్టారు. సిట్ సినీ ప్రముఖులను టార్గెట్ చేసుకోవడంతో వారి కుటుంబసభ్యులు మానసికక్షోభను అనుభవిస్తున్నారని అన్నారు. 'డ్రగ్స్‌కు యువత ఎలా బానిసగా మారుతోంది. ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై నా తదుపరి సినిమా ఉంటుంది' అని పీసీ ఆదిత్య తెలిపారు. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా డ్రగ్స్ కేసులో సిట్ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
పూరీతో సంబంధాలపైనే ఫోకస్!
- ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను విచారించిన ఎక్సైజ్ సిట్ - కెల్విన్‌తో సంబంధాలపై ఆరా - ముగ్గురు వ్యాపారవేత్తలను కూడా ప్రశ్నించిన సిట్ సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ వ్యవహారంలో మంగళవారం సినీ ఆర్ట్ డైరెక్టర్ ధర్మారావు అలియాస్ చిన్నాను సిట్ విచారించింది. ఉదయం 10.30కి ప్రారంభమైన విచారణలో.. ప్రధానంగా చిన్నాకు, పూరీ జగన్నాథ్‌కు మధ్య ఉన్న సంబంధాలపై ప్రశ్నించినట్టు తెలిసింది. పూరీతో కలసి డ్రగ్స్ తీసుకున్నారా అని ప్రశ్నించగా తనకు అలాంటి అలవాటేదీ లేదని చిన్నా చెప్పినట్టు తెలుస్తోంది. పూరీతో కలసి ఎక్కువ సినిమాలకు పనిచేయడం వల్ల తన పేరు తెరమీదకు వచ్చి ఉంటుందని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. ఇక ఈవెంట్ మేనేజర్‌గానే కెల్విన్‌తో పరిచయం ఏర్పడిందని.. దాంతో పలుమార్లు ఫోన్లో మాట్లాడానని చెప్పినట్లు తెలిసింది. పూరీ జగన్నాథ్ ద్వారా చిన్నాకు డ్రగ్స్ అలవాటైనట్లుగా కెల్విన్ చెప్పాడని అధికారులు ప్రస్తావించగా.. అది అవాస్తవమని, కావాలంటే పరీక్షలు చేసుకోవచ్చని స్పష్టం చేసినట్లు సమాచారం. మొత్తంగా సిట్ అధికారులు చిన్నాను 25కు పైగా ప్రశ్నలు వేశారని తెలిసింది. ఇక మధ్యాహ్నం 1.45 గంటల సమయంలోనే చిన్నా విచారణ ముగిసి బయటికి వచ్చారు. ఈ కేసులో ఇప్పటిదాకా విచారణ ఎదుర్కొన్న సినీ ప్రముఖుల్లో చిన్నా విచారణే తక్కువ సమయంలో ముగియడం గమనార్హం. నేడు చార్మి వంతు పూరీ జగన్నాథ్‌తో కలసి డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలెదుర్కొంటున్న హీరోయిన్ చార్మి బుధవారం సిట్ విచారణకు హాజరుకానున్నారని అధికారులు తెలిపారు. ఎక్కడ కోరితే అక్కడ విచారించేందుకు సిద్ధమంటూ తామిచ్చిన అవకాశాన్ని చార్మి సద్వినియోగం చేసుకోలేదని.. కోర్టు నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో ఆమె సిట్ కార్యాలయంలోనే విచారణకు హాజరవుతారని వెల్లడించారు. పూరీ జగన్నాథ్‌తో కలసి ఆమె పలువురికి డ్రగ్స్ అలవాటు చేసినట్టు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో చార్మిని సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశముందని సిట్ అధికారి ఒకరు తెలిపారు. చార్మి పదే పదే కెల్విన్‌తో వాట్సాప్ చాటింగ్, కాల్స్ చేశారని.. అతడితో దిగిన ఫొటోలు కూడా ఉన్నాయని.. వాటి ఆధారంగా విచారిస్తామని చెప్పారు. కెల్విన్ ఇంట్లో సోదాలు డ్రగ్స్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న కెల్విన్ నివాసంలో సిట్ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. వాస్తవా నికి కెల్విన్ అరెస్టు సమయంలోనే అతడి నివాసంలో తనిఖీలు చేసేందుకు ప్రయత్నించామని అధికారులు తెలిపారు. కానీ కెల్విన్ కుటుంబ సభ్యులు ఎక్సైజ్ అధికారులపై దాడికి పాల్పడటంతో పూర్తిస్థాయిలో సోదా చేయలేకపోయామన్నారు. ఈ నేపథ్యంలో కోర్టు అనుమతి తీసుకుని మంగళవారం తిరిగి సోదాలు చేసినట్టు చెప్పారు. ఈ సందర్భంగా కెల్విన్ వ్యక్తిగత కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌ను, గతంలో వాడిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఎవరా ముగ్గురు వ్యాపారవేత్తలు ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను ప్రశ్నిస్తున్న సమయంలోనే సిట్ అధికారులు ముగ్గురు వ్యాపారవేత్తలను కూడా పిలిపించి విచారించారు. హైదరాబాద్‌కు చెందిన బానోత్ సౌరభ్, ఆకుల రిషితేష్, అంకిత్ అగర్వాల్‌లను విచారిస్తున్నట్లు అధికారులు మీడియాకు వెల్లడించారు. కానీ వారు ఎవరు, ఏ ప్రాంతానికి చెందినవారు, ఏ తరహా వ్యాపారం చేస్తారు, వారికీ ఈ డ్రగ్ కేసుకు ఉన్న లింకులు ఏమిటన్న వివరాలను మాత్రం బహిర్గతం చేయలేదు. దీనిపై సిట్ మీడియా లైజనింగ్ అధికారులను కోరినా... తమ వద్ద వారి పేర్లు తప్ప ఇతర వివరాలేవీ లేవని పేర్కొన్నారు. అయితే ఆ ముగ్గురిలో ఒకరు ఆరోగ్య సంబంధిత ఉత్పత్తుల సంస్థను నిర్వహిస్తున్నారని, ఆ ఉత్పత్తిని అడ్డుపెట్టుకొని డ్రగ్స్ విక్రయిస్తున్నారని సిట్ అనుమానిస్తోంది. -
ఎక్సైజ్ అధికారి.. మస్కా!
సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: అది మద్యం దుకాణానికి ఆనుకొని ఉన్న గొదాం! తనిఖీ చేస్తే అక్కడ పరిమితికి మించిన మద్యం నిల్వ బయటపడింది! వాస్తవంగా నిబంధనల ప్రకారమైతే ఈ నేరానికి సంబంధిత వ్యాపారి లైసెన్స్ రద్దు చేయాలి! దుకాణాన్నీ సీజ్ చేయాలి! కానీ ఆ సరుకు తనది కాదని, పక్కనే ఉన్న మరో మూడు మద్యం దుకాణాలకు సంబంధించినదని ఆ వ్యాపారి వాదన! తన తప్పు నుంచి తప్పించుకోవడానికి అతను వేసిన ఎత్తుగడకు ఆ మూడు దుకాణాల లైసెన్స్‌లు రద్దయిపోయాయి! ఆ వ్యాపారికి మాత్రం ఏమీకాలేదు! ఈ వ్యవహారం ఒక్కసారిగా తారుమారైపోయిందంటే ఏదో బలీయమైన శక్తి పనిచేసి ఉండాలి! సామాన్యుడికి సైతం ఆ విషయం ఇట్టే అర్థమైపోతుంది కదా? రాజాం పట్టణంలో చోటు చేసుకున్న ఈ మస్కా వ్యవహారం వెనుక అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడితో పాటు ఎక్సైజ్ శాఖలో ఓ అధికారి ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి... రాజాం పట్టణం నుంచి చీపురుపల్లి రోడ్డులో వివేక్ బీర్ అండ్ వైన్స్ అనే పేరుతో మద్యం దుకాణం ఉంది. దీనికి ఈనెల 18వ తేదీనే ఎక్సైజ్ అధికారులు లైసెన్స్ మంజూరు చేశారు. సంబంధిత వ్యాపారి అదే రోజు రూ.6 లక్షల విలువైన మద్యం దుకాణానికి తెప్పించారు. అయితే ఆ దుకాణంలో అక్రమ మద్యం ఉందని, దీన్ని చుట్టుపక్కల బెల్ట్‌షాపులకు తరలించేందుకు సిద్ధం చేశారని ఈనెల 19వ తేదీన ఎక్సైజ్ కమిషనరేట్‌కు ఫిర్యాదు అందింది. ఈ మేరకు అదేరోజు రాత్రి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వివేక్ బీర్ అండ్ వైన్స్ దుకాణంపై దాడులు చేయడానికి సన్నద్ధమయ్యారు. కానీ స్థానిక ఎక్సైజ్ అధికారి ఒకరు వారిని వారించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. మూసిఉన్న దుకాణంపై సంబంధిత యజమాని లేకుండా దాడి చేస్తే తిరిగి తమ పీకకే చుట్టుకుట్టుందని భయపెట్టారట! కానీ చివరకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆ ఎక్సైజ్ అధికారి సహకారం తీసుకొనే దుకాణాన్ని తెరిపించారు. కథలో మలుపు అక్కడే.... వివేక్ బీర్ అండ్ వైన్స్ దుకాణంలో భారీ ఎత్తున మద్యం పెట్టెలు బయటపడిన సంగతి తెలిసిందే. ఒకే డోర్ నంబరుతో దుకాణానికి ఆనుకొని ఉన్న గోదాంలో మొత్తం 120 పెట్టెల వరకూ వెలుగు చూశాయి. ఈ సమాచారం వ్యాపారి ద్వారా తెలుసుకున్న అధికార పార్టీ నాయకుడు ఒకరు ఎక్సైజ్ శాఖ అధికారులపై ఒత్తితి తెచ్చినట్లు గుసగుసలు వినిపించాయి. అందుకు అనుగుణంగా స్థానిక ఎక్సైజ్ అధికారి చక్రం తిప్పి 72 పెట్టెలను అక్కడి నుంచి తప్పించేశారు. అవి రాజాంలోనే ఉన్న మరో మూడు మద్యం దుకాణాలకు సంబంధించిన సరుకుగా చూపించారు. ఇదే విషయాన్ని కమిషనర్ డైరెక్టరేట్‌కు చేరవేశారు. ఈ మేరకు పైనుంచి వచ్చిన ఆదేశాలతో ఆ మూడు దుకాణాలను సీజ్ చేస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ శాఖ ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్ పి.శివప్రసాద్ వెల్లడించారు. కానీ రాజాం ఎక్సైజ్ అధికారి నిర్వాహకంతో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తల పట్టుకుంటున్నారు. వాస్తవానికి అక్రమ సరుకు దొరికిన మద్యం దుకాణాన్ని కూడా సీజ్ చేయాల్సి ఉంది. ఈ వ్యాపారిని తప్పించేందుకు ఆ ఎక్సైజ్ అధికారి తమను ఇరికించారని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు లోలోన భయపడుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం బెల్ట్‌షాపులపై దాడులంటూ ఎక్సైజ్ అధికారులు చేస్తున్న హంగామా వెనుకనున్న అసలు రహస్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి! -
అధికారులతో అకున్ సబర్వాల్ వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్: తెలంగాణలోని అన్ని జిల్లాల ఎక్సైజ్ అధికారులతో ఆ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధానంగా జిల్లాల్లో డ్రగ్స్ విక్రయాలు, సరఫరా చేస్తున్న వారి గురించి చర్చించినట్లు సమాచారం. డ్రగ్స్ నియంత్రణకు మార్గాలు, డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరినామాలపై అవగాహన పెంపోందించేందుకు చేయాల్సిన కార్యక్రమాల గురించి సబర్వాల్ అధికారులతో చర్చించారు. -
అకున్‌తో బాహుబలి–3 తీయాలేమో!
డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ విచారణపై రాంగోపాల్‌వర్మ - ఫేస్బుక్లో వివాదాస్పద కామెంట్లు - నటీనటులను విచారించినట్టే విద్యార్థులను విచారిస్తారా అని ప్రశ్న - వర్మపై మండిపడ్డ ఎక్సైజ్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం - అరెస్ట్ తప్పదంటూ హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్‌పై ఫేస్బుక్లో అనుచిత కామెంట్లు పెట్టారు. దీనిపై ఎక్సైజ్ అధికారులు, సిట్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం తీవ్రంగా స్పందించింది. అరెస్టు తప్పదంటూ హెచ్చరించింది. అకున్ను బాహుబలిలా చూపుతున్న మీడియా: వర్మ ‘సినీ ప్రముఖులు పూరీ జగన్నాథ్, సుబ్బరాజులను 12 గంటలపాటు ప్రశ్నించినట్టుగానే డ్రగ్స్ తీసుకున్న స్కూల్ విద్యార్థులను కూడా గంటల తరబడి ప్రశ్నిస్తారా? డ్రగ్స్ కేసును అడ్డం పెట్టుకొని ఎక్సైజ్ విభాగం తన ప్రచారానికి సినీ నటులను ట్రైలర్, టీజర్‌గా వాడుకుంటోంది. డ్రగ్స్ ఎవరు తీసుకున్నారు, ఎవరు తీసుకోలేదన్న విషయం చట్టపరంగా బయటపడుతుంది. కానీ అకున్ సబర్వాల్ విచారణలో సినీ వ్యక్తులు చెప్పిన విషయాలు, చెప్పని విషయాలను మీడియాకు లీకులిస్తున్నారు. అకున్ను మీడియా అమరేంద్ర బాహుబలి తరహాలో చూపిస్తోంది. బహుశా అకున్ సబర్వాల్‌తో రాజమౌళి బాహుబలి పార్ట్–3 తీయాలేమో. డ్రగ్స్ తీసుకున్నట్టు ఎక్కడా ఎలాంటి కేసులు లేకున్నా విచారణ పేరుతో మీడియాకు లీకులిచ్చి సంబంధిత నటీనటుల కుటుంబీకులు బాధపడేలా, వారి గౌరవం దెబ్బతినేలా అకున్ సబర్వాల్, అతడి దర్యాప్తు బృందం వ్యవహరిస్తోంది. డ్రగ్స్ నియంత్రణలో అకున్ పాత్ర సరైనదే కానీ, విచారణకు హాజరవుతున్న వారితో సిట్ వ్యవహరిస్తున్న తీరుపై మీడియాలో వచ్చే ఊహాగానాలను ఆపడం మీ బాధ్యత కాదా? విచారణ జరుగుతున్న తీరుపై మీడియాకు లీకులిచ్చి సంబంధిత విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తుల పట్ల మీ విభాగం అమర్యాదగా ప్రవర్తిస్తోంది’ అంటూ రాంగోపాల్ వర్మ ఫేస్బుక్లో కామెంట్లు చేశారు. కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తాం... డ్రగ్స్ కేసు విచారణ జరుపుతున్న అధికారులు, అకున్ సబర్వాల్‌పై వివాదాస్పద కామెంట్లు చేసిన వర్మపై ఎక్సైజ్ సిట్‌తోపాటు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం తీవ్రంగా స్పందించింది. ఎలాంటి ఆధారాల్లేకుండా విచారణ సంస్థ, అధికారులపై ఆరోపణలు చేసిన వర్మపై హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేస్తామని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మహమూద్ అలీ మీడియాకు తెలిపారు. అరెస్టు తప్పదని హెచ్చరించారు. వర్మ విజ్ఞతకే వదిలేస్తున్నాం: చంద్రవదన్ రాంగోపాల్‌వర్మ చేసిన కామెంట్లు సరికాద ని, అయినా ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ చెప్పారు. అన్ని ఆధారాలతోనే విచారణ జరుగుతోందని, అంద రూ సహకరిస్తున్నారని తెలిపారు. చట్టాలకు లోబడే చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వం పూర్తి అధికారం ఇచ్చిందని చెప్పారు. కేవలం సినిమా వాళ్లనే టార్గెట్ చేశామని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఎక్సైజ్ శాఖను దెబ్బతీసే ప్రయత్నం కొంత మంది చేస్తున్నారని, వాటిని ఖండిస్తున్నామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న పబ్బులకు నోటీసులిచ్చి విచారణ జరిపామన్నారు. వీటిలో నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరిస్తున్న ‘ఎఫ్ క్లబ్’ పబ్ లైసెన్స్ రద్దు చేశామన్నారు. మరో 14 పబ్బుల యాజమాన్యాలకు హెచ్చరిక నోటీసులిచ్చామని, సీసీ కెమెరాలు, రికార్డులు తదితర వివరాలు నమోదు చేయాలని స్పష్టం చేశామన్నారు. పబ్బుల్లో డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు అనుమానం వస్తే సమాచారం ఇవ్వాలని, అక్కడ పార్టీలు చేసే ఈవెంట్‌మేనేజర్లు, డ్యాన్సర్ల వివరాలను ఇవ్వాలని ఆదేశించారు. ఆరు నెలల నుంచి ఉన్న సీసీ టీవీ ఫుటేజీలు సమర్పించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పబ్బుల లైసెన్స్ సస్పెన్డ్ చేస్తామని హెచ్చరించారు. -
నో డౌట్.. డైరెక్టర్ వర్మ అరెస్టు ఖాయం!
సిట్ విచారణను ఆటంకపరిచేలా వ్యాఖ్యలు చేశారు ఆయనపై కేసు పెడుతాం... హైదరాబాద్: డ్రగ్స్ కేసులో సినీప్రముఖులను విచారిస్తున్న సిట్ అధికారులపై దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై ఎక్సైజ్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. డ్రగ్స్ కేసును విచారిస్తున్న అధికారి లక్ష్యంగా వర్మ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొంది. ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్, సిట్ అధికారులపై వర్మ వ్యాఖ్యల నేపథ్యంలో ఎక్సైజ్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అలీ మీడియాతో మాట్లాడారు. ఎక్సైజ్‌శాఖ చేపడుతున్న విచారణపై అభ్యంతరం వ్యక్తం చేయడం ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం చట్టవిరుద్ధమని ఆయన తెలిపారు. రాంగోపాల్ వర్మపై కఠిన చర్యలు తీసుకోవాలని తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, సాయంత్రం ఆయనపై ఆబిడ్స్ పోలీసు స్టేషన్ లేదా ఎక్సైజ్ పోలీసు స్టేషన్లో కేసు నమోదుచేస్తామని తెలిపారు. సిట్ అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మ అరెస్టు ఖాయమని, నో డౌట్ అని ఆయన వ్యాఖ్యానించారు. డ్రగ్స్ కేసులో విచారణను ఆటంకపరిచేవిధంగా వర్మ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. అకున్ సబర్వాల్ ఫొటో పెట్టి బాహుబలి-3 అంటూ వర్మ వ్యాఖ్యలు చేయడం చాలా అభ్యంతరకరని మండిపడ్డారు. డ్రగ్స్ కేసులో సిట్ విచారణ ఎదుర్కొన్న పూరీ జగన్నాథ్, సుబ్బరాజులకు మద్దతుగా తాజాగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 'సిట్ అధికారులు పూరీ జగన్నాథ్, సుబ్బరాజు మిగిలిన సినీ ప్రముఖులు విచారించినట్టుగానే స్కూల్ విద్యార్థులను కూడా విచారిస్తారా..? ప్రస్తుతం మీడియా అకున్ సబర్వాల్ ను అమరేంద్ర బాహుబలి లా చూపిస్తుంది. రాజమౌళి ఆయనతో బాహుబలి 3 తీయాలేమో. అకున్ సబర్వాల్ గారి సమగ్రతను ఎవరు అనుమానించటం లేదు. కానీ ఎలాంటి ఆరోపణలు, ఆధారాలు లేకుండా మీడియాకు లీకులివ్వటం, ప్రముఖులకు కీర్తికి భంగం కలిగించే విధంగా, వారి కుటుంబాలకు బాధ కలిగించే విధంగా ప్రవర్తించటం దురదృష్టకరం' అంటూ తన ఫేస్ బుక్ పేజ్ లో వర్మ పోస్ట్ చేశారు. ఆయన వ్యాఖ్యలను ఇప్పటికే తెలుగు ఆర్టిస్టుల సంఘం 'మా' సైతం తప్పుబట్టింది. -
డ్రగ్స్ మూలాలపై దర్యాప్తు ఏదీ?
కెల్విన్‌కు డ్రగ్ సరఫరా గుట్టు తేల్చడంపై దృష్టి సారించని ఎక్సైజ్ సిట్ - డ్రగ్స్ దొరకకున్నా కొందరికి నోటీసులు, విచారణ పేరుతో హడావుడి - డార్క్ నెట్, కొరియర్ రవాణా అంశాలపై నిర్లక్ష్యం - కెల్విన్ అరెస్ట్ రోజు ఓ ప్రముఖ నిర్మాత ఉన్నాడని చెప్పిన అకున్ - దర్యాప్తు జాబితాలో ఏ నిర్మాత పేరూ లేని వైనం - ఆ నిర్మాత సహా మరో 14 మంది ప్రముఖులు తప్పించుకున్నట్లేనా? - తీవ్ర ఒత్తిళ్ల కారణంగా వారి విచారణపై సందిగ్ధం సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ కేసులో విచారణ తీరు ఏమిటన్నది గందరగోళంగా మారింది. అసలు డ్రగ్స్ మూలాలను పెకలించాల్సింది పోయి.. వాటిని వినియోగించిన వారిని మాత్రమే టార్గెట్ చేయడమేమిటన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కెల్విన్‌కు డ్రగ్స్ ఎక్కడినుంచి సరఫరా అయ్యాయి, కెల్విన్ పైన మరింత మంది డ్రగ్ పెడ్లర్లు ఉన్నారా? ఉంటే వారెవరు? అసలు డ్రగ్స్ సరఫరా మూలాలు ఎక్కడున్నాయి? వాటిని నియంత్రించేదెలా.. వంటి అంశాలన్నీ పక్కదారి పట్టాయి. డ్రగ్స్‌కు బానిసైన వారిని, వినియో గించిన వారిని బాధితులుగా పరిగణిస్తారని... కానీ వారే ప్రధాన నిందితులు అనే స్థాయిలో ఎక్సైజ్ సిట్ హడావుడి చేయడమేమిటంటూ పోలీసు శాఖ అధికారులే విస్తుపోతున్నారు. ఒకవేళ వారు డ్రగ్ పెడ్లర్లుగా భావిస్తే.. వారి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసి, డ్రగ్స్ ఉంటే స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుందని.. కానీ నోటీసులు ఇచ్చి ప్రశ్నించడం ఏమిటని పేర్కొంటున్నారు. డార్క్ నెట్లపై సిట్ మౌనం కెల్విన్ సహా ఇతర పెడ్లర్లు డార్క్‌నెట్ ద్వారా డ్రగ్స్ తెప్పించారని పేర్కొన్న ఎక్సైజ్ సిట్.. ఆ డార్క్ నెట్, వాటి నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్ సరఫరాలను నియంత్రించే అంశంపై దృష్టి పెట్టలేదన్న ఆరోపణ వినిపిస్తోంది. డార్క్ నెట్ వెబ్సైట్ల నియంత్రణకు ఎన్ఐసీ (నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్)కి లేఖ రాయా లి. కానీ ఇప్పటివరకు సిట్ అనుమానిత డార్క్‌నెట్ సైట్లపై ఎన్ఐసీకి లేఖ రాయలేదని సమాచారం. దీనిపై సిట్ అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించినా.. స్పందన రాలేదు. అసలు గుట్టు తేలేనా? కెల్విన్‌కు గోవా, జర్మనీల నుంచి డ్రగ్ వచ్చిందని సిట్ చెబుతోంది. గోవా నుంచే డ్రగ్ వస్తోందని తెలిసినప్పుడు ప్రత్యేకంగా ఒక బృందాన్ని గోవాకు పంపించి దర్యాప్తు చేయాల్సి ఉంది. అక్కడి మూలాలను ఛేదిస్తే మొత్తం నెట్వర్క్ బయటపడేది. కానీ సిట్ ఆ దిశగా దృష్టి పెట్టలేదు. అంతేగాకుండా కెల్విన్ డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు ఎక్కడి నుంచి వివరాలు సేకరించాడు? డార్క్ నెట్ వెబ్సైట్ల అంశం అతడికి ఎలా తెలిసిందన్న కోణంలోనూ పరిశీలన జరగడం లేదన్న విమర్శలున్నాయి. బడా నిర్మాత సేఫ్..? డ్రగ్స్ వ్యవహారంలో పలు ఇంటర్నే షనల్ స్కూళ్ల విద్యార్థులతో పాటు ఓ బడా సినీ నిర్మాత కూడా ఉన్నట్లు కెల్విన్ విచారణలో తేలిందని కొద్దిరోజుల కింద అకున్ సబర్వాల్ వెల్లడించారు. ఆ నిర్మాతకు కూడా నోటీసులిచ్చి విచారిస్తామన్నారు. కానీ ఇప్పుడు ఆ బడా నిర్మాత అంశం మరుగున పడిపోవడం గమనార్హం. దీనిపై సిట్ అధికారులెవరూ నోరు మెదపడం లేదు. -
గంజాయి జోరు
⇔జిల్లా అంతటా విస్తరిస్తున్న గంజాయి విక్రయాలు ⇔ఒడిశా సరిహద్దు జిల్లాల నుంచి రవాణా..? ⇔పట్టనట్లు వ్యవహరిస్తున్న పోలీస్, ఎక్సైజ్ అధికారులు ⇔తూతూ మంత్రంగా కేసుల నమోదు ఒంగోలు క్రైం: జిల్లాలో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మద్యం షాపుల జోరు, బెల్ట్ షాపుల హుషారుతో ఉన్న ఎక్సైజ్ అధికారులు గంజాయి విక్రయాలు జిల్లా నలుమూలలా విస్తరించినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ఒంగోలు నగరంతోపాటు మున్సిపాలిటీలు, ప్రధాన మండల కేంద్రాల్లోనూ గంజాయి జోరుగా లభ్యమవుతోంది. అయినా అటు పోలీసులుకాని ఇటు ఎక్సైజ్ అధికారులుకాని సరఫరా అవుతున్న మూలాలపై దృష్టి సారించటంలేదు. రైల్వే రూట్లో... రైల్వే లైన్లు ఉన్న చీరాల–గూడూరు లైన్లోనూ, వినుకొండ–మార్కాపురం లైన్లోనూ విచ్చలవిడిగా విక్రయాలు సాగుతున్నాయి. ఎప్పుడో ఒకసారి ఉన్నతాధికారులు గంజాయి విక్రయాలపై కఠినంగా అడిగినప్పుడు మాత్రం నామమాత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. రైల్వే లైన్లలోని రైల్వే స్టేషన్లు ఉండే గ్రామాలు, పట్టణాలతో పాటు జాతీయ రహదారి వెంట ఉన్న పట్టణాలు, మండల కేంద్రాల్లోనూ గంజాయి విక్రయాలు సాగుతున్నాయి. ఒడిశా సరిహద్దు జిల్లాల నుంచి వేర్వేరు ప్రాంతాలకు రవాణా అవుతున్నట్టు సమాచారం. ఈ విషయం పోలీసులకు తెలిసినా చేతులు తడుపుకొని తెలిసీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. నగరం నడిబొడ్డున గంజాయి స్వాధీనం.. గత ఏడాది ఒంగోలు నగరంలోని సీవీఎన్ రీడింగ్ రూములో పేకాట అనుమతి తెచ్చుకొని నిబంధనలకు విరుద్దంగా కోతముక్క ఆడిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు అప్పట్లో దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో సీవీఎన్ రీడింగ్ రూములోనే కేజీకి పైగా గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో ఆ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం రేపింది. జిల్లా కేంద్రం ఉన్న క్లబ్‌లోనే గంజాయి దొరికిందంటే ఇక చాటుమాటుగా ఏస్థాయిలో గంజాయి విక్రయాలు జోరందుకుంటున్నాయో అర్ధం చేసుకోవచ్చు. నాలుగేళ్లలో 32 కేసుల నమోదు.. గత నాలుగేళ్లలో ఎక్సైజ్ అధికారులు 32 గంజాయి కేసులు నమోదు చేశారు. 285 కేజీల ఎండిపోయిన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 33 మందిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. 2013–14లో గిద్దలూరు ప్రాంతంలో సాగుచేసిన గంజాయి తోటపై దాడి చేసిన ఎక్సైజ్ పోలీసులు 2,108 మొక్కలను ధ్వంసం చేశారు. పొలం యజమానిని అరెస్ట్ చేశారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు 2015లో నాలుగు గంజాయి కేసులు నమోదు చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు. 37 కేజీల ఎండిపోయిన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 2016లో ఏడు గంజాయి కేసులు నమోదు చేశారు. 30 మందిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా 700 గ్రాముల నల్లమందు స్వాధీనం చేసుకొని దానిని సరఫరా చేస్తున్న ఇరువురిని అరెస్ట్ చేసి, రెండు కేసులు నమోదు చేశారు. -
సినీ ప్రముఖులకు సర్కారు అండ!
తెలంగాణ ప్రభుత్వం వారిని కాపాడుతోంది బీజేవైఎం ఆరోపణ.. ఎక్సైజ్ ఆఫీస్ ముట్టడి హైదరాబాద్: టాలీవుడ్ సినీ పరిశ్రమ డ్రగ్స్ మాఫియాలో చిక్కుకుపోయి విలవిలలాడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే డ్రగ్స్ తీసుకుంటున్నారన్న ఆరోపణలపై 12మంది సినీ ప్రముఖులకు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ నోటీసులు ఇచ్చింది. డ్రగ్స్ రాకెట్ సూత్రధారి కెల్విన్ కాల్‌లిస్ట్‌లో మరో 15మంది సినీ ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయని, కానీ ప్రభుత్వ పెద్దలతో తెరవెనుక మంతనాలు జరిపి.. వారు తమ పేర్లు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేవైఎం కార్యకర్తలు శనివారం నగరంలోని ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎక్సైజ్ కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. డ్రగ్స్ వ్యవహారంలో చిక్కుకున్న సినీ ప్రముఖులను తెలంగాణ ప్రభుత్వం కాపాడుతుందని వారు ఆరోపించారు. బీజేవైఎం కార్యకర్తల ఆందోళనను పోలీసులు అడ్డుకోవడంతో ఇక్కడ ఉద్రిక్తత నెలకొంది. -
మద్యం షాపు మార్చాలని వినతి
ఎల్.ఎన్.పేట: మండల కేంద్రంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మద్యం షాపు ఏర్పాటు చేస్తున్నారని, ఇందుకు ఎక్సైజ్ అధికారులు వత్తాసు పలుకుతున్నారని పలువురు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం ఆందోళన చేశారు. అనంతరం తహసీల్దార్ కె.అప్పారావుకు వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రధాన రహదారికి కనీసం 100 అడుగుల దూరంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చెబుతున్న ఇక్కడ అందుకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్నారని మండల కేంద్రానికి చెందిన ఎం.ఆదెమ్మ, ఆర్.జ్యోతి, ఎం.భాగ్యలక్ష్మి, డి.శ్రీనివాసరావు, కె.సింహాచలంతో పాటు పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మద్యం దుకాణానికి సమీపంలోనే శ్రీభక్తాంజనేయ స్వామి దేవాలయం ఉందని, ఎదురుగా తహసీల్దారు, ఎంపీడీఓ, ఐకేపీ కార్యాలయాలకు వెళ్లేందుకు రోడ్డు ఉందన్నారు. వైన్ షాపు ఉన్నచోటే రోడ్డుపై ఆటోలు నిలుపుతారని దీని వల్ల ఇబ్బందులు వస్తాయన్నారు. ఈ మేరకు మరోచోట దుకాణం ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. ఫిర్యాదును జిల్లా అధికారులకు పంపించి తగిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. -
డ్రగ్స్ కేసు: మరో ముగ్గురి అరెస్టు
హైదరాబాద్: రాజధాని హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో మరో భారీ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు రట్టయింది. ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం మరో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అరెస్టయిన వారి వద్ద నుంచి భారీగా డ్రగ్స్ ప్యాకెట్లు, 20 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అసిస్టెంట్ కమిషనర్ హరికిషన్ నేతృత్వంలో దాడులు జరిగాయి. నగరంలోని బంజారాహిల్స్ ప్రాంతంలో మత్తుమందు విక్రయిస్తున్నారనే సమాచారంతో దాడులు చేసిన ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు ఆఫ్రికన్ దేశస్తుడు కాగా.. మరో ఇద్దరు స్థానికులని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. డ్రగ్స్ కేసులో ఇప్పటివరకూ అరెస్ట్ చేసిన ముఠాకు ఈ ముఠాకు సంబంధాలు లేవని సమచారం. ప్రస్తుతం సిట్ బృందం అరెస్ట్ చేసిన ముఠా సభ్యులు ఢిల్లీ, హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో విరివిగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
నాటు ఇక నీటు
చేయూత ► సారా తయారీదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు ► ఒక్కొక్కరికి రూ. 2 లక్షల ఆర్థిక సహాయం ► ప్రత్యేక కార్యక్రమంఅమలుకు చర్యలు.. నాటు సారా తయారీ వారి జీవనాధారం.. తరచూ ఎక్సైజ్ అధికారుల దాడులు.. కేసులు, అరెస్టులు.. అయినా కుటుంబ పోషణ కోసం వేరేదారి లేక అదే ఊబిలో కూరుకుపోవడం.. పరిపాటిగా తయారైన వారి జీవితాలకు చేయూత నిచ్చేందుకు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. నాటు సారా కాయడం, విక్రయించడం జీవనోపాధిగా మార్చుకున్న కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను చూపించే చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ వృత్తి వదిలేసి.. గొర్రెల పెంపకం, మినీ డెయిరీలు, ఆటోలు, కిరాణషాపులు, కూరగాయలు, భూమి అభివృద్ధి, టెంట్‌హౌస్ వంటి స్వయం ఉపాధి ద్వారా జీవనం కొనసాగించేందుకు తోడ్పాటునందిస్తోంది. ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున స్వయం ఉపాధి యూనిట్లను మంజూరు చేశారు. సాక్షి, నిజామాబాద్: నాటు సారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఎక్సైజ్‌శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో 2015 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు సుమారు నాలుగు నెలల పాటు ఎక్సైజ్‌శాఖ ఈ నాటు సారా తయారీపై దృష్టి సారించింది. పెద్ద ఎత్తున దాడులు చేయడం, కేసులు నమోదు చేసింది. ఈ మేరకు నాటు సారా రహిత జిల్లాగా జిల్లా అధికార యంత్రాంగం ప్రకటించింది. ఈ క్రమంలో కేసులు నమోదైన నాటుసారా తయారీదారులు, రవాణా చేసే వారు, విక్రయించిన వారు తిరిగి ఇదే ఊబిలో కూరుకుపోకుండా చూసేందుకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు కల్పించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో 170 మంది నాటు సారా కాచే వారిని, విక్రయించే వారిని ఎక్సైజ్‌శాఖ గుర్తించింది. మోర్తాడ్, భీంగల్,ఆర్మూర్ తదితర ప్రాంతాల వారు అధికంగా ఉన్నారు. వీరికి ఆయా కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధిని కల్పిస్తున్నారు. మొదటి విడతలో 116 మందికి గిరిజన సంక్షేమశాఖ ద్వారా స్వయం ఉపాధి పథకాలను మంజూరు చేశారు. ఇందులో 46 మందికి గొర్రెల పెంపకం యూనిట్లు, 20 మందికి మిని డెయిరీలు, 17 మంది ఆటోల ద్వారా ఉపాధి పొందేలా యూనిట్లను అందించారు. అలాగే ఏడుగురికి మేకల పెంపకం, 12 మందికి కిరాణ షాపులు, కూరగాయల వ్యాపారం, ఆరుగురికి భూమి అభివృద్ధి, ఇద్దరికి ట్రా క్టర్లు, మరొకరి టెంట్‌హౌజ్, మరో ఐదుగురికి ఇతర యూనిట్ల ద్వారా స్వయం ఉపాధి యూనిట్లను మం జూరు చేశారు. ఇందుకోసం గిరిజన సంక్షేమ శాఖ ద్వారా రూ.2.32 కోట్లను మంజూరు చేసింది. కామారెడ్డి జిల్లా పరిధిలో మొత్తం 45 మంది నాటుసారా త యారీ, విక్రయదారులను గుర్తించారు. ఇందులో మొ దటి విడతలో 15 మంది లబ్ధిదారులకు గిరిజన సంక్షేమశాఖ నిధులతో స్వయం ఉపాధి యూనిట్లను మం జూరు చేశారు. గొర్రెల కొనుగోలు ప్రక్రియకు ఇప్పటికే శ్రీకారం చుట్టారు. అలాగే ఆటోల కొనుగోలుకు టెండర్లు పిలిచారు. రెండో విడతలో మిగిలిన వారికి ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి యూ నిట్లను మంజూరు చేయనున్నారు. మూడు శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నా రు. ఎక్సైజ్‌శాఖ లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ చేపట్టగా, స్వయం ఉపాధి పథకాల మంజూరు సంబం ధించి నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లు మంజూరు చేస్తాయి. ఈ యూనిట్ల కొనుగోలు, పంపిణీ వంటి ప్రక్రియ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ చేపట్టింది. ఇతర పథకాలూ లబ్ధి కేవలం స్వయం ఉపాధి పథకాలు మంజూరు చేయడమే కాకుండా ఇలాంటి కుటుంబాల్లోని చిన్నారులను మోడల్ స్కూల్, ఆశ్రమ పాఠశాలల్లో చేర్పించడం, ఆ కుటుంబాల్లోని సభ్యులకు అర్హులైన వారికి సామాజిక పెన్షన్లు ఇప్పించడం, ఉపాధి హామీ జాబ్ కార్డులు మంజూరు వంటి చర్యలు చేపట్టారు. పరివర్తన తెచ్చేందుకు.. నాటుసారా తయారీదారుల్లో పరివర్తన తెచ్చేందుకు ఈ కార్యక్రమం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. సారాకు అలవాటు పడిన వేలాది మంది కుటుంబాలను కూడా కాపాడినట్లవుతుంది. ఇందుకోసం ఈ కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ వహించాము. ఈ యూనిట్లను తీసుకున్న తర్వాత తిరిగి నాటుసారా వైపు వెళ్లకుండా ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతాం. –డేవిడ్ రవికాంత్, డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్‌శాఖ -
మత్తు వదిలిస్తాం..!
♦ ఉధృతమవుతున్న మద్యంపై మహిళల యుద్ధం..! ♦ ఇళ్ల మధ్య దుకాణాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళనలు ♦ మద్యం సిండికేట్లకు వత్తాసు పలుకుతున్న ఎక్సైజ్, పోలీసులు ♦ దుకాణాలు వెతుక్కునే పనిలో మద్యం వ్యాపారులు ♦ జిల్లాలో 94 మద్యం దుకాణాలు, 18 బార్లకు మాత్రమే లైసెన్స్‌లు మద్యం దుకాణాల ఏర్పాటులో పాలకులు, అధికారుల నిర్లక్ష్యపు కిక్కు దిగేదాకా..ఇళ్ల మధ్య నుంచి మహమ్మారి తరలిపోయేదాకా చేతబట్టిన ఉద్యమ జెండా దించబోమంటూ జిల్లాల్లో మహిళలు నినదించారు. ఇళ్ల మధ్యకొస్తున్న మద్యం దుకాణా లను తరిమికొడతామంటూ సోమవారం ఊరూవాడా రోడ్డెక్కారు. మాట వినకుంటే సీసా పగులుద్దంటూ ఇప్పటికే ఏర్పాటు చేసిన దుకాణాలపై దాడులు చేశారు. సిండికేట్లకు వత్తాసు పలుకుతూ తమకు అన్యాయం చేస్తే సహించ బోమని హెచ్చరించారు. -
అధిక ధరలకు మద్యం.. వైన్ షాపు సీజ్
వరంగల్ రూరల్: నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న ఓ వైన్ షాపును ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. వరంగల్ రూరల్ జిల్లాలోని పర్వతగిరి మండల కేంద్రంలో ఉన్న లక్ష్మి వైన్ షాపులో గత కొన్ని రోజులుగా అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న లక్ష్మి వైన్స్ షాపును సీజ్ చేయడంతో పాటు రూ. 3.50 లక్షల జరిమానా విధించారు. -
అధికారం మాది.. చెప్పింది చేయండి!
– లిక్కర్ గోడౌన్ వ్యవహారంలో ఎక్సైజ్ అధికారులకు మంత్రి కాలవ బెదిరింపులు – తన బినామీకి చెందిన భాస్కర్ ఫర్టిలైజర్స్ గోడౌన్లోనే అద్దెకు ఉండాలని హుకుం – అద్దె అధికం కావడంతో మరో గోడౌన్ యజమానితో అగ్రిమెంట్ చేసుకున్న ఎక్సైజ్ అధికారులు – మంత్రి కాలవతో పాటు ఎక్సైజ్ మంత్రి నుంచి కూడా జిల్లా అధికారులకు ఒత్తిళ్లు – నిబంధనలకు విరుద్ధంగా పనిచేయలేక తల పట్టుకుంటున్న వైనం (సాక్షి ప్రతినిధి, అనంతపురం) అధికార పార్టీ నేతలు ఆదాయం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. నిబంధనలతో పనిలేదు. అధికారులపై గౌరవం లేదు. ‘మా ప్రభుత్వం ఉంది...మేము చెప్పినట్లే జరగాల’నే ధోరణిలో వెళ్తున్నారు. తాజాగా ఎక్సైజ్ శాఖలో లిక్కర్గోడౌన్ అగ్రిమెంట్‌కు సంబంధించిన వ్యవహారంలో ఏకంగా మంత్రి కాలవ శ్రీనివాసులు అధికారులకు ఫోన్ చేసి బెదిరించగా, నిజానిజాలతో పనిలేకుండా ఎక్సైజ్ మంత్రి జవహర్ కూడా ఆయనకే వత్తాసు పలికారు. దీంతో ఈ వ్యవహారాన్ని అధికారులు ఆ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇద్దరు మంత్రుల సిఫార్సులను కమిషనర్ తోసిపుచ్చడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎక్సైజ్‌శాఖలో మంగళవారం తీవ్ర చర్చనీయాంశమైన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం నగర శివారులోని సోములదొడ్డిలో లిక్కర్గోడౌన్ ఉంది. 2016 ఏప్రిల్ 26న విద్యుత్ ప్రమాదంలో ఇది కాలిపోయింది. దీంతో గార్లదిన్నె జెడ్పీటీసీ సభ్యురాలు విశాలక్షి భర్త, భాస్కర్ ఫర్టిలైజర్స్ యజమాని భాస్కర్‌కు చెందిన గోడౌన్‌ను అద్దెకు తీసుకున్నారు. గోడౌన్‌ను అద్దెకు తీసుకునేందుకు చదరపు అడుగుకు రూ.8–11 వరకూ అనుమతి ఉంది. దీంతో రూ.8 చొప్పున అద్దె చెల్లించేందుకు ఈ ఏడాది మే 31 వరకూ భాస్కర్‌తో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇప్పటి వరకూ నెలకు రూ.1.12 లక్షల చొప్పున అద్దె చెల్లిస్తూ వచ్చారు. నేటితో అగ్రిమెంట్ గడువు ముగియనుంది. ఈ క్రమంలో రెండు నెలల కిందట అగ్రిమెంట్ పొడిగింపుపై ఎక్సైజ్ అధికారులు భాస్కర్‌తో మాట్లాడారు. ప్రస్తుతం ఇస్తున్న అద్దెలో 15 శాతం పెంచాలని భాస్కర్ కోరారు. దీంతో ఈ విషయాన్ని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అనసూయ కమిషనర్‌కు నివేదించారు. అద్దె పెంపు కుదరదని, మరో గోడౌన్ చూసుకోవాలని కమిషనర్ సూచించారు.. దీంతో రామలింగారెడ్డి అనే వ్యక్తికి చెందిన గోడౌన్‌ను నిర్ధారణ చేసుకుని.. చదరపు అడుగుకు రూ.7.50లతో అగ్రిమెంట్ చేసుకున్నారు. మంత్రి కాలవ ఒత్తిళ్లు ఎక్సైజ్ అధికారులు 15శాతం పెంచి తమ గోడౌన్లోనే కొనసాగుతారని భాస్కర్ భావించారు. అయితే.. మరో గోడౌన్ యజమానితో అగ్రిమెంట్ చేసుకోవడంతో జీర్ణించుకోలేకపోయారు. ఎలాగైనా తమ అగ్రిమెంట్ పొడిగించాలంటూ మంత్రి కాలవ శ్రీనివాసులు ద్వారా ఎక్సైజ్ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. మంగళవారం కాలవ..డీసీ అనసూయకు ఫోన్ చేసి ‘టీడీపీ నేతలకు కాకుండా ఇతరులకు మేలు చేసేలా వ్యవహరిస్తారా? అగ్రిమెంట్ భాస్కర్‌కే అయ్యేలా చూడండి’ అంటూ హుకుం జారీ చేసినట్లు తెలిసింది. అయితే.. అగ్రిమెంట్ ప్రక్రియ ముగిసిందని, ఇప్పుడు రద్దు చేస్తే రామలింగారెడ్డి కోర్టుకు వెళితే ఆయనకు అనుకూలంగానే తీర్పు వస్తుందని, ఏదైనా ఉంటే కమిషనర్‌తో మాట్లాడాలని బదులిచ్చినట్లు సమాచారం. దీంతో కమిషనర్ లక్ష్మీనరసింహంతో మంత్రి కాలవ మాట్లాడినట్లు తెలిసింది. మంత్రి సిఫార్సును కమిషనర్ కూడా తోసిపుచ్చారు. అంతటితో ఆగని కాలవ.. ఎక్సైజ్ మంత్రి జవహర్‌తో కూడా డీసీకి ఫోన్ చేయించినట్లు తెలిసింది. జవహర్‌కు కూడా డీసీ అదే సమాధానమిచ్చారు. దీంతో జవహర్ కమిషనర్‌కు ఫోన్ చేశారు. ఆయన సిఫార్సును కూడా కమిషనర్ తోసిపుచ్చినట్లు ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. తమ పరిధి మేరకు అద్దెకు సంబంధించిన వ్యవహారంపై చర్చించామని, భాస్కర్ కాదన్న తర్వాతనే మరొకరితో అగ్రిమెంట్ చేసుకున్నామని, కానీ ఇలా మంత్రుల ద్వారా ఒత్తిడి తేవడం సమంజసం కాదని ఎక్సైజ్ అధికారులు అంటున్నారు. మంత్రుల ఫోన్లు, అగ్రిమెంట్ వ్యవహారంపై మంగళవారం ఎక్సైజ్‌శాఖలో తీవ్ర చర్చ జరిగింది. కానీ తుదిగా జూన్ ఒకటి నుంచి రామలింగారెడ్డి గోడౌన్లోనే మద్యాన్ని నిల్వ చేయనున్నారు. -
పునరావాసం
► గుడుంబా తయారీ కుటుంబాలకు ప్రభుత్వం భరోసా ► స్వయం ఉపాధి కల్పనకు కార్యాచరణ ► జాబితా తయారీలో ఎక్సైజ్ అధికారులు ► ఒక్కొక్కరికి రూ.2 లక్షలు ఆర్థికసాయం ఆదిలాబాద్:, వాటిని విక్రయిస్తూ కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇటువంటి వారికి ప్రత్యామ్నాయ ఉపా«ధి అవకాశాలు కల్పించడానికి సర్కారు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ స్టేషన్ల వారీగా అర్హుల జాబితాను తయారుచేస్తోంది. జూన్ 1 వరకు పూర్తిస్థాయిలో లబ్ధిదారుల వివరాలు సేకరించి జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో గుడుంబా తయారీదారులకు పునరావాసం పథకం కింద బాధితులకు స్వయం ఉపాధి కల్పించనున్నారు. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 360 మందిని గుర్తించారు. సారా విక్రయాలపై సర్కార్ గత ఏడాది నవంబర్ నుంచి ప్రత్యేక దృష్టి సారించింది. సారాపై ఉమ్మడి జిల్లాలో ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. కేసులు, బైండోవర్ చేయడం, గ్రామీణా ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో చాలా మట్టుకు గుండా తయారీ తగ్గుముఖం పట్టిందని ఎక్సైజ్ శాఖ అధికారులు అంటున్నారు. దీంతో గుడుంబా తయారీదారులకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 11 ఎక్సైజ్ స్టేషన్లు ఆదిలాబాద్, ఇచ్చోడ, ఉట్నూర్, బైంసా, నిర్మల్, మంచిర్యాల, బెల్లంపల్లి, లక్సెట్టిపేట, చెన్నూర్, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ ఉన్నాయి. గతేడాది ఉమ్మడి జిల్లాను గుడుంబా రహిత జిల్లాగా ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పటికే చాలా మారుమూల గ్రామాల్లో పెద్ద ఎత్తున గుడుంబా, సారా విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ స్టేషన్ల పరిధిలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించినప్పుడల్లా ఎంతో మందిపై కేసులు నమోదవుతున్నాయి. అయినప్పటికీ గుడుంబా తయారీ కుటుంబాలకు ప్రధాన ఆధారం కావడంతో విక్రయిస్తూనే ఉన్నారు. జూన్ 2న రాష్ట్రాన్ని గుడుంబా రహిత రాష్ట్రంగా ప్రకటించనున్న నేపథ్యంలో తయారీదారులకు పునరావాస పథకాన్ని అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. బాధిత కుటుంబాలకు రూ.2లక్షలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో కుటుంబాలు నాటుసారా, గుడుంబా అమ్మకాలే జీవనాధారంగా ఉన్నాయి. బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించి వారిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నాలు అధికారులు ముమ్మరం చేస్తున్నారు. గుడుంబా తయారీ మానేసి జనజీవన స్రవంతిలో కలిసిన ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ విషయాన్ని ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ప్రకటించారు. 2015 జనవరి నుంచి 2016 సెప్టెంబర్ వరకు గుడుంబా విక్రయిస్తూ బైండోవర్ అయిన ప్రతి ఒక్కరూ ఈ స్కీంకు అర్హులుగా నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాలో ఇప్పటికే ఈ కుటుంబాలను గుర్తించేందుకు జాబితా తయారు చేస్తున్నారు. ఈ సాయంతో బాధితులు స్వయం ఉపాధి పొందనున్నారు. వీరందరికీ పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం ఇప్పటికే రూ.58 కోట్లు మంజూరు చేసింది. వివరాలు సేకరిస్తున్నాం.. జిల్లాలో గుడుంబా తయారీ మానేసిన వారి వివరాలు సేకరిస్తున్నాం. జూన్ 1లోగా పూర్తి జాబితాను సిద్ధం చేయనున్నాం. పునరావాస పథకం కింద గుడుంబా తయారీ కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థికసాయం అందజేయనుంది. ఇప్పటికే జిల్లాల గుడుంబా నిర్మూలనకు కృషి చేస్తున్నాం. – రమేశ్‌రాజ్, డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ -
1600 కిలోల బెల్లం స్వాధీనం
భద్రాద్రి: కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లిలో తనిఖీలు చేపట్టిన ఎక్సైజ్ శాఖ అధికారులు గుడుంబా తాయరు చేస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 1600 కిలోల నల్లబెల్లం, 50 కిలోల పట్టిక స్వాధీనం చేసుకున్నారు. శనివారం తెల్లవారుజాము నుంచి దాడులు నిర్వహించిన అధికారులు పెద్ద ఎత్తున బెల్లం ఊటను ధ్వంసం చేశారు. అదుపులోకి తీసుకన్న ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. -
నాటుసారా రహిత జిల్లాగా మారుస్తాం
కామారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ గాంధారి(ఎల్లారెడ్డి): వచ్చే జూన్ వరకు కామారెడ్డిని నాటుసారా రహిత జిల్లా గా మార్చడమే తమ లక్ష్యమని కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ అన్నారు. మండలంలోని బూర్గుల్ జీపీ పరిధిలోని సోమ్లానాయ క్ తండా, పంతులు నాయక్ తండా, దుర్గం జీపీ పరిధిలోని పలుతండాల్లో గురువారం దాడులు చేశామన్నారు. అనంతరం తండా వాసులతో సమావేశం ఏర్పాటు చేసి నాటుసారా తయారీ వలన కలిగే అనర్థాలను వివరించినట్లు తెలిపారు. గతంలో నాటుసారా పట్టుపడితే ఒక్కరిపైనే కేసులు నమోదు చేసేవాళ్లమని, ప్రస్తుతం నాటుసారా తయా రు చేసే కుటుంబసభ్యులందరినీ బా ధ్యులను చేస్తూ కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. ఈ విధానంతో అ ధికశాతం నాటుసారా తయారీ మా నుకుంటున్నారని పేర్కొన్నారు. జిల్లా లో లింగంపేట్, గాంధారి మండలాల పరిధిలోని తండాల్లో మాత్రమే రెండుశాతం గిరిజనులు నాటుసారా తయా రు చేస్తున్నారన్నారు. తండాల్లో తరచూ దాడులు చేస్తూ నాటుసారా తయారీని పూర్తిగా నివారిస్తామని పేర్కొన్నారు. ఎక్సైజ్ శాఖ సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని ఆదేశాలిచ్చామన్నారు. నాటుసారా తయారీకి వినియోగించే ముడిసరుకులు నల్లబెల్లం, స్పటిక తది తర సరుకులు లభించకుండా తండాల్లో నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. అయినా మారుమూల తండాల్లో నాటుసారా తయారుచేస్తున్నారని, వారికి కౌన్సెలింగ్ ఇచ్చి నాటుసారా తయారీని నివారించడానికి చ ర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా పరిధిలో ఎక్కడైనా నాటుసా రా తయా రు చేస్తే టోల్‌ఫ్రీ నంబరు 11800 4252523తో పాటు ఎక్సైజ్ జిల్లా కార్యాలయం నంబరు 08468 22013, 9440902737కు సమాచారం ఇవ్వాలని సూపరింటెండెంట్ కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ సత్యం, ఎక్సైజ్ సీఐలు ఏఎల్ఎన్ స్వామి, పీర్సింగ్, ఎస్ఐలు సృజన, నాగభూషణం, సిబ్బంది పాల్గొన్నారు. -
మద్యం టెండర్లకు కసరత్తు
నేడో.. రేపో నోటిఫికేషన్ - ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ - 29, 30 తేదీల్లో లాటరీ పద్ధతిలో షాపుల కేటాయింపు - 75శాతం మేర తగ్గనున్న లైసెన్సు ఫీజు మచిలీపట్నం : జిల్లాలోని మద్యం దుకాణాల కేటాయింపునకు నోటిఫికేషన్ జారీ చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. బుధవారం లేదా గురువారం నోటిఫికేషన్ విడుదలవుతుందని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి ఐదు రోజులపాటు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 29, 30 తేదీల్లో మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు. జాతీయ, రాష్ట్ర రహదారులకు ఇరువైపులా 500 మీటర్ల మేర మద్యం దుకాణాలు ఉండకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నూతన మద్యం దుకాణాల విషయంలో అమలు చేస్తారు. ఈసారి ముందుగానే... ఈ ఏడాది జూన్ నెలాఖరుకు మద్యం దుకాణాల గడువు ముగియనుంది. జాతీయ, రాష్ట్ర రహదారులకు సమీపంలో మద్యం దుకాణాలు ఉండకూడదనే సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వుల నేపథ్యంలో ఏప్రిల్ ఒకటో తేదీకే మార్పు చేసిన మద్యం విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు మచిలీపట్నం ఎక్సైజ్ ఈఎస్ తెలిపారు. జూన్ 30వ తేదీ వరకు మద్యం దుకాణాలకు పర్మిట్ ఉన్నా.. సుప్రీం ఆంక్షల నేపథ్యంలో ముందస్తుగానే దుకాణాలను కేటాయించనున్నారు. తగ్గనున్న లైసెన్సు ఫీజు గతంలో మండలాలు, నగర పంచాయతీలు, మునిసిపాల్టీలు, కార్పొరేషన్ల వారీగా మద్యం లైసెన్సు ఫీజులను నిర్ణయించారు. మచిలీపట్నం పురపాలక సంఘంలో ఒక్కో షాపునకు రూ.45 లక్షలు లైసెన్సు ఫీజుగా ఉంది. మారిన మద్యం పాలసీ ప్రకారం రూ.12.50 లక్షలు లైసెన్సు ఫీజు నిర్ణయించారు. మండలాల్లో ఒక షాపునకు గతంలో రూ.30 లక్షలు లైసెన్సు ఫీజుగా ఉంటే ప్రస్తుతం రూ.7.5లక్షలుగా ఉంటుంది. గతంలో జనాభా ప్రాతిపదికన వార్డు లేదా గ్రామాల్లో మద్యం దుకాణాలను కేటాయించేవారు. ప్రస్తుతం జాతీయ రహదారులకు దగ్గరగా మద్యం దుకాణాలు ఉండకూడదనే కోర్టు ఉత్తర్వులతో మండలం, పురపాలక సంఘం, కార్పొరేషన్, నగర పంచాయతీలను ఒక యూనిట్‌గా పరిగణిస్తున్నారు. ఈసారి నోటిఫికేషన్లో ఏ ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయాలో సంబంధిత ప్రాంతాన్ని ప్రస్తావించరని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. మద్యం దుకాణాలకు పర్మిట్ రూమ్ అనుమతి కోసం రూ.5 లక్షలు, ఏడాది పూర్తయిన తరువాత రీ–రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉంది. అధిక ధరకు మద్యం విక్రయిస్తూ పట్టుబడితే రూ.5 లక్షలు జరిమానా విధిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.5వేలు మద్యం దుకాణాలకు రూ.5వేలు దరఖాస్తు ఫీజు చెల్లించాలి. మండలంలో రూ.50వేలు, మునిసిపాల్టీలో రూ.75వేలు, కార్పొరేషన్లో రూ.లక్ష రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాలి. ఎక్సైజ్‌శాఖ రూపొందించిన సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించి దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు, ఐటీ రిటర్న్స్ తదితర వివరాలను పరిశీలించి హాల్‌టికెట్ ఇస్తారు. ఈ హాల్‌టికెట్‌కు యూనిక్ ఐడీ, పాస్వర్డ్ ఉంటుంది. వీటిని సంబంధిత ఎక్సైజ్ సీఐ, సూపరింటెండెంట్ పరిశీలించి ఆమోదం తెలుపుతారు. ఈ హాల్‌టికెట్ యునిక్ కోడ్ సక్రమంగా ఉంటేనే దరఖాస్తుదారులు లాటరీ సమయంలో హాజరయ్యేందుకు అవకాశం ఇస్తారు. మద్యం షాపుల కేటాయింపు, దరఖాస్తుల స్వీకరణ అంతా ఆన్లైన్లోనే ఉన్నా.. షాపుల కేటాయింపు మాత్రం దరఖాస్తుదారుల సమక్షంలో లాటరీ పద్ధతిలోనే నిర్వహిస్తారు. గతంలో జిల్లాలోని 334 మద్యం దుకాణాలకు 3,333 దరఖాస్తులు రాగా, రూ.12.57 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. ఈసారి అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చి రూ.15 కోట్లు ఆదాయం వస్తుందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. -
తర్జనభర్జన
- హైవేల పక్కన మద్యం దుకాణాల తొలగింపునకు ‘సుప్రీం’ ఆదేశం - జిల్లాలో 247 మద్యం దుకాణాల్లో 179 హైవేల పక్కనున్నవే - తొలగింపునకు ఈ నెల 31 డెడ్‌లైన్.. - ఎక్సైజ్ అధికారులు, మద్యం దుకాణాదారుల్లో టెన్షన్ అనంతపురం సెంట్రల్ : జాతీయ, రాష్ట్రీయ రహదారుల పక్కన ఉన్న మద్యం దుకాణాల తొలగింపుపై ఎక్సైజ్ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం ద్వారా అధికశాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రధానంగా జాతీయ రహదారికి ఆనుకుని మద్యం షాపులు, బార్లు ఉండడం ద్వారా ప్రజలు మరింత ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. తాగి హైవేలపై రయ్‌మంటూ వాహనాలు నడుపుతున్నారు. వారు నష్టపోవడంతో పాటు ఎదురుగా వస్తున్న అమాయకుల ప్రాణాలను సైతం బలిగొంటున్నారు. ఈ అంశంపై రెండు నెలల క్రితం సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. జాతీయ రహదారుల పక్కన మద్యం దుకాణాలను తొలగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు మార్చి 31 గడువు విధించింది. జిల్లాలో మెజార్జీ మద్యం దుకాణాలు హైవేపైనే ఉన్నాయని అధికారుల సర్వేలో తేలింది. మొత్తం 247 మద్యం షాపులలో జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన 179 షాపులు ఉన్నట్లు గుర్తించారు. వ్యాపార కోణంలో ఆలోచించి ప్రతి ఒక్కరూ హైవే పక్కనే ఏర్పాటు చేసుకున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ షాపులను ఏం చేయాలో అర్థం కాక అధికారులు సతమతమవుతున్నారు. సదరు మద్యం దుకాణాలకు జూన్ వరకూ లైసెన్స్ గడువు ఉంది. దీంతో రెండు నెలలు మినహాయించాలని దుకాణాదారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో న్యాయంస్థానం నుంచి ఎలాంటి కబురు వస్తుందో అనే టెన్షన్ ఇటు అధికారుల్లోనూ, మద్యం దుకాణాదారుల్లోనూ నెలకొంది. ఆదేశాలు రాలేదు జిల్లాలో మద్యం దుకాణాలకు జూన్ వరకూ గడువు ఉంది. న్యాయస్థానం మార్చి 31లోగా హైవేల పక్కన ఉన్న వాటిని తొలగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కొంతమంది దుకాణాదారులు మరికొంత గడువు కావాలని కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇంకా స్పష్టమైన ఆదేశాలు రాలేదు. ఉత్తర్వులను అనుసరించి చర్యలు తీసుకుంటాం. - అనుసూయదేవి, డిప్యూటీ కమిషనర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ -
‘బెల్ట్’ తీసే వారేరి?
విచ్చలవిడిగా బెల్ట్ షాపుల నిర్వహణ ఏరులై పారుతోన్న మద్యం బాల్కొండ: గ్రామాల్లో బెల్ట్ షాపుల నిర్వహణ జోరుగా సాగుతోంది. పల్లెల్లో మద్యం ఏరులై పారుతోంది! ఎక్సైజ్ అధికారులు ‘మామూలు’గా తీసుకోవడం, వీడీసీలు సైతం మద్దతు పలుకుతుండడంతో బెల్ట్ షాపుల దందా దర్జాగా నడుస్తోంది. ముప్కాల్, మెండోరా తదితర మండలాల పరిధిలో బెల్ట్‌షాపులు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ప్రతి గ్రామంలో షాపులు ఏర్పాటు చేసి, అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారు. ముప్కాల్ మండలంలో ముప్కాల్తో పాటు రెంజర్లలో, అలాగే, మెండోరా మండలంలో మెండోరాతో పాటు దూదిగాంలో ఎన్‌హెచ్ 44కు సమీపంలో వైన్ షాపులు ఉన్నాయి. మిగతా అన్ని గ్రామాల్లో బెల్ట్ షాపులు వెలిశాయి. ఒక్క శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కాలనీలోనే నాలుగు బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్నారంటే ఏ స్థాయిలో ఈ అక్రమ దందా కొనసాగుతుందో ఊహించుకోవచ్చు. ఎక్సైజ్ అధికారులను, పోలీసులను మచ్చిక చేసుకుంటున్న నిర్వాహకులు.. గ్రామాభివృద్ధి కమిటీల సహకారంతో జోరుగా మద్యం విక్రయిస్తున్నారు. ఇందుకోసం ప్రతి నెలా వీడీసీలకు, అధికారులకు ఎంతో కొంత ముట్టచెబుతున్నారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువే బెల్ట్ షాపులను నియంత్రించాల్సిన అధికారులతో పాటు వీడీసీలు సైతం కిమ్మనక పోవడంతో నిర్వాహకులు రెచ్చి పోతున్నారు. కొంత మంది బెల్ట్ షాపులనే వృత్తిగా మలుచుకున్నారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తూ మందుబాబుల జేబు లు గుల్ల చేస్తున్నారు. ఒక్కో బీరుకు రూ.10, క్వార్టర్‌పై రూ.10–15 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ప్రతి నెలా ఆదాయం వస్తుండడంతో వీడీసీలు ఈ అక్రమ దందాను చూసీ చూడనట్లు వదిలేస్తున్నాయి. మరోవైపు, ‘బెల్ట్’ తీయాల్సిన ఎక్సైజ్, పోలీస్ అధికారులు ‘మామూలు’గానే ‘మత్తు’లో తూగుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బెల్ట్‌షాపులను నియంత్రించాలని పలు గ్రామాల వాసులు కోరుతున్నారు. -
కల్తీ దందా
► నీళ్లు, స్పిరిట్ కలిపి మద్యాన్ని కల్తీ చేస్తున్న వ్యాపారులు ► ఇప్పటికే పలు కేసులు నమోదు ∙ఆందోళనలో మందుబాబులు ► పట్టించుకోని ఎక్సైజ్‌శాఖ అధికారులు సిర్పూర్(టి) : జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో కల్తీ మద్యం ఏరులైపారుతోంది. ధనార్జనే ధ్యేయంగా వ్యాపారులు మద్యాన్ని కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మద్యంలో నీళ్లు, స్పిరిట్ కలిపి కల్తీ చేస్తున్నారు. గతంలో కాగజ్‌నగర్, దహెగాం మండలాల్లో కల్తీ మద్యం తయారు చేసిన బాటిళ్లలో స్పిరిట్ కలిపినట్లు తేలడంతో సిర్పూర్ నియోజకవర్గ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తరుచూ అధికారుల దాడుల్లో లూజ్ విక్రయాలు జరుగుతున్నట్లు తేలడంతో కల్తీ మద్యంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు కొందరు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదులు చేసినా వారు పట్టించుకోవడం లేదు. దీంతో జిల్లా ఉన్నతాధికారులు, ఎన్ఫోర్స్మెంట్, టాస్క్‌పోర్స్ హైదరాబాద్ అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తున్నారు. స్థానికులు ఫిర్యాదు చేస్తే కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. మామూళ్ల మత్తులో పడి ఎక్సైజ్ అధికారులు పర్యవేక్షణ చేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్‌నగర్, దహెగాం మండలాల్లో ఇది వరకే కల్తీ మద్యం లభించడంతో పలు కేసులు నమోదయ్యాయి. అయినా పలు మద్యం దుకాణాల్లో లూజ్ విక్రయాలు, అక్రమ రవాణా నిలిపివేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. మచ్చుకు కొన్ని సంఘటలు.. గతంలో కాగజ్‌నగర్ పట్టణంలోని కాపువాడలో అధికారులు చేసిన దాడుల్లో ఓ ఇంటిలో ఉన్న కల్తీ మద్యం తయారు చేసే పరికరాలు, ఖాళీ బాటిళ్లు, బాటిళ్లకు అమర్చే మూతలు చూసి నివ్వెరపోయారు. ఆ ఇంటిలో బాటిళ్లకు అమర్చే 15వేల మూతలు, 5వేల ఖాళీ బాటిళ్లు, 8 కాటన్ల మద్యం లభించింది. ఇంటిలో కల్తీ మద్యం తయారు చేస్తున్న ఇద్దరిపై కేసులు కూడా నమోదు చేశారు. దీనికి ముందు దహెగాం మండలంలోని ఓ వ్యాపారి కల్తీ మద్యం విక్రయిస్తుండగా పట్టుబడటంతో కేసు నమోదైంది. అలాగే కాగజ్‌నగర్ పట్టణంలోని ఓ వైన్‌షాపులో లూజ్ విక్రయాలు జరుపుతుండటంతో కేసు నమోదు చేశారు. సిర్పూర్(టి)లోని మద్యం షాపులో గతంలో అదిక ధరలు, లూజ్ విక్రయాలు చేస్తుండగా అధికారులకు పట్టుబడటంతో కేసులు నమోదు చేశారు. పదిహేను రోజుల క్రితం తిరిగి కల్తీ మద్యం, లూజ్ విక్రయాలు జరుపుతున్నారని గుర్తు తెలియని వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి షాపుసీజ్ చేసి కేసు నమోదు చేశారు. షాపులోని 12లూజ్ బాటిళ్లను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు. లూస్ విక్రయాలు చేసినందుకు రూ.5లక్షల జరిమానా విధించారు. మహారాష్ట్రకు రవాణా.. మహారాష్ట్రలోని చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాల్లో మద్య నిషేధం ఉండటంతో మహారాష్ట్రలోని పలు పట్టణాలు,, గ్రామాలకు మద్యం అక్రమ రవాణా చేస్తున్నారు. మహారాష్ట్రలోని ఈ రెండు జిల్లాలు నియోజకవర్గంలోని సిర్పూర్(టి), కౌటాల, బెజ్జూర్ మండలాలకు ఆనుకోని ఉండటంతో మద్యం అక్రమ రవాణా జోరుగా కొనసాగుతోంది. అలాగే కాగజ్‌నగర్ పట్టణం నుంచి రామగిరి ప్యాసింజర్, నాగ్‌పూర్ ప్యాసింజర్, భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ ద్వారా రాత్రి సమయాల్లో మహారాష్ట్రకు మద్యం రవాణా చేస్తున్నారు. రైళ్లలో అప్పుడప్పుడు చేసిన తనిఖీలలో మద్యం రవాణాదారులు మద్యం వదిలి వెళ్లడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిర్పూర్(టి)–మాకిడి అంతర్రాష్ట్ర రోడ్డు గుండా ప్రతీరోజు మద్యం అక్రమ రవాణా చేస్తుండటంతో పోలీసులు తనిఖీలు నిర్వహించి మద్యం రవాణా చేస్తున్న వాహనాలు సీజ్ చేసి పలు సార్లు కేసులు నమోదు చేశారు. అడపాదడపా ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నా అక్రమ రవాణాను అడ్డుకోవంలో విఫలమవుతున్నారు. అలాగే కౌటాల, బెజ్జూర్ మండలాల నుంచి సమీపంలో ఉన్న పెన్‌గంగ, ప్రాణహిత నదులను దాటిస్తూ మహారాష్ట్రకు మద్యం రవాణా చేస్తున్నారు. కౌటాల మండలంలో సైతం పలుమార్లు అక్రమ రవాణా చేస్తున్న వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. మద్యం షాపుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా మద్యం తరలిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు స్పందించి కల్తీ మద్యం జరగకుండా చర్య తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం మద్యం అక్రమరవాణా, కల్తీ మద్యం, లూజ్ విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇటీవల వచ్చిన ఫిర్యాదుల మేరకు తనిఖీలు నిర్వహించి సిర్పూర్(టి) షాపులో లూజ్ విక్రయాలు చేస్తుండటంతో షాపును సీజ్ చేసి రూ.5లక్షల జరిమానా విధించాం.– మంగమ్మ, ఎక్సైజ్ సీఐ -
మద్యం షాపులకు తప్పని స్థాన చలనం
⇔సుప్రీం కోర్టు ఉత్తర్వులతో జిల్లాలో 200 మద్యం షాపుల తరలింపు ⇔ప్రధాన రహదారులకు 500 మీటర్ల దూరంలో ఏర్పాటుకు కసరత్తు ⇔ఇప్పటికే నోటీసులు జారీ చేసిన ఎక్సైజ్ అధికారులు తిరుపతి క్రైం: రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులకు పక్కన ఉన్న మద్యం షాపులను తొలగించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమ ఉత్తర్వులను 2017 ఏప్రిల్ 1 నుంచి తప్పని సరిగా అమలు చేయాలని ఆదేశించింది. ఆయా ప్రధాన రహదారులకు 500 మీటర్ల దూరంగా ఆలయాలకు, విద్యాసంస్థలకు 100 మీటర్ల దూరంలో ఉండాలని నిర్దేశించింది. సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం జిల్లాలోని సుమారు 200 దుకాణాలను తొలగించాల్సింది. దీంతో మద్యం దుకాణాల నిర్వాహకులు గగ్గోలు పెడుతున్నారు. ఇటు ఎక్సైజ్ అధికారులు ఇప్పటికే అలాంటి దుకాణాలకు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో వేరొక చోట షాపుల ఏర్పాటుకు ఎక్సైజ్ అధికారులు, వైన్‌షాపు యజమానులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా జిల్లాలో మద్యం దుకాణాలు విచ్చలవిడిగా ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో జనసాంధ్రతను బట్టి దుకాణాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ అంతర్రాష్ట్ర సరిహద్దుల ఆధారంగా దుకాణాలు వెలిశాయి. ప్రస్తుతం చిత్తూరు ఎక్సైజ్‌శాఖ పరిధిలో 206, తిరుపతి పరిధిలో 190 దుకాణాలకు ప్రభుత్వం లైసెన్స్‌లు జారీ చేసింది. ఏటా సగటున రూ.255 కోట్లుకు పైగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. అలాగే లైసెన్స్ ఫీజుల రూపంలో రూ.350 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. ఈ తరుణంలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లాలోని సుమారు 200 షాపుల వరకు తొలగించి వేరొక చోట ఏర్పాటు చేసుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ప్రధాన రహదారుల్లో... ⇔చెన్నై– బెంగళూరు జాతీయ రహదారి (ఎన్‌హెచ్ 4)లో 28 మద్యం దుకాణాలు ఉన్నాయి. ⇔కలకడ–చిత్తూరు (ఎన్‌హెచ్ 40) రోడ్డుపై 11 మద్యం దుకాణాలు ఉన్నాయి. ⇔మదనపల్లె – క్రిష్ణగిరి (ఎన్‌హెచ్ 42) రోడ్డుపై 18 మద్యం దుకాణాలు ఉన్నాయి. ⇔రేణిగుంట (ఎన్‌హెచ్ 716) రోడ్డులో 21 మద్యం దుకాణాలు ఉన్నాయి. ⇔పూతలపట్టు – తిరుపతి (ఎన్‌హెచ్ 140) రోడ్డులో 32 మద్యం దుకాణాలు ఉన్నాయి. ⇔పుత్తూరు రాష్ట్ర రహదారిపై 17 మద్యం దుకాణాలున్నాయి. ⇔జిల్లాలో ఎన్‌హెచ్, ఎస్‌హెచ్‌లపై 8 బార్లు, జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉన్న 98 అనధికార మద్యం దుకాణాలను తొలగించాల్సిందే. కోర్టు తీర్పుపై ఎదురుచూపు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీలు చేసింది. జాతీయ ప్రధాన రహదారులను పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. రాష్ట్ర రహదారులు ఇళ్ల మధ్యలో కూడా వెళ్లాయని, అటువంటి వాటిని మినహాయించాలని విజ్ఞప్తి చేసింది. దీనిపై ఈ నెల 22వ తేదీన కోర్టు తీర్పు వెలువడనుంది. ఈ తీర్పుపైనే మద్యం షాపుల యజమానులు, ఎక్సైజ్ అధికారులు ఆశలు పెట్టుకున్నారు. తీర్పు ఎలా వస్తుందనేది వేచి చూడాలి. -
10కిలోల గంజాయి స్వాధీనం
ఆత్మకూరు: ఆత్మకూరు పట్టణంలో ఓ మహిళ నుంచి ఎకై్సజ్ పోలీసులు 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు స్థానిక పద్మావతి హైస్కూల్ సమీపంలో నివసిస్తున్న సారా విక్రేతరాలు ఇస్తేరమ్మ ఇంటిపై ఎక్సైజ్, స్థానిక పోలీసులు శుక్రవారం దాడులు చేశారు. దాడుల్లో నాలుగు బిందెల సారాతో పాటు 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ జానకిరామ్ మాట్లాడుతూ నిందితురాలి ఇంటిలో తనిఖీ చేస్తుండగా సిబ్బందిపై దాడికి యత్నించిందన్నారు. నిందితురాలిని విచారించి కేసు నమోదు చేస్తామన్నారు. దాడుల్లో స్థానిక ఎస్ఐ లోకేష్ కుమార్, ఎక్సైజ్ ఎస్ఐ సుబ్బయ్య, ఆర్ఐ జాకీర్ హుసేన్, వీఆర్వో గౌస్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
గ్రామస్తుల మందలింపు : ఆత్మహత్యాయత్నం
నెక్కొండ : వరంగల్ జిల్లాలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానిక నెక్కొండ తండాకు చెందిన బోద దేవ(24) ఆదర్శ పాఠశాలపైకి ఎక్కి అక్కడి నుంచి దూకుతానని బెదిరిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అతన్ని కిందకు దించడానికి యత్నిస్తున్నారు. కాగా శనివారం నెక్కొండ తండాలో నర్సంపేట ఎక్సైజ్ ఎస్సై సరిత దాడులు నిర్వహించారు. స్థానిక గుడుంబా స్థావరాల వివరాలను దేవ ఎక్సైజ్ పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. అనంతరం గ్రామస్థులంతా కలిసి దేవాను దూషించడంతో మనస్తాపానికి గురైన అతను ఆదివారం ఉదయం భవనం పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఎక్సైజ్ ఎస్సై సరిత వచ్చేవరకు దిగనని మొండికేస్తున్నాడు. -
రెండో మద్యం డిపో ప్రారంభానికి బాలారిష్టాలు
హమాలీల నియామకం విషయంలో వివాదం వెనుదిరిగిన మద్యం లారీలు పండగ అనంతరం సన్నాహాలు నెల్లూరు(క్రైమ్): గూడూరు ఎక్సైజ్ జిల్లాలో రెండో మద్యం డిపో నిర్మాణం పూర్తయింది. ఈనెల మొదటివారంలో ప్రారంభించాల్సి ఉంది. అయితే హమాలీల నియామక విషయంలో వివాదం చెలరేగడంతో ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో డిపోకు వచ్చిన 30 లారీల మద్యం దేవరపాలెం ఐఎంఎల్ డిపోకు తరలింది. జిల్లాలో 336 మద్యం దుకాణాలు 42 బార్లు ఉన్నాయి. వీటన్నింటికీ నెల్లూరు ఎౖMð్సజ్ జిల్లా పరిధిలోని దేవరపాలెం ఐఎంఎల్ డిపో నుంచే మద్యం, బీరు సరఫరా అవుతోంది. గూడూరు సబ్‌డివిజన్ పరిధిలోని తడ, సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు ఇక్కడి నుంచే మద్యం ఏన్నోఏళ్లుగా తీసుకెళుతున్నారు. కొంతకాలంగా ఖర్చు అధికమవుతుండటం వ్యాపారులకు తలకు మించిన భారంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గూడూరు ఎక్సైజ్ జిల్లా పరిధిలోని ఓజిలిలో రెండో మద్యం డిపో ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 141 మద్యం దుకాణాలకు సరఫరా గూడూరు జిల్లాలోని 141 మద్యం దుకాణాలకు, నాలుగుబార్లకు ఓజిలి నుంచే మద్యం సరఫరా అవుతోంది. దీంతో వ్యాపారుల్లో ఆనందం నెలకొంది. ఈ నెల మొదటివారంలో ప్రారంభించాలని అధికారులు సన్నాహాలు చేశారు. 30 లారీల మద్యాన్ని సైతం తెప్పించారు. అయితే హమాలీల నియామక విషయంలో నెలకొన్న వివాదంతో ప్రారంభానికి బ్రేక్ పడింది. దీంతో మద్యాన్ని దేవరపాలెంలోని డిపోకు తరలించారు. డిపోలో పనిచేసేందుకు çసుమారు 80మంది లోడింగ్, అన్లోడింగ్ చేసేందుకు హమాలీలు అవసరం. హమాలీల నియామకాల్లో 80శాతం స్థానికులకు, 20శాతం స్థానికేతరులకు అవకాశం కల్పిస్తారు. ఈ క్రమంలో హమాలీల నియామక బాధ్యతలు జేసీ చేపట్టారు. పదోతరగతి ఉత్తీర్ణులై, 40 ఏళ్లలోపు వారినే నియమించేందుకు చర్యలు చేపట్టారు. స్థానికేతరులకు ఎలాంటి పరిస్థితుల్లో అవకాశం కల్పించరాదని, తమనే నియమించాలని, అధికారపార్టీ నేతలు సిఫార్సులను పరిగణనలోకి తీసుకోకుండా నియామకాలు పారదర్శకంగా నిర్వహించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానికులు ఆందోళన చేపట్టారు. దీంతో డిపో ప్రారంభానికి నోచుకోలేదు. గత కొద్దిరోజులుగా అధికారులు, కార్మిక నాయకుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. సంక్రాంతి పండగ అనంతరం డిపోను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయమై నెల్లూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి.శ్రీనివాసరావును వివరణ కోరగా హమాలీల నియామకం విషయంలో కొంత సమస్య ఉందని అది త్వరలోనే కొలిక్కి వస్తుందన్నారు. పండగ అనంతరం డిపోను ప్రారంభించే అవకాశం ఉందని చెప్పారు. -
మత్తులో మునిగి తేలారు..
ఇక మందు ప్రియులు మద్యపానంలో ముందున్నారు. కనుమ పండగ ఆదివారం రావడంతో ఎక్సైజ్ అధికారులు ’మందు’జాగ్రత్తలు తీసుకున్నారు. ఇండెంటును బట్టి రోజువారీ వినియోగంకంటే రెండు, మూడు రెట్ల అధికంగా మద్యాన్ని ఆయా షాపులకు సరఫరా చేశారు. సాధారణంగా జిల్లాలో సగటున రూ.4 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతాయి. ఈ లెక్కన కనీసం రూ.8 కోట్ల లిక్కర్ విక్రయాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖలోని అనధికార వర్గాల సమాచారం. ఆదివారం సెలవు దినం కావడం వల్ల మద్యం అలవాటున్న వారు తమ స్నేహితులు, చుట్టాలతో కలిసి మజా చేశారు. ప్రత్యేకంగా పార్టీలు ఏర్పాటు చేసుకున్నారు. మామూలు రోజులకంటే ఆదివారం మరింతగా మత్తులో మునిగితేలారు. మొత్తమ్మీద కనుమ పండగ సందర్భంగా మందు, చికెన్, మటన్లకు జిల్లా వాసులు రూ.20 కోట్లు ఖర్చు చేసినట్టు స్పష్టమవుతోంది. -
దోచేస్తున్నారు!
ధరల పెరుగుదలను సాకుగా చూపి మద్యం వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తున్నారు. పాత మద్యాన్ని కొత్త ధరలకు విక్రయిస్తూ కస్టమర్లకు చుక్కలు చూపుతున్నారు. దీంతో ధరల విషయంలో ప్రతిరోజు దుకాణాల వద్ద గొడవలు జరుగుతున్నాయి. అయినా, ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సిద్దిపేట రూరల్: జిల్లాలో 67 మద్యం దుకాణాలు, 6 బార్లు ఉన్నాయి. గతేడాది డిసెంబర్ 3వ తేదీన ప్రభుత్వం మద్యం ధరలను పెంచింది. దీంతో వ్యాపారులు పాత మద్యాన్ని కొత్త ధరలకు విక్రయిస్తున్నారు. బ్రాండెడ్ కంపెనీ క్వార్టర్ బాటిల్‌పై రూ.5నుంచి రూ.10వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వినియోగదారులు వ్యాపారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. జిల్లాలోని అన్ని దుకాణాల వద్ద ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ధరలు పెరిగిన తర్వాత వాటి వివరాల పట్టికలు దుకాణాలకు చేరకముందే మద్యాన్ని పెంచిన ధరలకు అమ్మడం ప్రారంభించారు. నెలవారీ మామూళ్లు రూ.10లక్షల పైనే.. జిల్లాలోని మద్యం దుకాణాలు, బార్ల నుంచి అధికారులకు నెలవారీ మామూళ్లు దాదాపు రూ.10 లక్షలకు పైగా ముడుతున్నట్టు సమాచారం. ఒక్కో మద్యం దుకాణం ద్వారా పోలీసులకు రూ.10వేలు, ఎక్సైజ్ పోలీసులకు రూ.6వేల చొప్పున ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పండగల సందర్భంగా ఖరీదైన మద్యం బాటిళ్లను అధికారులకు ఇస్తున్నట్టు తెలిసింది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకూ ఆరు నెలలకు ఒకసారి ప్రత్యేక మామూళ్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పాతస్టాక్పై కొత్త రేట్లు.. ధరల పెరుగుదలకు ముందే తయారైన బాటిళ్లపై పాత ధరే ఉంటుంది. ఆ సీసాలపైనే పెరిగిన ధర స్టాంప్ వేసి ముద్రించలేదు. అయితే, మద్యం వ్యాపారులు అధిక ధరలకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఎవరైనా అమ్మితే మా దృష్టికి తీసుకోస్తే చర్యలు తీసుకుంటాం. విజయ్‌భాస్కర్‌రెడ్డి, జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ -
మద్యం కిక్కు
► ఒక్కరోజులోనే రూ.కోటిన్నర విలువజేసే మద్యం తాగేశారు ► కనిపించని పెద్దనోట్ల రద్దు ప్రభావం నాగర్‌కర్నూల్ విద్యావిభాగం : ఒకవైపు పెద్దనోట్ల రద్దు, మరోవైపు పోలీసులు నిబంధనలు విధించినా జిల్లాలో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా మందుబాబులు ఒక్కరోజే జిల్లావ్యాప్తంగా రూ.కోటిన్నరకు పైగా విలువజేసే మద్యం తాగేశారు. శనివారం ఉదయం నుంచే గ్రామీణ ప్రాంతాల్లోని కిరాణా దుకాణాలు, బార్ షాపుల్లో మద్యం విక్రయిం చారు. బెల్ట్‌షాపుల్లోనే మద్యం విక్రయాలు ఎక్కువగా జరి గాయి. జిల్లావ్యాప్తంగా 45 వైన్ షాపులతోపాటు కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ ప్రాంతాల్లో రెండు బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటిలో ఒక్కరోజే 2,300 కేసుల లిక్కర్, నాలుగువేల పైచిలుకు బీరు కేసులు అమ్ముడుపోయినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసి దాదాపు 52 రోజులు గడుస్తున్న నేపథ్యంలో రైతులు, కూలీలు, కార్మికులు, కర్షకులు, సామాన్య ప్రజలు నగదు దొరకక సతమతమవుతుంటే మందుబాబులపై దీని ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. గతంలో ప్రతినెలా ఉమ్మడి మహబూబ్‌నగర్ పరిధిలో తిమ్మాజీపేటలోని మద్యం డిపో నుంచి రూ.70 నుంచి రూ.80 కోట్ల వరకు అమ్ముడయ్యేది. పెద్దనోట్ల రద్దు అనంతరం నెల రోజులపాటు పరిశీలిస్తే రూ.160 కోట్లకు పైగా మద్యం అమ్ముడుపోయింది. దీనికితోడు కొత్త జిల్లాగా ఏర్పడిన నాగర్‌కర్నూల్‌లో ఎస్పీ కల్మేశ్వర్ సింగెనవర్ ఒకరోజు ముందే మందుబాబులపై ప్రకటన చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం తాగి వాహనాలు నడపరాదని, ఇతరులకు ఇబ్బంది కలిగించే కార్యకలాపాలకు పాల్పడరాదని హెచ్చరించడం గమనార్హం. -
కేరళలో రూ. 51 లక్షల కొత్త నోట్లు స్వాధీనం
-
కేరళలో రూ. 51 లక్షల కొత్త నోట్లు స్వాధీనం
కన్నూర్/ముంబై: దేశవ్యాప్తంగా కొత్త కరెన్సీ అక్రమాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. కేరళలోని ఇరిటి వద్ద ఆదివారం ఎక్సైజ్ అధికారులు ఓ బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికుల నుంచి లెక్కల్లో చూపని రూ. 51 లక్షల విలువైన రూ. 2 వేల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ బస్సు బెంగళూరు నుంచి వస్తోంది. కేరళలోని తిరూర్‌లో ఓ వ్యాపారి నుంచి రూ. 39.98 లక్షల విలువైన రూ.2 వేలనోట్లను ఇటీవల స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. ఇదిలా ఉండగా, ముంబైలోని పన్వేల్‌లో పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేసి రూ. 35 లక్షలను, రూ. 2.5 కేజీల బంగారాన్ని పట్టుకున్నారు. దొరికిన కరెన్సీ అంతా రూ.2 వేల కొత్తనోట్లే. -
ముగిసిన ఎక్సైజ్ క్రీడా పోటీలు
అనంతపురం సప్తగిరి సర్కిల్: రెండు రోజులుగా కొనసాగిన ఎక్సైజ్ శాఖ క్రీడా పోటీలు ఆదివారం ముగిసాయి. క్రీడా పోటీలు ఆదివారం ఆలమూరు రోడ్డులో సైక్లింగ్, ఇండోర్ క్రీడా పోటీలు స్థానిక అనంతపురం క్లబ్లో నిర్వహించారు. జిల్లాకు చెందిన ఎక్సైజ్ శాఖ సిబ్బంది పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఉదయం సైక్లింగ్ పోటీలు నిర్వహించారు. షటిల్, బాల్ బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్ క్రీడా పోటీలను అనంతపురం క్లబ్లో నిర్వహించారు. క్రీడలు స్నేహ భావాన్ని పెంపొందిస్తాయి నిత్యం పని ఒత్తిడితో సతమతమయ్యే ఎక్సైజ్ శాఖ ఉద్యోగులకు క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని డిప్యూటీ కమిషనర్ అనసూయదేవి తెలిపారు. ఆదివారం అనంతపురం క్లబ్లో జరిగిన జిల్లాస్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమెతో పాటు అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ పోటీల్లో పాల్గోనే వారు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు మల్లారెడ్డి, మునిస్వామి, రాష్ట్ర ఎక్సైజ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరసింహులు, క్రీడల రిఫరీగా గుత్తి ఎక్సైజ్ సీఐ రాజశేఖర్ గౌడ్ వ్యవహరించారు. ఎస్సై జాకీర్‌హుస్సేన్, రాముడు, బాలాజి నాయక్, తదితరులు పాల్గొన్నారు. రెండోరోజు విజేతలు వీరే షటిల్ పురుషుల విభాగం: మధుసూదన్ నాయుడు(అనంతపురం), సాల్మన్ రాజు (హిందూపురం), నరసింహులు(ధర్మవరం), రామ్మోహన్ (ఓబుళాపురం). సైక్లింగ్ 5 కి.మీ: భక్తర్‌వలి(తాడిపత్రి), భీమేష్(కణేకల్లు), ఓబులేసు(కణేకల్లు), వెంకటనారాయణ(తాడిపత్రి). టేబుల్ టెన్సిస్: వలి(డీసీ కార్యాలయం). చదరంగం: హేమంత్‌కుమార్, నాగభూషణం. బాల్ బ్యాడ్మింటన్ : కృష్ణమూర్తి(కదిరి), మధుసూదన్ నాయుడు(అనంతపురం), నాగభూషణం(ధర్మవరం), వలి(డీ సీ కార్యాలయం), ఉమామహేశ్వరరావు( డీ సీ కార్యాలయం), సాల్మన్ రాజు (హిందూపురం). క్యారమ్స్: రాముడు, ఖలందర్, వలి, కృష్ణయ్య. -
31 మద్యం బాటిళ్ల స్వాధీనం
హిందూపురం రూరల్ : చిలమత్తూరు మండలంలో బెల్టుషాపులపై దాడులు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకోవడంతో పాటు 31 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు హిందూపురం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ప్రతాప్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. డోరనాలపల్లిలో బెల్టుషాపు నిర్వహిస్తున్న పాపన్న వద్ద 10 మద్యం బాటిళ్లు, నల్లరాళ్లపల్లిలో 10, చిలమత్తూరులో 11 బాటిళ్లు పట్టుకున్నట్టు వివరించారు. గ్రామాల్లో అక్రమంగా బెల్టుషాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడుల్లో ఎక్సైజ్ సీఐతో పాటు ఎస్ఐ రామన్న గౌడ్, కానిస్టేబుల్ వెంకటేషులు, గోపాల్ నాయక్ పాల్గొన్నారు.