వరంగల్ జిల్లాలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు.
నెక్కొండ : వరంగల్ జిల్లాలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానిక నెక్కొండ తండాకు చెందిన బోద దేవ(24) ఆదర్శ పాఠశాలపైకి ఎక్కి అక్కడి నుంచి దూకుతానని బెదిరిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అతన్ని కిందకు దించడానికి యత్నిస్తున్నారు.
కాగా శనివారం నెక్కొండ తండాలో నర్సంపేట ఎక్సైజ్ ఎస్సై సరిత దాడులు నిర్వహించారు. స్థానిక గుడుంబా స్థావరాల వివరాలను దేవ ఎక్సైజ్ పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. అనంతరం గ్రామస్థులంతా కలిసి దేవాను దూషించడంతో మనస్తాపానికి గురైన అతను ఆదివారం ఉదయం భవనం పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఎక్సైజ్ ఎస్సై సరిత వచ్చేవరకు దిగనని మొండికేస్తున్నాడు.