youth suicide
-
పరిహారం రాక.. ప్రాణాలు తీసుకున్నాడు!
జైపూర్: జీవనోపాధి కోసం రూ.6 లక్షలు అప్పు తెచ్చి కొనుగోలు చేసిన ట్రాక్టర్‌కు గిరాకీ లేదు.. ట్రాక్టర్ కిస్తీలు కట్టలేని పరిస్థితి. అదీగాక ఏడాది క్రితం చెల్లి పెళ్లి కోసం రూ.5 లక్షలు అప్పు తెచ్చాడు. సింగరేణి సంస్థ నుంచి పరిహారం వస్తే తన కష్టాలు గట్టెక్కుతాయనుకున్నాడు. కానీ, రెండేళ్లుగా పరిహారం విషయం ఎటూ తేలడం లేదు. ఈ క్రమంలో అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడి తట్టుకోలేక శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో హరీశ్ (28) అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.తన చావుకు సింగరేణి యాజమాన్యం, గ్రామ పెద్దలు కారణమని సూసైడ్ నోట్ రాశాడు. అమ్మా నాన్న క్షమించండి.. అక్క, చెల్లి.. అమ్మనాన్నలను బాగా చూసుకోండి అని అందులో పేర్కొన్నాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రామారావుపేట పంచాయతీ పరిధిలోని దుబ్బపల్లిలో జరిగింది. జైపూర్ ఎస్సై నాగరాజు కథనం ప్రకారం.. దుబ్బపల్లి గ్రామానికి చెందిన జాడి బొందాలు–పద్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు హరీశ్ సంతానం. బొదాలు కూలీనాలి చేస్తూ పిల్లలను పెంచి పెద్ద చేశాడు. వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో ప్రస్తుతం ఏ పని చేయడం లేదు. దీంతో కుటుంబ భారం హరీశ్‌పై పడింది. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వస్తుందని...దుబ్బపల్లి గ్రామాన్ని రెండేళ్ల క్రితం సింగరేణి శ్రీరాంపూర్ ఓసీపీ విస్తరణ కోసం సేకరించింది. ఇంటితోపాటు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.20 లక్షలు పరిహారం వస్తుందని హరీశ్ భావించాడు. కానీ, రెండేళ్లుగా సింగరేణి యాజమాన్యం పరిహారం విషయం తేల్చడం లేదు. గ్రామ పెద్దలు పరిహారం ఇప్పించే బాధ్యత తీసుకున్నా.. ఎలాంటి పురోగతి లేదు. ఒక్కగానొక్క కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
అచ్యుతాపురం(అనకాపల్లి): అచ్యుతాపురం మండలం పూడిమడకకు చెందిన దానయ్య(17) ఆదివారం ఉదయం ఇంట్లో ఉరేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మనస్తాపం వల్లే అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో సున్నితమైన అంశం కావడంతో ఎస్పీ స్థాయి అధికారులు రంగంలోకి దిగారు. ఎటువంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసు బందోబస్తు నిర్వహిస్తుండగా, డీఎస్పీ పర్యవేక్షిస్తున్నారు. అచ్యుతాపురం పోలీస్ స్టేషన్లో ఎస్పీ మురళీకృష్ణ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పూర్వ విద్యార్థి దానయ్య రెండు రోజుల క్రితం పూడిమడక ఉన్నత పాఠశాలకు వెళ్లి అక్కడి ప్రధానోపాధ్యాయునిపై చేయి చేసుకోవడంతోపాటు సహచర ఉపాధ్యాయులు, విద్యార్థులను టీజింగ్ చేశాడని తెలిపారు. దీంతో హెచ్ఎం పోలీసులకు ఫిర్యాదు చేయగా, సదరు పూర్వ విద్యార్థిని పోలీస్ స్టేషన్‌కు పిలిచి నోటీసు ఇచ్చి పంపించామన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన కారణం, ఉన్నత పాఠశాలలో వివాద అంశాలపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తామన్నారు. మరోవైపు పోలీసులు దుర్భాషలాడటంతో మనస్తాపానికి గురై దానయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడనేది అతడి కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీసీ కోసం హెచ్ఎం పలుమార్లు తిప్పించడం వల్లే గొడవ జరిగి ఉంటుందని, అనంతరం పోలీసు కేసులోకి వెళ్లడంతో మనస్తాపానికి గురయ్యాడని మృతుడి సన్నిహితులు వాపోతున్నారు. కుమారుడి మృతితో తల్లి తీవ్ర దుఖఃసాగరంలో మునిగిపోయింది. -
మూగ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
(హుస్నాబాద్): ఓ మూగ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే ఆ యువకుడి మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ ఆరోపిస్తున్నారు. ఎస్ఐ తాండ్ర వివేక్ తెలిపిన వివరాల ప్రకారం... మండలపరిధిలోని నర్సింహతండాకు చెందిన మాలోతు రాజు–లలిత దంపతులకు ముగ్గురు సంతానం. రెండేళ్ల కిందటే ఐదేళ్ల కుమార్తె అనారోగ్యంతో మృతి చెందింది. పెద్దకుమారుడు మాలోతు ఆంజనేయులు(17)పుట్టుకతోనే మూగవాడు. బుధవారం తండాలో బంధువుల వివాహ వేడుక జరిగింది. మధ్యాహ్నం పెళ్లిలో భోజనం చేస్తున్న క్రమంలో ముగ్గురు భయపెట్టారని ఆంజనేయులు సైగల ద్వారా తన తల్లిదండ్రులకు వివరించాడు. రాత్రి 9గంటలు దాటినా ఇంటికి రాలేదు. చుట్టు పక్కల వెతకగా, ఎక్కడా ఆచూకీ దొరకలేదు. గురువారం తెల్లవారుజామున గౌరవెల్లి రిజర్వాయర్ సమీపంలో తమకున్న వ్యవసాయ క్షేత్రం దగ్గర కట్టవద్దకు వెళ్లి చూసేసరికి వేప చెట్టుకు ఆంజనేయులు శవం వేలాడుతూ ఉంది. విషయం తెలుసుకొని పలువురు సంఘటన స్థలానికి వచ్చారు. తండాకు చెందిన కిషన్‌కు రాజుకు కొంతకాలంగా భూతగదాలు నడుస్తున్నాయి. ఇటీవల ఇద్దరిపై కేసులు నమోదు అయ్యాయి. అయితే పాతకక్షల నేపథ్యంలో తమ కుమారుడిని హతమార్చారని ఆంజనేయులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ సభ్యురాలు భూక్యమంగ హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆంజనేయులు మృతదేహం వద్ద నివాళులు అర్పించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
కబళించిన నిరుద్యోగ భూతం
కర్నూలు: తాము అధికారంలోకి రాగానే ఇంటికో ఉద్యోగం, ఒకవేళ ఉద్యోగం రాకపోతే నెలకు రూ.2,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గత ఎన్నికల సమయంలో ఊదరగొట్టారు. టీడీపీ మేనిఫెస్టోలోనూ స్పష్టంగా హామీ ఇచ్చారు. అధికారంలో రాగానే హామీలకు పాతరేశారు. ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవ్వడం తన బాధ్యత కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నిర్వాకం వల్ల నిరుద్యోగ యువత ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఉన్నత చదువులు చదివినా కొలువు దొరక్క, బతికేందుకూ ఏ ఆసరా లేక, కుటుంబాలకు భారంగా మారలేక మనస్తాపానికి గురై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఉద్యోగం రాలేదన్న బెంగతో కర్నూలు జిల్లా కల్లూరులో ఓ యువకుడు అర్ధాంతరంగా తనువు చాలించాడు. కల్లూరులోని పీవీ నరసింహారావునగర్లో నివాసం ఉంటున్న పెద్ద చెన్నయ్య కుమారుడు క్రాంతి కుమార్ (23) డిగ్రీ(బీఎస్సీ) పూర్తి చేశాడు. కొంతకాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్లు వెలువడే అవకాశం కనిపించకపోవడంతో లా కోర్సు చేయాలని భావించాడు. అయితే, ఆర్థిక ఇబ్బందులు వేధిస్తుండడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శనివారం సాయంత్రం ఎలుకల మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని కుటుంబ సభ్యులు గమనించి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్రాంతి కుమార్ చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఉద్యోగం రాక, తల్లిదండ్రులపై ఆధారపడి జీవించడం ఇష్టం లేకనే బాధితుడు ఎలుకల మందు తాగినట్లు వైద్యులు చెప్పారు. తండ్రి చెన్నయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కర్నూలు నాలుగో పట్టణ ఎస్ఐ శేషయ్య తెలిపారు. -
ప్రేయసి ఇక లేదని.. రైలు పట్టాలపై తలపెట్టి!
సాక్షి, ఆత్మకూరు: ప్రేయసి ఆత్మహత్య చేసుకుని మృతిచెందడాన్ని తట్టుకోలేని ఓ యువకుడు తానూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలో ఈ ఘటన కలకలం రేపుతోంది. ఆ వివరాలిలా.. విక్రమ్ అనే యువకుడు, సుస్మిత అనే ఇంటర్ విద్యార్థిని గత కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. అయితే వీరి ప్రేమ విఫలం కావడంతో మనస్తాపం చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది. శుక్రవారం రాత్రి 11 గంటలకు గుళికల మందు తాగి ఆమె బలవన్మరణం చెందింది. నేటి ఉదయం విషయం తెలుసుకున్న విక్రమ్.. ప్రియురాలు లేదన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోయాడు. తానూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో శనివారం ఆత్మకూరు మండలంలోని శ్రీరామ్ నగర్ రైల్వేస్టేషన్‌కు ఆ యువకుడు రైలు పట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు తలపైనుంచి వెళ్లడంతో తల, మొండెం వేరయ్యాయి. మృతుడి స్వగ్రామం కొత్తకోట మండలం అప్పరాల గ్రామం. కాగా, విక్రమ్ మృతితో అప్పరాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
పోలీసులు అరెస్టు చేస్తారేమోనని..
అశ్వారావుపేట రూరల్: దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్న ఓ గిరిజన యువకుడు పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఉసిర్లగూడేనికి చెందిన కల్లూరి శివరామకృష్ణ (28)పై స్థానిక పోలీసులు దొంగతనం కేసు నమోదు చేశారు. కొద్దిరోజులుగా వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు తనను అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేస్తారేమోనని భయంతో శివరామకృష్ణ ఆదివారం ఇంట్లోనే పురుగుల మందు తాగి మృతి చెందాడు. ఈ విషయమై పోలీసులను మృతుడి కుటుంబీకులు నిలదీస్తే సరైన సమాధానం చెప్పలేదు. దీంతో వారు పోలీసుస్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించేందుకు మృతదేహాన్ని ట్రాక్టర్‌పై తరలిస్తుండగా మార్గమధ్యంలో అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య గంటకుపైగా తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం మృతదేహాన్ని వినాయకపు రం–భద్రాచలం ప్రధాన రహదారిపై ఉంచి ఐదు గంటల పాటు ఆందోళన చేపట్టారు. శివరామకృష్ణ మృతికి కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చివరికి కుటుంబ సభ్యుల్లో ఒకరికి పోలీస్ ఉద్యోగానికి కావాల్సిన సహకారం అందిస్తామని, అవసరమైన కోచింగ్ ఇప్పిస్తామని సీఐ అబ్బయ్య సర్దిచెప్పడంతో వారు శాంతించి ఆందోళన విరమించారు. అతనిపై మూడు చోరీ కేసులు: సీఐ మృతుడు శివరామకృష్ణపై మూడు చోరీ కేసులు నమోదయ్యాయని సీఐ అబ్బయ్య తెలిపారు. అదే గ్రామానికి చెందిన సున్నం నాగేంద్రతోపాటు ద్విచక్ర వాహనాల చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని చెప్పారు. ఈ క్రమంలోనే పది రోజుల క్రితం ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేశామని, కల్లూరి శివరామకృష్ణ మాత్రం ఆరోజు నుంచి పరారీలో ఉన్నాడని తెలిపారు. ఆచూకీ కోసం ఆరా తీస్తున్న క్రమంలో అరెస్ట్ చేస్తారనే భయంతో పురుగుల మందు తాగినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు. -
యువకుని ప్రాణం తీసిన స్వీట్
సాక్షి, శ్రీకాకుళం : తనపై టీడీపీ కౌన్సిలర్ చేయిచేసుకోవడంతో అవమానం భరించలేక ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన శ్రీకాకుళం జిల్లా పలాసలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పలాసలోని లక్ష్మీ స్వీట్ షాపులో హరీష్(24) అనే యువకుడు సెల్స్మన్గా పనిచేస్తున్నాడు. 14 వార్డు కౌన్సిలర్ పైల చంద్రరావు స్వీట్స్ కొనడానికి షాపుకురాగా హరీష్ చేతితో స్వీట్స్ తీస్తుండగా.. చేతిని శుభ్రం చేసుకొని తీయాలంటూ అతనిపై చేయి చేసుకున్నాడు. దీంతో అవమానం భరించలేక హరీష్ సోమవారం బెండి గేటు వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కౌన్సిలర్ చేయి చేసుకోవడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని షాపు యజమాని ఆరోపించాడు. -
తెలంగాణలో మరో నిరుద్యోగి ఆత్మహత్య
సాక్షి, నిర్మల్ : ఉద్యోగం రాలేదని మనస్తాపంతో తెలంగాణ రాష్ట్రంలో మరో నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిర్మల్ జిల్లా కుంటాల మండలం లింబా (కె)లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎమ్మెస్సీ బీఈడీ చదివిన బదుల భూమేష్ అనే యువకుడు గత కొంతకాలంగా ఉద్యోగం వస్తుందో రాదో అనే భయంతో మానసికంగా క్రుంగిపోయాడు. దీంతో అతడిని కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించి వైద్యం చేయించారు. అయితే గత రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో, ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో కొడుకుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆత్మహత్య చేసుకోవడం ఇలా అంటూ..
-
ఆత్మహత్య చేసుకోవడం ఇలా అంటూ..
చదువంటే విరక్తి పుట్టిందో.. మరి ఏమైందో తెలియదు గానీ, ఓ కుర్రాడు ఫేస్బుక్ లైవ్‌లో వీడియో అప్లోడ్ చేసి, హోటల్ 19వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వీడియోలో.. ఆత్మహత్య ఎలా చేసుకోవాలో చెబుతూ ఓ ట్యుటోరియల్ పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘోరం ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో చోటుచేసుకుంది. అర్జున్ భరద్వాజ్ అనే ఈ యువకుడు హోటల్ గది కిటికీ అద్దం పగలగొట్టి అక్కడినుంచి కిందకు దూకేశాడు. అంతకుముందు అతడు షూట్ చేసిన లైవ్ వీడియోలో అతడు సిగరెట్ కాల్చి, మద్యం తాగి, ఆహారం తీసుకుంటూ కనిపించాడు. ఒక నిమిషం 43 సెకండ్ల పాటు ఆ వీడియో షూట్ చేశాడు. రూం నెం. 1925లోని అతడి టేబుల్ మీద చిన్న చిన్న సూసైడ్ నోట్లు ఏకంగా తొమ్మిది కనిపించాయి. తెల్లవారు జామున 3 గంటల సమయంలో రూం తీసుకున్నాడని, రోజంతా రూంలోనే ఉండిపోయాడని పోలీసులు తెలిపారు. తాను తీవ్రమైన డిప్రెషన్లో ఉన్నానని, జీవితంతో విసుగెత్తిపోయానని కూడా అతడు సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నాడు. తన డిప్రెషన్‌కు ఎవరూ కారణం కాదని చెప్పడమే కాక.. తన తల్లిదండ్రులకు సారీ కూడా చెప్పాడు. అరుణ్ భరద్వాజ్ ముంబైలోని నస్రీ మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్‌లో చదువుతున్నాడు. హోటల్ ప్రాంగణంలో భరద్వాజ్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని ఓ సెక్యూరిటీ గార్డు చూశాడు. వెంటనే అతడిని లీలావతి ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. నాలుగేళ్లుగా అతడు అంధేరిలో పేయింగ్ గెస్ట్‌గా ఉంటున్నట్లు విచారణలో తేలింది. మూడో సంవత్సరం పరీక్షలలో ఫెయిల్ కావడం వల్లే డిప్రెషన్‌కు లోనై ఉంటాడని అనుమానిస్తున్నారు. బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారవేత్త పెద్దకొడుకే అర్జున్ భరద్వాజ్. కొడుకు ఆత్మహత్య విషయం తెలిసి ఆయన ముంబైకి హుటాహుటిన తరలి వచ్చారు. -
నేను ఈ సమాజంలో బతకలేను!
ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య మిడ్జిల్ : ‘‘మనుషులు మృగాలుగా మారారు.. ఇలాంటి సమాజంలో నేను బతకలేను.. అందుకే అందర్నీ విడిచిపెట్టి పోతున్నా.. కానీ నా తల్లి నన్ను ఎంతో ప్రేమతో పెంచింది.. నా ఇల్లును అనాథాశ్రమానికి, నా అవయవాలను అవసర మైన వారికి దానం చేయాలి..’’అంటూ ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రానికి చెందిన దుడ్డు నాగేశ్ (19) తండ్రి బాలయ్య పదేళ్ల కిందట మృతి చెందాడు. తల్లి వెంకటమ్మ కుటుంబ భారాన్ని మోస్తూ పిల్లల్ని పోషించింది. ఈ క్రమంలో ఆరేళ్ల క్రితం పెద్ద కుమారుడు కృష్ణయ్య ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఇంతవరకు ఆచూకీ లభించలేదు. ఇంటర్ వరకు చదువుకున్న నాగేశ్ ఆ తర్వాత కరాటే నేర్చుకొని విద్యార్థులకు శిక్షణ ఇచ్చేవాడు. గతేడాది హైదరాబాద్‌కు వెళ్లగా తల్లి కూడా తోడుగా వెళ్లి అక్కడే ఇళ్లలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. వారం క్రితం బీరప్ప పండుగ చేసుకోవడంతో గ్రామానికి వచ్చారు. వీరు కూడా అందరితో కలిసి పండుగ చేసుకున్నారు. తల్లి శుక్రవారం మధ్యాహ్నం గ్రామంలోకి పనిమీద వెళ్లగా.. ఇంట్లో ఒంటరిగా ఉన్న నాగేశ్ ఉరేసుకున్నాడు. నాగేశ్ నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసినట్లు గ్రామస్తులు తెలిపారు. కొడుకు ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ తల్లి రోదనలు అందర్నీ కంటతడి పెట్టించాయి. -
గ్రామస్తుల మందలింపు : ఆత్మహత్యాయత్నం
నెక్కొండ : వరంగల్ జిల్లాలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానిక నెక్కొండ తండాకు చెందిన బోద దేవ(24) ఆదర్శ పాఠశాలపైకి ఎక్కి అక్కడి నుంచి దూకుతానని బెదిరిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అతన్ని కిందకు దించడానికి యత్నిస్తున్నారు. కాగా శనివారం నెక్కొండ తండాలో నర్సంపేట ఎక్సైజ్ ఎస్సై సరిత దాడులు నిర్వహించారు. స్థానిక గుడుంబా స్థావరాల వివరాలను దేవ ఎక్సైజ్ పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. అనంతరం గ్రామస్థులంతా కలిసి దేవాను దూషించడంతో మనస్తాపానికి గురైన అతను ఆదివారం ఉదయం భవనం పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఎక్సైజ్ ఎస్సై సరిత వచ్చేవరకు దిగనని మొండికేస్తున్నాడు. -
రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య
కావలిరూరల్ : రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్యామ్ సమాచారం మేరకు.. ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం మక్కెనవారిపాళెంకు చెందిన పల్లపు రవికుమార్ (27) బేల్దారి పనులు చేస్తుంటాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్థాపం చెంది, శుక్రవారం మధ్యాహ్నం కావలికి వచ్చాడు. ఉదయగిరి బ్రిడ్జి సమీపంలో రైలు పట్టాల మీద తల పెట్టడంతో తల మొండెం వేరు పడ్డాయి. రైల్వే కీమెన్ గుర్తించి జీఆర్పీ పోలీసులకు సమాచారమందించారు. హెడ్ కానిస్టేబుల్ శ్యామ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడి వద్ద లభించిన ఆధారాల మేరకు కుటుంబ సభ్యులకు సమాచారమందించారు. -
ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
గొలగమూడి (వెంకటాచలం): చెట్టుకు ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని గొలగమూడిలో సోమవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. బాలాయపల్లి మండలం కడగుంట గ్రామానికి చెందిన ఎన్.శ్రీను అలియాస్ జీవా నెల్లూరు నగరంలోని నారాయణ హాస్పిటల్ ప్రాంగణంలోని కిచెన్‌లో సప్లయిర్‌గా పనిచేస్తున్నాడు. రెండు నెలల క్రితం అక్కడ విధుల నుంచి యాజమాన్యం తొలగించింది. ఆదివారం గొలగమూడికి వచ్చిన శ్రీను ఆశ్రమ అన్నదాన కేంద్రంలో ఆదివారం రాత్రి భోజనం చేసి కోనేరు కట్టపై నిద్రించాడు. సోమవారం మధ్యాహ్నం సమయంలో మద్యం తాగి కట్టపై ఉన్న చింతచెట్టుకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని స్వీపర్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలంలో మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, బంధువులకు సమాచారం అందించారు. అనారోగ్యంతో ఆత్మహత్య అనారోగ్య సమస్యతోనే శ్రీను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. శ్రీనుకు ఇటీవల వైద్య పరీక్షలు చేయగా హె^Œ ఐవీ పాజిటివ్ అని నిర్ధారణ అయిందని తెలియడంతో విధుల నుంచి తప్పించారు. అప్పటి నుంచి ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న శ్రీను గొలగమూడికి చేరుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తుంది. -
పెళ్లి రద్దుతో యువకుడి ఆత్మహత్య
పంజగుట్ట: వివాహం రద్దు కావడంతో మనస్తాపం చెంది ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పంజగుట్ట పోలీసుల కథనం ప్రకారం .. నెల్లూరు జిల్లాకు చెందిన రాజశేఖర్ (38) సోమాజిగూడ క్రాంతిశిఖరా అపార్ట్మెంట్ 3వ అంతస్తులో తల్లిదండ్రులతో కలిసి ఉంటూ వీడియో ఎడిటింగ్ ల్యాబ్ నిర్వహిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఇతనికి పెళ్లి కుదిరింది. పేరు బలాలు కుదరకపోవడంతో వివాహాన్ని రద్దు చేసుకుంటున్నామని పెళ్లికూతురు తరఫువారు ఇటీవల ఫోన్ చేసి చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన రాజశేఖర్ ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లి కావడం లేదనే బెంగతో..
చిట్యాల: తనకు పెళ్లి సంబంధాలు కలిసి రావడం లేదని, ఇక పెళ్లి కాదనే బెంగతో జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని ఏంపేడు గ్రామశివారులో శుక్రవారం జరిగింది. ఎస్సై వెంకట్రావు కథనం ప్రకారం... మండలంలోని బూర్నపల్లి గ్రామానికి చెందిన మొగుళ్ల దేవేందర్(28) తనకు పెళ్లి కావడం లేదనే బెంగతో గత ఏడాది నుంచి తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం దేవేందర్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మండలంలోని ఏంపేడు గ్రామశివారులో శవమై కనిపించాడు. తన కుమారుడు పెళ్లికావడం లేదని ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తండ్రి చిన్నయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు. -
రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య
నల్లగొండ : రైలు కిందపడి ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన నల్లగొండ రైల్వే స్టేషన్లో బుధవారం చోటుచేసుకుంది. పానగల్‌కు చెందిన మహేష్ రైల్వే స్టేషన్లో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గుర్తించిన రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ విఫలమడంతోనే మహేష్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
కుటుంబ కలహాలతో యువకుని ఆత్మహత్య
నూజివీడు : కృష్ణా జిల్లా ముసునూరు మండలం గోపవరం గ్రామంలో కుటుంబ కలహాలతో ఎం.రవి (20) అనే యువకుడు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణం తీసిన ఫేస్బుక్ పరిచయం
కడప : ఫేస్బుక్ పరిచయం ఓ నిండి ప్రాణాన్ని బలి తీసుకుంది. ఖాజీపేటకు చెందిన యువకుడికి ఫేస్బుక్ ద్వారా ఓ అమ్మాయి పరిచయమైంది. తాను ఆర్థికంగా కష్టాల్లో ఉన్నానని.. సాయం చేయాలని అడిగింది. అమ్మాయి మాటలకు కరిగిపోయి ఇంట్లో తెలియకుండా ఆమె అకౌంట్లో డబ్బులు వేశాడు. చివరికి ఈ విషయం ఇంట్లో తెలియడం..ఆపై యువతి మోసం చేయడంతో దిక్కుతోచని స్థితిలో ఆ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు నియోజకవర్గం ఖాజీపేటలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. ఖాజీపేట బస్టాండులో మాడిచెట్టి నరసింహ ప్రసాద్ అలియాస్ రమేష్ (33) మూడేళ్లుగా టీకొట్టు నిర్వహిస్తున్నాడు. అతడు ఫేస్బుక్లో ఖాతా ప్రారంభించి ప్రతిరోజు తన మొబైల్ ద్వారా చూసేవాడు. ఇలా విశాఖపట్నానికి చెందిన ఓ అమ్మాయితో అతడికి నెలక్రితం పరిచయమైంది. ఆ పరిచయంతో ఆమె ఫోన్ నంబర్ తీసుకుని తరచూ మాట్లాడేవాడు. ఈ నేపథ్యంలో ఆమె తాను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నానని తనను ఆదుకోవాలని కోరింది. ఆమేరకు ఆమె ఎస్బీఐలోని గ్రీన్‌కార్డు అకౌంట్ నంబర్(20241371120)కు గతనెల 6వ తేదీ నుంచి ఇప్పటివరకు సుమారు రూ.2లక్షలు పంపాడు. ఈ విషయంలో అతని ఇంట్లో తెలియడంతో గట్టిగా మందలించారు. దీంతో అతను తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వాలని ఆ యువతిపై ఒత్తిడి తెచ్చాడు. ఆమె ఇచ్చిన ఫోన్ నంబర్‌కు ఇదే విషయమై తరచూ మెసేజ్ పంపాడు. డబ్బు ఇవ్వకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని కూడా తెలిపాడు. అయినా ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదు. తాను మోసపోయానని.. డబ్బు విషయమై ఇంట్లోని పెద్దలకు ఏం సమాధానం చెప్పాలో దిక్కు తెలియక సోమవారం మధ్యాహ్నం బాత్రూంలోకి వెళ్లి ఉరి వేసుకున్నాడు. ఎంతకీ తమ కుమారుడు బాత్రూంలో నుంచి బయటికి రాకపోవడంతో అనుమానంతో వారు బాత్రూం తలుపులు పగులగొట్టి చూడగా అప్పటికే మృతి చెందాడు. ఆ తర్వాత అతని మొబైల్‌ను పరిశీలించగా అందులో ఆ యువతికి పంపిన మెసేజ్‌లు తదితర వివరాలు బయటపడ్డాయి. తర్జనభర్జన అనంతరం మంగళవారం ఉదయం మృతుని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ అమ్మాయి ఎవరు.? నరసింహ ఫోన్ చేసిన మొబైల్ నంబర్‌తో పాటు బ్యాంకు అకౌంట్ నెంబర్‌ను పోలీసులు పరిశీలించారు. విశాఖపట్నంలోని సీతంపేటకు చెందిన గార్లే కళ్యాణిగా ఉంది. కాగా బ్యాంక్ అకౌంట్‌కు ఇచ్చిన ఫోన్ నంబరు మరోలా ఉంది. ఆ యువకుడు ప్రతిరోజు ఫోన్ చేసిన నంబర్ వివరాలు సేకరిస్తే అక్కడ అనుశ్రీగా ఉంది. దీంతో ఫోన్ కాల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. -
ప్రాణం తీసిన ఫిర్యాదు..
* మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య * వల్లాల గ్రామంలో ఘటన * ఫిర్యాదుదారుడి ఇంటి ఎదుట బంధువుల ఆందోళన వల్లాల (శాలిగౌరారం) : చిన్న తగాద ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. మండలంలోని వల్లాల గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. వల్లాల గ్రామానికి చెందిన జాల మహేశ్ (20), అదే గ్రామపంచాయతీ పరిధిలోని జోలంవారిగూడెంకు చెందిన జోలం నరేందర్ మధ్య కొంత కాలంగా పాత కక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు నెలల క్రితం ఇరువురు గొడవ పడటంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. అనంతరం గ్రామ పెద్దల సమక్షంలో రాజీపడ్డారు. అయితే ఈనెల 17న మరోమారు జాల మహేశ్ తన స్నేహితులతో కలిసి తనపై దాడి చేసేందుకు ప్రయత్నించాడంటూ జోలం నరేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈనెల 18న పోలీసులు మహేశ్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. సాయంత్రం గ్రామానికి చెందిన ఓ పెద్దమనిషి జామీనుపై ఇంటికి పంపిస్తూ తిరిగి ఆదివారం మళ్లీ స్టేషన్‌కు రావాలని, తన స్నేహితులను కూడా తీసుకురావాలని ఆదేశించారు. దీంతో మనస్తాపానికి గురైన మహేశ్ ఆదివారం ఉదయం తమ వ్యవసాయ బావివద్దకు వెళ్లి పురుగులమందు తాగాడు. ఆ సమయంలో బావి వద్దకు వెళ్లిన తండ్రి సైదులు కుమారుడి గమనించి లబోదిబోమనడంతో చుట్టుపక్కల వారు వెంటనే నకిరేకల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బంధువుల ఆందోళన... మహేశ్ మృతికి జోలం నరేందర్‌తో పాటు పోలీసులు కారణమంటూ మృతుడి తల్లిదండ్రులు, బంధువులు నరేందర్ ఇంటి ముందు, పోలీస్‌స్టేషన్ ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధిత కుటుంబ సభ్యులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో సంబంధిత ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సాయంత్రం వరకు నరేందర్ కుటింబీకులలో ఒక్కరు కూడా అందుబాటులోకి రాకపోవడంతో మహేశ్ మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బైఠాయించారు. అప్పటికే పోలీస్‌స్టేషన్‌లో ఉన్న శాలిగౌరారం, నకిరేకల్ సీఐలు ప్రవీణ్, సుబ్బిరామిరెడ్డి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి నచ్చజెప్పారు. పోలీసులకు సంబంధం లేదు : ఎస్ఐ ఇదిలా ఉండగా ఎస్ఐ శ్రీరాముల అయోధ్య మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు అందడంతోనే మహేశ్‌ను పిలిపించి తిరిగి పంపించామన్నారు. కావాలనే పోలీసులపై ఆరోపణలు చేయడం మంచిదికాదని, మహేశ్ మృతికి పోలీసులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. పోలీస్ బందోబస్తులో నార్కట్‌పల్లి, కట్టంగూరు ఎస్ఐలు మోతీరాం, నరేందర్, సత్యనారాయణతో పాటు సిబ్బంది ఉన్నారు. -
'స్వారీ' మమత..
మహేశ్వరం: ఓ యువకుడు మర్రిచెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని తుక్కుగూడలోని సురం చెరువులో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. తుక్కుగూడ గ్రామానికి చెందిన గొరిగే పాండు(27) నగరంలోని కారు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఇంటి నుంచి వెళ్లిన పాండు సాయంత్రం గ్రామ సమీపంలోని చెరువు పక్కన ఉన్న మర్రి చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న పహాడిషరిఫ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పాండు జేబులో దొరికిన కాగితంపైన 'స్వారీ మమత' అని రాసి ఉంది. దీంతో ప్రేమ వ్యవహారం కారణంగానే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
డిప్రెషన్ లో గన్ తో కాల్చుకున్న యువతి..
ముజఫర్ నగర్: కుటుంబ కలహాలు ఓ యువతిని మానసిక వేదనకు గురిచేయాయి. దీంతో ఏం చేయాలో ఆమెకు పాలుపోలేదు. చివరికి ఆత్మహత్యే తనకు శరణ్యమని భావించింది. తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ముజఫర్ నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని ఖరాడ్ గ్రామంలో చౌదరి మన్సబ్ అలీ కుటుంబం జీవనం సాగిస్తోంది. ఆయన కూతురు రేష్మ చౌదరి(18). గత కొన్ని రోజులుగా వారి కుటుంబం కొన్ని సమస్యల్లో చిక్కుకుంది. ఈ క్రమంలో ఆమె మానసిక వేదనకు గురైంది. గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడింది. రేష్మ అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. అయితే ఆమెది ఆత్మహత్యా.. లేక హత్యా.? అనేది ఇంకా తేలలేదని అన్ని కోణాల్లో విచారణ జరుపుతామని పోలీసులు పేర్కొన్నారు. -
పోలీసుల వేధింపులు : యువకుడు ఆత్మహత్య
కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా ఏటపాక మండలం గుండాల గ్రామంలో పోలీసుల వేధింపులు భరించలేక మంచిన పవన్‌కల్యాణ్ (18) అనే యువకుడు సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. గత కొద్దిరోజుల క్రితం వెలుగు సీసీ సాంబశివరావు హత్య జరిగింది. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ క్రమంలో సాంబశివరావు కాల్ లిస్ట్‌లో పవన్‌కల్యాణ్ సెల్ నెంబర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పవన్ కల్యాణ్‌ను పోలీసులు విచారించారు. దాంతో తీవ్ర మనస్థాపం చెందిన అతడు... గత రెండు నెలల నుంచి పోలీసులు వేధిస్తున్నారని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. సాంబశివరావు హత్యతో తమ పవన్‌కు ఎలాంటి సంబంధం లేదని కుటుంబసభ్యులు తెలిపారు. పోలీసులు విపరీతంగా వేధించినందువల్ల మనస్థాపంతో పవన్‌కల్యాణ్ ఆత్మహత్య చేసుకున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. -
సౌదీలో నల్గొండ వాసి ఆత్మహత్య
నల్గొండ జిల్లా: బతుకుదెరువు కోసం సౌదీకు వెళ్లిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం బొప్పారం గ్రామానికి చెందిన మహ్మద్ మాజూ(26) 9 నెలల కిందట సౌదీ అరేబియాకు వెళ్లాడు. అక్కడ అల్హట్టా రాష్ట్రం అల్సుఖ్ఖీ గ్రామంలో మాజూ ఓ షేక్‌కు చెందిన ఖర్జూర తోటలో పనిచేస్తున్నాడు. ఆ తోటలో అతను అనూహ్యంగా చెట్టుకు ఉరివేసుకుని మరణించాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పొట్టకూటి కోసం విదేశీలకు వెళ్లిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడటంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య
భువనగిరి: నల్లగొండ జిల్లాలో శనివారం ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. భువనగిరి పట్టణానికి చెందిన మిర్యాల విద్యాసాగర్ కుమారుడు చాణక్య(23) బీఫార్మసీ పూర్తి చేశాడు. కొద్ది రోజులుగా హైదరాబాద్‌లోని ఓ మెడికల్ షాపులో పనిచేస్తున్నాడు. శుక్రవారం భువనగిరికి వచ్చిన అతడు శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. కుటుంబసభ్యులు వచ్చి చూసేసరికి చాణక్య మరణించాడు. ఈ మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
చిత్తూరు జిల్లా పోలీసుల దాష్టీకం
తిరుపతి: చిత్తూరు జిల్లాలో మంగళవారం ఓ యువకుడు ఆత్యహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఓ పాతకేసు విచారణలో భాగంగా కల్లూరు పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ నాయకులకు ప్రత్యర్థులవ్వడం కారణంగా తమను పోలీసులు వేధిస్తున్నారంటూ...విచారణ ఎదుర్కొన్న వారిలో కిరణ్ కుమార్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వెంటనే అతనిని పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. టీడీపీ నేతల ఒత్తిళ్ల వల్లే ఎస్.ఐ కృష్ణయ్య వేధింపులకు గురిచేస్తున్నాడని కిరణ్ బంధువులు ఆరోపిస్తున్నారు. -
ఆ రాత్రి ఏం జరిగింది..?
► నరసాపురంలో యువకుడి అనుమానాస్పద మృతి ► డబ్బు కోసం వదినకు మరిది వేధింపులు ► తెల్లవారే సరికి ఉరికి వేలాడిన నిందితుడు ► అనుమానాలకు బలం చేకూరుస్తున్న గాయాలు అనంతపురం: పెద్దపప్పూరు మండలం నరసాపురంలో ఆదివారం తెల్లవారుజామున కలకలం రేగింది. గ్రామానికి చెందిన పవన్‌కుమార్(28) అనుమానాస్పద స్థితిలో మరణించడం అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడన్న సమాచారం క్షణాల్లో అందరికీ తెలిసిపోయింది. అప్పుడప్పుడే నిద్ర నుంచి మేల్కొంటున్న గ్రామస్తులు ఏం జరిగిందో అర్థం కాక ఆందోళనకు గురయ్యారు. మద్యానికి బానిసై... ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేసే పవన్‌కుమార్ అన్న ఓబులేసు, వదిన ఎరుకలమ్మతో కలసి జీవించేవాడు. ఏడాది కిందట అనారోగ్యంతో అన్న చనిపోయినా వదినతో కలసే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో తాగుడుకు బానిసయ్యాడు. మందు కోసం తెలిసిన వారి దగ్గర చిల్లర అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు వదినను వేధించేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి 10 గంటలకు డబ్బుల కోసం వదినతో గొడవకు దిగాడు. అంతటితో ఆగక ఆమెపై చేయి చేసుకున్నాడు. పుట్టింటోళ్లకు విషయం తెలిపి.. మరిది పవన్‌కుమార్ చేతిలో దెబ్బలు తిన్న ఎరుకలమ్మ తన పరిస్థితిని తండ్రితో పాటు అన్నలకు ఫోన్లో తెలిపి విలపించింది. అక్కడి నుంచి వారు బైక్‌లో వచ్చి రాత్రికి రాత్రే పవన్‌తో గొడవపెట్టుకున్నారు. ఆ తరువాత ఎరుకలమ్మను పొరుగింట్లో ఉంచి వెళ్లిపోయారు. తెల్లారేసరికి ఉరికి వేలాడిన పవన్ ఆ రాత్రి ఏం జరిగిందో ఏమో గానీ తెల్లారేసరికి ఇంట్లోనే ఫ్యాన్‌కు పవన్‌కుమార్ ఉరి వేసు కున్నాడు. విషయం తెలిసిన వెంటనే ఎస్ఐ శ్రీహర్ష తమ సిబ్బందితో కలసి గ్రామానికి చేరుకున్నారు. మృతుని తల, వీపు, కాళ్లపై గాయాలుండడాన్ని గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఉదంతంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో పోస్టుమార్టం రిపోర్టు కీలకం కానుంది. పోలీ సులు నిష్పక్షపాతంగా విచారణ జరిపితే నిజనిజాలు వెల్లడవుతాయని గ్రామస్తులు అంటున్నారు. మృతుని వదిన ఎరుకలమ్మను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
విషం తాగి యువకుడి మృతి
హైదరాబాద్: ప్రేమించిన యువతితో గొడవ జరగడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని క్రిష్ణారెడ్డి నగర్ కాలనీలో కృష్ణ(23) అనే యువకుడు ఓ యువతిని ప్రేమించాడు. గత కొన్ని రోజులుగా ఆ యువతితో కృష్ణ గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపం చెందిన అతను ఆదివారం విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
అక్క హత్య.. ఆపై ఆత్మహత్య
తనను గుట్కా తిననివ్వలేదన్న కోపంతో సొంత అక్కను పీక పిసికి చంపేసి.. ఆపై అపరాధ భావంతో ఆత్మహత్య చేసుకున్నాడో వ్యక్తి. ఈ ఘటన దేశ రాజధానిలో కలకలం రేపింది. అతడు టీబీతో పాటు.. స్కిజోఫ్రేనియాతో కూడా బాధపడుతున్నాడని, ఆగ్నేయ ఢిల్లీలోని ఓ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించేవాళ్లమని ఆ కుటుంబ సభ్యులు తెలిపారు. మంచానికి కింద ఉండే అరలో నీలమ్ (24) మృతదేహం కనిపించింది. దీపక్ కుమార్ (21) మెట్ల మార్గంలో ఉరేసుకుని చనిపోపయాడు.తన అన్న అనిల్ కుమార్, అక్క నీలమ్‌తో కలిసి మహావీర్ ఎన్‌క్లేవ్‌లో దీపక్ ఉండేవాడు. అనిల్ ఓ కంప్యూటర్ సెంటర్లో ట్రైనర్‌గా పనిచేస్తాడు. దీపక్‌కు గుట్కా తినే అలవాటు బాగా ఉంది. కానీ టీబీ కారణంగా వద్దని కుటుంబ సభ్యులు చెప్పేవారు. ఎప్పుడైనా అలా చెబితే అతడు బాగా కోపంగా ప్రవర్తించేవాడు. అక్కతో తరచు కొట్లాడేవాడని, దాంతో ఆమె అప్పుడప్పుడు గదిలో పెట్టి తాళం వేసేదని పొరుగున ఉండే సరస్వతి తెలిపారు. అయితే, ఉన్నట్టుండి ఇద్దరూ కనిపించకపోవడంతో ఆమే అనిల్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. మెయిన్ డోర్ తాళం వేసి ఉండటం, నీలమ్ చెప్పులు అక్కడ ఉండటం కనిపించింది. దాంతో చుట్టుపక్కల, ఇంట్లోను గాలించగా దీపక్ మృతదేహం కనిపించింది. పోలీసులు వచ్చి, మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించిన కాసేపటికే మళ్లీ అనిల్ వాళ్లకు ఫోన్ చేశాడు. తాను డబ్బుల కోసం మంచం కింద ఉన్న అరను తెరవగా.. అందులో నీలమ్ మృతదేహం ఉందని చెప్పాడు. ఆమె గొంతు చుట్టూ ఓ చున్నీ బిగించి ఉంది. -
రైలుకింద పడి యువకుడి ఆత్మహత్య
బుక్కరాయసముద్రం(అనంతపురం): బుక్కరాయ సముద్రం మండల పరిదిలోని వడియంపేట గ్రామంలో ఓ వ్యక్తి రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు వడియంపేట గ్రామంలో టీడిపి నాయకులు మాజీ ఎంపీటీసీ క్రాంతి కుమారుడు నవీన్(28) మగ్గం వేసుకుంటూ జీవనం గడుపుతుండేవాడు. ఇతనికి భార్య, ఒక కుమారుడు ఉన్నాడు. శనివారం సాయంత్రం గ్రామ శివారుల్లో వున్న రైలు పట్టాల మీద తల పెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీటిలో నవీన్ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడో పోలీసుల దర్యాప్తులో తేలాల్సి వుంది. విషయం తెలుసుకున్న మండల ఎస్ఐ విశ్వనాథ్ చౌదరి సంఘటణా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
యువకుడి ఆత్మహత్య
ప్రేమించిన యువతి చీర తీసుకోలేదని మనస్తాపం ఆ చీరతో ఉరి వేసుకుని దారుణం విశాఖపట్నం, న్యూస్‌లైన్ : షీలానగర్ అయ్యప్పస్వామి దేవాలయం పక్కన యమహా షోరూం వెనుక ఒక అపార్ట్మెంట్లో ఆదివారం ఒక యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గాజువాక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వి. సంతపాలేనికి చెందిన ఈశ్వరమ్మ, ఈశ్వరరావు రెండవ సంతానం బొత్సా కార్తీక్ (21) కొద్ది నెలలుగా ఆటోనగర్‌లోని ఒక ప్రైవేటు సంస్థలో పొక్లెయిన్ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతని స్నేహితుడు సంతోష్‌తో కలసి ఆరు నెలల క్రితం షీలానగర్‌లో ఒక అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నారు. కార్తీక్ కొద్దినెలలుగా ఒక యువతితో ప్రేమలో పడ్డాడని అతని స్నేహితుడు తెలిపాడు. రెండు రోజుల ముందు తను ప్రేమించిన యువతికి చీర కొన్నాడని, అయితే ఆ చీర తీసుకునేందుకు ఆ యువతి తిరస్కరించి ఉంటుందని భావిస్తున్నానని సంతోష్ తెలిపాడు. శనివారం సాయంత్రం తాను డ్యూటీకి వెళ్లానని కార్తీక్ మాత్రం తాను విధులకు వెళ్లడంలేదని చెప్పాడని మృతుని స్నేహితుడు తెలిపారు. ఉదయం విధుల నుంచి ఇంటికి వచ్చిన తాను తలుపు తట్టినా సమాధానం రాకపోవడంతో వరండాలోనే పడుకున్నానన్నారు. ఉదయం వెంటిలేటర్ నుంచి చూస్తే కార్తీక్ ఉరివేసుకుని ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. కంపెనీ అధికారులకు ఈ సమాచారం అందించాడు. వారు గాజువాక పోలీసులకు తెలపటంతో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. యువతికి కానుకగా కొన్న చీరతోనే ఉరిపోసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతునికి ఇద్దరు సోదరులు ఉన్నారు. కార్తీక్ మరణ వార్త విన్న వెంటనే బంధువులు విలపించారు. కేసు ఎస్ఐ దాలిబాబు దర్యాప్తు చేస్తున్నారు.