బుక్కరాయసముద్రం(అనంతపురం): బుక్కరాయ సముద్రం మండల పరిదిలోని వడియంపేట గ్రామంలో ఓ వ్యక్తి రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు వడియంపేట గ్రామంలో టీడిపి నాయకులు మాజీ ఎంపీటీసీ క్రాంతి కుమారుడు నవీన్(28) మగ్గం వేసుకుంటూ జీవనం గడుపుతుండేవాడు. ఇతనికి భార్య, ఒక కుమారుడు ఉన్నాడు.
శనివారం సాయంత్రం గ్రామ శివారుల్లో వున్న రైలు పట్టాల మీద తల పెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీటిలో నవీన్ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడో పోలీసుల దర్యాప్తులో తేలాల్సి వుంది. విషయం తెలుసుకున్న మండల ఎస్‌ఐ విశ్వనాథ్ చౌదరి సంఘటణా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.