వరుస రైలు ప్రమాదాలు.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు షాక్‌! | Train Accidents Effet Ashwini Vaishnaw Resign Trending In Social Media | Sakshi
Sakshi News home page

వరుస రైలు ప్రమాదాలు.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు షాక్‌!

Published Sun, Feb 16 2025 10:34 AM | Last Updated on Sun, Feb 16 2025 11:28 AM

Train Accidents Effet Ashwini Vaishnaw Resign Trending In Social Media

ఢిల్లీ: న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌ (Delhi Railway Station) కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు పోటెత్తడంతో శనివారం రాత్రి తొక్కిసలాట (stampede) జరిగింది. ఈ తొక్కిసలాటలో 18 మంది మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులున్నారు. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ (#AshwiniVaishnawResignNow) వెంటనే రాజీనామా చేయాలనే డిమాండ్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.

కుంభమేళాకు వెళ్లేందుకు ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులు భారీ సంఖ్యలో వచ్చారు. కుంభమేళాకు వెళ్లేందుకు రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడిపింది. ఈ క్రమంలో 14వ నంబరు ప్లాట్‌ఫాంపై ప్రయాగ్‌రాజ్‌ ఎక్స్‌ప్రెస్‌ నిలిచి ఉండడంతో భక్తులు అక్కడకు చేరుకున్నారు. ఇదే సమయంలో స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్‌ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆలస్యం కావడంతో వాటి కోసం వచ్చిన ప్రయాణికులు అదే సమయంలో 12, 13, 14 నంబరు ప్లాట్‌ఫాంలపై ఉన్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ రద్దీ పెరిగిపోయి తొక్కిసలాటకు దారితీసింది. దీంతో, 18 మంది మృతిచెందారు.

 

ఈ నేపథ్యంలో రైలు ప్రమాదాలపై నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. అశ్విని వైష్ణవ్‌ రైల్వే శాఖ మంత్రి అయినప్పటి నుంచే రైలు ప్రమాదాల సంఖ్య పెరిగిందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. రైలు ప్రమాదాల్లో ఇప్పటికే చాలా మంది చనిపోయారని అంటున్నారు. రైలు ప్రమాదాలకు బాధత్య వహించి రైల్వే మంత్రి (#AshwiniVaishnawResignNow) వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ట్యాగ్‌(#ResignRailwayMinister) ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది.  

 

ఇక, ఇదే సమయంలో అశ్విని వైష్ణవ్‌ రైల్వే మంత్రిగా ఉ‍న్న సమయంలో గత కొన్నేళ్లలో జరిగిన రైలు ప్రమాదాల గురించి కూడా పోస్టులు పెడుతున్నారు. ఆయన రైల్వే శాఖకు మంత్రి అయ్యాకే ప్రమాదాలు ఎక్కువగా జరిగాయని కామెంట్స్‌ చేస్తున్నారు. మరోవైపు.. 1956లో అరియలూర్‌లో జరిగిన రైలు ప్రమాదం తర్వాత ప్రమాదానికి బాధత్య వహిస్తూ నాటి రైల్వే మంత్రి లాల్‌ బహదూర్‌ శాస్త్రి రాజీనామా చేశారని గుర్తు చేస్తున్నారు. తన హయాంలో ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. 

 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement