kumbhamela
-
కుంభమేళాకు వెళ్లొచ్చిన పూజారి కరోనాతో మృతి
వైఎస్సార్ కడప: దేశంలో కరోనా విశృంఖలంగా వ్యాపించడానికి ప్రధాన కారణం కుంభమేళా అని కూడా అందరూ ఆరోపిస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవమో పక్కన పెడితే కుంభమేళాకు వెళ్లి వచ్చిన వారికి మాత్రం పెద్ద సంఖ్యలో కరోనా వ్యాప్తి చెందింది. తాజాగా కుంభమేళాకు వెళ్లివచ్చిన పూజారి కరోనా సోకి మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఆలయ ప్రధాన అర్చకులు కరోనాతో మృతిచెందారు. కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని అమ్మవారిశాల ప్రధాన అర్చకుడు అనంతబోట్ల హరికృష్ణ శర్మ ఇటీవల హరిద్వార్‌లో జరిగిన కుంభమేళాకు వెళ్లారు. తిరిగి వచ్చిన అనంతరం ఆయనకు కరోనా సోకింది. వారం రోజులుగా కరోనాతో పోరాడుతున్నారు. చికిత్స పొందుతూ గురువారం ఆయన మృతి చెందారని వారి బంధువులు వెల్లడించారు. ఈ విధంగా కుంభమేళాకు వెళ్లి వచ్చిన చాలా మంది కరోనా బారినపడ్డారని తెలుస్తోంది. చదవండి: ఘోరం.. 577 మంది టీచర్లు కరోనాకు బలి చదవండి: ఇప్పటివరకు లాక్డౌన్ ప్రకటించిన రాష్ట్రాలు ఇవే.. -
మహాశివరాత్రితో ముగిసిన కుంభమేళా
-
కుంభమేళాలో 24 కోట్ల మంది పుణ్యస్నానం
అలహాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్(అలహాబాద్)లో జరుగుతున్న ఆధ్యాత్మిక వేడుక కుంభమేళా ముగిసింది. మహాశివరాత్రితో పాటు కుంభమేళా చివరిరోజు కావడంతో సోమవారం పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పవిత్ర సంగమానికి పోటెత్తారు. జనవరి 15 న ప్రారంభమైన కుంభమేళాలో భాగంగా సోమవారం సాయంత్రం నాటికి మొత్తం 24.05 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. మహాశివరాత్రి నేపథ్యంలో ఒక్కరోజే 1.10 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. సన్నటి వర్షపు జల్లులు కురుస్తున్నప్పటికీ భక్తులందరూ ‘హరహర మహాదేవ్’అంటూ శివనామస్మరణ చేస్తూ ముందుకుసాగారు. కుంభమేళా సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కుంభమేళా చివరిరోజున యూపీ మంత్రి సురేశ్ రాణా పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం బోటులో విహరించారు. కుంభమేళా సందర్భంగా మూడు గిన్నిస్ రికార్డులు నెలకొల్పామని మంత్రి సురేశ్ రాణా తెలిపారు. ‘పెయింట్ మై సిటీ’పేరుతో మార్చి 1న 7,664 మంది వాలంటీర్లు 8 గంటల వ్యవధిలో చేతితో పెయింటింగ్ రూపొందించి గిన్నిస్‌రికార్డు సాధించినట్లు వెల్లడించారు. ఈ నెల 2న భక్తులు భారీ సంఖ్యలో ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుని చీపుర్లతో రోడ్డును శుభ్రంచేసి గిన్నిస్ రికార్డును సాధించారని పేర్కొన్నారు. అలాగే 19వ జాతీయ రహదారిపై 500 బస్సులతో 3.2 కి.మీ పరేడ్ నిర్వహించి మరో గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నామన్నారు. -
ప్రయాగరాజ్‌కు పోటెత్తుతున్న భక్తులు
-
4న కుంభమేళాలో పుణ్యస్నానం!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక రాజకీయ ప్రవేశానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 4వ తేదీన రాహుల్, ప్రియాంక కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే రోజు ఆమె తూర్పు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తారు. అనంతరం సోదరుడు రాహుల్‌తో కలిసి లక్నోలో మీడియా సమావేశంలో పాల్గొంటారు. ఒకవేళ ఫిబ్రవరి 4వ తేదీన వీలుకాకుంటే 10వ తేదీన వసంత పంచమి రోజు కుంభమేళాకు వెళతారని సమాచారం. తోబుట్టువులిద్దరూ గంగ, యమున, అంతర్వాహిని సరస్వతీ సంగమంలో పవిత్ర స్నానాలు చేయనుండటం ఇదే ప్రథమం. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో కీలకంగా వ్యవహరించేందుకు ఇటీవల సోదరి ప్రియాంకకు రాహుల్ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. హిందుత్వ భావనపై కాంగ్రెస్ పార్టీ మెతక వైఖరి ఆవలంబిస్తోందనే అపవాదును తొలగించుకునేందుకే రాహుల్, ప్రియాంక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, 2001లో అప్పటి కాంగ్రెస్ అధినేత్రి, రాహుల్ తల్లి సోనియా గాంధీ కుంభమేళాలో పాల్గొన్నారు. గోవాలో రాహుల్, సోనియా కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఓ ప్రైవేటు కార్యక్రమం నిమిత్తం శనివారం గోవాకు చేరుకున్నట్లు ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు. రాబోయే మూడు రోజులు వీరు గోవాలోనే ఉంటారన్నారు. వీరు దక్షిణగోవాలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో బసచేస్తున్నారన్నారు. ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమనీ, రాహుల్, సోనియా పార్టీ నేతలను కలుసుకోబోరని స్పష్టం చేశారు. -
‘పాస్‌పోర్ట్, వీసా నిబంధనలు సరళతరం’
వారణాసి : పాస్‌పోర్ట్‌తో పాటు వీసా నిబంధనలనూ తమ ప్రభుత్వం సరళతరం చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు . ఈ - వీసాతో ఎన్ఆర్ఐల విలువైన సమయం ఆదా అవుతుందని, సమస్యలనూ అధిగమించవచ్చని చెప్పారు. పీఐఓ కార్డులను ఓసీఐ కార్డులుగా మార్చేందుకూ తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.ప్రపంచానికి పలు అంశాల్లో భారత్ నేతృత్వం వహిస్తోందని, అంతర్జాతీయ సోలార్ అలయన్స్ (ఐఎస్ఏ) వీటిలో ఒకటని చెప్పుకొచ్చారు. ఈ వేదిక కేంద్రంగా ఒక ప్రపంచం, ఒక సూర్యుడు, ఒకే గ్రిడ్ అనే స్ఫూర్తితో మనం ముందుకెళతామని చెప్పారు. ప్రధాని తన నియోజకవర్గం వారణాసిలో మంగళవారం 15వ ప్రవాసి భారతీయ దివస్‌ను ప్రారంభించి సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు. కాగా, సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులు అలహాబాద్‌లో కుంభమేళాకు హాజరవడంతో పాటు, రిపబ్లిక్ డే వేడుకలను తిలకించేందుకు వీలుగా ఈ ఏడాది ప్రవాసి భారతీయ దివస్‌ను జనవరి 21 నుంచి 23 వరకూ నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. నూతన భారత్ ఆవిష్కరణలో భారత సంతతి పాత్రను ఈ ఏడాది సదస్సుకు ప్రధాన థీమ్‌గా ఎంపిక చేశారు. -
కుంభమేళాలో కిన్నెర అఖాడా
ప్రయాగ్‌రాజ్: కుంభమేళా సందర్భంగా ట్రాన్స్జెండర్లతో కూడిన కిన్నెర అఖాడా సభ్యులు మంగళవారం పవిత్ర స్నానాలు ఆచరించి చరిత్ర సృష్టించారు. జునా అఖాడా సభ్యులతో కలిసి భారీ ర్యాలీగా తరలివచ్చిన కిన్నెర అఖాడా సభ్యులు త్రివేణీ సంగమంలో స్నానం చేశారు. ఈ సందర్భంగా ‘హరహర మహాదేవ్’ అంటూ నినాదాలు మిన్నంటాయి. కార్యక్రమానికి హాజరైన వారంతా కిన్నెర అఖాడా సభ్యులను ఆసక్తిగా తిలకించారు. కాగా, కుంభమేళాకు ట్రాన్స్జెండర్లను అనుమతించడం ఇదే ప్రథమం. సంప్రదాయ వాదుల నుంచి వారికి గట్టి ప్రతిఘటన కూడా ఎదురైందని అఖాడా వర్గాలు తెలిపాయి. ‘ప్రాచీన భారతంలో ట్రాన్స్జెండర్లకు ఎలాంటి గౌరవం దక్కిందో మన మత గ్రంథాలు చెబుతున్నాయి. అప్పట్లో మాదిరిగా సమాజం మమ్మల్ని అంగీకరించేందుకే ఈ ప్రయత్నం. రానున్న తరాల వారు మా మాదిరిగా వివక్షకు గురి కాకుండా చూసేందుకే ఇక్కడికి వచ్చాం’ అని కిన్నెర అఖాడా అధిపతి లక్ష్మి నారాయణ్ త్రిపాఠీ(40) తెలిపారు. ‘ట్రాన్స్జెండర్లు బిచ్చగాళ్లుగానే ఉండాలని మీ రెందుకు భావిస్తున్నారు? ట్రాన్స్జెండర్లకు ఉద్యోగాలు ఇచ్చేందుకు కూడా సంస్థలు ఇష్టపడటం లేదు’ అని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈమె పలు హిందీ సినిమాల్లో వివిధ పాత్రలు పోషించారు. మందిరం కోసం 33 వేల దీపాలు అయోధ్యలో రామాలయం నిర్మించాలంటూ కుంభమేళా సందర్భంగా సాధువులు రోజుకు 33వేల దీపాలను వెలిగిస్తున్నారు. ఆలయం కోసం ఈ నెలలో 11 లక్షల దీపాలను వెలిగించనున్నట్లు వారు తెలిపారు. కాగా, కుంభ్‌నగరిలో టాయిలెట్లు పనిచేయకపోవడంతో కుంభమేళా ప్రారంభమైన మొదటి రోజు తరలివచ్చిన సుమారు కోట్ల మందిలో చాలా మంది ఇబ్బందులు పడ్డారు. -
భళా..! కుంభమేళా..!
-
కుంభమేళా కోసం ప్రత్యేక మొబైల్ యాప్
లక్నో: అలహాబాద్‌లో జనవరి 15 నుంచి జరగనున్న కుంభమేళా కోసం నార్త్ సెంట్రల్ రైల్వే(ఎన్సీఆర్) ప్రత్యేకంగా ’రైల్ కుంభ సేవా మొబైల్ యాప్’ ను ఆవిష్కరించింది. కుంభ మేళాలో పాల్గొనేందుకు అలహాబాద్‌ను సంద ర్శించే భక్తులు, పర్యాటకులు, ఇతర ప్రయా ణికులకు అవసరమైన సమాచారాన్ని అందించ డానికి ఈ యాప్‌ను రూపొందిం చినట్టు ఎన్సీఆర్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అమిత్ మాల్వియ తెలిపారు. ఈ యాప్ కుంభమేళా ప్రత్యేక రైళ్లకు సంబంధించిన సమాచారం, రిజర్వ్ సీట్లు, రిజర్వు కాని సీట్ల వివరాలను తెలియజేస్తుందని ఆయన చెప్పారు. ఏ సమ యంలోనైనా, ఎక్కడినుంచైనా కుంభమేళా కు సంబంధించిన సమాచారం ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. భక్తులు తమ ప్రస్తుత స్థానంతో పాటు, అలహాబాద్‌లోని అన్ని రైల్వేస్టేషన్లు, మేళా ప్రాంతం, ప్రధాన హోట ళ్ళు, బస్స్టేషన్లు, ఇతర సౌకర్యాలకు సంబం ధించిన సమాచారం కూడా ఈ యాప్ ద్వారా పొందొచ్చని చెప్పారు. పార్కింగ్, అల్పాహార గదులు, వేచి ఉండు గదుల సమాచారం కూడా ఈ యాప్ అందిస్తుందన్నారు. -
అక్కడ ఆ మూడు నెలలు పెళ్లిళ్లు నిషేధం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సంచలనాలకు, వివాదాలకు మారు పేరుగా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల యూపీ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో వివాహ వేడుకలను నిషేధిస్తూ యూపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ నిర్ణయం రాష్ట్రం మొత్తం కాదు.. కేవలం ప్రయాగ్ రాజ్ (అలహాబాద్) సిటీలో మాత్రమే. ఆ సమయంలో కుంభమేళా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వివరించింది. కుంభమేళా జరిగే మూడు నెలల కాలంలో ప్రయాగ్ రాజ్ లో ఎటువంటి పెళ్లి వేడుకలు పెట్టుకోరాదని యోగి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ ఇప్పటికే పెళ్లి తేదీలను - ఫంక్షన్ హాళ్లను మాట్లాడుకున్న వారు వాటిని రద్దు చేసుకోవాలని కూడా ఆదేశించింది. దీంతో ఇప్పటికే ఫంక్షన్ హాళ్లను బుక్ చేసుకున్న వాళ్లు మరో చోటు వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరికొందరు ఈ సీజన్ లో పెళ్లి తేదీలను రద్దు చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వెడ్డింగ్ బిజినెస్ కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని వాటి నిర్వాహకులు వాపోతున్నారు. కుంభమేళా ముగిసే వరకు ప్రయాగ్ రాజ్ లో ఎటువంటి పెళ్లి వేడుకలు నిర్వహించరాదు అని ఆదేశాల్లో స్పష్టంగా తెలియజేసింది. జనవరిలో మకర సంక్రాంతి, పుష్య పూర్ణిమ రోజుల్లో. ఫిబ్రవరిలో మౌని అమావాస్య, బసంత్ పంచమి, మాఘ పూర్ణిమ రోజుల్లో. మార్చిలో మహాశివరాత్రి పర్వదినాలలో జరిగే స్నానాల సమయంలో భారీ ఎత్తున భక్తులు వస్తారని అందుకే ఆ రోజుల్లో వివాహా వేడుకలు ఉంటే ఇబ్బందులు ఎదురయితాయనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూపీ ప్రభుత్వం పేర్కొంది -
వైభవంగా కుంభమేళా
న్యాల్కల్(జహీరాబాద్): కుంభమేళాకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో మంజీర నది కోలాహలంగా మారింది. రాఘవాపూర్–హుమ్నాపూర్ గ్రామాల శివారులో కొనసాగుతున్న కుంభమేళా ఆరో రోజు కూడా భక్తుల తాకిడి పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వేకువజామున వచ్చిన భక్తులు మంజీరలో పుణ్యస్నానాలచరించారు. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు నదిలో స్నానాలు చేసి గంగామాతకు పూజలు నిర్వహించారు. అనంతరం గంగాదేవి ఆలయంలో పూజలు చేసి దైవదర్శనం చేసుకున్నారు. ఆలయ ఆవరణలో ఉన్న శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యజ్ఞా, హోమాలు కొనసాగుతున్నాయి. కుంభమేళాలో భక్తుల కోలాహలంతో పాటు సాధువుల సంతుల సందడి నెలకొంది. భక్తులు దిగంబర సాధువులను దర్శించుకున్నారు. సాయంత్రం సాధువుల ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. అలాగే భక్తులు పంచవటిలో వెలసిన శారదాదేవి, సాయిబాబ, శనీశ్వర ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేసిన వెంకటస్వామి ఉదయం కుంభమేళాకు వచ్చిన రుస్తుపేట పీఠాధిపతి వెంకటస్వామికి పంవచటి క్షేత్రం పీఠాధిపతి కాశీనాథ్‌బాబా ఘనంగా స్వాగతం పలికారు. ఆయనతో కలసి మంజీర నది వద్ద గంగామాతకు పూజలు నిర్వహించారు. అనంతరం వెంకటస్వామి భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం శుభదినాలు ఉన్నందున భక్తులు మంజీరలో పుణ్యస్నానాలచరించాలన్నారు. లోక కల్యాణార్థమై ఈ ప్రాంతంలో కాశీనాథ్‌బాబా కుంభమేళా నిర్వహించడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న పుణ్యమన్నారు. ప్రతి ఒక్కరూ అధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. -
ఈ మరణ మృదంగం ఇప్పడే కాదు.. ఎప్పటి నుంచో
భారతదేశంలో ప్రముఖ ఆలయాల సందర్శన, ఉత్సవాలు, ఆధ్మాత్మిక కార్యక్రమాలంటేనే సామాన్యుల గుండెల్లో గుబులు పుట్టుకొచ్చే పరిస్థితి వస్తోంది. ఇందులో పాల్గొన్న తాము సురక్షితంగా ఇంటికి వెళతామో లేదోనన్న ఆందోళన వెన్నంటే ఉంటుంది. తాజాగా ప్రారంభమైన మరో బ్రహ్మాండ ఆధ్యాత్మిక కార్యక్రమం గోదావరి పుష్కరాలు మిగిల్చిన విషాదం అదే భయాన్ని గుర్తు చేస్తోంది. అయితే, మనదేశంలో ఆలయాల సందర్శన కొత్తకాదు.. తొక్కిసలాట అంతకంటే కొత్త విషయమేమి కాదు. ఘటన జరిగినప్పుడు మాత్రం సామాన్యుల నుంచి మీడియా వరకు పిల్ల నేత నుంచి బడా నేతల వరకు ఆ అంశంపై చర్చాతిచర్చల్లో మునగినట్లు కనిపించడం మళ్లీ సాధారణ స్థితికి రావడం షరా మాములయ్యింది. అలాంటి ఘటన మరోసారి జరిగితే అయ్యో మళ్లీ జరిగిందే అనే మరోసారి అదే ముచ్చట. గత దశాబ్దకాలంలో ఆలయాల్లో తొక్కిసలాట జరిగి వెయ్యిమందికి పైగా చనిపోయారని అధికారుల వద్ద సమాచారం ఉందంటే సామాన్య జనాల ప్రాణాలు పాలకులకు ఎంత తేలికో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు దేశంలో ఆద్మాత్మిక కార్యక్రమాల్లో జరిగిన తొక్కిసలాటలు ఒక్కసారి పరిశీలిస్తే.. ► ఫిబ్రవరి 3, 1954: మహాకుంభమేళ విషాదం, 800 మంది మృతి, 100 మందికి గాయాలు ► ఆగస్టు 27, 2003: నాసిక్ గోదావరి కుంభమేళ, 40 మంది మృతి, 125 మందికి గాయలు ► 2004: కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలో తొక్కిసలాట, ఐదుగురు దుర్మరణం ► జనవరి 26, 2005: మహారాష్ట్రలోని సతారాజిల్లాలోగల మందిర్ దేవీ ఆలయంలో తొక్కిసలాట 350 మంది మృతి, 200 మందికి గాయలు ► జూలై 12, 2008: పూరి జగన్నాథ్ యాత్ర 6 గురు మృతి, పలువురికి గాయాలు. ► ఆగస్టు 3, 2008: హిమాచల్ ప్రదేశ్‌లోని నైనా దేవీ ఆలయంలో తొక్కిసలాట 160 మంది మృతి 400 మందికి గాయాలు(కొండచరియలు పడుతున్నాయన్న తప్పుడు వార్తలతో తొక్కిసలాట చోటుచేసుకొంది) ► సెప్టెంబర్ 30, 2008: జోద్‌పూర్‌లోని చాముండా ఆలయంలో తొక్కిసలాట 120 మంది దుర్మరణం. పలువురికి గాయాలు ► మార్చి 4, 2010: ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌ఘడ్ నవరాత్రి ఉత్సవంలో తొక్కిసలాట, 63 మంది మృతి. కృపాలు మహారాజ్ పేదలకు చీరలు పంచే కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ► జనవరి 14, 2011: కేరళలోని శబరిమల ఆలయంలో తొక్కిసలాట. 106 మంది మృతి, 100 మందికి గాయాలు ► మార్చి 27, 2011: మధ్యప్రదేశ్‌లోని కరీలా గ్రామంలో తొక్కిసలాట.8 మందిమృతి, 10 మందికి గాయాలు ► నవంబర్ 8, 2011: హరిద్వార్‌లో తొక్కిసలాట, 22 మంది మృతి ► ఫిబ్రవరి 8, 2013: మహాకుంభ మేళా సమయంలో అలహాబాద్‌లో మౌని అమావాస్యనాడు ఫుట్ బ్రిడ్జి కూలి తొక్కిసలాట జరగగా 36 మంది దుర్మరణం ► అక్టోబర్ 13, 2013: మధ్యప్రదేశ్‌లోని దాటియా జిల్లాలో రతన్ఘడ్ ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకొని చిన్నారులతో సహా 75 మంది మృతి, వందమందికి గాయాలు ► జూలై 14, 2015: ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి పుష్కరాల్లో రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాట. 27 మంది మృతి, పలువురికి గాయాలు. -
కుంభమేళా కాదు అన్నీ కుంభకోణాలే..!
పుష్కర పనులు పరిశీలించిన కాంగ్రెస్ నేతలు మంథని/ధర్మపురి/మహదేవపూర్ : పన్నెండెళ్లకోసారి వచ్చే గోదావరి పుష్కరాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిం చాల్సి ఉండగా.. ప్రభుత్వం రాజకీయ కోణంలో ముందుకుసాగుతోందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కటకం మృత్యుంజయం, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నా రు. జిల్లాలోని ధర్మపురి, మంథని, కాళేశ్వరంలో చేపట్టిన పుష్కరపనులను శుక్రవారం పరిశీలించారు. కుంభమేళా తరహాలో కాదు.. కుంభకోణాలే కనిపిస్తున్నాయన్నారు. సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వం దేవాలయాలు, విగ్రహాలకు గులాబీ రంగులు వేయడం ఏంటని ప్రశ్నించారు. ఇంత జరుగుతుంటే దేవాదాయశాఖ నిద్రపోతుందా అని ప్రశ్నించారు. పుణ్యస్నానానికి వచ్చే భక్తులపై గులాబీ రంగును హెలిక్యాప్టర్ ద్వారా చల్లే ప్రమాదం ఉందన్నారు.పనుల్లో నాణ్యత లేదని, పర్యవేక్షించే అధికారులే కరువయ్యూరన్నారు. కాంట్రాక్టర్లంతా ముఖ్యమంత్రి బంధువులేనన్నారు. స్వరాష్ట్రంలో మొదటిసారి వచ్చిన పుష్కరాలకు అత్యధిక నిధులు కేటాయిస్తారనుకుంటే అతి తక్కువ మంజూరు చేశారన్నారు. గతంలో నిర్మించిన ఘాట్లే తప్ప కొత్తవి లేవని, కేవలం మెట్లు మాత్రమే నిర్మిస్తున్నారన్నారు. పుష్కరాలకు రెండు రోజులే మిగిలి ఉండగా.. ఇంకా పనులు కొనసాగుతుండడం వింతగా ఉందన్నారు. పనుల నాణ్యతపై క్వాలిటీ కంట్రోల్ అధికారులతో విచారణ చేపట్టాలని కోరారు. పుష్కరాల పనులపై నివేదిక తయూరు చేసి గవర్నర్‌కు అందజేయనున్నట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, అల్గిరెడ్డి ప్రవీణ్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, డీసీసీ అధికార ప్రతినిధి శశిభూషణ్ కాచే, ముత్తారం జెడ్పీటీసీ సదానందం తదితరులు పాల్గొన్నారు. -
కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలు: నాయిని
కరీంనగర్: కాళేశ్వరం వద్ద ఉన్న గోదావరి పుష్కర ఘాట్ లను తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గోదావరి పుష్కరాలకు కుంభమేళాను తలపించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. తెలంగాణలోని పోలీస్ స్టేషన్లన్నింటినీ అనుసంధానం చేస్తూ హైదరాబాద్ లో కమాండెంట్ కంట్రోల్ రూమ్ పేర్పాటు చేస్తామని నాయని తెలిపారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమౌతుందని ఆయన అన్నారు. అంతేకాకుండా ఇకపై పోలీసులకు వీక్ ఆఫ్ లు కల్పిస్తామన్నారు.