వైఎస్సార్ కడప: దేశంలో కరోనా విశృంఖలంగా వ్యాపించడానికి ప్రధాన కారణం కుంభమేళా అని కూడా అందరూ ఆరోపిస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవమో పక్కన పెడితే కుంభమేళాకు వెళ్లి వచ్చిన వారికి మాత్రం పెద్ద సంఖ్యలో కరోనా వ్యాప్తి చెందింది. తాజాగా కుంభమేళాకు వెళ్లివచ్చిన పూజారి కరోనా సోకి మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఆలయ ప్రధాన అర్చకులు కరోనాతో మృతిచెందారు.
కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని అమ్మవారిశాల ప్రధాన అర్చకుడు అనంతబోట్ల హరికృష్ణ శర్మ ఇటీవల హరిద్వార్‌లో జరిగిన కుంభమేళాకు వెళ్లారు. తిరిగి వచ్చిన అనంతరం ఆయనకు కరోనా సోకింది. వారం రోజులుగా కరోనాతో పోరాడుతున్నారు. చికిత్స పొందుతూ గురువారం ఆయన మృతి చెందారని వారి బంధువులు వెల్లడించారు. ఈ విధంగా కుంభమేళాకు వెళ్లి వచ్చిన చాలా మంది కరోనా బారినపడ్డారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment