Porumamilla
-
కువైట్‌లో రోడ్డు ప్రమాదం.. కృష్ణంపల్లె వాసి మృతి
పోరుమామిళ్ల : మండలంలోని చల్లగిరిగెల పంచాయతీ క్రిష్ణంపల్లెకు చెందిన గోపవరం జయరామిరెడ్డి (40) కువైట్‌లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సంఘటన జరిగి మూడు రోజులవుతున్నా సరైన సమాచారం లేదని మృతుడి తమ్ముడు దశరధరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశరధరామిరెడ్డి కథనం మేరకు జయరామిరెడ్డి కువైట్‌లో లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆయన భార్య 9 సంవత్సరాల క్రితం క్యాన్సర్‌తో మృతి చెందింది. ఆయనకు రాముకార్తీక్రెడ్డి(14), తునుషి కౌసల్య(10) ఇద్దరు పిల్లలు. మూడు రోజుల క్రితం బస్తాల లోడుతో వెళుతున్న జయరామిరెడ్డి లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయింది.లారీలో ఉన్న జయరామిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, కారులో ఉన్నవారిలో ముగ్గురు మృతి చెందారు., మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రమాదం గురించి, జయరామిరెడ్డి మృతి గురించి కానీ ఇక్కడకు ఎవ్వరూ సమాచారం ఇవ్వలేదు. జయరామిరెడ్డి రెండు రోజులు ఫోన్ చేయకపోవడంతో దశరధరామిరెడ్డి ఫోన్ చేయడంతో విషయం తెలిసింది. జయరామిరెడ్డి ఫోన్ లిఫ్ట్ చేసిన వ్యక్తి ఆయన ప్రమాదంలో చనిపోయారని అరబిక్‌లో చెప్పాడు. దశరధరామిరెడ్డి కూడా గతంలో కువైట్‌లో ఉన్నందున భాష తెలిసి అన్న మృతి చెందాడని అర్థం చేసుకున్నాడు. అన్న పని చేస్తున్న సేట్‌కు ఫోన్ చేశాడు. సేట్ ప్రమాదంలో జయరామిరెడ్డి చనిపోయాడని, మృతదేహం ఆసుపత్రిలో ఉందని, ప్రాసెస్ పూర్తయితే ఇండియాకు పంపిస్తానని చెప్పాడు. రెండు రోజులుగా సేట్ నుండి ఎలాంటి సమాచారం లేదని, ఫోన్ చేస్తే ప్రాసెస్ జరుగుతున్నదని మాత్రమే చెపుతున్నాడని దశరథరామిరెడ్డి వివరించాడు. కువైట్‌లో ఉన్న ఆంధ్రా ఎంబసీకానీ, ఆంధ్రా వ్యక్తులు కానీ అందుబాటులోకి రావడం లేదని, సరైన సమాచారం ఎవ్వరూ చెప్పడం లేదని దశరధరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మృతదేహం ఎప్పుడు పంపిస్తారు? ప్రమాదంపై కేసు నమోదు చేశారా? కేసు ఏమని రాశారు? తదితర సమాచారం ఏమీ తెలియడం లేదని బంధువులు చెబుతున్నారు. -
అడవిలో తప్పిపోయిన బాలుడ్ని కాపాడిన ఫారెస్ట్ అధికారులు
-
బంధువుల ఇంటికి వెళ్తూ..
పోరుమామిళ్ల: భార్యాభర్తలు బంధువుల ఇంటికి వెళ్తూ.. రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో భార్య దుర్మరణం చెందగా, భర్త గాయాల పాలయ్యాడు. ఈ సంఘటన పోరుమామిళ్ల మండలంలోని రామిరెడ్డికుంట వద్ద ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం రంగనాయుడిపల్లెకు చెందిన దంపతులు రాగి నారాయణ, పోలమ్మ.. పోరుమామిళ్ల మండలం రామేశ్వరం ఎస్టీ కాలనీలోని బంధువుల ఇంటికి టీవీఎస్ మోపెడ్‌పై వస్తున్నారు. ఈ వాహనాన్ని కొమరోలు వైపు నుంచి పోరుమామిళ్ల వైపు వస్తున్న ట్యాంకర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో మోపెడ్ పైనుంచి ఇద్దరూ కింద పడిపోయారు. పోలమ్మ తలపై ట్యాంకర్ చక్రం వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. నారాయణకు స్వల్ప గాయాలయ్యాయి. ఎస్ఐ హరిప్రసాద్ ఘటన స్థలానికి చేరకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోరుమామిళ్ల ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
కుంభమేళాకు వెళ్లొచ్చిన పూజారి కరోనాతో మృతి
వైఎస్సార్ కడప: దేశంలో కరోనా విశృంఖలంగా వ్యాపించడానికి ప్రధాన కారణం కుంభమేళా అని కూడా అందరూ ఆరోపిస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవమో పక్కన పెడితే కుంభమేళాకు వెళ్లి వచ్చిన వారికి మాత్రం పెద్ద సంఖ్యలో కరోనా వ్యాప్తి చెందింది. తాజాగా కుంభమేళాకు వెళ్లివచ్చిన పూజారి కరోనా సోకి మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఆలయ ప్రధాన అర్చకులు కరోనాతో మృతిచెందారు. కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని అమ్మవారిశాల ప్రధాన అర్చకుడు అనంతబోట్ల హరికృష్ణ శర్మ ఇటీవల హరిద్వార్‌లో జరిగిన కుంభమేళాకు వెళ్లారు. తిరిగి వచ్చిన అనంతరం ఆయనకు కరోనా సోకింది. వారం రోజులుగా కరోనాతో పోరాడుతున్నారు. చికిత్స పొందుతూ గురువారం ఆయన మృతి చెందారని వారి బంధువులు వెల్లడించారు. ఈ విధంగా కుంభమేళాకు వెళ్లి వచ్చిన చాలా మంది కరోనా బారినపడ్డారని తెలుస్తోంది. చదవండి: ఘోరం.. 577 మంది టీచర్లు కరోనాకు బలి చదవండి: ఇప్పటివరకు లాక్డౌన్ ప్రకటించిన రాష్ట్రాలు ఇవే.. -
ఎస్బీఐ హెడ్ క్యాషియర్.. నిండా ముంచాడు
సాక్షి, కడప : ప్రభుత్వ రంగానికి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో అతను ఉద్యోగి. హెడ్ క్యాషియర్‌గా పనిచేస్తున్న అతడు సొంత బ్యాంకుకే కన్నం వేశాడు. ఖాతాదారులు కుదవపెట్టిన నగలు, బ్యాంకులోని సొమ్ముతో ఉడాయించాడు. గత మార్చి నెలలో పరారైన ఆ కేటుగాడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. అతనికి సహకరించిన ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వివరాలాలి.. వైఎస్సార్ జిల్లా పొరుమామిళ్లలోని రంగసముద్రం ఎస్బీఐలో గురుమోహన్‌రెడ్డి అనే వ్యక్తిగా హెడ్ క్యాషియర్‌గా పనిచేశాడు. అతడు గత మార్చిలో బ్యాగు తీసుకొని బ్యాంకుకు వచ్చిన అతను.. బ్యాంకులో ఖాతాదారులు తాకట్టు పెట్టిన నగలు, డబ్బుతో ఉడాయించాడు. తాజాగా గురుమోహన్‌రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు.. అతని వద్ద నుంచి 56 లక్షల నగదు, 1.7 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టపోయానని, అందుకే బ్యాంకు సొమ్ముతో ఉడాయించానని నిందితుడు గురుమోహన్ విచారణలో వెల్లడించినట్టు వైఎస్సార్ జిల్లా ఓఎస్డీ అద్నాన్ నయీమ్ అస్మి తెలిపారు. -
అప్పుడే నూరేళ్లు నిండాయా..!
పోరుమామిళ్ల : ‘అప్పుడే నూరేళ్లు నిండా యా చిట్టి తల్లీ’.. అంటూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతురు మృత్యువాత పడటంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని రౌతుపల్లెకు చెందిన చప్పిడి వెంకటసుబ్బారెడ్డి, సునీత కూతురు తన్విత (5). ఆ బాలిక గానుగపెంట పాఠశాలలో ఎల్‌కెజీ చదువుతోంది. ఈ క్రమంలో శనివారం తల్లిదండ్రులతో బద్వేలు నుంచి ఆటోలో ఊరికి వచ్చింది. ఆటో దిగి రోడ్డు దాటి ఇంటికి వెళుతుండగా.. క్రిష్ణంపల్లె నుంచి బద్వేలు వెళుతున్న ట్రాక్టర్ పసిబిడ్డపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తన్విత అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో తల్లిదండ్రులు కూలబడిపోయారు. క్రిష్ణంపల్లెకు చెందిన ట్రాక్టర్ యజమాని చలపతి స్వయంగా డ్రైవింగ్ చేస్తుండగా జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పలుగుతో భార్యను పొడిచి చంపాడు
సాక్షి, పోరుమామిళ్ళ: కడదాకా కలిసి ఉంటానని పెళ్లినాడు బాస చేశాడు.. కానీ నిలబెట్టుకోలేకపోయాడు. ఉన్మాదంతో భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల మండలం రామేశ్వరంలో జరిగింది. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, గంగమ్మ(45)లు భార్యాభర్తలు. ఇద్దరూ పొలం పనులకు వెళ్లారు. ఇంతలో వారి మధ్య ఏమైందో ఏమో గాని బోరు బావి వద్ద గంగమ్మను గడ్డపారతో పొడిచి వెంకటేశ్వర్లు దారుణంగా హత్య చేశాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు. -
ఇలా అయితే దాహం తీరేదెలా?
► తక్కువ ట్రిప్పులు తోలి.. ఎక్కువ నమోదు ► ప్రజలకు తప్పని ఇబ్బందులు పోరుమామిళ్ల: జిల్లాలోని పోరుమామిళ్ల పట్టణంలో తాగునీటి ఎద్దడి నెలకొంది. దీంతో ప్రజల అవసరాలు తీర్చేందుకు అర్డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు తీసుకున్నారు.పంచాయతీ ఆధ్వర్యంలో 65 ట్యాంకర్లు నీరు సరఫరా చేస్తున్నారు. అవసరాలు తీరడం లేదని ఫిర్యాదులు రావడంతో 75కు పెంచారు. అయితే కొంతమంది తక్కువ ట్యాంకర్లు తోలి ఎక్కువ ట్రిప్పులు నమోదు చేసి దోచుకుంటున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. వాటి గురించి విచారణ చేయకుండా మళ్లీ ట్రిప్పులు పెంచారు. పట్టణంలోని జనాభాకు 4 లక్షల లీటర్ల నీరు కావాలని, ఆ మేరకు సరఫరా చేయాలంటే 125 ట్యాంకర్లు అవసరం అవుతాయని అధికారులపై పాలకపార్టీ నేతలు ఒత్తిడి తెచ్చి ట్రిప్పులు పెంచుకున్నారు. 50 ట్రిప్పులు తోలి 75 నమోదు చేయిస్తుండటం వల్లే నీటి అవసరాలు తీరడం లేదని వివిధవర్గాల వారు ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా ఎన్ని ట్రిప్పులు తోలుతున్నారు? ప్రజలకు ఎన్ని అందుతున్నాయనేది తెలుసుకుని విచారణ చేయాలని కోరుతున్నారు. చాలా వీధుల్లో నీరు అందక డ్రమ్ము రూ. 30 నుంచి 40 రూపాయలు చెల్లించి కొంటున్నారు. కొందరు పైపుతో ట్యాంకుకు పట్టుకుంటున్నారు. ఉచితంగా నీరు సరఫరా చేస్తే ఇలా కొనాల్సిన అవసరం ఏముందని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనిపై అధికారులు సమగ్ర విచారణ చేయాలని కోరుతున్నారు. -
ఆటో నుంచి కింద పడి బాలుడు మృతి
పోరుమామిళ్ల: మండలంలోని తోకలపల్లెకు చెందిన ఆటో డ్రైవర్ పుల్లయ్య ఒక్కగానొక్క కుమారుడు పండు(3) సోమవారం సాయంత్రం ఆటో నుంచి కింద పడి మృతి చెందాడు. వివరారాలు ఇలా ఉన్నాయి. పుల్లయ్య ఆటో డ్రైవర్. సోమవారం సరదాగా కుమారున్ని ఆటోలో కూర్చోపెట్టుకుని వెళుతుండగా పండు జారి కిందపడ్డాడు. అంతే అక్కడికక్కడే చలనం లేకుండా పోయింది. చిన్నారిని రాత్రి ఇక్కడి ప్రభుత్వ ఆసుపత్రికి తెచ్చారు. డాక్టర్ రహిమాన్ పరీక్షించి ప్రాణం పోయినట్లు నిర్ధారించారు. అంతే తల్లిదండ్రులు పుల్లయ్య, ధనమ్మ రోదన చెప్పనలవి కాలేదు. ఆ గ్రామం నుంచి వచ్చిన వారు వారి దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. పండుగ రెండ్రోజులు ఉందనగా కళ్ల ముందు కన్నకొడుకు విగతజీవిగా మారడం ఆ తల్లిదండ్రులకు పుట్టెడు శోకాన్ని మిగిల్చింది. -
ఎందాకైనా వెళ్తాం
► కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని పోలీసులు అప్పగించాలి ► నిందితులను పట్టుకోవాలి ∙ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పోరుమామిళ్ల: టీడీపీ నేతలు కిడ్నాప్ చేసిన వ్యక్తిని.. వారి కుటుంబ సభ్యులకు అప్పగించే వరకు పోరాటం చేస్తామని కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంలో తాము ఎందాకైనా వెళ్తామని పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ఆయన కడప మేయర్ సురేష్‌బాబుతో కలసి పోరుమామిళ్ల వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక నేతలతో చర్చించారు. అక్కడికి వచ్చిన డాక్టర్ గౌస్‌పీర్ కుటుంబ సభ్యులు, మైనారిటీ నాయకులతో మాట్లాడి కిడ్నాప్‌కు గురయిన ముర్తుజా హుసేన్‌కు ఏమీ జరగదని, ఈ విషయంలో ఎలాంటి పోరాటాలకైనా వెనకడుగు వేయబోమన్నారు. ఎస్పీతో మాట్లాడామని, ఆయన మంగళవారం సాయంత్రానికి ముర్తుజా సమస్య పరిష్కారమవుతుందని హామీ ఇచ్చారన్నారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి పోలీస్‌స్టేషన్‌కు నడచుకుంటూ వెళ్లారు. సరైన రీతిలో స్పందించని పోలీసులు: పోలీస్‌స్టేషన్‌లో ఎంపీ, మేయర్..సీఐ పద్మనాథన్, ఎస్‌ఐపెద్ద ఓబన్నను కలసి మాట్లాడారు. ప్రొద్దుటూరులో కారు స్వాధీనం చేసుకున్నామని, కారు యజమాని, డ్రైవర్ ద్వారా కిడ్నాపర్లను అదుపులోకి తీసుకుంటామని పోలీస్ అధికారులు తెలిపారు. సాయంత్రానికి ముర్తుజాను తెస్తామని వారు పేర్కొన్నారు.ఎంపీ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ ఆదివారం కిడ్నాప్ అయితే ఇప్పటికీ ఈ విషయంలో పోలీసులు సరైన రీతిలో స్పందించలేదన్నారు. టీడీపీ నాయకులే కారణమనే విషయం తెలిసినా, స్థానికంగా వారికి సహకరించిన వారిపై చర్యలు తీసుకోలేదన్నారు. కిడ్నాపర్లను అదుపులోకి తీసుకోవడంలో ఎందుకో నిర్లక్ష్యంగా ఉన్నారని, సాయంత్రానికి ముర్తుజాను కుటుంబ సభ్యులకు అప్పగించాలని కోరారు. ఆ తరువాత పోలీస్‌స్టేషన్ వద్ద విలేకరులతో ఎంపీ మాట్లాడుతూ ఈరోజు ఆమరణదీక్షకు కూర్చుంటానని చెప్పడం జరిగిందని, అయితే ఎస్పీ ఈ రోజు సాయంత్రానికి కిడ్నాప్ ఛేదిస్తామని హామీ ఇచ్చారన్నారు. సాయంత్రానికి ముర్తుజాను కుటుంబసభ్యులకు అప్పగించకపోతే చెప్పిన కార్యక్రమం జరుగుతుందన్నారు. కిడ్నాప్ చేయడం టీడీపీ విష సంస్కృతి అని పేర్కొన్నారు. ప్రశాంతంగా వున్న పోరుమామిళ్లలో ఫ్యాక్షన్‌కు తెరలేపారన్నారు. కార్యక్రమంలో మేయర్‌సురేష్‌బాబు, నాగార్జునరెడ్డి, రవిప్రకాష్‌రెడ్డి, సియం బాషా తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయ కిడ్నాప్
పోరుమామిళ్ల : పోరుమామిళ్ల పట్టణంలోని గాజుల్లా టీ బంక్ దగ్గర స్థానిక ఎంపీటీసీ సభ్యుడు డాక్టర్ గౌస్‌పీర్ కుమారుడు ముర్తుజాహుస్సేన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో కిడ్నాప్ చేశారు. సినిమాకు వెళుతుండగా అడ్డగించి, కొట్టి కారులో ఎత్తుకెళ్లారు. ఈ ఘటన పోరుమామిళ్లలో కలకలం సృష్టించింది. విషయం తెలిసిన ఎంపీ అవినాష్‌రెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు సోమవారం ఉదయం పోరుమామిళ్లకు చేరుకున్నారు. ముందుగా పార్టీ కార్యాలయంలో స్థానిక నేతలతో మాట్లాడారు. ఎంపీ, మేయర్ వస్తున్నారని తెలిసి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అందరూ ర్యాలీగా పోలీస్‌స్టేషన్ వరకు నడుచుకుంటూ వెళ్లారు. అక్కడ సీఐ పద్మనాథన్, ఎస్సై పెద్ద ఓబన్నలతో మాట్లాడారు. పోరుమామిళ్ల నుంచి కార్లు మైదుకూరు రూట్లో వెళుతున్నట్లు సీసీ పుటేజ్‌లో స్పష్టంగా తెలుస్తున్నా అమగంపల్లె, మల్లెపల్లె, వనిపెంట చెక్‌పోస్టుల వద్ద ఎందుకు పట్టుకోలేకపోయారని ఎంపీ నిలదీశారు. కిడ్నాప్‌నకు వచ్చిన వారిలో ఒకరి సెల్ కిందపడితే మీకు అందజేసినా ఎందుకు ఆచూకీ తెలుసుకోలేకపోయారని ప్రశ్నించారు. ఆ సెల్ ఎవరిది? ఆ కార్లు ఎవరివి? యువకుడ్ని ఎక్కడకు తీసుకెళ్లారు? అంటూ ప్రశ్నించారు. సీఐ, ఎస్సై స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయారు. తాము రాత్రి నుంచి గాలిస్తున్నామని, ఆచూకీ తెలియడం లేదన్నారు. స్థానికులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించి ఉంటే ఆచూకీ తెలిసి ఉండేదని, మీ విధులను సమర్థవంతంగా నిర్వహించక పోవడం వల్లనే ఇంతవరకు ఆచూకీ తెలియలేదని మండిపడ్డారు. 24 గంటల్లో ఎంపీటీసీ డాక్టర్ గౌస్‌పీర్ కుమారుడు ముర్తుజాహుసేన్ ఆచూకీ కనుగొని అతడిని వారి కుటుంబానికి అప్పజెప్పకపోతే రేపు ఉదయం ఇక్కడే పోలీస్‌స్టేషన్ దగ్గర ఆమరణ నిరాహారదీక్ష చేపడతానని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పోలీసులను హెచ్చరించారు. ఎన్నడూలేని రాజకీయ కిడ్నాప్ ఎంపీ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఇలా రాజకీయ కిడ్నాప్‌లు ఎన్నడూ జరగలేదని, దీనికి స్థానికంగా కొంతమంది సహకరించి ఉంటారన్నారు. జమ్మలమడుగు, పులివెందుల నాయకుల హస్తం లేనిదే ఇలాంటి దారుణం జరగదని పేర్కొన్నారు. పక్కాప్లాన్‌తోనే రాత్రి మూడు కార్లల్లో వచ్చి డాక్టర్ గౌస్‌పీర్ కుమారుడ్ని ఎత్తుకెళ్లారని, ఇంతవరకు ఆచూకీ తెలుసుకోవడంలో పోలీసులు విఫలమయ్యారన్నారు. ఈ వ్యవహారంలో స్థానిక తెలుగుదేశం నేతల సహకారం ఉన్నట్లు స్పష్టమవుతుందని తెలిపారు. ఇదే సమయంలో అక్కడకు వచ్చిన డాక్టర్ గౌస్‌పీర్ భార్య అప్సరున్నీసా, కోడలు రేష్మాలు ముర్తుజాహుస్సేన్‌ను కాపాడాలని విలపించారు. ఎంపీ, మేయర్ వారిని ఓదార్చారు. -
మోస్ట్‌వాంటెడ్ స్మగ్లర్ అరెస్ట్
బద్వేలు అర్బన్: పోరుమామిళ్ల మండలం రేపల్లె గ్రామానికి చెందిన చవ్వా రమణారెడ్డి అనే మోస్ట్‌వాంటెడ్ స్మగ్లర్‌ను అరెస్ట్ చేసినట్లు మైదుకూరు డీఎస్పీ బి.ఆర్.విజయ్‌కుమార్ తెలిపారు. ఆదివారం స్థానిక సర్కిల్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గత నెల 13వ తేదీన గోపవరం మండలం లక్కవారిపల్లె గ్రామ సమీపంలోని కట్టెల వరువ కాలువ అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న విషయం తెలుసుకుని సీఐ, రూరల్ ఎస్ఐలు తమ సిబ్బందితో వెళ్లి దాడులు చేసిన సమయంలో ఎం.శ్రీను మొఘల్ నాయబ్‌లు పట్టుబడగా రమణారెడ్డి పోలీసులపై గొడ్డళ్లు, రాళ్లు రువ్వుతూ పారిపోయాడు. ఈ క్రమంలో ఆదివారం గోపవరం మండలంలోని కాలువపల్లె గ్రామానికి వెళ్లే ఆర్చివద్ద రమణారెడ్డి ఉన్నట్లు సమాచారం రావడంతో వెళ్లి అరెస్టు చేసినట్లు తెలిపారు. అతన్ని విచారించగా గోపవరం మండల పరిధిలో లక్కవారిపల్లె గ్రామ సమీపంలో గల తెలుగుగంగ కాలువ వద్ద ఎర్రచందనం దుంగలు దాచి ఉంచినట్లు తెలపడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితునిపై పోరుమామిళ్ల స్టేషన్లో ఐదు కేసులు, పోరుమామిళ్ల ఫారెస్టు రేంజ్లో రెండు కేసులు , బద్వేలు ఫారెస్టు రేంజ్లో ఐదు కేసులు , బి.కోడూరు పోలీసు స్టేషన్లో రెండు కేసులు, బద్వేలు అర్బన్ స్టేషన్లో ఒక కేసు చొప్పున 15 కేసులు ఉన్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా 2015లో పోరుమామిళ్ల పోలీసులు ఇతనిపై పీడీయాక్ట్ కూడా పెట్టగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండి తిరిగి వచ్చిన తర్వాత కూడా కూలీల సహాయంతో ఎర్రచందనం చెట్లను నరికించి అంతర్జాతీయ స్మగ్లర్లకు అందజేస్తుండేవాడని విచారణలో తేలిందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ రామాంజినాయక్, రూరల్ ఎస్ఐ నరసింహారెడ్డి, హెడ్‌కానిస్టేబుళ్లు మూర్తి, చెంచురామయ్య, ఫారెస్టు బీట్ ఆఫీసర్ రమణయ్య, ఏబీవో కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. -
నందివిగ్రహం చోరీ కేసులో ఏడుగురు అరెస్ట్
పోరుమామిళ్ల: ఎక్కడెక్కడ గుప్తనిధులున్నాయో వెతుకుతూ, వాటిని వెలికితీసే కార్యక్రమంలో భాగంగానే పోరుమామిళ్ల పురాతన శివాలయంలో నందివిగ్రహం చోరీకి ప్రయత్నించారని ఎస్ఐ పెద్ద ఓబన్న పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం పోలీస్‌స్టేషన్‌లో విగ్రహం అపహరణకు ప్రయత్నించిన దుండగులను విలేకరుల ఎదుట హాజరుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత్రి ఆలయంలో శబ్దం వస్తోందని చుట్టుపక్కలవారు ఫోన్ చేయగా సిబ్బందితో వెళ్లి చుట్టుముట్టగా ఏడు మంది పట్టుబడ్డారన్నారు. వారిని విచారించగా శివాలయంలోని నందివిగ్రహంలో గుప్తనిధులున్నట్లు తెలిసి, తీసుకెళ్లేందుకు వచ్చినట్లు చెప్పారన్నారు. ప్రకాశం జిల్లా బేస్తవారిపేటకు చెందిన కర్నాటి రమణారెడ్డి అలియాస్ స్వామి కడపకు చెందిన సాయికృష్ణ, రాయచోటికి చెందిన చరణ్, అశ్విన్‌కుమార్, యర్రగుంట్లకు చెందిన ఆరవేటి రాజా, బేతంచర్లకు చెందిన రమేష్, చెన్నారెడ్డిపేటకు చెందిన సుబ్బారెడ్డితో కలిసి గుప్తనిధుల కోసం ప్రయత్నిస్తున్నారన్నారు. కొన్నేళ్ల నుంచి తవ్వకాలు.. గత సంవత్సరకాలంగా జిల్లాలోని రాయచోటి, కడప ఫారెస్టు, పాలకొండ ప్రాంతాల్లో గుప్తనిధుల కోసం ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. రమణారెడ్డి అలియాస్ స్వామి ఉత్తరభారతదేశంలో పర్యటించి, క్షుద్ర పూజలు, అంజనం వేయడం నేర్చుకున్నాడని తెలిపారు. దాంతో భూమిలో, గుహల్లో, ఆలయాల్లో గుప్తనిధులు వెలికితీసే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. పోరుమామిళ్ల శివాలయం గర్భగుడిలో 7 నెలల కిందట శ్వేతనాగు దర్శనమిచ్చినట్లు పత్రికల్లో, టీవీల్లో కథనాలు వచ్చాయని, దీన్ని చూసి అక్కడ గుప్తనిధులు ఉన్నట్లు భావించారన్నారు. పూజారికి ఆశ చూపి లోబరచుకుని, రాత్రికి రాత్రి విగ్రహం ఎత్తుకెళ్లాలని కారుతో సహా వచ్చారని తెలిపారు. అయితే పోలీసులకు సమాచారం అందడంతో వారి ఆటలు కుదరలేదని ఎస్ఐ వివరించారు. -
విశ్వాసం కోల్పోయారు
పోరుమామిళ్ల: ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి చంద్రబాబు ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని 16, 17, 18 వార్డులకు చెందిన బెస్తవీధి, కొత్తవీధి, ఆపరేటర్బాషా వీధి, రంపాడ్రోడ్, చితానందనగర్లలో సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య, ఎంపీపీ చిత్తా విజయప్రతాప్‌రెడ్డి, మండలశాఖ అధ్యక్షుడు సీఎం బాషాలతో కలసి ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గడప గడపకు వైఎస్సార్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఏ విషయంలోనూ నిలకడగా మాట్లాడరని, ప్రత్యేకహోదా విషయంలోనూ మాట మార్చారన్నారు.ఆయన మంత్రులు కూడా ఆయన బాటలోనే నడుస్తున్నారన్నారు. బెస్తవీధికి చెందిన మైనారిటీ మహిళలు మాట్లాడుతూ తమ కాలనీలో కుళాయిలకు నీళ్లు రావడం లేదని, ట్యాంకర్లు వచ్చినా అందరికీ అందడం లేదన్నారు. మరికొంత మంది మాట్లాడుతూ పింఛన్లు, రేషన్‌కార్డులను దరఖాస్తు చేసి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదన్నారు. కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్‌మెంబర్ రవిప్రకాష్‌రెడ్డి, ఎస్సీసెల్ జిల్లా కార్యదర్శి ముత్యాల ప్రసాద్, కో ఆప్షన్ మెంబర్ ఇస్సాక్, మండల కార్యదర్శి ఓబన్న, మండల మాజీ ఉపాధ్యక్షుడు సంగా వసంతరాయలు, మాజీ సర్పంచులు డాక్టర్ మాబు, భూతప్ప, ఎంపీటీసీలు సంగా బ్రహ్మయ్య, మహబూబ్‌పీర్, వార్డు మెంబర్లు అల్లా, చెండ్రాయుడు, నాయకులు కరెంటు రమణారెడ్డి, చాపాటి లక్ష్మినారాయణరెడ్డి, సుబ్బారావు, ఓబయ్య, ఓబులపతి, మూర్తెయ్య, గురయ్య, అమీర్‌బాషా, మిద్దె షరీఫ్, రమణ, గిరిప్రణీత్‌రెడ్డి, సద్దాం, బాబు, అవినాష్ పాల్గొన్నారు. -
చౌకబియ్యం తరలిస్తున్న లారీ పట్టివేత
పోరుమామిళ్ల: చౌకడిపోల ద్వారా పేదలకు అందాల్సిన 380 బియ్యం బస్తాలు ఓ లారీలో అక్రమంగా తరలిస్తుండగా పట్టణ సరిహద్దులో ఎస్ఐ కృష్ణంరాజునాయక్, సిబ్బంది స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పద్మనాథన్ తెలిపారు. బద్వేలుకు చెందిన సునీల్ గిద్దలూరులో వాటిని కొనుగోలు చేసి లారీలో బద్వేలుకు తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు లారీని పట్టుకున్నట్లు ఆయన వివరించారు. డ్రైవర్ శీను, బియ్యం అక్రమ రవాణాదారుడు సునీల్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు. లారీ, వ్యక్తులను తహసీల్దారుకు అప్పగించినట్లు సీఐ వివరించారు. -
గురప్పస్వామి ఆలయాన్ని సందర్శించిన ఏసీ
పోరుమామిళ్ల: మండలంలోని ప్రముఖ దర్శనీయ క్షేత్రమైన శ్రీ మద్దిమాను గురప్పస్వామి ఆలయాన్ని శుక్రవారం దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకరబాలాజీ సందర్శించారు. డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు వివిధ అంశాలపై విచారణ నిర్వహించేందుకు వచ్చినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఆయన కార్యనిర్వాహణాధికారి మారుతీప్రసాద్‌ను ఆలయ విస్తీర్ణం, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది వివరాలు, భక్తులు నిర్మించిన సత్రాలు, గదులు, అన్నదానం, నెలవారీ వేతనాలు, ఇతర ఖర్చులు, సంవత్సరంలో ఆలయం వద్ద నిర్వహించే పర్వదినాలు, వసతులు తదితర అనేక అంశాల గురించి ప్రశ్నించి వివరాలు నమోదు చేసుకున్నారు. అసిస్టెంట్ కమిషనర్ వచ్చారన్న విషయం తెలిసిన గురప్పగారిపల్లె ప్రజలు, కొంతమంది భక్తులు అక్కడకు చేరుకుని ఈఓపై ఫిర్యాదు చేశారు. అన్నదానానికి, ఆలయ పూజలకు చేసిన ఖర్చుకంటే రెండింతలు, మూడింతలు అదనంగా ఖర్చు రాసి ఈఓ స్వాహా చేస్తున్నారన్నారు. తలనీలాలు రూ.9.5 లక్షలకు వేలం పాడితే రద్దుచేసి, ఆ తరువాత ఎవ్వరికీ తెలియకుండా రూ. 6 లక్షలకే వేలం ఖరారు చేశారని ఆరోపించారు. ఆలయ ఆవరణలోకి పందులు, మేకలు, గేదెలు ప్రవేశించి చెట్లు నాశనం చేస్తున్నాయని, ఆలయ స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించాలని కోరారు. -
భార్య హత్య కేసులో భర్త, ప్రియురాలికి జీవిత ఖైదు
సిద్దవటం: జీవితాంతం తోడు నీడగా ఉంటానని ఏడడుగులు నడిచిన భర్త వివాహమైన మూడు నెలలకే మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఈ క్రమంలో ప్రియురాలితో కలిసి కట్టుకున్న భార్యను కర్కశంగా కడతేర్చాడు. నేరం రుజువు కావడంతో జిల్లా అడిషనల్ జడ్జి అన్వర్‌బాషా బుధవారం భర్త, ప్రియురాలికి జీవిత ఖైదు శిక్ష విధించారని ఎస్ఐ అరుణ్‌రెడ్డి తెలిపారు. వివరాల్లోకి వెళితే.. పోరుమామిళ్ల మండలం నారాయణపల్లె గ్రామానికి చెందిన మనోహర్‌కు కాశినాయన మండలం నాయినపల్లె గ్రామానికి చెందిన విజయలక్ష్మితో 2012 జనవరిలో వివాహమైంది. వివాహం అనంతరం వారు కడప లోని అశోక్‌నగర్‌లో కాపురం పెట్టారు. పెండ్లి అయిన మూడు నెలలకే మనోహర్‌కు చాపాడు మండలం చీపాడు గ్రామానికి చెందిన మేరీతో కడపలో పరిచయ మేర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరిద్దరు కలిసి 2012 జూన్ నెలలో కూల్ డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి విజయలక్ష్మికి తాపించారు. ఆమె స్పృహ కోల్పోవడంతో ఆటోలో సిద్దవటం మండలం కనుమలోపల్లె గ్రామ సమీపంలోని అడవుల్లోకి తీసుకెళి్ల చంపేశారు. అప్పట్లో వారిపై సిద్దవటం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి కడప కోర్టులో వాదోపవాదాలు విన్న తరువాత నేరం రుజువు కావడంతో జిల్లా ఆదనపు జడ్జి అన్వర్‌బాషా బుధవారం మనోహర్, మేరీలకు జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారని సిద్దవటం ఎస్ఐ వివరించారు. -
నేడు జిల్లాకు తమిళనాడు గవర్నర్ రోశయ్య
కడప కల్చరల్ : తమిళనాడు గవర్నర్ రోశయ్య శుక్రవారం జిల్లాకు రానున్నారు. శుక్రవారం ఉదయం 10.45 గంటలకు ఆయన చెన్నై నుంచి తిరుపతి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 11 గంటలకు అక్కడి నుంచి హెలికాఫ్టర్ ద్వారా జిల్లాలోని పోరుమామిళ్లకు చేరుకోనున్నారు. 11.55 గంటలకు పోరుమామిళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో దిగి అనంతరం పోలీసు అతిథి గృహానికి వెళతారు. మధ్యాహ్నం 12 గంటలకు పోలీసుస్టేషన్ ఆవరణలో మొక్కలు నాటుతారు. 12.10 గంటలకు పునర్నిర్మించిన శ్రీమత్ కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. 1.00 గంటలకు అమ్మవారిశాల వీధిలోని జయరామకృష్ణయ్య ఇంటికి వెళ్లనున్నారు. 2.45 గంటలకు అక్కడి ప్రభుత్వ జూనియర్‌కళాశాల మైదానానికి బయలుదేరి అక్కడి నుంచి సాయంత్రం మూడు గంటలకు తిరుపతికి వెళతారు. -
కీచక ఉపాధ్యాయుడు
► మహిళపై అత్యాచారయత్నం ► దేహశుద్ధి చేసిన మహిళ, బంధువులు పోరుమామిళ్ల: మండలంలోని మంగనపల్లె ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు మంగళవారం ఓ మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మంగనపల్లె పాఠశాల పక్కనే వంట కోసం నిర్మించిన గది నిరుపయోగంగా ఉండటంతో అక్కడే నివసిస్తున్న ఓ కుటుంబం అందులో ధాన్యం, ఇతర వస్తువులు ఉంచుకున్నారు. రోజు లాగే మంగళవారం మధ్యాహ్నం ఆ ఇంటికి చెందిన మహిళ వంటగదిలోకి వెళ్లి ధాన్యం తీసుకుంటుండగా, సదరు ఉపాధ్యాయుడు ఆ గదిలోకి వెళ్లి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. వెంటనే ఆ మహిళ ప్రతిఘటించి పాదరక్షలతో దేహశుద్ధి చేసింది. దీంతో అతను పాఠశాల వదిలి మోటార్‌బైక్‌పై పొరుగూరికి వెళ్లి అక్కడి పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న తన భార్యను మోటార్‌బైక్‌పై ఎక్కించుకుని తిరిగి వస్తుండగా మంగనపల్లె వద్ద ఆ మహిళ భర్త, బంధువులు మరోమారు దాడి చేసినట్లు తెలిసింది. ఉపాధ్యాయుడి భార్య ప్రాధేయపడటంతో వారు వదిలేసినట్లు తెలుస్తోంది. కాగా, అత్యాచారయత్నానికి ఒడిగట్టిన ఉపాధ్యాయుడు ఇటీవల అధికార పార్టీలో చేరిన ఓ ఎమ్మెల్యేకి బంధువు కావడంతో పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయకుండా రాజీ యత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. -
13 మంది తమిళ కూలీల అరెస్ట్
-
13 మంది తమిళ కూలీల అరెస్ట్
పోరుమామిళ్ల (వైఎస్సార్‌జిల్లా): అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న 13 మంది తమిళ కూలీలను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల అటవీ పరిధిలోని ఇటుకులపాడు గ్రామ సమీపంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు దుంగలను తరలిస్తున్న తమిళ కూలీలు ఎదురు పడటంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఒక కూలీ పరారుకాగా.. 13 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 14 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న దుంగల విలువ సుమారూ రూ.5 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి
పోరుమామిళ్ల (వైఎస్ఆర్జిల్లా) : అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన వైఎస్ఆర్జిల్లా పోరుమామిళ్ల గిరినగర్ కాలనీలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పోరుమామిళ్లకు చెందిన జరీనా(30) అనే మహిళ.. భర్త కువైట్‌లో పని చేస్తుండగా, తన ఇద్దరు కొడుకులతో కలిసి గిరినగర్ కాలనీలో ఉంటుంది. కాగా బుధవారం అర్ధరాత్రి ఉరివేసుకుంది. గురువారం ఉదయం గమనించిన ఆమె పిల్లలు ఇతర కుటుంబసభ్యులకు చెప్పారు. ఆమె బంధువులు విషయాన్ని పోలీసులకు తెలిపారు. కువైట్‌లో ఉన్న భర్త ఫోన్లో మనస్థాపం చెందే విధంగా మాట్లాడినందువల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. -
బిడ్డ చనిపోలేదని.. బతికొస్తాడని..!!
-
నేడు పోరుమామిళ్లలో వైఎస్ఆర్ సీపీ ధర్నా
హైదరాబాద్: వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గంలో పోలీసులు, అధికారుల తీరును నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టనుంది. శనివారం పోరుమామిళ్ల అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నా నిర్వహిస్తారు. ఈ ధర్నాలో వైఎస్ఆర్ సీపీ నాయకులు కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, 8 మంది ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్ ఇతర నాయకులు పాల్గొంటారు. -
'రెండేళ్లుగా నా కొడుకుతో సంబంధాలు లేవు'
పోరుమామిళ్ల : అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులకు పాల్పడినట్లు భావిస్తున్న కానిస్టేబుల్ ఓబులేసు తండ్రి మైకేల్‌ను గురువారం పోరుమామిళ్ల పోలీసులు విచారించారు. పోలీసులు విచారణలో మైకేల్.... తన కుమారుడితో రెండు సంవత్సరాల నుంచి సంబంధాలు లేవని వెల్లడించినట్లు తెలుస్తోంది. కాగా కాల్పుల కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న వ్యక్తి ...తన కుమారుడా కాదా అనేది తనకు తెలియదని మైకేల్ ...పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. ఓబులేసు స్వస్థలం వైఎస్ఆర్ జిల్లా జీ.పోరుమామిళ్ల మండలం తిరువెంగళాపురం. మరోవైపు ఓబులేసు గురించి మాట్లాడేందుకు గ్రామస్తులు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది.