విశ్వాసం కోల్పోయారు | Lost faith | Sakshi
Sakshi News home page

విశ్వాసం కోల్పోయారు

Published Sat, Dec 24 2016 11:42 PM | Last Updated on Mon, Sep 4 2017 11:31 PM

విశ్వాసం కోల్పోయారు

విశ్వాసం కోల్పోయారు

పోరుమామిళ్ల:  ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి చంద్రబాబు ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని 16, 17, 18 వార్డులకు చెందిన బెస్తవీధి, కొత్తవీధి, ఆపరేటర్‌బాషా వీధి, రంపాడ్‌రోడ్, చితానందనగర్‌లలో సమన్వయకర్త డాక్టర్‌ వెంకటసుబ్బయ్య, ఎంపీపీ చిత్తా విజయప్రతాప్‌రెడ్డి, మండలశాఖ అధ్యక్షుడు సీఎం బాషాలతో కలసి ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గడప గడపకు వైఎస్సార్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఏ విషయంలోనూ నిలకడగా మాట్లాడరని,  ప్రత్యేకహోదా విషయంలోనూ మాట మార్చారన్నారు.ఆయన మంత్రులు కూడా ఆయన బాటలోనే నడుస్తున్నారన్నారు.  బెస్తవీధికి చెందిన మైనారిటీ మహిళలు మాట్లాడుతూ తమ కాలనీలో కుళాయిలకు నీళ్లు రావడం లేదని, ట్యాంకర్లు  వచ్చినా అందరికీ అందడం లేదన్నారు. మరికొంత మంది మాట్లాడుతూ పింఛన్లు, రేషన్‌కార్డులను దరఖాస్తు చేసి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదన్నారు. కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్‌మెంబర్‌ రవిప్రకాష్‌రెడ్డి,  ఎస్సీసెల్‌ జిల్లా కార్యదర్శి ముత్యాల ప్రసాద్, కో ఆప్షన్‌ మెంబర్‌ ఇస్సాక్, మండల కార్యదర్శి ఓబన్న, మండల మాజీ ఉపాధ్యక్షుడు సంగా వసంతరాయలు,   మాజీ సర్పంచులు డాక్టర్‌ మాబు, భూతప్ప, ఎంపీటీసీలు సంగా బ్రహ్మయ్య, మహబూబ్‌పీర్, వార్డు మెంబర్లు అల్లా, చెండ్రాయుడు,  నాయకులు కరెంటు రమణారెడ్డి, చాపాటి లక్ష్మినారాయణరెడ్డి, సుబ్బారావు, ఓబయ్య, ఓబులపతి, మూర్తెయ్య, గురయ్య, అమీర్‌బాషా, మిద్దె షరీఫ్, రమణ, గిరిప్రణీత్‌రెడ్డి, సద్దాం,  బాబు, అవినాష్‌  పాల్గొన్నారు.
 
 
 
 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement