రంగసముద్రం ఎస్బీఐ.. (ఇన్‌సెట్)
సాక్షి, కడప : ప్రభుత్వ రంగానికి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో అతను ఉద్యోగి. హెడ్ క్యాషియర్‌గా పనిచేస్తున్న అతడు సొంత బ్యాంకుకే కన్నం వేశాడు. ఖాతాదారులు కుదవపెట్టిన నగలు, బ్యాంకులోని సొమ్ముతో ఉడాయించాడు. గత మార్చి నెలలో పరారైన ఆ కేటుగాడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. అతనికి సహకరించిన ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వివరాలాలి.. వైఎస్సార్ జిల్లా పొరుమామిళ్లలోని రంగసముద్రం ఎస్‌బీఐలో గురుమోహన్‌రెడ్డి అనే వ్యక్తిగా హెడ్ క్యాషియర్‌గా పనిచేశాడు.
అతడు గత మార్చిలో బ్యాగు తీసుకొని బ్యాంకుకు వచ్చిన అతను.. బ్యాంకులో ఖాతాదారులు తాకట్టు పెట్టిన నగలు, డబ్బుతో ఉడాయించాడు. తాజాగా గురుమోహన్‌రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు.. అతని వద్ద నుంచి 56 లక్షల నగదు, 1.7 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టపోయానని, అందుకే బ్యాంకు సొమ్ముతో ఉడాయించానని నిందితుడు గురుమోహన్ విచారణలో వెల్లడించినట్టు వైఎస్సార్ జిల్లా ఓఎస్డీ అద్నాన్ నయీమ్ అస్మి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment