cashier arrested
-
ఎస్బీఐ హెడ్ క్యాషియర్.. నిండా ముంచాడు
సాక్షి, కడప : ప్రభుత్వ రంగానికి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో అతను ఉద్యోగి. హెడ్ క్యాషియర్‌గా పనిచేస్తున్న అతడు సొంత బ్యాంకుకే కన్నం వేశాడు. ఖాతాదారులు కుదవపెట్టిన నగలు, బ్యాంకులోని సొమ్ముతో ఉడాయించాడు. గత మార్చి నెలలో పరారైన ఆ కేటుగాడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. అతనికి సహకరించిన ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వివరాలాలి.. వైఎస్సార్ జిల్లా పొరుమామిళ్లలోని రంగసముద్రం ఎస్బీఐలో గురుమోహన్‌రెడ్డి అనే వ్యక్తిగా హెడ్ క్యాషియర్‌గా పనిచేశాడు. అతడు గత మార్చిలో బ్యాగు తీసుకొని బ్యాంకుకు వచ్చిన అతను.. బ్యాంకులో ఖాతాదారులు తాకట్టు పెట్టిన నగలు, డబ్బుతో ఉడాయించాడు. తాజాగా గురుమోహన్‌రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు.. అతని వద్ద నుంచి 56 లక్షల నగదు, 1.7 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టపోయానని, అందుకే బ్యాంకు సొమ్ముతో ఉడాయించానని నిందితుడు గురుమోహన్ విచారణలో వెల్లడించినట్టు వైఎస్సార్ జిల్లా ఓఎస్డీ అద్నాన్ నయీమ్ అస్మి తెలిపారు. -
ఎస్బీఐ క్యాషియర్ భార్య అరెస్ట్
పోరుమామిళ్ల: పోరుమామిళ్ల స్టేట్ బ్యాంక్ క్యాషి యర్ మార్తాల గురుమోహన్‌రెడ్డి భార్య చిన్నపురెడ్డి మంజులతను మంగళవారం కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్ఐ పెద్ద ఓబన్న తెలిపారు. గురుమోహన్‌రెడ్డి నేరానికి తాను సహకరించినట్లు మంజులత ఒప్పుకుందని ఎస్ఐ తెలిపారు. గురుమోహన్‌రెడ్డి డబ్బంతా షేర్లలో పెట్టినట్లు తెలుస్తోందని, అతను పరారీలో ఉన్నాడని వివరించారు. మంజులత బ్యాంక్ అకౌంట్ పరిశీలించగా రూ.కోటి 90 లక్షలు గురుమోహన్‌రెడ్డి అకౌంట్‌కు బదిలీ అయినట్లు ఉందన్నారు. ఇప్పుడు ఆమె అకౌంట్లో, గురుమోహన్‌రెడ్డి అకౌంట్లో డబ్బు లేదని ఎస్ఐ వివరించారు. గురుమోహన్‌రెడ్డి ప్రొద్దుటూరు బజాజ్ ఫైనాన్స్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ సంస్థల్లో పెట్టిన 720 గ్రాముల బంగారు రికవరీ చేశామన్నారు. మిగతా బంగారు ఎక్కడుందో విచారిస్తున్నామన్నారు. మంజులత దగ్గర నుంచి నకిలీ బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. గురుమోహన్‌రెడ్డి షేర్లలో పెట్టిన డబ్బు పోగొట్టుకున్నట్లు తెలుస్తోందని ఎస్ఐ తెలిపారు. వాస్తవంగా గురుమోహన్‌రెడ్డి ఎంత డబ్బు.. బంగారు.. దోచుకెళ్లాడనే అంశంపై వివరాల్లేవు. బ్యాంకు అధికారులు కూడా స్పష్టత ఇవ్వడం లేదు. -
ఆంధ్రాబ్యాంక్ క్యాషియర్ అరెస్ట్
-
ఆంధ్రాబ్యాంక్ క్యాషియర్ అరెస్ట్
మటంపల్లి : సూర్యాపేట జిల్లా మటంపల్లి ఆంధ్రాబ్యాంక్ క్యాషియర్ రవీందర్ రెడ్డిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్ద నోట్ల రద్దు ప్రకటన అనంతరం పెద్దమొత్తంలో నోట్లు మార్పిడి చేస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన హుజూర్నగర్ పోలీసులు క్యాషియర్‌ను అదుపులోకి తీసుకున్నారు. రూ. 5.22 లక్షల విలువైన పాత వెయ్యి రూపాయల నోట్లను మార్పిడి చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. దీనిపై పోలీసులు రవీందర్ రెడ్డిని విచారిస్తున్నారు. -
హోటల్లో నగదు చోరీ: క్యాషియర్ అరెస్ట్
హైదరాబాద్: నమ్మకంగా పనిచేస్తున్న సంస్థకే కన్నం వేసిన ఓ వ్యక్తిని ఎల్బీనగర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కింగ్‌కోఠికి చెందిన ఎండీ షరీఫ్ సాగర్ రింగురోడ్డులోని గ్రీన్ బావర్చీ హోటల్లో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. గత నెల 28వ తేదీన హోటల్ నుంచి రూ.50 వేలు తీసుకుని గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారని మేనేజర్‌కు చెప్పాడు. దీంతో హోటల్ నిర్వాహకులు ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి దొంగతనం చేసింది క్యాషియరే అని తేల్చారు. శుక్రవారం అతడిని అరెస్టు చేసి రూ.50 వేలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.