
నిర్దిష్ట ఆదాయం కంటే ఎక్కువ సంపాదన ఉన్నప్పుడు.. మన దేశంలో ట్యాక్స్ చెల్లించాలి. పాత ఆదాయపు పన్ను విధానం ప్రకారం.. ట్యాక్స్ రిబేట్ రూ. 5 లక్షలుగా ఉండేది. కొత్త పన్ను విధానం ప్రకారం ఇది రూ. 12 లక్షలకు చేరింది. ఆదాయపన్ను చట్టం 1961 కింద.. కొత్త, పాత పన్ను విధానాల కింద ఏది ఎంచుకుంటే.. ఆ శ్లాబుల ప్రకారం ట్యాక్స్ చెల్లించాలి.
పన్ను మినహాయింపు పరిమితి దాటితే.. ఐటీఆర్ ఫైల్ చేయాలి. కొందరు దీనిని పెడచెవిన పెడుతున్నారు. అంటే ట్యాక్స్ చెల్లించకుండా తప్పించుకుంటున్నారు. అలాంటి వారిని ఇప్పుడు ఐటీ శాఖ గుర్తించింది. ఇప్పటికే ట్యాక్స్ కట్టకుండా ఉన్నవారి లిస్ట్ కూడా తయారు చేసుకుంది. సదరు వ్యక్తులకు నోటీసులు కూడా అందుతాయి.
ఎవరైతే ట్యాక్స్ కట్టకుండా తప్పించుకుంటున్నారో.. వారిపైన సెక్షన్ 148ఏ కింద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు లిస్ట్ చేసిన వారు 2018-19, 2019-20, 2020-21, 2021-22 ఆర్ధిక సంవత్సరానికి గానూ చెల్లించకుండా ఉన్నవారు అని తెలుస్తోంది. ఇప్పటికే కొందరికి నోటీసులు పంపినట్లు చెబుతున్నారు.
పన్ను కట్టకుండా తప్పించుకునే వారిని గుర్తించడానికి ఏఐఎస్, టీడీఎస్/టీసీఎస్ స్టేట్‌మెంట్స్, ఫైనాన్సియల్ ట్రాన్సక్షన్ స్టేట్‌మెంట్ వంటి వాటిని ఆదాయపన్ను శాఖ తనిఖీ చేస్తుంది. వీటి ద్వారానే ఎవరు పన్ను కడుతున్నారు, ఎవరు కట్టడం లేదనే విషయాలను తెలుసుకుంటుంది. పన్ను ఎగ్గొట్టే వారిని గుర్తించి.. వారికి నోటీసులు జారీ చేస్తుంది.
ఇదీ చదవండి: రన్యా రావు కేసు.. దుబాయ్ నుంచి ఎంత బంగారం తీసుకురావచ్చంటే?
ఎవరైతే పన్ను చెల్లించకుండా.. తప్పించుకుంటున్నారో వారికి నోటీసులు జారీ చేసి, చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే కండొనేషన్ ఆఫ్ డిలేకు అప్లై చేసుకుని లేదా వడ్డీతో కలిపి ట్యాక్స్ పూర్తిగా చెల్లించినట్లయితే.. బయటపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment