
ప్రత్యక్ష పన్ను వసూళ్లలో భారతదేశం 2024-25 ఆర్థిక సంవత్సరానికి గణనీయమైన వృద్ధిని సాధించింది. స్థూల వసూళ్లు 15.59% పెరిగి రూ.27.02 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అధిక కార్పొరేట్, నాన్-కార్పొరేట్ పన్ను ఆదాయాలు, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (ఎస్‌టీటీ) రాబడుల్లో పెరుగుదల నమోదైంది. ఈ పెరుగుదల దేశం బలమైన ఆర్థిక కార్యకలాపాలు, మెరుగైన పన్ను విధానాన్ని ప్రతిబింబిస్తుంది.
కార్పొరేట్ ట్యాక్స్ రాబడులు: కార్పొరేట్ పన్ను వసూళ్లు 2024-25లో రూ.12.72 లక్షల కోట్లకు చేరాయి. అంతకుముందకు ఏడాది ఇది రూ.11.31 లక్షల కోట్లుగా ఉంది.
నాన్ కార్పొరేట్ ట్యాక్స్ రెవెన్యూ: నాన్ కార్పొరేట్ ట్యాక్స్ వసూళ్లు 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.11.68 లక్షల కోట్ల నుంచి 2024-25లో రూ.13.73 లక్షల కోట్లకు పెరిగాయి.
సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్‌టీటీ): క్యాపిటల్ మార్కెట్లలో కార్యకలాపాలు పెరగడంతో ఎస్‌టీటీ రాబడులు రూ.34,192 కోట్ల నుంచి రూ.53,296 కోట్లకు పెరిగాయి.
నికర పన్ను వసూళ్లు, రీఫండ్‌లు
రిఫండ్లను పరిగణనలోకి తీసుకుంటే నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.22.26 లక్షల కోట్లలో 26.04 శాతం పెరిగి రూ.4.76 లక్షల కోట్లకు చేరాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.19.60 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 13.57% పెరుగుదలను సూచిస్తుంది. ఇది ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ చట్టబద్ధమైన రీఫండ్ క్లెయిమ్‌లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేస్తుంది.
ఇదీ చదవండి: ఏడాదిలో రూ.21.16 లక్షల కోట్లు గీకారు!
వృద్ధికి సంకేతం
ప్రత్యక్ష పన్ను వసూళ్లు పెరగడం భారత ఆర్థిక వృద్ధికి సానుకూల సంకేతం. ప్రభుత్వ ఆదాయాన్ని బలోపేతం చేయడం, రుణాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఇది తోడ్పడుతుంది. అధిక పన్ను ఆదాయాలు మౌలిక సదుపాయాలు, సాంఘిక సంక్షేమం, ఇతర కీలక రంగాలపై ప్రభుత్వ వ్యయాన్ని పెంచడానికి వీలు కల్పిస్తాయి.