Direct tax
-
లక్ష్యాన్ని మించేలా పన్ను వసూళ్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు.. నిర్దేశిత రూ.22.07 లక్షల కోట్ల లక్ష్యాన్ని దాటేస్తాయని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఛైర్మన్ రవి అగర్వాల్ తెలిపారు. కార్పొరేట్, నాన్–కార్పొరేట్ పన్నుల వసూళ్లు గణనీయంగా పెరిగాయని ఆయన పేర్కొన్నారు. ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ (ఐఐటీఎఫ్)లో ట్యాక్స్‌పేయర్స్ లాంజ్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు. సీబీడీటీ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 10 మధ్య కాలంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు నికరంగా 15.41 శాతం పెరిగి రూ.12.11 లక్షల కోట్లకు చేరాయి.ఇదీ చదవండి: గోల్డ్ ఈటీఎఫ్‌లు కళకళమరోవైపు, 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను విదేశీ ఆదాయం, అసెట్స్‌ను తమ ఐటీఆర్‌లలో వెల్లడించని వారు సవరించిన రిటర్న్‌లను దాఖలు చేసేందుకు డిసెంబర్ 31 వరకు గడువుందని అగర్వాల్ పేర్కొన్నారు. ఇతర దేశాలతో ఒప్పందాల ద్వారా విదేశీ అసెట్స్ వివరాలన్నీ ఆటోమేటిక్‌గా ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అందుతాయని, ఐటీఆర్‌లలో పొందుపర్చిన వివరాలతో వాటిని సరిపోల్చి చూస్తుందని తెలిపారు. అధిక విలువ అసెట్స్‌ను వెల్లడించనివారికి ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ పంపే ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు వివరించారు. ఆదాయ పన్ను చట్టంలో భాషను సరళంగా, అందరికీ అర్థమయ్యే విధంగా మార్చడంపై 6,000 పైచిలుకు సలహాలు తమకు వచ్చినట్లు అగర్వాల్ పేర్కొన్నారు. -
రూ.12.11 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ 20 వరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు మెరుగ్గా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 15.41 శాతం అధికంగా రూ.12.11 లక్షల కోట్ల నికర పన్ను ఆదాయం వచ్చింది. ఇందులో రూ.5.10 లక్షల కోట్లు కార్పొరేట్ పన్ను రూపంలో రాగా, రూ.6.62 లక్షల కోట్లు నాన్ కార్పొరేట్ రూపంలో సమకూరింది. ఇక స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఏప్రిల్ నుంచి నవంబర్ 10 వరకు రూ.15.02 లక్షల కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే 21 శాతం పెరిగింది. ఈ కాలంలో రూ.2.92 లక్షల కోట్ల రిఫండ్లను ఆదాయపన్ను శాఖ పూర్తి చేసింది. -
పన్ను వివాదాల పరిష్కారానికి అక్టోబర్ 1 నుంచి ‘వివాద్ సే విశ్వాస్ 2.0’
న్యూఢిల్లీ: పన్ను వివాదాల పరిష్కారానికి వీలుగా వివాద్ సే విశ్వాస్ 2.0 పథకం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ పథకాన్ని 2024–25 బడ్జెట్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం గుర్తుండే ఉంటుంది.రూ.35 లక్షల కోట్ల పన్నుకు సంబంధించి 2.7 కోట్ల ప్రత్యక్ష పన్ను డిమాండ్లు వివిధ దశల్లో, న్యాయ వేదికల వద్ద అపరిష్కృతంగా ఉండడం గమనార్హం. వీటికి పరిష్కారంగా గతంలో అమలు చేసిన వివాద్ సే విశ్వాస్ పథకాన్ని మరో విడత కేంద్రం తీసుకురావడం గమనార్హం. -
21 శాతం పెరిగిన పన్నులు..!
ఏప్రిల్ 1 నుండి డిసెంబర్ 17 వరకు భారతదేశ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 20.7 శాతం పెరిగి రూ.13.70 లక్షల కోట్లకు చేరుకున్నాయని కేంద్రం ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదికను విడుదల చేసింది. మొత్తం ప్రత్యక్ష పన్ను వసూళ్లలో కార్పొరేట్ పన్ను రూ. 6.95 లక్షల కోట్లు కాగా, వ్యక్తిగత ఆదాయ పన్ను, సెక్యూరిటీల లావాదేవీల పన్ను కలిపి రూ. 6.73 లక్షల కోట్లుగా ఉంది. ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 17 వరకు స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు సంవత్సరానికి 17 శాతం పెరిగి రూ.15.96 లక్షల కోట్లుగా ఉన్నాయి. అదే సమయంలో స్థూల కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ. 7.90 లక్షల కోట్లు, స్థూల వ్యక్తిగత ఆదాయ పన్ను, సెక్యూరిటీల లావాదేవీల పన్ను రూ. 8.03 లక్షల కోట్లుగా ఉందని డిసెంబర్ 18న మంత్రిత్వ శాఖ తెలిపింది. 10.5 శాతం వృద్ధితో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 2023-24లో రూ. 18.2 లక్షల కోట్లుగా ఉందని అంచనా. తాత్కాలిక డేటా ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 2.25 లక్షల కోట్ల రూపాయల మొత్తాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా రీఫండ్లను జారీ చేసింది. -
ప్రత్యక్ష పన్నులు : రూ.10.65 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను నికర వసూళ్లు ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ గడచిన ఆర్థిక సంవత్సరం ఎనిమిది నెలల్లో రూ.10.65 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2023–24 బడ్జెట్ మొత్తం అంచనాల్లో ఇది 58.34 శాతం. కాగా రిఫండ్స్ రూ.2.03 లక్షల కోట్లు కూడా కలుపుకుంటే, స్థూలంగా పన్ను వసూళ్లు 2022–23 ఇదే కాలంలో పోలి్చతే 17.7 శాతం పెరిగి రూ.12.67 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేంద్రం రూ.18.23 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను (వ్యక్తిగత ఆదాయ, కార్పొరేట్ పన్నులు) వసూళ్లను లక్ష్యంగా పెట్టుకుంది. పరోక్ష పన్నుల (వస్తు సేవల పన్ను, కస్టమ్స్, ఎక్సైజ్) వసూళ్ల లక్ష్యం రూ.15.38 లక్షల కోట్లు. వెరసి మొత్తం పన్ను వసూళ్ల లక్ష్యం రూ. 33.61 లక్షల కోట్లు. బడ్జెట్ సవరిత అంచనాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) రూ. 33.61 లక్షల కోట్ల పన్ను వసూళ్ల లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలలూ చూస్తే (ఏప్రిల్–నవంబర్) ప్రత్యక్ష పన్ను వసూళ్లు దాదాపు 20 శాతం పెరిగాయి. పరోక్ష పన్ను 5 శాతం అధికంగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్లో నిర్దేశించుకున్న పన్ను వసూళ్ల లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్ల మొత్తం రూ.30.54 లక్షల కోట్లు. 2023–24లో దీనిని 10 శాతం (రూ.33.61 లక్షల కోట్లు) పెంచాలన్న లక్ష్యాన్ని బడ్జెట్ నిర్దేశించుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన లోక్‌సభలో ఓట్ ఆన్ అకౌంట్ లేదా మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. లోక్‌సభకు ఎన్నికల అనంతరం కొలువుదీరే నూతన ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. -
ప్రత్యక్ష పన్ను వసూళ్లు 22 శాతం అప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ప్రత్యక్ష పన్నుల వసూళ్లు నికరంగా రూ. 10.60 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 22 శాతం పెరిగాయి. పూర్తి ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న టార్గెట్‌లో 58 శాతానికి చేరాయి. కార్పొరేట్ ట్యాక్స్ వసూళ్లు 12.48 శాతం, వ్యక్తిగత ఆదాయ పన్నుల వసూళ్లు 31.77 శాతం పెరిగాయని ఆదాయపు పన్ను శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 9 వరకు రూ. 1.77 లక్షల కోట్ల రిఫండ్లు జారీ చేసినట్లు పేర్కొంది. స్థూలంగా ప్రత్యక్ష పన్నుల వసూళ్లు (కార్పొరేట్, వ్యక్తిగత ఆదాయపు పన్నులు కలిపి) సుమారు 18% పెరిగి రూ. 12.37 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2023–24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ. 18.23 లక్షల కోట్లు సాధించాలని నిర్దేశించుకున్నారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ. 16.61 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 9.75 శాతం అధికం. -
అంచనాలకు అనుగుణంగానే పన్ను వసూళ్లు
ముంబై: కార్పొరేట్ పన్ను, ఎక్సైజ్ పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలకు అనుగుణంగానే ఉంటాయని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్‌సేత్ తెలిపారు. ప్రత్యక్ష పన్నుల్లో రెండో అతి పెద్ద వాటా కలిగిన కార్పొరేట్ పన్ను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో (ఏప్రిల్–జూలై) 10.4 శాతం తగ్గడం గమనార్హం. ముఖ్యంగా మొదటి త్రైమాసికంలో పన్నుల ఆదాయం 14 శాతం తగ్గడంపై వస్తున్న ఆందోళలను సేత్ తోసిపుచ్చారు. పన్నుల వసూళ్లను దీర్ఘకాలానికి చూడాలని సూచించారు. ‘‘కేవలం కొన్ని నెలల డేటా చూసి, దీర్ఘకాల ధోరణిని అంచనా వేయకూడదు. కనీసం మరో త్రైమాసికం వేచి చూసిన తర్వాత దీర్ఘకాలంపై అంచనాకు రావాలి. బడ్జెట్లో పేర్కొన్న అంచనాలకు అనుగుణంగానే పన్ను వసూళ్లు ఉంటాయన్నది నా ఉద్దేశ్యం’’అని వివరించారు. ఎస్ఎంఈ రుణాలపై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ముగింపు సందర్భంగా సేత్ మీడియాతో మాట్లాడారు. వాస్తవానికి ఏప్రిల్–జూలై కాలానికి స్థూల పన్నుల ఆదాయం రూ.8.94 లక్షల కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2.8 శాతం అధికం. 2023–24 సంవత్సరానికి రూ.33.61 లక్షల కోట్ల పన్నుల ఆదాయం వస్తుందని బడ్జెట్లో పేర్కొనడం గమనార్హం. -
ఆదాయపు పన్ను రిటర్న్ ఫారమ్‌లను విడుదల చేసిన ఐటీ శాఖ!
మార్చి 31తో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు కొత్త బడ్జెట్‌కు సంబంధించిన ఆలోచనలు, సమావేశాలు, సంప్రదింపులు, ప్లానింగ్ విషయాలు .. మొదలైన వాటిని పక్కన పెట్టండి. 2023 ఏప్రిల్ 1 నుంచి వాటి గురించి ఆలోచిద్దాం. ఈలోగా 2023 మార్చి 31లోపల మనం ఈ ఆర్థిక సంవత్సరానికి అవసరమైన ఆలోచనలు, సమాలోచనలు, ప్లానింగ్ ఆలోచిద్దాం. 2023 మార్చి 31తో పూర్తయ్యే ఆర్థిక సంవత్సరానికి కొంత మందికి గడువు తేదీ 31–07–2023; మరికొందరికి సెప్టెంబర్ నెలాఖరు. అందుకు గాను ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఫిబ్రవరి 10న కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్లో మీరు మార్చి నెల తర్వాత డిపార్టుమెంటు వారికి దాఖలు చేయాల్సిన రిటర్నుల గురించి .. ఫారమ్‌లు, వాటిని దాఖలు చేసినప్పుడు మీకు వచ్చే అక్నాలెడ్జ్మెంట్ గురించి.. నోటిఫై చేశారు. ►ఈ ఫారాలు 01–04–2023 నుండి అమల్లోకి వస్తాయి. ►డిపార్టుమెంట్ వారి భాష ప్రకారం 2023–24 అసెస్మెంట్ సంవత్సరానికి వర్తించేవి అనాలి. ►ఈ ఫారాలు ఏమిటంటే..ఐటీఆర్ 1 సహజ్, ఐటీఆర్ 2, ఐటీఆర్ 4 సుగమ్, ఐటీఆర్ 5,ఐటీఆర్ 6 ►పైన పేర్కొన్న ఫారాలు దాఖలు చేస్తే మీకు వచ్చే ఐటీ అక్నాలెడ్జ్మెంటు ఐటీఆర్విని కూడా నోటిఫై చేశారు. ► అన్ని ఫారాల్లోనూ షెడ్యూళ్లు ఉన్నాయి. ►2022 అక్టోబర్‌లోనే రూల్స్ విడుదల చేశారు. ►ఉద్యోగస్తులకు సర్క్యులర్ డిసెంబర్లోనే విడుదల చేశారు. ►‘‘డౌన్లోడ్స్’’ కింద ఐటీఆర్ ఆఫ్‌లైన్ యుటిలిటీ ద్వారా ఆఫ్‌లైన్ సదుపాయం ఉంది. ►సాంకేతికంగా సులువుగా, త్వరగా వేసేలా తగిన చర్యలు తీసుకున్నారు. ►ప్రస్తుతం ఒకొక్కప్పుడు తప్పులు దొర్లుతున్నాయి. ‘డేటా’ .. అంటే సమాచారమనేది సిస్టంలోకి ప్రీ–ఫిల్ అవడం లేదు. పూర్తి సమాచారం లేదని చూపుతోంది. ►ఎక్సెల్ వెర్షన్లో ‘సబ్మిట్’కి ఎక్కువ వ్యవధి తీసుకుంటోంది. ►షెడ్యూల్స్ నింపేటప్పుడు కొన్ని తప్పులు దొర్లుతున్నాయి. షెడ్యూల్స్ ఎంపిక చేసేటప్పుడు గందరగోళం, గజిబిజి ఏర్పడుతోంది. స్పష్టత ఉండటం లేదు. ఒక్కొక్కప్పుడు మొరాయిస్తోంది. ► ఇలాంటివి ఉండవని ఆశిద్దాం. ► మీరు స్వయంగా వేసుకుంటే మీ స్వంత అనుభవాన్ని మించిన పాఠం లేదు. ► వృత్తి నిపుణులకి ఇస్తే సమగ్ర సమాచారాన్ని సకాలంలో ఇవ్వండి. -
ప్రత్యక్ష, పరోక్ష పన్నులు: సీతారామన్‌కు యూఎస్ఐఎస్పీఎఫ్ కీలక సూచనలు
న్యూఢిల్లీ:మరికొన్ని రోజుల్లో 2023-24 వార్షిక బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రడీ అవుతున్నారు. ఈ సందర్భంగా అమెరికాలోని ఇండియా సెంట్రిక్ టాప్ పరిశ్రమ బృందం ఆర్థికమంత్రికి కీలక విజ్ఞప్తి చేసింది. భారత దేశంలోని ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధానాన్ని సరళీకృతం చేయాలని, హేతు బద్ధీకరించాలని భారతదేశం-కేంద్రీకృత అమెరికా వ్యూహాత్మక, వ్యాపార సలహా బృందం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరింది. ఇది ప్రపంచ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచి, భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను తెచ్చి పెడుతుందని తెలిపాయి. విదేశీ కంపెనీల కార్పొరేట్ పన్ను రేట్లను హేతుబద్ధం చేయండి అంటూ యూఎస్ ఇండియా స్ట్రాటజిక్ అండ్ పార్టనర్షిప్ ఫోరమ్ (USISPF) ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్ సమర్పణలకు ముందు ఆర్థిక మంత్రిత్వ శాఖకు కోరింది. మూలధన లాభం పన్ను సంస్కరణలను సరళీకృతం చేయాలని, వివిధ సాధనాల హోల్డింగ్ కాలాలు, రేట్లను సమన్వయం చేయాలని కోరింది. గ్లోబల్ టాక్స్ డీల్‌కు భారత నిబద్ధతను పునరుద్ఘాటించడంతోపాటు, సెక్యూరిటీలలో పెట్టుబడి నుండి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్మెంట్ (FPI) వరకు రాయితీ పన్ను విధానాన్ని విస్తరించాలని కేంద్ర ఆర్థిక మంత్రికి సూచించింది. అంతేకాదు హెల్త్ లాంటి నిర్దిష్ట సెక్టార్లలో పునరుత్పాదక శక్తి, ఆర్ అండ్ డీ పెట్టుబడులపై పన్ను రాయితీలను కూడా కోరింది.(Union Budget 2023 ఆ పథకాలకు పెద్ద పీట, వారికి బిగ్ బూస్ట్) స్థిరమైన, ఊహాజనిత పన్ను పర్యావరణం కోసం వాదించడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానం సరళీకరణ, వ్యాపారం ఖర్చులను హేతుబద్ధీకరించడం, పన్ను రేట్లు , సుంకాలను హేతుబద్ధీకరించడం వంటివి ఉన్నాయి. చమురు మరియు సహజ వాయువు కంపెనీలకు అందించిన కస్టమ్స్ సుంకం మినహాయింపులపై వివరణ కోరింది. దీంతోపాటు ఎక్స్-రే యంత్రాల కోసం కస్టమ్స్ సుంకం రేట్లను 10 శాతం నుండి 7.5 శాతానికి తగ్గించడం, నిర్దేశిత పరిశోధన ద్వారా దిగుమతి చేసుకునే అన్ని వస్తువులపై కస్టమ్స్ సుంకం మినహాయింపును అందించాలని తెలిపింది. ఉత్పత్తి ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుని పోషకాహార ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ పెంపును ఉపసంహరించుకోవాలని కూడా అభిప్రాయపడింది. భారతదేశంలో శాస్త్రీయంగా రూపొందించే పోషకాహారం లభ్యతను ప్రోత్సహించాలని ఆర్థిక మంత్రిని కోరింది. కస్టమ్స్ టారిఫ్‌లు సుంకాలు మరియు కస్టమ్స్ సిఫారసుకు సంబంధించి టెలికాం ఉత్పత్తులపై కస్టమ్స్ టారిఫ్ చట్టంలోని అస్పష్టతలను పరిష్కరించాలని తెలిపింది. అలాగే CAROTAR , ఫేస్‌లెస్ ఎసెస్మెంట్ వంటి వాణిజ్య సులభతర పథకాలను బలోపేతం చేయాలని అధునాతన జీవ ఇంధన ప్రాజెక్టులకు రాయితీ కస్టమ్స్ సుంకం పొడిగింపును యూఎస్ఐఎస్పీఎఫ్ కోరింది. (Union Budget-2023పై కోటి ఆశలు: వెండి, బంగారం ధరలపై గుడ్‌న్యూస్!) -
బడ్జెట్ లక్ష్యంలో 62% పన్నులు వసూలు
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నుల ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సం బడ్జెట్ అంచనాల్లో 62 శాతం ఇప్పటికే వసూలైంది. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 24 శాతం అధికంగా రూ.8.77 లక్షల కోట్లు వచ్చింది. ఇది 2022–23 సంవత్సరానికి విధించుకున్న రూ.14.20 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నుల ఆదాయ లక్ష్యంలో 62.79 శాతానికి సమానాం. ఈ వవరాలను కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 2021–22 సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల ద్వారా కేంద్రానికి రూ.14.10 లక్షల కోట్ల ఆదాయం రావడం గమనార్హం. పన్నుల ఆదాయం దేశ ఆర్థిక రంగ ఆరోగ్యాన్ని ప్రతిఫలిస్తుందని విశ్లేషకులు భావిస్తుంటారు. ఇక పన్ను చెల్లింపుదారులకు చేసిన రిఫండ్లు ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 30 మధ్య రూ.2.15 లక్షల కోట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 67 శాతం పెరిగాయి. చదవండి ఐటీ ఉద్యోగులకు డేంజర్ బెల్స్! -
లక్ష్యానికి మించి ప్రత్యక్ష పన్ను వసూళ్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష పన్నుల ఆదాయం బడ్జెట్ అంచనా రూ.14.20 లక్షల కోట్ల కంటే, 30 శాతం అధికంగా వసూలు అవుతుందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చైర్మన్ నితిన్ గుప్తా తెలిపారు. దీని ఆధారంగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సైతం పన్నుల లక్ష్యం మరింత పెద్దగా ఉండొచ్చన్నారు. పన్నుల ఎగువేతకు చెక్ పెట్టేందుకు వీలుగా ఆన్లైన్ గేమింగ్‌కు సంబంధించి టీడీఎస్ నిబంధనల్లో మార్పులు ఉంటాయని చెప్పారు. తదుపరి ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో వీటికి చోటు కల్పించే అవకాశం ఉందన్నారు. ‘‘ఆన్లైన్ గేమింగ్‌పై ప్రస్తుతం టీడీఎస్ మినహాయింపు నిబంధన ఉంది.దీన్ని సవరించడమా లేక ప్రస్తుత రూపంలోనే ఉంచడమా అన్నది చూడాలి’’అని ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్‌లో భాగంగా తెలిపారు. ఆన్లైన్ గేమింగ్ ఆదాయంపై 10 శాతం టీడీఎస్ తగ్గించిన తర్వాతే ఇన్వెస్టర్‌కు చెల్లింపులు చేసే విధానం ప్రస్తుతం అమల్లో ఉంది. మొత్తం మీద పస్త్రుత ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష పన్నుల ఆదాయం రూ.17.75–18.46 లక్షల కోట్ల మధ్య ఉండొచ్చని గుప్తా చెప్పారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ 10 వరకు వసూలైన ఆదాయం రూ.10.54 లక్షల కోట్లుగా ఉంది. ఇది అంచనాల కంటే 30 శాతం ఎక్కువ కావడం గమనార్హం. రిఫండ్లను తీసేసి చూస్తే నికరంగా రూ.8.71 లక్షల కోట్లు ఉంటుంది. బడ్జెట్ లక్ష్యంలో ఇది 61.31 శాతానికి సమానం. చదవండి: భారత్‌లో ట్విటర్ చాలా స్లో, మరీ దారుణం: ఎలాన్ మస్క్ షాకింగ్ కామెంట్స్! -
ప్రత్యక్ష పన్ను వసూళ్లు 6.56 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో (2017 ఏప్రిల్– డిసెంబర్) రూ.6.56 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2016లో ఇదే కాలంతో పోల్చి చూస్తే 18 శాతం వృద్ధి నమోదయ్యింది. 2017–18లో మొత్తం సంవత్సరానికి గాను బడ్జెట్లో రూ.9.8 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు వస్తాయని అంచనా వేశారు. కాకపోతే ఈ లక్ష్యంలో ప్రస్తుత డిసెంబర్ నాటికి 67 శాతం పూర్తయింది. పలువురు వేతన జీవులతో పాటు వృత్తి నిపుణులు ఆఖరికి కార్పొరేట్లు కూడా ముందుగా అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించినా సంవత్సరం చివరిలోనే అధిక పన్నును చెల్లిస్తారు. ఈ లెక్కన బడ్జెట్లో అంచనా వేసిన మొత్తాన్ని తేలిగ్గానే సాధించగలమని ఆర్థిక శాఖ వర్గాలు అభిప్రాయపడ్డాయి. వ్యక్తులు, కంపెనీలు చెల్లించే ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్ను, సంపద పన్ను.. ఈ ప్రత్యక్ష పన్నుల కేటగిరీలోకి వస్తాయి. తాజా వివరాలను చూస్తే... ♦ డిసెంబర్ వరకూ జారీ అయిన రిఫండ్స్ మొత్తం పరిమాణం రూ.1.12 లక్షల కోట్లు. ♦ రిఫండ్స్‌కు ముందు స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 12.6% వృద్ధితో రూ.7.68 లక్షల కోట్లు. ♦ వసూలయిన మొత్తంలో అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్ల పరిమాణం రూ.3.18 లక్షల కోట్లు. ఈ విభాగంలో వృద్ధి 12.7%. కార్పొరేట్ల అడ్వాన్స్ పన్ను లో 10.9% వృద్ధి నమోదయితే, వ్యక్తిగత ఆదాయ పన్ను విషయంలో 21.6% వృద్ధి చెందింది. ♦ కార్పొరేట్ల ఆదాయాల్లో వృద్ధి బాగుంది కనక ఈసారి కూడా గతేడాది మాదిరి ప్రత్యక్ష పన్ను వసూళ్లు అంచనాలను మించుతాయని ఆర్థిక శాఖ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ♦ 2016–17 బడ్జెట్లో ప్రభుత్వం ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని అధిగమించింది. లక్ష్యం రూ.8.47 లక్షల కోట్లయితే, వసూళ్ల మొత్తం రూ.8.49 లక్షల కోట్లకు చేరాయి. -
గతవారం బిజినెస్
సేవింగ్స్‌పై వడ్డీ కోత: యాక్సిస్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును అరశాతం తగ్గించింది. సేవింగ్స్ అకౌంట్లో డిపాజిట్లు రూ. 50 లక్షల కన్నా తక్కువుంటే ఇకపై 3.5% వడ్డీ రేటు మాత్రమే చెల్లించనుంది. రూ. 50 లక్షలు పైబడిన మొత్తం ఉంటే మాత్రం యథా ప్రకారం 4% గానే కొనసాగించనున్నట్లు బ్యాంకు వెల్లడించింది. ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 19 శాతం వృద్ధి ప్రత్యక్ష పన్ను వసూళ్లు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్–జూలై మధ్య 19 శాతం పెరిగాయి. విలువ రూపంలో ఇది రూ.1.90 లక్షల కోట్లు. 2017–18 మధ్య కాలంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.9.80 లక్షల కోట్లుగా ఉండాలని బడ్జెట్లో లకి‡్ష్యంచారు. తాజా వసూళ్ల మొత్తం ఇందులో 19.5 శాతంగా ఉంది. ఆర్బీఐ డివిడెండ్ చిక్కి సగమైంది! కేంద్రానికి ఆర్బీఐ చెల్లించే డివిడెండ్ గడిచిన ఆర్థిక సంవత్సరం భారీగా సగానికి సగం పడిపోయింది. ఈ కాలానికి సంబంధించి ఆర్బీఐ రూ.30,659 కోట్లు మాత్రమే చెల్లించింది. అంతకు ముం దటి ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ.65,876 కోట్లు. ఎంసీఎక్స్‌లో బంగారం ఆప్షన్ల కాంట్రాక్టులు బంగారంపై ఆప్షన్ల కాంట్రాక్టులను ప్రారంభించేందుకు మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ (ఎంసీఎక్స్)కు సెబీ ఆమోదం తెలిపింది. ’’బంగారం ఫ్యూచర్స్‌లో ఆప్షన్ల కాంట్రాక్టులను ప్రవేశపెట్టేందుకు సెబీ నుంచి అనుమతి వచ్చింది. ఇప్పటికే మాక్ ట్రేడింగ్ కూడా నిర్వహించాం. ఇన్వెస్టర్లలో అవగాహన కోసం కార్యక్రమాలు నిర్వహించాం. రానున్న కొన్ని వారాల్లో ఆప్షన్ల కాంట్రాక్టు సైజు, ఇతర వివరాలతోపాటు, ప్రారంభ తేదీని ప్రకటిస్తాం’’ అని ఎంసీఎక్స్ ప్రతినిధి గిరీష్దేవ్ తెలిపారు. జారుడు బల్లపైకి పారిశ్రామిక ఉత్పత్తి! పారిశ్రామిక రంగం ఉత్పత్తి జూన్ నెల్లో అత్యంత నిరాశను మిగిల్చింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) అసలు వృద్ధిలేకపోగా –0.1 % క్షీణతలోకి జారిపోయింది. అంటే 2016 జూన్ నెల ఉత్పత్తితో పోల్చితే 2017 జూన్‌లో ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా –0.1% క్షీణించిందన్నమాట. 2016 జూన్‌లో వృద్ధి భారీగా 8%గా ఉంది. గడిచిన 12 నెలల కాలాన్ని చూస్తే, ’క్షీణ’ ఫలితం ఇదే తొలిసారి. మొత్తం సూచీలో దాదాపు 77% వాటా ఉన్న తయారీ రంగం పేలవ పనితీరును ప్రదర్శించింది. వాహన విక్రయాలు రయ్ రయ్ ప్యాసింజర్ వాహన విక్రయాల్లో జూలై నెలలో రెండంకెల వృద్ధి నమోదయ్యింది. జీఎస్టీ అమలు తర్వాత డీలర్లు స్టాక్‌ను మళ్లీ నింపుకోవడం దీనికి ప్రధాన కారణం. సియామ్ తాజా గణాంకాల ప్రకారం.. ప్యాసింజర్ వాహన విక్రయాలు వార్షిక ప్రాతిపదికన జూలైలో 15.12 శాతం వృద్ధితో 2,59,720 యూనిట్ల నుంచి 2,98,997 యూనిట్లకు పెరిగాయి. కార్ల అమ్మకాలు 8.52 శాతం వృద్ధి చెందాయి. ఇవి 1,77,639 యూనిట్ల నుంచి 1,92,773 యూనిట్లకు ఎగశాయి. ఆరు కంపెనీలపై ట్రేడింగ్ ఆంక్షలు ఎత్తివేత పార్శ్వనాథ్ డెవలపర్స్ సహా ఆరు కంపెనీలకు ఊరట దక్కింది. ఈ కంపెనీల షేర్ల ట్రేడింగ్‌పై సెబీ విధించిన ఆంక్షలను స్టే రూపంలో శాట్ పక్కన పెట్టింది. జాబితాలో పార్శ్వనాథ్ డెవలపర్స్, కవిట్ ఇండస్ట్రీస్, పిన్‌కాన్ స్పిరిట్, సిగ్నెట్ ఇండస్ట్రీస్, ఎస్‌క్యూఎస్ ఇండియా బీఎఫ్ఎస్ఐ, కెకల్పన ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈ కంపెనీల వాదన వినాలని, వీటి వ్యాపారాలపై దర్యాప్తు నిర్వహించాలని శాట్ ఆదేశించింది. 331 అనుమానిత షెల్ కంపెనీలపై సెబీ ట్రేడింగ్ ఆంక్షలకు ఆదేశించిన విషయం తెలిసిందే. డీల్స్.. ♦ ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో జపాన్‌కి చెం దిన సాఫ్ట్‌బ్యాంక్ భారీగా పెట్టుబడులు పెట్టిం ది. సాఫ్ట్ బ్యాంక్ తన విజన్ ఫండ్ ద్వారా 2.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.16,000 కోట్లు) ఇన్వెస్ట్ చేసింది. తద్వారా ఫ్లిప్‌కార్ట్‌లో అతి పెద్ద ఇన్వెస్టర్లలో ఒకటిగా మారింది. ♦ భారతి ఎయిర్టెల్..తన టవర్ల కంపెనీ భారతి ఇన్ఫ్రాటెల్లో 3.65 శాతం వాటా (6.5 కోట్ల షేర్లు) విక్రయించి, రూ. 2,570 కోట్ల నిధుల్ని సమీకరించింది. ♦ సాఫ్ట్వేర్ కన్సల్టింగ్ కంపెనీ నెట్‌లింక్స్.. శ్రీవెంకటేశ్వర గ్రీన్ పవర్ ప్రొజెక్ట్స్ లిమిటెడ్‌లో 51% వాటాను కొనుగోలు చేసింది. ♦ పీకల్లోతు కష్టాలోఉన్న సహారా గ్రూప్‌కు చెందిన యాంబీ వ్యాలీ ప్రాజెక్ట్‌లో 1.67 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 10,700 కోట్లు) పెట్టుబడికి మారిషస్‌కు చెందిన ఇన్వెస్టర్ రాయలీ పార్ట్నర్స్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఆఫర్ ఇచ్చింది. ♦ పెన్నార్ ఇండస్ట్రీస్ తన అనుబంధ కంపెనీ అయిన పెన్నార్ రెన్యువబుల్స్‌లో తనకున్న వాటాను గ్రీన్కో సోలార్ ఎనర్జీకి విక్రయిస్తున్నట్టు ప్రకటించింది. ఐపీవో కాలమ్.. ♦ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా (జీఐసీ) ప్రతిపాదిత ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌కి (ఐపీవో) సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను(డీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది. ఐపీవోలో 12.4 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ♦ న్యూ ఇండియా అష్యూరెన్స్ (ఎన్ఐఏ) ఐపీవోకు అనుమతి కోరుతూ ముసాయిదా పత్రాలను సెబీ వద్ద దాఖలు చేసింది. ఎన్ఐఏ ఐపీవో ద్వారా కేంద్రం 9.6 కోట్ల షేర్లను, ఎన్ఐఏ సొంతంగా 2.4 కోట్ల షేర్లను ఆఫర్ చేయనున్నాయి. -
పరోక్ష పన్ను వసూళ్లలో 22% వృద్ధి
ప్రత్యక్ష పన్ను వసూళ్ల వృద్ధి 11% న్యూఢిల్లీ: పరోక్ష పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016–17) ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకూ (గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చిచూస్తే) గడిచిన 11 నెలల్లో 22.2 శాతం వృద్ధిని సాధించాయి. ప్రత్యక్ష పన్ను వసూళ్ల విషయంలో ఈ రేటు 11 శాతంగా ఉంది. తాజాగా విడుదలైన గణాంకాల్లో ముఖ్యాంశాలు ... ⇔ ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్లు మొత్తంగా రూ.13.89 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2016–17 బడ్జెట్ సవరించిన అంచనాల లక్ష్యం (రూ.16.99 లక్షల కోట్లు)లో ఇది 81.5 శాతం. ⇔ వేర్వేరుగా చూస్తే... ప్రత్యక్ష పన్ను వసూళ్లు 6.17 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. స్థూలంగా కార్పొరేట్ ఆదాయపు పన్ను (సీఐటీ) 11.9 శాతంవృద్ధి సాధించగా, వ్యక్తిగత ఆదాయ పన్ను (పీఐటీ) విషయంలో ఈ వృద్ధిరేటు 20.8 శాతంగా ఉంది. రిఫండ్స్‌ను భర్తీ చేసి, నికరంగా చూస్తే– ఈ శాతాలు వరుసగా 2.6 శాతం, 19.5 శాతంగా నమోదయ్యాయి. ఈ కాలంలో రిఫండ్స్ రూ. 1.48 లక్షల కోట్లు. వార్షికంగా 40.2 శాతం పెరుగుదల రిఫండ్స్ విషయంలో నమోదయ్యింది. ⇔ కాగా, పరోక్ష పన్ను వసూళ్లు రూ.7.72 లక్షల కోట్లు. తయారీ రంగం క్రియాశీలతకు సూచికయిన ఎక్సైజ్ సుంకాల వసూళ్లు 36.2 శాతం వృద్ధితో రూ.3.45 లక్షల కోట్లకు చేరాయి. సేవల విభాగం పన్ను వసూళ్లు కూడా భారీగా 20.8 శాతం పెరిగి రూ.2.21 లక్షలకు ఎగశాయి. ఇక కస్టమ్స్ సుంకాల వసూళ్లు 5.2 శాతం వృద్ధితో రూ.2.05 లక్షల కోట్లకు ఎగశాయి. -
పెరిగిన పన్ను వసూళ్లు
న్యూఢిల్లీ: ఏప్రిల్-ఆగస్టు కాలంలో నికర ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్లు వివరాలను సెంట్రల్ బో ర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) విడుదల చేసింది. ఏప్రిల్-ఆగస్టు కాలానికి నికర పరోక్ష పన్నుల వసూళ్లు పెరిగాయని సీబీడీటీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రత్యక్ష పన్నుల(కార్పొరేట్ ఆదాయ పన్ను, వ్యక్తిగత ఆదాయ పన్ను) వసూళ్ళు 15 శాతం వృద్ధితో రూ 1.89లక్షల కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి ఇది రూ 1.03 లక్షల కోట్లుగా ఉంది. సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ టాక్స్, కస్టమ్స్ కలగలసిన పరోక్ష పన్నులు 27.5 శాతం వృద్ధితో రూ.3.36 లక్షల కోట్లను సాధించినట్టు తెలిపింది. సర్వీస్ టాక్స్ నికర వసూళ్లు 23.2 శాతం పెరిగి రూ.92,696 కోట్లుగా ఉంది. ఇది గత ఏడాది ఇది రూ.75,219కోట్లు. కస్టమ్స్ వసూళ్లు 5.7 వృద్ధితో రూ. 90,448 కోట్లు. గత ఏడాది ఇదే కాలానికి ఇది రూ.85,557 కోట్లుగా ఉంది. మరోవైపు ప్రభుత్వం 2016-17 ఆర్థిక సంవత్సరంలో పరోక్ష (కస్టమ్స్, ఎక్సైజ్, సర్వీస్ టాక్స్) 7,79 లక్షల కోట్లు, ప్రత్యక్ష పన్నుల వసూళ్ల రూపంలో రూ 8.47 లక్షల కోట్ల రూపాయలను వసూలు చేయాలని భావిస్తోంది. -
భారత్‌తో పన్ను సమాచార మార్పిడి
న్యూఢిల్లీ: పన్ను సంబంధ సమాచారాన్ని భారత్‌తో ఆటోమాటిగ్గా మార్పిడి చేసుకోవాలని నిర్ణయించినట్లు మారిషస్ ప్రధాని నవీన్ రామ్గులాం తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీతో మంగళవారం న్యూఢిల్లీలో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మనీ లాండరింగ్ వంటి అక్రమాలను తమ ప్రభుత్వం అనుమతించబోదని స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య ప్రత్యక్ష పన్ను నివారణ ఒప్పందానికి సంబంధించిన అన్ని అంశాల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాల్సి ఉందని అన్నారు. పన్ను ఒప్పందానికి సవరణల ప్రతిపాదన దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉందని చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఇరుదేశాలు కట్టుబడి ఉన్నాయని అన్నారు. తమ ఆలోచనలను సమర్థంగా అమలు చేయడానికి మోడీ, తాను ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. మారిషస్ పర్యటనకు రావాల్సిందిగా మోడీని ఆహ్వానించినట్లు తెలిపారు.