ప్రత్యక్ష, పరోక్ష పన్నులు: సీతారామన్‌కు యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌ కీలక సూచనలు  | Union Budget 23 Rationalise Simplify Direct and Indirect Taxes in India urgers US Industry | Sakshi
Sakshi News home page

UnionBudget 2023 ప్రత్యక్ష, పరోక్ష పన్నులు: యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌ కీలక సూచనలు 

Published Sat, Jan 28 2023 9:36 PM | Last Updated on Sat, Jan 28 2023 9:48 PM

Union Budget 23 Rationalise Simplify Direct and Indirect Taxes in India urgers US Industry - Sakshi

న్యూఢిల్లీ:మరికొన్ని రోజుల్లో 2023-24 వార్షిక  బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రడీ అవుతున్నారు. ఈ సందర్భంగా  అమెరికాలోని ఇండియా సెంట్రిక్‌ టాప్‌ పరిశ్రమ  బృందం ఆర్థికమంత్రికి కీలక విజ్ఞప్తి చేసింది.  

భారత దేశంలోని ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధానాన్ని సరళీకృతం చేయాలని, హేతు బద్ధీకరించాలని భారతదేశం-కేంద్రీకృత అమెరికా వ్యూహాత్మక, వ్యాపార సలహా బృందం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరింది. ఇది ప్రపంచ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచి, భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను  తెచ్చి పెడుతుందని తెలిపాయి.  

విదేశీ కంపెనీల  కార్పొరేట్ పన్ను రేట్లను హేతుబద్ధం చేయండి అంటూ  యూఎస్‌ ఇండియా స్ట్రాటజిక్ అండ్ పార్టనర్‌షిప్ ఫోరమ్ (USISPF) ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్ సమర్పణలకు ముందు ఆర్థిక మంత్రిత్వ శాఖకు  కోరింది. మూలధన లాభం పన్ను సంస్కరణలను సరళీకృతం చేయాలని, వివిధ సాధనాల హోల్డింగ్ కాలాలు, రేట్లను సమన్వయం చేయాలని కోరింది. గ్లోబల్ టాక్స్ డీల్‌కు భారత నిబద్ధతను పునరుద్ఘాటించడంతోపాటు,  సెక్యూరిటీలలో పెట్టుబడి నుండి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ (FPI) వరకు రాయితీ పన్ను విధానాన్ని విస్తరించాలని కేంద్ర ఆర్థిక మంత్రికి సూచించింది. అంతేకాదు  హెల్త్‌  లాంటి  నిర్దిష్ట సెక్టార్లలో పునరుత్పాదక శక్తి, ఆర్‌ అండ్‌  డీ పెట్టుబడులపై  పన్ను రాయితీలను కూడా కోరింది.(Union Budget 2023 ఆ పథకాలకు పెద్ద పీట, వారికి బిగ్‌ బూస్ట్‌)

స్థిరమైన, ఊహాజనిత పన్ను పర్యావరణం కోసం వాదించడం, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ విధానం సరళీకరణ, వ్యాపారం ఖర్చులను హేతుబద్ధీకరించడం, పన్ను రేట్లు , సుంకాలను హేతుబద్ధీకరించడం వంటివి ఉన్నాయి. చమురు మరియు సహజ వాయువు కంపెనీలకు అందించిన కస్టమ్స్ సుంకం మినహాయింపులపై వివరణ కోరింది. దీంతోపాటు ఎక్స్-రే యంత్రాల కోసం కస్టమ్స్ సుంకం రేట్లను 10 శాతం నుండి 7.5 శాతానికి తగ్గించడం, నిర్దేశిత పరిశోధన ద్వారా దిగుమతి చేసుకునే అన్ని వస్తువులపై కస్టమ్స్ సుంకం మినహాయింపును అందించాలని తెలిపింది. 

ఉత్పత్తి  ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుని పోషకాహార ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ పెంపును ఉపసంహరించుకోవాలని కూడా అభిప్రాయపడింది. భారతదేశంలో శాస్త్రీయంగా రూపొందించే  పోషకాహారం లభ్యతను ప్రోత్సహించాలని ఆర్థిక మంత్రిని కోరింది. కస్టమ్స్ టారిఫ్‌లు సుంకాలు మరియు కస్టమ్స్‌ సిఫారసుకు సంబంధించి టెలికాం ఉత్పత్తులపై కస్టమ్స్ టారిఫ్ చట్టంలోని అస్పష్టతలను పరిష్కరించాలని తెలిపింది.  అలాగే CAROTAR , ఫేస్‌లెస్‌ ఎసెస్‌మెంట్‌ వంటి వాణిజ్య సులభతర పథకాలను బలోపేతం చేయాలని అధునాతన జీవ ఇంధన ప్రాజెక్టులకు రాయితీ కస్టమ్స్ సుంకం పొడిగింపును  యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌  కోరింది. (Union Budget-2023పై కోటి ఆశలు: వెండి, బంగారం ధరలపై గుడ్‌న్యూస్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement