బడ్జెట్‌ లక్ష్యంలో 62% పన్నులు వసూలు | Net Direct Tax Collection Grows More Than 8 Lakh Cr, 62 Pc Of Budget Estimates | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌ లక్ష్యంలో 62% పన్నులు వసూలు

Published Tue, Dec 13 2022 2:46 PM | Last Updated on Tue, Dec 13 2022 2:54 PM

Net Direct Tax Collection Grows More Than 8 Lakh Cr, 62 Pc Of Budget Estimates - Sakshi

న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నుల ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సం బడ్జెట్‌ అంచనాల్లో 62 శాతం ఇప్పటికే వసూలైంది. ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకు 24 శాతం అధికంగా రూ.8.77 లక్షల కోట్లు వచ్చింది. ఇది 2022–23 సంవత్సరానికి విధించుకున్న రూ.14.20 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నుల ఆదాయ లక్ష్యంలో 62.79 శాతానికి సమానాం. ఈ వవరాలను కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.

2021–22 సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల ద్వారా కేంద్రానికి రూ.14.10 లక్షల కోట్ల ఆదాయం రావడం గమనార్హం. పన్నుల ఆదాయం దేశ ఆర్థిక రంగ ఆరోగ్యాన్ని ప్రతిఫలిస్తుందని విశ్లేషకులు భావిస్తుంటారు. ఇక పన్ను చెల్లింపుదారులకు చేసిన రిఫండ్‌లు ఏప్రిల్‌ 1 నుంచి నవంబర్‌ 30 మధ్య రూ.2.15 లక్షల కోట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 67 శాతం పెరిగాయి. 

చదవండి  ఐటీ ఉద్యోగులకు డేంజర్‌ బెల్స్‌!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement