tax payers
-
కేంద్రం కీలక నిర్ణయం, వాళ్లకి ఉచిత రేషన్ కట్.. అందులో మీరున్నారా?
ఢిల్లీ : ఉచిత రేషన్ బియ్య పంపిణీ ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన (పీఎంజేకేఏవై) పథకంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ ట్యాక్స్ చెల్లింపు దారులకు రేషన్ బియ్యం పంపిణీని నిలిపివేసే దిశగా అడుగులు వేస్తోంది.ఇందులో భాగంగా ఇన్ కమ్ ట్యాక్స్ విభాగం పన్నులు చెల్లింపు దారుల డేటాను కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖకు పంచుకోనుంది. తద్వారా పన్నుచెల్లింపు దారులు ఎవరైనా ఉచిత రేషన్ బియ్యం పొందుతుంటే.. వారిని అనర్హులుగా గుర్తిస్తుంది. అనంతరం, ఉచిత రేషన్‌ను నిలిపి వేయనుంది.ఆదాయపు పన్ను చెల్లించలేని వారికి పీఎంజేకేఏవై పథకంలో భాగంగా పేద కుటుంబాలకు కేంద్రం ఉచిత రేషన్ అందిస్తుంది. అయితే పీఎంజేఏఏవైలో పన్ను చెల్లింపు దారులకు సైతం రేషన్ అందుతుందని కేంద్రానికి ఫిర్యాదులు అందాయి. ఆ ఫిర్యాదులపై కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. ఆదాయపు పన్ను శాఖ వద్ద ఉన్న పన్ను చెల్లింపు దారుల డేటాను పరిశీలించనుంది. ఈ మేరకు సంబంధిత శాఖల్ని సమన్వయం చేస్తోంది. ఉచిత రేషన్ పథకంలో అనర్హుల డేటాను వెలికి తీయనుంది. ఆ తర్వాత కేంద్రం చర్యలు తీసుకోనుంది. దేశంలో కోవిడ్-19 కారణంగా తలెత్తిన ఆర్ధిక ఇబ్బందుల నుంచి నిరు పేదల్ని గట్టెక్కించేలా కేంద్రం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద పేదలకు ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తుంది. ఉచిత రేషన్ వ్యవధిని జనవరి 1, 2024 నుండి ఐదు సంవత్సరాల పాటు పొడిగించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి తాజా బడ్జెట్లో రూ.2.03 లక్షల కోట్లను ప్రతిపాదించింది. -
ఐటీ రికార్డ్.. భారీగా పెరిగిన ట్యాక్స్ పేయర్లు
దేశంలో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు భారీగా పెరిగారు. దాఖలైన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌ను బట్టీ ఈ విషయం తెలుస్తోంది. జూలై 31న గడువు ముగిసే నాటికి 2024-25 అసెస్మెంట్ ఇయర్ (AY)కి రికార్డు స్థాయిలో 7.28 కోట్ల ఐటీ రిటర్న్స్ (ITR) దాఖలయ్యాయి. మునుపటి మదింపు సంవత్సరానికి (AY 2023-24) దాఖలైన 6.77 కోట్ల ఐటీఆర్‌లతో పోలిస్తే ఇది 7.5 శాతం అధికం.పన్ను చెల్లింపుదారుల ప్రాధాన్యతలలోనూ ఈ సారి గణనీయ మార్పు కనిపించింది. ఎక్కువ మంది కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నారు. దాఖలు చేసిన మొత్తం 7.28 కోట్ల ఐటీఆర్‌లలో, 5.27 కోట్లు కొత్త పన్ను విధానంలో ఉన్నాయి. మొత్తం ఫైలింగ్‌లలో ఇవి దాదాపు 72 శాతం. ఆర్థిక శాఖ ప్రకటన ప్రకారం.. పాత పన్ను విధానంలో దాఖలైన ఐటీఆర్‌లు 2.01 కోట్లు. ఇది మొత్తంలో కేవలం 28% మాత్రమే.ఇక రికార్డ్-బ్రేకింగ్ సింగిల్-డే ఫైలింగ్‌లు ఒకే రోజులో 69.92 లక్షలు. ఆఖరి రోజైన జూలై 31న ఇవి దాఖలయ్యాయి. ఒక గంటలో దాఖలైన ఐటీఆర్‌లను పరిశీలిస్తే ఈ-ఫైలింగ్ పోర్టల్ రాత్రి 7:00 నుంచి 8:00 గంటల మధ్య అత్యధిక ఐటీఆర్ ఫైలింగ్స్‌ను చూసింది. ఈ సమయంలో సగటున 5.07 లక్షల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. ఇక జూలై 17న అత్యధికంగా సెకనుకు 917 ఫైలింగ్‌లు, జూలై 31న నిమిషానికి 9,367 ఫైలింగ్‌లను నమోదు చేసింది.మొదటిసారి ఐటీఆర్ దాఖలు చేసేవారి సంఖ్య ఈ సంవత్సరం కొత్త పన్ను చెల్లింపుదారులలో పెరుగుదల కనిపించింది. ఈసారి 58.57 లక్షల మంది మొదటిసారిగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేశారు. దాఖలైన మొత్తం 7.28 కోట్ల ఐటీఆర్‌లలో, ఐటీఆర్-1 కింద 45.77% (3.34 కోట్లు), ఐటీఆర్-2 కింద14.93% (1.09 కోట్లు), ఐటీఆర్-3 కింద 12.50% (91.10 లక్షలు), ఐటీఆర్-4 కింద 25.77% (1.88 కోట్లు)గా ఉన్నాయి. మిగిలిన 1.03% (7.48 లక్షలు) ఐటీఆర్-5 నుంచి ఐటీఆర్-7 కేటగిరీల కింద దాఖలయ్యాయి. The Income Tax Department appreciates taxpayers & tax professionals for timely compliance, resulting in a record surge in the filing of Income Tax Returns (ITRs).Here are the key highlights:👉More than 7.28 crore ITRs for AY 2024-25 filed till 31st July, 2024, a 7.5% increase… pic.twitter.com/CzbgZEMUWi— Income Tax India (@IncomeTaxIndia) August 2, 2024 -
తగ్గనున్న ట్యాక్స్!.. మోదీ 3.0 బడ్జెట్ ప్లాన్ ఇదేనా?
ఇటీవల కేంద్రంలో కొలువుతీరిన కొత్త ప్రభుత్వం 2024-25 బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఇప్పుడు ప్రజలందరి ద్రుష్టి త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ మీదనే ఉన్నాయి. గతంలో ఎన్నికల దగ్గరపడుతున్న వేళ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. కాబట్టి త్వరలో నిర్మల సీతారామన్ పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.2024-25 బడ్జెట్ పేద ప్రజలకు, వేతన జీవులకు ఊరట కల్పించనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. సంవత్సరానికి రూ. 15 లక్షల నుంచి రూ. 17 లక్షల మధ్య సంపాదించే వ్యక్తులకు ఆదాయ పన్ను రేట్లను తగ్గించనున్నట్లు సమాచారం. మధ్య తరగతి ప్రజలకు ఊరట కలిగించడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.కొత్త పన్ను విధానంలో.. రూ. 3 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ ఉండదని తెలుస్తోంది. రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు 5 శాతం పన్ను ఉంటుందని సమాచారం. అయితే ఈ పన్ను మినహాయింపు రూ. 5 లక్షల వరకు ఉంటే బాగుంటుందని. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ వచ్చే నెలలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు.రాబోయే బడ్జెట్ మోదీ 3.0 ప్రభుత్వ ఆర్థిక ఎజెండాను వివరిస్తుంది. సంకీర్ణ ప్రభుత్వ కట్టుబాట్లకు తగిన విధంగా వనరులను పొందుతూనే సీతారామన్ ద్రవ్యోల్బణం పెరగకుండా వృద్ధిని ప్రేరేపించాల్సిన అవసరం ఉంది. ఈ ఎజెండా భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడం, 2047 నాటికి దేశాన్ని 'అభివృద్ధి చెందిన భారతదేశం'గా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నారు.వ్యవసాయ సవాళ్లను పరిష్కరించడం, ఉద్యోగాల కల్పన, మూలధన వ్యయాలను నిలబెట్టుకోవడం, ఆర్థిక ఏకీకరణను కొనసాగించడానికి ఆదాయ వృద్ధిని పెంచడం రాబోయే బడ్జెట్లో కీలక అంశాలుగా ఉన్నాయి. మొత్తం మీద ఓ వైపు ప్రజలకు అనుకూలమైన విధి విధానాలను రూపొందించడమే కాకుండా.. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా అడుగులు వేయనున్నారు.నిర్మల సీతారామన్ రికార్డ్జూన్ 20న ఆర్థిక మంత్రి పరిశ్రమ వాటాదారులతో ప్రీ-బడ్జెట్ సంప్రదింపులు జరుపుతారు. ఇది మోదీ 3.0 కింద మొదటి కేంద్ర బడ్జెట్ అవుతుంది. అయితే నిర్మలా సీతారామన్ ఇందులో చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయంలో మొరార్జీ దేశాయ్ రికార్డును అధిగమించి ఆరు పూర్తి బడ్జెట్లు, ఒక తాత్కాలిక బడ్జెట్‌తో కూడిన ఏడు.. వరుస బడ్జెట్ ప్రజెంటేషన్లను సీతారామన్ ప్రవేశపెట్టారు. -
ఆదాయ పన్ను తగ్గించాలని ప్రధాని మోదీకి విజయసాయిరెడ్డి విజ్ఞప్తి
సాక్షి, తాడేపల్లి: పది లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ఆదాయపన్ను తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ‘ఎక్స్’ వేదికగా ప్రధనికి విజ్ఞప్తి చేశారు. ‘దేశంలోని గ్రామీణ/అర్బన్ ప్రాంతాల్లో ఉంటూ ఏడాదికి రూ.10 లక్షలలోపు సంపాదించే వారికి ఆదాయపు పన్ను తగ్గించాల్సిన అవసరం ఉంది. వారి ఆదాయపన్ను తగ్గించాలని ప్రధాని మోదీని అభ్యర్థిస్తున్నా. ద్రవ్యోల్బణం కారణంగా ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతిని ప్రోత్సహించేందుకు పన్ను తగ్గిచండి. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలకు మేలు చేకూరేలా నిర్ణయం తీసుకోండి’ అని విజయసాయిరెడ్డి అన్నారు.There is an imminent need to reduce Income Tax for those earning under ₹10lakh per year which would boost demand, especially in rural/semi-urban India. I request Hon’ble FM @nsitharaman ji to incentivize our salaried middle class that is reeling under pressure due to inflation.— Vijayasai Reddy V (@VSReddy_MP) June 19, 2024 -
కనిష్ట శ్లాబు వారికి ఐటీ ఊరట కల్పించాలి
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న నేపథ్యంలో తక్కువ స్థాయి శ్లాబ్‌లో ఉన్న ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఊరట కలి్పంచే అంశాన్ని బడ్జెట్లో పరిశీలించాలని పరిశ్రమల సమాఖ్య సీఐఐకి కొత్త ప్రెసిడెంట్‌గా ఎన్నికైన సంజీవ్ పురి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. భూ, కారి్మక, విద్యుత్, వ్యవసాయ రంగ సంస్కరణలన్నింటిని అమలు చేసేందుకు కేంద్రం, రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధన కోసం సంస్థాగత వేదికను ఏర్పాటు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ మూడో దఫా ప్రభుత్వం సంస్కరణలను అమలు చేయడానికి సంకీర్ణ రాజకీయాలనేవి అడ్డంకులు కాబోవని భావిస్తున్నట్లు పురి చెప్పారు. ఇప్పటికే రెండు విడతల్లో విధానాలను విజయవంతంగా అమలు చేయడం, దేశ ఎకానమీ మెరుగ్గా రాణిస్తుండటం వంటి అంశాలు తదుపరి సంస్కరణలను వేగవంతం చేసేందుకు దన్నుగా ఉండగలవని ఆయన పేర్కొన్నారు. -
ఐటీ రిటర్న్స్‌లో తప్పులు.. ట్యాక్స్ పేయర్లకు అప్డేట్
ట్యాక్స్ పేయర్లకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. 2021-22, 2022-23 సంవత్సరాలలో మీరు ఐటీ రిటర్న్స్ (ITR) ఫైల్ చేసివారికి ఇది ముఖ్యమైన వార్త. మీ ఐటీఆర్‌లో కొన్ని తప్పులను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉండవచ్చు. కొన్ని ఐటీఆర్‌లు, థర్డ్ పార్టీ సమాచారంలో వ్యత్యాసాలను గుర్తించామని, వాటిని సరిదిద్దాలని పన్ను చెల్లింపుదారులను సీబీడీటీ కోరింది. కొంతమంది పన్ను చెల్లింపుదారులు దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్‌లు, థర్డ్ పార్టీల నుంచి వచ్చిన డివిడెండ్లు, వడ్డీ ఆదాయానికి సంబంధించిన సమాచారంలో వ్యత్యాసాలను గుర్తించినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. పన్ను చెల్లింపుదారులు తమ అభిప్రాయాలను తెలియజేయడానికి ఈ-ఫైలింగ్ పోర్టల్ అందుబాటులో ఉందని సీబీడీటీ ఒక ప్రకటనలో తెలిపింది. డిపార్ట్మెంట్ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. పన్ను చెల్లింపుదారులకు ఎస్ఎంఎస్ ఈ-మెయిల్ ద్వారా వ్యత్యాసం గురించి తెలియజేస్తున్నట్లు సీబీడీటీ తెలిపింది. వ్యత్యాసాన్ని స్పష్టం చేయలేని పన్ను చెల్లింపుదారులు ఆదాయాన్ని తక్కువగా నివేదించిన కేసును సరిచేయడానికి అప్డేటెడ్ ఐటీఆర్ సమర్పించే అవకాశాన్ని పరిగణించవచ్చని సీబీడీటీ పేర్కొంది. -
దేశంలో ట్యాక్స్ కట్టేవాళ్లు ఎంతమందో తెలుసా?
న్యూఢిల్లీ: గడిచిన పదేళ్లలో ఇన్‌కం ట్యాక్స్ రిటర్నులను (ఐటీఆర్) దాఖలు చేసే పన్ను చెల్లింపుదారుల (ఫైలర్స్) సంఖ్య రెట్టింపయ్యింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 7.78 కోట్లకు చేరింది. కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2013–14లో ఐటీఆర్‌లు దాఖలు చేసిన వారి సంఖ్య 3.8 కోట్లుగా ఉంది. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం దాదాపు 105 శాతం పెరిగింది. ఇదే వ్యవధిలో నికరంగా ప్రత్యక్ష పన్ను వసూళ్లు 161 శాతం పెరిగి రూ. 6.39 లక్షల కోట్ల నుంచి రూ. 16.64 లక్షల కోట్లకు ఎగిశాయి. స్థూలంగా ప్రత్యక్ష పన్ను వసూళ్లు 173 శాతం పెరిగాయి. రూ. 7.22 లక్షల కోట్ల నుంచి రూ. 19.72 లక్షల కోట్లకు చేరాయి. -
ట్యాక్స్ ఆడిట్ చేయించారా? లేదా? లేదంటే..!
టాక్స్ ఆడిట్ అంటే? ఆదాయపు పన్ను చట్టం ప్రకారం కొందరికి ఆడిట్ వర్తిస్తుంది. అలా చేయించే ఆడిట్నే ట్యాక్స్ ఆడిట్ అంటారు. ఎవరికి వర్తిస్తుంది? ఇది ఎన్నో సంవత్సరాల నుంచి అమల్లో ఉంది. ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న నియమాల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరం మీ టర్నోవరు/బిజినెస్ వసూళ్లు/బ్యాంకులో రశీదులు అక్షరాలా ఒక కోటి రూపాయలు దాటితే కంపల్సరీగా ఆడిట్ చేయించాలి. వ్యాపారస్తులకు ఈ పరిమితి రూ. 1 కోటి. వృత్తి నిపుణులకు అయితే రూ. 50,00,000 పరిమితిగా ఉంటుంది. ఎవరు చేస్తారు? ఈ ఆడిట్‌ని డిపార్టుమెంట్ వారు చేయరు. చట్టప్రకారం మనమే.. అంటే అస్సెస్సీలే తమ టర్నోవరు రూ. 1 కోటి దాటితే ప్రాక్టీసులో ఉన్న సీఏ చేత చేయించాలి. ఈ ఆడిట్‌ను మనంతట మనమే స్వయంగా చేయించాలి. అంటే వాలంటరీగా చేయాలి. అలా చేయించినందుకు సీఏకి ఫీజు మనమే ఇవ్వాలి. సకాలంలో చేయించకపోయినా, చేసి ఆడిటర్ రిపోర్ట్‌ను సమరి్పంచకపోయినా, చాలా పెద్ద మొత్తంలో పెనాల్టీలు వేస్తారు. ఆడిట్ వెనుక లక్ష్యం ఏమిటంటే.. ♦ సరైన, తగిన విధంగా, కరెక్టుగా బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌ను నిర్వహించేలా చూడటం. ♦ అలా నిర్వహించిన అకౌంటు మొదలైన వాటిని సీఏ సర్టిఫై చేయాలి లేదా ధృవీకరించాలి. ♦ ఆడిటింగ్ చేస్తున్నప్పుడు దొరికిన తప్పులు, దొర్లిన తప్పొప్పులు, తేడాలు, మిస్ అయిన అంశాలు, తప్పుడు సమాచారాలు, డబుల్ అకౌంటింగ్, ఆదాయంలో హెచ్చుతగ్గులు, ఖర్చుల్లో హెచ్చుతగ్గులు, వ్యక్తిగత ఖర్చులు, సమంజసం కాని ఖర్చులు, సంబంధం లేని ఖర్చులు, కేవలం ఆ సంవత్సరానికి సంబంధించినవే రాశారా లేదా వేరే సంవత్సరానివి రాశారా, ఆ వ్యాపారానివేనా లేక వేరే వ్యాపారానికి సంబంధించినవా, ఆ వ్యక్తి ఖర్చేనా లేక వేరే వ్యక్తికి సంబంధించినదా? క్యాపిటల్ ఖర్చెంత, రెవెన్యూ ఖర్చెంత? ఒకదానికొకటి సర్దుబాటు చేయలేదు కదా? స్థిరాస్తి కొని మామూలు ఖర్చుగా రాశారా? ఇలా వందలాది ప్రశ్నలకు జవాబులు ఈ రిపోర్టులో రాయాలి. ♦ అంతే కాకుండా అస్సెస్సీ కేవలం చట్టప్రకారం తనకు అర్హత ఉన్న, ఎలిజిబిలిటీ ఉన్న ప్రయోజనాల తగ్గింపులు, మినహాయింపులు మాత్రమే పొందారా లేక అదనంగా ఏదైనా లబ్ధి పొందారా? ♦ అంతే కాకుండా, ఇతర చట్టాల ప్రకారం, అంటే ఈఎస్ఐ, పీఎఫ్, జీఎస్టీ, కంపెనీ లా మొదలైన వాటి ప్రకారం చెల్లింపులు, అవి సక్రమమేనా, సకాలంలో చెల్లించారా .. ఇలా ఎన్నో విషయాలు బయపడతాయి. మీకు నిబంధనలు వర్తించే పక్షంలో ట్యాక్స్ ఆడిట్ తప్పక చేయించండి. అదే మీకు శ్రీరామరక్ష. -కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి ( ట్యాక్సేషన్ నిపుణులు) -కె.వి.ఎన్ లావణ్య( ట్యాక్సేషన్ నిపుణులు ) -
టాక్స్ రిఫండ్స్: పన్ను చెల్లింపుదారులకు శుభవార్త!
Income tax refund: ఆదాయపు పన్ను రిటర్న్‌లు (ITRలు) దాఖలు చేసిన తర్వాత టాక్స్ రిఫండ్స్ విషయంలో ఆదాయపన్ను కీలక నిర్ణయం తీసుకోనుంది. దీనికి సంబంధించిన యావరేజ్ ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించాలని ఆదాయపు పన్ను శాఖ యోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న 16 రోజుల నుంచి 10 రోజులకు తగ్గింపుపై పన్ను శాఖ ఆలోచిస్తోంది. అంతేకాదు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కొత్త టైమ్‌లైన్‌ను అమలు చేయాలని భావిస్తున్నట్లు ఒక నివేదిక పేర్కొంది. కాగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి పెనాల్టీ లేకుండా ఐటీఆర్ ఫైల్ చేసేందుకు గడువుజూలై 31, 2023తో ముగిసిన సంగతి తెలిసిందే. తాజా లెక్కల ప్రకారం చాలామంది ఇప్పటికే ఐటీఆర్ ఫైల్ చేసిన పన్ను చెల్లింపుదారులు టాక్స్ రిఫండ్స్ దాదాపు అందుకున్నారు. అయితే మరికొంతమంది మాత్రం టాక్స్ రిఫండ్ కోసం ఇప్పటికీ ఎదురుచూస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది.వార్షిక ITRను ఫైల్ చేసేటప్పుడు అసెస్సీ ఉపయోగించే ఎంపికపై ఆధారపడి, రీఫండ్ ఎలక్ట్రానిక్ మోడ్ అంటే ఖాతాకు నేరుగా క్రెడిట్ లేదా రీఫండ్ చెక్ ద్వారా గానీ చెల్లిస్తారు. ఈ రీఫండ్ ప్రాసెస్‌ను సంబంధిత పోర్టల్‌లో చెక్ చేసుకోవచ్చు. రీఫండ్ ఆలస్యం అయితే ఏమి చేయాలి? ప్రతిస్పందన కోరుతూ ఆదాయపు పన్ను శాఖ నుండి ఏదైనా కమ్యూనికేషన్ వచ్చిందా లేదా అని ఈమెయిల్లో చెక్ చేసుకోవాలి ఒక వేళా అలాంటి ఇమెయిల్ ఎదైనా వస్తే వీలైనంత త్వరగా ప్రతిస్పందించడం చాలా ముఖ్యం. ఒకవేళ ITR స్టేటస్ రీఫండ్ గడువు ముగిసినట్లు చూపితే, 90 రోజుల చెల్లుబాటు వ్యవధిలోపు చెల్లింపు కోసం వాపసు సమర్పించబడలేదని అర్థం.ఈ సందర్బంగా టాక్స్‌పేయర్ రీఫండ్ రీ-ఇష్యూ రిక్వెస్ట్ పంపవచ్చు. రీఫండ్ స్టేటస్‌పై చాలా క్వెరీలువస్తున్నాయని, ఇ-ఫైలింగ్ తర్వాత తిరిగి చెల్లించాల్సిన పన్ను చెల్లింపుదారులకు చెల్లింపును వేగవంతం లోకి ఇది మంచి చర్య అని క్లియర్ ఫౌండర్సీఈవో అర్చిత్ గుప్తా అన్నారు. ఈఏడాది పెద్ద సంఖ్యలో పన్ను చెల్లింపుదారులు సకాలంలో దాఖలు చేశారని (31 జూలై 2023 వరకు 6.77 కోట్ల ఐటీఆర్‌లు) అందువల్ల వాపసులను త్వరగా ప్రాసెస్ చేస్తారనే అంచనా ఉందన్నారు. -
ఫోన్‌పే యూజర్లకు గుడ్‌న్యూస్.. సరికొత్త ఫీచర్ వచ్చింది, అదనపు బెనిఫిట్స్ కూడా
ఫోన్‌పే... ఈ పేరు తెలియని వారుండరు. చెల్లింపుల వ్యవస్థలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడంతో పాటు కోట్లాది మంది యూజర్లను సొంతం చేసుకుంది ఈ సంస్థ. తాజాగా ఈ డిజిటల్ పేమెంట్స్ యాప్ తమ యూజర్లకు మరో సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. 'ఆదాయ పన్ను చెల్లింపు' అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ (ITR)ఫైలింగ్‌తో పాటు చెల్లించడానికి జూలై 31 గా నిర్ణయించింది. ఈ తేదీకి మించి ఐటీఆర్ ఫైల్ చేయడానికి గడువు పొడిగించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇకపై చాలా ఈజీ ఇదిలా ఉండగా కొన్ని సార్లు పన్ను చెల్లింపు చేస్తుండగా సర్వర్లు యూజర్ల సంఖ్య పెరగడంతో మొరాయిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సమస్యకు పరిష్కారంగా ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్స్ ఫీచర్ ప్రారంభిస్తున్నట్లు ఫోన్‌పే తెలిపింది. యూపీఐ లేదా క్రెడిట్ కార్డు పేమెంట్లను ఉపయోగించి నేరుగా యాప్ ద్వారానే సెల్ఫ్ అసెస్మెంట్, అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు చేసేందుకు ట్యాక్స్ పేయర్స్‌కు వీలు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ కొత్త సేవను తీసుకొచ్చేందుకు ఫోన్ పే సంస్థ ప్రముఖ బీ2బీ పేమెంట్స్, సర్వీసెస్ సంస్థ పేమేట్ కంపెనీతో భాగస్వామ్యం ఏర్పరచుకుంది. కొత్తగా వచ్చిన ఫీచర్లో యూజర్లు తమ క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐని ఉపయోగించి సులభంగా పన్నులు చెల్లించడానికి వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్ క్రెడిట్ కార్డ్ చెల్లింపుల కోసం అదనపు ప్రయోజనాలతో వస్తుంది, ఫోన్ పే తెచ్చిన ఈ ఫీచర్ ఉపయోగించడం ద్వారా 45 రోజుల ఇంటరెస్ట్ ఫ్రీ పీరియడ్ అవకాశం పొందవచ్చని, బ్యాంకును బట్టి వారి పన్ను చెల్లింపులపైనా రివార్డు పాయింట్లను కూడా అందుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఫోన్‌పేలో బిల్ పేమెంట్స్, రీఛార్జ్ బిజినెస్ హెడ్ నిహారిక సైగల్ ఈ అంశంపై మాట్లాడుతూ, "ఫోన్‌పేలో, మా యూజర్లు అవసరాలను తీర్చడానికి మా యాప్‌ను నిరంతరం అప్డేట్ చేస్తూ వారికి అనుగుణంగా మార్పులు చేస్తూనే ఉంటాం. మా సరికొత్త ఫీచర్‌ను ప్రారంభించడం పట్ల మేము సంతోషిస్తున్నాం. ఫోన్‌పేలో ఆదాయపు పన్నులు చెల్లించే సౌలభ్యం తరచుగా ఉంటుంది. పన్నులు కట్టడం అనేది క్లిష్టమైన ప్రక్రియ, చాలా సమయం పడుతుంది కూడా. ఇకపై మా యూజర్లకు ఎలాంటి అడ్డంకులు లేకుండా సురక్షితమైన పన్ను చెల్లింపు ప్రక్రియను అందిస్తోందని అన్నారు. చదవండి: EPFO: వేతన జీవులకు గుడ్‌న్యూస్: ఈపీఎఫ్ వడ్డీని పెంచిన కేంద్రం -
ట్యాక్స్ పేయర్స్‌కు ఊరట! టీసీఎస్, టీడీఎస్ అనుసంధానం..
న్యూఢిల్లీ: మూలం వద్దే పన్ను వసూలు చేయడం (టీసీఎస్), మూలం వద్ద పన్ను మినహాయించడం (టీడీఎస్)ను ప్రభుత్వం అనుసంధానించే ప్రయత్నం చేస్తోందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ తెలిపారు. దీనివల్ల టీసీఎస్ చెల్లించిన వారిపై టీడీఎస్ భారం తగ్గుతుందని.. తద్వారా పన్ను చెల్లింపుదారు నగదు ప్రవాహాలపై ప్రభావం పడకుండా ఉంటుందన్నారు. జూలై 1 నుంచి కొన్ని రకాల అంతర్జాతీయ క్రెడిట్ కార్డు వ్యయాలపై 20 శాతం టీసీఎస్‌ను అమలు చేస్తున్న దశలో అనంతనాగేశ్వరన్ ఈ అంశంపై మాట్లాడడం ప్రాధాన్యం సంతరించుకుంది. వర్తకులు తాము విక్రయించే ఉత్పత్తులు లేదా సేవలపై టీసీఎస్‌ను వసూలు చేస్తుంటారు. అదే టీడీఎస్ అయితే ప్రభుత్వం అమలు చేస్తుంది. క్రెడిట్‌కార్డు లావాదేవీలపై 20 శాతం టీసీఎస్ పట్ల నిరసన వ్యక్తం కావడంతో రూ.7 లక్షల వరకు లవాదేవీలకు మినహాయింపునిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించడం గమనార్హం. దీనివల్ల చిన్న పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం లభించిందని... కనుక ఎక్కువ శాతం లావాదేవీలు 20 శాతం టీసీఎస్ పరిధిలోకి రావంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని అనంత నాగేశ్వరన్ సమర్థించారు. -
ట్యాక్స్‌పేయర్ల కోసం స్పెషల్ యాప్, ఎలా పనిచేస్తుంది?
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారుల కోసం ఆదాయ పన్ను శాఖ తాజాగా ఏఐఎస్ ట్యాక్స్‌పేయర్ పేరిట మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో తమ మొబైల్ ఫోన్లలో వార్షిక సమాచారాన్ని, పన్ను చెల్లింపుదారుల సమాచార సారాంశాని చూడవచ్చు. ఇది పన్ను చెల్లింపుదారుల టీడీఎస్/టీసీఎస్, వడ్డీ, డివిడెండ్లు, షేర్ల లావాదేవీలు మొదలైన వాటి సమగ్ర సమాచారాన్ని ఒకే దగ్గర చూసుకునేందుకు, ఫీడ్‌బ్యాక్ ఇచ్చేందుకు ఉపయోగపడుతుంది. టీఏఎస్ అంటే టేక్స్ పేయర్స్ ఇన్ఫర్మేషన్ సమ్మరీని, ఏఐఎస్ యాన్సువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ వివరాలు ఉంటాయి. ఈ సమాచారం అందించే యాప్ గూగుల్ ప్లే, యాప్ స్టోర్‌లో ఉచితంగా అందుబాటులో ఉంటుందని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఒక ప్రకటనలో తెలిపింది. తమ పాన్ నంబర్ ద్వారా ఈ యాప్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ITD has launched a mobile app ‘AIS for Taxpayers’ to enable taxpayers to view their info as available in Annual Information Statement(AIS)/Tax Information Summary(TIS). This will provide enhanced taxpayer service & ease of compliance.(1/2) Press Release:https://t.co/WujCqyYQSe pic.twitter.com/Q6VaC2L2S2 — Income Tax India (@IncomeTaxIndia) March 22, 2023 -
భార్య గురించి అలా ట్వీట్ చేసిన అష్నీర్ గ్రోవర్
వృత్తిపరంగా ఎప్పుడూ బిజీగా ఉండే ప్రముఖ వ్యాపారవేత్త 'అష్నీర్ గ్రోవర్' ఇటీవల తన భార్య 'మాధురీ జైన్ గ్రోవర్' గురించి ఒక ఆసక్తికరమైన విషయం ట్వీట్ చేశారు. ఇందులో ఆమె స్టార్టప్ పెట్టుబడులను గురించి, దేశంలో ఎక్కువ టాక్స్ చెల్లిస్తున్న మహిళ అంటూ ప్రశంసించాడు. అష్నీర్ గ్రోవర్ ప్రకారం, మాధురి ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 2.84 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించినట్లు తెలిసింది. అదే సమయంలో ఆయన 2022 - 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 7.1 కోట్లు టాక్స్ చెల్లించినట్లు తెలుస్తోంది. హర్యానాలోని పానిపట్‌కు చెందిన మాధురీ జైన్ పానిపట్‌లోని బాల్ వికాస్ స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, NIFT ఢిల్లీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. ప్రస్తుతం భారతదేశంలో ప్రముఖ వ్యాపారవేత్తగా, స్టార్టప్ పెట్టుబడిదారుగా కొనసాగుతోంది. తన భర్త స్థాపించిన వ్యాపారంలో చేరడానికి ముందు ఇతర కంపెనీలలో కెరీర్ ప్రారంభించింది. ఇప్పుడు భారత్ పే ఆపరేషన్స్ అండ్ ఫంక్షన్స్ విభాగం నిర్వహణ బాధ్యతలను చేపట్టింది. అంతే కాకుండా గ్రోవర్తో పాటు గత ఫిబ్రవరిలో థర్డ్ యునికార్న్ బిజినెస్ ప్రారంభించారు. క్రికెట్ సాఫ్ట్వేర్ CrickPeని ఉపయోగించి కొత్త బిజినెస్ ఫాంటసీ కింద క్రీడలపై దృష్టి పెట్టారు. గత సంవత్సరం మాధురీ జైన్ గ్రోవర్ భారత్ పే ఆపరేషన్స్ హెడ్ హోదాలో 63 లక్షలు సంపాదించినట్లు సమాచారం. అదే ఏడాది అష్నీర్ గ్రోవర్ రూ. 1.69 కోట్లు సంపాదించారు. Madhuri Jain Grover @madsj30 is one of the highest female tax payers in the country. She’s paid ₹2.84 crores of advance tax this financial year. She is killing it with her start up investments - in a year where the space in general is falling apart. Kudos to all honest tax payer pic.twitter.com/cRkeRRfgqx — Ashneer Grover (@Ashneer_Grover) March 15, 2023 -
బడ్జెట్ 2023: కేంద్రం ఫోకస్ పెట్టనున్న కీలక అంశాలు ఇవేనా!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2023-24ను సమర్పించనున్నారు. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఈ సారి బడ్జెట్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించడంతో పాటు పన్ను ప్రయోజనాల రూపంలో ప్రజలకు కొంత ఉపశమనాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వం తన కేటాయింపులను ప్రణాళికాబద్దంగా ఖర్చు చేయనుంది, ద్రవ్య లోటు, ద్రవ్యోల్బణాన్ని ఎలా నియంత్రిస్తుంది అనే దానిపై అందరి దృష్టి ఉంది. ఈ సారి బడ్జెట్లో ఈ ప్రతిపాదనలు ఉండొచ్చని అటు ప్రజలతో పాటు నిపుణులు భావిస్తున్నారు. అవేంటో ఓ లుక్కేద్దాం! పన్ను స్లాబ్ ప్రస్తుత పన్ను స్లాబ్‌లో వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ₹ 2.5 లక్షల ప్రాథమిక మినహాయింపు పరిమితి ఉంది. దీని అర్థం ఈ పరిమితి కంటే తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయవలసిన అవసరం లేదు. అయితే ఈ నిబంధనలో గత ఏడేళ్లగా ఎటువంటి మార్పులు చేయలేదు. దీంతో రాబోయే బడ్జెట్లో ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని కేంద్రం ₹ 5 లక్షలకు పెంచే అవకాశం ఉన్నట్లు ప్రజలు భావిస్తున్నారు. ప్రామాణిక తగ్గింపు(స్టాండర్డ్ డిడక్షన్) ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్‌ను ₹ 50,000 నుంచి ₹ 1 లక్ష వరకు రెట్టింపు చేసే అవకాశం ఉందని పన్ను చెల్లింపుదారులు భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పెరుగుతున్న జీవన వ్యయం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కోసం ప్రామాణిక మినహాయింపు పరిమితిని రెట్టింపు చేయాలని వాదన కూడా ఉంది. ఆర్థిక లోటు తగ్గింపు భారత్ తన ఆర్థిక లోటు లక్ష్యాన్ని 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించుకోవచ్చని గోల్డ్‌మన్ సాక్స్ గ్రూప్ తెలిపింది. ఆండ్రూ టిల్టన్, శాంతాను సేన్‌గుప్తాతో సహా గోల్డ్‌మ్యాన్ ఆర్థికవేత్తలు భారతదేశం తన లోటును 5.9కి ఉంచుతుందని ఒక నివేదికలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మూలధన వ్యయాన్ని కొనసాగిస్తూ సంక్షేమ వ్యయాన్ని పెంచడంతో పాటు గ్రామీణ ఉపాధి, గృహనిర్మాణంపై దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. మౌలిక సదుపాయాలు, సామాజిక పథకాల వ్యయం ఈ ఏడాది బడ్జెట్లో మౌలిక సదుపాయాలపై ఖర్చు కూడా పెంచే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే రానున్న కాలంలో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు బడ్జెట్ ఇదే కావడంతో ప్రభుత్వం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, సామాజిక రంగ సంక్షేమ పథకాలకు మరిన్ని నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: అప్పట్లో రియల్ ఎస్టేట్ కింగ్.. ఇప్పుడేమో లక్షల కోట్ల ఆస్తిని కోల్పోయి -
Budget 2023: సెస్సులు, సర్‌చార్జీలు ఎత్తివేయాలి
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు అదనపు భారంగా ఉంటున్న సెస్సు, సర్‌చార్జీలను ఎత్తివేయాలని, ట్యాక్స్ పరిధిలోకి మరింత మందిని చేర్చాలని బడ్జెట్‌కు సంబంధించి థింక్ చేంజ్ ఫోరం (టీసీఎఫ్) కేంద్ర ఆర్థిక శాఖను కోరింది. అలాగే, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న రంగాలకు పన్నుల భారాన్ని తగ్గించాలని, ట్యాక్స్‌పేయర్లు నిబంధనలను పాటించేలా పర్యవేక్షణను మరింత మెరుగుపర్చాలని పేర్కొంది. ఆర్థిక వృద్ధి సాధనకు, అభివృద్ధి పనులపై ఇన్వెస్ట్ చేసేందుకు ప్రభుత్వం పన్ను ఆదాయాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని టీసీఎఫ్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న నిపుణులు అభిప్రాయపడ్డారు. అధిక పన్నుల భారం, సంక్లిష్టమైన ట్యాక్స్ విధానాలు మొదలైనవి వివాదాలకు దారి తీస్తున్నాయని, నిబంధనల అమలు సరిగ్గా లేకపోవడం వల్ల వసూళ్లపై ప్రభావం పడుతోందని వారు తెలిపారు. అక్రమ వ్యాపారాలను అరికట్టడానికి ప్రభుత్వ ఏజెన్సీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా పన్ను ఎగవేతదారులు మరింత వినూత్న వ్యూహాలతో స్మగ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు మాజీ చైర్మన్ పీసీ ఝా చెప్పారు. అత్యధిక నియంత్రణలు, పన్నులు ఉండే పరిశ్రమలైన పొగాకు ఉత్పత్తులు, ఆల్కహాలిక్ పానీయాల రంగాల నుంచి ఖజానాకు రావాల్సిన రూ. 28,500 కోట్ల మేర ఆదాయానికి గండి పడుతోందని పేర్కొన్నారు. ఇలాంటివి అరికట్టేందుకు మరింత అధునాతన టెక్నాలజీని ఉపయోగించాలని, పోర్టుల్లో మరిన్ని స్కానర్లను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. -
నగదు వ్యవహారాలు.. జాగ్రత్త, అలా చేస్తే చిక్కుల్లో పడినట్లే!
నేను రిటైర్ అయ్యాను. సర్వీసులో ఉండగా పన్నుకట్టేవాణ్ని. తర్వాత కూడా చెల్లిస్తున్నాను. నా ప్రాణ మిత్రుడు ఒక ఇల్లుఅమ్ముతున్నాడు. ఆయనకి వైట్‌లో కోటి రూపాయలు, బ్లాక్‌లో రూ. 30,00,000 వస్తుంది. ఆరూ. 30,00,000 నా బ్యాంకులో నగదుగా డిపాజిట్ చేసి, వీలైనంత త్వరగా తనకు నగదు ఇవ్వమంటున్నాడు. అలా చేయవచ్చా? ఇంతవరకు మీ ఆదాయపు పన్ను అసెస్మెంటు సజావుగాజరుగుతోంది. ఎటువంటి సమస్యా లేదు. ఇప్పుడు మీరు మీ మిత్రుడి నుంచి నగదు తీసుకుని,మీ అకౌంటులో డిపాజిట్ చేయగానే, అది డిపార్ట్మెంట్ వారి దృష్టిలో పడుతుంది.నోటీసులు ఇస్తారు. ఆరా తీస్తారు. మీరు వివరణ ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు అంతమొత్తం ఎలా వచి్చందని అడుగుతారు. ఎవరు ఇచ్చారు, ఎందుకిలా ఇచ్చారు అన్న ప్రశ్నలువస్తాయి. చట్టప్రకారం రూ. 2,00,000 దాటి నగదు తీసుకోవడం నేరం. శిక్ష పడుతుంది. ఇచ్చినవారికంటే పుచ్చుకున్న వారిని వివరణ అడుగుతారు. మీరు మీ ఫ్రెండ్ పేరుచెప్పారనుకోండి. ఆయన్ని అడుగుతారు. ఆయన దగ్గర్నుంచి ఒక ధృవీకరణ పత్రం అడుగుతారు.దీని ద్వారా ‘‘సోర్స్’’ ను నిర్ధారించవచ్చు కానీ, మీరు చట్టాన్ని ఉల్లంఘించినవారవుతారు. ఆ తర్వాత, ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేయాలి. నగదులో విత్‌డ్రా చేసి మీమిత్రుడికి ఇవ్వాలి. ఈ విషయంలోనూ ఆరా తీస్తారు. వివరణ ఇవ్వాలి. నోటి వివరణసరిపోదు. ఒకవేళ నిజం చెప్పినా, నగదులో పుచ్చుకున్నందుకు మీ ఫ్రెండ్నినిలదీస్తారు. అది పెద్ద తలకాయ నొప్పి. ఈ సబ్జెక్ట్‌లో తెలుసుకోవాల్సింది ఏమిటంటే (1) నగదువ్యవహరాలు చేయకూడదు (2) నగదుడిపాజిట్/విత్‌డ్రాయల్ గురించి ఆరా తీస్తారు. ఎంక్వైరీ గట్టిగాఉంటుంది. (3) ఈఎంక్వయిరీలో ఇద్దరూ ఒకే మాట మీద నిలబడాలి. అది సాధ్యమయ్యేనా? (4) వివరణ సరిగ్గా ఉండకపోయినా, సంతృప్తికరంగా లేకపోయినా, పూర్తిగా లేకపోయినా.. ఆ రూ.30,00,00 ముందు మీ కేసులో ఆదాయంగా కలుపుతారు. ఆ తర్వాత సంగతి మీకు తెలియనిదేముంది?అందుకని ఎటువంటి నగదు తీసుకోకండి. తీసుకున్నా డిపాజిట్ చేయకండి. మీరు ఏ సహాయం చేయవచ్చంటే వారిదగ్గర్నుంచి చెక్కు రూపంలో పుచ్చుకుని, తిరిగి చెక్కు రూపంలో ఇవ్వొచ్చు. మరీ ప్రాణమిత్రుడైతే నగదు పుచ్చుకుని, దాచి నగదు ఇచ్చేయండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
కేంద్రం దీనికి ఓకే అంటే.. పన్ను చెల్లింపుదారులకు పండగే!
మరి కొన్ని రోజుల్లో న్యూ ఇయర్ రాబోతోంది. ప్రతి సంవత్సరం మాదిరే ఈ సారి కేంద్ర ప్రభుత్వం కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ ఏడాది బడ్జెట్లో వివిధ రంగాలకు చెందిన నిపుణులు తమ డిమాండ్లను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే పరిశ్రమల సంస్థ అసోచామ్ తన ప్రీ-బడ్జెట్ సిఫార్సులలో కేంద్రానికి ఓ కీలక అంశాన్ని నివేదించింది. అది కోట్లాది మంది పన్ను చెల్లింపుదారులపై ప్రభావం చూపుతుందని తెలిపింది. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రాబోయే బడ్జెట్లో రూ. 5 లక్షలు చేయాలని పరిశ్రమల సంఘం అసోచామ్ తమ బలమైన వాదనను కేంద్రానికి వినిపించింది. తద్వారా ఆర్థిక వ్యవస్థ వినియోగ వృద్ధిని పొందుతుందని పేర్కొంది. ప్రస్తుతం ఆదాయపు పన్ను శ్లాబ్ ప్రకారం గరిష్ట ఆదాయం రూ. 2.5 లక్షలు వరకు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. 60-80 సంవత్సరాల వయస్సు గల వ్యక్తుల విషయంలో, ఇది రూ. 3 లక్షలు ఉండగా 80 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు రూ. 5 లక్షలు ఉంది. ఈ సందర్భంగా అసోచామ్ ప్రెసిడెంట్ సుమంత్ సిన్హా మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్, సిమెంట్ వంటి రంగాలలోని కంపెనీలు ప్రస్తుత సామర్థ్యాలను పెంచుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం ప్రారంభించాయని అభిప్రాయపడ్డారు. ప్రతికూల నష్టాల గురించి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా, ప్రపంచం మాంద్యంలోకి వెళ్లవచ్చని, అది బాహ్య రంగాన్ని ప్రభావితం చేస్తుందని, అందువల్ల భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (GDP)పై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ప్రత్యక్ష, పరోక్ష పన్నులు రెండింటిలోనూ ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచేందుకు ప్రభుత్వానికి తగినంత సమయం ఇవ్వాలన్నారు. భారత్ ప్రధాన ఇంధన ఉత్పత్తిదారుగా అవతరించేందుకు కృషి చేస్తున్నందున గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి మద్దతుగా ఇతర దేశాలు తీసుకుంటున్న క్రియాశీల చర్యలకు ప్రభుత్వం తప్పనిసరిగా స్పందించాలని చెప్పారు. చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
బడ్జెట్ లక్ష్యంలో 62% పన్నులు వసూలు
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నుల ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సం బడ్జెట్ అంచనాల్లో 62 శాతం ఇప్పటికే వసూలైంది. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 24 శాతం అధికంగా రూ.8.77 లక్షల కోట్లు వచ్చింది. ఇది 2022–23 సంవత్సరానికి విధించుకున్న రూ.14.20 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నుల ఆదాయ లక్ష్యంలో 62.79 శాతానికి సమానాం. ఈ వవరాలను కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 2021–22 సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల ద్వారా కేంద్రానికి రూ.14.10 లక్షల కోట్ల ఆదాయం రావడం గమనార్హం. పన్నుల ఆదాయం దేశ ఆర్థిక రంగ ఆరోగ్యాన్ని ప్రతిఫలిస్తుందని విశ్లేషకులు భావిస్తుంటారు. ఇక పన్ను చెల్లింపుదారులకు చేసిన రిఫండ్లు ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 30 మధ్య రూ.2.15 లక్షల కోట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 67 శాతం పెరిగాయి. చదవండి ఐటీ ఉద్యోగులకు డేంజర్ బెల్స్! -
వ్యాపారంలోనూ సిక్సర్లు.. ఎంఎస్ ధోని ఎంత టాక్స్ కడుతున్నాడో తెలుసా!
ఇండియన్ టీం మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) దశాబ్దకాలంగా భారత క్రికెట్లో విపరీతంగా మారుమోగిన పేరు. ధోని ఎంత పెద్ద క్రికెటర్ అనేది అందరికీ తెలిసిన విషయమే, దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. ఈ జార్ఘండ్ డైనమెట్ క్రికెట్లో రాణించినట్లుగానే రిటైర్మెంట్ తర్వాత వ్యాపారంలో అదే స్థాయిలో రాణిస్తున్నాడు. అందుకు నిదర్శనంగా మరోసారి జార్ఖండ్‌లో అతిపెద్ద పన్ను చెల్లింపుదారుడు (Tax Payer) నిలవడం. ధోని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 17 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ డిపాజిట్ చేశారు. గత సంవత్సరం అడ్వాన్స్ ట్యాక్స్ రూ.13 కోట్లు డిపాజిట్ చేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి అడ్వాన్స్ ట్యాక్స్ రూ. 4 కోట్లు పెరిగింది. దీని బట్టి చూస్తే గతేడాదితో పోలిస్తే ఈ సారి ధోనీ ఆదాయం 30 శాతం పెరిగినట్లు అంచనా. రిటైర్మెంట్ తర్వాత కూడా తగ్గడం లేదు.. ధోని క్రికెటర్‌గా ఉన్నప్పటి నుంచి వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. అయితే రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత పూర్తిగా బిజినెస్ వైపు దృష్టి సారించాడు. మహీ ఇప్పటికీ చాలా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నాడు. ఖాతా బుక్ యాప్‌కు స్పాన్సర్‌గా ఉండటంతో పాటు అందులో పెట్టుబడి కూడా పెట్టాడు. ఇటీవల బెంగళూరులో ఎంఎస్ ధోని గ్లోబల్ స్కూల్‌ను ప్రారంభించాడు. ఇది కాకుండా సినిమా నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టాడు. వీటితో పాటు సేంద్రియ వ్యవసాయం కూడా చేస్తుంటాడు. మీడియా నివేదికల ప్రకారం, అతను రాంచీలోని తన వ్యవసాయ ఉత్పత్తులను దుబాయ్‌కి ఎగుమతి చేస్తాడు. ఇంతకు ముందు కూడా 2017-18లో జార్ఖండ్‌లో అత్యధిక పన్ను చెల్లింపుదారుగా ధోని నిలిచిన సంగతి తెలిసిందే. చదవండి: ఐటీలో ఫేక్ కలకలం.. యాక్సెంచర్ బాటలో మరో కంపెనీ, వేరే దారిలేదు వాళ్లంతా ఇంటికే! -
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్: అందరికీ ఒకటే ఐటీఆర్ ఫామ్!
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులు అందరికీ అనుకూలమైన ఒకే ఒక్క ఆదాయపన్ను రిటర్నుల పత్రాన్ని (ఐటీఆర్ ఫామ్) తీసుకురావాలంటూ ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. ఈ పత్రంలో వర్చువల్ డిజిటల్ అసెట్స్ రూపంలో వచ్చే ఆదాయాన్ని వెల్లడించేందుకు ప్రత్యేక భాగం ఉంటుంది. ట్రస్ట్‌లు, ఎన్జీవోలు మినహా మిగిలిన పన్ను చెల్లింపుదారులు అందరూ నూతన ప్రతిపాదిత ఐటీఆర్‌ను ఫైల్ చేసుకోవచ్చంటూ, దీనిపై అభిప్రాయాలు తెలియజేయాలని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) భాగస్వాములను కోరింది. ఐటీఆర్–7 మినహా మిగిలిన అన్ని ఐటీఆర్‌లను విలీనం చేయాలన్నది ప్రతిపాదన. చిన్న, మధ్య స్థాయి పన్ను చెల్లింపుదారుల్లో ఎక్కువ మంది ఐటీఆర్–1, ఐటీఆర్–4 దాఖలు చేస్తుంటారు. ఇంటి రూపంలో ఆదాయం, వేతనం రూపంలో రూ.50 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు ఐటీఆర్–1 దాఖలు చేయవచ్చు. రూ.50 లక్షల వరకు ఆదాయం కలిగిన వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు, సంస్థలు వ్యాపార ఆదాయం కూడా కలిగి ఉంటే ఐటీఆర్–4ను, వేతన లేదా వ్యాపార ఆదాయంతోపాటు మూలధన లాభాల పన్ను పరిధిలోని వారు ఐటీఆర్–2 దాఖలు చేయాలి. చదవండి: ‘జెఫ్ బెజోస్’ను అధిగమించి..ప్రపంచ ధనవంతుల జాబితాలో అదానీకి 3వ స్థానం -
పన్ను చెల్లింపుదారులకు షాక్, 'ఏపీవై' పథకంలో చేరకుండా కేంద్రం నిషేధం!
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులు అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకంలో చేరకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ‘‘అక్టోబర్ 1 నుంచి పన్ను చెల్లింపుదారులు ఎవరైనా ఏపీవైలో చేరేందుకు అనర్హులు’’అంటూ కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్ 1లోపు చేరిన వారికి నూతన నిబంధన వర్తించదని స్పష్టం చేసింది. ఈ అటల్ పెన్షన్ యోజన పథకం కింద పెన్షన్ ప్రయోజనాలను ప్రధానంగా లక్ష్యిత వర్గాలకు అందించాలన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అక్టోబర్ 1, ఆ తర్వాత నుంచి ఏపీవైలో చేరిన సభ్యుల్లో ఎవరైనా పన్ను చెల్లింపుదారునిగా బయటపడితే వారి ఏపీవై ఖాతాను మూసేసి, అందులో జమ అయిన మొత్తాన్ని తిరిగి చెల్లించనున్నట్టు ఆర్థిక శాఖ నోటిఫికేషన్ స్పష్టం చేసింది. అసంఘటిత రంగంలో పనిచేసే వారికి.. వృద్ధాప్యంలో ఎటువంటి సామాజిక భద్రతా సదుపాయం లేదు. చదవండి👉 ఇన్కమ్ టాక్స్ నుంచి 143 (1) నోటీసు వచ్చిందా?..అప్పుడేం చేయాలి ? దీంతో అటువంటి వారిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర సర్కారు 2015 జూన్ 1 నుంచి ఏపీవై పథకాన్ని తీసుకొచ్చింది. రూ.1,000–5,000 మధ్య ఎంత పెన్షన్ కావాలో ఎంపిక చేసుకుని, ఆ మేరకు నెలవారీ లేదా త్రైమాసికం లేదా, వార్షికంగా చందా చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్ల తర్వాత నుంచి పెన్షన్ అందుకోవచ్చు. 18 ఏళ్ల నుంచి 39 ఏళ్లు పూర్తయ్యే వరకు ఈ పథకంలో చేరేందుకు అర్హత ఉంది. -
ఐటీ రిటర్న్: గడువులోగా ఫైల్ చేయలేదా?.. ఫైన్ మాత్రమే కాదు.. ఇవన్ని కోల్పోతారు!
గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ గుడువు ఆదివారంతో (జూలై 31) ముగిసింది. ఆఖరి రోజు పన్ను చెల్లింపుదారులు ఉరుకులు పరుగులు మీద ఐటీఆర్ దాఖలు చేశారు. చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఇటీవల వారాల్లో ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ మరో వైపు గడువు తేది పొడిగించే ఆలోచన లేదంటూ ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో చివరి రోజైన ఆదివారం రాత్రి 11గంటల వరకు మొత్తం 67,97,067 మంది ఐటీ రిటర్న్ ఫైల్ చేయగా.. చివరి గంటలో 4,50,013 ఐటీఆర్ దాఖలు చేశారని ఐటీ శాఖ ట్వీట్ చేసింది. దీంతో ఈ సంఖ్య మొత్తంగా ఐదున్నర కోట్లకు పైనే చేరుకుంది. ఒకవేళ మీరు జూలై 31 లోపు ఐటీఆర్ ఫైల్ చేయడంలో విఫలమైన పరిస్థితి ఏమిటని అనుకుంటున్నారా? ప్రస్తుతం ఫైల్ చేయడం కుదరని వాళ్లు డిసెంబర్ 31, 2022లోపు రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు. అయితే అందుకు కొంత పెనాల్టీ చెల్లించక తప్పదు. దీంతో పాటు కొన్ని ఆర్ధిక ప్రయోజనాలకు కోల్పోతారని నిపుణులు చెపుతున్నారు. డెడ్‌లైన్‌లోపు ఫైల్ చేయకపోతే: ►డెడ్‌లైన్ తర్వాత ఐటీ రిటర్న్ దాఖలు చేసేవారు.. వార్షిక ఆదాయం రూ.5 లక్షల కంటే ఎక్కువ ఉన్నవారు రూ.5000, అంతకంటే తక్కువ ఆదాయం ఉన్నవారు రూ. 1000 జరిమానాగా చెల్లించాలి. ►పన్ను చెల్లింపుదారుల వైపు నుంచి ఏమైనా బకాయిలు ఉంటే ఐటీఆర్ ఫైలింగ్ చేయటానికి గడువు తేదీ నుంచి దానిపై 1 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ► ఐటీర్ ఆలస్యంగా పైల్ చేసిన పన్ను చెల్లింపుదారులు.. వారి మూలధనరాబడి వంటి వాటిని నష్టాలతో భర్తీ చేసుకునే అవకాశం ఉండదు. ఇంటి ఆస్తిని అమ్మినప్పుడు వచ్చిన నష్టాన్ని మాత్రమే సర్దుబాటు చేసుకోగలరు. ► ఐటీ రిటర్న్ సకాలంలో దాఖలు చేసి, ధృవీకరించుకున్న తర్వాతే రీఫండ్ అనేది వస్తుంది. కాకపోతే దాఖలు చేయడం అలస్యమయ్యే కొద్దీ రీఫండ్ కూడా అదే తరహాలో ఆలస్యం అవుతుంది. ►2022 డిసెంబర్ 31 తర్వాత కూడా ఐటీఆర్ దాఖలు చేయకపోతే ఐటీశాఖ నుంచి నోటీసులు అందుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా భవిష్యత్తులో కొన్ని ఆర్థికపరమైన ప్రయోజనాలు విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. Statistics of Income Tax Returns filed today. 67,97,067 #ITRs have been filed upto 2300 hours today & 4,50,013 #ITRs filed in the last 1hr. For any assistance, pl connect on orm@cpc.incometax.gov.in or on our help desk nos 1800 103 0025 & 1800 419 0025. We will be glad to assist! — Income Tax India (@IncomeTaxIndia) July 31, 2022 చదవండి: LPG Cylinder Price: బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గిన కమర్షియల్ సిలిండర్ -
అలర్ట్: డెడ్‌లైన్ వచ్చేసింది.. లేదంటే రూ.5000 ఫైన్!
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులు రిటర్నుల దాఖలు గడువు సమీపించడంతో త్వరపడుతున్నారు. ఈ నెల 28వ తేదీ నాటికి 4.09 కోట్ల రిటర్నులు దాఖలైనట్టు ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. ఒక్క 28వ తేదీన 36 లక్షల రిటర్నులు సమర్పించారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ సంవత్సరం (2022–23) రిటర్నులు దాఖలు చేసేందుకు ఈ నెల 31న చివరి తేదీ. ఇప్పటి వరకు రిటర్నులు వేయకపోతే వెంటనే ఆ పని చేయాలని, దీనివల్ల ఆలస్యపు ఫీజు చెల్లించే అవసరం ఏర్పడదని ఆదాయపన్ను శాఖ మరోసారి సూచించింది. గడువులోగా ఐటీఆర్ దాఖలు చేయకుంటే.. వార్షిక ఆదాయం ₹ 5 లక్షల వరకు ఉన్నవారు ఫైన్ కింద ₹ 1,000, ₹ 5 లక్షల కంటే ఎక్కువ ఉన్నవారు ₹ 5,000 ఫైన్ కట్టాల్సిఉంది. ఆదాయపన్ను శాఖ గతేడాది నూతన ఈ ఫైలింగ్ పోర్టల్‌ను ప్రారంభించడం తెలిసిందే. అయినా ఇప్పటికీ పలు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నట్టు పన్ను చెల్లింపుదారుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గడువును పొడిగించాలంటూ డిమాండ్లు రాగా, గడువు పొడిగించేది లేదని ఆదాయపన్ను శాఖ స్పష్టం చేసింది. చదవండి: ఓలా ఉద్యోగులకు షాక్.. వందల మంది తొలగింపు..? -
ష్..కథ మళ్లీ మొదటికొచ్చింది, ఇన్ఫోసిస్ ఇదేం బాగాలేదు!
కేంద్ర ఆర్ధిక శాఖకు చెందిన ట్యాక్స్ రిటర్న్‌లకు సంబంధించిన ఆదాయ పన్ను విభాగం పోర్టల్‌లో మళ్లీ సమస్యలు మొదలయ్యాయి. పోర్టల్‌లోకి లాగిన్ కాలేకపోతున్నామని, త్వరగా ఈ -ఫైలింగ్ చేయలేకపోతున్నామంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వెంటనే ఆ సమస్యని పరిష్కరించాలంటూ ట్యాక్స్ పేయర్స్ ఐటీ డిపార్ట్మెంట్ను కోరారు. దీనిపై ఐటీ డిపార్ట్ మెంట్ స్పందించింది. జులై 2న(శనివారం) ట్యాక్స్ చెల్లించేందుకు ట్యాక్స్ పేయిర్స్ ఇన్ కం ట్యాక్స్‌కు చెందిన వెబ్‌సైట్‌ను లాగిన్ అయ్యారు. ఆ సమయంలో పోర్టల్ పనితీరు స్తంభించింది.ఈ ఫైలింగ్ చేసినా అప్రూవల్ వచ్చేందుకు సమయం పట్టింది. దీనిపై అసహనం వ్యక్తం చేసిన యూజర్లు ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ను ఆశ్రయించారు.పోర్టల్ వల్ల ఇబ్బందులు పడుతున్నామని సంబంధి శాఖకు మెయిల్స్ పెట్టారు. It has been noticed that taxpayers are facing issues in accessing ITD e-filing portal. As informed by @Infosys, they have observed some irregular traffic on the portal for which proactive measures are being taken. Some users may be inconvenienced, which is regretted. — Income Tax India (@IncomeTaxIndia) July 2, 2022 "ట్యాక్స్ పేయర్స్ ఫిర్యాదుతో కేంద్రానికి చెందిన ఇన్ కం ట్యాక్స్ అధికారులు.. ఆ పోర్టల్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఇన్ఫోసిస్‌కు తెలిపినట్లు ట్వీట్ చేసింది. అంతేకాదు ట్యాక్స్ పేయర్స్ ఐటీడీ ఈ- ఫైలింగ్ పోర్టల్‌తో ఇబ్బంది పడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది.ట్యాక్స్ పేయర్స్ పడుతున్న ఇబ్బందులకు మేం చింతిస్తున్నాం". అంటూ ఇన్ కం ట్యాక్స్ ఇండియా ట్విట్లో పేర్కొంది. pic.twitter.com/GBdX7nhxKu — Yogesh Thombre (@YogsThombre7177) July 2, 2022 గతంలో పలు మార్లు ఐటీ శాఖ ఈఫైలింగ్ పోర్టల్ ప్రాజెక్ట్‌ను 2019లో ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌కు అప్పగిచ్చింది. ఈ నేపథ్యంలో గతేడాది జూన్‌లో ఈ-ఫైలింగ్ కొత్త పోర్టల్‌ను ఇన్ఫోసిస్ లాంచ్ చేసింది. నాటి నుంచి కొత్త పోర్టల్‌లో ఏదో ఒక్క సమస్య ఎదురవుతూనే ఉంది. సమస్యలపై ఫిర్యాదులు వెల్లువెత్తడం,ట్యాక్స్ రిటర్న్ గడువు తేదీలను మార్చడం పరిపాటిగా మారిందే తప్పా. ఆ పోర్టల్ పనితీరు మాత్రం మారిన దాఖలాలు లేవంటూ ట్యాక్స్ పేయర్స్, నిపుణులు ఇన్ఫోసిస్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఆదాయపు పన్నును ఎలా లెక్కించాలో తెలుసా!
అవును, ప్రస్తుతం ఆదాయపు పన్ను లెక్కించే సాధనం అందుబాటులోకి వచ్చింది. కేంద్ర ప్రత్యక్ష ఆదాయపు పన్ను బోర్డ్ పోర్టల్‌లో ఇది ఉంటుంది. బోర్డు వారే దీన్ని తయారుచేసి, అమల్లోకి తెచ్చారు. నిజానికి బోర్డు వారు ఆదాయపు పన్ను అసెసీలకు సులువుగా, త్వరగా, స్వంతంగా లెక్కించుకునే ఎన్నో సాధనాలు తెచ్చారు. అందులో ఇది కూడా ఒకటి. ఇది రెండు సంవత్సరాలకు వర్తిస్తుంది. మొదటిది. 01–04–2021 నుండి 31–3–2022తో పూర్తయ్యే ఆర్థిక సంవత్సరానికి..అంటే 2021–22..ఇన్‌కం ట్యాక్స్ పరిభాషలో చెప్పాలంటే అసెస్మెంట్ 2022–23 సంవత్సరం. దీనికి గాను మీరు రిటర్నులు 31–07–2022 లోపల వేయాలి. ఎవరు వేయాలి? ఏ పరిస్థితుల్లో రిటర్న్ వేయాలి? ఏం ఫారం ఐటీఆర్ దాఖలు చేయాలి .. ఇలాంటి ప్రాథమిక ప్రశ్నలకు జవాబులు గతంలో ఎన్నో సార్లు ఇచ్చాం. చదవండి: కొత్త రూల్స్, వీళ్లు తప్పని సరిగా ఐటీ రిటర్న్ దాఖలు చేయాల్సిందే! ఇదొక ఆన్లైన్ సాధనం. రెడీమేడ్ కాల్క్యులేటర్. ఇది ఉచితం. సులభమైన సాధనం. తప్పులుండే అవకాశమే లేదు. చాలా త్వరగా అవుతుంది. మీరు మీ వివరాలతో లాగిన్ అయితే.. ఈ సాధనం ఒక మార్గదర్శినిలాగా పని పూర్తి చేస్తుంది. అయితే, ఒక పని చేయాలి. సంబంధిత కాగితాలను మీ ఎదురుగా పెట్టుకుని సంబంధిత సమాచారాన్ని సరైన ఫీల్డులో నింపుతూ ముందుకెళ్లండి. అన్ని వివరాలు సరిగ్గా ఇవ్వండి. కొన్ని అంశాలు మీకు వర్తించకపోతే ‘‘0’’ అని రాయండి. మీకున్న రెండు ఆప్షన్ల ప్రకారం స్టేట్మెంట్ రెడీ, ట్యాక్స్ లయబిలిటీ రెడీ. ఇన్స్టంట్ ఫుడ్ లాగా అంతా సిద్ధం. మరొక సారి చెక్ చేసుకుని మీరు మీ రిటర్న్‌ని ఫైల్ చేసుకోవచ్చు. వృత్తి నిపుణుల సహాయం అక్కర్లేదు. సరైన సమాచారం సరిగ్గా నింపి, మీరు సరైన ఆప్షన్ తీసుకుంటే సరిపోతుంది. ఇక రెండోది. ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సంవత్సరం 01–04–22 నుండి 31–03–23 అంటే 2022–23.. ఇన్‌కం ట్యాక్స్ వారి పరిభాషలో 2023–24 అసెస్మెంట్ సంవత్సరం విషయం తీసుకుంటే.. ఇది కూడా ఇంచు మించు పైన చెప్పిన విధంగానే ఉంటుంది. మీకెంత ఆదాయం ఉంటుందో, ఎంత వస్తుందో ఊహించి, అంచనా వేసుకుని అంశాలవారీగా సరైన ఫీల్డ్‌లో నింపాలి. గడిచిన సంవత్సరానికి సంపాదించినది.. నడుస్తున్న సంవత్సరానికి సంపాదించబోయేది.. అంటే వ్యత్యాసం .. గతం .. వర్తమానం .. ఇలా అన్ని విషయాలు సమగ్రంగా పొందుపర్చాకా స్టేట్మెంట్ ‘‘రెడీ’’గా కనిపిస్తుంది. మీకు తెలిసే ఉంటుంది. అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాల్సిన వారు ట్యాక్స్ లయబిలిటీ మొత్తాన్ని నాలుగు వాయిదాల్లో చెల్లించాలి. మొదటి విడత జూన్ 15. రెండోది సెప్టెంబర్ 15. మూడోది డిసెంబర్ 15. నాలుగోది..ఆఖరుది మార్చి 15. ఇలా నాలుగు విడతల్లో మొత్తం లయబిలిటీని లెక్కిస్తుంది. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు. ఆర్థికంగా ముందే ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్, ఖర్చులు మొదలైనవి ప్లాన్ చేసుకోవచ్చు. మధ్యలో మార్పులు వస్తే, ఆ మార్పులతో మళ్లీ లెక్కించుకోవచ్చు. ఏ మార్పుకైనా ఇది అనువుగా ఉంటుంది. చాలా మంచి ఎస్టిమేటర్. చివరగా చెప్పాలంటే ఈ సాధనం ఒకటే .. ఆర్థిక సంవత్సరం మారితే లయబిలిటీని తెలియజేస్తుంది. గడిచిన సంవత్సరం రిటర్న్ వేయటానికి పనికివస్తుంది. నడుస్తున్న సంవత్సరం ప్లానింగ్‌కి కూడా పనికొస్తుంది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే రంగంలోకి దూకండి. -
ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్.. వెంటనే ఈ డాక్యుమెంట్స్ ఫైల్ చేయండి..!
ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, చార్టర్డ్ అకౌంటెంట్లకు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫ్ ఇండియా అలర్ట్ చేసింది. గతంలో పొడిగించిన గడువు తేదీ ఫిబ్రవరి 15 నాటికి ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, చార్టర్డ్ అకౌంటెంట్లు ముఖ్యమైన ఆదాయపు పన్ను సంబంధిత పత్రాలను దాఖలు చేయాలి అని ట్విటర్ వేదికగా పేర్కొంది. "ప్రియమైన పన్ను చెల్లింపుదారులారా, ఫారం 3 సీఏ-సీడీ/3 సీబీ-3 సీడీ దాఖలు చేయడానికి పొడగించిన గడువు తేదీ ఫిబ్రవరి 15, 2022. పీఎల్ ఫైల్ ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్‌లను, స్టేట్ మెంట్లను సెక్షన్ 44ఏబి కింద సాధ్యమైనంత త్వరగా సబ్మిట్ చేయండి" అని ఆదాయపు పన్ను శాఖ ట్వీట్ చేసింది. అలాగే, "ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 115జెసీ కింద ఫారం 29సీ దాఖలు చేయడానికి పొడగించిన గడువు తేదీ ఫిబ్రవరి 15, 2022. చివరి రోజు వరకు వేచి ఉండవద్దు. ఇప్పుడు ఫైల్ చేయండి!" అని ఆదాయపు పన్ను శాఖ ట్వీట్ చేసింది. ఇక అది అలా ఉంటే దేశవ్యాప్తంగా ఐటీ రిటర్నులు దాఖలు చేసేవారి సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతున్నది. అసెస్మెంట్ ఏడాది 2021-22(2020-21 ఆర్థిక సంవత్సరం)కిగాను 6.17 కోట్ల మంది ఐటీ రిటర్నులు దాఖలు చేశారని, వీరిలో 19 లక్షల మంద ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్‌లను నూతన ఐటీ ఈ-ఫైలింగ్ పొర్టల్ కింద దాఖలు చేసినట్లు సీబీడీటీ తాజాగా వెల్లడించింది. Dear Taxpayers, The extended due date for filing Form 3CA-3CD/3CB-3CD is 15th February, 2022. Pl file Tax Audit Report & submit statement of particulars under section 44AB at the earliest. Pl visit https://t.co/GYvO3mStKf #FileNow #eFiling pic.twitter.com/fnjEkyh0Yd — Income Tax India (@IncomeTaxIndia) February 8, 2022 The extended due date for filing Form 29C is 15th February, 2022 for furnishing the report under section 115JC of Income-tax Act, 1961. Let’s not wait till the last day. File Now! Pl visit https://t.co/GYvO3mStKf#FileNow #eFiling pic.twitter.com/K9bkjlep1Q — Income Tax India (@IncomeTaxIndia) February 7, 2022 (చదవండి: హైటెక్ బిచ్చగాడు.. వీడు మాములోడు కాదు) -
బడ్జెట్ 2022-23: టాక్స్ పేయర్లకు ఊరటనా..లేదా బాదుడేనా..?
కొత్త ఏడాది వచ్చేసింది. 2022 మార్చి 31తో FY21 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. త్వరలోనే కేంద్ర బడ్డెట్ 2022-23ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 న రానున్న బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. కాగా బడ్జెట్ 2022-23లో భాగంగా ముఖ్యంగా ఆదాయపు పన్నుకు సంబంధించిన వాటి కోసం టాక్స్ పేయర్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. గత బడ్జెట్లో ఆదాయపు పన్నుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పెద్దగా ఎలాంటి ప్రయోజనాలను ప్రకటించలేదు. కాగా టాక్స్ పేయర్లకు ఈ బడ్జెట్లో ఉపశమనం కల్గించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంపు...! రాబోయే బడ్జెట్లో వేతనం పొందే టాక్స్ పేయర్లకు, పెన్షనర్లకు అందుబాటులో ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని 30 శాతం నుంచి 35 శాతంకు పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆదాయపు పన్ను స్లాబ్స్ విషయంలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చునని సమాచారం. ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి రూ.50,000గా ఉంది. అయితే దీనిని పెంచాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ఇప్పటికే వ్యక్తిగత పన్నులపై పరిశ్రమ నుంచి పలు సూచనలు వచ్చాయి. కోవిడ్-19 రాకతో ముఖ్యంగా వైద్య ఖర్చులు పెరిగాయని, ద్రవ్యోల్భణం వంటి అంశాలు భారీగా పెరిగాయని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. దీంతో కేంద్రం ఈ విషయంపై సానూకూలంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఆర్ధికశాఖకు సూచనలు..! ప్రతి సంవత్సరం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పునఃపరిశీలించడాన్ని ప్రభుత్వం ఒక క్రమ పద్ధతిలో చేయాలని బిగ్ ఫోర్ అకౌంటింగ్ సంస్థ డెలాయిట్ భాగస్వామి సుధాకర్ సేతురామ కేంద్రానికి విన్నవించారు. పెరిగిన ద్రవ్యోల్భణం, వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఖర్చులు పెరిగాయని, ఇందుకు అనుగుణంగా కనీసం 25 శాతం వరకు పరిమితిని పెంచాలని సూచించారు. 2019లో రూ.50,000కు పెంపు 2018లో స్టాండర్డ్ డిడక్షన్ రూ.40,000గా ఉంది. గతంలో దీని పరిమితిని 2019లో రూ.50,000కు పెంచారు. ఇప్పుడు మరోసారి దీనిని పెంచాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే తాజా పన్ను వసూళ్ల పరిస్థితిని బట్టి ప్రతిపాదన తుది ఆమోదానికి లోబడి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్న పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి స్టాండర్డ్ డిడక్షన్ మినహాయింపు అందుబాటులో లేదు. అసలు ఏంటి స్టాండర్డ్ డిడక్షన్ ఒక వ్యక్తి లేదా సంస్థ ఆదాయంపై విధించిన పన్ను, వారి ఆదాయ లేదా లాభాలను బట్టి మారుతుంది. చట్ట ప్రకారం వ్యక్తులు లేదా సంస్థలు ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయాలి. ఇందులో స్టాండర్డ్ డిడక్షన్‌కు మినహాయింపు ఉంటుంది. ఆదాయపు పన్ను ప్రకారం మినహాయించడం లేదా వ్యక్తి పెట్టిన పెట్టుబడి స్టాండర్డ్ డిడక్షన్. స్టాండర్డ్ డిడక్షన్ అనేది స్థిర మినహాయింపు సంస్థతో ఉన్న స్థానంతో సంబంధం లేకుండా వేతనం నుంచి తీయడం జరుగుతుంది. కాబట్టి, ఇది పన్ను విధించదగిన ఆదాయాన్ని తగ్గిస్తుంది. పన్ను చెల్లించిన మొత్తం కూడా తగ్గిపోతుంది. జీతం ఉద్యోగి మరియు పింఛనుదారుడు స్టాండర్డ్ డిడక్షన్ పొందవచ్చు చదవండి: కంపెనీలో ఫుడ్ సర్వ్ చేసేవాడు..! ఇప్పుడు ఆ ఒక్కటే అంబానీనే దాటేలా చేసింది...! -
పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్.. రూ.1.44 లక్షల కోట్లు రీఫండ్..!
పన్ను చెల్లింపుదారులకు ఆదాయ పన్ను శాఖ తీపికబురు అందించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 1.38 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు ఖాతాల్లో రూ.1.44 లక్షల కోట్లకు పైగా ఆదాయపు పన్ను జమ చేసినట్లు ఐటీ విభాగం తెలిపింది. సీబీడీటీ తెలిపిన వివరాల ప్రకారం.. 1, ఏప్రిల్, 2021 నుండి 20 డిసెంబర్ మధ్య కాలంలో ఆదాయపు పన్ను శాఖ 1.38 కోట్లకు పైగా పన్ను చెల్లింపుదారులకు రూ.1,44,328 కోట్లను రీఫండ్ చేసినట్లు తెలిపింది. ఇది కాకుండా రూ. 2.11 లక్షలకు కార్పొరేట్ కేసులలో రూ.95,133 కోట్లను రీఫండ్ చేసినట్లు తెలిపింది. 1,35,35,261 సంస్థలకు రూ.49,194 కోట్ల ఆదాయపు పన్ను రీఫండ్లు జారీ చేసినట్లు పేర్కొంది. CBDT issues refunds of over Rs. 1,44,328 crore to more than 1.38 crore taxpayers from 1st Apr,2021 to 20th December,2021. Income tax refunds of Rs. 49,194crore have been issued in 1,35,35,261 cases &corporate tax refunds of Rs. 95,133crore have been issued in 2,11,932cases(1/2) — Income Tax India (@IncomeTaxIndia) December 22, 2021 (చదవండి: "మెర్రీ క్రిస్మస్" మెసేజ్ ఖరీదు ఇన్ని లక్షలా.. స్పెషల్ ఏంటి?) -
టాక్స్ పేయర్లకు ఎస్బీఐ గుడ్‌న్యూస్...!
పన్ను చెల్లింపుదారులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ గుడ్‌న్యూస్‌ను అందించింది. ఐటీఆర్ ఫైలింగ్ చేసే వారి కోసం ఎస్బీఐ సరికొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది. ఎస్బీఐ యోనో యాప్‌లోని ట్యాక్స్2విన్ ఆప్షన్‌ను ఉపయోగించి ఆదాయపు పన్ను దాఖలు చేసే సౌకర్యాన్ని ఎస్బీఐ తీసుకొచ్చింది. టాక్స్ పేయర్లకు ఇకపై ఎస్బీఐ ఖాతాదారులకు ఐటీఆర్ ఫైలింగ్ మరింత ఈజీ కానుంది. ఈ సదుపాయంతో టాక్స్ పేయర్స్ ఉచితంగానే ఆదాయపు పన్ను దాఖలు చేయవచ్చును. యోనో యాప్ ద్వారా ఐటీఆర్ దాఖలుకు కావలసిన పత్రాలు ఇవే...! 1. పాన్ కార్డ్ 2. ఆధార్ కార్డ్ 3. ఫారం-16 4. పన్ను మినహాయింపు వివరాలు 5. ఇంట్రస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు 6. ఇన్వెస్ట్మెంట్ ప్రూఫ్ ఫర్ టాక్స్ సేవింగ్ ఐటీఆర్ ఫైలింగ్ యోనో యాప్‌లో ఇలా చేయండి.. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఎస్బీఐ యోనో యాప్‌లో లాగిన్ అవ్వాలి. తరువాత ‘షాప్స్ అండ్ ఆర్డర్స్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ‘ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్’ సెలక్ట్ చేయాలి. అక్కడ మీకు కనిపించే ‘ట్యాక్స్2విన్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇక్కడ ఐటీఆర్‌కు సంబంధించిన సమాచారం మొత్తం అందుబాటులో ఉంటుంది. ఆయా స్టెప్స్‌ను ఫాలో అవుతూ ఐటీఆర్ సులభంగా దాఖలు చేయొచ్చు. చదవండి: 11 ఏళ్లకు అంతా ఉల్టా పల్టా? ఫేస్బుక్ డిలీట్ అంటూ కవర్ పేజీ -
టాక్స్ పేయర్లకు గుడ్ న్యూస్..!ఇప్పడు మరింత సులువుగా..
న్యూఢిల్లీ: టాక్స్‌పేయర్లకు శుభవార్త! పన్ను చెల్లింపులో ఉన్న ఇబ్బందులు తొలగించేందుకు మరో వెసులుబాటును ఇన్‌కంట్యాక్స్ డిపార్ట్మెంట్ అందుబాటులోకి తెచ్చింది. మధ్యవర్తుల జోక్యం లేకుండా పన్ను చెల్లించేలా ఫేస్‌లెస్ అసెస్మెంట్ పథకాన్ని 2020 ఆగస్టు 13 న ఆదాయపు పన్నుశాఖ ప్రారంభించింది. అయితే వాస్తవంలో ఫేస్‌లెస్ ద్వారా ఇన్‌కంట్యాక్స్ ఫైల్ చేసేప్పుడు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. పన్ను చెల్లింపుదారులు తప్పని పరిస్థితుల్లో కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఫేస్‌లెస్ పథకం ప్రయోజనాలు పన్ను చెల్లింపుదారులు పొందలేక పోతున్నారు. ఫేస్‌లెస్ ఐటీఫైలింగ్లో వస్తున్న ఇబ్బందులు, ఇతర ఫిర్యాదులను తెలియజేసేందుకు వీలుగా కొత్తగా మూడు అధికారిక ఈ-మెయిల్ చిరునామాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ సౌలభ్యం 2021 ఆగస్టు ఆగస్టు 7 నుంచి అందుబాటులోకి వచ్చింది. పన్ను చెల్లింపుదారులు ఈ-మెయిల్ళ్లకు తమ ఫిర్యాదులను అందివచ్చుననీ ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. పన్ను చెల్లింపులకు సంబంధించిన ఇబ్బందులు పరిష్కరించుకునేందుకు ఇకపై కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని... ఈమెయిల్‌తోనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఐటీ శాఖ తెలిపింది. ఆదాయపు పన్ను సంబంధిత వ్యాపారాల కోసం డిపార్ట్మెంట్ అధికారిని కూడా కలవాల్సిన అవసరం లేదని ఐటీ శాఖ వెల్లడించింది. ఐటీ డిపార్ట్మెంట్ జారీ చేసిన మూడు ఈ-మెయిల్ ఐడీలు ఫేస్‌లెస్ అసెస్మెంట్స్ కోసం: samadhan.faceless.assessment@incometax.gov.in ; ఫేస్‌లెస్ పెనాల్టీల కోసం: samadhan.faceless.penalty@incometax.gov.in ; ఫేస్‌లెస్ అప్పీళ్ల కోసం: samadhan.faceless.appeal@incometax.gov.in. Grievances can be furnished as under: For Faceless assessments: samadhan.faceless.assessment@incometax.gov.in; For Faceless penalty: samadhan.faceless.penalty@incometax.gov.in; For Faceless Appeals: samadhan.faceless.appeal@incometax.gov.in. (2/2) — Income Tax India (@IncomeTaxIndia) August 7, 2021 -
జీఎస్టీతో పన్ను చెల్లింపుదారులు రెట్టింపు
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వల్ల నాలుగేళ్ల కాలంలో పన్ను చెల్లింపుదారులు రెట్టింపయ్యారని, 1.28 కోట్లకు చేరుకున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో పెరిగిన పన్నుల వసూలు ఇక మీదటా మెరుగ్గా ఉండడం సాధారణమేనని చెప్పారు. జీఎస్టీ 2017 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పన్ను అధికారులకు మంత్రి లిఖిత పూర్వక సందేశం ఇచ్చారు. ఈ తరహా సంస్కరణను భారత్ వంటి పెద్ద, వైవిధ్యమైన దేశంలో అమలు చేయడం అతిపెద్ద సవాలుగా పేర్కొన్నారు. జీఎస్టీ పన్ను చెల్లింపుదారులకు నిబంధనల అమలును సులభతరం చేయడమే కాకుండా సామాన్యులపై పన్నుల భారాన్ని తగ్గించినట్టు వివరించారు. జీఎస్టీ వసూళ్లు వరుసగా ఎనిమిదో నెలలోనూ రూ.లక్ష కోట్లకు పైనే ఉండడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో రూ.1.41 లక్షల కోట్లు వసూలయ్యాయి. మోసపూరిత డీలర్లు, ఐటీసీకి సంబంధించి ఎన్నో కేసులను వెలుగులోకి తీసుకువచ్చినట్టు మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. నాలుగేళ్ల కాలంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య 66.25 లక్షల నుంచి 1.28 కోట్లకు చేరుకున్నట్టు చెప్పారు. పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) 2020 నవంబర్ నుంచి పెద్ద ఎత్తున సోదాలు చేపట్టి నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ), రూ.29,000 కోట్ల జీఎస్టీ ఎగవేతలను గుర్తించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ చెప్పారు. జీఎస్టీ అమలులో ఎన్నో సవాళ్లను అధిగమించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయంలో పన్ను చెల్లింపుదారుల మద్దతు పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రాల మద్దతుతో జీఎస్టీలోకి పెట్రోలియం జీఎస్టీని ఎంతో అవసరమైన పన్నుల విధానంగా కేంద్ర ఉపరితల, ఎంఎస్ఎంఈ శాఖల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. జీఎస్టీ దినోత్సవం రోజున ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) నిర్వహించిన వెబినార్‌ను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. జీఎస్టీని ఇంకా మెరుగుపరచడానికి అవకాశాలున్నాయంటూ.. భాగస్వాముల మద్దతుతో ఈ పనిచేస్తామని చెప్పారు. సమాఖ్య దేశంలో పెట్రోలియం ఉత్పత్తులు, ఆల్కహాల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చేందుకు రాష్ట్రాల సమ్మతి అవసరమన్నారు. చదవండి: కరోనా కాలంలోనూ కరెంట్ ఖాతా మిగులు -
కొత్త ఇళ్లు కొనేవారికి కేంద్రం గుడ్ న్యూస్!
దేశవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా చాలా మంది బీద, మధ్య తరగతి ప్రజలతో పాటు పన్ను చెల్లింపుదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కొత్త ఇళ్లు కొనుగోలుచేయడానికి ఖర్చు చేసే పెట్టుబడిపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవడానికి గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. సాదారణంగా అయితే ఈ గడువు తేదీ జూన్ 30వ తేదీతో ముగియాల్సి ఉంది. కానీ, కేంద్ర ప్రభుత్వం కరోనా మహమ్మారి వల్ల తలెత్తిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోని గడువును పెంచింది. దీనికి సంబందించి కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 54, 54 జీబీ ప్రకారం మీరు మీ రెసిడెన్షియల్ ప్రాపర్టీని విక్రయిస్తే క్యాపిటల్ గెయిన్స్‌పై పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే ప్రాపర్టీ విక్రయం ద్వారా వచ్చిన డబ్బును మూడు సంవత్సరాల లోపు కొత్త ఇల్లు నిర్మించుకోవడానికి లేదా రెండు సంవత్సరాల లోపు కొత్త ఇంటిని కొనడానికి వాడాలి. అప్పుడే మీరు పెట్టుబడి పెట్టే నగదుపై పన్ను మినహాయింపు లభిస్తుంది. 2019 కేంద్ర బడ్జెట్ లో సెక్షన్ 54 కింద మూలధన లాభం పన్ను మినహాయింపును పెంచింది. పెట్టుబడి పెట్టె నగదు రూ.2 కోట్ల కంటే తక్కువగా ఉండాలి. అలాగే, పన్ను చెల్లింపుదారుడు ఈ అవకాశాన్ని ఒకసారి మాత్రమే వినియోగించుకోవచ్చు. చదవండి: త్వరలో మార్కెట్లోకి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు! -
పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్!
న్యూఢిల్లీ: వ్యాపార సంస్థలు ఇకపై డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ (డీఎస్సీ)తో పనిలేకుండా, కేవలం మొబైల్ వన్‌టైమ్ పాస్‌వర్డ్‌తో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు. పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్ర బోర్డ్ (సీబీఐసీ) ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు సీజీఎస్టీ నిబంధనలు, 2017 సవరణకు ఉద్దేశించిన సీజీఎస్టీ (రెండవ సవరణ) రూల్స్ 2021ని కేంద్రం నోటిఫై చేసినట్లు తెలిపింది. ‘‘కంపెనీల చట్టం, 2013 నిబంధనల ప్రకారం రిజిస్టరయిన వ్యక్తి 2021 ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 31వ తేదీ మధ్య ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ (ఈవీసీ) ద్వారా రిటర్న్స్ (జీఎస్టీఆర్-3బీ ఫామ్‌లో) ఫైల్ చేయవచ్చు. సరఫరాల (అవుట్‌వర్డ్, ఇన్వర్డ్) వివరాలను (జీఎస్టీఆర్-1 ఫామ్‌లో) తెలుసుకోవచ్చు’’ అని సీబీఐసీ పేర్కొంది. పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం నెలవారీ రిటర్న్స్ దాఖలు, పన్నుల చెల్లింపులకు సంబంధించి జీఎస్టీఆర్-3బీ ఫామ్‌పై సంబంధిత వ్యాపార ప్రతినిధి డిజిటల్ సిగ్నేచర్ అవసరం. స్థానిక లాక్డౌన్ల వల్ల కార్యాలయాలు మూసి ఉండడంతో డిజిటల్ సిగ్నేచర్ జనరేషన్, తద్వారా లావాదేవీలు క్లిష్టమైన వ్యవహారంగా మారింది. రిటర్న్స్ ఫైలింగ్‌లో దీనివల్ల తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో తాజా నిర్ణయం హర్షణీయమని ఏఎంజీఆర్ అండ్ అసోసియేట్స్ సీనియర్ పార్ట్నర్ రజిత్ మోహన్ పేర్కొన్నారు. డిజిటల్ సిగ్నేచర్ సర్టి ఫికెట్‌ను తీసుకోడానికి కార్యాలయాలను సందర్శించలేదని వందలాది మంది పన్ను చెల్లింపుదారులకు ఇది ప్రయోజనం చేకూర్చుతుందని తెలిపారు. ఎర్నెస్ట్ అండ్ యంగ్ ట్యాక్స్ పార్ట్నర్ అభిశేక్ జైన్ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. చదవండి: టెకీలకు ఊరట: వేతనంతో కూడిన సెలవులు -
పన్ను చెల్లింపుదారులకు కేంద్రం తీపికబురు
కేంద్ర ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు తీపికబురు అందించింది. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించే ప్రకటన చేసింది. వివాద్ సే విశ్వాస్ స్కీమ్ గడువును మరింత పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. వివాద్ సే విశ్వాస్ స్కీమ్ గడువును జూన్ 30 వరకు పొడిగించిది. కరోనా కారణంగా పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ట్యాక్స్‌పేయర్లు, ట్యాక్స్ కన్సల్టెంట్లు నుంచి గడవు పొడిగించాలని తమకు వినతులు వచ్చినట్లు సీబీడీటీ ఒక ప్రకటనలో వెల్లడించింది. సాధారణంగా వివాద్ సే విశ్వాస్ స్కీమ్ గడువు ఏప్రిల్ 30తో ముగియాల్సి ఉంది. ట్యాక్స్ పేయర్స్‌కు పన్ను అంశానికి సంబంధించి ఏమైనా వివాదాలు లేదా పాత బకాయిలు ఉంటే వాటన్నింటినీ ఈ స్కీమ్ కింద సెటిల్మెంట్ చేసుకోవచ్చు. ఒకేసారి కొంత మొత్తం చెల్లించి క్లియర్ చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల చాలా మందికి ఊరట కలగనుంది. చదవండి: ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లపై కేంద్రం కీలక నిర్ణయం -
పన్ను కట్టండి.. గవర్నర్‌తో ఛాయ్ తాగండి
న్యూఢిల్లీ : గవర్నర్‌తో కూర్చుని ఓ కప్పు కాఫీ తాగాలని ఉందా.. ఎయిర్‌పోర్టులో ప్రియారిటీ చెక్-ఇన్ చేయించుకోవాలని ఉందా, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సస్ కావాలని ఉందా.. అయితే పన్నులు సక్రమంగా కట్టండి. ఉత్తమమైన పన్ను చెల్లింపుదారులకు పలు రివార్డులను అందించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనిలో భాగంగా నిజాయితీ గల పన్ను చెల్లింపుదారులను ప్రభుత్వం గుర్తిస్తోంది. దీని కోసం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఈ స్కీమ్ కింద అర్హులయ్యే పన్ను చెల్లింపుదారులను గుర్తిస్తుందని సీబీడీటీ ఉన్నతాధికారులు చెప్పారు. ఎక్కువ మంది ఇన్కమ్-ట్యాక్స్ రిటర్నులను ఫైల్ చేయడానికి, నిజాయితీగా పన్నులు చెల్లించడానికి ఈ రివార్డు ప్రొగ్రామ్ అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో ఉన్న రివార్డు ప్రొగ్రామ్‌లను కమిటీ పరిశీలిస్తోంది. అయితే ఉత్తమమైన పన్ను చెల్లింపుదారుల్లో కేవలం, పన్నులు కట్టే ప్రక్రియనే మాత్రమే కాక, రిటర్నులను దాఖలు చేసే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోనున్నారు. అంతకముందు కూడా పన్ను చెల్లింపుదారుల కోసం సమ్మాన్ అనే స్కీమ్‌ను ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 2004 తర్వాత దీన్ని క్లోజ్ చేశారు. పలు దేశాల్లో ఉన్న రివార్డు ప్రొగ్రామ్‌లు... పలు దేశాల్లో నిజాయితీ గల పన్ను చెల్లింపుదారులకు రివార్డు ప్రొగ్రామ్‌లను అవలంభిస్తున్నాయి. చక్రవర్తితో ఫోటోలు తీసుకునే అవకాశాన్ని జపాన్ కల్పిస్తోంది. దక్షిణ కొరియా సర్టిఫికేట్లను, ఎయిర్‌పోర్టులో వీఐపీ రూమ్‌ల యాక్సస్‌ను, ఫ్రీ పార్కింగ్‌ను అందజేస్తుండగా.. పాకిస్తాన్ ప్రతేడాది టాప్ 100 పన్ను చెల్లింపుదారులకు ఎయిర్‌పోర్టుల్లో వీఐపీ లాంజ్‌ల యాక్సస్‌ను ఆఫర్ చేస్తోంది. ఇమ్మిగ్రేషన్ కౌంటర్లలో త్వరగా క్లియరెన్స్, ఉచిత పాస్‌పోర్టులను, బ్యాగేజీ అలవెన్స్‌ను అందిస్తోంది. ఇలా పలు దేశాల్లో పన్ను రివార్డుల స్కీమ్‌లు కొనసాగుతున్నాయి. తాజాగా మన దేశంలో కూడా ఉత్తమమైన పన్ను చెల్లింపుదారులను గుర్తించి, వారికి రివార్డులను అందించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. -
15 రోజుల్లోనే ట్యాక్స్ రీఫండ్?
న్యూఢిల్లీ : ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులు(ఐటీఆర్) దాఖలు చేసి, రీఫండ్ కోసం ఎదురు చూస్తున్న ఆదాయ పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. ఐటీఆర్ దరఖాస్తులను వేగంగా పరిశీలించి త్వరగా తిరిగి డబ్బు ఇచ్చేయాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ), ఆదాయ పన్ను శాఖను ఆదేశించింది. మీడియా రిపోర్టుల ప్రకారం ఇప్పటికే కొంతమంది పన్ను చెల్లింపుదారులకు, రిటర్నులు దాఖలు చేసి, ఈ-వైరిఫై చేపట్టిన అనంతరం 10 నుంచి 15 రోజుల్లో ట్యాక్స్ రీఫండ్స్ వచ్చేశాయని తెలిసింది. ఒకవేళ అంతా బాగుంటే.. పన్ను చెల్లింపుదారులందరికీ.. ఆదాయపన్ను రిటర్న్‌ల రీఫండ్స్ కేవలం 15 రోజుల్లోనే తిరిగి ఇవ్వాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఆదాయపన్ను రిటర్నుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు నిబంధనల ప్రకారం అన్ని పత్రాలు ఇస్తే, దరఖాస్తు పరిశీలనలో ఎలాంటి ఇబ్బందులు లేకుంటే పదిహేను రోజుల్లో ట్యాక్స్ రీఫండ్ ఇచ్చే విధానం త్వరలో రావొచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. రిటర్నుల ఈ-వెరిఫికేషన్ పూర్తికాకుంటే పన్ను చెల్లింపుదారులకు రీఫండ్ ఆలస్యం అవుతుందని తెలిపాయి. అయితే ప్రస్తుతం ఐటీ రిటర్నుల రీఫండ్‌కు నిర్దిష్ట గడువంటూ ఏమీలేదు. దాంతో ట్యాక్స్ రీఫండ్‌కు రెండు వారాల నుంచి రెండు నెలల వరకు సమయం పడుతుంది. ఇది కూడా పన్ను రిటర్నుల దాఖలు బట్టి ఉంటుంది. 15 రోజుల్లో పన్ను రీఫండ్స్ చేయడం సాధ్యమనే తెలుస్తోంది. పన్ను చెల్లింపుదారుల ట్యాక్స్ రీఫండ్‌ను ట్యాక్స్ డిపార్మెంటే ఆమోదించాల్సి ఉంటుంది. ఐటీ డిపార్ట్మెంట్ ఆమోదం తర్వాత చివరికి పన్ను చెల్లింపుదారు బ్యాంకు ఖాతాలోకి చెల్లించిన మొత్తంతో పాటు వడ్డీ కూడా వాపసు అవుతుంది. రీఫరెన్స్ నెంబర్‌తో పన్ను చెల్లింపుదారులు, తమ ట్యాక్స్ రీఫండ్‌ను మానిటర్ చేసుకోవచ్చు. -
జీఎస్టీ తొలి బర్త్‌డే : పన్ను చెల్లింపుదారులు జంప్
న్యూఢిల్లీ : దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పన్ను విధానం జీఎస్టీ అమలు అయి రేపటికి(జూలై 1) ఏడాది పూర్తవుతోంది. ఈ సందర్భంగా తొలి వార్షికోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. జీఎస్టీని ఎంతో విజయవంతంగా అమలు చేస్తున్నామని.. భారత ఆర్థిక వ్యవస్థకు ఇది పలు ప్రయోజనాలను చేకూర్చుతుందని కేంద్ర చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం చెప్పిన మేరకే జీఎస్టీ అమల్లోకి వచ్చాక పన్ను చెల్లింపుదారులు కూడా భారీగా పెరిగారు. జీఎస్టీ అమల్లోకి వచ్చే నాటికి 63.76 లక్షలుగా ఉన్న పన్ను చెల్లింపుదారులు, ఇప్పటికి 1.12 కోట్లకు చేరుకున్నారని తెలిసింది. యాక్టివ్ పన్ను చెల్లింపుదారులు విపరీతంగా పెరగడం, అధికారిక రంగంలో మరిన్ని వ్యాపారాలు చేరాయని, ఆర్థిక వ్యవస్థలో అధికారీకరణ పెరుగుతుందనే దానికి సంకేతమని ఆర్థిక వేత్తలంటున్నారు. కొత్త పన్ను విధానంలో ఐటీ ఇన్‌ఫ్రాక్ట్ర్చర్ చాలా బాగుందని, యూజర్ అనుభవాన్ని, ఇంటర్ఫేస్ను మరింత మెరుగుపరచడానికి మరిన్ని చర్యలు తీసుకోనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ‘ప్రతి నెలా కోట్ల రూపాయల రిటర్నులు దాఖలవుతూ.. జీఎస్టీ విధానం ఎంతో విజయవంతంగా అమలవుతుండటం ఎంతో ఆనందదాయకం. తొలి ఏడాదిలోనే నెలకు సుమారు రూ.90 వేల కోట్ల సగటు రెవెన్యూలను ఇది ఆర్జించింది. ఏప్రిల్‌లో లక్ష కోట్లను ఇది అధిగమించింది. ఇప్పటి వరకు 12 కోట్ల రిటర్నులు దాఖలు అయ్యాయి. 380 కోట్ల ఇన్వాయిస్లు ప్రాసెస్ అయ్యాయి. 1,12,15,693 మంది పన్నుచెల్లింపుదారులు జీఎస్టీ సిస్టమ్‌లో నమోదయ్యారు. వీరిలో 63,76.967 మంది ముందస్తు పన్ను విధానం నుంచి ఈ కొత్త విధానంలోకి రాగ, మిగతా 48,38,726 మంది కొత్తగా పన్ను విధానంలోకి ప్రవేశించారు. పన్ను చెల్లింపుదారుల సంఖ్యను అంతకంతకు ఇది పెంచుతుంది‘ అని జీఎస్టీఎన్ చైర్మన్ ఏబీ పాండే తెలిపారు. యూజర్ ఇంటర్ఫేస్ను మెరుగుపరచడం, ఫైలింగ్‌ను సులభతరం చేయడం, తప్పుడు మెసేజ్‌లను అదుపులో ఉంచడం వంటి జీఎస్టీ విధానాన్ని మరింత విజయవంతంగా అమలయ్యేలా చేస్తున్నాయని చెప్పారు. -
రాత్రి 8 గంటల వరకు బ్యాంకులు
ముంబై : పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యం కోసం బ్యాంకింగ్ రెగ్యులేటరీ రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. రేపు(మార్చి 31న) బ్యాంకులు రాత్రి 8 గంటల వరకు పనిచేయనున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. బ్యాంకులతో పాటు అన్ని ఆర్బీఐ శాఖల కార్యాలయాలు కూడా రేపు రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటాయని పేర్కొంది. అంతేకాక శనివారం అర్ధరాత్రి వరకు డిజిటల్ లావాదేవీలు చేసుకోవచ్చని తెలిపింది. రేపటితో ఈ 2017-18 ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. అంతేగాక ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు రేపే ఆఖరి తేదీ కావడంతో బ్యాంకుల సమయాన్ని పెంచినట్లు ఆర్బీఐ వెల్లడించింది. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు కూడా పేర్కొంది. ఇక ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ వంటి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ సేవలు కూడా శనివారం అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. కాగా ఏప్రిల్ 2న బ్యాంకులు సెలవు పాటించనున్నట్టు ఆర్బీఐ పేర్కొంది. -
ట్యాక్స్ పేయర్లకు గుడ్‌న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ : పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం 2018 బడ్జెట్లో గుడ్‌న్యూస్ చెప్పబోతుంది. పాపులర్ ''సెక్షన్ 80సీ'' స్కీమ్ కింద పెట్టుబడుల పరిమితిని ఏడాదికి రూ.2,00,000లకు పెంచాలని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ నిర్ణయిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో రూ.2 లక్షల వరకున్న బ్యాంకు డిపాజిట్లు, ఇన్సూరెన్స్ ప్రీమియం, మ్యూచువల్ ఫండ్స్ వంటి పెట్టుబడులకు పన్ను చెల్లించవసరం లేదు. ఇప్పటి వరకున్న నిబంధన ప్రకారం ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీ కింద ప్రాఫిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్, ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లు, పిల్లల ట్యూషన్ ఫీజు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, స్పెషిఫిక్ మ్యూచవల్ ఫండ్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో పెట్టుబడి పెట్టే మొత్తంలో రూ.1,50,000 వరకు పన్ను మినహాయింపు ఉంది. ఒకవేళ ఇది కనుక అమలైతే, ఫైనాన్సియల్ ఇన్స్ట్రుమెంట్లలో ప్రజలు పొదుపు చేయడం పెరుగుతుందని తెలిసింది. ఈ పన్ను మినహాయింపును పెంచిన అనంతరం ఒకవేళ మీ స్థూల వార్షికాదాయం రూ.10 లక్షలుంటే, దానిలో సెక్షన్ 80సీ కింద ఇన్స్ట్రుమెంట్లలో పెట్టే పెట్టుబడులు రూ.2 లక్షలుంటే, కేవలం రూ.8 లక్షలకు మాత్రమే మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతమున్న రూ.1.5 లక్షల పరిమితి 2014-15 నుంచి కొనసాగుతూ వస్తోంది. జైట్లీ తన తొలి బడ్జెట్ 204-15లోనే ఈ పరిమితిని రూ.50వేల నుంచి లక్షన్నరకు పెంచారు. ప్రస్తుతం మరోసారి ఈ పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలని అరుణ్ జైట్లీ యోచిస్తున్నారు. ఇటీవల బ్యాంకుల టాప్ ఎగ్జిక్యూటివ్‌లు, ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూషన్లతో అరుణ్‌జైట్లీ నిర్వహించిన మీటింగ్‌లో దీనిపై చర్చించినట్టు తెలిసింది. -
జరిమానాలు రద్దు, అకౌంట్లలోకి డబ్బులు
సాక్షి, న్యూఢిల్లీ : ఆగస్టు, సెప్టెంబర్ నెలకు సంబంధించిన జీఎస్టీ రిటర్నులను ఆలస్యంగా దాఖలు చేసినందుకు విధించిన జరిమానాలను ప్రభుత్వం మాఫీ చేసింది. పెనాల్టీని రద్దు చేస్తున్న విషయాన్ని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించి జీఎస్టీఆర్-3బీ ఫైలింగ్ ఆలస్యంపై విధించిన ఫీజులను రద్దు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే బిజినెస్‌లపై విధించిన ఆలస్య ఛార్జీలను, తిరిగి పన్ను చెల్లింపుదారుల అకౌంట్లలోకి వేయనున్నట్టు పేర్కొన్నారు. జీఎస్టీ పాలన కింద జూలై నెల రిటర్నులపై విధించిన ఆలస్య ఫీజులను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. 3బీ రిటర్నుల ఆలస్యానికి విధిస్తున్న పెనాల్టీను రద్దు చేయాలని వ్యాపార వర్గాలు డిమాండ్ చేసిన క్రమంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ డేటా ప్రకారం జూలై నెలలో 55.87 లక్షల జీఎస్టీఆర్-3బీ రిటర్నులు దాఖలు కాగ, ఆగస్టు నెలలో 51.37 లక్షల రిటర్నులు, సెప్టెంబర్‌లో 42 లక్షలకు పైగా రిటర్నులు దాఖలయ్యాయి. తుది గడువు పూర్తి అయిన తర్వాత పెద్ద మొత్తంలో వ్యాపారస్తులు తమ రిటర్నులు ఫైల్ చేస్తున్నట్టు జీఎస్టీఎన్ నెట్వర్క్ డేటాలో తెలిసింది. జూలై నెలకు సంబంధించి తుది గడువుకి కేవలం 33.98 లక్షల రిటర్నులు మాత్రమే దాఖలయ్యాయని, తర్వాత ఈ సంఖ్య 55.87 లక్షలకు పెరిగినట్టు వెల్లడైంది. అదేవిధంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలలో కూడా ఉంది. రిటర్నులను ఆలస్యంగా దాఖలు చేస్తున్న వారిపై కేంద్ర జీఎస్టీ కింద రోజుకు రూ.100, అంతేమొత్తంలో రాష్ట్ర జీఎస్టీ ఫీజును విధిస్తున్నారు. -
ఎంత ఆదాయముంటే.. ఎంత పన్ను?
బడ్జెట్లో పన్ను రేట్లపై వేతన జీవులకు జైట్లీ కొంత ఊరటనిచ్చారు. రూ.2.5 లక్షల వరకు ఉన్న పరిమితిని యథాతథంగానే ఉంచినా, 2.5 లక్షల నుంచి 5లక్షల వరకు 5% పన్ను మాత్రమే విధిస్తామన్నారు. ఇంతకుముందు ఇది 10 శాతంగా ఉండేది. ఇక ఎంత ఆదాయముంటే.. ఎంత పన్ను పడుతుందో లెక్కించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. వివిధ ఆదాయపు స్థాయిల్లో ఉన్నవారు తామెంత పన్ను చెల్లించాలో ఓ సారి చూసుకోండి.... రూ.3.5 లక్షల స్థూల వార్షిక ఆదాయం ఆర్జించే వారికి పన్ను ఎంత ? ఏడాదికి పన్ను వర్తించే ఆదాయం : రూ.3,50,000 ప్రాథమిక మినహాయింపు పరిమితి : రూ.2,50,000 నికర పన్ను ఆదాయం : రూ.1,00,000 పన్ను : రూ.5,000 రాయితీ : రూ.2,500 రాయితీ తర్వాత పన్ను : రూ.2,500 సర్ఛార్జ్ : నిల్ సెస్ : రూ.75 ప్రస్తుతం మొత్తంగా చెల్లించాల్సిన పన్ను : రూ.2,575 బడ్జెట్ ముందు వరకు మొత్తంగా చెల్లిస్తున్న పన్ను : రూ.5,150 బడ్జెట్ ముందు పన్నుకి బడ్జెట్ తర్వాత పన్నుకి మధ్య లభించిన పొదుపు : రూ.2,575 రూ.24 లక్షల స్థూల వార్షిక ఆదాయం ఆర్జించే వారు చెల్లించాల్సిన పన్ను: ఏడాదికి పన్ను వర్తించే ఆదాయం : రూ.24,00,000 ప్రాథమిక మినహాయింపు పరిమితి : రూ.2,50,000 నికర పన్ను ఆదాయం : రూ.21,50,000 పన్ను : రూ.5,45,000 రాయితీ : రూ.12,500 రాయితీ తర్వాత పన్ను : రూ.5,32,500 సర్ఛార్జ్ : నిల్ సెస్ : రూ.15,975 ప్రస్తుతం మొత్తంగా చెల్లించాల్సిన పన్ను : రూ.5,48,475 బడ్జెట్ ముందు వరకు చెల్లిస్తున్న పన్ను : రూ.5,61,350 బడ్జెట్ ముందు పన్నుకి బడ్జెట్ తర్వాత పన్నుకి మధ్య లభించిన పొదుపు : రూ.12,875 రూ.60 లక్షల స్థూల వార్షిక ఆదాయం ఆర్జించే వారు చెల్లించాల్సిన పన్ను: ఏడాదికి పన్ను వర్తించే ఆదాయం : రూ.60,00,000 ప్రాథమిక మినహాయింపు పరిమితి : రూ.2,50,000 నికర పన్ను ఆదాయం : రూ.57,50,000 పన్ను : రూ.16,25,000 రాయితీ : రూ.12,500 రాయితీ తర్వాత పన్ను : రూ.16,12,500 సర్ఛార్జ్ : రూ.1,61,250 సెస్ : రూ.53,213 ప్రస్తుతం మొత్తంగా చెల్లించాల్సిన పన్ను : రూ.18,26,963 బడ్జెట్ ముందు వరకు చెల్లిస్తున్న పన్ను : రూ.16,73,750 బడ్జెట్ ముందు పన్నుకి బడ్జెట్ తర్వాత పన్నుకి మధ్య లభించిన పొదుపు : -రూ.1,53,212 రూ.1.1 కోటి స్థూల వార్షిక ఆదాయం ఆర్జించే వారు చెల్లించాల్సిన పన్ను: ఏడాదికి పన్ను వర్తించే ఆదాయం : రూ.1,10,00,000 ప్రాథమిక మినహాయింపు పరిమితి : రూ.2,50,000 నికర పన్ను ఆదాయం : రూ.1,07,50,000 పన్ను : రూ.31,25,000 రాయితీ : రూ.12,500 రాయితీ తర్వాత పన్ను : రూ.31,12,500 సర్ఛార్జ్ : రూ.4,66,875 సెస్ : రూ.1,07,381 ప్రస్తుతం మొత్తంగా చెల్లించాల్సిన పన్ను : రూ.36,86,756 బడ్జెట్ ముందు వరకు చెల్లిస్తున్న పన్ను : రూ.37,01,562 బడ్జెట్ ముందు పన్నుకి బడ్జెట్ తర్వాత పన్నుకి మధ్య లభించిన పొదుపు : రూ.14,806 -
ట్యాక్స్ పేయర్స్‌కు ఎల్లప్పుడూ గౌరవం
ఇన్‌కంట్యాక్స్ శాఖ జాయింట్ కమిషనర్ కేసీ దాసు వినుకొండ టౌన్: ట్యాక్స్ పేయర్స్‌ను ఎల్లప్పుడూ ఇన్‌కంటాక్స్ శాఖ గౌరవంగా చూస్తుందని ఇన్‌కంటాక్స్ శాఖ జాయింట్ కమిషనర్ కేసీ దాసు అన్నారు. ఫెర్టిలైజర్స్ కల్యాణ మండపంలో ఇన్‌కంటాక్స్ శాఖ ఆధ్వర్యంలో డాల్‌మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పెండ్యాల పుల్లారావు అధ్యక్షతన ఆదాయ వెల్లడి పథకం–2016పై అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. దాసు మాట్లాడుతూ ఆదాయ వెల్లడి పథకాన్ని టాక్స్ పేయర్స్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాన్ నంబర్‌తో తమ ఖాతాలను జాయింట్ చేసుకోవాలన్నారు. ఆదాయ వెల్లడి పథకం–2016 వ్యాపారుల పాలిట వరమన్నారు. అనంతరం డాల్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేసీ దాసును సత్కరించారు. కార్యక్రమంలో ఇన్‌కంటాక్స్ అధికారి కామరాజు, ఇన్‌కంటాక్స్ ఇన్స్పెక్టర్లు రామచంద్రరావు, అన్నపూర్ణ, ఇమ్మడిశెట్టి నాగేశ్వరరావు, ఎస్వీజే సుబ్బారావు, ఆడిటర్స్, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు. -
ఖరీదైన కారు కొంటే...ఐటీ కంట్లో పడినట్లే
న్యూఢిల్లీ: పన్ను పరిధిని పెంచడంతో పాటు అప్రకటిత ఆదాయానికి చెక్ పెట్టేందుకు ఆదాయ పన్ను (ఐటీ) విభాగం కొత్త వ్యూహాన్ని రూపొందించింది. ఆర్థికంగా వృద్ధిచెందుతున్న కొన్ని నగరాల్లో లగ్జరీ కార్ల కొనుగోలు, పెట్టుబడులపై వడ్డీ, వ్యక్తిగత వ్యయం, ఆస్తుల అమ్మకం ద్వారా వచ్చే మూలధన రాబడి (క్యాపిటల్ గెయిన్స్) తదితర లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించనుంది. బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, పుణే, కొచ్చి, లక్నో, భోపాల్, గువాహటిల్లో ఈ మేరకు పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాల్సిందిగా నిఘా, నేర పరిశోధన కార్యాలయం(డీఐసీఐ)ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఆదేశించింది. గువాహటిలో షాపింగ్ మాల్స్, ఇతర మార్కెట్లలో భారీగా చేసే వ్యక్తిగత ఖర్చులను, విద్యాసంస్థలకు చేసే చెల్లింపులను, భవనాల కొనుగోళ్లను అధికారులు విశ్లేషించనున్నారు. బెంగళూరులో కార్పొరేట్ బాండ్లు, సహకార రుణ సంఘాలు, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో పెట్టుబడులపై వ్యక్తులకు వచ్చే వడ్డీని అక్కడి ఐటీ అధికారులు పరిశీలించనున్నారు. తమిళనాడులో ఇసుక తవ్వకం, కలప దిగుమతుల్లోకి వచ్చే పెట్టుబడులపై చెన్నైలోని ఐటీ ఉద్యోగులు ఆరా తీయనున్నారు. ఇటీవల న్యూఢిల్లీలో రెండు రోజులపాటు జరిగిన సీబీడీటీ, ఐటీ ఉన్నతాధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఐటీ ఈమెయిల్ ఐడీని భద్రంగా ఉంచుకోండి.. ఐటీ రిటర్నుల ఆన్లైన్ ఫైలింగ్ కోసం ట్యాక్స్‌పేయర్ల ఈమెయిల్ ఐడీలు, మొబైల్ ఫోన్ నంబర్లను ఇప్పటికే కోరిన ఐటీ విభాగం తాజాగా తమ ఈమెయిల్ ఐడీని సేఫ్ లిస్ట్‌లో భద్రపర్చుకోవాలని సూచించింది. పన్ను చెల్లింపుదారులు తమ ఇన్‌బాక్స్‌లోని వైట్/సేఫ్ లిస్ట్‌లో donotreply @incometax indiaefiling.gov.in అనే ఐడీని ఉంచాలనీ, తద్వారా స్పామ్, జంక్ ఫోల్డర్లోకి వెళ్లకుండా చూసుకోవాలనీ కోరింది. దీనివల్ల తాము పంపే మెయిళ్లు స్పామ్, జంక్ ఫోల్డర్లోకి వెళ్లకుండా ఉంటాయని తెలిపింది.