పన్ను చెల్లింపుదారులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌ను అందించింది. ఐటీఆర్ ఫైలింగ్ చేసే వారి కోసం ఎస్‌బీఐ సరికొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది. ఎస్‌బీఐ యోనో యాప్‌లోని ట్యాక్స్2విన్ ఆప్షన్‌ను ఉపయోగించి ఆదాయపు పన్ను దాఖలు చేసే సౌకర్యాన్ని ఎస్‌బీఐ తీసుకొచ్చింది. టాక్స్ పేయర్లకు ఇకపై ఎస్‌బీఐ ఖాతాదారులకు ఐటీఆర్ ఫైలింగ్ మరింత ఈజీ కానుంది. ఈ సదుపాయంతో టాక్స్ పేయర్స్ ఉచితంగానే ఆదాయపు పన్ను దాఖలు చేయవచ్చును.
యోనో యాప్ ద్వారా ఐటీఆర్ దాఖలుకు కావలసిన పత్రాలు ఇవే...!
1. పాన్ కార్డ్
2. ఆధార్ కార్డ్
3. ఫారం-16
4. పన్ను మినహాయింపు వివరాలు
5. ఇంట్రస్ట్ ఇన్‌కమ్ సర్టిఫికెట్లు
6. ఇన్వెస్ట్‌మెంట్ ప్రూఫ్ ఫర్ టాక్స్ సేవింగ్
ఐటీఆర్ ఫైలింగ్ యోనో యాప్‌లో ఇలా చేయండి..
- మీ స్మార్ట్‌ఫోన్‌లో ఎస్‌బీఐ యోనో యాప్‌లో లాగిన్ అవ్వాలి.
- తరువాత ‘షాప్స్ అండ్ ఆర్డర్స్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- ‘ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్’ సెలక్ట్ చేయాలి.
- అక్కడ మీకు కనిపించే ‘ట్యాక్స్2విన్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- ఇక్కడ ఐటీఆర్‌కు సంబంధించిన సమాచారం మొత్తం అందుబాటులో ఉంటుంది.
- ఆయా స్టెప్స్‌ను ఫాలో అవుతూ ఐటీఆర్ సులభంగా దాఖలు చేయొచ్చు.
చదవండి: 11 ఏళ్లకు అంతా ఉల్టా పల్టా? ఫేస్‌బుక్ డిలీట్ అంటూ కవర్ పేజీ
Comments
Please login to add a commentAdd a comment