భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI)కు చెందిన యోనో (YONO) యాప్ సేవలు బుధవారం కొద్దిసేపు నిలిచిపోయాయి. జనవరి 10న ఉదయం 10:30 గంటల వరకు యోనో యాప్ సేవలు అందుబాటులో ఉండవని ఎస్‌బీఐ స్వయంగా కస్టమర్లకు తెలియజేసింది.
ఈ మేరకు ఎస్‌బీఐ ‘ఎక్స్’ (ట్విటర్)లో బుధవారం ఉదయం 10 గంటల సమయంలో ఓ పోస్టు చేసింది. "సాంకేతిక సమస్యల కారణంగా, యోనో సేవలు 2024 జనవరి 10న ఉదయం 10:30 గంటల వరకు అందుబాటులో ఉండవు. ఈ సమయంలో యోనో లైట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ వంటి మా ఇతర డిజిటల్ ఛానెల్‌లు అందుబాటులో ఉంటాయి" అని ఎస్‌బీఐ పేర్కొంది. కాగా బుధవారం ఉదయం 10.30 గంటల తర్వాత ఎస్‌బీఐ యోనో యాప్ సేవలు తిరిగి పునరుద్ధరించినట్లుగా తెలిసింది.
— State Bank of India (@TheOfficialSBI) January 10, 2024
Comments
Please login to add a commentAdd a comment