ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఎస్‌బీఐ ఖాతాదారులు బ్యాంక్ కార్యకలాపాల్ని మరింత సులభతరం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. 45 కోట్ల మంది ఖాతాదారులు, 22వేల బ్రాంచీలు, 71,617 ఆటోమెటిక్ డిపాజిట్ మెషిన్లు, విత్‌డ్రా మెషిన్లు, 62617 ఏటీఎం సెంటర్ల నుంచి సేవల్ని అందిస్తుంది. ఇప్పుడా ఖాతాదారుల సంఖ్యను పెంచేలా బ్యాంక్ సేవల్ని మరింత సులభతరం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.
ఇప్పటికే అకౌంట్ హోల్డర్లు పలు రకాల సేవల్ని ఆన్‌లైన్‌లో ఇంటి వద్ద నుంచి చేసుకునే వెసలుబాటు కల్పించింది. వాటిలో అతి ముఖ్యమైంది బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్‌ను ఒక బ్రాంచ్ నుంచి మరో బ్రాంచ్‌కు.. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చుకునేందుకు గంటల తరబడి క్యూలైన్‌లలో నిల్చొని వ్యయప్రయాసలు ఎదుర్కొవాల్సి వచ్చింది.
ఆ సమస్యల్ని తగ్గించేలా ఆన్‌లైన్‌లో అకౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం కల్పించ్చింది. అయితే ఇప్పుడు మనం ఇంట్లో కూర్చొని అకౌంట్ నుంచి ఎలా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చో తెలుసుకుందాం. ఇందుకు కోసం బ్యాంక్ విధించిన నిబంధనలకు లోబడి కేవైసీ, ఇతర వ్యక్తిగత వివరాలు తప్పనిసరిగా ఉండాలి. ఆ వివరాలు అందుబాటులో లేక పోతే అకౌంట్‌ను మార్చుకోలేం.
చదవండి👉 ఈ ఉద్యోగాలు చేస్తున్నారా? అయితే వేరే జాబ్ చూసుకోవడం మంచిదంట?
ఎస్‌బీఐ అకౌంట్‌ను ఇలా ట్రాన్స్‌ఫర్ చేసుకోండిలా
♦ ముందుగా ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ ఆన్‌లైన్ ఎస్‌బీఐ. కామ్‌లో లాగిన్ అవ్వాలి
♦అందులో పర్సనల్ బ్యాంకింగ్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై మనం ట్యాప్ చేయాలి.
♦ట్యాప్ చేసి యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి
♦అనంతరం ఈ- సర్వీస్ ట్యాబ్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
♦క్లిక్ చేస్తే స్క్రిన్‌పైన ట్రాన్స్‌ఫర్ సేవింగ్ అకౌంట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌పై ట్యాప్ చేసి మీరు ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్న అకౌంట్ నెంబర్‌పై క్లిక్ చేయాలి.
♦అక్కడ మీరు ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్న బ్యాంక్ ఐఎఫ్‌ఎస్ కోడ్‌ను ఎంటర్ చేయాలి
♦ఇతర వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేసిన తర్వాత కన్ఫామ్ బటన్‌పై ట్యాప్ చేయాలి.
♦అనంతరం మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి మరోసారి కన్ఫామ్ చేయాలి
♦ ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేసిన కొన్ని రోజులకు మీరు ఎక్కడికైతే బ్యాంక్ అకౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేశారో అక్కడి నుంచి బ్యాంక్ అకౌంట్ సేవలు ప్రారంభమవుతాయి.
ఎస్‌బీఐ యోనో యాప్ నుంచి సైతం
ఒకవేళ మీరు ఇలా కాకుండా ఎస్‌బీఐ యోనో యాప్ నుంచి బ్యాంక్ ఖాతాను మార్చుకోవచ్చు. ఇలా మార్చుకోవాలంటే మీరు తప్పని సరిగా బ్యాంక్ అకౌంట్‌కు రిజిస్టర్ మొబైల్ నెంబర్ జత చేయాల్సి ఉంటుంది.
If you need help in transferring your account from one branch to another, then SBI has got your back.
— State Bank of India (@TheOfficialSBI) May 7, 2021
Use YONO SBI, YONO Lite and OnlineSBI from the comfort of your homes and bank safe.#SBIAapkeSaath #StayStrongIndia #YONOSBI #YONOLite #OnlineSBI #BankSafe pic.twitter.com/WlW8bb8aBG
చదవండి👉 వేలకోట్ల బ్యాంక్‌ను ముంచేసి..భార్యతో పారిపోయిన సీఈవో!
Comments
Please login to add a commentAdd a comment