డెబిట్ కార్డు పోయిందా? సింపుల్‌గా ఇలా బ్లాక్ చేయండి! | Easy Steps for SBI Debit card online black | Sakshi
Sakshi News home page

SBI: డెబిట్ కార్డు పోయిందా? సింపుల్‌గా ఇలా బ్లాక్ చేయండి!

Published Thu, Jun 29 2023 3:56 PM | Last Updated on Thu, Jun 29 2023 4:16 PM

Easy Steps for SBI Debit card online black - Sakshi

State Bank of India: కొన్ని సందర్భాల్లో అనుకోకుండా ఏటీఎమ్ కార్డు లేదా డెబిట్ కార్డు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో చాలా మంది కంగారు పడతారు. కానీ డెబిట్ కార్డు పోగొట్టుకుంటే ఏ మాత్రం గాబరా పడకుండా.. సింపుల్‌గా బ్లాక్ చేయవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

(ఇదీ చదవండి: హైలక్స్ కొనుగోలుపై బంపర్ ఆఫర్.. మిస్ చేసుకుంటే మళ్ళీ రాదేమో!)

  • మీరు పోగొట్టుకున్నది స్టేట్ బ్యాంక్ ఏటీఎమ్ కార్డు అయితే.. ముందుగా స్టేట్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
  • వెబ్‌సైట్‌ ఓపెన్ చేసి అక్కడ బ్లాక్ ది కార్డ్‌పై క్లిక్ చేయాలి.
  • డెబిట్ కార్డును ఆన్‌లైన్‌ నుంచి బ్లాక్ చేయాలనుకుంటే తప్పకుండా మీ అకౌంట్ నెంబర్‌కి.. మీ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి.
  • మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, కంట్రీ, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి.. క్యాప్చా ఫిల్ చేయాలి. ఇవన్నీ పూర్తయిన తరువాత సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.
  • క్లిక్ చేసిన తరువాత మీ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది.
  • ఓటీపీ నెంబర్ ఎంటర్ చేసి తరువాత మీ పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంట్స్ అన్నీ డిస్‌ప్లే అవుతాయి.
  • అందులో ఏ కార్డునైతే బ్లాక్ చేయాలనుకుంటారో.. అక్కడ కనిపించే నుంబర్లలో సెలక్ట్ చేసుకుని సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.
  • ఒక సారి కార్డుని బ్లాక్ చేసిన తరువాత దానిని తిరిగి ఆన్‌లైన్‌లో అన్‌బ్లాక్ చేయడం సాధ్యం కాదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement