debit card
-
కోటక్ బ్యాంకు అలెర్ట్.. ‘డెబిట్ కార్డులు పని చేయవు’
కోటక్ మహీంద్రా బ్యాంక్ తన బ్యాంకింగ్ వ్యవస్థను మెరుగుపరిచే లక్ష్యంతో మెయింటెనెన్స్ సర్వీసులపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపింది. దాంతో కొన్ని బ్యాంకింగ్ సేవలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. కోటక్ వీసా డెబిట్ కార్డు, స్పెండ్జ్ కార్డుకు సంబంధించిన సేవలు కొంత సమయంపాటు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. ఈ మెయింటెనెన్స్ సర్వీసులకు సంబంధించి బ్యాంక్ తన ఖాతాదారులకు ఇప్పటికే ఈమెయిల్ ద్వారా సమాచారం అందించింది. సేవల్లో అసౌకర్యాన్ని నివారించడానికి తదనుగుణంగా వారి లావాదేవీలను ప్లాన్ చేసుకోవాలని వినియోగదారులకు సూచించింది.ఇదీ చదవండి: ఇండిగోకు రూ.115.86 కోట్ల జరిమానాఅంతరాయం ఎప్పుడంటే..ఫిబ్రవరి 5, 2025, ఫిబ్రవరి 12, 2025న రెండు రోజుల్లో తెల్లవారుజామున 1:00 గంటల నుంచి ఉదయం 5:00 గంటల వరకు నిర్వహణ కార్యకలాపాలు జరుగుతాయని బ్యాంకు పేర్కొంది. ఇన్‌స్టోర్ పీఓఎస్ లావాదేవీలు, ఆన్లైన్ లావాదేవీలు, అంతర్జాతీయ ఏటీఎం ఉపసంహరణలు వంటి సేవలు కోటక్ వీసా డెబిట్ కార్డ్, స్పెండ్జ్ కార్డ్ వినియోగదారులకు అందుబాటులో ఉండవని వివరించింది. యూపీఐ, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి ఇతర బ్యాంకింగ్ సేవలపై ప్రభావం ఉండదని బ్యాంక్ తెలిపింది. అంతరాయంలేని బ్యాంకింగ్ అనుభవాన్ని అందించడానికి ఈ మెయింటెనెన్స్ అవసరమని ఖాతాదారులకు బ్యాంక్ హామీ ఇచ్చింది. -
ఏటీఎం కార్డు వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయా?
బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ.. దాదాపు 'ఏటీఎం' (ATM) కార్డు (డెబిట్ కార్డు) ఉంటుంది. ఏటీఎం అనేది కేవలం డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. ఇతర కార్యకలాపాల కోసం కూడా ఉపయోగించవచ్చు. ఈ కథనంలో వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.బ్యాలెన్స్ ఎంక్వైరీ: ఏటీఎం కార్డు ఉపయోగించే మీరు బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేకుండానే.. ఖాతాలో బ్యాలెన్స్ ఎంత ఉందనే విషయం తెలుసుకోవచ్చు. అంతే కాకుండా లావాదేవీలకు సంబంధించిన మినీ స్టేట్మెంట్ కూడా తీసుకోవచ్చు.ఫండ్ ట్రాన్స్ఫర్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ప్రకారం.. మీరు డెబిట్ కార్డును ఉపయోగించి, ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు రోజుకు రూ. 40,000 ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీనికి ఎస్బీఐ ఎలాంటి ఛార్జెస్ విధించదు.క్రెడిట్ కార్డ్ చెల్లింపు: క్రెడిట్ కార్డ్ చెల్లింపులను కూడా ఏటీఏం ద్వారా చెల్లించవచ్చు. దీనికి మీ డెబిట్ కార్డు, పిన్ నెంబర్ వంటివి అవసరమవుతాయి.బీమా ప్రీమియం చెల్లింపు: ఏటీఎం ఉపయోగించి బీమా ప్రీమియంలను చెల్లించవచ్చు. ఎల్ఐసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్ వంటివి బ్యాంకులతో టై-అప్‌లను కలిగి ఉన్నాయి. కాబట్టి ఏటీఎంలోనే ప్రీమియం చెల్లించవచ్చు.చెక్‌బుక్ రిక్వెస్ట్: చెక్ లీఫ్లు అయిపోయినా చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఇప్పుడు ఏటీఎం వీడరనే కొత్త చెక్‌బుక్ కోసం రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. చిరునామా అక్కడ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఆ చిరునామాకే చెక్‌బుక్ (Checkbook) వస్తుంది.బిల్ పేమెంట్స్: ఏటీఎం ద్వారా యుటిలిటీ బిల్లులను చెల్లించవచ్చు. అయితే ముందుగా బిల్లింగ్ కంపెనీ ఏటీఎం నెట్వర్క్కి లింక్ చేయబడిందో లేదో చెక్ చేసుకోవాలి. డబ్బు పంపే ముందు, బ్యాంకు వెబ్సైట్లో చెల్లింపుదారు వివరాలను నమోదు చేసుకోవాలి.మొబైల్ బ్యాంకింగ్ యాక్టివేషన్: బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తరువాత మొబైల్ బ్యాంకింగ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటివి యాక్టివేట్ చేస్తారు. అయితే మీరు ఏటీఎం ఉపయోగించి కూడా మొబైల్ బ్యాంకింగ్ యాక్టివేట్ చేసుకోవచ్చు లేదా డీయాక్టివేట్ చేసుకోవచ్చు.ఏటీఎం పిన్ చేంజ్: ఏటీఎం ఉపయోగించే.. పిన్ నెంబర్ మార్చుకోవచ్చు. అనుమానం వచ్చినప్పుడు ఏటీఎం పిన్ నెంబర్ మార్చుకోవడం మంచిది. కాబట్టి బ్యాంకుకు వెళ్లకుండానే.. ఏటీఎంలోనే పిన్ నెంబర్ మార్చుకోవచ్చు. -
అక్టోబర్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం!
సెప్టెంబర్ ముగుస్తోంది.. అక్టోబర్ నెల మొదలవడానికి మరికొన్ని రోజుల మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రతి నెలలో మాదిరిగానీ వచ్చే నెలలో (2024 అక్టోబర్) కూడా ఇన్వెస్ట్మెంట్స్, సేవింగ్స్ వంటివాటికి సంబంధించిన చాలా నిబంధలను మారతాయి. ఈ కథనంలో వచ్చే నెలలో ఏ రూల్స్ మారుతాయనే విషయం తెలుసుకుందాం..స్మాల్ సేవింగ్ స్కీమ్2024 అక్టోబర్ 1 నుంచి స్మాల్ సేవింగ్ రూల్స్ మారనున్నాయి. ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY) ఖాతాల వంటి పోస్ట్ ఆఫీస్ చిన్న పొదుపు ఖాతాలు కొత్త సర్దుబాట్లకు లోబడి ఉంటాయి. రెగ్యులర్ కానీ నేషనల్ స్మాల్ సేవింగ్ (NSS) ఖాతాలపై కూడా కొంత ప్రభావం ఉంటుంది. కొన్ని అకౌంట్స్ క్రమబద్దీకరించాల్సి ఉంటుంది.ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ కార్డ్ ఛార్జీలుఐసీఐసీఐ బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం.. 2024 అక్టోబర్ 1 నుంచి మీరు రూ. 10వేలు ఖర్చు చేయడం ద్వారా రెండు కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ పొందవచ్చు. మునుపటి క్యాలెండర్ త్రైమాసికంలో చేసిన ఖర్చులు.. తరువాత క్యాలెండర్ త్రైమాసికానికి యాక్సెస్‌ను అన్‌లాక్ చేస్తాయి.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మార్పులువచ్చే నెల ప్రారంభం నుంచే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్దులో కొన్ని మార్పులు జరగనున్నాయి. స్మార్ట్‌బై ప్లాట్ఫామ్లో.. యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లయితే.. అందులో వచ్చే రివార్డ్ పాయింట్స్ కేవలం ప్రొడక్ట్‌కు మాత్రమే వర్తిస్తాయి. ఇప్పుడు 1వ తేదీ నుంచి స్మార్ట్‌బై పోర్టల్ ప్రతి క్యాలెండర్ త్రైమాసికానికి 50,000 రివార్డ్ పాయింట్ల చొప్పున తనిష్క్ వోచర్ల కోసం రివార్డ్ పాయింట్ల రిడీమ్‌ను పరిమితం చేస్తుంది. ఈ మార్పులు ఇన్ఫినియా, ఇన్ఫినియా మెటల్ కార్డ్‌లకు మాత్రమే వర్తిస్తాయి.ఇదీ చదవండి : ఇద్దరితో మొదలై.. విశ్వమంతా తానై - టెక్ చరిత్రలో గూగుల్ శకం.. అనన్య సామాన్యంటీడీఎస్ వడ్డీ రేట్లుకేంద్ర బడ్జెట్ సమయంలో సెక్షన్ 194DA - జీవిత బీమా పాలసీకి సంబంధించి చెల్లింపును 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించారు. ఇది అక్టోబర్ 1, 2024 నుండి అమలులోకి వస్తుంది. సెక్షన్ 194G - లాటరీ టిక్కెట్ల విక్రయంపై కమీషన్ తదితరాలను కూడా 5 నుంచి 2 శాతానికి తగ్గించాలని పేర్కొన్నారు. ఇది కూడా 1వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుంది. కమిషన్ లేదా బ్రోకరేజీ చెల్లింపులు, హెచ్‌యూఎఫ్‌లు చేసే అద్దె చెల్లింపులు వంటి వాటికి అక్టోబర్ 1 నుంచి టీడీఎస్ రేట్లు తగ్గుతున్నట్లు సమాచారం. -
డెబిట్ కార్డు లేకపోయినా డబ్బు విత్‌డ్రా
డెబిట్ కార్డు పోయిందా..ఏటీఎంకు కార్డు తెసుకెళ్లడం మర్చిపోయారా..డెబిట్ కార్డు లేకుండా దూరప్రాంతాలకు వెళ్లారా.. మరేం పర్వాలేదు. మీరు ఉన్న ప్రాంతంలో ఏటీఎం ఉంటే ఎలాంటి డెబిట్ కార్డు లేకుండానే నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే అందుకోసం మీ స్మార్ట్‌ఫోన్‌లో యూపీఐ యాప్ ఉంటే సరిపోతుంది. కార్డు అవసరం లేకుండా యూపీఐ ద్వారా ఎలా డబ్బు విత్‌డ్రా చేయాలో తెలుసుకుందాం.బ్యాంకింగ్ రంగ సేవల్లో టెక్నాలజీ విస్తరిస్తోంది. అందులో భాగంగా యూపీఐ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఏ చిన్న లావాదేవీలు చేయాలన్నా స్మార్ట్పోన్లోని యూపీఐని వినియోగిస్తున్నారు. దీన్ని ఉపయోగించి డెబిట్ కార్డు లేకుండానే ఏటీఎంలో డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. అందుకోసం ఇంటర్ ఆపరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రావల్ (ఐసీసీడబ్ల్యూ) విధానం ఉపయోగపడుతుంది. ప్రస్తుతం చాలా బ్యాంకులు ఈ సర్వీసును అందిస్తున్నాయి.విత్‌డ్రా చేసుకోండిలా..ముందుగా మీ వద్ద యూపీఐ యాప్ ఇన్స్టాల్ చేసిన స్మార్ట్‌ఫోన్ ఉండాలి. ప్రస్తుతం చాలామంది గూగుల్‌పే, ఫోన్‌పే..వంటి యూపీఐ ధర్డ్‌పార్టీ యాప్‌లను వాడుతున్నారు.మీ బ్యాంకు ఐసీసీడబ్ల్యూ సేవలందిస్తుందో లేదో తనిఖీ చేసుకోవాలి.ఒకవేళ ఈ సర్వీసు అందుబాటులో ఉంటే ఏటీఎం వద్దకు వెళ్లి స్క్రీన్‌పై ‘యూపీఐ నగదు ఉపసంహరణ’ ఆప్షన్ ఎంచుకోవాలి.ఏటీఎం ప్రొవైడర్‌ను బట్టి ఈ ఎంపిక విభిన్నంగా ఉండవచ్చు. జాగ్రత్తగా గమనిస్తే సులువుగానే దాన్ని గుర్తించవచ్చు.యూపీఐ విత్‌డ్రా సెలక్ట్ చేసుకున్నాక క్యూఆర్ కోడ్ డిస్ప్లే అవుతుంది.మీ ఫోన్లోని యూపీఐ యాప్ ఓపెన్ చేసి ఏటీఎం స్క్రీన్‌పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి.మీరు ఎంత డబ్బు విత్‌డ్రా చేయాలో ఎంటర్ చేసి, యూపీఐ పిన్ ప్రెస్ చేయాలి. (యూపీఐ ద్వారా ఏటీఎం రోజువారీ విత్‌డ్రా పరిమితి సాధారణంగా రూ.10,000గా ఉంటుంది)కొంత సమయం తర్వాత బ్యాంకు సిస్టమ్ సర్వర్‌తో కనెక్ట్ అయి డబ్బు విత్‌డ్రా అవుతుంది.ఇదీ చదవండి: కొత్త పెన్షన్ విధానంలోని కీలకాంశాలు..ఈ ప్రక్రియ వల్ల ఖాతాదారుల వ్యక్తిగత సమాచారానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. క్యూఆర్ కోడ్ మీ సమాచారాన్ని రక్షించడానికి ఎన్క్రిప్షన్ని ఉపయోగిస్తుంది. మీకు మాత్రమే తెలిసిన యూపీఐ పిన్‌తో లావాదేవీని పూర్తి చేసుకోవచ్చు. -
చోరీ డెబిట్ కార్డుతో లాటరీ.. రూ. 41 కోట్లు గెలిచి..
యూకేలో ఓ వింత ఉదంతం వెలుగు చూసింది. ఈ దేశానికి చెందిన ఇద్దరు దొంగలు లాటరీలో నాలుగు మిలియన్ పౌండ్లు గెలుచుకున్నాడు. భారత కరెన్సీతో పోల్చిచూస్తే ఈ మొత్తం రూ.41 కోట్ల 66 లక్షలు. ఇంత భారీ ప్రైజ్ మనీ గెలుచుకున్నాక కూడా వారు చిక్కుల్లో పడ్డాడు. బోల్టన్‌కు చెందిన జాన్ రాస్ వాట్సన్, మార్క్ గుడ్‌రామ్‌లు తాము చోరీ చేసిన డెబిట్ కార్డుతో లాటరీ టిక్కెట్ కొనుగోలు చేశారు. ఆ లాటరీ ఫలితాలు రాగానే వారు ఆనందంతో గెంతేశారు. తాము నాలుగు మిలియన్ పౌండ్లు అందుకోబోతున్నామంటూ ఉబ్బితబ్బిబయ్యారు. అయితే వారి ఆనందం కొద్దిసేపటికే ఆవిరయ్యింది. లాటరీలో వచ్చిన మొత్తాన్ని అందుకునేందుకు వారు లాటరీ నిర్వాహకులను సంప్రదించారు. వారు బ్యాంకు ఖాతా గురించి అడగగా, గుడ్‌రామ్ తనకు బ్యాంకు ఖాతా లేదని తెలిపాడు. దీంతోవారు అనుమానంతో అతనిని పలు విధాలుగా విచారించారు. ఈ నేపధ్యంలో గుడ్‌రామ్ ఆ కార్డు తన స్నేహితుడు జాన్‌దని తెలిపాడు. దీంతో వారు జాన్‌ను కూడా విచారించారు. అది అతనిది కూడా కాదని తేలింది. లాటరీ నిర్వాహకుల విచారణలో ఆ డెబిట్ కార్డు జోషువా అనే వ్యక్తికి చెందినదని తేలింది. దీంతో జాన్ రాస్ వాట్సన్, మార్క్ గుడ్‌రామ్‌లు ఆ కార్డును దొంగిలించారని వారు గుర్తించారు. విషయం పోలీసుల వరకూ చేరింది. కోర్టు విచారణలో జాన్ రాస్ వాట్సన్, మార్క్ గుడ్‌రామ్‌లకు 18 నెలల చొప్పున జైలు శిక్ష పడింది. డెబిట్ కార్డు యజమాని జోషువా ఆ లాటరీ మొత్తాన్ని అందుకునేందుకు అర్హుడయ్యాడు. ఈ విషయం తెలిసినవారంతా అదృష్టమంటే ఇదేనేమో అని అంటున్నారు. -
లైఫ్‌టైమ్ జీరో బ్యాలెన్స్ అకౌంట్! డెబిట్, క్రెడిట్ కార్డులు కూడా...
BoB LITE Savings Account: బ్యాంక్ అకౌంట్ లేని వారికి, జీరో బ్యాలెన్స్ అకౌంట్ కావాల్సిన వారి కోసం ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) సరికొత్త అకౌంట్‌ను అందిస్తోంది. బీఓబీ ప్రత్యేక పండుగ క్యాంపెయిన్‌లో భాగంగా ‘బీఓబీ లైట్ సేవింగ్స్ అకౌంట్’ పేరిట లైఫ్‌టైమ్ జీరో బ్యాలెన్స్ అకౌంట్‌ను ప్రకటించింది. ఈ అకౌంట్‌తో మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండానే బ్యాంకింగ్ సేవలు పొందవచ్చని బ్యాంక్ ఆఫ్ బరోడా ఓ ప్రకటనలో పేర్కొంది. ఉచితంగా డెబిట్, క్రెడిట్ కార్డులు బీఓబీ లైట్ సేవింగ్స్ అకౌంట్‌తో పాటు కస్టమర్లు ఉచితంగా డెబిట్, క్రెడిట్ కార్డులు కూడా పొందవచ్చు. అయితే లైఫ్‌టైమ్ ఫ్రీ రూపే ప్లాటినమ్ డెబిట్ కార్డు కోసం సగటు త్రైమాసిక బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. అలాగే అర్హతను బట్టీ లైఫ్‌టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డు కూడా పొందవచ్చు. వీటితో పాటు మరిన్ని ఆఫర్లను కస్టమర్లకు బ్యాంక్ అందిస్తోంది. ఇప్పటికే వివిధ కన్జ్యూమర్ బ్రాండ్లతో ఒప్పందం చేసుకున్న బ్యాంక్ ఆఫ్ బరోడా.. డిసెంబర్ 31 వరకు వివిధ బ్రాండ్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తోంది. రిలయన్స్ డిజిటల్, క్రోమా, మేక్ మై ట్రిప్, అమెజాన్, బుక్ మై షో, మింత్రా, స్విగ్గీ, జొమాటోలో కొనుగోళ్లపై స్పెషల్ ఆఫర్లు లభిస్తాయని బ్యాంక్ ఆఫ్ బరోడా ఓ ప్రకటనలో తెలిపింది. బీఓబీ లైట్ సేవింగ్స్ అకౌంట్ ప్రయోజనాలు ఇది లైఫ్‌టైమ్ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్. 10 ఏళ్లు పైబడిన భారతీయ పౌరులెవరైనా ఈ కౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఉచితంగా రూపే ప్లాటినమ్ డెబిట్ కార్డు. ఇందు కోసం మెట్రో/అర్బన్‌లో రూ.3000, సెమీ అర్బన్‌లో రూ.2000, గ్రామీణ శాఖల్లో రూ.1000 త్రైమాసిక సగటు బ్యాలెన్స్ నిర్వహించాల్సి ఉంటుంది. అర్హత ఆధారంగా లైఫ్‌టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డు ఒక ఆర్థిక సవత్సరంలో ఉచితంగా 30 చెక్ లీవ్స్ -
Jio financial services: ఇకపై రిలయన్స్ జియో డెబిట్ కార్డులు!
రిలయన్స్ జియో టారిఫ్ పరంగా టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఆ దెబ్బతో అదే రంగంలోని కొన్ని కంపెనీలు కుదేలయ్యాయి. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రత్యేకంగా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి పూర్తిస్థాయి ఆర్థిక సేవలు అందించేలా సన్నద్ధమవుతుంది. రిలయన్స్ ఫైనాన్షియల్ మార్కెట్లోనూ తన సత్తా చాటాలనుకుంటోంది. పేమెంట్ విభాగం సేవింగ్స్ అకౌంట్లను, బిల్ పేమెంట్ సర్వీసులను సంస్థ రీలాంచ్ చేసింది. త్వరలో డెబిట్ కార్డులు కూడా తీసుకురావాలని భావిస్తున్నట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ త్వరలో ఆటో, హోమ్లోన్లను కూడా జారీ చేయనుంది. ఇటీవల సంస్థ తొలి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు కొన్ని అంశాలను వెల్లడించారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ దేశవ్యాప్తంగా ఉన్న 300 స్టోర్లలో గృహ వినియోగ వస్తువులపై రుణాలను మంజూరు చేస్తోంది. ఇప్పటికే ముంబయిలోని వేతన జీవులకు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి వ్యక్తిగత రుణాలు అందిస్తుంది. త్వరలో వ్యాపారులకు సైతం రుణాలు జారీ చేస్తామని కంపెనీ తెలిపింది. ఇప్పటికే 24 బీమా సంస్థలతో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జతకట్టింది. తన ఉత్పత్తులను వినియోగదారులకు చేరువ చేసేందుకు ఓ యాప్‌ను సైతం జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ సిద్ధం చేస్తోంది. -
వాట్సాప్ పేమెంట్స్ సేవల విస్తరణ
ముంబై: మెసేజింగ్ యాప్ వాట్సాప్ తాజాగా భారత మార్కెట్లో తమ చెల్లింపుల సేవలను మరింతగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా వ్యాపార సంస్థలకు కొనుగోలుదారులు చేసే పేమెంట్స్ ప్రక్రియను సులభతరం చేసింది. ‘వాట్సాప్ బిజినెస్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించే భారతీయ వ్యాపార సంస్థలన్నింటికీ మా పేమెంట్స్ సర్వీసును విస్తరిస్తున్నాం. కొనుగోలుదారులు తమకు కావాల్సిన ఉత్పత్తులను వాట్సాప్‌లోనే కార్ట్‌కి జోడించుకోవడంతో పాటు తమకు నచ్చిన పేమెంట్ విధానం ద్వారా .. అంటే వాట్సాప్ లేదా యూపీఐ యాప్‌లు, డెబిట్ .. క్రెడిట్ కార్డులతో కూడా చెల్లించవచ్చు. ఇందుకోసం ఇతర వెబ్‌సైట్‌కి గానీ, మరో యాప్‌కి గానీ వెళ్లనక్కర్లేదు. వ్యక్తిగతంగా వెళ్లి చెల్లించనక్కర్లేదు‘ అని సంస్థ తెలిపింది. ఈ ఫీచర్ ఇప్పటికే సింగపూర్, బ్రెజిల్లో చిన్న వ్యాపార సంస్థల కోసం కంపెనీ అమలు చేస్తోంది. వ్యాపార సంస్థలు, కొనుగోలుదారులు మెసేజింగ్ ఫీచర్‌ను సమర్ధంగా వినియోగించుకునే విషయంలో ప్రపంచానికి భారత్ సారథ్యం వహిస్తోందని బిజినెస్ మెసేజింగ్ సదస్సు ’కన్వర్సేషన్స్’ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న వాట్సాప్ మాతృసంస్థ మెటా వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. వాట్సాప్ ఫ్లోస్, వెరిఫైడ్ బ్యాడ్జ్ .. మెసేజింగ్ ఫార్మాట్లు, గ్రూప్ చాట్స్, బ్రాడ్కాస్ట్ చానల్స్ విషయంలో మెటా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ఆవిష్కరిస్తోందని జుకర్‌బర్గ్ చెప్పారు. ఇందులో భాగంగా వ్యాపార సంస్థల కోసం వాట్సాప్ ఫ్లోస్, మెటా వెరిఫైడ్ బ్యాడ్జ్‌లను విస్తృతంగా అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. రిజర్వేషన్ బుకింగ్, ఉత్పత్తులను ఆర్డర్ చేయడం, ఫ్లయిట్స్‌లో చెకిన్ చేయడం వంటి అంశాల్లో కస్టమర్లకు వెసులు బాటు కల్పించేలా వాట్సాప్ ఫ్లోస్‌ను వ్యాపార సంస్థలు ఉపయోగించుకోవచ్చు. మరోవైపు, మెటా వెరిఫైడ్ బ్యాడ్జ్‌లను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌లకు విస్తరిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
యూపీఐ ట్రాన్సాక్షన్ల జోరు.. డెబిట్ కార్డులు బేజారు!
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ లావాదేవీలతో మనోళ్లు దుమ్మురేపుతున్నారు. యూపీఐ పేమెంట్స్ అనేది అత్యంత ప్రజాదరణ పొందిన డబ్బు బదిలీ (మనీ ట్రాన్స్ఫర్)గా నేడు అవతరించింది. అందుకే మునుపెన్నడూ లేనంత స్థాయిలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ట్రాన్సాక్షన్ల జోరు కొనసాగుతోంది. మూడు, నాలుగేళ్ల కిందట ప్రధానంగా బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులతో అత్యధికంగా పలు రకాల లావాదేవీలు, ఆర్థిక కార్యకలాపాలు జరిగిన విషయం తెలిసిందే. కోవిడ్ మహమ్మారి కాలం తెచ్చిన మార్పు చేర్పులతో డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగాన్ని తోసిరాజని యూపీఐ లావాదేవీలు ఇప్పుడు అగ్రపీఠాన్ని అధిరోహించాయి. యూపీఐ ద్వారా... చిన్న మొత్తంలో కొనుగోళ్లు, ఇతరత్రా చెల్లింపులకు అవకాశం ఉండడంతో వాటివైపే అత్యధికుల మొగ్గు చూపుతున్నట్టు స్పష్టమైంది. రోజువారీ నిత్యావసర కొనుగోళ్లు మొదలు, మార్కెట్లో వివిధరకాల వస్తువుల కొనుగోలుకు యూపీఐ చెల్లింపు విధానాన్ని మెజారిటీ వినియోగదారులు అనుసరిస్తున్నారు. గత మూడేళ్లలో 428 శాతం యూపీఐ ట్రాన్సాక్షన్లు పెరగ్గా, గత నెలలో (ఆగస్టులో) రూ.పది బిలియన్ల (బిలియన్ = 100 కోట్లు) ట్రాన్సాక్షన్ల నమోదుతో తొలిసారి రికార్డ్ సృష్టించాయి. మూడేళ్లుగా డిజిటల్ లావాదేవీలు కోవిడ్ నుంచి మూడేళ్లుగా క్రమంగా డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. ఎంతగా అంటే.. 2023–24 ఆర్థికసంవత్సరంలో (ఏప్రిల్–జూలైల మధ్య) చెల్లింపుల విషయానికొస్తే..క్రెడిట్‌కార్డుల ద్వారా రూ.5.57 ట్రిలియన్లు, డెబిట్‌కార్డులతో రూ.13 ట్రిలి యన్లు, యూపీఐ ద్వారా రూ.59.14 ట్రిలియన్ల (ట్రిలియన్ = లక్ష కోట్లు)లో జరిగినట్టు వెల్లడైంది. ఆర్బీఐ డేటా ఆధారంగా రూపొందించిన నివేదికలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. కరోనా తెచ్చిన మార్పులతో భారతీయులు అనుస రిస్తున్న వ్యయం తీరులో మార్పులు వచ్చి నట్టుఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. చదవండి: పనిచేస్తున్న బ్యాంకులోనే రూ.8.5 కోట్లు స్వాహా చేసిన డిప్యూటీ మేనేజర్ కీలకాంశాలు ► 2020 జూలైలో డెబిట్‌కార్డుల ద్వారా చేసిన చెల్లింపులు రూ.2.81 ట్రిలియన్లు కాగా. 2023 జూలైలో అవి రూ.3.15 ట్రిలియన్లుకు... అంటే 11.96 శాతం వృద్ధిని మాత్రమే నమోదుచేశాయి. ► ఇదే సమయంలో యూపీఐ చెల్లింపులు అనేవి రూ.2.90 ట్రిలియన్ల నుంచి రూ.15.33 ట్రిలియన్లకు.. అంటే 428 శాతం పెరుగుదలను రికార్డ్ చేశాయి ►మరోవైపు క్రెడిట్‌కార్డుల ద్వారా చెల్లింపులు కూడా పెరుగుతున్నాయి ► 2020 జూలైలో రూ.0.45 ట్రిలియన్ల చెల్లింపులతో పోల్చితే 2023 జూలై నాటికి అవి రికార్డ్ స్థాయిలో రూ.1.45 ట్రిలియన్లకు చేరుకున్నాయి ► కస్టమర్లు చెల్లిస్తున్న పద్ధతుల్లో భారీ మార్పుల వస్తున్నా డెబిట్‌కార్డుల వినియోగం పూర్తిగా కనుమరుగయ్యే అవకాశాలు లేవు. మార్కెట్లో వాటి స్థానం పదిలమని నిపుణుల అంచనా. 20 బిలియన్లకు చేరుకున్నా ఆశ్చర్యం లేదు చిన్న చిన్న మొత్తాల్లో చెల్లింపులు పెరగడం, ఫోన్ ద్వారా యూపీఐ లావాదేవీల వెసులుబాటుతో.. సంప్రదాయ చెల్లింపు పద్ధతిగా ఉన్న కస్టమర్ల డెబిట్‌కార్డుల వినియోగం అనేది బాగా తగ్గింది. దీనిని బట్టి వచ్చే 18–24 నెలల కాలంలో యూపీఐ లావాదేవీలు నెలకు రూ.20 బిలియన్లకు చేరుకున్నా ఆశ్చర్యపడక్కర లేదు. –సునీల్ రంగోలా, సీనియర్ వైస్‌ప్రెసిడెంట్, హెడ్ –స్ట్రాటజీ,ఇన్నోవేషన్, అనాలిటిక్స్, వరల్డ్‌లైన్ ఇండియా -
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్! ఏటీఎం కార్డు వాడట్లేదా? అయితే...
ప్రస్తుతం యూపీఐ వినియోగం ఎక్కువైంది. ఎక్కడ డబ్బు చెల్లించాలన్న ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి యూపీఐ యాప్‌ల ద్వారానే అన్ని చెల్లింపులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏటీఎం వాడకం బాగా తగ్గిపోయింది. ఇక రెండు మూడు కార్డులున్న వారి సంగతి చెప్పనక్కర్లేదు. అయితే ఎప్పుడోకానీ ఏటీఎం కార్డులు వాడని వారికి ఇబ్బందులు తప్పడం లేదు. సాధారణంగా డెబిట్ కార్డు గడువు ముగిసిన తర్వాత బ్యాంకులు ఆటోమేటిక్‌గా కొత్త ఏటీఎం కార్డును పోస్ట్ ద్వారా కస్టమర్ల చిరునామాకు పంపుతాయి. కానీ ఓ ఎస్బీఐ కస్టమర్‌కు విభిన్న అనుభవం ఎదురైంది. దీనిపై ఆ కస్టమర్ ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. (ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్! ఇకపై మరింత..) ఆ కస్టమర్‌కు ఎస్బీఐలో 10 సంవత్సరాలుగా అకౌంట్ ఉంది. అతని డెబిట్ కార్డ్ గడువు ఇటీవలే ముగిసింది. కొత్త ఏటీఎం కార్డు ఆటో మేటిక్‌గా పోస్టులో ఇంటికి రావాల్సిఉండగా అతనికి బ్యాంక్ కొత్త ఏటీఎం కార్డును పంపలేదు. దీంతో బ్యాంక్ బ్రాంచికి వెళ్లిన అతనికి కొత్త కార్డు కావాలంటే మరోసారి దరఖాస్తు చేసుకోవాలని బ్యాంకులు అధికారులు చెప్పారు. ఇదీ చదవండి: బాస్మతి బియ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు.. దీంతో ఎక్స్ (ట్విటర్)లో ఎస్బీఐ యాజమాన్యాన్ని ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేయగా ఎస్బీఐ స్పందించింది. కొత్త ఏటీఎం కార్డు ఎందుకు రాలేదో కారణాలను వివరించింది. కార్డు గడువు ముగిసేందుకు మూడు నెలల ముందే అప్రమత్తం కావాలని సూచించింది. కొత్త కార్డు ఆటోమేటిక్‌గా రావాలంటే.. ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ అకౌంట్ అయి ఉండకూడదు. డెబిట్ కార్డును ఏడాదిలో కనీసం ఒక్కసారైనా వాడి ఉండాలి. అకౌంట్‌కు కస్టమర్ పాన్ నంబర్ తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి. -
డేంజర్: ఇది జరిగితే మీ బ్యాంక్ అకౌంట్ ప్రమాదంలో ఉన్నట్టే..
ప్రపంచవ్యాప్తంగా సైబర్ మోసాలు ఎక్కువయ్యాయి. అమాయక ప్రజల డబ్బును దోచుకునేందుకు సైబర్ మోసగాళ్లు రోజుకో ఎత్తు వేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. మీ డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలు అత్యంత తేలికగా స్కామర్ల చేతికి చేరుతున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. పలు అక్రమ వైబ్సైట్లు, టెలిగ్రామ్ చానెళ్లు డెబిట్, క్రెడిట్ కార్డ్ నంబర్లు, కార్డ్ హోల్డర్ పేర్లు, సీవీవీతో సహా వివరాలను స్కామర్లకు విక్రయిస్తున్నాయి. అదీ కూడా ఒక్కో కార్డు వివరాలు కేవలం 5 యూఎస్ డాలర్లు. అంటే రూ.410లకు మాత్రమే. పశ్చిమ దేశాలలో చెల్లింపులు ప్రాసెస్ చేయడానికి కార్డు వివరాలు ఉంటే సరిపోతుంది. ఓటీపీ అవసరం ఉండదు. అందుకే ఆయా దేశాల్లో పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. కానీ భారత్‌లో వన్ టైమ్ పాస్వర్డ్ (OTP) ద్వారా రెండు-కారకాల ప్రామాణీకరణ తప్పనిసరి. అయినప్పటికీ దీన్ని కూడా అధిగమించడానికి స్కామర్లు కొత్త మార్గాన్ని కనుగొన్నారు. ఉన్నట్టుండి సిమ్ డీయాక్టివేట్ అయితే.. బాధితుల ఒరిజినల్ సిమ్‌ను డీయాక్టివేట్ చేయడం ద్వారా స్కామర్లు ఓటీపీని ఎలా యాక్సెస్ చేస్తున్నారో భారతీయ పోలీసు అధికారులను టైమ్స్ ఆఫ్ ఇండియా ఉటంకిస్తూ పేర్కొంది. హ్యాకర్లు డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలను బాధితుడి పేరు, ఫోన్ నంబర్‌తో సహా షాడో వెబ్సైట్లు, టెలిగ్రామ్ చానెళ్ల ద్వారా అమ్మకానికి పెడుతున్నారు. సైబర్ మోసగాళ్లు ఈ వివరాలను కొనుగోలు చేసి టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను సంప్రదించి బాధితుల సిమ్ కార్డ్ డీయాక్టివేట్ చేయిస్తున్నారు. తర్వాత డూప్లికేట్ సిమ్ పొంది ఓటీపీలను సునాయాసంగా యాక్సెస్ చేయగలుగుతున్నారు. నష్టం జరిగేంత వరకు బాధితుడి ఈ మోసం గురించి తెలియదు. కాబట్టి మీ సిమ్ కార్డ్ ఉన్నట్టుడి డీయాక్టివేట్ అయినట్లు గుర్తిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. కొన్ని నిమిషాల్లోనే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. ఈ వెబ్సైట్లను నిర్వహిస్తున్నదెవరు? నివేదిక ప్రకారం.. అక్రమ వెబ్సైట్లు, టెలిగ్రామ్ చానెళ్లను రష్యా, ఉక్రెయిన్ దేశాలకు చెందిన హ్యాకర్లు నిర్వహిస్తున్నట్లుగా తేలింది. వీళ్లు వెబ్సైట్లు, టెలిగ్రామ్ చానెళ్ల ద్వారా కార్డ్ వివరాలను హ్యాక్ చేసి విక్రయిస్తున్నారు. సంపన్న పాశ్చాత్య దేశాలకు చెందిన వారి కార్డు వివరాలకు ఒక్కో కార్డుకు 10 డాలర్లు (రూ.820) చొప్పున తీసుకుంటుండగా భారత్ సహా ఆసియా దేశాలకు చెందిన బాధితుల కార్డుల వివరాలకు చవగ్గా కేవలం 5 డాలర్లు (రూ.410)కే అమ్మేస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. 2022 జనవరిలో అటువంటి అక్రమ వెబ్సైట్ ఒకదానిని అధికారులు గుర్తించి చర్యలు తీసుకున్నారు. కానీ అలాంటి అక్రమ వెబ్సైట్లు, టెలీగ్రామ్ చానెళ్లు లెక్కకు మించి పుట్టుకొస్తున్నాయి. ఇదీ చదవండి: ఇంటర్నెట్ షట్‌డౌన్: ఆరు నెలల్లో ఇన్ని వేల కోట్ల నష్టమా? -
డెబిట్ కార్డు పోయిందా? సింపుల్‌గా ఇలా బ్లాక్ చేయండి!
State Bank of India: కొన్ని సందర్భాల్లో అనుకోకుండా ఏటీఎమ్ కార్డు లేదా డెబిట్ కార్డు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో చాలా మంది కంగారు పడతారు. కానీ డెబిట్ కార్డు పోగొట్టుకుంటే ఏ మాత్రం గాబరా పడకుండా.. సింపుల్‌గా బ్లాక్ చేయవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. (ఇదీ చదవండి: హైలక్స్ కొనుగోలుపై బంపర్ ఆఫర్.. మిస్ చేసుకుంటే మళ్ళీ రాదేమో!) మీరు పోగొట్టుకున్నది స్టేట్ బ్యాంక్ ఏటీఎమ్ కార్డు అయితే.. ముందుగా స్టేట్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాలి. వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ బ్లాక్ ది కార్డ్‌పై క్లిక్ చేయాలి. డెబిట్ కార్డును ఆన్లైన్ నుంచి బ్లాక్ చేయాలనుకుంటే తప్పకుండా మీ అకౌంట్ నెంబర్‌కి.. మీ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, కంట్రీ, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి.. క్యాప్చా ఫిల్ చేయాలి. ఇవన్నీ పూర్తయిన తరువాత సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తరువాత మీ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ నెంబర్ ఎంటర్ చేసి తరువాత మీ పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంట్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. అందులో ఏ కార్డునైతే బ్లాక్ చేయాలనుకుంటారో.. అక్కడ కనిపించే నుంబర్లలో సెలక్ట్ చేసుకుని సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఒక సారి కార్డుని బ్లాక్ చేసిన తరువాత దానిని తిరిగి ఆన్లైన్లో అన్‌బ్లాక్ చేయడం సాధ్యం కాదు. -
వామ్మో! క్రెడిట్ కార్డు రుణాలు.. ఒక్క ఏప్రిల్‌లోనే అన్ని లక్షల కోట్లా!
దేశంలో క్రెడిట్ కార్డ్ వినియోగం అంతకంతకూ పెరిగిపోతోంది. ఏడాదిలో క్రెడిట్‌కార్డ్ రుణాలు ఏకంగా 30 శాతం పెరగడమే దీనికి నిదర్శనం. క్రెడిట్ కార్డు రుణ బకాయిలు అమాంతంగా పెరుగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తాజా నివేదిక వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం.. ► దేశంలో క్రెడిట్ కార్డ్ రుణ బకాయిలు 2023 ఏప్రిల్‌లో ఏకంగా రూ.2.05 లక్షల కోట్లకు చేరాయి. 2022, ఏప్రిల్‌లో ఉన్న బకాయిల కంటే ఇవి 30 శాతం అధికం కావడం గమనార్హం. 2023, ఏప్రిల్‌లోనే రూ.1.3 లక్షల కోట్ల మేరకు క్రెడిట్ కార్డ్ రుణాలు తీసుకోవడం విస్మయపరుస్తోంది. ► ఇక బ్యాంకులు ఇస్తున్న మొత్తం రుణాల్లో క్రెడిట్ కార్డ్ రుణాలు 1.4 శాతానికి చేరాయి. 2008లో ఆర్థిక మాంద్యం సమయంలో దేశంలో క్రెడిట్ కార్డ్ రుణాలు అత్యధికంగా 1.2 శాతానికి చేరాయి. అనంతరం దశాబ్దం పాటు క్రెడిట్ కార్డ్ రుణాలు ఒక్క శాతం కంటే తక్కువే ఉంటూ వచ్చాయి. కానీ 2023 ఏప్రిల్‌లో క్రెడిట్ కార్డ్ రుణాలు 1.4 శాతానికి చేరుకోవడం గమనార్హం. కాగా విశ్వసనీయమైన ఖాతాదారులకే క్రెడిట్ కార్డ్ రుణాలిస్తున్నామని బ్యాంకులు చెబుతున్నాయని ఆర్బీఐ పేర్కొంది. దేశ జనాభాలో ఇంకా కేవలం 5 శాతం మందే క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగిస్తున్నారని కూడా ఆర్బీఐ తెలిపింది. ► దేశంలో వ్యక్తిగత రుణాల్లో క్రెడిట్ కార్డ్ రుణాలు మూడో స్థానంలో ఉన్నాయి. వ్యక్తిగత రుణాల్లో గృహ రుణాలు మొదటి స్థానంలో ఉన్నాయి. బ్యాంకులు ఇస్తున్న రుణాల్లో గృహ రుణాల వాటా 14.1 వాటా ఉంది. 3.7శాతం వాటాతో వాహన రుణాలు రెండో స్థానంలో ఉన్నాయి. 1.4 శాతంతో క్రెడిట్ కార్డు రుణాలు మూడో స్థానంలో ఉన్నాయి. ► బ్యాంకులు జారీ చేస్తున్న పారిశ్రామిక రుణాల వాటా 2022–23లో తగ్గింది. 2021–22లో పారిశ్రామిక రుణాలు 26.3శాతం ఉండగా.. 2022–23లో 24.3 శాతానికి తగ్గాయి. చదవండి: గుడ్‌న్యూస్: ఈపీఎఫ్‌వో అధిక పింఛన్‌కు దరఖాస్తు గడువు పొడిగింపు -
ఆధార్‌తో యూపీఐ పేమెంట్: గూగుల్‌పేలో కొత్త ఫీచర్
Aadhaar-based UPI: గూగుల్‌పే (Google Pay) యూజర్లకు కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఆధార్‌తో యూపీఐ చెల్లింపుల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)కు యూజర్లు గూగుల్‌పే యాప్‌లో నమోదు చేసుకోవచ్చు. డెబిట్ కార్డుతో పనిలేదు ఆధార్ ఆధారిత యూపీఐ ఆన్‌బోర్డింగ్ విధానం ద్వారా గూగుల్‌పే యూజర్లు డెబిట్ కార్డ్ లేకుండానే తమ యూపీఐ పిన్ని సెట్ చేసుకోవచ్చు. కోట్లాది మంది యూపీఐ చెల్లింపులను వినియోగిస్తున్న నేపథ్యంలో ఇది చాలా మంది వినియోగదారులకు యూపీఐ ఐడీలను సెటప్ చేసుకునేందుకు, డిజిటల్ చెల్లింపులు చేయడానికి ఈ ఫీచర్ వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: Retrieve Aadhaar card: ఆధార్ కార్డ్ పోయిందా.. నంబర్ కూడా గుర్తులేదా.. ఎలా మరి? ఆధార్‌తో యూపీఐ పేమెంట్ అవకాశం ప్రస్తుతానికి ఎంపిక చేసిన కొన్ని బ్యాంకుల కస్టమర్లకు మాత్రమే ఉండగా త్వరలో మరిన్ని బ్యాంకులు ఈ సదుపాయాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆధార్ ద్వారా యూపీఐ చెల్లింపులను వినియోగించుకోవాలంటే ఆధార్, బ్యాంక్‌లో నమోదు చేసుకున్న ఫోన్ నంబర్ ఒకటే అయి ఉండాలి. అలాగే బ్యాంక్ ఖాతా ఆధార్‌తో లింక్ చేసి ఉండాలి. నమోదు చేసుకోండిలా.. గూగుల్‌పే యాప్‌లో వినియోగదారులు డెబిట్ కార్డ్ లేదా ఆధార్ ఆధారిత యూపీఐ నమోదును ఎంపిక చేసుకోవచ్చు. ఆధార్‌ని ఎంచుకుంటే నమోదు ప్రక్రియను ప్రారంభించడానికి వారి ఆధార్ నంబర్లోని మొదటి ఆరు అంకెలను నమోదు చేయాలి. ప్రామాణీకరణ దశను పూర్తి చేయడానికి ఆధార్ (UIDAI), బ్యాంక్ నుంచి వచ్చిన ఓటీపీలను నమోదు చేయాలి. తర్వాత ప్రక్రియను బ్యాంక్ పూర్తి చేశాక యూపీఐ పిన్ని సెట్ చేసుకోవచ్చు. ఇదీ చదవండి: ఆధార్ కొత్త ఫీచర్: ఓటీపీ మీ మొబైల్ నంబర్‌కే వస్తోందా? కస్టమర్లు లావాదేవీలు చేయడానికి లేదా బ్యాలెన్స్‌ని చెక్ చేయడానికి గూగుల్ యాప్‌ని ఉపయోగించవచ్చు. ఆధార్ నంబర్లోని మొదటి ఆరు అంకెలను నమోదు చేసిన తర్వాత, అది ధ్రువీకరణ కోసం NPCI ద్వారా UIDAIకి వెళ్తుంది. ఈ ప్రక్రియ వినియోగదారుల ఆధార్ నంబర్ భద్రతను నిర్ధారిస్తుంది. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే గూగుల్‌పే ఆధార్ నంబర్‌ను స్టోర్ చేయదు. ధ్రువీకరణ కోసం NPCIతో ఆధార్ నంబర్‌ను భాగస్వామ్యం చేయడంలో కేవలం ఫెసిలిటేటర్‌గా మాత్రమే పనిచేస్తుంది. -
కొత్త రూల్ : క్రెడిట్‌కార్డుదారులకు అలర్ట్.. అలా వాడితే ట్యాక్స్ కట్టాల్సిందే!
న్యూఢిల్లీ: విదేశాల్లో క్రెడిట్ కార్డులపై చేసే ఖర్చుల మీద 20 శాతం టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్) విధింపుపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆర్థిక శాఖ వివరణ ఇచ్చింది. ఒక ఏడాదిలో రూ. 7 లక్షల వరకు క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చేసే వ్యయాలపై టీసీఎస్ విధించబోమని పేర్కొంది. ఇదీ చదవండి: రూ. 2000 నోట్ల రద్దు: షాపింగ్ చేసుకోవచ్చా? విదేశాల్లో క్రెడిట్ కార్డుతో చేసే వ్యయాలను కూడా కేంద్రం ఇటీవల రెమిటెన్స్ స్కీమ్–ఎల్ఆర్ఎస్ పరిధిలోకి తెచ్చింది. దీంతో జూలై 1 నుంచి విదేశాల్లో క్రెడిట్ కార్డులపై చేసే వ్యయాలపై 20% పన్ను వర్తించనుంది. అయితే ఇది ట్యాక్స్ టెర్రరిజం అంటూ విమర్శలు వెల్లువెత్తడంతో ఆర్థిక శాఖ తాజా ప్రకటన చేసింది. చదవండి👉 ఫ్లాష్‌బ్యాక్: ఆ నిర్ణయంతో..అతలాకుతలం మరిన్ని ఆసక్తికరమైన కథనాలు, అప్డేట్స్ కోసం చదవండి సాక్షి,బిజినెస్ -
అదిరిపోయే క్రెడిట్ కార్డ్, భారీ డిస్కౌంట్లు.. ఉచితంగా రైల్వే సదుపాయాలు!
హైదరాబాద్: ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎన్పీసీఐ భాగస్వామ్యంతో బిజినెస్ క్యాష్ బ్యాక్ రూపే క్రెడిట్ కార్డ్‌ను విడుదల చేసింది. వ్యాపారస్తుల కోసం దీన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చింది. కార్డు ద్వారా కొనుగోళ్లపై 2 శాతం వరకు క్యాష్‌బ్యాక్, 48 రోజుల పాటు వడ్డీ లేని రుణ సదుపాయం, తక్షణ రుణ సదుపాయం ఈ కార్డులో భాగంగా ఉంటాయని ప్రకటించింది. అలాగే అగ్ని ప్రమాదాలు, దోపిడీలు, ఇళ్లు బద్ధలు కొట్టడం తదితర వాటికి కార్డులో భాగంగా బీమా కవరేజీ పొందొచ్చని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తెలిపింది. ఎన్పీసీఐ సీఈవో దిలీప్ ఆస్బే సమక్షంలో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎండీ, సీఈవో సంజయ్ అగర్వాల్ ఈ కార్డును ప్రారంభించారు. ఈ కార్డుపై లైఫ్‌స్టయిల్, ట్రావెల్ ప్రయోజనాలు కూడా ఉన్నట్టు బ్యాంక్ ప్రకటించింది. 300కు పైగా రెస్టారెంట్లలో 30% వరకు తగ్గింపు, ఏడాదికి 8 సార్లు రైల్వే లాంజ్‌లను ఉచితంగా వినియోగించుకునే సదుపాయం ఉంటుందని తెలిపింది. చదవండి👉 240 ఏళ్ల చరిత్రలో మ్యాన్ గ్రూప్ సంచలనం.. తొలిసారి మహిళా సీఈవో నియామకం! -
ఆ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులు వాడుతున్నారా? కొత్త రూల్స్ చూసారా..!
కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభమైపోయింది. ఈ తరుణంలో ఎన్నెన్నో కొత్త రూల్స్ కూడా పుట్టుకొచ్చాయి. ఇందులో భాగంగానే కొన్ని బ్యాంకులు తమ క్రెడిట్ కార్డు / డెబిట్ కార్డులలో చాలా మార్పులు తీసుకువచ్చాయి. ఇందులో ఎస్బీఐ, కోటక్ మహీంద్రా, పంజాబ్ నేషనల్ బ్యాంకు ఉన్నాయి. ఈ బ్యాంకులు చేసిన మార్పులను గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్యూర్-ప్లే క్రెడిట్ కార్డ్ జారీచేసే ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ (ఎస్బీఐ కార్డ్) తమ AURUM కార్డ్‌లలో కొన్ని మార్పులు తీసుకువచ్చింది. దీని ప్రకారం ఆరమ్ కార్డు కలిగిన వారు RBL Luxeకి బదులుగా టాటా క్లిక్ లగ్జరీ నుంచి రూ. 5000 వోచర్ పొందుతున్నారు. గతంలో రూ.5 లక్షలు క్రెడిట్ కార్డు ద్వారా ఖర్చు చేసిన వారికి ఆర్బీఎల్ లగ్జరీ నుంచి ఈ వోచర్ వచ్చేది. ఈజీ డైనర్ ప్రైమ్, లెన్స్ కార్ట్ గోల్డ్ మెంబర్ షిప్ ప్రయోజనాలను తొలగించింది. అయితే ఈ కార్డు మీద ప్రైమ్ అండ్ లెన్స్‌కార్ట్ గోల్డ్ మెంబర్షిప్ బెనిఫిట్ ఇకపై అందుబాటులో ఉండే అవకాశం ఉండదు. పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) 2023 మే 1 నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) కూడా కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువచ్చింది. దీని ప్రకారం ఏటీఎమ్ నుంచి అమౌంట్ డ్రా చేసుకోవడం వంటి లావాదేవీలపైన రూ. 10 + జీఎస్టీ విధిస్తోంది. అంతే కాకుండా డెబిట్ కార్డు, ప్రీపెయిడ్ కార్డు వంటి వాటికి కూడా కొంత రుసుము అమలు చేసే ప్రక్రియలో బ్యాంకు ఆలోచిస్తున్నట్లు సమాచారం. కోటక్ మహీంద్రా బ్యాంకు కోటక్ మహీంద్రా బ్యాంకు విషయానికి వస్తే, ఇది 2023 మే 23 నుంచి డెబిట్ కార్డు చార్జీలను రూ. 259తో పాటు GST పెంచనున్నట్లు తమ కస్టమర్లకు ఒక మెయిల్ ద్వారా తెలిపింది. గతంలో ఈ చార్జీలు రూ. 199 ప్లస్ జీఎస్టీతో ఉండేది. కావున ఈ బ్యాంకు కూడా త్వరలోనే కొత్త రూల్స్ ద్వారా కస్టమర్ల మీద పెను భారాన్ని మోపే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
ఏటీఎం కార్డ్ మెషిన్లో ఇరుక్కుపోయిందా.. జాగ్రత్త!
మీ ఏటీఎం కార్డు ఎప్పుడైనా మెషిన్లో ఇరుక్కుపోయిందా.. ఇలాంటప్పుడు మీరేం చేస్తారు.. తోటివారిని సాయం అడుగుతారు. మెషిన్లో ఏదో సమస్య వచ్చిందిలే అనుకుని బ్యాంకును సంప్రదిస్తారు.ఇలాంటి సందర్భంలోనే మోసగాళ్లు పొంచి ఉంటారు. సాయం చేసే నెపంతో కార్డులు మార్చి డబ్బులు కాజేస్తారు. కాపలా లేని ఏటీఎం సెంటర్ల వద్ద ఇలాంటి మోసగాళ్లు మాటు వేస్తున్నారు. ఏటీఎం మెషిన్లలో సమస్య కారణంగా ఇబ్బంది పడుతున్న కార్డుదారులను ఏమార్చి వారి కార్డులను క్లోనింగ్ చేయడమో మార్చేయడమో చేసి వారి కష్టార్జితాన్ని దోచేస్తున్నారు. ఈ మోసం ఇక్కడితో ఆగిపోదు. మీ కార్డ్‌ని మార్చేసిన కేటుగాళ్లు ఆ కార్డును ఉపయోగించి అకౌంట్లోని డబ్బు మొత్తాన్ని నిమిషాల వ్యవధిలో కొట్టేస్తున్నారు. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది నిజం. ఇదీ చదవండి: ఏటీఎం చార్జీలు.. జీఎస్టీ కొత్తరూల్! మే 1 నుంచి అమలయ్యే కీలక మార్పులు ఇవే.. ఇటువంటి అనేక ముఠాలు దేశంలోని అనేక ప్రాంతాలలో సంచరిస్తున్నాయి. డబ్బులు విత్‌డ్రా చేయడానికి ఏటీఎం మెషిన్లో కార్డ్ పెట్టి పిన్ ఎంటర్ చేసిన తర్వాత డబ్బు బయటకు రాగానే ఏటీఎం కార్డ్ మెషిన్లో ఇరుక్కుపోతుంది. ఏటీఎం స్క్రీన్‌పై అకౌంట్ బ్యాలెన్స్, ఫోన్ నంబర్, ఇతర వివరాలు కన్పిస్తాయి. మెషిన్లో ఏదో సమస్య తలెత్తిందని మీరు గ్రహించేలోపే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు లోపలికి ప్రవేశిస్తారు. వారిలో ఒకరు మిమ్మల్ని మాటల్లో పెడతారు. మరొకరు మీ కార్డును వేరే కార్డుతో మార్చేసి కాజేసి అక్కడి నుంచి ఉడాయిస్తారు. తర్వాత కొద్ది సమయానికే డబ్బు విత్ డ్రా చేసినట్లు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఎస్సెమ్మెస్‌లు వస్తాయి. భయాందోళనకు గురైన కస్టమర్లు బ్యాంకుకు కాల్ చేసినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే జరగాల్సిన మోసం అప్పటికే జరిగిపోయి ఉంటుంది. కార్డ్ డియాక్టివేషన్ అనేది చాలా శ్రమతో కూడుకున్న ప్రక్రియ. ఎందుకంటే అటువంటి సమస్యలను పరిష్కరించడానికి బ్యాంకులకు ప్రత్యేక వ్యవస్థ అంటూ ఏమీ ఉండదు. అనేక మంది బాధితులు ఇలాంటి మోసాలకు గురైన కస్టమర్లు చాలా మందే ఉన్నారు. ఢిల్లీలో ఒక సీనియర్ జర్నలిస్ట్ నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంకు వెళ్లగా తన కార్డ్ మెషిన్లో ఇరుక్కుపోయింది. సహాయం చేసే నెపంతో దుండగులు తన ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ డెబిట్ కార్డ్‌ను ప్రభుత్వ రంగ బ్యాంకు కార్డుతో మార్చేశారు. ఘటన జరిగిన 10 నిమిషాల్లోనే తన మొబైల్లో విత్‌డ్రా నోటిఫికేషన్లు రావడంతో మోసపోయానని గ్రహించి వెంటనే బ్యాంక్ కస్టమర్ కేర్ సెంటర్‌కు ఫోన్ చేసి కార్డ్ బ్లాక్ చేయాలని కోరాడు. అయినా అకౌంట్ నుంచి డబ్బు పోవడం ఆగలేదు. ఎందుకంటే కార్డ్ డీయాక్టివేట్ చేసేందుకు సమయం పట్టింది. అలాగే తూర్పు ఢిల్లీలో జరిగిన మరో ఘటనలో ఓ గృహిణి ప్రభుత్వ రంగ బ్యాంక్ ఏటీఎంకి వెళ్లింది. ఆమె కార్డ్ కూడా ఇలాగే ఇరుక్కుపోయింది. ఆ కార్డును మోసగాళ్లు మార్చేసి షాపింగ్ చేశారు. ఆమె వెంటనే ఫిర్యాదు చేసినా దాదాపు రూ.1 లక్ష కోల్పోయిన తర్వాత ఆ కార్డ్ డీయాక్టివేట్ అయింది. ఇలాంటి మోసాలు జరగినప్పుడు ఏకకాలంలో బ్యాంక్ బ్రాంచ్ని సంప్రదించి, సైబర్ క్రైమ్ బ్రాంచ్‌కు ఫిర్యాదు చేస్తే మీ డబ్బును తిరిగి పొందడంలో సహాయపడతారని ఆర్బీఐ చెబుతోంది. అయితే బ్యాంకులు మాత్రం ఈ పిన్ నంబర్ మోసగాళ్లకు తెలిసి ఉండవచ్చని ఎప్పుడూ చెప్పే సమాధానమే చెబుతాయి. ఇక సైబర్ క్రైమ్ బ్రాంచ్ వద్ద ఇలాంటి కేసులు వేలల్లో ఉంటాయి. 65,893 మోసాలు ఆర్బీఐ డేటా ప్రకారం.. ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లకు సంబంధించి 2021-22లో 65,893 మోసాలు జరిగాయి. కస్టమర్లు నష్టపోయిన డబ్బు రూ.258.61 కోట్లు. మోసగాళ్లు రోజుకో కొత్త మార్గాన్ని కనిపెట్టి కస్టమర్లను మోసం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు నివారించడానికి డిజిటల్, తక్కువ నగదు లావాదేవీలను ప్రోత్సహించడానికి ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదీ చదవండి: Aunkita Nandi: రెండు అద్దె కంప్యూటర్లతో రూ.100 కోట్ల వ్యాపారం! ఈ బెంగాలీ అమ్మాయి సంకల్పం మామూలుది కాదు.. -
డీసీబీ ట్రావెల్ స్మార్ట్ కార్డ్
ముంబై: డీసీబీ బ్యాంక్.. డీసీబీ ట్రావెల్ స్మార్ట్ కార్డ్‌ను విడుదల చేసింది. అంతర్జాతీయ పర్యటనలు, వ్యాపార పర్యటనలు, వేకేషన్ల కోసం దీన్ని తీసుకొచ్చినట్టు ప్రకటించింది. భారత్‌లో ఉన్నప్పుడు ఇది డెబిట్ కార్డ్‌గా పనిచేస్తుందని తెలిపింది. ఈ కార్డ్ ఉంటే విదేశీ కరెన్సీలను కొనుగోలు చేయాల్సిన అవరం లేకుండా సులభంగా ఎక్కడైనా ప్రయాణించొచ్చని, బీమా కవరేజీ, అదే సమయంలో డీసీబీ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలోని బ్యాలన్స్‌పై ఆకర్షణీయమైన వడ్డీ రేటును ఆఫర్ చేసే మూడు రకాల ప్రయోజనాలతో డీసీబీ ట్రావెల్ స్మార్ట్ కార్డ్ వస్తుందని బ్యాంక్ తెలిపింది. ఇందులో ఫారీన్ కరెన్సీ మార్కప్ చార్జీలు అతి తక్కువగా 2 శాతమేనని పేర్కొంది. వీసా కార్డ్‌ను ఆమోదించే అన్ని అంతర్జాతీయ వేదికల వద్ద ఈ కార్డ్‌ను వినియోగించుకోవచ్చని వెల్లడించింది. -
వారికోసం యస్ బ్యాంక్ ప్రైవేట్ డెబిట్ కార్డు, బెనిఫిట్స్ ఏంటి?
ముంబై: అత్యంత సంపన్న కస్టమర్ల (హెచ్ఎన్ఐ) కోసం మాస్టర్‌కార్డ్ భాగస్వామ్యంతో యస్ బ్యాంక్ కొత్తగా ప్రైవేట్ డెబిట్ కార్డును ఆవిష్కరించింది. సంపన్న ప్రొఫెషనల్స్, ఎంట్రప్రెన్యూర్ల అవసరాలకు తగినట్లుగా ఇందులో ఫీచర్లు ఉంటాయని యస్ బ్యాంక్ గ్లోబల్ హెడ్ రాజన్ పెంటాల్ తెలిపారు. ట్రావెల్, వెల్నెస్, లైఫ్‌స్టయిల్ వంటి వివిధ విభాగాల్లో ప్రత్యేక ప్రయోజనాలు అందు కోవచ్చని పేర్కొన్నారు. ఓబెరాయ్ హోట ల్స్ నుంచి ఈ-గిఫ్ట్ వోచర్లు, కాంప్లిమెంటరీ గోల్ఫ్ సెషన్లు, ఎయిర్పోర్ట్ లాంజ్‌లకు యాక్సెస్ పొందవచ్చని వివరించారు. ఆసి యా పసిఫిక్ దేశాల్లో ఈ తరహా వర ల్డ్ ఎలైట్ డెబిట్ కార్డును ప్రవేశపెట్టడం ఇదే తొలిసారని మాస్టర్ కార్డ్ ప్రెసిడెంట్ గౌతమ్ అగర్వాల్ తెలిపారు. -
పీవోఎస్, యూపీఐ లావాదేవీలకు ప్రోత్సాహకాలు
న్యూఢిల్లీ: పాయింట్ ఆఫ్ సేల్, ఈ కామర్స్ సంస్థలకు రూపే డెబిట్ కార్ట్‌తో చేసే చెల్లింపులు, వరక్తుల వద్ద భీమ్ యూపీఐ ప్లాట్‌ఫామ్ సాయంతో చేసిన తక్కువ విలువ లావాదేవీలకు ప్రోత్సాహకాలను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్ ఉంచారు. రూపే కార్డు, భీమ్ యూపీఐ లావాదేవీ రూ.2,000లోపున్న వాటిపై ఈ ప్రోత్సాహకాలు అందనున్నాయి. పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మెషిన్లపై, ఈ కామర్స్ సైట్లపై రూపే డెబిట్ కార్డుతో చెల్లింపులు చేసినప్పుడు.. స్వీకరించే బ్యాంకులకు 0.4 శాతం, గరిష్టంగా రూ.100 ప్రోత్సాహకంగా లభిస్తుంది. భీమ్ యూపీఐ ఆధారిత లావాదేవీలపై చెల్లింపులను స్వీకరించే బ్యాంకులకు 0.25 ప్రోత్సాహకం లభిస్తుంది. ఇవి రిటైల్ చెల్లింపులకు సంబంధించినవి. అలా కాకుండా ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్, ప్రభుత్వం, విద్య, రైల్వే తదితర రంగాల్లోని లావాదేవీలపై ప్రోత్సాహకాలు భిన్నంగా ఉన్నాయి. 2022 ఏప్రిల్ 1 నుంచి ఈ ప్రోత్సాహకాలు ఏడాది పాటు అమల్లో ఉంటాయి. గరిష్టంగా రూ.2,600 కోట్లను ఈ ప్రోత్సాహకాల కోసం కేంద్రం కేటాయించింది. -
రూపే కార్డుల ప్రోత్సాహానికి రూ. 2,600 కోట్ల స్కీం!
న్యూఢిల్లీ: రూపే డెబిట్ కార్డులు, తక్కువ విలువ చేసే భీమ్–యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించే దిశగా కేంద్ర క్యాబినెట్ బుధవారం రూ. 2,600 కోట్ల స్కీముకు ఆమోదముద్ర వేసింది. దీని కింద ఈ ఆర్థిక సంవత్సరంలో రూపే కార్డులు, యూపీఐని ఉపయోగించి జరిపే పాయింట్ ఆఫ్ సేల్స్, ఈ–కామర్స్ లావాదేవీలను ప్రోత్సహించినందుకు గాను బ్యాంకులకు ప్రోత్సాహకాలు లభిస్తాయి. అనగా కేంద్రం ఈ పథకం కింద బ్యాంకులకు ఆర్థికసాయాన్ని అందివ్వనుంది. ఈ పథకం ద్వారా బలమైన డిజిటల్ చెల్లింపు వ్యవస్థగా వృద్ధి చెందాలని భావిస్తోంది. వినియోగదారులు వ్యాపారులకు తక్కువ విలువ గల పేమెంట్స్‌ను పోత్సహిస్తుంది. యూపీఐ లైట్, యూపీఐ123పే ద్వారా డిజిటల్ చెల్లింపులను ప్రమోట్ చేస్తుంది. ఈ పథకంతో భారత్ డిజిటల్ చెల్లింపుల విషయంలో మరో ముందడుగు వేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. చదవండి: టాలెంట్ కోసం విప్రో కీలక నిర్ణయం: ఉద్యోగులకు బంపర్ ఆఫర్ -
గుడ్ న్యూస్: ఏటీఎం కార్డ్ లేకుండా క్యాష్ విత్‌డ్రా.. ఇలా చేస్తే సరిపోతుంది!
న్యూఢిల్లీ: గతంలో బ్యాంకులోని మన నగదుని తీసుకోవాలంటే.. అయితే బ్యాంకుకు వెళ్లాలి లేదా ఏటీం( ATM) మెషిన్‌కు వెళ్లి డెబిట్ కార్డ్‌తో కావాల్సినంత డబ్బులను డ్రా చేసుకోవాలి. కానీ నేటి డిజిటల్ యుగంలో, మీరు డెబిట్ కార్డ్ లేకుండా కూడా ఏటీఎం మెషీన్ నుంచి డబ్బును తీసుకోవచ్చు. దీని కోసం మీకు మీ మొబైల్ మాత్రమే అవసరం. చాలా రోజుల నుంచి ఈ బ్యాంకింగ్ సర్వీస్ నడుస్తోంది. అసలు ఇలాంటి సర్వీస్ ఒకటి ఉందని చాలా మందికి కూడా తెలియదు. డబ్బులు డ్రా చేసేందుకు.. ఏటీఎం అక్కర్లేదు ఇప్పటికే చాలా బ్యాంకులు తమ కస్టమర్లకు కార్డు లేకుండానే డబ్బు తీసుకునే వెసులుబాటును కల్పిస్తున్నప్పటికీ.. తాజాగా రిజర్వ్ బ్యాంక్ తన పరిధిని మరింత పెంచింది. ఈ సౌకర్యం కోసం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) ఉపయోగించనుంది. డెబిట్ కార్డ్ లేకుండా ఏటీఎం నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవాలంటే, మీరు తప్పనిసరిగా స్మార్ట్‌ఫోన్‌ని కలిగి ఉండాలి. మీ స్మార్ట్‌ఫోన్‌లో భీం(BHIM), పేటీఎం (Paytm), గూగుల్‌పే (GPay), ఫోన్‌పే (PhonePe) మొదలైన యాప్‌లను ఉపయోగించి ద్వారా డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇలా ఫాలో అయితే సరిపోతుంది.. ఏటీఎం సెంటర్లోకి వెళ్లి కార్డ్ లేకుండా డబ్బు విత్‌డ్రా చేసుకునే ఆప్షన్‌ను ఎంచుకోండి. మీరు యూపీఐ ద్వారా గుర్తింపును అందించే ఎంపికను చూస్తారు. ఆ తర్వాత మీ మొబైల్లో యూపీఐ యాప్‌ని ఓపెన్ చేసి, మీ ముందు కనిపిస్తున్న QR కోడ్‌ను స్కాన్ చేయండి. ఇక్కడి నుంచి ప్రక్రియ మునుపటి మాదిరిగానే ఉంటుంది. మీకు కావలసిన డబ్బును ఎంటర్ చేయండి ఆ తర్వాత విత్‌డ్రా చేసుకోండి. కార్డ్ లెస్ క్యాష్.. ప్రయోజనాలు ఇవే కార్డు లేకుండా నగదు విత్‌డ్రా చేసుకునే సదుపాయం కార్డు స్కిమ్మింగ్, కార్డ్ క్లోనింగ్ వంటి మోసాలను నిరోధించడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా, మీరు కార్డును మీ వద్ద ఉంచుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. మీ స్మార్ట్‌ఫోన్ ఈ పనులన్నింటినీ చేస్తుంది. చదవండి: కొత్త ఏడాదిలో యూజర్లకు షాక్.. నెట్‌ఫ్లిక్స్ పాస్వర్డ్ షేర్ చేస్తే పైసలు కట్టాలి! -
ఫోన్‌పే వాడుతున్నారా? అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు గురించి తెలుసా!
ఫోన్‌పే(Phone Pay) .. డిజిటల్ లావాదేవీలు పెరిగినప్పటి నుంచి ఈ పేరు బాగా పాపలర్ అయిపోయింది. పర్సలో మనీ లేకపోయినా పర్లేదు ఫోన్లో ఫోన్‌పే ఉంటే చాలు అనుకునేంతగా ప్రజాదారణ పొందింది ఈ యాప్. ప్రస్తుతం 350 మిలియన్ల మంది రిజిస్టర్డ్ కస్టమర్లతో పలు సేవలు అందిస్తూ భారత్‌లో దూసుకుపోతుంది ఫోన్‌పే. ఎప్పటికప్పడు కొత్త సేవలో కస్టమర్లను ఆకట్టుకుంటూ వారి సంఖ్యను పెంచుకుంటున్న ఈ యాప్ తాజాగా మరో సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. సరికొత్త సేవల మీ కోసం.. ఇది వరకు ఫోన్‌పే ఉపయోగించాలంటే తప్పనిసరిగా మన డెబిట్ కార్డుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే డెబిట్ కార్డు అవసరం లేకుండా సరికొత్త సేవలను ఫోన్‌పే అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో వినియోగదారుడు కేవలం ఆధార్ కార్డు ఉపయోగించి యూపీఐ సేవలు పొందవచ్చని ఫోన్ పే తెలిపింది. ఇకపై ఫోన్ పేలో మీ డెబిట్ కార్డ్ అవసరం లేకుండా కేవలం మీ ఆధార్ కార్డ్ ద్వారా ఫోన్‌పేలో మీ యూపీఐ (UPI)ని సెటప్ చేయాలనుకుంటే, సింపుల్‌గా ఇలా ఫాలో అవ్వండి. ►ముందుగా ప్లేస్టోర్ (PlayStore) లేదా యాప్ స్టోర్( App Store) నుంచి ఫోన్‌పేని డౌన్లోడ్ చేసుకోండి. ►ఆపై ఓపెన్ చేసి మీ మొబైల్ నంబర్ని యాడ్ చేయండి, తర్వాత OTP వస్తుంది దాని ఎంటర్ చేయండి. ►ఇప్పుడు మై మనీ పేజీకి వెళ్లి, ఆపై పేమెంట్స్ మెతడ్స్ (payments method)పై క్లిక్ చేయండి. ►తర్వాత మీ బ్యాంక్‌ని ఎంచుకోని, 'Add New Bank Account'పై క్లిక్ చేయండి. ► మీ బ్యాంక్‌ని సెలక్ట్ చేసుకుని, మీ ఫోన్ నంబర్ని ధృవీకరించాల్సి ఉంటుంది. ►దీంతో ఫోన్‌పే మీ ఖాతా వివరాలను యాక్సెస్ పొందుతుంది, వీటితో పాటు మీ అకౌంట్ యూపీఐకి లింక్ అవుతుంది. ►తర్వాత మీ డెబిట్/ఏటీఎం కార్డ్ వివరాలను నమోదు చేయవచ్చు లేదా ఆధార్ కార్డ్ ఎంపికను ఎంచుకోవచ్చు. ►మీ ఆధార్‌లోని చివరి ఆరు అంకెలను నమోదు చేయండి. మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. ► OTPని ఎంటర్ చేసి ఆపై మీ యూపీఐ పిన్ నెంబర్ సెట్ చేసుకోవడంతో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. చదవండి: వణుకుతున్న ఉద్యోగులు.. డిసెంబర్ నాటికి మాంద్యంలోకి ఆ దేశాలు! -
బాబోయ్.. 90 లక్షల క్రెడిట్ కార్డుల డేటా లీక్!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులతో సహా 90 లక్షల కార్డ్ హోల్డర్ల ఆర్థికపరమైన డేటా భారీ లీకైనట్లు సైబర్-సెక్యూరిటీ పరిశోధకులు బయటపెట్టారు. సింగపూర్ ప్రధాన కార్యాలయంగా కార్యకలాపాలు జరుపుతున్న CloudSEK సంస్థ ఈ విషయాన్ని గుర్తించింది. వారి పరిశోధనలో.. రష్యాకు చెందిన డార్క్ వెబ్ సైబర్ క్రైమ్ ఫోరమ్‌లో 1.2 మిలియన్ కార్డ్‌ల డేటాబేస్‌ను ఉచితంగా అందుబాటులో ఉన్నట్లు తేలింది. వీటితో పాటు 7.9 మిలియన్ కార్డ్ హోల్డర్ డేటా BidenCash వెబ్సైట్లో ఉన్నట్లు కనుగోన్నారు. గతంలో మాదిరి కాకుండా, ఈసారి, హ్యాకర్లు SSN, కార్డ్ వివరాలు, CVV వంటి ముఖ్యమైన వ్యక్తిగత సమాచారాన్ని విడుదల చేశారని బృందం వెల్లడించింది. వీటితో పాటు కార్డ్ వివరాలతో అనుసంధానించిన చాలా వ్యక్తిగత ఇమెయిల్‌లు కూడా బయటపడ్డాయి. BidenCash ద్వారా గతంలో సాఫ్ట్‌బ్యాంక్, ప్రపంచ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ సింగపూర్‌తో అనుబంధించబడిన అధికారిక ఇమెయిల్‌ల రికార్డులు కూడా లీక్ అయ్యాయి. "స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫిసర్వ్ సొల్యూషన్స్ LLC, అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌లతో పాటు కొన్ని అగ్రశ్రేణి బ్యాంకింగ్ సంస్థల కస్టమర్ల డేటా కూడా లీక్ అయ్యింది. మాస్టర్‌కార్డ్, వీసా నెట్‌వర్క్‌లకు సంబంధించిన 414,000 రికార్డులతో సుమారు 508,000 డెబిట్ కార్డ్‌ల వివరాలు కూడా బహిర్గతమైంది." అని భద్రతా పరిశోధకులు దేశాయ్ తెలిపారు. ఈ కార్డుల సమాచారం లీక్ వల్ల అక్రమ కొనుగోళ్ళు, కార్డ్ క్లోనింగ్, అనధికారిక లావాదేవీలు జరుగుతాయని దేశాయ్ అన్నారు. BidenCash వెబ్ సైట్ తన సైట్ కు ట్రాఫిక్‌ను పెంచుకోవడం కోసం ఈ తరహా చర్యలకు పాల్పడుతూ ఉంటుందని తెలిపారు. చదవండి: ఎఫ్బీలో జుకర్‌బర్గ్‌కు భారీ షాక్, కష్టాల్లో మెటా -
క్రెడిట్, డెబిట్ కార్డులపై ఆర్బీఐ కొత్త రూల్
-
‘క్రెడిట్ కార్డు యూజర్లకు ఆర్బీఐ అలెర్ట్’
ఆర్బీఐ, స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థలు (సెబీ) క్రెడిట్ కార్డ్, డీమ్యాట్ అకౌంట్లపై పలు మార్పులు చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 1 నుంచి మార్పులు అమలు కానున్నాయి. వీటితో పాటు టోకనైజేషన్, నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్), అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకాల్లోని మారిన నిబంధనల గురించి తెలుసుకుందాం. క్రెడిట్ కార్డు వినియోగదారుల భద్రతే లక్క్ష్యంగా ఆర్బీఐ ఈ ఏడాది జులై నుంచి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులపై ఎప్పుటికప్పుడు మార్పులు చేస్తూ వస్తుంది. తాజాగా ఆర్బీఐ క్రెడిట్ కార్డుల జారీ అంశంలో కొత్త నిబంధనల్ని తెచ్చింది. ఆ నిబంధనల ప్రకారం.. అక్టోబర్ 1 నుంచి క్రెడిట్ కార్డుల జారీ సంస్థలు.. లబ్ధి దారులకు కార్డు జారీ చేసే ముందు వారి నుంచి ఓటీపీ రూపంలో అనుమతి పొందాల్సి ఉంటుంది. ఆ అనుమతి కార్డు జారీ చేసిన 30 రోజుల్లోగా పొందాల్సి ఉంటుంది. లేదంటే 30 రోజుల తర్వాత కార్డు బ్లాక్ అవుతుంది. అలాగే వినియోగదారుడి అనుమతి లేకుండా క్రెడిట్ కార్డు లిమిట్‌ను పెంచవద్దని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. అటల్ పెన్షన్ యోజన పన్ను చెల్లింపు దారులు అక్టోబర్ 1 లోపు అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకంలో చేరే అవకాశం ఉంది. అక్టోబర్ 1 లేదా ఆ తర్వాత నుంచి చేరేందుకు అనర్హులని కేంద్ర ఆర్ధిక శాఖ తెలిపింది. ఒకవేళ అక్టోబర్ 1 న ఏపీవైలో చేరితే ఆ ఖాతాను బ్లాక్ చేసి, డిపాజిట్ చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని వెల్లడించింది. నేషనల్ పెన్షన్ స్కీమ్ నేషనల్ పెన్షన్ స్కీమ్ ఖాతా దారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. పెన్షన్ ఫండ్ రెగ్యూలరేటరీ అండ్ డెవలప్మెంట్ అథారటీ ( పీఎఫ్ఆర్డీఏ) ఆదేశాల ప్రకారం.. అక్టోబర్ 1 నుంచి పెన్షన్ స్కీమ్ ఖాతాదారులు చేసిన ఈ - నామినేషన్‌ను నోడల్ కార్యాలయం అధికారులు 30 రోజుల వ్యవధిలో యాక్సెప్ట్ చేయొచ్చు. లేదంటే రిజక్ట్ చేయొచ్చు. 30 రోజులు పూర్తయిన అధికారులు స్పందించకపోతే సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ( సీఆర్ఏ) సిస్టమ్‌లో ఆటోమేటిక్‌గా ఇ- నామినేషన్ ఆమోదం పొందుతుంది. డీ మ్యాట్ అకౌంట్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలంటే డీమ్యాట్ అకౌంట్ తప్పని సరి. అయితే ఈ డీమ్యాట్ అకౌంట్‌పై స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ (సెబీ) ఈ ఏడాది జూన్ 14న సర్క్యూలర్‌ను పాస్ చేసింది. ఆ సర్క్యూలర్ ప్రకారం.. డీ మ్యాట్ టూ ఫ్యాక్టర్ అథంటికేషన్‌ను సెప్టెంబర్ 30,2022లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు అకౌంట్‌ను ఓపెన్ చేసేందుకు ఐడీ, పాస్‌వర్డ్‌తో పాటు బయో మెట్రిక్ అథంటికేషన్ చేయాలని సెబీ ఆదేశాలు జారీ చేసింది. -
క్రెడిట్,డెబిట్ కార్డులపై కీలక నిర్ణయం.. ఆర్బీఐ కొత్త రూల్!
డెబిట్, క్రెడిట్ కార్డుల దుర్వినియోగం, సైబర్ నేరాలపై ఫిర్యాదులు ఇటీవల పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వీటికి చెక్ పెట్టేందుకు శ్రీకారం చుట్టింది. అందుకోసం ఆర్బీఐ నూతనంగా కార్డ్-ఆన్-ఫైల్ టోకనైజేషన్ నిబందనలను అక్టోబర్ 1 నుంచి అమలు చేయనుంది. గతంలో కార్డుల వినియోగదారులు వారి భవిష్యత్ చెల్లింపుల కోసం వ్యక్తిగత సమాచారం..అంటే బ్యాంక్ నెంబర్లు, వారి పేర్లు, ఇతర వివరాల్ని వెబ్సైట్లో స్టోర్ చేసేవాళ్లు. దీని కారణంగా సైబర్ నేరాలకు పాల్పడే వారిపని ఈజీగా మారింది. వీటిని అరికట్టేందుకు నూతన టోకన్ పద్దతిని ప్రవేశపెట్టింది ఆర్బీఐ. ఈ కొత్త నిబంధనల ప్రకారం..ఆన్లైన్లో చెల్లింపులు చేసేటప్పుడు 16 అంకెల కార్డు నంబర్, పేర్లు, గడుపు తేది వంటి సమాచారం ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆయా బ్యాంకులు జారీ చేసే నంబర్‌తో ఇకపై లావాదేవీలు చేసుకోవచ్చు. కస్టమర్ల కార్డ్ వివరాలను సేఫ్‌గా ఉంచేందుకు ఆర్బీఐ ఈ టోకనైజేషన్ నిబంధనలను అమలు చేస్తోంది. దీని అమలు తర్వాత కస్టమర్ల డేటా మొత్తం వారి బ్యాంకు వద్ద మాత్రమే ఉంటుంది తప్ప ఇతర వెబ్సైట్లలో ఉండదు. ఈ సర్వీసును పొందేందుకు ఎటువంటి ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు. చదవండి: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు: కొనే ముందు ఇవి గుర్తుపెట్టుకోండి, లేదంటే బేబుకి చిల్లే! -
Cyber Crime: ఏడాదిలో రూ.60,414 కోట్ల సైబర్ మోసాలు
ఉదయం నుంచి రాత్రి వరకూ ఆన్లైన్ ద్వారా చెల్లింపులు ఇప్పుడు మామూలయ్యాయి. టికెట్లు, వస్తువుల కొనుగోళ్లు, బిల్లుల చెల్లింపులకు ఆన్లైన్ మార్గమే శరణ్యమనేంతగా ఆధారపడుతున్నారు. ఇదే సమయంలో మధ్యలో సైబర్ నేరగాళ్లు మాటువేసి అమాయకులను లూటీ చేయడం పెరిగింది. ఏదో ఒక రకంగా మభ్యపెట్టి నగదు దోచేస్తారు. విద్యావంతులు కూడా వీరి వలలో పడడం కొత్త కాదు. అలా పోయిన డబ్బు పోలీసులకు, బ్యాంకులకు ఫిర్యాదు చేస్తే 100 శాతం తిరిగి వస్తుందన్న గ్యారంటీ ఏమీ లేదు. అందుకే సైబర్ నేరాలకు గురికాకుండా జాగ్రత్త పడడమే ఉత్తమం. బనశంకరి: డబ్బు వ్యవహారాలు ఆన్లైన్ అయ్యేకొద్దీ ఆర్థిక నేరాలు తీవ్రమవుతున్నాయి. ఆర్బీఐ నివేదిక ప్రకారం 2021– 22 లో రూ.60,414 కోట్ల మేర సైబర్ మోసాలు చోటుచేసుకున్నాయి. సైబర్ మోసగాళ్ల వల్ల డబ్బు కోల్పోయిన 75 శాతం మంది బాధితులకు ఆ సొమ్ము తిరిగి రావడం లేదు. లోకల్ సర్కిల్స్ అనే సంస్థ సైబర్ నేరాల బాధితులను మూడేళ్ల పాటు సర్వే చేయగా, వారిలో 74 శాతం మందికి ఇప్పటికీ డబ్బు వాపస్ కాలేదని తెలిసింది. సర్వేలో మొదటి ప్రశ్నగా గత మూడేళ్లలో మీరు, లేదా మీ బంధువులు, పరిచయస్తులు నగదు వంచనకు గురయ్యారా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు 11,065 మంది స్పందించగా, అందులో 38 శాతం మంది తమ కుటుంబంలో కనీసం ఒకరు మోసపోయారని తెలిపారు. 54 శాతం జాగ్రత్త పడ్డామని పేర్కొన్నారు. కొంత మందికే తిరిగి దక్కింది ఎవరికైనా డబ్బు తిరిగి వచ్చిందా అని అడగ్గా, 10,995 మంది స్పందించారు, వీరిలో 10 శాతం మంది అవును, ఫిర్యాదు చేసి డబ్బు వెనక్కి తీసుకున్నాం అని తెలిపారు. 19 శాతం మంది ఏ ఫలితమూ లేదని బాధ వెళ్లగక్కారు. ఇంకా 19 శాతం మంది ఫిర్యాదు చేశామని చెప్పగా, మిగిలిన 9 శాతం మంది పోయిన డబ్బు గురించి ఆలోచించడం లేదని చెప్పారు. మొత్తం 74 శాతం మంది బాధితులకు వారి డబ్బు తిరిగి రాలేదు. కంప్యూటర్, మొబైల్లో పాస్వర్డ్స్ 33 శాతం మంది తమ బ్యాంక్ అకౌంట్, డెబిట్ లేదా క్రెడిట్‌కార్డు పాస్వర్డ్స్, ఆధార్, పాన్‌కార్డు నంబర్లను కంప్యూటర్లో దాచుకున్నారు. 11 శాతం మంది ఈ వివరాలు అన్నింటిని మొబైల్లో భద్రపరచుకున్నట్లు చెప్పారు. దీంతో సులభంగా వంచకులు, హ్యాకర్లు చేతికి అందడంతో వంచనకు గురిఅవుతున్నారు. ఇ కామర్స్ ద్వారా అధిక మోసాలు ఇక ఎలా వంచన జరిగింది అన్న ప్రశ్నకు 9,936 మంది స్పందించగా 29 శాతం మంది బ్యాంక్ అకౌంట్ ద్వారా మోసానికి గురైనట్లు తెలిపారు. ఆన్లైన్ షాపింగ్ యాప్స్, వెబ్సైట్లలో కొనుగోళ్లు (ఇ–కామర్స్) వల్ల 24 శాతం మంది వంచనకు గురయ్యారు. ఇదే అత్యధికం. 18 శాతం మంది క్రెడిట్ కార్డులతో మోసపోయారు. 12 శాతం మందిని మోసపూరిత మొబైల్ అప్లికేషన్లు లూటీ చేశాయి. 8 శాతం మంది డెబిట్ కార్డులు, 6 శాతం మంది బీమా పేర్లతో నష్టపోయారు. సైబర్ వంచనకు గురైనవారు తక్షణం పోలీస్ సహాయవాణి 112 నంబరుకు ఫోన్ చేస్తే పోయిన డబ్బు వెనక్కి తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. -
‘సన్’ స్ట్రోక్స్! ఆన్లైన్ క్లాస్‌ల పేరిట గేమ్‌లకు బానిసగా...
సాక్షి, హైదరాబాద్: నగరంలోని యువకుల తల్లిదండ్రులకు ఇటీవల ‘సన్’ స్ట్రోక్స్ ఎక్కువగా తగులుతున్నాయి. ఆన్లైన్ గేమింగ్‌కు అలవాటు పడుతున్న యువత వాటిలో గెలవడానికి బానిసలుగా మారిపోతున్నాయి. దీనికోసం ఆయా కంపెనీల ట్రాప్‌లో పడి యూసీ పాయింట్లు కొంటున్నారు. వాటిని ఖరీదు చేయడానికి తల్లిదండ్రుల క్రెడిట్, డెబిట్ కార్డులు వారికి తెలియకుండా వాడేస్తున్నారు. అంబర్‌పేట ప్రాంతానికి చెందిన పదో తరగతి విద్యార్థి ఫ్రీఫైర్ గేమ్ కోసం తన తల్లి, తాతల బ్యాంకు ఖాతాల్లోని రూ.36 లక్షలు వాడిన ఉదంతం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పథకం ప్రకారం కంపెనీల వ్యవహారం.. కోవిడ్ నేపథ్యంలో దాదాపు రెండేళ్లుగా ఆన్లైన్ క్లాసులే నడుస్తున్నాయి. దీంతో దాదాపు ప్రతి విద్యార్థి చేతికి ఫోన్, ట్యాబ్‌లు వచ్చి చేరాయి. దీన్ని క్యాష్ చేసుకోవడానికి గేమింగ్ కంపెనీలు పథకం ప్రకారం వ్యవహరిస్తున్నాయి. ఆకర్షణీయమైన ప్రకటనలు, లింకుల ద్వారా తమ గేమ్స్‌ను ప్రమోట్ చేస్తున్నాయి. వీటికి ఆకర్షితులవుతున్న విద్యార్థులు వాటిని ఇన్స్టాల్ చేసుకుని ఆడటం మొదలెడుతున్నారు. ఈ గేమ్స్ అన్నీ వాటి నిర్వాహకులు రూపొందించిన ప్రత్యేక ప్రోగ్రామింగ్ ద్వారా నడుస్తుంటాయి. దీనిప్రకారం గేమ్ ఆడటం కొత్తగా ప్రారంభించిన వారి ఐపీ అడ్రస్ తదితర వివరాలను నిర్వాహకులు సంగ్రహిస్తారు. దీని ఆధారంగా తొలినాళ్లల్లో దాదాపు ప్రతి గేమ్‌లోనూ వాళ్లే గెలిచేలా చేసి బానిసలుగా మారుస్తారు. పాయింట్లతో బలపడతావంటూ... ఇలా తమ గేమ్‌కు బానిసగా మారిన వారిని ఎంపిక చేసుకునే నిర్వాహకులు అసలు కథ మొదలెడుతున్నారు. కొన్ని రోజుల పాటు వాళ్లు ఆయా గేమ్స్‌లో ఓడిపోయేలా చేస్తారు. ఆపై గేమ్‌లో నువ్వు వీక్ అయిపోయావంటూ సందేశాలు పంపి రెచ్చగొడతారు. దీంతో తాను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే భావన యువతలో కలిగిస్తారు. ఆపై అసలు కథ మొదలెట్టి.. కొన్ని రోజుల తర్వాత ఆ యూసీ పాయింట్లు ఉచితంగా ఇవ్వలేమంటూ మెలికపెడతారు. అవి కావాలంటే తమ వద్ద రిజిస్టర్ చేసుకుని, డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో చెల్లింపులు చేయాలని షరతు విధిస్తారు. అప్పటికే ఈ గేమ్స్‌కు బానిసలుగా మారుతున్న యువత తేలిగ్గా వాటి నిర్వాహకుల ట్రాప్‌లో పడిపోతున్నారు. అలా తమ తల్లిదండ్రుల కార్డులు తీసుకుని వారికి తెలియకుండా పేమెంట్లు చేస్తున్నారు. యువత అనునిత్యం రూ.2 వేల నుంచి రూ.3 వేలు ఖర్చు చేసేస్తోంది. నేరగాళ్ల పనిగా భావిస్తున్న తల్లిదండ్రులు.. ఇలా అనునిత్యం తమకు తెలియకుండా కార్డులు, ఖాతాల నుంచి చిన్న మొత్తాలు పోతుండటాన్ని తల్లిదండ్రులు తక్షణం గుర్తించలేకపోతున్నారు. కొన్ని రోజుల తర్వాత ఇవి పెద్ద మొత్తాలుగా మారిన తర్వాత తెలుసుకుంటున్నారు. ఆ పని చేసింది సైబర్ నేరగాళ్లుగా భావించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. యువకులే డబ్బు పెట్టి ఆడుతున్నారు యువకులతో పాటు యువతులూ ఇలాంటి గేమ్స్‌కు బానిసలుగా మారుతున్నారు. తల్లిదండ్రులు అప్రమత్తం కావాలి. పిల్లలు ఆన్లైన్ గేమ్స్‌కు బానిసలు కాకుండా చూసుకోవాలి. – కేవీఎం ప్రసాద్, సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ (చదవండి: అరువుపై ఎరువులు ఇవ్వం) -
క్రెడిట్, డెబిట్ కార్డులు వాడుతున్నారా..! అయితే మీకో షాకింగ్ న్యూస్..!
క్రెడిట్, డెబిట్ కార్డుల వాడకం ఈ రోజుల్లో సర్వసాధారణమైంది. వీటి వాడకం ఎంతగా ఉందో..అదే స్థాయిలో సైబర్ నేరాలు కూడా ఎక్కువయ్యాయి. అమాయక ప్రజలను మోసం చేస్తూ క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలను కొట్టేసి, డబ్బులను లాగేసుకుంటున్నారు సైబర్ నేరస్తులు. వీరి నుంచి దూరంగా ఉండేందుకుగాను క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలను ఇతరులతో పంచుకోవద్దంటూ బ్యాంకులు కూడా హెచ్చరిస్తుంటాయి. ఇక క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డును హ్యాక్ చేయడానికి కేవలం ఆరు సెకన్ల సమయం సరిపోతుందంటూ ఒక నివేదిక వెలుగులోకి వచ్చింది. ప్రముఖ గ్లోబల్ వీపీఎన్ సర్వీసెస్ ప్రొవైడర్ నార్డ్‌వీపీఎన్ అనే సంస్థ క్రెడిట్, డెబిట్ కార్డుల హ్యకింగ్‌పై ఒక నివేదికను రిలీజ్ చేసింది. కోవిడ్ 19 కారణంగా ఆన్లైన్ లావాదేవీలు భారీగా పెరిగాయి. దీంతో డిజిటల్ లావాదేవీలు అధికమయ్యాయి. ఇప్పుడు ఇదే సైబర్ నేరస్తుల పాలిట వరంలా మారిందని నార్డ్ వీపీఎన్ పేర్కొంది. 140 దేశాల నుంచి 40 లక్షల కార్డు పేమెంట్లను పరిశీలిస్తే.. బ్రూట్ ఫోర్స్ ద్వారా డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు పేమెంట్లను ఎక్కువగా హ్యాక్ చేస్తున్నారని వెల్లడించింది. ఇలాంటి మోసాలు చాలా వేగంగా జరుగుతాయని, కేవలం సెకన్ల వ్యవధిలోనే సదరు డెబిట్, క్రెడిట్ కార్డు యూజర్ల నుంచి డబ్బులను ఇట్టే స్వాహా చేస్తోన్నట్లు పేర్కొంది. డార్క్ వెబ్‌లో వివరాలు..! పెద్ద సంఖ్యలో కార్డు పేమెంట్స్ వివరాలు డార్క్ వెబ్‌లో కనిపించడానికి ముఖ్య కారణం బ్రూట్ ఫోర్స్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. వీరు సదరు డెబిట్, క్రెడిట్ కార్డుల నెంబర్లను, సీవీవీను అంచనా వేస్తున్నారని నార్డ్‌వీపీఎన్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మరిజూస్ బ్రిడీస్ తెలిపారు. హ్యకింగ్‌లో భాగంగా.. తొలి 6 - 8 డిజిట్స్ అనేవి కార్డు ఇష్యూయర్ ఐడీ నెంబర్‌ను సూచిస్తుండగా...ఇక మిగతా 7 - 9 నెంబర్లను హ్యాకర్లు గెస్ చేస్తే సరిపోతుందని తెలిపారు.దీంతో హ్యకర్లు సులువుగా కార్డులను హ్యక్ చేస్తున్నట్లు తెలిపారు. సెకన్లలో కార్డు డిటేల్స్..! మనం వాడే క్రెడిట్, డెబిట్ కార్డులపై 16 అంకెల యూనిక్ నెంబర్ ఉంటుంది. కార్డుల నెంబర్లను గేస్ చేయడానికి అనేక కాంబినేషన్లను ప్రత్యేకమైన కంప్యూటర్ సహాయంతో సైబర్ నేరస్తులు హ్యక్ చేస్తోన్నట్లు బ్రీడిస్ అభిప్రాయపడ్డారు. గంటకు 25 బిలియన్ కాంబినేషన్లను ప్రయత్నించవచ్చని తెలిపారు. డెబిట్ , క్రెడిట్ కార్డులను సులువుగా హ్యక్ చేయడానికి వారికి కేవలం 6 సెకన్ల సమయం సరిపోతుందని వెల్లడించారు. ఈ చర్యలు కచ్చితంగా..! క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు ఆర్బీఐ ఎప్పటికప్పుడూ హెచ్చరికలను జారీ చేస్తోంది. పలు సూచనలు పాటించడంతో డెబిట్, క్రెడిట్ కార్డుల హ్యకింగ్ నుంచి దూరంగా ఉండవచ్చును. ► డెబిట్, క్రెడిట్ కార్డు యూజర్లు ఎప్పటికప్పుడు వారి నెలవారీ స్టేట్మెంట్లను సమీక్షించడం మంచింది. ► మీ బ్యాంక్ నుంచి వచ్చే ప్రతి భద్రతా నోటిఫికేషన్‌కు త్వరగా స్పందించాలి. ► తక్కువ మొత్తంలో డబ్బును ఖాతాలో ఉంచుకోవడం బెస్ట్ ఆప్షన్. ► వివిధ ప్రయోజనాల కోసం ప్రత్యేక బ్యాంక్ ఖాతాను కలిగి ఉండటం మంచింది. ► ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నప్పుడు సదరు బ్యాంకులు అందించే తాత్కాలిక వర్చువల్ కార్డులతో లావాదేవీలను జరపడం ఉత్తమం. ► టెలిఫోన్లు/ఈ-మెయిల్స్ ద్వారా వచ్చే మోసపూరిత ప్రకటనలను అసలు నమ్మకూడదు. చదవండి: ఎల్ఐసీ పాలసీదారులకు అలర్ట్..! ఇదే చివరి అవకాశం..! -
గుడ్‌న్యూస్.. ఏటీఎం కార్డు లేకపోయినా.. ఈ సేవలు పొందొచ్చు
దేశంలో రోజు రోజుకి యుపీఐ చెల్లింపుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. ప్రస్తుతం ఉన్న ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎమ్ వంటి యుపీఐ థర్డ్ పార్టీ సంస్థలు తమ వినియోగదారుల సంఖ్యను పెంచుకునేందుకు కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. దీంతో దేశంలో డీజిటల్ యుపీఐ లావాదేవీల సంఖ్య భారీగా పెరిగింది. అయితే, ఈ యుపీఐ లావాదేవీలు చేయడానికి యూజర్లు మొదట తమ డెబిట్ కార్డు వివరాలను నమోదుజేయాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకు ఖాతాదారులకు డెబిట్ కార్డు లేకపోవడం, ఉన్న పని చేయక పోవడం కారణాల వల్ల ఈ సేవలు అందడం లేదు. అయితే, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) డెబిట్ కార్డు లేని బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. డెబిట్ కార్డు లేకున్నా యుపీఐ సేవలను పొందవచ్చు అని తెలిపింది. ఇందుకు సంబంధించి ఎన్పీసీఐ బ్యాంకులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఎన్పీసీఐ ఆదేశాల ప్రకారం.. దేశంలో డిజిటల్ లావాదేవిలను ప్రోత్సహించేందుకు ఎన్పీసీఐ ఆధార్ నెంబర్, ఓటీపీ ద్వారా డెబిట్ కార్డు లేని బ్యాంకు ఖాతాదారులకు యుపీఐ సేవలను అందించాలని బ్యాంకులను కోరింది. ఇప్పుడు, ఆధార్ నెంబర్, ఓటీపీ ద్వారా డెబిట్ కార్డు లేని/ డెబిట్ కార్డు పనిచేయని వినియోగదారులకు యుపీఐ సేవలను అందజేయవచ్చు అని తెలిపింది. ఎన్పీసీఐ గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఈ సర్క్యులర్ జారీ చేసింది. గత ఏడాది డిసెంబర్ 15 నాటి నుంచి సర్క్యులర్ నిబంధనలను పాటించాలని బ్యాంకులను కోరింది. ఆ తర్వాత గడువు తేదీని 2022, మార్చి 15 వరకు పొడగించింది. "ఈ సేవలను డెబిట్ కార్డు లేని వారికి ఎన్పీసీఐ పేర్కొన్న విధంగా అందజేయడానికి బ్యాంకులు, చెల్లింపు సేవా సంస్థలకు తొమ్మిది నుంచి పన్నెండు నెలలు పట్టవచ్చు" నిపుణులు తెలిపారు. అయితే, ఈ సేవలు పూర్తిగా అందాలంటే, వినియోగారుడు బ్యాంకులో ఇచ్చిన మొబైల్ నెంబర్, ఆధార్ కార్డుకి లింకు చేసిన మొబైల్ నెంబర్ ఒకటే కావాల్సి ఉంటుంది. అప్పుడే ఈ సేవలు మీకు అందనున్నాయి. (చదవండి: ఒకేరోజు డీజిల్‌పై రూ.75, పెట్రోల్‌పై రూ.50 పెంపు.. బతికేది ఎలా?) -
కార్డులు, నెట్‌బ్యాంకింగ్‌పై ఫిర్యాదులు ఎక్కువ: ఆర్బీఐ
ముంబై: బ్యాంకు ఖాతాదారులు ఏటీఎం, డెబిట్‌కార్డులు, మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డులకు సంబంధించి ఎక్కువగా అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయిస్తున్నారు. 2020 జూలై నుంచి 2021 మార్చి మధ్యకాలంలో వీటిపైనే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. పారదర్శక విధానాలు పాటించకపోవడం, ఇచ్చిన హామీలను నిలుపుకోకపోవడంపై ఖాతాదారులు ఫిర్యాదు చేస్తున్నట్టు ఆర్బీఐ నివేదిక తెలిపింది. 2020-21 వార్షిక నివేదికను ఆర్బీఐ తాజాగా విడుదల చేసింది. 2020 జూలై 1 నుంచి 2021 మార్చి 31 వరకు తొమ్మిది నెలల గణాంకాలు ఇందులో ఉన్నాయి. 2020 జూలై నుంచి ఆర్బీఐ సైతం ఆర్థిక సంవత్సరానికి అనుగుణంగా (ఏప్రిల్-మార్చి) తన వార్షిక సంవత్సరాన్ని కూడా సవరించుకుంది. బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ 2006 (బీవోఎస్), ద అంబుడ్స్‌మన్ స్కీమ్ ఫర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ 2018(ఓఎస్ఎన్బీఎఫ్సీ), ద అంబుడ్స్‌మన్ స్కీమ్ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ 2019 (ఓఎస్డీటీ) పథకాల కింద గణాంకాలను ఆర్బీఐ ఈ నివేదికలో పేర్కొంది. వీటి నుంచి ఎక్కువ.. ఈ మూడు పథకాల కింద ఫిర్యాదులు 2020 జూలై నుంచి 2021 మార్చి మధ్య కాలంలో 22 శాతం పెరిగి 3,03,107కు చేరాయి. మొత్తం ఫిర్యాదుల్లో ఏటీఎం/డెబిట్‌కార్డుల నుంచి 17.40 శాతం, మొబైల్/ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీలపై 12.98 శాతం, క్రెడిట్ కార్డులపై 12.36 శాతం చొప్పన వచ్చాయి. ఓఎస్డీటీ పథకం కింద ఫండ్ ట్రాన్స్ఫర్/యూపీఐ/ బీబీపీఎస్/ భారత్ క్యూఆర్కోడ్కు సంబంధించి 51 శాతం,, మొబైల్/ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించి 22.57 శాతం, తప్పుడు బెనిఫీషియరీ కారణంతో లావాదేవీ మొత్తాన్ని తిరిగి జమ చేయకపోవడంపై 8 శాతం చొప్పున ఫిర్యాదులు దాఖలయ్యాయి. (చదవండి: కేసులు పెరిగితే ఆంక్షలు విధించకండి.. కేంద్రానికి ఫిక్కీ విజ్ఞప్తి!) -
Alert: జనవరి 1నుంచి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ రూల్స్ మారుతున్నాయ్!
ఆన్లైన్ ట్రాన్సాక్షన్లపై ఆర్బీఐ కీలక మార్పులు చేసింది. చేసిన మార్పులు జనవరి 1 నుంచి అమలవుతాయని ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి వినియోగదారులు చేసిన మార్పులకు అనుగుణంగా ట్రాన్సాక్షన్ లు చేయాల్సి ఉంటుందని తెలిపింది. కొత్త ఏడాది ప్రారంభం నుంచి జరిపే ఆన్లైన్ ట్రాన్సాక్షన్లలో కార్డ్,వ్యక్తిగత వివరాలు, సీవీపీ నెంబర్‌ను ఎంటర్ చేసే పనిలేకుండా టోకనైజేషన్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నట్లు ఇప్పటికే ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ టోకనైజేషన్ అంటే ఏమిటీ? ఆ టోకనైజేషన్‌ను ఎలా పొందాలో తెలుసుకుందాం. టోకనైజేషన్ అంటే ? వినియోగదారుల డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వివరాలు హ్యాకర్ల చేతికి చిక్కకుండా ఉండేందుకు ఆర్బీఐ టోకనైజేషన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ట్రాన్సాక్షన్ జరిపే సమయంలో కార్డ్ వివరాలు సైబర్ నేరస్తుల చేతుల్లోకి వెళ్లకుండా సెక్యూర్ గా ఉంచే వ్యవస్థనే టోకెన్ అంటారు. ట్రాన్సాక్షన్ చేసే సమయంలో వినియోగదారుడు 16 అంకెల కార్డ్ నెంబర్‌ను ఎంట్రి చేయాల్సి ఉంటుంది. కానీ ఆర్బీఐ తెచ్చిన టోకనైజేషన్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసిన ప్రతిసారి వ్యక్తిగత, కార్డ్ వివరాలు, సీవీవీ నెంబర్లను ఎంట్రీ చేసే అవకాశం లేకుండా చెల్లింపులు చేసుకోవచ్చు. టోకనైజేషన్ కార్డ్ ఎలా పొందాలి? ►ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లు నిర్వహించే సమయంలో మీ కార్డ్ వివరాలు ఎంటర్ చేసినప్పుడు..ఇవి టోకెన్ సర్వీస్ ప్రొవైడర్లుగా వ్యవహరించే కార్డు నెట్వర్క్ కంపెనీలైన వీసా, మాస్టర్ కార్డులకు అనుమతికోసం రిక్వెస్ట్ పంపిస్తాయి. ►ఇవి కస్టమర్ల కార్డు వివరాలను వారి బ్యాంక్ వివరాలతో చెక్ చేసుకొని టోకెన్ నెంబర్లను జనరేట్ చేస్తాయి. ► ఇవి కస్టమర్ డివైజ్‌తో లింక్ అవుతాయి. ►తర్వాత ఎప్పుడైనా లావాదేవీలు నిర్వహిస్తే.. కార్డు నెంబర్, సీవీవీ నెంబర్లు ఎంటర్ చేయాల్సిన పని లేదు. టోకెన్ నెంబర్ వివరాలు ఇస్తే సరిపోతుంది చదవండి: ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ, కీలక వ్యాఖ్యలు చేసిన ఆర్ధిక మంత్రి -
Good News! ఇక డెబిట్, క్రెడిట్ కార్డులు లేకుండానే ఆన్లైన్ షాపింగ్!
New credit debit card rules for online payments from January 1, 2022 అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, బిగ్‌బాస్కెట్.. మీకిష్టమైన ఆన్లైన్ వెబ్సైట్లలో షాపింగ్ సులభతరం కానుంది. అవును.. జనవరి 1, 2022 నుంచి డెబిట్, క్రెడిట్ కార్డులు లేకుండానే ఆన్లైన్ షాపింగ్ చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం ద్వారా మీ చెల్లింపులు సులభతరం కావడమేకాకుండా, మీలావాదేవీల సమాచారం కూడా మరింత భద్రంగా ఉంటుంది. డిజిటల్ చెల్లింపుల కోసం ఇకపై 16-అంకెల కార్డ్ వివరాలను, కార్డ్ గడువు తేదీని గుర్తుంచుకోవాల్సిన అవసరం అసలే లేదు. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం.. 'టోకనైజేషన్' అనే కొత్త పద్ధతి ద్వారా త్వరగా కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు చేయవచ్చు. టోకనైజేషన్ అంటే ఏమిటి? కొత్త చెల్లింపు పద్ధతి ఎలా ఉండబోతోంది? టోకనైజేషన్ అనేది క్లయింట్లు టోకెన్ ద్వారా కార్డు సమాచారాన్ని వినిమయించుకోవడం ద్వారా వ్యక్తిగత సమాచారంతో సంబంధంలేకుండా కొనుగోళ్లు సజావుగా సాగే విధానం. ఈ కాంటాక్ట్‌లెస్ బ్యాంకింగ్ కోసం సీవీవీ నంబర్ ఇకపై అవసరం లేదు. టోకనైజ్డ్ కార్డ్‌లను ఎలా ఉపయోగించాలి? ►టోకనైజేషన్ ప్రక్రియ పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. వినియోగదారులు తమకు నచ్చినన్ని కార్డులను టోకనైజ్ చేయవచ్చు. అయితే దేశీయ కార్డులు మాత్రమే ప్రస్తుత నిబంధనలకు లోబడి ఉంటాయి. విదేశీ కార్డ్‌లకు టోకనైజేషన్ వర్తించదు. ►వినియోగదారులు ప్రొడక్ట్స్‌ను కొనుగోలుచేసే సమయంలో షాపింగ్ వెబ్‌సైట్‌కు చెందిన చెక్-అవుట్ పేజీలో కార్డు వివరాలను ఖచ్చితంగా నమోదు చెయ్యాలి. అలాగే టోకనైజేషన్‌ను ఎంపిక చేసుకోవాలి. ►ఆన్లైన్లో ఉత్పత్తులను కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు తమ కార్డు సమాచారాన్ని తప్పక సమర్పించాలి. తర్వాత టోకనైజేషన్‌ని ఎంచుకోవాలి. చెల్లింపుల సమయంలో ఇన్‌పుట్‌ని నిర్ధారించడానికి టోకెన్లు సహాయపడతాయి. ►ఈ పద్ధతి ద్వారా ఆన్లైన్ మోసాలకు చెక్ పెట్టొచ్చు. ఎందుకంటే.. హ్యాకర్ టోకెన్ నుండి కొనుగోలుదారు సమాచారాన్ని సేకరించడం అంత సులభమేమీకాదు. చదవండి: Covid Alert: 70 రెట్లు వేగంతో వ్యాపిస్తున్న ఒమిక్రాన్! నిపుణుల హెచ్చరికలు.. -
ఎస్బీఐ ఖాతాదారులకు ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్...!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీవాళీ సేల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సేల్ అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 వరకు జరగనుంది. బిగ్ దీవాళీ సేల్‌లో భాగంగా ఎస్బీఐ డిబెట్ కార్డు హోల్డర్లకు ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. బిగ్ దివాళీ సేల్ సందర్భంగా పలు ఉత్పత్తులను ఎస్బీఐ డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ తగ్గింపును ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. చదవండి: Nykaa: రూ. 850 కోట్లను సొంతం చేసుకోనున్న నైకా టాప్ ఉద్యోగులు..! ఎస్బీఐ డెబిట్ కార్డ్ వినియోగదారులకు రియల్ మీ సీ11, రియల్మీ సీ21వై, శాంసంగ్ ఎఫ్12, పోకో జీ3 ఎఫ్టీ, రియల్మీ నార్జో 50ఏ, మోటోరోలా జీ60, ఒప్పో రోనో 6 5జీ వంటి స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై మరింత తగ్గింపును ఫ్లిప్‌కార్ట్ అందించనుంది. బిగ్ దీపావళి డేస్ సేల్ సందర్భంగా వివిధ ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోలుపై 80 శాతం వరకు తగ్గింపును అందించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. డెస్క్‌టాప్‌ల కొనుగోలుపై 30 శాతం వరకు,పవర్ బ్యాంక్‌లపై 75 శాతం వరకు తగ్గింపు , హెడ్‌ఫోన్, స్పీకర్లపై 70 శాతం వరకు తగ్గింపును ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. గృహోపకరణాల విషయానికి వస్తే...టీవీలపై 75 శాతం వరకు, మైక్రోవేవ్ ఓవెన్లపై 45 శాతం వరకు తగ్గింపు , ఎయిర్ కండీషనర్లపై 55 శాతం వరకు తగ్గింపు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. చదవండి: తొలి మొబిలిటీ స్టేషన్ ప్రారంభించిన జియో-బీపీ -
అక్టోబర్ 1 నుంచి ఆర్బీఐ కొత్త ఆటో డెబిట్ రూల్స్
ప్రస్తుత ప్రపంచం మొత్తం డిజిటల్ గా మారింది. బ్యాంకుకు వెల్లకుండానే చెల్లింపులు క్షణాలలో జరిగిపోతున్నాయి. చాలా మంది కరెంట్ బిల్, టీవీ బిల్లు, ఓటీటీ సబ్స్క్రిప్షన్ బిల్లు, ఇతర ఈఎంఐల వంటి వాటికి ఆటో డెబిట్ అనే సదుపాయం వినియోగించుకుంటున్నారు. ఈ ఆటో డెబిట్ సదుపాయం వల్ల ఏదైనా బిల్లు గడువు తేదీ మరిచిపోయినా ఆటో మెటిక్ గా సరైనా సమయానికి చెల్లింపులు జరుగుతున్నాయి. అయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఈ ఆటో డెబిట్ లావాదేవీల్లో కొన్ని మార్పుల చేసింది. ఆటో డెబిట్ లావాదేవిలకు సంబంధించి కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుండి అమల్లోకి రానున్నాయి. అక్టోబర్ 1 నుంచి ఆటో డెబిట్ అనే సదుపాయం ఉపయోగించుకోవడం అంత సులభం కాదు. కొత్త నిబందనల ప్రకారం.. క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఆటో డెబిట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే.. ఆ పేమెంట్‌కు ఓటీపీ అదనపు ధ్రువీకరణ(ఏఎఫ్ఏ) అవసరం. రూ.5000 కంటే ఎక్కువ మొత్తానికి ఆటో డెబిట్ సదుపాయాన్ని వాడుకోవాలంటే ఓటీపీ అదనపు ధ్రువీకరణ(ఏఎఫ్ఏ) అవసరమవుతుంది. ఆటో డెబిట్ తేదీకి కొన్ని రోజుల ముందే లవదేవికి సంబంధించిన సమాచారాన్ని వినియోగదారుడికి బ్యాంకులు పంపిస్తాయి. (చదవండి: లోన్ తీసుకునేవారికి బ్యాంకులు బంపర్ ఆఫర్స్!) ఆ తర్వాత పేమెంట్ కొనసాగించాలనుకుంటే ఓటీపీతో ఆ పేమెంట్‌ను నిర్ధరించాలి. లేదంటే పేమెంట్ పూర్తవదు. అప్పుడు మాన్యువల్‌గా లావాదేవీని పూర్తి చేయాల్సి ఉంటుంది. అన్ని రకాల క్రెడిట్, డెబిట్ కార్డులకు దేశీయ, అంతర్జాతీయ లావాదేవీలకు ఈ రూల్స్ వర్తిస్తాయి. ఈ కొత్త నిబంధనలు 2021 ఏప్రిల్ నుంచి అమలులోకి రావాల్సి ఉండేది. కానీ, బ్యాంకుల అభ్యర్ధన మేరకు ఆరు నెలలు వాయిదా వేసింది. గడువు తర్వాత ఆర్బీఐ పేర్కొన్న విధంగా నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకొనున్నట్లు కూడా స్పష్టం చేసింది. -
ఆర్బీఎల్ వీసా క్రెడిట్ కార్డుల జారీ ప్రారంభం
ముంబై: వీసా పేమెంట్ నెట్వర్క్ ఆధారిత కార్డుల జారీని ఆర్బీఎల్ బ్యాంకు ప్రారంభించింది. కార్డు డేటాను భారత్‌లోనే నిల్వ చేయాలన్న నిబంధనలను మాస్టర్‌కార్డు ఆచరణలో పెట్టకపోవడంతో కొత్త కార్డుల జారీపై జూలై 14న ఆర్బీఐ నిషేధం విధించింది. అప్పటి వరకు ఆర్బీఎల్ బ్యాంకు మాస్టర్కార్డులనే జారీ చేస్తుండేది. ఆర్బీఐ ఆదేశాల నేపథ్యంలో వీసా పేమెంట్ నెట్‌వర్క్‌తో జూలై 14నే ఆర్బీఎల్ బ్యాంకు ఒప్పందం చేసుకుంది. డేటా అనుసంధానాన్ని వేగంగా పూర్తి చేసుకోవడంతో వీసా కార్డుల జారీని మొదలు పెట్టినట్టు బ్యాంకు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12–14 లక్షల కార్డుల జారీ లక్ష్యాన్ని చేరుకుంటామని ప్రకటించింది. క్రెడిట్ కార్డుల్లో ఆర్బీఎల్ బ్యాంకుకు 5 శాతం మార్కెట్ వాటా ఉంది. -
డెబిట్/ క్రెడిట్ కార్డు దారులు ఇక అన్ని వివరాలు గుర్తు పెట్టుకోవాల్సిందే!
గతంలో స్మార్ట్ఫోన్లు రాకముందు ల్యాండ్ లైన్ కాలంలో ప్రతి ఒక్కరూ ముఖ్యమైన వ్యక్తుల నంబర్లను అలవోకగా గుర్తుపెట్టుకొనేది. ఎప్పుడైతే స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలోకి వచ్చిందో అప్పటి నుంచి ప్రతి చిన్న పనికి దాని మీద ఎక్కువ శాతం ఆధారపడుతున్నాము. ఇదంతా ఎందుకు మీకు చెబుతున్నాను అంటే.. ఆర్బీఐ కొత్తగా తీసుకోని రాబోయే నిబంధనల వల్ల ఇక నుంచి ప్రతి ఖాతాదారుడు తమ 16 అంకెల డెబిట్/ క్రెడిట్ కార్డు నంబర్లతో పాటు సీవీవీ, గడువు తేదీ వంటి వివరాలను గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 2022 జనవరి నుంచి ఈ కొత్త నిబందనలు అమలులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కొన్ని నివేదికల ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) డేటా నిల్వ విధానంపై ఉన్న మార్గదర్శకాలను సవరించబోతోంది. ఈ సవరించిన నిబంధనల వల్ల పేమెంట్ అగ్రిగేటర్లు, ఈ-కామర్స్ వెబ్ సైట్లు, అమెజాన్ వంటి ఆన్ లైన్ వ్యాపారులు, ఫ్లిప్ కార్ట్, గూగుల్ పే, పేటిఎమ్, నెట్ ఫ్లిక్స్ వంటి సంస్థలు వారి సర్వర్లలో కస్టమర్ల డెబిట్/ క్రెడిట్ కార్డు సమాచారాన్ని నిల్వచేయకూడదు. దీని వల్ల ఇక నుంచి పేమెంట్ చేయాలని అనుకున్న ప్రతిసారీ మీ కార్డు పూర్తి వివరాలు(పేరు, 16 అంకెల కార్డు నెంబరు, గడువు తేదీ, సీవీవీ)ను నమోదు చేయాల్సి ఉంటుంది.(చదవండి: తాలిబన్లతో చైనా దోస్తీ..! భారీ పన్నాగమేనా..!) అయితే, ఈ కొత్త నిబంధనలలో మార్పు చేయాలని సంస్థలు ఆర్బీఐని కోరాయి. వినియోగదారుల డేటా నిల్వకు సంబంధించి పేమెంట్ గేట్ వే కంపెనీలు చేసిన ప్రతిపాదనలను ఆర్బీఐ తిరస్కరించింది. ఈ కొత్త నిబంధనల వల్ల వినియోగదారుడి సెక్యూరిటీ వివరాలు థర్డ్ పార్టీ సర్వర్లలలో ఉండవు కాబట్టి వారి డేటాను దొంగలించే ఆస్కారం ఉండదు అని ఆర్బీఐ భావిస్తుంది. -
ఈ బ్యాంక్ డెబిట్ కార్డ్‌తో షాపింగ్ చేయొచ్చు, క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ పొందొచ్చు
సాధారణంగా మనకు బ్యాంకులు క్రెడిట్ కార్డ్ లపై ఈఎంఐ సదుపాయాన్ని కల్పిస్తుంటాయి. కానీ కొటాక్ మహీంద్రా బ్యాంక్ మాత్రం డెబిట్ కార్డ్ ద్వారా ఈఎంఐ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. మనల్ని అత్యవసర సమయాల్లో ఆర్ధికంగా ఆదుకునేది క్రెడిట్ కార్డ్‌లే. ఆ కార్డ్‌లపై అవగాహన ఉండి సరైన పద్దతిలో మితంగా వాడుకుంటే మంచిది. పరిధి దాటితే చివరికి అప్పులు పాలు కావాల్సి వస్తుంది. అయితే కొటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో అవసరం లేకుండా 'కొటక్ స్మార్ట్ ఇనిషియేటివ్' స్కీమ్ లో భాగంగా డెబిట్ కార్డ్‌తో షాపింగ్ చేస్తే క్రెడిట్ కార్డు ప్రయోజనాలు అందిస్తోంది. అంటే డెబిట్ కార్డుతో చేసిన బిల్లును ఈఎంఐలుగా మార్చుకుని మన బడ్జెట్‌కి అనువుగా వాయిదాల్లో చెల్లించే అవకాశం కల్పిస్తోంది. 'కొటక్ స్మార్ట్ ఇనిషియేటివ్' స్కీమ్‌లో వినియోగదారులు ఫ్యాషన్ యాక్ససరీస్,ఎలక్ట్రానిక్ వస్తువులు, కిరాణా సామాగ్రిని కొనుగోలు చేవవచ్చు. అనంతరం షాపింగ్‌కి సంబంధించిన బిల్లును డెబిట్ కార్డ్ ద్వారా పే చేస్తూ వాటిని ఈఎంఐగా మార్చుకోవచ్చు. ఆ అవకాశం వినియోగించుకోవాలంటే తప్పని సరిగా రూ.5,000లకు పైగా షాపింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ సదుపాయాన్ని కల్పించినందుకు ప్రాసెసింగ్ ఫీజ్ తీసుకోవడం లేదని కొటక్ బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు. ♦ వినియోగదారులు ఆఫ్ లైన్ లో లేదంటే ఆన్ లైన్ లో డెబిట్ కార్డ్‌తో రూ.5వేల వరకు షాపింగ్ చేసుకోవచ్చు. ♦ మీరు డెబిట్ కార్డ్ ఈఎంఐకి అర్హులా? కాదా అనేది బ్యాంక్ అధికారుల్ని అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. ♦ మీరు డెబిట్ కార్డ్ ఈఎంఐకి అర్హులైతే బ్యాంక్ నుంచి ఎస్ఎంఎస్ వస్తుంది. ♦ అనంతరం మీ ట్రాన్సాక్షన్ ను రివ్వ్యూ చేసి మీకు ఈఎంఐ సదుపాయాన్ని ఎన్ని నెలలు ఇవ్వాలనేది బ్యాంక్ నిర్ణయం తీసుకుంటుంది. ♦ మీకు బ్యాంక్ కల్పించిన ఈఎంఐ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే రిక్వెస్ట్ చేయాలి. అపై మీకు కావాల్సిన వస్తువుల్ని కొనుగోలు చేసి ఈఎంఐగా మార్చుకోవచ్చు. ♦ వస్తువులు కొనుగోలు చేసిన తర్వాత ఈఎంఐలో భాగంగా ఆటో మెటిగ్గా మీ అకౌంట్ నుంచి మీరు ఎంత ఈఎంఐ చెల్లిస్తారో అంతే కట్ అవుతుంది. -
డెబిట్ కార్డ్ వినియోగదారులకు బంపర్ ఆఫర్, ఫ్రూప్ లేకుండానే
ముంబై: అర్హత కలిగిన డెబిట్ కార్డుహోల్డర్లందరికీ ప్రత్యేకమైన నెలవారీ వాయిదా చెల్లింపుల (ఈఎంఐ) ఆఫర్ అందిస్తున్నట్లు కోటక్ మహీంద్రా బ్యాంక్ (కేఎంబీఎల్) వెల్లడించింది. దీని ప్రకారం మధ్య స్థాయి, అధిక విలువ చేసే కొనుగోళ్లు అన్నింటికీ డెబిట్ కార్డుపై ఈఎంఐల ద్వారా చెల్లించే సదుపాయం ఉంటుందని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో దీన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది. ఇప్పటిదాకా ఇది కేవలం ఎంపిక చేసిన కొన్ని స్టోర్స్‌కి మాత్రమే పరిమితమై ఉండేదని కేఎంబీఎల్ తెలిపింది. రూ. 5,000 అంతకు పైబడిన లావాదేవీలన్నింటినీ ఎలాంటి పేపర్‌వర్క్ లేదా పత్రాల అవసరం లేకుండానే ఈఎంఐల కింద మార్చుకోవచ్చని వివరించింది. చదవండి : ఏంటీ..ఈ టెక్నాలజీతో రేపు ఏం జరుగుతుందో తెసుకోవచ్చా! -
ఆగస్టు 1 నుంచి పెరగనున్న ఏటీఎం ఛార్జీలు
ఆగస్టు 1 నుంచి ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్స్(ఏటీఎం) చార్జీలు పెరగనున్నాయి. ఏటీఎం కేంద్రాల నిర్వహణ భారంగా మారిందన్న బ్యాంక్ ఆందోళన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఇంటర్ చేంజ్ ఫీజ్ ను ₹2 పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. తాజాగా వచ్చే ఆగస్టు 1 నుంచి ఏటీఎం కేంద్రాల్లోనూ ఒక్కో ఆర్ధిక లావాదేవీపై ఇంటర్ ఛేంజ్ ఫీజు రూ.15 నుంచి రూ.17కు, ఆర్ధికేతర లావాదేవీలపై రూ.5 నుంచి రూ.6కు పెరగనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు చెందిన డెబిట్ కార్డులు 90 కోట్ల వరకు వాడుకలో ఉన్నాయి. ఆర్బీఐ సవరించిన నిబంధనల ప్రకారం, ఖాతాదారులు తమ హోమ్ బ్యాంక్ ఏటీఎం నుంచి ప్రతి నెలా ఐదు ఉచిత లావాదేవీల చేసుకోవచ్చు. ఆ తర్వాత చేసే నగదు లావాదేవిపై ఇంటర్ ఛేంజ్ ఫీజ్ వర్తించనుంది. మెట్రో నగరాలలో ఉచిత లావాదేవీల సంఖ్య 3గా ఉంటే మెట్రో యేతర నగరాల్లో 5గా ఉంది. 2019 జూన్ లో ఆర్బీఐ ఏర్పాటు చేసిన కమిటీ సూచనల ఆధారంగా ఈ మార్పులను చేశారు. ఏటీఎం లావాదేవీల ఇంటర్ చేంజ్ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించి ఏటీఎం ఛార్జీలు, ఫీజుల మొత్తం పరిధిని సమీక్షించడానికి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశారు. మార్చి 31 నాటికి, దేశంలో 115,605 ఆన్ సైట్ ఏటీఎంలు, 97,970 ఆఫ్ సైట్ టెల్లర్ యంత్రాలు ఉన్నాయని వార్తా సంస్థ పీటీఐ నివేదించింది. -
ఎస్బీఐ : జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) కస్టమర్లకు హెచ్చరిక. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులకు విధించే సేవా ఛార్జీలను సవరించింది. ఏటీఎంలో డబ్బులు విత్‌డ్రా చేయడం, చెక్‌బుక్, ఇతర ఆర్థిక లావాదేవీలకు జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయని ఎస్బీఐ తన వెబ్సైట్లో పేర్కొంది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్. ఇందులో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇతర అకౌంట్లలో అయితే మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం తప్పనిసరి. ఒకవేల మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్బీఐలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ హోల్డర్లకు బేసిక్ రూపే ఏటీఎం కమ్ డెబిట్ కార్డు వస్తుంది. నెలలో నాలుగు సార్లు ఉచితంగా బ్యాంక్ బ్రాంచ్‌లో, ఏటీఎంలో డబ్బులు డ్రా చేయొచ్చు. అంతకన్నా ఎక్కువసార్లు డ్రా చేస్తే సర్వీస్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. జూలై 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీ రూ.15+జీఎస్టీ వర్తిస్తుంది. అంటే ఎస్బీఐ, నాన్ ఎస్బీఐ ఏటీఎంలల్లో, బ్రాంచ్‌లో కలిపి ఒక నెలలో నాలుగు సార్లు మాత్రమే డబ్బులు డ్రా చేసే అవకాశం ఉంటుంది. ఎస్బీఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులకు ఒక ఆర్థిక సంవత్సరంలో 10 చెక్స్ ఉచితంగా అందిస్తుంది. ఆ తర్వాత మరో 10 చెక్స్ ఉన్న బుక్ కావాలంటే రూ.40+జీఎస్టీ, 25 చెక్స్ ఉన్న బుక్ కావాలంటే రూ.75+జీఎస్టీ చెల్లించాలి. 10 చెక్స్‌తో ఎమర్జెన్సీ చెక్ బుక్ కావాలంటే రూ.50+జీఎస్టీ చెల్లించాలి. సీనియర్ సిటజన్లకు చెక్ బుక్‌పై కొత్త సర్వీస్ ఛార్జీ వర్తించదు. ఇక ఎస్బీఐ, నాన్ ఎస్బీఐ బ్రాంచ్‌లల్లో ఎస్బీఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులు జరిపే నాన్ ఫైనాన్షియల్ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించరు. చదవండి: ఐఎఫ్ఎస్సీ కోడ్లను అప్డేట్ చేసుకోండి -
బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు గుడ్ న్యూస్..!
కరోనా వైరస్ మహమ్మారి తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో వినియోగదారులు బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం కోసం, చెక్ బుక్ వంటి ఇతర పనుల కోసం బ్యాంకు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు అని బ్యాంక్ ఆఫ్ బరోడా పేర్కొంది. బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఖాతాదారుల కోసం కొన్ని ప్రత్యేక నంబర్లను జాబితాను విడుదల చేసింది. వాట్సాప్ ద్వారా లావాదేవీ వివరాలను తెలుసుకోవడంతో సహా బ్యాలెన్స్‌ను తనిఖీ చేసుకోవచ్చు అని తెలిపింది. అలాగే, టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా ఇతర సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవచ్చు అని ట్విటర్ ద్వారా వెల్లడించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా జారీ చేసిన ఈ ముఖ్యమైన సంఖ్యలు 24 * 7 అందుబాటులో ఉంటాయి. బ్యాంకింగ్ సేవలు అవసరమైన సంఖ్యల జాబితా మీ ఖాతా బ్యాలెన్స్ తెలుసుకోవడానికి- 8468001111కి మిస్డ్ కాల్ ఇవ్వండి చివరి 5 లావాదేవీల సమాచారం కోసం- 8468001122కి మిస్డ్ కాల్ ఇవ్వండి టోల్ ఫ్రీ -18002584455 / 18001024455 వాట్సాప్ బ్యాంకింగ్ సేవల కోసం- 8433888777 To maintain social distancing, you can continue your banking services from your home. #BankofBaroda is here by your side 24x7, with these simple and easy ways. #BankfFromHome #BreakTheChain #StaySafeBankSafe pic.twitter.com/MiXNKaCSc8 — Bank of Baroda (@bankofbaroda) May 10, 2021 బ్యాంక్ ఆఫ్ బరోడా వాట్సాప్ బ్యాంకింగ్ సేవల ద్వారా డెబిట్ కార్డును బ్లాక్ చేయడం, బ్యాలెన్స్ తెలుసుకోవడం, చెక్ స్టేటస్, వడ్డీ రేట్లు, మినీ స్టేట్మెంట్లు మొదలైనవి తెలుసుకోవచ్చు. ఇటీవల, బ్యాంక్ 'బరోడా ఎమ్ కనెక్ట్ ప్లస్' యాప్‌ను కూడా ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఖాతాదారులు 24 * 7 వారి మొబైల్ ఫోన్లలో బ్యాంకింగ్ సంబంధిత సదుపాయాలను వెంట వెంటనే పొందవచ్చు. చదవండి: ఈ మొబైల్ ఫోన్‌పై ఏకంగా రూ. 60 వేలు తగ్గింపు -
బ్యాంకుల్లో నిరుపయోగంగా రూ.60 వేల కోట్లు?
ప్రపంచ బ్యాంకు 2017 గ్లోబల్ ఫైండెక్స్ నివేదిక ప్రకారం, భారతదేశంలో దాదాపు సగం మంది ఖాతాదారులు 2016లో క్రియారహితంగా ఉన్న ఖాతాలు కలిగి ఉన్నట్లు పేర్కొంది. అంటే అక్షరాల 60 కోట్లకు పైమాటే అన్నమాట. ఇన్ని ఖాతాలలో కనీసం రూ.1000 ఉన్నాయి అనుకున్న సుమారు అరవై వేల కోట్ల రూపాయలు ఎటువంటి ప్రయోజనం లేకుండా ఖాతాలో ఉన్నాయి అనుకోవచ్చు. కాబట్టి అనేక ఖాతాలు కలిగి ఉండటం వల్ల ఆర్ధికంగా చాలా నష్టపోతారని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే అన్ని ఖాతాల్లో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండలేం. ఖాతాల్లో కనీస నిల్వ లేకుంటే ఛార్జీలు పడతాయి. అందుకే ఎంతో కొంత డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. పెద్ద బ్యాంకులు చార్జీల రూపంలోనే ఏడాదికి రూ.100 కోట్లు వసూలు చేస్తున్నాయి. దీన్ని బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు మనం ఎక్కువ ఖాతాలు కలిగి ఉండటం వల్ల ఏమి కోల్పోతున్నామో అని. ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉంటే ఎక్కువ డబ్బు నష్ట పోతున్నారని అర్థం చేసుకోవాలి. చాలా బ్యాంకులు ఖాతాదారులు కనీస బ్యాలెన్స్ ఉంచకపోతే ఛార్జీలు వేస్తాయి. ఇలా మీరు కలిగిఉన్న ఖాతాలో కచ్చితంగా కనీస నిల్వలు పాటించాల్సి ఉంటుంది. చాలా వరకు బ్యాంకుల్లో కనీస నిల్వ రూ.5000 నుంచి రూ.10 వేల వరకు ఉంచాలి. అంటే మీకు ఐదు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయనుకుంటే రూ.25,000 నుంచి రూ.50,000 వేల వరకు ఖాతాల్లోనే ఉండిపోతుంది. బ్యాంకుల్లో ఉన్న కనీస నిల్వలపై 3-4 శాతం వార్షిక వడ్డీ మాత్రమే లభిస్తుంది. అదే మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్లలో లేదా స్టాక్ మార్కెట్లో పెడితే దానికంటే రెట్టింపు వడ్డీ లభిస్తుంది. ఇవే కాకుండా పొదుపు ఖాతాలపై డెబిట్ కార్డ్ ఛార్జీలు, క్రెడిట్ కార్డు ఛార్జీలు వంటివి వర్తిస్తాయి. మీ వేతన ఖాతా లేదా జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతాలో వరుసగా మూడు నెలలు ఎలాంటి డిపాజిట్ చేయకపోతే ఆ తర్వాత అది సాధారణ పొదుపు ఖాతాగా మారుతుంది. అప్పుడు కచ్చితంగా కనీస నిల్వలను పాటించాల్సి ఉంటుంది. ఒక బ్యాంకు ఖాతాను అసలు ఉపయోగించకపోతే దానిని మూసివేయడమే మంచిది. ఎక్కువ ఖాతాలు ఉండటం వల్ల వాటి డెబిట్, క్రెడిట్ పిన్ నంబర్లు గుర్తుంచుకోవాలంటే కూడా కష్టమే. మీ ఖాతా ద్వారా ఎలాంటి లావాదేవీలు జరపకపోతే రెండేళ్ల తర్వాత బ్యాంకులు ఖాతాను డీయాక్టివేట్ చేస్తాయి. ఇలా చేయడం వల్ల నగదు కోల్పోవాల్సి ఉంటుంది. దానిని తిరిగి తెరవలన్న చాలా ఇబ్బంది. మరి ఏం చేయాలి? బ్యాంకు ఖాతాలు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది అని చెప్పుకోవాలి. ఒకటి వేతన ఖాతా కోసం, కుటుంబ సభ్యులతో కలిపి ఉమ్మడి ఖాతా ఉంటే సరిపోతుంది. డబ్బు అత్యవసరం అయినప్పుడు మీరు అందుబాటులో లేకపోతే ఉమ్మడి ఖాతా వల్ల ఖాతాదారులు డబ్బు తీసుకునే అవకాశం ఉంటుంది. మరీ అంతగా కావాలనుకుంటే మరొక ఖాతాను శాశ్వత ఖాతాగా తెరుచుకోవచ్చు. ఉద్యోగం మారినప్పుడు వేతన ఖాతాలు అనేవి మారుతుంటాయి. చదవండి: కరోనా బీమా పాలసీ దారులు మీకు ఈ విషయాలు తెలుసా? -
ఒక్క ఫోన్ కాల్ తో ఎస్బీఐ పిన్ జనరేట్ చేసుకోండి
దేశ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులను మరో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొనివచ్చింది. ఇప్పుడు ఎస్బీఐ ఖాతాదారులు తమ ఇంటి వద్ద నుంచే 5 నిమిషాలలో ఏటీఎం డెబిట్ కార్డ్ పిన్, గ్రీన్ పిన్ జనరేట్ చేసుకోవచ్చునని తెలిపింది. దీని కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా జనరేట్ చేసుకోవచ్చు. కాగా, ఇప్పుడు ఎస్బీఐ టోల్ ఫ్రీ ఐవిఆర్ సిస్టమ్ ద్వారా 1800 112 211 లేదా 1800 425 3800 కాల్ చేయాలి ఆ తరువాత కింద పేర్కొన్న విధంగా చేయాల్సి ఉంటుంది. Here are the easy steps to generate your Debit Card PIN or Green PIN via our toll-free IVR system. Don't hesitate to call 1800 112 211 or 1800 425 3800.#SBI #StateBankOfIndia #IVR #debitcard pic.twitter.com/MhuJGcwMa2 — State Bank of India (@TheOfficialSBI) February 17, 2021 దశ 1: కాల్ చేసిన తరువాత PIN జనరేట్ చేసుకునేందుకు ఆప్షన్ 6 ఎంచుకోవాలి దశ 2: ఎస్బీఐ కార్డు మీద ఉన్న నెంబర్, పుట్టిన తేదీ, కార్డు చివరి తేదీ ఎంటర్ చేయాలి దశ 3: రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు లేదా మెయిల్ ఐడీకి 6 అంకెల ఓటీపీ వస్తుంది దశ 4: నాలుగు అంకెలు ఉండే పిన్ నెంబర్ ఎంచుకోవాలి, దాన్ని రీ కన్ఫామ్ చేసేందుకు మరోసారి టైప్ చేయాలి దశ 5: ఆ తరువాత ఐవీఆర్ లో మీ పిన్ జనరేట్ అయిందని నిర్దారణ మెస్సేజ్ వస్తుంది చదవండి: వాహనదారులకు కేంద్రం తీపికబురు బంగారంపై రుణమా?.. ఇవి గుర్తుంచుకోండి -
అమెజాన్ లో మరో సేల్
మీరు అమెజాన్ లో ఇంటి అవసరాల కోసం ఏదైనా వస్తువు కొనాలనుకుంటున్నారా? అయితే, ఒక రోజు ఆగండి మీ కోసం మంచి డీల్ ని తీసుకొచ్చింది అమెజాన్. అమెజాన్ ఇండియా తన స్మాల్ బిజినెస్ డే 2020 యొక్క 4వ ఎడిషన్‌ను 2020 డిసెంబర్ 12 శనివారం నిర్వహిస్తుంది. ఈ సేల్ డిసెంబర్ 12 అర్ధరాత్రి నుండి అదే రోజు రాత్రి 11:59 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ ఒక రోజు మాత్రమే కొనసాగనున్నట్లు పేర్కొంది. మహిళా వ్యాపారవేత్తలకు, కళాకారులు, చేనేత దారులు, స్థానిక దుకాణాలను ప్రోత్సహిచేందుకు అమెజాన్ ఈ సేల్ ని నిర్వహిస్తుంది. చిరువ్యాపారులకు మద్దతుగా నిలవడంతో పాటు వారి వ్యాపారం వృద్ధ్ది చెందేలా చేయడమే ఈ సేల్ ముఖ్య లక్ష్యం.(చదవండి: షియోమీ మరో సంచలనం) స్మాల్ బిజినెస్ డే 2020 రోజున మీకు గృహ అవసరాలు, భద్రత, పరిశుభ్రత, గోడల ఆకృతి, పర్యావరణ అనుకూల ఉత్పత్తులు, వంట సామాగ్రి, క్రీడలు అవసరమైనవి వంటి విభాగాలలోని ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. అమెజాన్ వినియోగదారులకు డిజిటల్ చెల్లింపులపై 10 శాతం వన్ డే క్యాష్‌బ్యాక్ కూడా ఆఫర్ చేస్తుంది. క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ లావాదేవీలపై 10 ఇన్స్టాంట్ డిస్కౌంట్ కోసం అమెజాన్ ఐసిఐసిఐ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఏడు లక్షల మంది అమ్మకందారుల కోసం మేము గత కొద్దీ నెలలుగా సేల్స్ తీసుకొస్తున్నామని దీని ద్వారా వారి వ్యాపార వృద్ధికి మేము కట్టుబడి ఉన్నామని మనీష్ తివారీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సేల్‌లో హోమ్ డెకార్‌పై 50 శాతం, ఫర్నీషింగ్పై 60 శాతం, ఫర్నీచర్‌పై 50 శాతం, కిచెన్ అప్లయెన్సెస్‌పై 60 శాతం, డిన్నర్వేర్పై 60 శాతం, స్టోరేజ్ అండ్ ఆర్గనైజేషన్‌పై 50 శాతం, చీరలపై 70 శాతం, కుర్తీలపై 70 శాతం, మెన్స్‌వేర్‌పై 70 శాతం, కిడ్స్ వేర్‌పై 60 శాతం, జ్యువెలరీ అండ్ యాక్సెసరీస్‌పై 75 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. 2020 జూన్ 27న నిర్వహించిన స్మాల్ బిజినెస్ డే ద్వారా 45,000 మంది అమ్మకందారులకు ఆర్డర్ వచ్చింది. 2,600 మంది అమ్మకందారులు ఇప్పటివరకు అత్యధికంగా అమ్మకాలు చేసారు అని సంస్థ పేర్కొంది. -
గూగుల్ పే యూజర్లకు డెబిట్ కార్డులు
గూగుల్ పే యూజర్లకు ఓ వెసులుబాటు కలగబోతోంది. తరచూ రివార్డ్ ప్రోగ్రామ్‌ల ద్వారా వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది గూగుల్ పే యాప్. తాజాగా గూగుల్ పే వినియోగదారుల కోసం సరికొత్త యాప్‌ను తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది గూగుల్. గూగుల్ అంతర్జాతీయ మార్కెట్ల కోసం పే యాప్ లో కొత్త అప్డేట్ ని తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఈ అప్డేట్ లో భాగంగా కో బ్రాండెడ్ డెబిట్ కార్డులను కూడా వినియోగదారులకు అందించబోతోంది. గూగుల్ పే ఇప్పటికే ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. అంతేకాకుండా గూగుల్ తన గూగుల్ పే ద్వారా డిజిటల్ బ్యాంక్ అకౌంట్ సర్వీసులను కూడా అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశమున్నట్లు వినిపిస్తుంది. ఈ సర్వీసులు ముందుగా అమెరికాలో అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత ఇతర దేశాల్లోనూ అందించనున్నట్లు సమాచారం. ఈ డిజిటల్ బ్యాంక్ అకౌంట్ సర్వీసులను ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు తీసుకురానుంది. -
ఐసీఐసీఐ కస్టమర్లకు కొత్త సర్వీసు
సాక్షి, ముంబై: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ తమ కస్టమర్ల కోసం కొత్త సర్వీసును ప్రవేశపెట్టింది. ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రుణాలు పొందిన కస్టమర్ల కోసం లోన్ఎగైనెస్ట్ సెక్యూరిటీస్ (లాస్) డెబిట్ కార్డు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ పొందిన కస్టమర్లకు ఎలక్ట్రానిక్ కార్డులను జారీ చేయొచ్చని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాల నేపథ్యంలో బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. తద్వారా ఈ సౌకర్యాన్ని కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చిన దేశంలో మొట్టమొదటి బ్యాంకుగా ఐసీఐసీఐ అవతరించింది. వీసా ప్లాట్ఫామ్లో డెబిట్ కార్డుద్వారా దేశీయ వ్యాపార సంస్థల కొనుగోళ్ళతోపాటు, పీఓఎస్ మెషీన్లు, ఆన్లైన్ లావాదేవీలను ఇ-కామర్స్ పోర్టల్‌పై చెల్లింపులు చేసుకోవచ్చు. కొత్త వినియోగదారులకు 24 గంటల అనంతరం డిజిటల్ డెబిట్ కార్డు జారీ అవుతుంది. ఈ కార్డును బ్యాంకుకు చెందిన ఐమొబైల్ యాప్ ద్వారా యాక్సస్ చేసుకోవచ్చు. అలాగే ఏడు పనిదినాల్లో ఫిజికల్ డెబిట్ కార్డు కూడా వస్తుంది. అయితే పాత లాస్ కస్టమర్లు ఈ కార్డును వెంటనే పొందవచ్చు. వీరికి కార్డు ఆటోమేటిక్‌గానే రెన్యూవల్ అవుతుంది. ప్రయోజనాలు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది పర్సనల్ లోన్ లానే వినియోగించుకోవచ్చు. డెబిట్ కార్డుకు లోన్ క్రెడిట్ అవుతుంది. నిబంధనల ప్రకారం ఈ డబ్బులు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త డెబిట్ కార్డు ద్వారా రోజుకు రూ.3 లక్షల వరకు పీఓఎస్ మిషన్లతో పాటు అన్ని ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు. కస్టమర్ సౌలభ్యం, వారి వైవిధ్యమైన అవసరాలను తీర్చే నిమిత్తం డిజిటల్ యుగంలో ఇది ఒక కొత్త అడుగు అని బ్యాంకు అన్ సెక్యూర్డ్ ఎసెట్స్ హెడ్ సుదీప్తా రాయ్ తెలిపారు. కరోనాకాలంలో వ్యాపార కార్యకలాపాలు తిరిగి పుంజుకునేలా ఐసీఐసీఐ బ్యాంక్ భాగస్వామ్యంతో ఓవర్‌డ్రాఫ్ట్ ఖాతాతో అనుసంధానించిన ఈ వినూత్న డెబిట్ కార్డ్ ప్రారంభించడం సంతోషంగా ఉందని వీసా ఇండియా అండ్ సౌత్ ఆసియా గ్రూప్ కంట్రీ మేనేజర్ టీఆర్ రామచంద్రన్ తెలిపారు. -
డెబిట్, క్రెడిట్ కార్డులు : ఆర్బీఐ కొత్త నిబంధనలు
-
వేలి ఉంగరంతోనూ చెల్లింపులు
సాక్షి, న్యూఢిల్లీ : ఒకప్పుడు జేబులో పర్సు, పర్సులో డబ్బులు లేకుండా ఎలాంటి చెల్లింపులు జరిగేయి కాదు. అయితే ఎలాంటి చెల్లింపులైన జరిపేందుకు 2011లో ‘మాస్టర్ కార్డు’ అందుబాటులోకి రావడంతో బ్యాంకింగ్ లావా దేవీలకు సంబంధించి దాన్ని ఓ పెద్ద విప్లవంగా పేర్కొన్నారు. అప్పట్లో ఆ కార్డు కేవలం వీఐపీలకే అందుబాటులో ఉండేది. 2014లో బార్ల్కేల కార్డు అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత ఏడాదికి స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగించి ‘ఆపిల్ పే’ విధానం అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతోపాటు పేటీఎం, రూపే, గూగుల్ పే ఎన్నో డబ్బు చెల్లింపు యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. సరికొత్తగా చొక్కా చివరన గుండీలాగా అమర్చుకునే చిప్, వేలికి ధరించే ఉంగరం, కంకణం వంటి పరికరాల చెల్లింపులు జరిపే సౌకర్యం అందుబాటులోకి వచ్చాయి. చెల్లింపు మిషన్ వద్దకు ఈ చిప్, ఉంగరం లేదా కంకణంను తీసుకెళ్లి కావాల్సినంత చెల్లింపులు జరపవచ్చు. క్రెడిట్ కార్డుల్లాగా ఇవి పనిచేయవు. ఖాతాలో డబ్బులు ఉన్నప్పుడే పని చేస్తాయి. పైగా ఇవన్నీ యాప్‌లకు అనుసంధానించి పని చేస్తాయి. చేతికి ధరించిన కంకణం ద్వారా చెల్లింపులు జరపాలంటే బార్ల్కేల తీసుకొచ్చిన ‘పింగిట్’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందే. అలాగే పనిచేసే ‘కే’ ఉంగరం నలుపు, తెలుపు రంగుల్లో లభిస్తోంది. మూడింటిలో ఇదే ఖరీదైనది. దాదాపు 9వేల రూపాయలకు ఈ ఉంగరం, దాని సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. మిగతావి రెండున్నర వేల రూపాయల నుంచి అందుబాటులో ఉన్నాయి. ఈ వస్తువులు పోయినప్పుడు లేదా చోరీ అయినప్పుడు చెల్లింపులను యాప్ ద్వారా నిలిపివేయవచ్చు. 2024 సంవత్సరానికి ఇలాంటి చెల్లింపు పద్ధతులు 18 లక్షల వరకు రావచ్చన్నది ఓ అంచనా. అప్పుడు జేబులో పెన్ను, మెడలో గొలుసు, చెవి పోగులు, ముక్కు పుడక ఏ ఆభరణం రూపంలోనైనా చెల్లింపులు జరపొచ్చన్నమాట. -
డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగం : ఆర్బీఐ కొత్త నిబంధనలు
సాక్షి, ముంబై: వినియోగదారుల భద్రత, సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. అక్రమాలకు చెక్ పెట్టడంతోపాటు డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల్లో పెరుగుతున్న డిజిటల్ లావాదేవీలను దృష్టిలో వుంచుకున్న ఆర్బీఐ ఈ నిబంధనలను ప్రవేశపెట్టింది. క్రెడిట్, డెబిట్ కార్డులను ఏటీఎం, పోస్ పరికరాలతో మాత్రమే ఉపయోగించుకునే అవకాశం వుంటుందని ఆర్బీఐ బుధవారం జారీ చేసిన నోటిఫికేషన్లో వెల్లడించింది. అలాగే ఈ కార్డులను (అంతర్జాతీయమా, దేశీయమా) వినియోగాన్ని నియంత్రించుకునే అధికారాన్ని బ్యాంకులు తమ వినియోగదారులకు అందుబాటులోకి తేవాలని ఆదేశించింది. ఈ కొత్త నిబంధనలు 2020, మార్చి16 నుండి అమల్లోకి వస్తాయని సెంట్రల్ బ్యాంక్ తన ప్రకటనలో తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం భారతదేశంలో ఏటీఎం, పాయింట్ ఆఫ్ సేల్ (పోస్) లాంటి కాంటాక్ట్-బేస్డ్ యూజ్ పాయింట్ల వద్ద మాత్రమే అన్ని కార్డులు ఉపయోగించవచ్చు. అయితే ఏ వ్యక్తి అయినా ఆన్లైన్ లావాదేవీలు, అంతర్జాతీయ లావాదేవీలు, కాంటాక్ట్‌లెస్ లావాదేవీల కోసం తన కార్డులను ఉపయోగించకపోతే, ఈ సేవలకు వారి కార్డు నిలిపివేస్తారు. తిరిగి ఈ సేవలను పొందటానికి వినియోగదారులు తిరిగి దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే ఉన్న కార్డ్ వినియోగదారుల కోసం దేశీయ, అంతర్జాతీయ లావాదేవీలు, ఆన్లైన్, కాంటాక్ట్‌లెస్ లావాదేవీల కోసం కార్డును నిలిపివేయాలా వద్దా అనే విషయాన్ని బ్యాంకులు నిర్ధారించుకోవాల్సి వుంటుంది. అలాగే ఆన్లైన్, అంతర్జాతీయ, కాంటాక్ట్‌లెస్ లావాదేవీల కోసం ఎప్పుడూ ఉపయోగించని కార్డులపై ఈ సేవలను తప్పనిసరిగా (మాండేటరీ) నిలిపివేయబడతాయని స్పష్టం చేసింది. ఈ మార్పులకు సంబంధించిన సమాచారాన్ని ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ హెచ్చరికల ద్వారా బ్యాంకులు వినియోగదారులకు తెలియజేయాలని ఆర్బీఐ సూచించింది. అయితే ప్రీపెయిడ్ గిఫ్ట్ కార్డులు, స్మార్ట్ కార్డులకు, ఢిల్లీ మెట్రో, ముంబై మెట్రో, బెంగళూరు మెట్రో లాంటి జాతీయ రవాణాలో ఉపయోగించే కార్డులకు ఈ నిబంధనలు తప్పనిసరి కాదని ఆర్బీఐ వివరించింది. అన్ని ఏటీఎంలు, పీఓఎస్ డివైస్‌లలో ఈఎంవీ చిప్ ఆధారిత కార్డులే జారీ చేయాలని ఆర్బీఐ ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే. -
నాన్నారు.. డెబిట్‌కార్డు..ఒక సన్ స్ట్రోక్!
‘నా బ్యాంకు ఖాతాలోని సొమ్మును పేటీఎం ద్వారా కాజేసిన వారిపై చర్యలు తీసుకోండి’అంటూ కొన్నాళ్ల క్రితం ఫిర్యాదు చేసిన ఓ బాధితుడు.. ‘అబ్బబ్బే.. చర్యలు వంటివి ఏమీ వద్దు’అని గురువారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల్ని వేడుకున్నాడు. ఈ మార్పునకు కారణం ఏమిటో తెలియాలంటే ఇది చదవాల్సిందే. వివరాలు.. నగరానికి చెందిన ఓ వ్యక్తి ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఈయన బ్యాంకు ఖాతా నుంచి నెల రోజుల వ్యవధిలో వివిధ దఫాల్లో మొత్తం రూ.70 వేలు వేర్వేరు ఖాతాల్లోకి బదిలీ అయ్యాయి. ఈ విషయం గుర్తించిన ఆయన నగర సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. దీని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడి బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్ పరిశీలించగా.. నగదు మొత్తం పలు దఫాల్లో వేర్వేరు ఖాతాలకు బదిలీ కావడాన్ని బట్టి ఇంటి దొంగల పాత్రను అనుమా నించారు. ఇదే విషయాన్ని బాధితుడికి చెప్పి ఎవరిపైన అయినా అనుమానం ఉందా? అంటూ ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగడానికి ఆస్కారం లేదంటూ చెప్పిన బాధితుడు అసలు నిందితుడిని పట్టుకోవాలని మరోసారి స్పష్టం చేశారు. అనంతరం బ్యాంకు నుంచి వివరాలు పొందిన పోలీసులు ఆ డబ్బు మొత్తం పేటీఎం ద్వారా బదిలీ అయినట్లు గుర్తించారు. – సాక్షి, హైదరాబాద్ అవాక్కయిన తండ్రి.. పేటీఎం సంస్థకు లేఖ రాసి ఆయా లావాదేవీలకు పాల్పడిన ఫోన్ నంబర్ తెలుసుకున్నారు. దీని వివరాలు ఆరా తీయగా ఫిర్యాదుదారుడి కుమారుడికి చెందినదిగా తేలింది. తండ్రికి తెలియకుండా ఆయన డెబిట్‌కార్డును చేజిక్కించుకున్న ఆ సుపుత్రుడు దాన్ని తన పేటీఎం ఖాతాతో లింక్ చేసుకున్నాడు. ఆపై నెల రోజుల పాటు జల్సాలు చేస్తూ తండ్రి ఖాతాలోని రూ.70 వేలు ఖర్చు చేశాడు. ఈ విషయాన్ని సదరు తండ్రికి సమాచారం ఇచ్చారు. దీంతో గురువారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌కు వచ్చిన ఆయన అసలు విషయం తెలుసుకుని అవాక్కయ్యాడు. తన కుమారుడిని తాను మందలిస్తానని, విద్యార్థి అయిన అతడిపై చట్టపరంగా చర్యలు వద్దని, తన ఫిర్యాదు వెనక్కు తీసుకుంటున్నానని వేడుకున్నాడు. సానుకూలంగా స్పందించిన అధికారులు కుమారుడికి ప్రాథమికంగా కౌన్సెలింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. -
స్కిమ్మింగ్.. క్లోనింగ్
సాక్షి, సిటీబ్యూరో: ఏటీఎం కేంద్రాలే టార్గెట్‌గా డెబిట్ కార్డులను క్లోనింగ్ చేస్తున్న ముఠాను అబిడ్స్ పోలీసులు గురువారం అరెస్టు చేసిన విషయంవిదితమే. రొమేనియాకు చెందిన ఇద్దరు లండన్ వాసి క్రిస్ట్ ఆదేశాలతో ఏటీఎం మెషిన్లకు స్కిమ్మర్లు, మైక్రో కెమెరాలు అమర్చి డేటా చోరీ చేశారు. అయితే నగరంలోనూ ఇలాంటి హైటెక్ ముఠాలు ఉన్నాయని... అవి స్కిమ్మింగ్, క్లోనింగ్ వ్యవహారాలకు పాల్పడుతున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. ప్రధానంగా పబ్లిక్ ప్లేసులే అడ్డాగా చేసుకొని దందా కొనసాగించే ఈ ముఠాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.ఈ ముఠాలు క్లోనింగ్,స్కిమ్మింగ్ చేసే విధానాలను వివరిస్తున్నారు. అంతా అరచేతిలోనే... ఈ సైబర్ నేరగాళ్లు మినీ స్కిమ్మర్లుగా పిలిచే అత్యాధునిక యంత్రాలను ఇంటర్నెట్, డార్క్ వెబ్ ద్వారా చైనా నుంచి ఖరీదు చేసి దిగుమతి చేసుకుంటున్నారు. నగరంలోని పెట్రోల్ బంక్‌లు, హోటల్స్, రెస్టారెంట్స్, బార్స్ తదితర చోట్ల హెల్పర్స్‌గా పనిచేసే వారిని మచ్చిక చేసుకొని వారికి ఈ పరికరాలను అందిస్తున్నారు. అరచేతిలో ఇమిడిపోయే సైజులో ఉండే వీటిని వాళ్లు నిత్యం తమ జేబుల్లో ఉంచుకుంటున్నారు. వినియోగదారుల్లో ఎవరైనా డబ్బు చెల్లింపు కోసం డెబిట్ కార్డు ఇచ్చినప్పుడు అదను చూసి ఆ కార్డును తమ అరచేతిలోని స్కిమ్మర్‌లోనూ ఒకసారి స్వైప్ చేస్తున్నారు. దీంతో అందులో ఉండే డేటా మొత్తం స్కిమ్మర్కు చేరుతోంది. ఆపై దాన్ని పీఓఎస్ మెషిన్లో స్వైప్ చేసి, పిన్ నంబర్ ఎంటర్ చేయడం కోసం వినియోగదారుడికి అందిస్తుంటారు. కస్టమర్ ఎంటర్ చేసే పిన్ను జాగ్రత్తగా గమనిస్తారు. ఈ తంతు పూర్తయిన తర్వాత కార్డును వినియోగదారుడికి తిరిగి ఇచ్చేస్తుంటారు. రైటర్‌తో ల్యాప్‌టాప్‌లోకి... డెబిట్ కార్డుకు సంబంధించిన డేటా మొత్తం దాని వెనుక ఉండే నల్లని టేపు లాంటి మ్యాగ్నటిక్ స్ట్రిప్ లేదా చిప్‌లో నిక్షిప్తమై ఉంటుంది. స్కిమ్మర్‌లో కార్డును ఉంచి స్వైప్ చేయడంతో డేటా అందులోకి చేరుతుంది. ఇలా తస్కరించిన డేటాతో కూడిన స్కిమ్మర్లను ఈ పాత్రధారులు అసలు సూత్రధారులకు అందిస్తారు. ఇలా చేసినందుకు వీరికి కమీషన్ లేదా కొంత మొత్తం సూత్రధారుల నుంచి అందుతుంది. కేవలం డేటా మాత్రమే ఇచ్చిన కార్డుల కంటే పిన్ నంబర్‌తో సహా అందించిన వారికే కమీషన్ ఎక్కువ ఇస్తారు. ఈ డేటాను అందుకునే సూత్రధారులు ల్యాప్‌టాప్‌కు స్కిమ్మర్లు కనెక్ట్ చేయడం ద్వారా వాటిలోకి అప్లోడ్ చేస్తారు. అనేక సందర్భాల్లో ఈ సమాచారాన్ని సూత్రధారులు విదేశాల్లోని తమ అనుచరులకు అందిస్తారు. డార్క్ వెబ్ ద్వారానూ విక్రయించే దందా జోరుగా సాగుతుంటుంది. ఖాళీ కార్డు టు క్లోన్డ్ కార్డు సూత్రధారులు ఇంటర్నెట్ లేదా డార్క్ వెబ్ ద్వారానే మ్యాగ్నటిక్ స్ట్రిప్ లేదా చిప్‌తో కూడిన ఖాళీ కార్డులను కొనుగోలు చేస్తుంటారు. వీటిని ల్యాప్‌టాప్‌కు అనుసంధానించిన రైటర్లో ఉంచి.. అందులోకి క్లోన్ చేసిన వాటిలో ఓ కార్డు డేటా ట్రాన్స్ఫర్ చేసి క్లోన్డ్ కార్డు రూపొందిస్తారు. అంటే వినియోగదారుడి కార్డుకు నకలు దుండగుడి వద్ద తయారైపోతుందన్న మాట. దీన్ని తీసుకొని వాళ్లు షాపింగ్, ఆన్లైన్లో లావాదేవీలు చేయడం, డబ్బు డ్రా చేసుకోవడం చేస్తుంటారు. పీఓఎస్ మెషిన్లు ఉన్న కొందరు చిన్న చిన్న వ్యాపారులకు ఈ నేరగాళ్లు కమీషన్ల వల వేస్తున్నారు. దీంతో వాళ్లు నిబంధనలకు విరుద్ధంగా స్వైపింగ్ మెషిన్లో స్వైప్ చేసి నగదు ఇస్తూ కమీషన్ తీసుకుంటున్నారు. ఓ కన్నేయండి... కేవలం డెబిట్ కార్డులనే కాదు క్రెడిట్ కార్డులనూ క్లోన్ చేసే ఆస్కారం ఉంది. కార్డుల ద్వారా లావాదేవీలు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ కార్డు ఎదుటి వ్యక్తి చేతికి వెళ్లి మళ్లీ తిరిగి వచ్చే వరకూ గమనిస్తూ ఉండాలి. పీఓఎస్ మెషిన్లో పిన్ నంబర్ మీరే ఎంటర్ చేయాలి. అలా చేస్తున్నప్పుడు అది ఎవరూ గమనించకుండా రహస్యంగా చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పిన్ను ఎంటర్ చేసుకొమ్మని ఎదుటి వ్యక్తికి చెప్పకూడదు. ఈ తరహా సైబర్ నేరాల్లో రికవరీలు కష్టసాధ్యం. ఈ నేపథ్యంలో నేరాల బారినపడకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమం. – సైబర్ క్రైమ్ పోలీసులు రొమేనియా ఎంబసీకి లేఖ రాస్తాం నగరంలోని ఏటీఎం కేంద్రాలను టార్గెట్‌గా చేసుకొని ప్రత్యేక ఉపకరణాల ద్వారా డెబిట్ కార్డుల క్లోనింగ్‌కు పాల్పడుతున్న డినీట వర్జిల్ సొరైనెల్, జార్జ్ క్రిస్టియన్లను అరెస్టు చేశాం. వీరి విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లండన్‌కు చెందిన క్రిస్ట్ వీరి తో పాటు మరికొందరు రొమేనియన్లనూ క్లోనింగ్ దందా కోసం భారత్‌కు పంపాడని వెల్లడైంది. వీళ్లు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో దిగారని తెలిసింది. దీనిపై సమగ్ర నివేదిక రూపొందించి ఆ వివరాలతో రొమేనియన్ ఎంబసీకి లేఖ రాసి సమాచారం ఇవ్వాలని నిర్ణయించాం. డినీట, జార్జ్లన కస్టడీలోకి తీసుకొని విచారించిన తర్వాత మరింత సమాచారం తెలుస్తుంది. – మధ్య మండల పోలీసులు -
టార్గెట్ ఏటీఎం
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ఏటీఎం కేంద్రాలను టార్గెట్‌గా చేసుకొని ప్రత్యేక ఉపకరణాల ద్వారా డెబిట్ కార్డ్స్ క్లోనింగ్ చేస్తున్న హైటెక్ ముఠా గుట్టును అబిడ్స్ పోలీసులు రట్టు చేశారు. లండన్‌లో ఉన్న సూత్రధారి సూచనల మేరకు నగరానికి వచ్చి స్కిమ్మింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు రొమేనియా దేశస్తులను పట్టుకున్నారు. వీళ్లు నగరంలోని 8 ఏటీఎం కేంద్రాల్లోని మెషిన్లకు అత్యాధునిక స్కిమ్మర్లు, మైక్రో కెమెరాలు ఏర్పాటు చేసి డెబిట్ కార్డుల డేటా సంగ్రహించినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. మధ్య మండల సంయుక్త పోలీసు కమిషనర్ విశ్వప్రసాద్‌తో కలిసి గురువారం తనకార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. గత నెల 20న సిటీకి యూరోపియన్ యూనియన్ దేశమైన రొమేనియాకు చెందిన డినీట వర్జిల్ సొరైనెల్, జార్జ్ క్రిస్టియన్లు అక్కడే చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతికేవాళ్లు. ఓ సందర్భంలో ఈ ద్వయం లండన్ వెళ్లినప్పుడు అక్కడ క్రిస్ట్ అనే వ్యక్తిని కలిశారు. ఇరువురికీ 5వేల యూరోల చొప్పున ఇచ్చిన అతగాడు డెబిట్ కార్డ్స్ స్కిమ్మింగ్, క్లోనింగ్‌కు ఉపకరించే అత్యాధునిక పరికరాలు అందజేశాడు. వీటితో ఇండియాకు వెళ్లి అక్కడి ఏటీఎం కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని సూచించాడు. అలా తస్కరించిన డేటాను తనకు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పాడు. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ 9న రొమేనియాలో పాస్‌పోర్ట్ పొందిన ఇరువురూ వేర్వేరుగా విజిట్ వీసా తీసుకొని 14న ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడి నుంచి 20న హైదరాబాద్‌కు వేర్వేరుగా వచ్చిన వీరు.. వేర్వేరు ప్రాంతాల్లోని సర్వీసు అపార్ట్‌మెంట్స్‌లో దిగారు. కేవలం ఫోన్‌కాల్స్, వాట్సాప్ సందేశాల ద్వారానే సమాచార మార్పిడి చేసుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కో పని... డినీట్ తన వద్దనున్న పరికరాలు తీసుకొని ఉదయమే బయటకు వచ్చేవాడు. నగరం మొత్తం సంచరిస్తూ అనువైన ఏటీఎం కేంద్రాన్ని గుర్తించేవాడు. అందులోకి మాస్క్, టోపీతో వెళ్లేవాడు. డెబిట్‌కార్డ్ పెట్టే స్లాట్‌లో స్కిమ్మర్, పిన్ నంబర్ నొక్కే కీ–ప్యాడ్‌పైన భాగంలో మైక్రో కెమెరా, బ్యాటరీలతో కూడిన డివైజ్ ఏర్పాటు చేసేవాడు. ఇవి ఆ మెషిన్‌కు ఉండే పరికరాల్లో ఇమిడిపోతాయి. దీంతో సాధారణంగా చూసే ఎవరూ గుర్తించరు. ఉదయం 7:30–8 గంటల మధ్య ఈ పని పూర్తి చేసేవాడు. ఆ ఏటీఎం మెషిన్‌ను వినియోగించడానికి వచ్చిన వినియోగదారుడు తన డెబిట్‌కార్డును స్లాట్‌లో పెడితే... అప్పటికే దానిపై అమర్చిన స్కిమ్మర్ దాని డేటాను రీడ్ చేసేస్తుంది. పిన్ నొక్కేప్పుడు అవన్నీ కీప్యాడ్ పైన ఉన్న కెమెరాలో రికార్డు అయిపోతాయి. వీటిని ఏర్పాటు చేసిన తర్వాత ఆ లోకేషన్‌ను డినీట్ వాట్సాప్‌లో జార్జ్‌కు పంపించేవాడు. దీని ఆధారంగా 16–17 గంటల తర్వాత ఆ ప్రాంతానికి చేరుకునే జార్జ్ వాటిని తీసుకెళ్లేవాడు. వాటిలో నిక్షిప్తమైన డేటాను తమ ల్యాప్‌టాప్‌లోకి డౌన్లోడ్ చేసేవాడు. సెక్యూరిటీ గార్డు అనుమానంతో... మధ్య మండల పరిధిలోని జగదీష్ మార్కెట్ వద్దనున్న ఎస్బీఐ ఏటీఎం కేంద్రంలోని మెషిన్‌కు ఓ విదేశీయుడు ఏవో ఉపకరణాలు బిగిస్తున్నట్లు సెక్యూరిటీ గార్డు అనుమానించాడు. ఈ విషయం బ్యాంకు అధికారులకు తెలపడంతో వాళ్లు ఈ నెల 14న వచ్చి పరిశీలించి ఉన్నట్లు గుర్తించారు. ఆ మరుసటి రోజు పరిశీలిస్తే అవి లేకపోవడం, 16న మళ్ళీ ఉండడంతో బ్యాంకు అధికారులు అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన ఇన్స్పెక్టర్ రవికుమార్ నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేపట్టింది. ఏటీఎం కేంద్రంలో రికార్డు అయిన ఫీడ్ ఆధారంగా దుండగులు విదేశీయులని గుర్తించింది. అక్కడి నుంచి చుట్టూ ఉన్న అనేక సీసీ కెమెరాల్లో ఫీడ్ పరిశీలిస్తూ ముందుకెళ్లింది. ఈ నేపథ్యంలోనే సదరు విదేశీయుడు ఆటో ఎక్కుతున్నట్లు దానికి 200 మీటర్ల దూరంలో ఉన్న ఓ కెమెరాలో గుర్తించారు. ఆ ఆటోడ్రైవర్‌ను ప్రశ్నించగా, అతగాడు మెహిదీపట్నంలో దిగాడని తేలింది. ఆటోలు మారుతూ... ఒకే ఆటోలో ప్రయాణిస్తే సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు పట్టుకుంటారని నిందితుడు అనుమానించాడు. దీంతో ఆటోలు మారుతూ తాను బస చేసిన సర్వీస్ అపార్ట్‌మెంట్‌కు వెళ్లే పథకం వేశాడు. మెహిదీపట్నం ప్రాంతంలో సీసీ కెమెరాలు పరిశీలించగా అక్కడ మరో ఆటో ఎక్కినట్లు తేలింది.దాని నంబర్ ఆధారంగా డ్రైవర్‌ను గుర్తించి ఆరా తీశారు. నానల్‌నగర్ వద్ద ఆటో దిగాడని తేలడంతో అక్కడి కెమెరాల ఆధారంగా మూడో ఆటో ఎక్కినట్లు తేల్చి ఆ డ్రైవర్‌ను ఆరా తీశారు. సదరు డ్రైవర్ ఆ విదేశీయుడు గచ్చిబౌలి పరిధిలోని అంజయ్యనగర్‌లో దిగాడని చెప్పాడు. అప్పటికే సీసీ కెమెరాల ఫీడ్ నుంచి సంగ్రహించిన విదేశీయుడి ఫొటో ఆధారంగా అక్కడి సర్వీస్ అపార్ట్‌మెంట్స్‌లో ఆరా తీయగా ఫలితం దక్కింది. ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న డినీట్ పోలీసులకు చిక్కాడు. అక్కడ దిగడానికి అతగాడు బోగస్ గుర్తింపు కార్డు వాడినట్లు వెల్లడైంది. అతడిచ్చిన సమాచారంతో బేగంపేటలోని మరో సర్వీస్ అపార్ట్మెంట్లో ఉంటున్న జార్జ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరి గదుల్లో తనిఖీ చేసిన పోలీసులు ల్యాప్‌టాప్ తదితర స్వాధీనం చేసుకున్నారు. క్లోనింగ్ సైతం చేస్తున్నట్లుఅనుమానాలు... ఈ ద్వయం చెప్పిన దాని ప్రకారం వీళ్లు డెబిట్‌కార్డుల డేటా తస్కరించి (స్కిమ్మింగ్) లండన్‌లో ఉన్న క్రిస్ట్‌కు పంపిస్తుంటారు. అయితే వీరి వద్ద పోలీసులు స్కిమ్మర్లతో పాటు ఎలాంటి డేటా లేని ఖాళీ ప్లాస్టిక్ కార్డులు, ల్యాప్‌టాప్ సాయంతో స్కిమ్మింగ్ డేటాను వీటిలోకి ఎక్కించే రీడర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వీళ్లు ఇక్కడే క్లోన్డ్ డెబిట్‌కార్డులు తయారీకి ప్రయత్నించారని అనుమానిస్తున్నారు. తదుపరి విచారణలోనే ఈ వివరాలన్నీ వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు. 20 రోజులకు పైగా నగరంలో స్వైరవిహారం చేసిన ఈ ద్వయం 8 ఏటీఎం కేంద్రాల్లో డివైజ్‌లు ఏర్పాటు చేసి డేటా తస్కరించినట్లు పోలీసులు గుర్తించారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌లో విశ్లేషించిన తర్వాతే ఎవరెవరి డేటా తస్కరణకు గురైంది? అందులో ఎంత లండన్‌లోని క్రిస్ట్‌కు చేరింది? అనేది తేలుతుందని, బ్యాంక్ అధికారులు సైతం దీనిపై విచారణ చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. ఎలా కొట్టేస్తున్నారు? ఏటీఎంలలో డెబిట్ కార్డును ఉంచే స్లాట్‌లో స్కిమ్మర్, పిన్ నంబర్ ఎంటర్ చేసే కీప్యాడ్ పైభాగం లో మైక్రో కెమెరా అమర్చుతారు. వినియోగదారులు డెబిట్ కార్డును స్లాట్‌లో ఉంచినప్పుడు అప్పటికే దానిపై అమర్చిన స్కిమ్మర్ డేటాను రీడ్ చేస్తుంది. పిన్ ఎంటర్ చేసేటప్పుడు మైక్రో కెమెరాలో రికార్డు అవుతుంది. ఏం చేస్తున్నారు? ఏటీఎం కేంద్రాల్లో ప్రత్యేక పరికరాలు ఏర్పాటు చేసి డెబిట్ కార్డుల డేటా సంగ్రహిస్తున్నారు. దీని ద్వారా డెబిట్ కార్డుల క్లోనింగ్‌కు పాల్పడుతున్నారు. ఎంత మంది? ఇద్దరు రొమేనియా దేశస్తులు ఈ నేరానికి పాల్పడ్డారు. వీరు విజిట్ వీసాపై భారత్‌కు వచ్చి నగరంలో పాగా వేశారు. వీరిద్దరు పాత్రధారులు కాగా.. లండన్‌లోని క్రిస్ట్ సూత్రధారి. ..ఇలా చిక్కారు అబిడ్స్ జగదీష్ మార్కెట్లోని ఎస్బీఐ ఏటీఎంలో వీటిని అమర్చుతుండ గా సెక్యూరిటీ గార్డుకు అనుమానం వచ్చింది. బ్యాంకు అధికారులకు సమాచారం ఇవ్వగా స్కిమ్మర్లు ఉన్నట్లు గుర్తించారు. అధికారులు పోలీసులకు తెలియజేయడంతో సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. -
ఇక డెబిట్ కార్డులపైనా బంపర్ ఆఫర్..
సాక్షి, న్యూఢిల్లీ : డెబిట్ కార్డు కస్టమర్లకు ఎస్బీఐ తీపికబురు అందించింది. డెబిట్ కార్డుపైనా ఈఎంఐ సౌకర్యం అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు ఎస్బీఐ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. దేశవ్యాప్తంగా 40,000కుపైగా వాణిజ్య సముదాయాలు, వ్యాపార సంస్ధల వద్ద ఏర్పాటు చేసిన పాయింట్ ఆఫ్ సేల్స్ (పీఓఎస్) వద్ద ఎస్బీఐ డెబిట్‌కార్డుదారులు వస్తువులను కొనుగోలు చేసి నెలసరి వాయిదాల రూపంలో (ఈఎంఐ)లో చెల్లింపులు చేపట్టే వెసులుబాటు కల్పిస్తున్నామని ఎస్బీఐ ఛైర్మన్ రజనీష్ కుమార్ వెల్లడించారు. వస్తువుల కొనుగోలుకు అయ్యే మొత్తం తక్షణమే ఒకేసారి చెల్లించకుండా డెబిట్ కార్డుల ద్వారా కస్టమర్లు ఈఎంఐపై వాటిని కొనుగోలు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. కనిష్టంగా ఆరు నెలల నుంచి 18 నెలల వరకూ వినియోగదారులు ఈఎంఐ గడువును ఎంపిక చేసుకోవచ్చని ఎస్బీఐ ప్రకటన పేర్కొంది. దీనికోసం డెబిట్‌కార్డు కలిగిన వినియోగదారులు ఎలాంటి ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. సేవింగ్స్ ఖాతాలో అకౌంట్ బ్యాలెన్స్‌తో సంబంధం లేకుండా ఒక్క నిమిషంలోనే ఈ సదుపాయం పొందవచ్చని వెల్లడించింది. లావాదేవీ పూర్తయిన నెల తర్వాత ఈఎంఐలు మొదలవుతాయి. మెరుగైన క్రెడిట్ హిస్టరీ కలిగిన కస్టమర్లందరూ వినిమయ రుణాలను పొందవచ్చని ఆ ప్రకటన పేర్కొంది. కస్టమర్లు తమ అర్హతను చెక్ చేసుకునేందుకు డీసీఈఎంఐ అని టైప్ చేసి 567676 నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలని తెలిపింది. అయితే ఈ నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేసిన పలువురికి ఫెయిల్డ్ అని రిప్లై వస్తుండటం గమనార్హం. -
రూపే కార్డులపై మర్చంట్ డిస్కౌంట్ రేటు తగ్గింపు
ముంబై: రూపే డెబిట్ కార్డు లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేటును క్రమబదీ్ధకరించినట్టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) ప్రకటించింది. అక్టోబర్ 20 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్), ఈకామ్, భారత్‌క్యూఆర్ కోడ్ ఆధారిత మర్చంట్ లావాదేవీలపై రేట్లను క్రమబదీ్ధకరించినట్టు వివరించింది. రూ.2,000కు పైన ఉండే లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ చార్జీని 0.60 శాతానికి సవరించామని, గరిష్టంగా రూ.150గానే ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం రూ.2,000పైన లావాదేవీలపై 0.90 శాతం వరకు అంటే గరిష్టంగా రూ.1,000 వరకు ఉండేది. ఇక క్యూఆర్ లావాదేవీలపై చార్జీని 0.50 శాతానికి తగ్గించింది. గరిష్ట చార్జీ రూ.150. -
‘స్కిమ్మింగ్’తో దోపిడీ!
సాక్షి, సిటీబ్యూరో: డబ్బులు డ్రా చేసుకునేందుకు ఏటీఎంలకు వెళ్తున్నారా? అయితే మీరు జాగ్రత్తగా వ్యవహరించకపోతే మీ బ్యాంక్ ఖాతాలోని డబ్బులు మాయం కావచ్చని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎప్పటికప్పుడూ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న సైబర్ నేరగాళ్లు ఏ మార్గమైనా డబ్బులే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారని సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ రోహిణీ ప్రియదర్శిని పేర్కొన్నారు. బ్యాంక్ ప్రతినిధులమంటూ ఫోన్‌కాల్స్ చేసి డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు తెలుసుకొని నగదు మాయం చేసే నేరగాళ్లు... ఇప్పుడు రూటు మార్చి ‘స్కిమ్మింగ్’ చేసి డబ్బులు డ్రా చేస్తున్నారని వెల్లడించారు. గత కొంతకాలంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కొన్ని బ్యాంక్ ఏటీఎంలలో స్కిమ్మింగ్ తరహా జరిగిన మోసాలను గుర్తు చేస్తూ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలా చేస్తే మంచిది... ♦ ఏటీఎంలో కార్డు రీడర్‌పై స్కిమ్మర్లను అమరుస్తారు. దీంతో పాటు ఏటీఎం పిన్ తెలుసుకోడానికి కీప్యాడ్‌కు వ్యతిరేకంగా పైభాగంలో చిన్న కెమెరాతో కూడిన స్కానర్‌ను కూడా ఉంచుతారు. ఏటీఎంలోకి వెళ్లినప్పుడు ఈ పరికరాలు ఉన్నాయా? అనేది పరిశీలించాలి. ♦ శివార్లలో ఉండే, జన సంచారం ఎక్కువగా లేని, సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎంలకు వెళ్లకపోవడమే మంచిది. ♦ పిన్ టైప్ చేసేటప్పుడు చెయ్యి అడ్డుపెట్టుకోవడం సురక్షితం. ♦ నగదు విత్‌డ్రా చేయగానే మొబైల్‌కు మెసేజ్‌లు వచ్చేలా ఎస్ఎంఎస్ అలర్ట్‌లు పెట్టుకోవాలి. ♦ చాలామంది కస్టమర్లు ఫోన్ నంబర్లను మార్చినా బ్యాంకు అధికారులకు తెలపడంలో నిర్లక్ష్యం వహిస్తారు. ఫోన్ నంబర్ మార్చితే తక్షణమే బ్యాంకు ఖాతాకు కొత్త ఫోన్ నంబరును అనుసంధానం చేసుకోవాలి. ♦ బ్యాంక్ ఖాతా నుంచి మన ప్రమేయం లేకుండానే నగదు ఉపసంహరణ జరిగితే వెంటనే కస్టమర్ కేర్ నంబర్‌కు ఫోన్ చేసి మన ఏటీఎం సేవలను స్తంభింపజేసుకోవాలి. వెంటనే సంబంధిత సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. స్కిమ్మింగ్ ఇలా... ప్రత్యేక పరికరాలను అమర్చి క్రెడిట్, డెబిట్ కార్డుల సమాచారాన్ని తస్కరించడాన్ని ‘స్కిమ్మింగ్’ అంటారు. ఇలా కార్డుల సమాచారాన్ని చౌర్యం చేయడానికి ఉపయోగించే పరికరాలను స్కిమ్మర్ పరికరాలు అంటారు. ఎంపిక చేసుకున్న ఏటీఎంలలో మోసగాళ్లు గుట్టుచప్పుడు కాకుండా వీటిని అమరుస్తారు. కస్టమర్లు ఏటీఎం ద్వారా నగదు తీసుకునేందుకు కార్డును స్వైప్ చేసినప్పుడు, కార్డు మ్యాగ్నటిక్ స్ట్రిప్‌లోని సమాచారం, పిన్ నంబర్‌ను స్కిమ్మర్ సంగ్రహిస్తుంది. సేకరించిన సమాచారంతో మోసగాళ్లు ఆ తర్వాత నగదు తీసుకుంటున్నారు. దీని కోసం కూడా పలుదారులు ఎంచుకుంటున్నారు. ప్రధానంగా నకిలీ కార్డులను తయారు చేసి సుదూర ప్రాంతాల్లోని ఏటీఎంల ద్వారా నగదు తస్కరిస్తున్నారు. -
వీసా ‘డెబిట్ కార్డు’పై ఈఎంఐ సదుపాయం
ముంబై: ప్రపంచ అతిపెద్ద చెల్లింపుల నెట్వర్క్ ‘వీసా’.. ఇక నుంచి తన అన్ని రకాల డెబిట్ కార్డులపై నెలవారీ వాయిదా చెల్లింపు (ఈఎంఐ) సదుపాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ–కామర్స్ సంస్థల నుంచి జరిపే ఆన్లైన్ కొనుగోళ్లకు ఈ ప్రయోజనం వర్తిస్తుందని తెలిపింది. దేశీయంగా 4.5 కోట్ల క్రెడిట్ కార్డులు ఉండగా.. 93 కోట్ల డెబిట్ కార్డులు ఉన్నాయి. మొత్తం డెబిట్ కార్డుల వాడకందారుల్లో 22 కోట్ల మందికి క్రెడిట్ సౌలభ్యం ఉంది. బ్యాంకులు, మర్చంట్లను ఒక ప్రత్యేక ప్లాట్‌ఫాం ద్వారా అనుసంధానం చేయడం ద్వారా విస్తృత స్థాయిలో డెబిట్ కార్డుదారులకు కూడా ఈఎంఐ సదుపాయాన్ని అందించనున్నట్లు సంస్థ ప్రొడక్డ్ హెడ్ అరవింద్ రొంటా వివరించారు. -
కస్టమర్లకు ఊరట : ఎస్బీఐ కొత్త ఫీచర్
సాక్షి, ముంబై : దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన వినియోగదారులకోసం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ ఫీచర్. డిజిటల్ బ్యాంకింగ్ ఫ్లాట్‌ఫామ్ యోనోపై ‘యోనో క్యాష్’ను లాంచ్ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా16,500కు పైగా ఉన్న ఎస్బీఐ ఏటీఎంలలో డెబిట్ కార్డు లేకుండానే నగదు ఉపసంహరణ చేసుకోవచ్చని బ్యాంక్ తెలిపింది. ప్రధానంగా కార్డు ద్వారా నగదు ఉపసంహరణ, వినియోగంలో చోటుచేసుకుంటున్నమోసాలకు చెక్ చెప్పేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలోనే ఇటువంటి సేవలను ప్రారంభించిన తొలి బ్యాంక్ తమదేనని ఎస్బీఐ ప్రకటించింది. ఈ సదుపాయం కలిగిన ఏటీఎంలను ‘యోనో క్యాష్ పాయింట్’గా వ్యవహరిస్తారు. కార్డు లేకుండా డబ్బులు డ్రా చేయడం ద్వారా స్కిమ్మింగ్, క్లోనింగ్ లాంటి మోసాలను తగ్గించొచ్చని ఎస్బీఐ భావిస్తోంది. యోనో యాప్‌లో యోనో క్యాష్ ద్వారా కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ సాధ్యమవుతుంది. 2-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ చేయాల్సి ఉంటుంది. ముందుగా యోనో యాప్‌పై ఎస్బీఐ ఖాతాదారులు కార్డురహిత నగదు ఉపసంహరణకు విజ్ఞప్తి చేయాల్సి ఉంటుంది. నగదు తీసుకునే విధానం యాప్‌లో అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసి ఎంత నగదు కావాలో ఎంటర్ చేయాలి 6 అంకెల యోనో క్యాష్ పిన్ సెట్ చేసుకోవాలి అనంతరం రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు 6 అంకెల రిఫరెన్స్ నెంబర్ ఎస్ఎంఎస్ వస్తుంది. ఈ నెంబర్ కేవలం 30 నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది. సమీపంలోని యోనో క్యాష్ పాయింట్‌కు వెళ్లాలి ఎస్ఎంఎస్లో వచ్చిన 6 అంకెల రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేయాలి. యాప్‌లో ఎంటర్ చేసిన అమౌంట్‌ను ఏటీఎంలో ఎంటర్ చేయాలి. తరువాత యాప్‌లో క్రియేట్ చేసిన 6 అంకెల యోనో క్యాష్ పిన్ను ఎంటర్ చేసి డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఎస్బీఐ వినియోగదారులకు బ్యాంకింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపర్చడమే తమ లక్ష్యమని ఎస్బీఐ ఛైర్మన్ రజినీష్ కుమార్ చెప్పారు. Say YO to YONO Cash! Go cardless with #YONOSBI and withdraw cash safely and securely, dono. For cardless ATM transactions look for the YONO Cash sign. Download: https://t.co/yjDSsj2O4L#SBI #StateBankofIndia #YONOSBI #YONOCash #EasyBanking #Convenience #Withdrawals #ATM pic.twitter.com/2ELLY0T2NF — State Bank of India (@TheOfficialSBI) March 16, 2019 -
తాజా మొండి బకాయిలు తగ్గాయ్: ఎస్బీఐ
హైదరాబాద్: తాజా మొండి బకాయిలు తగ్గాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రిటైల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్ విభాగ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ గుప్తా తెలిపారు. భారీ మొండి బకాయిల ఖాతాలకు సంబంధించి పరిష్కారం కోసం ఎన్సీఎల్టీలో ప్రయత్నాలు చేస్తున్నామని, భవిష్యత్తులో మొండి బకాయిలు తగ్గుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎస్బీఐ హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్ 150వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో మొండి బకాయిలు పెరగవు... ఎన్సీఎల్టీకి నివేదించిన భారీ మొండి బకాయిల్లో కొన్ని కేసులు పరిష్కారమయ్యాయని, మరి కొన్ని కేసుల్లో పరిష్కారం తుది దశలో ఉందని ప్రవీణ్ కుమార్ గుప్తా వివరించారు. మొత్తం మీద రానున్న రెండు నెలల్లో ఈ బకాయిల సమస్య ఒక కొలిక్కి రాగలదన్నారు. తాజా మొండి బకాయిలు తగ్గాయంటూ... భవిష్యత్తులో మొండి బకాయిలు పెరిగే సమస్యే లేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మహారాష్ట్ర, కర్నాటకల్లో మాత్రమే వ్యవసాయ రంగ రుణాల్లో మొండి బకాయిలు పెరిగాయని, దేశవ్యాప్తంగా ఈ ధోరణి లేదని గుప్తా స్పష్టంచేశారు. పాత డెబిట్ కార్డ్‌ల స్థానంలో మరింత సురక్షితమైన ఫీచర్లున్న కొత్త డెబిట్ కార్డ్‌ల జారీ కొనసాగుతోందన్నారు. పాత డెబిట్ కార్డులను మార్చుకోవడానికి ఈ నెల 31 గడువు తేదీ అని, ఇప్పటికే చాలా వరకూ కొత్త కార్డ్‌లను జారీ చేశామని వివరించారు. -
చిప్‌లేని కార్డులకు ఇక చెల్లు
కడెం(ఖానాపూర్): ‘ఈఎంవీ’ చిప్ లేని ఏటీఎం డెబిట్, క్రెడిట్ కార్డులు డిసెంబర్ 31 తర్వాత పనిచేయవని రిజర్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. గతంలో జారీచేసిన మాగ్నటిక్ పూత(స్రి ్టఫ్)కల్గిన ఏటీఎం కార్డులతో ఆన్లైన్ మోసాలు జరుగుతున్న నేపథ్యంలో కార్డులను పూర్తిగా బ్యా న్ చేసి చిప్ కలిగిన నూతన ఏటీఎం కార్డులను వినియోగాదారులకు అందివ్వనుంది. ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకే.. 2016 వరకు దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు చిప్ లేని డెబిట్, క్రెడిట్ కార్డులను అం దజేశాయి. ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా ఏటీ ఎం కార్డుల క్లోనింగ్ ద్వార మోసాలు పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్ల నుంచి ఖాతాదారుల డ బ్బును కాపాడేందుకు మాగ్నటిక్ స్ట్రిఫ్తో పాటు, అదనంగా ఈవీఎం చిప్ కలిగిన కార్డులు అవసర మని బ్యాంకింగ్ సంస్థలు భావించాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల ఖాతాదారులకు హా ్యక్ కాకుండా ఉండేందుకు ఈచర్యలు తీసుకుంటున్న ట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈఎంవీతో సేఫ్.. యూరో, మాస్ట్రో, విసా (ఈ.ఎం.వీ) చిప్ కల్గిన ఏటీఎం కార్డుల ద్వారా సమాచా రం హ్యక్ కాకుండా సురక్షితంగా ఉంటుంది. గతంలో బ్యాంకులు జా రీ చేసిన మాగ్నటిక్ స్ట్రిఫ్ కార్డుల ద్వారా క్లోనింగ్ చేసి సైబర్ నేరగాళ్లు ఈజీగా ఖాతాల నుంచి నగదు దోపిడీకి పాల్పడుతున్నారు. కొత్తగా వచ్చిన ఈవీ ఎం కార్డులను ఈ విధంగా చేసేందుకు వీ లుండదు. ఎందుకంటే ప్రతి లావాదేవీకి ఒక వ ర్చువల్ కీ జనరేట్ కావడం వల్ల క్లోనింగ్ చేసేం దుకు ఆస్కారం ఉండదు. కొత్త కార్డులు జారీ మాగ్నటిక్ స్ట్రిఫ్ గల పాత ఏటీఎం కార్డులున్న ఖాతాదారులకు ఆయా బ్యాంకులు వాటి స్థానం లో చిప్ ఉన్న నూతన ఏటీఎం కార్డులను జారీచేస్తున్నాయి. దీనికి ఎలాంటి దరాఖాస్తులు అవస రం లేదని, ఆటోమెటిక్‌గా కార్డులు పోసు ్టద్వారా ఖాతాదారులకు అందిస్తున్నట్లు అధికారులు పే ర్కొన్నారు. అడ్రస్‌లలో తప్పులు, ఇతర కారణాల వల్ల కొత్త కార్డులు అందనివారు బ్యాంకు అధికారులను సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు. కార్డులు జారీ చేస్తున్నాం పాత మాగ్నటిక్ కార్డులు కలిగిన ఖాతాదారులకు వాటిస్థానంలో కొత్తగా చిప్ కలిగిన ఏటీఎం కార్డులు అందుతాయి. ఖాతాదారుల చిరునామాల్లో తప్పులు, తదితర కారణాలతో కార్డులు అందనివారు బ్యాంక్ అధికారులను సంప్రదించాలి. – నర్సయ్య, మేనేజర్, ఎస్బీఐ, లింగాపూర్ -
బ్యాంకు కార్డులపై భారీ ఆఫర్లు
అమెజాన్ ‘గ్రేట్ ఇండియా ఫెస్టివల్’... ఫ్లిప్‌కార్ట్ ‘ఫెస్టివ్ ధమాకా సేల్స్’... పేటీఎం ‘మహా క్యాష్‌బ్యాక్ సేల్’... వీటిలో కొనలేకపోయారా..? ఆఫర్లను మిస్ అయ్యామని నిరాశ పడాల్సిన పనేలేదు. ఎందుకంటే పండుగ సందర్భంగా డిస్కౌంట్ ఆఫర్లకు పలు ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. అటు ఆన్లైన్ సంస్థలూ కొత్త కొత్త పేర్లతో పండుగల దాకా ఏదో ఒక రూపంలో ఆఫర్లు అందిస్తూనే ఉంటున్నాయి. ఇక దగ్గర్లోని ప్రముఖ దుకాణానికి వెళ్లినా ఆఫర్లు అందుకోవచ్చు! కాకపోతే క్రెడిట్, డెబిట్ కార్డులపై చాలా బ్యాంకులు ఇన్స్టాంట్ డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందిస్తున్నాయి. వీటిని వినియోగించు కోవడం ద్వారా కొంత వరకు ఆదా చేసుకునే అవకాశముంది. ఎస్బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్, సిటీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు తమ క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి షాపింగ్ చేస్తే పండుగ ఆఫర్లను అందిస్తున్నాయి. పలు రిటైల్ సంస్థలతో (వీటిలో ఆన్లైన్, ఆఫ్‌లైన్) సంబంధం పెట్టుకుని తగ్గింపు, క్యాష్ బ్యాక్ ఆఫర్లను తమ ఖాతాదారులకు అందిస్తున్నాయి. కాకపోతే వీటి గురించి అంతగా ప్రచారం ఉండదు. కాబట్టి ఆయా బ్యాంకు వెబ్‌సైట్లకో, లేదంటే ఈ కామర్స్ వెబ్‌సైట్లకో వెళితే తప్ప తెలియదు. వాటిలో గనక ఈ ఆఫర్ల గురించి తెలుసుకుంటే... దానికి అనుగుణంగా కొనుగోళ్లు చేసుకునే వీలుంటుంది. విభిన్న ఆఫర్లు పండుగ ఆఫర్లు రెండు రూపాల్లో ఉంటాయి. ఒకటి క్యాష్ బ్యాక్ ఆఫర్ కాగా, రెండోది రిటైల్ సంస్థలు పండుగ సందర్భంగా అందిస్తున్న తగ్గింపు ధరలపై అదనపు డిస్కౌంట్!. ఈ అదనపు డిస్కౌంట్ అనేది అప్పటికప్పుడే అమలవుతుంది. క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే, ఆ మొత్తం తిరిగి కస్టమర్‌కు వచ్చేందుకు కొంత సమయం పడుతుంది. అంటే ముందు మొత్తం చెల్లించి ఉత్పత్తి కొనుగోలు చేస్తే... నిర్ణీత తేదీన క్యాష్ బ్యాక్ జమ చేస్తారు. ఇది నెల రోజుల నుంచి మూడు నెలల వరకు ఒక్కో సంస్థను బట్టి మారిపోతుంది. పీటర్ ఇంగ్లండ్ స్టోర్లలో కొనుగోళ్లపై ఐసీఐసీఐ బ్యాంకు తన క్రెడిట్, డెబిట్ కార్డులపై 10 శాతం క్యాష్ బ్యాక్ అందిస్తోంది. కాకపోతే కనీస బిల్లు మొత్తం రూ.3,500 ఉంటేనే ఈ డిస్కౌంట్ ఆఫర్‌కు అర్హులు. అలాగే గరిష్ట క్యాష్ బ్యాక్ ఒక కార్డుపై రూ.750కే పరిమితం. 2019 జనవరి 31లోపు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఇదొక ఉదాహరణ మాత్రమే. చాలా స్టోర్లు చాలా కార్డులపై ఇలాంటి ఆఫర్లు అందిస్తున్నాయి. క్యాష్ బ్యాక్, డిస్కౌంట్‌తోపాటు రివార్డు పాయింట్ల రూపంలో మరో ప్రయోజనాన్ని కూడా కస్టమర్లు సొంతం చేసుకోవచ్చు. పండుగ సీజన్లో క్రెడిట్ కార్డు కొనుగోళ్లపై హెచ్ఎస్బీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు తదితర కొన్ని బ్యాంకులు రివార్డు పాయింట్లను అందిస్తున్నాయి. ఇన్ఫీబీమ్‌లో రూ.50,000 అంతకుమించి చేసే కొనుగోళ్లపై హెచ్ఎస్బీసీ ఇతరులతో పోలిస్తే ఐదు రెట్లు అధికంగా రివార్డు పాయింట్లను ఆఫర్ చేస్తోంది. వస్త్రాలు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కొనుగోళ్లపై హెచ్డీఎఫ్సీ బ్యాంకు 10 రెట్లు అధికంగా రివార్డు పాయింట్లను ఇస్తోంది. కాకపోతే కనీస కొనుగోలు మొత్తం రూ.5,000 ఉండాలి. ప్రతీ రోజు సాయంత్రం 5–9 గంటల మధ్య కొనుగోలు చేసే వారికే ఈ ఆఫర్ పరిమితం. ఇక ఈ పండుగ సీజన్లో ఏం కొనుగోలు చేయవచ్చంటే... వస్త్రాలు, గృహోపకరణాలు, మొబైల్ ఫోన్లు, బంగారు ఆభరణాలపై ఈ ఆఫర్లు ఉన్నాయి. ఎక్కడెక్కడ... రిలయన్స్ ట్రెండ్స్, పాంటలూన్, వెస్ట్ సైడ్, మ్యాక్స్, మార్క్స్ అండ్ స్పెన్సర్స్ తదితర ప్రముఖ రిటైల్ వస్త్ర దుకాణాలు ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకుతో టై అప్ అయ్యాయి. తమ కార్డులతో కొనుగోళ్లపై క్యాష్ బ్యాక్, డిస్కౌంట్లను అందిస్తున్నాయి. దాదాపు అన్ని స్టోర్లలోనూ ఇవి అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల విషయంలో మాత్రం క్రోమా, రిలయన్స్ డిజిటల్ కనీసం రూ.10,000 కొనుగోలుపై 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తున్నాయి. అదే హెచ్డీఎఫ్సీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో క్రోమాలో చేసే కొనుగోళ్లపై రూ.2,000 వరకు క్యాష్ బ్యాక్ పొందొచ్చు. తనిష్క్లో హెచ్డీఎఫ్సీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు కొనుగోళ్లపై 5 శాతం డిస్కౌంట్ ఆఫర్ ఉంది. రూ.50,000–1,00,000 కొనుగోళ్లపై అందుకునే గరిష్ట క్యాష్‌బ్యాక్ రూ.2,500. రూ.లక్షపైన కొనుగోలుపై గరిష్ట క్యాష్ బ్యాక్ రూ.5,000. కొన్ని పరిమితులు కూడా... ఈ ఆఫర్లు దాదాపు అన్ని అవుట్లెట్లలో అందు బాటులో ఉన్నప్పటికీ కొన్ని పరిమితులూ ఉన్నాయి. ఉదాహరణకు... పాంట లూన్ రిటైల్ దుకాణాల్లో ఎస్బీఐ అందించే 5%క్యాష్ బ్యాక్ ఆఫర్, తూర్పు ప్రాంతంలోని స్టోర్లకు అమలు కాదు. రిలయన్స్ ట్రెండ్స్‌లో ఐసీఐసీఐ 5% క్యాష్ బ్యాక్ ఆఫర్, అసోం, పశ్చిమబెంగాల్, బిహార్ సహా తొమ్మిది రాష్ట్రాల్లో అందుబాటులో లేదు. ఇక మరో అంశం... బ్యాంకు నిర్దేశించిన కనీస మొత్తం కొనుగోలుపైనే ఆఫర్లు అమలవుతాయి. అంతేకాదు గరిష్ట తగ్గింపు, క్యాష్ బ్యాక్పైనా పరిమితి ఉంటుంది. ఈ వివరాలను బ్యాంకు వెబ్సైట్లు, సంబంధిత రిటైల్ దుకాణాల్లో తెలుసుకోవచ్చు. యాక్సిస్ , కోటక్, సిటీబ్యాంకులు రిలయన్స్ డిజిటల్ అవుట్లెట్లలో తమ క్రెడిట్ కార్డు లతో చేసే కొనుగోళ్లపై 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తున్నాయి. కాకపోతే కనీస కొనుగోలు రూ.10,000 ఉండాలి. గరిష్ట క్యాష్ బ్యాక్ రూ.2,000. రిటైల్ దుకాణాల్లో కార్డు స్వైప్ చేసే ముందు కూడా అక్కడి సిబ్బందికి విషయం తెలియజేయడం మంచిది. ఇక రిటైల్ కార్డులపైనే ఈ ఆఫర్లన్నీ. కార్పొరేట్ కమర్షియల్ కార్డులకు వర్తించవు. ముందస్తు జాగ్రత్తలు క్రెడిట్ కార్డు వినియోగం వల్ల వడ్డీ రహిత రుణాన్ని కొన్ని రోజులకు తీసుకునే అవకాశం లభిస్తుంది. కాకపోతే వడ్డీ రహిత కాల వ్యవధి (20–50 రోజుల మధ్య) ముగిసేలోపు ఆ మొత్తాన్ని తిరిగి కార్డులోకి జమ చేయాలి. లేదంటే భారీగా వడ్డీ పడుతుంది. ప్రతి నెలా 2.5–3 శాతం వరకు వడ్డీ ఉంటుంది. అంటే వార్షిక వడ్డీ 30–36 శాతం వరకు. అందుకే తిరిగి వడ్డీ రహిత కాల వ్యవధిలోపు చెల్లించగలిగే వారు, పండుగ ఆఫర్ల కోసమే క్రెడిట్ కార్డును వాడుకోవడానికి పరిమితం కావడం మంచిదే. -
డెబిట్, క్రెడిట్ పాత కార్డులకు చెల్లు
వైఎస్ఆర్ జిల్లా, బద్వేలు: బ్యాంకు ఖాతాదారుల వద్ద ఉన్న డెబిట్, క్రెడిట్ కార్డుల్లో చిప్ ఉందో లేదో పరిశీలించండి. లేందటే మీ బ్యాంక్ హోం బ్రాంచ్‌ను సంప్రదించాలి. ప్రస్తుతం మీ వద్ద ఉన్న మాగ్నెటిక్ స్ట్రిప్ కార్డు స్థానంలో చిప్ ఆధారిత కార్డులను బ్యాంకులు ఉచితంగా అందిస్తున్నాయి. లేదంటే డిసెంబరు 31 తర్వాత పాతకార్డులు పని చేయవని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఆర్బీఐ ఆదేశాలతో... కొన్నేళ్లుగా కార్డు క్లోనింగ్, ఆన్‌లైన బ్యాంకింగ్ మోసాలు భారీగా పెరిగాయి. వీటిని అరికట్టేందుకు మాగ్నెటిక్ స్ట్రిప్ టెక్నాలజీ బదులు ఎలాక్ట్రానిక్ చిప్ ఆధారిత కార్డులను జారీ చేయాలని బ్యాంకులకు ఆర్బీఐ గతంలో ఆదేశాలు జారీ చేసింది. పాత కార్డులతో పోలిస్తే ఈఎంవీ (యూరోవే, మాస్టర్‌కార్డు, వీసా) చిప్ కార్డుల్లో భద్రత అధికం. దేశీయ బ్యాంకులతో పాటు అంతర్జాతీయ సంస్థల డెబిట్/క్రెడిట్ కార్డులకు సైతం ఆర్బీఐ ఆదేశాలు వర్తిస్తాయి. పాతకార్డులు మార్చుకోవాలంటూ ఇప్పటికే ఖాతాదారులకు ఆయా బ్యాంకులు సంక్షిప్త సందేశాలు పంపుతున్నాయి. వీటిని చాలామంది గమనించడం లేదని బ్యాకులు చెబుతున్నాయి. 2016 నుంచి జారీ 2016 నుంచి మరింత సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్న కార్డులను బ్యాంకులు అందిస్తున్నాయి. ఈ కార్డుల్లో ఒక వైపు మాగ్నెటిక్ స్ట్రిప్ నల్లరంగులో మరోవైపు ఈవీఎం చిప్ ఉంటుంది. ఇందులో సెక్యూరిటీ పీచర్స్ ఎక్కువగా ఉన్నాయి. మాగ్నెటిక్ స్ట్రిప్ ఏటీఎం కార్డులు ఎటీఎంల్లో నగదు తీసుకోవడానికి, పాయింట్ ఆప్ స్కేల్ (పీఓఎస్)లో స్వైపింగ్ చేయడానికి పనికి వస్తాయి. ఇందుల్లో నకిలీ కార్డుల తయారీ (క్లోనింగ్ కార్డు) తయారీ, డేటా కొల్లగొట్టేందుకు అవకాశం ఉందని నిషేధించారు. దీంతో 2016 నుంచి బ్యాంకు కార్డుల్లో మాగ్నెటిక్ స్ట్రిప్‌తో పాటు ఈఎంవీ చిప్ కూడా అమరుస్తున్నారు. మాగ్నెటిక్ స్ట్రిప్ ఏటీఎంల్లో పని చేస్తుంది. ఏటీఎంలు బ్యాంకుల ఆధీనంలో, లైసెన్స్ కంపెనీల ఆధీనంలో ఉంటాయి. పాయిం ట్ ఆప్ స్కేల్ (పీఓఎస్) మిషన్లలో పని చేయదు. చిప్ ఉన్న కార్డులు మాత్రమే పని చేస్తాయి. చిప్ ఉన్న కార్డుల నుంచి సమాచారం కొల్లగొట్టడం, క్లోనింగ్‌కార్డులు తయారీ చేయడం వీలుకాదు. ♦ మాగ్నెటిక్ కార్డు వెనుకభాగంలో ఉన్న నలుపురంగు స్ట్రిప్‌లో సమాచారం మొత్తం నిక్షిప్తమై ఉంటుంది. కొత్త టెక్నాలజీ కార్డుల్లో ముందు భాగంలో ఉంటే చిప్‌లో డైనమిక్ పార్మాట్లో నిక్షిప్తం చేసి ఉంటారు. దీన్ని క్లోనింగ్ చేయడం చాలా కష్టం. ♦ ఆన్లైన్ బ్యాంకింగ్ విషయంలో కొత్తకార్డు వినియోగదారులూ జాగ్రత్త వహించాలి. కార్డు పిన్ నెంబరు, సీవీవీ లాంటి సమాచారాన్ని ఇతరులతో పంచుకోకూడదు. మీ కార్డు నంబరు, పిన్, సీవీవీ ఉపయోగించి ఆన్లైన్ ద్వారా ఎవరైనా లావాదేవీలు నిర్వహించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ♦ ఖాతాదారులు తమ ఖాతా ఉన్న బ్యాంకు శాఖను సంప్రదించి కొత్తకార్డు పొందవచ్చు. చాలా బ్యాంకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ 2016 ముందు ఏటీఎం కార్డులు తీసుకున్న ఖాతాదారులందరికీ పోస్టు ద్వారా ఉచితంగా కొత్తకార్డులు పంపిస్తోంది. -
డెబిట్ కమ్ క్రెడిట్.. రెండూ ఒకే కార్డులో
డెబిట్ లేదా క్రెడిట్‌కు రెండు కార్డులు వాడుతున్నారా? అయితే ఇక ఆ పని లేదట. ఒకే కార్డులో రెండింటిన్నీ వాడుకోవచ్చట. ఇండస్ఇండ్ బ్యాంక్ తొలిసారి 2 ఈఎంవీ చిప్ డెబిట్ కమ్ క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టింది. ఈ టూ-ఇన్-వన్ డ్యూ కార్డు రెండు మాగ్నెటిక్ స్ట్రిప్స్, 2 ఈఎంవీ చిప్స్‌లతో మార్కెట్లోకి వచ్చింది. ఇవి డెబిట్, క్రెడిట్ కార్డులు చేసే రెండు పనులను చేస్తోంది. కస్టమర్లకు సౌకర్యవంతంగా ఉండేందుకు డెబిట్ కమ్ క్రెడిట్ కార్డును తీసుకొచ్చినట్టు బ్యాంక్ చెప్పింది. ప్రతి రోజూ జరిపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల అన్ని లావాదేవీలకు రెండు కార్డులను తీసుకు వెళ్లాల్సినవసరం లేకుండా.. ఇక నుంచి ఒకే కార్డును తీసుకువెళ్లవచ్చని పేర్కొంది. అనగ్రామ్ టెక్నిక్‌తో ఈ కార్డును బ్యాంక్ డిజైన్ చేసింది. ఇండస్ఇండ్ డ్యూ కార్డు మొబైల్ కస్టమర్ల కోసం ముఖ్యంగా యువత కోసం ఎంటర్టైన్మెంట్, ట్రావెల్, లైఫ్‌స్టయిల్ వంటి పలు ఫీచర్లను ముందస్తుగా అప్లోడ్ చేసుకుని వచ్చింది. బ్యాంకింగ్‌ను మరింత సులభతరం చేసి, తమ కస్టమర్లకు సౌకర్యవంతంగా తీసుకురావడమే తమ లక్ష్యమని ఇండస్ఇండ్ బ్యాంక్ కస్టమర్ బ్యాంకింగ్ సుమంత్ కత్పాలియా చెప్పారు. డ్యూ కార్డు లాంటి ఇన్నోవేషన్లు కస్టమర్ల జీవితాన్ని సరళీకరం చేయున్నట్టు పేర్కొన్నారు. యువత, ఔత్సాహికులైన కస్టమర్లు కొత్తదనాన్ని కోరుకుంటారని చెప్పారు. ఒక్క ప్లాస్టిక్ కార్డులోనే విస్తృతమైన ఆఫర్లను, అనుభవాన్ని ఉన్నతంగా అందించనున్నట్టు పేర్కొన్నారు. -
అమ్మకానికి విదేశీయుల ‘డెబిట్ కార్డు డేటా’
సాక్షి, హైదరాబాద్: విదేశీయుల డెబిట్ కార్డుల సమాచారాన్ని పిన్ నెంబర్లతో సహా ఆన్లైన్లో విక్రయిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. యాప్స్ ద్వారా దేశవ్యాప్తంగా విక్రయిస్తున్న హ్యాకర్లు వచ్చే లాభాల్లో చెరి సగమంటూ ఒప్పందం చేసుకుంటున్నారు. ఇలా కొందరు విదేశీయుల సమాచారాన్ని కొనుగోలు చేసిన ఇద్దరు నిందితులు.. దీని ఆధారంగా క్లోన్డ్ డెబిట్ కార్డులు రూపొందించారు. అనంతరం ఆ కార్డులతో రూ.60 వేలు డ్రా చేయడంతో విషయం ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌కు చేరి నిందితులు కటకటాల పాలయ్యారు. ఈ ద్వయం పోలీసులకు చిక్కకుండా ఉంటే గనుక భారీ స్కామ్‌కు పాల్పడేదని అదనపు డీసీపీ చైతన్యకుమార్ శుక్రవారం తెలిపారు. నగరంలోని కంచన్‌బాగ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అఫ్రోజుద్దీన్ అలియాస్ అలీ పెద్దగా చదువుకోకపోయినా స్మార్ట్‌ఫోన్, యాప్స్ వినియోగంపై మంచి పట్టుంది. ఈ నేపథ్యంలోనే అలీ తన ఫోన్లో ‘ఐసీక్యూ’అనే యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుని అనేక మందితో చాటింగ్ చేస్తుండేవాడు. అలీకి ఈ యాప్ ద్వారానే అభి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. కొన్ని రోజులు చాటింగ్ చేసిన తర్వాత తాను విదేశీయుల డెబిట్ కార్డుల డేటా, పిన్ నెంబర్లు విక్రయిస్తానంటూ అలీకి చెప్పాడు. అయితే అలా చేయడానికి ముందు తనకు పూర్తి స్థాయిలో నమ్మకం కలగాలన్నాడు. స్నేహితుడిని కలవడానికి వచ్చి.. అంతగా చదువుకోని అలీ అతడితో చాటింగ్ చేయడం, నమ్మకం కలిగించడంలో బాగా ఇబ్బంది పడ్డాడు. ఈ పరిస్థితుల్లోనే నెల రోజుల క్రితం పంజాబ్‌కు చెందిన పంకజ్ సచ్చదేవ్తో అలీకి పరిచయమైంది. పంకజ్ చేసేది కూలి పని అయినా రెండేళ్లు న్యూజిలాండ్, ఎనిమిదేళ్లు ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు చేసి వచ్చాడు. దీంతో పంకజ్‌కు ఆంగ్లంపై కొంత పట్టు ఉంది. ఆస్ట్రేలియాలో ఉండగా తనతో కలసి పనిచేసిన ఓ స్నేహితుడిని కలవడానికి పంకజ్ పాతబస్తీకి వచ్చాడు. ఆ స్నేహితుడి ద్వారా పంకజ్‌కు అలీతో పరిచయం ఏర్పడింది. పంకజ్ విషయం తెలుసుకున్న అలీ తనకు యాప్‌లో పరిచయమైన అభితోపాటు అతడు ఇచ్చిన ఆఫర్ విషయం చెప్పాడు. అతడి వద్ద నమ్మకం పొంది కార్డుల డేటా సంగ్రహించగలిగితే విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, తక్కువ శ్రమతో భారీ మొత్తం సంపాదించవచ్చని చెప్పడంతో పంకజ్ సహకరించడానికి అంగీకరించాడు. పంకజ్ సాయంతో అభితో చాటింగ్ చేసిన అలీ అతడి నమ్మకాన్ని పొందాడు. నెల రోజుల క్రితం 200 డాలర్లు బిట్‌కాయిన్స్ రూపంలో అభికి చెల్లించాడు. దీంతో అతడు 15 మంది విదేశీయులకు చెందిన డెబిట్ కార్డుల డేటా, పిన్ నంబర్లు అదే యాప్ ద్వారా పంపాడు. వీటిలో అన్నీ సక్రమంగా ఉండవని, సక్సెస్ అయిన వాటికి సంబంధించిన మొత్తంలో తనకు సగం ఇవ్వాలని షరతు పెట్టాడు. ఎంఎస్ఆర్ మెషిన్ వినియోగించి క్లోనింగ్.. ఇలా వచ్చిన డేటాను కార్డుల్లోకి ఎక్కిస్తే (రైట్ చేస్తే) తప్ప వినియోగించే ఆస్కారం ఉండదు. ఏ కార్డుల్లోకి, ఎలా ఎక్కించాలనే విషయాన్ని అభి ద్వారా వీరు తెలుసుకున్నారు. కంచన్‌బాగ్ ప్రాంతంలో ఓ గదిని అద్దెకు తీసుకుని క్లోనింగ్ వ్యవహారం మొదలెట్టారు. స్టార్ హోటళ్లలో రూమ్స్ బుక్ చేసుకున్నప్పుడు తాళంగా యాక్సస్ కార్డు ఇస్తారు. ఈ కార్డులోకి అవసరమైన వివరాలు హోటల్ రిసెప్షన్‌లోని వారు ఎంఎస్ఆర్ మెషిన్ ద్వారా రైట్ చేస్తారు. అభి సూచనల మేరకు ఇలాంటి మెషిన్‌ను ఖరీదు చేసి అలీ, పంకజ్‌లు తమ గదిలో పెట్టుకున్నారు. అభి పంపిన డేటాను ఫోన్ నుంచి ల్యాప్‌టాప్‌లోకి మార్చి దాన్ని ఈ మెషిన్‌తో అనుసంధానించారు. మాగ్నటిక్ స్ట్రిప్‌తో కూడిన, ఎలాంటి బ్యాలెన్స్ లేని డెబిట్, క్రెడిట్ కార్డుల్ని సేకరిస్తున్న ఈ ద్వయం వాటిని ఎంఎస్ఆర్ మెషిన్లో ఉంచుతోంది. ల్యాప్‌టాప్ ఆధారంగా ఆపరేట్ చేస్తూ అభి పంపిన కార్డుల డేటాను వీరు సేకరిస్తున్న కార్డుల్లోకి రైట్ చేస్తోంది. తొలి దశలో 15 కార్డుల డేటా పొందగా.. కేవలం రెండింటికి చెందిన సమాచారమే కరెక్ట్‌గా ఉంది. ఇలా రెండు కార్డులు తయారు చేసిన అలీ, పంకజ్‌లు రూ.50 వేలు, రూ.10 వేలు చొప్పున డ్రా చేశారు. మరికొన్ని కార్డుల డేటా పొందటం కోసం రూ.50 వేలు అభికి బిట్‌కాయిన్స్ రూపంలో బదిలీ చేశారు. భారీ స్టాయిలో క్లోన్డ్ కార్డులతో దందా చేయాలని పథకం వేసిన వీరి వ్యవహారంపై ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్‌కు అందింది. ఆయన నేతృత్వంలో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం శుక్రవారం దాడి చేసి అలీ, పంకజ్‌లను పట్టుకుంది. వీరి నుంచి ల్యాప్‌టాప్, ఎంఎస్ఆర్ మిషన్, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసును కంచన్‌బాగ్ పోలీసులకు అప్పగించింది. ఈ డేటాను హ్యాకర్లు ఎక్కడ నుంచి సేకరిస్తున్నానేది తెలియాలంటే అభి చిక్కాల్సి ఉందని పోలీసులు చెప్తున్నారు. -
ఎస్బీఐ ఏటీఎం విత్‌డ్రాయల్స్: బ్యాడ్ న్యూస్
సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వినియోగదారులకు మరో చేదువార్త చెప్పింది. రోజువారీ క్యాష్ విత్‌డ్రాయల్ పరిమితిని మరింత కుదించింది. ఏటీఎం ద్వారా రోజువారీ నగదు ఉపసంహరణపై కస్టమర్లకు షాకిచ్చింది. క్లాసిక్, మ్యాస్ట్రో డెబిట్ కార్డులు వినియోగిస్తున్న ఎస్బీఐ ఖాతాదారులు ఏటీఎంల ద్వారా వినియోగదారులు పొందే నగదును సగానికి కోత పెట్టి కేవలం రూ.20వేలుగా నిర్ణయించింది. ఇంతకుముందు ఈ పరిమితి 40వేల రూపాయలుగా ఉంది. అయితే అక్రమ లావాదేవీలు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అలాగే డిజిటల్, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఎస్బీఐ తెలిపింది. అక్టోబర్ 31 నుంచి ఇది అమల్లోకి రానున్నట్టు ప్రకటించింది. డిజిటల్ లావాదేవీలలో పెరుగుదల ఉన్నప్పటికీ, నగదు డిమాండ్ ఎక్కువగా ఉందని ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ పికె గుప్తా చెప్పారు. తాజా అంచనాల ప్రకారం, నోట్ల రద్దు ముందు కంటే నగదు డిమాండ్ భారీగా ఉందని తెలిపారు. తాజానిర్ణయం వినియోగదారుల అసౌకర్యానికి దారితీస్తుందా అని ప్రశ్నించినపుడు అంతర్గత విశ్లేషణ అనంతరం 20వేల రూపాయల మొత్తం చాలామంది వినియోగదారులకు సరిపోతుందని భావిస్తున్నామన్నారు. అలాగే స్వల్ప ఉపసంహరణలు ద్వారా మోసాలను తగ్గించేందుకు వీలవుతుందా లేదా అనేది పరిశీలించనున్నట్టు చెప్పారు. మరోవైపు దీనిపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో, ముఖ్యంగా వైద్య అవసరాల నిమిత్తం ఇప్పటికే పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, తాజా నిర్ణయంతో మరిన్ని కష్టాలు తప్పవని వాపోతున్నారు. -
క్యూఆర్ కార్డులంటే ఏమిటి ?
గ్రామీణ ప్రాంత ప్రజలకి కూడా ఇంటి ముంగిట్లో బ్యాంకింగ్ సేవలను అందించే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన తపాలా బ్యాంకులు (ఐపీపీబీ) పనితీరుని సులభం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూనే సులభతరంగా అన్ని పనులు పూర్తి అయ్యే చర్యలు చేపడుతున్నాయి. ఇందులో బాగంగానే తపాలా బ్యాంకు ఖాతాదారులకు ఏటీఎం, డెబిట్ కార్డులకి బదులుగా క్యూఆర్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించాయి. అసలు క్యూఆర్ కార్డులంటే ఏమిటి ? అవెలా పని చేస్తాయి ? క్యూఆర్ కార్డులంటే ... క్విక్ రెస్సాన్స్‌కు సంక్షిప్త నామమే క్యూఆర్.. ఈ కార్డులకి సాధారణ ఏటీఎంల మాదిరిగా పిన్ నెంబర్లు, పాస్వర్డ్లు ఉండవు. బయోమెట్రిక్ నిర్ధారణ ద్వారా ఈ కార్డులు పనిచేస్తాయి. తపాలా బ్యాంకులు మంజూరు చేసిన ఈ కార్డుల్లో క్యూఆర్ కోడ్ లేదా బార్ కోడ్ ప్రింట్ చేసి ఉంటుంది. ఈ కోడ్ ద్వారా ఐపీపీబీ ఖాతాదారుల్ని గుర్తించవచ్చు. స్మార్ట్ఫోన్లు, మైక్రో ఏటీఎం, పోస్ట్మ్యాన్లు ఇంటికి తీసుకువచ్చే పరికరాల ద్వారా కూడా క్యూఆర్ కోడ్‌ని వినియోగించి ఖాతాదారుల్ని గుర్తించవచ్చు. క్యూఆర్ కోడ్ ద్వారా ఒకసారి ఖాతాదారుడిని గుర్తించే పని పూర్తవగానే బయోమెట్రిక్ డేటా ద్వారా పోస్టుమ్యాన్లు మిగిలిన తనిఖీ పూర్తి చేస్తారు. రెండు అంచెల తనిఖీ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఈ క్యూఆర్ కార్డుల్ని వినియోగించుకోవచ్చు. బయోమెట్రిక్ విధానం ద్వారా తనిఖీ పూర్తయితే ఖాతాదారులు తమ లావాదేవీలను సులభంగా పూర్తి చేసుకోవచ్చు. వినియోగం సులభం.. క్యూఆర్ కార్డులని వినియోగించుకోవడం అత్యంత సులభం మీ అకౌంట్ నెంబర్ తెలీకపోయినా ఈ కార్డుని వాడుకునే సౌలభ్యం ఉంది. ఈ కార్డుల్ని దేశవ్యాప్తంగా ఉన్న తపాలా బ్యాంకు కేంద్రాల్లోనూ, ఇతర వాణిజ్య కేంద్రాల్లోనూ వాడుకోవచ్చు. ఐపీపీబీ మొబైల్ యాప్స్‌ద్వారా కూడా వీటిని వినియోగించుకోవచ్చు. అంతేకాదు వీటిని వాడడానికి ఏమంత ఖరీదైన మౌలిక సదుపాయాలు ఉండాల్సిన పనిలేదు. చిన్న చిన్న దుకాణాల్లో కూడా ఈ క్యూఆర్ కార్డులు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుత్, టెలిఫోన్ బిల్లులు కూడా క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి చెల్లించుకోవచ్చు. ఆన్లైన్ బిల్లు చెల్లింపులకి రూ.15, నగదు డిపాజిట్, ఉపసంహరణ వంటి లావాదేవీలు ప్రతీ ఒక్కదానికి రూ.25 చార్జీలు వసూలు చేస్తారు. భద్రత ఎక్కువ ఏటీఎం కార్డు ఉండి, పిన్ నెంబర్ తెలిస్తే ఒకరి కార్డుని మరొకరైనా వినియోగించుకోవచ్చు. కానీ క్యూఆర్ కార్డు విషయానికి వచ్చేసరికి అలా కుదరదు. బయోమెట్రిక్ తనిఖీ ఉంటుంది కాబట్టి భద్రత ఎక్కువ. మీ పిన్ నెంబర్ని ఎవరైనా గుర్తిస్తారేమో, పాస్వర్డ్ ఎవరికైనా తెలిసిపోతుందేమోనన్న ఆందోళన అక్కర్లేదు. కార్డు పోగొట్టుకున్నా మీ నగదుకు భద్రత ఉంటుంది. -
డెబిట్ కార్డులపై ఎస్బీఐ న్యూ అలర్ట్
న్యూఢిల్లీ: ఈ ఏడాది డిసెంబర్ 31లోగా ప్రస్తుత మాగ్నెటిక్ స్ట్రైప్ ఏటీఎం కమ్ డెబిట్ కార్డులను సరికొత్త ఈఎంవీ చిప్ ఆధారిత కార్డులతో మార్చుకోవాలని ఖాతాదారులకు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ సూచించింది. ఇది పూర్తిగా సురక్షితమైన ప్రక్రియేనని, కొత్త కార్డుల జారీకి ఎటువంటి చార్జీలు ఉండవని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ఎస్బీఐ ట్వీట్ చేసింది. నకిలీ కార్డు మోసాలకు ఆస్కారమివ్వని ఈఎంవీ (యూరోపే, మాస్టర్‌కార్డ్, వీసా) చిప్ కార్డులు సురక్షితమైనవని పేర్కొంది. జూన్ ఆఖరు నాటికి ఎస్బీఐ 28.9 కోట్ల ఏటీఎం–డెబిట్ కార్డులు జారీ చేయగా, ఇందులో సింహభాగం చిప్ ఆధారితమైనవే. కొత్త చిప్ డెబిట్ కార్డు కోసం హోమ్ బ్రాంచీలో సంప్రదించవచ్చని లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఎస్బీఐ సూచించింది. ఏటీఎం కార్డులకు సంబంధించిన మోసాలబారిన పడకుండా ఖాతాదారుల ప్రయోజనాలను పరిరక్షించే క్రమంలో కేవలం చిప్ ఆధారిత, పిన్ నంబర్ ఆధారిత డెబిట్, క్రెడిట్ కార్డులు మాత్రమే జారీ చేయాలంటూ బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించడం తెలిసిందే. -
కారు డ్రైవర్ నమ్మకద్రోహం
మార్కాపురం: కారు డ్రైవర్‌గా ఉంటూ యజమానురాలిని నమ్మించి ఆమె డెబిట్ కార్డును దొంగతనం చేసి ఆన్లైన్ షాపింగ్ చేసి తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసినట్లు సీఐ భీమానాయక్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుడి వివరాలు వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం.. మార్కాపురానికి చెందిన శిరసనగండ్ల సునీత హైదరాబాద్‌లో వెంచర్స్ డెవలప్మెంట్ వ్యాపారం చేస్తోంది. నెల కిందట ఆమె దగ్గరకు తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కేంద్రానికి సమీపంలోని కంబలపురం గ్రామానికి చెందిన మేకల రాజశేఖర్ డ్రైవర్‌గా చేరి నమ్మకంగా ఉంటున్నాడు. పది రోజుల కిందట రాజశేఖర్ ఆమె డెబిట్ కార్డు నంబర్ కనుగొని సుమారు రూ.2,41,348 విలువ చేసే 4 ఫోన్లను ఫ్లిప్‌కార్టు ద్వార కొనుగోలు చేశాడు. విషయం సునీతకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ నెల 26న ఆమె సెల్‌ఫోన్‌కు మేసేజ్ రావడంతో ఆశ్చర్యానికి గురై మార్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ భీమానాయక్ సైబర్ క్రైమ్‌గా గుర్తించి ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడైన రాజశేఖర్‌కు సునీత ఫోన్ చేయడంతో మార్కాపురంరాగా సమాచారం పోలీసులకు తెలియడంతో శుక్రవారం పట్టుకుని అరెస్టు చేశారు. -
రారమ్మని.. కార్డు వివరాలు ఇమ్మని..!
మీరు సీరియస్‌గా బ్రౌజింగ్ చేస్తుండగానో.. సోషల్ నెట్వర్కింగ్ సైట్లో మునిగి ఉండగానో.. ‘ఆకర్షించే’లా పాప్అప్స్ వచ్చాయా? హఠాత్తుగా మీ మెయిల్ ఐడీకి గుర్తుతెలియని అడ్రస్ నుంచి ‘ఫొటోలతో’కూడిన ఈ–మెయిల్ వచ్చిందా? అలాంటి వాటిని క్లిక్ చేసే ముందు ఒక్కక్షణం ఆగండి..! అవి మిమ్మల్ని నిలువునా ముంచేసే ప్రమాదం ఉందని గుర్తుంచుకోండి. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? ఇది చదవండి.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఇటీవల ఓ ఫిర్యాదు అందింది. ఓ యువకుడి ఖాతా నుంచి రూ.10 లక్షలు గోల్మాల్ అయ్యాయన్నది దాని సారాంశం. ప్రాథమికంగా దర్యాప్తు చేపట్టిన అధికారులు అతగాడు ఓ అశ్లీల వెబ్సైట్లోకి లాగిన్ కావడంతో ఈ మోసం చోటు చేసుకుందని గుర్తించారు. క్రెడిట్, డెబిట్ కార్డులకు సంబంధించిన వ్యక్తిగత వివరాలతో పాటు నెట్ బ్యాంకింగ్‌కు ఉపకరించే రహస్య అంశాలను తస్కరించేందుకు సైబర్ నేరగాళ్లు అశ్లీలంతో ఎర వేస్తున్నారని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ అధికారులు సూచిస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ ఆ వివరాలే కీలకం.. ఓ వ్యక్తికి చెందిన సొమ్మును ఆన్లైన్లో స్వాహా చేయడానికి సైబర్ నేరగాళ్లకు అతడి క్రెడిట్/డెబిట్ కార్డు నంబర్, సీవీవీ కోడ్లతో పాటు కొన్ని వ్యక్తిగత వివరాలూ అవసరం. ఇంటర్నెట్ బ్యాంకింగ్‌కు లాగిన్ ఐడీ, పాస్వర్డ్ కచ్చితంగా ఉండాల్సిందే. వీటన్నింటితో పాటు వన్ టైమ్ పాస్వర్డ్(ఓటీపీ) సైతం ఎంటర్ చేయాల్సిందే. ఇవి లేకుండా ఆన్లైన్లో డబ్బు కాజేయడం అసాధ్యం. సాధారణంగా ఈ వివరాల కోసం సైబర్ నేరగాళ్లు వివిధ పేర్లు, వెరిఫికేషన్లు అంటూ, బ్యాంకు అధికారుల పేర్లతో ఫోన్లు చేయడం, మెయిల్స్ పంపడంతో పాటు సూడో సైట్లు సృష్టించే వారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ‘అశ్లీలం దారి’పట్టారని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. యువకులే టార్గెట్‌గా.. సైబర్ నేరగాళ్ల వల్లో ఎక్కువగా యువకులే పడుతున్నారు. వీరిని ఆకర్షించేందుకు కొన్ని అశ్లీల వెబ్సైట్లను సైతం రూపొందిస్తున్నారు. అర్ధనగ్న, నగ్న చిత్రాలతో కూడిన పాప్ అప్స్‌ను వివిధ సామాజిక నెట్వర్కింగ్ సైట్లతో పాటు వెబ్సైట్లకు లింక్ చేస్తున్నారు. వీటికి ఆకర్షితులవుతున్న యువత వీటిపై క్లిక్ చేసిన వెంటనే అవి ఓపెన్ అవుతున్నాయి. ఆ తర్వాతే అసలు ఘట్టం ప్రారంభమవుతోంది. ఆ సైట్లోకి లాగిన్ కావాలన్నా, అందులోని వీడియోలు, ఫొటోలు ఓపెన్ కావాలన్నా కొంత రుసుము చెల్లించాలని ప్రత్యేక లింకు పెడుతున్నారు. నేరుగా చేరిపోతున్న వివరాలు.. ఆయా సైట్లలోకి లాగిన్ కావడానికి, వీడియోలు–ఫొటోలు చూడటానికి కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా నగదు చెల్లించి సభ్యత్వం తీసుకోవాలని ఉంటోంది. దీంతో ‘కార్డుల’ వివరాలు, నెట్ బ్యాంకింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని అందులో పూరిస్తున్నారు. దీంతో ఈ వివరాలన్నీ నేరుగా సైబర్ నేరగాళ్లకు చేరిపోతున్నాయి. ఇవన్నీ వారి చేతికి చిక్కిన తర్వాత ఇక కావాల్సింది ఓటీపీ మాత్రమే. దీనికోసం సదరు వెబ్సైట్లోనే ప్రత్యేక లింకు ఏర్పాటు చేస్తున్నారు. ఓపక్క ఈ వివరాలతో ఆన్లైన్ లావాదేవీలు పూర్తి చేసి.. ఓటీపీ వచ్చేలా ఆప్షన్ ఎంచుకుని వేచి చూస్తున్నారు. ఆ యువకుడు వెబ్సైట్లో ఏర్పాటు చేసిన లింకులో దీన్ని పొందుపరిచిన వెంటనే లావాదేవీ పూర్తి చేసి ఆన్లైన్లో డబ్బు స్వాహా చేస్తున్నారు. ఈ వివరాలను వినియోగించి వారు తేలిగ్గా ఖాతాలు ఖాళీ చేయడమో, ఆన్లైన్ షాపింగ్ చేసి ‘కార్డు’లకు చిల్లు పెట్టడమో చేస్తున్నారు. ఈ నేరాలకు పాల్పడే వారు వినియోగిస్తున్న సర్వర్లు విదేశాల్లో ఉంటుండటంతో వారి పూర్తి వివరాలు తెలుసుకోవడం అసాధ్యంగా మారుతోందని అధికారులు చెప్తున్నారు. ఆన్లైన్ చెల్లింపులను నమ్మదగ్గ సైట్లలోనే చేయాలి. అశ్లీల సైట్లు నిర్వహించే వారికి నైతికత ఉండదు. అలాంటి వాళ్లకు మీ వివరాలు తెలిస్తే కచ్చితంగా దుర్వినియోగం చేస్తారు. ఇలాంటి నేరాల్లో మోసపోవడం ఎంత తేలికో.. నిందితులు చిక్కడం, నగదు రికవరీ అంత కష్టం. అప్రమత్తతతోనే సైబర్ నేరగాళ్లకు చెక్ చెప్పవచ్చు. – సైబర్ క్రైమ్ అధికారులు -
రైలు టికెట్‌కు ‘కార్డు’ కష్టాలు!
సాక్షి, హైదరాబాద్: రైల్వేస్టేషన్లో కౌంటర్ వద్ద టికెట్ కొంటున్నారా? క్రెడిట్ కార్డుతోనో, డెబిట్ కార్డుతోనో డబ్బు చెల్లించాలనుకుంటున్నారా? అయితే ప్రయాణ వివరాలు రాసే పత్రంతోపాటే మీ డెబిట్/క్రెడిట్ కార్డును కూడా కౌంటర్ సిబ్బందికి ఇవ్వండి. లేదంటే నగదు చెల్లించక తప్పదు. టికెట్ల కోసం కార్డులతో సొమ్ము చెల్లిస్తే.. ఆ కార్డు వివరాలను కంప్యూటర్ లో ముందుగానే నమోదు చేయాల్సి రావడమే దీనికి కారణం. ఈ విషయమై ప్రయాణికులు, రైల్వే సిబ్బంది మధ్య ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. ఎందుకిలా..? నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే క్రమంలో రైల్వే శాఖ ప్రధాన స్టేషన్ల టికెట్ కౌంటర్లలో కార్డు స్వైపింగ్ యం త్రాలను అందుబాటులో ఉంచింది. కార్డు స్వైప్ చేయటం ద్వారా టికెట్ కొనాలంటే.. ఆ కార్డు నంబర్‌ను ముందుగానే కంప్యూటర్లో పొందుపరచాల్సి ఉంటుంది. ఇలా ముందుగా నమోదు చేయకుండా టికెట్లు బుకింగ్ చేస్తే నగదుగానే చెల్లిం చాల్సి వస్తుంది. టికెట్ కౌంటర్లలోని కొందరు సిబ్బంది.. ఈ విషయంలో ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. టికెట్ బుకింగ్ కోసం వివరాల పత్రం తీసుకునేప్పుడే.. ఆ ధర మేరకు నగదుగానీ, క్రెడిట్/డెబిట్ కార్డుగానీ అడిగి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కొందరు సిబ్బంది ఇలా తీసుకోకుండానే ప్రయాణికుల వివ రాలు నమోదు చేసి టికెట్ బుక్ చేస్తున్నారు. డబ్బు చెల్లించేందుకు ప్రయాణికులు కార్డు ఇస్తే.. ముందుగా కంప్యూటర్లో నమోదు చేయనందున కార్డు చెల్లింపు సాధ్యం కాదని, నగదు చెల్లించాల్సిందేనని చెబుతున్నారు. రద్దు చార్జీల మోతలు.. ఒకవేళ ప్రయాణికుల వద్ద నగదు లేక కార్డు ద్వారానే చెల్లించాలంటే.. అప్పటికే బుక్ చేసిన టికెట్లను రద్దు చేసి, మళ్లీ బుక్ చేయాల్సి ఉంటుందని సిబ్బంది చెబుతున్నారు. రద్దు చేసిన చార్జీలనూ వసూలు చేస్తున్నారు. కాదంటే నగదు చెల్లించి టికెట్ తీసుకోవాలని వాదిస్తున్నారు. సూచన బోర్డులు లేవు.. టికెట్ల చార్జీలను కార్డు ద్వారా చెల్లించాలంటే.. ముందుగానే చెప్పాలంటూ సూచన బోర్డులను కూడా కౌంటర్ల వద్ద ఏర్పా టు చేయలేదు. దీనిపై సిబ్బందిని నిలదీస్తే దురుసు సమాధానాలు వస్తున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. కాగా, సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని రైల్వే ప్రజా సంబంధాల విభాగం అధికారులు పేర్కొన్నారు. -
ఈ సైబర్ క్రైమ్.. ఓ మిస్టరీ.!
సాక్షి, హైదరాబాద్: ఇదో మిస్టరీ సైబర్ క్రైమ్.. నేరం జరిగింది.. కానీ అది ఎలా జరిగిందనే దానిపై పోలీసులకే స్పష్టత లేదు. రూమ్ అద్దెకు కావాలంటూ వచ్చిన నేరగాడు తన డెబిట్‌కార్డు తస్కరించాడని, ఫోన్లో సాఫ్ట్వేర్ బగ్ ఇన్స్టాల్ చేశాడని బాధితుడు చెప్తున్నాడు. ఇలా తన ఖాతాలోని రూ.49,900 కాజేశాడని గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే బగ్గింగ్ లేదని, కేవలం తాత్కాలిక పిన్ నంబర్ సృష్టించాడని పోలీసులు అంటుంటే.. టెంపరరీ పిన్ సృష్టించడం సాధ్యం కాదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ మిస్టరీ సైబర్ క్రైమ్‌ను ఛేదించడానికి సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. గది అద్దెకు కావాలంటూ వచ్చి.. ఉత్తరాదికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న హర్ష్ కరీవాల, వన్ష్ దత్తా, ఆకాశ్ గార్గ్ కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలోని హ్యాపీ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తున్నారు. త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని ఒక్కో బెడ్రూమ్లో ఒకరు ఉండేవారు. ఇటీవల ఆకాశ్ వెళ్లిపోవడంతో ఓ బెడ్రూమ్ ఖాళీ అయింది. ఎవరికైనా ఈ రూమ్‌లోకి రావడానికి ఆసక్తి ఉంటే సంప్రదించాలంటూ హర్ష్, వన్ష్ ‘హైదరాబాద్ ఫ్లాట్ అండ్ ఫ్లాట్ మేట్స్’అనే ఫేస్బుక్ పేజ్‌లో గత శనివారం పోస్ట్ చేశారు. అది చూసిన ఓ వ్యక్తి అదే రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో వన్ష్కు ఫోన్ చేశాడు. రమ్మని చెప్పడంతో పది నిమిషాల్లో ఫ్లాట్‌కు చేరుకున్నాడు. తన పేరు శ్రీనివాసరెడ్డి అని, తిరుపతికి చెందిన తాను ఢిల్లీ, పుణేల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేశానని, పది రోజుల క్రితం హైదరాబాద్‌లోని గూగుల్ కార్యాలయంలో యూజర్ ఇంటర్ఫేస్ డెవలపర్‌గా ఉద్యోగం వచ్చిందంటూ పరిచయం చేసుకున్నాడు. ఫ్లాట్ నచ్చిందని, ఒకటి రెండు రోజుల్లో వచ్చి చేరుతానంటూ అడ్వాన్స్, అద్దె వివరాలు సైతం ఖరారు చేసుకున్నాడు. కార్డ్ కొట్టేసి.. ఫోన్ తీసుకుని.. వీరి ఫ్లాట్‌కు వస్తూనే తన ఫోన్ స్విచ్ఛాఫ్ అయిందంటూ చార్జర్ తీసి చార్జింగ్ పెట్టాడు శ్రీనివాసరెడ్డి. అద్దెకు రావాలని నిర్ణయించుకున్నట్లు చెప్పిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకోవాలని హర్ష్‌కు చెందిన రూమ్‌లోకి వెళ్లాడు. హర్ష్, వన్ష్ హాల్లోనే ఉండటంతో అక్కడి వార్డ్‌రోబ్‌లో ఉన్న హర్ష్ పర్సు నుంచి అతడి డెబిట్ కార్డు తస్కరించాడు. ఏమీ ఎరుగనట్లు బయటకొచ్చి అతను ఫ్లాట్‌లోకి అద్దెకు వస్తున్న విషయం తన తల్లిదండ్రులకు చెప్పాలంటూ హర్ష్ నుంచి సెల్‌ఫోన్ తీసుకున్నాడు. ఫోన్ కలవట్లేదంటూ కాస్త దూరం వెళ్లిన అతడు.. వారికి ఎస్సెమ్మెస్ పంపిస్తున్నానంటూ మెసేజ్ టైప్ చేస్తున్నట్లు నటిస్తూ ఓ బగ్గింగ్ యాప్‌ను ఫోన్లో ఇన్స్టాల్ చేశాడు. ‘పని’పూర్తయిన తర్వాత ఫోన్ ఇచ్చేసి రెండు రోజుల్లో ఫ్లాట్‌లో చేరతానంటూ చెప్పి వెళ్లిపోయాడు. ఏటీఎం నుంచి డబ్బు డ్రా.. హర్ష్ డెబిట్‌కార్డును తీసుకుని శ్రీనివాసరెడ్డి నేరుగా హైటెక్ సిటీలో ఉన్న ఓ ఏటీఎం వద్దకు వెళ్లాడు. డెబిట్ కార్డుతో డబ్బు డ్రా చేయాలంటే పిన్ నంబర్ కావాల్సిందే. దీనికోసం అతడు హర్ష్ ఫోన్లో ఇన్స్టాల్ చేసిన బగ్గింగ్ యాప్‌ను వాడుకున్నాడు. డెబిట్‌కార్డును ఏటీఎంలో పెట్టి పిన్ నంబర్ మార్చాలనే ఆప్షన్ ఎంచుకున్నాడు. సాధారణంగా ఇలా చేస్తే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు సందేశం వస్తుంది. అయితే హర్ష్ ఫోన్లోని బగ్గింగ్ సాఫ్ట్వేర్ కారణంగా ఈ సందేశం దుండగుడి ఫోన్‌కే వచ్చింది. అంతే పిన్ నంబర్ మార్చేసి మూడు విడతల్లో హర్ష్ ఖాతాలోని రూ.49,900 కాజేశాడు. రాత్రి 10 గంటల ప్రాంతంలో డబ్బు డ్రాకు సంబంధించిన సందేశాలు ఫోన్‌కు రావడంతో హర్ష్ కార్డు కోసం చూడగా అది కనిపించలేదు. ఫోన్‌ను సరిచూసుకోగా బగ్గింగ్ యాప్ ఇన్స్టాల్ అయినట్లు ఉంది. దీంతో శ్రీనివాసరెడ్డిగా చెప్పుకుని వచ్చిన వ్యక్తే బాధ్యడని అనుమానించిన హర్ష్, వన్ష్ మరుసటి రోజు(ఆదివారం) గచ్చిబౌలి ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అదుపులో వరంగల్ వాసి.. గచ్చిబౌలి పోలీసులు సాంకేతిక ఆధారాలను బట్టి నిందితుడిని గుర్తించారు. వరంగల్‌కు చెందిన అతడిని గురువారం అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తాను ఎలాంటి బగ్గింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేయలేదని, హర్ష్‌కు చెందిన ఫోన్ ద్వారా తాత్కాలిక పిన్ నంబర్ సృష్టించానని, ఈ నంబర్ వ్యాలిడిటీ కొన్ని గంటలు ఉంటుందని, దాని ఆధారంగానే డబ్బు డ్రా చేసినట్లు అంగీకరించాడని పోలీసులు పేర్కొన్నారు. విషయాన్ని బాధితుడు బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. టెంపరరీ పిన్ నంబర్ జనరేషన్ సాధ్యం కాదని వారు స్పష్టం చేశారు. అయితే బగ్గింగ్ యాప్ విషయాన్ని పోలీసులు అంగీకరించట్లేదు. దీంతో ఈ కేసును సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగించారు. నిందితుడు ఈ పంథాలో అనేక మందిని ముంచి ఉంటాడనే అనుమానంతో దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. -
క్రెడిట్ కార్డు విషయంలో ఇలా..
నిడమర్రు:ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డులు వాడటం ఎక్కువైపోయింది. అయితే చాలామంది వాటిని వాడటం సరిగ్గా రాకపోవటం వల్ల ఎక్కువ మొత్తంలో బ్యాంకులకు చెల్లించాల్సి వస్తుంది. అందుకే క్రెడిట్ కార్డు తీసుకునే ముందు వాటి నిబంధనలను తప్పక తెలుసుకోవాలి. కార్డు పరిమితి, చెల్లించాల్సిన ఫీజు, వడ్డీ శాతం మొదలైన వివరాలపై అవగాహన ఉండాలి. ఆ సమాచారం తెలుసుకుందాం. మొదట క్రెడిట్, డెబిట్ కార్డుమధ్య తేడా గుర్తించాలి. క్రెడిట్ కార్డుకి డెబిట్ కార్డులా డబ్బులు నేరుగా ఖాతా నుంచి తీయబడవు. క్రెడిట్ కార్డుకి వడ్డీ కూడా ఉంటే అదనపు పాయింట్లు జోడించబడతాయి. బిల్లింగ్ చక్రంలోపు క్రెడిట్ కార్డు బిల్లు కట్టేస్తే ఆ వడ్డీని నివారించవచ్చు. ఏపీఆర్ అంటే.. వాణిజ్య ప్రకటనల్లో చూసి ఏపీఆర్ అంటే వార్షిక రేటు శాతం. ఏపీఆర్ అంటే గుర్తు ఉండకపోయినా పర్వాలేదు కానీ, మీరు క్రెడిట్ కార్డుకి దరఖాస్తు చేసేముందు సరైన ఏపీఆర్ శాతం చూసుకోవాలి. ఎందుకంటే మీ బిల్లు బాకీ ఉంటే కట్టాల్సింది ఏపీఆర్యే. కొన్ని ఏపీఆర్లు రూ.30 శాతం అంతకంటే ఎక్కువగా కూడా ఉంటాయి. ప్రామాణికం కాని ఫీజు గురించి కొన్ని క్రెడిట్ కార్డులకి ప్రామాణికం కాని ఫీజులు ఉంటాయి. మీరు అంచనా వేసిన విధంగానే వాటి పేర్లు వైవిధ్యమైనవి, మంచి క్రెడిట్ కార్డులకు ఎప్పుడూ ప్రామాణికం కాని ఫీజులు ఉండవు. అడిట్ ఫీజు, మార్పిడి ఫీజు, త్రైమాసిక టెక్నాలజీ ఫీజు, భద్రతా ఫీజు మొదలైనవి ఉండవు. కనీస చెల్లింపు కంటే ప్రతీ నెల కేవలం క్రెడిట్ కార్డు బిల్ మీద కనీసమే చెల్లించాల్సి వస్తే, కొంచెమే కదా అని చెల్లించకుండా వదిలేయవద్దు. అలాగే మొత్తం నెలలో వచ్చిన కార్డు బిల్లు కట్టేయండి. వార్షిక ఫీజు గురించి మీరు తరచూ క్రెడిట్ కార్డు వాడకపోతే, వార్షిక ఫీజు లేని క్రెడిట్ కార్డు తీసుకోవడమే మంచిది. ఈ ఫీజు ఏడాదికి రూ.100 నుంచి రూ.300 దాకా ఉంటుంది. కార్డుల ప్రయోజనం తెలుసుకోవాలి క్రెడిట్ కార్డు ప్రయోజనాలు కొన్ని నిబంధనలు మరియు షరతులతో వస్తాయి. ఉదాహరణకు మీకు రివార్డు పాయింట్స్ ఇస్తామంటారు. కానీ అవి నాణ్యమైన వస్తువుల కొనుగోలుపై మాత్రమే ఉండవచ్చు. మరియు ప్రతీ త్రైమాసికానికి మారవచ్చు. అందుకే క్రెడిట్ కార్డు ప్రయోజనాల గురించి క్షుణంగా తెలియకపోతే, క్రెడిట్ కార్డ్ నుంచి మొత్తం లాభం పొందలేము. కొనుగోలు చేయటం మర్చిపోకండి లెక్కలేనన్ని క్రెడిట్ కార్డులు ఉన్నాయి. అందుకే ఏదైనా కొనుగోలు చేసేముందు వేరే వాటితో పోల్చుకుని కొనండి. బిల్లు కట్టే సమయంలో ఒత్తి డికి లోనయ్యి స్కోర్ క్రెడిట్ కార్డు తీసుకోకండి. క్రెడిట్ కార్డు మినిమమ్ డ్యూ కార్డుకు సంబంధించి ప్రారంభంలో ఈ విషయంలో చాలా మంది తికమకపడుతూ ఉంటారు. మీరు బిల్లులో ఇంత మొత్తం చెల్లిస్తే అని ఎస్ఎంఎస్ వస్తుంది. దాన్ని మినిమమ్ బ్యాలెన్స్ అంటారు. ఈ మినిమం అమౌంట్ డ్యూలను చెల్లించి ఊరుకుంటే మొత్తం అప్పు తీరినట్టు కాదు. ఎందుకంటే మిగిలిన మొత్తంపై విధించే వడ్డీలు బాగా ఉంటాయి. అందుకే వాడిన మొత్తం బిల్లును బిల్లు తేదీ తుది గడువులోపు కట్టేయాలి. సాధారణంగా మనం వాడుకున్న బ్యాలెన్స్‌లో 5 శాతం మినిమం అమౌంట్ డ్యూగా వ్యవహరిస్తుంటారని గమనించాలి. -
క్లారిటీ ఇచ్చిన ఐఆర్సీటీసీ
సాక్షి, న్యూఢిల్లీ: డెబిట్ కార్డు లావాదేవీలను బ్లాక్ చేసిందంటూ వచ్చిన వార్తలపై భారతీయ రైల్వేకు చెందిన ఇండియన్ రైల్వే అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) స్పందించింది. తాము ఎలాంటి పేమెంట్ గేట్‌వేను రద్దు చేయలేదని ప్రకటించింది. డెబిట్ కార్డ్ పేమెంట్లను నిలిపివేసిందన్న చేసిన వార్తలు అవాస్తవమని ఖండించింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వరుస ట్వీట్లతో స్పష్టత ఇచ్చింది. అన్ని క్రెడిట్, డెబిట్ కార్డుల లావాదేవీలు యథాతథంగా కొనసాగుతాయని, నిలిపేయలేదని స్పష్టం చేసింది. పలు బ్యాంకులకు చెందిన డెబిట్ కార్డు ద్వారా అన్ని లావాదేవీలు నిరభ్యంతరంగా జరుపుకోవచ్చని తెలిపింది. ఏ పేమెంట్ గేట్‌వే నుంచి అయినా అన్ని క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులను చేసుకోవచ్చని తెలిపింది. కాగా కన్వీనియన్స్ ఫీజు వివాదం నేపథ్యంలో పలు బ్యాంకుల డెబిట్‌కార్డుల పేమెంట్‌ను రద్దు చేసిందని దీంతో డెబిట్‌కార్డ్ వినియోగదారులకు తీవ్ర అసౌకర్యం కలగనుందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే No truth in news of having blocked any card of any bank. 5/5 — IRCTC (@IRCTC_Ltd) September 23, 2017 -
పలు డెబిట్ కార్డులను బ్లాక్ చేసిన ఐఆర్సీటీసీ
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ రైల్వేకు చెందిన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) డెబిట్ కార్డు వినియోగదారులకు షాక్ ఇచ్చింది. కొన్ని బ్యాంకుల డెబిట్ కార్డుల పేమెంట్ గేట్‌వేను బ్లాక్ చేసింది. కన్వీనియన్స్ ఫీజు కారణంగా పలు బ్యాంకుల డెబిట్‌కార్డు లావాదేవీలను నిలిపివేసింది. ప్రస్తుతానికి ఆరు బ్యాంకులు తప్ప మిగిలిన అనేక బ్యాంకులకు చెందిన కార్డు వినియోగదారులకు అసౌకర్యం కలగనుంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌తో సహా ఆరు బ్యాంకుల కార్డుదారుల కార్డు చెల్లింపులను మాత్రమే అనుమతిస్తోంది. డీమానిటైజేషన్ తరువాత కస్టమర్లనుంచి వసూలు చేసే రూ.20 ఫీజును రద్దు చేసింది. అయితే ఈ ఫీజులో బ్యాంకుల వంతుగా చెల్లించాల్సిన (సగం)సొమ్మును ఆయా బ్యాంకులు చెల్లించకపోవడంతో ఐఆర్సీటీసీ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు దీనిపై భారతీయ బ్యాంకుల అసోసియేషన్ (ఐబీఏ), ఐఆర్సీటీసీ, ఇండియన్ రైల్వేశాఖతో చర్చించనున్నట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. -
కార్డు లావాదేవీల్లో పెరుగుదల 7 శాతమే
న్యూఢిల్లీ: గతేడాది పెద్ద నోట్ల రద్దు అనంతరం మొత్తం మీద డిజిటల్ లావాదేవీలు 23% పెరగ్గా, అందులో క్రెడిట్, డెబిట్ కార్డు లావాదేవీల పెరుగుదల 7%గానే ఉంది. ఈ మేరకు పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఆర్థిక శాఖకు చెందిన పార్లమెంటరీ ప్యానల్‌కు వివరాలు తెలిపారు. దీని ప్రకారం గతేడాది నవంబర్‌లో అన్నిరకాల డిజిటల్ లావాదేవీలు 22.4 మిలియన్లుగా ఉండగా, 23% వృద్ధితో ఈ ఏడాది మే నెల నాటికి 27.5 మిలియన్లకు చేరాయి. యూపీఐ ఆధారిత లావాదేవీల్లో ఎక్కువ పెరుగుదల నమోదైంది. ఐఎంపీఎస్ లావాదేవీలు 1.2 మిలియన్ల నుంచి 2.2 మిలియన్లకు చేరాయి. అతి తక్కువ వృద్ధి మాత్రం కార్డులదే. 6.8 మిలియన్ల నుంచి 7.3 మిలియన్లకు పెరిగాయి. -
‘క్లోన్’ చేసి రూ.కోటి కొట్టేశారు!
► క్రెడిట్, డెబిట్ కార్డుల్నిక్లోనింగ్ చేసిన ముఠా ► స్వైపింగ్ మెషీన్ల ద్వారా రూ.కోటి స్వాహా ► నలుగురి అరెస్టు సాక్షి, హైదరాబాద్: కరెంట్ ఖాతాల ఆధారంగా బ్యాంక్ నుంచి క్రెడిట్, డెబిట్ కార్డుల స్వైపింగ్ మెషీన్లు తీసుకు ని క్లోనింగ్ కార్డుల్ని వినియోగించి రూ.1.1 కోట్ల స్వాహా చేసిన అంతర్రాష్ట్ర ముఠాను నగర సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయని డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు. కరెంట్ ఖాతాల ద్వారా.. నగరానికి చెందిన మామిడి మహేశ్ జమ్మూ అండ్ కశ్మీర్ బ్యాంక్‌లో 4 కరెంట్ ఖాతాలు తెరిచి.. వ్యాపార లావాదేవీలకు ఫిబ్రవరిలో నాలుగు స్వైపింగ్ మెషీన్లు తీసుకున్నాడు. ఓ కేసులో నిందితునిగా ఉన్న మహేశ్‌కు ఇటీవలే కోర్టు జీవిత ఖైదు విధించింది. దీంతో జైలుకు వెళ్తూ తన స్వైపింగ్ మెషీన్లను స్నేహితుడైన కిరణ్‌కుమార్‌కు అప్పగించాడు. వనస్థలిపురం లో చిన్న దుకాణం నడుపుతున్న కిరణ్‌కు కొన్నాళ్ల క్రితం చాంద్‌పాషాతో పరిచయమైంది. తనకు కేరళ నుంచి క్లోనింగ్ చేసిన క్రెడిట్, డెబిడ్ కార్డులతో పాటు పిన్ నంబర్, డేటా వస్తుందని అతను కిరణ్‌తో చెప్పాడు. స్వైపింగ్ మెషీన్లు తనకిస్తే లావాదేవీలపై 10 శాతం కమీషన్ ఇస్తానంటూ ఎర వేశాడు. కమీషన్ కోసం పక్కదారి.. కమీషన్ కోసం కిరణ్ స్వైపింగ్ మెషీన్లను పాషాకు అప్పగించాడు. పాషా వాటిని కేరళకు చెందిన అబుబాకర్‌కు అందించాడు. కేరళలోని యూసుఫ్ నుంచి క్లోన్డ్ కార్డుల్ని తీసుకుంటున్న ఇతను వాటిని స్వైపింగ్ మెషీన్లలో స్వైప్ చేస్తూ నిర్ణీత మొత్తం మహేశ్ కరెంట్ ఖాతాల్లో పడేలా చేస్తున్నాడు. కిరణ్ ఆ మొత్తంలో 10 శాతం కమీషన్‌గా తీసుకుని మిగిలినది అబుబాకర్ ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. అబుబాకర్ తన ఖాతాల్లోకి చేరిన మొత్తంలో 40 శాతం కమీషన్‌గా తీసుకుని మిగిలింది యూసుఫ్ ఖాతాల్లోకి జమ చేస్తున్నాడు. ఈ వ్యవహారాల్లో కిరణ్‌కు రామ్‌ప్రసాద్.. అబుబాకర్‌కు కేరళకే చెందిన హనీఫ్ హంజా సహకరించారు. రెండు నెలల్లో రూ.కోటి స్వైప్ ఈ గ్యాంగ్ రెండు నెలల్లో అనేక మంది క్లోన్డ్ కార్డులను వినియోగించి రూ.1.1 కోట్లు స్వాహా చేసింది. జేఅండ్‌కే బ్యాంక్ జారీ చేసిన స్వైపింగ్ మెషీన్ల ద్వారా తమ కస్టమర్లకు తెలి యకుండానే వారి కార్డుల్ని క్లోన్ చేసి, నగదు కాజేస్తున్నారని దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకులు ఫిర్యాదు చేశాయి. దీంతో జేఅండ్‌కే బ్యాంక్ అధికారి మహ్మద్ అల్తాఫ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీ సులు కిరణ్, అబుబాకర్, హనీఫ్, రామ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. జైల్లో ఉన్న మహేశ్‌ను పీటీ వారెంట్‌పై అరెస్టు చేయాలని నిర్ణయించారు. పరారీలో ఉన్న కీలక సూత్రధారి యూసుఫ్‌తో పాటు చాంద్‌పాషా కోసం గాలిస్తున్నారు. -
డెబిట్ కార్డు యూజర్లకు శుభవార్త!
-
డెబిట్ కార్డుపై ఎండీఆర్ చార్జీలు తగ్గింపు
• ఆర్బీఐ ప్రతిపాదనలు • ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి... ముంబై: పెద్ద నోట్ల రద్దు అనంతరం డెబిట్ కార్డు వాడకాన్ని మరింతగా పెంచే దిశగా ఆర్బీఐ చర్యలు ప్రారంభించింది. డెబిట్ కార్డుపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్)ను ఏప్రిల్ 1 నుంచి గణనీయంగా తగ్గించాలని ప్రతిపాదించింది. వార్షికంగా రూ.20 లక్షల టర్నోవర్ ఉన్న చిన్న వ్యాపారులు, ప్రత్యేక విభాగం కిందకు వచ్చే వ్యాపారులు (విద్యా సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూ రెన్స్, యుటిలిటీలు), ప్రభుత్వ ఆస్పత్రులు డెబిట్ కార్డు లావాదేవీల విలువపై 0.40% చార్జీ చెల్లించేలా ఆర్బీఐ ప్రతిపాదించింది. ఎండీఆర్ అనేది డెబిట్ కార్డు లావాదేవీల విలువపై దుకాణాదారుల నుంచి వసూలు చేసే చార్జీ. డిజిటల్ విధానంలో (క్యూఆర్‌కోడ్) లావాదేవీ జరిగితే ఎండీఆర్‌ను కేవలం 0.30%గానే ఆర్బీఐ ప్రతిపాదించింది. ప్రస్తుతం ఈ ఎండీఆర్ చార్జీ అనేది రూ.2,000 విలువ వరకు లావాదేవీలపై 0.75%గా ఉంది. ఆపై విలువగల లావాదేవీలకు 1% చార్జీ ఉంది. ఇక క్రెడిట్ కార్డు లావాదేవీలపై వసూలు చేసే ఎండీఆర్‌లో ఎటువంటి మార్పులను ఆర్బీఐ పేర్కొనలేదు. ఈ మేరకు ముసాయిదాను విడుదల చేసిన ఆర్బీఐ వీటిపై ఈ నెల చివరి వరకు ప్రజాభిప్రాయాలకు ఆహ్వానం పలికింది. అనంతరం ఏప్రిల్ 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి.పెద్ద నోట్ల రద్దు అనంతరం ఎండీఆర్ చార్జీలను ఆర్బీఐ తగ్గించింది. ఇవి మార్చి వరకు అమల్లో ఉండనున్నాయి. ఏప్రిల్ నుంచి ఈ చార్జీలను మరింత తగ్గించడం ద్వారా డెబిట్ కార్డుల వాడకాన్ని విస్తృతం చేయాలని ఆర్బీఐ భావించింది. నిజానికి ఎండీఆర్‌ను దుకాణాదారులే చెల్లించాల్సి ఉండగా, కొంత మంది వ్యాపారులు దాన్ని కస్టమర్ల నుంచి రాబడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘కన్వీనియెన్స్ లేదా సేవా చార్జీని కస్టమర్లు చెల్లించ్సాలిన అవసరం లేదని’ పేర్కొంటూ వ్యాపారులు బోర్డులను పెట్టేలా బ్యాంకులు చూడాలని కూడా ఆర్బీఐ తన ముసాయిదాలో కోరింది. ‘‘కార్డు లావాదేవీల్లో పెరుగుదల కనిపిస్తోంది. డిజిటల్ చెల్లింపులను మళ్లిన చిన్న వ్యాపారస్థులను ఈ విధానాన్ని కొనసాగించేలా చూడాలి’’ అని ఆర్బీఐ పేర్కొంది. నాలుగు విభాగాలు: ఆర్బీఐ వర్తకులను 4 కేటగిరీలుగా పేర్కొంది. వార్షికంగా రూ.20 లక్షల్లోపు టర్నోవర్ కలిగిన వారు, రూ.20 లక్షలకు మించిన టర్నోవర్; ప్రభుత్వ లావాదేవీలు, ప్రత్యేక కేటగిరీ వర్తకులు. ప్రభుత్వ లావాదేవీలు అయితే రూ.1,000 వరకు లావాదేవీపై ఫ్లాట్‌గా రూ.5 చార్జీ, రూ.1,001 నుంచి రూ.2,000 వరకు ఫ్లాట్‌గా రూ.10 చార్జీని చెల్లించాల్సి ఉంటుంది. రూ.2,001కి పైన విలువగల లావాదేవీలపై మొత్తం లావాదేవీ విలువలో చార్జీ 0.50% మించరాదు. అదీ రూ.250 వరకు మాత్రమే గరిష్ట పరిమితి. పెట్రోల్ బంకుల్లో కార్డుల వాడకంపై ఎండీఆర్ చార్జీ విషయంలో పరిశ్రమ వర్గాలతో సంప్రదింపుల తర్వాత ఆర్బీఐ నిర్ణయించనుంది.