కార్డు లావాదేవీల్లో పెరుగుదల 7 శాతమే
న్యూఢిల్లీ: గతేడాది పెద్ద నోట్ల రద్దు అనంతరం మొత్తం మీద డిజిటల్ లావాదేవీలు 23% పెరగ్గా, అందులో క్రెడిట్, డెబిట్ కార్డు లావాదేవీల పెరుగుదల 7%గానే ఉంది. ఈ మేరకు పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఆర్థిక శాఖకు చెందిన పార్లమెంటరీ ప్యానల్‌కు వివరాలు తెలిపారు.
దీని ప్రకారం గతేడాది నవంబర్‌లో అన్నిరకాల డిజిటల్ లావాదేవీలు 22.4 మిలియన్లుగా ఉండగా, 23% వృద్ధితో ఈ ఏడాది మే నెల నాటికి 27.5 మిలియన్లకు చేరాయి. యూపీఐ ఆధారిత లావాదేవీల్లో ఎక్కువ పెరుగుదల నమోదైంది. ఐఎంపీఎస్ లావాదేవీలు 1.2 మిలియన్ల నుంచి 2.2 మిలియన్లకు చేరాయి. అతి తక్కువ వృద్ధి మాత్రం కార్డులదే. 6.8 మిలియన్ల నుంచి 7.3 మిలియన్లకు పెరిగాయి.