Credit
-
వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలు అందించండి
న్యూఢిల్లీ: వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను నిర్దేశించిన మేర రుణ వితరణ చేయాలంటూ బ్యాంక్‌లను కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. వ్యవసాయ అనుబంధ రంగాలైన పశువుల పెంపకం, డైరీ, ఫిషరీస్‌కు రుణ వితరణ పురోగతిపై కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎం.నాగరాజు మంగళవారం ఢిల్లీలో అధికారులతో కలసి సమీక్షించారు. ప్రభుత్వరంగ బ్యాంక్‌లు (పీఎస్‌బీలు), నాబార్డ్, వ్యవ సాయ అనుబంధ రంగాలు, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీల తరఫున ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన రుణ వితరణ లక్ష్యాన్ని చేరుకునేందుకు బ్యాంక్‌లు చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నాగ రాజు కోరారు. అలాగే ఈ దిశగా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ అభివృద్ధి, ఉపాధి కల్పన పరంగా అనుబంధ రంగాలకు ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తు చేశారు. అన్ని ప్రాంతాల్లోనూ రుణ వితరణ సాఫీగా సాగేందుకు సమావేశాల నిర్వహణ/మదింపు చేపట్టాలని బ్యాంక్‌లను ఆదేశించారు. చేపల రైతులను గుర్తించి, వారికి కేసీసీ కింద ప్రయోజనం అందే దిశగా రాష్ట్రాలకు సహకారం అందించాలని నాబార్డ్‌ను సైతం కోరారు. -
అక్టోబర్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం!
సెప్టెంబర్ ముగుస్తోంది.. అక్టోబర్ నెల మొదలవడానికి మరికొన్ని రోజుల మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రతి నెలలో మాదిరిగానీ వచ్చే నెలలో (2024 అక్టోబర్) కూడా ఇన్వెస్ట్మెంట్స్, సేవింగ్స్ వంటివాటికి సంబంధించిన చాలా నిబంధలను మారతాయి. ఈ కథనంలో వచ్చే నెలలో ఏ రూల్స్ మారుతాయనే విషయం తెలుసుకుందాం..స్మాల్ సేవింగ్ స్కీమ్2024 అక్టోబర్ 1 నుంచి స్మాల్ సేవింగ్ రూల్స్ మారనున్నాయి. ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY) ఖాతాల వంటి పోస్ట్ ఆఫీస్ చిన్న పొదుపు ఖాతాలు కొత్త సర్దుబాట్లకు లోబడి ఉంటాయి. రెగ్యులర్ కానీ నేషనల్ స్మాల్ సేవింగ్ (NSS) ఖాతాలపై కూడా కొంత ప్రభావం ఉంటుంది. కొన్ని అకౌంట్స్ క్రమబద్దీకరించాల్సి ఉంటుంది.ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ కార్డ్ ఛార్జీలుఐసీఐసీఐ బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం.. 2024 అక్టోబర్ 1 నుంచి మీరు రూ. 10వేలు ఖర్చు చేయడం ద్వారా రెండు కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ పొందవచ్చు. మునుపటి క్యాలెండర్ త్రైమాసికంలో చేసిన ఖర్చులు.. తరువాత క్యాలెండర్ త్రైమాసికానికి యాక్సెస్‌ను అన్‌లాక్ చేస్తాయి.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మార్పులువచ్చే నెల ప్రారంభం నుంచే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్దులో కొన్ని మార్పులు జరగనున్నాయి. స్మార్ట్‌బై ప్లాట్ఫామ్లో.. యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లయితే.. అందులో వచ్చే రివార్డ్ పాయింట్స్ కేవలం ప్రొడక్ట్‌కు మాత్రమే వర్తిస్తాయి. ఇప్పుడు 1వ తేదీ నుంచి స్మార్ట్‌బై పోర్టల్ ప్రతి క్యాలెండర్ త్రైమాసికానికి 50,000 రివార్డ్ పాయింట్ల చొప్పున తనిష్క్ వోచర్ల కోసం రివార్డ్ పాయింట్ల రిడీమ్‌ను పరిమితం చేస్తుంది. ఈ మార్పులు ఇన్ఫినియా, ఇన్ఫినియా మెటల్ కార్డ్‌లకు మాత్రమే వర్తిస్తాయి.ఇదీ చదవండి : ఇద్దరితో మొదలై.. విశ్వమంతా తానై - టెక్ చరిత్రలో గూగుల్ శకం.. అనన్య సామాన్యంటీడీఎస్ వడ్డీ రేట్లుకేంద్ర బడ్జెట్ సమయంలో సెక్షన్ 194DA - జీవిత బీమా పాలసీకి సంబంధించి చెల్లింపును 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించారు. ఇది అక్టోబర్ 1, 2024 నుండి అమలులోకి వస్తుంది. సెక్షన్ 194G - లాటరీ టిక్కెట్ల విక్రయంపై కమీషన్ తదితరాలను కూడా 5 నుంచి 2 శాతానికి తగ్గించాలని పేర్కొన్నారు. ఇది కూడా 1వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుంది. కమిషన్ లేదా బ్రోకరేజీ చెల్లింపులు, హెచ్‌యూఎఫ్‌లు చేసే అద్దె చెల్లింపులు వంటి వాటికి అక్టోబర్ 1 నుంచి టీడీఎస్ రేట్లు తగ్గుతున్నట్లు సమాచారం. -
అప్పు తీసుకుంటున్నారా..? ఒక్కక్షణం ఆలోచించండి
డబ్బు విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అప్పుల ఊబిలో చిక్కుకోవాల్సిందే. మనకు తెలిసిన చాలామంది, మరీ ముఖ్యంగా జీతం తీసుకుంటున్నవారు తరచూ అప్పులు చేయడం గమనిస్తుంటాం. బాధ్యతా రహితంగా డబ్బు తీసుకుంటే భవిషత్తులో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అప్పు చేస్తున్న చాలామందికి దాని తీవ్రత తెలియక మళ్లీ అదే పనిచేస్తుంటారు. అప్పు ఉచ్చులో చిక్కుకుంటున్నామని సూచించే కొన్ని సంకేతాల గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం.ఆదాయంలో 50 శాతం కంటే ఎక్కువ ఈఎంఐలకు చెల్లిస్తుంటే క్రమంగా అప్పుల్లోకి జారుకుంటున్నారని తెలుసుకోవాలి. ఆన్లైన్ షాపింగ్ పెరుగుతున్న క్రమంలో చాలామంది ఈజీ ఈఎంఐలు, డిస్కౌంట్లు, సేల్స్ ఆకర్షణకు లోనవుతారు. అనవసర ఖర్చుతో ఇబ్బందులు తప్పవు. అప్పు మిమ్మల్ని మరింత ఊబిలో పడేస్తుంది. ఒకవేళ తప్పని పరిస్థితిలో అప్పు చేయాలంటే మాత్రం వచ్చే ఆదాయంలో ఈఎంఐలు 50శాతం కంటే తక్కువగా ఉండేలా జాగ్రత్తపడాలి.రోజువారీ ఖర్చుల కోసం అప్పురోజువారీ ఆర్థిక అవసరాల కోసం తరచు అప్పు తీసుకుంటే మాత్రం మీ ఆర్థిక పరిస్థితి గురించి మరోసారి ఆలోచించుకోవాలి. అద్దె, పిల్లల స్కూల్ ఫీజులు వంటి సాధారణ ఖర్చులకు అప్పు తీసుకుంటే రుణఊబిలోకి వెళ్లే ప్రమాదం ఉంది.క్రెడిట్ కార్డుతో జాగ్రత్తతీసుకున్న అప్పులను తీర్చడానికి క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించడం వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డ్ ద్వారా నగదు తీయడానికి భారీగా చార్జీలు వసూలు చేస్తారు. ఇది 2.5శాతం నుంచి 3.5శాతం వరకు ఉంటుంది. వార్షిక ప్రాతిపదికన, అసోసియేటెడ్ వడ్డీ 35శాతం నుంచి 50శాతం వరకు చేరవచ్చు.పేమెంట్లను చెల్లించకపోవడంక్రెడిట్ కార్డ్ డ్యూ డేట్‌లోపు పేమెంట్ చెల్లించాలి. అందులో మినిమం డ్యూ కడితే సరిపోతుందనుకోవద్దు. మిగిలిన డ్యూ మొత్తాన్ని నెలవారీగా వడ్డీ విధిస్తారు. అది మరింత ప్రమాదకరం. దాంతో మీ సిబిల్ స్కోర్ ప్రభావం చెందుతుంది. ఒక సర్వే ప్రకారం, దాదాపు 21శాతం మంది క్రెడిట్ కార్డ్ బిల్స్ చెల్లించడం లేదు లేదా గత సంవత్సరంలో కనీస బకాయి మొత్తాన్ని మాత్రమే చెల్లించడం ద్వారా దాన్ని రోల్ ఓవర్ చేశారు. క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌లను ఫార్వర్డ్ చేసినా మూడుశాతం వడ్డీ భరించాలి. ఈ రోల్ఓవర్ చక్రంలో చిక్కుకున్నట్లు అనిపిస్తే, వెంటనే దాన్ని క్లియర్ చేసుకోవాలి.భవిష్యత్తులో వచ్చే ఆదాయంపై అప్పుభవిష్యత్తులో ఫలానా వారు డబ్బు ఇస్తారనో.. లేదా ఈ సంవత్సరం చివర్లో బోనస్ వస్తుందనో ఇప్పుడే అప్పు తీసుకుంటే ఇబ్బందుల్లో పడవచ్చు. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. తప్పని పరిస్థితుల్లో ప్రస్తుత జీతం ఆధారంగా అప్పు తీసుకోవచ్చు. కానీ రాబోయే బోనస్, ఇంక్రిమెంట్లు మొదలైన వాటిపై కాదు.ఇంక్రిమెంట్లను నమ్మొద్దుభవిష్యత్తులో వచ్చే జీతం, ఇంక్రిమెంట్లను ఎక్కువగా అంచనా వేస్తారు. కెరీర్ ప్రారంభ దశల్లో ఇంక్రిమెంట్లు సాధారణంగా ఎక్కువగా ఉంటాయి. ఇవి రిటైర్మెంట్ వరకు కొనసాగకపోవచ్చు. కాబట్టి కనిపించని భవిషత్తుపై అంచనాలతో ప్రస్తుతం అప్పులు చేయడం తప్పు.ఫ్లోటింగ్ వడ్డీ రేట్లుఉద్యోగంలో చేరిన వెంటనే చాలామంది అడిగేప్రశ్న.. ‘ఇల్లు ఎప్పుడు కొంటారు’ అని.. దాంతో స్థోమతకు మించి అప్పు చేసైనా సరే ఇల్లు కొనాలనుకుంటారు. దీర్ఘకాల వ్యవధికిగాను హోమ్లోన్లను ఎంచుకునేప్పుడు ఫ్లోటింగ్ రేట్లును సెలక్ట్ చేసుకుంటారు. దాంతో వడ్డీ రేట్ల పెంపు వల్ల వచ్చే ఈఎంఐలలో ఆకస్మిక పెరుగుదలకు సిద్ధంగా ఉండాలి. భవిష్యత్తులో కిస్తీలు 20శాతం వరకు పెరిగే అవకాశం ఉందని గుర్తుంచుకొని లోన్ రీపేమెంట్ కోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించడం మంచిది.లోన్ తీర్చడానికి మళ్లీ అప్పువడ్డీ ఖర్చులను తగ్గించడానికి, హోం లోన్ రీఫైనాన్స్ చేయడం వంటివాటి కోసం తప్పా..అప్పు తిరిగి చెల్లించడానికి డబ్బు తీసుకోవడం మంచిది కాదు. సాధారణంగా, సామాజిక ఒత్తిళ్ల కారణంగా హోంలోన్, కారు లోన్ ఈఎంఐలు, అద్దె, పాఠశాల ఫీజులు వంటి చెల్లింపులను వాయిదా వేయడానికి వెనుకాడతారు. బదులుగా, కొందరు క్రెడిట్ కార్డ్‌లను ఆశ్రయిస్తారు. అవసరమైన కనీస మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తూ అప్పును పెంచుకుంటూ పోతారు. -
బ్యాంకుల్లో రుణవృద్ధి తగ్గుతుందన్న ప్రముఖ సంస్థ
భారతీయ బ్యాంకులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్, లాభాల విషయంలో ఆశించిన వృద్ధి నమోదవుతుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ తెలిపింది. అయితే అనుకున్న మేరకు డిపాజిట్లు రావని, దాంతో రుణ వృద్ధి తగ్గుతుందని సంస్థ అంచనా వేసింది.ఆసియా-పసిఫిక్ 2క్యూ 2024 బ్యాంకింగ్ అప్డేట్ కార్యక్రమంలో ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ డైరెక్టర్ నికితా ఆనంద్ మాట్లాడారు. ‘గతేడాదిలో 16 శాతం వృద్ధి నమోదుచేసిన రిటైల్ డిపాజిట్లు ఈ ఏడాది 14 శాతానికి పరిమితం కానున్నాయి. ప్రతి బ్యాంకులో రుణం-డిపాజిట్ల నిష్పత్తిలో తేడా ఉండనుంది. లోన్‌వృద్ధి డిప్లాజిట్ల కంటే 2-3 శాతం ఎక్కువగా ఉండనుంది. ఈ ఏడాదిలో బ్యాంకులు తమ రుణ వృద్ధిని తగ్గించి, డిపాజిట్ల పెంపునకు కృషి చేయాలి. అలా చేయకపోతే బ్యాంకులు నిధులు పొందడానికి కొంత ఇబ్బందులు పడాల్సి ఉంటుంది’ అని చెప్పారు. సాధారణంగా రుణ వృద్ధిలో ప్రైవేట్ రంగ బ్యాంకులు 17-18 శాతం వృద్ధి నమోదుచేస్తాయి. మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సరాసరి 12-14 శాతం మేరకు రుణ వృద్ధి ఉంటుంది. -
అక్రమ రుణయాప్‌లు.. యమపాశాలు! ఎలా మోసం చేస్తున్నారో తెలుసా..
రుణాల కోసం బ్యాంక్‌లను ఆశ్రయించడం ఆనవాయితీగా మారింది. మారుతున్న టెక్నాలజీతో అప్పు కావాలనుకుంటున్నవారు బ్యాంకులకు బదులుగా రుణ యాప్‌లను వినియోగిస్తున్నారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా ధ్రువపత్రాలు, గుర్తింపు వివరాలు తెలియజేయకుండా వెంటనే అప్పులిస్తామంటూ ప్రకటించడంతో వాటి వలలో పడుతున్నారు. అధిక మొత్తం వడ్డీలు లాగుతున్న రుణయాప్‌ల మూసుగులోని నేరముఠాలు గడువు ముగిసి వసూళ్ల పర్వం ప్రారంభించాక వేధింపులకు దిగుతున్నాయి. అక్రమ రుణయాప్‌లు నిరుద్యోగులు, చిరుద్యోగులు, పేద విద్యార్థులు, వ్యాపారుల ఉసురుతీస్తున్నాయి. ఆ రుణయాప్‌లపై చర్యలు తీసుకునేందుకు రిజర్వ్ బ్యాంకుతో కలిసి కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ చేపడుతుందని గడచిన సెప్టెంబరులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అక్రమ రుణయాప్‌లను అరికట్టడానికి ఆర్బీఐ, సెబీలతోపాటు రెగ్యులేటరీ సంస్థలు చర్యలు చేపట్టాల్సిందిగా కేంద్రమంత్రి చెప్పారు. దేశంలో నేడు రుణయాప్‌లు వేల సంఖ్యలో విస్తరించాయి. అందులో మోసపూరితమైనవేమిటో తెలియజేయాల్సిన బాధ్యతను, వాటన్నింటినీ నియంత్రించే కార్యాన్ని కేంద్రం రాష్ట్రప్రభుత్వాలకు, పోలీసు విభాగాలకు, రిజర్వ్‌బ్యాంకుకు వదిలేస్తే ఎలా అనే విమర్శలు వస్తున్నాయి. కేంద్ర మంత్రిత్వశాఖలు, టెలికాం సంస్థలు, సెబీ, రాష్ట్రాలు... అన్నీ కలిసికట్టుగా పని చేయాలని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వేలల్లో రూపాయలు ఎరగా చూపి వాటిని రుణాలిచ్చి లక్షల్లో వసూళ్లకు పాల్పడుతున్న అక్రమ ఆన్లైన్ రుణదాతలు భారీ మోసాలకు తెరతీస్తున్నట్లు సమాచారం. గతంలో దాదాపు రూ.170 కోట్ల పెట్టుబడితో ఏడాదిలోనే చైనాకు చెందిన ఓ రుణయాప్ సంస్థ ఏకంగా రూ.11,700 కోట్లు దండుకున్న ఘటనలు వెలుగుచూశాయి. ఒక్క హైదరాబాద్‌లోనే ఆన్లైన్ రుణయాప్‌లతో సుమారు రూ.32 వేలకోట్ల లావాదేవీలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ ఆన్లైన్ రుణాల్లో వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజు ముందుగానే అప్పులో దాదాపు 35శాతం మేర మినహాయించుకుంటారు. గడువు తీరిన వెంటనే అధిక వడ్డీతో బాకీలు వసూళు చేస్తారు. ఇదీ చదవండి: 20 దేశాలను టార్గెట్ చేసిన చైనా హ్యాకర్లు..? కీలక పత్రాలు లీక్.. డిమాండ్ చేసినమేరకు చెల్లించకపోతే రుణ తీసుకున్నపుడు మొబైల్లో అన్ని అనుమతులు ఇస్తారు కాబట్టి అప్పు తీసుకున్నవారి కాంటాక్ట్ వివరాలు, గ్యాలరీ, హిస్టరీ అన్ని రికార్డవుతాయి. దాంతో మార్ఫింగ్ చేసిన కుటుంబ సభ్యుల ఫొటోలు పంపి బ్లాక్మెయిల్ చేస్తారు. దాంతో బాధితులు తట్టుకోలేక అడిగినంత ముట్టజెపుతారు. ఆన్లైన్ రుణయాప్‌ల నియంత్రణకు పటిష్ఠ చట్టాలు, చర్యలు తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు. -
ఉద్దేశపూర్వక ఎగవేతదార్ల నిబంధనలు కఠినతరం
ముంబై: ఉద్దేశపూర్వక ఎగవేతదారుల నిబంధనలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ సవరణలను ప్రతిపాదించింది. రూ. 25 లక్షలకు పైన బాకీ పడి, స్థోమత ఉన్నా చెల్లించడానికి నిరాకరిస్తున్న వారిని ఈ పరిధిలోకి చేర్చేలా నిర్వచనాన్ని మార్చనున్నట్లు ముసాయిదా ప్రతిపాదనల్లో పేర్కొంది. ఈ కోవకు చెందిన డిఫాల్టర్లకి రుణ సదుపాయాన్ని పునర్వ్యవస్థీకరించుకునేందుకు అర్హత ఉండదు. అలాగే ఇతరత్రా ఏ కంపెనీ బోర్డులోనూ పదవులు చేపట్టే వీలుండదు. బాకీలను వేగవంతంగా రాబట్టుకునేందుకు అవసరాన్ని బట్టి సదరు రుణగ్రహీతలు, హామీదారులపై బ్యాంకులు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. మొండిబాకీగా వర్గీకరించిన పద్దుకు సంబంధించి ఆరు నెలల వ్యవధిలో ఉద్దేశపూర్వక ఎగవేత అవకాశాలను సమీక్షించి, తగు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ముసాయిదాపై సంబంధిత వర్గాలు అక్టోబర్ 31లోగా ఆర్బీఐకి తమ అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది. -
40 ఖాతాల్లోకి ఉన్నట్టుండి లక్షలు.. డబ్బులు తీసుకునేందుకు క్యూ!
ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలోని కొందరు గ్రామీణులు రాత్రికిరాత్రే లక్షాధికారులయ్యారు. వీరి బ్యాంకు ఖాతాల్లో గుర్తుతెలియని అకౌంట్ నుంచి డబ్బలు జమ అయ్యాయి. సుమారు 40 మంది గ్రామీణుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. దీనికి సంబంధించిన మెసేజ్ రాగానే ఆ ఖాతాదారుల ఆనందంతో చిందులేశారు. ఆ డబ్బు తీసుకునేందుకు బ్యాంకు ముందు క్యూ కట్టారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటన కేంద్రపారా జిల్లాలోని ఒడిశా గ్రామ్య బ్యాంకు చెందిన బాటీపాడా శాఖలో చోటుచేసుకుంది. ఖాతారులు తమ అకౌంట్లోని పెద్ద మొత్తంలో డబ్బులు జమకావడంతో వారంతా బ్యాంకుకు చేరుకున్నారు. కొందరు తమ ఖాతాల నుంచి సొమ్ము ఉపసంహరించుకున్నారు. మరికొందరు డబ్బులు తీసుకోలేకపోయారు. పలువురు ఖాతాదారులకు అకౌంట్లలో వేల రూపాయలు మొదలుకొని 2 లక్షల రూపాయల వరకూ జమ అయ్యాయి. దీనిని గమనించిన బ్యాంకు అధికారులు నగదు విత్‌డ్రాలను నిలిపివేశారు. వినియోగదారుల ఖాతాలలోకి ఈ సొమ్ము ఎలా వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇది కూడా చదవండి: బెర్లిన్‌లో గణేశుని ఆయలం.. దీపావళికి ప్రారంభం -
చూడటానికి చిన్న "క్యూఆర్ కోడ్"..వ్యాపారంలో ప్రకంపమే సృష్టిస్తోంది!
రోడ్డు పక్కన ఉన్న టీ కొట్టు, చాట్ బండి, పండ్ల షాపులను గమనించారా? అక్కడ మీకో యూపీఐ క్యూఆర్ కోడ్ దర్శనమిస్తుంది. చూడ్డానికి చిన్నదే అయినా వాటి ఆధారంగా జరుగుతున్న వ్యాపారం గురించి తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే! దేశ వాణిజ్యంలో యూపీఐ క్యూఆర్ కోడ్స్ అత్యంత కీలకంగా మారాయంటే అతిశయోక్తి కాదు. కుగ్రామాల్లోని చిరు వ్యాపారుల వద్ద కూడా దర్శనమిస్తున్న ఈ కోడ్లను గమనిస్తే, డిజిటల్ పేమెంట్స్ రంగంలో భారతావని ముఖచిత్రం ఎలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. వ్యక్తుల నుంచి వర్తకులకు చేరిన డిజిటల్ పేమెంట్స్‌లో సంఖ్యపరంగా రూ.500 లోపు విలువ చేసే లావాదేవీల వాటా ఏకంగా 84.27 శాతం ఉంది. చిన్న చిన్న మొత్తాలే డిజిటల్ రూపంలో చేతులు మారుతున్నాయనడానికి ఇదే నిదర్శనం. ఇన్స్టంట్ పేమెంట్ సిస్టమ్ భారత వాణిజ్యాన్ని పునర్నిర్మించింది. అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి కోట్లాది మందిని తీసుకొచ్చింది. రోజువారీ జీవితాన్ని మరింత సౌకర్యవంతం చేసింది. కోట్లాదిమంది భారతీయులకు క్రెడిట్, సేవింగ్స్ వంటి బ్యాంకింగ్ సేవలను విస్తరించింది. ప్రభుత్వ కార్యక్రమాలు లబ్ధిదారులకు నేరుగా చేరాయి. పన్నుల వసూళ్లలో వృద్ధి నమోదవుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారతదేశం ఇంతకు ముందు చూడని స్థాయిలో ఈ సాంకేతిక ఆవిష్కరణ ప్రభావం చూపించింది. సౌకర్యాల కలబోత.. చాక్లెట్ కొన్నా షాపు యజమానికి అక్కడి క్విక్ రెస్పాన్స్ (క్యూఆర్) కోడ్ లేదా బ్యాంకు ఖాతాకు అనుసంధానమైన మొబైల్ నంబరు సాయంతో డబ్బులు చెల్లించొచ్చు. అదీ 10 సెకన్లలోపే. కస్టమర్‌కి గాని, వ్యాపారస్తుడికి గాని చేతిలో చిల్లర లేదన్న బెంగ లేదు. క్యాష్ కోసం ఏటీఎమ్‌కి, బ్యాంకుకు పరుగెత్తే పని లేదు. షాపింగ్ కోసం చేతినిండా నగదు ఉంచుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. కావాల్సిందల్లా చేతిలో ఉన్న ఫోన్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) పేమెంట్ యాప్ ఉంటే చాలు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి క్షణాల్లోనే చెల్లింపులు పూర్తి చేయవచ్చు. వర్తకులు ప్రతిసారీ తమ మొబైల్‌ను చెక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా వాయిస్ బాక్సులు వచ్చాయి. వినియోగదారుడి బ్యాంకు ఖాతా, లేదా డిజిటల్ వాలెట్ నుంచి లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాకు డబ్బులు నేరుగా బదిలీ అవుతాయి. యూపీఐ యాప్‌లో ప్రతి బ్యాంకు ఖాతాకు ఒక వర్చువల్ పేమెంట్ అడ్రస్ (ఐడీ) క్రియేట్ అవుతుంది. ఈ యూపీఐ ఐడీ లేదా బ్యాంకు ఖాతాకు అనుసంధానమైన మొబైల్ నంబరుతో కూడా డబ్బులు చెల్లించవచ్చు. బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు జరిగే చెల్లింపులకు ఎటువంటి చార్జీ ఉండదు. అంటే బ్యాంకు ఖాతా నుంచి క్యూఆర్ కోడ్ ద్వారా జరిగే లావాదేవీలు కూడా ఉచితం అన్నమాట. మొబైల్ రీచార్జ్, ఎలక్ట్రిసిటీ బిల్లులు, బీమా, డీటీహెచ్ చెల్లింపులు, సిలిండర్ బుకింగ్ చేసుకోవచ్చు. లావాదేవీల పరిమితి రోజుకు రూ.1 లక్ష వరకు ఉంది. దేశవ్యాప్తంగా అధికారికంగా జరుగుతున్న ఆర్థిక లావాదేవీల్లో విలువ పరంగా యూపీఐ వాటా 43 శాతం ఉందంటే అతిశయోక్తి కాదు. పీవోఎస్ టెర్మినల్స్‌ను మించి.. క్యూఆర్ కోడ్స్‌కు ఆదరణ అంతా ఇంతా కాదు. విక్రేతలు ఎవరైనా డిజిటల్ రూపంలో నగదును స్వీకరించేందుకు వీటిని వినియోగిస్తున్నారు. దీనికి ప్రధాన కారణమేమిటంటే తెల్లకాగితం మీద కూడా క్యూఆర్ కోడ్‌ను ప్రింట్ తీసుకుని వినియోగించే వెసులుబాటు ఉండడం. పైగా పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మెషీన్ ఖరీదు సుమారు రూ.12 వేల వరకు ఉంది. ఎంపీవోఎస్ ఖరీదు అయిదు వేల వరకు పలుకుతోంది. చౌకైన వ్యవహారం కాబట్టే క్యూఆర్ కోడ్స్ పాపులర్ అయ్యాయి. వినియోగదారులు సైతం డిజిటల్ పేమెంట్లకు మొగ్గు చూపుతుండటమూ వీటి వినియోగం పెరిగేందుకు దోహదం చేసింది. నగదుతో పోలిస్తే చాలా సందర్భాల్లో అతి తక్కువ సమయంలో డిజిటల్ చెల్లింపులు పూర్తి చేయవచ్చు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది మార్చి నాటికి వర్తకుల కోసం 26 కోట్ల పైచిలుకు క్యూఆర్ కోడ్స్ జారీ అయ్యాయి. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా నగదును స్వీకరించే పీవోఎస్ టెర్మినల్స్ 78 లక్షలు ఉన్నాయి. పీవోఎస్ టెర్మినల్స్‌ను మించి క్యూఆర్ కోడ్స్ జారీ అయ్యాయంటే యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపుల వేగాన్ని అర్థం చేసుకోవచ్చు. ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి డిజిటల్ పేమెంట్స్ సంస్థలు క్యూఆర్ కోడ్స్‌ను జారీ చేస్తున్నాయి. ఆధార్ ఆధారంగా.. దేశంలో 99 శాతం మంది పెద్దలు బయోమెట్రిక్ గుర్తింపు సంఖ్యను కలిగి ఉన్నారని ప్రభుత్వం చెబుతోంది. మొత్తం 130 కోట్లకుపైగా ఆధార్ ఐడీలు జారీ అయ్యాయి. ఈ ఐడీలు కొత్తగా బ్యాంక్ ఖాతాలు తెరిచే పనిని సులభతరం చేశాయి. అలాగే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అని పిలిచే తక్షణ చెల్లింపు వ్యవస్థకు పునాదిగా మారాయి. 2016 నవంబర్‌లో భారత ప్రభుత్వం రూ.500, 1,000 నోట్లను రద్దు చేసింది. నోట్ల కొరత కూడా డిజిటల్ లావాదేవీల వైపు మళ్లడానికి కారణం అయింది. గత ఏడాది భారత్‌లో ఇన్స్టంట్ డిజిటల్ పేమెంట్స్ లావాదేవీల విలువ యూఎస్, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్‌ల కంటే చాలా ఎక్కువ. ఈ నాలుగు దేశాల మొత్తం లావాదేవీలే కాదు, ఈ మొత్తం విలువను నాలుగుతో గుణించినదాని కంటే భారత లావాదేవీలు అధికమని ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం సందర్భంగా కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. దేశంలో 30 కోట్ల పైచిలుకు వ్యక్తులు, 5 కోట్లకు పైగా వర్తకులు యూపీఐ వేదికపైకి వచ్చి చేరారు. పట్టణ ప్రాంతాలను దాటి.. యూపీఐ వేదికగా 2021 ఏప్రిల్‌లో రూ.4,93,663 కోట్ల విలువైన 264 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఆ తర్వాతి సంవత్సరం ఏప్రిల్‌లో రూ.9,83,302 కోట్ల విలువైన 558 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. 2023 వచ్చేసరికి యూపీఐ లావాదేవీల విలువ ఏప్రిల్ నెలలో ఏకంగా రూ.14,15,504.71 కోట్లకు ఎగసింది. లావాదేవీల సంఖ్య 886.32 కోట్లకు చేరింది. అంటే రెండేళ్లలో లావాదేవీల విలువ మూడింతలకు చేరువ అవుతోంది. పరిమాణం మూడు రెట్లు దాటింది. 2021లో గరిష్ఠంగా డిసెంబర్లో రూ.8,26,848 కోట్లు, 2022 అత్యధికంగా డిసెంబర్లో రూ.12,81,970.8 కోట్లు నమోదయ్యాయి. డిజిటల్ పేమెంట్లు భారత్‌లో వేగంగా ఆదరణ చెందుతున్నాయని అనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. కోవిడ్–19 మహమ్మారి సమయంలో యూపీఐ ప్లాట్‌ఫామ్ పెద్ద ఎత్తున ప్రాచుర్యంలోకి వచ్చింది. పట్టణ ప్రాంతాలను దాటి గ్రామీణ భారతదేశానికి కూడా యూపీఐ విస్తరించడం నిపుణులనూ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. భారత్‌లో 2016 నుంచి.. సౌలభ్యం ఉంది కాబట్టే చెల్లింపుల వ్యవస్థలో రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్ అయిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు విప్లవం సృష్టిస్తోంది. భారత్‌లో అయితే వీటి లావాదేవీల సంఖ్య, విలువ అనూహ్య రీతిలో పెరుగుతూ వస్తోంది. విభిన్న బ్యాంకు ఖాతాలను పేమెంట్ యాప్‌కు అనుసంధానం చేయడం ద్వారా నగదుకు బదులు డిజిటల్ రూపంలో చెల్లింపులను సురక్షితంగా, క్షణాల్లో పూర్తి చేయవచ్చు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) 2016 ఏప్రిల్ 11న యూపీఐ సేవలను పైలట్ ప్రాజెక్టుగా 21 బ్యాంకులతో కలసి భారత్‌లో ప్రారంభించింది. అదే ఏడాది ఆగస్ట్ 25 నుంచి గూగుల్ ప్లే స్టోర్లలో బ్యాంకులు తమ పేమెంట్ యాప్స్‌ను జోడించడం మొదలుపెట్టాయి. భారత్‌లో ప్రస్తుతం 414 బ్యాంకులు యూపీఐ సేవలను అందిస్తున్నాయి. పేమెంట్ యాప్స్‌లో ఫోన్‌పే విజయపరంపర కొనసాగిస్తోంది. ఈ యాప్ 2023 ఏప్రిల్‌లో లావాదేవీల సంఖ్య, విలువ పరంగా తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. గూగుల్‌పే, పేటీఎమ్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఎన్పీసీఐ ప్రమోట్ చేస్తున్న భీమ్ యాప్ క్రమంగా ఆదరణ పెంచుకుంటోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో టాప్–10 పేమెంట్ యాప్స్‌లో ఏడవ స్థానాన్ని భీమ్ దక్కించుకుంది. 2023 ఏప్రిల్‌లో విలువ పరంగా తొలి 10 స్థానాల్లో నిలిచిన యాప్స్ పేమెంట్ యాప్స్‌లో ఫోన్‌పే విజయపరంపర కొనసాగిస్తోంది. ఈ యాప్ 2023 ఏప్రిల్‌లో లావాదేవీల సంఖ్య, విలువ పరంగా తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. గూగుల్‌పే, పేటీఎమ్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఎన్పీసీఐ ప్రమోట్ చేస్తున్న భీమ్ యాప్ క్రమంగా ఆదరణ పెంచుకుంటోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో టాప్–10 పేమెంట్ యాప్స్‌లో ఏడవ స్థానాన్ని భీమ్ దక్కించుకుంది. (2023 ఏప్రిల్‌లో విలువ పరంగా తొలి 10 స్థానాల్లో నిలిచిన యాప్స్) కోవిడ్ కాలంలో రెండింతలు.. 2016 డిసెంబర్లో రూ.708 కోట్ల విలువైన యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపులు జరిగాయి. 2017లో ఒక నెలలో గరిష్ఠంగా రూ.13,174 కోట్లు నమోదయ్యాయి. 2018 డిసెంబరులో లక్ష కోట్ల మార్కును దాటింది. ఏడాదిలోనే రెట్టింపు అయ్యాయి. 2020 జూలై నుంచి యూపీఐ లావాదేవీల వేగం పుంజుకుంది. ఆ నెలలో రూ.2,90,538 కోట్ల విలువైన 149.7 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి కాలంలో వైరస్ భయానికి నోట్లను ముట్టుకోవడానికి ప్రజలు ససేమిరా అన్నారు. దీంతో డిజిటల్ చెల్లింపులకు మళ్లారు. ఫలితంగా 2020, 2021లో డిజిటల్ లావాదేవీల విలువ రెట్టింపైంది. 2022 మే నెలలో రూ.10 లక్షల కోట్ల మైలురాయి దాటి యూపీఐ సరికొత్త రికార్డు సృష్టించింది. అంటే 40 నెలల్లోనే పదిరెట్లు అయ్యాయంటే పేమెంట్ యాప్స్ ఏ స్థాయిలో ప్రజల్లోకి చొచ్చుకుపోయాయో అర్థం చేసుకోవచ్చు. యూపీఐదే 43 శాతం వాటా.. ఏటీఎమ్‌ల నుంచి నగదు స్వీకరణ, జమ, చెక్కులు, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు, ఇతర మార్గాల్లో దేశవ్యాప్తంగా నమోదైన ఆర్థిక లావాదేవీల పరిమాణం 2022–23లో 10,620.6 కోట్లు. వీటి విలువ రూ.3,22,36,700 కోట్లు. ఇందులో యూపీఐ సింహభాగం కైవసం చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో యూపీఐ వేదికగా 8,375.1 కోట్ల లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ.1,39,20,678 కోట్లు. అధికారికంగా జరిగిన మొత్తం ఆర్థిక లావాదేవీల్లో యూపీఐ ఏకంగా 43.18 శాతం వాటా కైవసం చేసుకుందన్న మాట. చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (సీటీఎస్) చెక్ క్లియరింగ్ విధానం ద్వారా రూ.71,67,040 కోట్ల లావాదేవీలు జరిగాయి. మొబైల్ ఫోన్స్ ద్వారా బ్యాంకుల మధ్య ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ సేవలైన ఇమ్మీడియేట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్) వేదికగా రూ.55,86,147 కోట్లు నమోదయ్యాయి. ఏటీఎమ్‌లలో నగదు జమ, స్వీకరణ లావాదేవీల విలువ రూ.16,62,419 కోట్లు ఉంది. ప్రజల వద్ద చలామణీలో ఉన్న నగదు రూ.36 లక్షల కోట్లు. ఇవీ డిజిటల్ లావాదేవీలు.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫిన్‌టెక్ మార్కెట్లలో భారత్ ఒకటిగా నిలిచింది. ప్రధానంగా డిజిటల్ చెల్లింపుల విభాగంలో పురోగతి ఇందుకు తోడ్పడింది. 2017–18లో దేశంలో డిజిటల్ లావాదేవీల సంఖ్య 2,000 కోట్లు. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 10,000 కోట్లు దాటింది. దీంతో డిజిటల్ లావాదేవీల విలువ 50 శాతానికిపైగా ఎగసింది. యూపీఐ ఇందుకు దోహదం చేసింది. 2022లో రూ.149.5 లక్షల కోట్ల విలువైన 8,792 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయి. ఇందులో రూ.126 లక్షల కోట్ల విలువైన 7,405 కోట్ల లావాదేవీలు యూపీఐ కైవసం చేసుకుంది. డిజిటల్ పేమెంట్ల విలువ 2026 నాటికి 10 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని ఫోన్‌పే, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇటీవలి నివేదిక వెల్లడించింది. ఇదే జరిగితే నగదు లావాదేవీల వాటా 60 నుంచి 35 శాతానికి వచ్చి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. డిజిటల్ చెల్లింపుల విషయంలో భవిష్యత్ అంతా 3–6 తరగతి శ్రేణి నగరాలు, పట్టణాలదే. గడిచిన రెండేళ్లుగా కొత్త మొబైల్ పేమెంట్ కస్టమర్లలో ఈ నగరాలు, పట్టణాలకు చెందినవారు 60–70 శాతం ఉన్నారట. 2023 మార్చినాటికి భారత్‌లో 96.12 కోట్ల డెబిట్ కార్డులు జారీ అయ్యాయి. 5.5 కోట్ల మంది వద్ద 8.53 కోట్ల క్రెడిట్ కార్డులు ఉన్నాయి. డిజిటల్ వేదికల రాకతో బ్యాంకులపై భారం గణనీయంగా తగ్గింది. బ్యాంకుల్లో ఇప్పుడు క్యూలు కానరావడం లేదు. ఎక్కడ ఎక్కువంటే.. గ్రాసరీస్, సూపర్మార్కెట్లలో అత్యధికంగా యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. ఆ తర్వాతి స్థానంలో ఆహార విక్రయ కేంద్రాలు, రెస్టారెంట్లు, టెలికం సేవలు, ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్, గేమ్స్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, సర్వీస్ స్టేషన్స్, ఔషధ దుకాణాలు, బేకరీస్ నిలిచాయి. విలువ పరంగా 2023 ఏప్రిల్‌లో నమోదైన లావాదేవీల్లో వ్యక్తుల నుంచి వ్యక్తులకు (పీర్ టు పీర్) చేరిన మొత్తం 77.18 శాతం. మిగిలినది వ్యక్తుల నుంచి వర్తకులకు (పీర్ టు మర్చంట్) చేరింది. పీర్ టు పీర్ విభాగంలో రూ.2 వేలు ఆపైన విలువ చేసే లావాదేవీలు 87.05 శాతం, రూ.500–2000 వరకు 9.73, రూ.500 లోపు 3.21 శాతం కైవసం చేసుకున్నాయి. పీర్ టు మర్చంట్ విభాగంలో రూ.2,000 పైన 67.3 శాతం, రూ.500–2000 వరకు 17.72, రూ.500 లోపు 15.24 శాతం నమోదయ్యాయి. లావాదేవీల సంఖ్య పరంగా 2023 ఏప్రిల్‌లో పీర్ టు మర్చంట్ అధికంగా 56.63 శాతం దక్కించుకుంది. మిగిలినది పీర్ టు పీర్ చేజిక్కించుకుంది. పీర్ టు మర్చంట్ విభాగంలో సింహభాగం అంటే 84.27 శాతం లావాదేవీలు రూ.500 లోపు విలువైనవే. రూ.500–2000 విలువ చేసేవి 11.01 శాతం, రూ.2 వేలకుపైగా విలువ కలిగిన కొనుగోళ్లు 4.71 శాతం ఉన్నాయి. వ్యక్తుల నుంచి వ్యక్తులకు రూ.500 లోపు బదిలీ చేసినవి 54.22 శాతం, రూ.500–2,000 వరకు 22.25 శాతం, రూ.2 వేలకుపైగా చెల్లించినవి 23.53 శాతం ఉన్నాయి. ఇంటర్నెట్ తోడుగా.. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ), మార్కెట్ డేటా అనలిటిక్స్ సంస్థ కాంటార్ సంయుక్త నివేదిక ప్రకారం.. భారత్‌లో సగానికి పైగా జనాభా ఇంటర్నెట్ను తరచుగా వినియోగిస్తోంది. 2022లో దేశవ్యాప్తంగా 75.9 కోట్ల మంది యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. ఈ స్థాయిలో యాక్టివ్ యూజర్లు ఉండడం భారత్‌లో ఇదే ప్రథమం. వీరు కనీసం నెలకు ఒకసారైనా నెట్లో విహరిస్తున్నారు. రెండేళ్లలో ఈ సంఖ్య 90 కోట్లకు చేరనుంది. మొత్తం యాక్టివ్ యూజర్లలో 39.9 కోట్ల మంది గ్రామీణ ప్రాంతాల వారు కాగా, మిగిలిన వారు పట్టణ ప్రాంతాల నుంచి ఉన్నారు. దేశీయంగా ఇంటర్నెట్ వినియోగ వృద్ధికి గ్రామీణ ప్రాంతం దన్నుగా నిలుస్తోందనడానికి ఇది నిదర్శనమని నివేదిక వివరించింది. ఏడాది వ్యవధిలో పట్టణ ప్రాంతాల్లో నెట్ వినియోగ వృద్ధి 6 శాతంగా ఉండగా, గ్రామీణ భారతంలో ఇది 14 శాతంగా నమోదైందని వివరించింది. 2025 నాటికి కొత్త ఇంటర్నెట్ యూజర్లలో 56 శాతం మంది గ్రామీణ ప్రాంతాల నుంచే ఉండవచ్చని నివేదిక తెలిపింది. ఇక డిజిటల్ చెల్లింపులు చేసేవారి సంఖ్య 2021తో పోలిస్తే గతేడాది 13 శాతం దూసుకెళ్లి 33.8 కోట్లకు చేరింది. వీరిలో 36 శాతం మంది గ్రామీణ ప్రాంతాలవారు ఉన్నారు. డిజిటల్ చెల్లింపులు చేస్తున్న వారిలో 99 శాతం మంది యూపీఐ యూజర్లే ఉండడం విశేషం. క్రెడిట్‌ను విస్తరించడానికి.. భారతదేశం యూపీఐ రూపంలో ప్రపంచంలోనే అత్యంత అధునాతన డిజిటల్ చెల్లింపు వ్యవస్థలను కలిగి ఉంది. ఇప్పుడు యూపీఐ పట్టాలను క్రెడిట్ లావాదేవీలకు విస్తరించడానికి సమయం ఆసన్నమైంది. రూపే క్రెడిట్ కార్డ్‌లపై యూపీఐ లావాదేవీలను ప్రారంభించడం ద్వారా దీని మొదటి దశ ఇప్పటికే ప్రారంభమైంది. అయితే భారత్ కేవలం 5.5 కోట్ల క్రెడిట్ కార్డ్ వినియోగదారులను కలిగి ఉంది. క్రెడిట్ కార్డ్‌లకు ఎటువంటి లింక్ లేకుండా నిజమైన క్రెడిట్ లావాదేవీలను ప్రారంభించడానికి ఈ పట్టాలను విస్తరించడం చాలా ముఖ్యం. ఇది అధికారిక క్రెడిట్ పరిధికి దూరంగా ఉన్న 60 కోట్లకుపైగా మందికి క్రెడిట్‌ను విస్తరించడానికి వివిఫై, ఇతర కంపెనీలకు వీలు కల్పిస్తుంది. – అనిల్ పినపాల, ఫౌండర్, వివిఫై ఇండియా ఫైనాన్స్. -- నూగూరి మహేందర్ -
కార్బన్ క్రెడిట్స్ మార్కెట్‌కు భారీ అవకాశాలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ కార్బన్ క్రెడిట్ మార్కెట్ వచ్చే ఏడేళ్లలో భారీగా విస్తరించనున్నట్టు ఈ రంగానికి సేవలు అందించే ఈకేఐ ఎనర్జీ సరీ్వసెస్ సీఎండీ మనీష్ దబ్‌కర తెలిపారు. 2030 నాటికి ఈ మార్కెట్ 250 బిలియన్ డాలర్లకు (రూ.20.75 లక్షల కోట్లు) చేరుకుంటుందన్నారు. పలు కారణాల వల్ల ప్రస్తుతం ఈ మార్కెట్ సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, వడ్డీ రేట్ల పెరుగుదల, డిమాండ్ తగ్గడంతో కార్బన్ క్రెడిట్ ధరలు 80 శాతం తగ్గినట్టు చెప్పారు. ‘‘స్వచ్ఛంద కార్బన్ ఆఫ్సెట్ మార్కెట్ 2021 నాటికి 2 బిలియన్ డాలర్లుగా ఉంది. అక్కడి నుంచి క్షీణించడం వల్ల ఇప్పుడు 500 మిలియన్ డాలర్ల స్థాయికి చేరింది. అయినప్పటికీ పలు రేటింగ్ ఏజెన్సీలు కార్బన్ మార్కెట్ పుంజుకునే విషయమై సానుకూలంగా ఉన్నాయి’’అని దబ్‌కర వివరించారు. బార్క్లేస్ నివేదికను ఉదహరిస్తూ.. ‘‘పలు దేశాలు అమలు చేస్తున్న కఠినమైన పర్యావరణ అనుకూల విధానాలు, ప్యారిస్ ఒప్పందం కింద కర్బన ఉద్గారాలను తగ్గించుకునే విషయంలో వాటి అంకితభావం, కార్పొరేట్ సస్టెయినబులిటీ లక్ష్యాలు అనేవి కార్బన్ క్రెడిట్ మార్కెట్ వృద్ధికి దోహదపడతాయి. 2030 నాటికి 250 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటుంది’’అని దబ్‌కర ఓ వార్తా సంస్థతో తెలిపారు. కార్బన్ క్రెడిట్ మార్కెట్ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిన సమయంలో మనీష్ దబ్‌కర తన అభిప్రాయాలను పంచుకున్నారు. కార్బన్ మార్కెట్‌కు కేంద్రం మద్దతు ‘‘కార్బన్ మార్కెట్‌కు సంబంధించి ఓ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నాం. ఇప్పటికే కొంత వరకు కార్బన్ మార్కెట్ ఇక్కడ ఉంది. పునరుత్పాదక ఇంధనం కలిగి ఉన్నామంటే అది కార్బన్ క్రెడిట్ అవుతుంది. ఇంధన ఆదా సరి్టఫికెట్లు కూడా కార్బన్ మార్కెట్లో భాగమే. ఈ రెండింటినీ కలిపి కార్బన్ క్రెడిట్‌గా మార్చి విక్రయిస్తాం’’అని కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ఆర్కే సింగ్ లోగడ చెప్పడం గమనార్హం. ఇండోర్ కేంద్రంగా పనిచేసే ఈకేఐ ఎనర్జీ సరీ్వసెస్ అంతర్జాతీయ కార్బన్ క్రెడిట్ మార్కెట్లో ప్రముఖ కంపెనీగా ఉంది. -
మోదీజీ ఆ ఆస్కార్ క్రెడిట్‌ని తీసుకోకండి: ఖర్గే సెటైరికల్ పంచ్
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో ఆస్కార వేడుకల్లో భారత్ సాధించిన కీర్తిని గురించి కొనియాడారు. విజేతలకు అభినందనలు తెలుపుతూ.. ఈ గెలుపు భారతదేశానికి గర్వకారణమని అన్నారు. అలాగే విజేతలు దక్షిణ బారతదేశానికి చెందిన వారంటూ హెలెట్ చేస్తూ చెప్పారు. ఐతే ఆర్ఆర్ఆర్ నుంచి నాటునాటు పాట, చిన్న డాక్యుమెంటరీ ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఆస్కార్ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఖర్గే మాట్లాడుతూ... దీనికి మేము చాలా గర్వపడుతున్నాం కానీ నాదోక అభ్యర్థన అంటూ ఒక సైటిరికల్ పంచ్ విసిరారు. మోదీజీ దయచేసి ఈ ఆస్కార్ క్రెడిట్‌ని తీసుకోకండి అలా చేయకూడదు అన్నారు. మోదీ తన గెలుపు కోసం.. మేమే దర్శకత్వం వహించాం, మేము రాశాం, అని చెప్పకూడదు ఇదే నా అభ్యర్థన అని ఖర్గే అన్నారు. అంతే ఒక్కసారిగా రాజ్యసభలో నవ్వులు విరబూశాయి. ఖర్గే వ్యాఖ్యలకు ప్రతిపక్ష సభ్యుల నుంచే కాకుండా ట్రెజరీ బెంచ్ నుంచి కూడా నవ్వులు విరిశాయి. ఈ మేరకు రాజసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్, సభా నాయకుడు పీయూష్ గోయల్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవియా, కార్మిక మంత్రి భూపేందర్ యదవ్ తదితరులందరూ నవ్వుతూ కనిపించారు. ఇదిలా ఉండగా, పియూష్ గోయల్ రాజసభ నామినేషన్ల గురించి ఆస్కార్ ఫర్ ప్రధానమంత్రి కార్యాలయం అనే పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అదికాస్తా ప్రధాన మంత్రి ఎంపిక ద్వారా రాజ్యసభ్యకు నామినేట్ అయిన వ్యక్తులకే ఆస్కార్ అవార్డు వచ్చిందన్నట్లు ఉండటంతో ఖర్గే ఇలా సైటరికల్‌గా వ్యాఖ్యానించారు. గోయల్ ఆ పోస్ట్‌లో విభిన్న రంగాల్లో విశేషమైన కృషి చేసిన వ్యక్తులను ఎంపిక చేసి మరీ రాజ్యసభకు నామినేట్ చేయడంలో మోదీ తనదైన ముద్ర వేశారని అన్నారు. అంతేగాదు 2022లో ఎగువ సభకు నామినేట్ అయిన వారిలో ఆర్ఆర్ స్క్రిప్ట్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కూడా ఉన్నారని ఆయన్ ఫేస్బుక్ పోస్ట్‌లో తెలిపారు. Oscar winning 'RRR' and The Elephant Whisperes' are India's contributions to the world. We request Modi ji not to take the credit for their win. :Congress President and LoP in Rajya Sabha Shri @kharge pic.twitter.com/43loVpofCF — Congress (@INCIndia) March 14, 2023 (చదవండి: క్షమాపణ చెప్పేదే లే! మరోసారి వాయిదాపడ్డా ఉబయ సభలు) -
క్రెడిట్‌పై అద్దె చెల్లించవచ్చు
న్యూఢిల్లీ: ప్రాపర్టీటెక్ కంపెనీ హౌసింగ్.కామ్ కస్టమర్లకు క్రెడిట్‌పై అద్దె చెల్లించే సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకు ఫిన్‌టెక్ సంస్థ నీరోతో చేతులు కలిపింది. వెరసి కస్టమర్లకు ప్రస్తుతం అద్దె చెల్లించు– తదుపరి దశలో తిరిగి చెల్లించు(రెంట్ నౌ పే లేటర్– ఆర్ఎన్పీఎల్) సేవలను ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం పలు ఫిన్‌టెక్ కంపెనీలు క్రెడిట్ కార్డుల తరహాలో ప్రస్తుత కొనుగోలుకి తరువాత చెల్లింపు(బయ్ నౌ పే లేటర్– బీపీఎన్ఎల్) సర్వీసులు అందిస్తున్న సంగతి తెలిసిందే. బెంగళూరు సంస్థ నీరోతో ఒప్పందం ద్వారా ఆస్ట్రేలియన్ కంపెనీ ఆర్ఈఏలో భాగమైన హౌసింగ్.కామ్ కస్టమర్లకు తాజాగా ఆర్ఎన్పీఎల్ సేవలను ప్రారంభించింది. దీంతో కస్టమర్లకు ఎలాంటి కన్వినెన్స్ ఫీజు లేకుండా 40 రోజుల క్రెడిట్ ద్వారా అద్దెను చెల్లించేందుకు వీలు కల్పిస్తోంది. అంతేకాకుండా అద్దె చెల్లింపులను అవసరమైతే కస్టమర్లు సులభ వాయిదా పద్ధతి(ఈఎంఐ)లోకి మార్పిడి చేసుకునేందుకు అవకాశమున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలియజేసింది. దేశీయంగా 4 శాతం ప్రజలకే క్రెడిట్ కార్డులున్నందున రెంట్ నౌ పే లేటర్ సర్వీసు వినియోగదారులకు ప్రయోజనకరంగా నిలవనున్నట్లు వివరించింది. హౌసింగ్.కామ్ ఇప్పటికే క్రెడిట్ కార్డుల ద్వారా అద్దె చెల్లింపులకు తెరతీసిన విషయం విదితమే. -
పోలీసుల అకౌంట్లోకి వచ్చిపడుతున్న కోట్ల డబ్బు...టెన్షన్లో అధికారులు
ఒక పోలీస్ అకౌంట్లో 10 కోట్లు క్రెడిట్ అయ్యాయి. దీంతో అతను ఒక్కసారిగా రాత్రికి రాత్రే కోటిశ్వరుడిగా మారిపోయాడు. ఈ ఘటన పాకిస్తాన్‌లోని కరాచీలో చోటు చేసుకుంది. ఒక పోలీస్ అధికారికి తన జీతంతో పాటుగా సుమారు రూ. 10 కోట్లు అకౌంట్లో జమ అయ్యాయి. అయితే బ్యాంకు వాళ్లు ఫోన్ చేసి చెప్పేంత వరకు తనకు ఈ విషయం తెలియలేదని సదరు పోలీసు అధికారి చెబుతున్నాడు. దీంతో అతని అకౌంట్‌ని బ్లాక్ చేసి ఈ డబ్బు ఎలా క్రెడిట్ అయ్యిందని దానిపై దర్యాప్తు ప్రారంభించారు అధికారులు. అచ్చం సదరు పోలీస్‌లానే పాక్‌లోని లర్కానా ప్రాంతంలోనిమరో ముగ్గురు పోలీస్ అధికారుల అకౌంట్లోకి కూడా రూ. 5 కోట్లు చొప్పున క్రెడిట్ అయినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఇంత మొతంలో డబ్బు ఎలా ఎక్కడ నుంచి వచ్చిందనే దానిపై అధికారులు ఆరా తీయడం ప్రారంభించారు. (చదవండి: బ్రేక్ ఇవ్వండి..ఎవరు ఇడియట్స్ అనేది తేలుద్దాం: బైడెన్ ఫైర్) -
మెరుగుపడుతున్న భారత్ కార్పొరేట్ రుణ నాణ్యత
ముంబై: భారత్ కంపెనీల రుణ నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెప్టెంబర్) మెరుగుపడిందని స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) అనుబంధ సంస్థ క్రిసిల్ తన తాజా నివేదికలో పేర్కొంది. అయితే మున్ముందు కాలంలో పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండే వీలుందని వివరించింది. 2021–22 మొదటి ఆరు నెలల కాలంలో కార్పొరేట్ క్రెడిట్ రేషియో 5.04 వద్ద ఉంటే తాజా సమీక్షా కాలంలో ఈ నిష్పత్తి 5.52కు పెరిగిందని వివరించింది. పటిష్ట క్యాష్ ఫ్లోస్, పెట్టుబడులు దీనికి కారణమని దాదాపు 6,800 కంపెనీలకు రేటింగ్ ఇచ్చే క్రిసిల్ నివేదిక వివరించింది. అయితే కొన్ని చిన్న పరిశ్రమలకు తమ అధ్యయనం వర్తించబోదని మేనేజింగ్ డైరెక్టర్ గురుప్రీత్ చౌహాత్వాలా పేర్కొన్నారు. అంతర్జాతీయ ద్రవ్యోల్బణం, కఠిన ద్రవ్య విధానం వంటి అంశాలు ఉన్నప్పటికీ, భారత్ కార్పొరేట్ పరిశ్రమ ఈ సవాళ్లను ఎదుర్కొంటుందన్న భరోసాను క్రిసిల్ వ్యక్తం చేసింది. తాను రేటింగ్ ఇస్తున్న సంస్థల్లో 80 శాతం యథాతథ పరిస్థితిని కొనసాగించగా, 569 సంస్థలను అప్‌గ్రేడ్ చేయడం జరిగిందని, 103 సంస్థలను డౌన్‌గ్రేడ్ చేసినట్లు వివరించింది. కాగా, ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య తన రేటింగ్ సంస్థల్లో 159కి అప్‌గ్రేడ్ చేసినట్లు 40 సంస్థలను డౌన్‌గ్రేడ్ చేసినట్లు తెలిపింది. ఇక్రా రేటింగ్స్ విషయంలో 250 సంస్థలు అప్గ్రేడ్కాగా, 76 సంస్థలు డౌన్‌గ్రేడ్ అయ్యాయి. అప్‌గ్రేడ్ సంస్థలు అధికంగా ఉండడం ఇక్కడ గమనార్హం. -
ఆర్థికమంత్రితో ఐఎఫ్‌సీ ఎండీ భేటీ
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో సోమవారం అంతర్జాతీయ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ) మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) మఖ్తర్ డియోప్ భేటీ అయ్యారు. భారత్‌లో రుణ అవకాశాల విస్తృతిపై వారు ఇరువురూ చర్చించినట్లు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ప్రపంచబ్యాంక్‌కు ప్రైవేటు రంగ ఫండింగ్ అనుబంధ విభాగంగా ఐఎఫ్‌సీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆర్థిక మంత్రిత్వశాఖ విడుదల చేసిన ఒక ట్వీట్ ప్రకారం, భారత్‌లో ఐఎఫ్‌సీ రుణాన్ని వచ్చే ఒకటి రెండేళ్లలో 2 నుంచి 2.5 బిలియన్ డాలర్ల మేర పెంచే అవకాశాలు ఉన్నాయని ఆర్థికమంత్రి భావిస్తున్నారు. మూడు, నాలుగు సంవత్సరాల్లో ఈ పరిమాణం 3 నుంచి 3.5 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. భారత్‌లో పెట్టుబడులకు ప్రత్యేకించి సూక్ష్మ, లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమకు (ఎంఎస్ఎంఈ) రుణ సౌలభ్యతను పెంచాలని ఐఎఫ్‌సీ భావిస్తోంది. తయారీ రంగం కేంద్రంగా ఎదగాలన్న భారత్ లక్ష్యాలని చేయూతను ఇవ్వాలన్న ఆకాంక్షను ఐఎఫ్‌సీ ఎండీ వ్యక్తం చేస్తున్నారు. సుస్థిర వృద్ధి కోసం గ్రామీణ రంగంలో ఫైనాన్సింగ్‌ను పరిశీలించడం, మహిళా పారిశ్రామికవేత్తలకు రుణాలను సమీకరించడం, వారి ఆర్థిక సామర్థ్యాన్ని మెరుగుపరడం వంటి లక్ష్యాలను సైతం ఆయన ఉద్ఘాటించారు. -
దుమారం రేపిన మోదీ వ్యాఖ్యలు... మాటల తూటలు పేల్చిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: నరేంద్రమోదీ పుట్టినరోజు పురస్కరించుకుని నమీబియా నుంచి తీసుకువచ్చిన ఎనిమిది చిరుతలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.... దేశంలో చిరుతలు అంతరించిపోయాయని, తిరిగి భారత్‌లో ప్రవేశపెట్టేలా... దశాబ్దాలుగా ఎలాంటి నిర్మాణాత్మక ప్రయత్నాలు జరగలేదంటూ వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా కాంగ్రెస్‌ను విమర్శించారు. అయితే, ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. మోదీ దగాకోరు! అంటూ మాటల తుటాలు పేల్చింది. అంతేకాదు ఇది మోదీ క్రెడిట్ కాదని, ఆయన చేసిన చారిత్రక ఘట్టానికి తామే ముందు అంకురార్పణ చేశామని తేల్చి చెప్పింది. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా చూపించింది. ఈ మేరకు 2009లో ప్రాజెక్టు చిరుత ప్రారంభించిన లేఖను కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల సీనియర్ నాయకుడు జై రామ్ రమేశ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ లేఖలో యూపీఏ హయాంలో పర్యావరణ అటవీ శాఖలను నిర్వహించిన జై రాం రమేష్ చిరుతలను తిరిగి ప్రవేశ పెట్టేందుకు వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఇండియా అధికారులను రోడ్‌మ్యాప్ సిద్ధం చేయమని కోరారు. తాను భారత్ జోడో యాత్రలో ఉండటం వల్లే ఈ లేఖను వెంటనే పోస్ట్ చేయలేకపోయానని జై రామ్ రమేశ్ వివరణ ఇచ్చారు. మెరుపు దాడికి ప్రసిద్ధి చెందిన చిరుతలు 1940లలో అంతరించుకుపోయాయి. అయితే 2012 లో యూపీఏ ప్రభుత్వం చిరుతలను తిరిగి ప్రవేశ పెట్టే ప్రణాళిక దరఖాస్తును సుప్రీం కోర్టు కొట్టివేసింది. అంతేగాదు కొంతమంది పరిరక్షకులు భారత్‌లోకి ఆఫ్రికన్ చిరుతలు దిగుమతి చేసుకోవడం అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ కమిటీ (ఐయూసీఎన్) మార్గదర్శకాలకు విరుద్ధమని వాదించారు. అయితే, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ 2017లో కోర్టులో ఈ విషయమై దరఖాస్తులు చేసింది. చిరుతలను భారత్‌లోకి ప్రవేశ పెట్టే ప్రాజెక్టు చట్టబద్ధమేనని ఐయూసీఎన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సుప్రీం కోర్టుకు తెలిపింది. దీంతో దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పిందని కాంగ్రెస్ వాదిస్తోంది. వాస్తవానికి ఇదంతా తమ పార్టీ హయాంలోనే జరిగిందని మోదీ ఘనతేమీ కాదని కాంగ్రెస్ బలంగా చెబుతోంది. This was the letter that launched Project Cheetah in 2009. Our PM is a pathological liar. I couldn’t lay my hands on this letter yesterday because of my preoccupation with the #BharatJodoYatra pic.twitter.com/3AQ18a4bSh — Jairam Ramesh (@Jairam_Ramesh) September 18, 2022 (చదవండి: చిరుతల రాకతో...భయాందోళనలతో బెంబేలెత్తుతున్న గ్రామస్తులు) -
అప్పు పథంలో ఐదు రాష్ట్రాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రతిష్టను రచ్చకీడుస్తూ.. శ్రీలంకతో పోలుస్తూ పదేపదే బురద చల్లుతున్న దుష్ట చతుష్టయానికి చెంపపెట్టులా ఆర్థిక పరిస్థితిపై ప్రపంచ బ్యాంకు నివేదికను వెల్లడించింది. లాక్డౌన్ తదనంతరం దేశంలోని 20 పెద్ద రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితులను ప్రపంచ బ్యాంకు క్షుణ్నంగా పరిశోధించి సమగ్ర నివేదిక రూపొందించింది. దేశంలో మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్ అప్పులు ప్రమాదకర స్థాయిలో లేవని ప్రపంచ బ్యాంకు పరిశోధన నివేదిక నిగ్గు తేల్చింది. కోవిడ్ కారణంగా లాక్డౌన్ నేపథ్యంలో 2020–21 తొలి త్రైమాసికంలో అన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)పై ప్రభావం పడటమే కాకుండా అప్పులు, ద్రవ్యలోటు గణనీయంగా పెరిగాయని వెల్లడించింది. సెకండ్ వేవ్‌తో ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతిన్నప్పటికీ అనంతరం పుంజుకోవడంతో చాలా రాష్ట్రాల ఆదాయాలు పెరగడంతో పాటు మూలధన వ్యయం మెరుగుపడిందని తెలిపింది. ఆదాయాలు క్షీణించినప్పటికీ ఆహార సబ్సిడీలు, పెన్షన్లు లాంటి సామాజిక భద్రత చర్యలు చేపట్టడంతో వ్యయం పెరిగి అన్ని రాష్ట్రాల రుణాలు 24 శాతం నుంచి 26 శాతానికి పెరిగాయని నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాలు అత్యధిక అప్పుల్లో ఉన్నాయని తెలిపింది. ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్ లేకపోవడం గమనార్హం. పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, బిహార్, కేరళ రాష్ట్రాల అప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. 2019, 2020, 2021 ఆగస్టు నెలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు, క్యాపిటల్ వ్యయం, బడ్జెట్ అంచనాలు, రెవెన్యూ రాబడులను ప్రపంచ బ్యాంకు విశ్లేషించింది. 2019–20లో ఆర్థిక మందగమనం కారణంగా అన్ని రాష్ట్రాలకు కేంద్రం నుంచి రావాల్సిన వాటా నిధులు తగ్గిపోయాయని నివేదిక పేర్కొంది. పుంజుకున్న ఆదాయాలు.. ఆంధ్రప్రదేశ్ సహా మిగతా రాష్ట్రాలన్నింటిలో 2019 ఆగస్టుతో పోల్చితే 2020, 2021 ఆగస్టుల్లో రెవెన్యూ రాబడులు పెరిగాయని నివేదిక తెలిపింది. చాలా రాష్ట్రాల్లో క్యాపిటల్ వ్యయం పెరిగిందని, ఏపీలో 2019 ఆగస్టుతో పోల్చి చూస్తే 2020 ఆగస్టులో క్యాపిటల్ వ్యయం బాగా పెరిగిందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో 2019 ఆగస్టుతో పోల్చితే 2021 ఆగస్టులో బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా రాబడులు మెరుగుపడ్డాయని, బడ్జెట్ అంచనాల మేరకు వ్యయం కూడా ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇకనైనా తప్పుడు సమాచారంతో రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే యత్నాలకు ఇకనైనా స్వస్తి పలకాలని ఆర్ధిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. నివేదికలో ముఖ్యాంశాలు... ► దేశంలో అత్యధికంగా పంజాబ్ అప్పుల్లో ఉంది. జీఎస్డీపీలో ఏకంగా 49.5 శాతం అప్పులున్నాయి. ► రాజస్థాన్‌కు జీఎస్డీపీలో 39.5 శాతం మేర అప్పులుండగా హిమాచల్‌ప్రదేశ్‌కు 39.7 శాతం, బిహార్‌కు 38.6 శాతం, కేరళకు 37 శాతం మేర అప్పులున్నాయి. ► ఆంధ్రప్రదేశ్‌కు జీఎస్డీపీలో 32.5 శాతం మాత్రమే అప్పులున్నాయి. ► సొంత రాబడుల్లో పంజాబ్ వడ్డీ చెల్లింపులపై అత్యధికంగా ఖర్చు చేస్తోంది. ► బిహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కేరళ, హర్యానా రాష్ట్రాలు వచ్చే ఐదేళ్లలో చెల్లించాల్సిన అప్పుల వాటా అత్యధికంగా ఉంది. చత్తీస్గడ్ వచ్చే ఐదేళ్లలో 59.2 శాతం, ఒడిశా 54.7 శాతం, హర్యానా 48.7 శాతం మేర అప్పులు చెల్లించాల్సి ఉంది. కేంద్రం అప్పులే ఎక్కువ కేంద్ర ప్రభుత్వ అప్పులు 2020–21లో ఏకంగా జీడీపీలో 61 శాతానికి చేరుకోవడం గమనార్హం. 2013– 14లో కేంద్రం అప్పులు రూ.56,69,128.48 కోట్లు కాగా 2021–22 నాటికి రూ.1,35,88,193.16 కోట్లకు పెరిగాయి. చదవండి: బతుకులు మార్చే పథకాలు పప్పుబెల్లాలా? -
ఎయిర్టెల్ ఆఫ్రికాకు సిటీ రూ.1,000 కోట్ల రుణం
ముంబై: ఎయిర్టెల్ ఆఫ్రికా 125 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1,000 కోట్లు) రుణ సదుపాయం కోసం అమెరికాకు చెందిన సిటీ బ్యాంకుతో ఒప్పందం చేసుకుంది. 14 ఆఫ్రికా దేశాల్లో ఎయిర్టెల్ ఆఫ్రికా టెలికం, మొబైల్ మనీ సేవలు అందిస్తోంది. స్థానిక కరెన్సీతోపాటు, డాలర్ మారకంలో ఈ రుణ సదుపాయం ఉంటుందని ఎయిర్టెల్ ఆఫ్రికా ప్రకటించింది. ఈ సదుపాయం 2024 సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఎయిర్టెల్ ఆఫ్రికా కార్యకలాపాలకు మద్దతుగా, నాలుగు సబ్సిడరీ కంపెనీల్లో పెట్టుబడులకు వినియోగించనున్నట్టు తెలిపింది. ఎయిర్‌టెల్‌కు చెందిన ముంబై యూనిట్ ద్వారా ఈ డీల్ చేసుకున్నట్టు ప్రకటించింది. -
‘సన్’ స్ట్రోక్స్! ఆన్లైన్ క్లాస్‌ల పేరిట గేమ్‌లకు బానిసగా...
సాక్షి, హైదరాబాద్: నగరంలోని యువకుల తల్లిదండ్రులకు ఇటీవల ‘సన్’ స్ట్రోక్స్ ఎక్కువగా తగులుతున్నాయి. ఆన్లైన్ గేమింగ్‌కు అలవాటు పడుతున్న యువత వాటిలో గెలవడానికి బానిసలుగా మారిపోతున్నాయి. దీనికోసం ఆయా కంపెనీల ట్రాప్‌లో పడి యూసీ పాయింట్లు కొంటున్నారు. వాటిని ఖరీదు చేయడానికి తల్లిదండ్రుల క్రెడిట్, డెబిట్ కార్డులు వారికి తెలియకుండా వాడేస్తున్నారు. అంబర్‌పేట ప్రాంతానికి చెందిన పదో తరగతి విద్యార్థి ఫ్రీఫైర్ గేమ్ కోసం తన తల్లి, తాతల బ్యాంకు ఖాతాల్లోని రూ.36 లక్షలు వాడిన ఉదంతం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పథకం ప్రకారం కంపెనీల వ్యవహారం.. కోవిడ్ నేపథ్యంలో దాదాపు రెండేళ్లుగా ఆన్లైన్ క్లాసులే నడుస్తున్నాయి. దీంతో దాదాపు ప్రతి విద్యార్థి చేతికి ఫోన్, ట్యాబ్‌లు వచ్చి చేరాయి. దీన్ని క్యాష్ చేసుకోవడానికి గేమింగ్ కంపెనీలు పథకం ప్రకారం వ్యవహరిస్తున్నాయి. ఆకర్షణీయమైన ప్రకటనలు, లింకుల ద్వారా తమ గేమ్స్‌ను ప్రమోట్ చేస్తున్నాయి. వీటికి ఆకర్షితులవుతున్న విద్యార్థులు వాటిని ఇన్స్టాల్ చేసుకుని ఆడటం మొదలెడుతున్నారు. ఈ గేమ్స్ అన్నీ వాటి నిర్వాహకులు రూపొందించిన ప్రత్యేక ప్రోగ్రామింగ్ ద్వారా నడుస్తుంటాయి. దీనిప్రకారం గేమ్ ఆడటం కొత్తగా ప్రారంభించిన వారి ఐపీ అడ్రస్ తదితర వివరాలను నిర్వాహకులు సంగ్రహిస్తారు. దీని ఆధారంగా తొలినాళ్లల్లో దాదాపు ప్రతి గేమ్‌లోనూ వాళ్లే గెలిచేలా చేసి బానిసలుగా మారుస్తారు. పాయింట్లతో బలపడతావంటూ... ఇలా తమ గేమ్‌కు బానిసగా మారిన వారిని ఎంపిక చేసుకునే నిర్వాహకులు అసలు కథ మొదలెడుతున్నారు. కొన్ని రోజుల పాటు వాళ్లు ఆయా గేమ్స్‌లో ఓడిపోయేలా చేస్తారు. ఆపై గేమ్‌లో నువ్వు వీక్ అయిపోయావంటూ సందేశాలు పంపి రెచ్చగొడతారు. దీంతో తాను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే భావన యువతలో కలిగిస్తారు. ఆపై అసలు కథ మొదలెట్టి.. కొన్ని రోజుల తర్వాత ఆ యూసీ పాయింట్లు ఉచితంగా ఇవ్వలేమంటూ మెలికపెడతారు. అవి కావాలంటే తమ వద్ద రిజిస్టర్ చేసుకుని, డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో చెల్లింపులు చేయాలని షరతు విధిస్తారు. అప్పటికే ఈ గేమ్స్‌కు బానిసలుగా మారుతున్న యువత తేలిగ్గా వాటి నిర్వాహకుల ట్రాప్‌లో పడిపోతున్నారు. అలా తమ తల్లిదండ్రుల కార్డులు తీసుకుని వారికి తెలియకుండా పేమెంట్లు చేస్తున్నారు. యువత అనునిత్యం రూ.2 వేల నుంచి రూ.3 వేలు ఖర్చు చేసేస్తోంది. నేరగాళ్ల పనిగా భావిస్తున్న తల్లిదండ్రులు.. ఇలా అనునిత్యం తమకు తెలియకుండా కార్డులు, ఖాతాల నుంచి చిన్న మొత్తాలు పోతుండటాన్ని తల్లిదండ్రులు తక్షణం గుర్తించలేకపోతున్నారు. కొన్ని రోజుల తర్వాత ఇవి పెద్ద మొత్తాలుగా మారిన తర్వాత తెలుసుకుంటున్నారు. ఆ పని చేసింది సైబర్ నేరగాళ్లుగా భావించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. యువకులే డబ్బు పెట్టి ఆడుతున్నారు యువకులతో పాటు యువతులూ ఇలాంటి గేమ్స్‌కు బానిసలుగా మారుతున్నారు. తల్లిదండ్రులు అప్రమత్తం కావాలి. పిల్లలు ఆన్లైన్ గేమ్స్‌కు బానిసలు కాకుండా చూసుకోవాలి. – కేవీఎం ప్రసాద్, సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ (చదవండి: అరువుపై ఎరువులు ఇవ్వం) -
మనదేశంలో రుణం..'కొందరికే' పరిమితం!
న్యూఢిల్లీ: సంపాదన విభాగంలో మొత్తం జనాభాలో సగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దాదాపు 48 కోట్ల మంది భారతీయులు 65 ఏళ్ల వయస్సు వరకు ఎటువంటి రుణ సదుపాయం పొందలేదని (క్రెడిట్ అన్ సర్వర్డ్) క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ– సిబిల్ ఒక నివేదికలో పేర్కొంది. ఇక సిబిల్ ప్రపంచ అధ్యయనంలో అదనంగా 16.4 కోట్ల మంది ’క్రెడిట్ అన్ సర్వర్డ్’’గా ఉన్నారు. 17.9 కోట్ల మంది మాత్రమే ’క్రెడిట్ సర్వ్’ కేటగిరీలో ఉన్నారు. సిబిల్ నివేదికలోని మరికొన్ని ఆసక్తికరమైన అంశాలను పరిశీలిస్తే... ►రుణగ్రహీతలు వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా ఉండేలా దేశంలో రుణ సంస్కృతిని మరింతగా పెంచేందుకు పాలసీ యంత్రాంగం ప్రత్యేక ప్రయత్నాలు చేస్తోంది. 45 కోట్లకుపైగా ఖాతాలను ప్రారంభించిన జన్ ధన్ యోజన క్రెడిట్ ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం అందిస్తోంది. ►అమెరికా విషయానికి వస్తే, పెద్దల్లో కేవలం 3 శాతం మందికి మాత్రమే క్రెడిట్ సౌలభ్యం అందలేదు. ఈ సంఖ్య కెనడాలో 7 శాతం, కొలంబియాలో 44 శాతం, దక్షిణాఫ్రికాలో 51 శాతం ఉంది. ►రుణ సదుపాయం కలిగించే విషయంలో కొన్ని కీలక అవరోధాలు ఎదురవుతున్నాయి. వినియోగదారులకు క్రెడిట్ స్కోర్, క్రెడిట్ చరిత్ర లేకపోవడం రుణ అవకాశాలను పొందడానికి ప్రతిబంధకంగా ఉంది. ఆయా వినియోగదారులకు చాలా మంది రుణదాతలు రుణాలు అందించడానికి వెనుకాడుతున్నారు. ►ఒక్కసారి రుణం తీసుకోవడం ప్రారంభమైతే, అటు తర్వాత ఈ విషయంలో ‘రెండేళ్ల పరిధిలోకి’ క్రియాశీలంగా ఉండే వారు 5 శాతం. రుణం.. మరింత విస్తృతమవ్వాలి ఇటీవలి సంవత్సరాలలో దేశవ్యాప్తంగా అన్ని స్థాయిల్లో రుణ లభ్యత పెంచే విషయంలో భారత్ గొప్ప పురోగతిని సాధించింది. అయినప్పటికీ, ప్రస్తుత వాస్తవికత రుణ వ్యవస్థను పరిశీలిస్తే, రుణం సౌలభ్యం మరింత విస్తృతం కావాలి. తమకు ఎటువంటి రుణ సదుపాయం అందడం లేదనే పెద్దల సంఖ్య తగ్గాలి’’– రాజేష్ కుమార్, సిబిల్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ -
కొంటే ఖర్సయిపోతారు..!
ఆన్లైన్ షాపింగ్. ముందు రూపాయి కట్టక్కర్లేదు. వడ్డీ కూడా లేదు. తీరిగ్గా తర్వాత ఇద్దురు. ఏంటి ఇదంతా.. అనుకుంటున్నారా..? అదే బై నౌ పే లేటర్. లేదా స్పెండ్ నౌ పే లేటర్. అమెజాన్ వంటి దిగ్గజాలు, బడా బ్యాంకుల నుంచి, చిన్న ఎన్బీఎఫ్సీ సంస్థల వరకు క్రెడిట్ ఇచ్చేందుకు బారులు తీరాయి. వినియోగం ఆధారంగా అవి అరువు ఇచ్చేస్తాయి. కాకపోతే వాడేసుకోవడమా.. లేక వేరే మార్గం చూసుకోవడమా? అన్న విచక్షణ వినియోగదారులదే. బీఎన్‌పీఎల్ రూపంలో లభించే క్రెడిట్ స్వల్ప మొత్తమే. కానీ, వీటిని సరిగ్గా నిర్వహించకపోతే తెలియకుండానే బ్యాలన్స్ కరిగిపోతుంది. 15–30 రోజుల వరకు వడ్డీ ఉండదు. మర్చిపోయారా..? అరువు ఇచ్చిన కంపెనీలకు అవకాశం ఇచ్చినట్టే. అవి తమకు నచ్చిన వడ్డీ బాదుడు షురూ చేస్తాయి. పెనాల్టీ అంటాయి. చెల్లించాల్సింది రూ.200 అయినా.. రూ.50–100 వరకు పిండేస్తాయి. కొరివితో తలగోక్కున్నట్టు కోరి క్రెడిట్ స్కోరును దెబ్బతీసుకున్నట్టు అవుతుంది. ∙ బ్యాంకు ఖాతాలో రూపాయి లేకపోయినా కొనుగోళ్లకు వీలు కల్పించేది క్రెడిట్ కార్డు. అయితే, ఇప్పటికీ దేశంలో క్రెడిట్ కార్డు విస్తరణ చాలా పరిమితంగానే ఉంది. ఇదే చక్కటి అవకాశంగా భావించి ఫిన్‌టెక్ సంస్థలు బీఎన్‌పీఎల్ రూపంలో మార్కెట్లో చొచ్చుకుపోయే క్రమంలో ఉన్నాయి. క్రెడిట్ కార్డుపై లభించేది రుణమే. బై నౌ పే లేటర్ రూపంలో వచ్చేదీ కూడా రుణమే. రెండింటిపైనా నిర్ణీత కాలం పాటు వడ్డీ ఉండదు. సారూప్యతలు అంతవరకే. కంటికి కనిపించని అంశాలు బీఎన్‌పీఎల్ సదుపాయంలో ఎన్నో ఉన్నాయి. ∙ ఇప్పుడు కొను, తర్వాత చెల్లించు (బై నౌ.. పే లేటర్/బీఎన్‌పీఎల్) చాలా మందిని ఆకర్షిస్తున్న సదుపాయం. క్రెడిట్ కార్డు మాదిరి ముందు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లపై ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ కామర్స్ సంస్థలు, ఆన్లైన్ మార్కెట్ ప్లాట్‌ఫామ్‌లతో జతకట్టి ఎన్బీఎఫ్సీ సంస్థలు ఇస్తున్న ముందస్తు రుణ సదుపాయం. దీనికి పాన్ నంబర్ ఉంటే సరిపోతుంది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల మధ్య పోటీ వల్ల పుట్టుకొచ్చిన కొత్త సాధనమే ఇది. చార్జీలు/ఫీజులు 15–30 రోజుల పాటు వడ్డీ లేని రుణ సదుపాయమే బీఎన్‌పీఎల్. ఇచ్చిన గడువులోపు చెల్లిస్తే రూపాయి అదనంగా కట్టాల్సిన పరిస్థితి ఉండదు. రుణం కనుక అశ్రద్ధ చూపినా, సకాలంలో చెల్లింపులు చేయకపోయినా తర్వాత భారాన్ని మోయాల్సి రావచ్చు. గడువు దాటితే మిగిలిన బ్యాలన్స్ మొత్తంపై 10–30 శాతం మేర వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. గడువు తర్వాత చెల్లించేవారు వడ్డీకి అదనంగా లేట్ ఫీజు కూడా కట్టాలి. కన్వినియన్స్ ఫీజు పేరుతో నెలవారీ వ్యయంపై 1–3 శాతం మధ్య వసూలు చేసే సంస్థలు కూడా ఉన్నాయి. బీఎన్‌పీఎల్ సంస్థలు ఓలా పోస్ట్‌పెయిడ్, జెస్ట్‌మనీ, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ పే లేటర్, యూని, పేటీఎం పోస్ట్‌పెయిడ్, స్లైస్, యూనికార్డ్స్ ఇలా ఎన్నో సంస్థలు బై నౌ పే లేటర్ పేరుతో క్రెడిట్‌ను ఆఫర్ చేస్తున్నాయి. రుణ సదుపాయం ఆన్లైన్లో వస్తువులు లేదా సేవల కోసం బీఎన్‌పీఎల్‌తో ఆర్డర్ చేసేయవచ్చు. నిర్ణీత కాలంలోపు వడ్డీ లేకుండా తీర్చేయాలి. ఇది అన్సెక్యూర్డ్ రుణం. దీంతో ఆన్లైన్ మార్కెట్లో ఈ సదుపాయాన్ని వినియోగించుకునే వారు పెరుగుతున్నారు. క్రెడిట్ కార్డుపై రూ.లక్షల రుణ సదుపాయం లభిస్తుంది. కానీ, బీఎన్‌పీఎల్ అలా కాదు. ఇవి చిన్న రుణాలు. ఎక్కువ శాతం రూ.2,000 నుంచి రూ.15,000 మధ్య రుణ సదుపాయం (క్రెడిట్లైన్) ఉంటుంది. స్మాల్ టికెట్ లోన్స్గా చెబుతారు. పేమెంట్ ఆప్షన్ పేజీలో బీఎన్‌పీఎల్ ఫీచర్ కనిపిస్తుంది. ఈ సదుపాయం కోసం కస్టమర్ ఆయా ప్లాట్‌ఫామ్‌లపై ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలి. ఇది ఒక్కసారి యాక్టివేట్ అయితే అది మీ క్రెడిట్ రిపోర్ట్‌లో రుణ సదుపాయంగానే ప్రతిఫలిస్తుంది. రుణ గ్రహీతలు బీఎన్‌పీఎల్ కింద పొందిన రుణ సదుపాయాన్ని ఒకే సారి తీర్చే వెసులుబాటు లేకపోతే అప్పుడు ఈఎంఐ కిందకు మార్చుకోవచ్చు. కానీ, అన్సెక్యూర్డ్ రుణం కనుక గడువులోపు తీర్చేయడమే మంచిది. లేదంటే క్రెడిట్ స్కోరుపై ప్రభావం పడుతుంది. కొన్ని సంస్థలు ఎటువంటి వడ్డీ విధించకుండా బిల్లు మొత్తాన్ని మూడు, నాలుగు నెలల సమాన వాయిదాల్లో చెల్లించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. బీఎన్‌పీఎల్ రూపంలో వచ్చే రుణాన్ని ఎన్బీఎఫ్సీలు లేదా బ్యాంకులు అందిస్తుంటాయి. ఉదాహరణకు పేటీఎం బీఎన్‌పీఎల్ అన్నది ఆదిత్య బిర్లా ఫైనాన్స్‌తో ఒప్పందంపై అందిస్తున్న సదుపాయం. అమెజాన్ బీఎన్‌పీఎల్ అన్నది అమెజాన్ ఇండియా అందిస్తున్న సదుపాయం. ఇక ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ సదుపాయాన్ని ఆ సంస్థతో ఒప్పందంపై ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు సమకూరుస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం ఇలా ఆన్లైన్ ప్లాట్‌ఫామ్/ఈకామర్స్ సంస్థ ఏదైనా కావచ్చు.. రుణ గ్రహీత, రుణదాతలను కలిపే వేదికలుగానే పనిచేస్తాయి. రుణ సదుపాయంతో వాటికి ప్రత్యక్ష సంబంధం ఉండదు. చెల్లింపుల్లో విఫలమైతే.. మొదట లేట్ ఫీజు పడుతుంది. ఫ్లిప్‌కార్ట్ అయితే తీర్చాల్సిన బ్యాలన్స్ రూ.100–500 మధ్య ఉంటే, విఫలమైన రుణగ్రహీతలకు రూ.60 చార్జీ విధిస్తోంది. రూ.5,000 అంతకుమించి మొత్తం చెల్లించడంలో విఫలమైతే అప్పుడు రూ.600 వరకు చార్జీ పడుతుంది. అమెజాన్ పే లేటర్ అయితే చెల్లించని మొత్తం రూ.200లోపు ఉంటే ఆలస్యపు రుసుం అమలు చేయడం లేదు. కానీ, పెనాల్టీ రూపంలో రూ.100–600 వరకు రాబడుతోంది. జీఎస్టీ అదనం చెల్లించాల్సి రావచ్చు. దీనికితోడు రుణం ఇచ్చిన సంస్థ వసూలుకు చర్యలు ప్రారంభించొచ్చు. రుణ గ్రహీత వివరాలను అవి క్రెడిట్ బ్యూరోలకు పంపిస్తాయి. ఇది క్రెడిట్ స్కోరును ప్రభావితం చేస్తుంది. దీంతో భవిష్యత్తు రుణాలు మరింత భారంగా మారతాయి. క్రెడిట్ డీలింక్వెన్సీగా క్రెడిట్ బ్యూరోలకు రుణ సంస్థలు సమాచారం ఇస్తాయి. కనీస బ్యాలన్స్ చెల్లించి మిగిలిన రుణాన్ని క్యారీ ఫార్వార్డ్ చేసుకోవచ్చు. అయినప్పటికీ అది కూడా క్రెడిట్ స్కోరును ప్రభావితం చేస్తుందని గుర్తుంచుకోవాలి. కస్టమర్ రిజిస్టర్ చేసుకున్న, వినియోగించుకున్న ప్రతీ బీఎన్‌పీఎల్ కూడా ఒక రుణం కింద వారి క్రెడిట్ రిపోర్ట్‌లో చేరుతుంది. కొద్ది బ్యాలన్స్ కోసం బీఎన్పీఎల్ను వాడేసుకుని మర్చిపోయారనుకోండి. ఇలా ఒకటికి మించిన రుణ సదుపాయాలు అన్నీ కలసి తలనొప్పిగా మారొచ్చు. క్రెడిట్ స్కోరు క్షీణిస్తుంది. దీనికంటే క్రెడిట్‌కార్డు మెరుగైన సాధనం అవుతుంది. 30–45 రోజుల క్రెడిట్ పీరియడ్‌తో వస్తుంది. కావాలంటే ఈఎంఐ కిందకు బ్యాలన్స్‌ను మార్చుకోవచ్చు. రుణ పరిమితి అధికంగా ఉంటుంది. యాక్టివేట్ అయినట్టే.. శ్రీరామ్ ఏప్రిల్ నెల క్రెడిట్ స్కోరు క్షీణించడాన్ని గమనించాడు. కారణం ఏంటా అని క్రెడిట్ రిపోర్ట్‌ను పరిశీలించగా.. ఆశ్చర్యపోవడం అతని వంతు అయింది. ‘‘క్యాపిటల్ ఫ్లోట్, కరూర్ వైశ్యా బ్యాంకు (కేవీబీ) నుంచి రెండు రుణాలు అతడి రిపోర్ట్‌లో యాక్టివ్‌గా కనిపించాయి. ఆయా సంస్థల నుంచి శ్రీరామ్ రుణాలు తీసుకోలేదు. దాంతో అవి ఎందుకు తన రిపోర్ట్‌లో వచ్చాయో మొదట అర్థం కాలేదు. క్రెడిట్ కార్డు తప్పించి అతడి పేరిట మరే రుణం లేదు. ఈ రెండూ బీఎన్‌పీఎల్ రుణాలని అతడికి తర్వాత తెలిసింది. అమెజాన్ పే లేటర్ సదుపాయం కోసం ఒకటి రెండు సార్లు అతడు లాగిన్ అయ్యాడు కానీ, బ్యాంకు ఖాతాను లింక్ చేయలేదు. అయినా కానీ, క్రెడిట్ సదుపాయాన్ని యాక్టివేస్ చేసేసింది సదరు సంస్థ. ఇది శ్రీరామ్ ఒక్కడి విషయంలోనే కాదు. చాలా మందికి ఎదురవుతున్న అనుభవం. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాలపై ప్రస్తావిస్తున్నారు. తమ తరఫున బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి రుణ సదుపాయాన్ని పలు ప్లాట్‌ఫామ్‌లు పొందుతున్నట్టు ఆరోపిస్తున్నారు. తమ అనుమతి లేకుండా రుణ సదుపాయాన్ని పొందినట్టు చేస్తున్న ఆరోపణ నిజం కాదు. ‘‘వినియోగదారులు తాము క్రెడిట్లైన్ కోసం సైనప్ చేసుకున్నామే కానీ, రుణం కోసం కాదని భావిస్తుంటారు. క్రెడిట్లైన్ అన్నది ఒక రుణ పరిమితి. వినియోగదారులు దీన్ని వినియోగించుకోవచ్చు. వినియోగించుకోకపోవచ్చు. కానీ, దీన్ని బుక్స్‌లో రుణంగానే పేర్కొంటారు’’ అని ‘యూని’ సంస్థ సీఈవో, వ్యవస్థాపకుడు నితిన్ గుప్తా తెలిపారు. అందుకే వీటిని క్రెడిట్ నివేదికల్లో పేర్కొనడం జరుగుతుందన్నారు. ఆయా అంశాల నేపథ్యంలో ఈ కొత్త వ్యవస్థ పట్ల తస్మాత్ జాగ్రత్త. -
అకడమిక్ బ్యాంకు క్రెడిట్.. విద్యార్థికి మేలే గానీ...
ఇటీవల విశ్వవిద్యాలయాల నిధుల జారీ సంస్థ అయిన యూజీసీ నూతన జాతీయ విద్యా విధానంలో అకడమిక్ బ్యాంకు క్రెడిట్ (ఏబీసీ)లను ప్రారంభించాల్సిందిగా ఆదే శాలు జారీ చేసింది. అకడమిక్ బ్యాంకు క్రెడిట్ అంటే ప్రతి విద్యార్థికీ ఒక విద్యా నిధిని ఏర్పాటు చేయడం అన్నమాట. దేశంలోని ప్రతి విద్యార్థికీ ఏబీసీ పోర్టల్ ద్వారా అతను పూర్తిచేసిన వివిధ కోర్సుల మార్కులు, గ్రేడ్, ర్యాంకులను నిక్షిప్తం చేయడం జరుగుతుంది. ఐదేళ్ళపాటు భద్రంగా దాచిన ఈ మార్కులు, గ్రేడ్లను విద్యార్థి తదనంతర కాలంలో తిరిగి చదువు కొనసాగించాలన్నా, వేరే ప్రదేశానికి వెళ్ళి అక్కడ తన చదువును సాగించాలన్నా... తిరిగి వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ ఏబీసీల వల్ల ప్రపంచంలో ఎక్కడైనా... విద్యార్థి సంపాదించిన కోర్సు సర్టిఫికెట్లకు గుర్తింపు ఇవ్వడం అనివార్యం అవుతుంది. ఇప్పటి వరకు కొన్ని విద్యా సంస్థలు లేదా యూనివర్సిటీలు జారీచేసిన సర్టిఫికెట్లకు కొన్నిచోట్ల గుర్తింపు లభించడం లేదు. ఏబీసీల్లో స్టూడెంట్ విద్యాపరమైన అన్ని విష యాలనూ నిక్షిప్తం చేసుకుంటే ఈ ఇబ్బంది నుంచి బయటపడవచ్చు. మరో ప్రయోజనం ఏమిటంటే... ఏబీసీ పోర్టల్‌కు దేశంలోని ఉన్నత విద్యా సంస్థలన్నీ అనుసంధానమై ఉంటాయి. కాబట్టి ఒక విద్యార్థి ఒక విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందినా మరొక విశ్వవిద్యాలయంలో మరొక కోర్సు చదివే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒక విద్యార్థి బొంబాయిలోని కళాశాలలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదువుతుండగా అతనికి ఇష్టమైన కృత్రిమ మేధ అనే ఐచ్ఛిక కోర్సు ఆ కళాశాలలో బోధించనట్లయితే... అతను వేరొక ప్రదేశంలోని వేరొక కళాశాల నుండి ఆ కోర్సు చేసే వెసులు బాటు ఉంటుంది. భారత ప్రభుత్వం అందిస్తున్న ‘స్వయం’, ఎన్పీటీఈఎల్ అందిస్తున్న అంతర్జాతీయ గుర్తింపు పొందిన కోర్సులూ, మైక్రోసాఫ్ట్ వంటి గుర్తింపు పొందిన సంస్థలు అందించే కోర్సులను పూర్తి చేసి వాటి ద్వారా లభించిన క్రెడిట్లను విద్యా నిధిలో దాచుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాలలోని కళాశాలలో చేరిన విద్యార్థులు పట్టణ ప్రాంతాల్లోని పేరున్న కళాశాలలోని కోర్సులు చదివే అవకాశం ఇక నుండి ఏర్పడుతుంది. అంతేకాక ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీలు, ఐఐఎంలలోని అత్యంత ప్రతిభావంతమైన అధ్యాపకుల దగ్గర విద్యాభ్యాసం చేసే అవకాశం ఏర్పడనుంది. అయితే ఇవన్నీ కూడా చెప్పుకోడానికి చాలా అందంగా ఉన్నాయి, కానీ ఆచరణలో మాత్రం ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. ఏబీసీ పోర్టల్ ద్వారా కోర్సులను అందించే విద్యాసంస్థలు తప్పనిసరిగా నాక్ ఏ గ్రేడ్ పొంది ఉండాలనే నిబంధనను ఒకటి విధించడం జరిగింది. కానీ నేడు దేశంలోని అనేక విద్యా సంస్థలు నాణ్యత ప్రమాణాలను పాటించనప్పటికీ నాక్ ‘ఏ’ గ్రేడు రావడం మనమందరం చూస్తున్నాం. ఏబీసీ విధానం ప్రకారం నాక్ ‘ఏ’ గ్రేడ్ పొందిన ఒక నాసిరకం విద్యాసంస్థ నుండి కోర్సు పూర్తి చేసిన విద్యార్థి అదే కోర్సు ఐఐటీ వంటి సంస్థల్లో పూర్తి చేసిన విద్యార్ధితో సమానంగా గుర్తింపు పొందుతాడు. ఇది ఎంతవరకు న్యాయం? ఒకే కోర్సును ఐఐటీ వంటి ఒక ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థ, ఒక సాధారణ ప్రాంతీయ కళాశాల విద్యార్థులకు అందుబాటులో ఉంచినప్పుడు సహజం గానే విద్యార్థులు అందరూ కూడా ప్రతిష్ఠాత్మక సంస్థలో చదవటానికి ఉత్సాహం చూపిస్తారు. ప్రాంతీయ విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్య నానాటికీ తగ్గిపోవడం వల్ల ఉపాధ్యాయుల సంఖ్య కూడా తగ్గి బోధనలో నాణ్యత కూడా క్షీణిస్తుంది. ఇందువల్ల చాలా విద్యా సంస్థలు మూతపడే ప్రమాదం కూడా లేకపోలేదు. అందుకే యూజీసీ అకడమిక్ బ్యాంక్ క్రెడిట్ల ఏర్పాటు నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి. - ఈదర శ్రీనివాసరెడ్డి సామాజిక, ఆర్థిక విశ్లేషకులు -
పొరపాటుగా అకౌంట్లో రూ.2 కోట్లు.. వ్యక్తి ఏం చేశాడంటే..
సాక్షి, వైరా(ఖమ్మం) : ఓ వ్యక్తి ఖాతాలో పొరపాటుగా రూ.2 కోట్ల నగదు జమ కాగా.. తిరిగి జమ చేసిన కంపెనీకి అప్పగించిన వైనమిది. వివరాలిలా ఉన్నాయి. వైరాకు చెందిన గంధం వెంకటేశ్వర్లు ఖాతాలో ఈనెల 11న రూ.2 కోట్లు జమ అయినట్లు సెల్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో ఆయన ఏటీఎం సెంటర్‌కు వెళ్లి చూడగా ఖాతాలో రూ.2కోట్లు జమ అయి ఉన్నాయి. కాగా, వెంకటేశ్వర్లు వైరా తహసీల్ ఎదుట నిర్మించిన భవనంలో సాబూ ఆటో జోన్ కంపెనీ(అశోక్ లేలాండ్ కంపెనీ) డీలర్ కార్యాలయాన్ని ఏర్పాటుచేశాడు. నెలనెలా సదరు డీలర్ వెంకటేశ్వర్లుకు ఇంటి అద్దెను బ్యాంకు అకౌంట్లో జమ చేసేవాడు. ఈక్రమంలోనే పొరపాటున కంపెనీకి చెల్లించాల్సిన రూ.2కోట్లను ఈయన ఖాతాలో జమ చేశారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన కంపెనీ జీఎం శేషాచారి వైరాకు చేరుకోగా.. అప్పటికే వెంకటేశ్వర్లు డీలర్‌తో చర్చిస్తున్నాడు. దీంతో మంగళవారం ఖమ్మంలోని రోటరీనగర్ ఎస్బీఐ శాఖ ద్వారా ప్రతి నిధులకు రూ.2కోట్ల చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లును కంపెనీ ప్రతినిధులు, బ్యాంకు అధికారులు అభినందించారు. -
మహిళ అకౌంట్లో పొరపాటున రూ. 7.7 కోట్లు జమ.. దొంగతనం కేసు!
యూకే: ఓ మహిళ అకౌంటుకు పొరబాటున ఏకంగా 7.7 కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. ఐతే జమ చేసిన సంస్థ పొరపాటున ఈ తప్పు చేసినప్పటికీ సదరు మహిళ పిర్యాదు చేసేంత వరకూ దానిని గమనించలేదట. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. యూకేకు చెందిన మహిళ అకౌంటుకు ఆగస్టు 2020న హర్ మెజెస్టీస్ రెవెన్యూ అండ్ కస్టమ్స్ (హెచ్‌ఎమ్‌ఆర్సీ) నుంచి 7,74,839 పౌండ్లు (సుమారు 7.7 కోట్ల రూపాయలు) జమ అయ్యాయి. అంతేకాదు ఈ మిస్టరీ డిపాజిట్ నుంచి అప్పటికే 20 వేల పౌండ్లు ఖర్చు చేసింది కూడా. ఐతే ఖర్చుచేసిన మొత్తాన్ని చెల్లించే స్థితిలో ప్రస్తుతం ఆమె లేదు. తర్వాత అకౌంటును చెక్ చేసుకున్న సదరు మహిళ మిస్టరీ డిపాజిట్ గురించి తీవ్ర ఆందోళనకు గురైంది. నిజానికి ఈ విధమైన పొరబాట్లు యూకేలో సెక్షన్ 24ఎ దొంగతనం చట్టం 1968 ప్రకారం నేరంగా పరిగణించబడుతుంది. పొరపాటున జమ అయిన మొత్తాన్ని సంబంధిత వ్యక్తులకు చెల్లించవల్సిన బాధ్యత అకౌంటుదారులే నిర్వర్తించాలి. చదవండి: ఆ మూడే ఒమిక్రాన్ ప్రధాన లక్షణాలు..! వీటిని గుర్తించిన వెంటనే.. ఐతే నవంబర్ 2020లో పన్ను చెల్లించినప్పుడు హెచ్‌ఎమ్‌ఆర్సీ సిబ్బంది తమ తప్పును గమనిస్తారని మహిళ భావించింది. కానీ అలా జరగలేదు. డబ్బు ఆమె ఖాతాకు మాత్రమే కేటాయించబడినందున, ఆమె ముందుకు రాకపోతే అది ఎప్పటికీ గుర్తించబడకపోవచ్చు. దీంతో ఆమె ఫోను ద్వారా హెచ్ఎమ్ఆర్సీని సంప్రదించి పొరపాటును గుర్తుచేసింది. పార్శిల్ కస్టమ్స్ డ్యూటీ రాయితీని చెల్లించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సిబ్బంది పొరపాటున 23.39 పౌండ్లకు బదులు అధికమొత్తాన్ని జమ చేసినట్లు హెచ్‌ఎమ్‌ఆర్సీ ఎట్టకేలకు కనుగొంది. దీని గురించి హెచ్‌ఎంఆర్‌సి ప్రతినిధి మాట్లాడుతూ.. ‘అసౌకర్యానికి చింతిస్తున్నాము. చెల్లింపును తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తాం. ఐతే ఇంత పెద్ద మొత్తం పొరబాటున క్రెడిట్ అవ్వడం ఇంతవరకూ జరగలేద’ని మీడియాకు తెలిపారు. దాదాపుగా 15 నెలల తర్వాత ఈ విషయం తాజాగా వెలుగులోకొచ్చింది. చదవండి: కోట్ల విలువచేసే ఇంటికి నిప్పంటించాడు..ఎందుకో తెలుసా? -
రుణాలు @ రూ.63,574 కోట్లు
న్యూఢిల్లీ: భారత్ బ్యాంకింగ్ ‘క్రెడిట్ అవుట్‌రీచ్’ కార్యక్రమం కింద కేవలం పక్షం రోజుల్లో దాదాపు 13.84 లక్షల మంది రుణ గ్రహీతలకు రూ.63,574 కోట్ల రుణాలను అందజేసిందని ఆర్థికమంత్రి నిర్మాలా సీతారామన్ ఒక ట్వీట్లో తెలిపారు. దేశ వ్యాప్తంగా అక్టోబర్ 16వ తేదీన ఈ కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం కింద, బ్యాంకులు నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం అర్హులైన రుణగ్రహీతలకు రుణాలను మంజూరు చేయడానికి దేశంలోని వివిధ ప్రాంతాలలో దాదాపు 10,580 శిబిరాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనితోపాటు పలు బ్యాంకులు రాయితీ వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు మాఫీ వంటి పండుగ ఆఫర్లను ప్రకటించాయి. ‘ఆగస్టులో ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా, ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ఆర్థిక వృద్ధి పునరుద్ధరణకు మద్దతును అందించే క్రమంలో అక్టోబర్‌లో క్రెడిట్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్‌ను నిర్వహించాలని బ్యాంకులకు సూచించారు. దీనికి అనుగుణంగా, బ్యాంకులు జిల్లాల వారీగా, రంగాల వారీగా రుణ ఔట్రీచ్ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తున్నాయి‘ అని ఆర్థిక మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. బ్యాంకులు–నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ), ఫిన్‌టెక్ సెక్టార్ల మధ్య సహ–రుణ ఏర్పాట్ల ద్వారా కేంద్రం క్రెడిట్ అవుట్‌రీచ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మంచి స్పందన వివిధ కేంద్ర ప్రభుత్వ రుణ గ్యారెంటీ పథకాల కింద మంజూరు చేసిన, పంపిణీ చేసిన నిధుల పరిమాణంకంటే క్రెడిట్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్ కింద జారీ అయిన రుణాలు అధికంగా ఉండడం గమనార్హం. ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, దాదాపు 3.2 లక్షల మంది లబ్ధిదారులకు రూ.21,687.23 కోట్ల వ్యాపార రుణాలు మంజూరు చేయగా, 59,090 మంది రుణగ్రహీతలకు రూ.4,560.39 కోట్ల విలువైన వాహన రుణాలు మంజూరయ్యాయి. 41,226 మంది రుణగ్రహీతలకు రూ.8,994.25 కోట్ల విలువైన గృహ రుణాలు మంజూరయ్యాయి. ఏడు లక్షలకు మందికిపైగా రైతులకు రూ.16,734.62 కోట్ల వ్యవసాయ రుణాలు మంజూరయ్యాయి. గతంలో ఇలా... 2019 అక్టోబర్ – 2021 మార్చి మధ్య ఇలాంటి అవుట్‌రీచ్ కార్యక్రమాలను బ్యాంకులు నిర్వహించాయి. తద్వారా ఆర్ఏఎం సెక్టార్ (రిటైల్, వ్యవసాయం, లఘు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు) అన్ని రకాల రుణ అవసరాలను నెరవేర్చాయి. అప్పట్లో ఈ కార్యక్రమం కింద రూ.4.94 లక్షల కోట్లు పంపిణీ చేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఈ పండుగ సీజన్లో కూడా చిన్న రుణగ్రహీతలకు సరసమైన వడ్డీ రేట్లలో భారీ ఎత్తున ఈ కార్యక్రమం కింద రుణాలను అందజేయాలని కేంద్రం నిర్దేశిస్తోంది. బ్యాంకింగ్‌కు ఇందుకు తగిన సూచనలు అందాయి. -
‘రెండు లక్షల మందికి రుణాలు ఇచ్చాం’
న్యూఢిల్లీ: భారత్ బ్యాంకింగ్ ‘క్రెడిట్ అవుట్‌రీచ్’ కార్యక్రమం కింద దాదాపు 2 లక్షల మంది రుణ గ్రహీతలకు రూ.11,168 కోట్ల రుణాలను అందజేసిందని ఆర్థికమంత్రి నిర్మాలా సీతారామన్ తెలిపారు. ఈ కార్యక్రమం కింద, బ్యాంకులు నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం అర్హులైన రుణగ్రహీతలకు రుణాలను మంజూరు చేయడానికి దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనితోపాటు పలు బ్యాంకులు రాయితీ వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు మాఫీ వంటి పండుగ ఆఫర్లను ప్రకటించాయి. ‘ఆగస్టులో ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా, ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ఆర్థిక వృద్ధి పునరుద్ధరణకు మద్దతును అందించే క్రమంలో అక్టోబర్‌లో క్రెడిట్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్‌ను నిర్వహించాలని బ్యాంకులకు సూచించారు. దీనికి అనుగుణంగా, బ్యాంకులు జిల్లాల వారీగా, రంగాల వారీగా రుణ ఔట్రీచ్ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తున్నాయి‘ అని ఆర్థిక మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. బ్యాంకులు–నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ), ఫిన్‌టెక్ సెక్టార్ల మధ్య సహ–రుణ ఏర్పాట్ల ద్వారా కేంద్రం క్రెడిట్ అవుట్‌రీచ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మంచి స్పందన వివిధ కేంద్ర ప్రభుత్వ రుణ గ్యారెంటీ పథకాల కింద మంజూరు చేసిన, పంపిణీ చేసిన నిధుల పరిమాణంకంటే క్రెడిట్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్ కింద జారీ అయిన రుణాలు అధికంగా ఉండడం గమనార్హం. ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, దాదాపు లక్ష మంది లబ్ధిదారులకు రూ.6,268 కోట్ల వ్యాపార రుణాలు మంజూరు చేయగా, 5,058 మంది రుణగ్రహీతలకు రూ.448 కోట్ల విలువైన వాహన రుణాలు మంజూరయ్యాయి. 2021 అక్టోబర్ 20 నాటికి 3,401 మంది రుణగ్రహీతలకు రూ.762 కోట్ల విలువైన గృహ రుణాలు మంజూరయ్యాయి. 2019 అక్టోబర్ – 2021 మార్చి మధ్య ఇలాంటి అవుట్‌రీచ్ కార్యక్రమాలను బ్యాంకులు నిర్వహించాయి. తద్వారా ఆర్ఏఎం సెక్టార్ (రిటైల్, వ్యవసాయం, లఘు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు) అన్ని రకాల రుణ అవసరాలను నెరవేర్చాయి. అప్పట్లో ఈ కార్యక్రమం కింద రూ.4.94 లక్షల కోట్లు పంపిణీ చేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఈ పండుగ సీజన్లో కూడా చిన్న రుణగ్రహీతలకు సరసమైన వడ్డీ రేట్లలో భారీ ఎత్తున ఈ కార్యక్రమం కింద రుణాలను అందజేయాలని కేంద్రం నిర్దేశిస్తోంది.