
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదిపై దుమ్ముగూడెం ఆనకట్టకు దిగువన నిర్మించనున్న సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణానికి రూ.3,426.25 కోట్ల రుణం తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. రాష్ట్ర జలవనరుల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఈ రుణాలు తీసుకునేలా ఆమోదించింది. గతంలోనే ఈ ప్రాజెక్టు రుణాలకు ఓకే చెప్పిన ప్రభుత్వం.. తాజాగా సవరణ ఉత్తర్వులు జారీచేసింది. 37 టీఎంసీల నిల్వ, 320 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు రూ.3,481 కోట్లతో గతేడాది పరిపాలనా అనుమతులిచ్చింది.
ఈ ప్రాజెక్టు టెండర్లను ఎల్‌అండ్‌టీ సంస్థ దక్కించుకోగా పనులు ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నారు. అయితే, ఈ ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం నుంచి ఎలాంటి అనుమతులు అవసరమున్నా.. తీసుకోవాలని.. ఒకవేళ అనుమతిలేని కారణంగా పనులు నిలిపివేస్తే.. రుణాన్ని బేషరతుగా వెన క్కి తీసుకుంటామని పీఎఫ్‌సీ తన పేర్కొంది. ఇటీవల కేంద్రం విడుదల చేసిన గెజిట్‌లో సీతమ్మసాగర్‌ను అనుమతి లేని ప్రాజెక్టుగా తెలిపింది. ఆరు నెలల్లోగా అనుమతులు తీసుకోవాలని అందులో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పీఎఫ్‌సీ ఈ నిబంధనలను పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment