రైతులకు నేడు పంట నష్టపరిహారం జమ  | Crop Compensation Credited To Farmers By AP Government | Sakshi
Sakshi News home page

రైతులకు నేడు పంట నష్టపరిహారం జమ 

Published Fri, Apr 24 2020 4:42 AM | Last Updated on Fri, Apr 24 2020 4:42 AM

Crop Compensation Credited To Farmers By AP Government - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గతేడాది సెప్టెం బర్‌ నుంచి ఈ ఏడాది జనవరి వరకు వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన 67,874 మంది రైతులకు పెట్టుబడి రాయితీ కింద రూ. 54.52 కోట్ల పంట నష్టపరిహారాన్ని శుక్రవారం చెల్లించనున్నట్టు  వ్యవసాయ శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌ కుమార్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పంట నష్టపోయిన రైతుల జాబితాలో పేర్లున్న వారి ఖాతాలకు నగదును జమ అవుతుంది. ఆధార్‌ అనుసంధానమైన రైతుల బ్యాంకు ఖాతాలకు ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌ఫర్‌ పద్ధతిన నగదు జమ అవుతుంది. నగదు జమ అయిన తర్వాత రైతుల పేర్లను గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement