Farmers bank account
-
గంగమ్మ దత్తత తీసుకుంది
వారణాసి: గంగా మాత తనను దత్తత తీసుకున్నట్లే కనపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా ఎన్నికయ్యాక మోదీ తొలిసారిగా మంగళవారం వారణాసిలో పర్యటించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 17వ విడత రూ.20,000 కోట్లను 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో జమచేశారు. మెహందీగంజ్‌లో పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్‌లో మాట్లాడుతూ ‘వారణాసి ప్రజలు మూడోసారి నన్ను ఎంపీగానే కాదు ప్రధానిగానూ ఎన్నుకున్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఇదివరకెప్పుడూ చూడని తీర్పునిచ్చారు.చరిత్ర సృష్టించారు’ అని మోదీ పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వ తొలి నిర్ణయం రైతులకు, పేదలకు సంబంధించినదని అన్నారు. వికసిత్ భారత్‌కు.. రైతులు, మహిళలు, యువత, పేదలు గట్టి మూలస్తంభాలుగా తాను పరిగణిస్తానన్నారు. ’విశ్వనాథుడు, గంగా మాత ఆశీస్సులు, కాశీ ప్రజల ఆపార ప్రేమతో మూడోసారి దేశానికి ప్రధాన సేవకుడిని అయ్యే భాగ్యం నాకు దక్కింది. వరుసగా మూడోసారి నన్ను తమ ప్రతినిధిగా ఎన్నుకొని కాశీ ప్రజలు నన్ను ఆశీర్వదించారు.ఇప్పుడు గంగా మాత కూడా నన్ను దత్తత తీసుకున్నట్లే కనపడుతోంది. నేనిక్కడి వాడిని అయిపోయాను’ అని మోదీ అన్నారు. ప్రజాస్వామ్య దేశాల్లో ప్రభుత్వాలు వరుసగా మూడోసారి ఎన్నికకావడం అరుదని, భారత్ ప్రజలు దీన్ని చేసి చూపించారని ప్రధాని అన్నారు. భారత్‌లో 60 ఏళ్ల తర్వాత తమ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించిందన్నారు. ‘యువత ఆకాంక్షలు, ప్రజల కలలు ఎక్కువగా ఉన్న భారత్ లాంటి దేశంలో 10 ఏళ్ల పాలన తర్వాత కూడా మరో అవకాశం రావడం ఘన విజయం. ప్రజల విశ్వాసానికి ప్రతీక’ అని మోదీ అన్నారు.ప్రతి డైనింగ్ టేబుల్‌పై మన ఆహార ఉత్పత్తులు ఉండాలి ప్రపంచవ్యాప్తంగా ప్రతి డైనింగ్ టేబుల్‌పై మన ఆహార ఉత్పత్తులు ఉండాలని తాను కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీ రైతులనుద్దేశించి అన్నారు. ‘ప్రపంచ మార్కెట్ గురించి ఆలోచించాలి. పప్పులు, నూనె గింజల ఉత్పత్తిలో స్వయంసమృద్ధిని సాధించాలి. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిలో అగ్రగామిగా ఎదగాలి. బనారస్ లంగ్డా మామిడి, జౌన్పూర్ రాడిష్ రకం, గాజిపూర్ లేడీ ఫింగర్ రకం.. తదితరాలు నేడు విదేశీ మార్కెట్లకు చేరుతున్నాయి. ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి చొరవతో, జిల్లా స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తుల హబ్‌ల ఏర్పాటుతో ఎగుమతులు పెరుగుతున్నాయి. ప్రపంచ ప్యాకేజ్డ్ ఫుడ్ మార్కెట్లో భారత్‌ను మనమిప్పుడు కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలి’ అని మోదీ పేర్కొన్నారు. -
పుట్టపర్తి: వైఎస్సార్ రైతు భరోసా సీఎం జగన్ బహిరంగ సభ (ఫొటోలు)
-
మీకు మంచి జరిగి ఉంటే మీరే సైనికులుగా నిలబడండి: సీఎం జగన్
Updates 12:40PM, Nov 7, 2023 ►రైతు భరోసా నిధులను బటన్ నొక్కి విడుదల చేసిన సీఎం జగన్ 11:50AM, Nov 7, 2023 వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమంలో సీఎం జగన్ ప్రసంగంఅ ►అక్క చెల్లెమ్మల మంచి కోసం అమ్మ ఒడి, ఆసరా, చేయూత, సున్నావడ్డీ పథకాలు అందిస్తున్నాం ►అబద్ధాలు, మోసాలు చేసేందుకు పెద్దపెద్ద మాటలు చెబుతారు ►మోసాలు, అబద్ధాలను నమ్మకండి ►ఈ నాలుగేళ్లలో మీ ఇంట్లో మంచి జరిగింది.. లేదా మీరే చూడాలి ►గెలిచేందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 సపోర్టు అవసరం లేదు ►మీ బిడ్డకు ఎల్లో మీడియా అండదండలు లేవు ►మీ బిడ్డ నమ్ముకుంది మిమ్మల్నే ►మీకు మంచి జరిగి ఉంటే మీరే సైనికులుగా నిలబడండి ►ఒక్క రైతు భరోసా ద్వారానే రూ. 33వేల 210 కోట్లు అందించాం ►రైతులకు అండగా నిలిచేందుకుందుకు రూ. 1లక్ష 73 వేల కోట్లు ఖర్చు చేశాం ►చంద్రబాబుకు అధికారం తాను తన గజదొంగల ముఠా కోసమే ►పేదలు, అవ్వాతాతలు, నిరుద్యోగుల కోసం చంద్రబాబు ఆలోచన చేయడం లేదు ►చంద్రబాబుకు దోచుకోవడం, దాచుకోవడం తెలుసు ►చంద్రబాబు పేరు చెబితే స్కామ్‌లే గుర్తుకొస్తాయి ►రాష్ట్రాన్ని దోచుకునేందుకు చంద్రబాబుకు అధికారం కావాలి ►బాబు హయాంలో ఫైబర్ గ్రిడ్, ఇన్నర్‌రింగ్ రోడ్డు, స్కిల్ డెవలప్మెంట్ ఇలా అన్నీ చంద్రబాబు హయాంలో స్కామ్‌లే ►మన ప్రభుత్వంలో ఇప్పటికే రూ. 2 లక్షల 42 వేల కోట్లు అక్క చెల్లెమ్మలకు అందించాం ►చంద్రబాబు హయాంలో ఈ డబ్బంతా ఎవరి జేజుల్లోకి వెళ్లింది ►చంద్రబాబు హయాంలో మన పిల్లల చదువులు, బడులు ఎందుకు మారలేదు ►ఇంటి వద్దకే వైద్య సేవలు అందేలా ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్ కార్యక్రమాలు తీసుకొచ్చాం ►ఆరోగ్యశ్రీని పరిధిని 3,300 ప్రొసీజర్లకు పెంచాం ►ఏ పేదవాడు వైద్యానికి అప్పులు చేయకూడదన్నదే మా లక్ష్యం ►ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మల కోసం దిశయాప్ తీసుకొచ్చాం ►గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసులను ఏర్పాటు చేశాం ►అక్క చెల్లెమ్మల మంచి కోసం అమ్మ ఒడి, ఆసరా, చేయూత, సున్నావడ్డీ పథకాలు అందిస్తున్నాం ►ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలున్న గిరిజన రైతున్నలకు రైతు భరోసా అందించాం ►పంట సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ అందిస్తున్నాం ►గడిచిన నాలుగేళ్లలో రూ. 60 వేల కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేశాం ►సున్నా వడ్డీకి నిజమైన అర్థం చెబుతూ రైతన్నకి భరోసా కల్పిస్తున్నాం ►గతంలో సున్నా వడ్డీ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం జరిగింది ►చంద్రబాబు హయాంలో హెరిటేజ్ కంపెనీకి లాభాలు పెరిగాయి ►రైతులకు మంచి చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు ఎందుకు రాలేదు..? ►మీ బిడ్డ ప్రభుత్వంలో పుష్కలంగా వర్షాలు పడ్డాయి ►గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా..? ►బాబు ప్రభుత్వంలో వ్యవసాయానికి 7 గంటల కరెంట్ కూడా ఇవ్వలేకపోయారు ►మనసున్న ప్రభుత్వానికి మనసులేని ప్రభుత్వానికి తేడా గమనించండి ►ఈ-క్రాప్ ద్వారా ప్రతి రైతుకు మంచి జరిగేలా చేస్తున్నాం ►ప్రతి గ్రామం్లో నేడు ఆర్బీకే కేంద్రాలు పని చేస్తున్నాయి ►ఏటా రూ. 13, 500 రైతు భరోసా సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం ►రూ. 1700 కోట్లతో ఫీడర్ల సామర్థ్యం కూడా మన ప్రభుత్వంలోనే పెంచాం ►ఈ నాలుగేళ్లలో రూ, 7,800 కోట్ల బీమా అందించాం ►చంద్రబాబు హయాంలో వరుసగా ఐదేళ్లు కరువే ►దేవుడి దయతో గత నాలుగేళ్లుగా కరువు మాటేలేదు ►14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు రైతులకు చేసిందేమీ లేదు ►గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా చూడాలి ►ఎందుకు మీ బిడ్డ జగన్‌లా గత ప్రభుత్వం సంక్షేమం అందించలేకపోయింది? ►కేంద్రం పీఎం కిసాన్‌డబ్బులు కూడా ఈనెలలోనే వస్తాయి ►పీఎం కిసాన్ నిధులు కూడా విడుదల చేయాలని కేంద్రాన్ని కోరాను ►ప్రతి విషయంలో అన్నదాతలకు అండగా నిలబడ్డాం ►దేవుడి దయతో మంచి కార్యక్రమం జరుగుతుంది ►53 లక్షల 53 మంది రైతులకు పెట్టబడి సాయం ►రైతులకు రూ. 2,200 కోట్ల ఆర్థిక సాయం ►రైతులు ఇబ్బందులు పడకూడదనే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా నిధులు ఇస్తోంది ►సామాజిక సాధికారిత బస్సుయాత్రకు విశేష స్పందన లభిస్తోంది. 11:24AM, Nov 7, 2023 ►వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమం పాల్గొన్న మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుమ్మనూరు జయరాం, ఉషాశ్రీచరణ్, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, శంకర్ నారాయణ, అనంతవెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, డాక్టర్ సిద్ధారెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీలు మంగమ్మ, శివరామిరెడ్డి, జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ తదితరులు 11:21AM, Nov 7, 2023 ►ఐదో ఏడాది రెండో విడత రైతు భరోసా కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన సీఎం జగన్ 11:15AM, Nov 7, 2023 ►పుటపర్తి చేరుకున్న సీఎం జగన్ 10:54AM, Nov 7, 2023 ►కాసేపట్లో పుటపర్తికి సీఎం వైఎస్ జగన్ 9:17AM, Nov7, 2023 ►పుట్టపర్తి బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ ►కాసేపట్లో వైఎస్సార్ రైతు భరోసా నిధులను విడుదల చేయనున్న సీఎం జగన్ ►వరుసగా ఐదో ఏడాది.. రెండో విడత వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం పంపిణీ చేయనున్న ఏపీ ప్రభుత్వం ►ఒక్కొక్కరికి రూ.4,000 చొప్పున 53.53 లక్షల మంది రైతన్నలకు రూ.2,204.77 కోట్ల రైతు భరోసా సాయం ►శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మంగళవారం బటన్ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహన్‌రెడ్డి రైతన్నలకు వెన్నుదన్నుగా సీఎం జగన్ వ్యవసాయం దండగ అనే గత పరిస్థితులను సమూలంగా మార్చి వ్యవసాయాన్ని పండుగ చేసి రైతన్నలకు అడుగడుగునా వెన్నుదన్నుగా నిలుస్తూ చెప్పిన దాని కన్నా ముందుగా, మాట ఇచ్చిన దానికన్నా మిన్నగా.. రైతన్నలకు సాయం అందిస్తున్నారు. మేనిఫెస్టోలో ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేల సాయం అందిస్తామన్న హామీకి మిన్నగా.. ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 చొప్పున అంటే మేనిఫెస్టోలో చెప్పిన దాని కంటే రైతన్నకు అదనంగా రూ.17,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఖరీఫ్ పంట వేసే ముందు మేలో రూ.7,500, అక్టోబర్–నవంబర్ నెల ముగిసే లోపే ఖరీఫ్ కోతలకు, రబీ అవసరాల కోసం రూ.4,000, పంట ఇంటికి వచ్చే వేళ జనవరి/ఫిబ్రవరిలో రూ.2 వేల చొప్పున ప్రభుత్వం సాయం అందిస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులు, ఆర్వోఎఫ్ఆర్ (అటవీ), దేవదాయ భూ సాగుదారులకు భూ యజమానులతో సమానంగా రైతు భరోసా కింద ప్రభుత్వం రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తోంది. తాజాగా జమచేస్తున్న రూ.2,204.77 కోట్లతో కలిపి వైఎస్సార్ రైతు భరోసా కింద ఒక్కో రైతు కుటుంబానికి రూ.65,500 చొప్పున ఈ నాలుగున్నరేళ్లలో రూ.33,209.81 కోట్ల పెట్టుబడి సాయం అందించింది. -
45 రోజులైనా..రైతుల ఖాతాల్లో జమకాని ధాన్యం డబ్బులు
సుభాష్‌నగర్ : ధాన్యం అమ్మి 45 రోజులైనా డబ్బులు ఖాతాల్లో జమ కాకపోవడంతో రైతులు ఎదురుచూస్తున్నారు. మొత్తం రూ.529 కోట్లకుపైనే రైతులకు రావాల్సి ఉంది. అందులో ఓటీపీఎస్ పూర్తయిన వారికే రూ.330.76 కోట్లు జమ చేయాల్సి ఉంది. మరో వైపు వానాకాలం సీజన్ మొదలైంది. ఇప్పటికే నార్లు పోసి, నాట్ల కోసం మడులను సిద్ధం చేసుకుంటున్నారు. ధాన్యం డబ్బులు రాకపోవడం.. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో రైతులు ప్రయివేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ● జిల్లా వ్యాప్తంగా 459 కొనుగోలు కేంద్రాల ద్వారా 93,150 మంది రైతుల నుంచి 6.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఈ ధాన్యం విలువ రూ.1,313.05 కోట్లు ఉంటుంది. అందులో రూ.1129 కోట్ల విలువైన ధాన్యానికి సంబంధించి ఓటీపీఎస్ పూర్తయ్యింది. ఇంకా రూ.184 కోట్ల విలువైన ధాన్యానికి ఓటీపీఎస్ సొసైటీల్లో పూర్తి చేయాల్సి ఉంది. ● రూ.784 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశారు. మొత్తం రూ.529 కోట్లకుపైగా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. ● ట్యాబ్ ఎంట్రీ, ట్రక్ షీట్ జనరేటెడ్, మిల్లర్ ఎక్నాలెడ్జ్మెంట్, ఓటీపీఎస్ తర్వాతే బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. వారం రోజుల్లో రూ.345 కోట్లు జమవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. కాగా సుమారు 100 వరకు లారీల ధాన్యం వివిధ రైస్‌మిల్లుల్లో అన్లోడింగ్ అవుతున్నాయి. డబ్బుల కోసం ఎదురుచూపులు! గత 15 రోజులుగా డబ్బులు జమ కావడం లేదని రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభం కాగా ఇప్పటికే నార్లు పోసుకుని, నాట్లు వేసుకునేందుకు మడులను సిద్ధం చేసుకుంటున్నారు. సోయా, శనగ, ఇతర పంటల సాగుకు దుక్కులు పూర్తయ్యాయి. ఈనెల 19 తర్వాత ఎప్పుడైనా వర్షాలు కురిసే అవకాశమున్నందున రైతులు సిద్ధమవుతున్నారు.ప్రస్తుతం డబ్బులు చేతిలో లేక అవస్థలు పడుతున్నారు. రూ. లక్ష వరకు రావాల్సి ఉంది ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ధా న్యం విక్రయించి నెల రోజులు గడి చిపోయింది. 130 బస్తాలను విక్రయించాను. సుమారు రూ.లక్ష వర కు రావాల్సి ఉంది. జూన్ పూర్తిగా పెట్టుబడుల నెల. పిల్లల స్కూల్ ఫీ జులు, వానాకాలం వ్యవసాయ పనులు ప్రారంభమైన నేపథ్యంలో పెట్టుబడికి డబ్బుల్లేక ధాన్యం విక్రయించిన సొ మ్ము కోసం ఎదురుచూస్తున్నాను. ఎరువులు, విత్తనాలు, వరి కోత యంత్రాలు, ట్రాక్టర్ అద్దె చెల్లించేందుకు డబ్బులు లేవు. సొసైటీలో అడిగితే త్వరలో వస్తాయని చెప్తున్నారు. వెంటనే ధాన్యం డబ్బులు జమ చేసేలా చూడాలి. – కేపీ నర్సారెడ్డి, రైతు, నల్లవెల్లి, ఇందల్వాయి మండలం వారంలోపు రూ.345కోట్లు జమ రైతులు అమ్మిన ధా న్యానికి సంబంధించి ఓటీపీఎస్ పూర్తయిన రూ.345 కో ట్లు వారం రోజుల్లో జమ అవుతాయి. రై తుల వివరాలను ఇప్పటికే నివేదించాం. డ బ్బులు జమ కావడంలో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమే. మిగతా డబ్బులు కూడా వీలైనంత త్వరగా జమ చేసేలా చర్య లు చేపడుతున్నాం. రైతులెవరూ ఆందోళన చెందొద్దు. – జగదీష్‌కుమార్, -
రైతుల ఖాతాలోకే విద్యుత్ సబ్సిడీ
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంపై రైతన్నల అజమాయిషీ పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేసింది. ఈ పథకం ద్వారా ఇంతకాలం విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కమ్‌లు)కు చెల్లిస్తున్న సబ్సిడీ మొత్తాన్ని ఇక నేరుగా రైతన్నల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఆ తరువాతే ఆ డబ్బు డిస్కమ్‌లకు చేరుతుంది. ఉచిత విద్యుత్తు ద్వారా వ్యవసాయదారులు ఎంత కరెంట్ వాడుకున్నా ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈమేరకు ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ వినియోగదారులకే నగదు బదిలీ చేసే ఈ పథకం 2021 – 22 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. రైతుల జేబు నుంచి ఒక్క పైసా ఖర్చు కాకుండా, నాణ్యమైన విద్యుత్‌ను హక్కులా సాధించుకునేందుకు ఇది వీలు కల్పిస్తుందన్నారు. రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వడానికి కేంద్రం కొన్ని సంస్కరణలను తప్పనిసరి చేసిందని, ఇందులో భాగంగా వ్యవసాయ సబ్సిడీని ’నగదు బదిలీ’గా మార్చాలని సూచించిందని వివరించారు. అయితే ఈ నిర్ణయం రైతన్నకు ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా, వారిపై ఒక్క పైసా కూడా భారం పడకుండా కట్టుదిట్టమైన విధాన నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. జవాబుదారీతనం పెంపు... ► దివంగత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్పథకాన్ని ఆ తర్వాత ప్రభుత్వాలు మొక్కుబడిగా మార్చాయి. అరకొరగా తక్కువ వోల్టేజీతో అందిస్తూ రైతు నిలదీయలేని దుస్థితిని గత సర్కారు కల్పించింది. ఈ పరిస్థితిని మార్చేసి నాణ్యమైన విద్యుత్తుతోపాటు రైతులకే నగదు అందచేసి వారి ద్వారా డిస్కమ్‌లు బిల్లులు అందుకోవడం, జవాబుదారీతనంతో వ్యవహరించేలా తాజాగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ► ఈ విధానం వల్ల రైతులకు తమకు వ్యవసాయ సబ్సిడీ ఎంత వస్తుందనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. డిస్కమ్‌లకు తానే బిల్లు చెల్లిస్తాడు కాబట్టి నాణ్యమైన విద్యుత్ కోసం నిలదీసే అధికారం ఉంటుంది. ఫలితంగా విద్యుత్ సంస్థల్లో పారదర్శకత పెరుగుతుంది. ► రాష్ట్రంలో ప్రస్తుతం 18 లక్షల వ్యవసాయ విద్యుత్ వినియోగదారులున్నారు. ఏటా 12 వేల మిలియన్ యూనిట్ల వ్యవసాయ విద్యుత్ వాడుతున్నట్లు అంచనా. గత సర్కారు ఏటా రూ. 4 వేల కోట్ల సబ్సిడీ మాత్రమే ఇవ్వగా ఇప్పుడు ఏకంగా ఏటా రూ. 8,400 కోట్ల వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ అందచేస్తూ 9 గంటల విద్యుత్ సరఫరా జరుగుతోంది. ముందే రైతు ఖాతాలోకి... ► వ్యవసాయ పంపుసెట్‌కు మీటర్ అమర్చి నెల నెలా వాడిన విద్యుత్‌ను లెక్కిస్తారు. అందుకయ్యే మొత్తాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తారు. ఆ మొత్తాన్ని ప్రభుత్వం రైతు ఖాతాలో ముందుగానే జమ చేస్తుంది. ఆ తర్వాత డిస్కమ్‌లకు రైతే తన బ్యాంకు ఖాతా ద్వారా చెల్లిస్తారు. ► ఈ క్రమంలో రైతులపై ఒక్క పైసా భారం కూడా పడదు. ఈ ప్రక్రియ ఆలస్యమైనాఅన్నదాతలకు విద్యుత్ సరఫరా నిలిపివేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అంతే కాదు మీటర్ అమర్చినప్పటికీ ఎంత విద్యుత్ వాడినా ఆ మొత్తాన్ని ప్రభుత్వమే రైతు ఖాతాలో వేస్తుంది. ఈ విషయంలో ఎలాంటి నియంత్రణ ఉండదు. అమలుకు కమిటీలు ► రైతులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా గ్రామ, మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర విద్యుత్ సంస్థల పరిధిలో ప్రత్యేకంగా కమిటీల ద్వారా పథకాన్ని అమలు చేస్తారు. ► వ్యవసాయ విద్యుత్ వినియోగదారులందరినీ పథకంలోకి తెస్తారు. అక్రమ కనెక్షన్లన్నీ క్రమబద్ధీకరిస్తారు. పథకం అమలులో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పునఃసమీక్షించనున్నారు. -
రైతులకు నేడు పంట నష్టపరిహారం జమ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గతేడాది సెప్టెం బర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన 67,874 మంది రైతులకు పెట్టుబడి రాయితీ కింద రూ. 54.52 కోట్ల పంట నష్టపరిహారాన్ని శుక్రవారం చెల్లించనున్నట్టు వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పంట నష్టపోయిన రైతుల జాబితాలో పేర్లున్న వారి ఖాతాలకు నగదును జమ అవుతుంది. ఆధార్ అనుసంధానమైన రైతుల బ్యాంకు ఖాతాలకు ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ పద్ధతిన నగదు జమ అవుతుంది. నగదు జమ అయిన తర్వాత రైతుల పేర్లను గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. -
మే నెలాఖరుకు రైతుబంధు నిధులు
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెలాఖరుకు ఖరీఫ్ రైతు బంధు నిధులను అందజేసేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు మొదలుపెట్టింది. లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రైతు బంధు సొమ్మును రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్, రబీల్లో రైతుబంధు నిధులను ప్రభుత్వం రైతులకు అందజేసిన సంగతి తెలిసిందే. రైతు బంధు కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ.8 వేల చొప్పున రెండు విడతలుగా అందజేసింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఏడాదికి రెండు సీజన్లకు ఎకరానికి రూ.10 వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఏటా ఖరీఫ్‌కు సంబంధించి రైతు బంధు సాయాన్ని మేలోనే ఇవ్వాలని సర్కారు భావిస్తోంది. దీంతో ఖరీఫ్ ప్రారంభానికి ముందే రైతులు విత్తనాలు, సాగు సహా ఇతరత్రా ఖర్చులకు వినియోగించుకుంటారని పేర్కొంటోంది. అవే మార్గదర్శకాలు.. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రైతుబంధు కోసం బడ్జెట్లో రూ.12 వేల కోట్లు కేటాయించింది. గత ఏడాది సాయం అందజేసిన ప్రతి రైతుకు ఈసా రి కూడా సాయం అందివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈసారి పదెకరాలకు మించి భూమి ఉన్న రైతులకు సాయం నిలిపేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే వ్యవసాయ శాఖ వర్గాలు మాత్రం అలాంటిదేమీ లేదని, గతేడాది మాదిరిగానే అందరికీ సాయం అందజేస్తామని చెబుతున్నాయి. మార్గదర్శకాలను మార్చేది లేదని స్పష్టం చేస్తున్నారు. రుణమాఫీపై అస్పష్టత.. అసెంబ్లీ ఎన్నికల హామీ ప్రకారం అధికారంలోకి వస్తే రూ.లక్ష రుణమాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక దీనికి సం బంధించి బ్యాంకర్లు కసరత్తు కూడా చేశారు. పైగా ప్రభుత్వం విడతల వారీగా ఇచ్చేలా బడ్జెట్లో ఈసారి రూ.6 వేల కోట్లు కేటాయించింది. అయితే ఎప్పుడు రుణమాఫీ చేస్తారన్న దానిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. లోక్‌సభ ఎన్నికల కోడ్ అయిపోయాక, రైతు బంధు సొమ్ము అందజేశాక రుణమాఫీ గురించి ఆలోచిస్తామని కొందరు సీనియర్ వ్యవసాయాధికారులు చెబుతున్నారు. రైతు ఖాతాలకే నేరుగా.. గతేడాది ఖరీఫ్‌లో రైతుబంధు సొమ్మును ప్రభుత్వం చెక్కుల రూపంలో అందజేసింది. ప్రతి గ్రామంలో సభలు పెట్టి చెక్కుల పంపిణీ చేసింది. రబీలోనూ అలాగే చేయాలని అనుకున్నారు. అయితే ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు రావడం, కోడ్ ప్రభావంతో చెక్కుల పంపిణీ జరగలేదు. దీంతో డబ్బును నేరుగా రైతుల ఖాతాలోనే జమ చేశారు. ఈసారి కూడా ఖరీఫ్‌లో రైతు బంధు సొమ్మును రైతుల ఖాతాలోనే నేరుగా వేయాలని సర్కారు నిర్ణయించింది. -
‘‘వెయ్యి’’కుండానే మోసమా..?
సాక్షి, కడప అగ్రికల్చర్ : రైతులను మభ్య పెట్టడం, మోసగించడం సీఎం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. రైతుకు టోకరా వేయడం మరింత సులువన్నది ఆయన భావన. ఐదు సంవత్సరాలుగా ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా, పంట రుణాలపై వడ్డీ రాయితీ ఇవ్వకపోగా, అన్నదాత.. సుఖీభవ పేరిట రూ.1000 ఖాతాలో వేస్తున్నట్లు నమ్మబలుకుతున్నారు. ఈ పథకంలో కొంతమంది రైతుల ఖాతాలకే నిధులు జమ చేశారు. 50 వేల మంది ఖాతాలకు డబ్బులు పడలేదని తెలిసింది. ఎన్నికల వేళ లేని ఆశలు కల్పిస్తూ వంచిస్తున్న ప్రభుత్వ తీరుపై రైతు సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. టీడీపీకి అనుకూలంగా ఉన్నవారికి, ఆ పార్టీ కార్యకర్తలకు మాత్రమే పథకాలు అందుతున్నాయని.. అందుకే నిన్ను నమ్మం బాబూ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకటనలతో హోరెత్తిస్తున్నారు. ఏదో చేస్తున్నట్లు భ్రమ కల్పిస్తున్నారు. క్షేత్రస్థాయిలో రైతుకు ఒరిగిందేమీలేదు. ‘అన్నదాత సుఖీభవ’ అంటూ గొప్ప పథకాన్ని తీసుకువచ్చినట్లు టీడీపీ ప్రభుత్వం బిల్డప్ ఇస్తోంది. ఈ పథకం కిందేమైనా రైతులకు పెద్ద ప్రయోజనం ఏమైనా చేకూరుతుందా? అంటే అదీలేదు. జిల్లాలో దాదాపు ఐదు సంవత్సరాలుగా వరుస కరువులతో వ్యవసాయం అతలాకుతలం అయింది. అనావృష్టి, అతివృష్టి, మరో పక్క ప్రకృతి విపత్తులు, అంతు చిక్కని చీడపీడలతో పంటలు తుడిచి పెట్టుకుపోయాయి. నేల తల్లిని నమ్ముకున్న జిల్లా రైతులు ఆర్ధికంగా చితికిపోయారు. బ్యాంకుల నుంచి, బయట ప్రయివేటు వారి వద్ద తీసుకున్న అప్పులు తీర్చే దారిలేక కొంతమంది రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఆసరా కల్పించాల్సిన సర్కారు మాటలతో కాలహరణం చేస్తోంది. 14.35 లక్షల ఎకరాల్లో భూమి...దీనిపై ఆధారపడిన కుటుంబాలు 4.89 లక్షలు జిల్లా వ్యవసాయ, ప్రణాళిక శాఖ లెక్కల ప్రకారం 14.35 లక్షల ఎకరాల భూములున్నాయి. వీటిపై ఆధారపడి 4,89,757 రైతు కుటుంబాలు జీవిస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకం కింద 3,59,205 కుటుంబాలు అర్హత కలిగినట్లు జిల్లా యంత్రాంగం తేల్చింది. అంటే 1,30,552 కుటుంబాలకు మొండిచేయి చూపినట్టేనని అర్ధమవుతోంది. జిల్లాలో 12 వ్యవసాయ డివిజన్లు ఉన్నాయి. ఇందులో ఎక్కువగా వర్షాధారంపై ఆధారపడిన భూములే అధికం. జిల్లా వ్యవసాయ, ప్రణాళికశాఖ సంయుక్తంగా సర్వేచేసి 3,24,965 అకౌంట్లు రైతు కుటుంబాలు కలిగిన ఉన్నాయని లెక్కలు కట్టారు. ఫిబ్రవరి 18 నుంచి రైతుల ఖాతాలకు రూ.1000 రియల్ టైం గవర్నెన్స్ సిస్టం (ఆర్టీజీఎస్) ద్వారా బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు. బ్యాంకులకు, ఏటీఎంలకు వెళ్లి పరిశీలించుకుంటుండగా నగదు జమకానట్లు చూపుతోందని చాలామంది ఆరోపిస్తున్నారు. ఆదివారం సాయంత్రం వరకు 2,88,077 అకౌంట్లకు ఆన్లైన్ చేయగా, ఇందులో 2,58,416 అకౌంట్లకు నగదు జమ అయిందని, 30,012 అకౌంట్లకు జమ కావాల్సి ఉందని తెలిపారు. మొత్తం 3,24,965 అకౌంట్లలో 48,946 అకౌంట్లకు బ్యాంకుల్లో ఆధార్ అనుసంధానం కాలేదని, ఐఎఫ్ఎస్సీ కోడ్ లేనందున ఆన్లైన్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా, కెవైసీ ఫారత పూర్తి చేసి ఇచ్చినా కూడా మొండిచేయి చూపారని రైతులు దుమ్మెత్తి పోస్తున్నారు. రైతు సాధికార సర్వే సమయంలో కూడా అన్ని పత్రాలు ఇచ్చామని, అయినా నగదు పడిందెక్కడని ప్రశ్నిస్తున్నారు. ఓట్ల కోసమే ఇదంతా.. వ్యతిరేకతను తగ్గించుకోవడానికే సుఖీభవ పథకాన్ని పెట్టి నమ్మబలుకుతోందని రైతు సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. వాస్తవానికి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ పధకం కింద ఏటా రైతులకు పెట్టుబడి సాయంగా రూ.6వేలు అందించాలని నిర్ణయించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం రూ.9వేలు, కేంద్రం ఇచ్చే రూ.6వేలు కలిపి రూ.15వేలు ఇస్తామని ప్రకటించింది. దీంట్లో మొదటి విడతగా కేంద్రం రూ.2వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1000లు ఇప్పుడే జమ చేస్తామని, మిగిలిన మొత్తం ఈ నెలలో ఇస్తామని ప్రకటించింది. దాదాపు 50 వేల మంది రైతుల ఖాతాలకు నగదు పడలేదని తేలిపోయింది. ఇన్‌ఫుట్ సబ్సిడీ, బీమా, రుణాల వడ్డీ రాయితీలకు ఎగ్గొట్టిన ప్రభుత్వం.. నాలుగున్నరేళ్లుగా ఇన్‌ఫుట్ సబ్సిడీ, పంటల బీమా, రూ.లక్షలోపు సాగు రుణాలు సకాలానికంటే ముందే చెల్లించగా వచ్చే రుణ రాయితీ ఇప్పటికి రాలేదని రైతులు మండిపడుతున్నారు. న్యాయంగా రావాల్సిన సొమ్ములు ఇవ్వకుంటే కొసరు దేనికని రైతులు, రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. 2012 నుంచి ఇప్పటి వరకు పంటపెట్టుబడి రాయితీ రూ.130 కోట్లు, పంటల బీమా రూ.117 కోట్లు, రుణాల వడ్డీ రాయితీ రూ.400 కోట్లు కలిపి రూ.647కోట్లు రైతులకు అందజేయాల్సి ఉంది. ఈ మొత్తమంతా ప్రభుత్వం ఎగ్గొట్టిందని రైతులు, రైతు సంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి. ఇది ఎన్నికల ఎత్తుగడే తెలుగు దేశం ప్రభుత్వం రైతులను ఏనాడో వదిలేసింది. పంటలు నష్టపోయినప్పుడు పట్టించుకోవడం మరచి పోయింది. ఇప్పుడు రైతుల ఓట్లు రాబట్టుకోవడానికి సుఖీభవ పథకం తీసుకువచ్చారు. ఇది ఎన్నికల జిమ్మిక్కే తప్ప రైతులకు మేలు చేయడానికి కాదు. –డేరంగుల రామాంజనేయులు, వేంపల్లె, వేంపల్లె మండలం రైతులను మభ్యపెట్టెందుకే.. ఎన్నికల సమయం దగ్గర పడడంతో రైతుల ఓట్లు బుట్టలో వేసుకోవడానికే తాయిలం. ఐదు సంవత్సరాలుగా రైతుల గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు రైతుల అవసరం వచ్చింది కాబట్టి నగదు ఇస్తామంటున్నారు. రైతులను మభ్యపెట్టడానికే ఈ రైతు సుఖీభవ పధకం. –సంబటూరు ప్రసాదరెడ్డి, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం ఈ ప్రభుత్వానిది అంతా బూటకమే.. తెలుగు దేశం ప్రభుత్వం అధికారం కోసం ప్రతిసారీ రైతులను ఏదో ఒక విధంగా బోల్తాకొట్టించాలని చూస్తుంది. పది రూపాయలు విధిలించి రైతులను బిక్షగాళ్ల మాదిరిగా చూస్తోంది. ఈ ప్రభుత్వం చేసేవన్నీ బూటకపు పనులే తప్ప రైతులకు మేలు చేసేది ఉండదు. ఇన్పుట్ సబ్సిడీ, వడ్డీ రాయితీ, బీమాను ఎగ్గొట్టింది. –చంద్ర,జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ రైతు సంఘం(సీపీఐ) -
రైతుల ఖాతాల్లో రూ.700 కోట్లు జమ
సాక్షి, హైదరాబాద్: రైతుల బ్యాంకు ఖాతాల్లోకి పెట్టుబడి సొమ్ము చేరుతోంది. రబీ రైతుబంధు సొమ్ము రెండో రోజు మంగళవారం నాటికి రూ.700 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. మొత్తం 52 లక్షల మందికి రబీ పెట్టుబడి సొమ్ము అందజేయాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. వారందరి బ్యాంకు ఖాతాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు 17 లక్షల మంది రైతుల ఖాతాలు సేకరించి క్షుణ్నంగా పరిశీలించారు. ఇప్పటివరకు ఆరున్నర లక్షల ఖాతాల్లో సొమ్ము జమ చేశారు. దీంతో రైతులు బ్యాంకుల వద్దకు క్యూలు కడుతున్నారు. దీపావళి నాటికి రైతులందరి బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేయాలని సర్కారు కృతనిశ్చయంతో ఉంది. గత ఖరీఫ్‌లో ప్రభుత్వం రైతులకు పెట్టుబడి చెక్కులను గ్రామసభల్లో అందజేసిన సంగతి తెలిసిందే. దాదాపు 51 లక్షల మంది రైతులకు రూ. 5,200 కోట్ల వరకు ప్రభుత్వం అందజేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రబీలో చెక్కుల రూపం లో ఇవ్వకూడదని, హడావుడిగా పంపిణీ చేయకూడదని ఈసీ స్పష్టం చేసింది. దీంతో రైతుల ఖాతాల్లోనే రైతుబంధు సొమ్ము జమ చేయాలని తెలిపింది. దీంతో వ్యవసాయశాఖ రైతుల బ్యాంకు ఖాతా నంబర్లను సేకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ–కుబేర్ సాఫ్ట్వేర్ ద్వారా రైతులకు పెట్టుబడి సొమ్ము బ్యాంకులకు పంపిస్తున్నారు. -
22 నుంచి పెట్టుబడి సొమ్ము?
సాక్షి, హైదరాబాద్: రైతులకు రబీ పెట్టుబడి సొమ్మును ఈ నెల 22 నుంచే అందజేయాలని వ్యవసాయ శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. మొదటి దశలో ఇప్పటివరకు సేకరించిన 10 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేయనుంది. అందుకు సంబంధించి ముమ్మరంగా సన్నాహాలు చేస్తుంది. ‘పండుగ తర్వాత ఈ నెల 22 నుంచి ఇవ్వాలనుకుంటున్నాం. అన్నీ సక్రమంగా జరిగితే అంతకుముందే రైతుల ఖాతాల్లోకి రబీ పెట్టుబడి సొమ్ము జమ చేస్తాం’అని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. రైతుల ఖాతాలను ఎప్పటికప్పుడు వేగంగా అప్లోడ్ చేసేలా మొబైల్ యాప్ కూడా వ్యవసాయ శాఖ రూపొందించింది. దానివల్ల గ్రామాల్లో వ్యవసాయాధికారులు వీలైనంత త్వరగా రైతుల బ్యాంకు ఖాతాలను సేకరించడం సాధ్యపడుతుంది. వేగంగా బ్యాంకు ఖాతాల సేకరణ.. గత ఖరీఫ్‌లో ప్రభుత్వం రైతులకు పెట్టుబడి చెక్కులను గ్రామసభల్లో అందజేసిన సంగతి తెలిసిందే. దాదాపు 51 లక్షల మంది రైతులకు రూ.5,200 కోట్ల వరకు ప్రభుత్వం అందజేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రబీలో చెక్కుల రూపంలో ఇవ్వకూడదని, ఎన్నికల కమిషన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అందుకు ప్రత్యామ్నాయంగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే రైతుబంధు సొమ్ము జమ చేయాలని స్పష్టం చేసింది. దీంతో వ్యవసాయ శాఖ రైతుల నుంచి బ్యాంకు ఖాతా నంబర్లను సేకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆ ఖాతాల నంబర్లను ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా అప్లోడ్ చేసి రిజర్వ్ బ్యాంకుకు పంపించాల్సి ఉంది. రిజర్వ్ బ్యాంకు వద్ద ఉన్న ఈ–కుబేర్ సాఫ్ట్వేర్ ద్వారా రైతులకు పెట్టుబడి సొమ్ము వెళ్తుంది. రైతుకు ఖాతా ఉన్న బ్యాంకుతో సంబంధం లేకుండా ఒకేసారి వారి ఖాతాల్లోకి సొమ్ము చేరుతుంది. -
రెక్కల కష్టం దక్కుతోంది
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎట్టకేలకు అన్నదాతల రెక్కల కష్టం నేరుగా వారింటికే వెళ్తోంది. దళారుల దగా.. దడవాయిల చేతివాటం లేకుండా ధాన్యం మీద వచ్చిన ప్రతి పైసా నేరుగా రైతు బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతోంది. ‘సారూ... మక్కలమ్మిన పైసలు అప్పుడే బేంకిల బడ్డయట..నా బిడ్డ పోనుకు మిసేజి పెట్టిళ్లు.. హరీషన్నకు, జేసీసారుకు దండాలని జెప్పురి’ అని జోగిపేట రైతు మల్లయ్య ‘సాక్షి’ ప్రతినిధికి ఫోన్ చేసి చెప్పారు. ఆ తర్వాత ఎల్లారెడ్డి... వెంకట్‌రెడ్డి...నర్సింహులు.. యాదయ్య...ఇలా రైతులంతా తమ అకౌంట్లలో డబ్బు జమ కాగానే సాక్షి’కి ఫోన్ చేసి చెబుతున్నారు. ‘వీఐపీ రిపోర్టర్’పేరుతో నేరుగా జేసీనే తమ వద్దకు తీసుకువచ్చి తమ సమస్యల పరిష్కారానికి సాక్షి చూపిన చొరవను ప్రశంసిస్తున్నారు. జనం కష్టం తెలిసిన జేసీ ప్రజలతో కలిసిపోయి జనం కష్టాలను చూడటం జాయింట్ కలెక్టర్ డాక్టర్ శరత్‌కు కొత్తకాదు. నిత్యం ప్రజలతో మమేకం కావటం వాటినికి అర్థవంతమైన నివేదికలను రూపొందించి సర్కారుకు పంపడం, ప్రభుత్వాన్ని ఒప్పించడం వచ్చిన ఫలాలను ప్రజలకు అందించడం శరత్‌కు నిత్యకృత్యం. కొత్తగా ‘సాక్షి’ తరఫున విలేకరిగా మారిన ఆయన రైతుల వద్దకు వెళ్లి, వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి ఇచ్చిన హామీలను మంత్రి హరీష్‌రావు ద్వారా నెరవేర్చారు. ఐకేపీ, మార్క్‌ఫెడ్ ద్వారా ధాన్యం అమ్మిన రైతులకు 72 గంటల్లో రైతు బ్యాంకు అకౌంటులోనే డబ్బు జమ చేస్తామని హామీ ఇచ్చిన శరత్, ఆ మాట నిలబెట్టుకున్నారు. మాటనిలుపుకున్న మంత్రి హరీష్ రైతులు ధాన్యం అమ్మిన 72 గంటల్లో ఆన్లైన్లోనే రైతు అకౌంట్లోనే డబ్బు జమ చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి హ రీష్‌రావు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలోనే సభ్యులకు హామీ ఇచ్చారు. ఇందుకోసం అవసరమైన టెక్నాలజీని డెవలప్ చేయించాలని, రైతులకు ఆన్లైన్ చెల్లింపుల విధానాన్ని మన జిల్లా నుంచే ప్రారంబిద్దామని అదే వేదిక మీద జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జాను ఆదేశించారు. దీంతో జేసీ శరత్ వెంటపడి టెక్నాలజీని అభివృద్ధి చేయించారు. అంతేకాకుండా ఊరూరా తిరిగి రైతులు పండించిన ధాన్యం దళారులకు అమ్ముకోకుండా వారిలో చైతన్యం తీసుకువచ్చారు. ప్రస్తుతం జిల్లాలో 70 కేంద్రాల ద్వారా ఐకేపీ, పీఏసీఎస్‌లు ధాన్యం కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 3,490 మంది రైతుల నుంచి 80,337 క్వింటాళ్ల మొక్క జొన్నలు కొనుగోలు చేశారు. దాదాపు రూ. 2.5 కోట్లు రైతులకు అందాల్సి ఉంది. ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్ నేపథ్యంలో రైతుల ఇబ్బందులకు స్వయంగా చూసిన జేసీ శరత్, యుద్ధ ప్రాతిపదికన పంటకు వచ్చిన పైకాన్ని వారి ఖాతాలో జమ చేయిస్తున్నారు. రెండు రోజుల నుంచి దాదాపు 1,500 మంది రైతుల అకౌంట్లలో డబ్బు జమ అయ్యింది. మిగిలిన వారి అకౌంట్లలో కూడా ఒకటి రెండు రోజుల్లో డబ్బు జమ అయే అవకాశం ఉంది. ఇంటర్నెట్లో అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో చెల్లింపుల్లో స్వల్ప జాప్యం జరుగుతోందని, ఈ సమస్యను కూడా త్వరలోనే అధిగమిస్తామని అధికారులు చెప్పారు.