సుభాష్‌నగర్ : ధాన్యం అమ్మి 45 రోజులైనా డబ్బులు ఖాతాల్లో జమ కాకపోవడంతో రైతులు ఎదురుచూస్తున్నారు. మొత్తం రూ.529 కోట్లకుపైనే రైతులకు రావాల్సి ఉంది. అందులో ఓటీపీఎస్ పూర్తయిన వారికే రూ.330.76 కోట్లు జమ చేయాల్సి ఉంది. మరో వైపు వానాకాలం సీజన్ మొదలైంది. ఇప్పటికే నార్లు పోసి, నాట్ల కోసం మడులను సిద్ధం చేసుకుంటున్నారు. ధాన్యం డబ్బులు రాకపోవడం.. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో రైతులు ప్రయివేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.
● జిల్లా వ్యాప్తంగా 459 కొనుగోలు కేంద్రాల ద్వారా 93,150 మంది రైతుల నుంచి 6.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఈ ధాన్యం విలువ రూ.1,313.05 కోట్లు ఉంటుంది. అందులో రూ.1129 కోట్ల విలువైన ధాన్యానికి సంబంధించి ఓటీపీఎస్ పూర్తయ్యింది. ఇంకా రూ.184 కోట్ల విలువైన ధాన్యానికి ఓటీపీఎస్ సొసైటీల్లో పూర్తి చేయాల్సి ఉంది.
● రూ.784 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశారు. మొత్తం రూ.529 కోట్లకుపైగా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది.
● ట్యాబ్ ఎంట్రీ, ట్రక్ షీట్ జనరేటెడ్, మిల్లర్ ఎక్‌నాలెడ్జ్‌మెంట్, ఓటీపీఎస్ తర్వాతే బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. వారం రోజుల్లో రూ.345 కోట్లు జమవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. కాగా సుమారు 100 వరకు లారీల ధాన్యం వివిధ రైస్‌మిల్లుల్లో అన్‌లోడింగ్ అవుతున్నాయి.
డబ్బుల కోసం ఎదురుచూపులు!
గత 15 రోజులుగా డబ్బులు జమ కావడం లేదని రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభం కాగా ఇప్పటికే నార్లు పోసుకుని, నాట్లు వేసుకునేందుకు మడులను సిద్ధం చేసుకుంటున్నారు. సోయా, శనగ, ఇతర పంటల సాగుకు దుక్కులు పూర్తయ్యాయి. ఈనెల 19 తర్వాత ఎప్పుడైనా వర్షాలు కురిసే అవకాశమున్నందున రైతులు సిద్ధమవుతున్నారు.ప్రస్తుతం డబ్బులు చేతిలో లేక అవస్థలు పడుతున్నారు.
రూ. లక్ష వరకు రావాల్సి ఉంది
ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ధా న్యం విక్రయించి నెల రోజులు గడి చిపోయింది. 130 బస్తాలను విక్రయించాను. సుమారు రూ.లక్ష వర కు రావాల్సి ఉంది. జూన్ పూర్తిగా పెట్టుబడుల నెల. పిల్లల స్కూల్ ఫీ జులు, వానాకాలం వ్యవసాయ పనులు ప్రారంభమైన నేపథ్యంలో పెట్టుబడికి డబ్బుల్లేక ధాన్యం విక్రయించిన సొ మ్ము కోసం ఎదురుచూస్తున్నాను. ఎరువులు, విత్తనాలు, వరి కోత యంత్రాలు, ట్రాక్టర్ అద్దె చెల్లించేందుకు డబ్బులు లేవు. సొసైటీలో అడిగితే త్వరలో వస్తాయని చెప్తున్నారు. వెంటనే ధాన్యం డబ్బులు జమ చేసేలా చూడాలి.
– కేపీ నర్సారెడ్డి, రైతు, నల్లవెల్లి, ఇందల్వాయి మండలం
వారంలోపు రూ.345కోట్లు జమ
రైతులు అమ్మిన ధా న్యానికి సంబంధించి ఓటీపీఎస్ పూర్తయిన రూ.345 కో ట్లు వారం రోజుల్లో జమ అవుతాయి. రై తుల వివరాలను ఇప్పటికే నివేదించాం. డ బ్బులు జమ కావడంలో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమే. మిగతా డబ్బులు కూడా వీలైనంత త్వరగా జమ చేసేలా చర్య లు చేపడుతున్నాం. రైతులెవరూ ఆందోళన చెందొద్దు. – జగదీష్‌కుమార్,
Comments
Please login to add a commentAdd a comment