breaking news
Nizamabad District News
-
దంపతులకు గాయాలు
కారును ఢీకొన్న కంటైనర్ భిక్కనూరు: మండల కేంద్రం సమీపంలో కారును కంటైనర్ ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న దంపతులకు గాయాలయ్యాయి. వివరాలు ఇలా.. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పద్మ, మోహన్‌రెడ్డి దంపతులు ఆదివారం కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. మండల పరిధిలోని వజ్రా గ్రానైట్ ఫ్యాక్టరీ సమీపంలో జాతీయ రహదారిపై వారి కారును వెనుకనుంచి వచ్చిన కంటైనర్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈఘటనలో కారులో ఉన్న పద్మ, మోహన్‌రెడ్డి దంపతులకు గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సంఘటన స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకున్నారు. -
క్రైం కార్నర్
మేసీ్త్రల మధ్య ఘర్షణ: ఒకరి మృతి మాక్లూర్: ఇద్దరు తాపీ మేసీ్త్రల మధ్య గొడవ జరుగగా, ఘర్షణలో ఒకరు మృతిచెందారు. మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాలు ఇలా.. మన్నేం లక్ష్మన్‌రావు అనే తాపీమేసీ్త్ర సంవత్సరకాలంగా మెట్పల్లి గ్రామంలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటూ శివారు గ్రామాల్లో ఇంటి నిర్మాణ పనులను గుత్తకు పట్టుకుని కొత్త ఇళ్లు నిర్మిస్తుంటాడు. ఏరోజుకు ఆరోజు కూలీలను తెచ్చుకుని పనులు చేయిస్తాడు. ఆదివారం లక్ష్మన్రావుకు తనతో పాటు ఉన్న మేసీ్త్ర జలపతిరాజు (60)కు మధ్య కూలీపై పనికి వెళ్లే విషయంలో గొడవ జరిగింది. ఈక్రమంలో లక్ష్మన్‌రావు జలపతిరాజును బలంగా నెట్టివేయడంతో పక్కనే ఉన్న సిమెంట్ దిమ్మైపె పడ్డాడు. దీంతో అతడి తలకు బలమైన గాయాలు కావటంతో స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. మృతుడి కుమార్తె శివాని ఫిర్యాదు మేరకు లక్ష్మన్పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. ఇసుక ట్రాక్టర్లు పట్టివేత నిజాంసాగర్(జుక్కల్): సంగారెడ్డి జిల్లా మాసాపల్లికి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్ట ర్లను శనివారం రాత్రి ప ట్టుకున్నామని ఎస్సై శివకుమార్ తెలిపారు. మండలంలోని మర్పల్లి గ్రామా నికి చెందిన మూడు ట్రాక్టర్లల్లో మంజీరా నదిలో నుంచి ఇసుక లోడ్ చేసి, పొరుగు జిల్లాకు తరలిస్తుండగా మార్గమధ్యలో పట్టుకున్నామన్నారు. పట్టుబడిన మూడు ఇసుక ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్‌కు తరలించి ముగ్గురు వ్యక్తులపైన కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. గంగారాం తండాలో ఒకరి ఆత్మహత్య ఇందల్వాయి: ఇందల్వాయి మండలం గంగారాం తండాలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై సందీప్ తెలిపిన వివరాలు ఇలా.. గంగారం తండాకు చెందిన షేక్ మహబూబ్ అలీ (48) అనే వ్యక్తి ఆటో డ్రైవర్‌గా కొనసాగుతూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా అతడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో అతడు జీవితంపై విరక్తి చెంది ఆదివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య షేక్ రిజ్వానా బేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. చోరీ కేసులో మహిళ అరెస్టు నిజామాబాద్ అర్బన్: నగరంలోని రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న మహిళను అరెస్టు చేసినట్లు ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి ఆదివారం తెలిపారు. ఇటీవల రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఓ మహిళ వద్ద నిందితురాలు బంగారాన్ని చోరీ చేసి, పారిపోయిందన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితురాలిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. నిందితురాలు కర్ణాటక రాష్ట్రం దీన్‌దయాల్ నగర్ ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయ రాణి బాయ్‌గా గుర్తించామన్నారు. అలాగే ఆమె వద్ద నుంచి నాలుగు తులాల రెండు గ్రాముల బంగారంను స్వాధీనం చేసుకున్నామన్నారు. -
ఘనంగా త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం
● 250 మంది సంగీత కళాకారుల కీర్తనల ఆలాపన ● అలరించిన చిన్నారుల నాట్యప్రదర్శన బోధన్: పట్టణంలోని శక్కర్‌నగర్ రామాలయంలో ఆదివారం కర్ణాటక సంగీత వాగ్గేయకారుడు, స్వరకర్త త్యాగరాజస్వామి మూడో ఆరాధనోత్సవాలు కనుల పండువగా నిర్వహించారు. శక్కర్‌నగర్ ప్రాంతానికి చెందిన ప్రతాప రామకృష్ణయ్య, అన్నపూర్ణ దంపతుల కుమారులు ప్రతాప శ్రీనివాస్, పీజీఎస్ శాసీ్త్ర అధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా వారు ముందుగా జ్యోతిప్రజ్వలన, త్యాగరాజస్వామి చిత్రపటానికి పూజలు చేశారు. అనంతరం త్యాగరాజ కీర్తనల సంగీత కచేరి ప్రారంభించారు. డాక్టర్ స్వప్న నేతృత్వంలో వివిధ ప్రాంతాలకు చెందిన 250 మంది సంగీత కళాకారులు త్యాగరాజస్వామి స్వరపర్చిన పంచకృతులు ఆలపించారు. నాట్యతరంగిణి సంస్థ నిర్వాహకులు కర్ణం శ్రీనివాస్ వారి విద్యార్థినులు, చిన్నారులు కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించి విశేషంగా ఆకట్టుకున్నారు. అతిథులు, సంగీత కళాకారులు, నృత్య ప్రదర్శనలిచ్చిన విద్యార్థినులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. -
మీకు తెలుసా..
వాట్సాప్‌లో మీ–సేవ రామారెడ్డి: ఉన్నత చదువుల కోసమో.. ఉద్యోగానికి దరఖాస్తు చేసేందుకో. విద్యార్థుల ప్రవేశాల కోసమో.. ఇలా అన్నింటికీ కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ తదితర పత్రాలు తప్పనిసరి. వీటన్నింటి కోసం ఇకపై రోజుల తరబడి వేచి చూడటం, మీ సేవా కేంద్రాలు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగడం లాంటి తిప్పలు తప్పనున్నాయి. వీటితో పాటూ దాదాపు 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన 580కి పైగా సేవలను తాజాగా ఫోన్ ద్వారా వాట్సప్ నంబర్ 8096958096 నుంచే అందుబాటులోకి రానున్నాయి. ● కామారెడ్డి జిల్లాలో 180 మీసేవలున్నాయి. ● ముందుగా ఫోన్లో అధికారిక మీ–సేవ వాట్సాప్ నంబరును సేవ్ చేసుకోవాలి. ● ఆ నంబరుకు మెనూ ఆప్షన్ టైప్ చేసి పంపిస్తే అందుబాటులో ఉన్న సేవలజాబితావస్తుంది. ● ఆధార్ ఆధారిత ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేసి అవసరమైన సేవను ఎంచుకోవాలి. ● దరఖాస్తు ఫారాన్ని వాట్సాప్‌లో ఇంటర్ఫేస్ ద్వారా పూర్తి చేయవచ్చు. ● అవసరమైన డాక్యుమెంట్లు, స్కాన్ చేసిన ప్ర తులను వాట్సాప్‌లోనే అప్లోడ్ చేయవచ్చు. ● ఫీజును ఆన్లైన్ పేమెంట్ గేట్‌వే ద్వారా సురక్షితంగా చెల్లించవచ్చు. ● సర్టిఫికెట్ లేదా డాక్యుమెంట్ సిద్ధం కాగానే దాని డౌన్లోడ్ లింక్ నేరుగా వాట్సాప్‌లోకి వస్తుంది. -
సర్పంచులు గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి
నిజామాబాద్ రూరల్: గ్రామాల్లో గెలిచిన సర్పంచు లు గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని, స్థానిక స మస్యలపై ఎకరువు పెట్టాలని గనులు, కార్మిక ఉపా ధి కల్పన శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి అన్నా రు. నగరంలోని న్యూ అంబేడ్కర్ భవన్లో ఆదివా రం జిల్లా మాల మహానాడు ఆధ్వర్యంలో నూతనంగా గెలిచిన మాల సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వా ర్డు సభ్యుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కా ర్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథి హాజరై మాట్లాడారు. పదవులు ఉన్న లేకున్న ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్‌అలీ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, తెలంగా ణ రాష్ట్ర సాధకుడు వెంకటస్వామి(కాక) విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని సర్పంచులను కోరారు. జిల్లావ్యాప్తంగా 64 మంది ఎస్సీ సర్పంచులు, 24 మంది ఉపసర్పంచులు గెలుపొందార న్నారు. రాష్ట్ర రైతుకమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, నుడా చైర్మన్ కేశవేణు, మాల మహానాడు జాతీ య అధ్యక్షుడు చిన్నయ్య, జిల్లా అధ్యక్షుడు దేవిదాస్, లింబాద్రి, టీఎన్జీవో నాయకులు కిషన్ ఉన్నారు. పదవులు ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉండాలి గనులు, కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి నగరంలో మాల మహానాడు, మున్నూరుకాపు సంఘాల ఆధ్వర్యంలో నూతన సర్పంచులకు సన్మానాలు -
ఆత్మీయ పలకరింపులు.. మధుర స్మృతులు
● జిల్లాలో పలుచోట్ల సమ్మేళనాలు నిర్వహించిన పూర్వవిద్యార్థులు ● ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో భావోద్వేగానికి గురైన మిత్రులు సాక్షి నెట్వర్క్: ఆత్మీయ పలకరింపులు.. ఆపాత మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుని పూర్వ విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. అరే ఎన్నాళ్లయింది కలుసుకుని.. పూర్తిగా మారిపోయావంటూ ఆనాటి స్నేహితులు ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో హర్షం వ్యక్తంచేశారు. జిల్లాలోని వివిధ గ్రామాల ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల పదోతరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. చిన్నానాటి మిత్రులందరూ ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే వేదికపై కలుసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఒకరినొకరు పలకరించుకుంటూ అనాటి జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకున్నారు. నాడు చదువు నేర్పిన ఉపాధ్యాయులను సమ్మేళనానికి ఆహ్వానించి, సన్మానించారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. అనంతరం అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఆర్మూర్‌లోని చిన్న రామ్‌మందిర్ పాఠశాల 1993–94 బ్యాచ్ ఏడో తరగతి వి ద్యార్థులు ఓ ఫంక్షన్హాల్లో ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. ్డ -
మున్నూరుకాపులు రాజకీయంగా ఎదగాలి..
● ధర్మపురి సంజయ్‌నిజామాబాద్ రూరల్: మున్నూరుకాపులు రాజకీయంగా ఎదగాలని మాజీ మేయర్, మున్నూరుకా పు జిల్లా సంఘం అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ అ న్నారు. నగరంలోని మున్నూరుకాపు కల్యాణమండపంలో ఆదివారం మున్నూరుకాపు జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఇటీవల గెలుపొందిన సంఘ స ర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు సన్మాన కా ర్యక్రమం నిర్వహించారు. అంతకుముందు సంఘ ప్రతినిధులు నగరంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. అనంతరం సంజయ్ మాట్లాడుతూ.. జిల్లాలో 450 పైచిలుకు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లుగా మున్నూరుకాపులు గెలవడం గొప్ప విషయమన్నారు. మున్నూరుకాపులకు ఏ కష్టం వచ్చి నా నేనున్నానని మర్చిపోవద్దన్నారు. ఉర్దూ అకాడ మీ చైర్మన్ తాహెర్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ మేయర్ ఆకుల సుజాత, సురేందర్, గంగాధర్, చిన్నరాజేశ్వర్, బలరాం, శ్రీశైలం, రాజశేఖ ర్, రవీందర్, పోతన్న, సాయిలు పాల్గొన్నారు. -
వీరన్నగుట్టలో షార్ట్‌సర్క్యూట్
రెంజల్: మండలంలోని వీరన్నగుట్ట గ్రామంలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. రామాలయం ఆవరణలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి షార్ట్‌సర్క్యూట్ కావడంతో పక్కనే ఉన్న గోశాలలో నిప్పురవ్వలు పడ్డాయి. దీంతో గోశాలలోని గడ్డికట్టలు దగ్ధమవుతున్న విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే 14 గోవులను సురక్షితంగా బయటకు తరలించారు. విషయం తెలుసుకున్న బోధన్ ఫైరింగ్ స్టేషన్ సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో మంటలను ఆర్పివేశారు. ఆలయ ప్రాంతంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి తరచూ మంటలు వస్తున్న విషయాన్ని ట్రాన్స్‌కో అధికారులు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని గ్రామస్తులు, ఆలక కమిటీ ప్రతినిధులు పేర్కొ న్నారు. ఇకనైనా ట్రాన్స్‌కో అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరారు. ● గోశాలలో తప్పిన ప్రమాదం.. ● 14 గోవులు సురక్షితం -
వీఏఓఏటీ కార్యవర్గం ఎన్నిక
సుభాష్‌నగర్: విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(వీఏఓఏటీ) నిజామాబాద్ సర్కిల్ కార్యవర్గాన్ని శనివారం నగరంలోని పవర్‌హౌస్ కంపౌండ్‌లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జే శివాజీ గణేశ్, కార్యదర్శిగా పీ వెంకట్, ఉపాధ్యక్షుడిగా వై మోహన్, కోశాధికారిగా సతీశ్, మహిళా కార్యదర్శిగా సునీత ఎన్నికయ్యారు. ఎన్నికల పరిశీలకులుగా ఎన్పీడీసీఎల్ కంపెనీ సెక్రెటరీ సుదర్శన్, ఫైనాన్స్ సెక్రెటరీ దేవేందర్ వ్యవహరించారు. కార్యక్రమంలో జిల్లా విద్యుత్ అకౌంట్స్ అధికారులు ఈశ్వర్, గంగారాం, సురేశ్, రమణ, మంగ్త్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటి నిర్మాణ అనుమతి పొందండి ఇలా..
మీకు తెలుసా..రామారెడ్డి: గ్రామ పంచాయతీ పరిధిలో ఇల్లు నిర్మించుకోవడానికి గతంలో మాదిరిగా పంచాయతీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం tgbpass( తెలంగాణ భవన నిర్మాణ అనుమతి ఆమోదం స్వీయ ధృవీకరణ వ్యవస్థ ) అనే ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తోంది. ● ప్లాట్ విస్తీర్ణం ఆధారంగా అనుమతులు ● 75 చదరపు గజాల లోపు (జీ– ప్లస్ వన్ అంతస్తు వరకు) దీనికి ఎటువంటి ముందస్తు అనుమతి అవసరం లేదు. ● మీరు కేవలం రూ. 1 టోకెన్ అమౌంట్‌తో వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా అవసరం లేదు. ● 75 నుండి 600 చదరపు గజాల వరకు (ఎత్తు 10 మీటర్ల లోపు) తక్షణ అనుమతి. తక్షణ ఆమోదం. వివరాలను, స్థల పత్రాలను ఆన్లైన్లో ‘సెల్ఫ్ సర్టిఫికేషన్’ ద్వారా సమర్పిస్తే, వెంటనే అనుమతి పత్రం జారీ అవుతుంది. ● 600 చదరపు గజాల కంటే ఎక్కువ (లేదా 10 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు) దీనికి సింగిల్ విండో సిస్టమ్ ద్వారా దరఖాస్తు చేయాలి. 21 రోజుల్లోగా అధికారులు పరిశీలించి అనుమతి ఇస్తారు. ఒకవేళ 21 రోజుల్లోపు సమాధానం రాకపోతే, అది ఆమోదించబడినట్లుగా (డిమాండ్ అప్రూవల్ గా) పరిగణించవచ్చు. దరఖాస్తుకు కావలసిన పత్రాలు ● ఆధార్ కార్డు, స్థలానికి సంబంధించిన సేల్‌డీడ్ లేదా రిజిస్ట్రేషన్ పత్రాలు. ● లింక్ డాక్యుమెంట్స్, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ (ఈసీ) ● బిల్డింగ్ ప్లాన్, స్థలం ఫొటోలు. అనుమతి పొందే విధానం: అధికారిక వెబ్సైట్ tgbpass.telangana.gov.inను సందర్శించండి. ● దరఖాస్తు ఎంపిక మీ ప్లాట్ సైజును బట్టి online service ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ● యజమాని వివరాలు, ప్లాట్ కొలతలు, సర్వే నంబర్ వివరాలను నమోదు చేయాలి. ●పత్రాలను అప్లోడ్ చేయాలి. నిర్దేశించిన ఫీజును ఆన్లైన్ ద్వారా చెల్లించాలి. ●దరఖాస్తు పూర్తయిన వెంటనే మీరు అనుమతి పత్రాన్ని (పర్మిషన్ సర్టిఫికెట్) డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముఖ్య గమనిక: ● స్వీయ ధృవీకరణలో తప్పుడు వివరాలు ఇస్తే నోటీసు ఇవ్వకుండానే నిర్మాణాన్ని కూల్చివేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ● ప్రభుత్వం మరింత వేగంగా అనుమతులు ఇచ్చేందుకు బిల్డ్ నౌ అనే కొత్త విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది. ● మీరు మీ ప్లాట్ యొక్క కచ్చితమైన కొలతలు (చదరపు గజాల్లో) చెబితే, మీకు ఎంత ఫీజు అవుతుందో లేదా ఏ కేటగిరీ కిందకు వస్తుందో కూడా తెలుసుకోవచ్చు. -
రాష్ట్రస్థాయి బాల్‌బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం
పెర్కిట్: మామిడిపల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో రాష్ట్ర స్థాయి జూనియర్ బాల్‌బ్యాడ్మింటన్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్‌రెడ్డి హాజరై పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో డీఎస్వో పవన్, బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బోనగిరి శ్యామ్, నాయకులు రాజయ్య, దుర్గయ్య, విద్యా సాగర్ రెడ్డి, రాజ్ కుమార్, నరేందర్, రాజేశ్, సునీత, సంతోష్ ఠాకూర్, నాగేశ్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టిజన్ కార్మికుల సర్వీసును రెగ్యులరైజ్ చేయాలి
● రాష్ట్ర జేఏసీ చైర్మన్ సతీశ్ రెడ్డి డిచ్పల్లి: విద్యుత్ సంస్థల్లో ఎక్కడా లేని విధంగా ఒకే సంస్థలో రెండు రూల్స్ అమలు చేసి ఆర్టిజన్ కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని రాష్ట్ర జేఏసీ చైర్మన్ సతీశ్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం డిచ్పల్లి మండల కేంద్రంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యల సాధన సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు విద్యార్హతను బట్టి కన్వర్షన్ ఇవ్వాలన్నారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగులకు ఏపీఎస్ఈబీ రూల్స్ అమలు చేయాలన్నారు. పీస్‌రేట్ కార్మికులకు జీవో నంబర్ 11 ప్రకారం కనీస వేతనాలు చెల్లించి, 30 రోజులు పని కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర జేఏసీ కన్వీనర్లు ఎస్ సాయిలు, ఎస్ చంద్రారెడ్డి, కో–చైర్మన్ ఎస్ శ్రీధర్ గౌడ్, వైస్ చైర్మన్ సంతోష్ నాయక్, సికిందర్, శ్రీకాంత్, మెట్టు జాషువా, తలారి తిరుపతి, మహేందర్ గౌడ్, బట్టు గంగాధర్, రవీందర్, రాజు, విజయ్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. క్రైం కార్నర్ -
మహిళా విద్యకు మార్గదర్శకురాలు సావిత్రీబాయి ఫూలే
● నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఖలీల్‌వాడి: మహిళా విద్యకు మార్గదర్శకురాలిగా, సమాజ సంస్కర్తగా నిలిచిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీ బాయి ఫూలే అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. శనివారం జిల్లా బీసీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సావిత్రీబాయి ఫూలే జయంతి సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయ పురస్కారాలు–2026 కార్యక్రమం నగరంలోని న్యూ అంబేడ్కర్ భవన్లో నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఆరోగ్యం, యువత నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని గుర్తు చేశారు. ప్రయివేటుకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యాబోధన సాగుతోందని పది ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపినా, కేంద్రం అడ్డుకుంటోందని విమర్శించారు. కార్యక్రమంలో బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు వినోద్, నాయకులు నరాల సుధాకర్, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, డీఈవో అశోక్, జెడ్పీ మాజీ చైర్మన్ విఠల్ రావు, కాంగ్రెస్ నాయకులు అగ్గు భోజన్న, రామచంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
నిధుల కోసం నిరీక్షణ
మోర్తాడ్: గ్రామాల్లో అనేక సమస్యలు పేరుకుపోతున్నాయి. వాటి పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధుల కోసం సర్పంచులు ఎదురు చూపులు చూస్తున్నారు. 23 నెలలుగా నిలిచిపోయిన ఆర్థిక సంఘం నిధుల విడుదలకు కేంద్రం మోక్షం కలిగిస్తేనే గ్రామాల్లో అభివృద్ధి పనులతో పాటు మౌలిక సదుపాయాల కల్పన సాధ్యమవుతుంది. 15వ ఆర్థిక సంఘం ద్వారా కేంద్రం ప్రతి నెలా జిల్లాకు విడుదల చేయాల్సిన మొత్తం రూ.10.30 కోట్లు ఆర్థిక సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల ద్వారా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఉంటేనే నిధులను విడుదల చేయాల్సి ఉంది. ప్రభుత్వం సకాలంలో ఎన్నికలను నిర్వహించకపోవడంతో 23 నెలల పాటు ప్రత్యేకాధికారుల పాలనలోనే గ్రామాలు కొనసాగాయి. జిల్లాలోని 545 గ్రామ పంచాయతీలకు ఆర్థిక సంఘం ద్వారా రూ.236.95 కోట్ల నిధులు విడుదల కావాల్సి ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను మంజూరు చేయనుందని సీఎం రేవంత్‌రెడ్డి పంచాయతీలపై వరాల జల్లును కురిపించారు. పెద్ద పంచాయతీలకు రూ.10లక్షలు, చిన్న పంచాయతీలకు రూ.5లక్షల చొప్పున నిధులను మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. కానీ సర్పంచులు బాధ్యతలు చేపట్టి పక్షం రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కార్యాచరణ అమలు కావడం లేదు. దీంతో నిధుల కోసం సర్పంచులు నిరీక్షిస్తున్నారు. సీఎం చెప్పిన లెక్క ప్రకారం జిల్లాకు రూ.35 కోట్ల వరకూ నిధులు విడుదల అయ్యే అవకాశం ఉంది. అటు ఆర్థిక సంఘం నుంచి భారీ మొత్తంలోనే నిధులు విడుదల కావాల్సి ఉండగా పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించినట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదికను అందించాల్సి ఉంది. ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచ్, వార్డు సభ్యులు ఉన్నారని తెలియజేస్తేనే ఆర్థిక సంఘం ద్వారా నిధులు విడుదల కానున్నాయి. రెండేళ్లుగా ఎన్నో సమస్యలు ఆర్థిక సంఘం నిధుల విడుదల నిలిచిపోవడం, ఎస్ఎఫ్సీ నిధుల స్థానంలో పంచాయతీ సిబ్బందికి జీతాల కోసం కొంత నిధులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకోవడంతో రెండేళ్ల పాటు ఎన్నో సమస్యలు పేరుకుపోయాయి. పెద్ద పంచాయతీలకు పన్నుల ద్వారా ఆదాయం లభించగా చిన్న పంచాయతీల్లో పన్నుల ఆదాయం అంతంత మాత్రంగానే ఉంది. ఈ కారణంగా పరిసరాలను శుభ్రంగా ఉంచే పరిస్థితి కూడా అక్కడక్కడ లేదు. సర్పంచులు ఎన్నిక కావడంతో నిధుల విడుదలకు మోక్షం లభిస్తేనే గ్రామాల్లో అభివృద్ధి పనులు సాధ్యమవుతాయి. మోర్తాడ్ జీపీ భవనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీలకు నిధులను వెంటనే విడుదల చే యాలి. గ్రామల్లో ఎన్నో సమస్యలు నెలకొని ఉ న్నాయి. ఆర్థిక వనరులు ఎంతో అవసరం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను విడుదల చేసి అభివృద్ధికి సహకరించాలి. – విజయ్, సర్పంచ్, శెట్పల్లి గ్రామాల్లో కుంటుపడుతున్న పాలన ఆర్థిక సంఘం నిధులు మంజూరైతేనే గ్రామాలు అభివృద్ధి కేంద్రం నుంచి జిల్లాకు రావాల్సింది రూ. 236.95 కోట్లు -
దంపతుల ఆత్మహత్యాయత్నం
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ పట్టణ శివారులో శనివారం సాయంత్రం దంపతులు గడ్డిమందు తాగి ఆత్మహత్యకు య త్నించారు. ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. వేల్పూర్ మండలం పడిగెల వడ్డెర కాలనీకి చెందిన అలకుంట రవితేజ(21), భార్య శోభ అలియాస్ లత(20) ఆర్మూర్ పట్టణ శివారులోని ఓ వెంచర్లో గడ్డి మందు సేవించి అపస్మారక స్థితిలో ఉండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దంపతులను అంబులెన్స్‌లో పెర్కిట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రానికి తీసుకెళ్లారు. వారు చికి త్స పొందుతున్నారు. కాగా, ఇరువురికి మూడు నెలల క్రితమే వివాహం జరిగింది. కుటుంబకలహాలతోనే దంపతులు ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిసింది. నిందితుడి అరెస్ట్ డిచ్పల్లి: ట్రాక్టర్‌ను దొంగిలించిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డిచ్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ వినోద్ తెలిపారు. శనివారం సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బర్దిపూర్ శివారులో గత నెల 5న ట్రాక్టర్ చోరీకి గురైంది. ట్రాక్టర్ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శనివారం మధ్యాహ్నం నాగ్‌పూర్ గేట్ సమీపంలోని కృష్ణప్రియ దాబా ముందు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు కామారెడ్డి జిల్లా రాజానగర్‌కు చెందిన దిండ్ల కరుణాకర్‌గా గుర్తించారు. అతను చేసిన తప్పును అంగీకరించి ట్రాక్టర్‌ను పోలీసులకు చూయించాడు. ట్రాక్టర్‌ను పీఎస్‌కు తరలించి అతన్ని రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో డిచ్పల్లి ఎస్సై మహమ్మద్ ఆరిఫ్, సిబ్బంది పాల్గొన్నారు. సెల్‌ఫోన్ చోరీ ఘటనలో ఇద్దరు..నిజామాబాద్‌అర్బన్: నగరంలో గాంధీచౌక్ ప్రాంతంలో శుక్రవారం సెల్‌ఫోన్ షాపులో దొంగతనం చేసిన ఇద్దరు నిందితులను పట్టుకొని అరెస్టు చేసినట్లు ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. నగరంలో బాబన్సాహెబ్పహడ్ ప్రాంతానికి చెందిన శ్రీకాంత్, తరుణ్ గాంధీచౌక్‌లో ఉన్న ఓ సెల్‌ఫోన్ షాపులో దొంగతనం చేశారు. పోలీసులు వీరి నుంచి 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. -
గ్రామాల అభివృద్ధిలో సర్పంచులదే కీలకపాత్ర
● కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్ రెడ్డి ఆర్మూర్: గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ కల్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచులకు సన్మాన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షుడు నగేశ్‌రెడ్డి హాజరై మాట్లాడారు. గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచ్ అని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన్న వీబీ జీ రాం జీ ఉపాధి చట్టాన్ని సర్పంచులు కేంద్రానికి వ్యతిరేకంగా తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికై న సర్పంచులను సన్మానించారు. అదేవిధంగా పలు పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి ఆయన కండువా వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఉరూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఏబీ చిన్నా, పట్టణ అధ్యక్షుడు సాయిబాబా, సీనియర్ నాయకు డు మార చంద్రమోహన్, పార్టీ మండలాల అధ్యక్షులు మంద మహిపాల్, రవి ప్రకాశ్, భూమేశ్వర్ రెడ్డి, చిన్నారెడ్డి, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. -
నగరాభివృద్ధే లక్ష్యం
● అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ● పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షసుభాష్నగర్ : ఇందూరు నగర అభివృద్ధే లక్ష్యంగా, ప్రజా సంక్షేమమే ఆశయంగా ముందుకు సాగుతున్నామని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. నగరంలోని అర్బన్ ఎమ్మెల్యే కార్యాలయంలో పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులతో ఆయన శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో చేపడుతున్న పలు కీలక అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించి, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. అనంతరం ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ అమృత్–2 పథకం కింద అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ, మ్యాన్‌హోల్స్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. నీటి సరఫరా వ్యవస్థకు సంబంధించిన అన్ని నిర్మాణాలను నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ప్రతి డివిజన్‌కు టీయూఎఫ్ఐడీసీ ఫండ్ నుంచి విడుదలైన రూ.కోటితో చేపట్టే అభివృద్ధి, మరమ్మతు పనుల కోసం టెండర్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. రామర్తి చెరువు సుందరీకరణ పనులను వేగవంతం చేసి, ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చిత్తశుద్ధితో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు, అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. సమావేశంలో పబ్లిక్ హెల్త్ ఈఈ తిరుపతి, మున్సిపల్ ఇన్చార్జి ఈఈ నాగేశ్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఏఈ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్ఎంసీలో పోలింగ్ కేంద్రాల పెంపు
● మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్ ● రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశంసుభాష్నగర్: నిజామాబాద్ మున్సిపల్ కా ర్పొరేషన్‌లో పెరిగిన ఓటర్ల సంఖ్యకు అను గుణంగా పోలింగ్ కేంద్రాలను పెంచుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్ తెలిపారు. శనివారం కా ర్పొరేషన్ కార్యాలయంలోని తన చాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో గతంలో 2.92 లక్షల మంది ఓటర్లు ఉండేవారని, ప్రస్తుతం 3.47 లక్షలకు పెరిగారని పేర్కొన్నారు. 413 పోలింగ్ కేంద్రాలు ఉండగా వాటి సంఖ్య 434కు పెరిగిందన్నారు. పెరిగిన పోలింగ్ కేంద్రాలకు భవనం, వసతులపై అభిప్రాయాలను సేకరించామని తెలిపారు. కొన్ని పోలింగ్ కేంద్రాలను మారుస్తున్నాని, వాటి స్థానంలో కొత్త కేంద్రాలను ఎంపిక చేశామన్నారు. ఈ నెల 13న ముసాయిదా పోలింగ్ కేంద్రాలను ప్రదర్శిస్తామని, 16న తుది పోలింగ్ కేంద్రాల జాబితాతోపాటు పోలింగ్ కేంద్రాల వారీగా ఫొటో ఓటరు తుది జాబితాను ప్రదర్శిస్తామని స్పష్టం చేశారు. ఓటరు జాబితాలో తప్పిదాలపై కమిషనర్, ఆర్డీవో, తహసీల్దార్లు, బీఎల్వోలతో వివరాలు సేకరించి సరి చేస్తున్నామని, ఏ డివిజన్లోని ఓటరు అదే డివిజన్లో ఓటు వేసేలా పకడ్బందీగా చర్యలు చేపడుతున్నామని కమిషనర్ పేర్కొన్నారు. అదనపు కమిషనర్ రవీందర్ సాగర్, ఏసీపీ శ్రీనివాస్, ఆయా పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
చాంపియన్‌గా నిఖత్ జరీన్
● ఎన్పీడీసీఎల్ ఎస్ఈ పీవీ రాజేశ్వర్రావునిజామాబాద్అర్బన్: జిల్లాకు చెందిన నిఖత్ జరీన్ జాతీయ బాక్సింగ్ పోటీల్లో చాంపియన్‌గా నిలిచింది. గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న ఈ పోటీల్లో నిఖిత్ పాల్గొని 51 కేజీల విభాగంలో హర్యానాకు చెందిన నీతూను ఓడించింది. దీంతో నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌గా నిలిచింది. జిల్లాకు చెందిన హుసాముద్దీన్ సైతం బాక్సింగ్ పోటీల్లో గెలుపొందారు. ఖాళీ ప్రదేశాల్లోనే పతంగులు ఎగురవేయాలి సుభాష్‌నగర్: విద్యుత్ లైన్లకు దూరంగా ఉండి సంక్రాంతి పండుగను సురక్షితంగా, ఆనందంగా జరుపుకోవాలని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ పీవీ రాజేశ్వర్‌రావు శనివారం ఒక ప్రకటనలో సూచించారు. పండుగ సందర్భంగా పతంగులు ఎగురవేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని కోరారు. పతంగులను కేవలం ఖాళీ ప్రదేశాలు, మైదానాల్లో మాత్రమే ఎగురవేయాలని పేర్కొన్నారు. విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్ల వద్ద పతంగులు ఎగురవేయడం అత్యంత ప్రమాదకరమని తెలిపారు. పక్షులు, మనుషులకు హాని చేసే విద్యుత్ వాహకత కలిగిన ‘చైనా మాంజా’ను వాడొద్దని కోరారు. పతంగులు విద్యుత్ తీగలకు చిక్కుకుంటే, తొలగించే ప్రయత్నం చేయొద్దని తెలిపారు. ప్రహరీ లేని మేడలు, బాల్కానీల నుంచి, డాబాల పైన ఎట్టి పరిస్థితుల్లో పతంగులు ఎగురవేయకూడదని పేర్కొన్నారు. పిల్లలు పతంగులు ఎగురవేసేటప్పుడు పెద్దలు పర్యవేక్షించాలని సూచించారు. విద్యుత్ వైర్లపై పతంగులు, మాంజాలు చిక్కుకున్నా, విద్యుత్ వైర్లు తెగిపడితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1912 కు కాల్ చేయాలని కోరారు. -
బ్యాలెట్‌తోనే మున్సిపోల్స్
● పరోక్ష పద్ధతిలో చైర్పర్సన్ ఎన్నిక ● పార్టీ గుర్తులతో నిర్వహణకు ఎన్నికల కమిషన్ నిర్ణయంఆర్మూర్: మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ పేపర్, పార్టీ గుర్తులతోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను ఈవీఎంల ద్వారా నిర్వహించిన ఎన్నికల కమిషన్.. రాష్ట్ర వ్యాప్తంగా ఆరు కార్పొరేషన్లతోపాటు 117 మున్సిపాలిటీల్లో బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. కౌన్సిలర్‌ను ఎన్నుకొనేందుకు వినియోగించే బ్యాలెట్ పత్రాలు తెలుపు రంగులో, అభ్యర్థుల పేర్లు, పార్టీ గుర్తులతో ఉంటాయి. ఓటరు తాను ఓటు వేయాలనుకున్న అభ్యర్థి పార్టీ గుర్తుపై స్టాంప్ వేయాల్సి ఉంటుంది. పోలింగ్ అనంతరం ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఒక్కో బ్యాలెట్ పేపర్‌ను లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. ఈ విధానంలో వార్డు కౌన్సిలర్ల ఎంపికకు మాత్రమే ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు రావడంతో చైర్పర్సన్ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రచారానికి నేతలు రెడీ.. ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో పోటీ ల్లో ఉన్న సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులకు ప్రత్యేకంగా గుర్తులను కేటాయించారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం లాంటి ప్రధాన పార్టీల నాయకులు పంచాయతీ ఎన్నికల్లో అంటీ ముట్టనట్లుగా వ్యవహరించారు. గెలిచిన అభ్యర్థిని తమ పార్టీలో చేర్చుకోవచ్చనే నమ్మకంతో నేరుగా ప్రచారం చేసేందుకు ఆసక్తి చూపించలేదు. అయితే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు ఆ ర్మూర్, బోధన్, భీమ్‌గల్ మున్సిపాలిటీల్లో నిర్వహించే ఎన్నికల్లో కౌన్సిలర్ అభ్యర్థులు సమర్పించే బీ ఫాం ఆధారంగా రాజకీయ పార్టీల గుర్తులను కే టాయించనున్నారు. దీంతో నియోజకవర్గాల పరిధిలో పార్టీలకు నాయకత్వం వహిస్తున్న నేతలు అ భ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. మున్సిపాలిటీల్లో తమ పార్టీ జెండాను ఎగురవేస్తే భవిష్యత్‌లో నిర్వహించే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు కలిసి వచ్చే అంశంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్‌లో బీజేపీ ఎమ్మెల్యేలు ధన్పాల్, పైడి రాకేశ్ రెడ్డి, బోధన్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, బా ల్కొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తమ పరిధిలోని మున్సిపాలిటీలపై ఆధిపత్యం కో సం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. -
అంగన్వాడీలకు ‘ప్రయోజనం’ అందేనా?
మోర్తాడ్(బాల్కొండ): మోర్తాడ్‌కు చెందిన శారద అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తూ 65 ఏళ్ల వయస్సు నిండటంతో రెండేళ్ల కింద పదవీ విరమణ చేశారు. ఆమెతోపాటు సుంకెట్‌కు చెందిన ఆలూరు గంగు, మోర్తాడ్‌లోని నూతికట్టు లక్ష్మి ఆయాలుగా పనిచే స్తూ పదవీ విరమణ చేశారు. అయితే, ప్రభుత్వం ఇప్పటి వరకు వారికి రిటైర్మెంట్ బెన్ఫిట్ను అందించలేకపోయింది. ఇది ఒక్క శారద, గంగు, లక్ష్మిలకు ఎదురైన సమస్యనే కాదు. జిల్లా వ్యాప్తంగా ఎంతోమంది అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసిన ఆయాలు, టీచర్లు పదవీ విరమణ చేసినా ప్రభుత్వం ప్రకటించిన సాయాన్ని అందించకపోవడంతో సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. జిల్లాలో 180 మంది ఎదురుచూపులు.. అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసేవారిలో 65 ఏళ్ల వయస్సు నిండిన వారిని పదవీ విరమణ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా జిల్లాలో 120 మంది ఆయాలు, 60 మంది టీచర్లను రిటైర్మెంట్ చేయించింది. పదవి విరమణ చేసిన ఆయాలకు రూ.50 వేల చొప్పున, టీచర్లకు రూ.1 లక్ష వరకు సాయం అందిస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఆయాలకు రూ.1 లక్ష, టీచర్లకు రూ.2 లక్షలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించినా ఉత్తర్వులలో మాత్రం 50 శాతం కోత విధించింది. ఉత్తర్వుల ప్రకారమైనా జిల్లాలోని ఆయాలు, టీచర్లకు రూ.1.20 కోట్ల నిధులను విడుదల చేస్తే సరిపోతుంది. రెండేళ్లుగా రిటైర్ అయిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు బెన్ఫిట్స్ కోసం నిరీక్షిస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. ఇప్పటికైనా పదవీ విరమణ చేసిన అంగన్వాడీ ఆయాలు, టీచర్లకు బెనిఫిట్ సొమ్ము విడుదల చేయాలని కోరుతున్నారు. నిధులు విడదల చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్తున్నారు.పదవీ విరమణ చేసిన ఉద్యోగుల మాదిరిగానే ఆయాలు, టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్‌ను అందిస్తే సంతోషంగా ఉంటుంది. హామీ ఇచ్చిన ప్రకారం కాకపోయినా ఉత్తర్వులలో ఉన్న విధంగానైనా అ మలు చేయాలి. నిధుల విడుదలలో నిర్లక్ష్యం తగదు. త్వరలో నిధులు విడుదల చేయకపోతే ఆందోళనలు చేస్తాం. – దేవగంగు,అంగన్వాడీ హెల్ప్‌ర్స్, టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు పదవీ విరమణ చేసిన ఆయాలు, అంగన్వాడీ టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్ కింద మంజూరు కావాల్సిన డబ్బుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం మంజూరు చేయగానే వారికి సొమ్మును అందజేస్తాం. – రసూల్ బీ, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి పదవీ విరమణ చేసిన ఆయాలు, టీచర్లకు అందని బెనిఫిట్స్ ఆయాలకు రూ.50 వేలు, టీచర్లకు రూ.లక్ష అందజేస్తామన్న ప్రభుత్వం రెండేళ్లు గడుస్తున్నా నయాపైసా ఇవ్వని వైనం -
నిజామాబాద్
గ్రామాభివృద్ధిలో.. గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి పేర్కొన్నారు.ఆదివారం శ్రీ 11 శ్రీ జనవరి శ్రీ 2026– IIలో uనందిపేటలో వీడీసీ అడ్డుకున్న భవన నిర్మాణం ఇదే..గ్రామాల్లో వీడీసీల ప్రభుత్వ, ప్రైవేటు భూముల ఆక్రమణలకు ఎదురు లేకుండా పోయింది. బాధితుల ఫిర్యాదు మేరకు విచారించిన కోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తోంది. అయితే, అధికారులు, వీడీసీలు మిలాఖత్ కావడంతో క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. నందిపేట మండల కేంద్రంలో బఫర్ జోన్లో భవనం నిర్మిస్తున్నారని అడ్డుకున్న వీడీసీ అక్కడే గోడ నిర్మించడం విస్మయానికి గురిచేస్తోంది. ఒకరు ఇంటి కోసం వేసుకున్న బోరును పూడ్చివేయడం, మరొకరి పొలం గట్లను ధ్వంసం చేయడం మచ్చుకు కొన్ని వీడీసీల ఆగడాలకు నిదర్శనం -
ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలి
● ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ● కలెక్టరేట్లో ఘనంగా సావిత్రీబాయిఫూలే జయంతి వేడుకలు నిజామాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని, వారు అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఎస్సెస్సీ పరీక్షల్లో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత నమోదయ్యేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. నగరంలోని కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం సావిత్రీబాయి ఫూలే జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరు కాగా, ఫూలే చిత్రపటానికి కలెక్టర్ ఇలా త్రిపాఠి, అధికారులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అత్యుత్తమ సేవలు అందించిన మహి ళా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను సత్కరించి, జ్ఞాపికలు బహూకరించారు. సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుందన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. చదువులో వెనుకబడిన పిల్లలను చిన్నచూపు చూడకుండా, వారిపట్ల సానుకూల ధృక్పథాన్ని కనబరుస్తూ మరింతగా ప్రోత్సహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, వ్యవసాయ శా ఖ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, రాష్ట్ర సహకార సంఘాల ఫెడరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, అదనపు కలెక్టర్ అంకిత్, డీఈవో అశోక్, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి బోధన్‌టౌన్(బోధన్): ప్రభుత్వం అందించే వైద్యసేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి అన్నారు.పట్టణంలోని గ్రామ చావిడీ వద్ద నూనతంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన వైద్యపరీక్షలు చేయించుకున్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, సబ్ కలెక్టర్ వికాస్ మహతో, కమిషనర్ జాదవ్ కృష్ణ, తహసీల్దార్ విఠల్, వైద్యాధికారులు నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు. అన్ని హంగులతో సమీకృత రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం చేపడతాం బోధన్‌రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమీకృత రెసిడెన్షియల్ స్కూల్‌ను అన్ని హంగులతో నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని బెల్లాల్ గ్రామంలో శుక్రవారం ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠి, బోధన్ సబ్ కలెక్టర్‌తో కలిసి సమీకృత రెసిడెన్షియల్ స్కూల్, వసతి గృహల నిర్మాణాల కోసం స్థలాన్ని పరిశీలించారు. త్వరలోనే పనులు ప్రారంభించి గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. -
విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకోవాలి
ఖలీల్‌వాడి: విద్యార్థులు లక్ష్యాలను నిర్ధేశించుకొని ముందుకు వెళ్లాలని బ్లూమింగ్ బడ్స్ స్కూల్ కరస్పాండెంట్ ఎన్. ప్రసన్న కుమారి, ప్రెసిడెంట్ పూర్ణచందర్‌రెడ్డి అన్నారు. నగరంలోని గంగాస్థాన్ ఫేజ్–2లోని బ్లూమింగ్ బడ్స్ స్కూల్లో శుక్రవారం స్కూల్ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వారు హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, తల్లిదండ్రుల ఆశయాలకు అనుకూలంగా ముందుకు వెళ్లాలన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అలరించాయి. గత సంవత్సరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులను కరస్పాండెంట్ ప్రసన్న కుమారి అందజేశారు. వ్యాపారవేత్త దినేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గోమాత దీక్ష
● ప్రతి ఏటా సంక్రాంతికి ముందు మాల వేసేలా నియమాలు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఇందూరు నగరంలో గోమాత లను సంరక్షించేందుకు ఇప్పటి కే కొందరు కృషి చేస్తున్నా రు. ఈక్రమంలో ఈ ఏడాది నుంచి గోమాత దీక్ష సైతం చేపట్టారు. ప్రతి జనవరిలో మాత్రమే ఈ దీక్ష ఉంటుంది. నగరానికి చెందిన తెలంగాణ గోప్రచారక్ సేవాసమితి స్టేట్ ఆర్గనైజర్ గున్నాల నవీన్‌కుమార్ ఈ దీక్షను స్వీకరించారు. ఈ నెల 3 నుంచి 13 వరకు ఈ దీక్ష చేయనున్నారు. ఇందులో భాగంగా నేల మీదే నిద్రించడం, రోజుకు ఒకే సారి సాత్వికాహారం భుజించడం చేయనున్నారు. అలాగే నిత్యం గోపూజ చేయనున్నారు. ఈనెల 7న గోప్రచారక్ సేవాసమితి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, హింగుళాంబ ఆలయం చైర్పర్సన్ విజయలత ద్వారా 108 మంది మహిళలతో సామూహిక గోపూజ నిర్వహించారు. రెంజల్(బోధన్): రెంజల్ ఉప సర్పంచ్ చీలం మానస రాకేష్‌రెడ్డి గ్రామంలోని యువతను సన్మార్గంలో నిలిపేందుకు ప్రయత్నిస్తున్నారు. యువత చెడు వ్యసనాలను దూరం చేసేందుకు కృషి చేస్తు న్నారు. ఇందులో భాగంగా గ్రామంలో ఎవరైనా గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందిస్తే వారికి రూ. 5వేల నజరానా ప్రకటించారు. సొంత ఖర్చులతో ఉప సర్పంచ్ పనులు చేస్తుండటంతో గ్రామస్తులు అభినందిస్తున్నారు. -
ఉపాధిహామీ పథకం పేరు మార్పు సరికాదు
● మొత్తం పనిదినాలను కేంద్రమే భరించాలి ● డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి నిజామాబాద్ రూరల్: మహాత్మాగాంధీ జాతీయగ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు సరికాద ని డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి అన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి పాత పేరును, విధానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో వలసలను నివా రించడానికి యూపీఏ హయాంలో 100 రోజుల ఉ పాధి హామీ పథకాన్ని తీసుకువచ్చినట్లు గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఆ పథకా న్ని పేరు మారుస్తూనే దానిని నీరు గార్చే ప్రయ త్నం చేస్తున్నారన్నారు. పని దినాలను 125 రోజులు పెంచి కేవలం 75 రోజులు మాత్రమే కేంద్రం భరిస్తుందని, 50 రోజుల పని భారాన్ని రాష్ట్రాలపై మోపారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం హామీనిచ్చిన యువతకు 2 కోట్ల ఉద్యోగాలు ఉత్తమాటే అని అన్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఈనెల 20 నుంచి ఉపాధి హామీ పథకంపై కేంద్రం అన్యాయం గురించి ప్రజలకు వివరించాలని, అదేవిధంగా మొత్తం పని దినాలను కేంద్రమే భరించాలని ప్రతి గ్రామంలో సర్పంచులు తీర్మానం చేయాలని కోరారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, సురేష్ బాబా, యాదగిరి, రాజా నరేందర్ గౌడ్, సంతోష్, ఎజాస్, ఈసా, సాయిరెడ్డి, సర్పంచులు కిసాన్, జనార్దన్ పాల్గొన్నారు. -
మత్స్య సంఘాలు స్మార్ట్‌గా..
● కార్యాలయాల స్థాపన, కంప్యూటర్ల ఏర్పాటుకు నిధులు ● పీఎంఎంఎస్వై కింద జిల్లాలో 215 సంఘాలు ఎంపిక డొంకేశ్వర్(ఆర్మూర్): మత్స్య సహకార సంఘాలు స్మార్ట్‌గా మారనున్నాయి. చేపల వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు వారి భవనాల్లో కార్యాలయాలు, అందులో కంప్యూటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం (పీఎంఎంఎస్వై) కింద పూర్తి శాతం సబ్సిడీపై రుణ రూపంలో నిధులు ఇవ్వనుంది. ఈ మేరకు జిల్లాలో 215 చేపల రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్ఎఫ్పీవోలు) ఎంపికై య్యాయి. ప్రస్తుతం ఈ ప్రక్రియ నిధుల మంజూరు దశలో ఉంది. ఆన్లైన్లోనే క్రయవిక్రయాలు, ధరల నిర్ణయం.. జిల్లాలో మొత్తం 398 మత్స్య సహకార సంఘాలు ఉండగా ఇందులో 24వేలకు పైగా సభ్యులున్నారు. ఎఫ్పీవోలుగా ఏర్పడి పట్టిన చేపలను వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వ్యాపారులు నిర్ణయించిందే ధర కావడంతో మత్స్యకారులు నష్టపోతున్నారు. ఇందుకోసం మత్స్య సహకార సంఘాలకు ఉన్న భవనాల్లోనే కార్యాలయం, ఒక కంప్యూటరు, ఫర్నీచర్ ఏర్పాటు చేస్తోంది. ఆన్లైన్లోనే చేపల క్రయవిక్రయాలు, ధరలను నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. జిల్లాలో 35మందికి పైగా సభ్యులున్న సంఘాలను గుర్తించిన మత్స్యశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. 215 సంఘాలకు అర్హత లభించగా ఒక్కో సంఘానికి పూర్తి సబ్సిడీపై రూ.90వేలు ప్రభుత్వం ఇవ్వనుంది. కంప్యూటర్ల కొనుగోలు, ఫర్నీచర్ కోసం మత్స్య సంఘాలు తీర్మాణాలు చేసి ఫోటోలతో అందించాల్సి ఉంటుంది. కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కంప్యూటర్ల ద్వారా వ్యాపారం ఏవిధంగా చేయాలనే దానిపై జిల్లాలో ఏడు స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వం బాధ్యతలిచ్చింది. వీరు పర్యవేక్షణ చేసి మత్స్యకారులు తమ వ్యాపారాన్ని మెరుగు పరిచేందుకు కృషి చేస్తారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద జిల్లాలో 215 మత్స్య సంఘాలు ఎంపికయ్యాయి. వీటికి ప్రభుత్వం రూ.90వేల చొప్పున పూర్తి సబ్సిడీతో నిధులు ఇవ్వనుంది. వచ్చిన నిధులతో సొసైటీ భవనాల్లో ఆఫీసులు, కంప్యూటర్లు ఏర్పాటు చేసుకుని వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఈ అవకాశాన్ని మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలి. –ఆంజనేయస్వామి, జిల్లా మత్స్య శాఖ అధికారి -
పీజీ పరీక్షలు వాయిదా
తెయూ(డిచ్ పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 17 నుంచి జరగాల్సిన పీజీ 3, 9వ సెమిస్టర్ పరీక్షలను విద్యార్థుల వినతి మేరకు వాయిదా వేస్తున్నట్లు కంట్రోలర్ సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షల నిర్వహణ తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు. తెయూ బీఎడ్, బీపీఎడ్ పరీక్షల తేదీ పొడిగింపు తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో ఈనెల 16 నుంచి జరగాల్సిన బీఎడ్, బీపీఎడ్, 1, 3వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలను విద్యార్థుల కోరిక మేరకు ఈనెల 21 వరకు పొడిగించినట్లు కంట్రోలర్ సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఖలీల్‌వాడి: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ రెండవ సెమిస్టర్ ఆంగ్ల పాఠ్యాంశాల మెటీరియల్‌ను నగరంలోని జీజీ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ రంగరత్నం ఆవిష్కరించారు. ఆంగ్ల విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ దండు స్వామి సంపాదకత్వంలో మెటీరియల్‌ను రూపొందించారు. టీయూ ఆచార్యులు కెవి రమణాచారి, సమత విద్యార్థులకు ఉపయోగకరంగా మెటీరియల్ రూపొందించడంపై సంతోషం వ్యక్తం చేశారు. రచయితలు నాగజ్యోతి, ప్రతిభ, దస్తప్ప, అధ్యాపకులు రాజశేఖర్, నిఖత్ ఫాతిమా, లావణ్య, మౌనిక, సన్నీత్, వసంత్, స్థిత ప్రజ్ఞ తదితరులు పాల్గొన్నారు. తెయూ(డిచ్పల్లి):తెలంగాణ యూనివర్సిటీ అంతర కళాశాలల క్రికెట్ (పురుషుల) టోర్నమెంట్ విజేతగా నిషిత డిగ్రీ కళాశాల జట్టు నిలిచింది. శుక్రవారం వర్సిటీ క్రీడా మైదానంలో జ రిగిన ఫైనల్ మ్యాచ్‌లో గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలపై నిషిత డిగ్రీ కళాశాల జట్టు విజయం సాధించినట్లు స్పోర్ట్స్ డైరెక్టర్ బాలకిషన్ తెలిపారు.విజేత జట్టుకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ రాంబాబు ట్రోఫీని అందజేశారు. సుభాష్‌నగర్: నిజామాబాద్‌లోని ఐడీవోసీ కార్యాలయంలో కలెక్టర్ ఇలా త్రిపాఠిని ఎంపీ అర్వింద్ ధర్మపురి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం సీపీ కార్యాలయంలోని సీపీ సాయి చైతన్యను ఎంపీ అర్వింద్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో శాంతిభద్రతలపై చర్చించారు. -
భావి శాస్త్రవేత్తలను తయారుచేసేది టీచర్లే
● ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ● ముగిసిన రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన కామారెడ్డి టౌన్: భావి శాస్త్రవేత్తలను తయారు చేసే ది ఉపాధ్యాయులేనని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి పేర్కొన్నారు. గురువులు ఎప్పుడూ పూ జనీయులేనన్నారు. జిల్లా కేంద్రంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్ శుక్రవారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో ఎమ్మె ల్యే మాట్లాడుతూ విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధి సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నా రు. ఉపాధ్యాయులు బడిలోనే ఉండాలని, కానీ కొందరు బయట తిరుగుతున్నారని, దానిని తగ్గించుకోవాలని సూచించారు. రాబోయే బడ్జెట్ సమా వేశాలలో విద్యావ్యవస్థపై చర్చిస్తానన్నారు. కాగా ఉదయం ప్రదర్శనను సందర్శించిన ఆయన.. వి ద్యార్థులు తయారు చేసిన ఒక్కో ప్రాజెక్టును పరిశీలి స్తూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. సామాజిక సమస్యలకు పరిష్కారం చూపేలా నూతన ఆవిష్కరణలు ఉండాలన్నారు. విద్యార్థులు దేశభక్తి పెంపొందించుకోవడంతోపాటు నూతన ఆవిష్కరణల పై దృష్టి సారించాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. వివిధ స్థాయిలకు ఎంపిక రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిపి 1,700 మంది సైన్స్‌ఫెయిర్‌లో పాల్గొన్నారని జిల్లా సైన్స్ అధికారి సిద్ధరాంరెడ్డి తెలిపారు. మొత్తం 7 విభాగాలలో 870 ప్రదర్శనలు ఇ చ్చారన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచినవారిని దక్షి ణ భారత, జాతీయ స్థాయి సైన్స్‌ఫెయిర్‌లకు ఎంపిక చేశామన్నారు. వారికి బహుమతులు అందించారు. రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నికోలస్, డీఈవో రాజు, తదితరులు పాల్గొన్నారు. -
కామారెడ్డిలో దొంగల బీభత్సం
● ఐదు దుకాణాలు, రెండిళ్లలో చోరీకి పాల్పడిన షట్టర్ లిఫ్టింగ్ ముఠా ● భారీగా నగదు, విలువైన వస్తువుల అపహరణ కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలో శుక్రవారం వేకువజామున షట్టర్ లిఫ్టింగ్ ముఠా దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు బైక్‌ల మీద వచ్చిన నలుగురు దుండగులు పలు కాలనీల్లో దుకాణాలు, తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి అందినకాడికి దోచుకెళ్లారు. మరిన్ని దుకాణాలు, ఇళ్ల చోరీకి య త్నించారు. వివరాలు ఇలా.. ఉదయం 4 గంటల ప్రాంతంలో శ్రీరాంనగర్ కాలనీ బసేరా లాడ్జి గల్లీలో ఉన్న రెండు సెల్‌ఫోన్ షాపుల షట్టర్లను గడ్డపారలతో దుండగులు లిఫ్ట్ చేశారు. శ్రీలక్ష్మీ మొబైల్స్‌లోకి ప్రవేశించి రూ.25 వేలు నగదు, 5 సెల్ఫోన్లు, లక్ష్మీ నరసింహా మొబైల్స్ లోనుంచి సెల్ఫోన్లు, ఇతర వస్తువులు చోరీ చేశారు. అక్కడనుంచి భగత్‌సింగ్ నగర్ లయన్స్ క్లబ్ సమీపంలోని మరో మూడు దుకాణాల షట్టర్లను గడ్డపారలతో పైకెత్తి చోరీలు చేశారు. లక్ష్మీ గిఫ్ట్స్ అండ్ నావెల్టీస్ దుకాణంలోకి చొరబడి రూ.లక్ష నగదు, ఇతర విలువైన వస్తువులు, ఏఆర్ ఆన్లైన్ సెంటర్‌తోపాటు మరో ఇంటర్నెట్ సెంటర్లోకి చొరబడి రూ.10వేల వరకు దోచుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. తాళం వేసి ఉన్న శ్రీరాంనగర్ కాలనీకి చెందిన జమీరుద్దీన్, అశోక్‌నగర్ కాలనీకి చెందిన మహ్మద్ సిరాజ్‌ల ఇళ్లను టార్గెట్ చేశారు. తాళాలు పగులగొట్టి లోనికి చొరబడ్డారు. వారిళ్లలో విలువైన వస్తువులు, నగదు లేకపోవడంతో నష్టం జరుగలేదు. అంతేకాకుండా శ్రీరాంనగర్ కాలనీలోని వెంకటేష్ అనే వ్యక్తి బైక్ చోరీకి గురైనట్లు తెలిసింది. ముందుగా ఆ బైక్‌ను చోరీ చేసి దానిపైనే తిరుగుతూ ఇతర చోరీలకు పాల్పడినట్లు స్థానికులు భావిస్తున్నారు. ఆయా దుకాణాల్లో చోరీకి గురైన నగదు, వస్తువుల విలువ మొత్తం రూ.5 లక్షల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. పోలీసులు ఆయా దుకాణాలు, ఇళ్లకు చేరుకుని విచారణ జరిపారు. క్లూస్‌టీం బృందాలు ఆధారాలు సేకరించాయి. సీసీ కెమెరాలను పరిశీలించగా నలుగురు దుండగులు చోరీలకు పాల్పడినట్లు తెలుస్తుంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
క్రైం కార్నర్
ట్రాక్టర్ కిందపడి ఒకరి మృతి జక్రాన్‌పల్లి: మండలంలోని పడకల్ గ్రామంలో శుక్రవారం ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి ఓ వ్యక్తి మృతి చెందాడు.ఎస్సై మహేష్ తెలిపిన వివరాలు ఇలా.. పడకల్ గ్రామానికి చెందిన తలారి నరేందర్ (35) రెండేళ్లుగా ట్రా క్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.అదే గ్రామానికి చెందిన గు ద్దేటి రవి కేజ్‌వీల్ ట్రాక్టర్‌ను వేరే చోటికి తరలించడానికి తన ట్రాలీ ట్రాక్టర్‌పై ఎక్కించి ట్రాలీకి ఉన్న పట్టీలు పెడుతున్నాడు. ఆకస్మాత్తుగా ట్రాక్టర్ ముందు కు జరగడంతో నరేందర్ గమనించి ఇంజిన్ వద్దకు వెళ్లి ఆపడానికి ప్రయత్నించాడు. ఈక్రమంలో నరేందర్ కాలుజారి ట్రాక్టర్ కింద పడిపోయాడు. దీంతో ట్రాక్టర్ వెనుక టైరు అతని కాళ్లపై నుంచి వెళ్లగా తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ట్రాక్టర్ పైనుంచి పడి యువకుడు.. రుద్రూర్: పోతంగల్ మండలం కొడిచర్లలో ఓ యువకుడు ట్రాక్టర్ పైనుంచి పడి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. కొడిచర్ల గ్రామానికి చెందిన మేత్రి సాయికుమార్ (18) అనే యువకుడు శుక్రవారం కొడిచర్ల నుంచి పోతంగల్ వెళ్తున్న ఇసుక ట్రాక్టర్‌ను లిప్ట్ అడిగి ఎక్కాడు. ట్రాక్టర్‌పై అతడు ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా జారిపడటంతో తలకు తీవ్ర గాయాలయ్యా యి. స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో బోధన్ ప్రభుత్వా స్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సునీల్ తెలిపారు. అదృశ్యమైన యువకుడు అనుమానాస్పద స్థితిలో.. లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ఎక్కపల్లి గ్రామాని కి చెందిన గంగమ్మల భరత్(19) అనే యువకుడు అదృశ్య మై శుక్రవారం అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితి లో మృతిచెందిరట్లు ఎస్సై దీపక్‌కుమార్ తెలిపారు. వివరాలు ఇలా..ఆదివారం మధ్యాహ్నం ఇంట్లోంచి వెళ్లిన భరత్ తిరిగి ఇంటికి రాలేడు. దీంతో అతడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా,కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టా రు. శుక్రవారం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో భరత్ మృతిచెంది ఉండటం,అతడి కాళ్లు కట్టేసి ఉండడంతో కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం వర్ని: వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్యనారాయణపురం గ్రామ శివారులో నిజాంసాగర్ ప్రధాన కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు వర్ని ఎస్సై వంశీకృష్ణ శుక్రవారం తెలిపారు. కాలువలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి వారు చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేవని, వయస్సు సుమారు ముప్పై ఏళ్లు ఉంటాయన్నారు. ఒంటిపై మెరున్ రంగు టీ షర్టు, యాష్ కలర్ కాటన్ ప్యాంటు ధరించి ఉన్నాడని, ఎవరికై నా ఆచూకీ తెలిస్తే వర్ని పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు. -
క్రీడల్లో జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేయాలి
● కలెక్టర్ ఇలా త్రిపాఠి ● అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్‌తో కలిసి సీఎం కప్ టార్చ్రిలే ర్యాలీ ప్రారంభంసుభాష్నగర్: క్రీడా రంగంలో జిల్లా ఖ్యాతిని మరింతగా ఇనుమడింపజేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్–2026 సెకండ్ ఎడిషన్ క్రీడా పోటీలను పురస్కరించుకొని శుక్రవారం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో కలిసి జెండా ఊపి టార్చ్ రిలే ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. పాలిటె క్నిక్ మైదానం నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన మార్గాల మీదుగా పాత కలెక్టరేట్ గ్రౌండ్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ జిల్లా నుంచి నిఖత్ జరీన్, యెండల సౌందర్య, గుగులోత్ సౌమ్య, హుస్సాముద్దీన్ వంటి అనేక మంది అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ప్రాతినిధ్యం వహిస్తుండటం ఎంతో గొప్ప విషయ న్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు, గ్రామీణ ప్రాంత క్రీడాకారులు ప్రతిభను మెరుగుపర్చుకోవాలని సూచించారు. తాను కూడా స్విమ్మింగ్ క్రీడాకారిణి అని, ఫ్రీ స్టైల్, రిలే, బట్టర్ ఫ్లై తదితర విభాగాల్లో అనేక పోటీల్లో పాల్గొన్నానని గుర్తు చేశారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో ఆసక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి పవన్ కుమార్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. క్రీడలతో మానసిక స్థైర్యం సీపీ సాయి చైతన్యసుభాష్నగర్: క్రీడలు యువతను చెడు అలవాట్లకు దూరంగా ఉంచుతాయని, మానసిక స్థై ర్యాన్ని పెంపొందిస్తాయని సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. సీఎం కప్–2 టార్చ్ ర్యాలీ ముగింపు కార్యక్రమం నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీపీ మాట్లాడుతూ రాష్ట్రంలోని యువతలో క్రీడలపై ఆసక్తిని పెంచుతూ, విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంలో సీఎం కప్–2026 కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఇందులో పాల్గొనే క్రీడాకారులందరూ ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి, దేశానికి పేరు తేవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. -
వీబీ జీ రామ్ జీతో గ్రామాల అభివృద్ధి
● అవకతవకలకు చెల్లుచీటి ● చట్టంతో రాష్ట్రాల బాధ్యత పెరిగింది ● ఎంపీ అర్వింద్ ధర్మపురి సుభాష్‌నగర్: వికసిత్ భారత్ రోజ్‌గార్ ఔర్ అజీవిక మిషన్ (వీబీ జీ రామ్ జీ) చట్టం భవిష్యత్ గ్రామాల అభివృద్ధికి దిక్సూచిలాంటిదని ఎంపీ అర్వింద్ ధర్మపురి పేర్కొన్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఆయ న మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో కలిసి మాట్లాడారు. వీబీ జీ రామ్ జీ చట్టంతో గ్రామాల్లో దీర్ఘకాలికంగా ఉపయోగపడే పనులు, పని దినాలు 125 రోజులకు పెంచడం, ఎస్టీ, ఆదివాసీ, గిరిజనులకు 150 రోజులు పని కల్పించడమేనని తెలి పారు. అనేక పథకాలను అధ్యయనం చేసి శాసీ్త్రయంగా ఈ పథకాన్ని కేంద్రం రూపొందించిందని పేర్కొన్నారు. ప్రధానంగా అవకతవకలకు చెల్లుచీటి పలికిందని, రాష్ట్రాల వాటా 40 శాతానికి పెంచిందని చెప్తూనే.. దేశంలో అధిక రా ష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందన్న విషయాన్ని కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు గుర్తెరగాలన్నారు. చెల్లింపుల కోసం పనులకు జియో ట్యాగింగ్‌తోపాటు ఆధార్‌కార్డు అనుసంధానం చేస్తూ పని చేసిన వారి బ్యాంకు ఖాతాల్లోనే ప్రతి వారం డబ్బులు నేరుగా జమ అవుతాయన్నా రు. డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ కావడం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని విమర్శించారు. జీ రామ్ జీ పథకంతో రాష్ట్రాలకు బాధ్యత పెరిగిందని, ఈ పథకంలో రాష్ట్రాల భాగస్వామ్యం పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలతో మమేకమై గ్రామపంచాయతీకి అవసరమైన పనులను గుర్తించి, పని చేయించాలన్నారు. కేంద్రంపై యుద్ధం చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అనడం సిగ్గుచేటన్నారు. కేంద్రం నిధులు రాకపోవడం, తగ్గిపోవడం, నిలిచిపోవడానికి రాష్ట్రాలు తమ వాటాను చెల్లించకపోవడమేనని అన్నారు ‘ఇందూరు’గా మార్చి తీరుతాం.. నిజామాబాద్ కార్పొరేషన్లో బీజేపీ మేయర్ అయిన వెంటనే ఇందూరుగా పేరు మార్చడమే మొదటి ఎజెండాతో ముందుకెళ్తామని ఎంపీ అర్వింద్ అన్నారు. ఇందూరు పేరు పెట్టి తీరుతామని, హిందుస్తాన్ అనే పేరు భవిష్యత్‌లో ఉంటుందన్నారు. నిజాంషుగర్స్, నిజాంసాగర్ కెనాల్, నిజామాబాద్‌లో యూజీడీ, అభివృద్ధి నిలిచిపోయాయని, నిజాం పేరు మారిస్తేనే శని పోతుందని అభిప్రాయపడ్డారు. అభివృద్ధిని చూసి ఓటేయాలని, పనిచేయని వారికి ఓటేస్తే ప్రయోజనం ఉండదని మైనార్టీలు, ఎంఐఎంలను ఉద్దేశించి పేర్కొన్నారు. కవిత పార్టీకి సీఎం రేవంత్‌రెడ్డి ఫండింగ్ చేస్తున్నారని ఎంపీ ఆరోపించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి, రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతిరెడ్డి, నాయకులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, జ్యోతి, పంచరెడ్డి ప్రవళిక, మల్లేశ్ యాదవ్, మాస్టర్శంకర్, కిషన్ పాల్గొన్నారు. -
స్టడీ టూర్లను సద్వినియోగం చేసుకోవాలి
● కలెక్టర్ ఇలా త్రిపాఠి ● రాష్ట్రపతి భవన్లో ఉద్యాన్ ఉత్సవ్‌కు తరలిన మోపాల్ విద్యార్థినులు నిజామాబాద్ అర్బన్: ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో జరిగే ఉద్యాన్ ఉత్సవ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలుగా ఏర్పాటు చేసిన స్టడీ టూర్ (అధ్యయన యాత్ర)ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యార్థినులకు సూచించారు. సికింద్రాబాద్, బొల్లారంలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహిస్తున్న ఉద్యాన్ ఉత్సవ్‌లో ప్రదర్శనలను తిలకించేందుకు వీలుగా జిల్లా యంత్రాంగం తరపున మోపాల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలకు చెందిన 52మంది విద్యార్థినులను ఎంపిక చేశారు. వీరిని శుక్రవారం ప్రత్యేక బస్సులో రాష్ట్రపతి భవన్‌కు పంపించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద విద్యార్థినులు వెళ్తున్న బస్సుకు కలెక్టర్ ఇలా త్రిపాఠి పచ్చజెండా ఊపారు. ఈ సందర్భంగా బాలికలను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. ఉద్యాన ఉత్సవ్‌లో ఎన్నో రకాల పుష్పాలు, మొక్కలను ప్రదర్శనలో ఉంచుతారని, వాటి గురించి అవగాహన ఏర్పర్చుకోవాలని సూచించారు. డీఈవో అశోక్, ఉద్యానవన శాఖ ఏపీడీ భారతి తదితరులు పాల్గొన్నారు. -
జైలులో దోస్తీ.. ఏటీఎంల దోపిడీ
● మధ్యప్రదేశ్‌లో పరిచయమై తెలంగాణలో చోరీలు ● అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు ● వివరాలు వెల్లడించిన సీపీ సాయిచైతన్య నిజామాబాద్ అర్బన్: జైలులో పరిచయమైన నేరస్తులు విడుదల అనంతరం ఏటీఎంలను కొల్లగొడుతూ లక్షలు దోచుకుంటున్నారు. నగరంలోని ఖలీల్‌వాడి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎంను దోచుకునేందుకు యత్నించిన వారని పోలీసులు శుక్రవారం జిల్లా కేంద్రంలో పట్టుకున్నారు. పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ సాయిచైతన్య మీడియాకు వివరాలు వెల్లడించారు. చోరీలు ఇలా.. అబ్దుల్లా, అమీర్ మొదట హైదరాబాద్‌లో చోరీకి నిర్ణయించారు. తోడుగా అబీద్, అర్షద్‌ను కలుపుకున్నారు. ఏటీఎంను కొల్లగొట్టేందుకు అవసరమైన ఆక్సిజన్ సిలిండర్, చిన్న ఎల్పీజీ సిలిండర్, గ్యాస్‌కట్టర్, గ్లౌస్లు, నల్లటి రంగు స్ప్రే బాటిళ్లను కొను గోలు చేశారు. గతేడాది జులై 8న హైదరాబాద్‌లోని షాపూర్‌నగర్ వద్ద హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఏటీఎం కొల్లగొట్టి రూ.30 లక్షలు దోచుకున్నారు. రెండు బైక్‌లను చోరీ చేసి కామారెడ్డి మీదుగా ఆదిలాబాద్ అ క్కడి నుంచి హర్యానాకు పారిపోయారు. ఈ కేసు లో పోలీసులు అమీర్, అబిద్, అర్షద్‌ను అరెస్టు చే యగా, అబ్దుల్లా తప్పించుకున్నాడు. ఇదే కేసులో బెయిల్‌పై బయటికి వచ్చిన అమీర్ మళ్లీ అబ్దుల్లా తో కలిసి వాజీబ్, అబీద్, ఇక్రామ్లను కలుపుకొని కొత్త గ్యాంగ్‌ను ఏర్పాటు చేశాడు. జహీరాబాద్‌లోని టోల్‌ప్లాజా వద్ద ఏటీఎం చోరీకి యత్నించారు. డిసెంబర్ 31న జిల్లా కేంద్రంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం కొల్లగొట్టేందుకు యత్నించగా పోలీసులు రావడంతో పరారయ్యారు. చిక్కారిలా.. జిల్లా కేంద్రంలో నిఖిల్‌సాయి హోటల్ వద్ద శుక్రవారం వాహనాల తనిఖీ చేపట్టగా అబ్దుల్లా, అమీ ర్, మరి కొందరు అనుమానాస్పదంగా కనిపించా రు. దీంతో వారి వాహనం తనిఖీ చేయగా కర్రలు, ఇతర మరణాయుధాలు లభించాయి. అదుపులోకి తీసుకొని విచారించిన అనంతరం అబ్దుల్లా, అమీర్, వాజీద్‌ఖాన్, మొహమ్మద్ అజీబ్, ఇక్రామ్‌ను అరెస్టు చేశారు. సమావేశంలో ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్అలీ, ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి, ఎస్సై సుమలత పాల్గొన్నారు. శివపురి జైలులో..హర్యానా రాష్ట్రానికి చెందిన అబ్దుల్లా ఖాన్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను అసీఫ్, అర్షద్, అజ్మీర్‌లను కలుపుకొని 2018లో ఉదయ్‌పూర్‌లో ఏటీఎం కొల్లగొట్టారు. అనంతరం మధ్యప్రదేశ్‌లోని శివపురిలో ఏటీఎంను కొల్ల గొట్టి రూ.8 లక్షలు దోచుకున్నారు. విచారణ చేపట్టిన మధ్యప్రదేశ్ పోలీసులు అబ్దుల్‌ను పట్టుకొని శివపురి జైలుకు తరలించారు. హైదరాబాద్‌కు చెందిన అమీర్, మధ్యప్రదేశ్‌కు చెందిన బాలికను తీసుకువచ్చిన కేసులో అరెస్టయ్యి శివపురి జైలుకు చేరుకున్నాడు. అప్పటికే ఇదే జైలులో ఉంటున్న అబ్దుల్లాతో అమీర్‌కు పరిచయం ఏర్పడింది. వీరిద్దరు కలిసి తెలంగాణలో దొంగతనాలు చేయాలని భావించారు. వీరికి తోడు మరికొందరిని కలుపుకొని చోరీలకు పాల్పడుతూ వచ్చారు. -
ఒక్కో వీడీసీది ఒక్కో లెక్క
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో సమాంతర వ్యవస్థలు నడుపుతున్న గ్రామాభివృద్ధి కమిటీలు(వీడీసీ) ఒక్కో గ్రామంలో ఒక్కోవిధంగా తమ హవా కొనసాగిస్తున్నాయి. గ్రామా ల్లో ప్రతి విషయంలో తాము చెప్పినట్లే నడవాలనే ఉద్దేశంతో వీడీసీ సభ్యులు, ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికల సంఘం, ఎన్నికల నియమావళితో నిమిత్తం లేకుండా పలు గ్రామాల్లో సర్పంచ్‌లు, ఉప సర్పంచ్ పదవులను వేలం వేశారు. కొన్ని గ్రామాల్లోనైతే ఏకంగా ఇసుక, మొరం మాఫియాతో చేతులు కలిపి డమ్మీ అభ్యర్థులను బరిలో నిలిపి, తమ చెప్పుచేతల్లో ఉండే వాళ్లు స ర్పంచ్లుగా ఎన్నికయ్యేలా చేశారు. గెలిచిన సర్పంచ్‌లు, పాలకవర్గ సభ్యులు స్వేచ్ఛగా, సొతంత్రంగా పనిచేసే వాతావరణం లేకుండా చేశారు. వీడీసీలు, ఇసుక, మొరం మాఫియా ఏది చెబితే అదే చేయాలనేవిధంగా హుకుం జారీ చేస్తున్నారు. వీడీసీల కథలు ఒక్కో గ్రామంలో ఒక్కోలాగా ఉన్నాయి. వీడీసీలను అడ్డం పెట్టుకుని అధికార పార్టీకి చెందిన కొందరు నియోజకవర్గ నాయకులు సొంత దందాకు తెరలేపినట్లు తెలుస్తోంది. ● వెల్మల్‌లో వీడీసీ వ్యవహారం ఇంతటితో ఆగలేదు. గత నెల 28న గ్రామంలో బెల్టు దుకాణం కోసం వేలం వేయగా రూ.2.65 లక్షలు పలికింది. చికెన్ దుకాణం రూ.3.25 లక్షలు పలికింది. దీనిపై రాములు నిజామాబాద్ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. ఇంకా కేసు నమోదు కాలేదు. ● మోర్తాడ్ మండలం దొన్కల్ గ్రామంలోనూ పంచాయతీ ఎన్నికల సమయంలో వీడీసీ అరాచకంపై పలువురు కలెక్టర్‌కు ఫిర్యాదులు చేశారు. గ్రామంలో సర్పంచ్ పదవిని రూ.32.80 లక్షలకు, ఉప సర్పంచ్ పదవిని రూ.7 లక్షలకు వేలం వేసినట్లు ఫి ర్యాదులో పేర్కొన్నారు. తమను నామినేషన్లు వేయ నీయకుండా, ఓటు హక్కు వినియోగించుకోనీయ కుండా చేస్తున్నారని పలువురు ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు వెల్లడించారు. వీడీసీని కాదని నామినేషన్లు వేస్తే ప్రతీకారంతో ప్రాణహాని చేసేందుకు ప్రయత్నాలు చేసే అవకాశముందని, తమకు రక్షణ కల్పిస్తే నామినేషన్లు వేస్తామని వివరించారు. అతి కష్టం మీద కొందరు నామినేషన్లు వేసినప్పటికీ చివరకు ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ● వేల్పూర్ మండలం అంక్సాపూర్‌లో సర్పంచ్ పదవిని రూ.26.40 లక్షలకు వేలం వేశారు. అధికారులకు అనుమానం రాకుండా డమ్మీ నామినేషన్లు వేయించారు. తరువాత డమ్మీ అభ్యర్థులను ఉపసంహరింపచేసి ఏకగ్రీవం అయ్యేలా చేశారు. ● మాక్లూర్ మండలం మాదాపూర్ గ్రామంలో మొరం, ఇసుక దందాలో ఆరితేరిన ఓ మాజీ సర్పంచ్, అతని కుమారులు హవా నడిపిస్తున్నారు. రెవెన్యూ, పోలీసు యంత్రాంగాన్ని మేనేజ్ చేసుకుంటూ అక్రమంగా సంపాదించిన డబ్బుతో సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసిన ముగ్గురు ఎస్సీ కమ్యూనిటీ అభ్యర్థులను కిడ్నాప్ చేసి ఎన్నికలు లేకుండా చేశారు. ఈ అక్రమార్కులు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులను భయపెట్టించి, ఇద్దరితో నామినేషన్లు ఉపసంహరణ చేయించి ఒకరిని మాత్రమే బరిలో ఉంచి ఏకగ్రీవం చేయించారు. ప్రస్తుతం ఇసుక, మొరం దందాకు పకడ్బందీ పథక రచన చేసినట్లు తెలిసింది. నందిపేట మండలం వెల్మల్ గ్రామంలో వీడీసీ రెండుగా చీలిపోయింది. అయితే ఇక్కడ ఒక వీడీసీ మాత్రం ఒక అభ్యర్థినే బరిలో నిలబడాలని తీర్మానం చేసింది. ఇక మరో వీడీసీ మరో అభ్యర్థిని నిలబెట్టింది. కాగా వీడీసీలు బలపర్చిన అభ్యర్థులు కాకుండా బోగ రాములు అనే మరో సొతంత్ర అభ్యర్థి బరిలో నిలిచాడు. కాగా ఒక్కరే నిలబడాలని తీర్మానం చేసిన వీడీసీ తమకు ఎదురు నిలిచి బరిలో నిలబడ్డ బోగ రాములును ఇబ్బందులకు గురిచేసింది. బోగ రాములు నామినేషన్ వేసేందుకు అధికార యంత్రాంగం మద్దతు తీసుకున్నాడు. ఎంపీడీవో సమక్షంలో రాములు నామినేషన్ దాఖలు చేయాల్సి వచ్చింది. అయితే రాములును బలపరిచేవారు వీడీసీకి భయపడ్డారు. అతికష్టం మీద ఒక ఓటరు మద్దతు రాగా రాములు నామినేషన్ వేశాడు. ఒకే నామినేషన్ వేయాలని తీర్మానం చేసిన వీడీసీ రాములుకు ఓట్లు వేయకుడదని తీర్మానం చేసింది. దీంతో రాములు ఈ దౌర్జన్యంపై ఫిర్యాదు చేయగా ఈ నెల 4న పోలీసులు కేసు నమోదు చేశారు. వీడీసీ సభ్యులు స్టేషన్ బెయిల్‌పై బయటకు వచ్చారు. మరోవైపు తీర్మానం చేసిన వీడీసీ నిలబెట్టిన అభ్యర్థి కాకుండా మరో వీడీసీ నిలబెట్టిన అభ్యర్థి సర్పంచ్‌గా గెలుపొందాడు. స్వతంత్ర అభ్యర్థి రాములు మాత్రం మానవహక్కుల సంఘం వద్ద ఫిర్యాదు చేశాడు. ప్రభుత్వం, ఈసీ, కోర్టు తీర్పులను సైతం ధిక్కరించే వ్యవహార శైలి జీపీ పాలకవర్గాలు తమ కనుసన్నల్లో పనిచేయాల్సిందేనని హుకుం జిల్లాలో పలుచోట్ల వేలం ద్వారా ఎన్నికై న సర్పంచ్, ఉపసర్పంచ్లు అధికారులకు, మానవహక్కుల సంఘాలకు ఫిర్యాదులు చేసిన బాధితులు తాజాగా వెల్మల్ గ్రామంలో బెల్ట్‌షాపు, చికెన్ దుకాణానికి వేలం వేసిన వీడీసీ -
పరీక్షలకు సిద్ధం కావాలి
● ఇంటర్మీడియట్ స్పెషల్ ఆఫీసర్ దాసరి ఒడ్డెన్న ఖలీల్‌వాడి: ఇంటర్మీడియట్ విద్యార్థులకు భ విష్యత్తులో బంగారు బాట వేస్తుందని ఉమ్మ డి జిల్లా ఇంటర్ ప్రత్యేకాధికారి దాసరి ఒడ్డె న్న పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్, ఆర్మూ ర్, డిచ్పల్లి కళాశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే 45 రోజుల్లో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఉన్నాయని, విద్యార్థులు సి ద్ధం కావాలని తెలిపారు. ఇంటర్ బోర్డు కల్పిస్తున్న అన్ని సౌకర్యాలను సద్వినియో గం చేసుకొని, ప్రతి విద్యార్థి పరీక్షల్లో ఉత్తీ ర్ణత సాధించేందుకుగాను చదువుపై దృష్టి సారించాలని చెప్పారు. విద్యార్థులు చదువుతున్న క్రమంలో వచ్చే అనుమానాలను నివృత్తి చేయడానికి అధ్యాపకులు సిద్ధంగా ఉన్నారరని అన్నారు. అనంతరం కళాశాల అధ్యాపకులతో నిర్వహించిన సమావేశంలో ఒడ్డెన్న మాట్లాడుతూ అధ్యాపకులు సమన్వయంతో పనిచేస్తూ మంచి ఫలితాలను సాధించాలన్నారు. 20న మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్‌ను విజయవంతం చేసేందుకు అధ్యాపకులు కృషి చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఐఈవో తిరుమలపుడి రవికుమార్, ప్రిన్సిపాళ్లు బుద్ధిరాజ్, చంద్రవిఠల్, విజయలక్ష్మితోపాటు అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్ పరీక్షకు శిక్షణ ఖలీల్‌వాడి: బ్యాంకింగ్, ఆర్ఆర్బీ, స్టాఫ్ సెలక్షన్ పరీక్షలకు సిద్ధమయ్య ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభ్యర్థులు ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజ గంగారాం, ఇంచార్జి డైరెక్టర్ సోమశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ నగరంలోని నాందేవ్‌వాడ ఎస్సీ స్టడీ సర్కిల్ లో ఐదు నెలలపాటు శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 30 వరకు http.//tsstudycircle.co.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. అభ్యర్థులు డిగ్రీ అర్హత ఉండి, కుటుంట వార్షిక ఆదాయం రూ. 3 లక్షలకు తక్కువ ఉన్నావారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఫిబ్రవరి 8 న నిజామాబాద్‌లో ప్రవేశ పరీక్ష ఉంటుందని, మార్కుల ఆధారంగా 100 మంది అభ్యర్థులు ఎంపిక చేస్తామన్నారు. పూర్తి వివరాలకు 9440196945, 9951199460, 9490511953 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. ‘సాగర్’కు సింగూరు జలాలు ● నేటి నుంచి నీటి విడుదల నిజాంసాగర్: సంగారెడ్డి జిల్లాలోని సింగూర్ ప్రాజెక్టునుంచి నిజాంసాగర్‌కు శనివారం నీటి విడుదలను ప్రారంభించనున్నారు. రోజుకు 3 వేల క్యూసెక్కుల చొప్పున మొత్తం 8 టీఎంసీల నీటిని వరద గేట్ల ద్వారా వదలనున్నారు. సింగూరు ప్రాజెక్టు కరకట్టతో పాటు రివిట్మెంట్ బలోపేతం పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 13 కోట్లు మంజూరు చేసింది. దీంతో మరమ్మతు పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులో ఉన్న నీటిని ఖాళీ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు నీటి విడుదలకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో 16 టీఎంసీల మేర నీటి నిల్వలు ఉన్నాయి. ప్రాజెక్టు మరమ్మతుల నేపథ్యంలో 8 టీఎంసీలను ఖాళీ చేయాలని అధికారులు నిర్ణయించారు. వరద గేట్ల ద్వారా రోజుకు మూడు వేల క్యూసెక్కుల చొప్పున దిగువనకు విడుదల చేయనున్నారు. మంజీర డ్యాంతో పాటు మంజీర నది ద్వారా సింగూరు జలాలు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి చేరతాయి. పరవళ్లు తొక్కనున్న మంజీర వర్షాకాలంలో భారీ వర్షాలు కురియడంతో దాదాపు సీజన్ మొత్తం మంజీర నది పరవళ్లు తొక్కింది. నెల రోజులుగా వర్షాలు లేకపోవడంతో నది శాంతించింది. అయితే సింగూర్‌నుంచి నీటిని విడుదల చేయనుండడంతో మరోసారి నదికి జలకళ రానుంది. నిజాంసాగర్‌లో 14 టీఎంసీల నిల్వ నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,045 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా.. శుక్రవారం సాయంత్రానికి 1,402.44 అడుగుల(14.253 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. -
నిజామాబాద్
ఇంటికి పోదాం.. శనివారం శ్రీ 10 శ్రీ జనవరి శ్రీ 2026చలో చలో సంక్రాంతి సెలవులు రావడంతో విద్యార్థులు ఆనందంగా సొంతూళ్లకు బయల్దేరారు. హాస్టళ్లు, అద్దె గదుల్లో ఉంటూ చదువుకుంటున్న వారూ పల్లెబాట పట్టారు. దీంతో జిల్లా కేంద్రంలోని బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కిటకిటలాడాయి. బస్సుల్లో సీట్ల కోసం పోటీపడుతూ కనిపించారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ -
అంగన్వాడీల్లో మెరుగైన సేవలందించాలి
● ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ● బోధన్‌లో అంగన్వాడీ కేంద్రాలకు ఉచితంగా గ్యాస్ పొయ్యిల పంపిణీబోధన్: అంగన్వాడీ కేంద్రాల పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించాలని, ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది సమర్ధవంతంగా పని చేయాలని ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి సూచించారు. బోధన్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని 113 అంగన్వాడీ కేంద్రాలకు ఉచితంగా గ్యాస్ పొయ్యిలను స్థానిక దీక్షిత్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు ఆదినారాయణ, నిత్యావసరుకులు భద్రపర్చుకునే ప్లా స్టిక్ కంటైనర్లను మున్సిపల్ మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ నాయకుడు తూము శరత్ రెడ్డి వితరణ చేశారు. శుక్రవారం పట్టణ కేంద్రంలోని లయన్స్ కంటి ఆస్పత్రి మీటింగ్ హాల్లో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, సబ్ కలెక్టర్ వికాస్ మహ తో, సీపీడీపీవో పద్మతో కలిసి అంగన్వాడీ టీచర్లకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని గుర్తు చేశారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ మహిళల సంక్షేమానికి ప్ర భుత్వం పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేసిందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, డీసీసీ అధ్యక్షుడు నగేశ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, తహసీల్దార్ విఠల్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
క్యాలెండర్ అవిష్కరణ
ఖలీల్‌వాడి:జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లోగల డీఈ వో కార్యాలయంలో గురువారం డీఈవో అశోక్ సీఆర్పీ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం జి ల్లా అధ్యక్షుడు అంబదాస్, ప్రధాన కార్యదర్శి అంజయ్యలు సీఆర్పీల సమస్యలపై డీఈవోకు వినతిప త్రాన్ని అందించారు. డీసీఈబీ సెక్రెటరీ సీతయ్య, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి ఉన్నారు. మోపాల్: మండలంలోని కంజర్ పెద్ద చెరువులో మత్య్సశాఖ ఆధ్వర్యంలో 1,42,060 చేప పిల్లలను గురువారం విడుదల చేశారు. ఎంపీడీవో రాములు నాయక్, ఒడ్డెరకాలనీ సర్పంచ్ సుమలత, ఎంపీవో కిరణ్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి నర్సింహులు, మత్య్సశాఖ ఇన్‌ఛార్జి లక్ష్మీ, గంగపుత్రులు ఉన్నారు. అనంతరం కాస్బాగ్ తండాలో గ్రామపంచాయతీ భవన నిర్మాణం కోసం స్థలాన్ని ఎంపీడీవో పరిశీలించారు. నిజామాబాద్ లీగల్: తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే న్యాయవాదుల సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తానని రాష్ట్ర హైకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, హైకోర్టు సీనియర్ న్యాయవాది పొన్నం అశోక్‌గౌడ్ అన్నారు. తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల నేపథ్యంలో గురువారం ఆయన నిజామాబాద్ బార్ అసోసియేషన్‌లో న్యాయవాదులను కలిసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయిరెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
సంక్షిప్తం
ఆర్మూర్ సీఐపై చర్యలు తీసుకోండి నిజామాబాద్ అర్బన్: ఆర్మూర్ సీఐ సత్యనారాయణపై చర్య లు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ నాయకులు గురువారం క లెక్టర్ ఇలా త్రిపాఠిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఆ ర్మూర్ మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన రాజేశ్వర్‌ను అ కారణంగా పోలీస్‌స్టేషన్‌లో పెట్టి చిత్రహింసలకు గురిచేసి నట్లు వారు పేర్కొన్నారు. నాయకులు ప్రమోద్, పోశెట్టి, గంగారాం, నాగభూషణం, యమున, రాజేందర్ ఉన్నారు. ఘనంగా వివేకానంద జయంతి నిజామాబాద్ రూరల్: నగరంలోని అర్సపల్లి ప్రభుత్వ ఉన్న త పాఠశాలలో గురువారం సొసైటీ సోల్జర్స్ యూత్ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళ్లు అర్పించారు. అనంతరం ఎస్సెస్సీ విద్యార్థులకు బిట్ బ్యాంక్‌ను అందజేశారు. నార్త్ మండలం విద్యాధికారి వెంకట్ నారాయణ, ఉపాధ్యాయులు ఉన్నారు. ఎమ్మెల్యేను కలిసిన నేతలు జక్రాన్‌పల్లి: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని గురువారం జక్రాన్‌పల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు కలిసి సన్మానించారు. నాయకులు సత్యం, నర్సారెడ్డి, వినోద్, అక్బర్, జితేందర్ నాయక్, గంగాధర్ పాల్గొన్నారు. ఎమ్మెల్యేను కలిసిన ఆలయ కమిటీ సభ్యులు.. ధర్పల్లి: మండలంలోని దుబ్బాకలోగ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ సభ్యులు గురువారం రూరల్ ఎమ్మెల్యే భూ పతిరెడ్డిని తన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఆలయ అభివృద్ధికి తమవంతు సహకారం అందించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యేను సన్మానించారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపిక జక్రాన్‌పల్లి: మండలంలోని తొర్లికొండ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థి దేశెట్టి మురళి జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికయినట్లు పాఠశాల పీడీ గంగా మోహన్ తెలిపారు. ఈసందర్భంగా గురువారం పాఠశాలలో మురళిని ఉపాధ్యాయ బృందం అభినందించారు. విద్యార్థులకు వాటర్ బాటిల్స్ పంపిణీ జక్రాన్‌పల్లి: మండలంలోని బాలానగర్ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు గురువారం విద్యార్థి గౌతమ్ జ న్మదినం పురస్కరించుకొని వారి తల్లిదండ్రులు వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. సర్పంచ్ కొమిరె రాజు, ఉపసర్పంచ్ బోదాస్ శ్రీనివాస్,వార్డు సభ్యులు పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులకు సన్మానం సిరికొండ: మండల కేంద్రంలోని సత్యశోధక్ పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా గురువారం మహిళా ఉద్యోగులను ఎంపీడీవో కేఆర్ మనోహర్‌రెడ్డి సన్మానించారు. ప్రిన్సిపాల్ నర్సయ్య, స్కౌట్స్ గైడ్స్ ప్రతినిధి సోలామన్, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బాలయ్య, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. పోడు సమస్యలపై వినతి సిరికొండ: కామారెడ్డి జిల్లా గాంధారిలో నిర్వహించిన సమావేశంలో గురువారం రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు మాలా వత్ రవినాయక్ కలిశారు. పోడు సమస్యలపై ఆయనకు వినతిపత్రం అందజేశారు. అనంతరం చైర్మన్‌ను సన్మానించారు. సర్పంచ్‌కు సన్మానం జక్రాన్‌పల్లి: మండలంలోని వివేక్‌నగర్ తండా సర్పంచ్‌గా ఎన్నికై న మోజీరాంను చిన్ననాటి స్నేహితులు గురువారం సన్మానించారు. కాట్పల్లి నర్సారెడ్డి, పిప్పెర గంగాధర్, బండి సత్యం, తిరుపతిరెడ్డి, విజయ్, జితేందర్‌నాయక్, భూషన్, గంగాధర్, గుడ్ల శ్రీనివాస్, శ్రీనివాస్, గంగాధర్, భూ మేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. సిర్పూర్ జెడ్పీహెచ్‌ఎస్‌కు విరాళం.. మోపాల్: మండలంలోని సిర్పూర్ జెడ్పీహెచ్ఎస్లో ఉద్యోగ విరమణ పొందుతున్న ఉపాధ్యాయురాలు లలిత గురువా రం పాఠశాల అభివృద్ధి కోసం రూ.38వేల విరాళాన్ని అందించారు. అనంతరం లలితను సర్పంచ్, వీడీసీ ప్రతినిధులు సన్మానించారు. హెచ్ఎం సత్యనారాయణ, సర్పంచ్ బొడ్డు గౌతమి, ఉపసర్పంచ్ భాస్కర్, వీడీసీ ప్రతినిధులు ఉన్నారు. స.హ.చట్టంపై అవగాహన ఖలీల్‌వాడి: నగరంలోని పులాంగ్లోగల ప్రభుత్వ పాఠశాలలో గురువారం సమాచార హక్కు చట్టంపై చైతన్య సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చైర్మన్ కోయడి నర్సింలుగౌడ్, ప్రతినిధులు రాంరాజ్ రాథోడ్, ప్రధాన కార్యదర్శి గంగాధర్, హెచ్ఎం నాగరాజు, సిబ్బంది రఫత్, నిఖిత, గంగాధర్, అశోక్ ఉన్నారు. ఇందూరుగా పేరు మార్చాలి సుభాష్‌నగర్: జిల్లా పేరు నిజామాబాద్ కాకుండా ఇందూరుగా మార్చాలని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గసభ్యుడు పల్నా టి కార్తీక్ కుమార్ డిమాండ్ చేశారు. నగరంలోని మార్కండేయ మందిరం వద్ద గురువారం వారు యువకులతో కలిసి నినాదాలు చేశారు. నాయకులు, యువకులు నిరంజన్, జగన్, శ్రీను, రాకేష్, చరణ్, కారంపురి నర్సయ్య, ప్రశాంత్, చరణ్, తదితరులు పాల్గొన్నారు. తల్లీకూతుళ్ల అదృశ్యం నిజామాబాద్ రూరల్: రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గూ పన్పల్లికి చెందిన దండ్ల పూజారి వెన్నెల, తన కూతురు అ మృత(సంవత్సరంన్నర) అదృశ్యమైనట్లు రూరల్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ తెలిపారు. బుధవారం తన కూతురుతో బయటకు వెళ్లిన వెన్నెల ఇప్పటికీ తిరిగి ఇంటికి రాలేదు. వెన్నెల భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
వైభవంగా అయ్యప్ప పడిపూజ
నిజామాబాద్ రూరల్: నగరంలోని అర్బన్ ఎమ్మెల్యే నివాసంలో గురువారం అయప్ప పడిపూజ వైభవంగా నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ దంపతులతో సహా వారి కుటుంబ సభ్యులు, ఆయన తనయుడు ధన్పాల్ ప్రణయ్ స్వామి భక్తిశ్రద్ధలతో అయ్యప్పకు పూజలు చేశారు. పడిపూజ సందర్భంగా అయ్యప్ప స్వాములకు, భక్తుల కోసం భిక్షను ఏర్పాటు చేశారు. బల్యపల్లి సుబ్బారావు గురు స్వామి, అయ్యప్ప మాలధారణ స్వాములు తదితరులు పాల్గొన్నారు. శబరిమలకు తరలిన స్వాములు జక్రాన్‌పల్లి: మండలంలోని పడకల్ గ్రామానికి చెందిన అయ్యప్ప స్వాములు గురువారం శబరిమలకు బయలుదేరి వెళ్లారు. గ్రామంలోని శ్రీ భూనీల సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇరుముల్లు కట్టుకుని శబరిమలకు వెళ్లారు. స్వాములు గంగారెడ్డి, భూమన్న , ప్రేమ్, సతీష్ , ప్రసాద్, శ్రీధర్, శ్రీనివాస్ ఉన్నారు. -
నిబంధనలు పాటించని కళాశాల గుర్తింపును రద్దు చేయాలి
తెయూ(డిచ్పల్లి): నిబంధనలను పాటించని తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని నిషిత డి గ్రీ కళాశాల గుర్తింపును రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరారు. ఈమేరకు గురువారం వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ యాదగిరికి వినతిపత్రం అందజేశారు. నాయకు లు బోడ అనిల్, కళ్యాణ్, శ్రీశైలం, గోపాల్‌సింగ్ ఠాగూర్, అరుణ్ తేజ, నవీన్, శివ, సునీల్ పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్: తమకు బకాయి బిల్లులను వెంటనే చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మికులు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు ఏఐటీయూసీ నేతలతో కలిసి గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య మాట్లాడుతూ.. గత ఆగస్టు నెల నుంచి మధ్యా హ్న భోజన కార్మికులకు బిల్లులు రావడం లేదన్నారు. జిల్లాకు రూ.8కోట్లు బకాయిలు రావా ల్సి ఉందన్నారు. వెంటనే అధికారులు బకాయిలను చెల్లించాలన్నారు. అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతిపత్రం అందజేశారు. నాయకులు చక్రపాణి, స్రవంతి, సాయమ్మ, గంగమణి, నాగలక్ష్మీ, సుజాత ఉన్నారు. నిజామాబాద్ రూరల్: కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగులకు 3వ వేతన సవరణ అమలు చేయాలని ఆల్ యూనియన్స్, అసోసియేషన్స్ ఆఫ్ భారత్ సంచార్ నిగమ్ లిమిటేడ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు గురు వారం నగరంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాల యం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. తమిళనాడు, చైన్నె సర్కిల్స్‌లో అక్రమంగా చేసిన అసోసియేషన్ నాయకుల బదిలీలను వెంటనే ఆపివేయాల న్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించా లన్నారు. నాయకులు నారాయణ, సాయిలు, సాయన్న, ఆశంశెట్టి, సందీప్ రాటి, రాజేందర్, రాజేశ్వర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇందల్వాయి: మండలంలోని ప్రభుత్వ కార్యా లయాలను ప్రజలకు అందుబాటులో ఉంచాల ని బీజేపీ నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు కోరారు. ప్రభుత్వ కార్యాలయాలు సొంత భవనాల్లోకి తరలించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఇందల్వాయి ఎంపీడీవో కార్యాలయాన్ని ఇందల్వాయి రైతు వేదికలోకి తరలించడానికి అధికారులు గురువారం ఏర్పాట్లు చేశారు. దీంతో మండలంలోని పలు గ్రామల సర్పంచ్‌లు, బీజేపీ నాయకులు ఎంపీడీవో కార్యాలయాన్ని మండల కేంద్రంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయాలని ఎంపీవో రాజ్కాంత్కి వినతిపత్రం అందించారు. నల్లవెల్లి సర్పంచ్ రాజేందర్, బీజేపీ నాయకులు శ్రావణ్ ,ప్రభాకర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు. జక్రాన్‌పల్లి: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని గురువారం ఎంపీడీవో సతీష్ కుమార్ తనిఖీ చేశారు. పాఠశాలలో స్టోర్ రూమ్, వంట గదిని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రిన్సిపల్ స్వప్న, ఏపీవో రవి తదితరులు ఉన్నారు. ఖలీల్‌వాడి: గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో గురువారం కామర్స్, బిజినెన్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఆధ్వర్యంలో గురువారం రిచర్స్ మెథడాలజీ ప్రాజెక్ట్‌పై రిపోర్ట్ ప్రిపరేషన్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రిసోర్స్ పర్సన్ పీవీవీ సత్యప్రసాద్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌కు సంబంధించిన అంశాలను విద్యార్థులకు వివరించారు. -
తొలగిస్తారా?.. కొనసాగిస్తారా?..
నిజామాబాద్ రూరల్: మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నగరంలోని 13వ డివిజన్ సారంగపూర్‌లో మున్సిపల్ ఎన్నికల ఓటర్ల జాబితాపై గందరగోళం నెలకొంది. సారంగపూర్‌లో గతంలో 5400 మంది ఓటర్లు ఉండగా, కొత్తగా 1900 మంది ఓట్లు నమోదు చేసుకున్నట్లు అధికారులు పేర్కొంటూ జాబితా విడుదల చేశారు. దీంతో స్థానికులతోపాటు స్థానిక రాజకీయపార్టీల నాయకులు ఓటర్ల జాబితాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నూతన ఓట్లన్నీ స్థానికేతరులవంటూన్నారు. నగరంలోని వెంగళరావు కాలనీ, పాముల బస్తి, ముజయ్నగర్, నాగారం, అర్సపల్లి, ఆటోనగర్, సుభాష్ నగర్, ఆటోనగర్ కాలనీ నుంచి అక్కడి వారిని ఇక్కడి జాబితాలో చేర్చారని ఆరోపిస్తున్నారు. దీంతో వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఇబ్బందులు కలుగుతాయని, అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపుతాయని నేతలు పేర్కొంటున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల ఓటర్లు కేవలం కరెంట్ బిల్లుతో సారంగాపూర్‌లోని 13వ డివిజన్లో ఉంటున్నట్లు ఓటరుగా నమోదు చేసుకున్నారని పలువురు నాయకులు ఆరోపిస్తున్నారు. అక్రమంగా వచ్చిన 1900 ఓట్లు 62, 63, 146, 147, 299, 300 బూతుల్లో నమోదయ్యాయని నేతలు పేర్కొంటున్నారు. గతంలో సారంగపూర్‌లో 5400 మంది ఓటర్లు ఉండగా అందులో మహిళ ఓటర్లు 3000, పురుషులు 2400 మంది ఉన్నారు. ప్రస్తుతం వచ్చిన 1900 ఓట్లలో మహిళలు 1100 మంది, పురుషులు 800 మంది ఉన్నారని తెలిపారు. అక్రమ ఓట్ల విషయమై ఇటీవల మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్‌కు డివిజన్ కాంగ్రెస్ నేతలు వినతిపత్రం సైతం అందించారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి అక్రమంగా నమోదైన ఓట్లను తొలగించాలని స్థానిక నాయకులు కోరుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 13 డివిజన్ సారంగాపూర్‌లో అక్రమంగా ఓట్లు నమోదు అయ్యాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి నూతనంగా నమోదైన ఓటర్లను జాబితా నుంచి తొలగించాలి. ఓటరు జాబితాను పారదర్శకంగా నిర్వహించాలి. –కుంచవు నగేష్, కాంగ్రెస్ నాయకుడు, సారంగాపూర్ ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సారంగాపూర్‌లో నూతనంగా 1900 మంది ఓటర్లు నమోదు అయ్యారు. వందల సంఖ్యలో నూతన ఓటర్లు నమోదు కావడంతో స్థానికుల్లో అయోమయం నెలకొంది. అధికారులు చేసిన తప్పులకు ఓటర్ లిస్ట్ తప్పుల తడకగా మారింది. –శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్ నాయకుడు, సారంగాపూర్ 13వ డివిజన్ సారంగాపూర్‌లో కొత్తగా 1900 మంది ఓటర్ల గుర్తింపు స్థానికేతరులవి అంటూ నేతల ఆరోపణ వెంటనే తొలగించాలంటూ అధికారులకు ఫిర్యాదు -
రోడ్డు ప్రమాదాల నివారణకు కృషిచేద్దాం
ధర్పల్లి: ట్రాఫిక్ రూల్స్ పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషిచేద్దామని జిల్లా రవాణాశాఖ అధికారులు పిలుపునిచ్చారు. మండలంలోని రామడు గు విజ్ఞాన్ హైస్కూల్లో జాతీయ రోడ్డు భద్రత మా సోత్సవాలను పురస్కరించుకొని గురువారం జిల్లా రవాణా శాఖ అధికారులు విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. అధికారులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అధికారులు కిరణ్ కుమార్, వాసుకి, పవన్ కళ్యాణ్, స ర్పంచ్ రమేష్‌గౌడ్, ఉపసర్పంచ్ రాజేశ్వర్, కరస్పాండెంట్ రాజు, హెచ్ఎం సుజాత,టీచర్లు ఉన్నారు. మోపాల్: మండలంలోని కంజర్ గ్రామంలో పోలీస్ కళాబృందం, ట్రాఫిక్ పోలీసులతో కలిసి రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. అంతకుముందు విద్యార్థులతో గ్రామంలో ర్యాలీ చేపట్టారు. ఎస్సై సుస్మిత మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలన్నారు. -
విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
మోపాల్: విద్యుత్ ప్రమాదాలు జరుగకుండా ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని, కరెంట్ సమస్యలపై ట్రాన్స్‌కో సిబ్బంది 24/7 అందుబాటులో ఉంటార ని ఏడీఈ బాలేష్ అన్నారు. మండలంలోని మోపాల్‌లో గురువారం విద్యుత్ అధికారుల ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఏడీ ఈ క్షేత్రస్థాయిలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా గ్రా మంలో విరిగిపోయిన స్తంభాలు, వేలాడుతున్న వి ద్యుత్ వైర్లు, వంగిన స్తంభాలను పరిశీలించారు. సర్పంచ్ ద్యాప రవికుమార్, లైన్‌మన్ మనోహర్, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. సిరికొండ: మండలంలోని తాళ్లరామడుగు గ్రామంలో ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో ప్రజాబాట గురువారం నిర్వహించారు. సర్పంచ్ బాకారం వరలక్ష్మీ ఆధ్వ ర్యంలో ట్రాన్స్‌కో అధికారులు గ్రామంలో పర్యటించి విద్యుత్ సమస్యలను తెలుసుకున్నారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బాకారం రవి, ఏఈ శివకుమార్, సంతోష్, ఉపసర్పంచ్ నవీన్, సుమన్ ఉన్నారు. -
పేదల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
● రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ● క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల అందజేత డిచ్పల్లి: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ వద్ద గల రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం లబ్ధిదారులకు ఆయన చెక్కులను అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం అప్పులు చేసి తెలంగాణను దివాళా తీసేలా చేసిందని విమర్శించారు. ప్రస్తుతం బీఆర్ఎస్లో ఆస్తుల పంచాయతీ నడుస్తోందని, కుటుంబ విభేదాలు బయటపడటంతోనే తట్టుకోలేక కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. బీజేపీ నేతలు ఎన్నికల సమయంలో రాముడి పేరు తెరపైకి తెచ్చి ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డిచ్పల్లి, మోపాల్, జక్రాన్‌పల్లి, నిజామాబాద్ రూరల్ మండల కాంగ్రెస్ నాయకులు అమృతపూర్ గంగాధర్, ఎల్లయ్య, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జీవాలకు టీకాలు తప్పనిసరిగా వేయించాలి
మోపాల్: ప్రభుత్వం గొర్రెలు, మేకలకు వ్యాధి నివారణా టీకాల పంపిణీని ఉచితంగా చేపడుతుందని, పెంపకందారులు టీకాలను జీవాలకు తప్పనిసరి వేయించాలని జిల్లా పశువైద్యాధికారి గంగాధరయ్య సూచించారు. మండలంలోని కాల్పోల్ గ్రామంలో గురువారం జీవాలకు టీకాల పంపిణీ కార్యక్రమాన్ని ఏడీ బస్వారెడ్డితో కలిసి ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవాలు వ్యాధుల బారిన పడకుండా ప్రభుత్వం అందజేస్తున్న టీకాల పంపిణీ కార్యక్రమాన్ని పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. 860 గొర్రెలు, 160 మేకలకు టీకాలు పంపిణీ చేశామని మండల పశువైద్యాధికారి శిరీష పేర్కొన్నారు. సర్పంచ్ రవి, సిబ్బంది మురారీ, బాబు తదితరులు పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న ముగ్గుల పోటీలు
ఖలీల్‌వాడి: నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో గురువారం రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘కెమి క్రోమా రంగోలి‘ ముగ్గుల పోటీలు ఆకట్టుకున్నాయి. ఈ పోటీలలో సుమారు 100 మంది విద్యార్థులు రసాయన శాస్త్రం, పండుగల సాంప్రదాయం, వివిధ సామాజిక రుగ్మతలలోని భావనలను రంగవళ్లుల ద్వారా తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ప్రిన్సిపాల్ రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి పోటీలు విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, సృజనాత్మకత, సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన పెంపొందిస్తాయని తెలిపారు. ప్రొఫెసర్లు లావణ్య, రవీందర్‌రెడ్డి, సంపత్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నం, భరత్‌రాజ్, నహీదా బేగం, రాజేశ్, రమ ణ, రాము, రంజిత్, చంద్రకళ, శ్రీవర్ష పాల్గొన్నారు. జక్రాన్‌పల్లి మండలంలో..జక్రాన్‌పల్లి: మండలంలోని మునిపల్లి గ్రామంలోగ ల మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల బాలికల జూ నియర్, డిగ్రీ కళాశాలలో గురువారం సంక్రాంతి వే డుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా బాలికలకు భోగి పండ్లు, భోగి మంటలు, రంగ వ ల్లికలు, ముగ్గుల పోటీలను నిర్వహించారు. అనంత రం విజేతలకు బహుమతులను అందజేశారు. ప్రిన్సిపాల్ అనూష, సిబ్బంది ఉన్నారు. -
జిల్లాస్థాయి శ్లోకాల కంఠస్థ పోటీలు
నందిపేట్(ఆర్మూర్): మండలంలోని వెల్మల్ బాలాజీ సత్సంగం 18 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కేదారీశ్వర ఆశ్రమంలో విద్యార్థులకు ఇందూర్ జిల్లాస్థాయి శ్లోకాల కంఠస్థ పోటీలను నిర్వహించారు. శ్రీ మద్భగవద్గీత 18వ అద్యాయం మోక్ష సన్యాసయోగముపై నిర్వహించిన శ్లోకాల పోటీలో శారద విద్యానికేతన్ వెల్మల్ పాఠశాల విద్యార్థులు మనస్వీ ప్రథమ, సంవేద్య ద్వితీయ బహుమ తి, ఎండీ అయాన్ ప్రోత్సాహాక బహుమతి సాధించారు. కార్యక్రమంలో బాలాజీ సత్సంగం వ్యవస్థాపకులు కృష్ణకుమార్, ఎండీ మాతాజీ శ్రావ్య, ప్రవళిక, మధుశ్రీ, రమ్యశ్రీ, పూజ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. సుభాష్‌నగర్: హర్యానా రాష్ట్రంలోని పటోడా సన్క్సరన్ యూనివర్సిటీలో ఈ నెల 9 నుంచి 12 వరకు జరగనున్న 38వ జాతీయ సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేసినట్లు జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వి ప్రభాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగామోహన్ గురువారం తెలిపారు. బాలికల విభాగంలో సుద్ధపల్లి సాంఘిక సంక్షేమ పాఠశాలకు చెందిన బి నిశిత, డి లిఖిత, డి కీర్తన, జి వర్ణిణి, ఆర్మూర్ సాంఘిక సంక్షేమ పాఠశాల నుంచి ఆర్ సౌజన్య ఎంపికయ్యారని పేర్కొన్నారు. బాలుర విభాగంలో పి నివాస్ (సాంఘిక సంక్షేమ పాఠశాల బోధన్), మురళి (జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొర్లికొండ), ప్రణీత్ కుమార్ (సాంఘిక సంక్షేమ పాఠశాల ఉప్పల్వాయి), రేవంత్ (సాంఘిక సంక్షేమ పాఠశాల వేల్పూర్) ఎంపికయ్యారన్నారు. ఇటీవల మెదక్ జిల్లా మనోహరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో చాంపియన్‌గా నిలిచి జాతీయస్థాయి పోటీలకు ఎక్కువమంది క్రీడాకారులు ఎంపిక కావడంపై వారు హర్షం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి చిప్ప నవీన్, జిల్లా కోచ్ నరేశ్ పాల్గొన్నారు. వర్ని: బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని, చందూర్, బాన్సువాడ మండలాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర కార్యదర్శి వినూత్న రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. యూత్ కాంగ్రెస్ నిబంధనలకు అనుగుణంగా పనిచేయకపోవడంతో వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హర్షవర్ధన్, సాయి సుమన్, భానుగౌడ్ను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. -
బాల శాస్త్రవేత్తలు.. ప్రగతికి బాటలు
కామారెడ్డి టౌన్: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానికేతన్ హైస్కూల్లో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ రెండో రోజు గురువారం కొనసాగింది. ప్రాంగణం వైజ్ఞానిక కాంతులతో మెరిసిపోతోంది. రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేయిర్ సందర్భంగా 33 జిల్లాల నుంచి 887 ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు చిన్నారులు చూపిన ’శాసీ్త్రయ’ పరిష్కారాలు పెద్దలను సైతం ఆలోచింపజేస్తున్నాయి. ఆయా జిల్లాల నుంచి విద్యార్థులను తీసుకువచ్చి ప్రదర్శనలను తిలకింపజేశారు. న్యాయనిర్ణేతలు ప్రదర్శనలన్నింటిని క్షణ్ణంగా పరిశీలించారు. నేడు జరగబోయే ముగింపు కార్యక్రమంలో విజేతలను ప్రకటిస్తారు. రెండో రోజు కొనసాగిన రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ ఆకట్టుకుంటున్న 33 జిల్లాల విద్యార్థుల ఆవిష్కరణలు నేడు ముగింపు, విజేతల ప్రకటన -
ఎస్ఎస్ఆర్ కళాశాల డిగ్రీ ఫలితాలు విడుదల
తెయూ (డిచ్పల్లి): తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలైన ఎస్ఎస్ఆర్ (స్వయం ప్రతిపత్తి) కళాశాల డిగ్రీ మొదటి సెమిస్టర్ ఫలితాలను గురువారం వర్సిటీ వీసీ యాదగిరిరావు , రిజిస్ట్రార్ యాదగిరి ఆవిష్కరించారు. డిగ్రీ మొదటి సెమిస్టర్లో 40.59 శాతం ఉత్తీర్ణత కాగా, బాలికలు 57.14 శాతం, బాలురు 30.27 శాతం పాస్ అయ్యారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఎస్ఎస్ఆర్ కళాశాల విద్యార్థులు మెరుగైన ఫలితాలను సాధించాలని సూచించారు. రిజిస్ట్రార్ మాట్లాడుతూ ఎస్ఎస్ఆర్ కళాశాల సిబ్బంది విద్యార్థులపై చూయించే క్రమశిక్షణ వారి భవిష్యత్తును ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే దిశగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఆర్ కళాశాల అధినేత డాక్టర్ మారయ్య గౌడ్, వర్సిటీ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్, కంట్రోలర్ ప్రొఫెసర్ సంపత్ కుమార్, యూజీసీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆంజనేయులు, అడిషనల్ కంట్రోలర్స్ శాంతాబాయి, సంపత్, కళాశాల కరస్పాండెంట్ హరితాగౌడ్, కంట్రోలర్ జి. శ్యాం కుమార్, అడిషనల్ కంట్రోలర్ ఎండీ యూసుఫ్, సలీం, ఎస్. ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
కూలీకి వెళ్లొస్తూ..
● రోడ్డు ప్రమాదంలో వ్యవసాయ కూలి మృతి బాన్సువాడ రూరల్: మండలంలోని బీర్కూర్–బాన్సువాడ ప్రధాన రహదారిపై కొల్లూర్ శివారులోని రైస్‌మిల్ వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. బాన్సువాడ మండలం బుడిమి గ్రామానికి చెందిన దినసరి కూలీలు నాగారం గ్రామంలో వరినాట్లు వేసి ఆటోలో తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న చించోలి గ్రామానికి చెందిన ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టింది. ప్రమాదంలో నీరడి రుకుంబాయి (35) తీవ్రగాయాలై అక్కడిక్కకడే మృతి చెందింది. కొనింటి ఆశయ్య, నర్వ భూలక్ష్మికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాన్సువాడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రవాసీయులకు భరోసా ఏది?
● భారీగా ఆదాయం లభిస్తున్నా... సంక్షేమంపై దృష్టి సారించని కేంద్రం ● నేడు ప్రవాసీ భారతీయ దినోత్సవం మోర్తాడ్(బాల్కొండ): ప్రవాస భారతీయుల వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారీ మొత్తంలో ఆదాయం సమకూరుతున్నా వారి సంక్షేమంపై చిత్తశుద్ధి చూపటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గల్ఫ్ వలస కార్మికుల కోసం కొన్ని సంక్షేమ పథకాలను అమలులోకి తీసుకొచ్చింది. గల్ఫ్యేతర దేశాల వలస కార్మికుల అంశంపై దృష్టి సారించాల్సి ఉంది. ఏటా జనవరి 9న ప్రవాస భారతీయ దినోత్సవాన్ని జరుపుతున్నా వలసదారుల బాగోగుల గురించి ఆలోచించేవారు కరువయ్యారు. అన్ని దేశాల కంటే మన దేశస్తులే విదేశాల నుంచి డబ్బులు పంపించడంలో ముందున్నారని ప్రపంచ బ్యాంకు లెక్కలు చెబుతున్నాయి. భారతీయులు వివిధ దేశాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేయడంతో 2024లో 125 బిలియన్ డాలర్లు అంటే రూ.10.25 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని మన దేశానికి చేరవేశారు. ● గల్ఫ్ దేశాలకు వీసాల జారీ మొదలుకొని వేతనాలు ఎగ్గొట్టడం ఇతరత్రా మోసాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గల్ఫ్ మినహా ఇతర దేశాల్లో ఎవరైనా మరణిస్తే వారి మృతదేహాలను స్వదేశానికి పంపించేందుకు అధికార యంత్రాంగం ఎంతో కృషి చేస్తుంది. గల్ఫ్ దేశాల్లో మరణిస్తే మాత్రం మృతదేహాల తరలింపు ఇబ్బందికరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎయిర్‌పోర్టు నుంచి మృతదేహాన్ని ఇంటికి చేర్చడానికి ఇటీవల ఉచిత అంబులెన్స్‌ను ఏర్పాటు చేసింది. ● పార్లమెంట్ సమావేశాల్లో ఇమిగ్రేషన్ యాక్ట్ 1983ను సవరించి కొత్తగా ఇమిగ్రేషన్ బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంది. ఇమిగ్రేషన్ యాక్టును సమూలంగా మార్చాలని గడిచిన 15 ఏళ్ల నుంచి వలసదారులు కోరుతూనే ఉన్నారు. ఇటీవల చర్యలు చేపట్టినా ఇంకా తుది దశకు చేరుకోలేదు. గల్ఫ్ వలస కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాలను అమలు చేస్తుంది. వలస కార్మికులకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగాలంటే గల్ఫ్ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. గల్ఫ్యేతర దేశాల వలస కార్మికుల సంక్షేమంపైనా దృష్టి సారించాలి. – సిస్టర్ లిజీ జోసెఫ్, ప్రవాస కార్మిక సంఘాల ప్రతినిధి విదేశాల నుంచి మనవారు పంపిస్తున్న ఆదాయంపైనే ప్రభుత్వాలు దృష్టి సారించాయి. కానీ వలస కార్మికులకు మాత్రం ఏమీ చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలను ఇటీవల అమలులోకి తీసుకవచ్చింది. కేంద్రం మాత్రం ఇంకా మౌనం వహిస్తుంది. –గంగుల మురళీధర్‌రెడ్డి, గల్ఫ్ జేఏసీ ప్రతినిధి -
క్రైం కార్నర్
చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతి రుద్రూర్: పోతంగల్ మండలం చేతన్‌నగర్ గ్రామానికి చెందిన మల్గె నాగవ్వ (67) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కోటగిరి ఎస్సై సునీల్ తెలిపారు. ఈ నెల 3న ఉదయం వంట చేసేందుకు సిలిండర్ స్టౌ వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తు నాగవ్వ చీర కొంగుకు మంట అంటుకొని తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించగా, గురువారం మధ్యాహ్నం మృతి చెందింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. వేల్పూర్: మండలంలోని పడగల్ క్రాస్ రోడ్డు వద్ద ఈ నెల 3న అచేతనంగా పడిఉన్న గుర్తుతెలియని వ్యక్తి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించినట్లు ఎస్సై సంజీవ్ తెలిపారు. సుమారు 50 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి పడగల్ క్రాస్ రోడ్డు సమీపంలోని తోట వద్ద పడి ఉన్నట్లు అందిన సమాచారంతో 108 అంబులెన్సులో చికిత్స కోసం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించామన్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించి గురువారం మరణించినట్లు తెలిపారు. మృతుడి సంబంధీకులు ఎస్‌హెచ్‌వో 8712659862, పోలీస్‌స్టేషన్ 87126597960 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. డ్రంకెన్ డ్రైవ్‌లో ఒకరికి జరిమానా వర్ని: మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి రూ.10 వేలు జరిమానా విధిస్తూ బోధన్ జడ్జి శేష తల్పసాయి తీర్పునిచ్చినట్లు వర్ని ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. ఈ నెల 6న సైదిపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి మద్యం తాగి వాహనం నడుపుతుండగా మండల కేంద్రంలో పట్టుకున్నామన్నారు. గురువారం కోర్టులో హాజరుపరచగా జడ్జి జరిమానా విధించినట్లు తెలిపారు. -
స్థానిక సమస్యలు పరిష్కరిస్తాం
● ఆశ వర్కర్లకు డీఎంహెచ్‌వో రాజశ్రీ హామీ నిజామాబాద్ రూరల్: ఆశ వర్కర్ల స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి రాజశ్రీ హామీ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా పనిచేసే ఆశ వర్కర్లు గురువారం ధర్నా నిర్వహించేందుకు జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయానికి చేరుకొని ర్యాలీగా బయల్దేరారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకోగా, సీఐటీయూ కార్యాలయం వద్దే నిరసన కార్యక్రమం చేపట్టారు. విషయం డీఎంహెచ్‌వో రాజశ్రీకి పోలీసులు తెలపడంతో ఆమె సీఐటీయూ కార్యాలయానికి చేరుకొని ఆశవర్కర్లతో మాట్లాడారు. తన ఆధీనంలో ఉన్న స్థానిక డిమాండ్లను పరిష్కరిస్తానని తెలిపారు. సమస్యల పరిష్కరానికి ప్రత్యేకంగా సర్క్యులర్‌ను జారీ చేస్తానని హామీ ఇచ్చారు. మిగితా డిమాండ్ల పరిష్కారానికి ఉన్నతస్థాయి అధికారులకు తెలియజేస్తామని స్పష్టం చేశారు. అనంతరం సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ లెప్రసీ సర్వేకు అదనంగా డబ్బులు చెల్లించాలని, వివిధ సర్వేల బకాయి డబ్బులను చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీఎంహెచ్‌వోకు అందజేశారు. -
ఓటరు జాబితాలో పొరపాట్లు ఉండొద్దు
● కలెక్టర్ ఇలా త్రిపాఠిఆర్మూర్: తప్పిదాలు, పొరపాట్లకు తావు లేకుండా తుది ఓటరు జాబితాను పక్కాగా రూపొందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయాన్ని ఆమె గురువారం సందర్శించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, కమిషనర్ శ్రావణి, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేలా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ముసాయిదా జాబితాను ప్రదర్శించాలని, అభ్యంతరాలను స్వీకరించి సకాలంలో వాటిని పరిష్కరించాలన్నారు. ఈ నెల 12న తుది ఓటరు జాబితా వెలువరించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఒక్క ఓటు కూడా ఎంతో కీలకమైనందున అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు జాబితా నుంచి తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బోగస్ ఓటర్లకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో నిశిత పరిశీలన జరపాలని ఆదేశించారు. సమావేశంలో తహసీల్దార్ సుజాత, సిబ్బంది పాల్గొన్నారు. -
రక్షణ చట్టంపై అవగాహన అవసరం
● న్యాయవాది కవిత రెడ్డి తెయూ (డిచ్పల్లి): పని ప్రదేశాల్లో మహిళలు తమకు వర్తించే రక్షణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ప్రముఖ న్యాయవాది కవితా రెడ్డి సూచించారు. తెలంగాణ యూనివర్సిటీ ఉమెన్స్ సెల్ ఆధ్వర్యంలో గురువారం క్యాంపస్‌లోని వసతిగృహంలో ‘పని ప్రదేశాల్లో మహిళలు– రక్షణ చట్టాలు’ అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన న్యాయవాది కవిత రెడ్డి మాట్లాడుతూ మహిళలు నిర్భయంగా పనిచేయాలన్నదే పోష్ చట్టం ముఖ్య ఉద్దేశమన్నారు. ఆర్ట్స్అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రాంబాబు మాట్లాడుతూ మహిళలు సురక్షితంగా ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్ట్స్ డీన్ ప్రొఫెసర్ లావణ్య, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు స్వప్న, స్రవంతి తదితరులు ప్రసంగించారు. అనంతరం అవగాహన సెల్‌ను ఏర్పాటు చేశారు. సెల్ అధ్యక్షురాలిగా ప్రొఫెసర్ లావణ్య వ్యవహరిస్తారు. మీనాక్షిని కలిసిన శేఖర్‌గౌడ్ నిజామాబాద్‌రూరల్: పీసీసీ కార్యవర్గ సమావేశానికి వెళ్లిన సందర్భంగా గురువారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు బాడ్సి శేఖర్‌గౌడ్ హైదరాబాద్‌లో ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షీ నటరాజన్‌ను కలిశారు. -
దొంగ బుద్ధి మారలే..
ఆర్మూర్ టౌన్: పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవించిన వ్యక్తిలో మార్పు రాలేదు. జైలు నుంచి విడుదలైన నెలలోనే చేతివాటం ప్రదర్శించి పోలీసులకు చిక్కాడు. ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్మూర్ పట్టణానికి చెందిన దాసరి అనిల్ గతంలో చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లాడు. నెల క్రితం విడుదలైన అనిల్ పట్టణంలోని పంత్ రోడ్, రాంనగర్, హౌసింగ్ బోర్డు కాలనీల్లో చోరీకి పాల్పడ్డాడు. గురువారం ఉదయం ఆర్మూర్ బస్టాండ్ వద్ద అపహరించిన బైక్‌పై వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. విచారణ అనంతరం నిందితుడి నుంచి ఒక బంగారు గొలుసు, ఒక ఉంగరం, 10 గ్రాముల వెండి, బైక్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసును ఛేదించిన కానిస్టేబుళ్లు కిరణ్‌కుమార్, హరీశ్‌లను ఎస్‌హెచ్‌వో అభినందించారు. ● జైలు నుంచి విడుదలైనా మారని తీరు ● చోరీ కేసులో ఒకరి రిమాండ్ -
‘వీబీ జీ రామ్ జీ’తో విప్లవాత్మక మార్పు
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి సుభాష్‌నగర్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ రోజ్‌గార్ ఔర్ అజీవిక మిషన్(వీబీ జీ రామ్ జీ) నూతన చట్టంతో గ్రామాల అభివృద్ధిలో విప్లవాత్మకమైన మార్పు తీసుకొస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి తెలిపారు. గురువారం నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ చట్టంపై గందరగోళం సృష్టించి తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్, ఇతర పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. గతంలో ఉన్న ఎంజీఎన్ఆర్ఈజీఏ కింద 100 రోజులు మాత్రమే పని కల్పించే వారని, కానీ నూతన చట్టం ద్వారా 125 రోజుల ఉపాధి లభిస్తుందన్నారు. ఈ చట్టంతో గ్రామీణ కార్మికులు తమ ఉపాధిని కోల్పోతారని జరుగుతున్న ప్రచారం కేవలం అపోహ మాత్రమేనని పేర్కొన్నారు. ఈ పథకం కింద ప్రధానంగా నీటి సంరక్షణ, మౌలిక సదుపాయాల కల్పన, జీవనోపాధి ఆధారిత పను లు, విపత్తు నిర్వహణ వంటి నాలుగు రకాల పను లు చేపట్టవచ్చని తెలిపారు. ఆధార్, బయోమెట్రిక్ అనుసంధానం ద్వారా నిధులు పక్కదారి పట్టకుండా అడ్డుకట్ట వేయడంతోపాటు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయొచ్చన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, లక్ష్మీనారాయణ, నాయకులు ప్రమోద్, జ్యోతి, బద్దం కిసాన్, వీరేందర్, ఓం సింగ్, ఇప్పకాయల కిశోర్, తారక్ వేణు, మాస్టర్ శంకర్, ఆమందు విజయ్ కృష్ణ, సురేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
చర్యలు తప్పవు
కలెక్టర్ ఇలా త్రిపాఠి ● ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రి ఆకస్మిక తనిఖీ ● డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం విధుల్లో నిర్లక్ష్యం వహిస్తేఆర్మూర్ : వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని ఆమె గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అవుట్ పేషంట్, ఇన్ పేషంట్ విభాగాలు, ఆపరేషన్ థియేటర్, శస్త్ర చికిత్స వార్డు, రిసెప్షన్ సెంటర్లను సందర్శించి వాటి పనితీరును పరిశీలించారు. హాజరు రిజిస్టర్‌ను తనిఖీ చేసి, విధుల్లో ఉన్న వైద్యులు, సిబ్బంది హాజరును వాకబు చేశారు. ఈ సందర్భంగా డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా అత్యవసర వైద్యం కోసం ఆస్పత్రికి వస్తే ఎలా అని సిబ్బందిని నిలదీశారు. ఈ తరహా నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమన్నారు. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందేనని కలెక్టర్ స్పష్టం చేశారు. తాను క్రమం తప్పకుండా తనిఖీలు జరుపుతానని, నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. స్థానికంగా నెలకు సగటున ఎన్ని సాధారణ ప్రసవాలు చేస్తున్నారు, సిజేరియన్లు ఇక్కడే అవుతున్నాయా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా ఉన్నారు. -
ఈవీఎం గోడౌన్‌ను సందర్శించిన కలెక్టర్
నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో ఉన్న ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్ గురువారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా వారు ఈవీఎం గోడౌన్‌కు వేసిన సీళ్లను పరిశీలించారు. పోలీసు బందోబస్తుపై పలు సూచనలు చేశారు. నిజామాబాద్ అగ్ని మాపక శాఖ అధికారి శంకర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, సిబ్బంది సాత్విక్, విజయేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. సెమీస్‌లోకి నిఖత్ జరీన్ సుభాష్‌నగర్: నేషనల్ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ సెమీస్‌లోకి చేరింది. గ్రేటర్ నోయిడాలో నిర్వహిస్తున్న పోటీల్లో 5–0తో అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన బాక్సర్‌ను ఓడించింది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కుసుమ్ బగేల్‌తో నిఖత్ జరీన్ తలపడనుంది. మానసిక సమస్యలకు చికిత్స అందించాలి – డీఎంహెచ్‌వో రాజ శ్రీ సుభాష్‌నగర్: పిల్లల్లో మానసిక సమస్యలను గుర్తించి చికిత్స అందించాలని డీఎంహెచ్‌వో రాజ శ్రీ సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా వైద్యారోగ్యశాఖ, ఐఎంఏ, చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ సంయుక్తాధ్వర్యంలో పిల్లల్లో మానసిక సమస్యల ద్వారా కలిగే మార్పులను సమన్వయపర్చే విధానంపై జిల్లా వనరుల కేంద్రంలో శిక్షణా కార్యక్రమా న్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ శ్రీ మాట్లాడుతూ పిల్లల సంరక్షణ కేంద్రాల్లో ఉన్న ప్రతి పిల్లవాని మానసిక అనారోగ్యాన్ని ముందుగానే గుర్తించాలన్నారు. ప్రారంభ దశలోనే కౌన్సిలింగ్ ఇచ్చి నడవడిక, ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చేలా సంరక్షకులు నడుచుకోవాలని సూచించారు. సైకియాట్రి స్టు రవితేజ జిల్లా సంక్షేమ అధి కారి రసూల్ బీ, చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ వ్యవస్థాపకుడు, ఐఎంఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ విశాల్, డిప్యూటీ డీఎంహెచ్‌వో అశ్విని, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షురాలు సంపూర్ణ, కమిటీ మెంబర్ దారం గంగాధర్, నాగేశ్వరరావు, డీహెచ్ఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లోకి డీఎస్పీ కార్యాలయం బాన్సువాడ : బాన్సువాడ డీఎస్పీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి గురువారం మార్చారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఆయా కార్యాలయాలకు జనవరి నుంచి అద్దె చెల్లించబోమని ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీచర్స్ కాలనీలో అద్దె భవనంలో ఉన్న డీఎస్పీ కార్యాలయాన్ని బోధన్ రోడ్డులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి మార్చారు. -
పోడు సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తా
● ఆర్వోఎఫ్ఆర్ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి ● రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిగాంధారి : పోడు భూముల సమస్యను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పేర్కొన్నారు. రెండు మూడు నెలల్లో సమస్యను పరిష్కరిస్తామన్నారు. గురువారం ఆయన మండలంలో పర్యటించారు. పోడు భూముల సమస్యలను తెలుసుకునేందుకు గాంధారిలోని మారుతి ఫంక్షన్ హాల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పోడు, గిరిజన రైతులతో సమావేశం నిర్వహించి, సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు గిరిజన రైతులు సాగు చేసుకుంటున్న అటవీ భూములపై వారికే హక్కు కల్పించాలనే ఉద్దేశంతో ఆర్వోఎఫ్ఆర్ చట్టం తీసుకువచ్చి పకడ్బందీగా అమలు చేశారన్నారు. 2005 వరకు అటవీ భూమిని సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాదారు పాసుబుక్కులు ఇచ్చారని గుర్తు చేశారు. పోడు రైతులు తమ సమస్యలపై రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాలని రైతు కమిషన్ సభ్యుడు రాములు నాయక్ సూచించారు. ఆర్వోఎఫ్ఆర్ చట్టం ద్వారా ఇచ్చిన పాసుబుక్కులు ఉన్నా అటవీ అధికారులు సాగు చేయనివ్వడం లేదని పలువురు రైతులు పేర్కొన్నారు. ఒకవేళ సాగు చేసినా పంటలను ధ్వంసం చేస్తున్నారని, కేసులు పెడుతున్నారని పలువురు ఫిర్యాదు చేశారు. సభ్యులు గడుగు గంగాధర్, రాములు నాయక్, గోపాల్‌రెడ్డి, కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. -
భర్త బాటలో గంజాయి రవాణా
● మధ్యప్రదేశ్ నుంచి నిజామాబాద్‌కు తరలింపు ● జిల్లా కేంద్రంలో ఐదుగురు నిందితుల అరెస్టు నిజామాబాద్ అర్బన్ : భర్త చేస్తున్న అక్రమ గంజా యి రవాణాను గమనించింది. కొన్నిసార్లు తోడుగా వెళ్లి గంజాయి రవాణాలో భాగమైంది. కొన్నేళ్లపా టు ఇద్దరూ ఈ అక్రమ దందాను కొనసాగించారు. అయితే, రెండు నెలల క్రితం భర్త అనారోగ్యంతో చనిపోగా, భార్య మాత్రం గంజాయి రవాణా కొనసాగిస్తోంది. తీరా నిజామాబాద్‌లో ఎకై ్సజ్ పోలీసులకు పట్టుబడటంతో ఆమె వ్యవహారం బట్టబయలైంది. ఆదిలాబాద్ జిల్లా నేరెడిగొండ మండలం దేవులతండా గ్రామానికి చెందిన పూజా పవార్ గురువారం జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో గంజాయితో పట్టుబడింది. ఆమె భర్త దేవ్‌రాజ్ కొన్నేళ్లుగా గంజాయి అక్రమ రవాణా కొనసాగించి రెండు నెలల కిందట మరణించాడు. ఇద్దరు పిల్లలు ఉన్న పూజా పవర్ కుటుంబ పోషణ కోసం భర్త కొనసాగించిన మార్గాన్ని అనుసరించింది. ఆమెకు ఆదిలాబాద్ జిల్లా కుప్టి(కె) గ్రామానికి చెందిన దుర్పాద బాయి జాదవ్ తోడైంది. ప్యాకెట్ల రూపంలో.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సిర్పూర్ పట్టణంలో కిలో గంజాయి ధర తక్కువగా ఉండటంతో పూ జా పవార్, దుర్బాద బాయి జాదవ్ కొనుగోలు చేస్తుంటారు. అనంతరం ఆ గంజాయిని మహారాష్ట్రలోని కిన్వట్‌కు తరలించి, మధ్యవర్తులైన కిషన్ మోతీరాం దాలే , ఇంద్రజిత్ టాగ్రెల ద్వారా నిజామాబాద్‌కు సరఫరా చేస్తుంటారు. గత నెలలో నిజామాబాద్‌కు వచ్చిన వారు కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చద్మల్‌కు చెందిన వెంకట్రామ్కు గంజాయి విక్రయించారు. ఆ గంజాయిని వెంకట్రామ్ జిల్లా కేంద్రంలో ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తూ వస్తున్నాడు. గురువారం ఉదయం 7.30 కంఠేశ్వర్ బైపాస్ రోడ్డులో నలుగురు వ్యక్తులు గంజాయితో బస్సు దిగారు. అప్పటికే సమాచారం అందుకున్న ఎకై ్సజ్ శాఖ నిజామాబాద్ ఎస్‌హెచ్‌వో స్వప్న తన సిబ్బందితో మఫ్టీలో కాపుకాశారు. బస్సు దిగగానే అనుమానాస్పదంగా కనిపించడంతో వారి బ్యాగులను తనిఖీ చేశారు. అందులో 13 కిలోల ఎండు గంజాయి లభించింది. దీని విలువ రూ.6 లక్షల వరకు ఉంటుందని ఎకై ్సజ్ శాఖ సూపరిండెంట్ మల్లారెడ్డి విలేకరులకు వెల్లడించారు. గంజాయి కొనుగోలు చేస్తున్న వెంకట్‌తోపాటు మహారాష్ట్రకు చెందిన కిషన్మోతీరాం దాలే, ఇంద్రజిత్ టాగ్రె, పూజా పవార్, దుర్పాదబాయి జాదవ్‌లను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులకు చెందిన ఐదు సెల్ఫోన్లు సీజ్ చేశామన్నారు. సమావేశంలో నిజామాబాద్ ఎకై ్సజ్ ఎస్‌హెచ్‌వో స్వప్న, ఎస్సై మల్లేశ్, సుస్మిత, సిబ్బంది సునీల్, ప్రభాకర్, రవి, సంగయ్య, సౌమ్య, సుచరిత, సంజయ్ తదితరులున్నారు. -
తుది జాబితా కోసం కసరత్తు
● రాజకీయ పార్టీల ఫిర్యాదులతో కదిలిన యంత్రాంగం ● ఇంటింటికి వెళ్లి జాబితాను సరి చేస్తున్న సిబ్బంది ఆర్మూర్: జిల్లాలోని నిజామాబాద్ కార్పొరేషన్‌తోపాటు ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్ పట్టణాల్లో ఇంటింటికి వెళ్లి బీఎల్వోలు ఓటరు జాబితాను సరి చేస్తున్నారు. ముసాయిదా జాబితాపై రాజకీయ పార్టీల ప్రతినిధుల ఫిర్యాదులు, సూచనలను పరిగణనలోకి తీసుకున్న అధికారులు, సిబ్బంది ఓటరు జాబితాలో నుంచి మరణించిన వారి పేర్లను, శాశ్వతంగా దూర ప్రాంతాలకు వలస వెళ్లిన, రెండు ప్రాంతాల్లో ఓటు హక్కు ఉన్న, నకిలీ ఓటర్లను, గ్రామ పంచాయతీల నుంచి పట్టణ ప్రాంతాలకు బదిలీ చేసుకున్న ఓటర్లను గుర్తించి తొలగించే పనిలో ఉన్నారు. మరో వైపు 2025 అక్టోబర్ 1వ తేదీలోగా నమోదు చేసుకున్న ఓటరుకు మాత్రమే ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుందని పేర్కొంటూ ఆయా పార్టీల ఆరోపణలకు సమాధానాలు చెబుతూ వస్తున్నారు. అధికారులు ఇప్పటికే ప్రకటించిన ముసాయిదా జాబితా ప్రకారం నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లో 3,44,756 మంది ఓటర్లు ఉండగా పురుషులు 1,65,916, మహిళలు 1,78,797, ఇతరులు 43 మంది ఉన్నారు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డుల్లో మొత్తం 64,165 ఓటర్లు ఉండగా.. పురుషులు 30,735, మహిళలు 33,428 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నారు. బోధన్ మున్సిపాలిటీ పరిధిలోని 38 వార్డుల్లో మొత్తం 69,810 ఓటర్లు ఉండగా.. పురుషులు 33,881, మహిళలు 35,929 మంది ఉన్నారు. భీమ్‌గల్ మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డుల్లో మొత్తం ఓటర్లు 14,189 మంది కాగా.. పురుషులు 6,687 మంది, మహిళలు 7,502 మంది ఉన్నారు. మరణించిన వారి పేర్లను, డబుల్ ఓట్లను తొలగించకపోవడంతో ఐదేళ్ల క్రితం మున్సిపల్ ఎన్నికల నాటికి ఇప్పటికీ ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. నకిలీ ఓట్లను గుర్తించే పనిలో భాగంగా బీఎల్వోలు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసుకోవాలని, ఎప్పటికప్పుడు సవరించిన వార్డుల వారీగా ఫొటో ఓటరు జాబితాలను ఈ నెల 12వ తేదీన ప్రచురించాలని ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుముదిని బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ స్టేషన్ల జాబితా ముసాయిదా ప్రచురణతోపాటు టీ–పోల్‌లో ఈ నెల 13న అప్లోడ్ చేయాలని పేర్కొన్నారు. 16వ తేదీన ప్రభుత్వ కార్యాలయాల్లో తుది ఓటరు జాబిత, పోలింగ్ స్టేషన్ల జాబితాను ప్రచురించాలని ఆదేశించారు. -
స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక ఇప్పట్లో లేనట్లే!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవిత చేసిన రాజీనామా ఆమో దం పొందడం అన్ని వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు లేకపోవడంతో ప్రస్తుతం ఉప ఎన్నిక నిర్వహించే పరిస్థితి లేకుండాపోయింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుకెళ్తోంది. అయితే పరిషత్ ఎన్నికలకు మాత్రం బీసీ రిజర్వేషన్ల అంశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఈ వ్యవహారం కోర్టులో ఉండడంతో ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. సస్పెన్షన్ దాకా.. నిజామాబాద్ నుంచి 2014లో ఎంపీగా గెలుపొందిన కవిత 2019లో ఓడిపోయారు. ఆ తరువాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2023లో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయాక కవిత జిల్లాకు రావడం తగ్గిస్తూ వచ్చారు. లిక్కర్ కేసులో అరెస్టు అయి ఢిల్లీలో తీహార్ జైలుకు వెళ్లారు. తరువాత కవిత కేసీఆర్‌కు రాసిన లేఖ బయటకు లీక్ అయినప్పటి నుంచి పార్టీలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఆ తరువాత వివిధ పరిణా మాల అనంతరం కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటన వచ్చింది. ఇదిలా ఉండగా పంచాయతీ ఎన్నికల్లో జాగృతి తరపున కొందరు పోటీచేయగా నలుగురు సర్పంచ్‌లు గెలుపొందారు. ఏకగ్రీవంగా ఎన్నికై .. 2014లో ఎంపీగా గెలుపొందిన కవిత.. 2019లో ఓటమిపాలయ్యారు. ఆ తరువాత 2020 జనవరిలో జరిగిన ఉప ఎన్నిక ద్వారా కవిత స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అప్పటివర కు ఈ స్థానంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న డాక్టర్ భూపతిరెడ్డి అనర్హతకు గురయ్యారు. 2022 జనవరిలో నిర్వహించిన సాధారణ ఎన్నికల్లో కవిత మరోసారి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే 2028 వరకు పదవీకాలం ఉన్నప్పటికీ.. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన కవిత గతేడాది సె ప్టెంబర్ 3న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశా రు. 4 నెలల తరువాత తాజాగా శాసనమండలి చైర్మన్ ఆమె రాజీనామాను ఆమోదించారు. కవిత రాజీనామా ఆమోదంపై ఉమ్మడి జిల్లాలో చర్చ పరిషత్, మున్సిపల్ ప్రజాప్రతినిధులు లేకపోవడమే కారణం పరిషత్ ఎన్నికలపై రిజర్వేషన్ అంశం నేపథ్యంలో ప్రతిష్టంభన -
ప్రిన్సిపాల్ రాంబాబుకు సన్మానం
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా గోపిశెట్టి రాంబాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ రాంబాబును అధ్యాపకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్, పరీక్షల నియంత్రణ అధికారి సంపత్ కుమార్, యూజీసీ డైరెక్టర్ ఆంజనేయులు, ఆర్ట్స్ డీన్ లావణ్య, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ అపర్ణ, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆరతి, అరుణ, వివిధ విభాగాల అధ్యాపకులు భ్రమరాంబిక, వాణి, నందిని, శాంతాబాయి, కై సర్ మహమ్మద్, అతిక్ సుల్తా న్ ఘోరీ, మహమ్మద్ అబ్దుల్ ఖవి, జమీల్ అహ్మద్, సాయిలు, మూస ఖురేషి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్: నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో సీనియర్ మెజీషియన్ జాదు రంగనాథ్‌ను జాదుగర్ మ్యాజిక్ షో సభ్యులు ఘనంగా సన్మానించారు. ప్రఖ్యాత మెజీషియన్, గోల్డ్ మెడలిస్ట్ జాదుగర్ మార్త రవీంద్ర మ్యాజిక్ షో లలో భాగంగా బుధవారం ప్రదర్శనలు జరిగాయి. ప్రదర్శనలో సీనియర్ మెజీషియన్ జాదు రంగనాథ్ దంపతులను సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్ట్ తిరునగరి శ్రీహరి, మెజీషియన్లు చందన శ్రీనివాస్, నందిపేట రాజు, జగిత్యాల చారి, మిమిక్రీ శంకర్, ట్రస్మా అరుణ్, ప్రముఖులు పాల్గొన్నారు. జక్రాన్‌పల్లి: మండలంలోని చింతలూర్ గ్రామ సర్పంచ్ నాగుల శ్రీనివాస్‌తో పాటు గ్రామస్తులు బుధవారం రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని సన్మానించారు. చింతలూర్ గ్రామానికి రామడుగు కుడి కాలువా ద్వారా తూము మంజూరు చేసి పూర్తి చేయడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఉపసర్పంచ్ బాలకృష్ణ, నాగుల గోపి, చిన్నారెడ్డి, రాజేశ్వర్, వీడీసీ సభ్యులు శ్రీనివాస్, బాలయ్య, గణపతి తదితరులు పాల్గొన్నారు. సిరికొండ: మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ ఆర్ రవీందర్రావును సర్పల్లి తండా సర్పంచ్ చందర్‌నాయక్ బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. భూసమస్యలపై తహసీల్దార్‌తో చర్చించారు. అనంతరం తహసీల్దార్‌ను సన్మానించారు. సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు చందర్‌నాయక్, ఉపసర్పంచ్ పిట్ల కళ్యాణ్ ఉన్నారు. -
సర్వే ఆధారంగానే టికెట్లు
ఆర్మూర్: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రతీ వార్డు నుంచి ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేసి సర్వే నిర్వహించిన అనంతరం గెలుపు గుర్రాలకు మాత్రమే అధిష్టానం టికెట్ కేటాయిస్తుందని డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ టికెట్ ఎవరికి కేటాయించినా వారి విజయం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని సీ కన్వెన్షన్‌లో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్ అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన డీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ పార్టీ అధిష్టానం నిర్ణయానికి ప్రతీ కార్యకర్త కట్టుబడి ఉండాలన్నారు. అలా ఉండని వారిపై వేటు తప్పదని హెచ్చరించారు. అంతకు ముందు టీపీసీసీ అధికార ప్రతినిధి ఏబీ శ్రీనివాస్ (చిన్న), మార చంద్రమోహన్, ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జి పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. సమావేశంలో ఆర్మూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్లు లింగాగౌడ్, షేక్ మున్నా, ఏఎంసీ వైస్ చైర్మన్ ఇట్టెం జీవన్, నాయకులు సంజయ్ సింగ్ బబ్లు, పండిత్ పవన్, అయ్యప్ప శ్రీనివాస్, జంబి హనుమాన్ ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ రేగుళ్ల సత్యనారాయణ, నాయకులు మహమూద్ అలీ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెయూ(డిచ్పల్లి): ఏబీవీపీ స్టేట్ ఆల్ యూనివర్సిటీస్ కన్వీనర్‌గా శివ ఎన్నికయ్యారు. ఇటీవల నిర్వహించిన ఏబీవీపీ నూతన రాష్ట్ర కార్యవర్గ నియామకంలో ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రావుల కృష్ణ తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు బీ శివను స్టేట్ యూనివర్సిటీస్ కన్వీనర్‌గా ఎన్నుకున్నారు. ● గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ● పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తే వేటు తప్పదు ● డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి -
పెండింగ్ జీతాలను విడుదల చేయాలి
సుభాష్‌నగర్: జిల్లాలో 104లో విధులు నిర్వర్తిస్తున్న తమకు ఏప్రిల్, 2025 నుంచి జీతాలు అందడం లేదని, వెంటనే పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని 104 ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు డీఎంఅండ్‌హెచ్‌వో రాజశ్రీకి 104 ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 104లో 18 ఏళ్లుగా అంకితభావంతో సేవలు అందిస్తున్నామని తెలిపారు. 9 నెలలుగా వేతనాలు రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. గతంలోనూ పలుమార్లు విజ్ఞప్తులు చేసినా.. ఎలాంటి పరిష్కారం లభించలేదన్నారు. పెండింగ్ జీతాలు విడుదలయ్యే వరకూ విధులను బహిష్కరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, సమస్య పరిష్కారమయ్యాక వెంటనే విధులకు హాజరై ముందులాగే పూర్తి నిబద్ధతతో సేవలందిస్తామని అన్నారు. కార్యక్రమంలో బాలకృష్ణ, అరుణ్గౌడ్, స్వామి, కృష్ణ, శ్రీనివాస్, ఇనాయత్ అలీ, సోని, సురేశ్, సుమలత, విజయలక్ష్మి, శృతి, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని తీర్మానం
మోపాల్: కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వీబీ జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేసి 2005 ఉపాధిహామీ చట్టాన్ని కొనసాగించాలని తాడెం గ్రామసభ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. బుధవారం తాడెం సర్పంచ్ కూచన్‌పల్లి జలంధర్‌రెడ్డి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చించారు. ప్రజలు పన్నులు చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలని సర్పంచ్ కోరారు. ఎమ్మెల్యే భూపతిరెడ్డి సహకారంతో గ్రామసభలో చర్చించిన సమస్యలు, ఇతర అభివృద్ధి పనులను పూర్తి చేసుకుందామని పేర్కొన్నారు. అలాగే ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య ప్రవేశపెట్టిన ఉపాధి కూలీలకు నష్టదాయకమైన జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేసి పాత చట్టాన్ని కొనసాగించాలని ప్రతిపాదించగా, సభలో చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశంలో ఉపసర్పంచ్ కంజర్ కిరణ్, పంచాయతీ కార్యదర్శి మృదుల, కారొబార్ అరుణ్, వార్డుసభ్యులు, గ్రామస్తులు అంగలి సుజాత, తిరుపతి, లక్క గంగారాం, బియ్య రవి తదితరులు పాల్గొన్నారు. -
చైన్ స్నాచింగ్ కేసును ఛేదించిన పోలీసులు
నిజామాబాద్‌అర్బన్: నగరంలోని మూడో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో డిసెంబర్ 29న జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. మూడోటౌన్ ఎస్సై హరిబాబు బుధవారం వివరాలు వెల్లడించారు. సుభాష్‌నగర్‌లో పది రోజుల క్రితం పూలు కోసేందుకు బయటికి వచ్చిన వృద్ధురాలి మెడలోని చైన్‌ను దుండగులు లాక్కొని పారిపోయారు. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన షేక్ మహ్మద్, అద్నాన్‌ను దుండగులుగా గుర్తించి అరెస్టు చేశారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నట్లు విచారణలో ఒప్పుకున్నారు. ఇదే కేసులో మరో నిందితుడు అమన్ పటేల్ పరారీలో ఉన్నారని ఎస్సై తెలిపారు. కేసు ఛేదనలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ సురేశ్, సిబ్బంది ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. -
ప్రభుత్వ భూములను కాపాడాలి
నిజామాబాద్ రూరల్: ప్రభుత్వ భూములను కాపాడాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ సభ్యుడు సయ్యద్ ఖైసర్ కోరారు. బుధవారం జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. నగరంలోని హైమదీ బజార్లో ఉన్న 1500 గజాల ప్రభుత్వ స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారని వారిపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే అక్రమంగా ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కాటిపల్లి నగేశ్‌రెడ్డి, బొబ్బిలి రామకృష్ణకు వినతిపత్రాలు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ నరేందర్ సింగ్, నాయకులు తదితరులు ఉన్నారు. -
బ్రెయిలీ లిపి కాదు.. అంధుల ఆశాజ్యోతి
● సీపీ సాయి చైతన్య ● స్నేహ సొసైటీలో ఘనంగా బ్రెయిలీ 217వ జయంతి సుభాష్‌నగర్: లూయి బ్రెయిలీ ఒక లిపి కాదని.. అంధుల ఆశాజ్యోతిగా మహోన్నత మార్గానికి శ్రీకారం చుట్టారని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్య పేర్కొన్నారు. నగరంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో అంధుల వనరుల కేంద్రం ఆవరణలో అంధుల జీవనజ్యోతి, అక్షర ప్రదాత, బ్రెయిలీ లిపి నిర్మాత డాక్టర్ లూయి బ్రెయిలీ 217వ జయంతిని ఘనంగా నిర్వహించారు. సీపీతోపాటు డీఎంహెచ్‌వో రాజ శ్రీ, డీడబ్ల్యూవో రసూల్ బీ ముఖ్యఅతిథులుగా హాజరై లూయి బ్రెయిలీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థులు నిరాశ నిస్పృహలకు గురి కాకుండా ఆత్మ విశ్వాసం, ధైర్యంతో ముందుకు సాగితేనే ఉన్నతస్థాయికి ఎదుగుతారని పేర్కొన్నారు. స్నేహ సొసైటీ మానసిక దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి, కార్యదర్శి సిద్ధయ్య, ఉపాధ్యాయులు, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సహకారంతో దివ్యాంగ విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారని చెప్పా రు. అంధ విద్యార్థిని రజిని స్నేహా సొసైటీ పాఠశాలకు 50 వేల విలువైన బెంచీలను విరాళంగా అందజేశారు. మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, అర్బన్ సీడీపీవో సౌందర్య, అంధ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సాయన్న, సాగర్, ఆరోగ్య రాజు, ఇలియాజుద్దీన్ పాల్గొన్నారు. -
ఆశల పోరుబాట
● ఫిక్స్డ్ వేతనం రూ.18వేలు ఇవ్వాలి ● జిల్లా కేంద్రంలో ఆశావర్కర్ల భారీ ర్యాలీ నిజామాబాద్ రూరల్: ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడం, వైద్య సేవలను అందించడంలో కీలక పాత్ర పోషించే ఆశా కార్యకర్తలు ఆందోళన పట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పోరాటం చేస్తున్నారు. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి ప్రధాన డిమాండ్ అయిన రూ. 18 వేల వేతనాన్ని ఇస్తామని చెప్పి ముఖం చాటేసింది. దీంతో జిల్లాలో ఆశావర్కర్లు తమ నిరసన గళాన్ని వినిపించేందుకు సిద్ధమయ్యారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియం నుంచి వందలాది మంది ఆశావర్కర్లు పాత కలెక్టరేట్ వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్, ఆశలు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేటికి ఆశలకు కనీస వేతనం చెల్లించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్డ్ వేతనం నిర్ణయించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఆశలకు ఫిక్స్డ్ వేతనం రూ. 18వేలు అందించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఆశలకు రావాల్సిన డబ్బులు ఇంకా రాలేదని వాటిని వెంటనే ఇవ్వాలన్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో లెప్రసి సర్వే చేయా లని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆరోగ్యశాఖ అధికారులు ఆశలను ఆదేశిస్తున్నారని ఆ సర్వేకు అదనంగా ఎంత డబ్బులు చెల్లిస్తారో ప్రభుత్వం వెల్లడించాలన్నారు. పలు జిల్లాల్లో వీటికి డబ్బులు ఇవ్వమని అధికారులు చెబుతున్నారని ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆశవర్కర్లు తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. నాయకులు సుకన్య, బాలమణి, రమ, నర్సా, ఇందిరా, రేఖ, రేణుక, శాంతి, బాలమణి , విజయ, లావణ్య పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
చికిత్స పొందుతూ ఒకరి మృతి తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన షెట్టి నాగరాజు(48) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. నాగరాజు కులవృత్తితోపాటు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ముగ్గురు కూతుళ్లు ఉండగా ఇద్దరికి పెళ్లి చేశారు. మూడో కూతురు హైదరాబాద్‌లో నివసిస్తోంది. ఇద్దరి కుమార్తెల వివాహాల ఖర్చుల కారణంగా కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. గతంలో నాగరాజు దుబాయి వెళ్లి అప్పుల పాలయ్యాడు. చిన్న కూతురు వివాహం చేయలేక, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోలేక జీవితంపై విరక్తి చెంది నాగరాజు ఈ నెల 2న గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు అపస్మారక స్థితిలో ఉన్న నాగరాజును కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించగా మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య శ్యామల ఉన్నారు. -
భళా.. బాల శాస్త్రవేత్తలు
● రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్‌లో ఆకట్టుకున్న విద్యార్థుల ఆవిష్కరణలు కామారెడ్డి టౌన్: కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ (విద్యా వైజ్ఞానిక ప్రదర్శన) సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను చూపుతూ, అభివృద్ధి దిశగా విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులు ఆలోచింపజేస్తున్నా యి. ప్రధానంగా గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అద్భుత ప్రతిభను కనబరిచారు. యాదాద్రి జిల్లా గూడూరు జెడ్పీహెచ్ఎస్ 8వ తరగతి విద్యార్థి హర్షవర్థన్ ‘మానవ రహిత చేపల వేట’ ప్రాజెక్టును ప్రదర్శించాడు. రిమోట్‌తో నడిచే ఈ బోటును డ్రైవర్ లేకుండానే చెరువులు, సముద్రాల్లోకి పంపవచ్చు. పడవకు అమర్చిన వలల ద్వారా ఆటోమేటిక్‌గా చేపలను పట్టి లోపల వేసుకోవచ్చు. ప్రాణహాని కలగకుండా ఉపయోగపడుతుందని గైడ్ టీచర్ శ్రీనివాస్ తెలిపారు. -
సంక్షిప్తం
రోడ్డు భద్రత నియమాలు పాటించాలి నిజామాబాద్ రూరల్: ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని రూరల్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ సూచించారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా బుధవారం బైపాస్ రోడ్డు సిగ్నల్ చౌరస్తా వద్ద వాహనదారులకు రోడ్డు భద్రతలపై రూరల్ పోలీసులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ మాట్లాడుతూ.. వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని సూచించారు. కార్యక్రమంలో పోలీస్‌సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కూలిరేట్లను పెంచాలని వినతి నిజామాబాద్ రూరల్: నగరంలోని మాదాపూర్‌లో ఉన్న బేవరేజీ డిపో హమాలీ కార్మికులకు కూలిరేట్లను పెంచాలని బుధవారం సీపీఎం జిల్లా కార్యదర్శి రమేశ్‌బాబు బుధవారం కార్మికులతో కలిసి జిల్లా లేబర్ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి రెండేళ్లకోసారి లోడింగ్, కూలి రేట్లను పెంచడానికి గతంలోనే అంగీకారం జరిగిందని కానీ గత డిసెంబర్ 1 నుంచి పెంపుదలలో వైన్స్ యజమానులు కొద్దిమంది అమలు జరపకుండా ఇబ్బందులు పెడుతున్నారని వెంటనే రేట్లను పెంచాలని కోరారు. నాయకులు శ్రీనివాస్, రమేశ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఎంఈవోను తొలగించాలని వినతి ఖలీల్‌వాడి: ఎడపల్లి ఎంఈవోను తొలగించాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు బుధవారం డీఈవో అశోక్‌కు వినతిపత్రం అందజేశారు. మండలంలోని ఓ టీచర్ పై ఎంఈవో కేసు నమోదు చేయడం దురదృష్టకరమని అన్నారు. గతంలో కూడా ఎంఈవో టీచర్లను ఇబ్బందులకు చేశారని వారు ఆరోపించారు. నాయకులు మోహన్ రెడ్డి, శ్రీకాంత్, స్వామి నాయక్, జమినుల్లా, ప్రవీణ్ కుమార్ తదితరులు ఉన్నారు. దంత వైద్య శిబిరం నిజామాబాద్ రూరల్: రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ నిజామాబాద్, శీను నాయక్ డెంటల్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం మల్లారం గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు దంత వైద్యశిబిరం నిర్వహించారు. పాఠశాలలోని 350 విద్యార్థులను పరీక్షించి, దంత సంరక్షణపై అవగాహన కల్పించారు. విద్యార్థులకు మందులు, టూత్ పేస్టులు అందజేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ అధ్యక్షుడు పాకాల నరసింహారావు, కార్యదర్శి గంజి రమేశ్, రంజిత్ సింగ్, గిరీశ్ కుమార్, పడాల సత్తయ్య, సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎల్వోసీ అందజేత సిరికొండ: మండలంలోని చీమన్‌పల్లి గ్రామానికి చెందిన రేణవ్వకు ఎమ్మెల్యే భూపతిరెడ్డి రూ. ఐదు లక్షల ఎల్వోసీని మంజూరు చేశారు. ఎల్వోసీని బాధితురాలి కుమారుడు నరేశ్‌కు ఎమ్మెల్యే బుధవారం అందజేశారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్‌రెడ్డి, సర్పంచ్ కళ్లెం నర్సయ్య, ఉపసర్పంచ్ ఏనుగు రాజేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. నేటి నుంచి గొర్రెలకు టీకాలు మోపాల్: మండలంలోని 21 గ్రామాల్లో ఈనెల 8 నుంచి 22 వరకు గొర్రెలు, మేకల్లో ఉచిత పోచమ్మ నివారణా టీకాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మండల పశువైద్యాధికారి శిరీష బుధవారం తెలిపారు. 8న కాల్పోల్, 9న చిన్నాపూర్, 10న బైరాపూర్, 12న బాడ్సి, 13న నర్సింగ్‌పల్లి, 16న మంచిప్ప, 17న కంజర్, 19న కులాస్పూర్, కులాస్పూర్ తండా, 20న మోపాల్, సిర్పూర్, 21న న్యాల్కల్, 22న ముదక్పల్లి, ఎల్లమ్మకుంటలో టీకాలు వేస్తామన్నారు. మండలంలోని అన్ని గ్రామాల గొర్రెలు, మేకల పెంపకందారులు, యాదవ సంఘ సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
అభివృద్ధి దిశగా తెలంగాణ
ఎమ్మెల్యే భూపతిరెడ్డి ధర్పల్లి: సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశలో ముందుకెళ్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పేర్కొన్నారు. ధర్పల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ధర్పల్లి, ఇందల్వాయి, సిరికొండ మండలాలకు చెందిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులు 200 మందికి ఎ మ్మెల్యే చెక్కులు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లా అత్యధికంగా వరి ధా న్యాన్ని పండించి మొదటి స్థానంలో నిలిచిందన్నా రు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించి వారికి పెద్దపీట వేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంతో వడ్డీ లేని రుణాలను అందజేస్తున్నట్లు తెలిపారు. చట్టసభల్లో ఎమ్మెల్సీ కవిత ఆత్మగౌరవం కోసమే తన పోరాటం అంటూ మొసలి కన్నీరు పెట్టుకోవడం సరైంది కాదని విమ ర్శించారు. కల్వకుంట్ల కుటుంబం దోచుకున్న ఆస్తులను కవితకు వాటా ఇవ్వకపోవడంతోనే కంటతడి పెట్టిందని విమర్శించారు. తెలంగాణ ద్రోహులను చేరదీసింది కవితే అని విమర్శించారు. రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి బీఆర్ఎస్ నాయకులకు లేదని స్పష్టం చేశారు. అనంతరం రామడుగు ప్రా జెక్ట్ నుంచి కుడి,ఎడమ కాలువల ద్వారా యాసంగి పంటలకు నీటిని విడుదల చేశారు. దమన్నపేట్లో ధర్పల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దినకర్, కాంగ్రెస్ నాయకులు కర్నాల నరసయ్య కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ఆర్మూర్ బాలరాజు, నాయకులు నవీన్ గౌడ్, ఇమ్మడి గోపి, చెలిమెల నరసయ్య, గంగారెడ్డి, సర్పంచులు శ్రీనివాస్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
నిజామాబాద్ లీగల్: వాహనాలు నడిపేటప్పుడు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని నిజామాబాద్ జిల్లా జడ్జి జీవీఎన్ భారతలక్ష్మి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో బుధవారం రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై రూపొందించిన పోస్టర్లను జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి సాయిసుధా, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీతో కలిసి జడ్జి ఆవిష్కరించారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం సరైన అవగాహన లేకుండా, ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడంతో జరుగుతున్నాయని అన్నారు. ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ హెల్మెట్, సీటు బెల్టు ధరించాలని, ట్రిపుల్ రైడింగ్‌ను నివారించాలని సూచించారు. సంక్రాంతి సందర్భంగా పిల్లలు గాలిపటాలు ఎగరవేసేటప్పుడు పెద్దలు వారిని గమనించాలని, చైనా మాంజాతో ప్రమాదాలు జరుగుతున్నాయని, దానిని వాడొద్దన్నారు. జిల్లా జడ్జి జీవీఎన్ భారతలక్ష్మి -
పీఎఫ్వోలపై అవగాహన
ఇందల్వాయి: మండలంలోని నల్లవెల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రైతులకు ఫార్మర్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్(పీఎఫ్‌వో)పై ఆన్లైన్ అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. పీఎఫ్వోలో రైతులు భాగస్వాములవడం వల్ల కలిగే అనేక రకాల లాభాలను ఆన్లైన్ కార్యక్రమం ద్వారా వీక్షించే ఏర్పాటు చేశారు. రైతులు ఫార్మర్ ప్రొడక్షన్ ఆర్గనైజేన్లో సభ్యులుగా చేరి వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ సొంతంగా చేసుకోవడమే కాకుండా ప్రభుత్వం అందించే పలు రకాల రాయితీలను పొంది బలమైన రైతు సంఘాలుగా ఏర్పడాలని సీఈవో తేజ గౌడ్ సూచించారు. -
సర్పంచుల ఫోరం డిచ్పల్లి మండల అధ్యక్షుడిగా వాసు
డిచ్పల్లి: సర్పంచుల ఫోరం డిచ్పల్లి మండల అధ్యక్షుడిగా ధర్మారం(బి) గ్రామ సర్పంచ్ గొట్టిపాటి వాసు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం మండల కేంద్రంలోని ఎస్ఎల్జీ గార్డెన్స్‌లో మండలంలో నూతనంగా ఎన్నికై న సర్పంచులు సమావేశమయ్యారు. సర్పంచుల ఫోరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గొట్టిపాటి వాసు, ఉపాధ్యక్షులుగా నీల బలరాం, మహమ్మద్ యూసుఫ్, ప్రధాన కార్యదర్శులుగా తోట భాస్కర్, టీ ప్రభాకర్, కార్యదర్శిగా కోట్ల భాస్కర్, కోశాధికారిగా వీ సురేశ్, మీడియా ఇన్చార్జిగా యాదగిరి, ప్రత్యేక సలహాదారుగా దేవీసింగ్, సలహాదారులుగా శాంతిలాల్, రుత్విజ రత్నం, సవిత, నర్సయ్య ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికై న కమిటీ సభ్యులను సర్పంచులు పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. సర్పంచుల సమస్యలను పరిష్కరించడానికి నిరంతరం అందుబాటులో ఉంటానని వాసు తెలిపారు. -
మిల్లెట్స్‌తో ఆరోగ్యం
డిచ్పల్లి: మిల్లెట్స్‌తో తయారు చేసిన ఆహార పదార్థాలకు ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, ఆరోగ్యానికి మిల్లెట్స్ ఎంతో మంచివని ఇక్రిశాట్ సీఈవో దినేశ్ చౌహాన్ అన్నారు. మండలంలోని ముల్లంగిలో సెర్ఫ్, ఇక్రిశాట్ సహకారంతో ఏర్పాటుచేసిన మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్‌ను దినేశ్చౌహాన్ బుధవారం ప్రారంభించారు. గ్రామానికి చెందిన స్వయం సహాయక సంఘం సభ్యురాలు మేక లత పీఎంఎఫ్ ఎంఈ స్కీం కింద మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా దినేశ్ చౌహాన్ మాట్లాడుతూ.. మేక లతను ఆదర్శంగా తీసుకొని మహిళా సంఘాల సభ్యులు ఇటువంటి యూనిట్లు ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీవో సాయాగౌడ్, ఇక్రిశాట్ అధికారులు లక్ష్మీకాంత్, రాజశేఖర్, జిల్లా కో ఆర్డినేటర్ యశ్వంత్, డీపీఎం రాచయ్య, ఫామ్ ఏపీఎం రవికుమార్, డిచ్పల్లి మండల ఏపీఎం రవీందర్, ఉపసర్పంచ్ అశోక్, మాజీ ఎంపీపీ నర్సయ్య, మధుసూదన్, గ్రామ సంఘం అధ్యక్షురాలు భూదేవి, సీసీ సురేశ్, వీఏవోలు తదితరులు పాల్గొన్నారు. -
టోల్ ప్లాజా వద్ద నిరసన
ఇందల్వాయి: గత ప్రభుత్వం తీసుకొచ్చిన చీకటి జీవో 317 నేటితో నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా ఉపాధ్యాయ బాధితులు ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద నిరసన తెలిపారు. గత నాలుగేళ్ల నుంచి సుదూర ప్రయాణాలు చేస్తూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని, తమ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని, పరిష్కారం కోసం ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిన జీవో190 గత నాలుగు నెలల నుంచి అమల్లోకి రావడం లేదన్నారు. సత్వరమే దానిని అమలు చేసి బాధితులందరినీ తమ సొంతజిల్లాలకు పంపాలని బాధిత ఉపాధ్యాయులు కోరారు. కార్యక్రమంలో రాజేశ్, వినాయక్, నర్సయ్య, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
తల్లిదండ్రుల కలను నిజం చేయాలి
● ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి ఖలీల్‌వాడి: విద్యార్థులు తల్లిదండ్రుల కలను నెరవేర్చాలని, పోటీ ప్రపంచంలో సాంకేతికను అందిపుచ్చుకోవాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని నిశిత డిగ్రీ కళాశాలలో మొట్టమొదటి గ్రాడ్యుయేషన్ డేను బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా సిద్ధం కావాలని సూచించారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగాలని తెలిపారు. తెలంగాణ వర్సిటీ వీసీ యాదగిరి రావు, రిజిస్ట్రార్ యాదగిరితో కలిసి ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు డిగ్రీ పట్టాలు, మెడల్స్ అందజేశారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ నిఖిల్, చీఫ్ ప్యాట్రన్ వినయ్, కో–ఆర్డినేటర్ రాజు, అకడమిక్ అడ్వైజర్ సాయిలు, డైరెక్టర్ షేక్, ప్రిన్సిపాల్ డాక్టర్ స్వప్న, వైస్ ప్రిన్సిపాల్ రఘువీర్, అధ్యాపక బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. బాలకిష్టారెడ్డికి సన్మానం.. నగరంలోని వివిధ కళాశాల సందర్శనకు వచ్చిన ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డిని ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్, టీయూ పాలక మండలి మాజీ సభ్యులు మారయ్య గౌడ్ బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యలో తీసుకురావాల్సిన సమూల మార్పులపై చర్చించారు. -
బాల్ బ్యాడ్మింటన్ శిక్షణ శిబిరం ప్రారంభం
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి ఆ ల్ఫోర్స్ పాఠశాల లో బాల్ బ్యాడ్మింటన్ బాలికల జట్టు శిక్షణ శిబిరాన్ని అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రావణ్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. పట్టణంలో ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి బాలికల బాల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించనున్నారు. అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ టీ విద్యాసాగర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బోనగిరి శ్యామ్, ఉపాధ్యక్షుడు రాజ్‌కుమార్, పెగాడ నరేందర్, హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సదమస్తుల రమణ, సీనియర్ క్రీడాకారులు కార్తీక్, సాయిశివ, లిఖిత, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
డిచ్పల్లి: జిల్లా కేంద్రానికి చెందిన ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో బుధవారం డిచ్పల్లి మండలం నడిపల్లి సీఎంసీ మైదానంలో డిచ్పల్లి క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభమయ్యాయి. నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ క్రికెట్ పోటీలను హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ బొద్దుల డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రారంభించారు. క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన జెర్సీలను విడుదల చేశారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా క్రీడల ద్వారా మానసిక, శారీరక దృడత్వాన్ని పెంపొందించుకోవాలనే సంకల్పంతో ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. డిచ్పల్లి మండలంలోని వివిధ గ్రామాలతో పాటు తెలంగాణ యూనివర్సిటీ, ఏడో పోలీస్ బెటాలియన్ కు చెందిన 16 జట్లు ఈ క్రికెట్ పోటీల్లో పాల్గొంటున్నాయన్నారు. కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త గాదె కృష్ణ, క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ చైర్మన్ బీ వినోద్, టోర్నీ ఆర్గనైజింగ్ కార్యదర్శి గంగాదాస్, ప్రముఖ వైద్యులు దీపక్ రాథోడ్, జమాల్పూర్ రాజశేఖర్, ఆర్ అండ్ బీ విశ్రాంత ఈఈ శ్రీమన్నారాయణ, నడిపల్లి తండా సర్పంచ్ పవార్ శాంతిలాల్, ఉప సర్పంచ్ గణేశ్, టోర్నీ నిర్వాహకులు జే నరేశ్, సాజిద్, మెరుగు నాగరాజు, మధుసూదన్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎఫ్‌పీవోలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలి
● పంట ఉత్పత్తులకు రైతుల వద్దే అదనపు విలువ చేకూరాలి ● మహి ఎఫ్‌పీవో నేషనల్ ఫెడరేషన్ డైరెక్టర్ వంగా గురవారెడ్డి సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న పదివేల రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీవో) అన్నింటినీ కేంద్ర ప్రభుత్వం ఒకే గొడుగు కిందకు తీసుకొస్తే అందరికీ మరింతగా మేలు చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహి ఎఫ్‌పీవో నేషనల్ ఫెడరేషన్ డైరెక్టర్ వంగా గురువారెడ్డి అన్నారు. జక్రాన్‌పల్లి మండలంలోని మనోహరాబాద్‌లో ఉన్న జేఎంకేపీఎం పసుపు రైతు ఉత్పత్తిదారుల సంఘం యూనిట్‌ను గురవారెడ్డి బుధవారం సందర్శించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడ్డంకులను అధిగమించి, ప్రకృతి విపత్తులను ఎదుర్కొ ని కష్టపడి పంటలు పండించే రైతులకు మరింత మేలు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కచ్చితమైన విధానాలను అమలు చేయాలన్నారు. దేశంలోని పదివేలకు పైగా ఉన్న ఎఫ్‌పీవోలను అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువస్తే ప్రతి ఒక్కరికీ మేలు కలుగుతుందన్నారు. రైతులు పండిస్తున్న పంట ఉత్పత్తులకు సంబంధించి రైతుల వద్దే అదనపు విలువ జోడించేలా గ్రేడింగ్, ప్రాసెసింగ్, ప్యాకింగ్ చేసేలా మరింతగా ప్రోత్సహించాలన్నారు. దీంతో రైతులకు లాభం పెరగడంతోపాటు వినియోగదారులకు తక్కువ ధరలకే ఉత్పత్తులు అందుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే రైతులు ఎఫ్‌పీవోల ద్వారా సేద్యం నుంచి ఎగుమతుల వరకు చేయవచ్చన్నారు. ఏపీలోని కృషిభారతి ఎఫ్‌పీవో డైరెక్టర్ ఈద శ్రీనివాసరెడ్డి, ఏపీకి చెందిన పసుపు రైతు ఈమని శివరాంరెడ్డి, జేఎంకేపీఎం ఎఫ్‌పీవో చైర్మన్ పాట్కూరి తిరుపతిరెడ్డి ఉన్నారు. -
పరీక్షలు వాయిదా వేయాలి
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ప రిధిలో ఈనెల 17 నుంచి నిర్వహించనున్న పీజీ 3 వ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం మధ్యాహ్నం ఏబీవీపీ ఆధ్వర్యంలో ఎగ్జామినేషన్ కంట్రోలర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏబీవీపీ వర్సిటీ అధ్యక్ష, కార్యదర్శులు పృద్వీ, సమీర్ మాట్లాడుతూ.. యూనివర్సిటీ అధికారులు కనీసం విద్యార్థుల సిలబస్ అయిందో కాలేదో అని తెలుసుకోకుండా పరీక్షల నోటిఫికేషన్లను జారీ చేయడం తగదని అన్నారు. అనంతరం పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ కంట్రోలర్ ప్రొఫెసర్ సంపత్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ ఇందూరు జిల్లా కన్వీనర్ అక్షయ్, అశోక్, శివ, మనోజ్, అనిల్, శివ, రాజు, విజయ్, మహేశ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలి మోపాల్: గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ప్ర జల భాగస్వామ్యం కీలకమని మోపాల్ సర్పంచ్ ద్యాప రవికుమార్ పేర్కొన్నారు. బుధవా రం మండల కేంద్రంలో పారిశుద్ధ్య పనులను ఉపసర్పంచ్ రామాగౌడ్తో కలిసి ఆయన పరిశీలించారు.గ్రామంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. మురుగుకాలువలు,రోడ్డుపై చెత్తాచెదారం వెంట వెంటనే తొ లగించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. గ్రా మాలు పరిశుభ్రంగా ఉండాలంటే ప్రజలు చెత్త ను ఎక్కడ పడితే అక్కడ వేయొద్దని కోరారు. వార్డుసభ్యులు,పంచాయతీ సిబ్బంది ఉన్నారు. ఐటీ టవర్ సందర్శన ఖలీల్‌వాడి: నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల విద్యార్థులను నిజామాబాద్ ఐటీ టవర్ క్షేత్ర పర్యటనకు బుధవారం తీసుకెళ్లినట్లు ప్రిన్సిపల్ రామ్మోహన్‌రెడ్డి బుధవారం తెలిపారు. క్షేత్ర పర్యటన ద్వారా విద్యార్థులకు ఐటీ టవర్‌లో ఉన్నటు వంటి వివిధ బహుళ జాతి కంపెనీలపై ఐటీ టవర్ ఇన్చార్జి హన్మంతు విద్యార్థులకు వివరించారు. ఇంటర్వ్యూ మెలకువలు, సాఫ్ట్వేర్ కంపెనీల పనితీరును తెలియజేశారని టీఎస్ కేసీ సమన్వయకర్త రామకృష్ణ తెలిపారు. పర్యటనలో టీఎస్ కేసీ మెంటర్ శ్రీకాంత్, అధ్యాపకులు విజయ, పద్మ, దస్తప్ప, విద్యార్థులు పాల్గొన్నారు. కేజీబీవీ తనిఖీ సిరికొండ: మండలంలోని కేజీబీవీని మండల ప్రత్యేకాధికారి, డీటీడీవో నాగోరావు బుధవారం తనిఖీ చేశారు. పాఠశాలలో తరగతి గదులను, వంటశాలను, వంట సామగ్రిని పరిశీలించారు. పాఠశాలలో జరుగుతున్న మరమ్మతు పనులను తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీడీవో మనోహర్‌రెడ్డి, సర్పంచ్ చందర్‌నాయక్, ప్రిన్సిపాల్ పర్వీన్‌బేగం ఉన్నారు. నిజామాబాద్‌అర్బన్: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర సైబర్ క్రైమ్ బ్యూరో ఎస్పీ సాయి శ్రీ అన్నారు. బుధవారం మాణిక్ బండార్‌లో ఉన్న కాకతీయ కళాశాలలో సైబర్‌క్రైమ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ మోసాలకు గురైనప్పుడు వెంటనే గోల్డెన్ హవర్లో ఫిర్యాదు చేస్తే అనేక ప్రయోజనం ఉంటుందని అన్నారు. అనుమానాస్పద లింకులు వస్తే స్పందించకూడదని సూచించారు. అవగాహన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్ పై నాటికను ప్రదర్శించారు. అనంతరం సైబర్ నేరాల నివారణకు విద్యార్థుతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఏసీపీ రాజా వెంకటరెడ్డి, సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటేశ్వరరావు, కాకతీయ ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ రజినీకాంత్, విద్యార్థినులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అంగన్వాడీ పిల్లలకు యూనిఫామ్స్ పంపిణీ
డిచ్పల్లి: మండలంలోని నడిపల్లి మేజర్ గ్రామపంచాయతీలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో ప్రీ స్కూల్ పిల్లలకు ప్రభుత్వం సరఫరా చేసిన యూనిఫామ్స్‌ను సర్పంచ్ కులచారి అశ్విని పంపిణీ చేశారు. జీపీ కార్యదర్శి గంగాధర్, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్ భాగ్య, ఆయా విజయలక్ష్మి, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అలాగే సాంపల్లి తండా, మేలయ తండా, గుడి తండాలో ఉన్న అంగన్వాడీ పిల్లలకు సర్పంచ్ రాథోడ్ మమత యూనిఫామ్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ బాదావత్ హరిచంద్, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు రాథోడ్ శశిరేఖ, బదావత్ కవిత, రాథోడ్ స్వరూప, సునీత, బాలింతలు, పిల్లలు పాల్గొన్నారు. భగవాన్ నాయక్ తండాలో..ధర్పల్లి: మండలంలోని భగవాన్ నాయక్ తండాలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు సర్పంచ్ సరస్వతి రమేశ్ ప్రభుత్వం సరఫరా చేసిన యూనిఫాంలను బుధవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోహన్ నాయక్, జీపీ సెక్రెటరీ గంగాధర్, అంగన్వాడీ టీచర్ శశికళ, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో రాణించాలి
జక్రాన్‌పల్లి: క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించాలని సర్పంచ్ కాటిపల్లి పద్మ అన్నారు. బుధవారం జక్రాన్‌పల్లి మండలంలోని తొర్లికొండలో ఉమ్మడి జిల్లా అండర్–14, అండర్–17 స్కూల్ గేమ్స్ సాఫ్ట్‌బాల్, బేస్ బాల్ ఎంపిక పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి సర్పంచ్ పద్మ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో ఎంఈవో శ్రీనివాస్, పీడీ గంగామోహన్, ఉపస్పంచ్ మహిపాల్, వార్డు సభ్యుడు ఉత్కం శ్రీనివాస్‌గౌడ్, జిల్లా బేస్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సొప్పరి వినోద్, పీఈటీ నాగభూషణం, సుజాత, రమేశ్, జ్యోత్స్న, నవీన్, వీణ, స్వప్న, అనికేత్ తదితరులు పాల్గొన్నారు. -
హాకీ టోర్నీ పరిశీలకుడిగా స్వామికుమార్
సుభాష్‌నగర్: ఎస్జీఎఫ్ అండర్–17 రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు వర్ని మండలం జాకోర జెడ్పీహెచ్ఎస్ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ స్వామి కుమార్ పరిశీలకుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రస్థాయి అధికారులు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. వనపర్తి జిల్లాలో రాష్ట్రస్థాయి హాకీ పోటీలు ఈ నెల 8 నుంచి 10 వ తేదీ వరకు కొనసాగనున్నాయి. కేజీబీవీ ఆకస్మిక తనిఖీ మాక్లూర్ : మండల కేంద్రంలోని కేజీబీవీని జిల్లా విద్యాధికారి అశోక్ కుమార్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల ప్రత్యేక అధికారిని స్రవంతిని విద్యార్థులకు సంబంధించి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలకు సంబంధించి హాజరు పట్టిక, ఉపాధ్యాయుల హాజరు విషయాలను తెలుసుకున్నారు. వంటగదిలో సరుకుల నాణ్యత పరిశీలించారు. దాతల సహకారంతో గ్రంథాలయాల అభివృద్ధి రెంజల్(బోధన్): దాతల సహకారంతో జిల్లాలోని శాఖా గ్రంథాలయాలను మరింత అభివృద్ధి చేస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి పేర్కొన్నారు. రెంజల్‌లోని శాఖా గ్రంథాలయాన్ని బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. నూతనంగా నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని త్వరలో ప్రారంభిస్తామన్నారు. పాఠకులకు తాగునీరందించేందుకు ఆవరణలో బోరు మోటారు వేయిస్తానని గ్రామానికి చెందిన దాత ముందుకు రావడంతో ఆయన అభినందించారు. పాఠకులకు అవసరమైన అన్నిరకాల పుస్తకాలను అందుబాటులోకి తీసుకవస్తున్నట్లు వివరించారు. జిల్లాలోని పలు గ్రంథాలయాల్లో సాంకేతికను అందిపుచ్చుకునేందుకు కంప్యూటర్లను ఏర్పాటు చేశామన్నారు. ఆయన వెంట మాజీ జెడ్పీటీసీ నాగభూషణంరెడ్డి, బోధన్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీనివాస్‌యాదవ్, కాంగ్రెస్ నాయకులు సాయిబాబా గౌడ్, పోచయ్య, షబ్బీర్, గవాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఇసుక డంప్ స్వాధీనం కమ్మర్పల్లి(భీమ్‌గల్): భీమ్‌గల్ మండలం బెజ్జోరా గ్రామ శివారులోని పోచమ్మ దేవాలయం సమీపంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంప్‌ను రెవెన్యూ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులు పోలీసులతో కలిసి తనిఖీ చేపట్టగా అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంప్ కనిపించింది. దీంతో డంప్‌ను స్వాధీనం చేసుకొని గ్రామ రెవెన్యూ సహాయకులకు అప్పగించారు. స్వాధీనం చేసుకున్న ఇసుక డంప్ 140 ట్రాక్టర్ల వరకు ఉంటుందని ఆర్ఐ సాయాగౌడ్ తెలిపారు. ఇసుకను గురువారం తహసీల్ కార్యాలయం వద్ద వేలం వేస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఆధునిక పద్ధతులపై అవగాహన
సిరికొండ: మండలంలోని గడ్కోల్ గ్రామంలోని రైతువేదికలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరి సాగులో ఆధునిక పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. తడి–పొడి విధానం ద్వారా యాజమాన్యం, నేరుగా వరి విత్తడం, భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం వంటి పద్ధతులను కంపెనీ ప్రతినిధులు వివరించారు. నూతన సాగు పద్ధతులను అనుసరించడం వలన పెట్టుబడి తగ్గడమే కాకుండా కూలీల ఖర్చు సుమారు ఎనిమిది వేల రుపాయల వరకు ఆదా అవుతుందని తెలిపారు. సాగు సమయం కూడా తగ్గుతుందన్నారు. నీటి వినియోగాన్ని నియంత్రించుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, చీడపీడల నివారణ సులభతరం అవుతుందని తెలిపారు. ఏఈవో శివాని, ఫౌండేషన్ ఏరియా మేనేజర్ సనూత్న, ట్రైనర్ శ్రావణి, కమ్యునిటీ ఫెసిలిటేటర్ వై శ్రీకాంత్, చందన్, ఉపసర్పంచ్ సంపత్‌రెడ్డి, అఖిల్, రైతులు పాల్గొన్నారు. -
వారంలో మూడురోజులు ప్రజాబాట
సుభాష్‌నగర్: జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లో వారంలో మూడు రోజులు (మంగళ, గురు, శనివారాల్లో) ఏఈలు సిబ్బందితో కలిసి ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎన్పీడీసీఎల్ చీఫ్ ఇంజినీర్ (ఆపరేషన్, వరంగల్) అశోక్ సూచించారు. ఈ మేరకు బుధవారం నగరంలోని పవర్‌హౌజ్ సమావేశపు హాలులో విద్యుత్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. ప్రజాబాటలో ఎస్ఈలు, డీఈలు, ఏడీఈలు పాల్గొనాలని, ప్రజాప్రతినిధులతో కలిసి గ్రామాల్లో తిరిగి విద్యుత్ సమస్యలు తెలుసుకోవాలని అన్నారు. పొలం బాట, పట్టణ బాట కూడా నిర్వహించి వినియోగదారులకు భద్రత అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. విద్యుత్ నియంత్రికలు చెడిపోకుండా చూడాలన్నారు. సమావేశంలో ఎస్ఈ పీవీ రాజేశ్వర్‌రావు, డీఈ టెక్నికల్ ఏ రమేశ్, ఎస్‌ఏవో శ్రీనివాస్, డీఈలు ఎం శ్రీనివాస్, ఎండీ ముక్తార్, రఘు, ఏడీఈలు, ఏఈలు, ఏఏవోలు పాల్గొన్నారు. -
కొత్త ఆవిష్కరణలపై దృష్టి సారించాలి
● ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ● కామారెడ్డిలో రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ ప్రారంభంకామారెడ్డి టౌన్: మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలని ప్రభుత్వ ముఖ్య సలహాదారు షబ్బీర్ అలీ సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానికేతన్ హైస్కూల్లో (అబ్దుల్ కలాం ప్రాంగణం) బుధవా రం 53వ బాల వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్స్పైర్ మనక్ రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్‌ను షబ్బీర్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అబ్దుల్ కలాంను ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలన్నారు. నూతన టెక్నాలజీపై విద్యార్థులు పట్టు సాధించాలని ఎంపీ సురేశ్ షెట్కార్ సూచించారు. విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, సృజనాత్మకతను పెంపొందించడంలో సైన్స్ ఫెయిర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి పేర్కొన్నారు. 33 జిల్లాల నుంచి మొత్తం 887 ప్రదర్శనలను ఆ యా విభాగాలలో విద్యార్థులు ప్రదర్శించారు. ఒక విద్యార్థితో ఒక గైడ్ టీచర్ పాల్గొంటున్నారు. -
సరిపడా యూరియా నిల్వలు
నందిపేట్(ఆర్మూర్): ప్రస్తుత యాసంగి సీజన్ కు జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు ఉ న్నాయని, రైతులు ఆందోళన చెందొద్దని జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి సూచించారు. మండలంలోని అయిలాపూర్ సొసైటీ పరిధిలో ఉన్న కంఠం, అయిలాపూర్ లోని గోదాములతోపాటు కుద్వాన్పూర్ సొసైటీ పరిధిలోని వన్నెల్ కే, కుద్వాన్పూర్లోని ఎరువుల గోడౌన్ లను బుధవారం పరిశీలించారు. యూరియా దొరకదనే ఆందోళనతో ముందస్తుగా నిల్వ చే సుకోవద్దని, అవసరానికి అనుగుణంగా మాత్ర మే కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. మోతాదుకు మించి యూరియా వాడొద్దన్నారు. డిమాండ్‌కు అనుగుణంగా ఎలాంటి అంతరాయం లేకుండా సకాలంలో యూరి యా సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. ఆయనవెంట మండల వ్యవసాయ శాఖ అధికారి రాంబాబు, ఏఈవోలు విజయ్, గంగాధర్, అబ్దుల్, సొసైటీల సిబ్బంది ఉన్నారు. -
రిజర్వేషన్లపై ఉత్కంఠ
● రాష్ట్రం యూనిట్‌గా మున్సిపల్ చైర్పర్సన్.. ● మున్సిపల్ యూనిట్‌గా వార్డు కౌన్సిలర్ల రిజర్వేషన్లుఆర్మూర్: మున్సిపల్ ఎన్నికలకు అధికారులు ఓవై పు ఏర్పాట్లు చేస్తుండగా.. మరో వైపు ఆశావహులతోపాటు రాజకీయ పార్టీల్లో రిజర్వేషన్ ల ఖరారుపై ఉత్కంఠ నెలకొంది. నిజామాబా ద్ కార్పొరేషన్లో మేయర్‌తోపాటు కార్పొరేటర్ పదవులకు, జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్‌లో చైర్మన్ పీఠం, వా ర్డు కౌన్సిలర్ సీట్లు ఏ కేటగిరికి రిజర్వ్ అవుతా యోననే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ నెల 10వ తేదీన తుది ఓటరు జాబితా ప్రకటించిన వెంటనే సామాజికవర్గాలుగా ఓటర్ల జాబితాను విభజించి అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. బరిలో నిలవాలనుకుంటున్న ఆశావహులు ఎమ్మెల్యేలను, పార్టీల ముఖ్య నాయకులను ప్రసన్నం చేసుకునే ప్రయ త్నాలను ముమ్మరం చేస్తున్నారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో ఏ పీఠం ఎవరికి కేటాయిస్తారనే ఉత్కంఠ నెలకొంది. దామాషా పద్ధతిలో.. కార్పొరేషన్ మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవులకు రిజర్వేషన్లను రాష్ట్ర యూనిట్‌గా, కార్పొరేటర్లు, వార్డు కౌన్సిలర్ల పదవులను కార్పొరేషన్, మున్సిపల్ యూనిట్‌గా ఖరారు చేయనున్నారు. రాష్ట్రంలోని మొత్తం మున్సి పాలిటీల్లో చైర్పర్సన్ పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం దామాషా పద్ధతిలో రిజర్వు చేయనున్నారు. మరో 50 శాతం జనరల్ కేటగిరీలో ఉండనున్నాయి. అయితే మొత్తంగా 50 శాతం స్థానాలను మహిళలకు రిజర్వు చేస్తారు. అయితే జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో రాష్ట్రం యూనిట్‌గా పరిగణలోకి తీసుకుంటే ఏ స్థానం ఏ కేటగిరీకి రిజర్వ్ అవుతుందో అనేది ఆసక్తికరంగా మారింది. ఆర్మూర్ మున్సిపాలిటీలో 36, బోధన్ మున్సిపాలిటీలో 38, భీమ్‌గల్ మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. ఆయా మున్సిపాలిటీల పరిధిలోని వార్డుల సంఖ్యలో సగ భాగం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు, మిగిలినిన 50 శాతం జనరల్‌కు రిజర్వు కానున్నాయి. మొత్తంగా 50 శాతం కౌన్సిలర్ స్థానాలు మహిళలకు రిజర్వు కానున్నాయి. అయితే ఇప్పటికే రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అవసరమైన చర్యలను అధికార యంత్రాంగం సిద్ధం చేస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రధాన రాజకీయ పార్టీల ఆశావహులు అంచనాలు, ఊహాగానాలతో తమకే అనుకూలిస్తుందనే గట్టి నమ్మకంతో పోటీకి సిద్ధమవుతున్నారు. -
నిజామాబాద్
గురువారం శ్రీ 8 శ్రీ జనవరి శ్రీ 2026అభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్న వీడీసీలు కొన్ని గ్రామాల్లో మాత్రమే ఆదర్శంగా వ్యవహరిస్తున్నాయి. చాలా గ్రామాల్లో కుటుంబాలను, కొన్ని కులాలపై ఏకపక్షంగా గ్రామ బహిష్కరణ విధిస్తున్నా బడా రాజకీయ నాయకులు, ప్రభుత్వ యంత్రాంగం ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. పోలీసులకు సవాలు విసిరిన వీడీసీలూ ఉన్నాయి. రాష్ట్రంలోనే అభివృద్ధి పరంగా ముందంజలో ఉన్న ఆర్మూర్ డివిజన్లో వీడీసీల పెత్తనంపై ప్రతిఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ అంశం తాజాగా శాసన మండలిలో ప్రస్తావనకు వచ్చింది. -
రాకాసి కంపెనీలొద్దు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి/భిక్కనూరు : ‘‘కెమికల్, ఫార్మా కంపెనీల నుంచి వెలువడుతున్న కాలుష్యంతో ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు పడుతున్నం. అలాంటి మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేస్తే మా బతుకులు నాశనం అవుతాయి. కాలుష్యం వెదజల్లే ఫార్మా కంపెనీలు మాకొద్దు’’ అంటూ భిక్కనూరు మండలంలోని భిక్కనూరు, కాచాపూర్, పెద్దమల్లారెడ్డి, అ య్యవారిపల్లి, మల్లుపల్లి, రామేశ్వర్‌పల్లి, బస్వాపూర్ తదితర గ్రామాల ప్రజలు నినదించారు. భిక్కనూరు శివారులో ఏర్పాటు చేస్తున్న మెన్సర్స్ ఫ్యూజన్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ (బల్క్ డ్రగ్) కంపెనీకి సంబంధించి తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆఽ ద్వర్యంలో బుధవారం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించారు. అదనపు కలెక్టర్ విక్టర్, కాలుష్య నియంత్రణ మండలి అధికారి లక్ష్మీనారాయణ, కామారెడ్డి ఆర్డీవో వీణ తదితరులు పాల్గొన్నా రు. 39 మంది ప్రతినిధులు ఫార్మా ఫ్యాక్టరీ ఏర్పా టును వ్యతిరేకించారు. ఇప్పటికే ఉన్న కంపెనీలు వెదజల్లుతున్న కాలుష్యంతో పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. ఉద్యోగాల ఆశ చూపి ఫ్యాక్టరీలు పెడుతూ నీరు, గాలి, నేల కలుషితం చేస్తున్నారని ఆరోపించారు. కంపెనీ ఏర్పాటు చేయొద్దంటూ వేలాది మంది నినాదాలు చేశారు.ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా భారీ పో లీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, అసిస్టెంట్ ఎస్పీ చైతన్యరెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్‌రావు, సీఐలు సంపత్‌కుమార్, తిరుపయ్య ఎస్సై ఆంజనేయులతో పాటు డివిజన్లోని అందరూ ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ ప్రాంగణం వరకు వాహనాలను అనుమతించలేదు. సుమారు అరకిలోమీటరు దూరంలోనే వాహనాలను నిలిపివేయడంతో ప్రజలు కాలినడకన వచ్చారు. ఫ్యాక్టరీ ఏర్పాటు చేయొద్దంటూ చే పట్టిన భిక్కనూరు బంద్ విజయవంతమైంది. ఇప్పటికే ఉన్న ఫ్యాక్టరీలతో అనారోగ్యం పాలవుతున్నాం కొత్తగా ఫార్మా కంపెనీని ఏర్పాటు చేస్తే ఊరుకోం ప్రజాభిప్రాయ సేకరణలో స్పష్టం చేసిన భిక్కనూరు ప్రజలు -
సంక్రాంతికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
సుభాష్‌నగర్: సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం ఈనెల 9 నుంచి 20వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు రీజియన్ మేనేజర్ టి జ్యోత్స్న బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ (జేబీఎస్) నుంచి నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, కామారెడ్డికి ప్రత్యేక బస్సులు రాకపోకలు సాగిస్తాయని పేర్కొన్నారు. పండుగ రోజుల్లోనూ ఆర్డీసీ మహాలక్ష్మి పథకాన్ని వర్తింపజేస్తుందని తెలిపారు. పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. నిజామాబాద్ రీజియన్ ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా జేబీఎస్లో డిపోలవారీగా ప్రత్యేక ఆఫీసర్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రయాణికులు ముందస్తుగా రిజర్వేషన్ చేసుకోవడం ద్వారా సౌకర్యవంతంగా, ఇబ్బందులు లేకుండా ప్రయాణించవచ్చన్నారు. టికెట్ బుకింగ్ సౌకర్యం ఆర్టీసీ ఆన్లైన్ వెబ్సైట్ www.tgartcbus.in, టీజీఎస్ఆర్టీసీ గమ్యం యాప్‌లో అందుబాటులో ఉందని ఆర్ఎం తెలిపారు. డిపోల వారీగా జేబీఎస్ నుంచి నడవనున్న బస్సులుడిపో ప్రత్యేక బస్సులు నిజామాబాద్–1 96 నిజామాబాద్–2 53 ఆర్మూర్ 94 బోధన్ 86 బాన్సువాడ 74 కామారెడ్డి 97 మొత్తం 500 -
సమాజ ఉన్నతిలో విద్య కీలకం
● ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డిఖలీల్వాడి: సమాజ ఉన్నతికి విద్య ఎంతో తోడ్పడుతుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలను బుధవా రం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. విద్యను ఉన్నతీకరించే ప్రయత్నంలో విశ్వవిద్యాలయాలు సంస్కరణలు చేపడుతున్నాయని, సమస్య లను అఽ దిగమిస్తూ వ్యవస్థలో మార్పులు తేవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి రామ్మోహన్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ రంగరత్నం, పీఆర్వో దండు స్వామి, ఎన్సీసీ అధి కారి లెఫ్టినెంట్ రామస్వామి, అధ్యాపకులు రంజిత, వినయ్‌కుమార్, ముత్తెన్న, చంద్రశేఖర్, జయప్రసాద్, రామకృష్ణ, రమేశ్‌గౌడ్, బాలమణి, పూర్ణ చందర్, కార్యాలయ సి బ్బంది తదితరులు పాల్గొన్నారు. క్వార్టర్ ఫైనల్‌కు నిఖత్ జరీన్ సుభాష్‌నగర్: నేషనల్ సీనియర్ బాక్సింగ్ చాంపియన్ షిప్లో తెలంగాణ స్టార్ నిఖత్ జరీన్ ముందంజ వేసింది. గ్రేటర్నోయిడాలో నిర్వహిస్తున్న పోటీల్లో మొదటి రౌండ్లో 5–0తో చండీగఢ్‌కు చెందిన నిధి పై నిఖత్ విజయం సాధించింది. మహిళల 48–51 కిలోల విభాగంలో తెలంగాణ బాక్సర్ నిఖత్, లడఖ్‌కు చెందిన కుల్సూమా బానోపై పైచేయి సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. గురువారం అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన బాక్సర్తో నిఖత్ పోటీపడనుంది. లేగ దూడపై చిరుత దాడి సిరికొండ: రేంజ్ పరిధిలోని తిరుపతిగుట్ట అటవీ ప్రాంతంలో ఈ నెల 6వ తేదీన లేగ దూడపై చిరుత దాడి చేసి చంపిందని ఇన్చార్జి రేంజర్ రవీందర్ బుధవారం తెలిపారు. గోప్యానాయక్ తండాకు చెందిన మలావత్ రఘుపతికి చెందిన లేగదూడ అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లి చోట మృతి చెందడంతో అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారన్నారు. తమ సిబ్బంది అక్కడికి వెళ్లి పరిశీలించగా లేగదూడపై చిరుత దాడి చేసినట్లు నిర్దారణ అయ్యిందన్నారు. ఘటనాస్థలంలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయగా, లేగ దూడ కళేబరాన్ని తినడానికి వచ్చిన చిరుత కెమెరాకు చిక్కినట్లు తెలిపారు. అటవీ శాఖ ద్వారా బాధితుడికి నష్ట పరిహారం మంజూరు చేయిస్తామని అన్నారు. అటవీ జంతువులు పశువులపై దాడి చేస్తే ఎలాంటి విషప్రయోగం చేయొద్దని, అలా చేస్తే కేసులు నమోదు చేస్తామని అన్నారు. పశువులపై అటవీ జంతువులు దాడి చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
మొరాయించిన మాధవనగర్ రైల్వేగేటు
నిజామాబాద్ రూరల్: బర్ధిపూర్ శివారులోని మాధవనగర్ రైల్వేగేటు సోమవారం మొరాయించింది. దీంతో ఇరువైపులా వాహనదారు లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం వే ళ రైలు వస్తుండటంతో గేట్‌మన్ రైల్వేగేటు వే శాడు. రైలు వెళ్లిన అనంతరం ఒకవైపు గేటు లే వగా కొందరు వాహనదారులు ముందుకు వె ళ్లారు. కానీ ఇంకో గేటు లేవకపోవడంతో ప్ర యాణికులు పట్టాల మధ్యలోనే ఉండిపోయా రు. అరగంట తర్వాత మళ్లీ గేట్‌మన్ రైల్వేగేట్‌ను వేసి తీయడంతో గేటు మొత్తం రెండు వైపులా తెరుచుకోవడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. -
బీజేపీ, ఎంఐఎంలవి ఎన్నికల డ్రామాలు
నిజామాబాద్ రూరల్: మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఎన్నికల డ్రామాలు చేస్తున్నారని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో మున్సిపల్ కమిషనర్ అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయగా, ప్రతి పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులు మించకుండా రావాల్సి ఉండగా, బీజేపీ, ఎంఐఎం నాయకులు తమ కార్యకర్తలతో కలిసి అధిక సంఖ్యలో వచ్చారన్నారు. నిజామాబాద్‌లో ఓటు హ క్కు లేని షబ్బీర్‌అలీ కొడు కు ఇలియాస్ నిజామాబాద్ మేయర్ అవ్వడానికి ఎలా సాధ్యమవుతుందొ బీజేపీ జిల్లా అధ్యక్షుడే తెలపాలని ఆయన అన్నారు. -
‘కార్పొరేషన్’పై బీజేపీ జెండా ఎగరడం ఖాయం
● మేయర్ పీఠంపై ఇందూరు బిడ్డనే కూర్చోబెడతాం ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి సుభాష్‌నగర్: మున్సిపల్ కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగరడం ఖాయం అని, మేయర్ పీఠంపై ఇందూరు బిడ్డనే కూర్చోబెడతామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి స్పష్టంచేశారు. షబ్బీర్, బషీర్ల కుమారులను కూర్చోబెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో సోమవారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం ముగిసిన అ నంతరం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆ యన మాట్లాడారు. ఓటరు జాబితాలో అవకతవకలపై బీజేపీ ప్రశ్నించగానే అధికార దుర్వినియోగం, మత రాజకీయాల అసలు స్వరూపం బయటపడ్డా యని విమర్శించారు. బోగస్ ఓట్లు, అక్రమ రాజకీ యాలు, బెదిరింపుల పాలనకు ముగింపు దగ్గర్లోనే ఉందని స్పష్టంచేశారు. ఇందూరు ప్రజల గుండెల్లో బీజేపీ ఉందని, మేయర్ పీఠం మీద కూడా బీజేపీ నే, హిందూ బిడ్డనే ఉంటాడని స్పష్టంచేశారు. మాజీ కార్పొరేటర్లు, నాయకులు న్యాలం రాజు, లక్ష్మీనారాయణ, ఆకుల శ్రీనివాస్, తారక్ వేణు, విజయ్, శ్రీనివాస్‌రెడ్డి, బాలకృష్ణ, ఓంసింగ్, సాయివర్ధన్, శ్రీనివాస్, సుధీర్, ఆనంద్, శ్రీకర్, పాల్గొన్నారు. బీజేపీలో పలువురి చేరిక సుభాష్‌నగర్: మాజీ కార్పొరేటర్ ప్రమోద్‌కుమార్ నేతృత్వంలో 4వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు, పాంగ్రా మాజీ సర్పంచ్ భీమ్‌సింగ్, ఎల్ఐసీ శ్రీనివాస్, తదితరులు తమ అనుచరులతో బీజేపీలో చేరారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో వారికి సోమవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి బీజేపీ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఘన విజయం సాధిస్తామని ఆయన తెలిపారు. పార్టీలో చేరారు. -
కాంగ్రెస్ నేతలను దూషించే హక్కు బీఆర్ఎస్కు లేదు
● సబ్బండవర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం ● కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగేశ్ రెడ్డి నిజామాబాద్ రూరల్: కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీని, సీఎం రేవంత్‌రెడ్డిని దూషించే హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్ రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు కాంగ్రెస్ పార్టీ నేతలను అవమానించేలా అసెంబ్లీలో మాట్లాడటం సరికాదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అమలు చేయడం లేదని కేటీఆర్ అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. గతంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు మూడు ఎకరాల భూమి, దళిత సీఎం, ప్రతి పేదవానికి డబుల్ బెడ్రూం ఇళ్లు, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇచ్చిందా అని ప్రశ్నించారు. పదేళ్లపాటు రాష్ట్రాన్ని దోచుకున్నారని, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పల తెలంగాణాగా మార్చారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు అందించినట్లు తెలిపారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు, దాదాపు రూ.22 కోట్ల వరకు రైతు రుణమాఫీ చేశామని పేర్కొన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమ మే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. మరోసారి కాంగ్రెస్ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే బీ ఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీస్తామని హెచ్చరించారు. నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, జావిద్ అక్రమ్, సంతోష్, వేణురాజ్, యాదగిరి, వేల్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సారెడ్డి, రాజేందర్, శోభన్, కౌశిక్, దేగం గంగారెడ్డి, గణేశ్ తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్‌ను కలిసిన అధికారులు, విద్యార్థినులు
నిజామాబాద్ అర్బన్: జిల్లా నూతన కలెక్టర్‌గా నియమితులైన ఇలా త్రిపాఠిని సోమవారం వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం ఇచ్చి పరిచయం చేసుకున్నారు. అలాగే కోటగల్లి, నాందేవ్‌వాడ ఎస్సీ బాలికల వసతిగృహం విద్యార్థులు గ్రీటింగ్‌లను అందించారు. సిరికొండ: జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకాన్ని నీరు గారేలా చేస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మండల కేంద్రంలో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇట్టెంపేట రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధిహామీ పథకం స్థానంలో తెచ్చిన వీబీ జీ రాంజీ మిషన్‌ను రద్దు చేయాలన్నారు. సొసైటీ హాల్లో నిర్వహించే సమావేశాన్ని అన్ని వర్గాల శ్రేణులు విజయవంతం చేయాలని ఆయన కోరారు. సుభాష్‌నగర్: నగరంలోని పెరిక భవన్లో సోమవారం పెరిక సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా మైదం రాజన్న, అసోసియేట్ అధ్యక్షుడిగా గొర్ల లింగం, కార్యదర్శిగా అల్లే రమేష్, ఉపాధ్యక్షులుగా విశ్వనాథం, కోశాధికారిగా వేణు ఎన్నికయ్యారు. జిల్లాలోని 48 గ్రామాల పెరిక సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా నూతన అధ్యక్షుడు రాజన్న మాట్లాడుతూ..పెరిక సంఘం సభ్యుల అభ్యునతికి పాటుపడతానని అన్నారు. సిరికొండ: సర్పంచ్ల ఫో రం మండలాధ్యక్షుడిగా దు ప్యతండా సర్పంచ్, డీసీసీ కార్యదర్శి మాలావత్ చందర్‌నాయక్ ఏకగ్రీవంగా ఎ న్నికయ్యారు. మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో అతడిని సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లా డుతూ.. మిగతా కార్యవర్గాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు బా కారం రవి, డీసీసీ కార్యదర్శి ఎర్రన్న, నర్సారెడ్డి, పిట్ల నర్సింగ్, చల్ల రాజారెడ్డి, దేగాం సాయన్న, రవినాయక్, సర్పంచ్‌లు మల్లేష్‌యాదవ్, లతభాస్కర్రెడ్డి, పిట్ల వనిత పాల్గొన్నారు. -
విద్యుత్ మరమ్మతులు సొంతంగా చేయొద్దు
ధర్పల్లి: విద్యుత్ సమస్యలు వచ్చినప్పుడు ప్రజ లు సొంతంగా మరమ్మతులు చేయొద్దని గ డ్కోల్ సెక్షన్ ఏఈ శివకుమార్ అన్నారు. మండలంలోని హోన్నాజీపేట్ గ్రామంలో సోమవా రం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. రైతులకు, వినియోగదారులకు విద్యుత్ వల్ల జరిగే ప్రమాదాలను, జా గ్రత్తలను వివరించారు. రైతులు నాణ్యమైన కరెంటు కోసం ఐఎస్ఐ ఉన్న కెపాసిటర్లు, మో టార్లను వాడాలన్నారు. కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్ రామ్మోహన్ రావు, లైన్మెన్ కాశీ రాం, రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు. ఖలీల్‌వాడి: ఐరన్ అధికంగా ఉండే పాలు, పండ్లు, ఆకుకూరలు వంటి పౌష్టికాహారంతోనే ఆ రోగ్యం లభిస్తుందని డాక్టర్ అంకం భానుప్రి య తెలిపారు. నగరంలోని శంకర్ భవన్ ప్ర భుత్వ పాఠశాలలో సోమవారం లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా అమె విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడారు. హెచ్ఎం సాయన్న, క్లబ్ ప్రతినిధులు అబ్బా యి లింబాద్రి, రాఘవేంద్ర బాబు, అంకం రా జేందర్, చింతల గంగాదాస్, ఉపాధ్యాయులు వెనిగల్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభు త్వ కళాశాలలో సోమవారం కామర్స్ విభాగంతో ఎస్జీడీ ప్రొఫెసనల్ ఐటీ సెక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కుదుర్చుకున్న ఎంఓయూలో భాగంగా వర్క్‌షాప్ నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ రాంమోహన్ రెడ్డి తెలిపారు. ఈసందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. విద్యార్థుల్లో నైపుణ్యం, ఉ ద్యోగావకాశాలు మెరుగుపర్చడానికి వర్క్ షా పు ఎంతగానో ఉపమోగపడుతుందన్నారు. నిజామాబాద్ రూరల్: ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలను పాటించాలని రూరల్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. నగరంలోని కంఠేశ్వర్ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద సోమవారం జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు ప్లకార్డులు పట్టుకిని అవగాహన కల్పించా రు. పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్: రిటైర్డ్ అంగన్వాడీల స మస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశా రు. నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో సోమవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఆమె మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే వారికి ఇచ్చిన హామీలను అమలు జరపాలన్నారు. లే నియెడల ఆందోళనలు చేస్తామని హెచ్చరించా రు. అనంతరం అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందిచారు. సంఘ ప్రతినిధులు హైమావతి, లలిత, రమ, పుష్ప, శోభారాణి పాల్గొన్నారు. -
7నుంచి డిచ్‌పల్లిలో క్రికెట్ టోర్నమెంట్
డిచ్పల్లి: మండలకేంద్రంలో ఈనెల 7 నుంచి 11 వరకు నిజామాబాద్ నగరానికి చెందిన ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్టు హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బొద్దుల రాజేంద్రప్రసాద్ తెలిపారు. డిచ్‌పల్లిలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ క్రికెట్ టోర్నీ డిచ్పల్లి సీఎంసీ మైదానంలో జరుగుతుందన్నారు. డిచ్పల్లి మండలంలోని వివిధ గ్రామాలతో పాటు తెలంగాణ యూనివర్సిటీ, తెలంగాణ ప్రత్యేక పోలీస్ ఏడో బెటాలియన్లకు చెందిన 16 క్రికెట్ జట్లు ఇందులో పాల్గొంటున్నాయన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా క్రీడల ద్వారా మానసిక, శారీరక ధృడత్వాన్ని పెంపొందించుకోవాలనే సంకల్పంతో ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్టు వివరించారు. విజేతలకు 11వ తేదీన బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు వినోద్, బాబు, వనిత, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
సంక్షిప్తం
అంగన్వాడీ పిల్లలకు యూనిఫామ్స్ పంపిణీ డిచ్పల్లి: మండలంలోని నడిపల్లి జీపీ పరిధిలోగల గాంధీనగర్ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో సోమవారం ప్రీ స్కూల్ పిల్లలకు ప్రభుత్వం ద్వారా వచ్చిన యూనిఫామ్స్‌ను సర్పంచ్ కులచారి అశ్విని పంపిణీ చేశారు. పంచాయతీ కార్యదర్శి గంగాధర్, వార్డుసభ్యులు,అంగన్వాడీ టీచర్ సుశీల,ఆ యా రూపాలి ఆశా కార్యకర్తలు, పిల్లల తల్లిదండ్రులున్నారు. రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీతలకు సన్మానం సుభాష్‌నగర్: సావిత్రిబాయి పూలే రాష్ట్రస్థాయి ప్రతిభ పురస్కారాలు అందుకున్న ‘బగ్గలి స్వప్న రజక, సురుకుట్ల ఝాన్సీలను సోమవారం నిజామాబాద్ జిల్లా మహిళా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. వాసంజయ, రేఖ, రుక్మిణి, అపర్ణ, సుధాకర్, కరిపే రవీందర్, దేవేందర్, అజయ్, చంద్రకాంత్, సురకుట్ల విజయ్, సాయి బసవ, సత్యనారాయణ, సురేందర్, బాలన్న, దేశాయి గంగాధర్, దామ నరసయ్య, హనుమాండ్లు పాల్గొన్నారు షూటింగ్ క్రీడాకారుడికి అభినందన సుభాష్‌నగర్: జిల్లాకు చెందిన క్రీడాకారుడు బొప్పు రణ్వీర్ ఇటీవల ఓపెన్ నేషనల్ మల్టీ టార్గెట్ స్పోర్ట్స్ మొదటి చాంపియన్‌షిప్–2025లో పాల్గొని 25 మీటర్ల బెంచ్ రెస్ట్ షూటింగ్ విభాగంలో బంగారు పతకం సాధించాడు. ఈసందర్భంగా సోమవారం మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ తన నివాసంలో రణ్వీర్ను అభినందించారు. తన తండ్రి ధర్మపురి శ్రీనివాస్, తాను స్థాపించిన నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ ద్వారా రణవీర్‌కు భవిష్యత్‌లో ప్రోత్సాహం అందిస్తానని ఆయన హామీనిచ్చారు. సమయానికంటే ముందే ఇంటికి.. సిరికొండ: మండల పంచాయతీ అధికారి తారాచంద్ సా యంత్రం ఐదు గంటల వరకు విధులు నిర్వహించాల్సి ఉండగా, సోమవారం నాలుగు గంటలకే ఆర్టీసీ బస్సులో నిజామాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. ఎంపీవో ప్రతి రోజు ఉదయం 11 గంటలకు వచ్చి సాయంత్రం కార్యాలయం సమయాని కంటే ముందే వెళ్లి పోతారని పలువురు పేర్కొంటున్నారు. ఈ విషయమై ఎంపీడీవో మనోహర్‌రెడ్డిని ఫోన్ లో వివరణ కోరగా తాను నిజామాబాద్‌లో ఉన్నానని, మంగళవారం తగిన విచారణ జరుపుతానన్నారు. పెటా క్యాలెండర్ ఆవిష్కరణ ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లోని డీఈవో కార్యాలయంలో సోమవారం డీఈవో అశోక్ జిల్లా తెలంగాణ వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం(పెటా) క్యా లెండర్‌ను ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షుడు గోపిరెడ్డి, ప్రధా న కార్యదర్శి శ్రీనివాస్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ప్రసా ద్, ఉపాధ్యక్షుడు సుశీల్ కుమార్, పావని, ప్రతిభ ఉన్నారు. క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం సుభాష్‌నగర్: నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో ఇంట్రా మ్యూరల్ క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రిన్సిపల్ రామ్మోహన్‌రెడ్డి సోమవా రం ప్రారంభించారు. నేడు ఫైనల్ మ్యాచ్ ఆర్ట్స్ విభాగం, ఫిజికల్స్ సైన్స్ విభాగాల మధ్య జరుగుతుందని ఫిజికల్ డైరెక్టర్ బాలమణి తెలిపారు. అక్రమ ఓట్లను తొలగించాలి నిజామాబాద్ రూరల్: జిల్లాలోని 13వ డివిజన్ సారంగాపూర్‌లో అక్రమంగా దాదాపు1600 ఓట్లు ఉన్నాయని, వెంటనే వాటిని తొలగించాలని 13 డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేతావత్ రాంసింగ్ సోమవారం ఒక ప్రకటనలో అన్నారు. వాటిని తొలగించాలని త్వరలో మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందిస్తామన్నారు. ఓటర్‌జాబితాలో అవకతవకలు సుభాష్‌నగర్: నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల ఓటర్ల జాబితాలో భారీగా అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సమీర్‌అహ్మద్, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు ఆజారొద్దీన్ ఆరోపించారు. ఈవిషయమై సోమవారం కలెక్టర్‌తో పాటు మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్‌కు ఆయన వినతిపత్రం అందజేశారు. వెనిజులాపై అమెరికా ఏకపక్ష దాడి అమానుషం.. నిజామాద్ రూరల్: వెనిజులాపై అమెరికా ఏకపక్ష దుర్మార్గ దాడి అమానుషం అని హమాలీ వర్కర్స్ యూనియన్ ప్రధా న కార్యదర్శి శివకుమార్ ఒక ప్రకటనలో అన్నారు. భారతదేశం అమెరికా చర్యలను ఖండించాలన్నారు. కొనసాగుతున్న పాశురాల ప్రవచనాలు నిజామాబాద్ రూరల్: నగరంలోని చక్రం గుడిలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుప్పావై పాశురాల ప్రవచనాల కార్యక్రమం వెభవంగా కొనసాగుతున్నాయి. ప్రవచనాలు ఈనెల 14 వరకు కొనసాగుతాయని, అర్చకులు నరసింహ మూర్తి, నాని స్వామి తెలిపారు. -
త్యాగరాజ స్వామి ఆరాధన మహోత్సవం
మోపాల్: మండలంలోని కంజర్ శివారులోగల తె లంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పా ఠశాలలో త్యాగరాజ స్వామి ఆరాధన మహోత్సవం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంగీతాన్ని భక్తిగా మార్చి, భక్తిని సంగీతంగా ఆవిష్కరించిన మహానుభావుడు సంత్ త్యాగరాజ స్వామి అని కళాశాల ప్రిన్సిపాల్ జి విజయలలిత కొనియాడారు. త్యాగరాజ ఆరాధన కేవలం ఒక సంగీత సభ మాత్రమే కాదు.. ఇది ఒక ఆధ్యాత్మిక యజ్ఞమని పేర్కొన్నారు. పాఠశాలలోని సంగీతవాద్యాలను విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చిన్నారులందరూ సంగీతం పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని సంగీత ఉపాధ్యాయురాలు జి సుజాత సూచించారు. ఈ మహోత్సవానికి సంగీత వాద్య సహకారం అందించిన వయోలిన్ వేదాంత సీతారామచంద్రమూర్తి, మృదంగం విశ్వనాథ్, తబలా యోగేశ్ జోషి, పి యానో సంబేటి రాము, ప్యాడ్ సంబేటి శ్యామ్‌లను ప్రిన్సిపాల్ సన్మానించారు. కార్యక్రమంలో ఉపా ధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
నిజామాబాద్‌ను స్మార్ట్ సిటీగా గుర్తించాలి
నుడా చైర్మన్ కేశ వేణు సుభాష్‌నగర్: నిజామాబాద్ నగరం అన్నివిధాలా అభివృద్ధి చెందాలంటే స్మార్ట్ సిటీగా మార్చేందుకు ఎంపీ ధర్మపురి అర్వింద్ చొరవ తీసుకోవాలని, అందుకు పార్టీలకతీతంగా తాము సహకరిస్తామని నుడా చైర్మన్ కేశ వేణు పేర్కొన్నారు. నగరంలోని ప్రధాన సమస్యలను ప్రస్తావిస్తూ నిజామాబాద్ నగర అభివృద్ధి కమిటీ రూపొందించిన పుస్తకాన్ని ఆయన సోమవారం సుభాష్‌నగర్‌లోని పెన్షనర్స్ భవనంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేశ వేణు మాట్లాడుతూ.. గతంలో కరీంనగర్, నాందేడ్ జిల్లాల నుంచి వివిధ వస్తువులు కొనుగోలు చేసేందుకు జిల్లాకు వచ్చేవారని, కానీ ఆ రెండు జిల్లాలు నిజామాబాద్ కన్నా అభివృద్ధిలో ముందున్నాయని తెలిపారు. గత పాలకుల వల్లే జిల్లా అన్నిరంగాల్లో వెనకబడిపోయిందని, నగరంలో యూజీడీ వ్యవస్థకు ప్రభుత్వం రూ.400 కోట్లు విడుదల చేసిందన్నారు. డ్రెయినేజీ వ్యవస్థ, రోడ్లు, వీధి దీపాల ఏర్పాటుకు అందరి సలహాలతో నుడా పరిధిలో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. నగరంలో కుక్కల బెడద, ఆవుల బెడదతోపాటుగా అనేక సమస్యలను పరిష్కరించడానికి మున్సిపల్ శాఖతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. ఆల్ పెన్షనర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నగర అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు, నాయకులు హుస్సేన్, మల్లేశ్ రెడ్డి, భరద్వాజ, భూపతిరావు, ఈవీఎల్ నారాయణ మాట్లాడుతూ నగరంలోని రోడ్లపై పశువులు, కాలనీల్లో కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని, సమస్యను పరిష్కరించాలని కోరారు. మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో ము న్సిపల్ కార్పొరేషన్ వైఫల్యం చెందిందన్నారు. -
ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి
మోపాల్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉ పాధి హామీ పథకం చట్టాన్ని కొనసాగించాలని ఏఐకేఎంఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం మండలంలోని తాడెంలో గాంధీ విగ్రహం వద్ద వారు నిరసన తెలిపారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ.. పథకంలో గాంధీ పేరును తొలగించి ‘జీ రామ్ జీ’ పేరుతో కొత్త బిల్లును తీసుకురావడం సరికాదన్నారు. ఉపాధి హామీ పథకానికి గతంలో కేంద్ర ప్రభుత్వం 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం వాటాగా నిధులు కేటాయించేదన్నారు. కానీ ఇప్పుడు ఈ కొత్త చట్టంలో 60 శాతం కేంద్రం వాటాగా, 40శాతం రాష్ట్రాల వాటాగా పొందుపరిచి మోదీ ప్రభుత్వం ఆ పథకం నుంచి మెల్లగా తప్పుకొని అంతిమంగా ఆ పథకం రద్దుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నాయకులు వేల్పూర్ భూజేందర్, బంటు రాజయ్య, గంగారాం, రమేష్, మురళి, బన్నీ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
ఆర్థిక ఇబ్బందులతో ఒకరి ఆత్మహత్య బిచ్కుంద(జుక్కల్): ఆర్థిక ఇబ్బందులతో మండల కేంద్రానికి చెందిన ఒకరు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై మోహన్ రెడ్డి తెలిపారు. మండల కేంద్రానికి చెందిన గోపీదత్తు(44) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అప్పులు కావడంతో ఆదివారం రాత్రి గదిలో ఉరేసుకున్నాడు. భార్య రుక్మిణి ఉదయం భర్త నిద్రిస్తున్న గదిలోకి వెళ్లి చూడగా విగతజీవి అయి ఉన్నాడు. పొలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారట్లు ఎస్సై తెలిపారు. వృద్ధురాలు ..జక్రాన్‌పల్లి: మండలంలోని మునిపల్లి గ్రామానికి చెందిన ఆరే గంగు (85) ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. గంగు కొంతకాలం క్రితం ఇంట్లో కాలు జారిపడటంతో తుంటి ఎముక విరిగింది. అప్పటి నుంచి మానసికంగా కుంగిపోయి చీటికి మాటికి చనిపోతానని కుటుంబీకులకు చెప్పేది. ఈ నెల 4న చీరతో ఇంట్లో కిటికీకి ఉరేసుకొంది. గమనించిన కుటుంబీకులు ఆర్మూర్‌లోని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సెల్‌టవర్ ఎక్కిన యువకుడు రుద్రూర్: భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన చాకలి రాజు అనే యువకుడు సోమవారం మధ్యాహ్నం సెల్‌టవర్ ఎక్కాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై సాయన్న ఘటనా స్థలానికి చేరుకున్నారు. టవర్‌పై ఉన్న యువకుడితో మాట్లాడి పరిస్థితిని సముదాయించి రాజును సురక్షితంగా కిందకు దింపారు. అనంతరం ఆయనను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి కుటుంబసభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఏడుగురికి జరిమానా ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో పోలీసులు డ్రంకెన్‌డ్రైవ్‌పై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఏడుగురికి కౌన్సిలింగ్ నిర్వహించి సోమవారం కోర్టులో హాజరుపరిచారు. దీంతో జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ భవ్యశ్రీ ఏడుగురికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడుపొద్దని, వాహనాల పత్రాలను సరిగా ఉండాలని ఎస్‌హెచ్‌వో సూచించారు. -
నందిపేట్‌కు ఆర్టీసీ డిపో మంజూరు చేయండి
ఆర్మూర్ : నందిపేట్ మండల కేంద్రంలో ఆర్టీసీ డిపోను మంజూరు చేయాలని లేదా డిపో స్థలాన్ని ఇతర అవసరాలకు వాడుకు నే విధంగా ఇవ్వాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి కోరారు. అసెంబ్లీ జీరో అవర్‌లో ఆయన మాట్లాడారు. ఖుద్వాన్పూర్లో బీసీ, ఎస్సీ వసతి గృహాలు, ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్‌నగర్‌లో ఉన్న మైనారిటీ ప్రభుత్వ పాఠశాలకు భవనాలు మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా కంఠం ప్రభుత్వ పాఠశాల కోసం రూ.5 లక్షలు కేటాయించాలన్నారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఆర్టీసీ డిపో సాధ్యాసాధ్యాలపై అధికారులతో మాట్లాడి అవసరం మేరకు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే పాఠశాలల మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నిజాంసాగర్ కాలువల మరమ్మతులకు.. ఆర్మూర్: నిజాంసాగర్ ప్రాజెక్టు కాలువల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని నీటి పా రుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో వినతిపత్రం అందజేశారు. కాలువలు శిథిలమవ్వడంతో ఆర్మూర్ నియోజకవర్గానికి నిజాంసాగర్ ప్రాజెక్టు నీరందడం లేదని, సుమారు 35 కిలో మీటర్ల మేర కాలువల మరమ్మతులకు రూ.1,500 కోట్లు మంజూరు చేయాలని కోరారు. స్పందించిన మంత్రి సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. -
డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో ఒకే రోజు 141 మందికి శిక్ష
కామారెడ్డి క్రైం: మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన వారిలో 141 మందికి సోమవారం జిల్లాలోని వివిధ కోర్టులు శిక్షలు, జరిమానాలు విధించినట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకరికి 2 రోజుల జైలు, మరో 12 మందికి 1 రోజు జైలు శిక్ష, రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. భిక్కనూర్ పీఎస్ పరిధిలో ఇద్దరికి ఒక రోజు జైలు శిక్ష రూ.వెయ్యి జరిమానా, దోమకొండ పరిధిలో ఒకరికి ఒక రోజు జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా, సదాశివనగర్ పరిధిలో ఒక రోజు జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించబడిందన్నారు. కామారెడ్డి పీఎస్ పరిధిలో 73 కేసులకు రూ.76 వేలు, దేవునిపల్లి పరిధిలో 11 కేసులకు రూ.11 వేలు, మాచారెడ్డి పరిధిలో 5 కేసులకు రూ.5 వేలు, రామారెడ్డి పరిధిలో 2 కేసులకు రూ.2 వేలు, భిక్కనూర్ పరిధిలో 18 కేసులకు రూ.20 వేలు, దోమకొండ పోలీస్ పరిధిలో 5 కేసులకు రూ.6 వేలు, బీబీపేట పరిధిలో 4 కేసులకు రూ.4 వేలు, సదాశివనగర్‌లో 6 కేసులకు రూ.7 వేలు చొప్పున జరిమానాలు విధించారని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 141 కేసులు నమోదు కాగా, మొత్తం రూ.1.48 లక్షలు జరిమానా విధించినట్లు తెలిపారు. -
అప్పు ఎగ్గొట్టేందుకు హత్య
● ఆస్తి కోసం మరదలిని చంపేందుకు వదిన సహాయం ● మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులునందిపేట్(ఆర్మూర్): తీసుకున్న అప్పును ఎగ్గొట్టేందుకు మహిళను కిరాతకంగా హత్య చేసిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. నందిపేట మండలం తల్వేద గ్రామ శివారులోని వాగులో ఈ నెల 3న జరిగిన మహిళ హత్యకు సంబంధించిన వివరాలను ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్‌రెడ్డి సోమవారం వెల్లడించారు. నందిపేట మండల కేంద్రానికి చెందిన రాగల గంగామణి తన స్నేహితులైన బామని స్వరూప, దుబ్బాక లావణ్యతోపాటు ఆమె చెల్లెలు ప్రేమలకు రూ. 6 లక్షలు అప్పుగా ఇచ్చింది. కొన్నిరోజుల పాటు వడ్డీ చెల్లించి, ఆ తర్వాత వడ్డీ చెల్లించడం ఆపేశారు. ఈ విషయంలో పలుమార్లు గంగామణి వారితో గొడవ పడింది. దీంతో ఆమె ఇచ్చిన డబ్బులను ఎగ్గొట్టేందుకు గంగామణిని చంపడమే మార్గమని భావించిన నిందితులు ఈ నెల 2న నిర్మల్ జిల్లా బాసరకు వెళ్దామని గంగామణిని నమ్మించారు. పథకం ప్రకారం స్వరూప, దుబ్బాక లావణ్యలు బస్సుపై బాసరకు వెళ్లారు. ప్రేమల, ఆమె భర్త నరేశ్, మృతురాలు గంగామణి కలిసి బైక్‌పై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో స్వరూప, లావణ్య ఆటోలో ఇంటికి వచ్చారు. ప్రేమల, నరేశ్, గంగామణి బైక్‌పై బయల్దేరారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో తల్వేద వాగు బ్రిడ్జి వద్దకు రాగానే టాయిటెల్ వస్తుందని నమ్మించి బైక్‌ను నిలిపారు. గంగామణి టాయిలెట్ చేస్తుండగా వెంట తెచ్చుకున్న సుత్తెతో వెనుకనుంచి ఆమె తలపై రెండు దెబ్బలు వేశారు. తీవ్రంగా గాయపడిన గంగామణి అరుస్తూ పరుగెత్తగా ప్రేమల, నరేశ్‌లు ఆమె మెడలోని పుస్తెలతాడును లాక్కొని వాగులో తోసేశారు. అనంతరం స్వరూప, లావణ్యలకు సమాచారం చేరవేసి ఇంటికి చేరుకున్నారు. కాగా, 3వ తేదీన డెడ్‌బాడీ దొరకడంతో మృతురాలి కూతురు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సోమవారం నందిపేట మండలంలోని వెల్మల్ చౌరస్తా నుంచి నిందితులు పారిపోతుండగా పట్టుకున్నారు. నిందితుల నుంచి రెండు తులాల పుస్తెలతాడు, బైక్, హత్యకు ఉపయోగించిన సుత్తెను స్వాధీనం చేసుకొని రి మాండ్‌కు తరలించినట్లు సీఐ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. హత్యలో వదిన ప్రమేయం.. నిందితులను విచారించగా మృతురాలి అన్న భార్య మగ్గిడి లావణ్య కూడా తమకు సహకరించినట్లు వెల్లడించారు. లావణ్య, ప్రేమల, స్వరూప తీసుకున్న అప్పు విషయమై పలుమార్లు గంగామణితో జరుగుతున్న గొడవల విషయంలో మృతురాలి అన్న భార్య మగ్గిడి లావణ్యతో చర్చించారు. దీంతో గంగామణి ఆస్తిపై కన్నేసిన లావణ్య.. గంగామణిని చంపేయాలని, తాను సహాయం చేస్తా అని హత్యకు ఉసిగొల్పినట్లు తెలిపారు. హత్య చేసిన అనంతరం నిందితులు లావణ్యకు ఫోన్ చేసినట్లు గుర్తించామని, కుట్రలో భాగమైనందున ఆమైపె కూడా కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. హత్య కేసును త్వరగా ఛేదించిన స్థానిక ఎస్సై శ్యాంరాజ్, సిబ్బందిని సీఐ అభినందించారు. -
ప్రజావాణిపై నమ్మకంతో వస్తారు..
నిజామాబాద్ అర్బన్: తమ సమస్యలు పరి ష్కా రమవుతాయనే నమ్మకంతో ప్రజలు ప్రజావాణికి వస్తారని, జిల్లా అధికారులు అందుబాటులో ఉండి వారి సమస్యలను అప్పటికప్పుడే ప రిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్‌తో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 70 ఫిర్యా దులు అందాయి. ప్రజావాణి అనంతరం అధికారులతో కలెక్ట ర్ మాట్లాడారు. రాష్ట్రస్థాయిలో కొనసాగుతున్న తరహాలోనే జిల్లా ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారం కోసం ఆన్లైన్ విధానాన్ని అవలంబిస్తామని అన్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆయా శాఖ ల జిల్లా అధికారులు ప్రజావాణికి గైర్హాజరు కావొద్దని, కార్యస్థానాల్లో అందుబాటులో ఉండాలని సూచించారు. క్షేత్ర స్థాయి విషయాలు తెలుసు కునేందుకు ప్రజావాణి వేదికగా ఉపయోగపడుతుందన్నారు. మండల ప్రత్యేక అధికారు లు జిల్లా ప్రగతిలో క్రియాశీల పాత్ర పోషించాలని అన్నారు. పథకాల అమలు తీరును నిశితంగా పరిశీలించాలని మార్గనిర్దేశం చేశారు. మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం కావాలన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక
డిచ్పల్లి: మండలంలోని సుద్దపల్లి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయులు భోజారాం సోమవారం తెలిపారు. గత నెల హైదరాబాద్‌లో నిర్వహించిన ఆశ్రమ పాఠశాలల జోనల్ స్థాయి క్రీడా పోటీలలో పాల్గొన్న క్రీడాకారులు చక్కని ప్రతిభ చూపడంతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. ఈ నెల 7, 8, 9 వ తేదీలలో ఏటూరు నాగారంలో జరగనున్న రాష్ట్రస్థాయి క్రీడాపోటీలలో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులు బిట్టు, చరణ్ సింగ్, రాంప్రసాద్, అజయ్ కుమార్, నిఖిల్, లోకేశ్, ఆనంద్‌లను హెచ్ఎం భోజారాం, ఫిజికల్ డైరెక్టర్ సంధ్యారాణి, ఉపాధ్యాయులు అభినందించారు. ఇందల్వాయి: మండలంలోని సిర్నాపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న శ్రీనివాస్ జాతీయస్థాయి స్కూ ల్ గేమ్స్ అండర్ –17 కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు రాజ్ కుమా ర్ తెలిపారు.ఈ నెల 7 నుంచి 11 వ తేదీ వ రకు ఖమ్మం జిల్లాలోని ఏడువుల బయ్యారంలో జరగనున్న పోటీల్లో శ్రీనివాస్ పాల్గొననున్నారు.ఎంపికై న విద్యార్థిని సర్పంచ్ అనిత చింటూ, ఉప సర్పంచ్ శ్రీనివాస్, వీడీసీ అధ్యక్షుడు భూమేశ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరాజు, ఉపాధ్యాయులు అభినందించారు. ● రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ నిజామాబాద్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్ల నిధులను వ్యవసాయ రంగానికి ఖర్చు చేస్తోందని రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభు త్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. సంక్రాంతి నుంచి సబ్సిడీపై వ్యవసా య యంత్ర పరికరాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రెండ్రోజుల క్రితం అసెంబ్లీలోని చాంబర్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వ్యవసాయంపై చర్చించినట్లు తెలిపారు. కమిషన్ పనితీరు బాగుందని సీఎం ప్రశించారని, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పంట మార్పిడిపై రైతుల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించినట్లు పేర్కొన్నారు. ఖలీల్‌వాడి: కలెక్టరేట్లో ఇటీవల బా ధ్యతలు స్వీకరించి న కలెక్టర్ ఇలా త్రి పాఠిని సోమవారం డీఈవో పార్శి అశోక్, ఐఎల్ఏ తిరుపతి కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం విద్యారంగానికి సంబంధించిన వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. -
బాలిక అదృశ్యం
వర్ని: మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన 16 సంవత్సరాల బాలిక అదృశ్యమైనట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. ఈ నెల 1న గుడికి వెళ్లి వస్తానని వెళ్లిన బాలిక తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు బంధువులు, స్నేహితుల ఇంట్లో వెతికినా ఆచూకీ లభించలేదు. సోమవారం బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని గాలింపు చేపట్టినట్లు ఎస్సై వెల్లడించారు. రెంజల్(బోధన్): మండలంలోని నీలా క్యాంపులో కుక్కలు స్వైరవిహారం చేశా యి. సోమవారం ఇంటి ముందు పనులు చేస్తున్న ఐదుగు రు మహిళలపై దాడి చేశాయి. బాధితులను వెంటనే ప్రభు త్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు కుటుంబీకులు తరలించారు. బాధితుల్లో వృద్ధులు ఉన్నారు. అయితే, కుక్కలకు ఇటీవల వైరస్ సోకడంతో వింతగా ప్రవర్తిస్తున్నాయని పలు గ్రా మాల ప్రజలు పేర్కొంటున్నారు. అధికారులు, గ్రా మ పంచాయతీ పాలకవర్గ సభ్యులు నియంత్రణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. బిచ్కుంద(జుక్కల్): మండలంలోని కందర్పల్లి నుంచి రాచూర్ వెళ్లే రోడ్డులో సోమవారం కంకర టిప్పర్ ఢీకొని ఒకరు మృతి చెందారు. రాచూర్ రోడ్డు నిర్మాణ పనుల కోసం కంకర తీసుకొచ్చిన టిప్పర్ లోడ్ ఖాళీ చేయడానికి రివర్స్‌లో వెళ్తుంది. రాచూర్ గ్రామానికి చెందిన కల్లప్ప (58) బైక్ పై కందర్పల్లి వైపు వస్తున్నాడు. రీవర్స్‌లో వెళ్తున్న టిప్పర్ డ్రైవర్ బైక్‌పై వస్తున్న కల్లప్పను గమనించకుండా ఢీ కొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్సై మోహన్‌రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. భార్య పార్వతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు. -
రాజకీయ పార్టీల సమావేశంలో రసాభాస
సుభాష్‌నగర్: ముసాయిదా ఓటరు జాబితాపై నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ దిలీప్‌కుమార్ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన రాజకీయ పార్టీ ప్రతినిధుల సమావేశం రసాభాసగా మారింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి మాట్లాడుతున్న క్రమంలో ‘ఇందూరు మున్సిపాలిటీ’ అనడంపై ఎంఐఎం అ భ్యంతరం వ్యక్తం చేసింది. నిజామాబాద్ అనాలని అనడంతో ఎంఐఎం, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరుపక్షాలు పోటాపోటీగా నినాదాలు చేశాయి. దీంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. రెండు పార్టీల నాయకులను కమిషనర్ దిలీప్‌కుమార్ సముదాయించే ప్రయ త్నం చేశారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఇద్దరు చొప్పున ఆయా పా ర్టీల ప్ర జాప్రతినిధులు తన చాంబర్లోకి రావాలని చెప్పి వెళ్లిపోయారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఘర్షణ చోటుచేసుకోకుండా బందోబస్తు చేపట్టారు. అనంతరం కమిషనర్ చాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కొనసాగించారు. ఎన్నికలు సజావుగా సాగాలంటే ఓటరు జాబితా ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని రాజకీయ పార్టీల ప్రతినిధులు దినేశ్ పటేల్ కులాచారి, న్యాలం రాజు, బొబ్బిలి రామకృష్ణ, నరాల రత్నాకర్, సిర్ప రాజు, రమేశ్‌బాబు, స మీర్ అ హ్మ ద్, రాజుగౌడ్ తదితరులు సూచించారు. బీఎల్వోల సేవలతోపాటు అవసరమైతే బూత్ లెవల్ నాయ కులు సహకారం అందిస్తారన్నారు. ముసాయిదా ఓటరు జాబితాపై రాజకీ య పార్టీల ప్రతినిధులు విలువైన సూచనలు చేశారని కమిషనర్ తెలిపారు. వాటని పరిగణనలోకి తీసుకుని తుది ఓటరు జాబితా రూపొందిస్తామన్నారు. ఇందూరు అనడంపై ఎంఐఎం అభ్యంతరం.. బీజేపీ నాయకులతో వాగ్వాదం.. పోటాపోటీ నినాదాలు ఇరుపక్షాలను సముదాయించిన కమిషనర్ దిలీప్‌కుమార్ -
డుమ్మాలకు చెక్!
● ఐకేపీ ఉద్యోగులకు ఆన్లైన్లో ముఖ గుర్తింపు హాజరు ● సోమవారం నుంచే అమలులోకి వచ్చిన కొత్త విధానం డొంకేశ్వర్(ఆర్మూర్): ఐకేపీలో డుమ్మాలు కొట్టే ఉద్యోగులకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర సెర్ప్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హాజరు రిజిస్టర్లకు స్వస్తి చెప్పి ఆన్లైన్ హాజరు విధానాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు ‘టీఫేస్ ఎఫ్ఆర్ఎస్’ యాప్‌ను రూపొందించగా సోమవారం నుంచి అమలులోకి వచ్చింది. దీనిని ఏ విధంగా ఉపయోగించాలనే దానిపై ఉద్యోగులకు అవగాహన కూడా కల్పించారు. తొలి రోజు విజయవంతంగా 85 శాతం ఉద్యోగులు ముఖగుర్తింపు ద్వారా ఆన్లైన్లో హాజరు నమోదు చేసుకున్నారు. ఐకేపీ విభాగంలో అన్ని కేడర్ల ఉద్యోగులు కలిపి 200 మందికి పైగా ఉన్నారు. ఇది వర కు జిల్లా, మండల కార్యాలయాల్లో హాజరు రిజిస్టర్ ద్వారా అటెన్డెన్స్ నమోదు చేసుకునే వా రు. దీని ద్వారా చాలా మంది ఉద్యోగులు ఇంటి ప ట్టున ఉంటూ అధికారులను మేనేజ్ చేస్తూ హాజరు వేసుకుని జీతాలు తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఆఫీసులకు రాకుండా సొంత పనులు చేసుకోవడంపై సెర్ప్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. ఉద్యోగులను క్రమశిక్షణలో పె ట్టేందుకు సెర్ప్ ఉన్నతాధికారులు ఆన్లైన్లో ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని తెచ్చారు. యాప్‌ను ఉద్యోగులు మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని ఐడీ, పాస్‌వర్డ్‌లతో లాగిన్ అయిన తరువాత హాజరు వే సుకోవాలి. ఉదయం 10గంటలకు ఒకసారి లాగినై ఎక్కడ ఉన్నారో లొకేషన్ పె ట్టాలి. మళ్లీ సాయంత్రం 5గంటలకు ఒకసారి విధు లు ముగించుకున్నట్లుగా నమోదు చేయాలి. సెలవులు సైతం యాప్‌లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగుల హాజరును పర్యవేక్షించడానికి జిల్లా స్థాయి అధికారికి లాగిన్ ఇచ్చారు. ఐకేపీలో ఏపీడీతోపాటు ఆరుగురు డీపీఎంలు, 30 మంది డీపీఎంలు, 165 మంది సీసీలు, పది మంది అడ్మిన్ అసిస్టెంట్లు ఉన్నారు. ఇక నుంచి ఉద్యోగులు కచ్చితంగా యాప్ ద్వారానే హాజరు వేసుకోవాల్సి ఉంటుందని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సాయాగౌడ్ ‘సాక్షి’కి తెలిపారు. -
నీటి తొట్టిలో పడి బాలుడి మృతి
కామారెడ్డి క్రైం: బాతులు నీళ్లు తాగేందుకు ఏర్పాటు చేసిన నీటి తొట్టిలో పడి బాలుడు మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామానికి చెందిన బుద్ద భాస్కర్ తన కుటుంబంతో కలిసి కొద్దిరోజులుగా రాజీవ్‌నగర్ కాలనీ సమీపంలో ఉన్న ఓ ఫాంహౌస్ వద్ద కాపలా, కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అక్కడ బాతులు నీళ్లు తాగేందుకు ఏర్పాటు చేసిన ఒక చిన్న తొట్టి ఉంది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తల్లిదండ్రులు కొద్దిదూరంలో పనులు చేసుకుంటున్నారు. వారి కుమారుడైన రన్విత్ కుమార్(2) బాతుల వెనుక వెళ్లి ప్రమాదవశాత్తు తొట్టిలో పడిపోయాడు. కొద్దిసేపటికి గమనించిన తల్లిదండ్రులు వెంటనే అతడిని జనరల్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. బాలుడి మృతితో కుటుంబంలో విషాదం అలుముకుంది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. -
పింఛన్లు పెంచలేని నిస్సహాయ స్థితి
● అసెంబ్లీలో ప్రభుత్వంపై మండిపడ్డ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్సుభాష్నగర్: లబ్ధిదారులకు పింఛన్‌ను పెంచుతామని మాయమాటలు చెప్పి కాంగ్రెస్ గద్దెనెక్కిందని, ఒక్కరికి కూడా పింఛన్ మొత్తాన్ని పెంచి ఇవ్వలేని నిస్సహాయ స్థితి లో ప్రభుత్వం ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మండిపడ్డారు. పింఛన్ల అంశంపై సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని, బీడీ కార్మికులు, వృద్ధులు, దివ్యాంగులు తమ పింఛన్లను ప్రభుత్వం ఎప్పుడు పెంచుతుందోన ని ఎదురు చూస్తున్నారన్నారు. వీలైనంత త్వరగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పింఛన్ మొత్తాన్ని పెంచాలని ఆయన అన్నారు. -
వేతనాలకు తప్పని కటకట
మోర్తాడ్(బాల్కొండ): ఇంటింటికీ తాగునీటిని అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్న మిషన్ భగీరథ ఆపరేటర్లకు ఆరు నెలలుగా వేతనాలు కరువయ్యాయి. ఫలితంగా ఆపరేటర్లు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మూడేళ్లుగా సమయానికి వేతనాలు చెల్లించడంలో విఫలమైన కాంట్రాక్టు కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో పరిస్థితిలో ఎలాంటి మార్పులేదు. ప్రభుత్వం నుంచి తమకు సకాలంలో బిల్లులు మంజూరు కావడం లేదనే సాకు చూపుతున్న కాంట్రాక్టు కంపెనీలు.. వేతనాలు చెల్లించకుండా ఆపరేటర్లతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం ప్రభుత్వం నుంచి వచ్చే బిల్లులతో సంబంధం లేకుండానే కంపెనీలు ఆపరేటర్లకు ప్రతినెలా వేతనాలను వారి ఖాతాల్లో జమ చేయాలి. గడచిన ఆరు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా కంపెనీ వేధింపులకు గురి చేస్తుండటంతో సోమవారం ఆపరేటర్లు ఆందోళన బాటపట్టారు. రెండు, మూడు రోజుల్లో వేతనాలు అందకపోతే సంక్రాంతి పండుగకు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో.. ఇంటింటికీ నీటిని సరఫరా చేసేందుకు నిర్దేశించిన పంప్‌హౌస్‌లు, సంప్హౌస్లు ప్రభుత్వ పరిధిలోనే ఉన్నాయి. కేవలం నీటి సరఫరా చేయడం, అజమాయిషీ చేసే బాధ్యతలను గత ప్రభుత్వం కంపెనీలకు కాంట్రాక్టు ఇచ్చింది. కాంట్రాక్టు పొందిన కంపెనీలు ఆపరేటర్లు, సూపర్వైజర్లను నియమించుకొని వారి ద్వారా ఇంటింటికీ రోజు నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇలా నీటి సరఫరాను పర్యవేక్షించే ఆపరేటర్లు, సూపర్వైజర్లు ఉమ్మడి జిల్లాలో 600 మంది వరకు పనిచేస్తున్నారు. ఆపరేటర్లకు సీనియారిటీ ప్రకారం రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు, సూపర్వైజర్లకు రూ.12 వేల చొప్పున వేతనం చెల్లిస్తున్నారు. పీఎఫ్ కూడా జమ చేయాల్సి ఉంది. పీఎఫ్‌ను జమ చేస్తున్నా వేతనాల విషయంలో మాత్రం మొదటి నుంచి నిర్లక్ష్యమే జరుగుతోంది. పదే పదే వేతనం చెల్లింపులో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారనే విమర్శలున్నాయి. ఎన్నోమార్లు వేతనాల కోసం మిషన్ భగీరథ ఆపరేటర్లు, సూపర్వైజర్లు ఆందోళన బాట పట్టినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఆందోళన చేస్తే ఒకటి, రెండు నెలల వేతనం చెల్లించి చేతులు దులుపుకుంటున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని తమకు న్యాయం జరిగేలా చూడాలని మిషన్ భగీరథ సిబ్బంది కోరుతున్నారు. మిషన్ భగీరథ ఆపరేటర్లకు ఆరు నెలలుగా జీతాలు కరువు మూడేళ్లుగా ఇదే పరిస్థితి బిల్లులు రావడం లేదనే సాకుతో వేతనాలు చెల్లించని కాంట్రాక్టు కంపెనీ వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని ఉద్యోగుల ఆవేదన -
వెంకటాపూర్‌లో భారీగా ఇసుక పట్టివేత
నలుగురిపై కేసు నమోదు వేల్పూర్: మండలంలోని వెంకటాపూర్ గ్రామం నుంచి ఆదివారం రాత్రి ఇసుక అక్రమంగా తరలిస్తున్న లారీని పట్టుకున్నట్లు ఎస్సై సంజీవ్ సోమవారం తెలిపారు. మరో చోట అక్రమంగా నిల్వ ఉంచిన మరో రెండు ఇసుక డంపులను పట్టుకున్నామన్నారు. ఆదివారం రాత్రి పెట్రోలింగ్ చేస్తుండగా వెంకటాపూర్ నుంచి వెళ్తున్న టీజీ16టీ1429 నంబరు లారీని తనిఖీ చేయగా అందులో అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. లారీ డ్రైవర్ దిలీప్‌ను విచారించగా వెంకటాపూర్ సొసైటీ వద్ద నుంచి ఇసుకను తీసుకెళ్తున్నట్లు తెలిపాడని పేర్కొన్నారు. వెంకటాపూర్‌లో రెండు చోట్ల అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను వేల్పూర్ తహసీల్దార్ శ్రీకాంత్ సమక్షంలో సీజ్ చేశామన్నారు. లారీ డ్రైవర్ దిలీప్, యజమాని రాజేశ్వర్, పొక్లెయిన్ డ్రైవర్ శర్మ, వెంకటాపూర్‌కు చెందిన మహిపాల్‌రెడ్డిపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. ముందస్తు అనుమతితో ఇసుక తీసుకోవాలి ఇసుక అవసరమున్న వారు రెవెన్యూ, మైన్స్ అధికారుల ముందస్తు అనుమతి తీసుకొని సరఫరా చేసుకోవాలని ఎస్సై సూచించారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
జిల్లా న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్
నిజామాబాద్ అర్బన్: జిల్లా పాలనాధికారిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా న్యాయమూర్తి జీ.వీ.ఎన్.భరతలక్ష్మితోపాటు పోలీస్ కమిషనర్ సా యి చైతన్యను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా న్యాయస్థానాల సముదాయంలో న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్ ఆమెకు పూలమొక్కను అందజేశారు. జిల్లా స్థితిగతులు, న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వ ర్యంలో చేపట్టే కార్యక్రమాలపై కొద్దిసే పు చర్చించారు. అనంతరం కమిషనరేట్‌లో సీపీని కలిసి బొకే అందించారు. ప్రత్యేక సొసైటీ ఏర్పాటు చేయాలి సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నందిపేట మండలంలో మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న వెల్మల్ కేంద్రంగా ప్రాథమిక వ్యవసా య సహకార పరపతి సంఘం (సొసైటీ) ఏ ర్పాటు చేయాలని ఆ గ్రామస్తులు సోమ వా రం కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతిపత్రం అందజేశారు. అఖిలపక్ష నాయకులు ఆధ్వ ర్యంలో గ్రామస్తులు కలెక్టరేట్‌కు వచ్చారు. వెల్మల్‌కు సరిహద్దు గ్రామాలైన ఆంధ్రనగర్, కౌల్పూర్, రైతుఫారం, జోజిపేట గ్రామ పంచాయతీల పాలకవర్గాలు ఏకగ్రీవ తీర్మానంతో కొత్త సొసైటీని ఏర్పాటు చేయాలని కోరా రు. 4 వేల ఎకరాలకు పైగా ఆయకట్టు ఉన్న తమ గ్రామాన్ని అయిలాపూర్ సొసైటీ నుంచి వేరు చేయాలని వినతిపత్రంలో పేర్కొ న్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో సర్పంచ్ దేవేందర్, ఉప సర్పంచ్ ఇసపల్లి మహేశ్, మాజీ సర్పంచ్ మచ్చర్ల పెద్ద గంగారాం, నాయకులు కస్ప రామకృష్ణ, రాము, గోజూరి నరేందర్, కిషన్, జీఆర్ రాజేందర్, మల్లేశ్, శ్రీధర్, శ్రీనివాస్ ఉన్నారు. దూరవిద్యలో సెమిస్టర్ పరీక్షలు ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళా శాల ప్రాంగణంలో కొనసాగుతున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్మోహన్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025 – 26 మొదటి సంవత్సరం సైన్స్ విద్యార్థులకు సెమిస్టర్ – 1 ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులకు సెమిస్టర్ – 3 ప్రయోగ, తృతీయ సంవత్సరం సైన్స్ వి ద్యార్థులకు సెమిస్టర్ – 5 తరగతులు ఈ నె ల 6 నుంచి ప్రారంభమవుతాయని తెలి పా రు. 80 శాతం అటెన్డెన్స్ లేనిపక్షంలో ప్రాక్టికల్స్‌కు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. 1,507 టీఎస్ ఐపాస్ దరఖాస్తుల ఆమోదం కామారెడ్డి క్రైం: టీఎస్ ఐపాస్ పథకం కింద పరిశ్రమల ఏర్పాటుకుగాను జిల్లాలో ఇప్పటివరకు 1,552 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో 1,507 ఆమోదించామని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో పారిశ్రామిక ప్రో త్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
అందరికీ మాఫీ ఏదీ..?
మోర్తాడ్(బాల్కొండ): ఏర్గట్ల మండలం తొర్తికి చెందిన రైతు మాదాం నర్సయ్యకు పాలెంలోని ఎస్బీఐలో పంట రుణం మాఫీ అవుతున్నట్లు గతంలో మెస్సేజ్ వచ్చింది. బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా.. ఇంకా నిధులు జమ కాలేదని, సొమ్ము ప్రభుత్వం నుంచి వస్తేనే రుణమాఫీపై తాము ఏమైనా చెప్పగలమని బ్యాంకు అధికారులు జవాబిచ్చారు. ఆరు నెలలుగా బ్యాంకులో, వ్యవసాయ శాఖ కార్యాలయంలో అడుగుతున్నా రుణమాఫీపై ఎక్కడ కూడా స్పష్టమైన సమాచారం నర్సయ్యకు దొరకడం లేదు. ఒక వేళ తాను రుణాన్ని రెన్యువల్ చేసుకుంటే మా ఫీ సొమ్ము జమ చేస్తారో లేదోనని వడ్డీ మాత్రమే చెల్లించి ఊరుకున్నాడు. జిల్లాలో ఇలా ఎంతో మంది రైతుల పేర్లు రుణమాఫీ జాబితాలో వచ్చినా బ్యాంకులో సొమ్ము జమ కాకపోవడంతో రుణమా ఫీ వర్తించలేదు. నాలుగు విడతల్లో రుణాన్ని మాఫీ చేసిన ప్రభుత్వం లక్ష్యానికి అనుగుణంగా నిధులను విడుదల చేయకపోవడంతో రైతులు అసహనం వ్య క్తం చేస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2లక్షల వరకు పంట రుణం మాఫీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రకటించింది. బడ్జెట్లో రుణమాఫీకి నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటన చేసినా ప్రభుత్వం ఆచరణలో విఫ లం కావడంతో రైతులకు మొండిచేయి ఎదురైంది. ప్రభుత్వం మోసం చేసింది రుణమాఫీ విషయంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతులను మోసం చేసింది. ఎంతో మంది రైతులకు అర్హత ఉన్నా పంట రుణం మాఫీ కాకపోవడంతో వడ్డీ భారం మోయాల్సి వస్తోంది. ప్రభుత్వమే మోసం చేస్తే రైతులు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలి. – ఏనుగు రాజేశ్వర్, రైతు, మోర్తాడ్నిధులు ఇవ్వాలి రుణమాఫీకి ప్రభుత్వం నిధులు ఇవ్వాలి. కొద్ది మందికే నిధులు విడుదల చేసి మిగతా వారిని మోసం చేయడం తగదు. అర్హులైన ప్రతి రైతుకు రూ.2లక్షల వరకు రుణం మాఫీ చేయాలి. లేకుంటే ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదు. బడ్జెట్లో నిధులు కేటాయించాలి. – పాపాయి పవన్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ ౖచైర్మన్, మోర్తాడ్జిల్లా వ్యాప్తంగా 97,696 మందికే లబ్ధిజిల్లా వ్యాప్తంగా 1,00,612 మంది రైతులకు నాలుగు విడతల్లో రూ.782.30 కోట్లు విడుదల చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. వాస్తవానికి 97,696 మంది రూ.755 కోట్ల 29 లక్షల, 40వేలు మాత్రమే రైతుల ఖాతా ల్లో జమ చేశారు. మరో 2,916 మంది రైతు ల వివరాలు సరిగా లేకపోవడంతో నిధులు జమ కాలేదు. ఫలితంగా రూ.27.01 కోట్లు వెనక్కి వెళ్లిపోయాయి. వాస్తవానికి జిల్లాలో రుణమాఫీకి అర్హత ఉన్న రైతులు 1.50లక్షల మందికి పైగానే ఉన్నారు. మొదట్లో ఒక్కో రైతుకు రూ.2లక్షల వరకు పంట రుణం మాఫీ అని ప్రకటించగా రుణమాఫీ అమలు చేసే సమయంలో ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షలు అని మార్గదర్శకాలు మార్చా రు. ఒక ఇంటిలో ఎంత మందికి రుణం ఉన్నా.. ఎంత బకాయి ఉన్నా రూ.2లక్షల వ రకు రుణ మాఫీ వర్తింపజేస్తామని ప్రభు త్వం స్పష్టం చేసింది. కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకున్నా రుణమాఫీకి అర్హత ఉండి లబ్ధి పొందని రైతుల సంఖ్య 50వేలకు పైగానే ఉంటుందని అంచనా. అసంపూర్ణంగా రైతు రుణమాఫీ జాబితాలో పేర్లున్నా.. ఖాతాల్లో నిధులు జమ కాలేదు అన్నదాతకు తప్పని నిరీక్షణ నాలుగు విడతల్లో కొద్ది మందికే ఊరట -
మైనారిటీ స్కూల్లో దారుణం
● ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్లు ● 8 మంది విద్యార్థులకు టీసీ జారీబిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రంలోని మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో ఇంటర్ విద్యా ర్థులు పదో తరగతి విద్యార్థిపై శనివారం రాత్రి దాడికి పాల్పడ్డారు. నలుగురు ఫస్టియర్, నలుగురు సెకండియర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడ్డారని గుర్తించి సోమవారం వారి తల్లిదండ్రులను పిలిపించి ప్రిన్సిపల్ స్వామి టీసీ ఇచ్చి పంపించారు. పదో తరగతి విద్యార్థి.. ఐదో తరగతి విద్యార్థులపై వేధింపులకు పాల్పడుతున్నాడని ఇంటర్ విద్యా ర్థులు శనివారం రాత్రి దాడి చేశారు. కొట్టిన వీడి యో సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ విష యమై ప్రిన్సిపల్ స్వామి జిల్లా అధికారులకు సమాచారం అందించారు. సోమవారం విచారణ చేపట్టిన అధికారులు పైఅధికారులకు నివేదిక అందించారు. వారి ఆదేశాల మేరకు 8 మంది ఇంటర్ విద్యార్థులకు టీసీ జారీ చేశారు. వేధింపులకు పాల్పడిన పదో తరగతి విద్యార్థిపై విచారణ చేపట్టి పాఠశాల నుంచి తొలగిస్తామని ఆర్ఎల్సీ జిల్లా అధికారి బషీర్ తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు టీసీలు ఇవ్వడంతో తోటి విద్యార్థులు పాఠశాలలో ఆందోళన చేపట్టారు. విద్యార్థిపై దాడి చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం నేరమని, పై అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నామంటూ విజిలెన్స్ అధికారులు హమీద్, అహ్మద్, ఆర్ఎల్సీ బషీర్ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. -
ఊరెళ్తున్నారా? అయితే జాగ్రత్త!
నిజామాబాద్ అర్బన్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇటీవల దొంగల అలజడి కలకలం రేపుతోంది. జిల్లా కేంద్రంలో రెండు ఏటీఎంల దోపిడీ, మరో ఏటీఎం, బంగారు దుకాణంలో లూటీకి యత్నించిన విషయం తెలిసిందే. అయితే, సంక్రాంతి సెలవుల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సీపీ సాయిచైతన్య సూచించారు. శివారు ప్రాంత కాలనీలలో తాళం వేసిన ఇళ్లను అపరిచిత వ్యక్తులు ఉదయం వేళ వెతికి, రాత్రివేళ చోరీలకు పాల్పడుతున్నారని, వారిపై నిఘా పెడుతున్నామన్నారు. ● ఖరీదైన వస్తువులను బ్యాంక్ లాకర్లో పెట్టుకోవాలి. ● ఊరెళ్తున్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయొద్దు. ● డోర్స్‌కు సెంట్రల్ లాకింగ్ సిస్టం వాడాలి. ● సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి సమాచారం ఇవ్వాలి. ● సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు గమనించాలి. ● అపరిచిత వ్యక్తులు వస్తే వారి పోలీసులకు సమాచారం అందించాలి. ● ఇరుగు పొరుగు వారిని ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పాలి. ● మహిళలు, వృద్ధులు ‘అపరిచితులు‘ సమాచారం పేరుతో వస్తే నమ్మొద్దు. ● కాలనీల వారీగా గస్తీ బృందాలను ఏర్పాటు చేసుకోవాలి. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ప్రజలకు పోలీసు శాఖ సూచనలు సంబంధిత పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి సీపీ సాయిచైతన్య -
ఆధునిక సేద్యాన్ని ప్రోత్సహించాలి
సుభాష్‌నగర్: జిల్లాలో ఆధునిక సేద్యం దిశగా రైతులను ప్రోత్సహిస్తూ అవసరమైన తోడ్పాటునందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సమావేశ మందిరంలో సోమ వారం నిర్వహించిన జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ సమావేశానికి పర్సన్ ఇన్చార్జి హోదాలో కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన అధికారులు, అభ్యుదయ రైతులు హాజరయ్యారు. సహకార బ్యాంకు ద్వారా రైతులకు అందిస్తున్న తోడ్పాటు, వివిధ కార్యక్రమాల అమలు వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో ప్రత్యేకతను కలిగి ఉన్న జిల్లా ఘనతను మరింత ఇనుమడింపజేసేలా సాగు రంగానికి ప్రాధాన్యతను ఇవ్వాలని అధికారులకు సూ చించారు. ముఖ్యంగా పసుపు రైతులకు పంట సా గు విషయంలో వెన్నుదన్నుగా నిలుస్తూ, ఆధునిక యంత్ర సామగ్రిని వినియోగిస్తూ పెట్టుబడి ఖర్చులు తగ్గించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా యూరియా, ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దన్నారు. యూరియా విషయంలో అక్కడక్కడా రైతుల్లో నెలకొని ఉన్న అపోహల ను దూరం చేసేందుకు అభ్యుదయ రైతులు కృషి చే యాలని సూచించారు. మోతాదు మేరకే యూరి యా వినియోగించేలా విస్తృత స్థాయిలో అవగాహ న కల్పించాలన్నారు. యూరియా, ఎరువుల అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్, దళారుల ప్రమేయం వంటి అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకు వీలుగా ప్రభుత్వం యూరియా బుకింగ్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందని అన్నారు. రైతులు యాప్‌ను వినియోగించుకునేలా చూడాలన్నారు. డీసీసీబీ జనరల్ మేనేజర్ అనుపమ, సీఈవో నాగభూషణం, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ సునీల్, ఉమ్మడి జిల్లాకు చెందిన వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య, సహకార తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. సాగు రంగంలో జిల్లా ఘనతను మరింత ఇనుమడింపజేయాలి సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయి రైతులు ఆందోళన చెందొద్దు సాంకేతిక కమిటీ సమావేశంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి -
నిజామాబాద్
సోమవారం శ్రీ 5 శ్రీ జనవరి శ్రీ 2026మోర్తాడ్(బాల్కొండ): కడుపులో ఆడ శిశువు జీవం పోసుకుంటుందంటే గర్భంలోనే చిదిమేయాలనే ఆలోచనలో ఉన్న ఎంతో మందికి కనువిప్పు కలిగించే నిర్ణయం తీసుకున్నారు నూతనంగా ఎన్నికై న సర్పంచులు. పుట్టింది ఆడపిల్లనా అనే వారికి కాదు మహాలక్ష్మి అని నిస్సంకోచంగా చెప్పగలిగే ధైర్యాన్నిస్తున్నారు. గ్రామానికి చెందిన ఆడపడుచు పెళ్లి చేసుకొని అత్తారింట్లో అడుగు పెడుతుంటే అండగా మేమున్నాం అంటూ చేయూతనిస్తున్నారు. నగదు, బంగారంతో గౌరవించాలని నిర్ణయించారు. తమకు తోచినంతలో ఎంతో కొంతసాయం అందిస్తూ ఆడపిల్లల భవిష్యత్తుకు భరోసానిస్తున్నారు. సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. మా ఊరి మహాలక్ష్మి పథకం పేరిట ఆడపిల్ల పుడితే ఫిక్స్డ్ డిపాజిట్ చేసి బాండ్ ఇవ్వడం, పెళ్లి చేసుకొని వెళితే కట్నం కింద నగదు, బంగారం అందజేస్తున్నారు. -
అమెరికా దురాక్రమణను ఖండిస్తున్నాం
నిజామాబాద్ రూరల్: వెనెజువెలా దేశంపై అమెరికా దురాక్రమణను ఖండిస్తున్నామని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ అన్నారు. అమెరికా దాడులకు నిరసనగా ఆదివారం సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అర్బన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్‌లో నాయకులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా వనమాల కృష్ణ మాట్లాడారు. వెనెజువెలా దేశంపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన సతీమణిని నిర్బంధించడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ అమెరికా వైఖరిని ఖండించకపోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు ఎం నరేందర్, జిల్లా నాయకులు డి.రాజేశ్వర్, కే.గంగాధర్ నగర కార్యదర్శి ఎం.సుధాకర్ నాయకులు లింగం, భాస్కర్, సాయిబాబా, కిరణ్, సాయరెడ్డి, అమూల్య, చరణ్, అశుర్, విజయ్ కుమార్, సజన్, గంగాధర్ రాజు తదితరులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో... సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నాయకులు ధర్నా చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ రమేశ్ బాబు మాట్లాడుతూ వెనెజువెలాపై అమెరికా చేసిన దాడులను ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ిసీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, నూర్జహాన్ , జిల్లా కమిటీ సభ్యులు సుజాత, నగర కమిటీ సభ్యులు నల్వాల నరసయ్య, అనసూయ, నగర నాయకులు అంజయ్య, శంషుద్దీన్, అబ్దుల్, రాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండలో.. సిరికొండ: వెనెజువెలాపై అమెరికా దాడి చేయడం దుర్మార్గమని సీపీఐఎంఎల్ మాస్‌లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ అన్నారు. మండల కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మను ఆదివారం దహనం చేశారు. ఈ సందర్బంగా రామకృష్ణ మాట్లాడారు. నిజామాబాద్ రూరల్, కామారెడ్డి సంయుక్త జిల్లా నాయకులు ఆర్ రమేశ్, దామోదర్, బాబన్న, సాయారెడ్డి, లింబాద్రి, రమేష్, సర్పంచ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. వెనెజువెలాపై అమెరికా దాడి దురహంకార చర్య నిజామాబాద్ రూరల్: వెనెజువెలాపై అమెరికా దాడి దురహంకార చర్య అని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య పేర్కొన్నారు. ఆదివారం కోటగల్లిలోని ఎన్.ఆర్.భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అమెరికా తీరును తీవ్రంగా ఖండించారు. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను బంధించడాన్ని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని కోరారు. ఆ దేశంలో ఉన్న చమురు నిల్వలను, ఖనిజ సంపదను దోచుకోవడానికే అమెరికా ఇలాంటి ఘాతుకానికి తెగబడిందన్నారు. సీపీఐ(ఎం.ఎల్) నాయకులు పాల్గొన్నారు. -
ఐడియా.. అదరహో
వ్యవసాయం చేసే రైతులంతా ఈ చిత్రాన్ని చూసి మార్పు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వం వేసిన రోడ్లను కాపాడుకోవడానికి డొంకేశ్వర్‌లో పలువురు రైతులు మంచి ఆలోచన చేశారు. పొలాలను దమ్ము చేసే కేజ్‌వీల్స్ ట్రాక్టర్లతో రోడ్లు పాడవకుండా ట్రాలీలను ఏర్పాటు చేసుకున్నారు. ఒక రైతు కేజ్‌వీల్ ట్రాక్టర్‌ను ట్రాలీలో ఎక్కించి మరో ట్రాక్టర్ సహాయంతో కావాల్సిన చోటికి తీసుకెళ్తున్న చిత్రాన్ని ‘సాక్షి’ తన కెమెరాలో తీసింది. గ్రామాల్లోని రైతులందరూ కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తే బాగుటుందని ఎస్సై శ్యామ్‌రాజ్ కోరారు. కేజ్‌వీల్ ట్రాక్టర్లను రోడ్లపై నడిపితే జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. – డొంకేశ్వర్(ఆర్మూర్) -
ఎంపీని కలిసిన మాజీ కార్పొరేటర్
సుభాష్‌నగర్: నగరంలోని 16వ డివిజన్ బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ పంచరెడ్డి సురేశ్ ఆదివారం ఎంపీ అర్వింద్ ధర్మపురిని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఎంపీని శాలువా, పుష్ఫగుచ్చంతో సన్మానించారు. అనంతరం పంచరెడ్డి సురేశ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ జనాకర్షక సంక్షేమ పథకాలు, ఎంపీ అర్వింద్ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తాను సంక్రాంతి తర్వాత తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరుతానని ప్రకటించారు. పసుపు బోర్డు ఏర్పాటు, ఆర్వోబీల నిర్మాణాలతో ఎంపీ అర్వింద్ జిల్లా ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకున్నారని తెలిపారు. బీఆర్ఎస్ కుటుంబ పాలనపై ప్రజలు విరక్తి చెందారని అన్నారు. అంతకుముందే అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణను కలిశారు. -
కూరగాయల సాగుకు ప్రోత్సాహం
● ఎకరాకు రూ. 9,600 ఇవ్వనున్న ప్రభుత్వం ● దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు ఇందల్వాయి: కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సమీకృత ఉద్యాన మిషన్ పథకం కింద ఒక ఎకరా సాగు చేసే రైతుకు రూ.9,600 రాయితీ రూపంలో నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది. ఒక ఎక రాలో కూరగాయలు సాగు చేస్తే 6 టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా వేసింది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కొనుగోలు, సస్యరక్షణ చర్యలతోపాటు యాజమాన్య పద్ధతుల కింద ఎకరాకు రూ.24 వేలు ఖర్చు అవుతుందని లెక్కించింది. ఈ క్రమంలో 40 శాతం రాయితీ ఉత్పత్తిదారుల ఖాతా లో నేరుగా జమ చేయాలని ఆదేశించింది. పచ్చిమి ర్చి, క్యాప్సికం, బెండ, బీర, దొండ, కాకర, క్యాబేజీ, టమాట, చిక్కుడు, సోరకా య తదితర తోటల సాగుకు ముందుకు వచ్చే రైతులు ఉద్యాన శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి రాయితీకి ఎంపిక చేస్తారు. రెండున్నర ఎకరాల వరకు రాయితీ అందించనున్నారు. సాగు ప్రారంభించి గుర్తింపు పొందిన నర్సరీలు లేదా ఉద్యానవన శాఖ నుంచి నారు లేదా విత్తనాలు కొనుగోలు చేస్తే వెంటనే నిధులు జమ చేస్తారు. రైతుల నుంచి అధికారులు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. దరఖాస్తు విధానం ఇలా.. కూరగాయలు పండించే రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. పట్టాదార్ పాస్‌బుక్, ఆధా ర్ కార్డు, బ్యాంక్ ఖాతా బుక్ జిరాక్స్‌లతో పాటు ఒక ఫొటో, ఎరువులు, విత్తనాలు, పురుగుమందు లు, కంపోస్ట్ ఎరువులు కొనుగోలు చేసిన రసీదులు (రూ. 20వేలకు తగ్గకుండా) జత చేయాలి. ఉద్యాన శాఖ విస్తరణ అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. జిల్లాలో 1,100 ఎకరాలకు..జిల్లాలో 1,100 ఎకరాలకు ప్రోత్సాహం అందించేలా ఉద్యానశాఖ అధికారులు రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గం నుంచి సుమారు 225 ఎకరాల్లో కూరగాయల సాగుకు ప్రోత్సాహం అందించనున్నారు. కూరగాయల ఉత్పత్తి పెంచడం, ధరల స్థిరీకరణ, మార్కెట్లో సరఫరాను బలోపేతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ఉద్యానశాఖ అధికారులు తెలిపారు. కూరగాయల రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నగదు ప్రోత్సహాకాన్ని పొందేందుకు అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలి. జిల్లాలో 1,100 ఎకరాల వరకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. నియోజకవర్గంలో ఇదివరకే కొంత మంది రైతులకు ప్రోత్సాహం అందించాం. మరిన్ని వివరాలకు సంబంధిత ఉద్యాన శాఖ అధికారులను రైతులు సంప్రదించాలి. – రోహిత్, ఉద్యాన శాఖ అధికారి, నిజామాబాద్ రూరల్ ఇప్పుడున్న భిన్న వాతావరణ పరిస్థితుల్లో కూరగాయలు సాగు చేయడం అధిక ఖర్చుతో కూడుకున్న వ్యవహారంలా మారింది. దీంతో రైతులు కూరగాయల సాగుపై ఎక్కువగా దృష్టి సారించడం లేదు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం రైతులకు కూరగాయల సాగుకు ప్రోత్సహకాలు అందించడం సంతోషంగా ఉంది. ఇలాంటి ప్రోత్సాహకాల వల్ల కూరగాయల సాగు పెరిగి రైతులతో పాటు వినియోగదారులకు లబ్ధి చేకూరుతుంది. – నోముల విజయ, కూరగాయల రైతు, నల్లవెల్లి -
అన్నసత్రానికి ముస్లిం యువకుడి విరాళం
సిరికొండ: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ప్రముఖ శైవక్షేత్రం లొంక రామలింగేశ్వరస్వామి ఆలయంలో అన్నసత్రంకు సిరికొండకు చెందిన ముస్లిం యువకుడు షేక్ ఉస్మాన్‌పాషా విరాళం అందజేశారు. ఆలయం వద్ద సోమవారం నిర్వహించే అన్నదానానికి ఒక రోజు అయ్యే పూర్తి ఖర్చులను ఉస్మాన్ ఆలయ కమిటీకి చెల్లించాడు. ఉస్మాన్‌ను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సన్మానించారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు అవదూత గంగాధర్, సంతోష్, శోభన్, పారుపల్లి రాజ్‌కుమార్, కంచెట్టి లక్ష్మీనారాయణ, తాళ్ల శ్రీనివాస్, కోల భూపతిరాజు, బోయిడి ప్రకాష్, కనగందుల నవీన్, సల్ల భాస్కర్, నగేష్, పెయింట్ శేఖర్, నరేష్, రాజు, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యం చేస్తే పథకాలు దూరం!
రైతు రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకోవాలి? ● కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ పథకాల లబ్ధిని సులభంగా పొందొచ్చు. పీఎం కిసాన్ సహాయానికి ఫార్మర్ ఐడీ తప్పనిసరి. ● రైతు వివరాలు ఖచ్చితంగా నమోదైతే పారదర్శకత పెరుగుతుంది. మోసాలు తగ్గుతాయి. ● బీమా, సబ్సిడీలు, రుణాలు త్వరితగతిన పొందడానికి అవకాశం. భవిష్యత్ పథకాల ప్రయోజనాలు సులభం.డొంకేశ్వర్(ఆర్మూర్): వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేసేందుకు ప్రభుత్వం ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ విధానాన్ని తీసుకొచ్చింది. ప్రతి రైతూ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే నిబంధన కూడా పెట్టింది. రైతుకు వచ్చిన యూనిక్ ఐడీ నంబర్ ద్వారానే పీఎం కిసాన్ వంటి పథకాలు అందుతాయని కూడా స్పష్టం చేసింది. కానీ జిల్లాకు చెందిన రైతులు తమ వివరాలు నమోదు చేసుకోవడానికి పెద్దగా ముందుకు రావడం లేదు. ఫార్మర్ రిజిస్ట్రీ అవసరాన్ని వివరించి చెబుతున్నా మనకెందుకులే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని అధికారులు వాపోతున్నారు. జిల్లాలో 2,98,474 మంది రైతులకు గాను ఇప్పటి వరకు 1,45,070 మంది (62శాతం) మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరో 1,53,404మంది రిజిస్ట్రేషన్‌కు దూరంగా ఉన్నారు. దీంతో పీఎం కిసాన్ డబ్బులు కొంతమంది రైతులకు ఇటీవల అందలేదు. అయితే ప్రస్తుతం నమోదు చేసుకోవాలని సంబంధిత రైతుల మొబైల్ ఫోన్లకు సర్వే నంబర్లతో సహా ఎస్ఎంఎస్ సందేశాలు వెళ్తున్నాయి. కొద్ది మంది మాత్రమే స్పందించి మీ సేవ కేంద్రాలకు లేదా రైతు వేదికల వద్దకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. మీ సేవ కేంద్రాల్లో సర్వర్ సమస్య తలెత్తడంతో రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతున్నారు. మిగిలిన రైతులు నమోదు చేసుకునేలా వ్యవసాయాధికారులు గ్రామాల్లో ఉన్న వారికి ఫోన్లు చేస్తున్నారు. ప్రతి రైతుకూ ఐడీ తప్పనిసరి.. ఫార్మర్ రిజిస్ట్రేషన్‌లో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలో 11వ స్థానంలో ఉంది. వివరాలు నమోదు చేసుకోని రైతుల వివరాలు ఏఈవోల వద్ద ఉన్నాయి. రైతుల సెల్ఫోన్లకు సందేశాయి కూడా వెళ్లాయి. ప్రతి రైతుకి ఐడీ ఉండాలని ప్రభుత్వం తప్పనిసరి చేసిందన్న విషయాన్ని గమనించాలి. రైతు వేదికలు, మీ సేవ కేంద్రాల వద్దకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేదంటే ప్రభుత్వ పథకాలు పొందడానికి అవకాశం ఉండదు. – వీరాస్వామి, జిల్లా వ్యవసాయాధికారి ఎలా చేసుకోవాలి? ఆధార్ కార్డు భూమి పాస్‌బుక్ వివరాలు ఆధార్ లింకై ఉన్న మొబైల్ నంబర్ తప్పనిసరి స్థానికంగా ఉన్న మీ సేవ కేంద్రాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫార్మర్ రిజిస్ట్రీపై ఆసక్తి చూపని రైతులు జిల్లాలో ఇంకా నమోదు చేసుకోని వారు 1.53లక్షల మంది ఐడీ నంబర్ ఉంటేనే పీఎం కిసాన్ వంటి పథకాలకు అర్హత -
90 మందికి తగ్గొద్దు..
● ప్రతీరోజు కూలీల హాజరు పెరగాలి ● జిల్లాలో ఉపాధిహామీ పనులపై రాష్ట్ర అధికారుల ఆదేశాలు డొంకేశ్వర్(ఆర్మూర్): ఉపాధిహామీ పథకం ‘వీబీ జీరామ్ జీ’గా మారిన నేపథ్యంలో ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని రాష్ట్రస్థాయి అధికారులు జిల్లా అధికారులను ఆదేశించారు. పనులకు వచ్చే కూలీల సంఖ్యను పెంచి ఈ నెలాఖరు నాటికి కావాల్సిన పనిదినాల లక్ష్యాన్ని చేరుకోవాలని గ డువు విధించారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధి లో 90 మందికి తగ్గకుండా కూలీలు పనికి వచ్చేలా చూడాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దీంతో రెండు రోజుల క్రితం మండలాల ఏపీవోలు, ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లతో జిల్లా అధికారులు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కూలీల హాజరు శాతం పెంచాలని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని ఉపాధి హామీ సిబ్బందిని హెచ్చరించారు. ఇప్పటికే పలు మండలాలు వెనుకబడి ఉన్నాయని, పురోగతి కనిపించాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాలో 545 గ్రామ పంచాయతీలు ఉండగా పలు చోట్ల పది మంది కూలీలు కూడా పనులకు రావడం లేదు. జిల్లా వ్యాప్తంగా సరాసరిగా 2,600 మందికి పైగా పనులకు వస్తున్నారు. చెరువుల్లో పూడికతీత పనులు లేకపోవడంతో వేరే పనులు చేయడానికి కూలీలు ముందుకు రావడం లేదు. చందూర్, కమ్మర్పల్లి, మెండోరా, ఏర్గట్ల, నవీపేట్, ఎడపల్లి, కోటగిరి, పొతంగల్, భీమ్‌గల్, సిరికొండ, డొంకేశ్వర్, మోస్రా మండలాల్లో కూలీలు చాలా తక్కువ సంఖ్యలో వస్తున్నారు. ఈ మండలాల్లో ఉపాధిహా మీ సిబ్బంది పనితీరు సరిగ్గా లేనట్లు తెలుస్తోంది. 29 లక్షలకు... 15 లక్షల పనిదినాలు పూర్తి... 2025–26 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో 29 లక్షల పనిదినాలు కల్పించాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టింది. ఇందులో ఇప్పటి వరకు 95 వేల మందికి 15 ల క్షల పనిదినాలు కల్పించారు. ఇందుకు రూ.41.60 కోట్లు వెచ్చించారు. ఇంకా 14 లక్షల పనిదినాలు కల్పించాల్సి ఉంది. మార్చి నాటికి మిగిలిన పనిది నాలను పూర్తి చేయాల్సి ఉండగా ఈ నెలాఖరు నాటికే పూర్తి చేయాలని జిల్లా అధికారులు ఉపాధిహామీ సిబ్బందిని ఆదేశించారు. దీంతో గ్రామాల్లో ఏయే పనులు చేయించాలో గుర్తిస్తున్నారు. కూలీల హాజరు పెంచుతున్నాం.. రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో ఉపాధిహా మీ పనులకు కూలీల హాజరు ను పెంచడానికి చర్యలు చేపట్టాం. జీపీలో రోజుకు 90 మందికి తగ్గకుండా కూలీలు వచ్చేలా చూడాలని ఉపాధిహామీ సిబ్బందికి ఆదేశాలిచ్చాం. మిలిగిన పనిదినాలను గడువులోపు పూర్తిచేస్తాం. – సాయాగౌడ్, డీఆర్డీవో -
పద్మశాలి సంఘ అభివృద్ధికి కృషి చేస్తా
సర్పంచ్ సాయిచరణ్‌ను సన్మానిస్తున్న గోసంగి సంఘం సభ్యులుభూమికను సన్మానిస్తున్న పద్మశాలి సంఘ సభ్యులు జక్రాన్‌పల్లి: పద్మశాలి సంఘం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని గ్రామ ఉపసర్పంచ్ గాండ్ల భూమిక శేఖర్ అన్నారు. ఆదివారం జక్రాన్‌పల్లి మండలంలోని బ్రాహ్మణ్‌పల్లిలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉపసర్పంచ్ భూమిక శేఖర్ దంపతులు, వార్డు సభ్యుడు మానేటి శ్రీకాంత్‌కు పూలమాలలు వేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పద్మశాలిలు రాజకీయంగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘ పెద్దలు గాండ్ల శ్రీనివాస్, రుద్ర రాజేశ్వర్, రాజేందర్, గంగాధర్, రాంచందర్, నర్సయ్య, చరణ్, రాజేందర్, హన్మండ్లు, పంచాక్షరి, వంకర్, నాందేవ్, రాజేశ్వర్, మమత సంఘ సభ్యులు పాల్గొన్నారు. సర్పంచ్ సాయిచరణ్‌కు సన్మానం సిరికొండ: సిరికొండ సర్పంచ్‌గా ఎన్నికై న గోసంగి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల సాయిచరణ్‌ను మండలకేంద్రంలో ఆ సంఘం నాయకులు, పలువురు సన్మానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు నిషాని రవీందర్, కార్యదర్శి శ్రీనివాస్, దేవయ్య, నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు బాలయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆయకట్టుకు సాగునీరు విడుదల
మోపాల్: మండలంలోని కంజర్ పెద్ద చెరువు నుంచి పాటి మీద తూము ద్వారా ఆయకట్టు రైతాంగానికి యాసంగి సాగుకు ఎస్ఐ జాడె సుస్మిత ఆదివారం నీటిని విడుదల చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు సాగునీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. నీటిని వృథా చేయొద్దని, అవసరం మేరకే వినియోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్యారం రాకేష్ యాదవ్, ఉపసర్పంచ్ గుడి ప్రవీణ్‌రెడ్డి, జీపీఓ దేవయ్య, రైతులు అరికెల నారాయణరెడ్డి, విశ్వనాథం, బున్నె రాములు, గొల్ల రాములు, గంగబాపు, నవీన్, తదితరులు పాల్గొన్నారు. -
పండితులకు సన్మానం
నిజామాబాద్ రూరల్: తెలుగు వెలుగు సమా ఖ్య ఆధ్వర్యంలో నూతన సంవత్సరం పురస్కరించుకొని గీతభవనంలో ఐదుగురు పండితులను ఘనంగా సన్మానించారు. సమాఖ్య ప్రధా న కార్యదర్శి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పండితు లు గోసం దత్తుశాస్త్రి, మనోహరశాస్త్రి, చంద్ర శేఖర్శర్మ, మారుతిజోషి, ప్రమోద్‌లను శాలు వ, మెమోంటోలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వీపీ చందన్రావు, సమాఖ్య అధ్యక్షులు ప్రభాకర్, ప్రకాశ్, లక్ష్మన్, ఆశోక్శర్మ తదితరులున్నారు. నిజామాబాద్ రూరల్: గుండె సంబంధిత వ్యాధుల నివారణకు వాకింగ్, శారీరక వ్యాయామం, యోగా చేయడం మంచిదని ప్రముఖ కార్డియాలజిస్ట్ సందీప్‌రావు తెలిపారు. ఆదివారం వినాయక్‌నగర్‌లో బస్వా పార్క్ యూజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. మద్యపానం, ధూమపానం అలవాట్లకు దూరంగా ఉండాలని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు సందీప్రావును సన్మానించారు. కార్యక్రమంలో గంగాధర్, మల్లేశ్‌రెడ్డి, మోహన్ కుమార్, రామ్మోహన్రావు, భూమేశ్వర్, దీవెన, మహేందర్, సత్యనారాయణ, శంకర్ తదితరులున్నారు. ఖలీల్ వాడి: త్రిభాషలైన తెలుగు, హిందీ, ఉర్దూలో విద్యార్థులను తీర్చిద్దాలని డీఈవో పార్శి అశోక్ తెలిపారు. ఆదివారం నగరంలోని ఆర్యనగర్ లో డీఈవో నివాసంలో రాష్ట్రీ య ఉపాధ్యాయ పండిత పరిషత్ క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ఏ, బీ,సీ గ్రేడులుగా విభజించుకుని సీ గ్రేడ్ కలిగిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జమీలుల్లా, ప్రధాన కార్యదర్శి రమణచారి, కోశాధికారి సతీష్ వ్యాస్, రాష్ట్ర బాధ్యులు గంట్యాల ప్రసాద్, పెంట శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు బి.ప్రవీణ్ కుమార్, దేవన్న, శ్రీమన్నారాయణ చారి, అబ్దుల్ వహీద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. సుభాష్‌నగర్: నిజామాబాద్ నగర అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన నగర సమస్యలపై పుస్తకాన్ని సోమవారం ఆవిష్కరిస్తున్నట్లు పెన్షనర్స్ యూనియన్ జిల్లా ప్రధానకార్యదర్శి కే రామ్మోహన్రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని సుభాష్‌నగర్‌లోగల పెన్షనర్స్ భవన్లో కార్యక్రమాన్ని ఏర్పాటుచేశామని, ఆవిష్కరణ కార్యక్రమానికి నుడా చైర్మన్ కేశ వేణు, మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్, అర్బన్ డెవలప్మెంట్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ ఎన్ శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని పేర్కొన్నారు. -
అభివృద్ధి పనుల పరిశీలన
నిజామాబాద్ రూరల్: నగరంలోని రెండో డివిజన్ బోర్గాం (కె) గ్రామంలో పలు అభివృద్ధి పనులను ఆదివారం కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పరిశీలించారు. సూపర్వైజర్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులతో మాట్లాడి పనులు వేగవంతం చేసుకోవాలని సూచించారు. అంబేడ్కర్ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు వారి కమిటీ హాల్ని సందర్శించారు. అనంతరం డివిజన్ గ్రామ కాంగ్రెస్ సభ్యులు బొబ్బిలి రామకృష్ణని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బోర్గాం(కె) అధ్యక్షులు రాజు, మట్ట రాము, నగేష్, నవీన్ గౌడ్, కాంతయ్య తదితరులు పాల్గొన్నారు. నగరంలోని 60వ డివిజన్ నాయకులు అలీ ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్యశిబిరాన్ని ఆదివారం నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ శిబిరాన్ని పరిశీలించి డాక్టర్లతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా బొబ్బిలి రామకృష్ణ వైద్య పరీక్షలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షులు అబుద్ బిన్ హందాన్, షాదాబ్, అంజద్, అష్రాఫ్, స్థానిక పెద్దమనుషులు, ఇతరులు పాల్గొన్నారు. -
సమస్య వస్తే పోలీసులను సంప్రదించాలి
● డిచ్పల్లి సీఐ వినోద్ ● నూతనంగా ఎన్నికై న సర్పంచులకు అవగాహనడిచ్పల్లి : గ్రామంలో ఏదైనా సమస్య వస్తే సొంత నిర్ణయాలతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, పోలీసులకు సమాచారం ఇవ్వాలని డిచ్పల్లి సీఐ కే వినోద్ సూచించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులకు ఆదివారం పోలీస్‌స్టేషన్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. నేరాల కట్టడికి శాంతిభద్రతల రక్షణ కోసం గ్రామాల్లోని ప్రధాన వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గ్రామాలకు వెళ్లే రోడ్లకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి, రోడ్డు ప్రమాదాలను అరికట్టేలా సహకరించాలన్నారు. వానదారులందరూ రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలన్నారు. గ్రామాల్లోని యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా సర్పంచులు కృషి చేయాలని సూచించారు. సైబర్ నేరాలపై గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. శాంతిభద్రత పరిరక్షణలో పోలీసులకు సర్పంచులు పంచాయతీ పాలకవర్గాల సభ్యులు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్సై మహమ్మద్ ఆరిఫ్, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. -
వీబీ–జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలి
ధర్పల్లి: కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో తీసుకువచ్చిన ’వీబీ– జీ రామ్ జీ ’చట్టాన్ని రద్దు చేయాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఆదివారం ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 1983లో రూపొందించిన విత్తన నియంత్రణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అణిచివేస్తుందని ఆరోపించారు. ఇప్పటికే అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేసి, జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 200 దినాల పని కల్పించి, రోజుకి రూ.600 కూలి చెల్లించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీ–జీ రామ్ జీ కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా, మండల, గ్రామస్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు బాలయ్య, విమల భూమేష్, గంగారం తదితరులు పాల్గొన్నారు. -
టీపీసీసీ అధ్యక్షుడిని కలిసిన ఆర్మూర్ కాంగ్రెస్ నాయకులు
ఆర్మూర్ : కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గం ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ను ఆదివారం హైదరాబాద్ లో కలిశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణం లో రాజకీయ పరిస్థితుల పై చర్చించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిని కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. మహేశ్ కుమార్ గౌడ్ ను కలిసిన వారిలో ఆర్మూర్ ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, వైస్ చైర్మన్ ఇట్టేం జీవన్, నాయకులు ఖాందేష్ శ్రీనివాస్, పవన్, పూల నర్సయ్య, విటోభ శేఖర్, రమేష్ తదితరులున్నారు. -
ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు
● ‘ఉచిత హెల్త్ క్యాంప్’ అభినందనీయం ● అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సుభాష్‌నగర్ : జీవితంలో ఎన్ని రకాల ఒత్తిళ్లు ఉన్నా.. ఆరోగ్యాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సూచించారు. ఆదివారం నగరంలోని కిషన్గంజ్లోగల ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత ఆరోగ్య శిబిరానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంతకుముందు వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలుచేశారు. వైద్యశిబిరానికి సన్‌రైజ్ ఆస్పత్రి, మనోరమ ఆస్పత్రికి చెందిన వైద్యులు పాల్గొని రోగులను పరీక్షించారు. రక్త పరీక్షలు, బీపీ, ఆర్థోపెడిక్, దంత, గుండె, కంటి, నరాలకు సంబంధించిన వైద్యనిపుణులతో కూడిన వైద్యబృందం ఆరోగ్య పరీక్షలను నిర్వహించింది. అనంతరం ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఆరోగ్యమే ప్రధానమని తెలిపారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మెగా హెల్త్‌క్యాంపు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆర్యవైశ్యుల్లో నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత తనదని ఆయన స్పష్టంచేశారు. ఆర్యవైశ్యులతోపాటు అనేక కులాల పేదలు ఆరోగ్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. మెగా హెల్త్ క్యాంప్‌లో పాల్గొన్న వైద్యులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. అలాగే ఆర్యవైశ్య సంఘంలో నిరుపేద ఆర్యవైశ్యలకు ధన్పాల్ లక్ష్మీబాయి, విఠల్ గుప్త ట్రస్ట్, ఆర్యవైశ్య సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిరుపేదలకు ప్రతినెలా రూ.500 అందించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.500 పెన్షన్‌లో ఆర్యవైశ్య సంఘం రూ.300, తన ట్రస్ట్ ద్వారా రూ.200 అందజేస్తున్నానని తెలిపారు. 72 మందికి ప్రతినెలా పింఛన్ అందజేస్తామన్నారు. రూ.500 పెన్షన్‌తోపాటు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించడానికి ఆర్యవైశ్యులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్కా దేవేందర్ గుప్త, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు ధన్పాల్ శ్రీనివాస్, ప్రధానకార్యదర్శి ఇల్లెందుల ప్రభాకర్ గుప్త, గాలి నాగరాజు గుప్త, లాభిశెట్టి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
కానిస్టేబుల్‌పై కేసు నమోదు
సిరికొండ: సిరికొండ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సుధాకర్‌పై యాక్సిడెంట్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై జే రామకృష్ణ ఆదివారం తెలిపారు. మండల కేంద్రానికి చెందిన కుమ్మరి గంగాధర్ అనే వ్యక్తిని గత నెల 27న సుధాకర్ కారుతో ఢీకొట్టి గాయపర్చారని పేర్కొన్నారు. సంఘటన జరిగిన రోజున పెద్ద మనుషుల సమక్షంలో గాయపడిన వ్యక్తికి ఆస్పత్రిలో అయ్యే వైద్య ఖర్చులను భరిస్తానని కానిస్టేబుల్ సుధాకర్ ఒప్పుకొని వెనుదిరిగాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ● దాబాపై నుంచి పడి విద్యార్థికి గాయాలు నవీపేట్: మండల కేంద్రంలోని సుభాష్‌నగర్ కాలనీకి చెందిన విద్యార్థి లోకేశ్ గాలిపటం ఎగుర వేస్తూ దాబాపై నుంచి కిందపడ్డాడు. స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న లోకేశ్ స్నేహితులతో కలిసి గాలిపటం ఎగురవేస్తూ వెనుకకు వెళ్లగా కిందపడ్డాడు. స్వల్ప గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. -
నేలవాలిన విద్యుత్ స్తంభం
● తప్పిన పెను ప్రమాదం దోమకొండ: మండల కేంద్రంలోని పలుగుగడ్డ ప్రాంతంలో గడ్డిని చదును చేయడానికి గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌తో ఆదివారం శుభ్రం చేస్తున్నారు. ఇదే సమయంలో విద్యుత్ స్తంభానికి సపోర్టు కోసం భూమిలో ఇనుప చువ్వకు వైరుతో ఉన్న భాగాన్ని సదరు ట్రాక్టర్ ఢీకొన్నది. దీంతో విద్యుత్ స్తంభం నేల వాలుతూ గ్రామానికి విద్యుత్ సరఫరా జరిగే ప్రధాన విద్యుత్ లైన్‌పై పడటంతో విద్యుత్ మంటలు చెలరేగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అదే సమయంలో అక్కడే ఉన్న గ్రామ వార్డు సభ్యులు బీసు సతీశ్, బత్తిని సిద్ధరాములు, కాలనీవాసులు ఉన్నారు. వెంటనే వారు అప్రమత్తమై దూరంగా వెళ్లడంతో ప్రమాదం తప్పింది. ప్రాణనష్టం జరగలేదు. వెంటనే వారు విద్యుత్ శాఖ అధికారులకు సమచారం అందించారు. ఈ ఘటనతో మండల కేంద్రంలో మూడు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. -
క్రైం కార్నర్
చికిత్సపొందుతూ బాలింత మృతి ఆర్మూర్‌టౌన్: జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆర్మూర్ పట్టణానికి చెందిన శ్రీలత(27) అనే బాలింత ఆదివారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ నెల 2న శ్రీలతకు పురిటినొప్పులు రావడంతో కుటుంబీకులు ఆర్మూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. కాగా శ్రీలత మగశిశువుకు జన్మనిచ్చింది. ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం కావడంతో ఈనెల 3న ఉదయం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం మృతి చెందింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే శ్రీలత మృతిచెందిందని బాధిత కుటుంబీకులు ఆరోపించారు. ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉరేసుకొని ఒకరి ఆత్మహత్య లింగంపేట(ఎల్లారెడ్డి): లింగంపేట మండలం నారాయణ గూడెం తండాకు చెందిన మునావత్ రవి(36) అనే వ్యక్తి ఆదివారం సాయంత్రం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతుడి తండ్రి బాల్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇసుక వాహనాల పట్టివేత మద్నూర్(జుక్కల్): డోంగ్లీ మండలంలోని కుర్లా శివారులో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు వాహనాలను శనివారం రాత్రి పట్టుకున్నట్లు ఎస్సై రాజు ఆదివారం తెలిపారు. విజిలెన్స్, రెవెన్యూ అధికారులు పోలీసు సిబ్బంది సహాయంతో కుర్లా వద్ద రెండు వాహనాలను పట్టుకున్నారు. డ్రైవర్లపై కేసు నమోదు చేసి వాహనాలను మద్నూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
తెలంగాణ బాలికల జట్టు కోచ్‌గా సుమలత
నందిపేట్: జాతీయ స్థాయి ఖేలో ఇండియా పోటీలకు నందిపేట మండల కేంద్రంలోని గీతా కాన్వెంట్ స్కూల్ పీఈటీ మర్రిపల్లి సుమలత తెలంగాణ జట్టు బాలికల కోచ్‌గా వ్యవహరించనున్నారు. ఈ క్రీడలు ఈనెల 5 నుంచి 9వ తేదీ వరకు కేంద్ర పాలిత ప్రాంతం డయ్యు డామన్ లో జరుగుతాయని గీతా కాన్వెంట్ పాఠశాల కరస్పాండెంట్ కానూరి గంగా సాగర్ తెలిపారు. తెలంగాణ జట్టు బాలికల కోచ్‌గా సుమలత ఎంపికపై తెలంగాణ వాలీబాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గజ్జల రమేశ్ బాబు, వైస్ ప్రెసిడెంట్, తెలంగాణ జనరల్ సెక్రెటరీ హనుమంత్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా జనరల్ సెక్రెటరీ మల్లేశ్ గౌడ్, నిజామాబాద్ క్రీడల అధికారి పవన్, గీతా కాన్వెంట్ హై స్కూల్, నందిపేట్ యాజమాన్యం సుమలతను అభినందించారు. -
ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం ఏబీవీపీ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం ఏబీవీపీ అని ఇందూరు విభాగ్ ప్రముఖ్, ఏబీవీపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు రెంజర్ల నరేశ్ అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 44వ రాష్ట్ర మహాసభలు ఈ నెల 3 నుంచి 5తేదీ వరకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రెండోరోజు ఆదివారం రెంజర్ల నరేశ్ ఆధ్వర్యంలో అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నరేశ్ మాట్లాడుతూ.. తెలంగాణ నలుమూలల నుంచి 1,500 మంది ఏబీవీపీ కార్యకర్తలు సభలకు రాగా, జిల్లా నుంచి 150 మంది కార్యకర్తలు హాజరయ్యారని పేర్కొన్నారు. ఏబీవీపీ క్రమశిక్షణ కలిగిన దేశభక్తులను తయారు చేసే సంస్థ అని తెలిపారు. చివరిరోజు సోమవారం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ హాజరుకానున్నారన్నారు. కార్యక్రమంలో విభాగ్ కన్వీనర్ కై రి శశిధర్, విభాగ్ సంఘటన మంత్రి హర్షవర్ధన్, స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యులు చారి, శివ, నిఖిల్, దినేశ్, పృథ్వి, సమీర్ తదితరులు పాల్గొన్నారు. ఇందూరు విభాగ్ ప్రముఖ్ రెంజర్ల నరేశ్


