breaking news
Nizamabad District Latest News
-
విభిన్న రూపాయ.. వినాయకాయ
నిజామాబాద్ రూరల్ : నగరంలోని వివిధ మండపాల నిర్వహకులు విభిన్న రకాల వినాయకులను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఖిల్లా రోడ్డులో శ్రీమహ్మదేవి యూత్ ఆధ్వర్యంలో పద్మనాభస్వామి రూపంలో గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అలాగే వర్నిచౌరస్తాలో భక్త హిందూ యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో విభూతి గణేశ్, ఖిల్లా చౌరస్తాలోని శ్రీశివసేన యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో చిరుధాన్యాలతో గణేశ్, మహ్మదేవినగర్లో శ్రీభజరంగ్ యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో గోమతి చక్రాల గణేశ్, బురుడుగల్లి గాజులపేటలో శ్రీరవీంద్రగణేష్ మండలి ఆధ్వర్యంలో పసుపుకొమ్ములతో గణేశ్, ఖిల్లా రోడ్డు చౌరస్తాలో రైజింగ్ స్టార్ యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో మట్టి దీపాలతో గణేశ్, వినాయక్‌నగర్‌లోని హైందవ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బాలగణపతి మట్టి విగ్రహం, చంద్రశేఖర్‌కాలనీలో శ్రీ సిద్ధివినాయక గణేశ్ మండలి ఆధ్వర్యంలో పద్మనాభస్వామి గణేశ్, ఠాణాగల్లిలో ఏర్పాటు చేసిన శ్రీమారుతి గణేష్ మండలి ఆధ్వర్యంలో పేపర్, మైదా పిండితో చేసిన గణేశ్ విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి.మండపాలను నిర్వహకులు రాత్రిసమయంలో విద్యుత్ దీపాలతో సెట్టింగ్స్‌తో తీర్చిదిద్దడంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. దీంతో విభిన్న వినాయక విగ్రహాలను వీక్షించేందుకు ప్రజలు తరలివస్తున్నారు. -
నిత్యవసర సరుకుల పంపిణీ
ధర్పల్లి/సిరికొండ : వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న మండలంలోని వాడి గ్రామస్తులకు వర్ష, ప్రమీల, ప్రవీణ్ ల సహకారంతో వందమంది కుటుంబాలకు ధర్పల్లి సీఐ భిక్షపతి, ఎస్సై కల్యాణి నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. వారికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. సిరికొండ మండలం పెద్దవాల్గోట్ గ్రామంలో దాతలు అందించిన విరాళాలతో కొనుగోలు చేసిన సరుకులను 70 కుటుంబాలకు అందజేశారు. కొండూర్ గ్రామంలోని బాధితులకు మోపాల్ మండలం నర్సింగ్‌పల్లికి చెందిన కాంట్రాక్టర్ రాములు రూ. 25 వేలు అందించారు. ధర్పల్లి మండలం ప్రాజెక్టు రామడుగు గ్రామానికి చెందిన ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో బాధితులకు ఒక రోజుకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. చీమన్‌పల్లి శివబాలాజీ ట్రేడర్స్, సిరికొండ రాజరాజేశ్వర ట్రేడర్స్ కలిపి పది వేలు, చీమన్‌పల్లి గ్రామస్తులు ఏడు ఆయిల్ ప్యాకెట్ల కాటన్లు నిత్యావసర వస్తువులు, 25 కిలోల పప్పు, ధర్పల్లికి చెందిన గణేష్ మండలి వారు బాధితులకు ఒక పూట భోజనం, చిన్నవాల్గోట్కు చెందిన రొండ్ల సంతోష్‌రెడ్డి 15 చీరలు బాధితులకు అందజేశారు. -
బాధ్యతలు స్వీకరించిన ఐకేపీ సీసీలు
డిచ్పల్లి: టీజీ సెర్ప్ ఉద్యోగుల సాధారణ బదిలీల నేపథ్యంలో డిచ్పల్లి మండల సమాఖ్య లో పనిచేసిన క్లస్టర్ కోఆర్డినేటర్లు (సీసీ)లు ఇతర మండలాలకు బదిలీపై వెళ్లగా వారి స్థానాల్లో బదిలీపై వచ్చిన సీసీ లు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మండలంలోని 8 క్టసర్లలో సీసీ లు ఎస్.హరిబాబు (మెంట్రాజ్‌పల్లి క్లస్టర్), ఎ.అశోక్ (సుద్దపల్లి), కే.సురేశ్ (రాంపూర్), కే.శ్రీధర్‌రెడ్డి (ఘన్పూర్), బి.గోవింద్ (మిట్టపల్లి), ఎస్.హరి (డిచ్పల్లి), ఎం.ఆరోగ్యరాణి (యానంపల్లి), టి.గిరీష్ కుమార్ (ధర్మారం(బి) క్లస్టర్) వీరు బాధ్యతలు నిర్వహించనున్నారు. ఏపీఎం రవీందర్‌రెడ్డిని సీసీలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాలను సక్రమంగా అందేలా కృషి చేయాలని ఏపీఎం సూచించారు. -
పూజలందుకుంటున్న గణనాథులు
తెయూ(డిచ్పల్లి)/మోపాల్/సిరికొండ : తెలంగాణ యూనివర్సిటీ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన వినాయకుడికి వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి, అధ్యాపకులు, విద్యార్థులు సోమవారం ప్రత్యేక పూజలు ని ర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం ని ర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. విద్యార్థులు తమ సంస్కృతి, సాంప్రదాయాలను పాటించడం అభినందనీయమన్నారు. మోపాల్ మండలం మోపాల్, కంజర్, కులాస్పూర్, మంచిప్ప, సిర్పూర్, న్యాల్కల్, ముదక్పల్లి, బాడ్సి, సింగంపల్లి, తదితర గ్రామాల్లో, సిరికొండ మండల కేంద్రంతో పాటు గడ్కోల్, పెద్దవాల్గోట్ గ్రామాల్లో వినాయక మండపాల వద్ద నిర్వహకులు అన్నదానం చేశారు. గణేశ్ నిమజ్జనానికి బల్దియా అధికారుల ఏర్పాట్లు నిజామాబాద్ సిటీ : వినాయక నిమజ్జనం సందర్భంగా మున్సిపల్ అధికారులు తగిన ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈనెల 6న నిర్వహించే గణేశ్ శోభాయాత్ర ప్రారంభం నుంచి గమ్యస్థానం వరకు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. మొదలు నుంచి చివరి వరకు ఇంజినీరింగ్, శానిటేషన్ సిబ్బందిని నియమిస్తూ మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్ ఆదేశాలు జారీచేశారు. దుబ్బ బాలగంగాధర్ తిలక్ జంక్షన్ నుంచి పాత గంజ్ మీదుగా బోధన్బస్టాండ్, గురుద్వారా, పెద్దబజార్, గోల్హనుమాన్, ఫులాంగ్ చౌరస్తా, వినాయకుల బావి వరకు రూట్‌మ్యాప్‌లో అధికారులను నియమించారు. మున్సిపల్ డీఈలు సుదర్శన్‌రెడ్డి, భూమేశ్వర్, నరేందర్, సయ్యద్ వాజిద్, సాయిచంద్, పావని, టీపీఎస్‌లు అనుపమ, జి.శ్రీకాంత్, తదితరులున్నారు. -
ఖైరతాబాద్ గణేశ్‌ను దర్శించుకున్న ధన్పాల్
సుభాష్‌నగర్: హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ వినాయకుడిని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీష్, రామారావు పాటిల్‌తో కలిసి సోమవారం దర్శించుకున్నారు. ఈసందర్భంగా ప్రత్యేక పూజ, హారతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ హిందూ ధర్మ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్న ఖైరతాబాద్ గణేశ్‌ని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. గణేశ్‌ని ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజలందరూ సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. అంతకుముందు ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేలను ఘనంగా సన్మానించారు. -
యంగ్ సైంటిస్ట్ పోటీలో ప్రతిభ చూపిన విద్యార్థి
మోపాల్: స్పేస్ కిడ్స్ ఇండియా ఆధ్వర్యంలో చెన్నయ్‌లో ఇటీవల జరిగిన గ్రాండ్ ఫినాలే యంగ్ సైంటిస్ట్ ఇండియా పోటీల్లో బోర్గాం(పి) జెడ్పీహెచ్ఎస్ 10వ తరగతి విద్యార్థి సైని కార్తీక్ తన ప్రదర్శనలతో ప్రతిభ కనబర్చారు. సోలార్ పవర్‌తో వాటర్ ఫ్యూరిఫైర్, వ్యవసాయ వ్యర్థాలతో బయో ప్లాస్టిక్‌ను, బయో ప్లాస్టిక్‌తో రోడ్డును తయారు చేసిన ప్రాజెక్టును సైని కార్తీక్ ప్రదర్శించాడు. ఈ రోడ్డు నీటిని పీల్చుకుని భూగర్భజలాల మట్టాన్ని పెంచుతుంది. ప్రదర్శనలో మొత్తం 95 పాఠశాలలు పాల్గొనగా, బోర్గాం(పి) జెడ్పీహెచ్ఎస్ విద్యార్థి ఉత్తమ ప్రతిభ కనబర్చడంతో మెమోంటో, మెడల్, సర్టిఫికెట్తో సైని కార్తీక్, గైడ్‌టీచర్ కే అనుపమను సత్కరించారు. విద్యార్థి, గైడ్ టీచర్‌ను పాఠశాల హెచ్ఎం శంకర్, ఉపాధ్యాయులు సోమవారం అభినందించారు. ఆశావర్కర్ల అరెస్టు దారుణం నిజామాబాద్ సిటీ : సమస్యల పరిష్కారానికి చలో హైదరాబాద్ తరలివెళ్తున్న ఆశావర్కర్లను ప్రభు త్వం అరెస్టు చేయడం దారుణమని సీఐటీయూ జి ల్లా కార్యదర్శి నూర్జహన్ తెలిపారు. నగరంలోని ఆశావర్కర్లను అరెస్టుచేసి తర్వాత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈసందర్భంగా నూర్జహన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఆశావర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.అక్రమ అ రెస్టులతో ఉద్యమాలను ఆపలేరన్నారు.ఆశావర్కర్లు రేణుక,లలిత,విజయ, సుకన్య, రేఖ,శోభ, సీహెచ్ నర్స లక్ష్మీ, సలీమా, సరూప, రాధా, రమా, పద్మ, బాలమణి, స్వప్న, రేవతి, విజయ, సాహిర, ఆసియా, లావణ్య, వనిత, దివ్య, సబిత, ఇందిర, లత, భాగ్య, రేణుక, చంద్రకళ, భారతి, చందన తదితరులున్నారు. -
లండన్‌లో ఘనంగా గణేశ్ ఉత్సవాలు
నిజామాబాద్ రూరల్ :లండన్‌లో ప్రవాస భారతీయులు వినాయక చవితి ఉత్సవాలను సోమవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గణేశ్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నరేష్ మెడిచేట్టి ఆధ్వర్యంలో 200 మంది సభ్యులు ఘనంగా పూజలు జరిపారు. ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ.. సంస్కృతి సంప్రదాయాలను పాటించాలన్నారు.వేలం పాటలో లడ్డూ ను రూ.3.60 లక్షలకు సికింద్రాబాద్ వారాసిగూడకి చెందిన వేదశ్రీ బాణాల దక్కించుకున్నారని, లక్కీ డ్రాలో ఐదు గ్రాముల గోల్డ్‌ను అఖిల్ బండి గెలుచుకున్నారని తెలిపారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా సౌతాల్ మాజీ ఎంపీ.వీరేందర్ శర్మ, యూరప్ మహిళా అధ్యక్షురాలు,యూత్.సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గురుమిందర్,కుమిలి ప్రెసిడెంట్ జాన్సన్ ఎడ్మన్ లు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో బండి అఖిల్, చరణ్, కార్తిక్, అన్విత్, వినోద్, తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి
సిరికొండ:మండలంలో వరదలతో జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాధితులను ఆదుకుంటామని మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి తెలిపా రు. మండలంలోని కొండూర్ గ్రామంలో వరద బా ధితులను ఆయన సోమవారం పరామర్శించారు. వరద తాకిడికి కూలిపోయిన ఇళ్లను, కప్పలవాగు వంతెన, రోడ్డును పరిశీలించారు. బాధితులకు 200 మందికి పది కిలోల బియ్యం, దుప్పట్లను ఆయన అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతు వరదలతో తీవ్ర నష్టం వాటిల్లడం జరిగిందన్నారు. పార్టీ మండలాధ్యక్షుడు రవి, బండారి నరేష్, రాజారెడ్డి, గర్గుల రాములు, సదానంద్‌రెడ్డి, పురుషోత్తం, పుప్పాల రవి, దేగాం సాయన్న, దేవేందర్, బాలనర్సయ్య, చెలిమెల నర్సయ్య, కోచర్ గంగారెడ్డి, భాస్కర్‌రెడ్డి, రాజేందర్, నవీన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధర్పల్లి మండలం వాడి, నడిమి తండా, బీరప్ప తండాలో వరద బాధితులను మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి సోమవారం పరామర్శించారు. అనంతరం వాడి గ్రామంలో వరద బాధిత కుటుంబాలకు ఆయన నిత్యవసర సరుకులను పంపిణీతో పాటు దుప్పట్లను పంపిణీ చేశారు. కాంగ్రెస్ నాయకులు ఆర్మూర్ బాలరాజ్, చెలిమిల నరసయ్య, సుభాష్, సురేందర్ గౌడ్ , నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం చారిత్రక నిర్ణయం
నిజామాబాద్ సిటీ : రాష్ట్రంలోని బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం చారిత్రక నిర్ణయమని పీసీసీ ప్రధాన కార్యదర్శి నరేశ్ జాదవ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, నుడా చైర్మన్ కేశ వేణుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 42 శాతం రిజర్వేషన్లతో బీసీల చిరకాల వాంఛ నెరవేరిందన్నారు. అనంతరం నుడా చైర్మన్ కేశ వేణు మాట్లాడుతూ కాంగ్రెస్‌పార్టీ అంటేనే బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు బీఆర్ఎస్, బీజేపీలు జీర్ణించుకోలేకపోతున్నాయని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్, డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, నాయకులు నరేందర్ గౌడ్, జావెద్ అక్రమ్, సేవాదళ్ సంతోష్, ప్రమోద్, మధుసూదన్, విఘ్నేష్ యాదవ్ తదతరులు పాల్గొన్నారు. -
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి
నిజామాబాద్‌అర్బన్/మోపాల్: సీపీఎస్‌ను రద్దు చేయాలని పీఆర్టీయూ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన మహాధర్నాకు జిల్లా ఉపాధ్యాయులు తరలివెళ్లారు. జిల్లా పీఆర్టీ యూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మోహన్ రెడ్డి కిషన్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు అంకం నరేశ్, ఆర్మూర్, ధర్పల్లి పీఆర్టీయూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గోపాల్ వెంకటరాజారెడ్డి సతీష్ నాయకులు వెంకటేశ్వర గౌడ్ జలంధర్ సంతోష్ భార్గవ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా నుంచి దాదాపుగా 1500 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారని పేర్కొన్నారు. పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమల్జేయాలని తెలంగాణ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు లాటికర్ రాము డిమాండ్ చేశారు. ఈమేరకు మండలంలోని సిర్పూర్ జెడ్పీహెచ్ఎస్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)కు వ్యతిరేకంగా టీటీయూ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి, ఫ్లకార్డులు పట్టుకుని ఉపాధ్యాయులు నిరసన తెలియజేశారు. ఉపాధ్యాయులు మోహన్, హజారే శ్రీనివాస్, అక్బర్ బాషా, నరేష్‌రావు తదితరులున్నారు. -
ఆత్మహత్య సరైన నిర్ణయం కాదు
నిజామాబాద్‌నాగారం: భారతదేశంలో ఆత్మహత్య అనేది ఒక తీవ్రమైన ప్రజారోగ్య సమస్య అని, మన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలకు ఆత్మహత్య సరైన పరిష్కారం కాదని భారత మానసిక వైద్యుల సంఘం డైరెక్ట్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ వి శాల్ ఆకుల అన్నారు. పశ్చిమ బెంగాల్లో ఆదివా రం నిర్వహించిన భారత మానసిక వైద్యుల సంఘం సదస్సుకు డాక్టర్ విశాల్ హాజరయ్యారు. సదస్సులో ఆత్మహత్య – ప్రపంచవ్యాప్త, భారతదేశ సమస్య అనే దానిపై చర్చించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేధిక ప్రకారం ప్రతి ఏడాది దాదాపు ఏడు లక్షల మంది ఆత్మహత్యల ద్వారా ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ఆధారంగా ప్రతి ఏడాది 1,70,000 కంటే ఎక్కువ మంది చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోలే క ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ప్రపంచంలోనే మహిళల ఆత్మహత్యల్లో మూడోవంతు భారత్‌లోనే చోటుచేసుకుంటుందన్నారు. ఆత్మహత్యల ని వారణకు పలు సూచనలు చేశారు. ప్రమాదకర పదార్థాలపై ప్రాప్యతను నియంత్రించాలని, మీడి యా ఆత్మహత్యలను సంచలనాత్మకంగా చూపకుండా నివారించాలన్నారు. మానసిక ఆరోగ్య సమస్య లు, వ్యసన రుగ్మతలతో బాధపడుతున్న వారిని ముందుగానే గుర్తించి చికిత్స అందించాలన్నారు. -
నోటిఫికేషనే ఆలస్యం!
● గ్రామాల్లో రాజకీయ హడావుడి ● స్థానిక ఎన్నికలపై జోరుగా చర్చ ● రిజర్వేషన్లపై నాయకులు, కార్యకర్తల్లో ఉత్కంఠ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలను ఈ నెలలోనే నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. నోటిఫికేషన్ రావడమే ఆలస్యం అన్నట్లుగా మారింది పల్లెల్లో వాతావరణం. ఎక్కడ చూసినా రాజకీయ హడావుడి నెలకొంది. రిజర్వేషన్లు ఏ విధంగా వస్తాయోనని ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు ఉత్కంఠగా ఎదు రు చూస్తున్నారు. జిల్లాలో మొత్తం 31 జెడ్పీటీసీలు, 307 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీలు 545 ఉండగా, 5,022 వార్డులు ఉన్నాయి. గ్రామీణ ప్రాంత ఓటర్లు మొత్తం 8,51,417 మంది ఉండగా, పురుష ఓటర్లు 3,96,778 మంది, మహిళా ఓటర్లు 4,54,621, ఇతరులు 18 మంది ఉన్నారు. పోలింగ్ స్టేషన్లు 5,053 ఉన్నాయి. ఫస్ట్.. పరిషత్ ముందుగా జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నా రు. జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికకు గులాబీ రంగు బ్యా లెట్ పత్రం, ఎంపీటీసీ సభ్యుల ఎన్నికకు తెలుపు రంగు బ్యాలెట్ పత్రం ఇచ్చేందుకు నిర్ణయించారు. అయితే 42 శాతం రిజర్వేషన్లకు ఆమోదం లేనప్పటికీ ప్రత్యామ్నాయ మార్గంలో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. రిజర్వేషన్ల కోటాపై పరిమితి ఎత్తేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రిజర్వేషన్ల అంశంపై ఉత్కంఠ నెలకొంది. 10న తుది జాబితాఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటర్లు, పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రకటించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దిష్ట షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ నెల 6వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల వారీగా ఓటర్లు, పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా ప్రకటించాల్సి ఉంది. 6 నుంచి 8వ తేదీ వరకు అభ్యంతరాలు, వినతులు స్వీకరిస్తారు. 8వ తేదీన జిల్లా స్థాయిలో కలెక్టర్, మండల స్థాయిలో ఎంపీడీవోలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. 9వ తేదీన వినతులు, అభ్యంతరాలు పరిష్కరించిన తరువాత 10న తుది జాబితా ప్రకటించాల్సి ఉంటుంది. ఆ తరువాత ఎప్పుడైనా పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావొచ్చని తెలుస్తోంది. -
వేర్వేరు కారణాలతో ముగ్గురి ఆత్మహత్య
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సోమవారం వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.భార్య మృతి తట్టుకోలేక.. ఇందల్వాయి: భార్య మృతి తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్లవెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లవెల్లికి చెందిన నీరడి గంగాధర్, హేమలతకు 11 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ క్రమంలో భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరగడంతో హేమలత గత శనివారం వాగులో దూకి ఆత్మహత్య చేసుకుంది. భార్య మృతిని తట్టుకోలేక గంగాధర్(34) గన్నారం గ్రామంలో తన చిన్నమ్మ వాళ్ల ఇంట్లో సోమవారం ఉదయం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు రోజుల వ్యవధిలో భార్య భర్తలు మృతిచెందడంతో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి. మృతుడి తల్లి ఎల్లవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. భూమి రిజిస్ట్రేషన్ చేయించలేదని.. ఖలీల్‌వాడి: తనకు రావాల్సిన భూమిని రిజిస్ట్రేషన్ చేయించలేదనే బాధతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరో టౌన్ పోలీసులు సోమవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని అర్సపల్లికి చెందిన సాయిలు(38) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. సాయిలు అక్క భర్తతో కొన్నేళ్ల క్రితం విడాకులు తీసుకొని తల్లి వద్దే ఉంటోంది. కాగా సాయిలుకు చెందిన భూమిని అక్క రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో కొన్ని రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. దీనిపై పెద్ద మనుషుల సమక్షంలో భూమిని రిజిస్ట్రేషన్ చేయించడానికి కొంత నగదును డిపాజిట్‌గా సాయిలు తన అక్కకు చెల్లించినట్లు స్థానికుల ద్వారా తెలిసింది. అయినా అక్క భూమి రిజిస్టేషన్ చేయడానికి మెలికవేయడంతో సోమవారం సాయంత్రం సాయిలు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మద్యానికి బానిసై యువకుడు.. బీబీపేట: మద్యానికి బానిసైన ఒకరు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు బీబీపేట ఎస్సై ప్రభాకర్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన ఎల్లమైన సాయి(27)కి చిన్ననాడే తల్లితండ్రులు చనిపోయారు. అతని పెద్దమ్మనే సాయి, తమ్ముడు నవీన్‌ను చేరదీసింది. కొంత కాలంగా సాయి పని చేయకుండా మద్యానికి బానిసయ్యాడు. శనివారం సాయంత్రం తన జన్మదిన వేడుకలను స్నేహితుల మధ్య జరుపుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. స్థానిక చెరువు కట్టపై నిలబడి తాను చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కుటుంబీకులకు ఫోన్ ద్వారా తెలిపాడు. వెంటనే కుటుంబీకులు చెరువు వద్దకు వెళ్లి గాలింపు చేపట్టగా ఆచూకీ లభించలేదు. అధికారులు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు ఆదివారం, సోమవారం బోట్ ద్వారా చెరువులో గాలించారు. సాయంత్రం సాయి మృతదేహం లభ్యమైంది. మృతుడి తమ్ముడు నవీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అతివల్లో అక్షర కాంతి కోసం..
నిజామాబాద్‌అర్బన్: అతివలందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించాయి. జాతీయ విద్యా విధానం–2020కి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్(అండర్ స్టాండింగ్ ఆఫ్ లైఫ్‌లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ)ను రూపొందించింది. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 8వ తేదీన ‘నవభారత సాక్షరత’ పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. వలంటీర్ల ద్వారా బోధన ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 59,049 మంది మహిళా నిరక్షరాస్యులను అధికారులు గు ర్తించారు. అందులో 45,158 మంది మహిళల వివరాలను యాప్‌లో నమోదు చేశారు. కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. వీరి పర్యవేక్షణలోనే ఉల్లాస్ కార్యక్రమం అమలు కానుంది. జిల్లా రిసోర్స్ పర్సన్లుగా నియమితులైన శ్రీనివాస్‌గౌడ్, రాజేశ్ రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందారు. వీరు 66 మంది మండల రిసోర్స్ పర్సన్లకు, వారి ద్వారా మండల స్థాయి వయోజన వలంటీర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. గ్రామస్థాయిలో 10 మంది నిరక్షరాస్యులకు ఒక వలంటీర్‌ను నియమించి చదువు నేర్పనున్నారు. ఈనెల 8న ఉల్లాస్ ప్రారంభం జిల్లాలో 59,049 మంది మహిళా నిరక్షరాస్యుల గుర్తింపు చదువు నేర్పేందుకు 10 మందికి ఒక వలంటీర్ -
యూరియా కోసం బారులు
సిరికొండ: మండల రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. మండల కేంద్రంలోని సొసైటీకి వచ్చిన 300 సంచుల యూరియా కోసం రైతులు బారులు తీరారు. రైతు వేదిక వద్ద పట్టా పాస్ పుస్తకం జిరాక్స్ తీసుకొని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు టోకెన్లు ఇచ్చారు. ఆ టోకెన్ పట్టుకొని వచ్చి రైతులు సొసైటీ కార్యాలయం వద్ద వరుసలో నిలుచున్నారు. ఎంత భూమి ఉన్నా ఒక్క రైతుకు మూడు సంచులు మాత్రమే పంపిణీ చేశారు. సిరికొండ సొసైటీ పరిధిలోని సిరికొండ, మైలారం, చీమన్‌పల్లి, పందిమడుగు, దుప్య తండా, హుస్సేన్‌నగర్, న్యావనంది, రావుట్ల గ్రామాలకు చెందిన రైతులు భారీగా తరలివచ్చారు. -
నేవీలో ఉద్యోగం సాధించిన యువకుడికి సీపీ అభినందన
డిచ్పల్లి: మండలంలోని అమృతాపూర్ గ్రామం ఒడ్డెర క్యాంపు కాలనీకి చెందిన పాలపు శివకుమార్ ఇండియన్ నేవీలో ఉద్యోగం సాధించారు. శివకుమార్ తన తల్లిదండ్రులతో కలిసి సీపీ పోతరాజు సాయి చైతన్యను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నేవీలో ఉద్యోగం సాధించిన శివకుమార్‌ను సీపీ అభినందించి మిఠాయి తినిపించారు. యువత చెడు మార్గాలకు వెళ్లకుండా చక్కగా చదువుకుని మంచి ఉద్యోగాన్ని సాధించి తల్లిదండ్రుల ఆశలను నిలబెట్టాలన్నారు. శివకుమార్‌ను ఆదర్శంగా తీసుకుని యువత దేశభక్తిని అలవర్చుకోవాలన్నారు. శివకుమార్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులను సీపీ అభినందించారు. ఆర్మూర్‌టౌన్: పెద్దమ్మ ఆలయ పరిసరాల్లో తిరుగుతున్న చిరుతను త్వరగా పట్టుకోవాలని ముదిరాజ్ సంఘం, ఆలయ కమిటీ సభ్యులు, రైతులు, గొర్ల కాపరులు సోమవారం ఫారెస్ట్ రెంజ్ అధికారి శ్రీనివాస్‌కు విన్నవించారు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో గొర్ల కాపరి మందను ఆలయ పరిసరానికి తీసుకువెళ్తున్న సమయంలో చిరుత ఒక మేకను నోట కరిచి గుట్టపై తీసుకెళ్లిందన్నారు. దీంతో తాము ఆ పరిసర ప్రాంతాలకు వెళ్లాలంటేనే భయంగా ఉందన్నారు. అధికారులు త్వరగా బోనులు ఏర్పాటు చేసి చిరుతను పట్టుకోవాలని ఎఫ్ఆర్వోను కోరారు. ఆలయ కమిటీ చైర్మన్ మచ్చేందర్, జక్కం శేఖర్, బోన్ల గోపి, ప్రసాద్, దేవేందర్, నర్సారెడ్డి, రాజారెడ్డి, గొర్లకాపరులు, రైతులు పాల్గొన్నారు. -
కాళోజీ పురస్కారానికి మొగిల్ స్వామిరాజ్ ఎంపిక
బోధన్: తెలంగాణ రచయితల సంఘం తొమ్మిదేళ్లుగా ప్రధానం చేస్తున్న కాళోజీ పురస్కారం 2024–25నకు గాను బోధన్‌కు చెందిన అ భ్యుదయ కవి మొగిలి స్వామిరాజ్ ఎంపికయ్యారు.ఈ విషయాన్ని సోమవారం ఆయన తెలిపారు. కవి మొగిలి స్వామిరాజ్ సమకాలిన సామాజిక అంశాలపై అనేక కవితలు రాశారు. నిశబ్ధ రహస్యాలు, నిప్పు కణికలు స్వీయ రచనలతో కవితా సంపుటాలు వెలువరించి ఉమ్మ డి జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు. త్వరలో పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం జరుగనుందని స్వామి రాజ్ తెలిపారు. తెయూ(డిచ్పల్లి): తెయూ పరిధిలో కొనసాగుతున్న పీజీ, బీఈడీ, బీపీఎడ్ సెమిస్టర్ పరీక్షల్లో సోమవారం ఒక విద్యార్థి మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతూ డిబార్ అయినట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం నిర్వహించిన పీజీ 2, 4వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షల్లో మొత్తం 744 మందికి 688 మంది హాజరు కాగా 55 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రంలో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ ఒకరు డిబార్ అయినట్లు తెలిపారు. మధ్యాహ్నం నిర్వహించిన బీఈడీ, బీపీఎడ్ 2, 4వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షల్లో మొత్తం 129 మందికి 115 మంది హాజరు కాగా 14 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం నిజామాబాద్‌నాగారం: జిల్లాలోని శారీరక దివ్యాంగ బాలుర విద్యార్థులు ఉచిత విద్య, వసతి కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా సంక్షేమ, మహిళా, శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల శాఖ అధికారి రసూల్‌బీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1 నుంచి 10వ తరగతి వరకు చదివే వారికి న్యాల్కల్ రోడ్‌లోని ఆనంద నిలయంలో వసతి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. సీట్లు భర్తీ కాకపోతే ఇంటర్, ఆపై చదివే వారికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల అర్హులైన దివ్యాంగ విద్యార్థులు కలెక్టరేట్లోని కార్యాలయంలో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శారీరక దివ్యాంగ విద్యార్థులను వసతి గృహంలో చేర్పించేందుకు సహకరించాలన్నారు. వివరాలకు 9703723632 నంబర్లో సంప్రదించాలని తెలిపారు. జీజీ కళాశాలలో..నిజామాబాద్‌అర్బన్: నగరంలోని గిరిరాజ్ ప్ర భుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ప్రాతిపదికన అధ్యాపక పోస్టుల కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ రామ్మోహన్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యూజీ కోర్సుల్లో బోధన కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్, హిస్టరీ సబ్జెక్టులలో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని, సంబంధిత విభాగంలో పీజీలో 55 శాతం ఉత్తీర్ణత ఉండాలన్నారు. పీహెచ్డీ, నెట్, సెట్ ఉత్తీర్ణులకు ప్రాధాన్యత ఉంటుంద న్నారు. కళాశాలలో బుధవారం ఉదయం 10 గంటలకు నిర్వహించే ఇంటర్వ్యూకు అభ్య ర్థులు హాజరు కావాలని కోరారు. -
ఓపీఎస్‌ను అమలు చేయాలి
● కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల నిరసననిజామాబాద్అర్బన్: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని టీఎన్జీవోస్ జిల్లా అ ధ్యక్షుడు సుమన్ డిమాండ్ చేశారు. పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ కలెక్టరేట్ ఎదుట సోమవారం టీఎన్జీవోస్, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీ లు, నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. అనంతరం ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ప్రవేశం మార్గం వద్ద బైఠాయించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ భూతాన్ని అంతం చేసే వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామ ని పేర్కొన్నారు. అనంతరం ఉద్యోగులు హైదరాబాద్‌కు తరలివెళ్లారు. కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ జిల్లా కో చైర్మన్లు రమణారెడ్డి, సురేశ్ కృష్ణారెడ్డి, శ్రీనివాస్, మోహన్ రెడ్డి, టీఎన్జీవోస్ అసోసియేట్ అధ్యక్షుడు పెద్దోళ్ల నాగరాజ్, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెనిగళ్ల సురేశ్, బీసీటీయూ జిల్లా అధ్యక్షుడు మాడవేటి వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వేల ఎకరాలు వరదార్పణం
ఎన్నో ఆశలతో సాగు చేసిన పంట కళ్ల ముందే కొట్టుకుపోయింది. వరద తాకిడితో నేల చూపు చూస్తున్న వరి, సోయా ఇక ఎదిగే అవకాశం లేక మురిగిపోతోంది. మంజీర పరీవాహక ప్రాంతమైన సాలూర మండలంలో 9,240 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు ఏవో శ్వేత తెలిపారు. 5,090 ఎకరాల్లో సోయా, 3,960 ఎకరాల్లో వరి, 115 ఎకరాల్లో అరటి, 50 ఎకరాల్లో కూరగాయలు, 25 ఎకరాల్లో చెరుకు పంటలకు నష్టం వాటిల్లింది. – బోధన్ -
బాధితులను ఆదుకోవడంలో సర్కారు నిర్లక్ష్యం
మోర్తాడ్/ధర్పల్లి/సిరికొండ : భారీ వర్షాలు, వరదలతో నష్టపోయినవారిని ఆదుకోవడంలో రాష్ట్ర ప్ర భుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్ ఆ రోపించారు. సహాయక చర్యల్లో అధికార యంత్రాంగానికి చిత్తశుద్ధి లేదని పేర్కొన్నారు. ధర్పల్లి, సిరికొండ, భీమ్‌గల్ మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం ఆయన పర్యటించారు. దె బ్బతిన్న పంటలు, ఇళ్లు, రోడ్లు, వాగు వంతెనలను పరిశీలించి వరద బాధితులతో మాట్లాడారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడారు. వరదల వల్ల జరిగిన నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్కువ చేసి నివేదికలు తయారు చేస్తోందని విమర్శించారు. నష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేయకుండా బాధితులకు ఏ విధంగా పరిహారాన్ని చెల్లిస్తారని ప్రశ్నించారు. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పొలా ల్లోని ఇసుక మేటలను ప్రభుత్వమే తొలగించాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు ఇస్తే కేంద్రం ద్వారా సహాయం అందిస్తామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వరదల వల్ల కలిగిన నష్టాన్ని వివరిస్తానన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకల కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించడాన్ని బీజేపీ స్వాగతిస్తోందని ఎంపీ పేర్కొన్నారు. అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరి నీ వదిలిపెట్టవద్దని, కాంట్రాక్టర్లపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజే పీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులచారి, బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి డా.మల్లికార్జున్ రెడ్డి, ఆయా మండలాల బీజేపీ అధ్యక్షులు మహిపాల్ యాదవ్, సంజీవ్‌రెడ్డి, ఆరె రవీందర్, నాయకులు నక్క రాజేశ్వర్, అల్లూరి రాజేశ్వర్‌రెడ్డి, కర్క గంగారెడ్డి, గంగాదాస్, చిలుక మహేశ్, నల్ల పెంటయ్య, రాజశేఖర్, నరేశ్, సాయాగౌడ్, రంజిత్‌రెడ్డి, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఎకరానికి రూ.50వేలు పరిహారం ఇవ్వాలి సీఎంని కలిసి నష్టాన్ని వివరిస్తా.. ఎంపీ ధర్మపురి అర్వింద్ ధర్పల్లి, సిరికొండ, భీమ్‌గల్ మండలాల్లో పర్యటన -
క్రైం కార్నర్
వర్ని: మోస్రా మండలం తిమ్మాపూర్‌కు చెందిన వడ్ల అశోక్ (35)చింతకుంట చెరువులో తూము వద్ద ఇసుక బస్తాలు వేస్తూ ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందినట్లు వర్ని ఎస్సై మహేశ్ తెలిపారు. చెరువు తూము నుంచి నీరు వృథాగా పోతున్నందున కట్టడి చేసేందుకు సోమవారం ఇసుక బస్తాలు వేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు ఎస్సై పేర్కొన్నారు. చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి .. రెంజల్: మండల కేంద్రంలో ఓ వాహనం ఢీ కొన్న ఘటనలో చికిత్స పొందుతున్న గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రెంజల్ ఎస్సై చంద్రమోహన్ సోమవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఆదివారం రాత్రి వీరన్నగుట్ట నుంచి సాటాపూర్ వైపు నడుచుకుంటు వస్తున్న ఓ యువకుడిని వాహనం ఢీకొనడంతో తీవ్రగాయాలపాలయ్యాడు. స్థానికులు అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ సదరు వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో.. ఖలీల్‌వాడి: నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందినట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు సోమవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మూడో టౌన్ పీఎస్ పరిధిలో జూలై 20న ఓ వ్యక్తి అపస్మారకస్థితిలో ఉన్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలో సదరు వ్యక్తి తన పేరును సురేశ్‌గా చెప్పినట్లు ఎస్సై తెలిపారు. ఆగస్టు 14న గుండెపోటుతో మృతి చెందాడన్నారు. నాటి నుంచి మృతదేహం కోసం ఎవరూ రాలేదని తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712659739, 8712551734 నంబర్లకు సమాచారం అందించాలని ఎస్సై కోరారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం ఖలీల్‌వాడి: నగరంలోని ఆరవ టౌన్ పీఎస్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైటన్లు ఎస్సై వెంకట్రావు సోమవారం తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 40 ఏళ్ల వరకు ఉంటుందన్నారు. మృతుడి ఒంటిపై క్రీమ్ కలర్ డబ్బాల షర్ట్, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని, షర్ట్ కాలర్‌పై క్లాసిక్ టైలర్స్, నవీపేట్ అని ఉందన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712659848, 8712659734 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. ఏడు లారీలు సీజ్ ఆర్మూర్ టౌన్: మండలంలోని గోవింద్‌పేట్‌లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఏడు లారీలను సీజ్ చేసినట్లు ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ సోమవారం తెలిపారు. భీమ్‌గల్ మండలం బెజ్జోరా గ్రామం వాగు నుంచి ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో గోవింద్‌పేట్‌లో లారీలను పట్టుకొని సీజ్ చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
తెయూ(డిచ్పల్లి): పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్(టూటా) అధ్యక్షుడు పున్నయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానం స్వచ్ఛందంగా ఎంచుకొనేందుకు కేంద్రం అవకాశం ఇచ్చినప్పటికీ చాలా రాష్ట్రాలు పోటీపడి నూతన పెన్షన్ విధానాన్ని ఎంపిక చేసుకున్నాయని అన్నా రు. తెలంగాణ రాష్ట్రంలో గత ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం టూటా ఆధ్వర్యంలో తెయూ వీసీ యాదగిరిరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టూటా వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ రెడ్డి, అడికె నాగరాజు, ప్రొఫెసర్ రాంబాబు గోపిశెట్టి, పాత నాగరాజు, వాసం చంద్రశేఖర్, మహేందర్ రెడ్డి, రాజేశ్వరి, బాలకిషన్, శిరీష బోయపాటి, సంపత్ తదితరులు పాల్గొన్నారు. నిరసన తెలిపిన నాన్ టీచింగ్ ఉద్యోగులు సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం తెలంగాణ యూనివర్సిటీ పరిపాలనా భవనం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నాన్ టీచింగ్ ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో నాన్ టీచింగ్(రెగ్యులర్) ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అసిస్టెంట్ రిజిస్ట్రార్ బి.సాయాగౌడ్, జనరల్ సెక్రెటరీ బి.భాస్కర్, విజయలక్ష్మి, ఉమారాణి, జ్యోతి, సంకీర్తన, ధీరజ్, పాషా తదితరులు పాల్గొన్నారు. -
నష్టం వివరాలు అందించండి
నిజామాబాద్‌అర్బన్: భారీ వర్షాల కారణంగా వాటిల్లిన నష్టంపై సమగ్ర వివరాలతో వెంటనే అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. భారీ వర్షాలు, వరద సహాయంపై సెక్రటేరియట్ నుంచి సోమవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సీఎం సోమవారం సమీక్షించారు. వరద ప్రభావం, ప్రస్తుత పరిస్థితులను తెలుసుకున్నారు. తక్షణ సహాయక చర్యల కోసం నిధులు మంజూరు చేస్తున్నామని వెల్లడించారు. విపత్తు సహాయ నిధిని కూడా అవసరాల కోసం వినియోగించుకోవాలని సూచించారు. వరదల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు వెంటనే నష్ట పరిహారం అందించాలని ఆదేశించారు. మరో నెల రోజుల వరకు ఇదే రీతిలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నా యని వాతావరణ శాఖ పేర్కొంటున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం విపత్తు సహాయనిధిని వినియోగించుకోండి తక్షణ సహాయక చర్యల కోసం నిధులు మంజూరు వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి -
ప్రజావాణి అర్జీలకు ప్రాధాన్యత ఇవ్వాలి
● జిల్లా అధికారులను ఆదేశించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ● 74 వినతుల స్వీకరణ నిజామాబాద్‌అర్బన్:ప్రజా సమస్యల పరిష్కారాని కి ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం ద్వా రా అందిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి జిల్లా అధికారులను ఆదే శించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయా ల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదన పు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్‌తో కలిసి కలెక్టర్ ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారు లు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. అత్య వస రమైతే తన అనుమతి తీసుకుని, తమ కింది స్థాయి అధికారిని ప్రజావాణికి పంపాలని సూచించారు. అ నంతరం ప్రజావాణికి 74 వినతులు రాగా వాటి ప రిష్కారానికి సంబంధిత అధికారులకు అందించా రు.ఎంతో కీలకంగా భావించే ప్రజావాణికి జిల్లా అ ధికారులు గైర్హాజరు కాకూడదని సూచించారు. ప్ర జావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ, త్వ రితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీవో సాయాగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీపీవో శ్రీనివాస్ రావు, మెప్మా పీడీ రాజేందర్, ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వేతనాలు ఇప్పించండి జిల్లాలోని మోడల్ స్కూల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఆరు నెలలుగా వేతనాలు లేవని వేతనాలు ఇప్పించాలని ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెనిగళ్ల సురేశ్ ఆధ్వర్యంలో ఉద్యోగులు కలెక్టర్‌ను కలిసి విన్నవించారు. పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ధర్నా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యూ నాయకులు కలెక్టరేట్ ప్రవేశ మార్గం వద్ద ధర్నా నిర్వహించారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు శిథిలావస్థలో ఉన్నాయని మరమ్మతులు చేపట్టాలని జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నరేందర్, గణేశ్ డిమాండ్ చేశారు. జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలన్నారు. కుక్కల బెడదను నివారించండి సారంగపూర్‌లోని కుక్కల బెడదను నివారించాలని గ్రామానికి చెందిన శ్రీ స్వామి వివేకానంద యూత్ సభ్యులు కలెక్టర్‌ను కలిసి విన్నవించారు.రోడ్డు ఎక్కాలంటే భయపడుతున్నామని వారు పేర్కొన్నారు. బార్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి ఆర్టీసీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన బార్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నివాస గృహాల మధ్య ఏర్పాటు చేశారని వెంటనే తొలగించాలన్నారు. కిచెన్ షెడ్డు నుంచి పొగ, దుర్వాసన ఇళ్లల్లోకి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చుట్టుపక్కల పాఠశాలలు, బ్యాంకులు ఉన్నాయని మహిళలకు ఇబ్బందికరంగా ఉందన్నారు. డబుల్ బెడ్రూమ్లను కేటాయించండి పేదలకు డబుల్ బెడ్ రూమ్‌లను వెంటనే కేటాయించాలని అంకాపూర్ గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామానికి చెందిన పేదవారికి ఇళ్లు ఇచ్చేందుకు గతంలో అర్హులుగా గుర్తించారని, ఇళ్లు మాత్రం ఇవ్వడం లేదన్నారు. అనంతరం వారు ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. -
డిజిటల్ క్రాప్ సర్వే షురూ
● వెబ్‌సైట్‌ను తెరిచిన ప్రభుత్వం ● సర్వే నంబర్ల వారీగా వివరాల నమోదు డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో నెల రోజులు ఆలస్యంగా డిజిటల్ క్రాప్ సర్వే మొదలైంది. ప్రభుత్వం డీసీఎస్ వెబ్‌సైట్‌ను తెరవడంతో వ్యవసాయ విస్తీర్ణ అధికారులు (ఏఈవోలు) క్షేత్రస్థాయికి వెళ్లి వానాకాలంలో సాగవుతున్న పంటల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. అక్టోబర్ 20వ తేదీ వ రకు పంట వివరాల నమోదు పూర్తి చేయాలని ప్ర భుత్వం గడువు విధించింది. ఇటీవల భారీ వర్షాల కారణంగా జిల్లాలో సుమారు 50వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. రైతులకు నష్టపరిహారం అందించాలంటే తప్పనిసరిగా క్రాప్ బుకింగ్ చేసి ఉండాలి. దీంతో ఏఈవోలు, ఏవోలు ఆగమేఘాల మీద సర్వే నంబర్ల వారీగా పంటల వివరాలను న మోదు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఖ రీఫ్ సీజన్లో పసుపు పంట మినహాయించి వివిధ ప్రధాన పంటలు 5,24,506 ఎకరాల్లో సాగవుతుండగా, అత్యధికంగా 4,36,695 ఎకరాల విస్తీర్ణంలో వరి ఉంది. ప్రభుత్వం పంటలను కొనుగోలు చే యాలన్నా, నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలన్నా డిజిటల్ క్రాప్ సర్వేలో పంటల వివ రాలు తప్పనిసరిగా ఉండాలి. వరి, సోయా, ఇతర పంటలకు ఇంకా సమయం ఉండగా, చాలా ప్రాంతాల్లో మొక్కజొన్న కోత దశకు వచ్చింది. తప్పులు లేకుండా పంటల సర్వే నిర్వహించాలని ఏఈవోలకు సూచించినట్లు జిల్లా వ్యవసాయాధికారి మేకల గోవింద్ ‘సాక్షి’కి తెలిపారు. -
బీఆర్ఎస్ ధనదాహానికి రైతులు బలి
మోర్తాడ్: పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతల ధనదాహానికి రైతులు బలయ్యారని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట్ అన్వేష్‌రెడ్డి పేర్కొన్నారు. మోర్తాడ్ మండలంలోని దొన్కల్ వద్ద పెద్దవాగులో కొట్టుకుపోయిన చెక్‌డ్యాంను సోమ వారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గంలోని కప్పలవాగు, పెద్దవాగులలో నిర్మించిన చెక్‌డ్యాంలు వర్షాల ధాటికి తట్టుకోలేక తెగిపోతున్నాయని చెప్పారు. దీంతో పంటలు నష్టపోయి రై తులకు తీరని వ్యధ మిగిలిందన్నారు. ఎస్సారెస్పీని నింపేందుకు రివర్స్ పంపింగ్ కోసం వేల కోట్లు ఖర్చు చేసినా చుక్కనీరు కూడా రాలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నియోజకవర్గానికి లాభం జరిగిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ఫ్లెక్సీలతో జోరుగా ప్రచారం చేసుకుంటున్నారని, ఇది పూర్తిగా అవాస్తవమని వెల్లడించారు. చెక్‌డ్యాంలలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలకు ప్రశాంత్‌రెడ్డి పూర్తిగా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట నాయకులు దొన్కల్ సంజీవ్‌రెడ్డి, రొక్కం మురళి, శివన్నోల్ల శివకుమార్, సోమ దేవారెడ్డి, ముత్యాల రాములు, బద్దం రాజశేఖర్, బూత్‌పురం మహిపాల్, సదానందంగౌడ్, పెండెం శ్రీనివాస్, ముత్యాల శ్రీనివాస్, అర్గుల్ రమేశ్, లచ్చల గంగారెడ్డి, ఆనంద్, ప్రసాద్, దొన్కల్ రవి తదితరులు పాల్గొన్నారు. -
క్యాంపస్‌లో హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటు
తెయూ(డిచ్పల్లి): టీజీ లాసెట్–2025 కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్స్ పొందిన విద్యార్థులు సోమవారం తెయూ న్యాయ కళాశాలలో చేరేందుకు క్యాంపస్‌కు వచ్చారు. తెయూ ఏబీవీపీ కమిటీ, ఎన్ఎస్యూఐ కమిటీల ఆధ్వర్యంలో లాసెట్ విద్యార్థులకు సహాయం కోసం వేర్వేరుగా హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏబీవీపీ లా కన్వీనర్ శివకుమార్‌రెడ్డి, కోకన్వీనర్ విజయ్, ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు చౌదరపల్లి మహేశ్, ఉపాధ్యక్షులు అరుణ్ తేజ, జనార్దన్, కార్యదర్శి అనిల్, అలియాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఆంగ్ల విభాగంలో హేమలతకు డాక్టరేట్
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగం పరిశోధక విద్యార్థి ఎల్టీ హేమలత డాక్టరేట్ సాధించారు. తెయూ అసిస్టెంట్ పి.సమత పర్యవేక్షణలో‘సైకలాజికల్ యాస్పెక్టస్ ఇన్‌ద సె లెక్ట్ నావెల్స్ ఆఫ్ అనిత నాయర్’ అనే అంశంపై హేమలత సిద్ధాంత గ్రంథం సోమవారం సమర్పించారు. పీహెచ్డీ డాక్టరేట్ సాధించిన హేమలతను వీసీ, రిజిస్ట్రార్‌తో పాటు పలువురు అధ్యాపకులు అభినందించారు. కార్యక్రమంలో ఆర్ట్స్ డీన్ లా వ ణ్య,హెచ్‌వోడీ కేవీ రమణచారి, అధ్యాపకులు స్వా మి,పరిశోధక విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ● సీపీ సాయిచైతన్య ఖలీల్‌వాడి: రక్తదానం ఎంతో గొప్పదని సీపీ సాయిచైతన్య అన్నారు. ఇండియన్ ఆయిల్ డే వార్సికోత్సం సందర్భంగా నిజామాబాద్ పోలీస్ ఫిల్లింగ్ స్టేషన్ ఆధ్వర్యంలో సోమవారం స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరానికి సీపీ హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని, రక్తదానంతో ఆపదలో ఉన్న వారి ప్రాణాలను రక్షించిన వారిమవుతామని అన్నారు. కార్యక్రమంలో ఐవోసీఎల్ అధికారి పూర్ణచంద్రరావు, ఆర్ఐ సీఐ తిరుపతి, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. పెర్కిట్: ఆలూర్ మండలం మిర్దాపల్లిలో గ్రామ దేవతల ఆలయాల ఎదుట పిల్లులను బలి ఇచ్చిన ఘటన కలకలం రేకేత్తిస్తోంది. గ్రామంలోని గ్రామ దేవతలతో పాటు గణేశ్ మండపం ఎదుట పిల్లులను బలి ఇచ్చిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. గ్రామస్తులు సోమవారం తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని దుండగులు గ్రామంలోని నాలుగు గ్రామ దేవతల ఆలయ ఎదుట పిల్లులను హతమార్చి బలి ఇచ్చారు. అలాగే గ్రామంలో చిన్న పిల్లలు ఏర్పాటు చేసిన గణేశ్ మండపం వద్ద సైతం పిల్లిని బలి ఇచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు పిల్లులను బలి ఇవ్వడంపై గ్రామంలో ఏదైన అరిష్టం జరగవచ్చని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై వీడీసీ వారు ఆర్మూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రతి రైతునూ ఆదుకుంటాం
రెంజల్/నవీపేట: వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటామని, ప్రభు త్వం ద్వారా నష్టపరిహారం అందజేస్తామని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. రెంజల్, నవీ పేట మండలాల్లోని తాడ్‌బిలోలి, బోర్గాం, నీలా, కందకుర్తి, మిట్టాపూర్, అల్జాపూర్, యంచ, కోస్లి గ్రామాల్లో ముంపునకు గురైన పంటలను సోమవా రం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల వరద బాధితులు, రైతులతో మాట్లాడారు. వరద ఉధృతికి భయపడొద్దని ధైర్యం చెప్పారు. ప్రతి వర్షాకాలంలో గోదావరి పరీవారక ప్రాంతాలవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం సుదర్శన్‌రె డ్డి మీడియాతో మాట్లాడుతూ వరద ఉధృతికి నష్ట పోయిన వారి వివరాలు పక్కాగా సేకరించాలని అ ధికారులకు సూచించారు. దెబ్బతిన్న రోడ్లు, ట్రా న్స్ఫార్మర్లు, కాల్వలకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని తెలిపా రు. విద్యుత్ పునరుద్ధరణ పనులను వేగవంతం చే యాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఉర్దూ అకాడ మీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, డీఏవో గోవింద్, ఆర్డీవో రాజేంద్రకుమార్, కాంగ్రెస్ పార్టీ రెంజల్ అధ్యక్షుడు మొబీన్ఖాన్, నాయకులు ధనుంజయ్, రాములు, సాయరెడ్డి, నితిన్, పోచయ్య, ఖుద్దూస్, కార్తిక్, జావిద్ తదితరులు పాల్గొన్నారు. నష్టం వివరాలు పక్కాగా సేకరించాలి సహాయక చర్యలు ముమ్మరం చేయాలి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే, కలెక్టర్ -
జనావాసాల మధ్య బార్
● ఇబ్బందుల్లో స్థానికులు ● పట్టించుకోని అధికారులు నిజామాబాద్‌అర్బన్: నగరంలోని ఆర్టీసీ కాలనీలో ఇళ్ల మధ్య ఇటీవల ఓ బార్ ప్రారంభమైంది. దీంతో బార్‌లోని వ్యర్థాలు రోడ్లపై పడేయడంతోపాటు, వంటశాల నుంచి వచ్చే దుర్వాసన, భారీ శబ్ధాలతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బార్‌కు రెండు వైపులా ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. మరోవైపు హనుమాన్ ఆలయం ఉంది. అలాగే చుట్టుపక్కల నివాసాలు ఉన్నాయి. అయినా ఇళ్ల మధ్య బార్‌కు అనుమతి ఎలా ఇస్తారంటూ స్థానికులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులకు చెందిన బంధువు ఈ బార్‌ను ప్రారంభించారు. దీంతో అనుమతులు తేలికగా తీసుకున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు కాలనీవాసులు పేర్కొన్నారు. రుద్రూర్: పోతంగల్ మండలం కారేగాం గ్రామానికి చెందిన పందిరి బుడ్డ చిన్నబోయి (64) అదృశ్యమైనట్లు కోటగిరి ఎస్సై సునీల్ తెలిపారు. ఈనెల 29న రాత్రి అతడు ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయి ఇప్పటి వరకు తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో వారు ఆదివారం కోటగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. -
పెన్షన్ విధానాల రద్దుకు జంగ్ సైరన్
● నేడు నూతన పెన్షన్ విద్రోహదినం ● ధర్నాకు తరలనున్న 5వేల మందిడిచ్పల్లి(నిజామాబాద్‌రూరల్): ఉద్యోగ, ఉపాధ్యాయులకు సరైన ఆర్థిక భద్రత ఇవ్వని సీపీఎస్, యూపీఎస్ పథకాలను రద్దు చేయాలని వేతన జీవులు కోరుతున్నారు. ప్రభుత్వానికి భారం కాని, నయా పైసా ఖర్చు లేని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 15,600 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు సీపీఎస్, యూపీఎస్ విధానంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే సెప్టెంబర్ 1న సీపీఎస్ విద్రోహ దినం సందర్భంగా రాష్ట్రంలో ప్రధాన ఉపాధ్యాయ సంఘమైన పీఆర్టీయూ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ధర్నా చౌక్‌లో మహాధర్నా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి దాదాపుగా 5వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు ఈ మహాధర్నాలో పాల్గొనే అవకాశాలున్నాయి. సీపీఎస్‌ను రద్దు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను పునరుద్ధరించాలి. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. – గజ్జె శ్రీనివాస్, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు -
శోభాయాత్ర రూట్లను సిద్ధం చేయాలి
భారీ గణపతుల నిమజ్జనానికి రూట్ ఇదే..ఆర్మూర్‌టౌన్: గణేశ్ నిమజ్జన శోభాయాత్ర సాగే రహదారులను సిద్ధం చేయాలని సీపీ సాయిచైతన్య అధికారులను ఆదేశించారు. ఆర్మూర్ పట్టణంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను ఆదివారం ఆయన పరిశీలించారు. ప్రధాన రూట్, రహదారి మరమ్మతు పనులు, గూండ్ల చెరువు వద్ద ఉన్న నిమజ్జన ఘాట్లను సందర్శించారు. భక్తుల రాకపోకలు సజావుగా సాగేందుకు బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. శోభాయాత్ర జరిగే సమయంలో ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్ ను కఠినంగా అమలు చేయాలని, కీలక జంక్షన్ల వద్ద ప్రత్యేక బృందాలను మోహరించాలని సూచించారు. ఆయన వెంట ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్, మున్సిపల్ సిబ్బంది శ్రీ చందు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.ఖలీల్‌వాడి: నిజామాబాద్ నగరంలో ఈ నెల 6న నిర్వహించనున్న గణేశ్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా సీపీ సాయిచైతన్య పలు సూచనలు చేశారు. హైటెన్షన్ రైల్వే లైన్ నేపథ్యంలో భారీ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు వెళ్లాల్సిన రూట్లను ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 8 ఫీట్లలోపు విగ్రహాలను నెహ్రూపార్క్, అర్సపల్లి, జాన్కంపేట్, నవీపేట మీదుగా బాసరకు వెళ్లాలి. 8 ఫీట్ల కంటే ఎత్తు ఉన్న విగ్రహాలను ఫూలాంగ్– ఎన్టీఆర్ చౌరస్తా– రైల్వే స్టేషన్– బస్టాండ్– రైల్వే ఓవర్ బ్రిడ్జి–శివాజీ చౌక్– దుబ్బా– జీజీ కాలేజీ చౌరస్తా–బైపాస్ రోడ్డు– డీఎస్ చౌరస్తా– ముబారక్ నగర్– మాణిక్ బండార్– దాస్‌నగర్– మాక్లూర్–నందిపేట్ మండలంలోని ఉమ్మెడ గ్రామంలోని గోదావరి బ్రిడ్జి వద్దకు వెళ్లాలని తెలిపారు. ఇదే రూట్లో నందిపేట నుంచి నవీపేట్ మీదుగా బాసర గోదావరి బ్రిడ్జికి వెళ్లొచ్చని పేర్కొన్నారు. పోలీసులకు సహకరిస్తూ శోభాయాత్ర, నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు. -
వరదలో కొట్టుకువచ్చిన వ్యక్తి మృతదేహం
కామారెడ్డి క్రైం: కామారెడ్డి పెద్ద చెరువు అలుగు ప్రాంతంలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. కామారెడ్డి పెద్ద చెరువు అలుగు ప్రాంతంలోని చెట్ల పొదల్లో ఓ వ్యక్తి మృతదేహంను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ప్యాంటు జేబులో ఉన్న ఆధార్ కార్డు, ఇతర ఆనవాళ్లతో మృతుడిని కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన కరివేపాల బాలరాజు (50)గా గుర్తించారు. నెల క్రితం అతడు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేడు. మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల్లో అతడు గల్లంతై చెరువు వరదలో కొట్టుకుపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రంజిత్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. -
వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే హత్య
● సిర్పూర్లో మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు మద్నూర్(జుక్కల్): తమ వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్న భర్తను ప్రియుడితోకలిసి భార్య హతమార్చిన ఘటన డోంగ్లీ మండలం సిర్పూర్లో చోటుచేసుకుంది. నిందితులను పోలీసులు అరెస్టు చేయగా, మద్నూర్ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం బాన్సువాడ డీఎస్పీ విఠల్‌రెడ్డి, బిచ్కుంద సీఐ రవి, ఎస్సై విజయ్‌కొండ వివరాలు వెల్లడించారు. డోంగ్లీ మండలంలోని సిర్పూర్ గ్రామానికి చెందిన మాగిరి రాములు(35)కు భార్య మాదాబాయి, ముగ్గురు కొడుకులు ఉన్నారు. అతడు చేపలు పడుతూ కుటుంబాన్ని పోషించేవాడు. అగస్టు 23 నుంచి రాములు కనబడకుండపోవడంతో అతడి అక్క లక్ష్మీబాయి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆగస్టు 30న మంజీర నదిలో రాములు మృతదేహం లభ్యమైంది. అదేరోజు సిర్పూర్ గ్రామానికి చెందిన ఉష్కల్వార్ శంకర్, రాములు భార్య మాదాబాయి ఇద్దరు కలిసి బైక్‌పై మద్నూర్ వైపు వస్తుండగా వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులు వారిని విచారించారు. దీంతో రాములును వారే హత్య చేసినట్లు తెలిపారు. మాదాబాయికి శంకర్‌తో వివాహేతర సంబంధం ఉండగా, భర్త అడ్డును తొలగించుకోవాలనుకుంది. ఈక్రమంలో ఆగస్టు 22న రాములుకు శంకర్ ఫుల్లుగా మద్యం తాగించి, సాలూరలోని మంజీర బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ రాములను అతడు కత్తితో పొడిచి, బ్రిడ్జి పైనుంచి మంజీర నదిలో పడేశాడన్నారు. శంకర్, మాదాబాయి ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. -
రూ.7 లక్షలు నష్టపోయా..
12 ఎకరాలలో వరి పంట వేశాను. పచ్చగా పెరగడంతో దిగుబడి బాగానే వస్తుందని ఆశ పడ్డాను. కానీ గోదారమ్మ కోపానికి ఆశలు గల్లంతయ్యాయి. దాదాపు రూ. 7 లక్షల నష్టం వాటిల్లింది. – ఏసప్ప ఈరన్న, రైతు, అల్జాపూర్ విలువైన వస్తువులు పాడయ్యాయి.. గతంలో ఎన్నడూ లేనివిధంగా మా ఊర్లోకి వరద నీరు వచ్చింది. ఇంట్లోని బీరువాలు, టీవీలు, ఫ్రిడ్జీలు పూర్తిగా పాడైపోయాయి. రూ.వేలల్లో నష్టపోయాం. – గంగుబాయి, హంగర్గ, బోధన్ మండలం -
ఉమ్మెడ బ్రిడ్జిపై పర్యాటకుల సందడి
నందిపేట్(ఆర్మూర్): మండలంలోని ఉమ్మెడ బ్రిడ్జి వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. గత వారం రో జులుగా భారీ వర్షాలు కురవడంతో ఎన్నడు లేనివిధంగా గోదావరి నది ఉధృతంగా పరవళ్లు తొక్కు తు ప్రవహిస్తోంది. దీంతో ఆదివారం పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చి ప్రవాహాన్ని తిలకిస్తున్నారు. బ్రిడ్జికి ఆనుకుని ప్రవహిస్తున్న వరద నీరు వద్ద సె ల్ఫీలు తీసుకుని సంబురపడుతున్నారు. కొందరు పర్యాటకులు నీటి అంచుకు వెళ్లి సెల్ఫీలు దిగుతున్నారు. ఈక్రమంలో వరద ఉధృతి పెరిగితే ప్రాణా లకు ప్రమాదం పొంచి ఉందని పలువురు పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి ఉమ్మెడ బ్రిడ్జి వద్ద ప్రమాదాలు జరుగకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. బాల్కొండ: ఎస్సారెస్పీకి ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో వరద గేట్ల ద్వారా గోదావ రిలోకి నీటి విడుదల కొనసాగుతోంది. ఈక్రమంలో ప్రాజెక్టును తిలకించడానికి ఆదివారం పర్యాటకులు భారీగా తరలివచ్చారు. ప్రాజెక్ట్ అందాలను చూసి, సెల్ఫీలు దిగారు. భద్రత కారణాల వల్ల అధికారులు సాయంత్రం వేళ కొంత సమయం మాత్రమే పర్యాటకులను ప్రాజెక్టుపైకి అనుమతి ఇస్తున్నారు. -
పరీవాహక ప్రజలను అప్రమత్తం చేయాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ● ఎస్సారెస్పీ సందర్శనబాల్కొండ: గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టును శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలను అడిగి తెలుసుకున్నారు. గో దావరిలోకి వదులుతున్న నీటిని పరిశీలించారు. అ నంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సారెస్పీలోకి మ హారాష్ట్ర ప్రాంతంలోని గైక్వాడ్, విష్ణుపురి, బాలేగావ్లతోపాటు స్థానిక ఎగువ ప్రాంతాల్లోని నిజాంసాగర్, కౌలాస్‌నాలా, లెండి ప్రాజెక్ట్‌ల నుంచి భారీగా వరద వచ్చి చేరుతుందన్నారు. దీంతో బ్యాక్‌వాటర్ ఏరియాలతోపాటు దిగువన లోతట్టు ప్రాంతాల్లో ఎలాంటి ముంపు తలెత్తకుండా ప్రాజెక్ట్ అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రా జెక్ట్‌లో ప్రస్తుతం 57 టీఎంసీల నీటిని ఉంచుతూ.. వరద గేట్లు, కాలువల ద్వారా 6 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు వెల్లడించారు. ఆయన వెంట ఆర్మూర్ సబ్‌కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, ఎస్ఈ జగదీశ్, ఈఈ చక్రపాణి, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. గంబూసియా చేపపిల్లలను పెంచాలి దోమల నివారణ కోసం గంబూసియా చేపపిల్లల ను అధికంగా పెంచాలని మత్స్యశాఖ అధికారులకు కలెక్టర్ సూచించారు. జాతీయ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రంలో కావాల్సిన పనులు, ఉత్పత్తి చేసిన చేపపిల్లల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మత్స్యశాఖ ఏడీ ఆంజనేయులు, ఎఫ్‌డీవో దామోదర్ ఉన్నారు. -
కదిలిస్తే కన్నీళ్లే !
● భారీ వరదల ప్రభావం నుంచి కోలుకోని బాధితులు ● మూడు రోజుల తర్వాత జీఆర్ కాలనీ, హౌజింగ్బోర్డులకు విద్యుత్ సరఫరా కామారెడ్డి టౌన్: మునుపెన్నడూ లేని విధంగా జిల్లాకేంద్రంలో ఒక్కసారిగా ముంచెత్తిన వరదలు.. పలు కాలనీల ప్రజలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. నాలుగు రోజులు గడిచినా ఆనాటి వరద బీభత్సాన్ని మర్చిపోలేకపోతున్నారు. బాధితులను కదిలిస్తే కన్నీళ్లు సమాధానంగా వస్తున్నాయి. బుధవారం ఉదయం ఒక్కసారిగా వచ్చిన వరదలతో పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ, జీఆర్ కాలనీలు నీట మునిగిన విషయం తెలిసిందే. జీఆర్ కాలనీ, హౌసింగ్‌బోర్డు కౌండిన్య ఎన్క్లేవ్లలో 100కు పైగా ఇళ్లు వరద నీటిలో మునిగిపోయాయి. వరదతో కోలుకోలేని విధంగా దెబ్బతిన్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వదలని బురద జీఆర్ కాలనీ, హౌసింగ్‌బోర్డులోని కౌండిన్య ఎన్క్లేవ్వాసుల కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. వరద తగ్గి మూడు రోజులవుతున్నా ఇంకా బురద కష్టాలు తీరడం లేదు. ఇళ్లలోకి చేరిన బురదను తొలగించడానికి అష్టకష్టాలు పడుతున్నారు. బురదతో తడిసి ముద్దయిన సామగ్రిని అంతా చెత్త కుప్పల్లో వేస్తున్నారు. వరదలో సుమారు 18 కార్లు కొట్టుకుపోయాయి. పాక్షికంగా పలు ఇండ్లు ధ్వంసం అయ్యాయి. ఈ రెండు కాలనీలవాసులు నాలుగు రోజులుగా సరైన తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు. శనివారం స్వచ్ఛంద సంస్థలు భోజనాలు సమకూర్చాయి. విద్యుత్ సరఫరా పునరుద్ధరించినా.. స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మతులు చేసి శనివారం మధ్యాహ్నం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఆదివారం వరకు ఎవరూ స్విచ్‌లను ఆన్ చేయవద్దని విద్యుత్ శాఖ అధికారులు సూచించారు. పక్కింటివాళ్లే ఆదుకున్నారు ఇంట్లోకి ఒక్కసారిగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులం ఇంటిపైకి వెళ్లాం. వర్షంలో కొంత సమయం గడిపాం. పక్కంటి వాళ్ల కిటికిలోంచి వారింటిలోకి వెళ్లి వాళ్ల వద్ద క్షేమంగా ఉన్నాం. వాళ్లే మాకు తిండి పెట్టారు. విలువైన సర్టిఫికెట్లు, సామాన్లు అన్నీ తడిసిపోయాయి. – రమేశ్, జీఆర్ కాలనీవాసి -
పంటలను ముంచిన గోదావరి!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలోని సిరికొండ, ధర్పల్లి మండలాల్లో కురిసిన భారీ వర్షం, బోధన్ డివిజన్లో ఉధృతంగా ప్రవహించిన మంజీర నది, శ్రీరాంసాగర్ బ్యాక్‌వాటర్ బోధన్, సాలూరా, రెంజల్ మండలాల్లోని పలు గ్రామాలను నీట ముంచాయి. జిల్లా వ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారం 48,429 ఎకరాల్లో పంటలు దెబ్బతిని అన్నదాతలు నష్టపోయారు. ఇందులో 1,026 ఎకరాల పంట భూముల్లో ఇసుక మేటలు వేశాయి. శ్రీరాంసాగర్ జలాశయంలోకి ప్రస్తుతం 5,40,000 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, 38 గేట్ల ద్వారా 4,50,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ● బోధన్ రెవెన్యూ డివిజన్లో మంజీర నది ఉధృతి తగ్గినప్పటికీ నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. మంజీర ఉధృతికి రెండు రోజులపాటు జల దిగ్బంధంలో చిక్కిన సాలూర మండలంలోని మందర్నా, హున్సా, ఖాజాపూర్ గ్రామాల నుంచి వరద నీరు బయటకు వెళ్లిపోయింది. సాలూర–ఖాజాపూర్, ఖాజాపూర్–హున్సా గ్రామాల మధ్య రాకపోకలు మొదలయ్యాయి. హున్సా, మందర్నా గ్రామాల మధ్య వాగు వంతెన మీదుగా పారుతోంది. సాలూ ర మండలంలోని మందర్నా, హున్సా, ఖాజాపూర్, తగ్గేల్లి, సాలూర గ్రామాల శివార్లలో మంజీర నది, ఇతర వాగుల వరదతో సోయా, వరి, అరటి, బొప్పాయి, కూరగాయల పంటలు మునిగిపోయా యి. శనివారం వరద తగ్గడంతో స్వల్పంగా పంట లు తేలాయి. బోధన్ మండలంలోని హంగర్గ గ్రా మంలో శ్రీరాంసాగర్ బ్యాక్‌వాటర్ నిలకడగా ఉంది. హంగర్గ, కోపర్గ, బిక్నెల్లి, ఖండ్గామ్ గ్రామాల శివార్లలో సోయా, వరి పంటలు నీట మునిగాయి. ● రెంజల్ మండలంలోని గోదావరి వరదతో కందకుర్తి, నీల, తాడ్‌బిలోలి, బోర్గం గ్రామాల శివార్లలో సోయా, వరి, పత్తి పంటలు నీటమునిగాయి. న వీపేట మండలంలోని గోదావరి పరీవాహక ప్రాంతాలైన యంచ, కోస్లీ, అల్జాపూర్, నాలేశ్వరం, తుంగిని, నందిగామ శివార్లలో పంటలు దెబ్బతిన్నాయి. పోతంగల్ మండలంలోని మంజీర తీరాన ఉన్న హెగ్డోలి, కల్లూరు, సుంకిని, హంగర్గ, కారేగాం, పొతంగల్ గ్రామాల శివారుల్లో సో యా, వరి పంటలు నీటమునిగాయి. ఇక సాలూర మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం నుంచి ఖాజాపూర్, హున్సా గ్రామస్తులు తిరిగి ఇళ్లకు చేరుకున్నారు. ● ధర్పల్లి మండలంలోని హొన్నాజిపేట ముత్యాల చెరువు కట్ట తెగిపోవడంతో భారీ నష్టం వాటిల్లింది. ముత్యాలవాగు వరద ప్రవాహంతో దిగువన ఉన్న బీరప్పతండా, వాడి గ్రామస్తులు తీవ్రంగా నష్టపోయారు. పంట భూములు కోతకు గురయ్యాయి. ఇసుక మేటలు వే శాయి. వాడి గ్రామం ముంపునకు గురికావడంతో 20 కుటుంబాలు సర్వం కోల్పోయాయి. ఇళ్లలోకి వరద రావడంతో నిత్యావసరా లు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు, ఇతర సామగ్రి పూర్తిగా బురదమయమై పనికిరాకుండా పోయాయి. శనివారం ఉదయం నుంచి వాడి గ్రామంలో వరద బాధితులు తమ ఇళ్లలోని బురదను శుభ్రపరుచుకునే పనిలో నిమగ్నమయ్యారు. విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో రెండు రోజుల అనంతరం శుక్రవారం సాయంత్రం ట్రాన్స్‌కో సిబ్బంది విద్యుత్ పునరుద్ధరణ చేశారు. సిరికొండ మండలం కొండూర్‌లో తడిసిన బియ్యం సంచులు ఇళ్లు కోల్పోయి..సిరికొండ మండలంలో కప్పలవాగు ఉప్పొంగడంతో కొండూరు గ్రామం అతలాకుతలమైంది. గ్రామంలోకి ఆకస్మికంగా వరద పోటెత్తడంతో గ్రామస్తులు కట్టుబట్టలతో ఊరి నుంచి బయటకు వచ్చి పునరావాస కేంద్రంలో తలదాచుకున్నారు. వరద ప్రవాహానికి గ్రామంలో 10 ఇళ్లు కూలిపోయాయి. 50 కుటుంబాలకు చెందిన ఆ ధార్, రేషన్ కార్డులు, వంట సామగ్రి, బియ్యం, బట్టలు, ఇతర నిత్యావసరాలు కొట్టుకుపోయా యి. 200 ఇళ్లల్లోకి భారీగా బురద చేరింది. గ్రామస్తులు గత రెండు రోజులుగా పేరుకుపోయిన బురదను శుభ్రం చేసుకుంటున్నారు. బాల్కొండ: శ్రీరాంసాగర్ జలాశయంలోకి వచ్చిన భారీ వరద దిగువన గోదావరి పరీవాహక ప్రాంత రైతుల పాలిట శాపంగా మారింది. గోదావరిలోకి 5.5 లక్షల క్యూసెక్కుల నీటిని వదలడంతో మెండోరా మండలం దూదిగాం, చాకీర్యాల్, కోడిచర్ల, సావెల్ గ్రామాల్లో సుమారు 400 ఎకరాల వరకు నీట మునిగింది. శుక్రవారం సాయంత్రం గోదావరిలోకి నీటి విడుదల పెంచగానే ఒక్కసారిగా ప్రవాహం పెరిగి దూదిగాంలో మొక్కజొన్న, సోయా, చాకీర్యాల్ వరి పంటల్లోకి నీరు చేరింది. పంటలు నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. -
షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం
సిరికొండ: మండలంలోని ముషీర్‌నగర్ గ్రామంలో ఉప్పారం మల్లయ్య ఇంట్లో షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించినట్లు తహసీల్దార్ రవీందర్రావు శనివారం తెలిపారు. ప్రమాదంలో ఇంట్లో ఉన్న రూ. లక్ష అరవై వేల నగదు, ఐదు సెల్ఫోన్లు, నిత్యావసర సరుకులు, దుస్తులు, ఇతర సామగ్రి పూర్తిగా కాలిపోయినట్లు తెలిపారు. ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు తెలిపారు. ప్రమాదస్థలాన్ని ఎమ్మారై గంగరాజం సందర్శించి పంచనామా నిర్వహించారు. ప్రమాదంలో నాలుగు లక్షల పది వేల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని తహసీల్దార్ తెలిపారు. పేకాడుతున్న ఆరుగురి అరెస్టు బాన్సువాడ: బీర్కూర్‌లోని కాలబజార్ గల్లీలో పేకాడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై రాజశేఖర్ శనివారం తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు గల్లీలోని పేకాట స్థావరంపై దాడి చేసి, వారిని పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.3080 నగదు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. -
మాటలకందని విషాదం
● వరదలతో ఇళ్లు దెబ్బతిని సర్వం కోల్పోయిన పలువురు ● కట్టుబట్టలే మిగిలిన వైనం సిరికొండ: మండలంలోని కొండూర్ గ్రామంలో వరద సృష్టించిన బీభత్సంతో మాటలకందని విషాదం నెలకొంది. వరద కారణంగా పది వరకు ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి. మరో ఇరవై అయిదు ఇళ్లు శిథిలావస్థకు చేరాయి. 190 ఇళ్లలోని సామగ్రి, ఎలక్ట్రానిక్ పరికరాలు పూర్తిగా తడిచిపోయాయి. క్వింటాళ్ల కొద్ది బియ్యం తడిసిపోవడంతో వాగులో పడేసినట్లు గ్రామస్తులు తెలిపారు. వరద ఒక్కసారిగా రావడంతో వాగు సమీపంలో ఉన్న వారందరు కట్టుబట్టలతో సురక్షిత ప్రదేశానికి తరలివెళ్లారు. బంగడి బాబయ్య అనే వ్యక్తి ఇల్లు అడుగు భాగం పూర్తిగా కొట్టుకుపోయింది. ఇంట్లోని సామగ్రి, విలువైన పత్రాలు సైతం వాగులో కొట్టుకుపోయాయని బాధితుడు వాపోయాడు. ఇళ్లలో బురద, చెత్త నిండిపోవడంతో గ్రామస్తులు శనివారం కూడా ఇళ్లను, సామగ్రిని శుభ్రం చేసుకుంటూనే ఉన్నారు. వరదతో ఇబ్బందులకు గురైన వారిని పరామర్శించేందుకు బంధువులు తరలివస్తుండగా, వారిని ఓదారుస్తు బంధువులు రోదించడం గ్రామస్తులను కలచివేస్తోంది. రెంజల్(బోధన్): 42 సంవత్సరాల తర్వాత గోదావరి నది పోటెత్తడంతో రెంజల్ మండలం కందకుర్తి గ్రామంలోని ఇందిరమ్మ కాలనీ పూర్తిగా నీట మునిగింది. వరద ఉధృతి పెరగడంతో శుక్రవారం రాత్రి నుంచి కాలనీవాసులు జాగారం చేయాల్సి వచ్చింది. అధికారులు పలువురిని పునరావాస కేంద్రాలకు బలవంతంగా తరలించారు. శనివారం పునరావాస కేంద్రాల నుంచి బాధితులు ఇళ్లకు చేరుకుని నీటిని తొలగిస్తున్నారు. ఇళ్ల ముందు నీరు వెళ్లే దారి లేకపోవడంతో మరికొందరు గ్రామంలోని బంధువుల ఇళ్లకు చేరుకున్నారు. కూలిన ఇంట్లోంచి సామగ్రిని తీస్తున్న బాధితులు వరద నీరు ఇంటి ముందు చెరువును తలపిస్తోంది. ఇంట్లోకి చేరడంతో నిత్యావసర వ స్తువులు, బట్టలు పూర్తిగా తడి సి ముద్దయ్యాయి. తినేందుకు తిప్పలు పడాల్సి వస్తుంది. రాత్రి పునరావాస కేంద్రానికి తీసుకువెళ్లారు. శనివారం ఇంటికి చేరుకుని కుటుంబం మొత్తం నీటిని తొలగించేందుకు తంటాలు పడుతున్నాం. ఇంట్లోని నీటిని తొలగించినా ఇంటి ముందు చేరిన నీరు మరో రెండు రోజుల వరకు వెళ్లే పరిస్థితి లేదు. అప్పటి వరకు ఇంట్లోలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. –ఆల్తాఫ్, కందకుర్తి -
హంగర్గలో తగ్గుతున్న నీటి ఉధృతి
బోధన్‌రూరల్: మండలంలోని హంగర్గ గ్రామంలో శ్రీరాంసాగర్ బ్యాక్‌వాటర్ నీటి ఉధృతి తగ్గుముఖం పట్టింది. శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్, మంజీర నదిలో వరద ప్రవాహం ఎక్కువవడంతో రెండు రోజులపాటు హంగర్గ గ్రామం జల దిగ్భందంలో చిక్కుకుంది. ప్రాజెక్టు గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుండటంతో శనివారం సాయంత్రానికి గ్రామంలో ముంపు ప్రభావం తగ్గింది. ఇటీవల ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహయంతో గ్రామంలోని ముంపు ప్రాంతం నుంచి 376 మంది గ్రామస్తులను, 30కుపైగా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తహసీల్దార్ విఠల్ తెలిపారు. వర్షం కురవకపోతే ఆదివారం సాయంత్రానికి గ్రామంలో ముంపు ప్రభావం పూర్తిగా తగ్గే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. 3వేల ఎకరాల్లో నీటమునిగిన పంటలు శ్రీరాంసాగర్ బ్యాక్‌వాటర్, మంజీర నది ఉధృతితో హంగర్గతోపాటు ఖండ్గావ్, బిక్‌నెల్లీ, సిద్ధాపూర్, కల్దుర్కి శివారులోకి భారీగా వరదనీరు చేరడంతో పంటలు నీట మునిగాయి. మంజీర తీర గ్రామాల్లో సుమారు 3వేల ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు వ్యవసాయ అధికారులు అంచనవేశారు. అత్యధికంగా సోయా పంట దెబ్బతింది. అడిషనల్ కలెక్టర్ పర్యటన.. హంగర్గ గ్రామంలో అడిషనల్ కలెక్టర్ అంకిత్ కుమార్ శనివారం స్థానిక అధికారులతో కలిసి పర్యటించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పడవలో ప్రయాణించి గ్రామంలో పరిస్థితులను సమీక్షించారు. టెయినీ ఐఏఎస్ చింగ్తియాన్ మావీ, బోధన్ తహసీల్దార్ విఠల్ తదితరులు ఉన్నారు. -
ఎస్సారెస్పీకి మళ్లీ పోటెత్తిన వరద
● ఇన్‌ఫ్లో 5.4 లక్షల క్యూసెక్కులు రావడం ఈ ఏడాదిలో తొలిసారి ● కొనసాగుతున్న నీటి విడుదలబాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతుండటంతో ప్రాజెక్టు అధికారులు వరద గేట్ల ద్వారా గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. శుక్రవారం రాత్రికి ప్రాజెక్ట్‌లోకి 5లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో పెరగడంతో గోదావరిలోకి నీటి విడుదలను 5.75 లక్షల క్యూసెక్కులకు పెంచారు. శనివారం మధ్యాహ్నం వరకు అంతే స్థాయిలో నీటి విడుదల కొనసాగింది. రాత్రి కి వరద నీరు మళ్లీ పోటెత్తింది. రాత్రి 8 గంటలకు 5 లక్షల 10వేల క్యూసెక్కులకు పెరుగగా, రాత్రి 9 గంటలకు ఏకంగా 5.4లక్షలకు పెరిగింది. ప్రస్తుత సంవత్సరం గరిష్టంగా 5.4 లక్షల క్యూసెక్కుల నీరు రావడం ఇదే తొలిసారి. కానీ గోదావరిలోకి నీటి విడుదలను ప్రాజెక్ట్ అధికారులు తగ్గించారు. 38 వరద గేట్ల ద్వారా 4.5 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్ట్ నీటి మట్టం పెంచుట కోసం నీటి విడుదలను తగ్గించారు. వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 165 టీఎంసీలు గంగపాలు.. ప్రాజెక్ట్ నుంచి గోదావరిలోకి ఈ నెల 18 నుంచి నీటి విడుదల చేపట్టారు. శనివారం సాయంత్రం వరకు 165 టీఎంసీల నీటిని వదిలినట్లు ప్రాజెక్ట్ అధికారుల రికార్డులు తెలుపుతున్నాయి. గడిచిన మూడు రోజుల వ్యవధిలోనే 110 టీఎంసీల నీటిని వదిలారు. ఇప్పటికీ ప్రాజెక్ట్‌లోకి వరద నీరు కొనసాగుతుంది. అలాగే ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వారా నీటి విడుదలను 12 వేల క్యూసెక్కుల నుంచి 16 వేల క్యూసెక్కులకు పెంచారు. కాకతీయ కాలువ ద్వారా 3వేల క్యూసెక్కులు, ఎస్కెప్ గేట్ల ద్వారా 5వేల క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 636 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) కాగా శనివారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1084.40(58.04 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు పేర్కొన్నారు. -
గుండెపోటుతో ట్రాక్టర్ డ్రైవర్ మృతి
బీబీపేట: బీబీపేట పెద్ద చెరువుకు పడ్డ బుంగను పూడ్చడానికి ట్రాక్టర్‌పై బయలుదేరిన డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఉప్పర్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై ప్రభాకర్ తెలిపిన వివరాలు ఇలా.. బీబీపేట పెద్ద చెరువు కట్టకు బుంగ పడడంతో ఉప్పర్‌పల్లి గ్రామానికి చెందిన మన్నె రమేష్ తన ట్రాక్టర్ ద్వారా మట్టిని గత మూడు రోజులుగా తీసుకెళ్తున్నాడు. శనివారం మట్టిని తరలించే క్రమంలో అకస్మాత్తుగా గుండెలో నొప్పి రావడంతో స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అతడు మృతి చెందినట్లుగా తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య మణెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ ఒకరు.. ఇందల్వాయి: ఇటీవల విద్యుత్ షాక్‌తో తీవ్రంగా గాయపడిన జీపీ కార్మికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై సందీప్ తెలిపిన వివరాలు ఇలా.. ఇందల్వాయి తండాకు చెందిన జీపీ కార్మికుడు ఎడపల్లి చిన్న సాయిలు(41) వారం రోజుల క్రితం విద్యుత్ వీధి దీపాలను అమర్చుతుండగా కరెంట్ షాక్‌కు గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు చికిత్స నిమిత్తం ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. అక్క చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. సాయిలు మృతికి పంచాయతీ కార్యదర్శి, కారోబార్ కారణమని పలువురు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. విద్యుత్ షాక్‌తో గేదె.. బీబీపేట: మండలంలోని యాడారం గ్రామంలో కాటేం శ్రీనివాస్‌కు చెందిన గేదె శనివారం సమీపంలోని పొలాల్లో విద్యుత్ షాక్‌తో మృతి చెందింది. ఘటన స్థలాన్ని పశు వైద్యాధికారి శివకుమార్, విద్యుత్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. గేదె విలువ రూ. లక్ష వరకు ఉంటుందని, ప్రభుత్వం తమకు నష్టపరిహారం అందించాలని బాధితుడు కోరాడు. -
రెండు రోజులుగా వరదలోనే పంటలు
బోధన్: మంజీర నది పరీవాహక ప్రాంత రైతులను భారీ వర్షం, వరదలు అపార నష్టాలపాలు చేశాయి. రైతుల కష్టం, పెట్టిన పెట్టుబడి నీట మునిగాయి. సాలూర మండలంలోని మంద ర్నా, హున్సా, ఖాజాపూర్, సాలూర, తగ్గేల్లి గ్రా మాల శివారులో వేలాది ఎకరాల సోయా, వరి, అరటి, బొప్పాయి, కూరగాయాలు, ఆకుకూర లు రెండు రోజులుగా వరద నీటిలోనే ఉన్నా యి. శనివారం మంజీర నది, వాగులకు వరద తగ్గుముఖం పట్టడంతో స్వల్ప విస్తీర్ణంలోని పంటలు తేలాయి. నీట మునిగిన పొలాలను చూసి రైతు లు లబోదిబోమంటున్నారు. ఆదివారం సా యంత్రం వరకు వరద నీరు తగ్గే అవకాశాలున్నా యి. వ్యవసాయ శాఖ అధికారుల ప్రాథమిక అంచనాల కన్నా ఎక్కువ విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి. దెబ్బతిన్న పంటల పరిశీలన సాలూర మండలంలోని తగ్గెల్లి గ్రామ శివారులో వరద కారణంగా నీటమునిగిన వరి, సోయా పంటలను బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు వడ్డీ మోహన్‌రెడ్డి, మండల నాయకులతో కలిసి పర్యటించి పరిశీలించారు. ప్రభుత్వం సర్వే చేసి రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. మందర్నా గ్రామంలో దెబ్బతిన్న పంటలు, రోడ్లను కాంగ్రెస్ శ్రేణులు, అధికారులు పర్యటించి పరిశీలించారు. సాలూర పీహెచ్సీ, హున్సా హెల్త్ సబ్ సెంటర్ వైద్య సిబ్బంది గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. -
ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సేవలు భేష్
● వరద విపత్తులో సాహసోపేతమైన కృషిని కనబర్చాయి ● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సుభాష్‌నగర్: భారీ వర్షాలతో వరద ప్రభావానికి లోనైన ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అందించిన సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. ఆయా బృందాలను శనివారం ఆయన అభినందించారు. జాతీయ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాలు కనబరచిన తెగువ, కృషి కారణంగా జిల్లాలో ఎక్కడ కూడా ప్రాణనష్టం వంటి సంఘటనలు చోటుచేసుకోకుండా నివారించామన్నారు. జల దిగ్బంధంలో చిక్కుకుపోయిన ఆ యా గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో విపత్తు ప్రతిస్పందన దళాలు సాహసోపేతమైన కృషిని కనబర్చాయన్నారు. బోధన్ మండలం హంగర్గలో వరదల్లో చిక్కుకున్న సుమారు 480 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ చేశాయని అన్నారు. అదేవిధంగా రెంజల్ మండలం కందకుర్తి వద్ద సీతారాం త్యాగి మహారాజ్ ఆశ్రమంలో వరదలలో చిక్కుకున్న 8 మందిని విపత్తు సహాయక సభ్యులు ప్రాణాలకు తెగించి కాపాడారని, ఆశ్రమంలోని మూగ జీవాలకు కూడా అవసరమైన మేత, నీటి వసతిని సమకూర్చారని కలెక్టర్ వివరించారు. సాలూర మండలంలోని మందర్న, హున్సా, ఖాజాపూర్ గ్రామాల్లో జలదిగ్బంధంలో చిక్కుకున్న 120 మందిని బోట్ల ద్వారా ఎస్డీఆర్ఎఫ్, 7వ పోలీస్ బెటాలియన్ బృందాలు రక్షించాయని తెలిపారు. ముత్యాల చెరువు తెగడంతో ధర్పల్లి మండలం వాడి గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టగా, ఎస్డీఆర్ఎఫ్ బృందం హుటాహుటిన చేరుకొని సహాయక చర్యలు కొనసాగించిందని తెలిపారు. ఇదే రీతిలో జిల్లాలోని వివిధ ప్రాంతాలలో వరదలలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు చేరవేసేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కృషిచేశాయని తెలిపారు. రెంజల్(బోధన్): మండలంలోని కందకుర్తి పుష్కరక్షేత్రంలోగల సీతారాం మహరాజ్ త్యాగి ఆశ్రమానికి శనివారం స్థానికులతో కలిసి ఎస్డీఆర్ఎఫ్ బృందం చేరుకుంది. ఆశ్రమం చుట్టూ వరద నీరు చేరడంతో మూడు రోజుల కిందట ఆశ్రమంలోని మహారాజ్ శిష్యులు, భక్తులను ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వారిని సురక్షితంగా గ్రామానికి తరలించారు. ఆశ్రమంలోని 20 గోవులను మేడపైకి చేర్చారు. మూడు రోజులుగా ఆశ్రమంలోని గోవులకు తాగునీరు, మే త లేకపోవడంతో భక్తులతో కలిసి ఎస్‌డీఆర్‌ఎ ఫ్ బృందాలు మేత, తాగు నీరు అందించింది. -
10 వేల కోళ్లు మృతి
దోమకొండ: మండలంలోని గొట్టుముక్కల గ్రామ శివారులో 10వేల కోళ్లు భారీ వర్షానికి మృతిచెందాయి. గ్రామానికి చెందిన గన్నమనేని పద్మకు ఎడ్లకట్ట వాగు సమీపంలో కోళ్లఫారాలు ఉన్నాయి. గత మూడు రోజులగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎడ్లకట్ట వాగు సమీపంలోని పంట పొలాల నుంచి నీరు ప్రవహించడంతో కోళ్లఫారాలు మునిగిపోయాయి. శనివారం వరద ఉధృతి తగ్గడంతో కోళ్లఫారాల యజమానులు అక్కడికి వెళ్లి చూడగా, అందులో ఉన్న పదివేల కోళ్లు బురదమట్టిలో కూరుకుపోయి చనిపోయి ఉన్నాయి. వెంటనే విషయాన్ని రెవెన్యూ, వెటర్నరీ అధికారులకు తెలియజేశారు. ఆర్ఐ శ్రీనివాస్, వెటర్నరీ డాక్టర్ శివ అక్కడికి చేరుకుని పంచమానా చేశారు. దాదాపు రూ. 6లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితురాలు పద్మ తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఆమె కోరారు. -
ఎకరానికి రూ. 25వేల నష్టపరిహారం ఇవ్వాలి
వేల్పూర్: బాల్కొండ నియోజకవర్గంలో వరదల వ ల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 25వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని బా ల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేల్పూర్, భీమ్‌గల్ మండలాల్లో వరద ఉధృతికి దెబ్బతిన్న పంటలను, రహదారుల ను శుక్రవారం ఆయన సంబంధిత అధికారులు, నా యకులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. ప్రాథమిక లెక్కల ప్రకారం 1162 ఎకరాల్లో వరి, 95 ఎకరాల్లో మొక్కజొన్న, 35 ఎకరాల్లో సోయాబిన్ పంట దెబ్బతిందని అధికారులు చెప్పారన్నారు. మరొక్కసారి పంటనష్టంపై క్షేత్రస్థాయిలో పూర్తి వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదించాలని అధికారులకు సూచించారు. అ లాగే రోడ్లు, వంతెనల మరమ్మతులకు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపాలన్నారు. తాను సైతం మంత్రులకు నివేదించి పనులు త్వరగా పూర్తయ్యేలా కృషి చేస్తానని చెప్పారు. ప్రజలెవరూ నీటి ప్రవాహాల వద్దకు వెళ్లవద్దని, స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. -
జిల్లాలోనే డొంకేశ్వర్ టాప్!
డొంకేశ్వర్(ఆర్మూర్): ఈ ఏడాది వానాకాలం సీజన్ లో ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో డొంకేశ్వర్ మండలంలో అత్యధిక వర్షపాతం రికార్డయింది. వర్షాకాలంలో సెప్టెంబర్ నెల కలుపుకొని డొంకేశ్వర్ మండలంలో 62 సెంటీ మీటర్ల వర్షం కురవా ల్సి ఉండగా, ఇప్పటి దాకా 97 సెంటీ మీటర్లు కురి సింది. అంటే కురవాల్సిన దాని కంటే 35 సెంటీ మీ టర్లు ఎక్కువగా నమోదైంది. ఇది జిల్లాలోనే అత్యధిక వర్షపాతం కాగా, జిల్లా సగటు కంటే ఎక్కువ. మూడు రోజుల్లోనే 19 సెం.మీ.. గడిచిన మూడు రోజుల్లోనే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలో 19 సెంటీ మీటర్ల వర్షపాతం రికార్డు కావడం గమనార్హం. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్‌లో వరద నీరు పెరగడంతో శివారు ప్రాంతాల్లో వేసిన పంట పొలాలు కొన్ని నీట మునిగాయి. మండలంలోని గ్రామాలన్నీ చాలా సంవత్సరాల క్రితమే ఎస్సారెస్పీ ముంపు నుంచి లేచి వచ్చి దూరంగా ఎత్తయిన ప్రాంతాలకు వచ్చాయి. తద్వారా ఎంతటి భారీ వర్షాలు వచ్చినా వరద ముప్పు నుంచి తప్పించుకుంటున్నాయి. రోడ్లకూ ఎలాంటి నష్టం జరగడం లేదు. ● వర్షాకాలంలో ఇప్పటి వరకు 97 సెంటీ మీటర్లు వర్షపాతం నమోదు -
ఆగం చేసిన పెద్దవాగు
బాల్కొండ: బాల్కొండ నియోజకవర్గంలో ప్రవ హించే పెద్దవాగు వరద అన్నదాతలను ఆగం చేసింది. గురువారం మధ్యాహ్నం నుంచి క్రమంగా పెరిగిన పెద్దవాగు సాయంత్రానికి ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. దీంతో పక్కన ఉన్న పంటలు నీట మునిగాయి. పసుపు పంటను ఆరబెట్టేందుకు తయారు చేసుకున్న కళ్లాలు కొట్టుకుపోయాయి. పసుపు ఉడికించేందుకు పెట్టిన కట్టెల కుప్పలు నీటి ప్రవాహానికి పెద్దవాగులో కలిసిపోయాయి. కట్టెల కోసం రైతులు శుక్రవారం ఉదయం నుంచి పెద్దవాగు పక్కన వెతకడం ప్రారంభించారు. ముప్కాల్ మండలం వెంచిర్యాల్, మెండోరా మండలం వెల్కటూర్‌లో రైతులకు భారీగా నష్టం జరిగింది. -
పర్యాటకులకు అనుమతి నిరాకరణ?
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సందర్శనకు వచ్చే పర్యాటకులకు పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు. వారిని పోచంపాడ్‌లోని జాతీయ రహదారి 44 వద్దనే అడ్డుకుంటున్నారు. ప్రాజెక్ట్ సందర్శనకు పర్యాటకులు రావద్దని, పోలీసులకు సహకరించాలని మెండోరా ఎస్సై జాదవ్ సుహాసిని శుక్రవారం కోరారు. ప్రాజెక్ట్‌లోకి భారీ వరద రావడంతో ప్రాజెక్ట్ నుంచి 5 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. దీంతో ప్రమాదాలు సంభవించకుండ పర్యాటకులను జాతీయ రహదారి వద్దనే అడ్డుకుంటున్నారు. దీంతో పర్యాటకులు జాతీయ రహదారి 44పై సోన్ వంతెన వద్దకు వెళ్లి గోదావరి జలాలను తిలకిస్తు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
గోదావరి పరీవాహక ప్రాంతాల పరిశీలన
నవీపేట: గోదావరి నది పరీవాహక ప్రాంతాలైన మండలంలోని కోస్లీ, మిట్టాపూర్, యంచ, అల్జాపూర్ గ్రామాలను అడిషనల్ కలెక్టర్ అంకిత్ శుక్రవారం పరిశీలించారు. యంచ వద్ద గోదావరి నదిలో ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద ఉధృతిని పరిశీలించారు. నీట మునిగిన పంటలతోపాటు రహదారిపై ఏర్పడిన గుంతలను పరిశీలించారు. పూర్తిగా వరద నీటితో మునిగిన అల్జాపూర్ రహదారిని పరిశీలించారు. ముంపు ప్రాంతాల వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఎంపీడీవో నాగనాథ్, తహసీల్దార్ వెంకటరమణ, ఏవో నవీన్‌కుమార్, ఏఈలు తదితరులు ఉన్నారు. -
పులాంగ్ బ్రిడ్జి మూసివేత
నిజామాబాద్ సిటీ: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. శుక్రవారం నగరంలోని వినాయక్‌నగర్‌లోని వంద ఫీట్ల రోడ్డు నుంచి గాయత్రినగర్‌కు వెళ్లే పులాంగ్ వాగు మీది నుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో ఈ బ్రిడ్జిని మున్సిపల్ అధికారులు మూసివేశారు. ఇక సీసీల బదిలీలు డొంకేశ్వర్(ఆర్మూర్): పేదరిక నిర్మూలన సంస్థ ‘సెర్ప్’లో ఉద్యోగ బదిలీలు చివరి దశకు చేరుకున్నాయి. డీపీఎంలు, ఏపీఎంలకు బదిలీలు పూర్తి కాగా, ఇప్పుడు క్లస్టర్ కో–ఆర్డినేటర్ల (సీసీలు) వంతు వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర సెర్ప్ శాఖ నుంచి ఉత్తర్వులు రాగా, సీనియారిటీ జాబితా జిల్లాకు చేరింది. వాస్తవానికి శుక్రవారమే బదిలీ కౌన్సెలింగ్ జరగాల్సి ఉండగా, వర్షాల కారణంగా శనివారానికి వాయి దా వేశారు. మొత్తం 145 మంది సీసీలకు కలెక్టరేట్లో శనివారం కౌన్సెలింగ్ చేపట్టి బదిలీలకు ఉత్తర్వులు జారీ చేయనున్నారు. విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి నిజామాబాద్‌నాగారం: ఽహాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్‌ను స్పూర్తిగా తీసుకొని విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలని డీవైఎస్వో పవన్‌కుమార్ అన్నారు. నగరంలోని డీవైఎస్వో కార్యాలయంలో శుక్రవారం ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా ధ్యాన్‌చంద్ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం డీవైఎస్వో మాట్లాడుతూ.. యువతను, బాలబాలికలను మైదానాలకు తీసుకురావాల్సిన గురుతరమైన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందన్నారు. చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. అలాగే క్రీడాకారులకు స్నేహపూర్వకమైన హాకీ టోర్నమెంట్ నిర్వహించారు. జిల్లా సైక్లింగ్ సంఘం ఆధ్వర్యంలో సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు నగరంలో విద్యార్థులతో సైకిల్ ర్యాలీని నిర్వహించారు. రిటైర్డు డీవైఎస్వో ముత్తెన్న, సిబ్బంది సురేష్, గంగాదాస్, చంద్రశేఖర్, శేఖర్, సత్యనారాయణ, రాష్ట్ర సైకిల్ సంఘం ప్రధాన కార్యదర్శి విజయ్ కాంత్, రవి పబ్లిక్ స్కూల్ పాఠశాల చైర్మన్ సరళ మహేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ శ్యామ్ కుమార్, శ్రీకాంత్ సైకిలింగ్ సంఘం సభ్యులు దుర్గ మల్లేష్ ,ప్రభాకర్, ఆర్ నరేష్ కుమార్ , మురళి రాహుల్ పాల్గొన్నారు. -
చెరువులను తలపిస్తోన్న పొలాలు
● పొంగి పొర్లుతున్న వాగులు ● దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు రుద్రూర్/వర్ని/రెంజల్/నందిపేట్/నవీపేట/బాల్కొండ/బోధన్‌రూరల్ : గత రెండు మూడు రోజులుగా కురిసిన వర్షానికి పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. వాగులు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు నిండి మిగులు జలాలు అలుగుల ద్వారా ప్రవహిస్తున్నాయి. పాత ఇళ్లు దెబ్బతిన్నాయి. పో తంగల్ మండలంలోని మంజీర నది సమీపంలో పంట నష్టం భారీగా జరిగింది. మంజీర వరద సుంకిని గ్రామ ఇళ్లలోకి రావడంతో గ్రామస్తులు భ యాందోళనకు గురయ్యారు. రెవెన్యూ అధికారులు గ్రామాన్ని సందర్శించి వరద పరిస్థితిని సమీక్షించారు. కోటగిరిలో105 మి.మీ. పోతంగల్లో 86 మి.మీ. వర్షపాతం నమోదైంది. వ్యవసాయాధికారుల లెక్కల ప్రకారం రెంజల్ మండలంలో 6020 ఎకరాల్లో సోయా, వరి పంటలు నీట మునిగినట్లు నివేదిక పంపారు. కనీసం 8000 వేల ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు రైతులు పేర్కొంటున్నారు. గోదావరి, మంజీర నదుల పరివాహక గ్రామాలతో పాటు వాగులు, వంతెనల కింది రెంజల్ మండలంలోని కందకుర్తి, నీలా, పేపర్‌మిల్, బోర్గాం, తాడ్‌బిలోలి గ్రామాల్లో కనుచూపు మేరలో వేసిన పంటలు నీట మునిగాయి. నవీపేట మండలంలోని గోదావరి నది పరివాహక ప్రాంతాలైన కోస్లీ, మిట్టా పూర్, యంచ, అల్జాపూర్, నందిగామ, బినోల, తుంగిని, నాళేశ్వర్ గ్రామాలలోని 5 వేల ఎకరాలు పూర్తిగా నీటమునిగాయి. అల్జాపూర్–యంచ, నందిగామ–బినోల రహదారులపై నీరు నిలవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి వర్ని మండలంలో రోడ్లు తెగిపోగా వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. పాత వర్ని, సైదిపూర్, శంకోరా, పైడిమల్ జలాల్పూర్, వెంకటేశ్వర క్యాంపు, చందూరు ,గోవురు తదితర గ్రామాల శివారులో వరదధాటికి పంట పొలాలు నష్టపోయాయి. పాత వర్ని నెహ్రూ నగర్ రోడ్డు వరదలకు కొట్టుకుపోయింది. రాజీపేట్ చెరువుకు గండి పడింది. దీంతో ఆయ కట్టు కింద సుమారు 200 ఎకరాల్లో పంట నష్టం ఏర్పడింది. నందిపేట పాలిటెక్నిక్ కళాశాల జలమయమైంది.కళాశాల, హస్టల్ భవనాల చుట్ట్టూ నీరు చేరి లోనికి వెళ్లేందుకు వీలు లేకుండా ఉంది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ప్రవహించే పెద్ద వాగులో వరద ఉధ్రుతి తగ్గింది. పెద్ద వాగు నీరు ఏర్గట్ల మండలం తడ్పాకల్ వద్ద గోదావరిలోకి కలుస్తుంది. వాగు వద్దకు ఎవరు వెళ్లకుండా ఆయ గ్రా మ పంచాయతీల ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. నందిపేట మండలంలోని తల్వేద–నాళేశ్వర్ వాగు పొంగి ప్రవహించింది. ఎగువ ప్రాంతంలో నీటి ఉ ధృతి తీవ్రమవడంతో నవీపేట మండలంలోని నాళేశ్వర్ గ్రామంతో పాటు నందిపేట మండలంలోని తల్వేద గ్రామానికి వారధిగా ఉన్న బ్రిడ్జి ప్రమాదానికి చేరువైంది.నాళేశ్వర్, తల్వెద గ్రామాల వాసులు శుక్రవారం ఈ బ్రిడ్జిని పరిశీలించి అధికారులకు సమాచారమిచ్చారు. తల్వేద వాగు బ్రిడ్జి వద్ద పేరుకుపోయిన గుర్రపు డెక్క వ్యర్థాలను రెవెన్యూ అధికారులు తొలగించారు. ఐదు వేల ఎకరాలల్లో నీట మునిగిన పంటలు బోధన్‌రూరల్ మండలంలోని మంజీర తీర గ్రామాల్లో శ్రీరాంసాగర్ బ్యాక్‌వాటర్, మంజీర నది వరద ఉధ్రుతితో సుమారు 5వేల ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు బోధన్ ఏడీఏ అలీం తెలిపారు. 3200పైగా ఎకరాల్లో సోయా, 1800పైగా ఎకరాల్లో వరి పంట నీట మునిగినట్లు ఆయన తెలిపారు. పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని ఆయన తెలిపారు. సాలూర మండలంలో సోయా 2820 ఎకరాలు,వరి 3,110 ఎకరాలు నీట మునిగి నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేశామని ఏవో శ్వేత తెలిపారు. పోతంగల్ మండలంలో 2వేల ఎకరాల్లో .. పోతంగల్ మండలంలోని సుంకిని శివారులో వరి 270 ఎకరాల్లో, సోయా 300 ఎకరాల్లో, కల్లూర్ శివారులో వరి 196 ఎకరాల్లో, కొడిచర్ల శివారులో వరి 185 ఎకరాల్లో, సోయా15 ఎకరాల్లో, హంగర్గాలో శివారులో వరి 154 ఎకరాల్లో, సోయా 28 ఎకరాల్లో, కారేగాంలో వరి 52 ఎకరాల్లో, సోయా 29 ఎకరాల్లో, హెగ్డోలి శివారులో వరి 30 ఎకరాల్లో, సోయా 26 ఎకరాల్లో, కొల్లూర్ శివారులో వరి 70 ఎకరాల్లో, సోయా 50 ఎకరాల్లో, సోంపూర్ శివారులో వరి 40 ఎకరాల్లో, 75 ఎకరాల్లో, టాక్లీ శివారులో వరి 35 ఎకరాల్లో, సోయా 250 ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్టు వ్యవసాయాధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. రుద్రూర్ మండలంలో వంద ఎకరాల్లో, కోటగిరి మండలంలో 15 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్టు వ్యవసాయాధికారులు తెలిపారు. పునరావాస కేంద్రాలకు తరలింపు రెంజల్/బాల్కొండ : రెంజల్ ఎస్సై, చంద్రమోహన్, తహసీల్దార్ శ్రావణ్‌కుమార్‌లు ఆయా గ్రామాల స్థానికుల సహకారంతో వర్షాలకు కూలడానికి సిద్ధంగా ఉన్న ఇళ్లను గుర్తించారు. వారి ఇళ్ల వద్దకు చేరుకొని కుటుంబీకులకు కౌన్సెలింగ్ నిర్వహించి గ్రామాల్లోని పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల చేపడుతుండటంతో ప్రాజెక్ట్ దిగువన పోచంపాడ్‌లోని వడ్డెర కాలనీ వాసులకు అధికారులు పునరావసం ఏర్పాటు చేశారు. కాలనీలో మహిళ సమాఖ్య భవనంలోకి కాలనీవాసులను తరలించారు.తహసీల్దార్ సంతోష్‌రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కందకుర్తిలో పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న అధికారులు నాళేశ్వర్ శివారులో ప్రమాదకరంగా మారిన బ్రిడ్జిని పరిశీలిస్తున్న గ్రామస్తులు నందిపేట పాలిటెక్నిక్ కళాశాల భవనం చుట్టూ చేరిన వరద నీరు -
అప్రమత్తంగా ఉండాలి
బాల్కొండ: గోదావరికి వరద ఉధృతి పెరుగు తుండడంతో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆర్మూర్ సబ్ కలెక్టర్ ఆభిజ్ఞాన్ మాల్వియా సూచించారు. శుక్రవారం ఆయన శ్రీరాంసాగర్ జలాశయాన్ని సందర్శించారు. గోదావరి ఒడ్డున ఉన్న రామాలయం, శివాల యం వరకు నీరు రావడంతో పక్కనే ఉన్న కాలనీవాసులతో మాట్లాడారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద పెరిగే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. గోదావరి వైపు ఎవ రూ వెళ్లొద్దని తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ సంతోష్‌రెడ్డి, ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధ ర్‌రెడ్డి, మెండోరా ఎస్సై జాదవ్ సుహాసిని, ఏఈఈ రామారావు, సిబ్బంది ఉన్నారు. నిజామాబాద్ లీగల్: సారంగాపూర్‌లోని నిజా మాబాద్ సెంట్రల్ జైలును శుక్రవారం జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి ఉదయ భాస్కర్‌రావు సందర్శించారు. నెలవారి తనిఖీల్లో భా గంగా ఆయన జైల్లో ఉన్న ఖైదీలతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. న్యాయ సహాయం కోసం ఎదురుచూస్తున్న ఖైదీలకు, జిల్లా న్యాయ సేవ సంస్థ ద్వారా ప్యానెల్ న్యా యవాదులను ఏర్పాటు చేయనున్నట్టు ఉదయ భాస్కర్‌రావు తెలిపారు. అలాగే మహిళా ఖైదీ లు ఎదుర్కొంటున్న సమస్యలను సైతం ఆయ న అడిగి తెలుసుకున్నారు. జైలు అధికారులకు పలు సూచనలు చేశారు. జైలు సూపరింటెండెంట్ చింతల దశరథ్, జైలర్ ఉపేందర్ రావు, జైలు సిబ్బంది పాల్గొన్నారు. 42 సంవత్సరాల తర్వాత.. రెంజల్(బోధన్): చెరువులు నిండలేదు.. అలుగులు పారలేదు అయినా భారీ వరద రావడంతో 42 సంవత్సరాల నాటి పరిస్థితులను గోదావరి, మంజీరా పరీవాహక గ్రామాల ప్రజలు, రైతులు గుర్తు చేసుకుంటున్నారు. 1983వ సంవత్సరంలో ఇంతటి వరదను చూసినట్లు గ్రా మపెద్దలు పేర్కొన్నారు. 1986, 1992లో వరదలు వచ్చినా 1983 సంవత్స రం నాటి వరద ను మళ్లీ ఇప్పుడే తిలకిస్తున్నట్లు చెబుతున్నారు. కాగా, మహారాష్ట్ర నుంచి గోదావరి, నిజాంసాగర్ వైపు నుంచి వస్తోన్న మంజీర నది వరద నీరు కందకుర్తి త్రివేణి సంగమం వద్ద ఉగ్రరూ పం దాలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం వ రకు కందకుర్తిలోని మహారాష్ట్ర సరిహద్దు వరకు చేరుకున్న వరద, సాయంత్రం గ్రామంలోని ముఖద్వారం వద్దకు చేరింది. దీంతో గ్రామంలోని ఇందిరమ్మ కాలనీవాసులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
బోధన్: ఎడపల్లి మండలం సాటాపూర్ గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ తెలిపిన వివరాలు ఇలా.. బోధన్ పట్టణానికి చెందిన షేక్ అన్సార్(38) శుక్రవారం ఉదయం వ్యక్తిగత పనుల నిమిత్తం బైక్‌పై నిజామాబాద్‌కు బయలుదేరాడు. ఎడపల్లి మండలంలోని సాటాపూర్గేట్ వద్ద అతడు ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొట్టి కిందపడిపోయాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలు కావడంతో వైద్య చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడిందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. చోరీ కేసులో నిందితుడి అరెస్టు మోర్తాడ్: మోర్తాడ్‌లోని భగత్‌సింగ్ కాలనీలోగల ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు భీమ్‌గల్ సీఐ సత్యనారాయణ, మోర్తాడ్ ఎస్సై రాము తెలిపారు. మోర్తాడ్ పోలీసు స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నాలుగు రోజుల క్రితం భగత్‌సింగ్ కాలనీకి చెందిన గురుడి అమృత్‌రావు ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లోని 9 మాసాల బంగారం, రూ.5వేల నగదు చోరీకి గురైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. విచారణలో ఎర్ల అశోక్ నిందితుడిగా తేలడంతో అతడిని పట్టుకొని బంగారంను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. -
ముప్పు పసిగట్టి.. అప్రమత్తం
● మంజీరా నదికి పోటెత్తిన వరద ● జలదిగ్బంధంలో మూడు గ్రామాలు ● బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించిన అధికారులు, నాయకులు బోధన్: బోధన్, సాలూర, పోతంగల్ మండలాల పరిధిలో విస్తరించి ఉన్న మంజీర నదికి రెండు రో జులుగా వరద పోటెత్తుతోంది. భారీ వర్షాలకు తో డు నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల నేపథ్యంలో మంజీరలో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం ఉదయం వరకు వరద ప్రవాహం భారీగా పెరగడంతో సాలూర మండలంలోని మందర్నా, ఖాజాపూర్, హున్సా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కాయి. ఐతే, వరద ముప్పును ముందే ప సిగట్టిన ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, గ్రామ స్తులు అప్రమత్తమయ్యారు. ఖాజాపూర్ గ్రామంలో ని సుమారు 200 మంది ముంపు బాధితులను నా యకులు ట్రాక్టర్ల ద్వారా సాలూరలోని పెరిక సంఘ భవనంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. సాలూర తహసీల్దార్ శశిభూషణ్ గు రువారం రాత్రి హున్సా గ్రామానికి వెళ్లి అక్కడే ఉండిపోయారు. బోధన్ రూరల్ సీఐ విజయ్‌బాబు, ఎ స్సై మచ్చేందర్ రెడ్డి, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది లోత ట్టు ప్రాంతాల ఇళ్ల నుంచి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు బాధితులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నాం, రాత్రికి భోజన సదుపాయం కల్పించారు. సాలూర పీహెచ్సీ డాక్టర్ రాజ్‌కుమార్ వైద్య సేవలందించారు. ఏఎంసీ చైర్మన్ చీల శంకర్, నాయకులు ఇల్తెపు శంకర్, నాగేశ్వర్ రావు, చిద్రపు అశోక్, టీపీసీసీ డెలిగేట్ గంగాశంకర్ శిబిరాన్ని సందర్శించి వరద బాధితులతో మాట్లాడారు. ఉప్పొంగుతున్న వాగులు సాలూర మండలంలోని ఖాజాపూర్–హున్సా గ్రామాల మధ్య పెద్దవాగు, సాలూర–ఖాజాపూర్ గ్రామాల మధ్య నరిగాగు, హున్సా–మందర్నా గ్రామాల మధ్య లోలెవల్ వాగు వంతెన మీదుగా వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆయా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. హున్సా, మందర్నా గ్రామాల ప్రజలు సురక్షితంగానే ఉన్నారని అధికారులు వెల్లడించారు. కాగా, శుక్రవారం రాత్రి హున్సా వద్ద వరద ఉధృతి కొంతమేర పెరిగినట్లు తెలిసింది. -
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
దోమకొండ: మండలంలోని సంఘమేశ్వర్ గ్రామ శివారులో బుధవారం ఎడ్లకట్ట వాగులో వరద ఉధృతికి కొట్టుకుపోయిన గ్రామానికి చెందిన గోత్రాల బాల్‌రాజ్(41) మృతదేహం శుక్రవారం లభ్యమైంది. గురువారం నుంచి ఎన్డీఆర్ఎఫ్ సభ్యులు గాలించగా, శుక్రవారం ఉదయం పొలాల మధ్య మృతదేహంను గుర్తించారు. మృతుడు బాల్‌రాజ్ బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం దోమకొండకు వచ్చి తిరిగి సొంత గ్రామం సంఘమేశ్వర్ వెళుతుండగా, వాగులో వరద ఉధృతికి కొట్టుకుపోయాడు.రెండు రోజులుగా గాలించగా శుక్రవారం మృతదేహం లభించింది.మృతుడికి భార్య రూప, ఇద్దరు కుమారులు ఉ న్నారు.తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబీకులు కోరారు.గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యంబోధన్రూరల్: సాలూర గ్రామ శివారులోని మంజీర నది బ్రిడ్జి వద్ద శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించినట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్‌రెడ్డి తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 40 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుందని ఆయన తెలిపారు. స్థానిక జీపీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండటంతో అక్కడే పోస్ట్‌మార్టం నిర్వహించి గ్రామ పంచాయితీ సిబ్బందితో అక్కడే పాతిపెట్టినట్లు ఎస్సై వివరించారు.జలాల్పూర్లో ఒకరి ఆత్మహత్యవర్ని: మండలంలోని జలాల్పూర్ గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వర్ని ఎస్సై మహేష్ తెలిపిన వివరాలు ఇలా.. జలాల్పూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ గౌస్ (47) కుటుంబంలో గొడవలు జరగడంతో అతడి భార్య వదిలిపెట్టి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెందిన గౌస్ గురువారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై తెలిపారు.కంజర్లో యువతి... మోపాల్: మండలంలోని కంజర్ గ్రామంలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై జాడె సుస్మిత తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన జినిగెల అక్షయ (20) జిల్లాకేంద్రంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది. గ్రామంలోని ఓ అద్దె ఇంట్లో అమ్మమ్మ లక్ష్మీ, చెల్లి నవ్యతో కలిసి జీవనం సాగిస్తోంది. మృతురాలి తల్లి గతంలోనే మృతిచెందగా, తండ్రి వదిలేసి వెళ్లిపోయాడు. శుక్రవారం సాయంత్రం అక్షయ ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతురాలి అమ్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లాకేంద్ర ఆస్పత్రికి తరలించారు. -
వరద ప్రాంతాలను పరిశీలించిన నాయకులు
వేల్పూర్/మోర్తాడ్/వర్ని/రెంజల్/ : మండలంలోని రామన్నపేట్, మోతె, వేల్పూర్ మార్గంలో వరద ఉధృతికి దెబ్బతిన్న పంట పొలాలను, తెగిపోయిన రహదారిని రాష్ట్ర కో ఆపరేటివ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. పంటలు, రహదారులకు జరిగిన నష్టంపై ఏవో శృతి, పీఆర్ ఏఈ శ్రీనివాస్, ఇతర అధికారులతో మాట్లాడారు. నష్టం వివరాలను ఉన్నతాధికారులకు వెంటనే చేరవేయాలని అధికారులకు సూచించారు. భీమ్‌గల్ మండలంలో వరద ధాటికి నష్టపోయిన పంటలను, దెబ్బతిన్న రోడ్లను ఆయన పరిశీలించారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. గత ప్రభుత్వం సరైన ప్రణాళిక లేకుండా నాసిరకంగా నిర్మించిన చెక్డ్యాంలతోనే పంటలకు నష్టం వాటిల్లుతోందని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ముత్యాల సునీల్‌కుమార్ పేర్కొన్నారు. వేల్పూర్ మండలం అక్లూర్, రామన్నపేట్ గ్రామాలలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. వరదలతో ధ్వంసమైన వంతెనలు, రహదారులు, పంటపొలాలను పరిశీలించారు.నియోజకవర్గంలో జరిగిన నష్టాన్ని సంబంఽధిత మంత్రులకు, సీఎంకు నివేదిస్తానని తెలిపారు.చందూర్ మండల కేంద్రంలో వరద నీళ్లు ఇళ్లలోకి ప్రవేశించిన బాధిత కుటుంబాలను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ పరామర్శించారు. ఇళ్లు కూలిపోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. చందూర్, శంకోరా, రాజిపేట్ శివార్లలో వరద ప్రవాహనికి దెబ్బతిన్న వరి పంటను స్థానిక రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి డీసీసీబీ మాజీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి పరిశీలించారు. వరదలతో ముంపుకు గురైన రెంజల్ మండలం నీలా, కందకుర్తి, తాడ్‌బిలోలి, బోర్గాం గ్రామాల్లో పంటలను, రహదారి పై వరద నీటి ప్రవాహన్ని కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. పంట నష్టం అంచనాలను గ్రామాల వారీగా రైతులు, ప్రజలతో మాట్లాడి ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి నివేదికను అందజేయనున్నట్లు మండల పార్టీ అధ్యక్షుడు మొబిన్‌ఖాన్ తెలిపారు.ఎస్సారెస్సీ నుంచి దిగువకు 7 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి బోధన్ నియోజకవర్గ రైతులు, ప్రజలను అధికారులు ఆదుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. రెంజల్ మండలం నీలా, కందకుర్తి గ్రామాల్లో రాష్ట్ర నాయకులు వడ్డి మోహన్‌రెడ్డి, మేడపాటి ప్రకాష్‌రెడ్డిలు పర్యటించారు. ఈ సందర్భంగా మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్సారెస్పీలో 65 టీఎంసీలను 50 టీఎంసీలకు తగ్గించాలని డిమాండ్ చేశారు. రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు యెండల లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. పొతంగల్ శివారులో మంజీర వరద వల్ల దెబ్బతిన్న పంట పొలాలను ఆయన సందర్శించారు. వరద ఉధ్రుతి తగ్గగానే అధికారులు పంట నష్టం వివరాలు సేకరించి బాధిత రైతులకు పరిహారం అందించాలని కోరారు. పొతంగల్ మండలం సుంకిని గ్రామంలో బీజేపీ నేత, ఎన్ఆర్ఐ శశాంక్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు పర్యటించి వరద బాధితులకు బియ్యం అందజేశారు. ఎకరానికి రూ.40 వేలు నష్టపరిహారం ఇవ్వాలి రుద్రూర్/బోధన్/బోధన్ రూరల్/నవీపేట : ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలతో నీటి మునిగిన పంటలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.20 వేలు చొప్పున ఎకరానికి రూ.40 వేలు నష్ట పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్‌బాబు డిమాండ్ చేశారు. బోధన్, సాలూర మండలాల్లోని ఆయా గ్రామాల్లో నీట మునిగిన పంటలను ఆయన పరిశీలించారు. వరద బాధితులు, రైతులతో మాట్లాడారు. దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ. 40వేలు చెల్లించాలని బీఆర్ఎస్ బాన్సువాడ నియోజక వర్గ నాయకులు జుబేర్, అంజిరెడ్డి డిమాండ్ చేశారు. పొతంగల్ మండలంలోని ఆయా గ్రామాల్లో మునిగిన పంటలను పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం పొతంగల్‌లో వారు విలేకరులతో మాట్లాడారు. వర్షాలకు నష్టం వాటిల్లడంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే విపత్తు నిధులను విడుదల చేయాలని నవీపేట మండల సీపీఎం నాయకులు శ్రీనివాస్, దేవేందర్‌సింగ్‌లు డిమాండ్ చేశారు. -
వైద్య సేవలు అందించాలి : కలెక్టర్ కృష్ణారెడ్డి
బోధన్‌రూరల్ : మండలంలోని పెగడాపల్లి గ్రామంలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్, ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి, ప్రజలకు వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. వరద ముంపు నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. అనంతరం పెగడాపల్లి సహకార సంఘం ఎరువుల గోడౌన్‌ను కలెక్టర్ తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ యూరియా, ఇతర ఎరువుల కొరత లేదని పేర్కొన్నారు. పాఠశాలపై ఎంఈవోకు ఫిర్యాదు పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో అనుమతి లేకుండా ఆల్ఫోర్స్ స్కూ ల్ పేరుమీద కొనసాగుతున్న నరేంద్ర లిటిల్ నేషనల్ స్కూల్ పర్మిషన్ను రద్దు చేయాలని విద్యార్థి సేన జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్ నాయక్ శుక్రవారం ఎంఈవో రాజ గంగారంకు వినతి పత్రం అందజేశారు. పాఠశాల భవనంపై ఆల్ఫోర్స్ స్కూల్ పేరు పెట్టుకుని విద్యార్థులను అయో మయానికి గురి చేస్తున్నారని ఎంఈవో దృష్టికి తీసుకు వచ్చారు. -
ఎంపీడీవో కార్యాలయం తనిఖీ
కమ్మర్పల్లి: కమ్మర్పల్లి మండల పరిషత్ కార్యాలయాన్ని జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో సాయన్న శుక్రవారం తనిఖీ చేశారు. ఈసందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ స్టేషన్ల, ఓటర్ల వివరాల మ్యాపింగ్‌ను ఆన్లైన్లో పరిశీలించారు. ఎంపీడీవో రాజశ్రీనివాస్, ఎంపీవో సదాశివ్ పాల్గొన్నారు.ఫోన్ల అప్పగింతమోర్తాడ్: మోర్తాడ్ పోలీసు స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న సెల్ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించి బాధితులకు అందించినట్లు ఎస్సై రాము శుక్రవారం తెలిపారు. ఆరుగురు గతంలో తమ ఫోన్లు పోయినట్లు స్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలిపారు. ప్రత్యేక పోర్టల్ ద్వారా ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగించినట్లు ఆయన వెల్లడించారు.నీటిని వేడి చేసి తాగండిబోధన్ టౌన్: పట్టణానికి సరఫరా చేసే తాగు నీటిని వేడిచేసుకొని తాగాలని మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ కోరారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన చేశారు.రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి పట్టణ తాగునీటి వనరైన బెల్లాల్ చెరువులోకి కొత్తగా నీరు, మట్టి రా వడం తో నీరు కలుషితం అవుతుందని, ఈనీ రు తాగడంతో అనారోగ్యం పాలవుతారని పేర్కొన్నారు. నీటిని కాచి చల్లార్చి తాగాలని కమిషనర్ జాదవ్ కృష్ణ సూచించారు.బాల్కొండ తహసీల్దార్‌గా శ్రీనివాస్బాల్కొండ: బాల్కొండ తహసీల్దార్‌గా ఆర్. శ్రీనివాస్ శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన శ్రీధర్ ఆర్మూర్ సబ్ కలెక్టర్ కార్యాలయానికి బదిలీ చేశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్‌ను కాంగ్రెస్‌పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. బదిలీపై వెళ్లిన తహసీల్దార్‌కు వీడ్కోలు పలికారు. పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేశ్‌గౌడ్, యూత్ అధ్యక్షుడు అర్వింద్, నాయకులు సంజీవ్, యూనిస్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.పెద్ద పులులు సంచరిస్తున్న వీడియో ఫేక్డొంకేశ్వర్(ఆర్మూర్): నాగారం, మల్లారం అటవీ ప్రాంతంలో పెద్ద పులులు తిరుగుతున్నాయని శుక్రవారం ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. నాలుగు పెద్ద పులులు సంచరిస్తున్న వీడియోను చాలా మంది వారి ఫోన్లలో స్టేటస్‌గా పెట్టుకున్నారు. నాగారం డంపింగ్ యార్డు దగ్గర అని కొందరు, మల్లారం అటవీ ప్రాంతంలో అని మరి కొందరు ఒకే వీడియోను వాట్సప్, ఫేస్‌బుక్‌లతో వైరల్ చేశారు. దీంతో పెద్ద పులులున్నాయంటూ జిల్లా వ్యాప్తంగా ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన నార్త్ ఫారెస్ట్ రేంజ్ అధికారి సంజయ్‌గౌడ్ ఇది ఫేక్ వీడియో అని తేల్చారు. ఇది కాగజ్‌నగర్‌కు చెందిన పాత వీడియో అని స్పష్టం చేశారు. ప్రజలు ఈవీడియోను నమ్మవద్దని, ఎవరూ వైరల్ చేయకూడదని ఆయన కోరారు.కోరుకున్నది జరగడంతో..డొంకేశ్వర్(ఆర్మూర్): కోరుకున్నది జరగడంతో గతేడాది డొంకేశ్వర్ సత్య (కర్ర) గణపతి వద్ద భక్తులు కట్టిన కొబ్బరి కాయ ముడుపులును విప్పుతున్నారు. ఆర్మూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా గెలుపొందిన బైండ్ల ప్రశాంత్ శుక్రవారం కర్ర గణపతిని దర్శించుకుని ముడుపు విప్పారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గొడిసెరం భూమేశ్‌రెడ్డి, సర్వసమాజ్ కమిటీ సభ్యులు మహిపాల్, సుమన్, బాపురావు, నాగరాజు, తదితరులున్నారు.మండపంలో హోమంరుద్రూర్; మండల కేంద్రంలోని సార్వజనిక్ గ ణేశ్ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు పురాణం మహేశ్వర శర్మ ప్రవచనం అందించారు. సార్వజనిక్ గణేశ్ మండలి ఏర్పాటు చేసి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రతిరోజు హోమం, అన్నదానం, స్వామీజీల ప్రవచనం కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.యువకుల రక్తదానంనవీపేట: మండలంలోని రాంపూర్ గ్రామంలోని శివాజీ గణేశ్ మండలి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మండలి నిర్వాహకులతో పాటు యువకులు రక్తదానం చేశారు. మహేందర్‌గౌడ్, రాము, శివ, భూమన్న, దివాకర్ తదితరులు పాల్గొన్నారు. -
పెరుగుతోన్న జ్వర పీడితులు
ఆర్మూర్‌టౌన్: వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వా తావరణ మార్పులతో ఆర్మూర్‌లో ప్రజలు జ్వరాల బారినపడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోజురోజుకు జ్వరం, ఒళ్లు తదితర లక్షణాలతో కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. ఆర్మూర్ ఏరి యా ఆస్పత్రిలో ఓపీల సంఖ్య గతంలో కంటే రెండింతలు పెరిగింది. 250 నుంచి ఓపీ సంఖ్య ప్రస్తు తం ప్రతిరోజు 500 వరకు వస్తున్నాయి. జ్వరంతో బాధపడుతున్న పట్టణంలోని వివిధ గురుకుల పాఠశాల విద్యార్థులను ఆర్మూర్ ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చి వైద్యపరీక్షలు చేయిస్తున్నారు. జ్వరంతో బాధపడుతున్న వారికి ఆస్పత్రిలోనే అడ్మిట్ చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. దోమల నివారణ చర్యలు శూన్యం పట్టణంలో దోమల బెడద ఉంది.ఎక్కువగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ● రోగులతో కిటకిటలాడుతున్న ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రి ● ప్రతిరోజు 500ల వరకు ఓపీ నిర్లక్ష్యం చేయవద్దు వర్షాలు కురుస్తున్న తరుణంలో బయటి వాతావరణంలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. జ్వరం, దగ్గు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడి సలహాతో మందులు వాడాలి. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన వా రికి వైద్య సేవలు అందిస్తున్నాం. అన్ని మందులు అందుబాటులో ఉన్నాయి. – ప్రణీత, సూపరింటెండెంట్,ఆర్మూర్ ఏరియా ఆస్పత్రి -
హైదరాబాద్‌కు బస్సుల పునరుద్ధరణ
ఆర్మూర్‌టౌన్/ఖలీల్‌వాడి: భారీ వర్షాల నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు నిజామాబాద్–హైదరాబాద్ రూట్లో బస్సుల రాకపోకలను నిలిపివేసిన విష యం తెలిసిందే. శుక్రవారం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తిరిగి బస్సుల రాకపోకలను ప్రారంభించారు. ప్రస్తుతం నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని ఆరు డిపోల్లో ప్రతి రోజు 588 బస్సులు ఉండగా ఇందులో 468 బస్సులు వివిధ రూట్లకు నడిపిస్తున్నారు. నిజామాబాద్ నుంచి కామారెడ్డి మీదు గా హైదరాబాద్‌కు బస్సులు నడుస్తున్నాయి. మెదక్ నుంచి జెబీఎస్కు, ఎల్లారెడ్డి, భీమ్‌గల్ తదితర రూ ట్లలో బస్సులను నిలిపివేశారు. వాతావరణ పరిస్థితులు వివిధ రూట్లలో ఉన్న రోడ్ల పరిస్థితులకు అనుకూలంగా బస్సులను నడిపిస్తామని ఆర్టీసీ ఆర్ఎం జ్యోత్స్న తెలిపారు. ట్రాఫిక్ జామ్‌తో ఇబ్బందులు.. ఎన్‌హెచ్ 44 హైవే నుంచి మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక తదితర ప్రాంతాల భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. రెండు రోజులుగా కురుస్తున్న వానలతో భారీ వాహనాలను హైవేపైనే పోలీసులు నిలిపివేశారు. దీంతో శుక్రవారం వాహనాలు ముందుకు కదులుతున్నాయి. ఒక్కసారిగా వాహనాలు భారీ సంఖ్యలో రావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. కామారెడ్డి జిల్లా కేంద్రం నుంచి జంగంపల్లి వరకు ఉన్న ఎన్‌హెచ్–44పై కిలోమీటర్ల మేర వా హనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనాలు హై దరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లడానికి గంటకు ఒక కిలోమీటర్ వరకు ముందుకు కదులుతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలో పోలీసులు ఆర్మూర్ నుంచి వాహనాలను మళ్లింపు చేశారు. నిర్మల్ నుంచి వచ్చే వాహనాలను ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ నుంచి మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్ మీదుగా హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. రైళ్ల రద్దు.. కామారెడ్డి జిల్లా త ల్లమడ్ల వద్ద రైల్వేట్రాక్ నీటి ప్రవాహంకు కొ ట్టుకపోవడంతో రైల్వే అధికారులు కొన్ని రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని నిజామాబాద్ నుంచి ఆర్మూర్, కరీంనగర్, పెద్దపల్లి, ఖాజీపేట్ మీదుగా కాచిగూడకు నడిపించారు. కానీ శుక్రవారం బాసర రైల్వే బ్రిడ్జి వద్ద గోదావరి నది ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తుండటంతో రైల్వేశా ఖ అధికారులు, రైల్వే ఎస్సై సాయిరెడ్డి పరిస్థితిని పరిశీలించారు. దీంతో బాసర మీదుగా నిజామాబాద్ రైల్వే జంక్షన్‌కు వచ్చే అన్ని రైళ్లను రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు. -
చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
ఆర్మూర్‌టౌన్/పెర్కిట్(ఆర్మూర్) : విద్యార్థులు చ దువుతో పాటు క్రీడల్లో రాణించాలని పాఠశాల హె చ్ఎం వనజ అన్నారు. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో శుక్రవారం జాతీయ క్రీడా ది నోత్సవం జరుపుకున్నారు. ఈసందర్భంగా హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూ లమాల వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థినులు క్రీడల్లో రా ణించి ఉన్నతస్థాయికి ఎదిగారన్నారు. అనంతరం పాఠశాలో అలేఖ్య అనే క్రీడాకారిణి సన్మానించారు. ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఆ ర్మూర్తో పాటు ఆలూర్ మండలంలోని ఆయా పా ఠశాలల్లో హెచ్ఎంలు ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆర్మూ ర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్‌లో ఇటీవల పదో న్నతిపై వచ్చిన పీడీ నిఖితను హెచ్ఎం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటరమణ చారి, విద్యార్థులు పాల్గొన్నారు. -
అలుగు పారుతున్న రాళ్లవాగు
కమ్మర్పల్లి: జిల్లా సరిహద్దులోని కమ్మర్పల్లి మండలం కోనాపూర్ రాళ్లవాగు అలుగుపారుతోంది. రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం రా వడంతో డెడ్ స్టోరేజీలో ఉన్న రాళ్లవాగు ప్రాజెక్ట్ జ లాశయం శుక్రవారం నిండింది. దీంతో ప్రాజెక్ట్ మత్తడి పైనుంచి వరద నీరు దూకుతోంది. రాళ్లవా గు ప్రాజెక్ట్ జలాశయం సామర్థ్యం 192 మెట్రిక్ క్యూబిక్ ఫీట్ కాగా, విస్తీర్ణం 129.43 హెక్టార్లుగా ఉంది. జిల్లా నలుమూ లల నుంచి, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల నుంచి పర్యాటకులు రాళ్లవాగును చూడాటానికి తరలి వస్తున్నారు. నిండుకుండలా రుద్రూర్ చెరువు రుద్రూర్: రుద్రూర్ చెరువు నిండు కుండను తలపిస్తోంది. అక్బర్ నగర్ – రుద్రూర్ మధ్యలో బ్రిడ్జి పక్కన రోడ్డు కోతకు గురైంది. ఇరిగేషన్ ఏఈ శృతి మండలంలో చెరువులను పరిశీలించారు. రోడ్డుకు కోతకు గురవడంతో స్థానిక నాయకులు వెంటనే స్పందించి రాళ్లు, కంకర వేయించడంతో ప్రమాదం తప్పింది. మండల కేంద్రంలోని కాటివాగులో ఉధృతి పెరగడంతో ప్రధాన ద్వారం స్వల్పంగా దెబ్బతింది. అధికారులు అవసరమైన మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు కొనసాగుతున్న అలీసాగర్ నీటి విడుదల బోధన్: ఎడపల్లి మండలంలోని ఠాణాకలాన్ గ్రామ శివారులోగల అలీసాగర్ రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు చేరడంతో గురువారం ఉదయం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు రిజర్వాయర్ మూడు వరద గేట్లు ఎత్తి దిగువన నిజాంసాగర్ ప్రాజెక్టు డి–50 కాలువల్లోకి నీరు విడుదల చేశారు. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1299.6 ఫీట్లు కాగా 1297.10 ఫీట్ల వరకు వరద నీరు చేరింది. రిజర్వాయర్‌లోకి అవుట్‌ఫ్లో 1500 క్యూసెక్కులు కాగా, ఇన్‌ఫ్లో 1200 క్యూసెక్కులు ఉందని నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం రెండు గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది. -
ఉరిమిన మేఘం
● సిరికొండ మండలం తూంపల్లిలో అత్యధికంగా 198.5 మి.మీ వర్షం ● తెగిన రెండు చెరువులు ● పలు గ్రామాల్లోకి చేరిన నీరుసిరికొండ మండలం ముషీర్‌నగర్ రగ్రామంలో ప్రవహిస్తున్న వరదవరుణుడి గర్జనకు ఉమ్మడి జిల్లా అతలాకుతలమైంది. ఎటు చూసినా వరద నీరే కనిపించింది. ధర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో రెండు చెరువులు తెగిపోవడంతో పలు గ్రామాల్లోకి నీరు చేరింది. ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. పలు చోట్ల నేషనల్ హైవే, తలమడ్ల ప్రాంతంలో రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో వాహనాలు, రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కాలనీలు చెరువులు, కుంటలను తలపించాయి. వరదలో చిక్కుకున్న పలువురిని రెస్క్యూటీములు, పోలీసులు కాపాడారు. కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి కురిపించిన వరుణుడు విలయ తాండవం చేశాడు. ఇద్దరు మృత్యువాతపడగా.. వాగులో గల్లంతయిన మరొకరి ఆచూకీ లభించలేదు. కార్లు, ఇతర వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. కామారెడ్డి జిల్లాలో 89,568 ఎకరాల్లో, నిజామాబాద్‌లో 12,413 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లా వ్యాప్తంగా రెండురోజులుగా కురుస్తున్న వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. సిరికొండ మండలం తూంపల్లిలో అత్యధికంగా 198.5 మిల్లీ మీటర్లు, ధర్పల్లి మండల కేంద్రంలో 181.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో సగటున 180.9 మి.మీ. వర్షం కురిసింది. ధర్పల్లి మండలం హొన్నాజీపేట అట వీ ప్రాంతంలోని ముత్యాల చెరువు తెగిపోవడంతో బీర ప్ప తండా, నడిమితండా, లక్ష్మీ చెరువు తండా ల్లోని ఇళ్లలోకి వరద నీరు చే రింది. ప్రజలు భ యంతో ఇళ్ల పైకప్పుల పైకి చేరారు. ఇందల్వాయి మండలం రాంసాగర్ తండా చెరువు కట్ట తె గింది. గుట్టకింది తండా, దొ న్కల్ చెరువులు ప్రమాదకరంగా పొంగిపొర్లడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి, డిచ్పల్లి మండలాల్లో వాగులు ఉధృతంగా ప్రవహించాయి. పలుచోట్ల రోడ్లు తెగిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బోధన్ డివిజన్లో మంజీర నది ఉధృతంగా ప్రవహించడంతో పంటలు నీట మునిగాయి. 12,413 ఎకరాల్లో వరి, సోయా పంట లు దెబ్బతిన్నాయి. శ్రీరాంసాగర్ నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. రూరల్ ని యోజకవర్గంలోని వరద ప్ర భావిత ప్రాంతాల్లో కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్యతో కలిసి ఎమ్మెల్యే భూపతిరెడ్డి పర్యటించారు. సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని కమలా నెహ్రూ కాలనీలో గుట్టపై నుంచి బండ రాయి పడడంతో ఓ ఇంటి గోడ ధ్వంసమైంది. ఇందల్వాయి మండలం గన్నారంలో విద్యుత్ సబ్‌స్టేషన్ జలమయమైంది. జాతీయ రహదారి 44పకి పలుచోట్ల భారీగా వరద నీరు చేరడంతో నిజామాబాద్–హైదరాబాద్ రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్ నుంచి, నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సినవారు మెట్పల్లి, కరీంనగర్ మీదుగా వె ళ్లాల్సి వస్తోంది. కామారెడ్డి జిల్లాలో పలుచోట్ల జాతీ య రహదారి కోతకు గురికావడంతో ఈ పరిస్థితి నెలకొంది. బాల్కొండ మండలంలో 12 కిలోమీటర్ల మేర లారీలు నిలిచిపోయాయి. నిర్మల్ వైపు కార్లు, బస్సులను మాత్రమే అనుమతిస్తున్నారు. లారీలు, ట్రక్కుల డ్రైవర్లు, క్లీనర్లకు రెవెన్యూ, పోలీసు అధికారులు ఆహారాన్ని, నీటిని అందిస్తున్నారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కలెక్టర్, సీపీ అతలాకుతలమైన జనజీవనం వర్షాలతో ఇద్దరు మృతి, మరొకరి గల్లంతు ఉప్పొంగిన వాగులు.. కొట్టుకుపోయిన రోడ్లు 55 చెరువులకు గండ్లు 89,568 ఎకరాల్లో నీట మునిగిన పంటలు -
కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి..
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా భారీ వర్షం కురిసింది. రెండు రోజుల పాటు వాన దంచికొట్టడంతో జనజీవనం స్తంభించింది. జిల్లా కేంద్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాజంపేటలో ప్రహరీ కూలి మీద పడడంతో డాక్టర్ వినయ్ మృతిచెందాడు. దోమ కొండ మండలంలో ఎడ్లకట్ల వాగులో కొట్టుకుపోయినవారిలో ఇద్దరు సురక్షితంగా ఇళ్లకు చేరగా.. బాల్‌రాజ్ అనే వ్యక్తి ఆచూకీ లభించలేదు. బీబీపేట మండలం జనగామలో ఎడ్లకట్ల వాగులో చిక్కుకుని రాజిరెడ్డి అనే రైతు మరణించాడు. జిల్లాలో ఆగస్టులో సాధారణ వర్షపాతం 224.4 మి.మీ. కాగా 529.0 మి.మీ. వర్షం కురిసింది. రా జంపేట, నాగిరెడ్డిపేట, భిక్కనూరు, ఎల్లారెడ్డి, లింగంపేట, కామారెడ్డి, దోమకొండ, నిజాంసాగర్, తా డ్వాయి, రామారెడ్డి, సదాశివనగర్, పాల్వంచ, మా చారెడ్డి, పిట్లం, బీబీపేట, మహ్మద్‌నగర్, గాంధారి మండలాల్లో రెండు రోజుల్లో 30 సెం.మీ. నుంచి 60 సెం.మీ. దాకా వర్షం కురిసింది. జిల్లాకేంద్రంలో పలువురి వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు విశేషంగా కృషి చేశాయి. 89,568 ఎకరాల్లో పంటకు నష్టం వా టిల్లగా, 18 గేదెలు, 8 ఆవులు, పదివేల కోళ్లు మృత్యువాతపడ్డాయి. 13 ఇళ్లు పూర్తిగా కూలగా, 310 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 44వ నంబరు జాతీయ రహదారి పలు చోట్ల ధ్వంసమై రాకపోక లు నిలిచిపోయాయి. కామారెడ్డి మీదుగా నిజామాబాద్, ఆదిలాబాద్ వెళ్లాల్సిన వాహనాలు చాలాచోట్ల గంటల తరబడి ఆగిపోవాల్సి వచ్చింది. -
పొర్లుతున్న చెరువులు
నిజామాబాద్‌నాగారం: జిల్లాలోని పలు చెరువులు పొర్లుతున్నాయి. మొత్తం 1086 చెరువులకు గాను 410 చెరువులు నిండుకుండను తలపిస్తుండగా, 178 పొంగిపొర్లుతున్నాయి. 50శాతానికి పైగా చెరువులు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరాయి. 251 చెరువులు 75శాతం నిండాయి. జిల్లాలో ఉన్న సగానికిపైగా చెరువులు నిండాయని ఇరిగేషన్ సీఈ మఽ దుసూదన్రావు తెలిపారు. రెండు చెరువులకు గండ్లు పడగా, వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో మా శాఖ ఉద్యోగులందరినీ అప్రమత్తం చేశామని, చెరువుల పరిస్థితిపై ఎప్పటికప్పుడు నివేదికలను పంపించాలని ఆదేశించినట్లు తెలిపారు. -
లక్షల క్యూసెక్కుల ఇన్ – అవుట్ ఫ్లో
● ఎస్సారెస్పీ 39 గేట్ల ఎత్తివేత బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఇన్, అవుట్ ఫ్లో అనూహ్యంగా పెరిగింది. బుధవారం ఉదయం నుంచి వరద గేట్లను ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. బుధవారం ఉదయం 50 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. రోజంతా నిలకడగా కొనసాగి సాయంత్రం నుంచి క్రమంగా వరద పెరిగింది. గురువారం మధ్యాహ్నం సమయానికి ఇన్‌ఫ్లో 2.75 లక్షల క్యూసెక్కులకు చేరింది. అదేస్థాయిలో వరద గేట్లు, కాలువల ద్వారా అవుట్ ఫ్లో కొనసాగించారు. సాయంత్రానికి 3.2 లక్షల క్యూసెక్కులకు ఇన్‌ఫ్లో పెరగగగా, 39 వరద గేట్ల ద్వారా 3.55 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. ఎగువ నుంచి మరింత వరద వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు ఎప్పటికప్పుడు నీటి విడుదలను పెంచుతూ, తగ్గిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. 67.05 టీఎంసీలు.. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా గురువారం సాయంత్రానికి 1087.20(67.05 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది. రెండు రోజులు.. 13 టీఎంసీలు ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నిలిచే ప్రాంతాల్లో ముంపు ముప్పు తలెత్తకుండ అధికారులు చర్యలు చేపట్టారు. నీటి నిల్వను 80 టీఎంసీల నుంచి 67 టీఎంసీలకు తగ్గించారు. -
నిలిచిన బస్సులు, రైళ్లు
● హైదరాబాద్‌కు ఆర్టీసీ బస్సులు నిలిపివేత ● వివిధ రూట్లల్లో 300 సర్వీసులు రద్దు ఖలీల్‌వాడి: భారీ వర్షాల కారణంగా ఉమ్మడి జిల్లా లోని పలు చోట్ల రోడ్లు, తలమడ్ల వద్ద రైల్వే ట్రాక్ దె బ్బ తినడంతో బస్సులు, రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్ రీజియన్ పరిధిలోని ఆ రు డిపోల నుంచి 584 బస్సులు ప్రతి రోజూ వివిధ రూట్లలో రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే భా రీ వర్షం కారణంగా జాతీయ రహదారి 44పై పలు చోట్ల రోడ్లు, వంతెనలు దెబ్బతినడంతో హైదరాబాద్‌కు బస్సు సర్వీసులను రద్దు చేశారు. అలాగే ఎ ల్లారెడ్డి, భీమ్‌గల్, వర్ని, చందూర్, సిరికొండ, ధరపల్లి తదితర ప్రాంతాల్లో రోడ్లపై వరద ప్రవహిస్తుండడం, రోడ్లు చెడిపోవడంతో ఆయా రూట్లలో మొ త్తం 284 బస్సులు నిలిచిపోయాయి. వరద ప్రభావం అంతగా లేని ప్రాంతాలకు 300 బస్సులను యథావిధిగా నడుపుతున్నట్లు ఆర్ఎం జ్యోత్స్న తెలిపారు. రద్దయిన 20 రైళ్లు వరద ప్రవాహానికి కామారెడ్డి జిల్లా తల్లమడ్ల వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో సికింద్రాబాద్ – నిజామాబాద్ మధ్య 20 రైళ్ల రాకపోకలు రద్దయ్యాయి. రెగ్యులర్‌గా రాకపోకలు సాగించే 10 రైళ్లతోపాటు 10 ప్రత్యేక రైళ్ల నిలిచిపోయాయి. గురువారం నిజామాబాద్‌కు చేరుకున్న దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ను ఆర్మూర్, కరీంనగర్ మీదుగా సికింద్రాబాద్‌కు మళ్లించినట్లు రైల్వే అధికారుల ద్వారా తెలిసింది. రైల్వే హెల్ప్‌లైన్ నంబర్లు.. రైళ్ల రద్దు, రూట్ మళ్లింపు నేపథ్యంలో ప్రయాణికులకు సమాచారం అందించేందుకు రైల్వే హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. రైళ్ల రాకపోకల సమాచారం కోసం నిజామాబాద్ – 97032 96714, కామారెడ్డి – 92810 35664, సికింద్రాబాద్ – 040 27786170, కాచిగూడ – 9063 18082 నంబర్లను సంప్రదించాలని ప్రయాణికులకు రైల్వేశాఖ సూచించింది. -
అప్రమత్తంగా ఉండాలి
నిజామాబాద్‌అర్బన్: వరద ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశించారు. రానున్న 48 గంటలపాటు భారీ వ ర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి పోలీస్ కమిషనర్ సాయిచైతన్య తో కలిసి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గురువారం ఉ దయం నుంచి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతా ల్లో నెలకొన్న పరిస్థితులపై సమీక్షించారు. అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటికి రావాలని ప్రజలకు సూచించారు. లోతట్టు ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలు, తెగిన విద్యుత్ వైర్ల వద్దకు వెళ్లొద్దన్నారు. అవసరమైన చోట్ల పోలీసు బందోబస్తు, పికెటింగ్ ఏర్పా టు చేయించాలని ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లల్లో ఉంటున్న వారిని తక్షణమే ఖాళీ చేయాలన్నా రు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. వరద ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అవసరమైన చోట్ల పోలీసు బందోబస్తు, పికెట్ అధికారులకు కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి దిశానిర్దేశం -
‘అలీసాగర్’ మూడు గేట్ల ఎత్తివేత
బోధన్: భారీ వర్షాలు, నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత నేపథ్యంలో ఎడపల్లి మండలంలోని ఠాణాకలాన్ గ్రామ శివారులోగల అలీసాగర్ రిజర్వాయర్‌కు భారీ వరద చేరుతోంది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1299.6 ఫీట్లు కాగా గురువారం సాయంత్రం వరకు 1297.10 ఫీట్లకు వరద నీరు చేరింది. ఈ క్రమంలో అధికారులు ఉదయం రెండు గేట్లు, సాయంత్రం మరో గేటును ఎత్తి 1400 క్యూ సెక్కుల నీటిని దిగువన ఉన్న నిజాంసాగర్ డి–50 కాలువల్లోకి వదిలారు. మూడు గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది. రిజర్వాయర్‌లోకి ఇన్‌ఫ్లో 1500 క్యూసెక్కులకు పైగానే ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. గురువారం రాత్రి రిజర్వాయర్‌లో మరింతగా ఇన్‌ఫ్లో పెరిగితే దిగువకు నీటి విడుదల పరిమాణాన్ని పెంచే అవకాశం ఉంది. ఎడపల్లి, రెంజల్, నవీపేట మండలాల్లో విస్తరించిన ఉన్న నిజాంసాగర్ డి–50 కాలువ కింద పంటలు నీట మునిగే అవకాశాలున్నాయి. -
పెద్దవాగు ఉగ్రరూపం
మోర్తాడ్(బాల్కొండ)/బాల్కొండ: కామారెడ్డి, ని జామాబాద్ జిల్లాల్లో విస్తరించిన పెద్దవాగు ఉగ్ర రూపం దాల్చింది. కామారెడ్డి జిల్లాలో బుధవారం కురిసిన భారీ వర్షాలకు పెద్దవాగు నీటి ప్రవాహం 6.4 మీటర్ల ఎత్తులో సాగింది. 1989లో తొలిసారి పెద్దవాగు 5.2 మీటర్ల ఎత్తులో ప్రవహించగా మధ్య కాలంలో 5 మీటర్లకు తక్కువ లోతులోనే నీటి ప్రవాహం సాగింది. బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్, మోర్తాడ్, ముప్కాల్, మెండోరా మండలాల మీదుగా ప్రవహించే పెద్దవాగు పరిసరాల్లో పంటలు నీటమునిగాయి. ఎస్సారెస్పీ నుంచి వరద నీటిని గేట్లు ఎత్తి గోదావరిలోకి విడుదల చేయడం, పెద్దవాగు ప్రవాహం తోడుకావడంతో తడపాకల్ వద్ద నది ఉధృతి మరింత ఎక్కువ అయ్యింది. పెద్దవాగు నీటి ప్రవాహంను సెంట్రల్ వాటర్ కమిషన్ ఉద్యోగులు లెక్కించి నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ముప్కాల్ మండలం వెంచిర్యాల్, మెండోరా మండలం వెల్కటూర్ గ్రామాల్లోనే సుమారు 300 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ● తొలిసారి 6.4 మీటర్ల ఎత్తులో ప్రవహించిన వరద ● 1989లో 5.2 మీటర్ల ఎత్తులో ప్రవాహం -
రూరల్ నియోజకవర్గంలో వరద బీభత్సం
డిచ్పల్లి(నిజామాబాద్‌రూరల్): నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండ, మోపాల్, నిజామాబాద్ రూరల్, మోపాల్ మండలాల్లో బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. పలు గ్రామాల్లో చెరువులు నిండి అలుగులు ఎత్తిపోస్తున్నాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో చెరువులు తెగి ఊళ్లల్లోకి వరద నీళ్లు చేరాయి. ధర్పల్లి మండలంలో వరద నీటిలో చిక్కుకున్న గ్రామాలను రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్య పరిశీలించారు. ముంపు బాధితులకు పునరావాస కేంద్రాల్లో వసతి కల్పించి భోజనం అందించారు. డిచ్పల్లి మండలంలోని కొరట్పల్లి–కొరట్పల్లి తండాకు, కొరట్పల్లి–మైలారం గ్రామాల మధ్య అధికారులు రాకపోకలను నిలిపివేశారు. బర్ధిపూర్ చె రువు నిండి అలుగు పారడంతో ఒడ్డున ఉన్న బర్ధిపూర్, ధర్మారం(బి) గ్రామాల్లోని ఇళ్లల్లోకి నీళ్లు చేరాయి. బాధితులను స్థానిక పునరావాస కేంద్రంలోకి తరలించారు. సిరికొండ మండలంలో కప్పల వాగు, మొండి వాగు, మద్దెల వాగు ఉధృతంగా ప్రవహించడంతో వాగు పరిసరాలల్లో పంటపొలాలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. వాగు పరిసర గ్రామాలైన తూంపల్లి, గడ్కోల్, కొండూర్, పెద్దవాల్గోట్, చిన్న వాల్గోట్ గ్రామాలను వరద ముంచెత్తింది. కొండాపూర్–తూంపల్లి గ్రామాల మధ్య కల్వర్టు కొట్టుకుపోయింది. మొండివాగు బ్రిడ్జి వద్ద వరద ఉధృతికి రోడ్లు కొట్టుకుపోయాయి. ధర్పల్లి మండలంలోని ముత్యాల చెరువు తెగిపోవడంతో కప్పల వాగులోకి వరద పోటెత్తింది. దీంతో కప్పలవాగు బ్రిడ్జి వద్ద రోడ్డు కొట్టుకుపోయింది. సమీప గ్రామాల్లోని ఇళ్లలోకి వరద నీరు వచ్చిచేరింది. వాడి, బీరప్ప తండాలో పంట నష్టం భారీగా జరిగింది. ముంపునకు గురైన వాడి గ్రామాన్ని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్య సదర్శించారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇందల్వాయి మండలంలో గన్నారం చిన్నవాగు ఉధృతికి విద్యుత్ సబ్‌స్టేషన్ వరద నీటిలో చిక్కుకుంది. సిర్నాపల్లి గ్రామం రామ్‌సాగర్ తండా చెరువు తెగిపోయి వరద నీటిలో స్వర్గరథం కొట్టుకుపోయింది. పలు గ్రామాల్లో పంట పొలాలు దెబ్బతిన్నాయి. సిర్నాపల్లి– గన్నారం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జక్రాన్‌పల్లి మండలంలోని కలిగోట్–చింతలూరు గ్రామాల వద్ద పెద్ద వాగు వంతెన పైనుంచి ఉధృతంగా ప్రవహించడంతో రెండు గ్రామాల మద్య రాకపోకలు నిలిచిపోయాయి. మోపాల్ మండలంలో చెరువులు నిండి అలుగులు పారుతున్నాయి. ఎల్లమ్మకుంట వెళ్లే రోడ్డును అధికారులు మూసివేశారు. నిజామాబాద్‌రూరల్ మండలంలోని పాంగ్రాలో నివసిస్తున్న కొందరు వరద బాధితులను నగరంలోని బింగి కల్యాణ మండపంలో పునరావాస కేంద్రానికి తరలించారు. గూపన్పల్లి శివారులో పులాంగ్‌వాగు వంతెన పైనుంచి ప్రవహిస్తుండటంతో రాకపోకలను నిలిపివేశారు. ముత్తకుంట– కుర్నాపల్లి గ్రామాల మధ్య వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు కోతకు గురైన రహదారులు పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు ముంపు గ్రామాలను సందర్శించిన అధికారులు -
భారీ వర్షాలపై ఎంపీ అర్వింద్ ఆరా
● కలెక్టర్, సీపీలతో ఫోన్లో మాట్లాడి, పరిస్థితిని తెలుసుకున్న ఎంపీ సుభాష్‌నగర్: జిల్లాలో రెండ్రోజులుగా ఎడతెరిపి లే కుండా కురుస్తున్న భారీ వర్షాల పై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మ పురి ఆరా తీశారు. కలెక్టర్, సీపీలతో ఫోన్లో మాట్లాడి, పరిస్థితి ని తెలుసుకున్నారు. వినాయక చవితి పండుగ సెలవు దినమైనప్పటికీ, అధికారులు బాధ్యతతో పనిచేశారన్నా రు. రానున్న రెండు రోజులు జిల్లాకు రెడ్ అలర్ట్ ఉ న్నందున ఇదే స్ఫూర్తితో బాధ్యతలు నిర్వహించి ఎ లాంటి ప్రాణనష్టం జరగకుండా, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వరద బాధితులను సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించి, కనీస సౌకర్యాలు అందించాలన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే అధికారులు ఆస్తి, పంట నష్టంపై నివేదికలు తయారు చేసి, ప్రభుత్వానికి అందజేయాలని కోరా రు. తాను కూడా సీఎంకు లేఖ రాస్తానని, హోం శాఖ కు సైతం నివేదిస్తానన్నారు. మరోవైపు ప్రజలకు కూడా ఎంపీ అర్వింద్ కీలక సూచనలు చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ప్రయాణాలు చేయకుండా అధికారులకు సహకరించాలన్నారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు 39 గేట్లు ఎత్తినందున పరివాహక ప్రాంత ప్రజలు, పశువుల కాపరులు గోదావరి పరిసర ప్రాంతాలకి వెళ్లకుండా ఉండాలని కోరారు. వినాయక చవితి దృష్ట్యా, మండపాల వద్ద నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
హంగర్గను చుట్టుముట్టిన ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్
బోధన్‌రూరల్: బోధన్ మండలంలోని హంగర్గ గ్రామాన్ని ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ చుట్టుముట్టింది. గురువారం సాయంత్రం మంజీర నదిలో ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి పెరగడం, ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ వెనక్కి నెట్టడంతో గ్రామంలోకి వరద నీరు చేరుకుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తహసీల్దార్ విఠల్ గ్రామంలోనే ఉంటూ పరిస్థితులను సమీక్షిస్తూ ముందస్తు చర్యలు చేపట్టారు. ముంపు బాధితులను గుర్తించి వారి బంధువుల ఇళ్లకు తరలించారు. పాడి పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఖండ్గావ్ గ్రామ శివారులోని మంజీర బ్రిడ్జి పైనుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మహారాష్ట్ర నుంచి రాకపోకలు నిలిపివేసినట్లు తహసీల్దార్ తెలిపారు. -
సహాయక చర్యల్లో పోలీసులు
ఖలీల్‌వాడి: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై నీ రు నిలిచింది. ఆయా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎస్సైలు, సిబ్బంది రోడ్లపై నిలిచిన నీటిని తొ లగించి వాహనాదారులకు అంతరాయం కలగకుండా చేశారు. ఆరో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అర్సపల్లి ఎక్స్‌రోడ్డు, నెహ్రూనగర్ రోడ్లపైకి వచ్చిన నీటిని ఎస్సై వెంకట్రావు, సిబ్బంది, స్థానికులు, పొక్లెయిన్ల సాయంతో తొలగించారు. కోర్టు చౌరస్తాలో రోడ్డుపై నీరు నిలవడంతో ట్రాఫిక్ సీఐ ప్రసాద్, ఎస్సై వినోద్, సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవిబాబుకి విషయం తెలిపి ట్రాఫిక్ క్రేన్ సహాయంతో నీటిని మ్యాన్హోల్లోకి వెళ్లేలా ఏర్పాటు చేశారు. బాల్కొండ: కామారెడ్డి జిల్లా కేంద్రం వద్ద జాతీయ రహదారి 44పై గండి ఏర్పడటంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. వాహనాలను దారి మళ్లించడంతో మెండోరా మండలం పోచంపాడ్ నుంచి బాల్కొండ మండలం శ్రీరాంపూర్ వరకు గురువారం ట్రాఫిక్ స్తంభించింది. హైవే పొడువునా 15 కిలోమీటర్ల మేర ట్రక్కులు నిలిచిపోయాయి. వాహనాలను విడతల వారీగా దారి మళ్లించారు. పోచంపాడ్జాతీయ రహదారి 44 కూడలి వద్ద ట్రాఫిక్ వన్ వే ఏర్పాటు చేశారు. డ్రైవర్లకు ఆహారం, నీటిని రెవెన్యూ సిబ్బంది, స్థానికులు సమకూర్చారు. ఓ వైపు వర్షం మరో వైపు ట్రాఫిక్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. మెండోరా, ముప్కాల్, బాల్కొండ పోలీసులు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. నిజామాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కొనసాగుతున్న కంట్రోల్ రూమ్ పనితీరును కలెక్టర్ టి వినయ్‌కృష్ణారెడ్డి పరిశీలించారు. బు ధవారం సాయంత్రం ఆయన కంట్రోల్ రూ మ్ను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. భా రీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని,ఎలాంటి పరిస్థితి తలెత్తినా,సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని క్షేత్రస్థాయి అధికారులు,సిబ్బందిని ఆదేశించారు. జిల్లా యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని సమీక్షిస్తోందన్నారు. భారీ వ ర్షాల కారణంగా ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తి తే కంట్రోల్ రూమ్ 08462–220183కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.తెయూ(డిచ్పల్లి): నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 29, 30వ తేదీల్లో జరగాల్సిన పీజీ, బీఈడీ, ఎంఈడీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కంట్రోలర్ కే సంపత్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాల కారణంగా వాయిదా పడిన పరీక్షల నిర్వహణ తేదీలను తరువాత ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. -
విద్యార్థి అదృశ్యం
రెంజల్(బోధన్): మండలంలోని సాటాపూర్ గ్రామానికి చెందిన ఇరుగందుల శివ (17) అనే విద్యార్థి అదృశ్యమైనట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. బోధన్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అతడు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగా, సోమవారం కాలేజీకి వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లాడు. ఇప్పటికీ ఇంటికి తిరిగి రాలేడు. కుటుంబీకులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబసభ్యులు బుధవారం ఫిర్యాదు చే యగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. బాల్కొండ: మండలంలోని జలాల్పూర్ గ్రామంలో గురువారం పిచ్చి కుక్క దాడి చేయగా పలువురికి గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన ఐదేళ్ల చిన్నారి శిరీషతో పాటు మరో ఇద్దరిపై దాడి తీవ్రంగా గాయపరిచింది. అలాగే ఏడు గేదే దూడలను కూడ తీవ్రంగా గాయపరిచింది. దీంతో స్థానికులు వెంటపడి పిచ్చికుక్కను చంపివేశారు. గాయాలపాలైన వారు బాల్కొండ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బోధన్‌టౌన్(బోధన్): పట్టణంలోని రాకాసీపేట్‌లోని ఓ అపార్ట్మెంట్లో పావురం కలకలం రేపింది. స్థానికులు పట్టుకొని చూడగా పావురం కాళ్లకు రింగులు, కోడ్‌తో కూడిన కాగితాలు కట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పావురాన్ని ఫారెస్ట్ అధికారులకు అప్పగించినట్లు సీఐ వెంకటనారాయణ తెలిపారు. పావురం ఎక్కడి నుంచి వచ్చింది, దాని కాళ్లకు ఉన్న రింగులపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. కాగా, పది రోజుల క్రితం బోధన్ మండలం భవానీపేట్ గ్రామంలో ఇలాంటి పావురమే కనిపించింది. -
వరదలో చిక్కుకొని రైతు మృతి
బీబీపేట: భారీ వర్షాల కార ణంగా వచ్చిన వరదల్లో మండలంలోని జనగామకు చెంది న ఓ రైతు మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరా లు ఇలా.. మండలంలోని జ నగామకు చెందిన కప్పెర రా జిరెడ్డి (63) వ్యవసాయం ఆధారంగా జీవనం సాగించేవాడు. సాగు పనుల నిమిత్తం బుధవా రం పొలం వద్దకు వెళ్లి తిరిగి రాలేడు. అతడి పొ లం పక్కకే ఎడ్ల కట్ట వాగు ప్రవహిస్తుండడం, బీ బీపేట పెద్దచెరువు పూర్తిగా నిండి బ్యాక్ వాటర్ పొలంలోకి చేరడంతో అందులో గల్లంతయ్యా డు. గ్రామస్తులు ఎంత వెతికినా అతడి ఆచూకి లభించకపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి స మాచారం అందించారు. వారు గురువారం ఉద యం గాలింపు చేపట్టగా రాజిరెడ్డి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య లక్ష్మి, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రహరీ కూలి యువ వైద్యుడు.. రాజంపేట: వరద నీటిని మ ళ్లించే ప్రయత్నంలో ప్రహరీ కూలి రాజంపేటలో యువ డాక్టర్ ఇప్పకాయల వినయ్ (28) మృతి చెందాడు. బుధవారం కురిసిన భారీ వర్షంతో బీసీ కాలనీకి సమీపంలో ఉ న్న దేవుని చెరువు అలుగుపారింది. చెరువులోకి వచ్చే కట్టు కాలువ ఉధృతి పె రిగి నీరు బీసీ కాలనీ వైపు తిరుగుముఖం పట్టి ఇ ళ్లలోకి చేరింది. వినయ్ ఇంట్లోకి సైతం నీళ్లు చేరడంతో వాటిని మళ్లించేందుకు గడ్డపార సహాయంతో ప్రహరీని కూల్చేందుకు ప్రయత్నించా డు. ఈ క్రమంలో గోడ కూలి మీద పడడంతో వి నయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. వినయ్ గుండారం పల్లె దవాఖానాలో మెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. పండుగ పూట డాక్టర్ మరణించడంతో రాజంపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసి నట్లు ఎస్సై దత్తాత్రి గౌడ్ తెలిపారు. -
ఆశ్రమంలోని వారిని కాపాడిన రెస్క్యూ బృందం
రెంజల్(బోధన్): గోదావరికి వరద పోటెత్తడంతో కందకుర్తి పుష్కరక్షేత్రంలోని సీతారాం త్యాగి మహారా జ్ ఆశ్రమం చుట్టూ వరద నీరు చేరింది. దీంతో ఆశ్రమంలో స్వామీజీతో పాటు ముగ్గురు శిష్యులు, ముగ్గురు భక్తులు అక్కడే చిక్కుకున్నారు. గురువారం సాయంత్రం బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయ్‌బాబు, ఎస్సై చంద్రమోహన్, తహసీల్దార్ శ్రావణ్‌కుమార్ గ్రామానికి చేరుకుని పరిస్థితులను సమీక్షించారు. వెంటనే రెస్క్యూ బృందాలను రప్పించి ఆశ్రమం వద్దకు పంపించారు. గంటన్నర వ్యవధిలో రెస్క్యూటీం బృందం మహారాజ్ శిష్యులతోపాటు భక్తులను సురక్షితంగా గ్రామానికి చేర్చారు. -
సెల్ఫీ తెచ్చిన తంట
బోధన్‌టౌన్(బోధన్): భారీ వర్షాలకు బోధన్‌లో ని బెల్లాల్ చెరువు అలుగు పారడంతో ఓ యువకుడు సెల్ఫీ తీసుకోవడానికి వెళ్లి, అక్కడే చి క్కుకున్నాడు. స్థానికులు తాళ్ల సాయంతో సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. పట్టణంలో ని కుమ్మరిగల్లీకి చెందిన నవీన్ గురువారం బె ల్లాల్ చెరువు వద్దకు వెళ్లాడు. అలుగు పారడంతో సెల్ఫీ తీసుకోవడానికి యత్నించగా కాలు జారి అలుగు పైనుంచి కిందపడడంతో అక్కడే చిక్కుకున్నాడు. సమాచారం అందుకున్న మ త్య్స పారిశ్రామిక సంఘం పట్టణ అధ్యక్షుడు అ క్కడికి చేరుకొని గజ ఈతగాళ్లతోపాటు అక్కడే ఉన్న యువకుల సహాయంతో తాడు అందించి బయటకు తీశారు. -
తెయూ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్య కమిటీ ఎన్నిక
● అధ్యక్షుడిగా జైపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా నరాల సుధాకర్తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ప్రైవేట్ డిగ్రీ , పీజీ కళాశాలల యాజమాన్య కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పర్ణిక ప్యాలెస్‌లో మంగళవారం తెయూ పరిధిలోని అన్ని ప్రైవేట్ కళాశాలల మేనేజ్మెంట్స్ సభ్యులు, కరస్పాండెంట్లు పాల్గొని కమిటీని ప్రకటించారు. అధ్యక్షుడిగా ఆర్కే గ్రూప్ ఆఫ్ కాలేజీస్ కరస్పాండెంట్, సీఈవో డాక్టర్ ఎం.జైపాల్‌రెడ్డి (కామారెడ్డి), ప్రధాన కార్యదర్శిగా కేర్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ నరాల సుధాకర్ (నిజామాబాద్), కోశాధికారిగా మీమ్స్ డిగ్రీ కాలేజ్ యజమాని శ్రీనివాస్ రాజు (బోధన్), ఉపాధ్యక్షులుగా ఎస్పీఆర్ డిగ్రీ కాలేజీ యజమాని అరుణ్‌కుమార్ రెడ్డి (డిచ్పల్లి), శశాంక్ డిగ్రీ కాలేజీ యజమాని సయ్యద్ హకీం (బాన్సువాడ), సంయుక్త కార్యదర్శులుగా సిద్ధార్థ డిగ్రీ కాలేజీ కరస్పాండెంట్ నవీన్ (ఆర్మూర్), రాజేశ్వరరావు (కామారెడ్డి), అసోసియేట్ అధ్యక్షుడిగా సంజీవ్‌రెడ్డి (ఆర్మూర్), స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా గురువేందర్‌రెడ్డి (కామారెడ్డి), హరిప్రసాద్ (నిజామాబాద్), లీగల్ అడ్వయిజర్‌గా ప్రముఖ న్యాయవాది, మాజీ పీపీ రాజేందర్రెడ్డిను ఎన్నుకున్నారు. అనంతరం కమిటీ మాజీ అధ్యక్ష, కార్యదర్శులు హరిప్రసాద్, సంజీవరెడ్డిలకు వీడ్కోలు సన్మానం చేశారు. అనంతరం కమిటీ నూతన అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారిని శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు జైపాల్‌రెడ్డి, సుధాకర్ మాట్లాడుతూ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల అధికారులుగా హరిస్మరణ్, శంకర్ వ్యవహరించారు. కార్యక్రమంలో ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు మారయ్య గౌడ్ , శంకర్, సూర్యప్రకాశ్, సృజన్ రెడ్డి, బాలాజీ రావు, ప్రతాప్ రెడ్డి, గిరి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌కు ఎంపిక
నిజామాబాద్ నాగారం: బాలబాలికల అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలలో ప్రతిభ కనబర్చిన 30 మందిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నరాల రత్నాకర్, రాజాగౌడ్ మంగళవారం తెలిపారు. ఈ నెల 23, 25 తేదీల్లో నిర్వహించిన అండర్ 14, 16, 18, 20 బాలబాలికల అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలలో జిల్లా నలుమూలల నుంచి 48 పాఠశాలలు పాల్గొన్నాయన్నారు. ఎంపికై న వారు అథ్లెట్లు ఈ నెల 30, 31వ తేదీలలో మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పాఠశాలలు, కళాశాలలకు ఓవరాల్ చాంపియన్‌షిప్ ట్రోఫీలను అందజేశారు. -
క్రీడాకారులకు అభినందన
నిజామాబాద్‌నాగారం : జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన పోటీల్లో తమ పాఠశాల విద్యార్థులు బంగారు పతకాలు సాధించారని నవ్యభారతి గ్లోబల్ పాఠశాల చైర్మన్ కె సంతోష్ కుమార్, కరస్పాండెంట్ శ్రీదేవి మంగళవారం తెలిపారు. పాఠశాలలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాఠశాలకు చెందిన సీహెచ్ ఉదయ్, కార్తీక, అన్విత, అద్విత, అతుల్ పటేల్‌లు గోల్డ్ మెడల్, క్రాంతి సిల్వర్ మెడల్, సుశాంత్ బ్రాంజ్ మెడల్ సాధించారని అన్నారు. తమ పాఠశాల విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటు విజయం సాధిస్తున్నారని పేర్కొన్నారు. పాఠశాలలో విద్యతో పాటు క్రీడలకు సైతం ప్రాముఖ్యత ఇస్తున్నట్లు తెలిపారు. హెచ్ఆర్ డైరెక్టర్ లత, ప్రిన్సిపాల్ ఆంథోని, వైస్ ప్రిన్సిపాల్ సరిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లా సైనికుల కోసం లీగల్ ఎయిడ్ క్లినిక్
నిజామాబాద్ లీగల్: నగరంలోని సైనిక వెల్ఫేర్ కార్యాలయంలో మంగళవారం లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ లీగల్ క్లినిక్ ద్వారా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల సైనికులు, వారి కుటుంబాలకు న్యాయ సహాయం అందించనున్నారు. సెంటర్‌ను వినియోగించుకోవాలని జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి డి ఉదయ భాస్కరరావు కోరారు. లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్యానెల్ న్యాయవాదిగా బాలరాజు నాయక్‌ను నియమించారు. ఆన్లైన్ ద్వారా నిర్వహించిన ప్రారంభోత్సవంలో రెండో అదనపు, ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి టి శ్రీనివాసరావు, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి డి ఉదయ భాస్కర్ రావు, జిల్లా ఇన్చార్జి సైనిక సంక్షేమ అధికారి ఆంజనేయులు పాల్గొన్నారు. -
అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య
భిక్కనూరు: అప్పుల బాధతో మండల కేంద్రానికి చెందిన యువకుడు మంగళవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. భిక్కనూరుకు చెందిన బండి రాజు (35) మైక్రో ఫైనాన్స్, హౌసింగ్ ఫైనాన్స్‌లో అప్పులు తీసుకున్నాడు. చెల్లించడంలో ఆలస్యం కావడంతో ఏజెంట్లు ఇబ్బందులకు గురిచేశారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురై మంగళవారం తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. మృతుడికి భార్య సుజాత, తల్లి రాధ, కుమారుడు మనోజు, కుమార్తె రిషిక ఉన్నారు. ● రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యాయత్నం ● కాపాడిన స్థానికులు కామారెడ్డి క్రైం: ప్రేమించిన యువతి మోసం చేసిందని ఓ యువకుడు రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు వెంటనే అతడిని పట్టాలపై నుంచి పక్కకు లాగి కాపాడారు. వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని డ్రైవర్స్ కాలనీకి చెందిన సచిన్ అనే యువకుడు కొంతకాలంగా బెంగళూరులో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. సెలవుపై రెండు రోజుల క్రితం కామారెడ్డికి వచ్చాడు. మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో నిజామాబాద్ నుంచి కామారెడ్డి వైపు వస్తున్న గూడ్స్ రైలు రాకను గమనించి రైల్వేగేట్‌కు కొద్దిదూరంలో పట్టాలపై తల పెట్టి పడుకున్నాడు. యువకుడు ఆత్మహత్య చేసుకోబోతున్నది గమనించిన స్థానికులు వెంటనే అతడిని పక్కకు లాగి ఆరా తీశారు. అదే కాలనీకి చెందిన ఓ యువతిని ప్రేమించాడనీ, ఆమె మోసం చేయడంతో మనస్తాపం చెందినట్లు సదరు యువకుడి బంధువులు చెబుతున్నారు. అనంతరం అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
నానో యూరియాతోనే అధిక దిగుబడులు
● ఇఫ్కో జాతీయ డైరెక్టర్ మార గంగారెడ్డిజక్రాన్పల్లి : నానో యూరియాతో అధిక దిగుబడులు సాధించవచ్చని ఇఫ్కో జాతీయ డైరెక్టర్ మార గంగారెడ్డి అన్నారు. మంగళవారం జక్రాన్‌పల్లి మండలంలోని కలిగోట్ రైతు వేదికలో ఇఫ్కో నానో యూరియాపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా డీఏపీ యూరియాను అధికంగా వినియోగిస్తున్నారని అన్నారు. దీని వల్ల నేల భూసారం దెబ్బ తింటుందన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఇఫ్కో నానో యూరియాను వాడితే తక్కువ ఖర్చుతో ఎక్కువ పంట దిగుబడి వస్తుందన్నారు. యూరియా వాడకాన్ని తగ్గించాలని రైతులకు సూచించారు. ఆయిల్ పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. ఇఫ్కో సంస్థ ఎల్లప్పుడు రైతులను శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, ఏవో దేవిక, కొలిప్యాక్ సొసైటీ చైర్మన్ నాగుల శ్రీనివాస్, మాజీ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు మద్దుల రమేశ్, ఇఫ్కో రాష్ట్ర మేనేజర్ కృపా శంకర్, రైతులు పాల్గొన్నారు. -
మట్టి గణపతులపై అవగాహన
నిజామాబాద్ రూరల్/ ధర్పల్లి/ జక్రాన్‌పల్లి: ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడాలని పలువురు ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు అన్నారు. గుండారం ఉన్నత పాఠశాలలో మంగళవారం మట్టి గణపతులపై అవగాహన కల్పించారు. నగరంలోని రామకృష్ణ పాఠశాలలో విద్యార్థులు మట్టితో వినాయకుని ప్రతిమలను తయారు చేశారు. కార్యక్రమంలో రామకృష్ణ విద్యాలయ కరస్పాండెంట్ శశిరేఖ శ్రీనివాస్, హెచ్ఎం సముద్రాల మధు మాధురి, విద్యార్థులు పాల్గొన్నారు. నగరంలోని జీపీఎస్ కోటగల్లి శంకర్ భవన్ పాఠశాలలో విద్యార్థులు మట్టితో గణపతులను తయారు చేశారు. కార్యక్రమంలో హెచ్ఎం రామచందర్ గైక్వాడ్, ఉపాధ్యాయులు దయానంద్, మమత, నందిని, సౌందర్య, ముకుందు, విద్యార్థులు పాల్గొన్నారు. ధర్పల్లి మండలంలోని దమన్నపేట్ మండల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు మట్టి వినాయక ప్రతిమలను తయారు చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకట్ రాజారెడ్డి, రాంచందర్, అజయ్ కుమార్, రమణ, రాజేశ్వర్, అనురాధ పాల్గొన్నారు. జక్రాన్‌పల్లి మండలంలోని చింతలూర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు రాములు మట్టి గణపతులను తయారు చేశారు. విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
సమాజ దిక్సూచి.. సాహిత్యం
నిజామాబాద్ అర్బన్: సాహిత్యం సమాజానికి ది క్సూచి వంటిదని, తెలుగు విభాగంలో కొరవి గోప రాజు చేసిన సాహిత్య కృషి ఎంతో అభినందనీయ మని గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపాల్ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం కళాశాలలో తెలుగు విభా గం ఆధ్వర్యంలో అవధాన ప్రక్రియ పరిచయం అనే అంశంపై అతిథి ఉపన్యాసం నిర్వహించారు. విద్యార్థులు తమ సామర్థ్యాలను మెరుగుప ర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నం, తెలుగు విభాగాధిపతి లెఫ్టినెంట్ డాక్టర్ రామస్వామి, ఐక్యూ ఏసీ కో–ఆర్డినేట ర్ రాజేశ్, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి వి నయ్ కుమార్, అకాడమిక్ కో–ఆర్డినేటర్ నహేద బే గం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
జీజీహెచ్‌లో అరుదైన శస్త్రచికిత్సలు
నిజామాబాద్‌నాగారం: ఏడాది వయస్సు ఉన్న పాపకు జీజీహెచ్‌లో అరుదైన చికిత్స చేశారు. ఈ నెల 15న ఉదయం 3 గంటల సమయంలో పాముకాటుకు గురైన సారంగాపూర్‌కు చెందిన భానుశ్రీ అనే పాప ను చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. పాముకాటు(క్రైట్–న్యూరోటాక్సిక్)తో ఇబ్బందులు పడింది. అదే రోజు ఉదయం 5.30గంటలకు పాపను ఐసీయూలో చేర్చినప్పుడు గ్యాస్పింగ్, చలిగా ఉండడం కనిపించిందని వైద్యులు తెలిపారు. పేషెంట్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రెస్పిరేటరీ పారాలసిస్కు గురైందని వెద్యులు తెలిపారు. 9 రోజులపాటు వెంటిలేటర్‌పై ఉంచి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించారు. పిల్లల వైద్య నిపుణులు, హెచ్‌వోడీ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్, ప్రొఫెసర్లు డాక్టర్ ఎండీ అబ్దుల్ సలీమ్, డాక్టర్ శ్రీకాంత్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శరత్చంద్ర, డాక్టర్ కీర్తి, సీనీయర్ రెసిడెంట్ డాక్టర్ ఎండీ జైనులాబుద్దీన్, పీజీ వైద్యులు డాక్టర్ హరీశ్‌కుమార్, డాక్టర్ సందీప్‌ల బృంద పర్యవేక్షణలో చికిత్స అందించారు. ప్రస్తుతం వెంటిలెటర్‌పై నుంచి పాపను బయటకు తీయగా, ఆరోగ్యం నిలకడగా ఉంది. పాప ఆరోగ్యం మెరుగవ్వడంతో తల్లిదండ్రులు కళ్యాణ్, లక్ష్మి డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. 8 నెలల గర్భిణికి.. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వైద్యులు ఓ గర్భిణికి అరుదైన శస్త్ర చికిత్స చేశారు. నగరానికి చెందిన 8 నెలల గర్భిణి గడ్డెల జ్యోతి(36) నొప్పులతో ఈ నెల 19న జీజీహెచ్‌లో చేరారు. ఆమెకు సంక్లిష్టమైన గర్భధారణ సమస్య ఉందని వైద్యులు గుర్తించి తక్షణమే సిజేరియన్ ఆపరేషన్ చేసి అనంతరం హిస్టరెక్టమీ(గర్భాశయం తొలగింపు శస్త్రచికిత్స) నిర్వహించారు. అలాగే మూత్రశయం కూడా ప్రభావితమవడంతో దానిపై కూడా శస్త్ర చికిత్స చేశారు. అనంతరం కొన్ని రోజులు వెంటిలేటర్ సపోర్టు అందించారు. వైద్యుల నిరంతర పర్యవేక్షణ, నిపుణుల వైద్యంతో ప్రస్తుతం జ్యోతి అపాయం నుంచి బయటపడి కోలుకుంటున్నారు. శస్త్రచికిత్స చేసినవారిలో గైనిక్ హెచ్‌వోడీ డాక్టర్ లక్ష్మీప్రసన్న, జనరల్ సర్జరీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బాలకృష్ణ, అనస్థీషియా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అనిల్, యురాలజిస్టు డాక్టర్ శబరీనాథ్ ఉన్నారు. -
మట్టి గణపతుల పంపిణీ
నిజామాబాద్ అర్బన్: నగరంలోని కలెక్టరేట్లో రెవెన్యూ అసోసియేషన్, హెల్పింగ్ హర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం మట్టి గణపతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి గణపతులను అందజేశారు. మట్టి గణపతుల వినియోగం పెంచాలని, పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని సుదర్శన్‌రెడ్డి సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, రెవెన్యూ అసోసియేషన్ నాయకులు రమణ్‌రెడ్డి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్: ప్రముఖ మెజీషియన్ రంగనాథ్ డాక్టర్ బీవీ పట్టాభిరామ్ మొదటి స్మారక జాతీయ పురస్కారానికి ఎంపికై నట్లు తెలంగాణ సైకలాజికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎం ఏ కరీం తెలిపారు. ఇంద్రజాల రంగంతోపాటు మనోవికాస రంగంలో విశిష్టత సాధించి జిల్లా ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటిన రంగనాథ్‌కు ‘మైండ్ పవర్ మెజీషియన్’గా గుర్తించి అవార్డును సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లో ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. -
డంపింగ్ యార్డు పరిశీలన
మోపాల్: మండలంలోని మంచిప్పలో ఉన్న డంపింగ్ యార్డును ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ మంగళవారం పరిశీలించారు. నిజామాబాద్ నగర ప్రజలకు తాగునీరు అందించే మంచిప్ప పెద్ద చెరువులోకి డంపింగ్ యార్డు నుంచి మురుగు నీరు, చెత్తా చెదారం వెళ్లి కలుషితమవుతున్నాయని, ఆలయాలకు వచ్చే భక్తులు ఇబ్బంది పడుతున్నారని గ్రామస్తులు ప్రజావాణిలో ఫిర్యాదుచేశారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ట్రెయినీ కలెక్టర్ డంపింగ్ యార్డు, కంపోస్ట్ షెడ్డు, పెద్ద చెరువును పరిశీలించి పంచాయతీ కార్యదర్శి శ్యామ్‌కుమార్ వద్ద వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
పది కౌంటర్లు..700 గణేశ్ మండపాలకు చందాలు
● అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సుభాష్‌నగర్: బాల గంగాధర్ తిలక్, శివాజీ మహరాజ్ స్ఫూర్తిగా హిందువుల్లో ఐకమత్యం పెంపొందించడమే లక్ష్యంగా ట్రస్ట్ ద్వారా నగర గణేశ్ మండపాలకు తనవంతు ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. ధన్పాల్ లక్ష్మీబాయి, విఠల్ గుప్త చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ధన్పాల్ ఆర్థిక సహకార కార్యక్రమం మంగళవారం రెండోరోజూ కొనసాగింది. పది కౌంటర్లు ఏర్పాటు చేసి, సుమారు 700లకుపైగా గణేశ్ మండపాలకు చందాలు అందజేశారు. హిందూ ధర్మరక్షణ, మన సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ కోసం హిందువుల్లో ఐక్యత పెంపొందించే ప్రతి కార్యక్రమానికి తన సహాయసహకారాలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
నగరంలో ఫుట్ పెట్రోలింగ్
ఖలీల్‌వాడి: గణేశ్ ఉత్సవాల సందర్భంగా జి ల్లా కేంద్రంలో భద్రతా ఏర్పాట్లపై సీపీ సాయి చైతన్య ఫుట్ వాకింగ్(పెట్రోలింగ్) మంగళవారం నిర్వహించారు. ప్రధాన వినాయక మండపాలు, ప్రధాన రహదారులు, చౌరస్తాల వద్ద సీపీ స్వయంగా పర్యటించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ప్రతి ఒక్కరూ శాంతియుతంగా పండుగను జరుపుకోవాలని సీపీ సూ చించారు. నగరంలోని నెహ్రూ పార్క్, పెద్ద పో స్టాఫీస్, లక్ష్మి మెడికల్, పెద్ద బజార్, ఆర్ఆర్ చౌరస్తా, వినాయకుల బావి, వీక్లీ మార్కెట్, పోచమ్మ గల్లీ, రవితేజ గణేశ్ మండపం, పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఏసీపీ మస్తాన్ అలీ, టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్, సిబ్బంది ఉన్నారు.సిరికొండ: మండలంలోని గడ్కోల్, ముషీర్‌నగర్ గ్రామాల్లో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను డీసీసీ ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్‌రెడ్డి మంగళవారం పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో మాజీ ఎంపీటీసీ లింబాద్రి, సంపత్‌రెడ్డి, భానుచందర్, రాజేందర్, అఖిల్, గవాస్కర్, సుమన్, శ్రీనివాస్, గంగారెడ్డి, సంతోష్‌నాయక్, గురిజల నరేశ్, మోహన్, జగన్నాయక్, గజన్‌లాల్, కిశోర్‌గౌడ్, తిరుపతి, ఉమ్లా తదితరులు పాల్గొన్నారు. సిరికొండ: మండలంలోని న్యావనంది, తూంపల్లి, పెద్దవాల్గోట్, పోత్నూర్ గ్రామాల్లో బాధితులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు మంగళవారం పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో పార్టీ మండల ఉపాధ్యక్షుడు రాజేశ్వర్‌గౌడ్, లక్ష్మణ్, మాజీ సర్పంచ్ దేవరాజు, లక్ష్మణ్‌గౌడ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రవీణ్, నర్సారెడ్డి, రాంరెడ్డి, లియాఖత్ అలీ, రమేశ్, గంగారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిరికొండ: మండలంలోని ముషీర్‌నగర్‌లో విద్యుత్ ప్రమాదానికి గురైన కాంగ్రెస్ కార్యకర్త రాంసింగ్‌ను డీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్కోల్ భాస్కర్‌రెడ్డి పరామర్శించారు. ఏఎంసీ డైరెక్టర్ సంపత్‌రెడ్డి, సంతోష్‌నాయక్, మోహన్‌నాయక్, గజన్‌లాల్, జగన్, నరేష్, ఉమ్లా, రాజు, రాములు, తార తదితరులు ఉన్నారు. నిజామాబాద్ అర్బన్: ఇటీవల ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులకు హెచ్‌సీఎల్ టెక్బీ సంస్థ, ఇంటర్మీడియెట్ విద్య ఆధ్వర్యంలో 29న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు డీఐఈవో తిరుమలపుడి రవికుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలి పారు. ఈ ఉద్యోగమేళాలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, వొకేషనల్ కంప్యూటర్ సైన్స్ చేసిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. 29న ఉదయం 10 గంటలకు వర్ని రోడ్‌లోని వెంకటేశ్వర కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో హాజరుకావా లన్నారు. వివరాలకు 8074065803, 79818 34205 నెంబర్లను సంప్రదించాలన్నారు. బైరాపూర్‌లో ఘనంగా తీజ్ మోపాల్: మండలంలోని బైరాపూర్ జీపీ పరిధిలోని నాలుగు తండాల్లో మంగళవారం తీజ్ పండుగను ఘనంగా నిర్వహించారు. సేవాలాల్ మహరాజ్, జగదాంబ మాతా ఆలయాల్లో పూజలు చేసి, బోగ్‌భండార్ చేపట్టారు. ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలితెయూ(డిచ్పల్లి): రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధికి రూ.వేయి కోట్ల ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించాలని ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు విరాజ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఏఐఎస్ఎఫ్ తెలంగాణ యూనివర్సిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యావ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. సమావేశంలో రెహమాన్, రఘురాం, భరత్, సంజీవ్, చందు, సాయి, అజయ్, భార్గవి, మోక్షిత్, భీమేశ్, ప్రభాస్, పీర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. హామీలను అమలు చేయాలి ఇందల్వాయి: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ అన్నారు. ఇందల్వాయి మండల కేంద్రంలో మంగళవారం నిర్వమించిన బీఆర్ఎస్ పార్టీ మండల స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దాసు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ సంబారు మోహన్, మాజీ వైస్ ఎంపీపీ అంజయ్య, నాయకులు రఘు, పాశం కుమార్, చింతల దాసు, మల్లాపూర్ రాము, పులి శ్రీనివాస్ పాల్గొన్నారు. ధర్పల్లి: మండలంలోని హోన్నాజీపేట్కు చెందిన చేపల నర్సయ్య ఇటీవల మృతి చెందడంతో ధర్మపురి అర్వింద్ ఫౌండేషన్ ద్వారా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నక్క రాజేశ్వర్ బాధిత కుటుంబానికి రూ. లక్ష చెక్కును మంగళవారం అందజేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, జిల్లా నాయకుడు ప్రదీప్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
మా వాళ్లను విడిపించి..స్వదేశానికి రప్పించండి
● ప్రవాసీ ప్రజావాణిలో గల్ఫ్ బాధిత కుటుంబాల వినతి ● బహ్రెయిన్‌లో జిల్లావాసులకు రెండేళ్ల జైలు డిచ్పల్లి/ఇందల్వాయి: కంపెనీ చేయించిన తప్పుడు పనులతో బహ్రెయిన్‌లో జైలు శిక్ష పడిన తమ వాళ్లను విడిపించి, స్వదేశానికి రప్పించాలని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి చెందిన బాధిత కుటుంబీకులు మంగళవారం ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లి గ్రామానికి చెందిన తిమ్మజాడ సంతోష్(24), డిచ్పల్లి గ్రామానికి చెందిన నకిడి లింబాద్రి(24), రూరల్ మండలం మల్లారం గ్రామానికి చెందిన కర్రోళ్ల లక్ష్మీనర్సింహలు గత మే నెలలో ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లారు. పనిచేసే కంపెనీ 19 మందితో కాలం చెల్లిన ఆహార ఉత్పత్తుల లేబుల్లు, తేదీలని మార్పించి అమ్మకం, నిల్వ, మార్కెటింగ్ వంటి కార్యకలాపాలు నిర్వహించింది. దీంతో అక్కడి ప్రభుత్వం కంపెనీకి లక్ష దినార్లు(రూ.2.3కోట్లు) జరిమానాతోపాటు పనిచేస్తున్న 19 మంది కార్మికులకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. వీరిలో జిల్లాకు చెందిన ముగ్గురూ ఉన్నారు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబసభ్యులు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సూచన మేరకు తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వైజరీ కమిటీ చైర్మన్ డా.బీఎమ్ వినోద్ కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డిల సహకారంతో మంగళవారం హైదరాబాద్‌లోని ప్రవాసి ప్రజావాణిని ఆశ్రయించారు. నోడల్ అధికారి దివ్య దేవరాజన్‌కి తమ వారిని విడిపించి స్వదేశానికి రప్పించాలని వినతిపత్రం ఇచ్చారు. ప్రత్యేక కేసుగా పరిగణించి వారికి క్షమాభిక్ష లభించేలా చూడాలని కోరారు. స్పందించిన ఆమె సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ వీ.శేషాద్రి దృష్టికి తీసుకెళ్లి బాధితులకు సరైన న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. బహ్రెయిన్‌లో సామాజిక సేవకుడు కోటగిరి నవీన్ ఇండియన్ ఎంబసీ ద్వారా బాధితులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చినట్లు మంద భీంరెడ్డి తెలిపారు. -
జాతీయస్థాయి బేస్‌బాల్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
డిచ్పల్లి: ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన 5వ సీనియర్ మహిళలు, పురుషుల బేస్‌బాల్ పోటీల్లో నిజామాబాద్ జిల్లా మహిళల జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన క్రీడాకారిణులు సౌమ్యారాణి (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ డిగ్రీ కాలేజీ, ఆర్మూర్), శృతి (జీజీ డిగ్రీ కాలేజీ, నిజామాబాద్), అనూష, శరణ్య (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్, సుద్దపల్లి), పురుషల విభాగంలో సాయికుమార్ (జీజీ డిగ్రీ కాలేజీ) జాతీయ స్థాయి బేస్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. వీరు ఈ నెల 28 నుంచి 31వరకు మహారాష్ట్ర అమరావతిలో జరగబోయే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలంగాణ రాష్ట్ర బేస్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్వేత, జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎల్ మధుసూదన్‌రెడ్డి, సొప్పరి వినోద్ తెలిపారు. క్రీడాకారులను మంగళవారం అభినందించారు. కార్యక్రమంలో జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ప్రభాకర్ రెడ్డి, గంగామోహన్, సాఫ్ట్‌బాల్ అకాడమీ కోచ్ నరేశ్, మౌనిక, పీఈటీలు జ్యోత్స్న, నర్మత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
విద్యుత్ పొదుపుపై అవగాహన
ఇందల్వాయి: విద్యుత్ ప్రమాదాల వల్ల జరిగే ఆస్తి, ప్రాణ నష్టాల నివారణకు జిల్లా వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు డీఈ అల్జాపూర్ శ్రీనివాస్ తెలిపారు. నల్లవెల్లిలోని ఉన్నత పాఠశాలలో 9, 10వ తరగతి విద్యార్థులకు విద్యుత్ ప్రమాదాల నివారణ, విద్యుత్ పొదుపు వాడకంపై మంగళవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ప్రమాదాలను నివారించి, విద్యుత్ పొదుపుని సూచించే కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో హెడ్మాస్టర్ మాధురి, ఏఈ జ్ఞానేశ్వర్, లైన్‌మన్ నవీన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కాంగ్రెస్ గ్రామ శాఖ కార్యవర్గం ఎన్నిక సిరికొండ: మండలంలోని గడ్కోల్‌లో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సంపత్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా చాకలి పెద్ద గంగాధర్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ లింబాద్రి, భానుచందర్‌రెడ్డి, భాస్కర్, అఖిల్‌యాదవ్, గంగారెడ్డి, గంగాధర్, సుమన్, మనోజ్, సంజీవ్, నవీన్, గంగబాపు తదితరులు పాల్గొన్నారు. -
గుంతలను పూడ్చిన ట్రాఫిక్ పోలీసులు
ఖలీల్‌వాడి: నగరంలోని రైల్వే ఫ్లైఓవర్ వద్ద ట్రాఫిక్ పోలీసులు మంగళవారం శ్రమదానం చేశారు. ఇటీ వల ఈ ప్రాంతంలో కేబుల్ ఆపరేటర్లు ఈ ప్రాంతంలో గుంతలు తవ్వి అలాగే వదిలేశారు. దీంతో వాహనదారులకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు శ్రమదానం చేశారు. రోడ్డుపై ఉన్న మట్టిని, రాళ్లను తొలగించారు. శ్రమదానంలో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ కేశవులు, కిరణ్, రాజసాగర్, గోపాల్, దినేశ్ మట్టి, రాళ్లను తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా చేశారు. ట్రాఫిక్ పోలీసు పనితీరుపై నగర ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఖలీల్‌వాడి: నగరంలోని ఖలీల్వాడిలో ట్రాఫిక్ ని యంత్రణకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. మంగళవారం నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ఏసీపీ మస్తాన్ అలీ, ట్రాఫిక్ సీఐ ప్రసాద్ వాహనాల పార్కింగ్ కోసం మున్సిపల్ సిబ్బంది స హకారంతో హద్దులను నిర్ణయించారు. ఖలీల్‌వాడికి వచ్చే వాహనదారులకు ఈ పార్కింగ్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని సీఐ ప్రసాద్ తెలిపారు. ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్రాంతంలోనే వా హనాలను పార్కింగ్ చేయాల్సి ఉంటుందన్నారు. సెప్టెంబర్ 30లోగా దాఖలు చేయాలి నిజామాబాద్ నాగారం: ఆదాయపు పన్ను మినహాయింపులకు సంబంధించి ఫారం 10ఏ, బీను సెప్టెంబర్ 30లోపు దాఖలు చేయాలని ఆదాయపు పన్ను శాఖ అధికారి విజయ్ కుమార్ సాహు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని టాక్స్ బార్ భవన్లో ఆదాయపు పన్ను చట్టాలపై మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఆదాయ పన్ను సంచాలకులు బాలకృష్ణ, అదనపు సంచాలకులు సుమిత ఆదేశాల మేరకు ఆదాయ పన్ను చట్టాలు, నూతన సవరణలు, మినహాయింపులపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు రామనాథ్‌రెడ్డి, జగదీశ్ ప్రసాద్మీనా, సీఏలు, స్వచ్ఛంద సంస్థల, విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
మండప నిర్వాహకులు.. పాటించాలి జాగ్రత్తలు
● సీపీ పోతరాజు సాయిచైతన్య● వినాయక నవరాత్రుల సందర్భంగా కీలక సూచనలు ఖలీల్‌వాడి: వినాయక నవరాత్రి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ వేడుకలను తొమ్మిది, పదకొండు రోజులపాటు నిర్వహిస్తారు. ఉత్సవాల కోసం ఊరూరా, వాడవాడలా మండపాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులకు సీపీ పోతరాజు సాయిచైతన్య పలు కీలక సూచనలు చేశారు. ● ఆన్లైన్ పోర్టల్ https://policeportal. tspolice.gov. inలో వివరాలను నమోదు చేయాలి. ● దరఖాస్తు అనంతరం జనరేట్ అయిన క్యూఆర్ కోడ్‌ను వినాయక మండపం వద్ద పోలీసులకు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయాలి. ● కరెంట్ స్తంభాలు, తీగలకు దూరంగా మండపం ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. ● విద్యుత్ కనెక్షన్ కోసం ట్రాన్స్‌కో అనుమతి తీసుకోవాలి. ● విద్యుత్ తీగలపై వర్షపు నీరు పడకుండా చూడాలి. ఎలక్ట్రీషియన్‌ను అందుబాటులో ఉంచుకోవాలి. ● అగ్ని ప్రమాదాల నివారణకు మండపం వద్ద నీటితో నింపిన బకెట్, ఇసుక బస్తాలను ఉంచాలి. ● అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే ఫైర్ అధికారులకు సమాచారం అందించి, మంటలు వ్యాపించకుండా ఆర్పేందుకు ప్రయత్నించాలి. ● మండపం వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. ● ఎల్లప్పుడూ ఇద్దరు వ్యక్తులు మండపం వద్ద ఉండాలి. ● మండపం చుట్టుపక్కల ఉండేవారికి ఇబ్బంది కలిగించకుండా పెద్ద సౌండ్‌తో పాటలు పెట్టొద్దు. ● సోషల్ మీడియాలో వచ్చే వద్దంతులు నమ్మొద్దు. అసత్య ప్రచారం చేయొద్దు. ● నిమజ్జన ఊరేగింపు బాధ్యతను నిర్వాహకుల్లో ఇద్దరికి అప్పగించాలి. ● వినాయక రథానికి ఇరువైపులా తాళ్లు పట్టుకోవడానికి కనీసం నలుగురు వ్యక్తులను ఏర్పాటు చేయాలి. ● జన సంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో టపాసులు వెలిగించొద్దు. ● చెరువులు, వాగుల వద్ద నిమజ్జనం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ● అవాంఛనీయ ఘటన జరిగితే డయల్ 100 కాల్ చేయాలి. -
గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్
● నుడా చైర్మన్ కేశ వేణునిజామాబాద్ సిటీ: వినాయక చవితి సందర్భంగా వినాయక మండపాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తోందని నుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ వేణు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేశ వేణు మాట్లాడుతూ.. గతంలో లేని విధంగా ఈసారి సీఎం రేవంత్‌రెడ్డి గణేశ్ మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించడం శుభపరిణామమన్నారు. మండపాల నిర్వాహకులు వారి వివరాలు అందించి ఉచిత విద్యుత్ పొందాలన్నారు. మండపాల వద్ద డీజేలను నిషేధించిన నేపథ్యంలో పోలీసు శాఖకు సహకరించాలన్నారు. మైనారిటీ విద్యార్థులకు ఉచిత శిక్షణ జిల్లాలోని మైనారిటీ విద్యార్థులకు ఐఐటీ, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశానికి త్వరలోనే ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ తెలిపారు. జిల్లాలోని పేద ముస్లిం విద్యార్థులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ మైనారిటీ నాయకుడు సయ్యద్ ఖైజర్ మాట్లాడుతూ క్రీడలు, ఇతర రంగాల నుంచి ప్రముఖ శిక్షకులు వచ్చి ఇందూరు యువకులకు శిక్షణలో తర్ఫీదునివ్వనున్నట్లు తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు నరేందర్‌గౌడ్, రత్నాకర్, రామర్తి గోపి, సుభాష్ జాదవ్, మల్యాల గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
అథ్లెటిక్స్‌లో ఓవరాల్ చాంపియన్‌గా బీసీ గురుకుల విద్యార్థులు
డిచ్పల్లి(నిజామాబాద్‌రూరల్): జిల్లా అథ్లెటిక్స్ అ సోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ని ర్వహించిన పోటీల్లో డిచ్పల్లి మండలం ధర్మారం(బీ) గ్రామంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గు రుకుల బాలుర పాఠశాల/కళాశాల విద్యార్థులు ఓ వరాల్ చాంపియన్‌గా నిలిచారు. అండర్–16, అండర్ –18 విభాగాల్లో జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో ప్ర తిభ చూపిన ఏ.ప్రణయ్ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఎన్ లక్ష్మి, పా ఠశాల ప్రిన్సిపల్ ఎన్ దివ్యరాణి తెలిపారు. ఈ నెల 30, 31వ తేదీల్లో మహబూబ్‌నగర్‌లో జరుగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రణయ్ పాల్గొంటారన్నారు. -
కాలుష్య రహిత సమాజాన్ని అందిద్దాం
● నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ● జిల్లా కేంద్రంలో మట్టి గణపతుల పంపిణీ నిజామాబాద్ రూరల్ : మట్టితో తయారు చేసిన గణనాథులనే పూజిద్దామని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ధన్పాల్ లక్ష్మీ బాయి – విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని ఆకృతి షాపింగ్ మాల్ ఎదుట మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పదిహేనేళ్ల నుంచి ట్రస్ట్ ఆద్వర్యంలో మట్టి గణపతులను ఉచింతగా పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. భావితరాలకు కాలుష్య రహిత సమాజాన్ని అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. అనంతరం ఇందూరు వాసులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కేసీఆర్ కాలనీలో.. నిజామాబాద్ నాగారం : నగరంలోని కేసీఆర్ కాలనీలో వినాయచవితిని పురస్కరించుకొని సాయిహనుమాన్ ఆలయం వద్ద డాక్టర్ పడకంటి రాము, కుమారుడు ఆదిత్య, మిత్రులు కలిసి మట్టి గణపతులను కాలనీవాసులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో చంద్రమౌళి, వివేకానందరెడ్డి, కాలనీవాసులు పాల్గొన్నారు. సిరికొండలో.. సిరికొండ : మండల కేంద్రంలో కిడ్స్‌పార్క్ పాఠశాల ఆధ్వర్యంలో మట్టి గణపతులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ జాకీర్ హుస్సేన్, హెచ్ఎం ఆసిఫ్, కాంగ్రెస్ నాయకులు భాస్కర్‌రెడ్డి, సంతోష్‌నాయక్, ఆసిఫ్, శోభన్, దిగంబర్, ప్రేమ్, మోజీరాం, కిశోర్‌గౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఎకో ఫ్రెండ్లీ యూత్‌లు..
కమ్మర్పల్లి: మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన యూత్ అసోసియేషన్లు ఎకో ఫ్రెండ్లీ యూత్లుగా గుర్తింపు పొందాయి. చౌట్పల్లిలో శరత్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో 13 ఏళ్లుగా, హసకొత్తూర్లో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో 8 సంవత్సరాలుగా మట్టితో తయారు చేసిన విగ్రహాలను ప్రతిష్ఠిస్తూ పూజిస్తున్నారు. బషీరాబాద్‌లో పోచమ్మగల్లీ గణేశ్ మండలి ఆధ్వర్యంలో 10 ఏళ్లుగా మట్టితో తయారు చేసిన గణపతిని ప్రతిష్టించి భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. కమ్మర్‌పల్లిలో ఈ ఏడాది నుంచి మట్టితో తయారు చేసిన గణనాథుడిని ప్రతిష్టించాలని ఓం పద్మశాలీ విజయ సంఘం తీర్మానించింది. -
మహిళ, శిశు సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలి
నిజామాబాద్ అర్బన్: మహిళ, శిశు సంక్షేమం కోసం అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్సు హాల్లో మంగళవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో మహిళ, శిశు సంక్షేమ శాఖ పనితీరుపై కలెక్టర్ సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, అందుబాటులో ఉన్న సదుపాయాలు, సమకూర్చాల్సిన వసతులు, సిబ్బంది ఖాళీలు, సొంత భవనాల నిర్మాణాల స్థితిగతులు తదితర అంశాలపై చర్చించి, ఐసీడీఎస్ అధికారులకు సూచనలు చేశారు. సీడీపీవోలు, సూపర్వైజర్లు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ, అంగన్వాడీ కేంద్రాల పనితీరు మెరుగుపడేలా చొరవ చూపాలన్నారు. విద్య, వైద్యారోగ్యం తదితర శాఖలతో సమన్వయంతో మహిళ, శిశు సంక్షేమ కార్యక్రమాలు సంపూర్ణంగా అమలయ్యేలా కృషి చేయాలని ఆదేశించారు. జిల్లాలో 1501 అంగన్వాడీ కేంద్రాలకు గాను, 494 కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయని, 610 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, మరో 397 కేంద్రాలు అద్దె భారం లేకుండా వివిధ భవనాల్లో కొనసాగుతున్నాయని జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బీ వివరించారు. అంగన్వాడీ భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అన్ని కేంద్రాల్లో తాగునీరు, టాయిలెట్స్, విద్యుత్ వంటి వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి సెంటర్లో ఫేస్ రికగ్నిషన్ అటెన్డెన్స్ అమలు చేయాలని అన్నారు. సమావేశంలో ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, పంచాయతీరాజ్ అధికారి శంకర్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ రాకేశ్, సీడీపీవోలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
మట్టి గణపతికే జై
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సనాతన సంప్రదాయంలో ప్రతి పండుగకూ అనేక పరమార్థాలు ఉంటాయి. పంచభూతాలు, ప్రకృతి వనరులను ఏవిధంగా సద్వినియోగం చేసుకుంటూ జీవనం గడపాలనే అంశాలు ముడిపడి ఉంటాయి. ప్రతి అంశం జీవులన్నింటి మనుగడతో ముడిపడి ఉంటుంది. ఆది దేవుడిగా పూజలందుకునే వినాయకుడిని మట్టితో విగ్రహాలను చేసి పూజించాలనే పురాణాలు చెబుతున్నాయి. పరబ్రహ్మ స్వరూపమైన మృత్తిక (మట్టి) ద్వారానే అన్నిరకాల పోషకాలు లభిస్తున్నాయి. మట్టిలోనే మొక్కలు మొలిచి చెట్లుగా ఎదిగి అన్ని జీవులకు అవసరమైన ఆహారం తయారవుతోంది. అలాగే సర్వజీవులు మట్టిలోనే లయమవుతాయి. తొలిపూజలందుకునే గణపతి విగ్రహాలను మట్టితోనే తయారు చేయాలని లింగపురాణంలో ఉంది. ● నిజామాబాద్ నగరంలోని వినాయక్‌నగర్‌లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించే హైందవ ఉత్సవ సమితి సభ్యులు ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ నుంచి 16 అడుగుల బాలగణపతి మట్టి విగ్రహాన్ని తీసుకొచ్చారు. దీనికి పర్యావరణహిత రంగులనే వాడారు. గతేడాది నుంచి పర్యావరణహితంగా నవరాత్రులు నిర్వహిస్తున్నారు. ● పోచమ్మగల్లీలో రవితేజ యూత్ సొసైటీ ఆధ్వర్యంలో గత 9 సంవత్సరాలుగా అక్కడిక్కడే బెంగాల్ కళాకారులతో మట్టి విగ్రహాన్ని తయారు చేయిస్తున్నారు. ఈ ఏడాది 55 అడుగుల విగ్రహాన్ని తయారు చేయించారు. భారీ మట్టి విగ్రహం కావడంతో ప్రతిష్ఠించిన చోటే వాటర్ ట్యాంకర్ల ద్వారా నిమజ్జనం చేస్తున్నారు. ఈ గణేశుడి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ● మారుతినగర్‌లోని ఆర్ఆర్ అపార్టమెంట్తోపాటు వర్ని చౌరస్తా, న్యాల్కల్ చౌరస్తాల్లో మట్టిగణపతులు కొలువుదీరుతున్నాయి. ● నిజామాబాద్ రూరల్ మండలంలోని గుండారంలో బాలాజీ గణేశ్ మండలి, మల్కాపూర్‌లో శివపుత్ర గణేష్‌మండలి ఆధ్వర్యంలో మట్టి గణపతులు ప్రతిష్ఠిస్తున్నారు. ● బాల్కొండ మండల కేంద్రంలో నవయుగ యూత్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాన్ని గత కొన్నేళ్లుగా ఏర్పాటు చేస్తున్నారు. సంప్రదాయం పాటిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించాలి వినాయకచవితి నవరాత్రుల నేపథ్యంలో విషరసాయనాలతో తయారు చేసిన విగ్రహాలను వాడడం మానేయాలి. దీంతో ప్రకృతిలోని అన్ని జీవరాసులకు సమస్య లేకుండా ఉంటుంది. అదేవిధంగా నవరాత్రుల మండపాల వద్ద సంప్రదాయ దుస్తులు ధరించాలి. ఆధ్యాత్మిక, భక్తి పాటలు పాడాలి. మద్యం సేవించి మండపాల వద్దకు రావొద్దు. పోటీతత్వంతో కాకుండా శాస్త్రోక్తంగా ఉత్సవాలు నిర్వహించుకోవాలి. సంప్రదాయాన్ని కాపాడుకుంటూ భావితరాలకు ఆదర్శంగా నిలవాలి. – ధాత్రిక రమేశ్, వీహెచ్‌పీ జిల్లా సహ కార్యదర్శి ఉత్సవం.. పర్యావరణ పరిరక్షణ కలగలిస్తేనే ఆనందం జిల్లాలో మట్టి ప్రతిమలను విగ్రహాలను ఆదర్శంగా నిలుస్తున్న పలు సంఘాలు నేడు కొలువుదీరనున్న గణనాథులు -
డొంకేశ్వర్‌లో కర్ర గణపతి
డొంకేశ్వర్(ఆర్మూర్): వినాయక చవితి ఉత్సవాలకు డొంకేశ్వర్‌లోని (చెక్క) సత్య గణపతి సిద్ధమైంది. ఎనిమిదో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సర్వసమాజ్ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. 2018లో గ్రామస్తులు ఒక్కొక్కరు రూ.10 చొప్పున డబ్బులు పోగు చేసి నిర్మల్ జిల్లా సిద్ధాపూర్లో జ్ఞానేశ్వర్ అనే కళాకారుడితో దీనిని తయారు చేయించారు. విగ్రహం తయారు చేసేందుకు మామిడి, తెల్ల జిల్లేడు, ఎర్రచందనం, రాగి చెక్కలను ఉపయోగించారు. 2018 సెప్టెంబర్ 13నుంచి మండల కేంద్రంలోని సత్య గంగవ్వ మండపంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా రామాలయంలోని ప్రత్యేక గదిలో భద్రపరుస్తారు. మళ్లీ వినాయక చవితికి ఒకరోజు ముందు తెరిచి శుద్ధి చేస్తారు. చవితినాడు రామాలయం నుంచి ఊరేగింపుగా మండపానికి తెస్తారు. సత్య గణపతిని దర్శిచుకుని అక్కడే ముడుపులు కడితే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. అందుకే జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ‘సత్య గణపతి’ని దర్శించుకునేందుకు భారీగా తరలివస్తారు. -
పదేళ్లుగా మట్టి విగ్రహం తయారీ..
నందిపేట్(ఆర్మూర్): మండలంలోని ఉమ్మెడ గ్రామానికి చెందిన బుచ్చ శ్రీధర్ పర్యావరణ పరిరక్షణలో తనవంతు బాధ్యతగా ఏడు అడుగుల మట్టి గణపతిని తయారు చేశాడు. అంతే కాకుండా 100 మట్టి గణపతులను తయారు చేసి గ్రామంలోని ఇంటింటికి పంపిణీ చేసి పర్యావరణ హితం కోసం ప్రజలను చైతన్య పరుస్తున్నాడు. బజరంగీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల కోసం పదేళ్లుగా శ్రీధర్ మట్టి గణపతిని స్వయంగా తయారు చేసి ఇస్తున్నాడు. గణపతుల తయారీ కోసం రెండు నెలల సమయాన్ని కేటాయిస్తున్నాడు. అలాగే మండలంలోని కుద్వాన్‌పూర్‌లో ఫ్రెండ్స్ యూత్ ఆద్వర్యంలో గత 10 సంవత్సరాలుగా మట్టి గణపతిని ప్రతిిష్ఠిస్తూ యువకులు ఆదర్శంగా నిలుస్తున్నారు. -
అటకెక్కిన ఆహార భద్రత
● రుచి చూసిన తర్వాత విద్యార్థులకు వడ్డింపు ఉత్తిమాటే..? ● నామమాత్రంగా మారిన కమిటీలు ● బయటి ప్రాంతాల్లో వంట ● బోగస్ ఏజెన్సీల ఇష్టారాజ్యం నిజామాబాద్‌అర్బన్: ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, సంక్షేమ వసతిగృహాల్లో నాణ్యమైన భోజనం అందించేందుకు ఏర్పాటైన ఆహారభద్రత కమిటీలు నామమాత్రంగా మారాయి. గతేడాది నవంబర్ 27వ తేదీన కమిటీలు ఏర్పాటయ్యాయి. ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలు, గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు కమిటీకి ఇన్చార్జిగా ఉండగా, పాఠశాలలో పనిచేస్తున్న మరో ఇద్దరు సిబ్బందిని ఈ కమిటీల్లో ఉంటారు. మండలాలు, డివిజన్ల వారీగా జిల్లా కలెక్టర్ ఇతర శాఖల అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఆహార భద్రత కమిటీలు పనిచేస్తాయి. ఈ కమిటీల ముఖ్య ఉద్దేశం కలుషిత ఆహారాన్ని నియంత్రిస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందేలా చూడడం. ప్రతిసారి వంట చేయడానికి ముందు స్టోర్ రూమ్, కిచెన్‌ను కమిటీ తనిఖీ చేయాలి. భోజనం సిద్ధం కాగానే కమిటీ సభ్యులు రుచి చూసిన తరువాత పిల్లలకు అందిస్తారు. మండలాలు, డివిజన్ల వారీగా నోడల్ ఆఫీసర్లు కలెక్టర్‌కు సమాచారం అందిస్తారు. భోజనానికి సంబంధించిన ఫొటోలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో అప్లోడ్ చేస్తే వివరాలను ప్రతిరోజూ రికార్డుల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. జరుగుతోంది ఇదీ.. నిజామాబాద్ నగరంలోని ఖలీల్‌వాడి ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం వేరే ప్రాంతంలో వంట చేసి తీసుకువస్తున్నారు. దీంతో భోజనం తయారీ సమయంలో పర్యవేక్షణ కొరవడింది. అర్బన్ ప్రాంతంలోని 12 పాఠశాలల్లో ఇదే పరిస్థితి ఉంది. ప్రారంభంలో కమిటీలు హడావుడి చేసినప్పటికీ ప్రస్తుతం నామమాత్రంగా మారాయి. భోజనం వికటించిన తర్వాత అధికారులు పరుగులు తీస్తున్నారు. పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం రికార్డుల్లో విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కోటగల్లి ప్రభుత్వ పాఠశాలలో గత కొన్నేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. విద్యార్థుల సంఖ్య తప్పుగా నమోదు చేయడం, భోజనం నాణ్యత విషయంలో ప్రశ్నించిన హెచ్ఎం, సౌత్ మండల విద్యాశాఖాధికారి సాయారెడ్డిని ఏజెన్సీ నిర్వాహకుడు బెదిరించడం గమనార్హం. గురుకులాలు, సంక్షేమ వసతిగృహాల్లో పర్యవేక్షణ లేకుండాపోయింది. ఏజెన్సీల నిర్వాహకులు కాదు.. డిక్టేటర్లు పలువురు మధ్యాహ్న భోజన ఏజెన్సీల నిర్వాహకులు దీనిని పెద్ద బిజినెస్‌గా మార్చారు. వారు చెప్పిందే వేదంలా మారింది. ఫిర్యాదులు, విచారణలు వారిని ఏమీ చేయలేకపోతున్నాయి. ● ఓ వ్యక్తి తమ బంధువుల పేరిట నగరంలో మొత్తం 23 ఏజెన్సీలను నిర్వహిస్తున్నాడు. కొనేళ్లుగా వారి చేతుల్లోనే ఏజెన్సీలున్నాయి. గతంలో మధ్యాహ్న భోజనం నిర్వహణలో రూ.7 కోట్ల 62 లక్షల అవినీతి వెలుగుచూసింది. దీంతో నాటి ప్రజాప్రతినిధులు ప్రగతి భవన్లో నిర్వహించిన జిల్లా సమీక్షలో సంబంధిత ఏజెన్సీ నిర్వాహకుడిపై చర్యలు తిసుకోవాలని ఆదేశించారు. అయితే ఓ మంత్రి అతడికి సహకరించడంతో సేఫ్ అయ్యాడని అంతా చర్చించుకుంటున్నారు. ● ఓ మాజీ కార్పొరేటర్ నగరంలో 345 మంది విద్యార్థులున్న ఓ హైస్కుల్లో మధ్యాహ్న భోజన ఏజెన్సీని నిర్వహిస్తున్నాడు. అతడిపై గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. నాటి డీఈవో లింగయ్య రెండు సార్లు ఏజెన్సీని రద్దు చేశారు. అయినప్పటికీ ప్రస్తుతం అతడే కొనసాగుతుండడం గమనార్హం. ఆ పాఠశాలలో భోజనం సరిగా ఉండకపోవడంతో విద్యార్ధులు ఇంటినుంచి తెచ్చుకుంటున్నారు. ప్రతి రోజూ 100 మంది విద్యార్ధులు భోజనం చేస్తే 345 మంది విద్యార్థుల బిల్లులు పొందుతున్నాడు. ● మాజీ డిప్యూటీ మేయర్ ఒకరు నాలుగు పాఠశాలల భోజన ఏజెన్సీలను నడుపుతున్నాడు. ఒకే చోట వంట చేయించి అన్ని పాఠశాలలకు సరఫరా చేస్తున్నాడు. భోజనం నాణ్యతపై ఓ హెచ్ఎం గతంలో ప్రశ్నించగా బెదిరింపులకు పాల్పడ్డాడు. ● ఆర్మూర్‌లో ఇద్దరు అధికారి పార్టికి చెందిన నాయకులు, బోధన్‌లో 9 మంది మాజీ ప్రజాప్రతినిధులు ఏజెన్సీలను నిర్వహిస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు/ గురుకులాలు / వసతిగృహాలు ఖలీల్‌వాడి ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం వేరే ప్రాంతంలో వంట చేసి ఈ ఆటోలో తీసుకువచ్చారు. వంట చేసే సమయంలో అసలు పర్యవేక్షణ లేకుండాపోయింది. అసలు ఎక్కడ వంట చేస్తున్నారు? వంట గది ఎలా ఉంది? అనే విషయాలను పట్టించుకునే వారు లేకుండాపోయారు. -
గణపయ్య పూజకు వేళాయే..
● నేటి నుంచి నవరాత్రోత్సవాలు నిజామాబాద్ రూరల్: విఘ్ననాయకుడి నవరాత్రోత్సవాలకు సర్వంసిద్ధమైంది. బొజ్జ గణపయ్య రాకకోసం మండపాలు, ఇళ్లు ముస్తాబయ్యాయి. సుదూర ప్రాంతాల నుంచి ఇప్పటికే భారీ ప్రతిమలు తరలిరాగా, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మండపాలకు మంగళవారం ఉదయం నుంచి తరలించారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ గణేశ్ మండళ్ల నిర్వాహకులు, పూజా సామగ్రి కొనుగోళ్లతో సందడిగా మారింది. ఉత్సవాల కోసం నిజామాబాద్ నగరంలోని గణపతి ఆలయాలను ముస్తాబు చేశారు. నగరంలోని రైల్వేకమాన్ వద్ద ఉన్న గణపతి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందూరులో 300 ఏళ్ల చరిత్ర కలిగిన బొడ్డెమ్మ చెరువు వద్ద నున్న వినాయక ఆలయంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. -
స్పాట్ కౌన్సెలింగ్‌కు ఏడు దరఖాస్తులు
● మరో రెండు రోజులు అవకాశం ● ఇంజినీరింగ్ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రవేశాలకు మంగళవారం నిర్వహించిన స్పాట్ కౌన్సెలింగ్‌కు ఏడుగురు విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సీహెచ్ ఆరతి తెలిపారు. ఈ నెల 28, 29వ తేదీల్లో కూడా స్పాట్ కౌన్సిలింగ్ ఉంటుందని ఈ అవకా శాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకో వాలని కోరారు. తెయూ ఇంజినీరింగ్ కళాశాలలో కంప్యూటర్ కోర్సుల తరగతులు బోధించేందుకు సుధీర్ఘ అనుభవం కలిగిన రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉన్నారని పేర్కొన్నారు. ఈ నెల 29వరకు అందిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి ప్రవేశాలు కల్పిస్తామని తెలిపారు. స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా అడ్మిషన్స్ పొందిన వారికి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదని పేర్కొన్నారు. రేపు డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల ● సెప్టెంబర్ 2న తుది జాబితా.. సుభాష్‌నగర్: గ్రామపంచాయతీ, వార్డుల వారీగా ఫొటో ఓటరు జాబితా డ్రాఫ్ట్ రోల్ ప బ్లికేషన్ ఈనెల 28వ తేదీన విడుదల కానుంది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ జిల్లా పంచాయతీ అధికారులను మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. 29న గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లాస్థాయిలో, 30న మండల స్థాయిలో సమావేశం నిర్వహించనున్నారు. డ్రాఫ్ట్ ఓట రు జాబితాపై 28 నుంచి 30వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. 31వ తేదీన అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరిస్తారు. సెప్టెంబర్ 2న అన్ని గ్రామపంచాయతీల్లో ఫొటోలతో కూడిన ఓటరు తుది జాబితాను విడుదల చేయనున్నారు. ఈమేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రావు తెలిపారు. జీజీహెచ్ మరమ్మతులకు రూ.2.76 కోట్లు ● మరుగుదొడ్లు, డ్రెయినేజీలు, భవనం పనులు ● పాలియేటివ్ కేర్ సెంటర్ అభివృద్ధినిజామాబాద్నాగారం: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి భవనం మరమ్మతుల కోసం ప్రభు త్వం రూ.2కోట్ల 76లక్షలు మంజూరు చేసినట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మరుగుదొడ్లు, డ్రెయినేజీలు, తలుపులు, కిటికీలు, భవనం ముందు భాగంలో మరమ్మతులు చేపట్టడంతోపాటు పాలియే టివ్ కేర్ సెంటర్ అభివృద్ధి, ల్యాబ్ మరమ్మతులు, టీహబ్ విస్తరణ పనులు చేపడతామ ని పేర్కొన్నారు. నిధుల మంజూరుకు కలెక్టర్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సహకారం ఉందన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
అటవీ పక్షులు పెంచుతున్న ముగ్గురిపై కేసు
● నిజామాబాద్ నగరంలో తనిఖీలుడొంకేశ్వర్(ఆర్మూర్): నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మాలపల్లి ప్రాంతంలో అటవీ పక్షులను బంధించి పెంచుతున్న దుకాణాలపై అటవీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఓ దుకాణంలో అటవీ చిలుకలు, అటవీ కంజులను గుర్తించిన అధికారులు ఇది అటవీ చట్టానికి విరుద్ధమని స్పష్టం చేశారు. దుకాణ యజమానులైన సయ్యద్ సిరాజుద్దీన్, షాజూర్ రహమాన్ ఖాన్, సయ్యద్ బిన్ ఖాలీద్లపై అటవీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. దాడుల్లో నిజామాబాద్ ఎఫ్‌డీవో సుధాకర్, ఎఫ్ఆర్వో సంజయ్ గౌడ్, సిబ్బంది ఉన్నారు. -
ప్రజావాణికి 102 ఫిర్యాదులు
నిజామాబాద్‌అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 102 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, హౌసింగ్ పీడీ పవన్ కుమార్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ర్యాగింగ్‌ను అరికట్టాలి ర్యాగింగ్‌ను అరికట్టాలని పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కరక గణేశ్ అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్‌కు విన్నవించారు. మెడికల్ కళాశాలలో ర్యాగింగ్‌తో మెడికో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇలాంటి విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. -
1న కలెక్టరేట్ ఎదుట నిరసన
నిజామాబాద్‌అర్బన్: సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా భావిస్తూ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు చేపడతామని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు సుమన్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరసన అనంతరం సీపీఎస్ రద్దు కోసం రాష్ట్ర ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించే ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి తరలిరావాలన్నారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం చేపట్టనున్న బస్సు యాత్ర సెప్టెంబర్ 11న జిల్లా కేంద్రానికి వస్తుందని పేర్కొన్నారు. యా త్రను విజయవంతం చేయాలని తెలిపారు. సమావేశంలో టీఎన్జీవోస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, అర్బన్ యూనిట్ అధ్యక్షుడు జాకీ హుస్సేన్, ఆర్మూర్ యూ నిట్ అధ్యక్షుడు శశికాంత్ రెడ్డి, సూర్య ప్రకాశ్, సాయి కృష్ణ, జ్ఞానేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మెగా జాబ్ డ్రైవ్‌లో 115 మందికి ఉద్యోగాలు
నిజామాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని ఉమెన్స్ కళాశాలలో మ్యాజిక్ బస్, సిస్కో ఆధ్వర్యంలో సోమవారం మెగా జాబ్ డ్రైవ్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ కళాశాలలకు చెందిన 222 మంది విద్యార్థులు డ్రైవ్‌లో పాల్గొనగా, 115 మంది ఉద్యోగాలు సాధించారు. ఉమెన్స్ కళాశాలకు చెందిన 25మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందారు. మెగా జాబ్ డ్రైవ్‌లో యాక్సిస్ బ్యాంక్, ఫిన్విచ్, టెక్ మహీంద్రా కంపెనీలతోపాటు ఇతర 14 సంస్థలు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించాయి. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ భారతి రెడ్డి, కళాశాల ట్రైనింగ్ కం ప్లేస్మెంట్ అధికారి ప్రసాద్, మహేశ్, ఉమెన్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు రాజేందర్, కరస్పాండెంట్ కిషన్ రెడ్డి, జయంతి, సెక్రెటరీ పద్మనాభరెడ్డి, కోశాధికారి అప్పన్న తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ సమగ్రతకు పాటుపడాలి
● పోటీతత్వాన్ని పెంపొందించుకోవాలి ● రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరితెయూ(డిచ్పల్లి): జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ద్వారా వలంటీర్లు జాతీయ సమగ్రతకు పాటుపడాలని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి సూచించారు. తెయూ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం ప్రీ రిపబ్లిక్ పరేడ్ ఎంపికలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రిజిస్ట్రార్ యాదగిరి మా ట్లాడుతూ.. ఎన్ఎస్ఎస్ వలంటీర్లు సమాజ సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనాలని సూచించారు. ప్రతి వలంటీర్ ప్రీ పరేడ్ ఎంపికకు పోటీ పడాలని, పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర ఎన్ఎస్ఎస్ యువజన అధికారి సైదా నాయక్ పర్యవేక్షణలో విద్యార్థుల ఎత్తు, పరు గు పందెం, పరేడ్, కల్చరల్ కార్యక్రమాలు, వ్యక్తిగత నైపుణ్యాన్ని పరీక్షించారు. కార్యక్రమంలో తె యూ ఎన్ఎస్ఎస్ కో–ఆర్డినేటర్ ప్రొఫెసర్ కే రవీందర్‌రెడ్డి, ప్రోగ్రాం అధికారులు స్వప్న, సంపత్, స్ర వంతి, అలీంఖాన్, అంజయ్య, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగాలి
● రిటైర్డ్ జడ్జి హేమంత్‌కుమార్ తెయూ(డిచ్పల్లి): అధికారం, ధనం, బంధుప్రీతికి అతీతంగా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగాలని చట్టాలు సూచిస్తున్నాయని హైదరాబా ద్ జిల్లా రిటైర్డ్ జడ్జి డాక్టర్ డి.హేమంత్‌కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ యూనివర్సిటీ న్యాయ కళాశాలలో సోమవారం ‘చట్టాల విశ్లేషణ – వివేచన’ అంశంపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన రిసోర్స్ పర్సన్‌గా హాజరై ప్రసంగించారు. సమాజంలో పెడధోరణులు పెరగకుండా చట్టాలు సహజ సూత్రాలను అందిస్తాయన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం కుల, మత, వర్గ, వర్ణ తేడా లేకుండా చట్టం దృష్టిలో అందరూ సమానమని తెలిపారు. అనంతరం న్యాయ విద్యార్థులు అడిగిన పలు సందేహాలకు వివరణాత్మకంగా సమాధానాలు ఇచ్చారు. కార్యక్రమంలో న్యాయ కళాశాల ప్రిన్సిపల్ కే ప్రసన్న రాణి, బీవోఎస్ చైర్మన్ బీ స్రవంతి, న్యాయ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.● అసిస్టెంట్ లేబర్ కమిషనర్ నరేందర్‌రాజు నిజామాబాద్‌నాగారం: జిల్లాలో ఎలక్ట్రీషియన్ పనులు చేస్తున్న ప్రతి ఒక్కరూ కచ్చితంగా లేబర్‌కార్డులు తీసుకోవాలని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ నరేందర్‌రాజు తెలిపారు. నగరంలోని గవర్నమెంట్, ప్రైవేటు ఎలక్ట్రికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వైసాక్షి సంతోష్ ఆధ్వర్యంలో సోమవారం లేబర్ కార్డులపై అవగాహన కల్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే కార్డులతో ఇన్సూరెన్స్, ఆర్థికసాయం అందుతుందన్నారు. కార్డు ఐదేళ్లకోసారి రెన్యువల్ చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎలక్ట్రీషియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సలీం, టౌన్ ప్రెసిడెంట్ రమేశ్, అజీమ్ అత్తర్ ఖాన్, లింబాద్రి తదితరులు పాల్గొన్నారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఏర్పాటు చేసిన 7 పరీక్ష కేంద్రాల్లో కొనసాగుతున్న పీజీ, బీఈడీ, బీపీఎడ్ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షల్లో సోమవారం 90 మంది విద్యా ర్థులు గైర్హాజరైనట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం జరిగిన పీజీ, ఇంటిగ్రేటెడ్ పీజీ 2,4వ సెమిస్టర్ పరీక్షలకు 1504 మంది విద్యార్థులకు 1438 మంది హాజరు కాగా 66 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన బీఈడీ, బీపీఎడ్ పరీక్షలకు 489 మంది విద్యార్థులకు గానూ 465 మంది హాజరుకాగా 24 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. -
కోతుల దాడిలో గాయపడ్డ వృద్ధుడు మృతి
భిక్కనూరు: మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో కో తుల దాడిలో గాయపడ్డ వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. గ్రామానికి చెందిన కర్రె సిద్ధయ్య (65) ను ఈ నెల 17న ఇంటి వద్ద కోతులు దాడి చేశాయి. దీంతో కిందపడిన ఆయన తుంటి ఎముక విరిగింది. వెంటనే కుటుంబీకులు ఆయనను చికిత్స నిమిత్తం కామారెడ్డిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మూడు రోజుల క్రితం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన సిద్ధయ్య సోమవారం మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, కుమారుడు బాబు, నలుగురు కుమార్తెలు లక్ష్మి, రేణుకా అనిత, లావణ్య ఉన్నారు. -
ఎస్సారెస్పీ నీటి విడుదల నిలిపివేత
● 29,907 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ● కాలువల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి వరద గేట్ల ద్వారా గోదావరిలోకి నీటి విడుదలను ప్రాజెక్ట్ అధికారులు సోమవారం మధ్యాహ్నం నిలిపివేశారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్ట్‌లోకి భారీ వరదలు రావడంతో గత సోమవారం నుంచి 25 వేల క్యూసెక్కుల నీటి విడుదలను ప్రారంభించారు. గరిష్టంగా 3.75 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. ప్రాజెక్ట్‌లోకి ఆదివారం రాత్రి ఇన్‌ఫ్లో తగ్గడంతో గోదావరిలోకి నీటి విడుదలను క్రమంగా తగ్గించారు. చివరికి 2 గేట్ల ద్వారా 6 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. సోమవారం మధ్యాహ్ననికి పూర్తిగా గేట్లు మూసివేశారు. కొనసాగుతున్న వరద నీరు ఎస్సారెస్పీలోకి ఎగువ ప్రాంతాల నుంచి 29,907 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. సోమవారం 37వేల క్యూసెక్కులకు తగ్గిన వరద, మధ్యాహ్నానికి 29,907 క్యూసెక్కులకు పడిపోయింది. ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులు, ఎస్కెప్ గేట్ల ద్వారా 4500 క్యూసెక్కులు, కాకతీయ కాలువకు 3500, సరస్వతి కాలువకు 500, లక్ష్మి కాలువకు 150, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు. 651 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో పోతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి ప్రాజెక్ట్ 1090.90(80.05 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు. ఏటికి ఎదురీదుతున్న మత్స్యకారులు ఎస్సారెస్పీ నుంచి వరద గేట్ల ద్వారా గోదావరిలోకి నీటి విడుదల తగ్గుముఖం పట్టడంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్తున్నారు. చేపల కోసం మత్స్యకారులు నీటితో సహవాసం చేస్తున్నారు. ప్రాజెక్ట్ వరద గేట్ల ముందర తెప్పలపై వెళుతూ, బండరాళ్లపై నిలబడి చేపలు పడుతున్నారు. మరోవైపు గోదావరిలోకి నీటి విడుదల చేసే సమయంలో చేపలు, చేప పిల్లలు కొట్టుకుపోతున్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు వరద గేట్లకు జాలీ గేట్లు ఉంటే చేప పిల్లలు గంగపాలయ్యేవి కావని అభిప్రాయపడుతున్నారు. కాగా, వరద గేట్లకు జాలి గేట్లు పెట్టే పరిస్థితి ఉండదని ప్రాజెక్ట్ అధికారులు చెబుతున్నారు. -
విద్యుదాఘాతంతో యువ రైతు మృతి
నస్రుల్లాబాద్ : మండలంలోని నెమ్లి గ్రామ శివారులో ఉన్న పంట పొలాల్లో విద్యుదాఘాతంతో యువ రైతు మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. గ్రా మస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బొబ్బిలి శ్రీనివాస్(39) నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఎక్స్–రే టెక్నీషియన్ గా పనిచేస్తాడు. భార్య ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా ఉద్యోగం చేస్తుంది. శ్రీనివాస్ సోమవారం ఉద యం పొలానికి పురుగు మందు పిచికారీ చేసేందు కు వెళ్లాడు. ఉదయం వెళ్లిన వ్యక్తి మధ్యాహ్నం వర కు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు పొలానికి వెళ్లి చూడగా పంట కాలువలో విగతజీవిగా పడి ఉన్నాడు. వెంటనే గ్రామస్తులు, పోలీసులకు సమాచారం అందించారు. పొలానికి స్ప్రే చేయడానికి మందులు తీసుకొని వచ్చి, బోరు ఆగిపోయి ఉండటంతో శ్రీనివాస్ స్టార్టర్ బాక్సులోని మూడు ఫ్యూజులలో ఒక ఫ్యూజు మాత్రమే తీసి బోరును ముట్టుకుని ఉన్నాడు. బోరు మోటారు నుంచి విద్యుత్ సరఫరా కావడం, పంట కాలువలో నీరు ఉండటంతో షాక్ తగిలి అక్కడిక్కడే షాక్ మృతి చెందాడన్నారు. ఘటనా స్థలాన్ని ఎస్సై రాఘవేంద్ర పరిశీలించి మృతదేహాన్ని బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య రమ్య, కూతురు పర్ణిత, కొడుకు రియాంత్ ఉన్నారు. నాన్నా... అంటూ చిన్నారి ఏడుపు పొలాల మధ్య నుంచి శ్రీనివాస్ మృతదేహాన్ని రోడ్డుపైకి స్థానికులు తీసుకుని వచ్చారు. అప్పుడే పాఠశాల నుంచి వచ్చిన కూతురు పర్ణిత నాన్నా అంటూ ఒక్కసారిగా ఏడవడంతో స్థానికులు కన్నీరు మున్నీరయ్యారు. -
వేధిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోండి
నవీపేట మండలం అల్జాపూర్ గ్రామానికి చెందిన సంతోష్ అదే గ్రామానికి చెందిన ఓ మహిళను శారీరకంగా వేధించి అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వెంటనే అతనిపై చర్య తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ నిజామాబాద్ అర్బన్ అధ్యక్షుడు సుధాకర్ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అల్జాపూర్ గ్రామానికి చెందిన మహిళను బెదిరించి లొంగదీసుకుని శారీరకంగా వేధించాడని, అనంతరం వీడియోలు, ఫొటోలు బయట పెడతానంటూ బెదిరిస్తున్నాడని పేర్కొన్నారు. సంతోష్‌పై నవీపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదని పేర్కొన్నారు. సంతోష్‌తో సదరు మహిళకు ప్రాణహాని ఉందని, వెంటనే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. -
పీజీలో వినూత్న కోర్సులు
● బీఆర్‌ఏవోయూ జేడీ రాజేందర్‌రెడ్డి నిజామాబాద్‌అర్బన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ జిల్లా ప్రాంతీయ కేంద్రంలో పీజీ సైన్స్ కోర్సులతోపాటు వివిధ వినూత్న పీజీ విద్యా కార్యక్రమాలను అందిస్తున్నామని వర్సిటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నైపుణ్య ఉపకార వేతన ఆధారిత విద్య కార్యక్రమాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని వర్గాలకు సమాన విద్య అవకాశాలను అందించేందుకు సమత, నిపుణ ఫెలోషిప్‌లు అందిస్తున్నామని తెలిపారు. నిజామాబాద్ అధ్యయన కేంద్రంలో ఈ విద్యా సంవత్సరం నుంచి పీజీ సైన్స్, లైబ్రరీ సైన్స్ కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపాల్ రామ్మోహన్ రెడ్డి, ప్రాంతీయ సమన్వయ కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ రంజిత, అసిస్టెంట్ ప్రొఫెసర్ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
రుద్రూర్: తాళం వేసిన ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడిన ఘటన పోతంగల్ మండల కేంద్రంలో జరిగింది. కోటగిరి ఎస్సై సునీల్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పోతంగల్ గ్రామానికి చెందిన మొండి రాములు ఆదివారం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లాడు. సోమవారం ఉదయం ఇంటికి వచ్చేసరికి తాళం పగలగొట్టి ఉంది. బీరువాలోని రెండున్నర తులాల బంగారం, 38 తులాల వెండి ఆభరణాలు దుండగులు అపహరించుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. ఖలీల్‌వాడి: నగరంలోని శ్రద్ధానంద్ గంజ్‌లో సోమవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి (35) ఉరేసుకొని మృతి చెందినట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. మృతుడి ఒంటిపై బ్లూ రంగు టీ షర్టు, నేవీ బ్లూ రంగు ప్యాంట్ ఉందని పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లభించలేవని, మృతదేహాన్ని జీజీహెచ్‌లోని మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలిస్తే మూడో టౌన్ పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు. బాన్సువాడ రూరల్: మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూం కాలనీలో నివాసముండే గులాం జిలానీ(50) ప్రమాదవశాత్తు తాడ్కోల్ శివారులోని బీడీ వర్కర్స్ కాలనీలోని డ్రెయినేజీలో పడి మృతి చెందాడు. బాన్సువాడలోని ఓ హోటల్లో పనిచేసే జిలానీ శుక్రవారం రాత్రి పని ముగించుకొని ఇంటికి బయల్దేరాడు. ఆదివారం రాత్రి వరకు అతని ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం కాలనీలో దుర్వాసన రావడంతో గుర్తించిన స్థానికులు పోలీసులకు సమా చారం అందించారు. మృతుడిని జిలానీగా గుర్తించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య షహనాజ్ ఫిర్యాదు మేరకు బాన్సువాడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సిరికొండ: మండలంలోని కొండూరు గ్రామంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చెల్లం లక్ష్మి (60) మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. లక్ష్మి, ఆమె భర్త నడ్పి గంగయ్య కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా గ్రామంలో ఎదురుగా వచ్చిన ద్విచక్రవాహనం వీరి వాహనానికి తగిలింది. దీంతో భార్యాభర్తలు వాహనంపై నుంచి కిందపడిపోయారు. గాయాలపాలైన లక్ష్మిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. -
సొంతగూటికి విజయభారతి
● కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిక ఆర్మూర్: నియోజకవర్గ పరిధిలోని ఆలూర్ మండల కేంద్రానికి చెందిన బీజేపీ నాయకురాలు విజయభారతి హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆలూర్ నుంచి వాహనాల్లో ర్యాలీగా హైదరాబాద్‌కు వెళ్లి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీజేపీ సీనియర్ నాయకుడు ఆలూర్ గంగారెడ్డి కూతురు విజయభారతి సొంతగూటికి చేరుకున్నట్లు కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిక కార్యక్రమంలో మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి, ఆయుష్య, జెడ్పీ మాజీ చైర్మన్ దాదన్న గారి విఠల్‌రావు, అరవింద్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ మోతె చిన్నారెడ్డి, మోహన్ రెడ్డి, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
పక్కా ప్లాన్‌తో ర్యాగింగ్?
● మెడికోపై సీనియర్ల అక్కసు ● జీజీహెచ్ రూమ్ నంబర్ 302లో ర్యాగింగ్, దాడినిజామాబాద్నాగారం: జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న రాహుల్‌ను హౌస్ సర్జన్ ట్రెయినీలు(సీనియర్లు) పక్కా ప్లాన్ ప్రకారం ర్యాగింగ్ చేసినట్లు తెలుస్తోంది. నాలుగేళ్లుగా తనపై కక్షగట్టారని, అదునుకోసం ఎదురు చూసి ర్యాగింగ్ చేస్తూ దాడి చేశారని బాధితుడు వాపోయాడు. ప్రభుత్వ ఆస్పత్రికి సమయానికి చేరుకొని డ్యూటీ చేసినా రిజిస్టర్లో అబ్సెంట్ వేశారని, దీనిపై ప్రశ్నించడంతో ఇదే అదునుగా తనను రూమ్ నంబర్ 302లోకి తీసుకెళ్లి రౌండప్ చేశారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితుడు పోలీసులకు చేసిన ఫిర్యాదులు పూర్తి వివరాలు పేర్కొన్నాడు. లేబర్ వార్డు వద్ద మొదలై.. రాహుల్‌ను ముందుగా లేబర్ వార్డు వద్ద బెదిరించిన సీనియర్లు ఆ తరువాత రూమ్‌నంబర్ 302కి పిలిపించారు. అక్కడికి వెళ్లిన రాహుల్‌ను 15 నుంచి 20మంది బూతులు తిడుతూ రాహుల్‌ను రౌండప్ చేశారు. మమ్మల్ని ఎదిరిస్తావా? ఎయిర్ చెయిర్ వేయి.. బయోడేటా చెప్పు అంటూ గంటలపాటు ర్యాగింగ్ చేశారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని రిపోర్టులు చూయించినా పట్టించుకోలేదు. ఒకే సారి ఐదుగురు దాడి చేశారు. రాహుల్ సెలఫోన్ లాక్కుని వాట్సాప్ చాటింగ్ చేశారు. ఇదంతా శనివారం సాయంత్రం 4.30 నుంచి రాత్రి 7.30గంటల వరకు సాగింది. విచారణకు కమిటీ ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఘటనపై విచారణ చేపట్టేందుకు నలుగురు సీనియర్ ప్రొఫెసర్లతో కమిటీ వేస్తామని ఇన్చార్జి సూపరింటెండెంట్ రాములు తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. వినాయక చవితి గొడవ అంటూ బుకాయింపు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మెడిసిన్ విద్యార్థుల మధ్య ర్యాగింగ్, గొడవ ఘటనలు జరిగినప్పటికీ ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్, వైద్యులు మాత్రం మెడికోలు వినాయకచవితి పేరుతో రెండు గ్రూపులుగా విడిపోవడంతో గొడవ జరిగిందని బుకాయించారు. ఇంత జరిగినా విషయం బయటికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చివరికు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమపై నాలుగేళ్లుగా కక్షగట్టారని, తాము డే స్కాలర్స్ కావడంతో అక్కసు పెంచుకున్నారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఐదుగురు వైద్య విద్యార్థులపై కేసు ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సీపీ ఖలీల్‌వాడి: ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనలియర్ విద్యార్థి రాహుల్రెడ్డిపై దాడి చేసిన ఐదుగురి సీనియర్లపై కేసు నమో దు చేసినట్లు సీపీ సాయిచైతన్య ఆదివారం తెలి పారు. కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. డే స్కాలర్కాగా కొనసాగుతున్న నగరంలోని వీక్లి మార్కెట్‌కు చెందిన రాహుల్ ను మొదటి సంవత్సరం నుంచి సీనియర్ అయిన సాయిరాం పవన్ బూతులు తిడుతూ ర్యాగింగ్ చేసేవాడు. ప్రస్తుతం ఫైనలియర్లో ఉన్న రాహుల్ ఆస్పత్రిలో డ్యూటీ చేయగా, రిజి స్టర్లో అతడికి సాయిరాం ఆబ్సెంట్ వేశాడు. దీనిపై ప్రశ్నించిన రాహుల్‌ను సీనియర్లు సా యిరాం పవన్, శ్రావణ్, సాత్విక్ హృదయపాల్, అభినవ్ పెద్ది, ఆదిత్య కొట్టడంతోపాటు కాలేజీలో ఎలా ఉంటావో.. ఎలా తిరుగుతా వో.. ఎలా పాస్ అవుతావో చూస్తామని భయబ్రాంతులకు గురి చేశారు. అంతకు ముందు ర్యాగింగ్ చేశారు. వారి నుంచి తప్పించుకుని ఇంటికి వెళ్లిన రాహుల్ తన ప్రాణానికి రక్షణ కల్పించాలని ఒకటో టౌన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాఠశాలలు, కళాశాలల్లో ర్యాగింగ్‌కు పా ల్పడే వారిని ఉపేక్షించేది లేదని, బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్ లేదా డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్‌రూమ్ 87126 59700కు స మాచారం అందించాలని సూచించారు. -
హల్చల్
నిజామాబాద్‌నార్త్ గ్యాంగ్‌ల గాంధీ పేరును చోరీ చేసింది.. రాహుల్‌గాంధీ ఓట్ చోరీ అంటూ డ్రామాలు చేస్తున్నారని, గాంధీ పేరును చోరీ చేసింది సోనియా కుటుంబమేనని ధన్పాల్ అన్నారు.సోమవారం శ్రీ 25 శ్రీ ఆగస్టు శ్రీ 2025– 8లో uచంద్రశేఖర్ కాలనీలో గ్యాస్ కట్టర్‌తో ధ్వంసం చేసిన ఏటీఎం (ఫైల్) తెయూ ఇంజినీరింగ్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్స్ తెయూ(డిచ్పల్లి): తెలంగాణ రాష్ట్ర టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్, అడ్మిషన్స్ కన్వీనర్ టీజీఎప్‌సెట్–2025 ఉత్తర్వుల ప్రకారం తె లంగాణ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 26, 28, 29వ తేదీల్లో అర్హులైన అభ్యర్థులకు స్పాట్ అడ్మిషన్స్ ఇవ్వనున్నా రు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), కంప్యూటర్ సైన్స్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), కంప్యూటర్ సైన్స్ (డాటా సైన్స్) కో ర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్లలో విద్యార్థులు స్పాట్ అడ్మిషన్లు పొందొచ్చని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సీహెచ్ ఆరతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత కౌన్సెలింగ్‌లో సీ ట్లు అలాట్ అయినవారు స్పాట్ అడ్మిషన్ ప్రక్రియలో పాల్గొనరాదని స్పష్టం చేశారు. ఈడబ్ల్యూఎస్ కోటా నిబంధనలు స్పాట్ అ డ్మిషన్స్కు వర్తించవని ప్రిన్సిపాల్ తెలిపారు. స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు ఫీజు రియింబర్స్‌మెంట్ వర్తించదన్నారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్సైట్ www. telanganauniversity. ac.inను సంప్రదించాలని సూచించారు. స్టాఫ్‌నర్సుల జాబితాలో గందరగోళం నిజామాబాద్‌నాగారం: వైద్య, ఆరోగ్యశాఖ లో స్టాఫ్ నర్సుల సెలక్షన్ జాబితా గందరగోళంగా మారింది. 1:2 జాబితాను ఈ నెల 23న శాఖ వెబ్సైట్లో పెట్టారు. 30 పోస్టుల కు గాను 60మంది పేర్లను పెట్టారు. అయితే 60 మంది జాబితాలో 13మంది పేర్లు రెండేసి సార్లు రావడంతో అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. 30 పోస్టులకు వందలాది దరఖాస్తులు వచ్చాయి. సర్టిఫికెట్లను పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఐదుగురిని ని యమించారు. అయినా జాబితాలో మాత్రం 13మంది పేర్లను రెండేసి సార్లు రావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 26న ఆర్డర్ కాపీలు ఇవ్వాల్సి ఉంది. నేటి నుంచి యాంత్రీకరణ దరఖాస్తుల స్వీకరణ ● రైతు వేదికల్లో స్వీకరించనున్న అధికారులుడొంకేశ్వర్(ఆర్మూర్): యాంత్రీకరణ పథకం కింద రాయితీపై వ్యవసాయ పనిముట్ల కో సం రైతులు దరఖాస్తులు చేసుకోవాలని జి ల్లా వ్యవసాయాధికారి మేకల గోవింద్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. రైతు వేదిక ల్లో సోమవారం నుంచి వ్యవసాయాధికారు లు అందుబాటులో ఉంటారని పేర్కొన్నా రు. జిల్లాకు 6,742 యూనిట్లు మంజూరు కా గా మొదటి విడతగా రూ.1.67కోట్లు మంజూరయ్యాయని, మొత్తం 11రకాల వ్యవసా య పరికరాలకు సబ్సిడీ వర్తిస్తుందని తెలిపారు. ఐదెకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్న ఎస్సీ, ఎస్టీ చిన్న, సన్నకారు రైతులకు, మహిళలకు 50శాతం, పెద్ద రైతులకు 40 శాతం సబ్సిడీ ఉందని పేర్కొన్నారు. దరఖాస్తుతోపాటు పట్టాపాస్ పుస్తకం, ఆధార్ జిరా క్స్ అందజేయాలని సూచించారు. గతంలో లబ్ధి పొందని రైతులకు ప్రాధాన్యత ఉంటుందని, లబ్ధిదారుల ఎంపిక తర్వాత పరికరాలు సరఫరా చేసే కంపెనీ పేరుపై రైతులు డీడీ తీయాల్సి ఉంటుందని తెలిపారు. యూపీ, ఢిల్లీ, హర్యానా.. వేల కిలో మీటర్ల దూరంలోని ఆయా రాష్ట్రాల నుంచి వస్తున్న దొంగలు దడ పుట్టిస్తున్నారు. వేల కిలోమీటర్ల ప్రయాణం.. వస్తూ వస్తూ వాహనాల దొంగతనాలు.. ఆ వాహనాల్లోనే తిరుగుతూ ఏటీఎంలు, ఇళ్లను కొల్లగొడుతున్నారు. పని పూర్తి కాగానే వాహనాలను ఎక్కడో ఓ చోట వదిలేసి సొంత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి చోరీలకు పాల్పడుతున్న వారిని పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారుతోంది. ఖలీల్‌వాడి: జిల్లాలో జరుగుతున్న వరుస దోపిడీ కేసుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వారి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పలు కేసుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని అరెస్టు చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఉత్తర భారతదేశంలోని ఉత్తర ప్ర దేశ్, హర్యానా, ఢిల్లీ ప్రాంతాల నుంచి వచ్చి పక్కా స్కెచ్‌తో దోపిడీలకు పాల్పడుతుండగా, నేరస్తులు పట్టుబడకపోవడంతో పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మహారాష్ట్ర నుంచి చెడ్డీ గ్యాంగ్.. మహారాష్ట్రకు చెందిన చెడ్డీ గ్యాంగ్ పేరు వింటేనే హడల్. ఒంటిపై చొక్కా, కాళ్లకి చెప్పులు లేకుండా చెడ్డీలు ధరించి ఒంటికి నూనె రాసుకొని, చేతిలో రాడ్లు పట్టుకుని చోరీలు చేస్తుంటారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్‌నగర్, ముబారక్‌నగర్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి. ఆరు సంవత్సరాల్లో ఆరు దొంగతనాలు చేయగా రెండు కేసులను పోలీసులు ఛేదించారు. ఏడాదిన్నర క్రితం నగరంలోని మూడో పోలీస్‌స్టేషన్ పరిధిలో చెడ్డీ గ్యాంగ్ కదలికలను గుర్తించారు. ఆ తరువాత గ్యాంగ్ మళ్లీ జిల్లాలో కనిపించలేదు. బ్యాంక్‌లు, సెల్‌ఫోన్ టవర్లు.. యూపీ ముఠాల టార్గెట్ మూడేళ్ల క్రితం మెండోరా మండలం బుస్సాపూర్ లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో యూపీకి చెందిన ముఠా దోపిడీకి పాల్పడింది. గ్యాస్‌కట్టర్‌తో షట్టర్‌ను తొలిగించి 8 కిలోల 300 గ్రాముల బంగా రం ఎత్తుకెళ్లింది. రూ.7.30 లక్షల నగదు కాలిపో యింది. ఇప్పటి వరకు ఈ ముఠా సభ్యుల్లో ఇద్దరిని అరెస్ట్ చేసి వారి నుంచి కొంత బంగారాన్ని స్వాధీ నం చేసుకున్నారు. జక్రాన్‌పల్లి ప్రాంతంలోని సెల్ టవర్‌కు సంబంధించిన విలువైన సామగ్రిని యూ పీ ముఠా ఎత్తుకెళ్లింది. ఢిల్లీ ప్రాంతంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడి వాహనాలు ఆ రాష్ట్రాలకు.. పొరుగునే ఉన్న కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన ముఠాలతోపాటు జిల్లాకు చెందిన ముఠాలు బైక్ లు, కార్లు, ఆటోలను చోరీలకు పాల్పడుతున్నాయి. ఇక్కడి వాహనాలను కర్ణాటక, మహారాష్ట్రకు తరలించి అక్కడ స్పేర్పార్ట్లుగా విడగొట్టి విక్రయిస్తున్నా రు. జిల్లాకు చెందిన బైక్ దొంగల ముఠాను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇనుప సామగ్రినీ వదలరు మహారాష్ట్రలోని నాగ్‌పూర్, నాందెడ్ ప్రాంతాలకు చెందిన వారు ఇసుప సామగ్రినీ మాయం చేస్తున్నారు. విద్యుత్ నియంత్రికల్లోని కాపర్ కాయిల్స్ దోచుకెళ్లిన ఘటనలు అనేకం ఉన్నాయి. వాటిని స్క్రాప్ కింద మార్చి ముంబై, ఢిల్లీ, గుజరాత్ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. రెండు సీవోఈ మైనారిటీ కళాశాలలునిజామాబాద్ అర్బన్: ఉమ్మడి జిల్లాకు మైనారిటీ గురుకులాల విద్యాసంస్థలు(టెమ్రిస్) ఆధ్వర్యంలో సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ (సీవోఈ) కళాశాలలు రెండు మంజూరయ్యాయి. టెమ్రిస్ సెక్రెటరీ షఫియుల్లా ఉత్తర్వులు జారీ చేశారు. నాగారం (బాలుర), ధర్మపురి హిల్స్(బాలికల) సీవోఈ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు టెమ్రిస్ ఉమ్మడి జిల్లా బీఎల్సీ బాసిర్ తెలిపారు. ఉమ్మడి జిల్లా మైనారిటీ కేటగిరీకి చెందిన (ముస్లిములు, క్రిస్టియన్లు, పార్సీలు, జైనులు, సిక్కులు) వారితోపాటు నాన్ మైనారిటీ కోటా కింద (ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ) అర్హత కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఈనెల 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, మరిన్ని వివరాలకు మైనారిటీ గురుకులాల ప్రిన్సిపాల్ సయ్య ద్ హైదర్ (89857 83112), ఆయేషా (85550 30851), ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారి బసీర్ (98494 19469)ను సంప్రదించాలని సూచించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పర్యాటకులతో కళకళలాడుతోంది. వరద గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. ఆదివారం సెలవు దినం కావడంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆనకట్టపై గుర్రపు స్వారీ చేస్తూ ఉల్లాసంగా గడిపారు. ప్రాజెక్టు వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు. – బాల్కొండఏటీఎంలలో హర్యానా ముఠాలు.. జిల్లా వాసుల్లో దడ పుట్టిస్తున్న గ్యాంగ్‌లు ఏటీఎంలు కొల్లగొడుతున్న ముఠాలు బ్యాంకులను టార్గెట్ చేస్తున్న యూపీ చోరులు చోరీ వాహనాలు మహారాష్ట్ర, కర్ణాటకకు..జాతీయ రహదారి వెంట ఉన్న ఏటీఎంలలో దోపిడీ చేయడం హర్యానా ముఠాల ప్రత్యేకత. నాలుగు రోజుల క్రితం నిజామాబాద్ నగరంలో ని చంద్రశేఖర్‌కాలనీ చౌరస్తాలో ఏటీఎంలో చోరీ కి యత్నించారు. గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను ధ్వంసం చేశారు. పోలీసులు వెంబడించడంతో వాహ నాన్ని వదిలేసి పరారయ్యారు. అదే రోజు ఆర్మూ ర్లోని ఏటీఎంను కొల్లగొట్టేందుకు ఇదే ముఠా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితం నవీపేట్‌లోని ఏటీఎంలో చోరీకి ఓ గ్యాంగ్ ప్రయత్నించింది. ఈ మూడు ప్రాంతాల్లో ఏటీ ఎంలలో చోరీకి యత్నించింది ఒకే ముఠా అని పోలీసులు భావిస్తున్నారు. దుండగులను పట్టుకునేందుకు పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడ్డారు. దుండగులు మహారాష్ట్రలోని లాతూర్‌లో మారుతీ వ్యాన్‌ను చోరీ చేసి అందులోని వచ్చినట్లు గుర్తించారు. పాత నేరస్తుల పనేనని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
ఎస్సారెస్పీకి తగ్గిన వరద
బాల్కొండ: ఎస్సారెస్పీకి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టింది. ఎగువ ప్రాంతాల నుంచి 65 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్ట్ నుంచి గోదావరిలోకి నీటి విడుదలను ప్రాజెక్ట్ అధికారులు తగ్గించారు. గోదావరిలోకి 8 వరద గేట్ల ద్వారా 25 వేల క్యూసెక్కుల నీరు పోతుంది. వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 3500, ఎస్కెప్ గేట్ల ద్వారా 4500, సరస్వతి కాలువ ద్వారా 500, లక్ష్మి కాలువ ద్వారా 150, ఆవిరి రూపంలో 651, మిషన్ భగీరథ ద్వారా తాగు నీటి అవసరాలకు 231 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1090.90(80.05టీఎంసీలు) అడుగుల నీటి నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు పేర్కొన్నారు. మరింత పెరిగిన విద్యుదుత్పత్తి ప్రాజెక్ట్ వద్ద ఉన్న జల విద్యుదుత్పత్తి కేంద్రంలో విద్యుదుత్పత్తి మరింత పెరిగింది. నాలుగు టర్బయిన్ల ద్వారా 36.5 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుంది. ప్రాజెక్ట్ నుంచి ఎస్కేప్ గేట్ల ద్వారా, కాకతీయ కాలువ ద్వారా కలిపి 8 వేల క్యూసెక్కుల నీట విడుదల కొనసాగుతోంది. ఆదివారం మరింత పెరిగి 36.50 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 9.84మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగిందని జెన్కో డీఈఈ శ్రీనివాస్ తెలిపారు. -
టీపీడీఈఏ సర్కిల్ కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
సుభాష్‌నగర్: తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజినీర్స్ అసోసియేషన్ (టీపీడీఈఏ) నిజామాబాద్ సర్కిల్ కార్యవర్గాన్ని ఆదివారం నగరంలోని సంఘం కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ నరేందర్ ఎన్నికల అధికారిగా, సర్కిల్ సెక్రెటరీ సంపత్ సహాయ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. అంతకుముందు జిల్లా సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు పి రాజేందర్‌రెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా కంపెనీ జనరల్ సెక్రెటరీ నార్ల సుబ్రహ్మణ్యేశ్వరరావు హాజరయ్యారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ నరేందర్, కంపెనీ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ మల్లికార్జున్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తోట రాజశేఖర్, కంపెనీ జాయింట్ సెక్రెటరీ శ్రీధర్‌రెడ్డి, వెంకట్‌నారాయణ, సర్కిల్ కార్యదర్శి ఏ కాశీనాథ్, కోశాధికారి పి శ్రీనివాస్, మహిళా ప్రతినిధి ఆర్ సుమిత, ఆర్గనైజింగ్ సెక్రటరీ సాయి తేజ, ఆఫీస్ సెక్రటరీ కెఎస్ఆర్ మూర్తి, డివిజన్ సెక్రెటరీలు జి శ్రీనివాస్, బల్ల శ్రీనివాస్, నాయిని కృష్ణ, శంకర్ గౌడ్, గంగాధర్, కోశాధికారులు భరత్, గిరిధర్, భరత్ కుమార్, కాంతారావు, జుబేర్, ఏడీఈలు, ఏఈలు, సబ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.నిజామాబాద్ అర్బన్: నందిపేట మండలం కుద్వాన్పూర్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు శంకర్‌ను సస్పెన్షన్ చేస్తూ డీఈవో అశోక్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలలో విద్యార్థులను కొట్టడం, వారి కళ్లల్లో కారం చల్లడం వంటి ఆరోపణలు రావడంతో ఎంఈవో గంగాధర్ చేపట్టిన విచారణ, నివేదిక ఆధారంగా సస్పెన్షన్ చేసినట్లు పేర్కొన్నారు. సదాశివనగర్: మండల కేంద్రంలోని ఓ గోల్డ్షాప్కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారని ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన బంజ ప్రభులింగం అనే వ్యక్తి గోల్డ్షప్ ఫర్నీచర్ కోసం ఓ దుకాణంలో పనులు చేపడుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు పనులు జరుగుతున్న షాప్‌లోకి చొరబడి ఫర్నీచర్‌కు నిప్పంటించారు. ఈ ఘటనలో కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ ఘటనలో మండల కేంద్రానికి అవుసుల శ్రీధర్ పాత్ర కూడా ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
జెండా బాలాజీ ఉత్సవాలు ప్రారంభం
నిజామాబాద్ రూరల్: నగరంలో జెండా బాలాజీ ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. అనాధిగా వస్తున్న సంప్రదాయం ప్రకారం అర్చకుడు అజయ్ సంగ్వాయ్ జెండాకు ప్రత్యేక పూజలు చేశారు. శతాబ్దానికి పైగా ఘన చరిత్ర ఉన్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడి ఉత్సవ విగ్రహాలను స్థానిక బాసింగ్బాబా ఆలయానికి తీసుకొచ్చి వేదపండితుల వేదమంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పూజలు చేపట్టారు. మేళతాళాలతో బయలుదేరి జెండా గల్లీలోని జెండా బాలాజీ ఆలయానికి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. ఆలయంలో 15 రోజుల పాటు జాతర జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు శ్రీనివాసుడిని, జెండాను దర్శించుకోవాలని, నిత్యం ప్రత్యేక పూజలతో పాటు భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ విజయ రామారావు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ లవంగ ప్రమోద్ కుమార్, ఆలయ కార్యనిర్వాహణాధికారి గింజుపల్లి వేణు, ఆలయ అర్చకులు నాగరాజు, జూనియర్ అసిస్టెంట్ ప్రశాంత్ కుమార్, ధర్మకర్తలు లక్ష్మణ్, దేవిదాస్, నర్సింగ్ రావు, కిరణ్ కుమార్, విజయ రాజ్ కుమార్, భక్తులు పాల్గొన్నారు. -
చెరువులో దూకి మహిళ ఆత్మహత్య
కామారెడ్డి క్రైం: క్షణికావేశంలో ఓ మహిళ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి మండలం కొట్టాల్పల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బచ్చగారి రాజమణి(50) భర్త విఠల్ గల్ఫ్‌కు వెళ్లి వచ్చాడు. చేసిన అప్పులు తీరలేదు. దీంతో తరచూ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. భార్యా భర్తల మధ్య ఆదివారం ఉదయం మరోసారి గొడవ జరిగింది. క్షణికావేశానికి గురైన రాజమణి సమీపంలోని చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దేవునిపల్లి ఎస్సై రంజిత్ తెలిపారు. మోపాల్: మండలంలోని మోతీరాంనాయక్ తండా వద్ద రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఒకరికి గాయాలైనట్లు ఎస్సై జాడె సుస్మిత ఆదివారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. కాల్పోల్ తండాకు చెందిన హీరాబాయి నగరంలో నివాసం ఉంటోంది. తండాలో తీజ్ వేడుకలు ఉండటంతో యాక్టివాపై వెళ్తుండగా, మోతీరాంనాయక్ తండా వద్ద బైరాపూర్ శివారులోని పోచమ్మ తండాకు చెందిన బానోత్ మంగూరామ్ వేగంగా వచ్చి ఢీకొట్టాడు. ప్రమాదంలో హీరాబాయి కాలికి తీవ్ర గాయమైంది. క్షతగాత్రురాలిని స్థానికులు 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కామారెడ్డి క్రైం: కామారెడ్డి ముపన్సిపల్ పరిధిలోని టేక్రియాల్ వద్ద బైక్ అదుపుతప్పి పడిపోయిన ఘటనలో విద్యుత్ శాఖలో పని చేస్తున్న ఓ సబ్ ఇంజినీర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. టాన్స్‌కో జిల్లా కార్యాలయంలోని టెక్నికల్ విభాగంలో పని చేస్తున్న దేవీప్రసాద్ విధుల్లో భాగంగా టేక్రియాల్ వైపు వెళ్తుండగా బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొన్నాడు. ఈ ఘటనలో అతని తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కుటుంబీకులు వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడని విద్యుత్‌శాఖ అధికారులు తెలిపారు. గాంధారి: మండల కేంద్రంలోని దాబా నిర్వాహకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు ఆదివారం తెలిపారు. మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఓ దాబాలో ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా సిట్టింగ్ నిర్వహిస్తున్న నిర్వాహకుడు అన్వేష్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దాబాలు, హోటళ్లలో ఎవరైనా అనుమతి లేకుండా సిట్టింగ్‌లు ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్సై హెచ్చరించారు. బాన్సువాడ: బీర్కూర్ శివారులో అక్రమంగా మొరం తరలిస్తున్న మూడు టిప్పర్లు, పొక్లె యిన్ సీజ్ చేసినట్లు బీర్కూర్ ఎస్సై రాజశేఖర్ ఆదివారం తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా మొరం తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడులు చేసినట్లు పేర్కొన్నారు. దాడిలో మూడు టిప్పర్లను, పొక్లెయిన్ ను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా అనుమతులు లేకుండా మొరం తరలిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. -
మోదీపై పోటీ చేసిన ఇస్తారి మృతి
● 2019 పార్లమెంట్ ఎన్నికల్లో వారణాసి నుంచి పసుపు రైతుల తరఫున పోటీమోర్తాడ్(బాల్కొండ): పార్లమెంట్ ఎన్నికల్లో (20 19) ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేసిన పసుపు రైతు సున్నపు ఇస్తారి(78) అనారోగ్యంతో మృతి చెందా రు. పసుపు బోర్డు ఏర్పాటు డిమాండ్‌తో నిజామాబాద్, వారణాసి పార్లమెంట్ స్థానాల బరిలో పసుపు రైతులు పోటీ చేసిన విష యం తెలిసిందే. పసుపు బోర్డు సాధనే ధ్యేయంగా నాటి ఎన్ని కల్లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి వివి ధ పార్టీల అభ్యర్థులతో పాటు 178 మంది రైతులు పోటీ చేశారు. అయితే నరేంద్ర మోదీ పోటీచేస్తున్న వారణాసి నుంచి బరిలో నిలిస్తే తమ డిమాండ్ దేశమంతా తెలుస్తుందనే ఉద్దేశంతో నిజామాబాద్, జగిత్యాల్ జిల్లాల నుంచి 25 మంది రైతులు వారణాసికి వెళ్లి ఆయనపై పోటీకి నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 24 మంది నామినేష న్లు తిరస్కరణకు గురి కాగా, ఏర్గట్లకు చెందిన సున్నపు ఇస్తారి నామినేషన్‌కు ఆమోదం లభించింది. ఆ ఎన్నికల్లో ఇస్తారికి 787 ఓట్లు వచ్చాయి. నీటి సంఘం చైర్మన్‌గా వ్యవహరించిన ఇస్తారి ప్రధానిపై పోటీ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇస్తారి శనివా రం రాత్రి ఆయన ఇంట్లో కన్నుమూశారు. అంత్యక్రియలను ఆదివారం నిర్వహించగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు హాజరై నివాళులు అర్పించారు. -
గాంధీ పేరును చోరీ చేసింది సోనియా కుటుంబమే
● అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సుభాష్‌నగర్: రాహుల్‌గాంధీ ఓట్ చోరీ అంటూ డ్రామాలు చేస్తున్నారని, ఇటలీ నుంచి వచ్చి గాంధీ పేరును చోరీ చేసింది సోనియా కుటుంబమే అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఆదివారం నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో మోదీ 11 ఏళ్ల సుపరిపాలన ఓర్వలేక రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని బదనామ్ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. నగరంలోని శ్రీరామగార్డెన్లో సోమవారం నిర్వహించే జిల్లా బూత్‌స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ప్రతిఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి కోరారు. కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, ఎంపీ అర్వింద్ ధర్మపురి హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి, కేసీఆర్ ఒక గూటి పక్షులని, ఇద్దరూ కులం, వర్గం రాజకీయాలకే పరిమితమయ్యారని విమర్శించారు. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి, సమగ్రత, సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, నిమ్మల శ్రీనివాస్‌రెడ్డి, పోతన్కర్ లక్ష్మీనారాయణ, రూరల్ కన్వీనర్ పద్మారెడ్డి, నాయకులు పాల్గొన్నారు. ఖలీల్‌వాడి: నగరంలోని ఖలీల్వాడిలో ఏర్పాటు చేసిన వన్ వేతో ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయని సీపీ పోతరాజు సాయిచైతన్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐఎంఏ అసోసియేషన్, మున్సిపల్, డీఎంఅండ్‌హెచ్‌వో లతో నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ట్రాఫిక్ సిబ్బంది వన్ వేను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఖలీల్‌వాడి ప్రవేశ మార్గం నగరంలోని బీఎస్ఎన్ఎల్ సర్కిల్ ఎంట్రీ వద్ద నుంచి ఉందని, బయటకు వెళ్లాలంటే గ్రంథాలయం ముందు నుంచి, వెల్నెస్ హాస్పిటల్ పక్కనపున్న నలంద కాలేజీ ముందు, ఇతర మార్గాల నుంచి ఉందన్నారు. వాహన దారులకు వన్ వే ఎంట్రీ, ఎగ్జిట్ రూట్ మ్యాప్, ఫ్లెక్సీ లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వాహనదారులు, ప్రజలు విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు సహకరించాలని కోరారు. -
భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్
సదాశివనగర్: భార్యను బండరాయితో హత్య చేసిన భర్తను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సంతోష్‌కుమార్ తెలిపారు. సదాశివనగర్ పీఎస్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. మండల కేంద్రానికి చెందిన చిందం రవి, లక్ష్మి భార్యా భర్తలు. వీరి మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. శనివారం తెల్లవారుజామున భార్యాభర్త మధ్య గొడవ జరగడంతో కోపోద్రిక్తుడైన రవి భార్యపై బండరాయితో మోది హత్య చేశాడు. హత్యకు ఉపయోగించిన బండరాయిని, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. హత్య కేసును చేధించిన పోలీసులను డీఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో ఎస్సై పుష్పరాజ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యుత్ తీగలు తగిలి రైతు మృతి
భిక్కనూరు: దుక్కిదున్నుతున్న ట్రాక్టర్‌కు విద్యుత్ తీగలు తగలకుండా ఉండేందుకు చేసిన ప్రయత్నంలో ఓ రైతు విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో చోటు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి మండలం నర్సన్నపల్లికి చెందిన చిదుర రాజిరెడ్డి(46) జంగంపల్లి శివారులో ఉన్న రాజంపేట మండలం బస్వన్నపల్లికి చెందిన ఆశిరెడ్డికి చెందిన ఆరు ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. ఆదివారం ఆ భూమిని దున్నేందుకు రాజిరెడ్డి తన ట్రాక్టర్‌తో ఇంటి నుంచి పొలానికి వెళ్లాడు. పొలం దున్నుతుండగా బోరు బావికి కనెక్షన్ ఇచ్చిన సర్వీస్ వైరు ట్రాక్టర్‌కు తగులుతుందని దానిని పైకి లేపే ప్రయత్నం చేశాడు. దీంతో విద్యుదాఘాతం సంభవించడంతో రాజిరెడ్డి ట్రాక్టర్పైనే ప్రాణాలు విడిచాడు. కొద్ది సేపటికి అటు వైపుగా వెళ్లిన రైతులు విషయాన్ని గమనించి కుటుంబీకులకు, పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జల్లాపల్లి ఫారంలో యువకుడు.. రుద్రూర్: పొతంగల్ మండలం జల్లాపల్లి ఫారం కు చెందిన షేక్ ముబీన్ (30) అనే యువకుడు విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు కోటగిరి ఎస్సై సునీల్ ఆదివారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ముబీన్ తన స్నేహితులతో కలిసి శనివారం చేపలు పట్టేందుకు స్థానిక గ్రామ చెరువు వద్దకు వెళ్లాడు. చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ తీగ తగిలి కిందపడిపోయాడు. గమనించిన స్నేహితులు వెంటనే బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ముబీన్ మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య ముస్కాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.మాక్లూర్: మండలంలోని దాస్‌నగర్‌లో చిన్న గంగారాం(60) అనే వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు ఎస్సై రాజశేఖర్ ఆదివారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చిన్న గంగారాం గ్రామంలో పనులు చేస్తూ జీవిస్తున్నాడు. భార్య మూడు రోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లింది. కుమారుడు, కోడలు జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. కాగా ఆదివారం ఉదయం కుమారుడు తండ్రి గంగారాంకు ఫోన్ చేస్తే స్పందించడం లేదని ఇంటి పక్కన ఉన్న వారికి సమాచారం అందించారు. వారు వెళ్లి చూడగా ఇంటి తలుపులు లోపలి నుంచి గడియ పెట్టి ఉందని, కిటికీల నుంచి చూడగా విగతజీవుడిగా ఉన్నట్లు కుమారుడికి సమాచారం అందించారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ఉద్యాన పంటలకు రాయితీలు
● కూరగాయలు, పండ్లు, పూలతోటల సాగులో పందిరి నిర్మాణానికి సబ్సిడీలు ● జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్న అధికారులుఆర్మూర్: జిల్లాలో కూరగాయలు, పండ్లు, పూల తోటలు పండించే రైతులకు ఉద్యానశాఖ (హార్టిక ల్చర్) అధికారులు రాయితీలు అందజేసి ప్రోత్సహిస్తున్నారు. ప్రధానంగా వ్యవసాయాధారిత ప్రాంతమైన జిల్లాలో రైతులను ఉద్యాన పంటలవైపు ప్రోత్సహిస్తూ అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో ఉద్యాన శాఖ తోడ్పాటును అందిస్తోంది. జిల్లా రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. యాౖౖభై శాతం సబ్సిడీపై... జిల్లాలో వర్షాకాలంలో సుమారు 800 ఎకరాల్లో, ఎండాకాలంలో సుమారు రెండు వేల ఎకరాల్లో కూరగాయల పంటలను రైతులు పండిస్తున్నారు. ఇలాంటి రైతులకు సాగును బట్టి రాయితీలను అధికారులు అందిస్తున్నారు. తీగ జాతి (బీర, కాకర, దొండ, పొట్లకాయ, సోరకాయ) లాంటి కూరగాయల పెంపకం కోసం పందిరి సాగు చేసుకోవాలనుకొనే రైతులకు 50 శాతం రాయితీని అందిస్తున్నారు. ఒక రైతు కనీసం అర ఎకరం సాగు చేసుకోవాల్సి ఉంటుంది. అర ఎకరానికి ఉద్యాన శాఖ వారు గరిష్టంగా రూ.50 వేలకు మించకుండా రాయితీని అందజేస్తున్నారు. అదేవిధంగా టమాట, వంగ, మిరప నారును జీడీమెట్లలోని సెంటర్ఆఫ్ ఎక్ట్సెన్స్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా అందజేస్తున్నారు. ఒక ఎకరానికి ఎనిమిది వేల మొక్కలను తీసుకోవడానికి అవకాశం ఉంది. ఒక్కో రైతు రెండున్నర ఎకరాల్లో ఈ కూరగాయలను పండించడానికి నారును తీసుకోవచ్చును. అదేవిధంగా ఉద్యాన పంటలో వేసుకొనే మల్చింగ్ (కప్పు) కోసం 50 శాతం రాయితీ అంటే ఎకరానికి రూ.6400 రాయితీని రైతులకు అందిస్తున్నారు. ఒక్కో రైతు ఐదు ఎకరాల్లో పంటపైన కప్పు కోసం రాయితీ తీసుకోవచ్చును. ఇక మామిడి, జామ, సీతాఫలం, పపాయ, డ్రాగన్ ఫ్రూట్ లాంటి పండ్ల తోటలు, బంతి, చామంతి, గల్లార్డియా లాంటి ఇతర పూల తోటల సాగును ప్రోత్సహించడానికి ఉద్యానశాఖ వారు 40 శాతం రాయితీని అందజేస్తున్నారు. ఈ రాయితీలను సద్వినియోగం చేసుకొని రైతులు ఉద్యాన పంటల సాగును లాభదాయకంగా మార్చుకోవాలి.సాంప్రదాయ పంటలతో పాటు అదనపు ఆదాయాన్ని పొందాలనుకొనే రైతులు కూరగాయలు, పండ్లు, పూల తోటలను సైతం పెంచడానికి ఉద్యానశాఖ తో డ్పాటును అందిస్తోంది. అదనపు సమాచా రం కోసం 8977713980 నంబర్‌ను సంప్రదించాలి. – కే సంధ్యరాణి, హార్టికల్చర్ ఆఫీసర్, ఆర్మూర్ -
ప్రమాదవశాత్తు బావిలో పడి ఒకరు..
బీబీపేట: ప్రమాదవశాత్తు బావిలో జారిపడి ఒకరు మృతి చెందినట్లు ఎస్సై ప్రభాకర్ ఆదివారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. బీబీపేట మండలం జనగామ గ్రామానికి చెందిన పిప్పిరిశెట్టి దేవయ్య శనివారం సాయంత్రం వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లాడు. అక్కడ మోటారు మరమ్మతుల కోసం బావిలోకి దిగే ప్రయత్నంలో జారిపడ్డాడు. అంతలోనే ఫిట్స్ రావడంతో నీటిలో ఊపిరాడక మృతి చెందాడు. కుటుంబీకులు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. ఉదయం పొలంలోని బావిలో మృతదేహం కనిపించడంతో గ్రామస్తుల సహాయంతో నీటిని మోటార్ల ద్వారా తీయించారు. మృతుడి భార్య దేవమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
తేలిన పంటల సాగు లెక్క
డొంకేశ్వర్(ఆర్మూర్): వానాకాలం సీజన్లో సాగవుతున్న పంటల లెక్క తేలింది. జిల్లాలో మొత్తం 5,24,506 ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలు సాగవుతున్నట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఆగస్టు రెండో వారంతో వరినాట్లు పూర్తి కావడంతో పంటల సాగు విస్తీర్ణంపై అధికారులకు స్పష్ట త వచ్చింది. అయితే గతేడాది వానాకాలం సీజన్ తో పోలిస్తే ఈ ఏడాది కొన్ని పంటల సాగు విస్తీ ర్ణం తగ్గింది. వరి, పసుపు, పెసర విస్తీర్ణం మాత్ర మే కొంత మేర పెరిగింది. సోయాతోపాటు మొ క్కజొన్న, మినుము పంటల సాగును రైతులు కొంత తగ్గించారు. ఈ సీజన్లో వేరుశనగ సాగు అసలే లేదు. ఇప్పటి వరకు రైతులు 63 వేల మె ట్రిక్ టన్నుల యూరియాను కొనుగోలు చేశారు. మొక్కజొన్న కంకి దశకు చేరుకోగా, వరి గింజలు వచ్చే దశలో ఉన్నాయి. జిల్లాలో 12లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచే అవకాశముంది. క్రాప్ బుకింగ్ ఆలస్యం జిల్లాలో సాగవుతున్న పంటల వివరాలను ఆన్లైన్ చేసేందుఉ ప్రభుత్వం డిజిటల్ క్రాప్ బుకింగ్ వెబ్‌సైట్‌ను ఇంకా తెరవలేదు. దీంతో పంటల వివరాల నమోదు ఆలస్యమవుతోంది. జూన్‌లోనే ప్రారంభం కావాల్సిన క్రాప్ బుకింగ్ ఇంత వరకు చేయకపోవంతో ఏఈవోలు ఎదురుచూస్తున్నారు. ఆన్లైన్లో నమోదైతేనే ప్రభుత్వం పంట దిగుబడులు కొనుగోలు చేసేందుకు ఏ విధంగా ముందుకెళ్లాలో అంచనా వేసే అవకాశం ఉంటుంది. క్రాప్ బుకింగ్‌పై త్వరలో ఆదేశాలు వచ్చే అవకాశాలున్నాయని జిల్లా వ్యవసాయాధికారి మేకల గోవింద్ ‘సాక్షి’కి తెలిపారు. పంటల సాగు విస్తీర్ణం (ఎకరాల్లో..) 5,24,506 ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలు.. గతేడాదితో పోలిస్తే జిల్లాలో కొంతమేర పెరిగిన వరి సాగు విస్తీర్ణం -
పల్లె దవాఖానాలపై పట్టింపేది..?
మాక్లూర్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని అన్ని రకాల వైద్య సేవలు పల్లెలకు చేరువ చేయాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం పల్లె దవాఖానాలను ప్రారంభించింది. కానీ అందులో కనీస వసతులు లేకపోవడంతో రోగులు, విధులు నిర్వహించే వైద్య సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. మాక్లూర్ మండలంలోని మాణిక్‌బండార్‌లో ఉన్న పల్లె దవాఖానా అసౌకర్యాలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ దవాఖానాకు ఏడేళ్లుగా విద్యుత్ సరఫరా లేక రోగులు, వైద్య సిబ్బంది ఇక్కట్లు పడుతున్నారు. కల్లెడి ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న ఈ పల్లె దవాఖానాను తండాతోపాటు మాణిక్‌బండార్ వాసులు ఉపయోగించుకుంటారు. ప్రతి నిత్యం 20 నుంచి 30 మంది గర్భిణులు, చిన్నాచితక జబ్బులతో బాధపడుతున్న వారు దవాఖానాకు వస్తుంటారు. ఇందులో నలుగురు ఆశవర్కర్లు, ఒక ఎంఎల్‌హెచ్‌పీ వైద్యురాలు సేవలందిస్తుంటారు. కానీ, దవాఖానాలో కనీస వసతులు లేకపోవడంతో రోగులు, విధులు నిర్వహించే వైద్య సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఈ దవాఖానాకు సంబంధిత అధికారులు పలు కారణాల నేపథ్యంలో కరెంట్ సరఫరాను నిలిపివేసి ఏడేళ్లు కావొస్తోంది. కానీ, ప్రతి నెలా పాత బకాయితోపాటు ప్రస్తుత బిల్లు రూ.35వేలు వస్తోంది. పాత బకాయి చెల్లిస్తే కానీ విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే పరిస్థితి లేదని విద్యుత్ అధికారులు తేల్చి చెబుతున్నారు. దీంతో చీకటి గదుల్లోనే వైద్యసేవలు కొనసాగుతున్నాయి. మరోవైపు చిన్నపాటి వర్షం కురిస్తే చాలు పల్లె దవాఖానా ఆవరణ మొత్తం మురికి కూపాన్ని తలపిస్తోంది. దీంతో దవాఖానాకు వచ్చే గర్భిణులు, రోగులు ఇబ్బందులు పడుతున్నారు. దవాఖానా ఆవరణలో పాములు సంచరిస్తున్నాయి. దీంతో వైద్య సిబ్బంది భయం భయంగా విధులు నిర్వర్తిస్తున్నారు.ఊరి చివరిలో మురికి కాల్వల మధ్య ఉన్న పల్లె దవాఖానాకు రావాలంటేనే భయం వస్తోంది. ఇక్కడ కనీస వసతులు లేవు. కనీసం కూర్చునేందుకు కు ర్చీలు, టేబుళ్లు కూడా లేవు. – నవనీత, గర్భిణి, మాణిక్బండార్పల్లె దవాఖానాలో అసౌకర్యాలు, కనీస వసతులపై ఉన్నతాధికారులకు నివేదించాం. గతంలో కార్పొరేటర్‌గా ఉన్న రాయ్‌సింగ్ దవాఖాన బాగోగులు చూసేవారు. వారి పదవీకాలం పూర్తి కావడంతో పట్టించుకునేవారు లేరు. దీంతో దవాఖాన పరిసరాలు అపరిశభ్రంగా మారాయి. త్వరలో విద్యుత్ సౌకర్యం కల్పిస్తాం. – డాక్టర్ ప్రకాశ్, కల్లెడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మాణిక్‌బండార్‌లో చీకట్లోనే వైద్య సేవలు మురికి కూపాన్ని తలపిస్తున్న ఆస్పత్రి ఆవరణ ఇబ్బంది పడుతున్న రోగులు, వైద్య సిబ్బంది -
తొండాకూర్ శ్రీమంతులు
● ఆపద ఎవరికొచ్చినా ముందుంటున్నారు ● 2019లో హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఏర్పాటు ● పక్క గ్రామాల వారికీ ఆర్థికసాయంఊరు చాలా ఇచ్చింది.. ఎంతో కొంత తిరిగిచ్చేయాలి.. అంటూ శ్రీమంతుడు సినిమాలో హీరో మహేశ్‌బాబు చెప్పిన డైలాగ్‌ను నిజ జీవితంలో ఆచరిస్తున్నారు డొంకేశ్వర్ మండలంలోని తొండాకూర్ గ్రామస్తులు. ఆపదలో ఎవరున్నా ఊరంతా ఒక్కటై అండగా నిలుస్తున్నారు. ఊరు విడిచి ఎక్కడెక్కడో ఉంటున్న వారు సైతం ‘ఎక్కడి నుంచి వచ్చామో మరిచిపోకూడదు’ అంటూ గ్రామంతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్నారు. తొండాకూర్ గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ సేవలపై ‘సాక్షి’ సండే స్పెషల్.. డొంకేశ్వర్(ఆర్మూర్): పక్కోడు బాగుపడితే ఓర్వలేని ఈ కాలంలో.. గ్రామంలో ఏ ఒక్కరికీ ఆపద వచ్చినా అండగా నిలుస్తున్నారు. మండలంలోని తొండాకూర్ గ్రామస్తులు. కొంతమంది వ్యక్తులు ఫౌండేషన్‌గా ఏర్పడి ఊరిలో ఏ పేదకు కష్టమొచ్చినా ఆదుకుంటున్నారు. అనుకోని ఆపద వస్తే మేమున్నామంటూ వెంటనే ఆర్థిక సహాయం అందిస్తూ వారి జీవితానికి భరోసా ఇస్తున్నారు. ఆర్థిక స్థోమత లేక వైద్యం చేయించుకోలేని వారికి రూ.లక్షల్లో సాయమందించి ప్రాణాలను సైతం నిలుపుతున్నారు. కులమతాలకు అతీతంగా హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషను ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతున్నారు. 15 మందితో 2015లో ఏర్పాటైన గ్రూపు 2019 సెప్టెంబర్‌లో ఫౌండేషన్‌గా మారింది. ప్రస్తుతం 224మంది సభ్యులు ఉండగా, ఇందులో స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు, విదేశాలకు వెళ్లిన వారున్నారు. ప్రారంభంలో నెలకు రూ.100 చొప్పున నిధులు జమ చేయగా, ఇప్పుడు ఆపద సమయాల్లో అడిగిన వెంటనే ఆలోచించకుండా రూ.వేలల్లో ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. గ్రామానికి చెందిన వారికే కాకుండా పక్క గ్రామాల పేదలకూ సాయం చేస్తూ ‘హెల్పింగ్ హ్యాండ్స్’ ఫౌండేషన్ ఆదర్శంగా నిలుస్తోంది. మున్ముందు పేద విద్యార్థుల చదువులకు కూడా తోడ్పాటునందించాలని సభ్యులు భావిస్తున్నారు. ● గ్రామానికి చెందిన బొగ్గుల సాగర్ 2023లో దుబాయ్‌లో మరణించగా, ఆయన మృతదేహాన్ని ఇంటికి రప్పించేందుకు తెచ్చేందుకు కృషి చేయడంతోపాటు బాధిత కుటుంబానికి రూ.1.75 లక్షల సాయం. ● 2024 డిసెంబర్లో ఫీల్డ్ అసిస్టెంట్ బండి రాజన్న భార్య లావణ్య అనారోగ్యంతో మరణించగా, బాధిత కుటుంబానికి రూ.1.44 లక్షల ఆర్థిక సాయం. ● 2025 ఫిబ్రవరిలో బోదాసు నడ్పి గంగాధర్ భార్య పోసాని అనారోగ్యంతో మృతి చెందగా కుటుంబ పోషణ కోసం గంగాదర్‌కు రూ.13,300 అందజేశారు. ● 2025 మార్చిలో ఐదో తరగతి చదువుతున్న దండుగుల శ్యామ్ ఇంట్లో పాముకాటుతో మరణించాడు. ఒక్కగానొక్క కొడుకు చనిపోయి దుఖంలో ఉన్న తల్లి సునీతకు రూ.26,300 అందజేశారు. ● గంగాసముందర్ గ్రామానికి చెందిన మోతె అశోక్ తొండాకూర్ గ్రామ పంచాయతీలో కారోబార్‌గా పని చేస్తున్నాడు. ఆయన కొడుకు అనారోగ్యం బారిన పడడంతో వైద్యం చేయించేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఫౌండేషన్ ద్వారా విరాళాలు సేకరించి అశోక్‌కు రూ.2లక్షల వరకు అందించారు. ● తొండాకూర్ గ్రామానికి చెందిన అవుట్ల నరేశ్ 2025 జూలైలో ట్రాక్టర్‌తో పొలాన్ని దమ్ము చేస్తుండగా ట్రాక్టర్ తిరగబడి మరణించాడు. పెద్ద దిక్కును కోల్పోయిన నరేశ్ కుటుంబానికి రూ.1.29 లక్షలు అందజేశారు. ● కుల, మతాల బేధాలు లేవని చాటి చెప్పేందుకు గ్రామానికి చెందిన షేక్ కలీం పాషా దుబాయ్ నుంచి రూ.30వేలు, రూ.10వేలు వేర్వేరు సందర్భాల్లో ఫౌండేషన్‌కు అందజేశారు. ఫౌండేషన్ అందించిన సేవల్లో కొన్ని -
‘సాగర్’ గేట్లు మూసివేత
నిజాంసాగర్: ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టడంతో శనివారం మధ్యాహ్నం నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లను మూసి వేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఈనెల 18 నుంచి శనివారం ఉదయం వరకు ఆరు రోజుల పాటు నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. శనివారం సాయంత్రం 13,590 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1,404 అడుగుల (16.357 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు. అవినీతిపై ఆరా నిజామాబాద్‌అర్బన్: జిల్లా విద్యాశాఖలో అవినీతి వ్వవహారంపై ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ‘విద్యాశాఖలో ఏసీబీ గుబులు’ శీర్షికన శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన ఏసీబీ అధికారులు కేజీబీవీల్లో ఇటీవల జరిగిన నిధుల ఖర్చుల, లర్నింగ్ మెటిరియల్, నోట్ పుస్తకాల పంపిణీపై ఆరా తీస్తున్నారు. ఎవరైనా అధికారులు మీ నుంచి డ బ్బులు వసూలు చేశారా? అని కేజీబీవీ ప్రత్యేకాధికారులను ఫోన్లో ప్రశ్నించారు. మాక్లూర్ కేజీబీలో భారీగా అవినీతి జరిగినట్లు కొంతమంది ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అలాగే వేసవి శిక్షణకుసంబంధించిన నిధులు కాజేసిన వ్యవహారంపై ఏసీబీ విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఇ దిలా ఉండగా ‘సాక్షి’ కథనంపై స్పందించిన విద్యాశాఖ అధికారులు నిధులు సక్రమంగా నే వినియోగించినట్లు పేర్కొన్నారు. కో ఆర్డినేటర్ల బిల్లుల మేరకే నిధులు విడుదల చేశా మని డీఈవో అశోక్ ప్రకటనలో తెలిపారు. ఫెర్టిలైజర్స్ దుకాణాల్లో తనిఖీలు బోధన్‌టౌన్(బోధన్): పట్టణంలోని ఎరువుల దుకాణాల్లో తూనికలు, కొలతల శాఖ అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎరువుల బ్యాగులపై ఉన్న ధరలు, ప్యాకింగ్ తేదీలతో పాటు ఇతర వివరాలను పరిశీలించారు. లీగల్ మెట్రాలజీ నిబంధనల ప్రకారం లేని ఎరువుల ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని మూడు దుకాణాలపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా పట్టణ తూనికల కొలతల అధికారి సందీప్ మాట్లాడుతూ.. జిల్లా అధికారుల ఆధ్వర్యంలో ఎరువుల దుకాణాలను తనిఖీ చేశామని, నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న మూడు దుకాణలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సీఎంసీ వద్ద ఉద్రిక్తత డిచ్పల్లి(నిజామాబాద్‌రూరల్): డిచ్పల్లి క్రిస్టి యన్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రి వద్ద శని వా రం ఉద్రిక్తత నెలకొంది. సీఎంసీ చైర్మన్ హో దాలో వచ్చిన షణ్ముక మహాలింగంను సె క్యూరిటీ సిబ్బంది శనివారం లోనికి రాకుండా అడ్డుకున్నారు. మెయిన్ గేటుకు తాళం వేసి ఉండటంతో తెరవాలని మహాలింగం చెప్పినా సెక్యూరిటీ పట్టించుకోలేదు. డైరెక్టర్ డాక్టర్ అజ్జ శ్రీనివాస్, చైర్మన్ షణ్ముక మహాలింగం మధ్య గత కొన్ని రోజులుగా సీఎంసీ నిర్వహణపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. అజ్జ శ్రీనివాస్‌ను డైరెక్టర్‌గా తొలగించి కొత్త డైరెక్టర్‌గా జేఎన్ రావును నియమించినట్లు షణ్ముక లింగం కొద్ది రోజుల క్రి తం తెలిపారు. అయినప్పటికీ అజ్జ శ్రీనివాస్ ఆదేశాల మేరకు సెక్యూరిటీ సిబ్బంది ష ణ్ముక మహాలింగంను లోనికి అనుమతించలేదు. దీంతో ఆగ్రహించిన మహాలింగం గేటు తాళాలు పగులగొట్టి లోనికి వెళ్తామని హెచ్చరించారు. సమాచారం అందుకున్న ఎస్సై ఎండీ షరీఫ్ సిబ్బందితో సీఎంసీ వద్ద కు చేరుకున్నారు. మహాలింగంతోపాటు జేఎ న్ రావును స్టేషన్‌కు తరలించారు. సీఎస్ఐ మెడికల్ ట్రస్ట్ వారితో ఒప్పందం కుదుర్చున్నందున వారిని ఇక్కడికి పిలిపించాలని, అప్పుడే ఎవరు సీఎంసీకి బాధ్యులో తేలుతుందని అంతవరకు ఎలాంటి గొడవలు చేయవద్దని ఎస్సై సూచించారు. ఈ సంద ర్భంగా మహాలింగం మాట్లాడుతూ.. అజ్జ శ్రీనివాస్ నేపాల్ దేశ డూప్లికేట్ సర్టిఫికెట్లతో డాక్టర్‌గా కొనసాగుతున్నారని, సీఎంసీ విషయంలో లీగల్‌గా తేల్చుకుంటానన్నారు. -
మోసానికి గేట్‌వే!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : గే యాప్స్ ద్వారా స్వలింగ సంపర్కులను ఆకర్షించి తమ దగ్గరకి రప్పించుకుని వారికి తెలియకుండా నగ్న వీడియో లు తీసి బ్లాక్ మెయిలింగ్ దందా నడిపిన ముఠా సభ్యులు ఐదుగురిని ఈనెల 2న కామారెడ్డిలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే వీరిపై ఇప్పటికే 11 కేసులు నమోదవగా.. బాధితులు నలభై మంది దాకా బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇంకా వందల్లో ఉంటారని సమాచారం. బాధితుల్లో కామారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట ప్రాంతాలకు చెందిన వారూ ఉన్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా కొందరు బాధితులు తమ విషయం బయటకు పొక్కితే పరువు పోతుంద న్న ఉద్దేశంతో బయటకు రావ డం లేదు. ఈ కేసులో స్థానిక పో లీసులు విచారణ కొనసాగిస్తున్నారు. రిమాండ్‌లో ఉన్న ము ఠా సభ్యుల కస్టడీ కోసం పిటిషన్ వేసి వారిని మ రింత లోతుగా విచారించే అవకాశాలున్నాయి. ముందుగా బాధితుల వివ రాలు సేకరించి వారి ద్వారా ఫిర్యాదులు తీసుకుని ఎంత నష్టపోయారన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు యాభై మంది వరకు బాధితులను గుర్తించినట్లు సమాచారం. బాధితులు ఇంకా వందల్లో ఉంటారని భావిస్తు న్నారు. కేసును మరింత లోతుగా విచారించేందుకు అరెస్టయిన వ్యక్తులను కస్టడీలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. యాప్ ద్వారా స్వలింగ సంపర్కులకు వల నగ్న వీడియోలు తీసి బ్లాక్‌మెయిలింగ్ రూ. లక్షలు వసూలు చేస్తున్న ముఠా ఇప్పటికే ఐదుగురు నిందితుల అరెస్ట్ బాధితుల గురించి ఆరా తీస్తున్న పోలీసులు -
రెండేళ్ల చిన్నారిపై పిచ్చికుక్క దాడి
● జిల్లా ఆస్పత్రికి తరలింపు నందిపేట్(ఆర్మూర్): మండల కేంద్రంలోని వడ్డెర కాలనీలో శనివారం అల్లెపు అక్షర అనే రెండేళ్ల చిన్నారిపై పిచ్చికుక్క దాడి చేసింది. దీంతో తీవ్ర గాయాలై పరిస్థితి విషమించడంతో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. చిన్నారి అక్షప మధ్యాహ్నం తన ఇంటి ఎదుట ఆడుకుంటుండగా పిచ్చికుక్క ఒక్కసారిగా దాడి చేసింది. కుక్క దాడి చేస్తుండగా గమనించిన చిన్నారి అమ్మమ్మ కర్రతో ఎంత తరిమినా వదలకుండా చిన్నారిని కరవడంతో ముఖం, చెంప, భుజంపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, కుటుంబీకులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉండడంతో అంబులెన్సులో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆర్మూర్‌లో ఒకరికి.. ఆర్మూర్‌టౌన్: పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉదయం వాకింగ్‌కు వెళుతున్న శ్రీనివాస్‌రావు అనే వ్యక్తిని కుక్కలు వెంబడించాయి. దీంతో ఆయన జారిపడటంతో కుక్కలు దాడి చేసి గాయపర్చాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లగా ఎడమకాలు విరిగినట్లు బాధితుడు తెలిపారు. -
ఓటరు లిస్ట్‌లో పొరపాట్లు ఉండొద్దు
మోపాల్(నిజామాబాద్‌రూరల్): ఓటరు జాబితాను పరిశీలించి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. మోపాల్ మండలకేంద్రంలోని బీసీ బాలుర హాస్టల్‌తోపాటు ఎంపీడీవో, తహసీల్ కార్యాలయాలను శనివారం రాత్రి ఆయన సందర్శించారు. స్థాని క సంస్థల ఎన్నికల సన్నద్ధతలో భాగంగా పోలింగ్ సామగ్రిని పరిశీలించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చి నా సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అనంతరం తహసీల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఇన్చార్జి తహసీల్దార్ సరితతో మాట్లాడి భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యలను తెలుసుకున్నారు. దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల అమలు తీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మోపాల్‌లోని బీసీ బాలుర హాస్టల్, ముదక్‌పల్లిలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర వసతిగృహాన్ని కలెక్టర్ తనిఖీచేశారు. విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించారు. రాత్రి భోజనంలో అందించిన ఆహా ర పదార్థాలు మెనూకు అనుగుణంగా ఉన్నాయా, భోజనం సక్రమంగా అందిస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. స్టడీ అవర్స్, కిచెన్, స్టోర్‌రూమ్‌లను తనిఖీ చేసి వార్డెన్ వద్ద వివరాలు ఆరా తీశారు. కలెక్టర్ వెంట ఆర్ఐ రాజేశ్వర్, ఎంపీవో కిరణ్‌కుమార్, ఎస్ఈ ప్రదీప్ తదితరులు ఉన్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి భూభారతి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి అధికారులకు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాలు -
వడ్డీ వ్యాపారుల ఇళ్లపై పోలీసుల దాడులు
ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంతోపాటు ఆర్మూర్ డివిజన్లోని వడ్డీ వ్యాపారుల ఇళ్లపై పోలీసులు శనివారం తెల్లవారుజాము నుంచి దాడులు చేశా రు. అనుమతులు, రిజిస్ట్రేషన్లు లేకుండా ఫైనాన్స్‌లు, వడ్డీ వ్యాపారం చేస్తున్నారనే ఫిర్యాదుల నేప థ్యంలో సీపీ సాయిచైతన్య ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది వడ్డీ వ్యాపారుల, ఫైనాన్షియర్ల ఇళ్లు, కార్యాలయా ల్లో తనిఖీలు చేపట్టారు. సామాన్యుల అవసరాన్ని ఆసరా చేసుకుని అధిక వడ్డీ వ సూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. నిజామాబాద్ డివిజన్లోని ఓ పో లీస్‌స్టేషన్ పరిధిలోని ఒక్క గ్రామంలోనే సు మారు రూ.2 కోట్ల లావాదేవీలకు సంబంధించిన ప్రామిసరీ నోట్లు లభించినట్లు ప్రచారంలో ఉంది. అలాగే నిజామాబాద్‌లో 99, ఆర్మూర్‌లో 5 ల్యాండ్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. బోధన్‌లో.. బోధన్‌టౌన్: బోధన్‌లోని ఆరు ఫైనాన్స్ కార్యా లయాలపై దాడులు చేసి ప్రామిసరీ నోట్లు, రసీదు లు, రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపారు.నిజామాబాద్‌లో స్వాధీనం చేసుకున్న నగదు రూ.1,21,92,750 పోలీసులు స్వాధీనం చేసుకున్న చెక్కులు, ప్రామిసరీ నోట్లు రూ.కోట్ల లావాదేవీలకు సంబంధించిన చెక్కులు.. ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు స్వాధీనం రూ.1.21 కోట్ల నగదు సీజ్ శనివారం తెల్లవారు జాము నుంచి సాయంత్రం వరకు తనిఖీలు -
ఫైర్ హుషార్
ఖలీల్‌వాడి: ఆపదలో ఆదుకునే అగ్నిమాపకశాఖకు అధునాతన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చా యి. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించే రెస్క్యూ, రిమోట్ బోట్లు ఆపరేటింగ్ చేసే విధానంపై జిల్లా కేంద్రంలోని రఘునాథ చెరువులో ప్రతి శుక్రవారం సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. నిజామాబాద్ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ శంకర్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా ల్లోని 12 ఫైర్స్టేషన్లకు చెందిన 20 మంది సిబ్బందికి శిక్షణ కొనసాగుతోంది. శిక్షణ పొందుతున్న వారిలో గాంధారి, భీమ్‌గల్ ఫైర్ స్టేషన్ల అవుట్ సోర్సింగ్ సిబ్బంది సైతం ఉన్నారు. రిమోట్ బోట్ ప్రత్యేకం సరికొత్తగా రిమోట్ బోటును అందుబాటులోకి తెచ్చి అగ్నిమాపక సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఒకప్పుడు నీటిలో పడినవారిని కాపాడేందుకు పడవ, బోట్‌ను ఉపయోగించే వారు. ఇప్పుడు నీటిలో చిక్కుకున్న వారివద్దకు ఒడ్డునే ఉండి రిమోట్ సాయంతో బోట్‌ను పంపించి కాపాడొచ్చు. ఒడ్డున ఉండి 800 మీటర్ల దూరం వరకు నీటిలో బోట్‌ను పంపించి బాధితులను రక్షించే అవకాశముంది. ప్రతి శుక్రవారం శిక్షణ జిల్లా కేంద్రంలోని ఖిల్లా రఘునాథ చెరువులో ఉమ్మడి జిల్లాకు చెందిన 20మంది అగ్నిమాపక సిబ్బందికి ప్రతి శుక్రవారం శిక్షణ ఇస్తున్నాం. ఇన్ఫ్ల్లటబుల్ రెస్క్యూ, రిమోట్ బోట్లు వాడి వరదల్లో చిక్కుకున్న వారిని ఎలా కాపాడాలో శిక్షణ ఇచ్చాం. వరదలు, వినాయక నిమజ్జనం వంటి సందర్భాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాల సేవలను ఉపయోగిస్తాం. – పరమేశ్వర్, జిల్లా ఫైర్ అధికారి, నిజామాబాద్రెస్క్యూ బోటులో రిస్క్ చేయడం శిక్షణలో అతి ముఖ్యమైనది రెస్క్యూబోట్ ఆపరేటింగ్. ప్రస్తుతం సిబ్బంది శిక్షణ పొందుతున్న బోటును ఎక్కువ మంది బాధితులను, ఎక్కువ బరువును మోసే విధంగా రూపొందించారు. దీనిద్వారా ఒకేసారి 8 నుంచి 10 మందిని కాపాడొచ్చు. అవుట్ బోల్ట్ మోటార్‌ను బిగించి రెస్క్యూబోట్ నడుపుతారు. ప్రస్తుతం 40 హెచ్‌పీ మోటారు వాడుతున్నారు. అగ్నిమాపకశాఖకు ఆధునిక పరికరాలు ఎనిమిది మందిని ఒకేసారి రక్షించే రెస్క్యూ బోట్ ఉమ్మడి జిల్లాలోని 20 మంది ఫైర్ సిబ్బందికి శిక్షణ -
కట్టుకున్నోడే కాలయముడయ్యాడు..
● అనుమానంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవ ● మద్యం మత్తులో బండరాయితో దాడి.. భార్య మృతి సదాశివనగర్(ఎల్లారెడ్డి): కలకాలం వెన్నంటి ఉండి కష్టసుఖాల్లో తోడుండాల్సిన భర్తే కాలయముడయ్యాడు. భార్యను బండరాయితో మోది హతమార్చిన ఘటన మండల కేంద్రంలోని జ్యోతినగర్ కాలనీలో శనివారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. జ్యోతినగర్ కాలనీకి చెందిన చిందం లక్ష్మి అలియాస్ లింగవ్వ(40) వంట చేస్తుండగా భర్త రవి అతిగా మద్యం సేవించి గొడవపడ్డాడు. ఈ క్రమంలో భార్య, భర్తపై దాడి చేసింది. మద్యం మత్తులో ఉన్న రవి బండరాయితో తలపై దాడి చేయగా లింగవ్వ అక్కడికక్కడే మృతి చెందింది. కాగా, అనుమానంతోనే ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండేవని కాలనీవాసులు తెలిపారు. మృతురాలికి కొడుకులు సురేశ్, మహేశ్ ఉన్నారు. ఘటనా స్థలాన్ని సీఐ సంతోష్‌కుమార్, ఎస్సై పుష్పరాజ్ సందర్శించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
గోదావరిలోకి కొనసాగుతున్న నీటి విడుదల
బాల్కొండ: ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతుండటంతో ఎస్సారెస్పీ నుంచి వరద గేట్ల ద్వారా గోదావరిలోకి నీటి విడుదల కొనసాగుతుంది. 16 గేట్ల ద్వారా 49,250 క్యూసెక్కుల నీరు పోతుండగా, 78వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. వరద కాలువ ద్వారా 20 వేలు, కాకతీయ కాలువకు 3500, ఎస్కెప్ గేట్ల ద్వారా 4500, సరస్వతి కాలువకు 500, లక్ష్మి కాలువకు 150, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 651 క్యూసెక్కుల నీరు ఆవిరవుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా శనివారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1090.70(79.26 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు. పెరిగిన విద్యుదుత్పత్తి.. ప్రాజెక్ట్ వద్ద గల జల విద్యుదుత్పత్తి కేంద్రంలో విద్యుదుత్పత్తి మరింత పెరిగింది. నాలుగు టర్బాయిన్ల ద్వారా 36.4 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 8.97 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగినట్లు జెన్కో డీఈఈ శ్రీనివాస్ తెలిపారు. -
తప్పిన ఇంటర్నెట్ తిప్పలు
● 80 రైతు వేదికల్లో మోడెంల ఏర్పాటు డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో మొత్తం 106 రైతు వేదికలు ఉండగా ప్రభుత్వం 80 చోట్ల వీడియో కాన్ఫరెన్స్ సదుపా యం కల్పించింది. ఐతే, ఇంటర్నెట్ సేవలు లేకపోవడంతో ఏఈవో, ఏవోలు మొబైల్ ఫోన్ నుంచి హాట్‌స్పాట్ ద్వారా ప్రతి మంగళవారం ‘రైతునేస్తం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాదాపు రెండున్నర గంటలపాటు జరిగే వీడి యో కాన్ఫరెన్స్‌ను కొనసాగించాలంటే మొబైల్ ఫోన్లలో డేటా సరిపోయేది కాదు. ఇక నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించింది. వీడియో కాన్ఫరెన్స్ ఉన్న రైతు వేదికల్లో స్థానిక నెట్‌వర్క్‌కు అనుగుణంగా ఇంటర్నెట్ మోడెంలను పెట్టించింది. కాగా, రైతు వేదికల నిర్వహణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే బాగుంటుందని ఏఈవోలు కోరుతున్నారు. సుభాష్‌నగర్: నగర శివారులోని శ్రీ రామగార్డెన్లో సోమవారం నిర్వహించే జిల్లా బూత్‌స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి జిల్లాకు వస్తున్న రాంచందర్‌రావుకు ఘన స్వాగతం పలికేలా నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆయనకు ఇందల్వాయి టోల్గేట్ వద్ద స్వాగతం పలకనున్నారు. అనంతరం కంఠేశ్వర్ ఆలయంలో పూజలు చేసి సమావేశ ప్రాంగణం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఆత్మీయ సమ్మేళనం అనంతరం బీజేపీ కార్యాలయంలో జరిగే జిల్లా పదాధికారుల సమావేశంలో ఆయన పా ల్గొననున్నారు. ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ అర్వింద్ ధర్మపురితోపాటు ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్‌రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి హాజరుకానున్నారు. -
వృద్ధుల రక్షణకో చట్టం
మీకు తెలుసా? ఎల్లారెడ్డి: చిన్ననాటి నుంచి అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను వృద్ధాప్య సమయంలో పిల్లలు భారంగా భావించి వదిలేస్తున్నారు. ఇలా దగ్గరి వాళ్లతో దగాపడ్డ తల్లిదండ్రులకు వయోవృద్ధుల నిర్వహణ, సంక్షేమ చట్టం –2007 రక్షణ కల్పిస్తోంది. ● చట్టం ప్రకారం పిల్లలు తమ తల్లిదండ్రులను పోషించేందుకు, వారికి అవసరమైన సహాయాన్ని అందించడానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ● పిల్లలు నిర్లక్ష్యం చేస్తే తల్లిదండ్రులు వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవచ్చు. వారి నుంచి భరణం లేదా సంరక్షణావ్యయం పొందేందుకు న్యాయస్థానం తలుపుతట్టవచ్చు. ● తల్లిదండ్రులకు ఆహారం, బస, దుస్తులు, వైద్య సంరక్షణ వంటి ప్రాథమిక అవసరాలను కచ్చితంగా సమకూర్చాలి. ● పిల్లలు మానసికంగా లేదా శారీరకంగా హింసిస్తే కోర్టు నేరంగా పరిగణించి తల్లిదండ్రులకు న్యాయం చేస్తుంది. తల్లిదండ్రులను పోషించడంలో విఫలమైతే కోర్టు పిల్లలకు జరిమానాతోపాటు జైలు శిక్ష విధిస్తుంది. ● నిరాదరణకు గురవుతున్న వయోవృద్ధుల కోసం కలెక్టర్, ఆర్డీవో, తహసీల్ కార్యాలయాలలో ప్రత్యేక సెల్‌లను ఏర్పాటు చేస్తున్నారు. బాధితులు తెల్లకాగితంపై తమ సమస్యను వివరిస్తూ పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకుంటే అధికారులు విచారణ జరిపి వారికి పోషణ, సంక్షేమం వచ్చేలా చర్యలు తీసుకుంటారు. -
దివ్యాంగులకు సమాన అవకాశాలు
ఆర్మూర్: దివ్యాంగ విద్యార్థులకు అన్ని రంగాల్లో స మాన అవకాశాలు ఉంటాయని జిల్లా విద్యాఽ దికారి పార్శి అశోక్ పేర్కొన్నారు. దివ్యాంగుల సేవ ను తల్లిదండ్రులు, సహిత విద్యావిభాగం ఉద్యోగులు బరువుగా భావించకుండా బాధ్యతగా భావించాల ని సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని సీఎస్ఐ కాంపౌండ్‌లో ఉన్న హెచ్పీడీ బధిరుల ఆశ్రమ పాఠ శాలలో విద్యాశాఖ, సమగ్ర శిక్షా సహిత విద్యా విభాగం, అలీంకో సంయుక్తంగా దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల కోసం లబ్ధిదారుల గు ర్తింపు శిబిరాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో అశోక్ దివ్యాంగుల అవసరాన్ని గుర్తించి సహాయ ఉపకరణాలు అందజేస్తున్న అలీంకోను అభినందించారు. జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ గతేడాది జిల్లా వ్యాప్తంగా 294 మంది దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాలను ఉచితంగా పంపిణీ చేశామన్నారు. కార్య క్రమంలో ఎంఈవో రాజగంగారాం, మెడికల్ ఆఫీస ర్ డాక్టర్ ఫిర్దౌస్ ఫాతిమా, బధిరుల పాఠశాల మేనేజర్ సువర్ణ కిరీటి, ప్రిన్సిపల్ శాంతమూర్తి, అలీంకో నిపుణులు రుక్మిణి, ఓం ద్వివేది, నర్సింగ్ ఆఫీసర్ ర జిత, హెల్త్ అసిస్టెంట్ ఆనంద్, ఐఈఆర్పీలు పాల్గొ న్నారు. అంతకుముందు 250 మందిని పరీక్షించి అందులో 150 మందిని అర్హులుగా గుర్తించారు. డీఈవో అశోక్ -
కమిటీల ఆధ్వర్యంలోనే పనులు
నిజామాబాద్‌అర్బన్: ఇంటర్మీడియట్ విద్య బలోపేతం కోసం ప్రభుత్వం జూనియర్ కళాశాలలకు కేటాయించిన నిధులను అమ్మ ఆదర్శ కమిటీల ఆ ధ్వర్యంలోనే ఖర్చు చేయాలని ఇంటర్ బోర్డు జిల్లా ప్రత్యేక అధికారి దాసరి ఒడ్డెన్న అన్నారు. జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో శనివారం నిర్రవహించిన సమావేశంలో ఒడ్డెన్న మాట్లాడారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మతులు, అభివద్ధి పనులు చేపట్టేందుకు ఇంటర్ బోర్డు కేటాయించిన నిధుల కోసం అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్, ప్రిన్సిపాల్ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నారు. బోర్డు కమిషనర్ ఆదేశాల కళాశాలల్లో విద్యార్థుల ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం ద్వారా ఆన్లైన్ అటెన్డెన్స్ విధానం అమలు చేయాలని, విద్యార్థులు కళాశాలలకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఇంటర్ విద్యా అకడమిక్ సెల్ ప్రతినిధి నర్సయ్య, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. కళాశాలల తనిఖీ ఒడ్డెన్నతోపాటు రవికుమార్ డిచ్పల్లిలోని ప్ర భుత్వ జూనియర్ కళాశాల, నిజామాబాద్ బాలుర ఖిల్లా జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అకడమిక్ అంశాలను సమీక్షించారు.