మీకు మంచి జరిగి ఉంటే మీరే సైనికులుగా నిలబడండి: సీఎం జగన్‌ | CM Jagan mohan reddy on Puttaparthi Visit on November 7th | Sakshi
Sakshi News home page

మీకు మంచి జరిగి ఉంటే మీరే సైనికులుగా నిలబడండి: సీఎం జగన్‌

Published Tue, Nov 7 2023 6:09 AM | Last Updated on Tue, Nov 7 2023 12:59 PM

CM Jagan mohan reddy on Puttaparthi Visit on November 7th - Sakshi

Updates

12:40PM,  Nov 7, 2023
►రైతు భరోసా నిధులను బటన్‌ నొక్కి విడుదల చేసిన సీఎం జగన్‌

11:50AM, Nov 7, 2023
వైఎస్సార్‌ రైతు భరోసా కార్యక్రమంలో సీఎం జగన్‌ ప్రసంగం

►అక్క చెల్లెమ్మల మంచి కోసం అమ్మ ఒడి, ఆసరా, చేయూత, సున్నావడ్డీ పథకాలు అందిస్తున్నాం
►అబద్ధాలు, మోసాలు చేసేందుకు పెద్దపెద్ద మాటలు చెబుతారు
►మోసాలు, అబద్ధాలను నమ్మకండి
►ఈ నాలుగేళ్లలో మీ ఇంట్లో మంచి జరిగింది.. లేదా మీరే చూడాలి
►గెలిచేందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 సపోర్టు అవసరం లేదు
►మీ బిడ్డకు ఎల్లో మీడియా అండదండలు లేవు
►మీ బిడ్డ నమ్ముకుంది మిమ్మల్నే
►మీకు మంచి జరిగి ఉంటే మీరే సైనికులుగా నిలబడండి

►ఒక్క రైతు భరోసా ద్వారానే రూ. 33వేల 210 కోట్లు అందించాం
►రైతులకు అండగా నిలిచేందుకుందుకు రూ. 1లక్ష 73 వేల కోట్లు ఖర్చు చేశాం
►చంద్రబాబుకు అధికారం తాను తన గజదొంగల ముఠా కోసమే
►పేదలు, అవ్వాతాతలు, నిరుద్యోగుల కోసం చంద్రబాబు ఆలోచన చేయడం లేదు

►చంద్రబాబుకు దోచుకోవడం, దాచుకోవడం తెలుసు
►చంద్రబాబు పేరు చెబితే స్కామ్‌లే గుర్తుకొస్తాయి
►రాష్ట్రాన్ని దోచుకునేందుకు చంద్రబాబుకు అధికారం కావాలి
►బాబు హయాంలో ఫైబర్‌ గ్రిడ్‌, ఇన్నర్‌రింగ్‌ రోడ్డు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఇలా అన్నీ చంద్రబాబు హయాంలో స్కామ్‌లే


►మన ప్రభుత్వంలో ఇప్పటికే రూ. 2 లక్షల 42 వేల కోట్లు అక్క చెల్లెమ్మలకు అందించాం
►చంద్రబాబు హయాంలో ఈ డబ్బంతా ఎవరి జేజుల్లోకి వెళ్లింది
►చంద్రబాబు హయాంలో మన పిల్లల చదువులు, బడులు ఎందుకు మారలేదు
►ఇంటి వద్దకే వైద్య సేవలు అందేలా ఫ్యామిలీ డాక్టర్‌, విలేజ్‌ క్లినిక్‌ కార్యక్రమాలు తీసుకొచ్చాం
►ఆరోగ్యశ్రీని పరిధిని 3,300 ప్రొసీజర్లకు పెంచాం
►ఏ పేదవాడు వైద్యానికి అప్పులు చేయకూడదన్నదే మా లక్ష్యం
►ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మల కోసం దిశయాప్‌ తీసుకొచ్చాం
►గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసులను ఏర్పాటు చేశాం
►అక్క చెల్లెమ్మల మంచి కోసం అమ్మ ఒడి, ఆసరా, చేయూత, సున్నావడ్డీ పథకాలు అందిస్తున్నాం
►ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలున్న గిరిజన రైతున్నలకు రైతు భరోసా అందించాం

►పంట సీజన్‌లో నష్టం జరిగితే అదే సీజన్‌లో ఇన్‌పుట్‌ సబ్సిడీ అందిస్తున్నాం
►గడిచిన నాలుగేళ్లలో రూ. 60 వేల కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేశాం
►సున్నా వడ్డీకి నిజమైన అర్థం చెబుతూ రైతన్నకి భరోసా కల్పిస్తున్నాం
►గతంలో సున్నా వడ్డీ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం జరిగింది
►చంద్రబాబు హయాంలో హెరిటేజ్‌ కంపెనీకి లాభాలు పెరిగాయి

►రైతులకు మంచి చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు ఎందుకు రాలేదు..?
►మీ బిడ్డ ప్రభుత్వంలో పుష్కలంగా వర్షాలు పడ్డాయి
►గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా..?
►బాబు ప్రభుత్వంలో వ్యవసాయానికి 7 గంటల కరెంట్‌ కూడా ఇవ్వలేకపోయారు
►మనసున్న ప్రభుత్వానికి మనసులేని ప్రభుత్వానికి తేడా గమనించండి
►ఈ-క్రాప్‌ ద్వారా ప్రతి రైతుకు మంచి జరిగేలా చేస్తున్నాం
►ప్రతి గ్రామం‍్లో నేడు ఆర్‌బీకే కేంద్రాలు పని చేస్తున్నాయి
►ఏటా రూ. 13, 500 రైతు భరోసా సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం
►రూ. 1700 కోట్లతో ఫీడర్ల సామర్థ్యం కూడా మన ప్రభుత్వంలోనే పెంచాం
►ఈ నాలుగేళ్లలో రూ, 7,800 కోట్ల బీమా అందించాం
►చంద్రబాబు హయాంలో వరుసగా ఐదేళ్లు కరువే
►దేవుడి దయతో గత నాలుగేళ్లుగా కరువు మాటేలేదు

►14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు రైతులకు చేసిందేమీ లేదు
►గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా చూడాలి
►ఎందుకు మీ బిడ్డ జగన్‌లా గత ప్రభుత్వం సంక్షేమం అందించలేకపోయింది?

►కేంద్రం పీఎం కిసాన్‌డబ్బులు కూడా ఈనెలలోనే వస్తాయి
►పీఎం కిసాన్‌ నిధులు కూడా విడుదల చేయాలని కేంద్రాన్ని కోరాను
►ప్రతి విషయంలో అన్నదాతలకు అండగా నిలబడ్డాం

►దేవుడి దయతో మంచి కార్యక్రమం జరుగుతుంది
►53 లక్షల 53 మంది రైతులకు పెట్టబడి సాయం
►రైతులకు రూ. 2,200 కోట్ల ఆర్థిక సాయం
►రైతులు ఇబ్బందులు పడకూడదనే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా నిధులు ఇస్తోంది
►సామాజిక సాధికారిత బస్సుయాత్రకు విశేష స్పందన లభిస్తోంది.

11:24AM, Nov 7, 2023
►వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమం పాల్గొన్న మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుమ్మనూరు జయరాం, ఉషాశ్రీచరణ్, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, శంకర్ నారాయణ, అనంతవెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, డాక్టర్ సిద్ధారెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీలు మంగమ్మ, శివరామిరెడ్డి, జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ తదితరులు

11:21AM, Nov 7, 2023
►ఐదో ఏడాది రెండో విడత రైతు భరోసా కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన సీఎం జగన్‌

11:15AM, Nov 7, 2023
►పుటపర్తి చేరుకున్న సీఎం జగన్‌

10:54AM, Nov 7, 2023
►కాసేపట్లో పుటపర్తికి సీఎం వైఎస్‌ జగన్‌

9:17AM, Nov7, 2023
►పుట్టపర్తి బయలుదేరిన సీఎం వైఎస్ జగన్
►కాసేపట్లో‌ వైఎస్సార్ రైతు భరోసా నిధులను విడుదల చేయనున్న సీఎం జగన్‌

►వరుసగా ఐదో ఏడాది.. రెండో విడత వైఎస్సార్‌ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం పంపిణీ చేయనున్న ఏపీ ప్రభుత్వం
►ఒక్కొక్కరికి రూ.4,000 చొప్పున 53.53 లక్షల మంది రైతన్నలకు రూ.2,204.77 కోట్ల రైతు భరోసా సాయం
►శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మంగళవారం బటన్‌ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగనమోహన్‌రెడ్డి

రైతన్నలకు వెన్నుదన్నుగా సీఎం జగన్‌
వ్యవసాయం దండగ అనే గత పరిస్థితులను సమూలంగా మార్చి వ్యవసాయాన్ని పండుగ చేసి రైతన్నలకు అడుగడుగునా వెన్నుదన్నుగా నిలుస్తూ చెప్పిన దాని కన్నా ముందుగా, మాట ఇచ్చిన దానికన్నా మిన్నగా.. రైతన్నలకు సాయం అందిస్తున్నారు. మేనిఫెస్టోలో ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేల సాయం అందిస్తామన్న హామీకి మిన్నగా.. ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 చొప్పున అంటే మేనిఫెస్టోలో చెప్పిన దాని కంటే రైతన్నకు అదనంగా రూ.17,500 చొప్పున పెట్టుబడి సాయం అం­దిస్తున్నారు.

ఖరీఫ్‌ పంట వేసే ముందు మేలో రూ.7,500, అక్టోబర్‌–­నవంబర్‌ నెల ముగిసే లోపే ఖరీఫ్‌ కోతలకు, రబీ అవసరాల కోసం రూ.4,000, పంట ఇంటికి వచ్చే వేళ జనవరి/ఫిబ్రవరిలో రూ.2 వేల చొప్పున ప్రభుత్వం సాయం అందిస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులు, ఆర్‌వోఎఫ్‌ఆర్‌ (అటవీ), దేవదాయ భూ సాగుదారులకు భూ యజమానులతో సమానంగా రైతు భరోసా కింద ప్రభుత్వం రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తోంది. తాజాగా జమచేస్తున్న రూ.2,204.77 కోట్లతో కలిపి వైఎస్సార్‌ రైతు భరోసా కింద ఒక్కో రైతు కుటుంబానికి రూ.65,500 చొప్పున ఈ నాలుగున్నరేళ్లలో రూ.33,209.81 కోట్ల పెట్టుబడి సాయం అందించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement