మీ ఓటు.. విశ్వసనీయతకా? మోసానికా? | Difference Between Andhra Pradesh YSRCP 2019 Manifesto And TDP Alliance 2014 Manifesto, More Details | Sakshi
Sakshi News home page

మీ ఓటు.. విశ్వసనీయతకా? మోసానికా?

Published Sat, May 11 2024 8:21 AM | Last Updated on Sat, May 11 2024 10:53 AM

Difference Between YSRCP 2019 Manifesto And TDP Alliance 2014 Manifesto Andhra Pradesh

వైఎస్సార్‌సీపీ 2019 మేనిఫెస్టో..
హామీ: వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా, రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరలు కలి్పంచి.. రైతులకు దన్నుగా నిలుస్తాం. 
అమలు: రైతులపై పైసా భారం పడకుండా వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని నీతి ఆయోగ్‌ అత్యుత్తమ పథకంగా ప్రశంసించింది. ఐదేళ్లలో పంటలు దెబ్బతిన్న 54.76 లక్షల మంది రైతులకు రూ.7,802.05 కోట్ల పరిహారాన్ని అందించారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేసి.. మార్కెట్లో ధరలేని పంటల ఉత్పత్తులు 21.73 లక్షల టన్నులను మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు రూ.7,796 కోట్లను వెచ్చించి, రైతులకు అండగా నిలిచారు. తుఫాన్‌లు, అధిక వర్షాల వల్ల తడిచిన, రంగుమారిన, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచారు. పంట నష్టపోయిన 34.41 లక్షల మంది రైతులకు అదే సీజన్‌లో ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.3,261.61 కోట్లు అందించారు.

హామీ: వార్షికాదాయం రూ.5 లక్షలలోపు ఉన్న వారందరికీ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తాం. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం. చికిత్సల అనంతరం విశ్రాంతి సమయానికి వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరాగా కింద ఆర్థిక సహాయం అందిస్తాం. 
అమలు: ఆరోగ్యశ్రీ కింద చికిత్స విధానాలను 1059 నుంచి 3,257కు పెంచారు. చికిత్స ఖర్చు రూ.వెయ్యి దాటిన అందరికీ ఆరోగ్యశ్రీని వర్తింపజేశారు. ఐదేళ్లలో 45.10 లక్షల మందికి ఆరోగ్యశ్రీ కింద చికిత్సల కోసం రూ.13,421 కోట్లు ఖర్చు చేశారు. విశ్రాంతి సమయంలో రోగులకు ఆరోగ్య ఆసరా కింద 24.59 లక్షల మందికి రూ.1,465 కోట్లను అందించారు. ఈ రెండు పథకాలను నీతి ఆయోగ్‌ ప్రశంసించింది. మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినప్పటికీ మరో అడుగు ముందుకేసి ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య ఖర్చుల పరిమితిని రూ.25 లక్షల వరకూ పెంచారు. గతంలో ఇది రూ.5 లక్షల వరకే ఉండేది.

హామీ: పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు వసతి, భోజనం కోసం అదనంగా ఏటా రూ.20 వేలు అందిస్తాం. 
అమలు:ఇచ్చిన మాట మేరకు జగనన్న విద్యా దీవెన పథకం 29.65 లక్షల మంది విద్యార్థులకు రూ.12,609.68 కోట్లను ఫీజురీయింబర్స్‌మెంట్‌గా చెల్లించారు. 2017–19 మధ్య చంద్రబాబు 16.73 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.1,778 కోట్లను సీఎం జగన్‌ చెల్లించారు. జగనన్న వసతి దీవెన కింద 25.17 లక్షల మంది విద్యార్థులకు రూ.4,275.76 కోట్లను అందించారు. 2022–23 విద్యా సంవత్సరంలో గరిష్టంగా 1.80 లక్షల మందికిపైగా విద్యార్థులు చదువు పూర్తిచేసుకున్న వెంటనే క్యాంపస్‌ ఇంటర్వ్యూల ద్వారా కార్పొరేట్‌ సంస్థల్లో ఉద్యోగాలు పొందారు.

హామీ: వైఎస్సార్‌ ఆసరా పథకం కింద ఎన్నికల రోజు వరకూ అక్క చెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును నాలుగు దఫాలుగా వారి చేతికే అందిస్తాం. మళ్లీ సున్నా వడ్డీకే రుణాల విప్లవం తెస్తాం. 
అమలు: 2019, ఏప్రిల్‌ 11 నాటికి పొదుపు సంఘాల మహిళలు 78.94 లక్షల మందికి ఉన్న రూ.25,570.90 కోట్లను నాలుగు విడతల్లో నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేశారు. సున్నా వడ్డీ కింద పొదుపు సంఘాల మహిళలకు రూ.4,969.04 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు.

హామీ: జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. పోలవరాన్ని పూర్తి చేస్తాం. సాగునీటి కలను నిజం చేస్తాం. 
అమలు: కరోనా మహమ్మారి ప్రభావం వల్ల లాక్‌డౌన్‌తో రెండేళ్లు పనులు చేయలేని పరిస్థితి. మిగతా మూడేళ్లలో రూ.35,268.05 కోట్లతో ఆరు ప్రాజెక్టులు (సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్, లక్కవరం ఎత్తిపోతల, అవుకు సొరంగం, కుప్పం బ్రాంచ్‌ కెనాల్, వెలిగొండ జంట సొరంగాలు–తొలి దశ) పూర్తి చేశారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించి పులిచింతల, సోమశిల, కండలేరు, గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌.. డయాఫ్రమ్‌ వాల్‌తో మట్టికట్ట లీకేజీలకు అడ్డుకట్ట వేసి బ్రహ్మంసాగర్‌లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేశారు. పోలవరంలో చంద్రబాబు చేసిన తప్పులను సరిదిద్దుతూ.. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన స్పిల్‌ వే, స్పిల్‌ చానల్, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు పూర్తి చేసి.. గోదావరి వరదను మళ్లించారు. చంద్రబాబు చారిత్రక తప్పిదం వల్లే దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్‌పై కేంద్రం నిర్ణయం వెల్లడించడమే తరువాయి.. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ పనులు చేపట్టి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సీఎం జగన్‌ సిద్ధంగా ఉన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఏటా ఖరీఫ్, రబీలలో కోటి ఎకరాలకు నీళ్లందించి రైతుల సాగునీటి కలను నిజం చేశారు.

హామీ: ఇంటి స్థలం లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాం. ఆ స్థలాలను అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తాం. ఇళ్లు కూడా కట్టిస్తాం. 
అమలు: ఇచ్చిన మాట మేరకు 31 లక్షల మందికిపైగా అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు పంపిణీ చేసి.. వాటిపై సర్వహక్కులు కల్పిస్తూ వారి పేరుతోనే రిజి్రస్టేషన్‌ చేసి ఇచ్చారు. ఈ స్థలాల మార్కెట్‌ విలువ రూ.76 వేల కోట్లకుపైగానే పలుకుతోంది. అంతే కాకుండా 22 లక్షల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించి.. ఇప్పటికే 9 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు ఇవ్వడంతోపాటు రూ.35 వేలు పావలా వడ్డీకే రుణంగా అందించారు. ఉచితంగా ఇసుక, సబ్సిడీపై ఇతర నిర్మాణ సామగ్రిని సరఫరా చేసి.. ఒక్కో లబి్ధదారుకు రూ.55 వేల చొప్పున ప్రయోజనం చేకూర్చారు. స్థలం, ఇంటి రూపంలో ఒక్కో లబ్ధిదారుకు రూ.6 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ స్థిరాస్థితిని సమకూర్చారు.

హామీ: బీసీల అభ్యున్నతికి ఏడాదికి రూ.15 వేల కోట్లు చొప్పున 5 ఏళ్లలో రూ.75 వేల కోట్లు ఖర్చు చేస్తాం. బీసీల్లోని అన్ని ఉప కులాలకు ప్రత్యేక కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసి, వైఎస్సార్‌ చేయూత ద్వారా ఎంత అవసరమైతే అన్ని నిధులు కేటాయించి వారి అభ్యున్నతికి తోడుగా ఉంటాం. నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్‌ కలి్పస్తూ చట్టం తెస్తాం. బీసీ జనగణన చేసి.. చట్టసభలో బీసీలకు రిజర్వేషన్‌ కలి్పంచాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పిస్తాం. 
అమలు: బీసీల అభ్యున్నతికి చెప్పిన దాని కంటే అధికంగా నిధులు ఖర్చు చేశారు. డీబీటీ రూపంలో రూ.1.28 లక్షల కోట్లను బీసీ లబి్ధదారుల ఖాతాల్లో నేరుగా జమా చేశారు. నాన్‌ డీబీటీ రూపంలో రూ.52 వేల కోట్ల ప్రయోజనం చేకూర్చారు. డీబీటీ, నాన్‌డీబీటీ కలిపి మొత్తం రూ.1.80 లక్షల కోట్లను బీసీల అభ్యున్నతి కోసం ఖర్చు చేశారు. బీసీల్లోని ఉప కులాలకు 56 కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసి, ఆ వర్గాల వారినే చైర్మన్‌లు, డైరెక్టర్‌లుగా నియమించారు. నామినేటెడ్‌ పనుల్లో, పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్‌ చేస్తూ చట్టం చేసి మరీ ఆ వర్గాలకు ప్రయోజనం చేకూర్చారు. బీసీ జనగణన చేయించి.. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్‌ కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడంతోపాటు ఇదే అంశంపై పార్లమెంట్‌లో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టారు. శాశ్వత బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పించారు. వెనుకబడిన వర్గాలను సమాజానికి వెన్నెముకగా తీర్చిదిద్దుతానంటూ ఆ వర్గాలకు ఇచ్చిన మాటను సీఎం జగన్‌ నిలబెట్టుకున్నారు.

హామీ: షాపులు ఉన్న నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఏడాదికి రూ.పది వేలు ఆర్థిక సహాయం చేసి తోడుగా ఉంటాం. 
అమలు: చెప్పిన మాట మేరకు ఐదేళ్లలో 3.37 లక్షల మందికి జగనన్న చేదోడు పథకం కింద రూ.1,260.17 కోట్లను సహాయంగా అందించి, తోడుగా నిలిచారు.

హామీ: మగ్గం ఉన్న చేనేత కారి్మకుల కుటుంబాలకు ఏడాదికి రూ.24 వేలను ప్రోత్సాహకంగా ఇస్తాం. 
అమలు: వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం కింద 82,130 మంది మగ్గం ఉన్న చేనేత కారి్మకులకు ఏడాదికి రూ.24 వేల చొప్పున ఐదేళ్లలో రూ.982.98 కోట్లను ప్రోత్సాహకంగా అందించారు.

హామీ: కులవృత్తిదారులు, చిరు వ్యాపారులకు సున్నా వడ్డీకే రూ.పది వేలు ఇస్తాం.  
అమలు: జగనన్న తోడు పథకం కింద 15.87 లక్షల మందికి సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చారు. సున్నా వడ్డీ కింద వారికి రూ.88.33 కోట్లు ఇచ్చారు.

హామీ: వైఎస్సార్‌ చేయూత పథకం కింద 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్క చెల్లెమ్మలకు ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగు విడతల్లో రూ.75 వేలు ఇస్తాం. 
అమలు: చెప్పిన మాట మేరకు 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కలు 33.15 లక్షల మందికి రూ.19,189.59 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. వాటిని సద్వినియోగం చేసుకున్న మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ.. ఆదాయం పొందుతూ ఆర్థిక సాధికారత సాధిస్తూ సొంత కాళ్లపై నిలబడే దిశగా అడుగులు వేస్తున్నారు.

హామీ: పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకంగా ఇస్తున్న రాయితీల (భూమి, పన్ను, విద్యుత్‌)తోపాటు ఏపీఐడీసీని పునరుద్ధరించి.. నిరుద్యోగ యువతకు సబ్సిడీ అందించి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడతాం. 
అమలు: అధికారం చేపట్టినప్పటి నుంచి పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక సంస్కరణల ద్వారా సులభతర వాణిజ్యం (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌)లో ఏటా రాష్ట్రాన్ని దేశంలో నంబర్‌ వన్‌గా నిలుపుతున్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఏటా సగటున రూ.14,896 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ఏపీఐడీసీని పునరుద్ధరించారు. ప్రభుత్వం ఇచ్చిన తోడ్పాటుతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) 1.9 లక్షల నుంచి ఏడు లక్షలకు చేరుకున్నాయి. 22.07 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. పరిశ్రమల స్థాపనతో గత 59 నెలల్లోనే కొత్తగా 28.92 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ప్రభుత్వ, ప్రైవేట్, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ అన్నీ కలిపి ఏకంగా 6,48,087 మందికి ఉద్యోగాలు, ఉపాధి లభించింది. హామీ ఇవ్వకున్నా నాలుగు పోర్టులు, పది ఫిషింగ్‌ హార్బర్లు, ఆరు ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు, మూడు ఇండస్ట్రియల్‌ కారిడార్లు, పది ఇండ్రస్టియల్‌ నోడ్స్‌ నిర్మాణంతో పారిశ్రామికాభివృద్ధిని పరుగులెత్తిస్తున్నారు.

హామీ: పార్లమెంటు నియోజకవర్గం యూనిట్‌గా ఒక జిల్లాను ఏర్పాటు చేసి.. జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేస్తా. 
అమలు: 13 జిల్లాలను పునర్‌వ్యవస్థీకరించి 26 జిల్లాలను ఏర్పాటు చేశారు. కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలు నిరి్మస్తున్నారు. 2023–24లో ఐదు మెడికల్‌ కాలేజీలను ప్రారంభించారు. 2024–25లో మరో ఐదు మెడికల్‌ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. మిగిలిన ఏడు 2025–26లో ప్రారంభించనున్నారు.

హామీ: ప్రతి గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేసి.. అదే ఊరిలోని పది మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం. 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించి ప్రభుత్వ సేవలను ఇంటి గుమ్మం వద్దకే ప్రజలకు అందిస్తాం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. 
అమలు: రాష్ట్రంలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాలను సీఎం జగన్‌ ఏర్పాటు చేశారు. ఒకే నోటిఫికేషన్‌ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.35 లక్షల మంది ఉద్యోగులను నియమించారు. సగటున 50 నుంచి 75 ఇళ్లకు ఒకరు చొప్పున 2.65 లక్షల మంది వలంటీర్లను నియమించి.. ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి గుమ్మం వద్దకే అందించి.. గ్రామ స్వరాజ్యాన్ని సీఎం జగన్‌ ఆవిష్కరించారు. వివిధ శాఖల్లో 2.31 లక్షల ఉద్యోగులను నియమించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే.. ఈ 59 నెలల్లోనే 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగులను నియమించడం గమనార్హం.   ప్రభుత్వ, ప్రైవేట్, ఎంఎస్‌ఎంఈలు, స్వయం ఉపాధితో కలిపి 58.22 లక్షల మందికిపైగా ఉద్యోగాలు, ఉపాధి కల్పించారు.

హామీ: ప్రభుత్వ పాఠశాలలను నాడు–నేడు కింద అభివృద్ధి చేస్తాం. విద్యా ప్రమాణాలు పెంచుతాం. ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెడతాం. పుస్తకాలు, యూనిఫాంలు సరైన సమయానికి ఇస్తాం. మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచుతాం. 
అమలు: నాడు–నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్థాయికి అభివృద్ధి చేసే పనులను రెండు దశల్లో చేపట్టారు. తొలి దశ ఇప్పటికే పూర్తయింది. రెండో దశ పనులు వేగంగా సాగుతున్నాయి. కోర్టులకు వెళ్లి టీడీపీ అడ్డుకున్నా సరే.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంను ప్రవేశపెట్టారు. పాఠశాలలు ప్రారంభమైన రోజే జగనన్న విద్యాకానుక పథకం కింద పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు, యూనిఫాంలు, బూట్లు సాక్స్‌లు అందిస్తున్నారు. జగనన్న గోరుముద్ద పథకం కింద మధ్యాహ్నం నాణ్యమైన భోజనంతోపాటు చిక్కీ ఇస్తున్నారు. సీబీఎస్‌ఈ సిలబస్‌ను అమలు చేస్తున్నారు. 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఐబీ సిలబస్‌ను ప్రవేశపెట్టనున్నారు. మూడో తరగతి నుంచే టోఫెల్‌ శిక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదవుతున్న పిల్లలు ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌), వైట్‌హౌస్‌ వేదికలపై రాష్ట్రంలో అమలవుతున్న విద్యా విధానం, సంస్కరణలపై అనర్గళంగా ప్రసంగించడం దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది.  

హామీ: వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం ఏడాదికి రూ.12,500 అందిస్తాం. 
అమలు: మేనిఫెస్టోలో చెప్పిన దాని కంటే అధికంగా.. ఏడాదికి ఒక్కో రైతు కుటుంబానికి రూ.13,500 రైతు భరోసా కింద ఇచ్చారు. ఐదేళ్లలో రూ.67,500 రైతు భరోసా కింద ఇచ్చారు. ఈ పథకం కింద ఐదేళ్లలో 53,58,366 మంది రైతులకు రూ.34,378.16 కోట్లను వారి ఖాతాల్లో నేరుగా జమ చేశారు.

హామీ: వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని రూ.4 వేల నుంచి రూ.పది వేలకు పెంచుతాం. మత్స్యకారులకు ఇచ్చే డీజిల్‌ సబ్సిడీని డెడికేటెడ్‌ పెట్రోల్‌ బంక్‌ల ద్వారా డీజిల్‌ పట్టుకునేటప్పుడు వారి చేతికి అందేటట్టు అమలు చేస్తాం. ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.పది లక్షలను పరిహారంగా చెల్లిస్తాం. 
అమలు: వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని రూ.పది వేలకు పెంచారు. వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకం కింద ఐదేళ్లలో 2.43 లక్షల మందికి రూ.538.06 కోట్లను అందించారు. డీజిల్‌ సబ్సిడీని అమలు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.పది లక్షలను పరిహారంగా అందిస్తున్నారు.

హామీ: అవ్వాతాతలకు పెన్షన్ల అర్హత వయసు 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించి.. పెన్షన్‌ను రూ.3 వేల వరకూ పెంచుకుంటూపోతాం. 
అమలు: ఇచ్చిన మాట మేరకు వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పథకం కింద వృద్ధాప్య పెన్షన్‌ను రూ.2,000 నుంచి రూ.2,250కు పెంచే ఫైలుపై 2019, మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక జగన్‌ తొలి సంతకం చేశారు. దశలవారీగా పెన్షన్‌ను రూ.3 వేలకు పెంచి వలంటీర్ల ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటి వద్దే వృద్ధులకు పంపిణీ చేస్తున్నారు. అర్హతే ప్రామాణికంగా ఎలాంటి వివక్ష చూపకుండా 66.34 లక్షల మందికి పెన్షన్‌ పంపిణీ చేస్తున్నారు. గత 59 నెలల్లో పెన్షన్‌ రూపంలో రూ.90,590.6 కోట్లను పంపిణీ చేశారు.

టీడీపీ కూటమి 2014 మేనిఫెస్టో..


హామీ: అధికారంలోకి రాగానే వ్యవసాయ రుణాల మాఫీపై తొలి సంతకం చేస్తా. 
అమలు: రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీపై తొలి సంతకం చేయకుండా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే 2014, జూన్‌ 8న చంద్రబాబు మోసం చేశారు. వ్యవసాయ రుణాల మాఫీపై కోటయ్య కమిటీని వేసి.. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ పేరుతో కోతలు పెట్టి రూ.15,297 కోట్లను మాత్రమే మాఫీ చేశారు. మిగతా రూ.72,315 కోట్లు మాఫీ చేయకుండా రైతులకు చంద్రబాబు టోపీ పెట్టారు.

హామీ: డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా. 
అమలు: టీడీపీ సర్కార్‌ అధికారంలోకి వచ్చే నాటికి రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల మహిళలు బకాయిపడ్డారు. ఆ రుణాల్లో ఒక్క పైసా కూడా మాఫీ చేయకుండా మహిళలను చంద్రబాబు వంచించారు.

హామీ: ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి అందజేస్తా. 
అమలు: 2014, జూన్‌ 8 నుంచి 2019, మే 29 వరకూ కేవలం 32 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేశారు. రాష్ట్రంలోని కోటికిపైగా ఇళ్ల(కుటుంబాలు)కు ఉద్యోగాలు ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి కింద పైసా కూడా ఇవ్వలేదు. ఒక్కో ఇంటికి నెలకు రూ.2 వేల చొప్పున 60 నెలలకు రూ.1.20 లక్షలు ఇవ్వకుండా ఎగ్గొట్టి చంద్రబాబు మోసం చేశారు.

హామీ: ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద బ్యాంకులో రూ.25 వేలు డిపాజిట్‌ చేస్తా. 
అమలు: ఐదేళ్లలో పుట్టిన ఒక్క ఆడబిడ్డ పేరుతో ఒక్క పైసా కూడా డిపాజిట్‌ చేయకుండా చంద్రబాబు మోసం చేశారు.

హామీ: అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం ఇచ్చి.. పక్కా ఇళ్లు కట్టిస్తాం. 
అమలు: మూడు సెంట్లు స్థలం మాట దేవుడెరుగు.. కనీసం ఏ ఒక్కరికీ సెంటు స్థలం కూడా ఇవ్వకుండా ప్రజలను చంద్రబాబు మోసం చేశారు.

హామీ: ఏటా రూ.పది వేల కోట్లతో బీసీ సబ్‌ ప్లాన్‌ను అమలు చేస్తా. 
అమలు: ఇచ్చిన మాట ప్రకారం ఏడాదికి రూ.పది వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.50 వేల కోట్లను బీసీ సబ్‌ ప్లాన్‌ కింద ఆ వర్గాల సంక్షేమం కోసం ఖర్చు చేయాలి. కానీ.. ఐదేళ్లలో రూ.36 వేల కోట్లను మాత్రమే ఖర్చు చేసి, అందులోనూ అవినీతికి పాల్పడి బీసీలను మోసం చేశారు.

హామీ: చేనేత, పవర్‌లూమ్స్‌ రుణాలు మాఫీ చేస్తా. 
అమలు: ఒక్క రూపాయి రుణాన్ని కూడా మాఫీ చేయకుండా చేనేత, పవర్‌లూమ్స్‌ కారి్మకులకు చంద్రబాబు టోపీ పెట్టారు.

హామీ: సింగపూర్‌ను మించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా. ప్రతి నగరంలో, జిల్లా కేంద్రంలో హైటెక్‌ సిటీ నిర్మిస్తా. 
అమలు: సింగపూర్‌ను మించి అభివృద్ధి మాటేమోగానీ అడ్డగోలు, అవినీతి, అక్రమాలకు పాల్పడి రాష్ట్రంలో చంద్రబాబు విధ్వంసం సృష్టించారు. జిల్లా కేంద్రాల మాట దేవుడెరుగు కనీసం ఏ ఒక్క నగరంలో కూడా హైటెక్‌ సిటీ నిర్మాణానికి పునాదిరాయి కూడా వేసిన పాపాన పోలేదు.

హామీ: మహిళల భద్రతకు ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తా. ఆపదలో ఉన్న మహిళలకు సెలఫోన్ల ద్వారా 5 నిమిషాలలో సహాయం అందించే వ్యవస్థ ఏర్పాటుచేస్తా. 
అమలు: ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటుకు చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విజయవాడలో కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ మహిళల మానప్రాణాలతో చెలగాటమాడటం రాష్ట్రాన్ని కుదిపేసింది. ఇసుక దోపిడీకి అడ్డుతగిలిన తహసీల్దార్‌ వనజాక్షిని అప్పటి టీడీపీ ఎమ్మెల్యే జుట్టుపట్టుకుని లాగి, దాడిచేసినా చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

హామీ: పేద పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య, కాలేజీ విద్యార్థులకు ఐప్యాడ్, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యా విధానంలో మార్పులు తెస్తా. 
అమలు: విద్యా విధానంలో మార్పుల మాట దేవుడెరుగు కనీసం ప్రభుత్వ పాఠశాలల ప్రమాణాలను పెంచేందుకు చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాలేజీ విద్యార్థులకు ఐప్యాడ్‌లు ఇవ్వకుండా మోసం చేశారు. ఫీజు ఎంత ఉన్నా
రూ.35 వేలు మాత్రమే ఫీజురీయింబర్స్‌మెంట్‌ కింద ఇవ్వడం వల్ల విద్యార్థుల తల్లితండ్రులపై తీవ్ర ఆర్థిక భారం పడింది.

హామీ: ఆరోగ్యశ్రీ కంటే మెరుగైన వైద్య సేవలు అందిస్తా. 
అమలు: ఆరోగ్యశ్రీ పేరును ఎనీ్టఆర్‌ వైద్య సేవగా మార్చిన చంద్రబాబు.. బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం చేయడం వల్ల ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగులకు చికిత్స అందించడానికి యాజమాన్యాలు నిరాకరించాయి. దాంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పేదల ఆరోగ్యానికి భరోసా ఇచ్చే ఆరోగ్యశ్రీని చంద్రబాబు నీరుగార్చారు. ఆరోగ్యశ్రీ కింద చంద్రబాబు పెట్టిన రూ.600 కోట్ల బకాయిలను సీఎం జగన్‌ చెల్లించారు.

హామీ: రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తా.. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్ట నివారణకు రైతుల వారీగా బీమా సౌకర్యం కలి్పస్తా. 
అమలు: ధరల స్థిరీకరణ నిధి కింద ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. గిట్టుబాటు ధరలు దక్కక ధాన్యం, అపరాలు, ఉల్లి, టమాటా, మామిడి, బత్తాయి తదితర రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా రైతులను మోసం చేశారు.

హామీ: ప్రతి జిల్లాకూ, పట్టణానికి, మండలానికి, గ్రామానికి ఒక దార్శనిక పత్రం (విజన్‌ డాక్యుమెంట్‌)ను తయారుచేసి అభివృద్ధి చేస్తాం. 
అమలు: ప్రతి జిల్లా, పట్టణం, మండలం, గ్రామం అభివృద్ధి మాటేమోగానీ.. అడ్డగోలుగా అవినీతి, అక్రమాలకు పాల్పడిన చంద్రబాబు బ్యాచ్‌ అధోగతిపాలు చేశాయి.

హామీ: అవినీతిరహిత సుపరిపాలన, పాలనలో పారదర్శకత తెస్తా. పెరుగుతున్న నిత్యావసరాల ధరల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటా. 
అమలు: అక్షర క్రమంలో ముందున్న ఆంధ్రప్రదేశ్‌ను అవినీతిలోనూ చంద్రబాబు అగ్రగామిగా నిలిపారు. చంద్రబాబు మానసపుత్రిక అయిన జన్మభూమి కమిటీల్లోని టీడీపీ నేతలు లంచాల కోసం ప్రజలను పీడించాయి.

హామీ: కొత్తగా కళింగపట్నం, నరసాపురం ఓడరేవు, నిజాంపట్నం, రామాయపట్నం, దుగరాజపట్నం పోర్టులను నిరి్మంచి, పాత పోర్టులతో అనుసంధానం చేస్తూ ఇండ్రస్టియల్‌ క్లస్టర్స్‌ను అభివృద్ధి చేస్తా. 
అమలు: ఐదేళ్లలో కొత్తగా ఒక్కటంటే ఒక్క పోర్టు నిర్మాణ పనలు కూడా చంద్రబాబు ప్రారంభించలేదు. ఇండ్రస్టియల్‌ క్లస్టర్స్‌ను ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు.

హామీ: వివిధ జిల్లాలను అనుసంధానం చేస్తూ బుల్లెట్‌ ట్రైన్స్‌ (ర్యాపిడ్‌ రైల్వే ట్రాన్స్‌పోర్టు వ్యవస్థ)ను ప్రవేశపెడతాం. 
అమలు: బుల్లెట్‌ ట్రైన్స్‌ పేరుతో ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఎన్నడూ ఆ మాట ఎత్తడానికి కూడా సాహసించలేదు.

హామీ: పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తా. గాలేరు–నగరి, హంద్రీ–నీవా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వెలిగొండ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేస్తాం. 
అమలు: కమీషన్ల కక్కుర్తితో జాతీయ పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు విధ్వంసం సృష్టించారు. పోలవరం ప్రాజెక్టును కమీషన్ల కోసం చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారంటూ 2019, ఏప్రిల్‌ 1న రాజమహేంద్రవరంలో ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేయడమే అందుకు నిదర్శనం. గాలేరు–నగరి, హంద్రీ–నీవా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వెలిగొండ ప్రాజెక్టుల్లో కాంట్రాక్టర్లతో కుమ్మక్కై భారీ ఎత్తున నిధులు దోచేశారు. దాంతో ఆ ప్రాజెక్టులు పూర్తి కాలేదు.

హామీ: కేంద్రం రాజధాని లేకుండా విభజించి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టింది. సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకుని రాజధానిగా ప్రపంచస్థాయి నగరాన్ని నిర్మిస్తా. 
అమలు: ప్రపంచస్థాయి నగరం మాటేమోగానీ.. ఆ ముసుగులో ఓత్‌ ఆఫ్‌ సీక్రసీని తుంగలో తొక్కి.. రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడి అంతర్జాతీయ స్థాయి భూ కుంభకోణానికి చంద్రబాబు పాల్పడ్డారు. అమరావతిలో ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్క శాశ్వత భవనాన్ని నిరి్మంచలేకపోయారు. కనీసం రహదారి సౌకర్యాన్ని కూడా కలి్పంచలేకపోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement