‘మద్దతు ధర ఆలోచన అప్పుడే ఎందుకు చేయలేదు?’ | YSRCP Leader Botsa Satyanarayana On TDP Government | Sakshi
Sakshi News home page

‘మద్దతు ధర ఆలోచన అప్పుడే ఎందుకు చేయలేదు?’

Published Fri, Feb 21 2025 5:49 PM | Last Updated on Fri, Feb 21 2025 6:47 PM

YSRCP Leader Botsa Satyanarayana On TDP Government

విశాఖ : మిర్చి రైతులకు మద్దతు ధర ఇవ్వాలనే ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు నెలల క్రితమే ఎందుకు చేయలేదని వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.  వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మిర్చి రైతులను పరామర్శించే వరకూ మీరు స్పందించ లేదంటే ఏమనుకోవాలని బొత్స నిలదీశారు.‘కేంద్ర మంత్రి ఢిల్లీ లో లేనప్పుడు మిర్చి రైతుల కోసం చర్చించడానికి వెళుతున్నామని చెప్పడం ఎంత వరకు సమంజసం. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  మిర్చి యార్డ్ కు వెళ్ళిన తర్వాత మిర్చి రైతుల ఆవేదన ఈ ప్రభుత్వానికి తెలిసింది. 

మద్దతు ధర ఇవ్వాలనే ఆలోచన రెండు నెలల క్రితమే ఎందుకు చేయలేదు..రైతులు, వ్యవసాయం దండగ అనే భావన చంద్రబాబు మనసులో ఇంకా పోలేదు. మిర్చి రైతులను కలవడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్లడం ఇల్లీగల్ యాక్టివిటీ అయితే అట్టహాసంగా విజయవాడలో జరిగిన మ్యూజికల్ నైట్ లీగల్ అవుతుందా...? .విశాఖలో జరిగిన భూ కుంభకోణాల పై విచారణ నివేదికల ను బహిర్గతం చెయ్యాలి. బురదజల్లడం కాదు ఆరోపణలు నిరూపించాలి...ఆ బాధ్యత ప్రభుత్వానిదే. జెడ్ కేటగిరీలో వున్నమాజీ ముఖ్యమంత్రి భద్రత ఎందుకు కుదిరించారు అని గవర్నర్ ఆశ్చర్య పోయారు. జగన్ భద్రత తనకు సంబంధం లేదని చెబుతున్న ముఖ్యమంత్రి.....మిర్చి యార్డ్ సందర్శనకు వెల్లడం ఇల్లీగల్ అని ఎలా చెబుతారు’ అని బొత్స సూటిగా ప్రశ్నించారు.

ప్రతిపక్ష నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది: Botsa

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement