AP Elections Political Latest Updates Telugu..
9:00PM, Feb 13, 2024
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్..
- టీడీపీ నేతల ప్రచారం పచ్చకామెర్లవాడి సామెతలాగ ఉంది
- దొంగ ఓట్లతోనే రాజకీయాలు చేసే టీడీపీ పార్టీలాగా మేము వ్యవహరించం
- తెలంగాణ ఎన్నికల్లో నేను గాని, నా కుటుంబం కానీ ఓట్లు వేయలేదు
- ప్రస్తుతం మేం ఉంటున్న రెయిన్‌ట్రీ కాలనీలో రోడ్డుకు ఒకవైపున ఉన్న రెయిన్‌ట్రీ అపార్ట్‌మెంట్లు పొన్నూరు నియోజకవర్గంలోనూ, రెండో వైపున ఉన్న విల్లాలు మంగళగిరి నియోజకవర్గంలోనూ ఉంటాయి
- ఓటర్ల చేరిక సమయంలో పొన్నూరు నియోజకవర్గంలోనూ పేర్లు నమోదు చేయడం జరిగింది
- విషయం తెలిసిన తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో ఓట్ల నమోదుకు దరఖాస్తు చేయడం జరిగింది
- మొదటగా దరఖాస్తు చేసిన పొన్నూరు నియోజకవర్గ ఓటర్ల జాబితానుంచి మా పేర్లను తొలగించాల్సిందిగా జనవరి 31వ తేదీనే దరఖాస్తు చేయడం జరిగింది
- ఇప్పటికే ఆ జాబితా నుంచి తొలగించే ఉంటారని భావిస్తున్నా
- ఇన్నాళ్ళ ప్రజా జీవితంలో ఎన్నడూ టీడీపీ ముఠా మాదిరిగా అనైతిక చర్యలకు పాల్పడలేదు
- తప్పుడు పద్ధతుల్లో, కుప్పంలో వేలాది దొంగ ఓట్లు నమోదు చేయించుకున్న మాదిరిగా ఎన్నికల్లో తలపడాల్సిన అవసరం మాకు లేదు
- మా నాయకుడు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, గత ఐదేళ్ల ప్రభుత్వపాలనే మాపార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయి
- ప్రజలు నిశితంగా వీటన్నింటినీ గమనిస్తూనే ఉన్నారు
5:012PM, Feb 13, 2024
టీడీపీ భూ కబ్జాలపై చర్చకు సిద్ధం: వరుదు కల్యాణి
- కబ్జాలకు కేరాఫ్ చంద్రబాబు, రామోజీనే
- లీజుకు తీసుకున్న భూమిని సొంతం చేసుకోవాలని రామోజీ కుట్ర చేశారు
- లోకేష్ తోడల్లుడు భరత్ సైతం 46 ఎకరాల కబ్జా చేశారు
5:05PM, Feb 13, 2024
లేవ లేనోడు కూడా నేను లేస్తే మనిషిని కాదు అని అంటాడు అలా ఉంది చంద్రబాబు, లోకేష్ మాటలు: పిల్లి సుభాష్ చంద్రబోస్
- చంద్రబాబు తన హయాంలో పేదలకు చేసింది ఏమి లేదు
- ప్రజలు చంద్రబాబు, లోకేష్, టీడీపీలను నమ్మే పరిస్థితి లేదు
- సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో తమ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని ప్రతి ఒక్కరు చెబుతున్నారు
- చంద్రబాబు హయాంలో బీసీలకు రాజ్యాధికారం కల్పించిన దాఖలాలు లేవు
- బీసీలు జడ్జిలుగా పనికిరారు అని లేఖ రాసిన వ్యక్తి చంద్రబాబు
- దాన్నే చంద్రబాబు కండకావరం అంటారు.
- ప్రజలు చంద్రబాబు కాకమ్మ కథలు నమ్మే పరిస్థితిలో లేరు
- 2024లో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారు
- నేనుపార్లమెంట్‌కి వెళ్తానని కలలో కూడా ఊహించలేదు
3:05PM, Feb 13, 2024
విజయవాడ:
లోకేష్ రెడ్‌బుక్ బెదిరింపుల కేసుపై విచారణ వాయిదా
- విచారణను ఈనెల 21కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
- కౌంటర్ దాఖలకు సమయం కోరిన లోకేష్ తరఫు న్యాయవాది
- ఇప్పటికే మూడుసార్లు సమయం కోరిన లోకేష్ తరఫు న్యాయవాది
- కేసు విచారణ జరగకుండా మొదటి నుంచి లోకేష్ యత్నాలు
1:45 PM, Feb 13, 2024
వైఎస్సార్‌ను విమర్శించిన వాళ్లతో షర్మిల స్నేహ హస్తమా?: మంత్రి రోజా
- అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు చంద్రబాబు నైజం
- పవన్ కల్యాణ్ మాటలను ప్రజలు నమ్మలేదు
- అందుకే షర్మిలకు చంద్రబాబు స్క్రిప్ట్ ఇచ్చి చదివిస్తున్నారు
- దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని విమర్శించిన చంద్రబాబుతో షర్మిల ఎలా కలుస్తారు?
- వైఎస్సార్‌ను పంచలు ఊడదీసి కొడతామన్నా పవన్‌కు ఎందుకు కలిశారు?
- రేవంత్‌రెడ్డి అవినీతిపరుడు, టీడీపీ కోవర్ట్ అని విమర్శించిన షర్మిల ఆ సంగతి మరిచిపోయి కలిశారా?
- ఇలాంటి వాళ్లతో చేతులు కలిపి.. వైఎస్ ఆత్మ క్షోభించేలా చేస్తున్నారు
- వినేవాళ్లు ఎర్రివాళ్లు అయితే చెప్పేవారు షర్మిల
- వైఎస్ ఆశయాలకు షర్మిల తూట్లు పొడుస్తున్నారు
- షర్మిలవి టైంపాస్ రాజకీయాలు
- సీఎం జగన్‌పై విషయం చిమ్ముతూ, వైఎస్సార్‌సీపీ ఓట్లు విభజించాలన్నదే షర్మిల ఉద్ధేశ్యం
- రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలని గానీ, రాష్ట్ర ప్రజలకు మంచి చెయ్యాలన్న ఆలోచన లేదు
- వైఎస్ ఆశయాలకు నిజమైన వారసుడు సీఎం జగన్
విశాఖలో ఆడుదాం ఆంధ్రా ముగింపు వేడుకల్లో మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యలు
1:32 PM, Feb 13, 2024
జగన్ అంటే నిజం.. అదే గెలుస్తుంది: మంత్రి పెద్దిరెడ్డి
- జగన్ మోహన్ రెడ్డి అంటేనే నిజం .. ఖచ్చితంగా నిజం గెలుస్తుంది
- టీడీపీ పతనావస్థకు చేరింది
- బాబు, పవన్ తో షర్మిల చేతులు కలపడం దురదృష్టకరం
- సీఎం జగన్ కృషి వల్లే ఎక్కువ సాగునీటి జలాలు ఏపీకి వచ్చాయి
- 2018 కి ముందు ఏపీలో 60 లక్షల దొంగ ఓట్లను టీడీపీ చేర్చింది
- ఏపీ రైతులకు జరిగిన మేలు తెలంగాణ అసెంబ్లీలో మంత్రులే చెబుతున్నారు
- 18న రాప్తాడు లో ' సిద్ధం' సభను విజయవంతం చేయాలి
- రాజ్యసభలో టీడీపీ ఖాళీ .. పతనావస్థకు ఇదే నిదర్శనం
రాప్తాడు సిద్ధం సభ ఏర్పాట్ల పర్యవేక్షణలో.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు
1:09 PM, Feb 13, 2024
ఆలూ లేదు చూలు లేదు.. అల్లుడి పేరు.!!?
- పవన్ పర్యటనకు ప్రత్యేక హెలికాఫ్టర్ సిద్ధమట.!
- ఇప్పటివరకు ఎక్కడ పోటీ చేస్తాడో లేని స్పష్టత
- జనసేనకు ఎన్ని సీట్లో తెలియని పరిస్థితి
- అయినను జిల్లాల్లో పర్యటించాలని పవన్‌కు చంద్రబాబు హుకుం
- ఒక్కో జిల్లాకు మూడు సార్లు వెళ్లాలని పవన్‌కు ఆదేశం
- కాపులు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో పర్యటించాలని సూచన
- పవన్ కల్యాణ్ జిల్లాల పర్యటనపై ప్రణాళిక సిద్ధం
- 175 నియోజకవర్గాల్లో హెలికాఫ్టర్ లో వెళ్లాలని నిర్ణయం
- ప్రతి జిల్లాకు 3 సార్లు వెళ్లాలని పవన్ నిర్ణయం
- మొదటి పర్యటనలో జిల్లాల ముఖ్యనేతలతో సమీక్షలు
- రేపటి నుంచి గోదావరి జిల్లాల్లో పర్యటించనున్న పవన్
- 4 రోజులు గోదావరి జిల్లాల్లో ముఖ్యనేతలతో సమీక్షలు
- రేపు, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా నేతలతో పవన్ సమీక్షలు
- ఈ నెల 15న అమలాపురంలో జిల్లా నేతలతో పవన్ భేటీ
- ఈ నెల 16న కాకినాడలో మరోసారి సమీక్షలు చేయనున్న పవన్
- ఈ నెల 17న రాజమండ్రిలో పార్టీ నేతలతో పవన్ సమావేశం
12:50 PM, Feb 13, 2024
వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ మరికొంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉండాలి
- తాత్కాలిక పేరుతో టీడీపీ కాలయాపన చేసింది
- రాజధాని నిర్మించే ఆర్థిక వనరులు లేవు
- విశాఖ రాజధానిగా ఏర్పాటు చేస్తే న్యాయపరమైన చిక్కులుఖెదురయ్యాయి
- విశాఖ రాజధాని కార్యసాధన పూర్తయ్యే వరకు .. హైదరాబాద్ రాజధానిగా ఉండాలి
- హైదరాబాద్ మరికొంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉండాలి
- ఎన్నికల తర్వాత.. సీఎం, పార్టీ నాయకత్వం దీనిపై చర్చిస్తుంది
12:32 PM, Feb 13, 2024
రాజ్యసభలో జీరో సైకిల్!!
- నాలుగు దశాబ్దాల చరిత్రలో మొదటిసారి రాజ్యసభలో విచిత్ర పరిస్థితి
- పెద్దల సభలో ప్రాతినిధ్యం కోల్పోయే దశలో టీడీపీ
- ఉన్న బలాన్ని బట్టి చూస్తే టీడీపీ కి ఒక్క సీటు కూడా అసాధ్యమే
- తెలుగుదేశానికి రాజ్యసభ అచ్చిరాదనే సెంటి మెంట్
- 2019 కు ముందు వైసీపీ కి రాజ్యసభలో ఇద్దరు సభ్యులు
- 2019 కు ముందు టీడీపీ కి తొమ్మిది మంది మెంబర్లు
- 2019 ఎన్నికల తర్వాత మారిపోయిన సీన్
- ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలన్నింటిలోనూ వైఎస్సార్‌సీపీ విజయం
- ఖాళీ అయ్యే మూడు సీట్లను వైఎస్సార్‌సీపీ గెలుచుకునే సమీకరణాలు
- వైఎస్సార్‌సీపీ ఎంపీ వేమిరెడ్డి ఏప్రిల్ నెలతో రిటైర్
- టీడీపీ ఎంపీ కనకమేడల ఏప్రిల్ నెలతో రిటైర్
- బీజేపీ కండువా కప్పుకున్న సీఎం రమేష్ ఏప్రిల్ నెలతో రిటైర్
- గంటా రాజీనామాతో 22కి పడిపోయిన టీడీపీ బలం
12:00 PM, Feb 13, 2024
లోకేష్ రెడ్ బుక్ బెదిరింపులపై విచారణ వాయిదా
- ఏసీబీ కోర్టులో నారా లోకేష్ బెదిరింపుల కేసు విచారణ
- ఏసీబీ కోర్టులో.. నారా లోకేష్‌ను అరెస్ట్ చేయాలని సీఐడీ పిటిషన్
- ప్రభుత్వ అధికారులను లోకేష్ బెదిరించాడంటూ పిటిషన్ వేసిన సీఐడీ
- రెడ్‌బుక్‌లో అధికారుల పేర్లు ఉన్నాయంటూ గతంలో బెదిరించిన నారా లోకేష్
- కేసును ఈ నెల 21కి వాయిదావేసిన ఏసీబీ కోర్టు
11:10 AM, Feb 13, 2024
జంగా కృష్ణమూర్తికి అనిల్ కుమార్ కౌంటర్
- ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వ్యాఖ్యలు బాధించాయి
- జగన్‌ను నిజంగా అభిమానించే వారు పార్టీ మారరు
- ఫేక్‌లే పార్టీ మారతారు
- తాను చనిపోయాక కూడా తన శవంపై పార్టీ జెండాను జగన్ కప్పాలన్న నేత పార్టీ మారారు
- బీసీలకు సీఎం జగన్ ఏం చేయలేదనడం సరికాదు
- నరసరావుపేట ఎంపీ సీటు తొలుత జంగా కృష్ణమూర్తికి కేటాయించారు
- జంగా కృష్ణమూర్తి విముఖత చూపించారు
- ఆయన పోటీ చేయనంటేనే నాకు అవకాశం ఇచ్చారు
- ఒకరిద్దదరు పార్టీ వీడి వెళ్లినంత మాత్రాన నష్టం లేదు
- టీడీపీ ఎంత మంది బీసీ నేతలకు అవకాశం ఇచ్చిందో చూడాలి
- కష్టకాలంలో నా వెంట ఉన్నవారి రుణం తీర్చుకోలేను
నరసరావుపేట పార్లమెంటరీ స్థానం వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జి అనిల్ కుమార్ యాదవ్
10:20 AM, Feb 13, 2024
పెద్ద మార్పులు ఉండకపోవచ్చు: వైవీ సుబ్బారెడ్డి
- సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్ మళ్లీ గెలవాలి
- అన్ని సీట్లు ప్రకటించినప్పుడు కొన్ని మార్పులు తప్పవు
- ఒకటిరెండు సీట్లు తప్పా మిగతా స్థానల్లో పెద్ద మార్పులు ఉండకపోవచ్చు
వైవీ సుబ్బారెడ్డి కామెంట్స్
9:32 AM, Feb 13, 2024
శెట్టి బలిజలను సీఎం జగన్ చట్ట సభలకు పంపారు
- సీఎం జగన్ పాలన.. బీసీలకు సువర్ణ అధ్యాయనం
- మరో నాలుగు రోజుల్లో కులగణన జరగబోతోంది
- శెట్టి బలిజలపై చిన్నచూపు అని చంద్రబాబు అసత్యాలు రాయిస్తున్నాడు
- తూర్పు గోదావరి నుంచి శెట్టి బలిజలను చట్ట సభలకు పంపిన ఘనత వైఎస్ జగన్‌ది
- సీఎం జగన్ ఒక ఆశయంతో ఎన్నికలకు వెళ్తున్నారు
- టీడీపీ జనసేలు అధికారంపై ఆశతో పొత్తులు పెట్టుకుంటున్నాయి
- 40 ఏళ్ల టీడీపీలో రాజ్యసభలో చోటు లేకుండా పోయింది
మంత్రి చెల్లబోయిన వేణుగోపాల్ కామెంట్స్
9:00 AM, Feb 13, 2024
బాబు, పవన్.. ష్ గప్‌చుప్
- టీడీపీ, జనసేన ఉమ్మడి సమావేశం వాయిదా
- రేపు అభ్యర్థులప్రకటన లేనట్లే!
- అభ్యర్తులు లేక జాబితా ఖరారు చేయని చంద్రబాబు
- ఢిల్లీ పర్యటనపై ఇప్పటిదాకా నోరు విప్పని చంద్రబాబు
- ఢిల్లీ పర్యటన తర్వాత బాబుతో పాటు పవనూ సైలెన్స్
7:51 AM, Feb 13, 2024
గ్లాస్ గుర్తు ఉంటుందా? ఊడుతుందా?
- జనసేన గ్లాస్ గుర్తు పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో నేడు విచారణ
- తమ దరఖాస్తును పట్టించకోకుండా జనసేను గుర్తు కేటాయించారంటూ కోర్టును ఆశ్రయించిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్(సెక్యూలర్)
- హైకోర్టులో వ్యాజ్యం వేసిన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం శ్రీనివాస్
- కిందటి ఏడాది డిసెంబర్ 20వ తేదీన దరఖాస్తు చేసినట్లు పిటిషన్‌లో ప్రస్తావన
- ఎన్నికల గుర్తులు ఉత్తర్వులకు విరుద్ధంగా ఈసీ వ్యవహరించిందని ఆర్‌పీసీ వాదన
- ఈసీ ఉత్తర్వులపై స్టే విధించి.. గ్లాస్ గుర్తును ప్రచారానికి వినియోగించకుండా జనసేనను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్
- డిసెంబర్ 12వ తేదీన ఈసీ దరఖాస్తులకు ఈసీ ఆహ్వానం
- అయితే.. అదే తేదీన జనసేన పార్టీ దరఖాస్తు చేసినట్లు ఈసీ వెల్లడి
- ఫస్ట్ సర్వ్ పద్ధతిలోనే జనసేనకు ఇచ్చామన్న ఈసీ
- రెండూ అన్ రికగ్నైజ్డ్ పార్టీలేనన్న ఈసీ తరఫు న్యాయవాది అవినాష్‌దేశాయ్
- కౌంటర్ వేయాలంటూ ఆదేశించి.. ఇవాళ్టికి విచారణ వాయిదా వేసిన కోర్టు
7:32 AM, Feb 13, 2024
చేతులెత్తేసిన చంద్రబాబు
- 41 ఏళ్లలో తొలిసారి రాజ్యసభలో సభ్యత్వం కోల్పోనున్న టీడీపీ
- రాజ్యసభలో టీడీపీని మట్టికరిపించనున్న వైఎస్సార్‌సీపీ
- పోటీ చేసే బలం లేక బరికి దూరంగా టీడీపీ
- నిన్నటిదాకా పోటీకి సై అంటూ ప్రగల్బాలు పలికిన చంద్రబాబు
- టికెట్ దక్కని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపైనే చంద్రబాబు ఆశలు
- ఎవరూ వెళ్లకపోవడంతో పోటీ చేయలే చేతులెత్తేసిన చంద్రబాబు
- వైఎస్సార్‌సీపీ ఖాతాలోనే పడనున్న మూడు సీట్లు
- ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబూరావు నామినేషన్లు
7:15 AM, Feb 13, 2024
జనసైనికులను జెండా కూలీలంటూ హేళన
- ఒకవైపు మార్పులు చేర్పులతో.. అశేష ప్రజాదరణతో దూసుకుపోతున్న అధికార పక్షం
- టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా సీట్లు ప్రకటించడానికి కూడా సాహసించని పరిస్థితి
- జనసైనికులను చిన్నచూపు చూస్తున్న టీడీపీ నాయకులు
- పొత్తులో బయటపడుతున్న లుకలుకలు
- చంద్రబాబు సభలకు దూరంగా పెట్టి.. జనసైనికులంటూ జెండా కూలీలంటూ హేళన
- దృష్టికి తీసుకెళ్తున్న స్పందించని పవన్
- జనసేనాని తీరుపై తీవ్ర అసంతృప్తి.. ఆగ్రహంతో పార్టీ కేడర్, నాయకులు
జనసైనికులను చిన్నచూపు చూస్తున్న @JaiTDP నాయకులు.@ncbn సభలకు దూరంగా పెట్టి, జెండా కూలీలంటూ హేళన.
— YSR Congress Party (@YSRCParty) February 12, 2024
ఒకవైపు సీఎం @ysjagan అభ్యర్థులను ప్రకటిస్తూ సిద్ధం సభలతో దూసుకుపోతుంటే.
టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా సీట్లు ప్రకటించడానికి కూడా సాహసించని పరిస్థితి. #CBNPoliTrics… pic.twitter.com/3KLhDDO9ZK
6:45 AM, Feb 13, 2024
ఎంత గడ్డి.. పచ్చ మీడియా పెట్టినా మారదా?
- టీడీపీ, చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం ఎంతటి తప్పుడు వార్త అయినా సిగ్గు లేకుండా ప్రచురిస్తున్న యెల్లో మీడియా
- ఎవరెంత గడ్డి పెట్టినా మారని పచ్చ పత్రికల తీరు
- కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగానే ఐపీఎస్‌ల బదిలీలు
- అయినా బదిలీల విషయంలో ఆంధ్రజ్యోతి తప్పుడు వార్తలు
- ఏపీ ఐపీఎస్ అధికారుల సంఘం కన్నెర్ర
- నిరాధార, బాధ్యతారాహిత్య వార్తలపై సంఘం సభ్యుల ఆగ్రహం
- ఆంధ్రజ్యోతిపై చట్టపరంగా చర్యలు సిద్ధమైన ఐపీఎస్ అధికారులు
బదిలీల విషయంలో తప్పుడు వార్తలు రాసిన ఆంధ్రజ్యోతిపై ఏపీ ఐపీఎస్ అధికారుల సంఘం కన్నెర్ర జేసింది. నిరాధార, బాధ్యతారాహిత్య వార్తలను ఆంధ్రజ్యోతి రాస్తోందని ఆ సంఘం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. @JaiTDP @ncbnల రాజకీయ లబ్ధి కోసం ఎంతటి తప్పుడు వార్త అయినా సిగ్గు లేకుండా ప్రచురిస్తుంది… pic.twitter.com/fZCxpXT4dX
— YSR Congress Party (@YSRCParty) February 12, 2024
6:30 AM, Feb 13, 2024
పవర్ లేని స్టార్.. పవన్ కల్యాణ్
- ప్రతిపక్షాలు కూటములుగా ఏర్పడి నీచ రాజకీయాలు
- వారాల ఆబ్బాయి లాగా అప్పుడప్పుడు సినిమా సెలవుల్లో విజయవాడకు పవన్ కల్యాణ్
- 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేని వ్యక్తి జనసేనాని
- పదేళ్ల రాజకీయ జీవితంలో అనుసరించిన ఎజెండా ఏంటో?
- కేఏ పాల్ తో తప్ప అందరితో పొత్తు!
- ప్రజల ఎజెండా లేని పవన్
- సినిమాలో పవన్ హీరో.. రాజకీయాల్లో మాత్రం పూర్తిగా జీరో
- పవర్ లేని స్టార్ పవన్ కళ్యాణ్.
- నాయకత్వ లక్షణాలు లేని వ్యక్తికి రాజకీయ పార్టీ నడిపే అర్హత ఎక్కడుంది?
Comments
Please login to add a commentAdd a comment