Feb 14th: ఏపీ పొలిటికల్ అప్‌డేట్స్ | AP Elections Today Political News Updates And Headlines On Feb 14th In Telugu - Sakshi
Sakshi News home page

AP Political Updates Feb 14th: ఏపీ పొలిటికల్ అప్‌డేట్స్

Published Wed, Feb 14 2024 7:06 AM | Last Updated on Wed, Feb 14 2024 6:14 PM

Andhra Pradesh Political Updates February 14th - Sakshi

AP Elections Political Latest Updates Telugu..

6:00PM, Feb 14th, 2024

జనసేనకు గాజుగ్లాస్ గుర్తుపై ఏపీ హైకోర్టులో విచారణ

  • గాజుగ్లాస్ కోసం ఫస్ట్ జనసేన దరఖాస్తుచేసుకుందన్న ఈసీ
  • జనసేన,ఈసీ కుమ్మక్కయ్యాయన్న పిటిషనర్  
  • ప్రభుత్వ ఆఫీసులు ఉ.10 గంటలకు తెరిస్తే దరఖాస్తు స్వీకరణ సమయం ఉ.9:15గా ఉందన్న పిటిషనర్
  • కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్‌కు హైకోర్టు ఆదేశం
  • తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా

4:53PM, Feb 14th, 2024

నారా లోకేష్ వ్యాఖ్యల పై వెల్లువెత్తుతున్న విమర్శలు

  • లోకేష్ కళ్లుండి చూడలేని కబోదిలా మాట్లాడుతున్నారని ఆగ్రహం 
  • సీఎం జగన్ చేసిన అభివృద్ధి లోకేష్ కంటికి కనిపించడం లేదా అని ప్రశ్న
  • ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం చూపింది సీఎం కాదా అని ప్రశ్నలు
  • మూలపేట పోర్ట్, భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులు కనిపించడం లేదా?
  • ఇన్ఫోసిస్, యకోహమా పరిశ్రమలు విశాఖకు రావడం వాస్తవం కాదా?
  • విశాఖను పరిపాలనా రాజధానిగా అడ్డుకున్నది మీరు కాదా?
  • హుద్ హుద్ సమయంలో భూ రికార్డులు ట్యాంపరింగ్ చేసింది టీడీపీ నేతలే
  • వీటన్నింటికీ లోకేష్ సమాధానం చెప్పాలని డిమాండ్

4:00PM, Feb 14th, 2024

చంద్రబాబు , పవన్ , పురంధేశ్వరి , షర్మిలపై కొడాలి నాని సెటైర్లు

  • చెల్లెమ్మ, వదినమ్మలతో చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలకు తెర లేపాడు
  • గుంట నక్క చంద్రబాబు, బీజేపీ వదినమ్మ, కాంగ్రెస్ చెల్లెమ్మ, ఉత్త పుత్రుడు, దత్తపుత్రుడిని కట్టగట్టి బంగాళాఖాతంలో పడేయాలి
  • చంద్రబాబు ఒంటరిగా జగన్‌ను ఎదుర్కోలేడు
  • అందుకే చంద్రబాబు ఒకపక్క దత్తపుత్రుడు, మరో పక్క ఉత్త పుత్రుడు, ముందు బీజేపీ వదినమ్మను, లేటెస్ట్ గా ఇప్పుడు కాంగ్రెస్ చెల్లెమ్మను వెనకాల నిలబెట్టుకొని ఎన్నికలకు వస్తున్నాడు
  • వీళ్ళందరూ ఉన్నా ధైర్యం సరిపోని చంద్రబాబు ఢిల్లీ పెద్దలను మభ్యపెడదామని వెళ్లాడు 
  • అమిత్ షా, మోదీ ఇచ్చిన ఆఫర్ దెబ్బకు..హైదరాబాద్ వెళ్లి మంచం పైపడి వారం నుంచి ఏపీకి రావడం లేదు 
  • ఢిల్లీ పెద్దల దెబ్బతో చంద్రబాబు పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యిలా మారింది.
  • హెలికాప్టర్ లేకపోతే పవన్ భీమవరం వెళ్లలేడా?
  • ఇళ్ల మధ్య హెలికాఫ్టర్ దిగడానికి అధికారులు ఒప్పుకోకపోవడంతో.... భీమవరం పర్యటన పవన్ కళ్యాణ్ వాయిదా వేసుకున్నాడు.
  • జనంలోకి వెళితే ఎన్ని సీట్లలో పోటీ చేస్తామని కేడర్ అడుగుతారన్న భయంతో దత్తపుత్రుడు హెలికాప్టర్ డ్రామా ఆడుతున్నాడు.
  • ఢిల్లీ పెద్దలు చెబితేనే ఎన్ని సీట్లలో పోటీ చేస్తాడో పవన్ చెప్పగలడు
  • మంగళగిరి నుండి గంటన్నరలో భీమవరం చేరుకునే అవకాశం ఉంది
  • లేకపోతే ఊరు బయట హెలికాప్టర్ ల్యాండింగ్ చేసుకుని వెళ్ళవచ్చు.
  • హెలీకాప్లర్ కోసమే పవన్ పర్యటన వాయిదా వేసుకోవడం పై భీమవరం ప్రజలు ఆలోచించుకోవాలి
  • ఒకవేళ గెలిస్తే హెలికాప్టర్ లేకపోతే ఎమ్మెల్యేగా పవన్ మీ ఊరు రాడని గమనించుకోవాలి

3:09PM, Feb 14th, 2024

రాజ్యసభ ఎన్నికల నుంచి తప్పుకున్న టీడీపీ

  • సంఖ్యాబలం లేక చతికిలబడ్డ టీడీపీ
  • పార్టీ స్థాపన తర్వాత తొలిసారి రాజ్యసభలో ఉనికి కోల్పోనున్న టీడీపీ
  • బలం లేకపోయినా ఎమ్మెల్యేల కొనుగోలుకు చంద్రబాబు యత్నం
  • ఫలించని చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు
  • సొంతపార్టీ ఎమ్మెల్యేల ఓటు వేయరనే భయంతో చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన చంద్రబాబు
  • ఓటుకు కోట్లు వెచ్చిస్తే తెలంగాణ చేదు అనుభవం తప్పదని భయపడ్డ చంద్రబాబు

02: 50 PM, Feb 14, 2024

చిత్తూరు:

అవసరం కోసం చంద్రబాబు ఎవరి కాళ్లు అయినా పట్టుకుంటాడు: డిప్యూటీ సీఎం నారాయణస్వామి

  • గతంలో ప్రధాని నరేంద్ర మోదీని తిట్టని తిట్టు తిట్టాడు చంద్రబాబు
  • బీజేపీ మతతత్వ పార్టీ అంటూ మండిపడ్డాడు
  • సోనియా గాంధీని తీవ్రంగా విమర్శించాడు
  • ఇటలీ దయ్యం మనకు పట్టిన శని అంటూ చెప్పాడు
  • ఇప్పుడు బీజేపీ నేతల కాళ్లు పట్టుకుంటున్నాడు
  • చంద్రబాబుది రాక్షస మనస్తత్వం

02: 40 PM, Feb 14, 2024

తిరుపతి: 
పార్టీ ఆదేశాలకు కట్టుబడి పనిచేస్తామని అందరు నాయకులు అంటున్నారు
సత్యవేడు నియోజకవర్గం ముఖ్యనాయకులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష

  • ఎమ్మెల్యే ఆదిమూలం మనదారిలో నడవలేదు. అందుకే అభ్యర్థి మార్పు.  నడిచి ఉంటే ఆదిమూలంనే మళ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించే వాళ్లం
  • సత్యవేడు నియోజకవర్గంలో ప్రజలకు అందరికీ ఆమోదయోగ్యమైన, అనుకూలమైన అభ్యర్థి రాజేష్‌ను ఎంపిక చేశారు
  • అనుకువుగా ఉండే వ్యక్తి, మాజీ మంత్రి కుతుహాలమ్మ కుటుంబానికి చెందిన వ్యక్తి రాజేష్‌ను  భారీ మెజారిటీ తో గెలిపించాలని పిలుపు

02: 35 PM, Feb 14, 2024

జనసేన పార్టీ వారికి ప్రతిదీ రాజకీయం చేయడం అలవాటైపోయింది: గ్రంధి శ్రీనివాస్ 

  • ఏవియేషన్ అధికారుల అనుమతి ఇచ్చాకే హెలిపాడ్ ల్యాండ్ అవుతుంది. అది కేంద్రం పరిధిలో ఉంటుంది
  • గతంలోసీఎం పర్యటనలో లూథరన్ గ్రౌండ్ లో  చెట్ల కొమ్మలు కొడితే  దానిని రాజకీయం చేశారు
  • ఏళ్ల నాటి చెట్లు నరికారు అంటూ నానాయాగి చేశారు
  • పవన్ కళ్యాణ్ గురించి మేము అధికారులపై ఒత్తిడి తెచ్చామనేది అవాస్తవం
  • ఎన్నికల అయిన తర్వాత పవన్ కళ్యాణ్ కౌంటింగ్ కూడా కూడా భీమవరం  లేరు
  • సీఎం జగన్‌ భద్రతలో ఏ విధంగా ఆలోచించారో పవన్ కళ్యాణ్ భద్రతలో కూడా అధికారులు అలాగే ఆలోచించారు
  • మంగళగిరి నుండి భీమవరం రోడ్డు మార్గంలో వచ్చేందుకు రెండు గంటలు సమయం పడుతుంది
  • చంద్రబాబు అవినీతి కేసు లో అరెస్ట్ అయితే  రోడ్లపై శవాసనంవేసి పార్టీ వారితోను ఎవరితో సంప్రదించకుండా పొత్తు సైతం పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ 
  • చంద్రబాబుకు విశ్వాస కుక్కలాగా ఎందుకు వ్యవహరిస్తున్నాడు... జన సేన కార్య కర్తలనుఎందుకు అవమానిస్తున్నాడు పవన్ కళ్యాణ్
  • చంద్రబాబుకు ఇచ్చే విలువ పార్టీ కార్యకర్తలకు ఎందుకు ఇవ్వడం లేదు
  • నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉండే మేము .. పవన్ కళ్యాణ్ చూసి ఎందుకు భయపడతాము
  • 2019 ఎన్నికల్లో లోకల్ నాన్ లోకల్‌కు ఎన్నిక జరిగింది
  • పవన్ కళ్యాణ్ ఎన్నికలు జరిగాక ఎన్నిసార్లు భీమవరం వచ్చాడు
  • సీఎం జగన్‌మోహన్ రెడ్డి పాలనలో పాలన వికేంద్రీకరణ జరుగుతుంది
  • ప్రభుత్వం పరిపాలన ప్రజల గడపకు ముందుకు చేర్చండి
  • పవన్ కళ్యాణ్ గెలిస్తే ఎక్కడుంటాడని ప్రజల ఆలోచించుకుంటున్నారు
  • పవన్ కళ్యాణ్ 175  స్థానాల్లో అభ్యర్థులను పెట్టలేడు..ఒంటరిగా పోటీ చేయలేడు. 
  • 175 నియోజకవర్గాల్లో కన్వీనర్లు కూడా పెట్టలేదు... పార్టీని పటిష్టం కూడా చేసుకోలేదు
  • పరాన్న జీవిలా ఇతరుల మీద ఆధారపడి నాలుగు సీట్లు గెలుచుకుందామని ఆలోచన చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్
  • ఒంటరిగా పోటీ చేయలేనోడు పవన్ కళ్యాణ్
  • మా వల్ల మంచి జరిగితేనే ఓటేయమన్న నాయకుడు సీఎం జగన్‌
  • చంద్రబాబు.. పవన్ కళ్యాణ్‌, బీజేపీలతో పొత్తులు పెట్టుకుని వస్తున్నారు...జగన్‌మోహన్‌రెడ్డిని ఓడించలేమని వారికి అర్థమైంది

01: 38 PM, Feb 14, 2024
ఈ నెల 18న రాప్తాడులో ‘సిద్ధం’ సభ: మంత్రి పెద్దిరెడ్డి

  • సిద్ధం సభకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తరలివస్తారు
  • భీమిలి, దెందులూరు సభలకు మించి రాప్తాడు సభ ఉంటుంది
     

12: 01 PM, Feb 14, 2024
ప్రకాశం జిల్లా వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో జోష్‌

  • చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి దర్శి పార్టీ ఆఫీస్‌ ఓపెనింగ్‌కు వెళ్లిన బాలినేని శ్రీనివాస్‌రెడ్డి
  • చెవిరెడ్డి-బాలినేని కలిసి రావడంతో ఉత్సాహంగా పాల్గొన్న పార్టీ శ్రేణులు
  • దర్శి నియోజకవర్గ ఇంచార్జి  బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన నేతలు

10: 59 AM, Feb 14, 2024
ఆ స్క్రాప్‌ను చూసి పిచ్చి వేషాలు వేయకు లోకేశ్‌: మాజీ మంత్రి వెల్లంపల్లి

  • విజయవాడ మధుర నగర్ 29వ డివిజన్‌లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
  • పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ శైలజా రెడ్డి, కార్పొరేటర్ లక్ష్మీ పతి.
  • కాంగ్రెస్ పార్టీతో కలిసి చంద్రబాబు 16 నెలలు సీఎం జగన్‌ని ఇబ్బంది పెట్టారు
  • మంగళగిరి నుంచి లోకేష్ జీవితంలో ఎమ్మెల్యే కాలేడు. అసెంబ్లీలో అడుగుపెట్టలేడు
  • లోకేష్ దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యాడు
  • సీఎం జగన్.. మీ బాబుకే భయపడలేదు నువ్వు ఎంత?
  • మా దగ్గర మిగిలిపోయిన స్క్రాప్‌ నీ దగ్గరికి వచ్చింది
  • ఆ స్క్రాప్‌ను చూసి నువ్వు పిచ్చి వేషాలు వేయకు
  • కుప్పంలో మీ బాబు, పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేసిన ఓడిపోతారు
  • రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఏర్పడటం కలగానే మిగిలిపోతుంది
  • మంగళగిరిలో నువ్వు, కుప్పంలో మీ తండ్రి, భీమవరంలో పవన్ కళ్యాణ్ గెలిచి చూపించండి.

10:25 AM, Feb 14, 2024
నెల్లూరు: నేను పార్టీ మారే ప్రసక్తే లేదు: ఆదాల ప్రభాకర్‌రెడ్డి

  • పార్టీ మార్పుపై స్పందించిన నెల్లూరు ఎంపీ, రూరల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ ఆదాల ప్రభాకర్ రెడ్డి
  • నేను పార్టీ మారే ప్రసక్తే లేదు
  • ఏడాది నుంచి ఇదే మాట చెబుతున్నా
  • నాపై వస్తున్న రూమర్స్‌ నమ్మొద్దు
  • సీఎం జగన్ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచే చేస్తా
  • అధినేతను కలిసిన తర్వాత క్లారిటీ ఇస్తాను

9:32 AM, Feb 14, 2024
పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన వాయిదా...

  • అనువుగా లేని హెలిప్యాడ్ ప్రాంతాన్ని ఎంపిక చేసిన జనసేన నాయకులు
  • ఆర్అం‌డ్‌బీ అధికారులు మోకాళ్ల అడ్డారంటూ అసత్య ప్రచారం
  • విష్ణు కళాశాల ప్రాంగణంలో హెలిప్యాడ్ ప్రాంతాన్ని 2018 నుంచి అనుమతించని అధికారులు
  • హెలిప్యాడ్ ప్రాంతానికి 50 మీటర్ల దూరంలోనే  అపార్ట్‌మెంట్లు, చెట్లు ఉన్నాయని సూచించిన అధికారులు
  • ఏవియేషన్స్ నామ్స్ పాటించాలని సూచించామని తెలిపిన ఆర్‌అండ్‌బీ అధికారులు
  • నివాస ప్రాంతాల సమీపంలో హెలిప్యాడ్‌ అనువు కాదని సూచించామని తెలిపిన ఆర్‌అండ్‌బీ అధికారులు
  • అనువైన ప్రదేశాన్ని హెలిప్యాడ్‌గా ఎంపిక చేసుకోవాలని తెలిపామన్న అధికారులు..
  • పెడచెవిన పెట్టిన జనసేన నాయకులు
  • రాజకీయ కక్ష సాధింపు అంటూ  జనసేన శ్రేణులు విష ప్రచారం

8:41 AM, Feb 14, 2024
టీడీపీ, ఎల్లో మీడియాది తప్పుడు ప్రచారం: సజ్జల రామకృష్ణా రెడ్డి 

  • తెలంగాణ ఎన్నికల్లో నేను, నా కుటుంబం ఓట్లు వేయలేదు
  • ప్రస్తుతం ఉంటున్న మంగళగిరిలోనే ఓట్లు నమోదు చేయించాం
  • పచ్చ కామెర్లు ఉన్న వాడికి లోకమంతా పచ్చగా కనబడినట్టుగా ఒక టీడీపీ నాయకుడు, ఆ పార్టీకి కొమ్ముకాస్తున్న మీడియా తనపై తప్పుడు ప్రచారం చేస్తోంది
  • టీడీపీ మద్దతుదారులు తెలంగాణలో ఓట్లు వేసి, ఏపీలో ఓట్లకు దరఖాస్తు చేసుకున్నట్టుగా తాను ఎన్నడూ దిగజారి ప్రవర్తించలేదు
  • తెలంగాణ ఎన్నికల్లో తాను, తన కుటుంబం ఓట్లు వేయలేదు
  • ప్రస్తుతం నివాసం ఉంటున్న రెయిన్‌ట్రీ కాలనీలో రోడ్డుకు ఒక వైపు ఉన్న అపార్ట్‌మెంట్లు పొన్నూరు నియోజకవర్గంలో, రెండో వైపు ఉన్న విల్లాలు మంగళగిరి నియోజకవర్గంలో ఉంటాయి
  • ఓటర్ల జాబితాలో చేరిక సమయంలో పొన్నూరు నియోజకవర్గంలో పేర్లు నమోదు చేశాం
  • అసలు విషయం తెలిసిన తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో ఓట్ల నమోదుకు దరఖాస్తు చేసుకున్నాం
  • మొదటగా దరఖాస్తు చేసిన పొన్నూను నియోజకవర్గ ఓటర్ల జాబితా నుంచి తమ పేర్లను తొలగించాలని కోరుతూ జనవరి 31వ తేదీనే దరఖాస్తు చేశాం
  • ఇప్పటికే ఆ జాబితా నుంచి తొలగించి ఉంటారని భావిస్తున్నాం
  • ఇన్నాళ్ల ప్రజా జీవితంలో ఎన్నడూ టీడీపీ ముఠా మాదిరిగా అనైతిక చర్యలకు పాల్పడలేదు
  • తప్పుడు పద్ధతుల్లో కుప్పంలో వేలాది దొంగ ఓట్లు నమోదు చేయించుకున్న మాదిరిగా అడ్డదారులు తొక్కాల్సిన అవసరం తమకు లేదు  
     

8:30 AM, Feb 14, 2024
శంఖారావ సభలు వెలవెల

  • నారా లోకే­శ్‌ మంగళవారం పాతపట్నం, పాలకొండ, కురు­పాం నియోజకవర్గాల్లో చేపట్టిన శంఖారావం సభలు జనంలేక వెలవెల
  • పాతపట్నం సభలో పాత ప్రసంగాన్నే లోకేశ్‌ కొనసాగించారు
  • ఇది వినలేక చాలా మంది సభ మధ్యలోనే వెళ్లిపోయారు
  • టీడీపీ ప్రతిజ్ఞ చేస్తున్న సమయంలో సభంతా ఖాళీ అయిపోయింది
  • ముందు వరుసలో కేవలం ముఖ్యనాయకులే మిగిలారు
  • పాతపట్నం నియోజకవర్గంలో టీడీపీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయారు. 
  • పాలకొండలో గందరగోళం 
  • పాలకొండ సభలో నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి జయకృష్ణకు టికెట్‌ ఇవ్వద్దంటూ ఆయన వ్యతిరేక వర్గం బలప్రదర్శనకు దిగడంతో గందరగోళంగా మారింది.
  • ఓ వైపు జయకృష్ణ, పడాల భూదేవి వర్గాలు టికెట్‌ తమకే ఇవ్వాలంటూ ఎవరికివారే ప్రయత్నిస్తే... మరోవైపు జనసేనకు అవకాశం కల్పించాలంటూ స్థానిక యువత నినదించారు. లోకేశ్‌ ప్రసంగం ఎప్పటిలా ఆరోపణలకే పరిమితం
  • స్థానిక సమస్యలపై టీడీపీ నాయకులు అందించిన స్క్రిప్ట్‌ను చదవలేక లోకేశ్‌ ఆపసోపాలు

7:51 AM, Feb 14, 2024
కబ్జాలలో బాబు, రామోజీ దొందూ దొందే: ఎమ్మెల్సీ వరుదు కల్యాణి

  • టీడీపీని చంద్ర­­బాబు కబ్జా చేస్తే తెలుగు రాష్ట్రాల్లో విలువైన భూములను రామోజీ కబ్జా చేశారు
  • పచ్చ మీడియా తప్పుడు రాతలతో ఉత్తరాంధ్ర ప్రజలను మభ్యపెట్టలేరు
  • టీడీపీ హయాంలో జరిగిన కబ్జాలపై ఆ పార్టీ నాయకులు చర్చకు సిద్ధమా?
  • అసలు కబ్జాలకు కేరాఫ్‌ అడ్రస్‌ చంద్ర­బాబు, రామోజీలే
  • విశాఖ, విజయ­వా­డలో లీజుకు తీసుకున్న భూముల టీడీఆర్‌లను సొంతం చేసుకోవడానికి రామోజీ కుట్ర చేశారు
  • లోకేశ్‌ తోడల్లుడు ‘గీతం’ భరత్‌ 46 ఎకరా­లు కబ్జా చేశారు
  • విశాఖలో 430 ఎకరాల కబ్జా భూములను వైఎస్సార్‌సీపీ ప్రభు­త్వం స్వాధీనం చేసుకుంది
  • టీడీపీ అధికారంలో ఉండగా గంటా శ్రీని­వాస­రావు 1,700 ఎకరాలు  కబ్జా చేశారని నాడు మంత్రి అయ్యన్నపాత్రుడే ఆరోపించారు

7:39 AM, Feb 14, 2024
ఎల్లో మీడియా తుప్పు వదిల్చిన సుప్రీంకోర్టు 

  • ఓటర్ల జాబితాలపై ‘సుప్రీం’ సంతృప్తి
  • ఎన్నికల సంఘం చర్యలు భేష్‌ అన్న సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం
  • ఈ విషయంలో ఎలాంటి తదుపరి ఉత్తర్వులు అవసరం లేదని వెల్లడి
  • సన్సద్‌ బచావో ట్రస్ట్‌ పిటిషన్‌లో సుప్రీంకోర్టు ఆదేశాలు
  • రాష్ట్రంలో ఓటర్ల జాబితాలపై కొంతకాలంగా అడ్డగోలు ఆరోపణలు చేస్తున్న ఎల్లోమీడియా
  • ఎన్నికల అధికారులే లక్ష్యంగా నిరాధార ఆరోపణలు.. తప్పుడు కథనాలు
  • తాజా ఆదేశాలతో ఎల్లో మీడియా తుప్పు వదిల్చిన సుప్రీంకోర్టు 

7:20 AM, Feb 14, 2024
కొత్త గ్రూపులకు ‘సారథి’! 

  • టీడీపీలో చేరకముందే నూజివీడులో పార్థసారథి గ్రూపు రాజకీయాలు
  • పార్థసారథికి స్వాగతం పేరిట పట్టణంలో ఫ్లెక్సీల ఏర్పాటు 
  • పార్టీలో చేరకుండానే ఎలా ఏర్పాటు చేశారని ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వర్గం ఆగ్రహం 
  • పార్థసారథి ఫ్లెక్సీలో తమ నాయకుడి ఫొటో తొలగించాలని హెచ్చరిక 
  • పదేళ్ల నుంచి ఇన్‌చార్జిగా ఉన్న ముద్దరబోయినను అధిష్టానం విస్మరించడంపై టీడీపీ నేతల విస్మయం
  • రానున్న ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన 

7:12 AM, Feb 14, 2024
వైఎస్సార్‌సీపీ రెబల్ ఎమ్మెల్యేలకు మరోసారి స్పీకర్ నోటీసులు

  • రేపు ఉ.11 గంటలకు స్పీకర్ ఎదుట హాజరు కావాలని నోటీసులు
  • వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు లేఖ రాసిన అసెంబ్లీ అధికారులు
  • ఈ నెల 12న విచారణకు రావాలని ఇంతకు ముందు స్పీకర్ నోటీసులు
  • వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోతున్నామని స్పీకర్ కు లేఖ పంపిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు
  • తాజాగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపిన అసెంబ్లీ అధికారులు

7:11 AM, Feb 14, 2024
రాజ్యసభలో జీరో సైకిల్‌!! 

  • నాలుగు దశాబ్దాల చరిత్రలో మొదటిసారి రాజ్యసభలో విచిత్ర పరిస్థితి
  • పెద్దల సభలో ప్రాతినిధ్యం కోల్పోయే దశలో టీడీపీ
  • ఉన్న బలాన్ని బట్టి చూస్తే టీడీపీ కి ఒక్క సీటు కూడా అసాధ్యమే
  • తెలుగుదేశానికి రాజ్యసభ అచ్చిరాదనే సెంటి మెంట్
  • 2019 కు ముందు వైసీపీ కి రాజ్యసభలో ఇద్దరు సభ్యులు
  • 2019 కు ముందు టీడీపీ కి తొమ్మిది మంది మెంబర్లు
  • 2019 ఎన్నికల తర్వాత మారిపోయిన సీన్
  • ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలన్నింటిలోనూ వైఎస్సార్‌సీపీ విజయం
  • ఖాళీ అయ్యే మూడు సీట్లను వైఎస్సార్‌సీపీ గెలుచుకునే సమీకరణాలు
  • వైఎస్సార్‌సీపీ ఎంపీ వేమిరెడ్డి ఏప్రిల్ నెలతో రిటైర్
  • టీడీపీ ఎంపీ కనకమేడల ఏప్రిల్ నెలతో రిటైర్
  • బీజేపీ కండువా కప్పుకున్న సీఎం రమేష్ ఏప్రిల్ నెలతో రిటైర్
  • గంటా రాజీనామాతో 22కి పడిపోయిన టీడీపీ బలం

7:05 AM, Feb 14, 2024
ఆలూ లేదు చూలు లేదు.. అల్లుడి పేరు.!!?

  • పవన్ పర్యటనకు ప్రత్యేక హెలికాఫ్టర్ సిద్ధమట.!
  • ఇప్పటివరకు ఎక్కడ పోటీ చేస్తాడో లేని స్పష్టత
  • జనసేనకు ఎన్ని సీట్లో  తెలియని పరిస్థితి
  • అయినను జిల్లాల్లో పర్యటించాలని పవన్‌కు చంద్రబాబు హుకుం
  • ఒక్కో జిల్లాకు మూడు సార్లు వెళ్లాలని పవన్‌కు ఆదేశం
  • కాపులు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో పర్యటించాలని సూచన
  • పవన్ కల్యాణ్ జిల్లాల పర్యటనపై ప్రణాళిక సిద్ధం 
  • 175 నియోజకవర్గాల్లో హెలికాఫ్టర్ లో వెళ్లాలని నిర్ణయం
  • ప్రతి జిల్లాకు 3 సార్లు వెళ్లాలని పవన్ నిర్ణయం 
  • మొదటి పర్యటనలో జిల్లాల ముఖ్యనేతలతో సమీక్షలు 
  • రేపటి నుంచి గోదావరి జిల్లాల్లో పర్యటించనున్న పవన్ 
  • 4 రోజులు గోదావరి జిల్లాల్లో ముఖ్యనేతలతో సమీక్షలు 
  • రేపు, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా నేతలతో పవన్ సమీక్షలు 
  • ఈ నెల 15న అమలాపురంలో జిల్లా నేతలతో పవన్ భేటీ 
  • ఈ నెల 16న కాకినాడలో మరోసారి సమీక్షలు చేయనున్న పవన్ 
  • ఈ నెల 17న రాజమండ్రిలో పార్టీ నేతలతో పవన్ సమావేశం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement