AP Elections Political Latest Updates Telugu..
7:44 PM, Jan 24, 2024
ఉత్తరాంధ్రలో అభివృద్ధి షర్మిలకు కనిపించడం లేదా?: వైవీ సుబ్బారెడ్డి
- షర్మిలకు మేము చేసిన అభివృద్ధి చూపించడానికి సిద్ధం
- ఉద్ధానంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించింది ఎవరు?
- చంద్రబాబు చూపించారా.. కాంగ్రెస్ పార్టీ చూపించిందా..?
- ఏళ్ల తరబడి ఉద్దానంలో ఉన్న సమస్యకు సీఎం జగన్ పరిష్కారం చూపించారు
- చంద్రబాబు జనసేన మేనిఫెస్టోను ప్రజలు ఎవరూ నమ్మరు
- మేనిఫెస్టోను వెబ్‌సైట్ నుంచి తొలగించిన ఘనుడు చంద్రబాబు
- చంద్రబాబు ఎన్ని హామీలు అమలు చేశారో ప్రజలందరికీ తెలుసు
- రాజీనామా చేసే ముందు గంటా ఆలోచించుకోవాలి
- రాజీనామా చేసిన తర్వాత ఎప్పుడు ఆమోదిస్తే గంటాకు ఎందుకు?
- స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసి ఇప్పుడు గంటా గగ్గోలు పెడితే ఎలా?
- రాజధానిపై గ్రాఫిక్స్ చూపించిన చంద్రబాబు గురించి ఎందుకు షర్మిల మాట్లాడటం లేదు?
- విశాఖ రాజధాని కాకుండా కోర్టులో కేసులు వేసింది చంద్రబాబే
- అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది చంద్రబాబు కాదా?
7:13 PM, Jan 24, 2024
తిరిగి మేం అధికారంలోకి రావడం ఖాయం: సీఎం జగన్
- నా వల్ల మేలు జరిగిందని భావిస్తేనే ఓటు వేయమని ధైర్యంగా అడుగుతున్నా
- తప్పనిసరిగా మేం తిరిగి అధికారంలోకి వస్తాం
- విద్య, వైద్యం, పరిపాలనా రంగాల్లో పెను మార్పులు తీసుకు వచ్చాం
- వివక్ష లేకుండా, అవినీతి లేకుండా పారదర్శకంగా అర్హత ఉన్న వారికి అన్నీ అందించాం
- మేని ఫెస్టోలో 99.5 శాతం హామీలను నెరవేర్చాం
- మా ప్రభుత్వానికున్న విశ్వసనీయతకు నిదర్శనం ఇది:
- కాంగ్రెస్ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్ ఆడుతుంది
- విభజించి రాష్ట్రాన్ని పాలించాలనుకున్నారు
- రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు
- అలాగే మా కుటుంబాన్ని కూడా విభజించారు
7:05 PM, Jan 24, 2024
ఇది మా ప్రభుత్వానికున్న విశ్వసనీయత: సీఎం జగన్
- ప్రతి 2వేల జనాభాకు గ్రామ సచివాలయాన్ని, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం
- వివక్ష లేకుండా, అవినీతి లేకుండా అర్హత ఉన్నవారికి డీబీటీ ద్వారా పథకాలు అందించాం
- డీబీటీ అన్నది ఒక విజయవంతమైన అంశం
- అయితే విద్య, వైద్యం, మహిళా సాధికారితల్లో గణనీయమైన మార్పులు తీసుకు వచ్చాం
- అన్నిటికంటే మించి వివక్ష లేకుండా పారదర్శకతతో ప్రత్యక్ష నగదు బదిలీ అమలు చేశాం
- కచ్చితంగా మేం తిరిగి అధికారంలోకి వస్తాం
- ప్రతిపక్షాలు ఏవీ కూడా పథకాలు గురించి మాట్లాడవు,
- వాటి అమలు గురించీ కూడా విపక్షాలు మాట్లాడలేవు
- ఇదే బడ్జెట్ గతంలోనూ ఉంది..ఇప్పుడూ ఉంది
- కాని మార్పు ఏంటంటే.. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారారు
- కాని ఈ ప్రభుత్వం మాత్రమే ఇవన్నీ చేయగలిగింది
- చంద్రబాబు విషయంలో ప్రతీకారం అన్నది నాకు లేనే లేదు
- చంద్రబాబుపై అవినీతి ఆరోపణల విషయం కోర్టుకు చేరింది
- ఆ ఆరోపణలు, ఆధారాలను చూసి కోర్టు నిర్ణయం తీసుకుని రిమాండ్ విధించింది
- అలాంటప్పుడు ప్రతీకారం ఎలా అవుతుంది.?
- సీఐడీ కేసులు పెట్టినా, కోర్టులు ఆధారాలను చూస్తాయి కదా?
- వాటిని చూసి కన్విన్స్ అయితేనే కోర్టులు నిర్ణయాలు తీసుకుంటాయి
- రాష్ట్రంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల ఉనికి పెద్దగా లేదు
- పోటీ మా పార్టీకి, టీడీపీ- జనసేన కూటమికి మధ్యే ఉంటుంది
- ప్రతి పార్టీ కూడా సర్వేలు చేస్తుంది
- వాటి ఫలితాల ఆధారంగా మార్పులు, చేర్పులు చేస్తుంది
- ప్రభుత్వం పట్ల ప్రజలు చాలా సానుకూలంగా ఉన్నారు
- కాని కొందరు స్థానిక నాయకుల విషయంలో ప్రజలకు కొంత అసంతృప్తి ఉంది
- అంతేకాకుండా సామాజిక సమీకరణాల దృష్ట్యా కూడా కొన్ని మార్పులు చేశాం
- చివరిదశలో మార్పులు చేసి అయోమయం సృష్టించే కన్నా, ముందుగానే నిర్ణయిస్తున్నాం
- జాతీయ రాజకీయాలు విషయంలో మా విధానం స్పష్టం:
- రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మేం రాజీపడబోం
- ప్రజల ప్రయోజనాల విషయంలోనే కేంద్ర ప్రభుత్వం సహకారంతో ముందుకు వెళ్తున్నాం:
- కాంగ్రెస్ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్ ఆడుతూ ఉంటుంది
- అది ఆ పార్టీ సంప్రదాయంగా గమనిస్తున్నాం
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు
- విభజించి రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలించాలనుకుంది
- అలాగే మా కుటుంబాన్ని కూడా విభజించారు
- నేను కాంగ్రెస్‌నుంచి విడిపోయినప్పుడు గతంలో మా చిన్నాన్నకు మంత్రిపదవి ఇచ్చి మాపై పోటీకి పెట్టారు
- వారు పాఠాలు నేర్వలేదు
- కాంగ్రెస్ పార్టీ ఏపీ సారథ్య బాధ్యతలు మా సోదరికి ఇచ్చారు
- కాని అధికారం అనేది దేవుడు ఇచ్చేది
- దేవుడ్ని నేను బలంగా నమ్మతాను ఆయనే అన్నీ చూస్తాడు
6:08 PM, Jan 24, 2024
సీఎం జగన్ పాలనలో ఏపీ సుభిక్షంగా ఉంది: మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు
- మన రాష్ట్రంలో పేదరికం గతంలో 12 శాతం ఉండేది.. జగన్ సీఎం అయ్యాక 6 శాతానికి తగ్గింది.
- చంద్రబాబు హయాంలో మనరాష్ట్ర విద్యా వ్యవస్థ 15 స్థానంలో ఉండేది
- సీఎం జగన్ ఏపీ విద్యా వ్యవస్థను మూడో స్థానానికి తీసుకొచ్చారు
- పేదవారి పిల్లలు కూడా ఉన్నతమైన ఉద్యోగాల్లో చూడాలన్నదే సీఎం జగన్ ధ్యేయం
- జగన్‌ను రాష్ట్రంలో అందరు తమ కుటుంబ సభ్యుడుగా భావిస్తున్నారు
- షర్మిలకు ఏపీలో సంక్షేమం, అభివృద్ధి కనిపించడం లేదు
- షర్మిలమ్మా... గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి మీ అన్న జగన్
- గడప వద్దకే సంక్షేమ ఫలాలు అందిస్తున్న వ్యక్తి మీ అన్న జగన్ అని తెలుసుకో..
- నాలుగున్నరేళ్ల తరువాత ఇక్కడకొచ్చి విమర్శించడం సరికాదు
- షర్మిల.. టీడీపీ వాళ్లు రాసిచ్చిన రాతలు మాట్లాడుతున్నారు
5:17 PM, Jan 24, 2024
విజయవాడ సెంట్రల్ లో వంగవీటి రాధా వర్సెస్ బోండా ఉమా
- విజయవాడలో వంగవీటి రాధా, బోండా ఉమా వర్గాల మధ్య సోషల్ మీడియా వార్
- వంగవీటి రాధాను టీడీపీ నమ్మడంలేదంటూ 3 రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్టులు
- ఈ పోస్టుల వెనుక ఉమా వర్గీయులే ఉన్నారని రాధా వర్గం ఆరోపణ
- తాజాగా బోండా ఉమా టార్గెట్ గా సోషల్ మీడియాలో కౌంటర్ పోస్టులు
- రాధా వర్గమే చేసినట్లుగా భావిస్తున్న బోండా ఉమా వర్గం
- నమ్మాలంటే ఏం చేయాలంటూ ఉమాకు వ్యతిరేకంగా కౌంటర్ పోస్టులు వైరల్
5:05 PM, Jan 24, 2024
విశాఖ: ఈనెల 27న భీమిలిలో వైఎస్ఆర్ సీపీ బహిరంగ సభ
- ఏర్పాట్లను పరిశీలించిన వైవీ సుబ్బారెడ్డి, తలశిల రఘురాం, మంత్రి అమర్నాథ్
- బహిరంగ సభ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి
- బహిరంగ సభలో సీఎం జగన్ దిశానిర్ధేశం చేస్తారు
- బహిరంగ సభకు సుమారు 2 లక్షల మంది హాజరవుతారని భావిస్తున్నాం
- భీమిలి సభతో పాటు రాష్ట్రంలో మరో 4 సభలు నిర్వహిస్తాం: వైవీ సుబ్బారెడ్డి
4:21 PM, Jan 24, 2024
గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
- గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణుల ఓవరాక్షన్
- సీఎం జగన్ పై అసభ్య పోస్టులు పెట్టిన NRI, టీడీపీ కార్యకర్త యశస్వి
- NRI యష్ కోసం వచ్చిన తెలుగు యువత విద్యార్థి నేతలు
- అనుమతి లేదని అడ్డుకున్న సీఐడీ పోలీసులు
- సీఐడీ పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం
- సీఐడీ అధికారులను దూషించిన టీడీపీ నాయకులు
3:49 PM, Jan 24, 2024
శ్రీకాకుళం నియోజకవర్గం టీడీపీలో బయటపడ్డ వర్గ విభేదాలు
- నియోజకవర్గ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీ దేవి వర్గం.. టిక్కెట్ ఆశావాహ అభ్యర్థి గోండు శంకర్ మధ్య వివాదం
- నియోజకవర్గ ఇంచార్జ్‌కి తెలియకుండా.. శ్రీకాకుళం పట్టణంలో.. ఇంటింటికి శంకరన్న కార్యక్రమం ప్రారంభించిన గొండు శంకర్
- గొండు శంకర్‌ను అడ్డుకున్న టీడీపీ పట్టణ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, పట్టణ టీడీపీ నేతలు
- పట్టణ టీడీపీకి సమాచారం లేకుండా పార్టీ కార్యక్రమం ఏంటంటూ గొండు శంకర్‌ని నిలదీసిన టీడీపీ నేతలు
- సొంత కార్యక్రమం ఏదైనా ఉంటే పార్టీ జెండా లేకుండా చేయాలంటూ గొండ శంకర్‌కు చెప్పిన టీడీపీ నేతలు
- టీడీపీ నేతలు నిరసనతో వెనుదిరిగిన గొండు శంకర్
3:37 PM, Jan 24, 2024
టీడీపీ హయాంలో పథకాలు కొందరికే దక్కేవి: సజ్జల రామకృష్ణారెడ్డి
- వైఎస్సార్ ఆశయాలు.. ఆలోచనలకు అనుగుణంగా పెట్టిన పార్టీ వైఎస్సార్‌సీపీ
- అణగారిన వర్గాలతో అసోసియేట్ అవ్వడమే ప్రధాన లక్ష్యం
- సీఎం జగన్.. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి తన చిత్తశుద్ధి నిరూపించుకున్నారు
- పథకాలు, సంస్కరణల్లో సీఎం జగన్ బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేశారు
- అణగారిన వర్గాలనుపైకి తీసుకువచ్చే ప్రక్రియలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల భాగస్వామ్యం కావాలి
- గత ప్రభుత్వాలు వెనుకబడిన తరగతుల కోసం ఖర్చు చేసిందేమీ లేదు
- సంపన్నులతో పోటీ పడే స్థాయికి అన్ని వర్గాలనూ తీర్చిదిద్దిన ఘనత సీఎం జగన్‌కే దక్కింది
- సచివాలయ ఉద్యోగాల్లో 80 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకే దక్కాయి
- మేనిఫెస్టోలో లేనివి కూడా సీఎం జగన్ అమలు చేశారు
- టీడీపీ హయాంలో పథకాలు కొందరికే దక్కేవి. సీఎం జగన్ అర్హులైన వారిని వెతికి మరీ ఇచ్చారు
- ఈ నాలుగున్నరేళ్లలో జరిగినంత సంక్షేమం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరగలేదు
- ఎన్నికలు రాబోతున్నాయ్. మీ భవిష్యత్తులు మారాలంటే.. మీరంతా ప్రభుత్వం చేస్తున్న మేలును ప్రజల్లోకి తీసుకెళ్లాలి
- ఏ చిన్న తేడా జరిగినా పేదలకు జరుగుతున్న మంచి దూరమైపోతుంది
- మీడియాను మేనేజ్ చేస్తే సరిపోతుందని కొన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి
- ఏమీ జరగడం లేదని ప్రచారం చేస్తున్నారు.
- ప్రభుత్వం చేస్తున్న మంచికి.. అభివృద్ధికి పబ్లిసిటీ అవసరం లేదని సీఎం భావించారు
- కొత్తగా రూపుదిద్దుకుంటున్న పోర్టులు రాష్ట్రం రూపురేఖలు మార్చేస్తాయి
- 11 మెడికల్ కళాశాలల ద్వారా దేశానికి కావాల్సిన వైద్యులను ఏపీ అందించబోతోంది
- అంబేద్కర్‌కు హిమాలయాలంత విగ్రహం పెట్టినా సరిపోదు
- అంతర్జాతీయ స్థాయిలో అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం రూపుదిద్దుకుంది
- అంబేద్కర్ విగ్రహం గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుకుంటుంది
- అమెరికాలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కనిపిస్తుంది. విజయవాడలో కొండ పై అమ్మవారు.. కొండ కింద అంబేద్కర్ కనిపిస్తారు
- దళితుల నుంచి మరింత మేధావులు రావాలనేదే సీఎం జగన్ ఆలోచన
- ఆయన చేపట్టిన యజ్ఞంలో మీరంతా భాగస్వామ్యం కావాలని కోరుతున్నా
2:51 PM, Jan 24, 2024
మండపేట టీడీపీలో అసమ్మతి
- రాజమండ్రిలో ఓ హోటల్లో సమావేశమైన మండపేట టీడీపీ సీనియర్ నేతలు.
- సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు వ్యతిరేకంగా అంతర్గత సమావేశం
- తమతో సంప్రదించకుండా మండపేట ఎమ్మెల్యే స్థానానికి జోగేశ్వరరావు పేరు చంద్రబాబు బహిరంగ సభలో ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తున్న నేతలు
- క్యాండిట్ నిర్ణయించే ముందు మా నిర్ణయం కూడా తీసుకోవాలి లేదంటే పార్టీ నష్టపోతుంది
- ఇప్పటివరకు నియోజకవర్గంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అంటే అది మావల్లే
- అధిష్టానం నిర్ణయాన్ని మార్చుకోవాలి
- నియోజకవర్గంలో జోగేశ్వరరావుతో పాటు జనసేన లీలా కృష్ణ కూడా ఉన్నాడు
- నియోజకవర్గంలో ఎమ్మెల్యే జోగేశ్వరరావు మమ్మల్ని గౌరవించడం లేదు
- స్థానిక ఎమ్మెల్యేకి క్యాడర్ మీద గౌరవం లేదు నమ్మకం లేదు
- రాజమండ్రిలో అంతర్గతంగా సమావేశమై భవిష్యత్ కార్యచరణపై చర్చిస్తున్నాం: టీడీపీ సీనియర్ నేత బాలకృష్ణ
2:42 PM, Jan 24, 2024
షర్మిల దుష్టశక్తుల ట్రాప్‌లో పడింది: ఎంపీ మిథున్‌రెడ్డి
- జగనన్న చెల్లెలుగా షర్మిలపై గౌరవం ఉంది
- వైఎస్సార్ పేరు ఎఫ్ఐఆర్‌లో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ
- నాడు షర్మిల కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టారు
- రాజశేఖర్ రెడ్డి పేరు ఎఫ్ఐఆర్‌లో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ
- 16 నెలలు అన్నను జైల్లో పెట్టిన పెట్టిన పార్టీకి కొమ్ము కాస్తుంది
- చంద్రబాబు లైన్‌లోనే షర్మిల మాట్లాడుతుంది
- షర్మిలను చూస్తే జాలి వేస్తుంది
- మణిపూర్ ఘటనలపై పార్లమెంట్‌లో బీజేపీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలదీసింది
- గత ఐదేళ్ల పాలనలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ జగనన్న నెరవేర్చారు
- మేము మీకు మేలు చేసి ఉంటేనే ఓటు వేయండి అని ధైర్యంగా చెబుతున్నారు జగనన్న.
- ఉభయ గోదావరి, కృష్ణ జిల్లాలు కలిపి ఎన్నికల సన్నాహక సభ ఏలూరులో నిర్వహించబోతున్నాం
- చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజాకు సముచిత స్థానం కల్పిస్తాము
- ఎమ్మెల్యే పార్టీ లైను దాటి ఎప్పుడు ప్రవర్తించలేదు
1:45 PM, Jan 24, 2024
ఇది సీఎం జగన్ పాలన అంటే..
- తెలంగాణలో ప్రభుత్వ పథకాల కోసం ఆధార్ సెంటర్ల వద్ద ప్రజల ఇబ్బందులు
- కానీ, ఏపీలో మాత్రం గడప వద్దకే ప్రభుత్వ పథకాలు
- వలంటీర్ల సాయంతో తీరిన ఇబ్బందులు
తెలంగాణ రాష్టంలోని నాగర్‌కర్నూల్ లో ప్రభుత్వ పథకాల కోసం ఆధార్ సెంటర్ వద్ద ఇబ్బందులు పడుతున్న ప్రజలు.
— YSR Congress Party (@YSRCParty) January 24, 2024
కానీ మన రాష్ష్రంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సీఎం @ysjagan గారి పాలనలో ప్రభుత్వ పథకాలన్నీ గడప వద్దకే చేరుతున్నాయి.#YSJaganDevelopsAP#YSJaganAgain#AndhraPradesh pic.twitter.com/oPEVqKvuvB
1:35 PM, Jan 24, 2024
ఈనాడుపై ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఫైర్
- ఈనాడు పత్రికపై ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఫైర్
- కావాలనే ఎల్లో మీడియా నాపై అసత్య ప్రచారం చేస్తోంది
- ధర్మవరం ప్రజల సమస్యల్ని తీర్చేందుకు గుడ్ మార్నింగ్ కార్యక్రమం చేపట్టాను
- భూకబ్జాలు, సెటిల్మెంట్ ఇసుక దందా ఆరోపణలు అవాస్తవం
- అధికారికంగా భూమి కొనుగోలు చేసి ఫాం హౌస్ నిర్మిస్తే తప్పేంటి?
- పరిటాల శ్రీరామ్, వరదాపురం సూరీ ర్యాలీలు పొలిటికల్ స్టంటే
- రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల వెళ్లటం హాస్యాస్పదం
- వైఎస్ఆర్ పేరును సీబీఐ ఎఫ్ఐఆర్‌లో చేర్చిన విషయం షర్మిలకు గుర్తులేదా?
- చంద్రబాబు రాజకీయ కుట్రలో భాగంగానే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు.
1:28 PM, Jan 24, 2024
ఎమ్మెల్యే టికెట్ నాదంటే దేహశుద్ధి చేస్తాం
- కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు
- ఆలూరు నియోజకవర్గం టీడీపీలో కోవర్టులు ఎక్కువగా ఉన్నారు
- ఆలూరు టీడీపీ టికెట్ ఆశావాధులపై సంచలన వ్యాఖ్య లు చేసిన టీడీపీ యువ నాయకుడు కోట్ల రఘురెడ్డి
- ఎమ్మెల్యే టికెట్ నాదే అని ప్రచారం చేసుకుంటే దేహశుద్ధి చేస్తాం
- ఎమ్మెల్యే టికెట్ కోట్ల సుజాతమ్మ దే
- కొందరికి రాజకీయం అంటే నాలుగు చావులు, ఆరు పెళ్లిళ్లు కాదు
1:00 PM, Jan 24, 2024
విశాఖ వెస్ట్ టీడీపీలో ముసలం
- ఎమ్మెల్యే గణబాబుకు తిరిగి టికెట్ ఇవ్వరాదంటూ సొంత పార్టీ కార్యకర్తల ఫిర్యాదు
- టీడీపీ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు కార్యకర్తలు ప్రజల సమస్యలపై పనిచేయడం లేదు
- ప్రజా సమస్యలు పట్టించుకోకుండా బడా షోరూం కట్టుకున్న నాయకుడు గణబాబు
- జనాభా ప్రాతిపదికగా ఈ సీటు కాపులు లేదా యాదవులకు కేటాయించాలని డిమాండ్
12:40 PM, Jan 24, 2024
భువనేశ్వరీకి మళ్లీ గుర్తొచ్చిన నిజం
- తూర్పుగోదావరి జిల్లాలో ‘నిజం గెలవాలి’ పేరుతో నారా భువనేశ్వరి పర్యటన
- చంద్రబాబు అరెస్టుకు మనస్తాపంతో చనిపోయారంటూ ప్రచారం
- బాధితుల కుటుంబాలకు పరామర్శ అంటూ భువనేశ్వరి పర్యటనలు
- జగ్గంపేట మండలం గుర్రంపాలెంలో పడాల వీరబాబు కుటుంబానికి పరామర్శ
- వీరబాబు కుటుంబానికి రూ.3 లక్షల చెక్కు అందించిన భువనేశ్వరి
12:15 PM, Jan 24, 2024
దమ్ముంటే పోటీ చేయొచ్చు కదా బుచ్చయ్య?
- రాజ్యసభ ఎన్నికలపై గోరంట్ల బుచ్చయ్య ఓవరాక్షన్
- రాజ్యసభకు అభ్యర్థిని నిలబెట్టాలని వైసీపీ ఎమ్మెల్యేలే మమ్మల్ని అడుగుతున్నారంటూ అబద్దాలు
- అభ్యర్థిని నిలబెడితే టీడీపీకి ఓటేసి గెలిపిస్తామని 50 మంది ఎమ్మెల్యేలు మాతో సంప్రదిస్తున్నారంటూ చెత్త కామెంట్స్
- బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీలో విస్మయం
- అసెంబ్లీ టికెట్‌కే దిక్కులేని బుచ్చయ్యకు రాజ్యసభ మీద దృష్టి పడిందా?
- ప్రస్తుతమున్న అసెంబ్లీలో ఏం బలముందని టీడీపీ అభ్యర్థిని పెడుతుంది?
- ఎన్నికల వేళ ఓడే సీటు కోసం ఎవరైనా పోటీ చేస్తారా?
ఆర్కే పోటీ చేసే స్ధానం త్వరలో తెలుస్తుంది: మాణిక్కం ఠాగూర్
- కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్ధానాలకు అభ్యర్ధులను నిర్ణయిస్తుంది
- ప్రతీ కాంగ్రెస్ కార్యకర్తకు అప్లికేషన్ తీసుకునే అవకాశం ఉంది
- అప్లికేషన్లు మధుసూధన్ మిస్త్రీ ఆధ్వర్యంలోని స్టీరింగ్ కమిటీ పరిశీలిస్తుంది
- నిజమైన కాంగ్రెస్‌లోకి మాజీలు రావాలని పిలుస్తున్నాం
- ఆర్కే పోటీ చేసే స్ధానం త్వరలో తెలుస్తుంది
12:00 PM, Jan 24, 2024
ఏపీలో కాంగ్రెస్ అభ్యర్థుల అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభం
- కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల అభ్యర్ధులకు అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభం
- అభ్యర్ధుల నుంచి అప్లికేషన్లు స్వీకరించిన మాణిక్కం ఠాగూర్
- మొదటి అప్లికేషన్ మడకశిర నుంచి సుధాకర్
- రెండవ అప్లికేషన్ గుంటూరు తూర్పు నుంచి మస్తాన్ వలీ
- మూడవ అప్లికేషన్ బద్వేల్ నుంచి కమలమ్మ
11: 40 AM, Jan 24, 2024
అక్కడ పోటీ చేయాలంటే బాబు, లోకేశ్‌కు భయం: వెల్లంపల్లి
- సీఎం జగన్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే సత్తా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు లేదు
- చంద్రబాబు, లోకేష్, పవన్‌లు ఏ ప్రాంతం నుండి పోటీ చేస్తారో వారికే తెలియదు
- చంద్రబాబుకు కుప్పంలో పోటీ చేయాలంటే భయం
- లోకేశ్‌కు మంగళగిరిలో పోటీ చేయాలంటే భయం
- పవన్‌కు గాజువాకలో పోటీ చేయాలంటే భయం
- సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ తరఫున ఆరు అడుగుల వ్యక్తి ఒకడున్నాడు
- బోండా ఉమా ఎందుకు పనికిరాడు..
- బద్ధకానికి నిలువెత్తు నిదర్శనం బోండా ఉమా
- బోండా ఉమాకి దమ్ముంటే సెంట్రల్ నియోజకవర్గంలో నాతో పాటు పర్యటించాలి
- రోడ్డు మీద ధర్నాలు పెట్టి పదిమంది సన్నాసులను వేసుకుని తిరుగుతున్నాడు.
- బోండా ఉమా లాంటి పెత్తందారుల పరిపాలన ప్రజలకు అవసరం లేదు.
- సీఎం జగన్ సంక్షేమ పథకాలు మా పార్టీకి శ్రీరామరక్ష.
11:15 AM, Jan 24, 2024
అభివృద్ధి అంటే గ్రాఫిక్స్ కాదు: దేవినేని అవినాష్
- ప్రజా సమస్యల పరిష్కారమే సీఎం జగన్ ప్రభుత్వ అజెండా
- అభివృద్ధి అంటే గ్రాఫిక్స్ కాదు
- రాష్ట్ర ప్రజలకు అభివృద్ధిని గ్రాఫిక్స్‌లో చూపించింది చంద్రబాబే
- అభివృద్ధి అంటే ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన
- డివిజన్‌లోని రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణాలు పూర్తి చేసిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుంది
- కళ్లుండి కూడా చూడలేని గుడ్డివారే రాష్ట్ర అభివృద్ధిపై ప్రశ్నిస్తారు
- రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గాన్ని మౌలిక సదుపాయాలతో మా ప్రభుత్వం అభివృద్ధి చేసింది
10:00 AM, Jan 24, 2024
సీఎం జగన్‌కే మా ఓటు..
- సీఎం జగన్ హయాంలో అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి
- తెల్లవారుజామునే పెన్షన్‌లు ఇస్తున్నారు.
- మంచి చేసే సీఎం జగన్‌కే ఓటు వేస్తాం
- చంద్రబాబు, పవన్‌ను మేము నమ్మం: సామాన్యులు
సీఎం వైయస్ జగన్ ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. మాకు తెల్లవారుజామునే పింఛన్ ఇస్తున్నారు. @ncbn , @PawanKalyan లను మేం నమ్మం. మంచి చేస్తున్న సీఎం @ysjagan గారికే ఓటేస్తాం.
— YSR Congress Party (@YSRCParty) January 24, 2024
-జగనన్న పాలనపై సామాన్యుడి అభిప్రాయం#PublicVoice #YSJaganAgain #AndhraPradesh pic.twitter.com/CQFUaCoqeV
8:15AM, Jan 24, 2024
పక్క రాష్ట్రం నాయకులే చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లు: సీఎం జగన్
- చంద్రబాబు సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
- పక్క రాష్ట్రంల నాయకులే చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లు
- పథకాలు అమలు చేయకపోయినా, అభివృద్ధి జరగకపోయినా బాబుకు భజన చేసేందుకు రెడీ అయ్యారు
- ప్రజలను దోచుకున్నా పట్టించుకోలేదు.
పక్క రాష్ట్రంలో ఉండే నాయకులే చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లు
— YSR Congress Party (@YSRCParty) January 23, 2024
పథకాలు అమలు చేయకపోయినా, అభివృద్ధి జరగకపోయిన @ncbnను భుజాన మోసేందుకు చాలా మంది ఉన్నారు.
-సీఎం వైయస్ జగన్#EndOfTDP pic.twitter.com/l4dzuCpA3j
7:43 AM, Jan 24, 2024
టీడీపీలో విజయవాడ సెంట్రల్ వార్
- విజయవాడలో వంగవీటి రాధా, బోండా ఉమా వర్గాల మధ్య సోషల్ మీడియా వార్
- టీడీపీ సెంట్రల్ సీటు విషయంలో ఇరు వర్గీయుల మధ్య ముదురుతున్న పోరు
- సోషల్ మీడియాలో పోటాపోటీగా వ్యతిరేక పోస్టులు
- వంగవీటి రాధను టీడీపీ నమ్మడం లేదంటూ మూడు రోజుల కిందటే సోషల్‌మీడియాలో పోస్టులు
- ఈ పోస్టుల వెనుక ఉమా వర్గీయులే ఉన్నారంటూ రాధా వర్గం ఆరోపణ
- తాజాగా బోండా ఉమా టార్గెట్‌గా కౌంటర్ పోస్టులు
- నమ్మాలంటే ఏం చేయాలంటూ ఉమాకు వ్యతిరేకంగా కౌంటర్ పోస్టులు వైరల్
- రాధా వర్గమే చేసినట్లు భావిస్తున్న బోండా ఉమా వర్గం
- ఉమా, రాధా వర్గాల కోల్డ్ వార్‌తో హీటకెక్కిన రాజకీయం
7:10 AM, Jan 24, 2024
చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్న షర్మిల..
- సీఎం జగన అధికారంలోకి వచ్చాక మొదట ఫోకస్ చేసింది రాజధానిపైనే.
- కానీ, కోర్టుల చుట్టూ తిరుగుతూ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ అడ్డుకుంది చంద్రబాబే.
- పోలవరానికి సంబంధించి సీఎం జగన్ వచ్చిన తర్వాతే 10,720 కుటుంబాలకు పునరావాసం.
- చంద్రబాబు కమీషన్లు కోసం పోలవరంలో ఘోర తప్పిదాలు.
- చంద్రబాబు చేసిన అన్నీ ఇన్నీ కావు.
షర్మిల గారు, మీరు @ncbn ఇచ్చిన స్క్రిప్టు బాగానే చదువుతున్నారు. జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోకస్ చేసింది మొదట రాజధానిపైనే, కానీ కోర్టుల చుట్టూ తిరుగుతూ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ అడ్డుకుంది మీ చంద్రబాబే. పోలవరం కి సంబంధించి జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత 10,720 కుటుంబాలకు… https://t.co/8O8giIke1d
— YSR Congress Party (@YSRCParty) January 23, 2024
7:00 AM, Jan 24, 2024
పీకే క్లారిటీ.. పచ్చ బ్యాచ్ గుండె బద్దలు
- నిజంగా పచ్చ బ్యాచ్ గుండె బద్ధలయ్యే వార్త ఇది
- వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తమ పార్టీతో పని చేస్తారని ఎల్లో బ్యాచ్ గంపెడు ఆశలు
- చంద్రబాబుతో కలిసి పని చేసేది లేదని కుండబద్ధలు కొట్టేసిన పీకే
- చంద్రబాబు, లోకేష్‌తో పీకే భేటీ కావడాన్ని బాహుబలి, కేజీఎఫ్ రేంజ్‌లో ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ వస్తోంది ఎల్లో మీడియా
- ఈ మేరకు బాబు కోసం.. టీడీపీ కోసం పీకే పని చేస్తారని.. ప్రస్తుతం చర్చలు కూడా జరుగుతున్నాయంటూ ఊహాజనిత కథనాలు
- తాజాగా ఓ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ దీనిపై స్పష్టత
- చంద్రబాబు తన కోసం ఎన్నికల్లో పని చేయమని అడిగాడు.. అందుకు తాను కుదరదని చెప్పా
చంద్రబాబు తన కోసం ఎన్నికల్లో పని చేయమని అడిగాడు, నేను చేయను అని చెప్పాను - #PrashantKishor
— Actual India (@ActualIndia) January 23, 2024
దీనికి పచ్చ మీడియా అల్లిన కథలు
ఇచ్చిన బిల్డప్పులు అబ్బబ్బబ్బబ్బ …. pic.twitter.com/chshlt6REG
6:55 AM, Jan 24, 2024
సైకిలెక్కితే సైడ్‌ట్రాకే!
- టీడీపీలో చేరి చతికిలపడ్డ ‘సీమ’ హేమాహేమీలు..
- కోట్ల, భూమా కుటుంబాలకు గెలుపు పూర్తిగా దూరం
- గౌరు, బుడ్డాతో పాటు వరదరాజులరెడ్డి, ఆదినారాయణరెడ్డి పరిస్థితీ అంతే
- టీడీపీని నమ్మి చేరిన పలువురికి టికెట్ నిరాకరణ
- ఒకప్పుడు సీమ రాజకీయాల్లో పేరొందిన ఆ రాజకీయ నేతలు
- చంద్రబాబు పంచన చేరి వంచనకుగురై చతికిలపడ్డారు
- సైకిలెక్కి తప్పుచేశామని, బాబు నిండాముంచేశారని తెరవెనుక గగ్గోలు
- కోట్ల.. భూమా.. గౌరు.. బుడ్డా కుటుంబాలకు చెందిన రాజకీయ నాయకులతోపాటు నంద్యాల వరదరాజులరెడ్డి, దేవగుడి ఆదినారాయణరెడ్డి ఒకప్పుడు కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీలో బలమైన నేతలు
- చంద్రబాబు కల్లబొల్లి మాటలు నమ్మి టీడీపీలో చేరితే ‘సీమ’ రాజకీయాల్లో తెరమరుగయ్యే స్థితికి చేరారు
- చంద్రబాబును నమ్మి వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన మరికొంతమంది కనీసం టికెట్ దక్కించుకోలేక మోసపోయారు
- వీరిలో కొందరు తిరిగి వైఎస్సార్‌సీపీలో చేరారు
- చంద్రబాబు మోసం గ్రహించి ‘సీమ’లో టీడీపీ పని ఖతమైందని తెలుసుకున్న కొందరు..
- ఆ పార్టీలో ఉండి ఓడిపోవడం కంటే మౌనంగా ఉండటం మంచిదనే నిర్ణయానికి వచ్చారు
- ఈసారి తాము కోరిన టికెట్ ఇవ్వకపోతే పోటీనుంచి తప్పుకోవాలనే భావనలో మరికొందరు
6:45 AM, Jan 24, 2024
స్కిల్ స్కాం కేసు.. ఏసీబీ కోర్టులో విచారణ వాయిదా
- స్కిల్ స్కాం కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టులో విచారణ ఈనెల 29కి వాయిదా
- స్కిల్ స్కాం కేసులో అప్రూవర్‌గా మారతానన్న ఏసీఐ ఎండీ శిరీష్ చంద్రకాంత్ షా
- చంద్రకాంత్ షా పిటిషన్‌పై విచారణ అనంతరం వాయిదా వేసిన కోర్టు.
- చంద్రకాంత్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ను వాయిదా వేసిన ఏసీబీ కోర్టు.
- కౌంటర్ దాఖలు సమయం అడిగిన చంద్రబాబు లాయర్లు.
- స్కిల్ కేసులో బాబుకు అత్యంత సన్నిహితుడైన ఏ-22 యోగేష్ గుప్తా నిధుల తరలింపులో కీలక పాత్ర
6:40 AM, Jan 24, 2024
లోకేష్ అరెస్టుకు అనుమతి కావాలన్న సీఐడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ
- విచారణను ఈనెల 30కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
- 41ఏ నిబంధనలకు విరుద్ధంగా లోకేష్ వ్యవహరించారని సీఐడీ పిటిషన్
- రెడ్ బుక్‌లో ప్రభుత్వాధికారుల పేర్లు ఉన్నాయని బెదిరిస్తూ 41A నిబంధనలకు విరుద్ధంగా లోకేశ్ వ్యవహరిస్తున్నారని సీఐడీ పిటిషన్
- విచారణ తర్వాత 30కు కేసును వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
6: 30 AM, Jan 24, 2024
హమ్మ.. ఎల్లో మీడియా..! ఇంత కుతంత్రమా.?
- ఆస్థాన విద్వాంసుడు జడ శ్రవణ్‌ను పక్కనబెట్టిన ఎల్లోమీడియా
- ఇటీవల అమరావతి విషయంలో చంద్రబాబును నిలదీసిన శ్రవణ్
- చంద్రబాబు, లోకేష్ వల్లే అమరావతి రైతులు తీవ్రంగా నష్టపోయారని వివరాలతో ప్రకటించిన శ్రవణ్
- మూడు పంటలు పండే భూములను అన్యాయం చేశారని ఆవేదన
- ఎప్పుడయితే చంద్రబాబును ప్రశ్నించాడో.. అప్పటినుంచి జడ శ్రవణ్‌ను దూరం పెట్టిన ఎల్లోమీడియా
- ఇదే విషయాన్ని మీడియాకు వివరించిన మాజీ జడ్జి రామకృష్ణ
- చంద్రబాబును తిట్టగానే శ్రవణ్‌ను దూరం చేస్తారా? ఎల్లో మీడియాకు మాజీ జడ్జి రామకృష్ణ ప్రశ్న
Comments
Please login to add a commentAdd a comment