Feb 20th: ఏపీ పొలిటికల్ అప్‌డేట్స్ | AP Elections Today Political News Updates And Headlines On Feb 20th In Telugu - Sakshi
Sakshi News home page

AP Political Updates Feb 20th: ఏపీ పొలిటికల్ అప్‌డేట్స్

Published Tue, Feb 20 2024 6:56 AM | Last Updated on Tue, Feb 20 2024 6:55 PM

Andhra Pradesh Political News Updates February 20th Telugu - Sakshi

AP Elections Political Latest Updates Telugu..

06:30 PM, Feb 20th, 2024
అసెంబ్లీకి దారేదీ? పవన్‌ రూటేదీ?

  • ఏం తేల్చకుండానే ముగిసిన పవన్ కల్యాణ్ రాజమండ్రి పర్యటన
  • రేపు మంగళగిరి నుంచి భీమవరం పర్యటనకు వెళ్లనున్న పవన్ కల్యాణ్
  • రాజమండ్రి రూరల్ టికెట్ నాకేనంటూ ప్రకటించిన జనసేన నేత కందుల దుర్గేష్
  • అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారని తెలిపిన కందుల దుర్గేష్
  • రాజమండ్రి రూరల్, రాజానగరం నుంచి పోటీ చేయడం ఖాయమని చెప్పిన పవన్
  • జనసేన నుంచి రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా కందుల దుర్గేష్ పేరు ఖరారు
  • టీడీపీ అధిష్ఠానంతో కలిసి త్వరలో అధికారికంగా ప్రకటిస్తామన్న పవన్ కల్యాణ్
  • రాజానగరం నుంచి జనసేన పోటీ చేయడం ఖాయం...అభ్యర్థి పై క్లారిటీ ఇస్తామంటున్న పవన్

06:25 PM, Feb 20th, 2024
రాజానగరం, రాజమండ్రి కూటమిలో రచ్చ

  • రాజానగరం టికెట్ జనసేనకు ప్రకటించడం పై టీడీపీ నేతల్లో అసంతృప్తి
  • రాజమండ్రి రూరల్ లో సైతం ఇదే పరిస్థితి వస్తుందా అనే అనుమానాలు
  • ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి
  • రాజమండ్రి రూరల్, రాజానగరం స్థానాలు జనసేనకు ఇస్తే తమ సామాజిక వర్గానికి సీట్లు కోల్పోయామని కమ్మ సామాజిక వర్గం అసంతృప్తి
  • రాజమండ్రి రూరల్ టికెట్ తనకే ఉంటుందన్న గోరంట్ల
  • నేనూ జిల్లాలో పార్టీ వ్యవస్ధాపకుడినే, సీనియర్ నే
  • పార్టీ టికెట్ నాకే, ఇందులో ఎలాంటి వివాదం లేదు
  • జనసేనకు మరో నియోజవకర్గం కేటాయిస్తాం, సర్దుబాటు చేసుకుంటారో.. లేదో వాళ్లిష్టం : బుచ్చయ్య చౌదరీ

06:24 PM, Feb 20th, 2024
రాయచోటి సైకిల్‌ నేనే తొక్కుతా

  • రాయచోటి టీడీపీ ఇంఛార్జ్ నేనే : మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్
  • టికెట్ వచ్చేది నాకే... రాజీనామా చేయను
  • కావాలని నన్ను తీసేస్తే వెళ్లిపోతా
  • చంద్రబాబు దగ్గర తేల్చుకోవాల్సిన అవసరం నాకు లేదు
  • ఈ ప్రాంతంలోనే ఉంటా...ఇక్కడే పోటీ చేస్తా : రమేష్ కుమార్
     

06:20 PM, Feb 20th, 2024
చంద్రబాబు నన్ను దారుణంగా మోసం చేశారు: ముద్రబోయిన వెంకటేశ్వరరావు

  • నూజివీడు టీడీపీ పార్టీకార్యాలయంలో టీడీపీ పోస్టర్లను పీకిపడేసిన ముద్రబోయిన 
  • చంద్రబాబు పై ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఫైర్ 
  • పార్టీ నన్ను దారుణంగా మోసం చేసింది
  • ఏది చెబుతాడో అది చేయని వ్యక్తి చంద్రబాబు 
  • పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డా 
  • చచ్చిపోయిన పార్టీని నూజివీడులో బ్రతికించా 
  • పార్టీ ఏ పిలుపునిచ్చినా పనిచేశా 
  • కరోనా సమయంలో రాష్ట్ర టీడీపీ కార్యాలయం మూతపడినా..నూజివీడు టీడీపీ కార్యాలయం మూతపడలేదు
  • పార్టీ కష్టకాలంలో నన్ను పిలిచి నూజివీడులో పోటీచేయమని యనమల అడిగారు
  • నా ఇంటికి మనిషిని పంపించి మరీ నూజివీడు సీటిచ్చారు  
  • ఈరోజు నన్ను నూజివీడు టీడీపీ ఇంఛార్జిగా నన్ను ఎందుకు తీసేశారో చెప్పడానికి ఎవరూ ముందుకు రావడం లేదు

04:50 PM, Feb 20th, 2024

చంద్రబాబు.. మీ పార్టీ సైజు ఎంతో తెలుసుకోండి: కొడాలి నాని

  • అసెంబ్లీలో చర్చకు అవకాశం ఉన్నా పారిపోయిన చంద్రబాబు చేతకాక ‘X’లో చాలెంజ్‌లు చేస్తున్నాడు
  • సీఎం జగన్‌ చాలా స్పష్టంగా ఎన్నికలకు వెళుతున్నారు
  • మీ కుటుంబాల్లో మంచి జరిగితే తనకు ఓటు వేసి మరో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు
  • 14 ఏళ్లు సీఎంగా చంద్రబాబు అమలు చేసిన ఓ పథకం, లేదా రాష్ట్రంలో అభివృద్ధికి చేసిన కార్యక్రమాలను చెప్పాలని సీఎం  జగన్‌ ప్రశ్నిస్తున్నారు.
  • అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేని చంద్రబాబు.. బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ‘X’లో చాలెంజ్‌లు చేస్తున్నాడు
  • భారతదేశంలో ఇద్దరి పెద్ద నాయకులు మధ్య బహిరంగ చర్చ ఎక్కడైనా జరిగిందా?
  • డొంక తిరుగుడు మాటలు మాని దమ్ముంటే మాలాగా ప్రజలకు చేసిన మంచిని చంద్రబాబు చెప్పుకోవాలి
  • ఎవరు సీఎంగా ఉండాలో జగన్ ,చంద్రబాబు కాదుగా నిర్ణయించేది ......ప్రజలే న్యాయ నిర్ణేతలు
  • తనలా మాజీలుగా ఉన్నవారికి చంద్రబాబు X లో ఛాలెంజ్‌లు చేసుకోవాలి.. ప్రజలు ఎన్నుకున్న జగన్‌తో కాదు
  • నేను సిద్ధం అంటే నాతో చర్చకు చంద్రబాబు వస్తాడా?
  • సీఎం జగన్‌ను ఎదుర్కోలేని స్థాయి చంద్రబాబుది
  • అందుకే మూడు పార్టీలతో కలిసి వస్తున్నాడు
  • చంద్రబాబు.. మీ పార్టీ సైజు ఎంతో తెలుసుకోండి
  • ఆ పార్టీకి పార్లమెంట్‌, రాజ్యసభ, అసెంబ్లీ, శాసనమండలిలో ఎంతమంది ఉన్నారో గుర్తించి ఛాలెంజ్‌లు చెయ్యాలి
     

04:43 PM, Feb 20th, 2024
చంద్రబాబు రా.. కదలిరా అంటే ఎవరూ కదలటం లేదు: మంత్రి అంబటి రాంబాబు

  • లోకేష్ శంఖారావం పేరు కూడా సరిగా ఉచ్చరించలేకపోతున్నాడు
  • ఇక పవన్  కళ్యాణ్ వారాహి వాహనానికి ఆయిల్ కూడా కొట్టించటం లేదు
  • మా సిద్దం సభకు జనం తండోపతండాలుగా వస్తున్నారు
  • ఎన్నికల మూడ్ క్లియర్‌గా అర్థం అవుతోంది
  • జనమంతా వైఎస్ జగన్ వైపే ఉన్నారని క్లియర్ గా అర్థం అవుతోంది
  • జగన్‌ని చర్చకు రమ్మనటానికి చంద్రబాబుకు సిగ్గు ఉండాలి
  • చర్చించాల్సిన అసెంబ్లీకి రమ్మంటే రాకుండా పారిపోయిన దద్దమ్మ చంద్రబాబు
  • దద్దమ్మ సవాళ్లు చేయటం చంద్రబాబు మానుకోవాలి
  • చంద్రబాబు కోసం నేనే టీడీపీ ఆఫీసుకు వస్తా
  • అయితే.. చర్చ అయిపోయాక ఏడవనని చంద్రబాబు హామీ ఇస్తేనే వస్తా
  • చంద్రబాబు ముసలోడని మేము అంటే లోకేష్‌కి తెగ కోపం వస్తోంది
  • జైల్లో ఉన్నప్పుడు తన తండ్రి ముసలోడనీ, రోగాలు ఉన్నాయనీ చెప్పుకుని బెయిల్‌పై బయటకు తెచ్చారు
  • ఇప్పుడు ముసలోడని మేము అంటే లోకేష్ తెగ ఏడుస్తున్నాడు
  • ఎన్నికల తర్వాత టీడీపీ కుర్చీని మడత పెట్టేస్తారు 
  • సింగిల్‌గా వచ్చే దమ్ము లేనోళ్లు మాకు సవాల్ చేయడం ఏంటి?
  • ఎన్టీఆర్ ఢిల్లీని వ్యతిరేకిస్తే చంద్రబాబు అదే ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు 
  • వారాహికి రెండు రంగులేశారు. త్వరలోనే మూడో రంగు కూడా వేస్తారు
  • ఎన్నికల తరువాత టీడీపీ అనేదే ఉండదు 
  • మ్యానిఫెస్టోని అమలు చేయలేని  చరిత్ర చంద్రబాబుది
  • మ్యానిఫెస్టోని అమలు చేసి చూపించిన వ్యక్తి జగన్ 
  • మళ్లీ జగన్ ప్రకటించే మ్యానిఫెస్టో కోసం జనం ఎదురు చూస్తున్నారు
  • చంద్రబాబుది మోసఫెస్టో, జగన్ ది మ్యానిఫెస్టో
  • ఎమ్మెల్యే ఆర్కే సిన్సియర్ లీడర్ 
  • పార్టీ కోసం మొదటిరోజు నుండి కష్టపడి పనిచేశారు

04:01 PM, Feb 20th, 2024
పవన్ కల్యాణ్ రాకపై ముద్రగడ ఆసక్తికర వ్యాఖ్యలు

  • కాకినాడ: మనం చెప్పాల్సింది చెప్పాం...తర్వాత మనం చేసేదేమీ లేదు
  • వస్తే ఒక నమస్కారం రాకపోతే రెండు నమస్కారాలు అంటున్న ముద్రగడ 
  • గత నెల ముద్రగడ నివాసానికి రెండుసార్లు వచ్చిన జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్
  • త్వరలోనే పవన్ ముద్రగడ నివాసానికి వచ్చి పార్టీలోకి ఆహ్వానిస్తారని చెప్పిన బొలిశెట్టి 
  • పవన్ తన నివాసానికి వస్తే తప్పకుండా ఆహ్వానిస్తానని చెప్పిన ముద్రగడ 
  • నెల రోజులు దాటినా ముఖం చాటేసిన పవన్ 
  • పవన్‌ వైఖరిపై చురకలంటించిన ముద్రగడ

03:29 PM, Feb 20th, 2024

విశాఖ..

లోకేష్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారు: మంత్రి గుడివాడ అమర్నాథ్

  • నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు..
  • పప్పు లోకేష్‌కు పప్పును కానుకగా పంపుతున్నాను..
  • కొంచెం ఉప్పు కారం కూడా వేసాను
  • సిగ్గు లజ్జ లేని వ్యక్తులు చంద్రబాబు, లోకేష్
  • నేను లోకేష్‌లా బ్యాక్ డోర్ పొలిటీషియన్‌ను కాదు
  • రాజకీయాల్లో 18 ఏళ్లు కష్టపడి సీఎం జగన్ దయ వలన మంత్రి అయ్యాను
  • అనకాపల్లి అభివృద్ధి లోకేష్ కంటికి కనిపించలేదా..
  • 420 గాళ్లను పక్కన పెట్టుకొని 420 గాడిలా లోకేష్ మాట్లాడాడు
  • నేను అవినీతి చేశానని నిరూపిస్తే రాజకీయాలు నుంచి తప్పుకుంటాను
  • మీ అన్న పవన్ విసన్నపేట వెళ్లి ఏమీ పీకలేకపోయారు..
  • నువ్వేమీ పీకుతావు లోకేష్
  • సారాయి, గంజాయి తాగిన వాళ్ళు నా గురించి మాట్లాడుతున్నారు
  • వీరప్పన్‌లు, స్మగ్లర్లు లోకేష్ వెంట ఉన్నారు
  • ఉత్తరాంధ్రలో జరిగిన అభివృద్ధిపై మీడియా సమక్షంలో చర్చకు సిద్దం
  • అయ్యన్న గంజాయి డాన్ అని గంటా ఎప్పుడో చెప్పారు
  • చంద్రబాబు గురించి ఎన్టీఆర్ ఏమీ చెప్పారో గుర్తుకు తెచ్చుకో
  • గతంలో మీ చిన్నాన్న రామ్మూర్తి నాయుడు, పురంధేశ్వరి, దగ్గుబాటి, పవన్ కళ్యాణ్ ఏమన్నారో గుర్తుకు తెచ్చుకో
  • బంధుత్వాలు గురించి మాట్లాడడానికి లోకేష్‌కు సిగ్గులేదు
  • లోకేష్‌, చంద్రబాబు కుర్చీలను ఎప్పుడో మడత పెట్టేశాము
  • రెడ్‌బుక్‌లో మొదటి పేజీ కూడా ఓపెన్‌ చేసే అవకాశం లోకేష్‌కు రాదు
  • ఎర్రబుక్‌ను మడత పెట్టీ ఎక్కడ పెట్టుకుంటారో లోకేష్‌ ఇష్టం

03:20 PM, Feb 20th, 2024

వైఎస్సార్‌సీపీ ఖాతాలో మరో మూడు ఎంపీ స్థానాలు

  • మూడు రాజ్యసభ స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకున్న వైఎస్సార్‌సీపీ
  • రాజ్యసభ సభ్యులుగా వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్‌రెడ్డి
  • అధికారంగా ప్రకటించనున్న అధికారులు
  • దీంతో రాజ్యసభలో 11కు చేరిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు
  • 41 ఏళ్ల తర్వాత రాజ్యసభలో ప్రాతినిథ్యం కోల్పోయిన టీడీపీ

02:50 PM, Feb 20th, 2024

ఇంకో 30 ఏళ్ల పాటు సీఎంగా జగన్ ఉండాలి : ఎమ్మెల్యే ఆర్కే

  • 175కి 175 ఎమ్మెల్యే స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలవాలి
  • మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ గెలుపునకు నేను పనిచేస్తా 
  •  పేదవారికి జరుగుతున్న మేలును చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి
  • 2019లో ఓసీ చేతిలో నారా లోకేష్ ఓడిపోయారు 
  •  2024 ఎన్నికల్లో బీసీ అభ్యర్థి చేతిలో నారా లోకేష్ ఓడిపోతారు 
  • సీఎం జగన్ మంగళగిరి సీటును బీసీ అభ్యర్థికి ఇస్తామన్నారు
  • ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం కృషి చేస్తా

01:28 PM, Feb 20th, 2024
కుప్పానికి బాబు నీళ్లు కూడా తేలేకపోయాడు: మంత్రి పెద్దిరెడ్డి

  • చిత్తూరు జిల్లా కుప్పం  నియోజవర్గంలో ఈనెల 26న సీఎం జగన్ పర్యటన 
  • హంద్రీనీవా జలాలను కుప్పం వాసులకు అంకితం చేయనున్నారు
  • శాంతిపురం మండలం గునిశెట్టి వారి పల్లెలో హంద్రీనీవా జలాలకు సీఎం జగన్ జలహారతి
  • అక్కడే బహిరంగ సభ
  • వివరాలు వెల్లడించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
  • చంద్రబాబు 14 సంవత్సరాల పాటు సీఎంగా పనిచేశాడు : మంత్రి పెద్దిరెడ్డి
  • చంద్రబాబు కుప్పంకు హంద్రీనీవా జనాలు తేలేకపోయాడు: మంత్రి పెద్దిరెడ్డి
  • ఇప్పుడు వేసవి ఉన్న కృష్ణా జలాలను తెప్పిస్తున్నాం: మంత్రి పెద్దిరెడ్డి
  • ఇకనుంచి కుప్పం ప్రాంతం శ్యామలం: మంత్రి పెద్దిరెడ్డి
  • ఇప్పటికే 55 చెరువులకు నీళ్లు ఇస్తున్నాం: మంత్రి పెద్దిరెడ్డి
  • కుప్పంలో రాజన్న క్యాంటీన్ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి: మంత్రి పెద్దిరెడ్డి
  • అన్ని రకాల ఆహారాలను రెండు క్యాంటీన్ ల ద్వారా అందిస్తున్నాం: మంత్రి పెద్దిరెడ్డి

01:28 PM, Feb 20th, 2024
కేంద్రం సహకారం కోసమే కొన్ని బిల్లులకు మద్ధతు: ఎంపీ విజయసాయిరెడ్డి

  • వైసీపీ సెంట్రల్ పార్టీ కార్యాలయంలో  పార్టీ జాయినింగ్స్ 
  • వేమూరు నియోజకవర్గం నుంచి పలువురు వైసీపీలో చేరిక
  • రాజ్యసభ సభ్యులు,  పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి  సమక్షంలో చేరికలు
  • వేమూరు నియోజకవర్గం చుండూరు,అమర్తలూరు,భట్టిప్రోలు మండలాలకు చెందిన బిసి,ఎస్సీ,
  • మైనార్టీ నాయకులు,కార్యకర్తలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన విజయసాయిరెడ్డి 
  • పాల్గొన్న వేమూరు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి వరికూటి అశోక్ బాబు,రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ,ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి
  • వరికూటి అశోక్ బాబు మంచి వ్యక్తి...మృదుస్వభావి 
  • వరికూటి అశోక్ బాబును అందరూ ఆశీర్వదించాలి 
  • ఎన్నికల్లో గెలిపించాలి...గెలిపిస్తే మీఅందరికీ మేలు జరిగుతుంది 
  • వరికూటి అశోక్ బాబుకు మీరంతా  సహకరిస్తేనే అసెంబ్లీలో మీ సమస్యలను వినిపిస్తారు 
  • మీ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తెస్తే పరిష్కరిస్తా
  • ఎస్సీలను కొందరు రెండు వర్గాలుగా విభజించాలని చూస్తున్నారు 
  • వైఎస్సార్‌సీపీకి అందరూ సమానమే  
  • జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఒంటరిగానే పోటీచేయాలనేది మన సిద్ధాంతం 
  • దేశానికే ఏపీని తలమానికంగా తీర్చిదిద్దుతాం
  • ఎన్నికలకు 50 రోజులే సమయం ఉంది
  • ప్రతీ ఒక్కరూ పార్టీ విజయానికి కృషి చేయాలి 
  • జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే పథకాలు కొనసాగుతాయి 
  • మతతత్వ పార్టీతో పొత్తుపెట్టుకునే టీడీపీని నమ్మొద్దని కోరుతున్నా 
  • ఏపీలో ఇన్ని సంక్షేమ పథకాలు అమలవుకావాలంటే కేంద్రం సహకారం అవసరం 
  • కేంద్రం సహకారం కోసమే మనం కొన్ని బిల్లులకు మద్దతు పలికాం 
  • త్రిపుల్ తలాక్ వంటి బిల్లులకు మనం మద్దతు పలకలేదు 
  • సెక్యులర్ భావాలకు వ్యతిరేకంగా ఉన్న బిల్లుసకు మనం సపోర్టు చేయలేదు 
  • మతతత్వ పార్టీలతో ఎప్పుడూ వైఎస్సార్‌సీపీ పొత్తు ఉండదు

01:10 PM, Feb 20th, 2024
బాబుకి ఓటేస్తే లోకేష్‌కి మంచిరోజులు: భూమన అభినయ్‌రెడ్డి

  • చంద్రబాబు నాయుడికి ఓటు వేసి.. తినే అన్నంలో మట్టి వేసుకోవద్దు
  • చంద్రబాబు నాయుడిని గెలిపిస్తే ఆయనకు ఆయన కొడుక్కి మంచిరోజులొస్తాయి తప్ప ప్రజలకు కాదు.
  • రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇస్తున్న సంక్షేమ పథకాలన్నీ చంద్రబాబు నాయుడు రద్దు చేస్తారు
  • మీ ఇంటి వద్దకే ఫించన్ అందుతోంది అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వలంటీర్ వ్యవస్థ వల్లే
  • పేదరికం నిర్మూలన జరగాలన్న ఒక మంచి ఆలోచనతో అన్ని వర్గాల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను బెస్ట్‌ సిలబస్‌తో (IB) అందిస్తున్నారు.
  • నాడు - నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా చేశారు.
  • ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులతో మంచి విద్యా బోధన చేయిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
  • 2024 ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చేసుకోవాలి

12:58 PM, Feb 20th, 2024
చంద్రబాబుకి మంత్రి మేరుగ నాగార్జున సవాల్‌

  • అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు మేం సిద్ధం
  • మాతో చర్చకు చంద్రబాబు సిద్ధమా?
  • విజయవాడ అంబేద్కర్‌ విగ్రహం దగ్గరకు బాబు రావాలి
  • చంద్రబాబు, లోకేష్‌, పవన్‌.. ఎవరైనా చర్చకు రావాలి?
  • సైకిల్‌ను జనం తొక్కేశారు.. మడతపెట్టి పక్కన పడేశారు
  • చంద్రబాబు దళిత ద్రోహి

12:35 PM, Feb 20th, 2024
వైఎస్సార్‌సీపీలోకి ఆళ్ల రామకృష్ణారెడ్డి

  • కాసేపట్లో సీఎం జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరనున్న ఆర్కే
  • కిందటి ఏడాది డిసెంబర్‌లో పార్టీకి.. మంగళగిరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆర్కే
  • తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌కు చేరుకున్న ఆళ్ల
  • అయోధ్య రామిరెడ్డితో సీఎం జగన్‌ను కలవనున్న ఆర్కే
  • మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ గెలుపు బాధ్యతల్ని ఆర్కేకు అప్పగించే ఛాన్స్‌
  • మంగళగిరి ఇన్‌ఛార్జిగా ఇప్పటికే గంజి శ్రీనివాస్‌ను ఎంపిక చేసిన వైఎస్సార్‌సీపీ అధిష్టానం

12:17 PM, Feb 20th, 2024
బాబు, చినబాబు ఫొటోల్లేకుండానే టీడీపీ సమావేశం!

  • రాయచోటి టీడీపీ లో భగ్గుమన్న అసంతృప్తి 
  • లక్కిరెడ్డి పల్లెలో తన వర్గీయులతో టీడీపీ నేత రమేష్ రెడ్డి ఆత్మీయ సమావేశం
  • ఆత్మీయ సమావేశంలో ఎక్కడా కనిపించని చంద్రబాబు, లోకేష్ ఫోటోలు
  • వలస నేతలు పార్టీని ప్రలోభాలు పెట్టి టికెట్ పొందాలని ప్రయత్నిస్తున్నారు: రమేష్ రెడ్డి
  • ప్రస్తుత పరిస్థితుల్లో పోరాటం తప్ప మరో మార్గం లేదు : రమేష్ రెడ్డి

11:55 AM, Feb 20th, 2024
భువనేశ్వరి యాత్ర.. జగన్‌ అనే నిజం గెలుస్తుంది: మంత్రి కారుమూరి

  • చంద్రబాబు పాలనలో సంక్షేమం శూన్యం 
  • సీఎం జగన్‌ ప్రవేశ పెట్టిన పథకాల ద్వారా ప్రజలు సుభిక్షంగా ఉన్నారు 
  • వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా  జగన్ మోహన్ రెడ్డే కావాలి-రావాలి అంటున్నారు ప్రజలు 
  • ప్రజలకు అన్నివిధాలా ఆదుకున్న నేత సీఎం జగన్ మాత్రనే 
  • పార్టీ ఓ కుటుబం లాంటిది.. మా కుటుంబ సమస్య మేమే తీర్చుకుంటాం 
  • ఒకరిద్దరు బయటకు వెళ్లిపోతే వారి వ్యక్తిగతం 
  • తెలంగాణను తగలేసి ఏపీని తగలపెట్టడానికి షర్మిల వచ్చింది 
  • నిజం జగన్… అబద్ధం చంద్రబాబు అని ప్రజలు అంటున్నారు 
  • భువనేశ్వరి నిజం గెలవాలని కార్యక్రమం చేపట్టారు.. కచ్చితం నిజం అయిన జగన్ గెలుస్తారు 

తిరుమలలో మంత్రి కారుమూరి నాగేశ్వర రావు వ్యాఖ్యలు

11:45 AM, Feb 20th, 2024
నార్కో టెస్టుకు చంద్రబాబు సిద్ధమా?: పోసాని

  • వంగవీటి రంగాను హత్య చేయించింది చంద్రబాబే అని పబ్లిక​్‌ డొమైన్‌లో ఉంది
  • హెరిటేజ్‌ను మోహన్‌బాబు నుంచి ఎందుకు లాక్కున్నారు?
  • ఎన్టీఆర్‌ పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు కార్యకర్త కూడా కాదు
  • ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబే అని పబ్లిక్‌ డొమైన్‌లో ఉంది 
  • నా ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి

 వైఎస్సార్సీపీ నేత,  ఏపీ చలనచిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ (ఏపీఎఫ్‌టీవీడీసీ) ఛైర్మన్‌ పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలు 

10:30 AM, Feb 20th, 2024
అమర్నాథ్‌పై లోకేష్‌ వ్యాఖ్యలు అర్థరహితం: మలసాల భరత్ కుమార్

  • మంత్రి గుడివాడ అమర్నాథ్ పై నారా లోకేష్ అసత్య ఆరోపణలు 
  • తీవ్రంగా ఖండిస్తున్న వైఎస్సార్‌సీపీ కేడర్‌
  • మంత్రి గుడివాడ అమర్నాథ్ పై నారా లోకేష్ వ్యాఖ్యలు అర్ధ రహితం
  • మంత్రి గుడివాడ అమర్నాథ్ నియోజక వర్గాల్లో ఏటువంటి భూకబ్జాలకు పాల్పడలేదు
  • ఒక్క సెంటు భూమిని మంత్రి గుడివాడ అమర్నాథ్ కబ్జా చేసినట్టు నారా లోకేష్ నిరూపించగలరా
  • అనకాపల్లి నియోజకవర్గాన్ని  మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్ని రకాలుగా అభివృద్ధి చేసారు
  • అనకాపల్లి నియోజకవర్గం యువగళం సభ  నియోజవర్గంలో కాకుండా పక్క నియోజకవర్గంలో పెట్టుకోవడం సిగ్గు చేటు
  • మంత్రి గుడివాడ అమర్నాథ్ పై ప్రతిపక్షాల చేస్తున్న ఆరోపణలు  పూర్తిగా అర్దరహితం
  • పవన్ కల్యాణ్ కూడా విసన్నపేటలో పర్యటించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో కంగుతిన్నారు
  • మంత్రి గుడివాడ అమర్నాథ్  భూకబ్జాలకు పాల్పడ్డారని నిరూపించే సత్తా నారా లోకేష్ కి గాని, తెలుగు దేశం లేదంటే జనసేన నాయకులకు వుందా?

నియోజకవర్గ ఇన్‌ఛార్జి మలసాల భరత్ కుమార్ వ్యాఖ్యలు

09:28 AM, Feb 20th, 2024
పచ్చ పార్టీ నేతలే విశాఖలో భూ రాబందులు 

  • ఎంవీవీఎస్‌ మూర్తి గీతం కళాశాలలో కలిపేసుకున్నది 42.51 ఎకరాలు
  • టీడీపీ నేత పల్లా, ఆయన బంధుగణం నుంచి స్వాధీనం చేసుకున్నది 38.45 ఎకరాలు
  • కబ్జాకోరు గంటా అంటూ సిట్‌కు ఫిర్యాదు చేసిన టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న బండారు కంటబడ్డ ఏ భూమైనా కబ్జానే...
  • విశాఖ భూములను కబ్జాకోరుల చెర నుంచి విడిపిస్తున్న జగన్‌ సర్కారు
  • ఇలా గత నాలుగున్నరేళ్లలో 430.81 ఎకరాలు స్వాధీనం
  • ఈ భూముల రిజిస్ట్రేషన్‌ విలువ రూ.2,638 కోట్లు 
  • మార్కెట్‌ విలువ రూ.5 వేల కోట్ల పైమాటే!
  • టీడీపీ కబ్జాదారుల కోరలు పీకేస్తే ఓర్వలేకపోతున్న చంద్రబాబు, రామోజీ.. విషపు రాతలతో విశాఖ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న ఈనాడు


08:32 AM, Feb 20th, 2024
పవన్ వ్యాఖ్యలపై టీడీపీలో కలకలం

  • మరోసారి తెరపైకి పవన్ ఢిల్లీ పర్యటన
  • 22 న పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తున్నారంటూ మీడియాకి లీకులు
  • రెండురోజులలో డిల్లీ వెళ్తున్నానంటూ విశాఖ జిల్లా జనసేన కార్యకర్తలతో పవన్ వ్యాఖ్యలు
  • టిడిపితో కలవడం బిజెపికి ఇష్టం లేదని కార్యకర్తలతో అన్న పవన్
  • టీడీపీతో జతకట్టడం ఇష్టం లేకున్నా తానే ఒప్పించానని పవన్ వ్యాఖ్యలు
  • పవన్ వ్యాఖ్యలపై టీడీపీలో కలకలం
  • ఇప్పటివరకు పవన్ కి దొరకని బిజెపి పెద్దల అపాయింట్ మెంట్
  • గత నెలలోనూ ఇదే విధంగా లీకులు
  • పవన్ కి అపాయింట్ మెంట్ ఇవ్వని బీజేపీ పెద్దలు
  • రేపటిలోగా బిజెపి అగ్రనేతల అపాయింట్ మెంట్ ఖరారవుతుందంటున్న జనసేన వర్గాలు
  • టీడీపీ-జనసేన పొత్తులపై ఇప్పటికీ కొనసాగుతున్న అయోమయం- ఖరారు కాని టిక్కెట్లు
  • త్యాగాలకి సిద్దం కావాలంటున్న పవన్ వ్యాఖ్యలతో కార్యకర్తలలో పెరిగిపోతున్న నైరాశ్యం
  • కేడర్ చేజారిపోకుండా ఉండేందుకే మరోసారి ఢిల్లీ డ్రామా

07:23 AM, Feb 20th, 2024
వైఎస్సార్‌సీపీలో సిద్ధం కళ కళ..  టీడీపీ, జనసేన సభలు వెలవెల

  • సార్వత్రిక ఎన్నికలకు ముందే కనిపిస్తున్న వైఎస్సార్‌సీపీ ప్రభంజనం 
  • చరిత్రాత్మక రాప్తాడు ప్రజా సభే ఇందుకు నిదర్శనం అంటున్న రాజకీయ పరిశీలకులు 
  • ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే అతి పెద్ద ప్రజా సభ  
  • 1982లో పుచ్చలపల్లి సుందరయ్య ఆధ్వర్యంలో విజయవాడలో 5 లక్షల మందితో సభ 
  • 1990లో వరంగల్‌లో 100 ఎకరాల్లో నిర్వహించిన పీపుల్స్‌ వార్‌ రైతు కూలీ సభకు 7 లక్షల మంది.. 1994లో సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఐదు లక్షల మందితో ఎన్టీఆర్ సభ 
  • ఈ మూడు సభలకు ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాల నుంచి తరలివచ్చిన ప్రజలు 
  • 2010లో వరంగల్‌లో నాటి టీఆర్‌ఎస్‌ సభకు ఏడు లక్షలకుపైగా హాజరైన జనం 
  • అనంతపురం జిల్లా రాప్తాడులో 250 ఎకరాల సువిశాల మైదానంలో సిద్ధం సభ
  • ఈ సభకు 10 నుంచి 11 లక్షల మంది కార్యకర్తలు, అభిమానుల రాక 
  • అదీ రాయలసీమలోని ఉమ్మడి 4 జిల్లాల పరిధిలోని 52 నియోజకవర్గాల నుంచే.. 
  • పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు వైఎస్సార్‌సీపీ నిర్వహిస్తున్న సభలు సూపర్‌ హిట్‌.. భీమిలికి మించి దెందులూరు.. ఆ రెండింటినీ మించి రాప్తాడు ‘సిద్ధం’ సభ  
  • సీఎం జగన్‌ నాయకత్వంపై కార్యకర్తల్లో ఉన్న విశ్వాసానికి అద్దంపట్టిన సిద్ధం సభలు  
  • టీడీపీ, జనసేన సభలు వెలవెల
  • 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కదం తొక్కుతున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు

07:18 AM, Feb 20th, 2024
నేను పార్టీ లైన్‌ దాటను: మండలి హనుమంతరావు

  • గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో మండలి హనుమంతరావు పేరుతో ప్రచారం 
  • గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన మండలి
  • ఎమ్మెల్యే కొడాలి నానికి తనకు అభిప్రాయ భేదాల్లేవని స్పష్టీకరణ 
  • ఎమ్మెల్యే కొడాలి నానిని దాటనంటూ ప్రకటన
  • పదవి కావాలి, ఇతర ప్రయోజనాలు కావాలి అనే కోరికలు లేవు: మండలి
  • ఎమ్మెల్యే కొడాలి నానితో అభిప్రాయ భేదాలు పడాల్సిన అవసరం నాకు లేదు: మండలి
  • వృత్తి రీత్యా నేను బిజీగా ఉన్నాను: మండలి
  • నేను వైఎస్సార్ కుటుంబానికి విశ్వాసంగా ఉంటాను: మండలి
  • పార్టీ లైను దాటి వెళ్లను: మండలి

వైఎస్సార్‌సీపీ కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు

06:52 AM, Feb 20th, 2024
జనసేనాని.. ఇవ్వాళైనా క్లారిటీ ఇస్తాడా?

  • రాజమండ్రిలో నేడు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటన
  • ఉదయం 10గం.  ఏవీఏ రోడ్డులోని జనసేన ఆఫీస్‌లో పవన్‌ మీటింగ్‌
  • టికెట్‌ ఆశావహులు, ముఖ్యనేతలతో చర్చించనున్న పవన్‌
  • ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ఏయే స్థానాల్లో పోటీ చేయాలి.. అభ్యర్థుల ఎంపికపై చర్చ 
  • పొత్తు ధర్మం పాటించలేదంటూ.. రాజానగరం, రాజోలులో పోటీ చేస్తామని ఇదివరకే ప్రకటించిన పవన్‌ 
  • వారాలు గడుస్తున్నా.. అభ్యర్థులపై ఇంకా రాని క్లారిటీ!
  • నేటి సమావేశంతో అయినా క్లారిటీ ఇస్తారని ఎదురుచూస్తున్న ఆశావహులు

06:49 AM, Feb 20th, 2024
ఆ నమ్మకమే.. ఈ ప్రజాభిమానం: సజ్జల

  • సీఎం జగన్‌పై ఏపీ ప్రజలకు అపార విశ్వాసం
  • అందుకే సిద్ధం సభలకు భారీగా జనం రాక 
  • జగన్‌ ప్రభుత్వంలో 87 శాతం మంది ప్రజలు నేరుగా లబ్ధి
  • డీబీటీ ద్వారా రూ.2.55 లక్షల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ
  • ఇది వాస్తవం కాదా?
  • ప్రతిపక్షాలకు వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూటి ప్రశ్న

06:38 AM, Feb 20th, 2024
నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ, జనసేనకి భారీ షాక్‌

  • జనసేన, టీడీపీకి చెందిన 500 మంది యువకులు వైఎస్సార్‌సీపీలో చేరిక
  • సోమవారంనాడు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన  ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి
  • యువతలో సీఎం జగన్‌కు మంచి క్రేజ్‌ ఉందని, వైఎస్సార్‌సీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్యే ప్రతాప్‌ ధీమా

06:31 AM, Feb 20th, 2024
సమాధానం చెప్పే దమ్ముందా చంద్రబాబు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement